అండర్-19 ఆసియాకప్‌లో వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు, భారత ఓపెనర్ ఆర్యవీర్ సెహ్వాగ్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా అల్ అమెరాత్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న సెమీఫైనల్-2లో ఆర్యవీర్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు.
228 పరుగుల లక్ష్య చేధనలో కాస్త ఆచితూచి ఆడిన ఆర్యవీర్.. క్రీజులో నిలదొక్కున్నాక తనదైన శైలిలో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ జూనియర్ సెహ్వాగ్ 57 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51 పరుగులు చేసి ఔటయ్యాడు. అంతకుముందు యూఏఈతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆర్యవీర్(160) భారీ సెంచరీతో కదం తొక్కిన సంగతి తెలిసిందే.
ఇక సెమీస్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 227 పరుగులకే పరిమితమైంది. అఫ్గాన్ బ్యాటర్లలో నొమన్ సలార్జాయ్ (51), షా ఫైసల్ (51) అర్ద సెంచరీలతో రాణించారు.
భారత బౌలర్లలో ఇషాన్ సూద్ 3, ఆర్యన్ సవ్సని 2, కావ్య పటేల్, యశ్‌వర్దన్ చౌహాన్, అర్జున్ రాజ్‌పుత్ తలో వికెట్ తీశారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు దూకుడుగా ఆడుతోంది. టీమిండియా 23 ఓవర్లకే కేవలం వికెట్ నష్టానికి 148 పరుగులు చేసింది.
చదవండి: జట్టు ప్రకటన.. ఇషాన్ కిషన్‌కు నో ఛాన్స్! కెప్టెన్‌గా అతడే


