Asia Cup: ఫైనల్‌కు దూసుకెళ్లిన పాకిస్తాన్‌ | ACC Mens U19 Asia Cup 2026: Pakistan Beat Bangladesh Enters Final | Sakshi
Sakshi News home page

Asia Cup: ఫైనల్‌కు దూసుకెళ్లిన పాకిస్తాన్‌

Nov 12 2026 3:16 PM | Updated on Nov 12 2026 3:32 PM

ACC Mens U19 Asia Cup 2026: Pakistan Beat Bangladesh Enters Final

PC: BCB X

ఏసీసీ మెన్స్‌ అండర్‌-19 ఆసియా కప్‌-2026 వన్డే టోర్నమెంట్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ పాకిస్తాన్‌ మరోసారి ఫైనల్‌కు దూసుకు వెళ్లింది. అల్‌ ఎమిరెట్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి సెమీస్‌ మ్యాచ్‌లో ఘన విజయం సాధించి.. వరుసగా మూడోసారి టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది.

గురువారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. పాకిస్తాన్‌ బౌలర్ల విజృంభణ కారణంగా 31.4 ఓవర్లలో కేవలం 138 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్‌ అయింది. ఓపెనర్‌ అబ్దుల్లా అల్‌ మూహి హాఫ్‌ సెంచరీ (45 బంతుల్లో 50) చేయగా.. మిగతా వారి నుంచి అతడికి పెద్దగా సహకారం అందలేదు.

టాపార్డర్‌లో మరో ఓపెనర్‌ ఎస్‌కే జారిఫ్‌ సియామ్‌ (1) పూర్తిగా విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన కవ్సర్‌ అహ్మద్‌ (9) కూడా నిరాశపరిచాడు. కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఎండీ ఫరీద్‌ హసన్‌ ఫైసల్‌ 17 పరుగులు చేయగా.. అల్‌ రఫీ 20, రకీబుల్‌ హొసన్‌ 26 పరుగులతో ఫర్వాలేదనిపించారు. మిగిలిన వాళ్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పెవిలియన్‌ చేరారు.

పాక్‌ బౌలర్లలో రిజ్వానుల్లా ఐదు వికెట్లతో చెలరేగి బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు. మిగిలిన వాళ్లలో మహ్మద్‌ సయ్యాం రెండు వికెట్లు పడగొట్టగా.. అలీ రెజా, హస్నైన్‌ అబ్బాస్‌ దర్‌, అహ్మద్‌ హుసేన్‌ తలా ఒక వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు.

ఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. కేవలం 21.5 ఓవర్లలోనే వికెట్‌ నష్టానికి 141 పరుగులు చేసి.. తొమ్మిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఓపెనర్లు ఉస్మాన్‌ ఖాన్‌ (54 బంతుల్లో 64 నాటౌట్‌), హయామ్‌ ఖాన్‌ (69) అర్ధ శతకాలతో సత్తా చాటారు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ అబ్దుల్‌ ఖాదిర్‌ 8 పరుగులతో అజేయంగా నిలిచి.. ఉస్మాన్‌తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement