హైదరాబాద్ : మాదాపూర్లో హైడ్రా అభివృద్ధి చేసిన తమ్మిడికుంట చెరువు (Tummidi Kunta Lake) నూతన శోభను సంతరించుకుంది. సుందరీకరణతో పరిసర ప్రాంతాలు ఆహ్లాదకరంగా మారాయి.
మాదాపూర్లోని శిల్పారామం ఎదురుగా హైడ్రా అభివృద్ధి చేసిన తమ్మిడికుంట చెరువును సీఎం రేవంత్రెడ్డి బుధవారం సాయంత్రం ప్రారంభించారు.
‘నాకు ఎలాంటి స్వార్థం లేదు.. ఎవరిపైనా కోపం లేదు. కేవలం ప్రకృతిని పరిరక్షించి, భవిష్యత్తు తరాలకు అందించాలనేదే నా కోరిక. అందుకే నగరాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్నాం. అందులో భాగంగానే చెరువుల్ని పరిరక్షిస్తున్నాం’ అని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.


