
సాక్షి, విజయవాడ: అక్రమ మద్యం కేసులో వైఎస్సార్‌సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. విజయవాడలో విచారణకు హాజరైన ఆయన్ని సిట్ అదుపులోకి తీసుకుంది. రేపు కోర్టులో హాజరుపర్చనుంది. లేని మద్యం కేసును సృష్టించి.. చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు తెరలేపింది. రాజకీయ కక్షతో పెద్దిరెడ్డి కుటుంబాన్ని చంద్రబాబు సర్కార్ వేధిస్తోంది. ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం బుసలు కొడుతోంది. మిథున్‌రెడ్డి అరెస్ట్‌పై వైఎస్సార్‌సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
మిథున్‌రెడ్డి అరెస్ట్‌ను వైఎస్సార్‌సీపీ నేతలు ఖండించారు. కూటమి పాలనలో కక్ష సాధింపులు తారాస్థాయికి చేరాయి. తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదు. మిథున్‌రెడ్డి కడిన ముత్యంలా బయటకొస్తారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది. లేని మద్యం కేసును సృష్టించి అరెస్ట్‌లు చేస్తున్నారు. కక్ష సాధింపులో భాగంగానే మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. న్యాయ పోరాటంలో కచ్చితంగా విజయం సాధిస్తాం’’ అని వైఎస్సార్‌సీపీ నేతలు అన్నారు.

కాగా, విచారణకు ముందు.. మిథున్‌రెడ్డి ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని, అక్కడి నుంచి సిట్ కార్యాలయానికి వెళ్లారు. ఈ ఉదయం ఆయన ఢిల్లీలో సాక్షితో మాట్లాడుతూ.. తనపై కేసులు రాజకీయ కక్షతో పెట్టినవే అని అన్నారు. తానొక ఎంపీనని, మద్యం పాలసీ రూపకల్పనలో తన ప్రమేయం ఎందుకు ఉంటుంది? అని ప్రశ్నించారు. అదే సమయంలో వైఎస్సార్‌సీపీ కీలక నేతలు ఇదంతా కూటమి ప్రభుత్వ కుట్రేనని మండిపడ్డారు. విచారణ సమయంలో సిట్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మిథున్ రెడ్డి అరెస్టుని ఖండించిన మాజీ ఎంపీ వంగా గీత
మీరు తప్పు చేస్తున్నారని మీకు తెలుసు కాబట్టే వాటిని మేము ప్రశ్నిస్తామని భయపడి YSRCP నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తున్నారని అందరికీ తెలుసు.
చంద్రబాబూ.. నిజాయితీగా పాలన చేస్తున్నవారు ఎవరూ ఇలా అక్రమ అరెస్టులు చేయించరు.
మిథున్ రెడ్డి అక్రమ అరెస్టును ఖండిస్తున్నా.
లేని మద్యం కేసును సృష్టించి, చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు తెరలేపుతోంది: ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి
ఎంపీ మిథున్ రెడ్డి మీద అక్రమ కేసు పెట్టి, అరెస్టు చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా.
ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం బుసలు కొడుతోంది అనడానికి ప్రస్తుత పరిణామాలే సాక్ష్యం
చంద్రబాబు గారూ మీరు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు.
మిథున్ రెడ్డిపై అక్రమ అరెస్టును ఖండిస్తున్నా: గోరంట్ల మాధవ్, మాజీ ఎంపీ
ప్రజల అండదండలు మాకు ఉన్నాయి.
మీ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తూనే ఉంటాం.
మిధున్ రెడ్డి అరెస్ట్ పై X లో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
లిక్కర్ స్కామ్ అంటారు… కానీ:ఆధారం లేదు
డబ్బు సీజ్ కాలేదు
మద్యం లభించలేదు
చార్ట్ షీట్ లో పేరు లేదు
ఇంకెక్కడా కుంభకోణం????
కానీ అరెస్ట్ ఉంది ఎందుకంటే టార్గెట్ జగన్ అన్న
ఈ కుట్రలో మిథున్ అన్నను కూడా లాగారు.
ఇది స్కామ్ కాదు… ఇది చంద్రబాబు గారి ప్రతీకార డ్రామా
మిథున్ రెడ్డిగారి అరెస్ట్ కుట్రపూరితం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా: గురుమూర్తి, ఎంపీ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు ప్రజల సమస్యలు గాలికి వదలి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కక్షసాధింపులకు ప్రాధాన్యం ఇస్తుంది.
ఎన్నికలలో ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చే విధంగా కుట్ర పూరితంగా వ్యవహరించడం దుర్మార్గం.
ఈ కుట్రలన్నింటికి సమాధానం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.