‘ఇలా బ్యాలెట్ బాక్సులు మార్చే అక్రమంగా గెలిచారు’ | TJR Sudhakar Babu Lashes Out At Chandrababu | Sakshi
Sakshi News home page

‘ఇలా బ్యాలెట్ బాక్సులు మార్చే అక్రమంగా గెలిచారు’

Nov 9 2026 3:25 PM | Updated on Nov 9 2026 3:30 PM

TJR Sudhakar Babu Lashes Out At Chandrababu

తాడేపల్లి : స్థానిక సంస్థల ఎన్నికలను ఫ్రీ అండ్‌ ఫెయిర్‌ గా నిర్వహించామని సీఎం చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు విమర్శించారు. అసలు ఇలాంటి ఎన్నికలు గతంలో చూడలేదని, భవిష్యత్‌లో కూడా చూడమన్నారు. చంద్రబాబు ఓ మాఫియా డాన్‌గా మాదిరిగా వ్యవహరించి ఎన్నికలను నిర్వహించి.. ఇప్పుడు ఫ్రీ అండ్‌ ఫెయిర్‌గా ఎన్నికలు నిర్వహించామని చెప్పడం సిగ్గుచేటన్నారు. తమ పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలను చంద్రబాబు టార్గెట్‌ చేసి మరీ అక్రమాలకు పాల్పడ్డారన్నారు. 

‘వెంగళాయపాలెం బ్యాకెట్ బాక్సును మార్చటానికి టీడీపీ నేతలు ప్రయత్నించారు. పోలింగ్ అధికారి బస్సులో నుండి బాక్సును ఎలా దించుతారు?, బస్సులో ఖాలీ లేదని బస్సు దిగాడని కలెక్టరు చెప్పటం సిగ్గుచేటు. ఇలా బ్యాలెట్ బాక్సులు మార్చే చాలాచోట్ల అన్యాయంగా గెలిచారు. బ్యాలెట్ బాక్సుతో బస్సు దిగటం తప్పయిందని అధికారే ఒప్పుకున్నాడు.

మరి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చేసిన తప్పేంటి?, లేళ్ల అప్పిరెడ్డిపై తప్పుడు కేసు పెట్టి జైలు పాలు చేశారు. ఆయనపై ఎందుకు కేసు పెట్టి అరెస్టు చేశారు?, తప్పుడు మాటలు మాట్లాడుతున్న టీడీపీ నేతలు ఆత్మవంచన చేసుకుంటున్నారు. ఆలపాటి రాజా, పిల్లి మాణిక్యరావు, తప్పుడు మాటలు, పచ్చి అబద్దాలు ఎలా చెప్తారు?, ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిచ్చు పెట్టారు. పెత్తందార్లకు వ్యతిరేకంగా పోటీ చశారని దళితులను కొట్టారు’ అని ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి: బ్యాలెట్‌ బాక్సులు దింపి.. అక్రమ కేసులా?: అంబటి ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement