అంబేకర్, గుంజన్‌ ‘పసిడి పంచ్‌’ | Two gold medals for India at the Youth Olympics | Sakshi
Sakshi News home page

అంబేకర్, గుంజన్‌ ‘పసిడి పంచ్‌’

Nov 13 2026 4:08 AM | Updated on Nov 13 2026 4:08 AM

Two gold medals for India at the Youth Olympics

యూత్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండు స్వర్ణాలు

డకర్‌ (సెనెగల్‌): యూత్‌ ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు గురువారం రెండు స్వర్ణ పతకాలు సాధించారు. భారత బాక్సర్లు అంబేకర్‌ మీటీ (పురుషుల 50 కేజీల విభాగం), గుంజన్‌ (మహిళల 48 కేజీల విభాగం) పసిడి పతకాలు నెగ్గారు. ఫైనల్లో మణిపూర్‌కు చెందిన 17 ఏళ్ల అంబేకర్‌ 3–2తో క్రిస్టియన్‌ జుబాని (ఐర్లాండ్‌)ను ఓడించగా ... హరియాణాకు చెందిన 17 ఏళ్ల గుంజన్‌ 5–0తో బుథైనా బెన్సాలా (అల్జీరియా)పై గెలిచింది. యూత్‌ ఒలింపిక్స్‌ చరిత్రలో భారత బాక్సర్లు స్వర్ణ పతకాలు సాధించడం ఇదే ప్రథమం. 

2010 యూత్‌ ఒలింపిక్స్‌లో భారత బాక్సర్లు శివ థాపా (54 కేజీలు) రజతం... వికాస్‌ కృషన్‌ (60 కేజీలు) కాంస్యం సాధించారు. నేటితో యూత్‌ ఒలింపిక్స్‌ క్రీడలకు తెర పడనుంది. గురువారంతో భారత ఈవెంట్స్‌ ముగిశాయి. ప్రస్తుతం భారత్‌ 2 స్వర్ణాలు, 3 రజతాలు, 5 
కాంస్యాలతో కలిపి మొత్తం 10 పతకాలతో 17వ స్థానంలో ఉంది. ఆఖరి రోజు బీచ్‌ హ్యాండ్‌బాల్, బ్రేకింగ్, ఫెన్సింగ్‌ క్రీడాంశాల్లో మెడల్‌ ఈవెంట్స్‌ ఉన్నాయి. ఈ మూడు ఈవెంట్స్‌ ముగిశాకే పతకాల పట్టికలో భారత్‌ తుది ర్యాంక్‌ ఖరారవుతుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement