పుట్టా మహేష్‌, ప్రియాంకరెడ్డికి నోటీసులు ఇచ్చి వదిలేసిన పోలీసులు | Police Issue Notices to Putta Mahesh and Priyanka Reddy | Sakshi
Sakshi News home page

పుట్టా మహేష్‌, ప్రియాంకరెడ్డికి నోటీసులు ఇచ్చి వదిలేసిన పోలీసులు

Mar 15 2026 4:17 PM | Updated on Mar 15 2026 5:05 PM

Police Issue Notices to Putta Mahesh and Priyanka Reddy

హైద‌రాబాద్‌ శివారులోని మొయినాబాద్‌లో బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి ఇచ్చిన వీకెండ్‌ పార్టీలో డ్రగ్స్‌ లభ్యం కావడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇందులో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మ‌హేష్ కుమార్‌ డ్రగ్స్ తీసుకున్న‌ట్లు ఈగిల్ ఫోర్స్ పోలీసులు ఇప్పటికే ప్ర‌క‌టించారు. పుట్టా మహేష్‌, ప్రియాంకరెడ్డికి నోటీసులు ఇచ్చి పోలీసులు వదిలేశారు. పెద్దల ఒత్తిళ్లతోనే వదిలేశారని ఆరోపణలు వస్తున్నాయి. 

మరోవైపు, శంషాబాద్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ నుంచి పైలట్‌ రోహిత్‌ రెడ్డి, రితేష్‌రెడ్డి, నితిన్‌ శర్మను పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపర్చనున్నారు. కాగా, ఫాంహౌస్‌లో దొరికిన 11 మందిలో ఆరుగురికి డ్రగ్స్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రైడ్స్‌ సమయంలో కాల్పులు జరిపిన వ్యక్తిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. ఆర్మ్స్‌ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేశారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement