breaking news
Illegal arrest
-
YSRCP Leaders: న్యాయం గెలిచింది.. జగన్ కు ధన్యవాదాలు
-
మిథున్ రెడ్డి అక్రమ అరెస్ట్ పై బియ్యపు మధుసూదన్ రెడ్డి నిరసన
-
కూటమి కుట్రలు-అక్రమ అరెస్ట్ లు
-
తండ్రిపై కక్షతో.. మిథున్ రెడ్డి జైలుకు
-
Gollapalli Surya: అక్రమ అరెస్టులు తప్ప.. పాలన చేతకాని కూటమి ప్రభుత్వం
-
రమేష్‌రెడ్డిని ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్
-
పార్లమెంట్లో మిథున్ రెడ్డి నిలదీస్తాడనే భయంతోనే అరెస్ట్
-
KSR Live Show: అనుకున్నట్టే మిథున్ రెడ్డిని జైల్లో వేసాం.. బయటపడ్డ తండ్రీకొడుకుల పన్నాగం
-
మిథున్ రెడ్డి అక్రమ అరెస్ట్ పై YV సుబ్బారెడ్డి రియాక్షన్
-
ఇలాంటి బెదిరింపులు ఎన్నో ఎదుర్కొన్నాం మిథున్ రెడ్డి అరెస్ట్ పై వరుదు కళ్యాణి
-
రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద భారీగా YSRCP నేతలు నిరసన
-
రాష్ట్రంలో YSRCP నాయకులే లక్ష్యంగా అరెస్టులు జరుగుతున్నాయి
-
Midhun Reddy Illegal Arrest: చంద్రబాబు కుతంత్రం.. అప్రూవర్ తంత్రం
-
మిధున్ రెడ్డి అక్రమ అరెస్ట్ పై భూమన అభినయ్ రెడ్డి కామెంట్స్
-
మిథున్ అరెస్ట్ పై అనిల్ కుమార్ యాదవ్ వార్నింగ్
-
లిక్కర్ కేసులు పెట్టి కూటమి ప్రభుత్వం చీప్ పాలిటిక్స్ చేస్తుంది
-
ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్ట్ పై విడదల రజిని ఫైర్
-
మిథున్ రెడ్డి అరెస్ట్ పై అంబటి స్ట్రాంగ్ రియాక్షన్
-
ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును ఖండించిన YS జగన్
-
ప్రజల దృష్టి మళ్లించేందుకే అక్రమ కేసు: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్ష నేత, ఎంపీ పీవీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్టును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలు, మోసాలను కప్పిపుచ్చుకోవడానికి, వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి.. జరగని లిక్కర్ స్కామ్ జరిగినట్లు చిత్రీకరిస్తూ.. వైఎస్సార్సీపీ నాయకులపై తప్పుడు వాంగ్మూలాలతో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు సీఎం చంద్రబాబు రాష్ట్ర సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. 2014–19 మధ్య జరిగిన అనేక కుంభకోణాల్లో.. తీవ్రమైన అవినీతి కేసుల్లో నిందితుడైన చంద్రబాబు ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారని గుర్తు చేశారు. ఆ కేసుల్లో ఆయనతో పాటు ఆయన సన్నిహితులపై దర్యాప్తు నిలిపేయించుకున్న చంద్రబాబు.. వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ మేరకు మద్యం అంశానికి సంబంధించి వాస్తవాలతో కూడిన సమగ్ర నివేదికను జత చేస్తూ ‘ఎక్స్’లో ఆదివారం పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. చంద్రబాబు బెయిల్‌పై ఉన్నారనేది తిరుగులేని సాక్ష్యం ‘వైఎస్సార్సీపీ లోక్‌సభ సభ్యుడు పీవీ మిథున్‌రెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది పూర్తిగా అక్రమ కేసు. ప్రజల తరఫున పోరాడేవారి గొంతు నొక్కేయడానికి రూపొందించిన కుట్ర తప్ప మరొకటి కాదు. వరుసగా మూడుసార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన మిథున్ రెడ్డిని బెదిరించి బలవంతంగా సేకరించిన అబద్ధపు వాంగ్మూలాలతో కేసులో అక్రమంగా ఇరికించారు. టీడీపీ ప్రభుత్వ మోసాలు, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మిథున్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారు. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య. జరగని మద్యం స్కామ్‌ను జరిగినట్లుగా చిత్రీకరించడం కేవలం మీడియా నాటకాల కోసం.. నిజమైన సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి సృష్టించిన కల్పిత కథనం తప్ప మరొకటి కాదు. ఈ కుంభకోణం మొత్తం కేసు ఒత్తిడి, బెదిరింపులు, థర్డ్–డిగ్రీ హింస, లంచాలు, ప్రలోభాలాల ద్వారా సేకరించిన తప్పుడు వాంగ్మూలాలపై సృష్టించిందే. 2014–19 మధ్య కాలంలో మద్యం విధానానికి సంబంధించి అక్రమాలపై కేసులో చంద్రబాబు స్వయంగా బెయిల్‌పై ఉన్నాడనే వాస్తవం.. ఆయన ఇప్పుడు ఎందుకు ఇంత దిగజారిపోయాడనేదానికి తిరుగులేని సాక్ష్యం. 2014–19 మధ్య కాలంలో ఆయనపై నమోదైన మద్యం కుంభకోణం కేసును రద్దు చేసుకోవడానికి.. ఇప్పుడు 2024–29 మద్యం విధానాన్ని సమర్థించుకోవడానికి.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూపొందించిన విధానాన్ని చంద్రబాబు తప్పుపడుతున్నారన్నది వాస్తవం. ఇలాంటి కుట్రలను ధైర్యంగా ఎదుర్కొన్నాం వైఎస్సార్సీపీని అణచి వేయడానికి ఇలాంటి కుట్రలు జరిగిన ప్రతిసారి మేము ధైర్యంగా ఎదుర్కొన్నాం. ప్రజలతో నిలబడి వారి పక్షాన ప్రశ్నిచడం, పోరాడటం ద్వారా మేము ఎదిగాము. అన్యాయాలపై రాజీలేని పోరాటాలు చేయడం ద్వారా వైఎస్సార్సీపీ ప్రజల హృదయాల్లో పదిలమైన స్థానాన్ని సంపాదించుకుంది. పైన వివరించిన విధంగా టీడీపీ అధికార దుర్వినియోగం ప్రజాస్వామ్యంపై జరిగిన నేరపూరిత దాడి కంటే తక్కువ కాదు. పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నా, వైఎస్సార్సీపీ ప్రజలతో నిలుస్తుందని, వారి గొంతుకగా, కవచంగా ఉంటుందని నేను ప్రజలకు హామీ ఇస్తున్నాను. మద్యం అంశానికి సంబంధించి సమగ్ర నివేదికను మీ పరిశీలన కోసం జత చేస్తున్నాను.’ గత ప్రభుత్వ విజయాలు అపహాస్యం మద్యం కుంభకోణం విషయంలో వైఎస్సార్సీపీ నాయకులపై తప్పుడు ఆరోపణలు చేస్తూనే.. ప్రస్తుత టీడీపీ కూటమి సర్కార్ వైఎస్సార్సీపీ రద్దు చేసిన మద్యం అవినీతి పద్ధతులను పునరుద్ధరిస్తోంది. బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్‌ల పేరుతో మద్యం దుకాణాలు తిరిగి వచ్చాయి. వేలాది బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్‌లను మూసి వేయడం, మద్యం దుకాణాలను గణనీయంగా తగ్గించడం వంటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తుత కూటమి సర్కార్ అపహాస్యం చేస్తూ మళ్లీ పర్మిట్ రూమ్‌లు, బెల్ట్ షాపులు, ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు బ్యాక్ డోర్ మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తోంది. మద్యం నియంత్రణను బలహీన పరుస్తోంది. మద్యం దుకాణాల లైసెన్స్‌లలో మళ్లీ అవినీతి, మాఫియా ప్రవేశించాయి. ఎంపిక చేసిన డిస్టిలరీలకు ఆర్డర్లు ఇవ్వడం ద్వారా 2019లో మేము అమలులోకి తెచ్చిన పారదర్శక ప్రభుత్వ దుకాణాల వ్యవస్థను రద్దు చేసింది. ఇది రాజకీయ ప్రేరేపిత కేసుచంద్రబాబు నాయుడు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు రాష్ట్ర సంస్థలను, ఎల్లో మీడియాను దుర్వినియోగం చేస్తున్నారు. అనేక తీవ్రమైన అవినీతి కేసుల్లో నిందితుడిగా ఉన్న చంద్రబాబునాయుడు ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఆయన బెయిల్‌పై ఉన్న కేసుల్లో 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన మధ్యం కుంభకోణం కూడా ఉంది. అప్పట్లో మద్యం సిండికేటు మాఫియాను పెంచి పోషించి అవినీతిని వ్యవస్థీకరించారు. అధికారంలోకి వచ్చాక, చంద్రబాబునాయుడు తనపై, తన సన్నిహితులపై ఉన్న ఆ తీవ్రమైన అవినీతి కేసుల దర్యాప్తును నిలిపి వేశారు. వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి, జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడానికి వైఎస్సార్సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని రాజకీయంగా ప్రేరేపితమైన మద్యం కేసును రూపొందించడానికి చంద్రబాబు కుట్ర పన్నాడు. ప్రజల హృదయాల్లో పాతుకుపోతున్నారని..టీడీపీ నిజమైన ఎజెండా ఇప్పుడు స్పష్టంగా ఉంది. దర్యాప్తు ముసుగులో వైఎస్సార్సీపీ నాయకులను అరెస్టు చేయడానికి, వారిని నిరవధికంగా జైలులో ఉంచడానికి చట్టపరమైన ప్రక్రియను లాగడానికి వారు సిట్‌ను ఉపయోగించాలనుకుంటున్నారు. కానీ.. విచారణ ప్రారంభమైన తర్వాత అసలు నిజం బయట పడుతుంది. ఇది పూర్తిగా చట్టపరమైన అర్హత లేని నిరాధారమైన, రాజకీయంగా ప్రేరేపితమైన కేసు. వైఎస్సార్సీపీ నాయకులను అరెస్టు చేస్తున్నది వారు దోషులు కాబట్టి కాదు.. ప్రజల హృదయాల్లో లోతుగా పాతుకుపోతున్నారు కాబట్టి. ఇది చట్టపరమైన ప్రక్రియ కాదు. ఇది బలమైన ప్రతిపక్షాన్ని అస్థిర పరచడానికి ఉద్దేశించి సాగిస్తున్న రాజకీయ వేట. -
పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడమే చంద్రబాబు లక్ష్యం
-
పెద్దిరెడ్డిని ఏమి చేయలేక.. మిథున్ రెడ్డి అక్రమ అరెస్ట్
-
రాజకీయ కుట్రలో భాగంగా మిథున్ రెడ్డి అరెస్ట్
-
మిథున్ రెడ్డి అరెస్ట్ పై YSRCP నేతలు ఫైర్
-
ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్ట్ పై రాచమల్లు కామెంట్స్
-
నిలువెల్లా విషం.. సిట్ పేరుతో చిల్లర కుట్రలు
-
వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్
సాక్షి, విజయవాడ: అక్రమ మద్యం కేసులో వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. విజయవాడలో విచారణకు హాజరైన ఆయన్ని సిట్ అదుపులోకి తీసుకుంది. రేపు కోర్టులో హాజరుపర్చనుంది. లేని మద్యం కేసును సృష్టించి.. చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు తెరలేపింది. రాజకీయ కక్షతో పెద్దిరెడ్డి కుటుంబాన్ని చంద్రబాబు సర్కార్ వేధిస్తోంది. ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం బుసలు కొడుతోంది. మిథున్‌రెడ్డి అరెస్ట్‌పై వైఎస్సార్సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.మిథున్‌రెడ్డి అరెస్ట్‌ను వైఎస్సార్సీపీ నేతలు ఖండించారు. కూటమి పాలనలో కక్ష సాధింపులు తారాస్థాయికి చేరాయి. తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదు. మిథున్‌రెడ్డి కడిన ముత్యంలా బయటకొస్తారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది. లేని మద్యం కేసును సృష్టించి అరెస్ట్‌లు చేస్తున్నారు. కక్ష సాధింపులో భాగంగానే మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. న్యాయ పోరాటంలో కచ్చితంగా విజయం సాధిస్తాం’’ అని వైఎస్సార్సీపీ నేతలు అన్నారు. కాగా, విచారణకు ముందు.. మిథున్‌రెడ్డి ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని, అక్కడి నుంచి సిట్ కార్యాలయానికి వెళ్లారు. ఈ ఉదయం ఆయన ఢిల్లీలో సాక్షితో మాట్లాడుతూ.. తనపై కేసులు రాజకీయ కక్షతో పెట్టినవే అని అన్నారు. తానొక ఎంపీనని, మద్యం పాలసీ రూపకల్పనలో తన ప్రమేయం ఎందుకు ఉంటుంది? అని ప్రశ్నించారు. అదే సమయంలో వైఎస్సార్సీపీ కీలక నేతలు ఇదంతా కూటమి ప్రభుత్వ కుట్రేనని మండిపడ్డారు. విచారణ సమయంలో సిట్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.మిథున్ రెడ్డి అరెస్టుని ఖండించిన మాజీ ఎంపీ వంగా గీతమీరు తప్పు చేస్తున్నారని మీకు తెలుసు కాబట్టే వాటిని మేము ప్రశ్నిస్తామని భయపడి YSRCP నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తున్నారని అందరికీ తెలుసు.చంద్రబాబూ.. నిజాయితీగా పాలన చేస్తున్నవారు ఎవరూ ఇలా అక్రమ అరెస్టులు చేయించరు.మిథున్ రెడ్డి అక్రమ అరెస్టును ఖండిస్తున్నా.లేని మద్యం కేసును సృష్టించి, చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు తెరలేపుతోంది: ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రిఎంపీ మిథున్ రెడ్డి మీద అక్రమ కేసు పెట్టి, అరెస్టు చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా.ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం బుసలు కొడుతోంది అనడానికి ప్రస్తుత పరిణామాలే సాక్ష్యంచంద్రబాబు గారూ మీరు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు.మిథున్ రెడ్డిపై అక్రమ అరెస్టును ఖండిస్తున్నా: గోరంట్ల మాధవ్, మాజీ ఎంపీప్రజల అండదండలు మాకు ఉన్నాయి.మీ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తూనే ఉంటాం.మిధున్ రెడ్డి అరెస్ట్ పై X లో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్లిక్కర్ స్కామ్ అంటారు… కానీ:ఆధారం లేదుడబ్బు సీజ్ కాలేదుమద్యం లభించలేదుచార్ట్ షీట్ లో పేరు లేదు ఇంకెక్కడా కుంభకోణం???? కానీ అరెస్ట్ ఉంది ఎందుకంటే టార్గెట్ జగన్ అన్నఈ కుట్రలో మిథున్ అన్నను కూడా లాగారు.ఇది స్కామ్ కాదు… ఇది చంద్రబాబు గారి ప్రతీకార డ్రామామిథున్ రెడ్డి అరెస్ట్ కుట్రపూరితం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా: గురుమూర్తి, ఎంపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు ప్రజల సమస్యలు గాలికి వదలి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కక్షసాధింపులకు ప్రాధాన్యం ఇస్తుంది.ఎన్నికలలో ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చే విధంగా కుట్ర పూరితంగా వ్యవహరించడం దుర్మార్గం.ఈ కుట్రలన్నింటికి సమాధానం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. -
హైకోర్టు జోక్యంతోనైనా అరాచకాలు తగ్గుతాయా?
ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానానికి అభినందనలు. రెడ్‌బుక్ పేరుతో రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలపై అరాచకాలకు తెగబడుతున్న తెలుగుదేశం పార్టీకి ముకుతాడు వేసే దిశగా న్యాయస్థానం మేలైన చర్య తీసుకుంది. సోషల్‌మీడియా పోస్టుల విషయంలో అరెస్ట్ అయిన వారికి రిమాండ్ ఇచ్చే విషయంలో ఆచితూచి వ్యవహరించాలని, పౌరుల హక్కుల పరిరక్షణకు విఘాతం కలిగితే చూస్తూ ఊరుకోబోమని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్లకు జారీ చేసిన ఒక సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతున్న కొందరు పోలీసు అధికారుల ఇష్టారాజ్య పోకడలకు కొంతమేర బ్రేక్ వేసింది. హైకోర్టు విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం జ్యుడిషియల్ మెజిస్ట్రేట్లు ఇకపై యాంత్రికంగా రిమాండ్ విధించరాదు. పోలీసులు పెట్టిన కేసు లోతుపాతులు, నిందితులపై మోపుతున్న బీఎన్ఎస్ సెక్షన్ల హేతుబద్ధతలను పరిశీలించిన తర్వాతే రిమాండ్‌పై చర్య తీసుకోవాలి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పెట్టుకోవాలి. ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసులలో రిమాండ్ అవసరం లేదని దేశ అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేసిన విషయం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఇటీవలి కాలంలో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్లు కొందరు అవసరమున్నా లేకపోయినా పోలీసులు మోపిన కేసుల్లో నిందితులను రిమాండ్‌కు పంపుతున్న విమర్శలు ఉన్నాయి. ఉన్నత న్యాయస్థానాలు అప్పుడప్పుడు రిమాండ్ తీరుతెన్నులను తప్పుపడుతున్నా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో హైకోర్టు ఈ సర్క్యులర్ జారీ చేసింది. దీనిని ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణ అవుతుందని కూడా స్పష్టం చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ సర్క్యులర్‌కు సంబంధించిన వార్తలకు తెలుగుదేశం అనుకూల మీడియా పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వకపోవడం!ఏడాది క్రితం ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెడ్‌బుక్ పేరుతో సొంత రాజ్యాంగం అమలు చేస్తూ భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేస్తూ, రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తూ సమాజంలో భయభ్రాంతులను సృష్టిస్తున్నట్లు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్‌లు చట్టాలతో సంబంధం లేకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ తీవ్రంగా విమర్శిస్తోంది. లోకేష్ మరో అడుగు ముందుకేసి రెడ్‌బుక్ ఏదో ఘనకార్యమైనట్లు సమర్థిస్తూ మాట్లాడుతున్న తీరు ఆయన అపరిపక్వతను తెలియచేస్తుందన్న విశ్లేషణలు వస్తున్నాయి. సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసులు దారుణంగా కేసులు పెడుతూ వస్తున్నారు.జర్నలిస్టులను కూడా వదలి పెట్టుకుండా వేధిస్తున్నారు. చివరికి పరిస్థితి ఏ దశకు చేరిందంటే అధికారంలో ఉన్న టీడీపీ జనసేనలకు అనుకూలంగా వ్యవహరించకపోతే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై సైతం రెడ్‌బుక్ ప్రయోగిస్తున్నారు. సిద్ధార్థ్ కౌశల్ అనే ఐపీఎస్ ఈ రెడ్‌బుక్ పిచ్చి గోలతో తాను పని చేయలేనని స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని వెళ్లిపోయారని వార్తలు వచ్చాయి. కొందరు అధికారులు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో అర్ధం కాక తల పట్టుకుంటున్నారు. అధికార పార్టీ కొమ్ము కాసే కొద్ది మంది అధికారులు మాత్రం రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తూ చట్టాలను, నిబంధలను గాలికి వదిలి వేస్తున్నారు. కొందరు జిల్లా కలెక్టక్టర్లు, ఎస్పీలు 'నీవు ఫలానా కులం వాడివి కదా! అయినా వైఎస్సార్సీపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నావు’ అని అడుగుతున్నారట. దీనికి సంబంధించి ఒక వ్యక్తి చెప్పిన మాటల వీడియో వైరల్ అయింది. జిల్లా స్థాయి అధికారులే అలా ఉంటే క్షేత్రస్థాయిలో ఉండే వారు ఏమి చేయగలుగుతారు? పద్దతిగా ఉంటే శంకరగిరి మాన్యాలు పట్టవలసి వస్తుందని భయపడుతున్నారు. కొన్ని సందర్భాలలో అధికారులు తాము వేధించామనే బయట చెప్పండని నిందితులతో అంటున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటివరకు వందలాది మంది సోషల్ మీడియా కార్యకర్తలకు నోటీసులు ఇవ్వడం, అరెస్టులు చేయడం వంటివి జరిగాయి. రిమాండ్ విషయంలో తగు జాగ్రత్తలతో వ్యవహరించాలని హైకోర్టు సర్క్యులరైతే పంపింది కానీ... మెజిస్ట్రేట్లు దీని పూర్తి స్థాయిలో అమలు చేయగలుగుతారా? లేదా?అన్న చర్చ ఉంది. ఎందుకంటే మెజిస్ట్రేట్లు పోలీసులు పెట్టే సెక్షన్ల ఆధారంగా రిమాండ్‌కు పంపుతారని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని, వాటి పరిధిలోకి రాకుండా, అవసరం ఉన్నా, లేకపోయినా కఠినమైన సెక్షన్లతో కేసులుపెట్టే అవకాశం ఉంటుందన్నది కొందరు న్యాయవాదుల అభిప్రాయంగా ఉంది. ఉదాహరణకు ఎవరినైనా వేధించాలని భావిస్తే, సంబంధం ఉన్నా, లేకపోయినా ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని ప్రయోగిస్తున్నారు. కొందరు మెజిస్ట్రేట్లు ఈ విషయాన్ని గుర్తించి ఆయా సెక్షన్లను తీసి వేయిస్తున్నా, అన్ని సందర్భాల్లోనూన అలా చేయగలుగుతారా? అన్నదానిపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. అయితే హైకోర్టు సూచనలతో మెజిస్ట్రేట్లు సోషల్ మీడియా, తదితర భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన ఫిర్యాదుల విషయంలోనైనా తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటారన్న విశ్వాసం వ్యక్తం అవుతోంది. ఎన్నికలకు ముందు లోకేశ్ రెడ్‌బుక్ అంటూ తిరుగుతుంటే, అదేదో పిచ్చిగోలలే! తెలిసి, తెలియని మాటలులే అని అంతా అనుకున్నారు. కాని కూటమికి అధికారం రాగానే అదే ప్రమాదకరంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కొన్నిసార్లు ఈ రెడ్‌బుక్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అని ఆందోళన వ్యక్తం చేసినట్లు రాజకీయ వర్గాల్లో ఒక టాక్! అయినా తన కుమారుడిని నియంత్రించలేక పోతున్నారని చెబుతున్నారు. పోలీసు అధికారులు కూడా సీఎం కంటే మంత్రి లోకేశ్ మాటలకే ఎక్కువ విలువ ఇస్తున్నారని టీడీపీ వర్గాలు సైతం అంటున్నాయి. రాజకీయ ప్రత్యర్ధులపై ఒకటికి పది చోట్ల కేసులు పెట్టి వేధించడం, ఒక కేసులో బెయిల్ వస్తే పీటీ వారంట్ల పేరుతో ఇంకో కేసులో అరెస్టు చేయడం వంటివన్నీ ఏపీలో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి. భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలకు ఇదొక బెంచ్ మార్క్ అయ్యే ప్రమాదం ఉందని ప్రజాస్వామ్య వాదులు ఆందోళన చెందుతున్నారు. నిప్పుకు గాలి తోడైనట్లుగా ఈ రెడ్‌బుక్ అరాచకానికి తెలుగుదేశం మీడియా వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రి అవ్వాలని ఉవ్విళ్లూరుతున్న లోకేశ్ హుందాగా వ్యవహరించాలని చెప్పడానికి టీడీపీ ఎవరూ సాహసించడం లేదట. అంతేకాదు. టీడీపీ నాయకత్వం అండ చూసుకుని హైకోర్టు న్యాయమూర్తులను ఇష్టం వచ్చినట్లు విమర్శించే దశకు కొందరు చేరుకున్నారు. తీర్పులను విశ్లేషించవచ్చు. కాని న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదిస్తూ వ్యాఖ్యలు చేస్తున్న తీరుపై బార్ కౌన్సిల్ సైతం తప్పు పట్టింది. జస్టిస్ శ్రీనివాస రెడ్డి కోర్టులోనే తన ఆవేదనను వ్యక్తపరిచారు.అయినా టీడీపీ తన ధోరణి మార్చుకుంటుందా?లేదా?అన్నది చెప్పలేం. ఎందుకంటే చంద్రబాబు నాయుడి నాయకత్వంలో రాజకీయ ప్రత్యర్ధుల వ్యక్తిత్వ హననం అన్నది తెలుగుదేశం పార్టీలో ఒక విధానంగా మారింది. టీడీపీ మీడియా అండగా ఉంటోంది. ఇతర పార్టీల వారి సంగతెందుకు! చివరికి 1995లో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును సైతం వదలి పెట్టకుండా దారుణమైన కథనాలు ప్రచారం చేశారు. ఒకవైపు నీతులు చెప్పడం, మరో వైపు ఇలా ఎదుటి వారి పట్ల అమానుషంగా వ్యవహరించడం అన్నది టీడీపీ వ్యూహంగా మారింది. ఈ నేపథ్యంలో హైకోర్టు జారీ చేసిన సర్క్యులర్‌ను న్యాయ వ్యవస్థ ఎంత గట్టిగా అమలు చేస్తుందో, పోలీస్ వ్యవస్థ ఎంతగా గౌరవిస్తుందో వేచి చూడాల్సిందే.::: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
YSRCP Leaders: మీ ఆటలు ఇంకా ఎన్ని రోజులో కాదు.. చంద్రబాబుకు సీరియస్ వార్నింగ్..
-
మీ అక్రమ అరెస్టులకు భయపడం.. చెవిరెడ్డికి మద్దతుగా భారీ నిరసన ర్యాలీ
-
‘కక్ష సాధింపునకే బాబు సర్కార్ తప్పుడు కేసులు’
సాక్షి, తిరుపతి జిల్లా: చంద్రగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అక్రమ అరెస్ట్ నిరసిస్తూ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు చంద్రగిరి క్లాక్ టవర్ సర్కిల్ వద్ద నిరసన నిర్వహించారు. నల్ల జెండాలు పట్టుకుని నిరసనకు దిగారు. చెవిరెడ్డి అరెస్ట్ అప్రజాస్వామ్యమంటూ నినాదాలు చేశారు. ‘‘రెడ్ బుక్ రాజ్యాంగం వద్దు- అంబేద్కర్ రాజ్యాంగమే ముద్దు" అంటూ బ్యానర్ ప్రదర్శించారు. ఈ ర్యాలీలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సతీమణి లక్ష్మి పాల్గొన్నారు.చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సతీమణి లక్ష్మి మాట్లాడుతూ.. చంద్రగిరి నియోజకవర్గంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. తమ కుటుంబంపై తప్పుడు కేసులు పెట్టీ ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. ఏనాడు బయటకు రాని వాళ్లం మేము ఈరోజు మీడియా ముందుకు బాధతో రావాల్సిన పరిస్థితి...చంద్రగిరి నియోజకవర్గం ప్రజలకు సేవ చేయడమే మేము చేసిన తప్పా.. గత పదేళ్లు మేము చంద్రగిరిలో ఎమ్మెల్యేగా ఉన్నాం. ఏ ఒక్కరినీ అరెస్ట్ చేసింది లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మా కుటుంబంపైనే కక్ష సాధింపు చర్యలకు దిగింది’’ అని చెవిరెడ్డి సతీమణి లక్ష్మి పేర్కొన్నారు. -
చెవిరెడ్డి అరెస్ట్ ను ఖండించిన భూమన కరుణాకర్‌రెడ్డి
-
చెవిరెడ్డి అరెస్ట్ పై వైఎస్ జగన్ రియాక్షన్
-
ఆలస్యమైనా న్యాయం, ధర్మం గెలుస్తుందన్న చెవిరెడ్డి
-
ప్రభుత్వ కుట్ర.. సిట్ కుతంత్రం
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ కుట్రతో సిట్ సాగిస్తున్న అక్రమ కేసు పన్నాగం మరోసారి బట్టబయలైంది. పూర్తిగా అవాస్తవాలు, అభూతకల్పనలతో సిట్ సమర్పించిన రిమాండ్ నివేదికే ఆ కుట్రను మరోసారి బయటపెట్టింది. ఓ కానిస్టేబుల్‌ను ప్రలోభాలకు గురిచేసి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేసి.. తాము చెప్పినట్టు వినని మరో కానిస్టేబుల్‌పై థర్డ్ డిగ్రీతో చిత్రహింసలు.. కేసే లేకుండా అక్రమంగా లుక్ అవుట్ నోటీసులు.. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘన.. ఈసీ పరిధిలోని కేసు వక్రీకరణ.. ఇలా చెప్పుకుంటూ పోతే సిట్ అక్రమాలు, కుట్రలు అంతేలేకుండా సాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడుపై సిట్ సమర్పించిన రిమాండ్ నివేదికలు ప్రభుత్వ పెద్దల కుట్రను మరోసారి వెలుగులోకి తెచ్చాయి. మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేష్నాయుడును సిట్ అధికారులు బుధవారం ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. ప్రభుత్వ పెద్దల రాజకీయ కుట్ర, దర్యాప్తు ముసుగులో సిట్ అధికారుల కుతంత్రాన్ని చెవిరెడ్డి్డ, ఆయన తరఫు న్యాయవాదులు దుష్యంత్‌రెడ్డి, వాణి తదితరులు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. ఇది పక్కా రాజకీయ కుట్రతో పెట్టిన అక్రమ కేసేనని స్పష్టం చేశారు. ‘సత్యమేవ జయతే’ అని నినదిస్తూ..వాదనలు విన్న న్యాయస్థానం చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్ నాయుడుకు జూలై 1 వరకు రిమాండ్ విధించింది. వెన్నునొప్పితో బాధపడుతున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి జైలులో పరుపు, దిండు, ఇతర సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది. అనంతరం వారిద్దరిని పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. జైలుకు వెళుతూ చెవిరెడ్డి ‘సత్యమేవ జయతే.. న్యాయపోరాటం చేస్తాం.. అక్రమ కేసును ఎదుర్కొంటాం.. దేవుడి ఆశీస్సులు, పార్టీ అధినేత మద్దతు మాకు ఉంది’ అని నినదించారు. గన్‌మెన్‌కు ప్రమోషన్ ప్రలోభం.. అబద్ధపు వాంగ్మూలంచెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వద్ద గతంలో గన్‌మెన్‌గా పనిచేసిన గిరి అనే ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్‌ను బెదిరించి, ప్రలోభపెట్టి లొంగదీసుకోవడం కుట్ర తీవ్రతను బయటపెడుతోంది. అందుకోసమే కానిస్టేబుల్ గిరిని సిట్ అధికారులు తెరపైకి తెచ్చారు. దాదాపు 10 నెలలుగా సాగుతున్న ఈ అక్రమ కేసులో ఇప్పటివరకు ఆయన ప్రస్తావనే లేదు. కానీ.. హఠాత్తుగా తెరపైకి తెచ్చి ఆయనే కీలక సాక్షి అంటూ నమ్మించేందుకు సిట్ యత్నించింది. ఈ విధంగా ప్రతీసారి ఓ కొత్త పాత్రను ప్రవేశపెట్టి తమ కుట్రకు మరింత పదును పెట్టడం సిట్‌కు అలవాటుగా మారింది. అందుకోసం సిట్ అధికారులు పక్కా పన్నాగంతో వ్యవహరించారు. కానిస్టేబుల్ గిరిని వారం రోజులపాటు సిట్ అధికారులు తమ అదుపులో ఉంచుకుని బెదిరించారు. తాము చెప్పినట్టు అబద్ధపు వాంగ్మూలం ఇవ్వకపోతే ఆయన్ను కూడా ఈ కేసులో నిందితుడుగా చేరుస్తామని.. సస్పెండ్ చేయిస్తామని.. జైలుకు పంపుతామని బెదిరించారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇస్తే జీతం పెంపుదలతోపాటు కోరుకున్న విభాగంలో పోస్టింగ్ ఇస్తామని ప్రలోభపెట్టారు. దాంతో గిరి సమ్మతించారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెప్పడంతో హైదరాబాద్ నుంచి నగదును వాహనంలో ఆంధ్రప్రదేశ్‌కు తరలించేందుకు తాను ఎస్కార్టుగా వెళ్లినట్టు ఆయనతో అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించారు. తాము చెప్పినట్టు చేసిన గిరికి వెంటనే 60శాతం జీతం పెంపుదలతో ఆయన కోరుకున్న ఆక్టోపస్ విభాగంలో పోస్టింగ్ ఇచ్చారు. అంటే గిరి బెదిరింపులు, ప్రలోభాలకు గురయ్యే ఆ వాంగ్మూలం ఇచ్చినట్టు స్పష్టమైంది. కానిస్టేబుల్ గిరి చెప్పింది నిజమేనని భావిస్తే.. నగదు అక్రమంగా తరలింపునకు సహకరించిన ఆయన ఈ కేసులో నిందితుడు కావాలి. కానీ ఆయన్ను సిట్ అధికారులు సాక్షిగా ఎలా పేర్కొంటారని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తరఫు న్యాయవాదులు ప్రశ్నించారు. అక్రమానికి సహకరించిన ప్రభుత్వ ఉద్యోగిని సాక్షిగా పేర్కొనడం సరికాదని.. నిందితుడిగానే పేర్కొనాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ప్రస్తావించారు. ఆధారాలు లేవు.. సేకరించాల్సి ఉందన్న విచారణ అధికారిఎలాంటి ఆధారాలు లేకుండానే అక్రమంగా కేసు నమోదు చేసినట్టు సిట్ విచారణ అధికారే పరోక్షంగా అంగీకరించడం గమనార్హం. నగదు అక్రమంగా తరలించారని సిట్ చెబుతున్న రోజుల్లో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కానిస్టేబుల్ గిరితో ఫోన్లో మాట్లాడినట్టు కాల్ డేటా రికార్డు ఉందా అని ఆయన తరఫు న్యాయవాది ప్రశ్నించారు. ఇదే విషయాన్ని న్యాయస్థానం ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ఆయన సరైన సమాధానం చెప్పలేకపోయారు. అప్పుడు విచారణ అధికారిని న్యాయస్థానం ప్రశ్నించింది. ఆ డేటా ఇంకా లేదని.. సేకరించాల్సి ఉందని విచారణ అధికారి చెప్పారు. అంటే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి వ్యతిరేకంగా సిట్ ఇప్పటివరకు కనీస ఆధారాలు కూడా సేకరించలేదని స్పష్టమైంది. ఆధారాలు లేకుండా కేసు నమోదు చేయడం, అరెస్టు చేయడం అక్రమమని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన తరపు న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. తుడా వాహనంపై కట్టుకథలుగత ఏడాది ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ‘తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (తుడా)’ వాహనంలో నగదును అక్రమంగా తరలించారని సిట్ పేర్కొనడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన తరువాత తుడా వాహనం చైర్మన్ ఆధీనంలో ఉండదు. ప్రభుత్వ వాహనాలను రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు ఉపయోగించడం నిషేధం. తుడా వాహనం ఆ సంస్థ వైస్ చైర్మన్‌గా ఉన్న ప్రభుత్వ అధికారి ఆధీనంలో ఉంది. కానీ ఆ వాహనంలో నగదును తరలించారని అభియోగం మోపడం పూర్తిగా కుట్ర పూరితమని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లారు.అబద్ధపు వాంగ్మూలం ఇస్తే నామినేటెడ్ పదవి కట్టబెడతామన్నారుఈ అక్రమ కేసులో సిట్ అరెస్టు చేసిన వెంకటేశ్నాయుడు న్యాయస్థానంలో అసలు కుట్రను వెల్లడించారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి వ్యతిరేకంగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని తనను, తన భార్యను సిట్ అధికారులు తీవ్రంగా బెదిరించి, వేధించారని తెలిపారు. ఆయన చెబితే నగదును అక్రమంగా తరలించినట్టు అంగీకరించాలని వేధించారన్నారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇస్తే రూ.2 కోట్ల నగదుతోపాటు ప్రభుత్వంలో నామినేటెడ్ పదవి ఇస్తామని ప్రలోభపెట్టారని వెంకటేశ్నాయుడు వెల్లడించారు. అబద్ధపు వాంగ్మూలం ఇవ్వడానికి తాము సమ్మతించనందునే తనను ఈ అక్రమ కేసులో నిందితుడిగా చేర్చి అరెస్టు చేశారని ఆయనన్యాయస్థానానికి నివేదించారు. ఈసీ కేసు వక్రీకరణ.. హైకోర్టు ఆదేశాల ఉల్లంఘనచెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అక్రమ అరెస్టు కోసం సిట్ ఏకంగా హైకోర్టు ఆదేశాలనే సిట్ ఉల్లంఘించింది. ఈసీ పరిధిలో ఉన్న కేసును వక్రీకరిస్తూ ఆయనపై నిరాధార అభియోగాలు నమోదు చేసింది. 2024 ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ (ఈసీ) జప్తు చేసిన రూ.8.37 కోట్ల నగదు కేసును సిట్ అధికారులు వక్రీకరిస్తూ రిమాండ్ నివేదికలో పేర్కొనడమే అందుకు తార్కాణం. 2024 ఎన్నికల ముందు ఓ ప్రైవేటు సంస్థ హైదరాబాద్ నుంచి తీసుకు వస్తున్న రూ.8.37 కోట్ల నగదును పోలీసులు జప్తు చేసి కేసు నమోదు చేశారు. ఎన్నికల కమిషన్ ఆ కేసును పర్యవేక్షిస్తోంది. కాగా.. ఆ నగదు తమ సంస్థకు చెందినదని అప్పట్లోనే తిరుపతిలోని ఈశా ఇన్ఫ్రా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ఈసీకి తెలిపింది. ఆ సంస్థ ఎండీ ప్రద్యుమ్న చంద్రపాటి ఆ నగదుకు సంబంధించిన పూర్తి రికార్డులు, బ్యాంకు వోచర్లు, ఇతర ఆధారాలు సమర్పించారు. అంటే ఆ నగదు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు తరలిస్తోంది కాదని.. ఓ ప్రైవేటు రియల్ ఎస్టేట్ సంస్థ తమ వ్యాపార కార్యకలాపాల కోసం అధికారికంగా తరలిస్తున్న పూర్తి వైట్‌మనీ అని నిర్ధారణ అయ్యింది. అందుకే ఆ సంస్థ ఎండీ ప్రద్యుమ్న చంద్రపాటి వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసు విచారణ పేరిట వేధింపులకు పాల్పడకుండా పోలీసులను ఆదేశించాలని కోరారు. ఆ కేసు విచారణ పేరిట ఆ సంస్థ ఎండీని గానీ, ఇతరులు ఎవర్నీగానీ పోలీస్ స్టేషన్‌కు పిలవవద్దని హైకోర్టు 2024 మే 31నే పోలీసులను ఆదేశించింది. అంతేకాదు ఆ కేసు విషయాన్ని ఇతర కేసుల్లో కూడా ప్రస్తావించకూడదని స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇప్పటికీ అమలులోనే ఉన్నాయి. అయినా సరే హైకోర్టు ఆదేశాలను సిట్ అధికారులు ఉల్లంఘించడం విభ్రాంతి కలిగిస్తోంది. సిట్ అధికారులు మాత్రం ఎన్నికల ముందు జప్తు చేసిన ఆ నగదు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఎన్నికల కోసం తరలిస్తున్న డబ్బు అంటూ అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని ఏఆర్ కానిస్టేబుళ్లను వేధించారు. అదే వక్రీకరణతో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారు. ఆ ఈసీ కేసు వివరాలను ప్రస్తుత అక్రమ కేసుకు ముడిపెడుతూ నిరాధారణ ఆరోపణలు చేయడం సిట్ బరితెగింపునకు నిదర్శనమని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన తరఫు న్యాయవాదులు న్యాయస్థానానికి నివేదించారు.కట్ అండ్ పేస్ట్ కుట్రేముందస్తు కుట్రతోనే అక్రమ కేసులు, అరెస్టులకు పాల్పడుతున్నట్టు సిట్ మరోసారి తన రిమాండ్ నివేదిక సాక్షిగా వెల్లడించింది. ప్రైవేటు వ్యాపారి అయిన వెంకటేశ్‌నాయుడును రిమాండ్ నివేదికలో ఐఏఎస్ అధికారి అని పేర్కొంది. గతంలో ఐఏఎస్ అధికారి ధనుంజయ్‌రెడ్డిని అరెస్టు చేసినప్పటి రిమాండ్ నివేదికనే కాపీ పేస్టుచేసినట్టు బయటపడింది. ఆయనను ఐఏఎస్ అధికారిగా పేర్కొన్న సిట్ అధికారులు అదే నివేదికను కాపీ పేస్ట్ చేయడంతోనే వెంకటేశ్నాయుడు కూడా ఐఏఎస్ అధికారి అని న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ నివేదికలో వచ్చింది. ఈ కేసులో సిట్ కాపీ అండ్ పేస్ట్ కుట్ర బయటపడటం ఇది రెండోసారి కావడం గమనార్హం.సిట్ కార్యాలయంలో చెవిరెడ్డి విచారణవిజయవాడ స్పోర్ట్స్/లబ్బీపేట (విజయవాడ తూర్పు): మద్యం విధానం కేసులో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన స్నేహితుడు వెంకటేష్నాయుడును సిట్ కార్యాలయంలో అధికారులు ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకు విచారణ జరిపారు. ఈ స్కాం ద్వారా వచ్చిన నగదును 2024 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రగిరి నుంచి ఒంగోలుకు ఎలా తరలించారు?, ఎంత తరలించారు, ప్రధాన నిందితుడుగా పేర్కొన్న రాజ్ కేసిరెడ్డితో ఉన్న సంబంధాలు ఏమిటనే విషయాలపై అధికారులు ఆరా తీసినట్టు సమాచారం. ఈ కేసులో తాజాగా నిందితులుగా చేర్చిన బాలాజీకుమార్ యాదవ్, నవీన్, హరీష్, మోహిత్‌రెడ్డి పాత్రపైనా విచారణ కొనసాగినట్టు తెలుస్తోంది. విచారణ అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ఇద్దరినీ విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కూటమి అక్రమ కేసులు పెడుతోందికూటమి ప్రభుత్వం తనపై అక్రమంగా కేసులు పెడుతోందని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి ఆయనను తీసుకు రాగా.. అక్కడ మీడియాతో మాట్లాడారు. ‘నాపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను. విచారణలో వారు చెప్పినట్టు సంతకం పెట్టమంటున్నారు. వారు చెప్పినట్టు నేనెందుకు సంతకం పెడతాను. నన్ను ఎప్పుడు రమ్మంటే అప్పుడు అందుబాటులో ఉంటా. నామీద ఏ కేసులు లేవు. ఇప్పుడు అన్యాయమైన, అధర్మమైన కేసులు పెడుతున్నారు’ అని చెవిరెడ్డి వ్యాఖ్యానించారు. -
అరెస్టుకు ముందు నాన్న రాసిన లెటర్.. ఈ లెటర్ లో ఏముందంటే
-
మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి అక్రమ అరెస్ట్
-
బాబు అరాచకం.. సిట్ గూండాయిజం
సాక్షి, అమరావతి: అచ్చోసిన ఆంబోతు ఊరి మీద పడి బీభత్సం సృష్టించిన తీరును తలపిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పనితీరు. దర్యాప్తు ముసుగులో గూండాగిరీకి బరితెగించమని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ముద్ర వేసి రాష్ట్రం మీదకు వదలినట్టుంది సిట్ అరాచకం. అందుకే బెదిరింపులు, వేధింపులు, కిడ్నాపులు, చిత్రహింసలతో చెలరేగిపోతోంది. చివరకు పోలీసు శాఖలో కింది స్థాయి ఉద్యోగి కానిస్టేబుల్‌ను కూడా విచారణ పేరుతో చిత్రహింసలకు గురి చేయడం సిట్ దాష్టీకానికి పరాకాష్టగా నిలుస్తోంది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేస్తూ సిట్ చీఫ్ ఎస్వీ రాజశేఖర్‌బాబు, ఆయన బృందం అధికారిక రౌడీయిజం చలాయిస్తోంది. మరోవైపు గతంలో ఎన్నికల కమిషన్ నమోదు చేసిన కేసును వక్రీకరిస్తూ వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసి అక్రమ అరెస్టుకు తెగబడింది. లుక్ అవుట్ నోటీసులు ఇచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన స్నేహితుడు వెంకటేశ్ నాయుడులను మంగళవారం బెంగళూరు విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. బెంగళూరులోని న్యాయస్థానంలో హాజరు పరచి, ట్రాన్సిట్ వారెంట్‌పై బుధవారం విజయవాడకు తీసుకురానున్నారు. అనంతరం వారిద్దరినీ విజయవాడ న్యాయస్థానంలో హాజరు పరిచే అవకాశం ఉంది. తద్వారా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసేందుకు కొన్ని రోజులుగా చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న కుతంత్రం బట్టబయలైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై రెడ్‌బుక్ కుట్రతో నమోదు చేసిన అక్రమ కేసును వేధింపులకు పాల్పడటమే లక్ష్యంగా అరాచకానికి తెగబడుతోంది. అందుకోసం అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో భేతాళ కుట్రకు తెరతీసింది. ఆ కుట్రలో తాజా అంకమే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్టు.. ఆయన కుమారుడు మోహిత్‌రెడ్డి, మరో నలుగురిపై కేసు నమోదు. ఈ అక్రమ కేసులో తాజాగా వెంకటేశ్ నాయుడు(ఏ34), బాలాజీ కుమార్ యాదవ్ (ఏ35), యద్దాల నవీన్ (ఏ36), హరీశ్ (ఏ37), చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (ఏ38), చెవిరెడ్డి మోహిత్ రెడ్డి (ఏ39)లను నిందితులుగా చేరుస్తూ సిట్ విజయవాడ న్యాయస్థానంలో మెమో దాఖలు చేసింది. ఏకంగా సుప్రీం ఆదేశాలు, హెచ్చరికలు బేఖాతరు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వ బేతాళ కుట్ర ఇలా సాగుతోంది.పోలీసు శాఖలో చిరుద్యోగులపై కూడా థర్డ్ డిగ్రీ!చివరకు పోలీసు శాఖలోని కింది స్థాయి ఉద్యోగులను కూడా దర్యాప్తు పేరుతో వేధించి భౌతికంగా హింసించడం సిట్ దాష్టీకానికి నిదర్శనం. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఈ అక్రమ కేసులో ఇరికించాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశించారు. అందుకోసం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్ద గతంలో గన్‌మెన్‌గా పని చేసిన గిరి అనే ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) కానిస్టేబుల్‌ను కొన్ని రోజులపాటు సిట్ ఆఫీసులో నిర్బంధించారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెబితే తాను నగదు తరలించే వాహనానికి భద్రత కోసం వెళ్లానని చెప్పాలని వేధించారు. ఆయన్ను కొట్టి మరీ ఒప్పించినట్టు తెలుస్తోంది. సిట్ అధికారులు చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించారని సమాచారం. అనంతరం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్ద గతంలో గన్‌మెన్‌గా చేసిన ఏఆర్ విభాగానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డిని సిట్ అధికారులు తిరుపతి నుంచి విజయవాడ తీసుకువచ్చారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని ఆయన్నూ వేధించారు. దాదాపు రూ.250 కోట్ల నగదును అక్రమంగా తరలించేందుకు తాను ఎస్కార్టుగా వెళ్లినట్టు వాంగ్మూలం ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి చేశారు. అబద్ధపు వాంగ్మూలం ఇచ్చేందుకు మదన్ రెడ్డి సమ్మతించకపోవడంతో సిట్ అధికారులు ఆయనపై పోలీసు మార్కు ప్రతాపం చూపించారు. ఆయన ముఖం, వీపుపై తీవ్రంగా కొట్టారు. అంటే పోలీసుకే పోలీసు మార్కు ట్రీట్మెంట్ రుచి చూపించారు. సిట్ అధికారులు కొట్టిన దెబ్బలకు తీవ్రంగా గాయపడిన మదన్‌రెడ్డి ఆసుపత్రిలో చేరారు. సిట్ అధికారులు కొట్టడంతో తనకు తగిలిన గాయాల ఫొటోలతో సహా ఆయన డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి, గవర్నర్లకు ఫిర్యాదు చేయడంతోపాటు పూర్తి ఆధారాలతోసహా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దాన్ని కోర్టు విచారణకు స్వీకరించి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.కోర్టును తప్పుదారి పట్టించే ఎత్తుగడఈ కేసులో మంగళవారం సాయంత్రం వరకు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన స్నేహితుడు వెంకటేశ్ నాయుడులను సిట్ నిందితులుగా చేర్చనేలేదు. కానీ వారిపై గుట్టుచప్పుడు కాకుండా లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. నిందితులుగా చేర్చక పోయినా లుక్ అవుట్ నోటీసు జారీ చేయడం సిట్ బరితెగింపే. సొంత కంపెనీ పనిపై చెవిరెడ్డి మంగళవారం ఉదయం కొలంబో వెళ్లి.. తిరిగి బుధవారం సాయంత్రం వచ్చేలా ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ క్రమంలో తన స్నేహితుడితో కలిసి వెళ్లేందుకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్ నాయుడులను అక్కడ అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాతే ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (ఏ38), వెంకటేశ్ నాయుడు (ఏ34)తోపాటు మరో నలుగురిని నిందితులుగా చేరుస్తూ సిట్ అధికారులు న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు. అంటే బెంగళూరు విమానాశ్రయంలో వారిని అదుపులోకి తీసుకునే వరకు వారు ఈ కేసులో నిందితులే కారు. అయినా సరే వారిపై లుక్ అవుట్‌నోటీసు జారీ చేసి వారిని అడ్డుకోవడం కచ్చితంగా నిబంధనలకు విరుద్ధమే. ఇదిలా ఉండగా, తాను ఎప్పుడు పిలిచినా సిట్ విచారణకు రావడానికి సిద్ధమని ఇప్పటికే చెవిరెడ్డి పలుమార్లు ప్రకటించారు. తన కోసం చిన్న చిన్న ఉద్యోగులను ఇబ్బంది పెట్టొద్దని, వేధించొద్దని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. అయినా ఆయన ఎక్కడికో పారిపోతున్నట్లు సిట్ రహస్యంగా లుక్ అవుట్ నోటీసులిచ్చి అరెస్ట్ చేయడం చంద్రబాబు ప్రభుత్వ బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తోంది. బుధవారం వారిని బెంగళూరులోని న్యాయస్థానంలో హాజరుపరచి ట్రాన్సిట్ వారెంట్‌పై ఆంధ్రప్రదేశ్‌కు తరలించాలి. ఆ సమయంలో ఏ కేసులో వారు నిందితులుగా ఉన్నారని అక్కడి న్యాయస్థానం ప్రశ్నిస్తుంది. అందుకే సిట్ అధికారులు మంగళవారం మధ్యాహ్నం తర్వాత హడావుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడు పేర్లను నిందితులుగా చేరుస్తూ విజయవాడ కోర్టులో మెమో దాఖలు చేయడం గమనార్హం.బండారం బయట పడుతుందనే..రెడ్‌బుక్ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చెవిరెడ్డిని చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. ఎందుకంటే చంద్రగిరిలో ఆయన బలమైన రాజకీయ నేతగా ఉన్నారు. ఆ నియోజకవర్గం నుంచి 2014, 2019లో వరుసగా వైఎస్సార్సీపీ అభ్యర్థిగా 2సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం కూడా చంద్రగిరితోపాటు ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్గా ఉన్నారు. దాంతో చెవిరెడ్డిపై కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ కుట్రకు తెగబడింది. అందుకోసం తిరుపతి, చంద్రగిరిలో ఆయనపై అక్రమ కేసులు నమోదు చేయించేందుకు యత్నించారు. అక్రమంగా పోక్సో కేసు పెట్టారు. అందుకోసం నిరక్షరాస్యుడైన ఓ వ్యక్తితో ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించుకుని ఆయన ఫిర్యాదు చేసినట్టుగా అక్రమ కేసు నమోదు చేశారు. కానీ పోలీసుల కుట్ర తెలుసుకున్న ఆ వ్యక్తి కోర్టులో అసలు విషయం వెల్లడించారు. తాను చెవిరెడ్డి్డపై ఫిర్యాదు చేయలేదని, పోలీసులే తనతో ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించుకుని వారికి నచ్చినట్టుగా అబద్ధపు ఫిర్యాదు రాసుకున్నారని చెప్పడంతో పోలీసుల కుట్ర బెడిసి కొట్టింది. దీంతో ఆయనపై మద్యం అక్రమ కేసు నమోదు చేయాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశించారు. అందుకోసం ఆయన వద్ద గతంలో గన్‌మెన్‌గా పనిచేసిన గిరి, మదన్ రెడ్డి అనే ఏఆర్ కానిస్టేబుళ్లను వేధించి,హింసించి అబద్ధపు వాంగ్మూలం కోసం బలవంతం చేశారు. చెవిరెడ్డి స్నేహితుడు వెంకటేశ్ నాయుడు, ఆయన సతీమణిని సిట్ అధికారులు విచారణ పేరిట హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకువచ్చి అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని వేధించారు. తిరుపతికి చెందిన బాలాజీని వేధించి లొంగదీసుకునేందుకు యత్నించారు. తనను చిత్రహింసలకు గురి చేశారని ఏఆర్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో తమ కుట్ర పూర్తిగా బట్టబయలవుతుందని భావించిన సిట్ అధికారులు వెంటనే చెవిరెడ్డి అక్రమ అరెస్టుకు పావులు కదిపారు.మద్యం అక్రమ కేసులో చెవిరెడ్డిని ఇరికించేందుకే..గన్మెన్లను పిలిచి అబద్ధపు స్టేట్మెంట్ల కోసం చిత్రహింసలురాజకీయ కక్షసాధింపులకు పోలీసులను వాడుకుంటున్నారుతప్పుడు కేసులతో భయపెట్టాలనుకోవడం ప్రభుత్వ అవివేకంవైఎస్సార్సీపీ నాయకుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆగ్రహంసాక్షి,అమరావతి/సాక్షి, టాస్క్‌ఫోర్స్: లిక్కర్ అక్రమ కేసులో కుట్రపూరితంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఇరికించాలని కూటమి ప్రభుత్వం యత్నిస్తోందని వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భాస్కర్‌రెడ్డి వద్ద గతంలో గన్మెన్లుగా పనిచేసిన గిరి, మదన్‌రెడ్డిలను సిట్ పోలీసులు విచారణ పేరుతో పిలిచి వ్యతిరేక స్టేట్మెంట్లు ఇవ్వాలని చిత్రహింసలకు గురి చేశారని విమర్శించారు. మదన్‌రెడ్డి ఆస్పత్రిపాలై చికిత్స పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను మోహిత్‌రెడ్డి ప్రదర్శించారు. మద్యం అక్రమ కేసులో చెవిరెడ్డికి సంబంధం ఉన్నట్టు అబద్ధపు స్టేట్మెంట్ ఇవ్వనందుకు మదన్‌రెడ్డిని దారుణంగా హింసించారని ధ్వజమెత్తారు. దీనిపై ఇప్పటికే ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని వెల్లడించారు. తనకు రక్షణ కల్పించాలంటూ ఓ హెడ్ కానిస్టేబుల్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారంటేనే సిట్ ఎంత దారుణంగా వ్యవహరిస్తుందో అర్థమవుతోందన్నారు. పోలీసులు చట్టపరిధిలో పనిచేయాలని, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడతారని హెచ్చరించారు.ఈ ప్రశ్నలకు బదులేదీ?మద్యం అక్రమ కేసులో ప్రతిపక్ష నేతలందరినీ ఇరికించడానికి సిట్ అనుసరిస్తున్న విధానం, అరెస్టు చేసిన వారిపై తెస్తున్న ఒత్తిడి, తప్పుడు స్టేట్మెంట్లకు వారు ఎంచుకున్న మార్గాన్ని నిలదీస్తూ మోహిత్‌రెడ్డి సోషల్ మీడియా వేదికగా ప్రశ్నావళిని సంధించారు. వీటికి నిజాయతీగా సమాధానం చెప్పగలరా? అని ప్రశ్నించారు.⇒ ఏడాదిగా విచారణ చేస్తున్న సిట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి రాజ్ కేసిరెడ్డి నుంచి డబ్బులు అందాయని గానీ, దానిని ప్రజలకు పంచారనిగానీ ఏనాడు ప్రస్తావించకుండా ఈ రోజే చెప్పడంలో అర్థం ఏమిటీ..? అది నిజం కాదు కనుకే కదా..? ⇒ 20 ఏళ్ల సర్వీసున్న హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని పణంగాబెట్టి పోలీసు అధికారులపై అబద్ధాలు చెప్పగలరా..? ఒక్క క్షణం అందరూ ఆలోచించండి.. అలాంటిది ఒక హెడ్ కానిస్టేబుల్ విచారణ సమయంలో తనకు జరిగిన అన్యాయం, తనపై జరిగిన దాడిని తన లేఖ ద్వారా డీజీపీకి విన్నవించుకోవడంపై అతను అబద్ధాలు చెబుతున్నారని అనడం సిట్ దిగజారుడుతనానికి నిదర్శనం కాదా?⇒ మదన్‌రెడ్డిని సిట్ కార్యాలయానికి పిలిపించి అతను చెప్పినట్టు స్టేట్మెంట్ రాయకుండా, సిట్ చెప్పినట్టు రాయాలని, చెప్పమన్నట్టు చెప్పాలని ఒత్తిడి చేయడం, తప్పుడు స్టేట్మెంట్పై సంతకం పెట్టాలని బలవంతం చేయడం వల్లే కదా అతడు చనిపోతానన్నది. కాదని చెప్పగలరా?⇒ ఒక హెడ్‌కానిస్టేబుల్ తనకంటే పైస్థాయి అధికారులు (సిట్ అధికారుల) ముందే విచారణ సమయంలో మీ అందరి పేర్లూ రాసి తాను చనిపోతాను అన్నాడంటే.. ఆ హెడ్ కానిస్టేబుల్‌ను సిట్ అధికారులు శారీరకంగా, మానసికంగా ఎంత చిత్రవధ చేసి ఉంటే అంత మాట అనగలడు. ఎవరైనా కాదని చెప్పగలరా?⇒ సిట్ విచారణకు వచ్చే వరు ఎంత నిజాయతీగా చెబుతున్నా.. ఎవరినో మెప్పించడానికి, తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించడానికి ప్రతిరోజు కుట్రలు, కుతంత్రాలు పన్నుతోంది సిట్ కాదా..?⇒ ‘‘సిట్ కార్యాలయంలో ఎంతో పారదర్శకంగా విచారణ జరుగుతోంది, ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరగలేదు. ఎవరినీ టార్చర్ చేయడం లేదు’’ అని సిట్‌లో పనిచేసే ఏ ఒక్క అధికారి అయినా భగవంతుని ముందు ప్రమాణం చేయగలరా? ⇒ సిట్ రాయమన్నట్టు రాసి, చెప్పమన్నట్టు కోర్టులో మెజిస్ట్రేట్‌కు చెప్పిన గిరి అనే కానిస్టేబుల్‌కు ఆగమేఘాలపై రాత్రికి రాత్రి ఇప్పుడు అతనికి వస్తున్న జీతానికి అదనంగా 60 శాతం పెంచి ఆక్టోపస్‌లో ఉద్యోగం ఇచ్చారంటేనే సిట్ అధికారుల నిజాయతీ, నిబద్ధత, పారదర్శకత ఏపాటిదో స్పష్టంగా అందరికీ తెలుస్తోంది కదా.. అది వాస్తవం కాదా?⇒ సిట్ తన పారదర్శకత, నిబద్ధతను నిరూపించుకోవడానికి మీలోనే ఒక పోలీసు అధికారితో విచారణ చేయిస్తే నిజాలు ఎలా బయటకు వస్తాయి? నిజాయతీ, నిబద్ధతలను నిరూపించుకోవాలంటే సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరపాలి. అలా చేయాలని సిట్ అధికారులు కోరగలరా..?⇒ సత్యమేవ జయతే.. అంటున్నారు.. నిజమే ఏదో ఒకరోజు తప్పకుండా సత్యమే జయిస్తుంది. ఆ రోజు తప్పు చేసిన సిట్ అధికారులందరికీ న్యాయస్థానం శిక్ష విధించి సత్యాన్ని, ధర్మాన్ని కాపాడుతుంది.. రాసి పెట్టుకోండి.. అంటూ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. -
అరెస్టులు, కక్షసాధింపులు తప్ప అభివృద్ధి, సంక్షేమం ఊసే లేదు!
-
అనలిస్ట్ వ్యాఖ్యలతో KSRకు ఏం సంబంధమని సుప్రీం ప్రశ్న
-
సత్యమేవ జయతే.. KSR అరెస్టు అక్రమమని తేల్చేసిన సుప్రీంకోర్టు
-
మీరు ఎన్ని కేసులైన పెట్టుకోండి.. సర్వే పల్లి మొత్తం నా కుటుంబమే
-
దమ్ముంటే ముందు వాళ్ళని అరెస్ట్ చేయండి.. కొమ్మినేని అరెస్ట్ పై షాకింగ్ నిజాలు..
-
చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్ లకు చురకలంటించిన వైఎస్ జగన్
-
ఈ అరెస్ట్.. చాలా వరస్ట్.. పోలీసులకు కోర్టు చీవాట్లు
-
జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు అక్రమం : కోరుముట్ల
-
మీ పాపం పండింది.. కొమ్మినేని అరెస్ట్ పై లక్ష్మి పార్వతి రియాక్షన్
-
కొమ్మినేని కేసులపై పొన్నవోలు కీలక వ్యాఖ్యలు
-
AP: ఆందోళన పేరుతో సాక్షి కార్యాలయాలపై దాడి
-
Kommineni Srinivasa Rao: నీ తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు
-
కొమ్మినేని శ్రీనివాస్ ను అరెస్ట్ చేయడం దురదృష్టకరం: దేవులపల్లి అమర్
-
అరెస్ట్ చేసే విధానం ఇది కాదు KSRపై అరెస్ట్ అడ్వకేట్ బాల రియాక్షన్
-
కొమ్మినేని అక్రమ అరెస్ట్ పై సంచలన ప్రెస్ మీట్
-
కొమ్మినేని అరెస్ట్ ను ఖండిస్తున్నాం: అనంత వెంకట్రామిరెడ్డి
-
కొమ్మినేనిపై SC, ST కేసు ఎలా పెడతారు? అక్రమ అరెస్ట్ పై సీనియర్ జర్నలిస్టుల ప్రశ్న
-
కొమ్మినేని అక్రమ అరెస్ట్ పై కన్నబాబు రియాక్షన్
-
సాక్షి రిపోర్టర్ ప్రశ్నలకు తెల్లమొహం వేసిన ఏపీ పోలీసులు
-
నేనంటే చంద్రబాబుకు పగ.. అందుకే ఈ కక్ష సాధింపు
-
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్ట్
-
నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద అక్రమ కేసులు పెట్టారు: మనోహర్ రెడ్డి
-
ఇంత దారుణంగా హింసిస్తారా..?.. హరికృష్ణ అక్రమ అరెస్ట్‌పై వైఎస్సార్సీపీ ఫైర్
పల్నాడు జిల్లా: గురజాల సబ్ జైల్లో ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్త ఉప్పుతల హరికృష్ణను ములాఖత్ ద్వారా ఆ పార్టీ నాయకులు అంబటి రాంబాబు, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి, డాక్టర్ చింతలపూడి అశోక్, కె.వి.మురళీధర్ రెడ్డి. పరామర్శించారు. దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేత ఉప్పుతల యల్లయ్య కుమారుడు హరికృష్ణని దాచేపల్లి సీఐ పి.భాస్కరరావు దారుణంగా కొట్టి అనంతరం న్యాయమూర్తి ముందు హాజరుపరచడం, గురజాల సబ్‌జైల్‌కు రిమాండ్‌కు పంపిన నేపథ్యంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు గురజాల సబ్ జైల్లో హరికృష్ణను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఈ రోజు ఉదయమే వైఎస్ జగన్ ఫోన్ చేసి హరికృష్ణ విషయం మాట్లాడారు. మేం గురజాల వచ్చి సబ్జైల్లో ఉన్న హరికృష్ణను, చల్లా ప్రేమ్‌కుమార్ ఇద్దరినీ పరామర్శించాం. హరికృష్ణను కొట్టిన విషయంలో కొన్ని విషయాలు మీడియా ముందు చెప్పాలంటే సిగ్గుగా ఉంది. పోలీసులు దారుణంగా చిత్రహింసలు పెట్టారు. చెప్పుకోలేని చోట అతి క్రూరంగా హింసించారు. ఉదయం 4 గంటలకు పోలీసులు టీడీపీ నాయకుడు జానీ బాషా కారులో తంగెడ వెళ్ళి పోలీస్ స్టేషన్‌కు రమ్మని బలవంతంగా దాచేపల్లి తీసుకొచ్చి సీఐ భాస్కర్ దారుణంగా కొట్టాడు.పోలీసులు కేసులు పెట్టాలి కానీ ఇంత దారుణంగా హింసిస్తారా.. గతంలో పాలేటి క్రిష్ణవేణిని ఇలాగే ఇబ్బందులు పెట్టాడు. తంగెడ నుంచి హరికృష్ణ తెలంగాణ వెళ్లిపోయి లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు, కానీ పండుగ రోజని ఇక్కడికి వస్తే ఇలా దారుణంగా హింసించి చివరికి జైలుకు పంపారు. హరికృష్ణకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలి. మేం ఉన్నత న్యాయ స్థానానికి వెళ్ళి న్యాయం జరిగేలా చూస్తాం. సీఐ పొన్నూరు భాస్కర్ ఇంత దారుణంగా వ్యవహరిస్తాడా.. అతనికి ఇది కొత్తకాదని తెలిసింది.ఖాకీ బట్టలు వేసుకుంటే రౌడీలా ప్రవర్తిస్తావా. భాస్కర్ ముందు నీపై 307 కేసు పెట్టాలి, నీపై కూడా ప్రైవేట్ కేసు వేస్తాం. పోలీస్ శాఖ తక్షణమే ఆయన్ను సస్పెండ్ చేయాలి, డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోకపోతే మేం చట్టపరంగా ఏం చేయాలో అది చేస్తాం. తేలుకుట్లకు చెందిన చల్లా ప్రేమ్‌కుమార్ పక్క రాష్ట్రంలో ఉంటే సారా అమ్ముతున్నాడని అక్రమ కేసుపెట్టి జైల్లో వేశారు. ఇలాంటి కేసులకు భయపడేది లేదు. పోలీసుల్లో భాస్కర్ లాంటి తలబిరుసు సీఐలకు చెబుతున్నాం. చిలకలూరిపేటలో సుబ్బనాయుడు ఇలాగే వ్యవహరిస్తున్నాడు, మేం అధికారంలోకి రాగానే మీ సంగతి చూస్తాం, ఇలాంటి కేసులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. అవసరమైతే సుప్రింకోర్టుకు వెళతాం.నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. మా పార్టీ కార్యకర్త హరికృష్ణను దాచేపల్లి సీఐ భాస్కరరావు క్రూరంగా హింసించాడు, ఒక పశువులాగా సీఐ వ్యవహరించాడు, సిగ్గుతో తలదించుకోవాలి, మీరు తప్పులు చేస్తే కేసులు పెట్టి కోర్టులో హాజరుపరచాలి అంతేకానీ ఇదంతా ఎందుకు చేశారు, సీఐ భాస్కరరావును తక్షణమే సస్పెండ్ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, జనం తిరగబడే సమయం వచ్చింది, పోలీస్ ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి, హరికృష్ణ విషయంలో హైకోర్టుకు కూడా వెళతాం. తప్పుడు కేసులు పెట్టి టీడీపీ నాయకులు వేధిస్తున్నారు, పైగా కేసులు మాఫీ కావాలంటే లక్షల రూపాయలు ఇవ్వాలంటూ బెదిరిస్తున్నారు. మా నాయకుడు వైయస్ జగన్ గారి సూచనల మేరకే మేమంతా ఇక్కడికి వచ్చాం, పోలీస్ వ్యవస్ధకే సీఐ భాస్కర్ మచ్చలాంటి వాడు.వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి రోజూ దారుణాలు జరుగుతూనే ఉన్నాయి, ప్రజలను కాపాడాల్సిన పోలీసులే ప్రజలను చిత్రహింసలు పెట్టడం ఎక్కడా చూడలేదు, సీఐ భాస్కర్, హరికృష్ణను బూటు కాళ్ళతో తొక్కుతూ పైశాచిక ఆనందం పొందాడు. సీఐ భాస్కర్ ను తక్షణమే సస్పెండ్ చేయాలి. ఏపీలో రెడ్ బుక్ పాలనను పక్కనపెట్టకపోతే పోరాటం తప్పదు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ భయపడరు, మేం చట్టపరంగా కేసులు ఎదుర్కుంటాంసత్తెనపల్లి వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో రెడ్ బుక్ పాలన సాగుతోంది, హరికృష్ణపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు, గతంలో పాలేటి క్రిష్ణవేణిని కూడా ఇలాగే ఇబ్బంది పెట్టారు, పోలీస్ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సీఐను సస్పెండ్ చేయాలి, సీఐ భాస్కర్‌కు ఇది కొత్త కాదు, కాబట్టి ఆయనపై వెంటనే చర్య తీసుకోవాలి. వైఎస్సార్సీపీ వారెవరూ భయపడాల్సిన అవసరం లేదు, మీకు పార్టీ అండగా ఉంటుంది, మనమంతా కలిసి పోరాడుదాంహరికృష్ణ తండ్రి ఉప్పుతల యల్లయ్య మాట్లాడుతూ.. మా అబ్బాయిని, నన్ను పోలీసులు బలవంతంగా దాచేపల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు, సీఐ రాగానే నన్ను మా అబ్బాయిని పోలీసులు పట్టుకున్నారు, నా కుమారుడిని నా ముందే పోలీసులు చిత్రహింసలు పెట్టారు, కాళ్ళ మీద ఇద్దరు కూర్చుంటే సీఐ, ఇద్దరు పోలీసులు తీవ్రంగా కొట్టారు, నేను దండం పెట్టి బతిమిలాడినా వదలకుండా కొట్టారు. నేను తట్టుకోలేక పోయాను, అంత దారుణంగా కొట్టారు.హరికృష్ణ భార్య భార్గవి మాట్లాడుతూ.. నా భర్తను పోలీసులు యూనిఫామ్ లేకుండా వచ్చి బలవంతంగా తీసుకెళ్ళి చిత్రహింసలు పెట్టి దారుణంగా కొట్టారు, నా భర్తకు ఏమైనా జరిగితే మా కుటుంబం అంతా రోడ్డునపడుతుంది, ఏ తప్పు చేయని నా భర్తని ఇంత దారుణంగా చిత్రహింసలు పెట్టే అధికారం పోలీసులకు ఎక్కడిది. నాకు ముగ్గురు పిల్లలు, నా భర్తను కాపాడాలని కోరుకుంటున్నాను. -
YSRCP హరికృష్ణను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి.. దారుణం! : Ambati Rambabu
-
బాలాజీ గోవిందప్ప అరెస్ట్ సంగతి తేలుస్తాం
సాక్షి, అమరావతి: మద్యం కేసులో వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప అరెస్ట్ సంగతి తేలుస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గోవిందప్ప ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణలో ఉండగానే ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేసిన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం ఈమేరకు స్పందించింది. గోవిందప్ప అరెస్ట్ నేపథ్యంలో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ నిరర్థకమవుతుందంటూ వాదన వినిపించిన రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో మీరేం చేస్తున్నారో స్పష్టంగా కనిపిస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించింది.రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధా్దర్థ అగర్వాల్ వాదనలు వినిపిస్తూ బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయ్యారని, అందువల్ల ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ నిరర్థకమవుతుందని పేర్కొన్నారు. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ ఈ వ్యవహారాన్ని మరింత మురికిగా మార్చవద్దంటూ హితవు పలికింది. కాగా అగర్వాల్ వాదనను బాలాజీ గోవిందప్ప తరఫు న్యాయవాది సిద్ధా్దర్థ దవే తీవ్రంగా వ్యతిరేకించారు. తమ వ్యాజ్యం నిరర్థకం కాదన్నారు. గోవిందప్ప అరెస్ట్ అక్రమమని నిరూపిస్తామన్నారు. గోవిందప్ప ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోందని తెలిసి కూడా అరెస్ట్ చేశారన్నారు. దర్యాప్తు సంస్థ తీరును ఈ కోర్టు పరిగణలోకి తీసుకోవాలని అభ్యర్థించారు. సిద్ధార్థ దవేదీనిపై ధర్మాసనం స్పందిస్తూ బాలాజీ గోవిందప్ప అరెస్ట్ సంగతి కూడా తదుపరి విచారణ సమయంలో తేలుస్తామని ప్రకటించింది. అయితే మీరు (సుప్రీంకోర్టు) ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తే కింది కోర్టులో బాలాజీ గోవిందప్ప.. ఏసీబీ రిమాండ్ రిపోర్ట్‌ను వ్యతిరేకిస్తారని సిద్ధా్దర్థ అగర్వాల్ పేర్కొన్నారు. అరెస్ట్ సంగతి తేలుస్తామని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి రిమాండ్‌కు ఇవ్వవద్దని అడుగుతారన్నారు. అగర్వాల్ వాదనపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారాన్ని మీరు మురికిగా మార్చవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇద్దరికీ ఊరట..ఇదే సమయంలో కె.ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. తదుపరి విచారణ వరకు వీరిద్దరిని అరెస్టు చేయరాదని ఏసీబీని ఆదేశించింది. దర్యాప్తునకు సహకరించాలని వారిద్దరినీ ఆదేశిస్తూ తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఏసీబీకి నోటీసులు జారీ చేసింది. అదే రోజు గోవిందప్ప అరెస్ట్‌తో సహా అన్ని అంశాలపై సమగ్ర విచారణ జరుపుతామని ప్రకటించింది.ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జంషేడ్ బుర్జోర్ పార్దీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసులో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలతో పాటు భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. ఏసీబీకి నోటీసులు జారీ చేసిన హైకోర్టు.. మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరుకి సైతం నిరాకరించింది. ఈ నేపథ్యంలో వారు ముగ్గురూ అత్యవసరంగా సుప్రీంకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించారు.సమావేశాల్లో పాల్గొంటే నిందితుడిని చేసేస్తారా...?ధనుంజయరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది వికాశ్సింగ్, కృష్ణమోహన్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది నాగముత్తు వాదనలు వినిపించారు. హైకోర్టు కనీస స్థాయిలో కూడా తమ వాదనలు వినలేదని వికాశ్ సింగ్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. తమకు హైకోర్టు అవకాశం ఇచ్చి ఉంటే పిటిషనర్లపై ఏసీబీ చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని నిరూపించేవారిమన్నారు.కార్యదర్శి హోదాలో సమావేశాల్లో పాల్గొన్నంత మాత్రాన నిందితునిగా చేర్చడం సరికాదన్నారు. రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విషయంలో ఇదే సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టమైన తీర్పునిచ్చిందని తెలిపారు. కార్యదర్శి హోదాలో సమావేశాల్లో పాల్గొన్నంత మాత్రాన నేరాన్ని ఆపాదించడానికి వీల్లేదని ఆ తీర్పులో పేర్కొన్నారని వికాశ్ సింగ్ నివేదించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ప్రముఖ మద్యం తయారీ కంపెనీలను పక్కకు నెట్టేసి ఎవరికీ తెలియని కంపెనీల నుంచి మద్యం కొనుగోలు చేశారన్నారు. బాలాజీ గోవిందప్ప అక్రమ అరెస్టుకర్ణాటకలో అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడకు తరలింపుసాక్షి,అమరావతి: వికాట్ గ్రూప్ భారత దేశ వ్యవహారాల డైరెక్టర్ (ఫైనాన్స్)గా ఉన్న బాలాజీ గోవిందప్పను సిట్ అధికారులు కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా యలందూర్లో అక్రమంగా అరెస్టు చేశారు. ప్రకృతి వైద్యం చేయించుకుంటున్న గోవిందప్పను అదుపులోకి తీసుకుని అక్కడి న్యాయస్థానంలో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడ తీసుకొస్తున్నారు. బుధవారం ఉదయం విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి తీసుకువచ్చి విచారిస్తారని తెలుస్తోంది. అనంతరం బాలాజీ గోవిందప్పను న్యాయస్థానంలో హాజరుపరిచే అవకాశాలున్నాయి. హైదరాబాద్‌లో సోదాల పేరుతో వేధింపులు కేసు దర్యాప్తు పేరిట హైదరాబాద్‌లోని బాలాజీ గోవిందప్ప, ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి నివాసాల్లో సోదాల పేరిట సిట్ అధికారులు హల్చల్ సృష్టించి వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేశారు. సిట్ బృందాలు హైదరాబాద్‌లో బాలాజీ గోవిందప్ప నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను హడలెత్తించారు. ఆయన భార్య, కుమారుడు, కుమార్తెలకు ప్రశ్నలతో వేధించారు.ఇంట్లో పత్రాల తనిఖీ పేరిట మంగళవారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు హల్చల్ చేశారు. కృష్ణమోహన్‌రెడ్డి నివాసంలోనూ సిట్ అధికారులు సోదాల పేరిట వేధింపులకు పాల్పడ్డారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి దాటేవరకు సోదాలు చేస్తూనే ఉన్నారు. మరో ప్రాంతంలో ఉన్న కృష్ణమోహన్‌రెడ్డి కుమారుడు రోహిత్ రెడ్డిని పిలిపించి మరీ ఆయనకు సంబంధం లేని అంశాలపై ప్రశ్నించారు. ధనుంజయ్‌రెడ్డి నివాసంలోనూ సోదాల పేరిట సిట్ అధికారులు అదే రీతిలో బెదిరింపులకు పాల్పడ్డారు. -
Ambati: అర్ధరాత్రి ఒక మహిళపై పోలీసులే దాడి.. రాష్ట్రంలో అసలేం జరుగుతోంది?
-
పరాకాష్టకు రెడ్‌బుక్ కుట్ర .. పీఎస్ఆర్ ఆంజనేయులు అక్రమ అరెస్ట్
సాక్షి, అమరావతి: సీనియర్ ఐపీఎస్ అధికారి, రాష్ట్ర నిఘా విభాగం పూర్వ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు అక్రమ అరెస్టుకు కూటమి ప్రభుత్వం తెగబడింది. టీడీపీ అధికారంలోకి రాగానే అక్రమ కేసులో ఆయన్ను సస్పెండ్ చేయడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు బరితెగించింది. వలపు వల వేసి బడా బాబులను బురిడీ కొట్టించే నేర చరిత్ర ఉన్న ముంబయికి చెందిన మోడల్ కాదంబరి జత్వానీ ద్వారా తప్పుడు ఫిర్యాదు ఇప్పించి మరీ కుతంత్రాన్ని రచించింది. మేనిఫెస్టో అమలు చేయలేని దుస్థితిలో ప్రజల దృష్టి మళ్లించే డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా పీఎస్ఆర్ ఆంజనేయులును అక్రమంగా అరెస్టు చేసింది.మంగళవారం తెల్లవారుజామునే సీఐడీ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను హైదరాబాద్ నుంచి విజయవాడలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించి, మంగళవారం మధ్యాహ్నం 1 గంట నుంచి అర్ధరాత్రి వరకు విచారించారు. బుధవారం ఉదయం ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించిన అనంతరం న్యాయస్థానంలో హాజరు పరిచే అవకాశం ఉంది. జత్వానీని అడ్డుపెట్టుకుని కుట్ర కాదంబరి జత్వానీ విషయంలో చట్టబద్ధంగా సాగిన వ్యవహారాన్ని వక్రీకరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. ఆమెతో తప్పుడు ఫిర్యాదు ఇప్పించి ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, టి. కాంతిరాణా, విశాల్ గున్నీలపై కేసు నమోదు చేసి వారిని సస్పెండ్ చేసింది. వారిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. పారిశ్రామికవేత్త కుక్కల విద్యా సాగర్‌ను అరెస్టు చేసింది. అనంతరం ఈ కేసును సీఐడీకి అప్పగించింది.అయితే ఈ కేసులో టి.కాంతిరాణా, విశాల్ గున్నీలకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. వారిపై కేసు నమోదు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుబట్టింది. కాగా, ఎలాంటి తప్పు చేయనందునే ముందస్తు బెయిల్‌కు వెళ్లాలన్న పలువురి సూచనను పీఎస్ఆర్ సున్నితంగా తిరస్కరించారు. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరితంగా ఆయన్ను అరెస్టు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు ఈ అక్రమ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులను సీఐడీ అధికారులు ఇప్పటి వరకు విచారించనే లేదు. నోటీసులు కూడా ఇవ్వలేదు. విచారణకు పిలవనూ లేదు. తాను ఎక్కడ ఉన్నదీ ఆయన ఎప్పటికప్పుడు పోలీసులకు సమాచారం ఇస్తూనే ఉన్నారు. ఏనాడూ తన మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకోలేదు. అయినాసరే సీఐడీ అందుకు విరుద్ధంగా వ్యవహరించి, ఆయన్ను అరెస్ట్ చేయడం గమనార్హం. కాగా, పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు సందర్భంగా కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ తీరు అత్యంత వివాదాస్పదంగా మారింది.ఈ కేసుతో కానీ, సీఐడీతో కానీ సంబంధంలేని కోయ ప్రవీణ్.. మరికొందరు పోలీసులతో కలిసి పీఎఎస్ఆర్ ఆంజనేయులు నివాసం సమీపంలో హడావుడి చేశారు. పీఎస్ఆర్ ఇంట్లో ఉన్నారా.. లేదా.. ఎక్కడికైనా వెళ్తున్నారా.. అంటూ ఆరా తీస్తూ అత్యుత్సాహం ప్రదర్శించారు. తనను అరెస్టు చేసేందుకు మంగళవారం తన నివాసానికి వచ్చిన సీఐడీ అధికారులకు పీఎస్ఆర్ ఆంజనేయులు పూర్తిగా సహకరించారు. పోలీసు వాహనంలో విజయవాడకు బయలుదేరారు. కానీ కోయ ప్రవీణ్ మాత్రం పీఎస్ఆర్ నివాసంలోకి వెళ్లి ల్యాప్‌టాప్ కావాలి.. ఏవేవో పత్రాలు కావాలి.. డివైజుసులు కావాలంటూ హడావుడి చేశారు. ఇరికించే కుట్రతోనే విచారణ పీఎస్ఆర్ ఆంజనేయులు విచారణ పేరిట సీఐడీ అధికారులు పచ్చ కుట్రను అమలు చేసేందుకే పెద్దపీట వేశారు. విజయవాడలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో ఆయన్ని దాదాపు 6 గంటలపాటు విచారించారు. హనీట్రాప్ నిందితురాలు కాదంబరి జత్వానీని అరెస్టు చేయాలని అప్పటి విజయవాడ సీపీ కాంతికాణా, డీసీపీ విశాల్ గున్నీని ఆదేశించారా.. అందుకోసం వారిని పిలిపించి మాట్లాడారా.. అని ప్రశి్నంచారు. తనకు ఆ ఉదంతంలో ఎలాంటి సంబంధం లేదని.. ఇంటలిజెన్స్ అధికారులు కేసుల దర్యాప్తు వ్యవహరాలను పర్యవేక్షించారని పీఎస్ఆర్ జవాబు ఇచ్చినట్టు తెలిసింది.తనకు తెలిసినంత వరకు న్యాయస్థానం అనుమతితోనే అప్పటి విజయవాడ పోలీసులు వ్యవహరించారని, కాదంబరి జత్వానీని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరు పరిచారని.. న్యాయస్థానం ఆదేశాలతో ఆమెను రిమాండ్‌కు తరలించారని చెప్పినట్టు తెలుస్తోంది. తనపై కదాంబరి జత్వానీ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఆ వ్యవహారంలో తాను ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. అందుకే తాను ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదని తేల్చి చెప్పారు. మరిన్ని అక్రమ కేసులకు కుట్ర కాగా పీఎస్ఆర్ ఆంజనేయులపై మరిన్ని అక్రమ కేసులు నమోదు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం పన్నాగం పన్నుతున్నట్టు సమాచారం. కదాంబరి జత్వానీ తప్పుడు ఫిర్యాదుతో నమోదు చేసిన కేసు న్యాయస్థానంలో నిలవదని ప్రభుత్వానికి తెలుసు. అందుకే అవాస్తవ ఆరోపణలతో మరికొన్ని కేసులు నమోదు చేయాలని భావిస్తోంది. అందుకోసం ఏపీపీఎస్సీ కార్యదర్శితో ముందస్తు కుట్రతోనే తప్పుడు ఫిర్యాదు ఇప్పించడం గమనార్హం. కాగా రఘురామకృష్ణంరాజు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు, ఇతరత్రా అక్రమ కేసులతో ఆయన్ను వేధించేందుకు ప్రభుత్వం తన కుట్రకు పదును పెడుతున్నట్టు సమాచారం. -
కృష్ణవేణిపై పోలీసుల టార్చర్.. సీఐకి మెమో జారీ చేసిన కోర్టు
-
Hindupuram: అంబేడ్కర్ జయంతి రోజు ఏపీలో దళితులకు అవమానం
-
గోరంట్ల మాధవ్ పై పెట్టిన కేసులు ఇవే... అరెస్ట్ పై పొన్నవోలు కామెంట్స్
-
గోరంట్ల మాధవ్ ని ఎక్కడ దాచిపెట్టారు? అరెస్ట్ పై అంబటి రియాక్షన్
-
కూటమి కుట్రలతో ఐపీఎస్‌ల బెంబేలు
సాక్షి, అమరావతి: చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వ రెడ్‌బుక్ కుట్రలు, అరాచకాలను అమలు చేయలేక పోలీసు శాఖ బెంబేలెత్తుతోంది. వైఎస్సార్సీపీ ముఖ్య నేతలపై అక్రమ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని ఏకంగా ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి వస్తుండడంతో పోలీసు ఉన్నతాధికారులు హడలెత్తిపోతున్నారు. కొందరు మానసిక ఒత్తిడితో అస్వస్థత పాలవుతున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ హఠాత్తుగా అస్వస్థతకు గురికావడం ప్రస్తుతం పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై ఇప్పటికే టీడీపీ కూటమి ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆయనపై వరుస కేసులు పెట్టాలని ప్రభుత్వ పెద్దలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌కు అల్టిమేటం ఇచ్చారు. ఈ వ్యవహారాన్ని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాతో పాటు రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ ఒత్తిడి తీవ్రం చేశారు. కాకాణిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను హైదారాబాద్‌కు పంపించారు. ప్రభుత్వ పెద్దలు, పోలీస్ బాస్‌లు అంతటితో సంతృప్తి చెందలేదు. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో నమోదైన పలు కేసుల్లో కాకాణి పేరును ఇరికించాలని కూడా ఒత్తిడి చేస్తున్నారు. మరోవైపు ఇంకా ఆయనను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రతి రోజూ నిలదీస్తున్నారు. ఈ పరిణామాలతో ఎస్పీ కృష్ణకాంత్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఓ పరిమితి వరకు నిబంధనలకు కాస్త అటూ ఇటూగా ఉల్లంఘించగలంగానీ... బరితెగించి అక్రమ కేసులు, వేధింపులు ఐపీఎస్ అధికారిగా తనకు సాధ్యం కాదని ఆయన భావించారు. చట్ట పరిధిలోనే కేసులను దర్యాప్తు చేయగలను తప్ప.. రాజకీయ కక్షసాధింపు చర్యలకు సాధనంగా మారలేనంటూ ఆయన లోలోన మథన పడుతున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. తీవ్రంగా మందలించిన పోలీస్ బాస్కాకాణిని ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారని నిలదీస్తూ.. డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా ఎస్పీ కృష్ణకాంత్‌పై గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఎస్పీపై మానసిక ఒత్తిడి మరింత పెరిగింది. ఆయన తన నివాసంలో మెట్లు ఎక్కుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు, సిబ్బంది హుటాహుటిన కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర ఒత్తిడితో ఎస్పీ కృష్ణకాంత్ బీపీ పడిపోయిందని వైద్యులు చెప్పారు. చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. కొన్ని రోజలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కొత్త ఎస్పీగా టీడీపీ వీర విధేయ సుబ్బారాయుడు!రెడ్‌బుక్ కుట్ర అమలులో అంచనాలకు తగ్గట్టుగా వ్యవహరించనందుకు నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్‌పై ప్రభుత్వ పెద్దలు గుర్రుగా ఉన్నారు. ఆయనను బదిలీ చేయాలని ఇప్పటికే నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ సానుభూతిపరుల కుటుంబానికి చెందిన, సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన ఐపీఎస్ అధికారి సుబ్బారాయుడును నెల్లూరు జిల్లా ఎస్పీగా నియమించాలని భావిస్తున్నారని తెలుస్తోంది. తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డెప్యుటేషన్‌పై రాష్ట్రానికి వచ్చారు. తిరుపతి ఎస్పీగా నియమితులయ్యారు. వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీలో పోలీసుల వైఫల్యంతో ఆరుగురు భక్తులు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. దీనికి బాధ్యుడిగా తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడును ప్రభుత్వం సస్పెండ్ చేయాలి. కానీ, బదిలీతో సరిపెట్టింది. అనంతరం ‘ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్‌ఫోర్స్’ ఎస్పీగా చిత్తూరు జిల్లాలోనే పోస్టింగ్ ఇచ్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాం నాటి మద్యం విధానంపై అక్రమ కేసు దర్యాప్తునకు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)లో సభ్యుడిగా సుబ్బారాయుడును నియమించారు. -
Sudhakar Reddy: మీరు ట్రైలర్ చూపిస్తే..మేం సినిమా చూపిస్తాం
-
పోసాని అనారోగ్యంగా ఉన్నారు: మనోహర్ రెడ్డి
-
సోషల్ మీడియా యాక్టివిస్టు దొడ్డా రాకేష్ గాంధీ అరెస్ట్
-
ఆగని ‘కూటమి’ వేధింపులు.. సోషల్ మీడియా యాక్టివిస్ట్ రాకేష్ అరెస్ట్
చిలకలూరిపేట: రాష్ట్రంలో సోషల్ మీడియా యాక్టివిస్ట్‌ల అరెస్టుల పరంపర కొనసాగుతోంది. పల్నాడు జిల్లా చిలకలూ రిపేటలోని తూర్పు మాలపల్లెకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ దొడ్డా రాకేష్‌గాంధీని అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి గుంటూరులో అదుపులోకి తీసుకుని చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు.కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అరెస్టు చేస్తారన్న భయంతో రాకేష్‌గాంధీ చిలకలూరిపేటలో నివాసం ఉండటం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రాకేష్‌గాంధీ ఆచూకీ తెలియజేయాలని అతని తండ్రి దొడ్డా దాసును పోలీసులు 4 రోజులపాటు అక్రమంగా నిర్బంధించి వేధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.అయినప్పటికీ అతని ఆచూకీ తెలియకపోవడంతో అప్పటి నుంచి నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. టీడీపీకి చెందిన బాషా అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాకేష్గాంధీపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాకేష్గాంధీపై రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల కూడా కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఈ విషయమై చిలకలూరిపేట అర్బన్ సీఐ పి.రమేష్‌ను వివరణ కోరగా, దొడ్డా రాకేష్‌గాంధీని అరెస్టు చేశామన్నారు. రాకేష్‌గాంధీని న్యాయస్థానంలో హాజరుపరిచారు. చిలకలూరిపేట కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. -
ఆగని కూటమి ప్రభుత్వ కక్షసాధింపు చర్యలు
-
KSR Live Show: పోసాని కేసులో సజ్జల టార్గెట్.!
-
ఇది రెడ్ బుక్ కుట్రే..
సాక్షి, అమరావతి: ‘‘కులాల వారీగా నంది అవార్డులను పంచుకున్నారు..! చంద్రబాబు హయాంలో కులాలను బట్టే పంపకాలు జరిగేవి.. అవార్డుల కమిటీలో 12 మంది సభ్యులుంటే వారిలో 11 మంది కమ్మ కులస్తులే. నాకు వచి్చన అవార్డు కమ్మ నందిలా కనిపించింది. అందుకే అవార్డును తిరస్కరించా..!’ ఇదీ ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్య!! ఆయన ఎప్పుడో 2015లో చేసిన వ్యాఖ్యలవి! అప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఆ వ్యాఖ్యల్లో అభ్యంతరకరమైన పదాలు ఏమీ లేవు. అసలు ఆయన ఎవరినీ దూషించలేదు. నంది అవార్డులను నిర్ణయించిన కమిటీ కూర్పుపైనే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కమ్మ కులాన్ని కూడా తూలనాడలేదు. అంతేకాదు.. పోసాని ఇంకా ఏమన్నారంటే...! ‘కమిటీలో 11 మంది కమ్మ కులస్తులు ఉండటం తప్పేమీ కాదు. 12 మంది కూడా కమ్మ కులస్తులే ఉండొచ్చు. ఇది తెలుగు సినీ పరిశ్రమ. కులాలు, మతాలకు సంబంధం లేని పరిశ్రమ. చాలామంది సినీ పరిశ్రమలో కమ్మ డామినేషన్... కాపు డామినేషన్ అని అంటారు. అదేమీ లేదు. వీడు మా కులం వాడు కాబట్టి వాడిని డెవలప్ చేద్దాం అనే మ్యాటరే లేదు...’ అని కూడా పోసాని విస్పష్టంగా చెప్పారు. అంటే ఆయన ఎవరినీ దూషించలేదన్నది సుస్పష్టం. వాస్తవం ఏమిటంటే... పోసాని కృష్ణ మురళి కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే. అయినా సరే ఆయన తనకు ప్రకటించిన అవార్డును తిరస్కరించారు. అది ఆయన వ్యక్తిగత నిర్ణయం. ఆయన హక్కు కూడా..! ఎప్పుడో 2015లో పోసాని కృష్ణ మురళి చేసిన ఆ వ్యాఖ్యలపై తాపీగా పదేళ్ల తరువాత టీడీపీ కూటమి ప్రభుత్వం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం విభ్రాంతికరం. ఇది చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్ కుట్రకు తార్కాణం.. రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న రాజ్యాంగ ఉల్లంఘన, ప్రాథమిక హక్కుల హననానికి నిదర్శనం...! అవార్డుల తిరస్కరణ నేరమేమీ కాదు.. తమకు ప్రకటించిన అవార్డులను వివిధ కారణాలతో తిరస్కరించడం నేరమేమి కాదు. దేశంలో వివిధ రంగాలకు చెందిన ఎంతోమంది ప్రముఖులు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులను తిరస్కరించారు. వారిలో స్వాతంత్య్ర సమర యోధులు, కవులు, కళాకారులు, క్రీడాకారులు, పాత్రికేయులు... ఇలా పలువురు ఉన్నారు. ఇక గతంలో తాము తీసుకున్న పద్మ అవార్డులను సైతం తరువాత ప్రభుత్వాల విధానాలకు నిరసనగా ఎంతోమంది ప్రముఖులు త్యజించి వెనక్కి ఇచ్చేశారు. వారిలో ప్రముఖ చరిత్ర పరిశోధకురాలు రోమిల్లా థాపర్, కవి కె.శివరామ కర్నాథ్, పారిశ్రామికవేత్త కేశుభ్ మహీంద్ర, ఆధ్యాత్మిక గురువులు పండిట్ రవిశంకర్, మహమ్మద్ బహరుద్దీన్, మాతా అమృతానందమయి తదితరులు ఉన్నారు. ఏ కారణంతో తాము అవార్డులను తిరస్కరిస్తోందీ, త్యజిస్తోందీ కూడా వారు వెల్లడించారు. అంతమాత్రాన వారిపై కేంద్ర ప్రభుత్వం కేసులు నమోదు చేయలేదు. వారిని వేధించలేదు. పక్కా కుట్రతో ఫిర్యాదు... ఆ వెంటనే అరెస్ట్ రెడ్‌బుక్ రాజ్యాంగ వేధింపులతో రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం మరోసారి బరితెగించింది. చంద్రబాబు సర్కారు అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలపై వేధింపులకు తెగబడింది. అదే రీతిలో పోసాని కృష్ణమురళిపై కూడా రాష్ట్రవ్యాప్తంగా 16 అక్రమ కేసులు నమోదు చేసింది. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని... తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని ప్రకటించిన ఆయన హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. అయినా సరే పోసాని కృష్ణ మురళిపై టీడీపీ అంకుశం వేలాడుతూనే ఉంది. డైవర్షన్ పాలిటిక్స్ కోసం అవసరమైనప్పుడు పోసానిని అరెస్ట్ చేయాలని ముందే పన్నాగం వేసింది. సూపర్‌సిక్స్ హామీలు అమలు చేయకపోవడంతో కూటమి ప్రభుత్వంపై సర్వత్రా వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించడంతోపాటు... చంద్రబాబు అవమానించడంతో ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా ఉదంతం నుంచి టీడీపీ శ్రేణుల దృష్టి మళ్లించేందుకే పోసాని అక్రమ అరెస్టు కుట్రను హఠాత్తుగా తెరపైకి తెచ్చింది.ఈ క్రమంలో.. 2015లో పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యలను తాను ఇటీవల సోషల్ మీడియాలో చూశానని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెకు చెందిన జోగినేని మణి ఈ నెల 24న పోలీసులకు ఫిర్యాదు చేయడం... ఆ వెంటనే పోలీసులు పోసానిపై కేసు నమోదు చేయడం.. హైదరాబాద్‌లో బుధవారం అరెస్ట్ చేసి అర్ధరాత్రి తరలించడం... అంతా పక్కా పన్నాగంతో చక చకా పూర్తి చేసి రెడ్‌బుక్ రాజ్యాంగ వేధింపుల కుట్రకు బరి తెగించారు. సోషల్ మీడియా పోస్టులపై బీఎన్ఎస్ 111 సెక్షన్లతో వ్యవస్థీకృత నేరాల కింద కేసు పెట్టకూడదన్న హైకోర్టు ఆదేశాలను నిర్భీతిగా ఉల్లంఘించి మరీ అక్రమ కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ 111 సెక్షన్‌తోపాటు 196, 353(2)తదితర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రభుత్వ కుతంత్రానికి తార్కాణం. -
Ponnavolu Sudhakar Reddy: పోసానిపై 111 సెక్షన్ కేసు దుర్మార్గం..
-
ప్రజలు, దేవుడు.. అంతా చూసున్నారు: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) అక్రమ అరెస్ట్‌ను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఖండించారు. పోసాని భార్య కుసుమలతను ఫోన్లో పరామర్శించిన ఆయన.. పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ‘‘ప్రజలు, దేవుడు అంతా చూస్తున్నారు. పోసాని కృష్ణమురళికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. మేం అందరం మీకు తోడుగా ఉంటాం. పార్టీ తరఫున న్యాయ సహాయం అందిస్తాం. సీనియర్ న్యాయవాదులకు ఆ బాధ్యతలు అప్పగించాం. పొన్నవోలు సహా అందరినీ రాజంపేటకు పంపించాం. నాయకులందరినీ కోర్టు వద్దకు పంపించాం. ఈ కష్టకాలంలో మీరు ధైర్యంగా ఉండండి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలన ఎక్కువ రోజులు కొనసాగదు’’ అని వైఎస్ జగన్(YS Jagan) అన్నారు. ఇదిలా ఉంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏపీఎఫ్‌టీవీడీసీ ఛైర్మన్‌గా పోసాని పని చేశారు. అయితే ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆపై ప్రెస్ మీట్ నిర్వహించి మరీ ఇకపై రాజకీయాలు మాట్లాడబోనని, వాటికి దూరంగా ఉంటానని ప్రకటించారు. అయితే.. అనూహ్యంగా హైదరాబాద్‌లో ప్రత్యక్షమైన అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీసులు.. ఆయనపై కేసు నమోదైందని చెబుతూ అప్పటికప్పుడే ఆయన భార్యకు నోటీసులు అందజేసి వెంట తీసుకెళ్లారు. తన ఆరోగ్యం బాగోలేదని, భోజనం చేసి తానే వస్తానని చెప్పినా వినలేదు. ఈ క్రమంలో పోసాని కుటుంబ సభ్యులతోనూ రాయచోటి పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మరోవైపు పోసానిని ఎక్కడికి తీసుకెళ్తున్నారనే విషయం కూడా చెప్పకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. గతంలో.. సినిమా పరిశ్రమపై విమర్శలు చేశారని జనసేన(Jana Sena) నేత మణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోసాని కృష్ణ మురళిపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. పోసానిపై 196, 353(2), 111 రెడ్‌విత్ 3(5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: పోసాని అరెస్ట్.. అసలు జరిగింది ఇదే! -
మేము ఎంత చెప్పినా వినలేదు.. చాలా భయంగా ఉంది
-
పోసాని కృష్ణ మురళి అక్రమ అరెస్ట్
-
High Court: విచారణ సందర్భంగా పోలీసులపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
-
Jr NTRపై పగ.. వల్లభనేని వంశీ అరెస్ట్.. నెక్స్ట్
-
సత్యవర్ధన్ ఎక్కడ..?
-
కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది: భూమన
-
వంశీ అక్రమ అరెస్ట్ బరితెగింపు.. దర్యాప్తు మార్గదర్శకాల ఉల్లంఘన
-
సైకోల రాజ్యంలో రెడ్ బుక్ రాజ్యాంగం
-
రెడ్‌బుక్ రాజ్యాంగం.. న్యాయ ప్రక్రియ అపహాస్యం
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయవాడ/విజయవాడ లీగల్/ పటమట (విజయవాడ తూర్పు) : రెడ్‌బుక్ రాజ్యాంగంతో విధ్వంసం సృష్టించడం, అక్రమ అరెస్టులకు తెగబడటమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం చెలరేగిపోతోంది. అందుకు జీ.. హుజూర్ అంటూ పోలీసు వ్యవస్థ ప్రభుత్వ కుట్రలకు వత్తాసు పలుకుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వ పెద్దలు, పోలీసు ఉన్నతాధికారులు రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కులకు భంగం కలిగిస్తూ, అత్యంత కీలకమైన న్యాయ విచారణ ప్రక్రియ ప్రమాణాలను కూడా ఉల్లంఘిస్తూ బరి తెగిస్తున్నారు.గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అక్రమ అరెస్ట్ ద్వారా తమ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల తీవ్రత.. రాజ్యాంగ ఉల్లంఘనలో బరితెగింపును మరోసారి బాహాటంగా చాటి చెప్పారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు పేరుతో వల్లభనేని వంశీపై నమోదు చేసిన అక్రమ కుట్ర కేసు బెడిసి కొట్టడంతో ప్రభుత్వ పెద్దలు తమ కుతంత్రానికి మరింత పదును పెట్టారు. పోలీసు దర్యాప్తు ప్రాథమిక విధి విధానాలు, న్యాయ విచారణ ప్రక్రియ ప్రమాణాలను ఉల్లంఘిస్తూ మరో అక్రమ కేసుతో విరుచుకు పడటం పట్ల సర్వత్రా విభ్రాంతి వ్యక్తమవుతోంది. సత్యవర్థన్‌ను విచారించకుండానే వంశీ అరెస్ట్ సత్యవర్థన్‌ను వల్లభనేని వంశీ బెదిరించి న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇప్పించారనే కట్టుకథను పోలీసులు తెరపైకి తెచ్చారు. అందుకోసం ఆయన తమ్ముడు కిరణ్‌ను తమదైన శైలిలో బెదిరించి మరీ రంగం సిద్ధం చేశారు. ఆయన్ను ఏకంగా మూడు రోజులపాటు గుర్తు తెలియని ప్రదేశంలో నిర్బంధించి, బెదిరించి మరీ తాము చెప్పింది చెప్పినట్టుగా చేసేందుకు ఒప్పించారు. ఆ తర్వాత ఆయన తన అన్న సత్యవర్థన్‌ను బెదిరించి వాంగ్మూలం ఇప్పించి కేసు ఉపసంహరింపజేశారని ఫిర్యాదు ఇప్పించడం గమనార్హం. కానీ ఆ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు బాధ్యతాయుతంగా ముందుగా సత్యవర్థన్‌ను విచారించాలి. ఆయన అన్నయ్య ఇచ్చిన ఫిర్యాదు సరైందా కాదా అన్నది నిర్ధారించుకోవాలి. ఈ దర్యాప్తు ప్రమాణాలను పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. విశాఖపట్నంలో ఉన్న సత్యవర్థన్‌ను తీసుకువచ్చేందుకు పోలీసు బృందాలు అక్కడకు వెళ్లాయి. మరోవైపు సత్యవర్థన్‌ను విచారించకముందే వల్లభనేని వంశీని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నాయి. తనను ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారన్న కనీస సమాచారం ఇవ్వకుండానే నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసి బలవంతంగా విజయవాడకు తరలించారు. 164 సీఆర్పీసీ వాంగ్మూలం అంటే లెక్కేలేదుదర్యాప్తు, విచారణ ప్రక్రియలో సీఆర్పీసీ 164 వాంగ్మూలం ఎంతో కీలకమైంది. పోలీసులు అక్రమ అరెస్టు్టలు, బెదిరింపులకు పాల్పడకుండా నిరోధించేందుకు రాజ్యాంగం సీఆర్పీసీ 164 వాంగ్మూలానికి అవకాశం కల్పించింది. అంటే సాక్షులు, బాధితులు ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా, ధైర్యంగా, స్వచ్ఛందంగా న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇవ్వొచ్చు. న్యాయ విచారణ ప్రక్రియలో ఆ వాంగ్మూలానికి అత్యంత విలువ ఉంటుంది. స్వచ్ఛందంగానే వాంగ్మూలం ఇస్తున్నారు కదా అని న్యాయమూర్తి అడిగి మరీ నమోదు చేస్తారు. ఓసారి ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా వాంగ్మూలం ఇస్తే అది క్రిమినల్ నేరం కూడా అవుతుందన్నది పోలీసులకు పూర్తి అవగాహన ఉంది. అయినా సరే చంద్రబాబు మెప్పు కోసం రాజ్యంగ నిబంధనలు, న్యాయ ప్రక్రియ ప్రమాణాలను ఉల్లంఘించి మరీ బరితెగించారు. సత్యవర్థన్ స్వచ్ఛందంగా న్యాయమూర్తి ఎదుట సీఆర్పీసీ 164 వాంగ్మూలం ఇస్తే... ఆ వాంగ్మూలం తప్పని ఆయన అన్నయ్యతో ఫిర్యాదు చేయించడం పోలీసుల బరితెగింపునకు నిదర్శనం.కస్టడీ పిటిషన్‌పై సోమవారం విచారణకృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ మోహన్‌ను పోలీసు కస్టడీకి కోరుతూ శుక్రవారం విజయవాడ పటమట పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ప్రస్తుతం వంశీమోహన్ విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన్ను పది రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇవ్వాలని, అతని సెల్ ఫోన్‌ను సీజ్ చేసేందుకు అనుమతివ్వాలని పోలీసులు కోర్టును కోరారు. ఇదిలా ఉండగా ఈ కేసులో పెద్ద అవుటపల్లికి చెందిన వేల్పూరు వంశీని, గన్నవరానికి చెందిన వీర్రాజులను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పరిచినట్లు పటమట సీఐ పవన్ కిషోర్ తెలిపారు. కుట్ర బట్టబయలు.. చంద్రబాబు, లోకేశ్ ఆగ్రహంగన్నవరం టీడీపీ ఆఫీసులోని కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్థన్ ద్వారా తప్పుడు ఫిర్యాదు ఇప్పించి అక్రమ కేసు బనాయించిన కుట్ర బెడిసి కొట్టడంతో చంద్రబాబు, లోకేశ్ పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీ కాగితాలపై తన సంతకం తీసుకుని తనకు తెలియకుండానే తన పేరిట ఫిర్యాదు చేశారని, ఆ ఫిర్యాదుతో తనకు ఏమాత్రం సంబంధం లేదని సత్యవర్థన్ న్యాయమూర్తి ఎదుట 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం ఇచ్చారు. దాంతో రెడ్‌బుక్ కుట్రలో భాగంగానే వల్లభనేని వంశీపై అక్రమ కేసు నమోదు చేశారన్నది న్యాయస్థానం సాక్షిగా బట్టబయలైంది. తమ కుట్ర బహిర్గతం కావడంతో చంద్రబాబు, లోకేశ్‌లు ఆగ్రహంతో చిందులు తొక్కినట్టు సమాచారం. ఎలాగైనా వంశీని అరెస్ట్ చేయల్సిందేనని స్పష్టం చేశారు. దాంతో డీజీపీ కార్యాలయం కేంద్రంగా అప్పటికప్పుడు కొత్త కుట్రకు తెరతీశారు. వంశీది పైచేయి అయిందని అక్కసుముదునూరి సత్యవర్ధన్ కోర్టులో ఇచ్చిన కీలక వాంగూ్మలం కూటమి ప్రభుత్వానికి అవమానభారంగా మారింది. గత సోమవారం ఆయన స్వచ్ఛందంగా విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టుకు హాజరై కేసును వెనక్కి తీసుకుంటున్నట్లుగా ఆఫిడవిట్ సమర్పించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కి పడిన ప్రభుత్వ పెద్దలు.. ఈ కేసును పర్యవేక్షిస్తున్న పోలీస్ అధికారులు, స్థానిక ఎమ్మెల్యేపై చిందులు తొక్కారు. ఈ కేసులో కీలకమైన ఫిర్యాదుదారుడిని కంట్రోల్లో ఉంచుకోవడంలో వైఫల్యం చెందారంటూ మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వల్లభనేని వంశీమోహన్ ఈ కేసులో పైచేయి ఎలా సాధిస్తారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. ఎలాగైనా సరే వంశీమోహన్‌ను అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురిచేయాల్సిందేనని మౌఖిక ఆదేశాలు ఇచ్చారని సమాచారం. దీంతో పోలీసులు సత్యవర్ధన్ తల్లిదండ్రులు, సోదరుడిని తమ అధీనంలోకి తీసుకుని.. వారిని తీవ్రంగా బెదిరించి, ప్రలోభపెట్టి కథ నడిపించారు. తమకు అనుకూలంగా ఫిర్యాదు తీసుకుని బలమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కుట్రలో భాగంగా సత్యవర్ధన్ కేసు వాపసు తీసుకోవడంపై ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆదేశాల మేరకు టీడీపీ మహిళా అధ్యక్షురాలు మేడేపల్లి రమాదేవితో కూడా ఫిర్యాదు చేయించి, ఆ మేరకు వంశీమోహన్‌పై ఇంకో కేసు నమోదు చేశారు. హైకోర్టు తీర్పునూ ఖాతరు చేయలేదురెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వల్లభనేని వంశీమోహన్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీసింది. కనీసం ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు.. ఏ కేసు నిమిత్తం వంటి వివరాలు, ఎఫ్ఐఆర్ కాïపీ ఇవ్వకుండానే పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. ఆయన్ను విజయవాడకు తీసుకువచ్చిన తర్వాత కనీస వైద్య సాయం అందించేందుకు కూడా పోలీసులు నిరాకరించారు. ఆయన సతీమణి పంకజ శ్రీ, న్యాయవాదులను కలిసేందుకు కూడా అంగీకరించలేదు. తుదకు ఆమె ఆందోళనకు దిగడంతో కలిసేందుకు అంగీకరించారు. ఆయన్ను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకువెళ్లే విషయంలో, కోర్టు నుండి రిమాండ్‌కు తరలించే సమయంలో ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగా ఆయన్ను ఇబ్బందులకు గురిచేశారు. కాగా, ఈ కేసులో వంశీపై ఈ నెల 20వ తేదీ వరకు ఎటువంటి తొందరపాటు చర్యలొద్దన్న హైకోర్టు తీర్పును ప్రభుత్వం, పోలీసులు ఏమాత్రం పట్టించుకోకుండా ఇబ్బందులకు గురిచేయడం తగదని వైఎస్సార్సీపీ నేతలు, ఆయన అభిమానులు, నియోజకవర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
వంశీ పట్ల కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్ జగన్ ఫైర్
-
కూటమి పాలనలో కొనసాగుతున్న అక్రమ అరెస్టులు
-
కూటమి ప్రభుత్వంలో ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు...
-
సోషల్ మీడియా కార్యకర్తని అర్థరాత్రి అరెస్టు చేసిన పోలీసులు
-
ఏపీలో ఆటవిక పాలన.. ప్రశ్నిస్తే చాలు..టార్గెట్
-
గన్నవరంలో అక్రమంగా 8 మంది అరెస్ట్.. ఏపీ పోలీసులపై పేర్ని నాని ఫైర్
-
నన్ను జైల్లో పెట్టినా పోరాటం కొనసాగిస్తా: చెవిరెడ్డి
సాక్షి, ప్రకాశం : తనని జైల్లో పెట్టినా పోరాటం కొనసాగిస్తానని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం తనపై నమోదు చేసిన అక్రమ కేసులపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. కేసులకు భయపడి పారిపోను. 2014 నుండి 2019 వరకు 88 కేసులు పెట్టారు. ఏం చేశారు?. నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయను.. నేను ఎక్కడికి పారిపోను. నన్ను జైల్లో పెట్టిన పోరాటం కొనసాగిస్తా. నాపైకి పెట్టిన కేసుకు ముందస్తు బెయిల్ కూడా అప్లై చేయను. బిడ్డ ఆపదలో ఉందని తన తండ్రి ఫోన్ చేశారు. వెంటనే స్పందించి బాధితురాలికి మెరుగైన వైద్యం అందించా. బిడ్డ కుటుంబాన్ని కూటమి నేతలు పరామర్శించారా? అని ప్రశ్నించారు. నాపై కేసులు పెడితే.. కార్యకర్తలు భయభ్రాంతులకు గురవుతారు అని అనుకుంటున్నారు. కానీ అలాంటివేవి జరగవు’ అని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్పష్టం చేశారు. -
ఇలాగే వేధిస్తే సీఎం ఇంటిముందు ఆత్మహత్య చేసుకుంటా: ఇంటూరి రవి భార్య సుజన
సాక్షి, తాడేపల్లి: తన భర్తపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికుమార్ భార్య సుజన ఆవేదన వ్యక్తం చేశారు. పీటీ వారెంట్ల పేరుతో రాష్ట్రమంతా తిప్పుతున్నారని అన్నారు. కనీసం తన భర్తను కలిసే అవకాశం కూడా ఇవ్వటం లేదని వాపోయారు. తన భర్త హార్ట్ పేషెంట్ అని కనీసం మెడిసన్ కూడా ఇవ్వటం లేదని మండిపడ్డారు. తన భర్తను ఇలాగే వేధిస్తే సీఎం చంద్రబాబు ఇంటిముందు ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు.ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం మీడియాతో ఆమె మాట్లాడుతూ.. రెండున్నర నెలలుగా తన భర్తను పోలీసులు ఎలా వేధిస్తున్నారో చెబుతూ కన్నీరు మున్నీరుగా విలపించారు. తన భర్తపై ఇప్పటికే 15 కేసులు పెట్టారని, ఇంకా పెడుతూనే ఉన్నారని,. అసలు ఆయన చేసిన తప్పేంటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం తమ కుటుంబాన్ని చాలా దారుణంగా ఇబ్బందులు పెడుతోందని వాపోయారు. భ ర్త వెంట వెళ్తున్నానని తన కారులో గంజాయి పెట్టి మరో కేసు పెట్టాలని చూశారని ఆవేదన వ్యక్తం చేశారు.విశాఖలోని మా ఇంటి నుంచి తీసుకువెళ్ళి తొలుత గుడివాడ, తర్వాత గుంటూరు అరండల్‌పేట, దువ్వాడలో కేసులు పెట్టారు. అటు శ్రీకాకుళం నుంచి ఇటు గుంటూరు వరకు ఎక్కడెక్కడో కేసులు పెట్టారు.నా భర్తను తీసుకెళ్తున్న పోలీసులతో నేను ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తున్నానని చెప్పి, మా కారులో గంజాయి పెట్టి సీజ్ చేయాలని ప్రయత్నించారు. ఆ తర్వాత విశాఖలోని మహారాణిపేట పీఎస్‌కు పంపి, అక్కడి నుంచి రాజమండ్రిలో రిమాండ్‌కు పంపారు. అక్కడి నుంచి మాచర్ల, తర్వాత కురుపాం, తర్వాత వైజాగ్ సెంట్రల్ జైల్‌కు పంపారు. పీటీ వారెంట్లు వేసి అక్కడి నుంచి బాపట్ల, ఇంకొల్లు పీఎస్‌కు ఆ తర్వాత సబ్బవరం జైల్‌కు పంపారు. అక్కడి నుంచి శ్రీకాకుళం లావేరు, గాజువాక కోర్టు ఇలా తిప్పి తిప్పి ఇప్పుడు మాచర్ల తీసుకువెళ్ళారు.రిమాండ్‌లో ఉన్నారని తెలిసి కూడా పులివెందుల పీఎస్ నుంచి పోలీసులు వచ్చి మా ఇంటి గోడకు నోటీసులు అంటించారు.నా భర్త హార్ట్ పేషెంట్. ఆయనకు ఏం మందులు ఇస్తున్నారో కూడా తెలియడం లేదు. ఏ జైల్లో ఉన్నాడో తెలుసుకుని అక్కడికి వెళితే అక్కడ కలవనీయకుండా పీటీ వారెంట్ల పేరుతో ఇంకో చోటకు తరలిస్తున్నారు. మా లాయర్లకు కూడా పూర్తి సమాచారం ఇవ్వడం లేదు. ఆయనను ఒకేచోట అస్సలు ఉంచకుండా దాదాపు అన్ని జిల్లాల్లోని పోలీస్ స్టేషన్లు. జైళ్లు తిప్పుతున్నారు. నా భర్త ఆరోగ్యం బాగోలేదు. అయినా ఆయన్ను కనీసం చూడనివ్వడం లేదు. అర్ధరాత్రిళ్ళు తరలిస్తున్నారు. 12 ఏళ్ళ నుంచి మేం వైఎస్సార్సీపీలో పనిచేస్తున్నాం, నా భర్త ఏ తప్పూ చేయలేదు. అయినా ఆయన పట్ల ఇంత కక్షపూరితంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్ధం కావడం లేదు.నా భర్తను, మా కుటుంబాన్ని ఇలాగే వేధిస్తే నేను చంద్రబాబు ఇంటి ముందు నా పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంటాను’ అని సుజన పేర్కొన్నారు.రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ అధికారిక గూండాగిరి వెర్రితలలు వేస్తోంది. సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులతో రోజురోజుకీ మరింతగా పేట్రేగిపోతోంది. ఉగ్రవాదులపట్ల కూడా వ్యవహరించనంత కాఠిన్యంతో పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తూ మానవ హక్కులను నిర్భీతిగా కాలరాస్తున్నారు. ఒక్కొక్కరిపై నాలుగైదు అక్రమ కేసులు బనాయిస్తూ అరెస్టుచేస్తున్న పోలీసులు వారు రిమాండ్‌లో ఉండగానే వారికి తెలియకుండానే మరిన్ని కేసులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవి కిరణ్‌ను అక్రమ కేసులో ఇటీవల దువ్వాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేసినా ప్రభుత్వ కక్ష చల్లారలేదు. న్యాయస్థానం రిమాండ్ విధించడంతో ఆయన్ని రాజమహేంద్రవరం జైలుకు తరలించిన పోలీసులు.. ఆ తరువాత కూడా వేధిస్తుండడం విస్మయం కలిగిస్తోంది. -
ప్రతిదీ గుర్తుపెట్టుకుంటాం.. వడ్డీతో సహా ఇచ్చేస్తాం...!
-
అక్రమ అరెస్ట్ లపై కూటమి ప్రభుత్వానికి అనంత వెంకటరామి రెడ్డి కౌంటర్
-
షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించలేదా?: వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: చంద్రబాబు లాంటి క్రూర రాజకీయాలు ఎవరూ చేయరంటూ మండిపడ్డారు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ఒక వైపు కేసులు. మరోవైపు దుష్ప్రచారం. టాపిక్ డైవర్ట్ చేయడంలో, తప్పుడు ప్రచారం చేయడంలో, అబద్దాలు చెప్పడంలో, మోసాలు చేయడంలో, వ్యక్తిత్వ హననంలో చంద్రబాబు ఎంత ప్రసిద్దుడో అందరికీ తెలుసు. లక్ష్మీపార్వతితో మొదలుపెడితే నా వరకు. ఎన్నికల ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద, విద్యుత్ మీద, రోడ్ల మీద, అప్పుల మీద, రాష్ట్ర ప్రగతి మీద, పరిశ్రమల మీద, పారిశ్రామికవేత్తల మీద.. అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి లడ్డూల మీద దుష్ప్రచారం. ఇవన్నీ గాక, తల్లీ చెల్లీ అంటే నా కుటుంబంపై ఎక్కడ పడితే అక్కడ చంద్రబాబు మాట్లాడుతున్నాడు.’’‘‘చంద్రబాబును ఒకటే అడుగుతున్నాను. నీకు కుటుంబం ఉంది. మా కుటుంబంలో విభేదాలు ఉండొచ్చు. కానీ నీవు పెట్టే పోస్టులు కానీ, నువ్వు చేసే క్రూరమైన రాజకీయాలు ఎవరూ చేయరు. నేను చంద్రబాబును ఒకటే అడుతున్నాను. నేను సీఎంగా ఉన్నప్పుడు, ఆయన విపక్షంలో ఉన్నప్పుడు తన ఆఫీస్‌లో తన పార్టీ అఫీషియల్ ప్రతినిధితో నన్ను ఏమని తిట్టించాడు.. బోస్డీకే అని. అది ధర్మమేనా?’’‘‘ఇదే చంద్రబాబునాయుడు నా చెల్లెలు షర్మిల మీద, హైదరాబాద్, జూబిలీహిల్స్ రోడ్ నెం.36లో ఆయన బావమరిది బాలకృష్ణ, లోకేష్ మామ తన సొంత టవర్ ఎన్బీకే బిల్డింగ్స్ నుంచి తప్పుడు వార్తలు రాయించలేదా? పోలీసుల దర్యాప్తులో అది తేలలేదా?’’‘‘ఇంకా మా ప్రభుత్వం ఉన్నప్పుడు వర్రా రవీంద్రారెడ్డి పేరుతో ఆయనకు చెందిన ఐ–టీడీపీ సభ్యుడు ఉదయ్‌భూషణ్ అనే వాడు ఒక ఫేక్ ఐడీ క్రియేట్ చేసి, దాని ద్వారా మా అమ్మను, మా చెల్లిని తిట్టించాడు. దీంతో వర్రా రవీందర్‌రెడ్డి కేసు పెడితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో పోలీసులు ఉదయ్భూషణ్ను ఆధారాలతో సహా అరెస్టు కూడా చేశారు.’’‘‘చంద్రబాబు తన స్వార్థం కోసం ఎవ్వరిమీద అయినా సరే, వ్యక్తిత్వ హననం చేస్తాడు. ఆయనే మన సానుభూతిపరుడు ఎవరైనా ఉంటే, వారి పేరుతో ఫేక్ ఐడీ క్రియేట్ చేయిస్తాడు. వారితోనే మనల్ని తిట్టిస్తాడు. మనం తిట్టించామని బయట ప్రచారం చేస్తాడు.ఇటువంటి మనిషి ప్రపంచంలో అరుదుగా పుడతాడు.’’ఏనాడైనా నీ తల్లిదండ్రులను పట్టించుకున్నావా?‘‘నేను చంద్రబాబును సూటిగా ఒకటే అడుగుతున్నాను. నీ తల్లిదండ్రులెవరో రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపావా? మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక హక్కులు ఈ మనిషికి లేవు. నీ తల్లిదండ్రులను రాష్ట్ర ప్రజలకు చూపించావా? వారితో కలిసి ఎప్పుడైనా ఉన్నావా?. రాజకీయంగా నీవు ఎదిగిన తర్వాత నీ ఇంటికి తీసుకొచ్చి రెండు పూటలు భోజనం పెట్టి, వారిని సంతోషంగా పంపించావా? వారిద్దరూ కాలం చేస్తే, కనీసం తలకొరివి అయినా పెట్టావా?’’‘‘ఎలాంటి మానవతా విలువలు లేని వ్యక్తి చంద్రబాబు. రాజకీయాల కోసం ఏమైనా చేస్తాడు. ఏ గడ్డి అయినా తింటాడు. ఏ అబద్ధం అయినా ఆడతాడు. మోసం చేస్తాడు. అలాంటి వ్యక్తితో మనం యుద్ధం చేస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరినీ నేను కోరేది ఒక్కటే. ఈ యుద్ధంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి.’’ అని అన్నారు..రామ్ గోపాల్ వర్మపై ‘‘రామ్ గోపాల్ వర్మపై కూడా తప్పుడు కేసులు పెట్టారు. సెన్సార్ బోర్డ్ అనుమతితోనే సినిమాలు రిలీజ్ చేశారు. వర్మకు సెన్సార్ బోర్డ్ అనుమతి ఉంది. చంద్రబాబు ఎల్లో బ్యాచ్ ఏ సినిమాలైనా తీయొచ్చా?’’ ‘‘న్యాయం కోసం ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. దళితుడు మాజీ ఎంపీ, నందిగం సురేష్ మీద కేసులు మీద కేసులు పెట్టారు. నందిగం సురేష్ 70 రోజులుగా జైల్లోనే ఉన్నారు. ప్రశ్నించిన దళిత ఎమ్మెల్యే చంద్రశేఖర్‌పై 8 కేసులు పెట్టారు. ఎక్కడ ఫిర్యాదులు వచ్చినా వారిని అక్కడే అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. వారిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు. వీడియోలు తీసి పై వాళ్లకు పంపిస్తున్నారు. కళ్లకు గంతలు కట్టి పీఎస్‌లకు మారుస్తున్నారు. అరెస్టైన వారు జడ్జీల దగ్గర దెబ్బలు చూపిస్తున్నారు’’ అని వైఎస్ జగన్ వివరించారు. -
Satyameva Jayate: ఏది నిజం.. ఎవరిది శాడిజం..? మార్ఫింగ్ ఫొటోలు పెడుతున్న సోషల్ సైకోలు..
-
నా భర్తను కాపాడండి..
-
సుందర్ కుమార్ అక్రమ అరెస్ట్..
-
ఏపీలో అరాచకం.. ‘ఎన్ని కేసులు పెట్టినా ప్రశ్నించడం ఆగదు’
ఏపీలో కూటమి ప్రభుత్వ ప్రతీకార రాజకీయాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులతో వేధిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. పాత పాత పోస్టుల ఆధారంగా పోలీసులు కేసులు పెడుతున్నారు. మరికొన్ని చోట్ల.. వాళ్ల మనుషులతో ఫేక్ అకౌంట్ల నుంచి పోస్టులు వేయించి.. వైఎస్సార్సీపీ శ్రేణుల్ని ఇరికిస్తున్నారు. నోటీసులు ఇవ్వడం, తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలు.. శారీరకంగా హింసించడం లాంటివి చేస్తోంది. -
సోషల్ మీడియా కార్యకర్తలపై కొనసాగుతున్న పోలీసుల వేధింపులు
-
హామీలు అమలు చేయం.. అడిగితే లోపలేస్తాం..
-
ఇంత అరాచకమా?.. కక్షగట్టి అక్రమ కేసులా?: అంబటి రాంబాబు ఫైర్
సాక్షి, గుంటూరు: సోషల్ మీడియా కార్యకర్తలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు జైల్లో ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టులు మేకా వెంకట్రామిరెడ్డి, కళ్ళం హరికృష్ణ రెడ్డితో పాటు పానుగంటి చైతన్యను ఆ పార్టీ నేతలు పేర్ని నాని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు మంగళవారం పరామర్శించారు. అనంతరం అంబటి మీడియాతో మాట్లాడుతూ, మహిళ అని చూడకుండా పోలీసులు టార్చర్ చేస్తున్నారన్నారు. సుధారాణి దంపతులను పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు.వర్రా రవీంద్రారెడ్డిని రాత్రి ఎందుకు అరెస్ట్‌చేశారు.? ముసుగు వేసి మీడియా ముందు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముంది?. ఏపీలో పౌర హక్కులు ఏమౌతున్నాయి.’’ అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. పోలీసులు చట్ట ప్రకారం పనిచేయాలి. టీడీపీకి అనుకూలంగా పనిచేయొద్దన్న అంబటి.. పోలీసులు కక్షగట్టి అందరిని కేసుల్లో ఇరికించాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు...గుంటూరు సబ్ జైలులో సోషల్ మీడియా కార్యకర్త సుధారాణి, ఆమె భర్తలను రిమాండ్ చేశారు. సుధారాణి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారు. భార్య, భర్తలు ఇద్దరూ జిల్లా జైలులో లేరు. పిటి వారెంట్ వేసి ఎక్కడికి తీసుకెళ్లారు తెలీదు. చిలకలూరిపేట సుధారాణి దంపతులను అక్రమంగా అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్లో కొట్టి, కోర్టులో ప్రవేశ పెట్టారు. మేజిస్ట్రేట్ సోషల్ మీడియా కార్యకర్త సుధారాణి వాగ్మూలాన్ని రికార్డు చేసి ఆమె చేతికి ఉన్న గాయాలను పరిశీలించి వైద్య సేవలకు ఆదేశించారు. అనంతరం జిల్లా జైలుకు రిమాండ్ విధించారు.ఎన్నికల అనంతరం ఊరు విడిచి హైదారాబాద్ ఇతర ప్రాంతాలకు వెళ్లి జీవనం సాగిస్తున్నారు. ప్రవీణ్ అనే ఐపీఎస్ అధికారి అరబ్ దేశాలలో అయితే ఇలాంటి వ్యవహారాల్లో నడిరోడ్డుపై కొట్టి చంపుతారంటూ మాట్లాడడం దారుణం. కోయ ప్రవీణ్ పైకి ఖాకీ చొక్కా వేసుకున్నాడు.. లోపల అంతా పసుపు పచ్చే. ఐపీఎస్ అధికారులు చట్ట పరిధిలో పని చేయాలి. చంద్రబాబు పులి మీద స్వారీ చేస్తున్నాడు.. ఆ పులే రేపు చంద్రబాబును తింటుంది.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ కుటుంబ సభ్యులపై ఐటీడీపీ సోషల్ మీడియాలో చాలా దారుణంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.. వాటిపై వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేసిన చర్యలు లేవు. చాలా మంది ఐపీఎస్ అధికారులు పైకి ఖాకీచొక్కా వేసుకొని లోపల ఎల్లో ఇన్నర్స్ వాడుతున్నారు.టీడీపీ వల్లే ఫేక్ ఎకౌంట్లు పెట్టి, అక్రమ పోస్టింగులు పెడుతున్నారు. చట్టాన్ని పాటించకపోతే సర్వనాశనం అవుతారు. పోలీసులు అక్రమంగా నిర్బంధించి వైఎస్ జగన్ పేరు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలపై పేర్లు చెప్పమని బెదిరిస్తున్నారు. మా సోషల్ మీడియాలో కార్యకర్తలకు అండగా ఉంటాం. త్వరలో సుప్రీంకోర్టును, రాష్ట్ర గవర్నర్ లను కలుస్తాం’’ అని అంబటి రాంబాబు చెప్పారు. -
నా భర్తకు ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత
సాక్షి అమరావతి: తన భర్తకు ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని సోషల్ మీడియా యాక్టివిస్టు వర్రా రవీందర్ రెడ్డి భార్య కళ్యాణి హెచ్చరించారు. ఆమె శనివారం తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. పోలీసులు తన భర్తని రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయని, ఇంతవరకు ఎక్కడున్నాడో ఆచూకీ తెలియడంలేదని ఆమె చెప్పారు. శనివారం ఉదయం టీడీపీ నేత బీటెక్ రవి మాట్లాడిన మాటలను బట్టి చూస్తే.. ప్రభుత్వం తన భర్తకి హాని తలపెట్టే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోందని, ఆయన్ని అంతమొందించాలని పోలీసులు కుట్ర చేస్తున్నారని అనుమానంగా ఉందని చెప్పారు.ఆయన్ని పోలీసులు మీడియా ముందు హాజరు పర్చకపోతే డీజీపీ ఆఫీసు ఎదుట ధర్నా చేస్తానని హెచ్చరించారు. ఐ–టీడీపీ, విశాఖకు చెందిన టీడీపీ సానుభూతిపరుడు పినపాల ఉదయ భూషణ్, చంద్ర కిరణ్‌లతో రవీందర్ రెడ్డి పేరుతో ఫేక్ ఐడీ సృష్టించి, దాని ద్వారా షర్మిల, నర్రెడ్డి సునీత, వైఎస్ విజయమ్మలపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారని తెలిపారు. దీనిపై రవీందర్‌రెడ్డి కడప ఎస్పీకి అప్పట్లోనే ఫిర్యాదు చేయగా, ఎస్పీ వారిని అరెస్టు చేసి మీడియాకు అసలు విషయాలు వివరించారని తెలిపారు.తన భర్త నిర్దోషి అని నాటి ఎస్పీ ప్రకటనతోనే స్పష్టమైందన్నారు. తన భర్త ఎవరి మీద పోస్టులు పెట్టలేదని, అసభ్యకరంగా పోస్టులు పెట్టినట్లు షర్మిల మాట్లాడటం సరికాదని అన్నారు. పులివెందుల వాసి అయినంత మాత్రాన వైఎస్ భారతి మేడానికి పీఏ అవుతారా? అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీపై కక్ష ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి గానీ, తన భర్తని పావుగా వాడుకోవడం సరికాదన్నారు. టీడీపీ నేతలకూ ఆడపిల్లలు, వారికి కూడా భర్తలు ఉన్నారు కదా? వారికి ఏమైనా జరిగితే తట్టుకుంటారా అని నిలదీశారు. తాను కూడా ఒక మహిళనే అన్న విషయం గుర్తించాలంటూ కళ్యాణి కన్నీటి పర్యంతమయ్యారు.నా తమ్ముడి ఆచూకీ తెలపాలి: వర్రా మల్లికార్జున్ రెడ్డి రవీందర్ రెడ్డిని పోలీసులు రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నట్లు మీడియా ద్వారా చూసి కుటుంబ సభ్యులందరం తల్లడిల్లిపోతున్నామని ఆయన సోదరుడు వర్రా మల్లికార్జునరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే తన సోదరుడిని కోర్టులో లేదా మీడియా ముందు హాజరు పరచాలని, లేకుంటే కుటుంబమంతా డీజీపీ ఆఫీసు ఎదుట నిరాహార దీక్ష చేస్తామన్నారు. -
YSRCP మహిళా కార్యకర్తను ఇంత దారుణంగా హింసిస్తారా ?
-
నా భర్తకు నోటీసులు ఇవ్వకుండా అక్రమ అరెస్టు
-
ముందు రాజ్యాంగం గురించి తెలుసుకో.. చంద్రబాబుపై పవన్ ప్రస్టేషన్..
-
ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపితే అక్రమ అరెస్ట్‌లా?: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమయ్యాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణే స్వయంగా ఒప్పుకున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ వెంకటేష్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయడం దుర్మార్గమని అన్నారు. అరెస్టుల ద్వారా పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లు, కార్యకర్తలను బెదిరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందన్నారు.సోషల్ మీడియా కోఆర్డినేటర్లను అరెస్టు చేయొద్దంటూ సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని గుడివాడ అమర్నాథ్ ప్రస్తావించారు. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్దంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని, దీనిపై పోలీసులు సమాధానం చెప్పాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపితే అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారని మండిపడ్డారు.. -
కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులకు వైఎస్సార్సీపీ అండ
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో అక్రమ కేసులను ఎదుర్కొంటున్న కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొండంత అండగా నిలుస్తోంది. వారికి అండగా ఉండేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా సోషల్ మీడియా కార్యకర్తలు, యాక్టివిస్ట్లపై కూటమి ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులను దీటుగా ఎదుర్కొని, అన్ని విధాలా వారికి అందుబాటులో ఉండేందుకు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ‘సెంట్రల్ ఆఫీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్’ను ఏర్పాటు చేసినట్లు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.ఈ మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులకు, ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ సమన్వయకర్తలకు సమాచారం పంపింది. ఈ సెంటర్లో ముగ్గురు సభ్యులు ఉంటారు. పార్టీ క్యాడర్‌పై అక్రమ కేసులకు సంబంధించి ఎవరికి ఎలాంటి సహాయం అవసరమైనా వెంటనే వీరిని సంప్రదిస్తే తగిన చర్యలు తీసుకుంటారని పార్టీ తెలిపింది. అండగా ఉన్నారనే భరోసా కల్పించాలివైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు వారి నియోజకవర్గాల్లో యాక్టివ్‌గా ఉన్న పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు, యాక్టివిస్ట్‌లను గుర్తించి, అండగా ఉన్నారనే భరోసా వారికి కల్పించాలని పార్టీ తెలిపింది. కేసుల విషయమై కార్యకర్తలు ఫోన్ చేయగానే వారి ప్రతినిధి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి మాట్లాడాలని, లీగల్‌గా కూడా స్పందించాలని పార్టీ కేంద్ర కార్యాలయం సూచించింది.సెంట్రల్ ఆఫీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సభ్యుల వివరాలుజె. సుదర్శన్ రెడ్డి , సీనియర్ అడ్వొకేట్ ఫోన్ నం: 9440284455 కొమ్మూరి కనకారావు, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ – ఫోన్ నం: 9963425526 దొడ్డా అంజిరెడ్డి , రాష్ట్ర సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ – ఫోన్ నం: 9912205535 -
పోలీసులకు సవాల్..
-
పిట్టపడా ఎన్‌కౌంటర్‌కు సీఎందే బాధ్యత
సాక్షి, హైదరాబాద్/చర్ల: విప్లవ పోరాటాలపై తె లంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసా గిస్తున్న హత్యాకాండను ప్రజలంతా ఖండించా లని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ములు గు జిల్లా వెంకటాపురం మండలంలో పిట్టపడా వద్ద గ్రేహౌండ్స్ పోలీసు లు చేసిన ఎన్‌కౌంటర్‌కు కాంగ్రెస్ పార్టీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డినే బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు మావో యిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ శనివారం ఓ లేఖను విడుదల చేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తెలంగాణలోకి కూలీ పనుల కోసం వస్తున్న ఆదివాసీలను ఎస్ఐబీ పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి మావో యిస్టుల సమాచారం చెప్పాలని వేధిస్తున్నారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకే గ్రేహౌండ్స్ బలగాలు ఏప్రిల్ 6న మధ్య రీజనల్ కంపెనీ–2కి చెందిన కమాండర్ అన్నె సంతోష్ శ్రీధర్, సాగర్, అదే కంపెనీకి చెందిన ప్లటూన్ పార్టీ కమిటీ సభ్యుడు ఆస్మా మణిరామ్, సభ్యుడు పూనెం లక్ష్మణ్ అమరులయ్యారని పేర్కొన్నారు. నిరాయుధులైన వారిని శారీరకంగా ఎంతో హింసించి చంపి మృగాల మాదిరిగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా ఈ నెల 15న బంద్‌కు పిలుపు ఇచ్చినట్లు వెల్లడించారు. -
భాస్కర్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ స్థానికుల ర్యాలీ
సాక్షి, వైఎస్సార్ జిల్లా: భాస్కర్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ స్థానికులు శాంతియూత ర్యాలీ నిర్వహించారు. సీబీఐ ఏకపక్ష వైఖరి పట్ల స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. దుకాణాలను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేశారు. ఆర్ అండ్ బీ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ వరకూ నిరసన ర్యాలీ చేపట్టారు.కడప- తాడిపత్రి హైవేపై నల్ల బ్యాడ్జీలతో నిరసన చేశారు. సీబీఐ ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ దిష్టిబొమ్మ దహనం చేశారు. దీనిలో భాగంగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. వివేకా హత్యకేసులో దోషులను కాకుండా అవినాష్‌రెడ్డి కుటుంబాన్నిసీబీఐ టార్గెట్ చేసిందన్నారు. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగిస్తోంది. పులివెందులలో భాస్కర్‌రెడ్డిని సీబీఐ ఆదివారం అరెస్ట్ చేసింది. ఆయనను హైదరాబాద్ తరలించారు. ఉస్మానియా ఆస్పత్రిలో భాస్కర్‌రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు. -
నలుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తల అక్రమ అరెస్టు
నాదెండ్ల(చిలకలూరిపేట): గుంటూరు జిల్లా, నాదెండ్ల మండలంలోని తూబాడు గ్రామానికి చెందిన నలుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. తూబాడు మాజీ సర్పంచి నర్రా మేరయ్యకు ముగ్గురు కుమారులు. మూడో కుమారుడు శ్రీరామయ్య భార్య వెంకటేశ్వరమ్మ సోమవారం రాత్రి ఇంటి ఆవరణలో నిద్రిస్తుండగా అదే గ్రామానికి చెందిన షేక్ శ్రీను ఆమె వద్దకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె కేకలు వేయడంతో భర్తతో పాటు బంధువులూ అక్కడకు చేరుకుని షేక్ శ్రీనుకు దేహశుద్ధి చేశారు. అయితే అతని బంధువైన ఆర్ఎంపీ, టీడీపీ వర్గీయుడు షేక్ మీరావలి తన వర్గీయులను తీసుకొచ్చి వైఎస్సార్ సీపీ శ్రేణులపై కర్రలతో దాడికి తెగబడ్డాడు. తమపై దాడి జరిగిందంటూ టీడీపీ వర్గీయులే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తెల్లవారుజాము నాలుగు గంటల సమయంలో పోలీసులు వచ్చి మాజీ సర్పంచి ఉషోదయ స్వప్నమేరి నివాసం తలుపులు పగులగొట్టి అక్కడున్న పదిమంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలను పోలీసుస్టేషన్‌కు తరలించారు. నర్రా అంకమ్మరావు, సిరిబోయిన గోపిరాజు, నర్రా సాంబశివరావు, రాఘవ రమేష్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేసి చిలకలూరిపేట కోర్టులో హాజరు పరిచారు. -
సోఫియాను అరెస్ట్ చేయడం అక్రమమే..!
సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడులోని తూత్తుకుడి విమానాశ్రయంలో సోమవారం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన 28 ఏళ్ల విద్యార్థిని లోయిస్ సోఫియాను అరెస్ట్ చేయడంపై రాజకీయ దుమారం రేగుతున్న విషయం తెల్సిందే. ఇక్కడ ఎవరికి పట్టని విషయం ఏమిటంటే ఆ విద్యార్థినిపై రెండు బెయిలబుల్ సెక్షన్లతోపాటు ఓ నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసును దాఖలు చేయడం. అది కచ్చితంగా చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించడంలో నిర్లిప్తంగా ఉండే న్యాయవ్యవస్థ.. సోఫియా అరెస్టు విషయంలో తమిళనాడు పోలీసులు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నా పట్టించుకోలేక పోయింది. విమానాశ్రయంలో ‘బీజేపీస్ ఫాసిస్ట్ గవర్నమెంట్ డౌన్‌డౌన్’ అంటూ కెనడాలో పీహెచ్డీ చేస్తున్న సోఫియా గట్టిగా నినాదాలు చేయడంతో తమిళనాడు బీజేపీ నాయకురాలు తమిళిసాయి సౌందరరాజన్ ఆమెతో గొడవ పెట్టుకున్నారు. అంతుకుముందు విమానంలో కూడా ఆమె అలాగే నినాదాలు చేశారని, అక్కడ తాను మౌనంగా ఉన్నానని, విమానాశ్రయంలోకి వచ్చాక అలా నినాదాలు చేయడం సబబేనా అని ప్రశ్నించగా, మళ్లీ నినాదాలు చేస్తానంటూ చేసిందని బీజేపీ నాయకురాలు ఫిర్యాదు చేశారు. విమానంలో సోఫియా నినాదాలు చేసిందనడానికి సాక్ష్యం లేదుగానీ, విమానాశ్రయంలో వారిద్దరికి మధ్య గొడవ జరగడం, సోఫియా నినాదాలు చేయడం, పోలీసులు సోఫియాను నిర్బంధంలోకి తీసుకోబోతే అటు వారికి, గొడవ చేస్తున్న బీజేపీ నాయకురాలికి తోటి ప్రయాణికులు సర్ది చెప్పడం, సోఫియాను వదిలేయాల్సిందిగా కోరడం అందుబాటులో ఉన్న వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీ నాయకురాలు ఇచ్చిన ఫిర్యాదును తీవ్రంగా తీసుకున్న తమిళనాడు పోలీసులు సోఫియాపై భారతీయ శిక్షాస్మతిలోని 290, తమిళనాడు పోలీసు చట్టంలోని 75 (1,సీ) సెక్షన్లతోపాటు భారతీయ శిక్షాస్మతిలోని 505 సెక్షన్ల కింద కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ప్రజల ముందు న్యూసెన్స్ సృష్టించినందుకు 290వ సెక్షన్ పెడతారు. ఇది బెయిలబుల్ సెక్షన్. బాండు చెల్లించి పోలీసు స్టేషన్లోనే బెయిల్ తీసుకోవచ్చు. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే 200 రూపాయలు జరిమాన విధిస్తారు. తమిళనాడు పోలీసు చట్టంలోని 75 (1,సీ) మొదటిదానికన్నా కొంచెం తీవ్రమైనది. ఇది కూడా బెయిలబుల్ సెక్షనే. ప్రజలు తిరుగాడే బహిరంగ ప్రదేశంలో, ఆఫీసుల్లో, కోర్టుల్లో, అమ్యూజ్మెంట్ పార్కుల్లో, రవాణా వాహనాల్లో, ప్రయాణికుల బోట్లలో, నౌకల్లో ఎవరైనా హింసాత్మకంగా లేదా గట్టిగా పెడబొబ్బలు లేదా అరుస్తూ ఎవరినైనా బెదిరిస్తూ లేదా దుర్భాషలాడుతూ లేదా అవమానిస్తూ ప్రజల మధ్య అశాంతికి కారణమైతే ఈ సెక్షన్‌ను అమలు చేయాలి. సోఫియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా నినాదాలు చేసినందున ఆమెపై ఈ రెండు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం కొంత మేరకు సమంజసమే. అయితే ఆమెపై భారతీయ శిక్షాస్మతిలోని 505 సెక్షన్ కింద కూడా కేసు పెట్టారు. ప్రజలకు చేటు చేసే ప్రకటనలు ఇచ్చినందుకు ఈ సెక్షన్ కింద కేసు పెడతారు. ఇది నాన్‌బెయిలబుల్ సెక్షన్ అవడం వల్ల సాధారణంగా ఈ సెక్షన్ కింద పోలీసులు అరెస్టులు చేస్తారు. ఈ సెక్షన్ కింద కూడా తమకు అధికారం ఉందికదా అని అరెస్టులు చేయవద్దని 1994లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి–జోగిందర్ కుమార్ మధ్య నడిచిన కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలను సూచించింది. ‘అరెస్ట్ చేసే అధికారం ఉందికదా అని ఏ పోలీసు అధికారి ఎవరిని అరెస్ట్ చేయరాదు. ఎందుకు అరెస్ట్ చేయక తప్పలేదో అరెస్ట్ చేసిన అధికారి ఆ తర్వాత రుజువు చేసుకోగలగాలి. హత్యలాంటి పెద్ద నేరం చేసినప్పుడు మాత్రమే అరెస్ట్ చేయాలి. అరెస్టులు, పోలీసుల కస్టడీ వ్యక్తుల ఆత్మగౌరవానికి, పరువుకు ఎనలేని నష్టం కలిగిస్తాయి. ‘కాగ్నిజబుల్ నేరం చేసినా అరెస్ట్ చేయరాదు. నిందితుడు చట్టం నుంచి తప్పించుకొని పారిపోయే అవకాశం ఉన్నప్పుడు, జనం మధ్య తిరగేందుకు అవకాశం ఇస్తే జనానికి తీవ్రమైన హాని కలిగించే అవకాశం ఉన్నప్పుడు, పదే పదే నేరాలకు పాల్పడినప్పుడు అరెస్ట్‌లు చేయవచ్చు’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేయడమే కాకుండా ‘నేషనల్ పోలీసు కమిషన్’కు ఈ విషయమై ఓ నివేదికను పంపించింది. సుప్రీంకోర్టు సూచించిన ఈ మార్గదర్శకాల ప్రకారం సోఫియాను పోలీసులు అరెస్ట్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు. కేసును తక్షణం పరిశీలించిన జుడీషియల్ మేజిస్ట్రేట్ ఎస్. తమిల్సెల్వీ యాంత్రికంగా సోఫియాను 15 రోజులు రిమాండ్‌కు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో నిందితురాలిని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందంటూ పోలీసు అధికారులను నిలదీయాల్సిన న్యాయమూర్తే రిమాండ్ ఉత్తర్వులు జారీ చేస్తే చట్టం ఎంత చక్కగా అమలవుతుందో అర్థం చేసుకోవచ్చు. బీజేపీ నాయకురాలి ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన పోలీసులు, ఆమె, ఆమె పార్టీ కార్యకర్తలు విమానాశ్రయంలో తమను నానా దుర్భాషలాడారంటూ సోఫియా తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై ఏ విధంగానూ స్పందించకపోవడాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలో! -
సోఫియాను అరెస్ట్ చేయడం అక్రమమే..!
-
ఏపీ సీఎం దిష్టిబొమ్మ దహనం
ఏపీ సీఎం దిష్టిబొమ్మ దహనం బంజారాహిల్స్: ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ అక్రమ అరెస్టును నిరసిస్తూ జూబ్లీహిల్స్ డివిజన్ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు గురువారం ఫిలింనగర్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా డివిజన్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు కాటూరి రమేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మార్పీఎస్ మద్దతుతో గెలిచి ముఖ్యమంత్రి పీఠమెక్కిన చంద్రబాబు మాదిగలకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని దుయ్యబట్టారు. ఎస్సీ వర్గీకరణను విస్మరించిన చంద్రబాబు తమ అధినేత మందకృష్ణ మాదిగను అరెస్టు చేయడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి దయ్యాల దాసు, ఉపాధ్యక్షులు నడిమింటి కృష్ణ, భవానీ రమేష్, వేణు, డి. ప్రభాకర్, పాపయ్య, కె. నర్సింహ్మ, నాగరాజు, కె.కృష్ణ, ఎన్. బిక్షపతి తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముట్టడికి యత్నం ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగను అకారణంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు మందా కుమార్ ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు గురువారం మధ్యాహ్నం బంజారాహిల్స్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముట్టడికి యత్నించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చౌరస్తాలో బైఠాయించారు. దీంతో పోలీసులు వీరందరిని అరెస్ట్ చేసేందుకు యత్నించగా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ట్రస్ట్‌భవన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు పలువురు కార్యకర్తలు తీవ్ర యత్నాలు చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం వీరిని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆందోళన చేసిన వారిలో ఎంఎస్ఎఫ్ జాతీయ నాయకులు లింగస్వామి, రాష్ట్ర అధ్యక్షుడు విజయ్, రమేష్, రంగారెడ్డి అర్బన్ ప్రధాన కార్యదర్శి కేశవ్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణ, శ్రీహరి, జంగం బబ్బి, కుమ్మరి సత్యనారాయణ, ఎంఎస్ఎఫ్ ఓయూ అధ్యక్షుడు శేఖర్ తదితరులు ఉన్నారు. -
భూ ఉద్యమాన్ని ఆపేది లేదు
అందరినీ కలుపుకెళతాం కుట్రతో జైలుకు పంపారు నేడు రైతు సంఘాలతో సమావేశం వైఎస్సార్ సీపీ నేత పేర్ని నాని మచిలీపట్నం టౌన్ : తెలుగుదేశం అరాచక పాలనకు, అక్రమ అరెస్టులకు బెదిరేది లేదని, రైతుల పక్షాన భూఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నాని స్పష్టం చేశారు. రైతుల తరఫున పోరాడుతున్న తమ పార్టీ, వామపక్ష నాయకులను కేసుల ద్వారా భయపెట్టాలనుకుంటే సహించేది లేదన్నారు. మచిలీపట్నం సబ్‌జైలు నుంచి విడుదలైన ఆయనకు బుధవారం సాయంత్రం ఆ పార్టీ నాయకులు, రైతులు, ప్రజాసంఘాల ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. భారీ ర్యాలీ నిర్వహించారు. సబ్‌జైలు నుంచి రేవతి సెంటరు వరకు ఆయనను రిక్షాపై ఊరేగింపుగా తీసుకువచ్చారు. రేవతి సెంటరులోని వంగవీటి మోహనరంగా విగ్రహానికి పూలమాలలు వేశారు. అక్కడి నుంచి పేర్ని నాని గృహం వరకు కార్యకర్తలు, నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. బాణసంచా పేల్చి దారి పొడవునా పూలు చల్లారు. యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. పేర్ని నాని మాట్లాడుతూ భూసేకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపితే రైతుల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని టీడీపీ నాయకులు భావించి ఉంటారన్నారు. పోర్టు అనుబంధ పరిశ్రమల స్థాపన పేరుతో 30వేల ఎకరాల చేజిక్కించుకునేందుకు జరిగిన రాజకీయ కుట్రకు రైతాంగం, వైఎస్సార్ సీపీ, వామపక్షాల కార్యకర్తలు వ్యతిరేకంగా నిలబడ్డారన్నారు. ఎంతమందిని జైలులో పెట్టినా భూ పోరాట ఉద్యమం ఆగదని చెప్పారు. రైతుల నుంచి పొలాలను గుంజుకుని పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టే ప్రయత్నాన్ని అడ్డుకుంటామని చెప్పారు. అధికారుల విధులకు ఆటంకం కలిగించారని తనను అరెస్టు చేశారని, సీపీఎం పట్టణ కార్యదర్శి, పోతేపల్లి ఎంపీటీసీ సభ్యుడు నాగబాబును ఏ కారణంతో అరెస్టు చేశారని ప్రశ్నించారు. తమను అరెస్టు చేసిన సమయంలో అన్నీ స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసులైనా ఇక్కడకు ఎందుకు తీసుకువచ్చారని న్యాయమూర్తి ప్రశ్నిస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ ఉందని, తమపై రకరకాల ఒత్తిళ్లు ఉన్నాయని దయచేసి వీరిని జైలుకు పంపాలని పోలీసు అధికారులు చెప్పుకున్నారని ఆయన అన్నారు. జైలుకు పంపిన టీడీపీ నాయకులు పేర్ని నాని బందరులో రౌడీయిజం చేశారనే ప్రచారం చేస్తున్నారని, నిజంగా రౌడీయిజం చేస్తే ఈ రోజు మీరు ఊళ్లో ఉండగలరా అని ప్రశ్నించారు. మూడు రోజులు కాదు మూడు నెలలు జైల్లో పెట్టినా భూ పోరాటాన్ని ఆపే ప్రసక్తి లేదన్నారు. ఉధృతం చేస్తాం... భూపోరాటాన్ని ఉధృతం చేసేందుకు మరింత పటిష్టవంతంగా వ్యవహరిస్తామని పేర్ని నాని అన్నారు. రైతు సంఘాలు, ప్రజాసంఘాలతో గురువారం అఖిలపక్ష నాయకులతో సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామన్నారు. ప్రతి గ్రామంలోనూ భూఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు తాను మారానని రైతులకు మేలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత భూదందా కొనసాగిస్తున్నారన్నారు. కాగా జైలు నుంచి విడుదలైన పేర్ని నానిని నూజివీడు, తిరువూరు ఎమ్మెల్యేలు మేకా ప్రతాప్‌అప్పారావు, కొక్కిలిగడ్డ రక్షణనిధి, వైఎస్సార్ సీపీ నాయకులు సామినేని ఉదయభాను, ఉప్పాల రాంప్రసాద్ తదితరులు పరామర్శించారు.