జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల్లోనూ టీడీపీ నేతల అక్రమాలు | Irregularities by TDP leaders in ZPTC and MPTC election results as well | Sakshi
Sakshi News home page

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల్లోనూ టీడీపీ నేతల అక్రమాలు

Nov 7 2026 6:57 PM | Updated on Nov 7 2026 6:57 PM

Irregularities by TDP leaders in ZPTC and MPTC election results as well

శ్రీ సత్యసాయి/కాకినాడ/అనంతపురం/ కృష్ణా జిల్లాలు: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల్లోనూ టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారు. మంత్రి సవిత ప్రాతినిధ్యం వహిస్తున్న పెనుకొండ నియోజకవర్గంలో టీడీపీ నేతలు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల లెక్కింపు వేళ బరితెగించారు. గోరంట్ల మండలం బూదిలి ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి 55 ఓట్లతో గెలుపొందగా, రీ కౌంటింగ్ జరపాలని మంత్రి సవిత వర్గీయులు గొడవ చేశారు. అయినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు. 

పిఠాపురం రూరల్ నర్సింగపురం-జమ్ముల ఎంపీటీసీ ఎన్నికల లెక్కింపుల్లోనూ అవకతవకలు జరిగాయి. కౌంటింగ్ అధికారుల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్సార్‌సీపీ అభ్యర్ది రాయుడు చాందినీ దేవి. నాలుగు కౌంటింగ్ బాక్సుల్లో ఒక బాక్స్‌కు కూడా సీల్‌ సరిగ్గా లేదు. చాందినీ దేవి అనుమానం వ్యక్తం చేసినా బాక్స్ తెరిచి అధికారులు ఓట్లు లెక్కించారు. దిక్కున చోట చెప్పుకో అంటూ తన పట్ల అధికారులు దురుసుగా వ్యవహరించారని చాందినీ దేవి ఆరోపించారు.

కల్యాణదుర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలిచినా అధికారులు డిక్లరేషన్ ఇవ్వలేదు. రీ కౌంటింగ్ పేరుతో ఫలితాలు తారుమారు చేస్తున్నారు టీడీపీ నేతలు. టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు కుటుంబ సభ్యులు దౌర్జన్యానికి దిగారు. వారికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారు. కల్యాణదుర్గం కౌంటింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిరసన తెలిపారు. శెట్టూరు, కుందుర్పి, కంబదూరు మండలాల్లో వైఎస్సార్‌సీపీ గెలిచిన ఎంపీటీసీ స్థానాల్లో డిక్లరేషన్ ఇవ్వలేదని ఆందోళన చేపట్టారు. పోలీసుల ప్రేక్షక పాత్ర పోషించారు.

మాడుగుల ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తికి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యే స్వగ్రామం వెన్నెలపాలెంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పైల సత్యనారాయణ విజయం సాధించారు. సమీప కూటమి అభ్యర్థిపై 73 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

నంద్యాలలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మహానంది మండలం అబ్బిపురం ఎంపీటీసీ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నూర్ బాష గెలుపొందినా కూడా ఉదయం నుంచి డిక్లరేషన్ ఫామ్ ఇవ్వకుండా ఆటంకం కలిగించటంపై శిల్పా చక్రపాణి రెడ్డి ఫైర్ అయ్యారు. కౌంటింగ్ సెంటర్ వద్దకు వెళ్లడానికి బయలు దేరిన శిల్పచక్రపాణి రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.

తిరుపతి రూరల్ మండలం జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ ఆధిక్యంలో ఉండటంతో టీడీపీ కుట్రలు చేసింది. తిరుపతి రూరల్ జడ్పీటీసీ కౌంటింగ్ గంటపాటు నిలిపివేశారు. వైఎస్సార్‌సీపీకి ఆధిక్యత వస్తుండటంతో పోలింగ్ అధికారులపై ఒత్తిళ్లు తెచ్చారు టీడీపీ నాయకులు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ఎస్.జీ.ఎస్ ఆర్ట్స్ కాలేజీకు వచ్చి పోలింగ్ అధికారులతో మాట్లాడారు.

ఇదీ చదవండి: అందుకే నా జీవిత కథను నేనే చెప్పాలనిపించింది: సోనియా గాంధీ

కృష్ణా జిల్లాలోనూ ఓటమి భయంతో కూటమి కుట్రలు చేసింది. గన్నవరం జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అనగాని రవికి ఆధిక్యం వచ్చి, 31 ఓట్ల స్పష్టమైన మెజార్టీ ఉన్నా అధికారులు తాత్సారం చేశారు. ఫలితం ప్రకటించకుండా జాప్యం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement