విషాదం.. పదవ తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి? | Tragedy at Mopidevi Ashram School | Sakshi
Sakshi News home page

విషాదం.. పదవ తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి?

Nov 8 2026 5:23 PM | Updated on Nov 8 2026 5:48 PM

Tragedy at Mopidevi Ashram School

సాక్షి,కృష్ణా: మోపిదేవి మండలం వార్పూలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పాఠశాల హాస్టల్‌లో ఉంటూ పదవ తరగతి చదువుతున్న లంకె కుమార్ రాజా (15) అనే విద్యార్థి ఫ్యాన్‌కు ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మృతుడు లంకె కుమార్ రాజా స్వగ్రామం నాగాయలంక మండలం ఈలచెట్లదిబ్బగా గుర్తించారు. అయితే, తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, హాస్టల్ సిబ్బంతే తమ కుమారుడిని హత్య చేసి ఉరివేసి ఉంటారని తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ అనూహ్య ఘటన జరిగిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రి ముందు రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

దీంతో అవనిగడ్డ - నాగాయలంక ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమ కుమారుని మృతికి కారణమైన అసలు నిజాలను నిగ్గు తేల్చి, బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతుడి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరుపుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement