Photo Credit: BCCI Twitter
భారత్, న్యూజిలాండ్ మధ్య రేపు జరగనున్న నాలుగో వన్డేకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోనున్న సంగతి తెలిసిందే. కివీస్‌తో టెస్టు సిరీస్ సన్నాహకాల్లో భాగంగా రెగ్యులర్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ జట్టును వీడడంతో వైస్ కెప్టెన్‌గా ఉన్న అయ్యర్ స్టాండిన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
అయితే వన్డేల్లో అయ్యర్‌కు కెప్టెన్‌గా ఇదే తొలి మ్యాచ్ కానుంది. ఈ నేపథ్యంలో భారత వన్డే జట్టుకు కెప్టెన్సీ చేసిన 29వ ఆటగాడిగా అతడు గుర్తింపు పొందుతాడు. అయితే, కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ఓ అరుదైన ఘనత సాధించే అవకాశం కూడా అతడి ముందుంది. భారత క్రికెట్ చరిత్రలో కెప్టెన్‌గా తొలి వన్డేలోనే సెంచరీ చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ ప్రత్యేకంగా నిలిచాడు.
1996 ఆగస్టు 28న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో తొలిసారి భారత జట్టుకు నాయకత్వం వహించిన సచిన్ 110 పరుగులతో శతకం బాదాడు. అయితే, అతడి అద్భుత ఇన్నింగ్స్ జట్టుకు విజయాన్ని అందించలేకపోయింది. ఇప్పటివరకు ఈ ఘనత సాధించిన ఏకైక భారత ఆటగాడిగా సచిన్ కొనసాగుతున్నాడు.
నాలుగో వన్డే శ్రేయస్‌కు ప్రత్యేకంగా మారనుంది. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధిస్తే సచిన్ సరసన నిలుస్తాడు. అంతేకాదు, ఆ శతకానికి జట్టు విజయాన్ని కూడా జోడిస్తే మరో అరుదైన రికార్డు సృష్టించినట్లే. కెప్టెన్‌గా తొలి వన్డేలో సెంచరీ చేసి, అదే మ్యాచ్‌లో భారత్‌ను గెలిపించిన తొలి ఆటగాడిగా చరిత్రలో నిలిచే అవకాశం అతడికి ఉంది.
ఇప్పటివరకు ఆటగాడిగా 85 వన్డేలాడిన శ్రేయస్ అయ్యర్ 3,181 పరుగులు సాధించాడు. ఇందులో 5 శతకాలు, 24 అర్థశతకాలున్నాయి. మరి ఇప్పుడు కెప్టెన్‌గా తొలి మ్యాచ్ ఆడబోతున్న శ్రేయస్ అయ్యర్.. సచిన్ రికార్డును బద్దలుకొట్టి చరిత్ర సృష్టిస్తాడా లేదా అనేది శుక్రవారం తేలిపోనుంది.
Training mode: 🔛 in Mount Maunganui 📍 #TeamIndia | #NZvIND https://t.co/Bb4QKhy1rG
— BCCI (@BCCI) November 12, 2026
Ishan Kishan 🆚 Mohd. Siraj ⚽️ Putting their best 'FOOT' forward 😉 Who is the better striker? 🤔 #TeamIndia | #NZvIND | @ishankishan51 | @mdsirajofficial https://t.co/7OiQDtBkon
— BCCI (@BCCI) November 12, 2026
ఇదీ చదవండి:


