సాక్షి, విజయవాడ: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్, ఏజెంట్లపై దాడుల అంశంపై ఎస్‌ఈసీకి వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఎస్ఈసీ కార్యాలయానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబ, వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, ఇతర నేతలు ఫిర్యాదు చేశారు.
కాగా, బ్యాలెట్ బాక్సును మార్చబోయి అడ్డంగా దొరికిపోయిన అధికారులు, గుంటూరు జిల్లా పోలీసులు వారి తప్పును కప్పిపుచ్చుకొనేందుకు మరికొన్ని తప్పులు చేసి, చివరకు వారి అప్రజాస్వామిక దుశ్చర్యను అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టారు. అది కూడా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, పార్టీ నాయకులు ఆ అధికారిని నిలదీసి, అక్కడే రోడ్డుపై ధర్నా చేయడంతో ఉన్నతాధికారులు రంగప్రవేశం చేసి, పరిస్థితిని చక్కదిద్దారు. అయినా శాంతియుతంగా ధర్నా చేసిన వారిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారు.
పైగా, విషయం తెలుసుకొని ధర్నా ప్రారంభమైన గంట తర్వాత అక్కడికి వచ్చిన వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పైనా కేసు పెట్టడం పోలీసుల దుర్మార్గానికి మరో నిదర్శనం. ఇంకా విచిత్రమేమిటంటే.. అసలు ఘటన స్థలంలోనే లేని ఎస్సై ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ తప్పుడు కేసు పెట్టడం. ఇదంతా చంద్రబాబు మార్కు రెడ్‌బుక్ రాజ్యాంగం మేరకే జరిగిందని వైఎస్సార్‌సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.
ఇదీ చదవండి: తప్పు చేసి.. తప్పుడు కేసు


