‘వైఎస్సార్‌సీపీ గెలిస్తే ప్రకటించరా..?’ | YSRCP Leaders Kethireddy Protest Against Delay Of YSRCP Winning Seats | Sakshi
Sakshi News home page

‘వైఎస్సార్‌సీపీ గెలిస్తే ప్రకటించరా..?’

Nov 7 2026 7:05 PM | Updated on Nov 7 2026 7:21 PM

YSRCP Leaders Kethireddy Protest Against Delay Of YSRCP Winning Seats

శ్రీ సత్యసాయి జిల్లా: అధికారాన్ని అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై జిల్లాలోని ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి నిరసన చేపట్టారు. తాడిమర్రి మండలంలో  వైఎస్సార్‌సీపీ గెలిచిన ఎంపీటీసీ స్థానాలను ప్రకటించకుండా ఎన్నికల అధికారులు కాలయాపన చేస్తున్నారు. టీడీపీ నేతల ఒత్తిడితో వైఎస్సార్‌సీపీ గెలుపును అడ్డుకునేందుకు  యత్నిస్తున్నారు. 

తాడిమర్రి మండలంలో వైఎస్సార్‌సీపీ గెలిచిన స్థానాలను రీ కౌంటింగ్‌ చేయాలంటూ టీడీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఎన్నికల అధికారులు ఫలితాలు ప్రకటించకుండా కూటమి నేతలకు అండగా నిలుస్తున్నారు. 

మరొకవైపు వైఎస్సార్ సీపీ కౌంటింగ్ ఏజెంట్లను బయటకు పంపి మరీ రీకౌంటింగ్‌కు పట్టుబడుతున్నారు. దీనిపై కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ క్రమంలోనే ధర్మవరం ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా చేసేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతొ రోడ్డుపైనే కేతిరెడ్డి నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ గెలిస్తే ప్రకటించరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గోరంట్ల మాధవ్‌ ఆందోళన

శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి ఎమ్పీటీసీ స్థానంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి విజయం సాధించారు. అయితే టీడీపీ అభ్యర్థి రీకౌంటింగ్‌ కోరడంతో వైఎస్సార్‌సీపీ కౌంటింగ్‌ ఏజెంట్లను బయటకు పంపారు.

 దీన్ని నిరసిస్తూ  వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఆందోళన చేపట్టారు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు పంపి రీ కౌంటింగ్‌ ఎలా చేస్తారని నిరసన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులతో ఆయన్ను అక్కడి నుంచి పంపే యత్నం చేయగా, దీన్ని గోరంట్ల ఖండించారు. టీడీపీ అరాచకాలకు ఇదొక పరాకాష్ట అంటూ మండిపడ్డారు. 

ఇదీ చదవండి: కౌంటింగ్‌ కేంద్రం ముందు ఆర్కే రోజా నిరసన

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement