శతక్కొట్టిన ఆర్యవీర్‌.. యూఏఈని చిత్తుచేసి సెమీస్‌కు భారత్‌ | Aaryavir-Century-India Won-70 Runs Vs UAE-ACC Mens-U19 Asia Cup 2026 | Sakshi
Sakshi News home page

శతక్కొట్టిన ఆర్యవీర్‌.. యూఏఈని చిత్తుచేసి సెమీస్‌కు భారత్‌

Nov 10 2026 6:12 PM | Updated on Nov 10 2026 6:44 PM

Aaryavir-Century-India Won-70 Runs Vs UAE-ACC Mens-U19 Asia Cup 2026

Photo Credit: Twitter

ఆసియా క‌ప్ అండ‌ర్‌-19 టోర్నీలో భాగంగా భార‌త యువ జ‌ట్టు అద్భుత విజ‌యాన్ని అందుకుంది. అల్ అమెర‌త్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో యూఏఈని టీమిండియా 70 ప‌రుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. 310 ప‌రుగుల లక్ష్యంతో బ‌రిలోకి దిగిన యూఏఈ జ‌ట్టు నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 239 ప‌రుగుల‌కు ఆలౌటయ్యింది. 

యూఏఈ బ్యాట‌ర్ల‌లో అహ్మ‌ద్ ఖుదాదాద్ (74) అర్థ‌సెంచ‌రీ సాధించ‌గా, నూరుల్లా అయోబి (39), య‌యిన్ రాయ్ (29) ప‌ర్వాలేద‌నిపించారు. భార‌త బౌల‌ర్ల‌లో ఇషాన్ సూద్ 4 వికెట్లు తీయ‌గా, మోహిత్ ఉల్వా, మ‌నాల్ చౌహాన్, కావ్యా ప‌టేల్‌, య‌శ్‌బ‌ర్ద‌న్ చౌహాన్ , ఆర్య‌న్ స‌వ్సానీ, అర్జున్ రాజ్‌పుత్ త‌లా ఒక వికెట్ ప‌డ‌గొట్టారు.

అంత‌క‌ముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 309 ప‌రుగులు చేసింది. ఆర్య‌వీర్ సెహ్వాగ్ (160) భారీ శ‌త‌కంతో చెల‌రేగ‌గా, వీకే వినీత్ (67) అర్థ‌సెంచ‌రీ సాధించాడు. యూఏఈఏ బౌల‌ర్ల‌లో నసీమ్ ఖాన్ 4 వికెట్లు తీయగా, హదయతుల్లా ఖాన్‌, నూరుల్లా అయోబి, అయాన్ మిస్బా త‌లా ఒక వికెట్ ప‌డ‌గొట్టారు. 

సెమీస్‌లో భారత్‌..
మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించిన భారత్‌ సెమీస్‌కు దూసుకెళ్లింది. ఇప్పటికే పాకిస్తాన్‌ మూడు విజయాలతో గ్రూప్‌ టాపర్‌గా సెమీస్‌లో అడుగుపెట్టింది. నవంబర్‌ 12న జరగనున్న తొలి సెమీస్‌లో పాకిస్తాన్‌తో బంగ్లాదేశ్‌, రెండో సెమీస్‌లో అఫ్గానిస్తాన్‌తో భారత్‌ తలపడనున్నాయి.

ఇదీ చదవండి: IND vs NZ: వర్షం వల్ల ఆట రద్దు.. మ్యాచ్‌ డ్రా 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement