ఎందుకు ఇబ్బందిపెడతారు? రేణు దేశాయ్ పోస్ట్ వైరల్ | Renu Desai Reacts Diwali Issue Latest | Sakshi
Sakshi News home page

Renu Desai: అందుకే ఆ రోజు మౌనంగా ఉన్నాను

Nov 10 2026 10:06 AM | Updated on Nov 10 2026 10:10 AM

Renu Desai Reacts Diwali Issue Latest

పవన్ కల్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్ పెట్టింది. అర్థరాత్రి దాటిన తర్వాత కూడా దీపావళి పేరు చెప్పి టపాసులు కాల్చడం లాంటి వాటి వల్ల జనాలు ఇబ్బంది పడుతున్నారని చెప్పుకొచ్చింది. పండగ రోజు కాకుండా ఇప్పుడు దీని గురించి మాట్లాడటానికి గల కారణాన్ని చెబుతూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది.

(ఇదీ చదవండి: వచ్చే నెలలో సినిమా రిలీజ్.. ఇంతలోనే విషాదం)

'రాత్రి 11 గంటలవుతోంది. అయినా ప్రజలు ఇంకా ఇంత పెద్ద శబ్దం వచ్చేలా టపాసులు కాలుస్తూనే ఉన్నారు. దీపావళి రోజు ఏదైనా మాట్లాడి ఉంటే నన్ను హిందూ వ్యతిరేకి అనేవారు. అందుకే ఆరోజు మౌనంగా ఉండిపోయా. కానీ దీపావళి అయిపోయినా కూడా 11 గంటలకు ఇంత పెద్ద శబ్దాలతో టపాసులు కాల్చడానికి ఏ పండుగ ఉంది? ఇతరుల బాధలని పట్టించుకోకుండా మన ఆనందమే ముఖ్యమనుకుంటున్నారు. ఇది కేవలం మూర్ఖత్వం, ఎదుటివారి పట్ల కనీస సానుభూతి లేకపోవడమే'

'మీరు దీపాల పండుగను ఆనందంగా చేసుకోండి తప్పులేదు. కానీ దాన్ని శబ్దాల పోటీగా మార్చకండి. వీలైనంత వరకు రాత్రి 10 గంటల్లోపే టపాసులు కాల్చడం ముగించండి. ఆ తర్వాతైనా జనాలను ప్రశాంతంగా ఉండనివ్వండి. తోటి మనుషుల పట్ల కొంచెం దయ చూపించండి. మీ ఆనందం కోసం ఇతరులను హింసించకండి' అని రేణు దేశాయ్ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. కాలుష్యం గురించి మాట్లాడటం వల్ల ప్రయోజనం లేదు. ఏడాదిలో 364 రోజులు వాహనాలు, పరిశ్రమల వల్ల కాలుష్యం ఉంటోందని గుర్తుచేసింది. 

(ఇదీ చదవండి: మూడో భార్య నుంచీ విడాకులు తీసుకున్న పవన్ కల్యాణ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement