ఆసియా కప్‌-2026: ఫైనల్లో భారత్‌- పాకిస్తాన్‌ పోరు | ACC Mens U19 Asia Cup 2026: India Beat Afghanistan Face Pak in Final | Sakshi
Sakshi News home page

ఆసియా కప్‌-2026: ఫైనల్లో భారత్‌- పాకిస్తాన్‌ పోరు

Nov 12 2026 4:42 PM | Updated on Nov 12 2026 4:55 PM

ACC Mens U19 Asia Cup 2026: India Beat Afghanistan Face Pak in Final

PC: ACC Media X

ఏసీసీ మెన్స్‌ అండర్‌-19 ఆసియా కప్‌-2026 వన్డే టోర్నమెంట్లో భారత జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. అల్‌ ఎమిరెట్‌ వేదికగా గురువారం జరిగిన రెండో సెమీస్‌ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తద్వారా వరుసగా రెండోసారి టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది.

ఈ టోర్నీలో గ్రూప్‌-‘ఎ’ నుంచి తలపడ్డ భారత్‌.. నేపాల్‌, యూఏఈలపై గెలిచింది. కానీ పాకిస్తాన్‌ చేతిలో ఓడిపోయింది. ఇక పాక్‌ మూడింట మూడు మ్యాచ్‌లు గెలిచి.. టాపర్‌గా నిలవగా.. భారత్‌ రెండో స్థానంతో నిలిచింది. ఈ క్రమంలో తొలి సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్‌ను ఓడించి పాక్‌ ఫైనల్‌కు చేరుకుంది.

ఇక రెండో సెమీస్‌లో అఫ్గానిస్తాన్‌తో తలపడ్డ భారత్‌ టాస్‌ ఓడి తొలుత బౌలింగ్‌ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. ఓపెనర్లు అబీదుల్లా నదార్జన్‌ (14), ఫరీదుల్లా ఇన్హాస్‌ (13) విఫలమైనా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ సుభాన్‌ జఖైల్‌ 31 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.

వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ నొమన్‌ సలార్జాయ్‌ (51), షా ఫైసల్‌ రహీమీ (51) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. కెప్టెన్‌ సొహైల్‌ 36 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత బౌలర్లలో ఇషాన్‌ సూద్‌ మూడు వికెట్లతో సత్తా చాటగా.. ఆర్యన్‌ సస్వాని రెండు, కావ్యా పటేల్‌, యశ్‌వర్దన్‌ చౌహాన్‌, అర్జున్‌ రాజ్‌పుత్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు ఓపెనర్లు కెప్టెన్‌ లక్ష్య రాయ్‌ చందాని, ఆర్యవీర్‌ సెహ్వాగ్‌ అర్ధ శతకాలతో అదిరిపోయే ఆరంభం అందించారు. లక్ష్య 93 పరుగులు చేయగా.. ఆర్యవీర్‌ 51 పరుగులు సాధించారు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ వీకే వినీత్‌ అజేయ అర్ధ శతకం (57)తో మెరవగా.. యశ్‌వర్దన్‌ చౌహాన్‌ (16 నాటౌట్‌) అతడికి సహకరించాడు.

ఈ క్రమంలో 36.5 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి భారత్‌ 230 పరుగులు సాధించింది. తద్వారా ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది. గత ఎడిషన్‌లో ఫైనల్లో పాక్‌తో తలపడ్డ భారత యువ జట్టు ఓటమిపాలైంది. అందుకు ఈసారి బదులు తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది.

ఇదీ చదవండి: Asia Cup: ఫైనల్‌కు దూసుకెళ్లిన పాకిస్తాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement