రాజస్థాన్‌లోని పాలి జిల్లాలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో కాంగ్రెస్ కౌన్సిలర్ , ఆమె భర్త ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. బాణసంచా రవ్వలు పడటంతో మొదలైన మంటలు దుకాణానికి కూడా అంటుకోవడంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన ఆదివారం రాత్రి సుమారు 10.30 గంటలకు పాలిలోని ఫల్నా పట్టణంలో స్వర్ణ మందిరం సమీపంలో జరిగింది.
ఖుడాలా-ఫల్నా మున్సిపాలిటీకి చెందిన 23వ వార్డు కౌన్సిలర్ ఉషా దేవి పూనమియా (68), ఆమె భర్త ప్రకాష్ పూనమియా (70) మరణించారు. ఉషా దేవి ఊపిరాడక మరణించగా, ఆమె భర్త సజీవ దహనం అయ్యారని పోలీసులు తెలిపారు. వారిని రక్షించే ప్రయత్నంలో ప్రకాష్ సోదరుడు గౌతమ్ పూనమియా (73) తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రస్తుతం ఆయన్ని పాలిలోని బంగర్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
VIDEO | Rajasthan: Congress councillor Usha Devi Poonamia and her husband, Prakash Poonamia, died after a fire broke out at a firecracker shop near Swarn Mandir in Falna town of Pali district. The incident occurred around 10.30 pm on Sunday when a spark from firecrackers being burst on the road reportedly fell on firecrackers displayed outside the family's shop, triggering the blaze, police said. Usha Devi (68), a councillor from Ward 23 of Khudala-Falna municipality, died along with her husband, Prakash (70). Prakash's elder brother, Gautam Poonamia (73), suffered serious burn injuries while attempting to rescue them and was referred to Jodhpur for treatment. (Full video available on PTI Videos - https://t.co/bIyFWTfmBd)
— Press Trust of India (@PTI_News) November 9, 2026
ఫల్నా స్టేషన్ హౌస్ ఆఫీసర్ పన్నా రామ్ సమాచారం ప్రకారం పూనమియా కుటుంబానికి చెందిన ఒక దుకాణం బయట రోడ్డుపై కొందరు టపాకాయలు కాలుస్తుండగా, నిప్పురవ్వ వచ్చి పడింది. వీరు తమ కాస్మెటిక్స్, బ్యాటరీ దుకాణం బయట టపాకాయలను విక్రయిస్తున్నారు. మంటలు వేగంగా వ్యాపించి ఇతర దుకాణాల్ని చుట్టుముట్టాయి. మంటలు వ్యాపిస్తుండటంతో, ఉషా దేవి మంటల నుండి తప్పించుకునేందుకు షాప్ బేస్‌మెంట్‌లోకి వెళ్లారు. అయితే బేస్‌మెంట్ పొగతో నిండిపోవడంతో ఆమె ఊపిరాడక మృతి చెందారు. ప్రకాష్ పూనామియా షాప్‌లోనే చిక్కుకుపోయి సజీవ దహనమయ్యారు.
తీవ్ర ప్రయత్నాల తరువాత రాత్రి 2 గంటల ప్రాంతంలో అగ్ని మాపక దళాల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో దంపతుల మృతదేహాలను వెలికితీశామని పోలీసులు అధికారి తెలిపారు. సహాయక చర్యల సమయంలో బేస్‌మెంట్‌లో సుమారు 10 అడుగుల ఎత్తు వరకు నీరు చేరిందన్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం పరీక్ష కోసం మార్చురీకి తరలించినట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. బాధిత దంపతుల కుమారుడు ముంబైలో చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడని వెల్లడించారు.


