భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ ఇంట దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. భార్య అంజలితో కలిసి సచిన్ లక్ష్మీ పూజ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకున్నాడు.

మరోవైపు.. సచిన్- అంజలిల కుమారుడు అర్జున్ తన భార్య సానియాతో కలిసి పండుగ సెలబ్రేట్ చేసుకున్నాడు. పెళ్లైన తర్వాత మా తొలి దీపావళి అంటూ అర్జున్ సతీమణి సానియా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఫొటోలు షేర్ చేయగా.. వైరల్‌గా మారాయి.

ఇక సచిన్ కుమార్తె సారా టెండుల్కర్ స్నేహితులతో పండుగ చేసుకున్న ఫొటోలను పంచుకుంది. ఇదిలా ఉంటే.. నవంబరు 10న తన సతీమణి అంజలి పుట్టినరోజును పురస్కరించుకుని.. ఆమెతో కలిసి దిగిన ఫొటోను పంచుకున్న సచిన్ భావోద్వేగ క్యాప్షన్ జతచేశాడు.
‘‘ఇల్లంటే కాస్త ఎక్కువ ఇష్టం ఉంటుంది. అందులో నువ్వు ఉంటావు కాబట్టే ఇలా!.. హ్యాపీ బర్త్‌డే అంజలి’’ అని సచిన్ భార్యకు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇక సారా సైతం.. ‘‘నా ఆత్మబంధువుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను చేసే ప్రతీ పనిలో నువ్వు నా భాగస్వామివే. నీవల్లే నేనున్నా’’ అని తల్లికి విషెస్ చెప్పింది.

కాగా ప్రేమించి పెళ్లిచేసుకున్న సచిన్- అంజలి దంపతులకు కుమార్తె సారా, కుమారుడు అర్జున్ సంతానం. ఈ ఏడాదే ముంబైలోని సంపన్న వ్యాపార కుటుంబానికి చెందిన సానియా చందోక్‌ను వివాహమాడాడు. అయితే, అర్జున్ అక్క సారా మాత్రం ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణిస్తూ పెళ్లి ఊసెత్తడం లేదు.
Laxmi Pujan at our home. An evening of prayers, traditions and blessings. 🙏🏻 🪔 https://t.co/kFwtSO22da
— Sachin Tendulkar (@sachin_rt) November 8, 2026


