మోదీకి రాహుల్ గాంధీ సవాల్ | Rahul Gandhi challenge to PM Narendra Modi | Sakshi
Sakshi News home page

మోదీకి రాహుల్ గాంధీ సవాల్

Nov 9 2026 4:46 PM | Updated on Nov 9 2026 4:54 PM

Rahul Gandhi challenge to PM Narendra Modi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ‘దిమాగీ నక్సల్స్’ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. తనను నక్సలైట్‌గా అభివర్ణించడంపై ఆయన మండిపడ్డారు. జాతి వ్యతిరేకులు ఎవరు? విదేశీ శక్తుల నియంత్రణలో ఉన్నది ఎవరు? అనే అంశాలపై తనతో బహిరంగ చర్చకు రావాలని మోదీకి సవాల్ విసిరారు.

‘ప్రధాని చెప్పిన అబద్ధాలను మీరు నమ్మలేదని మీ ముఖాలే చెబుతున్నాయి. ఆయన మమ్మల్ని నక్సలైట్లు అన్నారు. నా సవాల్ అలాగే ఉంది. ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు సిద్ధం’ అని రాహుల్ ఎక్స్‌లో పోస్టు చేశారు. అయితే ఈ చర్చ జరిగితే తర్వాత ప్రధాని ఏ ఒక్క జవాన్ ఎదుట నిలబడే ధైర్యం కూడా చేయలేరని రాహుల్ వ్యాఖ్యానించారు.

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో సైనికులతో దీపావళి జరుపుకున్న సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. సాయుధ నక్సలిజం తగ్గినా, పలు సంస్థలు, రాజకీయ పార్టీల్లో ‘దిమాగీ నక్సల్స్’ చొరబడి రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో మోదీ, రాహుల్ మధ్య రాజకీయ విమర్శలు మరోసారి వేడెక్కాయి.

ఇదీ చదవండి: జెన్సన్ హువాంగ్‌కు ఎలాన్ మస్క్ మద్దతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement