ఇక్కడ కన్నీరు పెడుతున్న మహిళ పేరు ఎచ్చెర్ల దివ్య. శ్రీకాకుళం మండలం శానివాడ ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసి 319 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆ ఎంపీటీసీ పరిధిలోనే స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ స్వగ్రా మం కిష్టప్పపేట కూడా ఉంది. స్వగ్రామంలో ఓటమిని ఎమ్మెల్యే సహించలేకపోయారు. మళ్లీ రీ కౌంటింగ్ చేయించారు. అయినా ఆమె 43 ఓట్ల మెజారిటీతో మళ్లీ గెలిచారు. గెలుపు పత్రం తీసుకునేందుకు పిలుపు కూడా అందుకున్నారు.
కానీ అధికార పక్షపు అహంకారం ఆమె గెలుపును ఒప్పుకోలేదు. మరోసారి ఓట్లు లెక్క వేయించి, అధికారులను చెప్పు చేతల్లో పెట్టుకుని ఆరు ఓట్ల తో ఆమె ఓడిపోయారంటూ తీర్మానించేశారు. వారు కోరితే రీ కౌంటింగ్ చేసిన అధికారులు.. ఈ మహిళా అభ్యర్థి కోరితే మాత్రం అంగీకరించలే దు. దీంతో ఆమె ఇలా కన్నీటి పర్యంతమయ్యా రు. ప్రజలు ఇచ్చిన గెలుపును లాక్కున్న ఎమ్మెల్యే తీరును అక్కడే దునుమాడారు. గెలిచిన అభ్యర్థిని, అందులోనూ మహిళను ఇంతలా ఏడిపించి బలవంతంగా ఆ స్థానాన్ని లాక్కోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
– అరసవల్లి (శ్రీకాకుళం )


