6.5 కేజీల బంగారం, వజ్రాలతో దీపావళి ముగ్గు! | Dubai Mall Unveils Golden Rangoli Crafted From 6.5 Kg of Fine Jewellery | Sakshi
Sakshi News home page

6.5 కేజీల బంగారం, వజ్రాలతో దీపావళి ముగ్గు!

Nov 10 2026 1:02 PM | Updated on Nov 10 2026 1:16 PM

Dubai Mall Unveils Golden Rangoli Crafted From 6.5 Kg of Fine Jewellery

దీపావళి అంటేనే.. దీపాల వెలుగులు, ఇంటి ముందు అందమైన రంగవల్లులు. సాధారణంగా రంగోలీ(ముగ్గు)ని రంగు పొడులు, పూలు, బియ్యప్పిండితో వేస్తుంటారు. కానీ దుబాయ్‌లో మాత్రం ఈసారి దీపావళికి చాలా ప్రత్యేకంగా రంగోలీని రూపొందించారు. ఏకంగా బంగారు ఆభరణాలు, వజ్రాలతో భారీ రంగోలీని తయారు చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దీపావళి సందర్భంగా దుబాయ్‌లోని సిటీ సెంటర్ దేరా మాల్‌లో ఈ గోల్డెన్ రంగోలీని ప్రదర్శనకు ఉంచారు. ఈ రంగోలీని ప్రముఖ ఆభరణాల సంస్థ డమాస్ (Damas), దుబాయ్ ఫెస్టివల్స్ అండ్ రిటైల్ ఎస్టాబ్లిష్‌మెంట్‌తో కలిసి రూపొందించింది. ఇందుకోసం మొత్తం 213 బంగారు ఆభరణాలను ఉపయోగించారు. వీటి బరువు ఏకంగా 6.5 కిలోలు కావడం విశేషం.

ఈ రంగోలి కోసం నెక్లెస్‌లు, భారీ గాజులు, చెవి దిద్దులు, పెండెంట్లను ఉపయోగించి ఎంతో అందంగా అమర్చి తయారు చేశారు. బంగారం మాత్రమే కాకుండా.. దీని కోసం ఏకంగా 380 క్యారెట్లకు పైగా వజ్రాలను కూడా ఉపయోగించారు. దీంతో ఈ రంగోలీ సాధారణ అలంకరణలా కాకుండా.. ఓ ఖరీదైన కళాఖండంలా నిలిచింది. చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది.

బంగారు, వజ్రాలతో ఇంత అందమైన రంగోలీని తయారు చేయడానికి కళాకారులు కూడా చాలా కష్టపడ్డారు. మొత్తం 10 మంది నిపుణులు కలిసి దాదాపు 16 గంటల పాటు పనిచేసినట్లు తెలుస్తోంది. ఒక్కో ఆభరణాన్ని జాగ్రత్తగా అమర్చుతూ ఈ డిజైన్‌ను పూర్తి చేశారు.

ఇదీ చదవండి: దీపావళికి ఆన్‌లైన్‌లో ఎక్కువగా కొన్నది ఏంటో తెలుసా?

నిజానికి బంగారు ఆభరణాలతో రంగోలి వేయడం అంత సులభమైన పనికాదు. దీని వెనుక కళాకారుల నైపుణ్యం, శ్రమ కూడా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లలను తెగ ఆకట్టుకుంటోంది. ఇంత విలువైన బంగారు ఆభరణాలను బహిరంగ ప్రదేశంలో ప్రదర్శించడం దుబాయ్‌లోనే సాధ్యమంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఈ రంగోలీని అద్భుతమైన కళాఖండంగా ప్రశంసిస్తున్నారు. చాలా సృజనాత్మకంగా రూపొందించారని, చూడటానికి ఎంతో అందంగా ఉందని అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement