Jangaon
-
కొనుగోలు కేంద్రంలో రైతు ఆత్మహత్యాయత్నం
లింగాలఘణపురం: మండలంలోని మాణిక్యాపురం ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ రైతు ఏనెబావికి చెందిన పొన్నం తిరుమలేశ్ ఆదివారం ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన తోటి రైతులు అడ్డుకున్నారు. ఘటనకు సంబంధించి స్థానిక రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలేశ్ నెల రోజుల క్రితం తాను సాగు చేసిన ఎనిమిది ఎకరాల దిగుబడి ధాన్యాన్ని మాణిక్యాపురం ఐకేపీ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. నెల రోజులుగా ధాన్యం తూకం వేయడంలో జాప్యం చేస్తున్నారు. కేంద్రంలో తూకం వేసిన ధాన్యాన్ని లారీల్లో సకాలంలో తరలించకపోవడంతో రైతులే స్వంతంగా ట్రాక్టర్లలో మిల్లులకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలేశ్‌కు ట్రాక్టర్ లేకపోవడంతో నిర్వాహుకులు మరో రైతు ధాన్యాన్ని తూకం వేస్తున్నారు. దీంతో మనస్తాపానికి గురైన రైతు తిరుమలేశ్ ఒంటిపై డీజిల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. గమనించిన రైతులు అడ్డుకుని సముదాయించారు. దీంతో ఐకేపీ కేంద్ర నిర్వాహుకులు వెంటనే స్పందించి ఆయన ధాన్యాన్ని తూకం వేశారు. 92 క్వింటాళ్లు వెంటనే తూకం వేసి తగిన రశీదులను అందజేశారు. -
విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకోవాలి
● జీసీడీఓ గౌసియా బేగం బచ్చన్నపేట: విద్యార్థులు చదువుపై మక్కువ చూపుతూ భవిష్యత్ లక్ష్యాలను ఎంచుకోవాలని జీసీడీఓ గౌసియాబేగం అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలలో ఇంటర్మీడియట్లో జిల్లా టాపర్స్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా టాపర్స్ పావని, అభిని సన్మానించి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున నగదు బహుమతిని అందించామన్నారు. ఈ 2026–27 సంవత్సరానికి కళాశాల, పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభమైనట్లు తెలిపారు. దీంతోపాటు వివిధ తరగతుల్లో టాప్ విద్యార్థులను సైతం సత్కరించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి ఇర్రి వెంకట్‌రెడ్డి, కళాశాల స్పెషలాఫీసర్ నారమల్ల గీత పాల్గొన్నారు. -
ధాన్యం త్వరగా తరలించాలి
బచ్చన్నపేట: మండలంలోని అన్ని గ్రామాల కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని వేగంగా మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ అన్నారు. ఆదివారం మండలంలోని కొడవటూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ధాన్యాన్ని మిల్లులకు తరలించడానికి ట్రాక్టర్లు, డీసీఎంలు పలు వాహనాలను వినియోగించుకోవాలని తెలిపారు. మిల్లుల్లో ఏమైనా సమస్యలు తలెత్తితే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. వర్షాకాలం సమీపిస్తున్నందున వర్షాలు రాకముందే ధాన్యం తరలింపు చర్యలు ముమ్మరం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ నీల కవితమురళి, ఐకేపీ ఏపీఎం మాదారపు రవి, సీసీలు నర్సింహులు, రఘు, సీఏ గంగం వాణి, నిర్వాహకులు, రైతులు, పలువురు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ -
కోతుల కొట్లాట!
రహదారిపై అడ్డంగా ఉన్న వానరాల గుంపు జనగామ: అడవుల్లో ఆహారం, నీటి కొరతతో కోతులు గ్రామాల్లోనే తిష్టవేస్తున్నాయి. పాత, కొత్త గ్యాంగులుగా విడిపోయిన వానరాలు పంచాయతీలు పెట్టుకోవడం పరిపాటిగా మారిపోయింది. తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలన్న ఉద్దేశంతో కోతుల గుంపులు ఒకదానిపై ఒకటి దాడులు చేసుకోవడం.. రక్తికట్టే విధంగా పొట్లాడుకునే ఘటనలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పాత, కొత్త గ్యాంగుల హల్చల్ గత ఐదేళ్లుగా జనావాసాల్లో తిష్టవేసిన పాత కోతుల గుంపులు ‘ఇది మా ప్రాంతం.. ఇది మా ఆహారంం’ అన్నట్టు వ్యవహరిస్తూ ఊర్లలో తిరుగుతున్నాయి. ఇదే సమయంలో అటవీ ప్రాంతాల్లో ఆహారం దొరక్క బాధపడుతున్న కొత్త కోతులు గ్రామాలకు చేరి పాత అడ్డాల్లోకి ప్రవేశించే ప్రయత్నం చేయడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసింది. పాత గుంపులు కొత్తగా వచ్చిన కోతులను చూసిన వెంటనే ‘ఎవర్రా మా సరిహద్దు దాటేది?’ అన్నట్టు గర్జిస్తూ దాడులు చేస్తున్నాయి. రెండు గుంపుల మధ్య జరిగే పోరాటాలు గ్రామాల్లో నిత్యకృత్యంగా మారాయి. ఇవి ఏకంగా గ్యాంగ్ వార్స్ లా మారిపోవడంతో పల్లెల్లోని ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. ఇంటి బయట అల్పాహారం తింటున్నా, చేతిలో కవర్ పట్టుకుని నడుస్తున్నా కోతుల దాడి తప్పదన్న భయం ప్రజలను వెంటాడుతోంది. పాత, కొత్త కోతుల మధ్య గొడవల సమయంలో సమీపంలో ఎవరినైనా ఉన్నా.. వాటిని అదిలించే ప్రయత్నం చేసినా వాటి దాడిలో బలికావాల్సిందే.. అలా కోతుల దాడితో ఇప్పటికే పలువురు ఆస్పత్రిపాలయ్యారంటే పరిస్థితి ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం ప్రజలకే కాకుండా.. వ్యవసాయ రంగానికీ ఈ కోతుల గ్యాంగ్ వార్స్ నష్టం కలిగిస్తున్నాయి. ముష్టి యుద్ధాల తర్వాత ఆకలితో అల్లాడే ఈ కోతులు పంటలపై దాడులు చేసి మొక్కజొన్న, పల్లీలు, సజ్జలు, జొన్నలు, కూరగాయలు, పండ్ల తోటలను నాశనం చేస్తున్నాయి. కోతుల అడ్డా సమీపంలో ఉన్న పొలాల్లో రైతులు పంటలు వేయాలనే ధైర్యం కూడా చేయలేని పరిస్థితి. ఈ కోతుల పంచాయతీలు బచ్చన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్, కొడకండ్ల, రఘునాథపల్లి, నర్మెట, లింగాలగణపురం, జనగామ అర్బన్, జఫర్‌గఢ్, చిల్పూరు, తదితర మండలాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతీ ప్రాంతంలో తమదైన అడ్డా నిర్మించుకున్న కోతులు ఒక గుంపుపై మరో గుంపు దాడులు చేస్తూ నిత్యం జనాన్ని భయకంపితులను చేస్తున్నాయి. తలనొప్పిగా మారిన కొత్తకోతుల రాక పాత కోతుల వేధింపులతోనే అలసిపోయిన ప్రజలకు ఇప్పుడు కొత్త కోతుల రాక మరో తలనొప్పిగా మారింది. పాత, కొత్త కోతుల యుద్ధం ఎటు దారితీస్తుందోననే భయాందోళన ప్రజల్లో పెరుగుతోంది. ఇప్పుడైనా స్థానిక సంస్థలు, కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సర్పంచులు, పురపాలక మండళ్ల ప్రతినిధులు ప్రత్యేక చర్యలు తీసుకుని కోతుల నిర్మూలనపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కోతుల మధ్య కొత్త, పాత లొల్లి గుంపులుగా దాడులు చేసుకుంటున్న కోతులు ఇళ్లు, పంట పొలాలు, రహదార్లు.. ఎక్కడ చూసినా అవే.. బెంబేలెత్తుతున్న ప్రజలు గ్రామాలు, పట్టణాల్లో పెరిగిన వానరాల గుంపులు -
శిథిలావస్థలో జనగామ మున్సిపల్ పాత భవనం
జనగామ: పట్టణంలో ఏన్నో దశాబ్దాల చరిత్రను మోసుకొస్తున్న పాత పురపాలక భవనం రోజు రోజుకూ శిథిలావస్థకు చేరుకుంటోంది. పురపాలక క్యాంపస్‌లో కొత్త భవనని ర్మాణం పూర్తయ్యాక మొదటగా కలెక్టరేట్‌కు కేటాయించారు. అనంతరం సూర్యాపేట రోడ్డులో సమీకృత నూతన కలెక్టరేట్ నిర్మాణం పూర్తవడంతో అక్కడికి కార్యాలయాలు మారాయి. తర్వాత పురపాలిక కూడా పాత భవనం నుంచి కొత్త కార్యాలయానికి మారిపోవడంతో ఈ భవనం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. తగిన సంరక్షణ లేకపోవడంతో గోడలు, పైకప్పులు దెబ్బ తింటూ కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితికి చేరుకుంటుంది. చిన్నపాటి మరమ్మతులు చేసి ప్రభుత్వ శాఖలు లేదా ఇతర అవసరాల కోసం ఉపయోగంలోకి తెస్తే ప్రభుత్వానికి అదనపు ఆదాయం వచ్చే అవకాశముందని పట్టణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కానీ, భవన పరిరక్షణ బాధ్యత తీసుకునే అధికారులు లేకపోవడంతో భవనం మరింత దెబ్బతింటోంది. ప్రస్తుతం ఈ స్థితిలో వదిలేస్తే భవిష్యత్‌లో పూర్తిగా పనికిరాని స్థితికి చేరుతుందనే ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతుంది. వెంటనే అధికారులు స్పందించి పాత పురపాలక భవనానికి అవసరమైన మరమ్మతులు చేసి, కొత్త హంగులతో వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఉపయోగంలోకి తీసుకురావాలని ప్రజల విన్నపం -
నిర్లక్ష్య సీసీలపై కలెక్టర్ కొరడా..
కొడకండ్ల: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అలసత్వం వహించిన కొడకండ్ల మండలంలోని ఇద్దరు సీసీలపై కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కొడకండ్ల మండలంలో కలెక్టర్ సుడిగాలి పర్యటన చేసి గిర్నితండా, మొండ్రాయి, రామన్నగూడెం, ఏ డునూతుల, పాకాల, రామవరం, చెరువుముందు తండాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏడునూతుల కొనుగోలు కేంద్రంలో ఐదు లారీల ధాన్యం బస్తాల వివరాలు ట్రక్ షీట్లో నమోదు కాకపోవడం.. సంబంధిత సీసీ వెంకటయ్య పట్టించుకోకపోవడంపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో సీసీని సస్పెండ్ చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అలాగే గిర్నితండా కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగో ళ్లలో నిర్లక్ష్యం వహించిన సీసీ తిరుమలపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి చార్జ్ మోమో ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యాన్ని ఊపేక్షించబోమని, రైతులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట ఏపీడీ నూరోద్దీన్ తదితరులు ఉన్నారు. కొనుగోళ్లలో నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆగ్రహం పాలకుర్తి టౌన్(దేవరుప్పుల): ధాన్యం కొనుగోళ్లు, తరలింపులో జాప్యం చేస్తూ, ట్రక్ షిట్ నమోదు వివరాలు సక్రమంగా నిర్వహించకపోవడంతో ఐఏపీ సీసీలపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పాలకుర్తి మండలం తీగారం, చెన్నూరు, వల్మిడి, ముత్తారం, దేవరుప్పల మండలం కామారెడ్డిగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేవగంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. ఎఫ్ఐక్యూ ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న ఓపీఎంఎస్ నమోదును వెంటనే పూర్తి చేయాలని తెలిపారు. లారీలతోపాటు ట్రాక్టర్ల ద్వారా ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని ఆదేశించారు. కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహించిన సీసీలపై చార్జ్ మెమోలు, సస్పెన్షన్ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ ఏపీడీ నూరోద్దిన్, ఎంపీఎం కారుపోతుల వెంకటేశ్వర్లుగౌడ్, సర్పంచ్‌లు కారుపోతుల శ్రీనివాస్‌గౌడ్, బేతి కుమారస్వామి, నీరటి లక్ష్మి, చింతకింది అనిత, మండల సమాఖ్య అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. ఒకరి సస్పెన్షన్.. మరొకరికి షోకాజ్‌కు ఆదేశం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ -
భార్య సర్పంచ్.. భర్తతో ప్రారంభోత్సవం
చిల్పూరు: గ్రామంలో ప్రజా అవసరాల కోసం చేపట్టిన అభివృద్ధి పనులను సర్పంచ్ ప్రారంభించాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా సర్పంచ్ భర్త ఆ కార్యక్రమాన్ని చేపట్టడం గమనార్హం. మండలంలోని లింగంపల్లి గ్రామం ఎస్సీ కాలనీలో బోరు మోటార్‌ను సర్పంచ్ భూక్య సునిత ప్రారంభించాల్సి ఉండగా ఆదివారం ఆమె భర్త లాలు ప్రారంభించారు. ప్రోటోకాల్ ప్రకారం అడ్డుకోవాల్సిన పంచాయతీ కార్యదర్శి మహేందర్ సైతం స్వయంగా సర్పంచ్ భర్తతో కొబ్బరికాయ కొట్టించి ప్రారంభింపజేయడంపై విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, లింగంపల్లి సమ్మక్క సారలమ్మ జాతర మాజీ చైర్మన్ మోతె శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామంలో సర్పంచ్‌కు బదులు భర్త, కార్యదర్శి కలిసి పెత్తనం చెలాయిస్తున్నారని, ఈవిషయంపై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2కే రన్లో అధిక సంఖ్యలో పాల్గొనాలి జనగామ: ప్రజా పాలన –ప్రగతి ప్రణాళికలో భాగంగా స్పోర్ట్స్ అండ్ యూత్ వీక్ నేపథ్యంలో నేడు(సోమవారం)లో ఉదయం 6.30 గంటలకు కలెక్టరేట్ నుంచి మినీ స్టేడియం వరకు జరిగే 2కే రన్ ఉంటుందని జిల్లా యువజన, క్రీడల అధికారి ఎన్.లక్ష్మీనరసింహరావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 7 గంటలకు మినీ స్టేడియంలో యోగా నిర్వహించనున్నట్లు తెలిపారు. యువత, క్రీడాకారులు, విద్యార్థులు, వాకర్స్ పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. గోదావరిలో ప్రముఖులకు దారి కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగు సరస్వతీనది అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. వీవీఐపీల కోసం సరస్వతీఘాటు తీరం నుంచి త్రివేణి సంగమంలోని నీటి వరకు వెళ్లడానికి బారికేడ్లు ఏర్పాటు చేసి మధ్యలో మట్టిరోడ్డు వేశారు. దానిపైన మ్యాట్లు రానున్నాయి. అక్కడే కంటెయినర్లు ఏర్పాటు చేస్తున్నారు. బయోటయిలెట్లు ఏర్పాటు చేస్తున్నారు. జల్లు స్నానాలకు ఏర్పాటు చేస్తున్నారు. కుడి, ఎడమ వైపున సాధారణ భక్తులు స్నానాలకు వెళ్లేందుకు షమియానాలు, మ్యాట్లు వేయనున్నారు. తీరం నుంచి రెండు ద్వారాల ద్వారా భక్తులు తరలి వెళ్లేందుకు ఏర్పాట్లు చేపట్టారు. సరస్వతీనది అంత్యపుష్కరాలకు పలు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తారనే అధికారుల అంచనాతో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు వివిధ మార్గాల వద్ద 15 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. 21 నుంచి వన్‌వే అమలులోకి రావడంతో చెక్‌పోస్టుల వద్ద ట్రాఫిక్ ఆంక్షలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 21నుంచి జూన్ 1వ తేదీ వరకు పన్నెండు రోజుల పాటు హోమాలు నిర్వహించడానికి దేవాదాయశాఖ శివ కల్యాణ మండపంలో ఏర్పాట్లు చేస్తుంది. హోమాల కోసం భారీ మంచుకొండల మాదిరిగా డెకరేషన్ సెట్టింగులు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా అచలాపురానికి చెందిన వేదపండితులు హోమాది పూజలు నిర్వహించనున్నారు. -
యువజన క్రీడోత్సవాలకు సిద్ధం
జనగామ: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నేటి(సోమవారం) నుంచి ఈ నెల 23వ తేదీ వరకు జిల్లా, మండల స్థాయిల్లో యువజన క్రీడోత్సవాల కోసం జనగామ సిద్ధమైంది. ఈ మేరకు కలెక్టర్ సందీప్ కుమా ర్ ఝా షెడ్యూల్ విడుదల చేశారు. నేడు(సోమవారం) ఉదయం 6 గంటలకు జిల్లాస్థాయిలో మారథాన్ (వాక్/రన్), శారీరక దృఢత్వం కార్యక్రమాలు కలెక్టరేట్ నుంచి ఆర్టీసీ చౌరస్తా మీదుగా మినీ స్టేడి యం వరకు నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 7 గంటలకు మినీ స్టేడియంలో యోగా. మండల కేంద్రాల్లో ఎంపీడీఓల ఆధ్వర్యంలో కార్యక్రమాలు. 19వ తేదీన మినీ స్టేడియంలో కెరీర్, నైపుణ్యత దినోత్సవం నిర్వహిస్తారు. యువతలో అభిరుచులు, అవకాశాలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. 20వ తేదీన యువ నాయకత్వ సదస్సు, పెయింటింగ్ పో టీలు జనగామ మినీ స్టేడియంలో జరుగుతాయి. నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకత వికసించేలా ఈ సదస్సు, పోటీలను ఏర్పాటు చేశారు. 21వ తేదీ న ఉదయం 7 గంటలకు మినీ స్టేడియంలో క్రీడా దినోత్సవం నిర్వహించనున్నారు. వివిధ విభాగాల్లో క్రీడ పోటీలు, ప్రదర్శనలు ఉండనున్నాయి. 22వ తేదీన మినీ స్టేడియంలో జిల్లా స్థాయిలో యువతలో సామాజిక బాధ్యతా భావాన్ని పెంపొందించే సే వా కార్యక్రమాలను నిర్వహిస్తారు. అలాగే మండల స్థాయిలో ఎంపీడీఓ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. 23వ తేదీన ఉదయం 11 గంటలకు మినీ స్టేడియంలో ఉద్యోగ సాధన కార్యక్రమం జరుగనుంది. ఇటీవల మే 8న వరంగల్ జిల్లాలో నిర్వహించిన జాబ్ మేళాలో ఉద్యోగాలు సాధించిన జిల్లా యువతకు నియామక పత్రాలు అందజేస్తారు. అలాగే సీఎం కప్– 2025 రాష్ట్రస్థాయి టోర్నమెంట్లో విజేతలైన వారికి మెడల్స్, సర్టిఫికెట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రదానం చేస్తారు. నేటి నుంచి 23 వరకు నిర్వహణ -
రవాణా కష్టాలు
తాలు తంటాలు.. పాడైపోయిన ప్యాడీ క్లీనర్ఎర్రగొల్లపహడ్లో కుప్పలుగా ఉన్న ధాన్యం రాశులుజనగామ రూరల్: జిల్లాలో ధాన్యం దిగుమతుల వ్యవహారం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఒక వైపు పండించిన ధాన్యాన్ని కల్లాల నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు నానా కష్టాలు పడుతుంటే.. మరోవైపు తాలు తొలగించేందుకు కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీక్లినర్స్ లేక రైతులు అవస్థలు పడుతున్నారు. దీంతో పంట పెట్టుబడితో పాటు విక్రయించేందుకు అదనపు భారం పడుతోంది. కాంటా కోసం హమాలీలకు క్వింటాల్‌కు రూ.40లు చెల్లిస్తుండగా అదనంగా ధాన్యం తాలు తొలగించడానికి ఒక్కొక్క రైతు సుమారుగా 2 వేల నుంచి 6 వేలు అదనంగా వెచ్చించాల్సి వస్తోంది. అలాగే యాసంగి ధాన్యంలో తాలు ఎక్కువగా ఉందంటూ మిల్లర్లు కొర్రీలు పెడుతుండడంతో లారీలు రోజుల తరబడి మిల్లుల ముందే నిలిచిపోతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కల్లాల వద్ద తూకం వేసి పంపించినా, మిల్లర్లు దిగుమతి చేసుకునేందుకు నిరాకరిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కొక్క కేంద్రంలో ఒక్కోరకంగా తూకం వేస్తున్నారు. ఎర్రగొల్లపహడ్ గ్రామంలో 41 కిలోల 500 గ్రాములు వేస్తుండగా వడ్లకొండలో 41 కిలోల 200 గ్రాములు వేస్తుండడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా 231 సెంటర్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను 50 రోజుల క్రితం ప్రారంభించారు. ప్రతీ సెంటర్‌కు ధాన్యంలో తాలు తొలగించేందుకు తూర్పార పట్టే యంత్రం అందజేశారు. అయితే జిల్లాలో 231 కేంద్రాలు ఉండగా 243 యంత్రాలు ఉన్నాయి. ఇందులో 123 పెద్దవి ఉండగా 121 పాత యంత్రాలు ఉన్నాయి. ఇందులో 224 పని చేస్తున్నాయి. మిగతా యంత్రాలు రిపేర్‌లో ఉన్నాయి. అయా కేంద్రాల్లో ధాన్యం తాలు తొలగించడానికి ప్రైవేట్ యంత్రాలను ఆశ్రయిస్తున్నారు. గంటకు రూ.1000 నుంచి 1500 వెచ్చిస్తున్నారు. దీంతో వేల రూపాయలు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. సెంటర్‌కు రెండు చొప్పున యంత్రాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.. తూకం సమయంలోనే అధికారులు, సిబ్బంది బస్తాకు 2 కిలోలపైనే తరుగు పేరుతో అదనంగా తీసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే భారీగా తరుగు తీసిన తర్వాత కూడా మిల్లుల వద్ద మళ్లీ తాలు పేరుతో ధాన్యాన్ని తిరస్కరించడం లేదా అదనపు కోతలు పెట్టాలని చూడడంపై రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 40 కిలోలు తీసుకోవాల్సి ఉన్నా అందుకు విరుద్ధంగా 42 కిలోలు తీస్తున్నారని రైతులు వాపోతున్నారు. దానికి సిద్ధంగా లేని రైతుల ధాన్యం కొనుగోళ్లను ఆలస్యం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే లారీ డ్రైవర్లు సైతం రైతుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో ఉండడంతో 17 శాతం రావల్సిన తేమ శాతం 10 నుంచి 5 శాతం వరకు వస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఉంది. మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకోకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని నిర్వాహకులు కాంటా వేయడం లేదు. అక్కడి నుంచి లారీలు వస్తేనే కాంటా వేసిన ధాన్యం మిల్లులకు పంపే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. దీంతో కల్లాల వద్ద రైతులకు పడిగాపులు తప్పడం లేదు. జనగా మ మండలంలోని పలు గ్రామాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎర్రగొల్లపహడ్‌లో నాలుగు రోజుల నుంచి లారీలు రాకపోవడంతో హమాలీలు కూడా ఖాళీగా ఉంటున్నామని తెలిపారు. ఒక్కొక్క రైతు రూ.2వేల నుంచి 5 వేల వరకు చెల్లింపులు కొనుగోలు కేంద్రాల్లో మందకొడిగా కాంటాలు రవాణా లేక రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్న రైతులు కొనుగోళ్లలో ఆలస్యం.. అన్నదాతలకు అదనపు భారం -
కొనుగోళ్లు సజావుగా నిర్వహించాలి
జనగామ రూరల్: మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లను సజావుగా నిర్వహించాలని హమాలీలు, లారీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. గన్నీ బ్యాగుల నిల్వలు, హమాలీల అందుబాటు, గోదాముల సామర్థ్యం, రవాణా, తదితర వివరాల గురించి అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ..రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. రవాణా, గోదాముల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో డీఆర్డీఓ భాస్కర్, మార్క్‌ఫెడ్ డీఎం చంద్రశేఖర్, డీసీఓ కోదండరాములు, డీఎంఓ రామకృష్ణ, అదనపు డీఆర్డీవో నూరుద్దీన్, సివిల్ సప్లై డీఎం హతిరామ్, డీసీఎస్ఓ సురేష్ రెడ్డి, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్, వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోనీ తదితరులు పాల్గొన్నారు. హమాలీలు, లారీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
హిందూ ధర్మపరిరక్షణే సమాజ బలం
జనగామ: హిందూ ధర్మపరిరక్షణే సమాజ బలం అని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డు సాయిరాం కన్వెన్షన్ హాల్లో శనివారం రాత్రి హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో హిందూ ధర్మ సమ్మేళనం వైభవంగా జరిగింది. ఈ మహాసభకు సిద్ధాశ్రమ చేజర్ల మఠ పీఠాధిపతి, రాష్ట్ర సాధు పరివార అధ్యక్షుడు శ్రీనివాసానంద స్వామీజీ మహారాజ్, అఖిల భారత సమరసత కళావిభాగం కన్వీనర్ అప్పల ప్రసాద్ జీ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామీజీ మహారాజ్ మాట్లాడుతూ.. హిందూ ధర్మ పరిరక్షణ ప్రతి భక్తుడి కర్తవ్యమని, ధర్మాన్ని నిలబెట్టే మార్గంలో సమాజం ఐక్యత చూపాలన్నారు. అప్పల ప్రసాద్ జీ మాట్లాడుతూ.. సమరసత, సామరస్యంతోనే హిందూ సమాజం మరింత బలపడుతుందన్నారు. కార్యక్రమంలో సామాజిక సమరసత వేదిక కన్వీనర్ సోలంకి రవళి పాటిల్, ఆర్ఎస్ఎస్ జిల్లా సహ కార్యవాహ్ దొంతుల శేఖర్, గౌరవ అధ్యక్షుడు ఫకీర్ యాదగిరిరెడ్డి, ప్రధాన కార్యదర్శి బెలిదె శ్రీధర్ పాల్గొన్నారు. హిందూ ధర్మ సమ్మేళనంలో వక్తలు -
పొదుపు.. భవిష్యత్ మదుపు!
ఖిలా వరంగల్: అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా దేశంలో విదేశీ మాదకద్రవ్య వినియోగం తగ్గించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దిగుమతి చేసుకున్న బంగారం, ఎరువులు, ఇంధనం, వంట నూనె, ఇతర సరుకుల వాడకం విషయంలో పొదుపు పాటించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ వీటి వినియోగం ఎక్కువగా పెరిగింది. ఇదేపరిస్థితి కొనసాగితే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పేలా లేవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రధాని సూచనను మన ఇంటినుంచే ఆచరిద్దాం. దీనివల్ల వ్యక్తిగత ప్రయోజనంతో పాటు దేశానికి మేలు జరుగుతుంది. ఉమ్మడి జిల్లాలో ప్రధాన ఖర్చులు.. ఆదాపై ఈ ఆదివారం ‘సాక్షి’ సండే స్పెషల్.. నూనె వాడకమూ ఎక్కువే.. ఇళ్లలో వంటలకు వాడే నూనెకు భారీగా వెచ్చిస్తున్నారు. నలుగురు కుటుంబ సభ్యులున్న ఇంటిలో నెలకు నగటున ఐదు లీటర్లు వాడుతున్నారు. నెల రోజులకు ఇప్పటికీ చూస్తే ఒక్కో ప్యాకెట్‌కు రూ.25కు పైగా ధరలు పెరిగాయి. అతిగా వంట నూనె వాడితే శరీరానికి విటమిన్లు, మంచి కొవ్వు, కేలరీలు అందవు. హార్మోన్ల అసమతుల్యతతో ఎక్కువ మంది ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధుల బారినపడుతున్నా వినియోగం తగ్గించడం లేదు. ఉమ్మడి జిల్లాలో సుమారు 38.20 లక్షల కుటుంబాలు ఉండగా నెలకు 1.90 కోట్ల లీటర్ల నూనె వాడుతున్నట్లు అంచనా. ప్రధాని పిలుపు మేరకు అందులో 10 శాతం తగ్గించినా 19 లక్షల లీటర్లు ఆదా అవుతుందని నిపుణులు చెబుతున్నారు. బంగారం చూసుకుని కొందాం.. వివాహాలు, ఇతర శుభకార్యాలకు స్వర్ణాభరణాలు కొనడం అలవాటుగా మారింది. ఈ విషయంలో నియంత్రణ పాటిస్తే కచ్చితంగా ప్రయోజనం కలుగుతుంది. ప్రధానంగా వరంగల్ నగరంలో 210కుపైగా షాపులు, మిగిలిన జిల్లాల్లో మరో 200 షాపులు ఉన్నాయి. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా సగటున రోజుకు 6 కిలోల బంగారు నగల అమ్మకాలు సాగుతున్నట్లు వ్యాపారుల అంచనా. ఈ విషయంలో కొంత పొదుపు పాటించాల్సిన అవసరం ఉంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ధరలు పెరగడంతో 80 శాతం కొనుగోళ్లు తగ్గిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇంధనం ఆదా చేద్దామా.. పశ్చిమాసియా పరిణామాలు ఇంధన వినియోగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు తమ కాన్వాయిలో వాహనాలను తగ్గించుకునేలా తీసుకున్న నిర్ణయం స్ఫూర్తిగా నిలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో 7,82,314 వాహనాలు ఉన్నాయి. దీంతో సగటున నెలకు 19 లక్షల లీటర్ల పెట్రోల్, 7 లక్షల లీటర్ల డీజిల్ వినియోగమవుతోంది. ఒక ద్విచక్రవాహనం ఇంధనం కోసం సగటున నెలకు రూ.మూడు వేలు వెచ్చించాల్సి వస్తోంది. ఇది ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబం.. నెలవారీ నిత్యావసర సరుకుల కొనుగోలుకు సమానంగా ఉంటుంది. ఖరీదైన వాహనాలను విని యోగిస్తే ఇంధన వ్యయం ఎక్కువ. బైక్‌లపై వెళ్లడం కంటే కాలినడకన, సైకిళ్ల మీద వెళ్తే కొంత ఇంధనాన్ని ఆదా చేసినట్లే. ఎరువుల మోతాదు మించొద్దు.. పంటలకు మోతాదుకు మించి ఎరువులు వాడుతున్నారు. అధికారుల సిఫార్సు మేరకు ఎకరాకు మూడు దశల్లో 75 కిలోల యూరియా వినియోగించాల్సి ఉండగా.. జిల్లాలో 225 కిలోల కంటే ఎక్కువ ఉపయోగిస్తున్నట్లు వ్యవసాయ అధికారులే చెబుతున్నారు. దీంతో నేలసారం తగ్గడమే కాకుండా చీడ పీడలు వ్యాపించి సాగు వ్యయం గణనీయంగా పెరుగుతుంది. ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 15 లక్షల ఎకరాల్లో పంటలు సాగువుతుండగా.. నిబంధనల ప్రకారం 41 వేల మెట్రిక్ టన్నుల యూరియా వేయాలి. ఈ ప్రకారం రసాయన ఎరువులు వేస్తే విదేశీమారక ద్రవ్యం వినియోగం తగ్గడంతో పాటు సాగుపరంగా ఎదురయ్యే ఇబ్బందులూ తీరుతాయి. ప్రధాని మోదీ సూచనను మన ఇంటి నుంచే ఆచరిద్దాం..విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడానికి పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలి. ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వాలి. – ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపు వంట నూనెల వాడకం తగ్గిస్తే.. ఇంటి ఖర్చులో అధిక ఆదా అవసరమైతేనే బైక్, కారు.. కాలినడక ఆరోగ్యానికి మంచిది దిగుమతి వస్తువుల వినియోగాన్ని తగ్గిస్తే మేలు -
చివరి ఆయకట్టుకు గోదావరి జలాలు అందించాలి
జనగామ: నియోజకవర్గంలో చివరి ఆయకట్టు వరకు గోదావరి జలాలు అందించే విధంగా ముందుకెళ్లాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కోరారు. సచివాలయంలో శనివారం నిర్వహించిన దేవాదుల ప్రాజెక్టు పురోగతి సమీక్షా సమావేశంలో దేవాదుల ప్రాజెక్టు పనుల పురోగతి, పెండింగ్ అంశాలు, రైతులకు నీటి సరఫరా పరిస్థితులపై రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డికి సమగ్ర సమాచారంతో వినతి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో సాగునీటి అవసరాలు, భూసేకరణ సమస్యలు, కాలువల నిర్మాణంలో జాప్యం, చివరి ఆయకట్టుకు సాగునీటి సరఫరా అందించడంలో తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. దేవాదుల ప్రాజెక్టు ఫేజ్–3 పరిధిలోని ప్యాకేజీ–8 కింద ఉన్న తపాస్‌పల్లి, కన్నెబోయినగూడెం రిజర్వాయర్ల పరిధిలో కాలువల నిర్మాణ పనులు చాలా కాలంగా నిలిచిపోయాయని ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. పనులను తక్షణమే పునఃప్రారంభించి నిర్దిష్ట గడువులో పూర్తి చేయా లని అధికారులను కోరారు. బొమ్మకూరు కుడి కాలువ ద్వారా సాగునీరు సక్రమంగా అందడం లేదని, కాలువలో సాంకేతిక లోపాలు, నిర్వహణ సమస్యల కారణంగా రైతులకు నష్టం జరుగుతోందని తెలిపారు. ఈ విషయమై మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సానుకూలంగా స్పందించారన్నారు.జనగామ రూరల్: శాంతియుత వాతావరణంలో బక్రీద్ పండుగను నిర్వహించుకోవాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్ అన్నారు. శనివారం ముస్లిం నాయకుల సభ్యులతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండుగను శాంతియుతంగా జరుపుకొని సామరస్యాన్ని కాపాడుకోవాలన్నారు. జంతువుల బలి కార్యక్రమాలు సంబంధిత చట్టాలు, నిబంధనల ప్రకారం మాత్రమే నిర్వహించాలని స్పష్టమైన సూచనలు ఇచ్చారు. జంతువుల అక్రమ రవాణా అనుమతించబోమని తెలిపారు. రఘునాథపల్లి: డెంగీపై అప్రమత్తత అవసరమని, ప్రజలు తప్పనిసరి ఇంటి పరిసరాల శుభ్రత పాటించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున్‌రావు సూచించారు. జాతీ య డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా శనివారం మండల కేంద్రంలోని పీహెచ్సీ ఆధ్వర్యంలో డెంగీపై ఏర్పాటు అవగాహన ర్యాలీని డీఎంహెచ్ఓ జెండా ఊపి ప్రారంభించారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ ఎల్.అశోక్‌కుమార్, ప్రొగ్రాం ఆఫీసర్ కమల్‌హాసన్, స్థానిక వైద్యాధికారి స్రవంతి, సూపర్వైజర్లు, అశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.ప్రజాసమస్యల పరిష్కారానికి హెల్ప్‌లైన్ ఏర్పాటుజనగామ రూరల్: జిల్లా ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కలెక్టర్ కార్యాలయంలో 24/7టోల్ ఫ్రీ సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సహాయ కేంద్రం ద్వారా వరి సేకరణ, తాగునీటి సరఫరా, గ్యాస్ సరఫరా, ఇంధన సరఫరా.. తదితర అంశాలకు సంబంధించిన ఫి ర్యాదులు స్వీకరించి, వెంటనే పరిష్కార చర్యలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాలోని జీపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ సిబ్బంది ప్రతీ గ్రామంలో ప్రజలకు ఈ సమాచారం చేరేలా ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 1800–425–6605 కాల్ చేయాలని సూచించారు. 54 మంది గైర్హాజరుజనగామ రూరల్: ఇంటర్మీడియట్ అడ్వాన్‌న్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు శనివారం 54 మంది గైర్హాజరైనట్లు ఇంటర్ విద్యాధికారి జితేందర్‌రెడ్డి తెలిపారు. ఫస్టియర్ జనరల్ విద్యార్థులు 1,154 గాను 1,134 హాజరు కాగా, 20 గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌లో 183మందికి గాను 162 విద్యార్థులు హాజరు కాగా 21 గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన సెకండియర్ పరీక్షలకు జనరల్‌లో 330మందికి గాను 326 హాజరు కాగా నలుగురు గైర్హాజరయ్యారు. ఒకేషనల్ 132మందికి 123మంది హాజరయ్యారు. -
బంగారం కొనలేకపోతున్నాం..
ె పెరిగిన ధరల దృష్ట్యా సామాన్య, మధ్య తరగతి మహిళలం బంగారం కొనలేక పోతున్నాం. వివాహ సమయాల్లో పుట్టింటి కానుకగా అందించిన ఆభరణాలతో సరిపెట్టుకుంటున్నాం. ప్రధాని మోదీ హైదరాబాద్‌లో ప్రకటించిన విధంగా ఏడాది వరకు బంగారాన్ని కొనకుండా వేచిచూస్తాం. దీంతోనైనా దేశానికి మేలు కలగడంతోపాటు ధరలు దిగివస్తాయని ఆశిస్తున్నా. – గోనె లత, కరీమాబాద్ రోడ్డు వరంగల్ అవసరమైతేనే బైక్ తీస్తున్నా.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయి. సామాన్యులపై భారం పడింది. ఏ చిన్న పనికి కూడా వాహనంపై వెెళ్లడమే ప్రజలకు అలవాటుగా మారింది. పెరిగిన ధరలను చూస్తే చిన్న పనులకు బైక్, కారు రోడ్డు ఎక్కించడం సామాన్యులకు భారమే. అత్యవసరం అనుకుంటేనే కారు, బైక్ తీయాలని సూచిస్తున్నా. ఇంటి నుంచి ఎక్కడికై నా సైకిల్ మీద లేదా నడిచి వెళ్తున్నా. దీంతో నాకు ఆరోగ్యంతోపాటు డబ్బులు ఆదా అవుతున్నాయి. – మచ్చిక రాజు, వరంగల్ సేంద్రియ పద్ధతి పాటిస్తున్నాం.. సేంద్రియ సాగు విధానాన్ని పాటిస్తున్నాం. తప్పని పరిస్థితుల్లో యూరియాను పంటలకు వాడుతున్నాం. నూతన పద్ధతులు ఎన్ని పాటించినా ఎకరాకు ఒక బస్తా యూరియా వేస్తే పచ్చదనంతోపాటు పంట ఎదుగుదల కనిపిస్తుంది. అధికారులు ప్రత్యేక చొరవ చూపి ఖరీఫ్ సీజన్లో యూరియా కొరత లేకుండా చూడాలి. – పులి మంజుల, మహిళా రైతు, లింగగిరి -
ఒక్క నిమిషం.. జీవితం భద్రం!
సిబ్బంది భద్రత మా తొలి ప్రాధాన్యం. పనిలోకి దిగేముందు ఒక్క నిమిషం సమయం కేటాయించి భద్రతా ప్రమాణాలను పరిశీలించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చు. వన్ మినిట్ రూల్‌ను ప్రతీ ఉద్యోగి తప్పనిసరిగా పాటించాలి. ఈ చిన్న జాగ్రత్త పెద్ద ప్రమాదాలను నివారించగలదు. – సంపత్‌రెడ్డి, ఎస్ఈ, ఎన్పీడీసీఎల్, జనగామజనగామ: జనగామ సర్కిల్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి భద్రతను అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకుంటూ టీజీఎన్పీడీసీఎల్ ‘వన్ మిని ట్ రూల్’ పేరుతో ప్రత్యేక భద్రతా విధానాన్ని ప్రా రంభించింది. ఫీల్డ్‌లో విద్యుత్ పనులు ప్రారంభించే ముందు ప్రతి ఉద్యోగి కేవలం ఒక నిమిషం సమయం తీసుకొని భద్రతా ప్రమాణాలను స్వయంగా పరిశీలించుకోవడం ఈ విధానంలోని ముఖ్య అంశం. ప్రమాదాల నివారణకు కొత్తదారి విద్యుత్ ప్రమాదాలను తగ్గించి సిబ్బంది ప్రాణాలను రక్షించడమే లక్ష్యంగా సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ఈ కొత్త ఆలోచనను ప్రవేశపెట్టగా, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదాలకు దారి తీసే అవకాశాలు ఉన్నందున, పని ముందు ఒక నిమిషం జాగ్రత్త తీసుకోవడం ప్రాణాలను కాపాడే కీలక అలవాటుగా అధికారులు చెబుతున్నారు. ‘వన్ మినిట్ రూల్’ లో భాగంగా ఉద్యోగులు పరిశీలించాల్సిన అంశాల్లో లైన్ క్లియర్ (ఎల్సీ) పొందడం, ఇండక్షన్ టెస్టర్‌తో పవర్ లేకపోవడం నిర్ధారించడం, పీపీఈ ధారణ, ఎర్తింగ్ అమలు, డబుల్ ఫీడింగ్ ప్రమాదాన్ని నివారించడం, పరికరాల స్థితి పరిశీలన వంటి అంశాలు ఉన్నాయి. సురక్షిత విద్యుత్ సరఫరా వ్యవస్థ కోసం జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు, శిక్షణ తరగతులు నిర్వహిస్తూ ఉద్యోగులు ఈ నియమాన్ని కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. ‘ఒక్క నిమిషం ఆలోచన, జీవితాంతం భద్రత’ అనే సందేశంతో టీజీఎన్పీడీసీఎల్ ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోంది. విద్యుత్ శాఖలో ‘వన్ మినిట్ రూల్’ అమలు ప్రమాదాల నివారణకు కొత్తదారి -
ధాన్యం కొనుగోలు చేయాలని రాస్తారోకో
జనగామ రూరల్: నెల రోజుల నుంచి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో నరకయాతన పడుతున్నామని మండలంలోని వడ్లకొండ గ్రామరైతులు జనగామ–హుస్నాబాద్ రోడ్డు వడ్లకొండ వద్ద రోడ్డుపై శనివారం రాస్తారోకో నిర్వహించారు. మొ లకెత్తిన ధాన్యాన్ని చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేశా రు. సీఐ కాళ్లు పట్టుకుని బతిమిలాడారు. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి చీటకోడూర్ రోడ్డులో గల వీరభద్ర రైస్ మిల్లును కేటాయించారన్నారు. అక్కడ లారీలు అన్లోడ్ కావడం లేదని రోజుల తరబడి నిరీక్షిస్తున్నామన్నారు. 160 కుప్పల వరకు(సుమారు 40 లారీల)ధాన్యం ఉండగా వర్షాకాలం సమీపిస్తుండడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాపోయారు. వీరభద్ర మిల్లు వద్దు అని నినాదాలు చేస్తూ రాస్తారోకో నిర్వహించారు.ఽ అక్కడకు చేరుకున్న సీఐ సత్యనారాయణరెడ్డి.. అడిషినల్ డీఆర్డీఓ నూరొద్దీన్తో ఫోన్లో మాట్లాడారు. ఈ కొనుగోలు కేంద్రం ధాన్యం వీరభద్ర మిల్లు నుంచి వేరే మిల్లుకు మార్చేలా చూస్తామని, త్వరగా కొనుగోలు చేసి ధాన్యం తరలిస్తామని హామీ రావడంతో రైతులు రాస్తారోకో విరమించారు. కార్యక్రమంలో మహిళా రైతులు దండెబోయిన పద్మ, చాలగొండ వెంకన్న, చెరుకు రాంరెడ్డి, 50 మంది రైతులు పాల్గొన్నారు. వడ్లు మొలకలు వస్తున్నాయని ఆవేదన సీఐ కాళ్లు పట్టుకొని బతిమిలాడిన రైతు -
విద్యారంగాభివృద్ధికి రూ.219 కోట్లు
● ఎమ్మెల్యే కడియం శ్రీహరిలింగాలఘణపురం: రెండున్నర ఏళ్లలోనే నియోజకవర్గంలో విద్యారంగాభివృద్ధికి రూ.219 కోట్లు మంజూరు చేయించానని, కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో అభివృద్ధికి కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ అసంపూర్తి హాస్టల్ భవన నిర్మాణానికి రూ.1.44 కోట్లు, కస్తూర్బా గాంధీ పాఠశాలలో అదనపు గదులు, టాయిలెట్ బ్లాక్స్ నిర్మాణానికి రూ.42లక్షలతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కస్తూర్బా, మోడల్ స్కూల్లో రెండు విడతలుగా రూ.8.20 కోట్లు, వేలేరు కస్తూర్బాకు రూ.3.25 కోట్లు, స్టేషన్ ఘన్‌పూర్‌లో డిగ్రీ కళాశాలకు రూ.16.10 కోట్లు, జఫర్‌గఢ్‌లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు రూ.200 కోట్లు ఇలా విద్యారంగానికి నిధులు మంజూరు తీసుకొచ్చానని అన్నారు. ఇతర మౌలిక వసతులకు ఎస్డీఎఫ్, సీడీఎఫ్, ఎంపీ నిధులతో కృషి చేస్తున్నానని తెలిపారు. మోడల్ స్కూల్లో వంటగది, ఇతర మౌలిక వసతులకు ప్రతిపాదనలు పంపాలని డీఈని ఆదేశించారు. సర్పంచ్‌లు ఎడ్ల లావణ్యరాజు, శైలజ, రామకృష్ణ, సదానందం, సంపత్, బుచ్చయ్య, రాంరెడ్డి, విష్ణు మార్కెట్ వైస్ చైర్మన్ శివకుమార్, ప్రిన్సిపాల్ సునిత, ఎంఈఓ విష్ణుమూర్తి, కస్తూర్బా పాఠశాల స్పెషల్ ఆఫీసర్ అన్నపూర్ణ, మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు ఉపేందర్, శ్రీశైలం, మార్కెట్ డైరెక్టర్లు మోహన్, శ్రీలతారెడ్డి, నాయకులు మల్లారెడ్డి, దిలీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొనుగోళ్లు వేగవంతం చేస్తాం నెల్లుట్ల ఐకేపీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరికి రైతులు తమ ఇబ్బందులను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలస్యం లేకుండా వేగవంతం చేస్తామని, లోడింగ్ అన్‌లోడింగ్‌లో సమస్యలు లేకుండా చూడాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాకు ఫోన్ చేసి మాట్లాడారు. -
ధాన్యం బస్తాలకు నిప్పుపెట్టి నిరసన
జనగామ రూరల్: ధాన్యం తరలింపు సమస్యలపై నిరసన వ్యక్తం చేస్తూ మండలంలోని పెంబర్తి గ్రామ రైతులు శుక్రవారం వరంగల్– హైదరాబాద్ నేషనల్ హైవే 163పై శుక్రవారం ధాన్యం బస్తాలకు నిప్పు పెట్టి రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రంలో సుమారు 1,200 బస్తాలు కాంటావేసినవి ఉన్నాయని, చీటకోడూర్ రోడ్డులో గల వీరభద్ర రైస్ మిల్లుకు కేటాయించగా అక్కడ అన్లోడ్ ఆలస్యం అవుతోందని వాపోయారు. కొనుగోలు కేంద్రాలకు లారీలు రాక ధాన్యం లిఫ్టింగ్ చేయడం లేదని ఆవేదన చెందారు. రైతుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రైతులను బుజ్జగించారు. ధాన్యం రవాణాకు లారీలను పంపిస్తామని కొనుగోలు చేసిన బస్తాలను మిల్లులకు తరలించడానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. రాస్తారోకోలో గ్రామ రైతులు నిడిగొండ ప్రశాంత్, గోయ భాస్కర్, ఆవుల అంజిరెడ్డి, బోయ సంపత్, బుడిగే వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కాంటా అయినా తరలించడం లేదని రాస్తారోకో -
పెట్రో ఘాతం!
జనగామ: జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు అన్ని వర్గాల ప్రజలపై అదనపు భారం మోపుతోంది. రవాణా రంగం, ప్రైవేటు ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి వాహనదారులు ఇలా ప్రతీ ఒక్కరిపై అదనపు భారం పడుతోంది. జిల్లా వ్యాప్తంగా 94 పెట్రోల్ బంకులు ఉండగా, రోజువారీగా సుమారు లక్ష లీటర్ల పెట్రోల్, 2 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయి. కాగా, జిల్లాలో అన్ని రకాల వాహనాలు కలిపి 1.45లక్షల వరకు ఉన్నాయి. మోయలేని భారం ఇంధన ధరల్లో తాజాగా పెరిగిన పెంపు ప్రజలపై భారం తప్పడం లేదు. లీటరు పెట్రోల్ గతంలో రూ. 107.41ఉండగా ప్రస్తుతం రూ.3.39 పెరిగి రూ.110.80కు చేరింది. అదే విధంగా డీజిల్ ధర లీటరుకు రూ.95.64 నుంచి రూ.3.26 పెరిగి రూ.98.90 కు పెరిగింది. ఈ పెంపు కారణంగా రోజువారీగా పెట్రోల్‌పై రూ.3.40 లక్షలు, డీజిల్‌పై రూ.6.52 లక్షలు, మొత్తంగా రూ.9.91 లక్షల వరకు అదనపు భారం వినియోగదారులపై పడుతున్నట్లు అంచనా. 1.45లక్షల వాహనాలు జిల్లాలో గూడ్స్ వాహనాలు, బైక్‌లు, ఆటోలు, క్యాబ్‌లు ఇతర ప్రైవేటు వాహనాలు కలిపి 1.45 లక్షల వాహనాలు ఉన్నాయి. ఇందులో పెద్దఎత్తున ద్విచక్ర వాహనాలే ఎక్కువ. పెట్రోల్ ధరల పెంపు కారణంగా వారి రోజువారీ జీవన వ్యయం గణనీయంగా పెరిగింది. అదే విధంగా గూడ్స్ వాహనాలు, ట్రాన్స్పోర్ట్ వాహనాలపై డీజిల్ ధరల పెంపు నేరుగా ప్రభావం చూపుతోంది. సరుకు రవాణా ఖర్చు పెరగడంతో భవిష్యత్తులో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు భావిస్తున్నారు. ఇంధన ధరలు ఈ స్థాయిలో పెరుగుతూనే ఉంటే చిన్న వాహనదారులు, ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని, కార్యకలాపాలను కొనసాగించడం కష్టమవుతుందని చెప్పారు. ఇదే సమయంలో సాధారణ ప్రజలు కూడా పెరుగుతున్న ఖర్చులతో వారి జీవనాధారంపై ఒత్తిడి పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇంధనం పాత కొత పెరిగిన ధర పెట్రోల్ 107.41 110.80 3.39 డీజిల్ 95.64 98.90 3.26 రవాణా, వాణిజ్య రంగాలపై తీవ్ర ప్రభావం నిత్యావసర సరుకుల పెరుగుదల.. సామాన్యుడికి ఇక్కట్లు జిల్లాలో రోజుకు రూ.10లక్షల అదనపు భారం రోజుకు 3 లక్షల లీటర్ల పెట్రోల్, డీజిల్ అమ్మకాలు -
టైలరింగ్ కోర్సులో శిక్షణ
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందజేస్తారుసాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు టైలరింగ్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణలో నేర్పించే అంశాలు మెథడ్ ఆఫ్ కట్టింగ్, మెథడ్ ఆఫ్ స్ట్రిచ్చింగ్, జుబ్బా, పెట్టికోట్, సారీ పెట్టికోట్, ప్లాజా, ఫ్రాక్, అంబ్రెల్లా ఫ్రాక్, వీ షేప్ ఫ్రాక్, స్లీవ్లేస్ ఫ్రాక్, అంబ్రెల్లా టాప్, క్రాస్ కట్ బ్లౌజ్, ఫిష్ అంబ్రెల్లా టాప్, కట్స్ టాప్, సాదా బ్లౌజ్, ప్రిన్స్కట్ బ్లౌజ్, కటోరి బ్లౌజ్, నార్మల్ బాటమ్, ఫ్రంట్ కుచ్చుల బాటమ్, సైడ్ కుచ్చుల బాటమ్.రిజిస్ట్రేషన్ ఫీజు : రూ.2,500/-వర్క్‌షాపు షెడ్యూల్ తేదీలు: 22–05–2026 నుంచి 21–06–2026 వరకు శిక్షణ సమయం : ఉదయం 10 గం.నుంచి మధ్యాహ్నం 01 గం. వరకు రిజిస్ట్రేషన్, శిక్షణ స్థలం వివరాలు : రేష్మా బోటిక్, ఇంటినంబర్: 10 –10– 34, మైసమ్మ వీధి, గిర్మాజీపేట, వరంగల్. ఫోన్ నంబర్ : 95330 12727, 95055 14424 -
ఓరుగల్లుకు స్వచ్ఛరక్ష
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పట్టణాల్లో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 కింద చేపట్టనున్న మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టులో పరకాల, భూపాలపల్లి, జనగామ, వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపాలిటీలకు ప్రాధాన్యం లభించింది. ఈ ఐదు పట్టణాల్లో మొత్తం ఆరు మురుగునీటి శుద్ధి ప్లాంట్లు (ఎస్టీపీలు) ఏర్పాటు చేయనున్నారు. వీటి మొత్తం సామర్థ్యం 22.80 ఎంఎల్డీలుగా ఉంటుంది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివద్ధి శాఖ కార్యదర్శి డా.టీకే శ్రీదేవి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్వచ్చ భారత్ మిషన్‌లో భాగంగా... స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్బీఎం) 2.0 కింద రాష్ట్రవ్యాప్తంగా 101 పురపాలక సంఘాల్లో మురుగునీటి నిర్వహణ పనులకు రూ.3,705.75 కోట్ల సవరించిన పరిపాలనా అనుమతులు జారీ చేశారు. అందులో వరంగల్ విభాగానికి కూడా ప్రాధాన్యం లభించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పట్టణ పారి శుద్ధ్యానికి ఊరటనిచ్చే ఈ భారీ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వరంగల్ విభాగంలో మొత్తం 6 మురుగునీటి శుద్ధి ప్లాంట్లు (ఎస్టీపీలు) ఏర్పాటు చేయనున్నారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్.. భూసేకరణకు ప్రత్యేక నిధులు.. పనులను వేగంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవనుంది. ఎక్కువ కంపెనీలు టెండర్లలో పాల్గొనేలా చర్యలు తీసుకుంది. టెండర్లు పొందిన కాంట్రాక్టర్లు 24 నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టును హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) పద్ధతిలో అమలు చేయనున్నా రు. నిర్మాణ సమయంలో ప్రభుత్వం 50 శాతానికి పైగా వ్యయాన్ని చెల్లించగా, మిగిలిన మొత్తాన్ని విడతల వారీగా చెల్లించనుంది. నిర్మాణంతోపాటు ఐదేళ్లపాటు నిర్వహణ బాధ్యత కూడా కాంట్రాక్టు సంస్థలదే ఉంటుంది. భూసేకరణ కోసం ప్రత్యేక నిధులు కూడా కేటాయించారు. ఇదిలా ఉండగా పరకాల, భూపాలపల్లి, జనగామ, వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపాలిటీల్లో ప్రస్తుతం మురుగునీరు నేరుగా కాలువలు, చెరువులు, వాగుల్లోకి చేరుతుండటంతో కాలుష్య సమస్య తీవ్రంగా ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే పట్టణాల్లో చెరువులు, వాగులు, భూగర్భజలాల్లో కాలుష్యం గణనీయంగా తగ్గి పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడనున్నాయని అధికారులు చెబుతున్నారు. ‘గ్రేటర్’లో ఉన్నా లేనట్లే... తాజాగా ప్రతిపాదనలు... ఇక గ్రేటర్ వరంగల్ నగరంలో ఇప్పటికే స్మార్ట్‌సిటీ నిధులతో రెడ్డిపురం వద్ద 100 ఎంఎల్డీ, బంధంచెరువు వద్ద 15 ఎంఎల్డీ, ఉర్సుగుట్ట వద్ద 15 ఎంఎల్డీల సామర్థ్యంతో మూడు ఎస్టీపీల నిర్మాణాలు చేపట్టారు. కొన్ని అందుబాటులోకి రాకపోగా, వచ్చినవి ట్రైసిటీలో పెరుగుతున్న జనాభా, నగర విస్తరణకు సరిపోవడం లేదని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో 2057 విజన్‌కు అనుగుణంగా అదనపు ఎస్టీపీల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో ప్రభుత్వం రూ.5,257 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) ప్రాజెక్టును ప్రకటించిన నేపథ్యంలో 100 శాతం మురుగునీటి శుద్ధి లక్ష్యంగా ప్రణాళికలు సిద్దం చేసినట్లు అధికారులు తెలిపారు. ఐదు మున్సిపాలిటీల్లో ఆరు ఎస్టీపీలు... తీరనున్న కాలుష్యం బాధలు పరకాల నుంచి నర్సంపేట వరకు గ్రీన్‌సిగ్నల్ 22.80 ఎంఎల్డీ సామర్థ్యం మూడు ప్యాకేజీలలో టెండర్లు.. పూర్తి చేసేందుకు గడువు 24 నెలలు రూ.3,705 కోట్ల ప్రాజెక్టులో వరంగల్‌కు ప్రాధాన్యం -
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు వేగవంతం చేయండి
జనగామ: జనగామ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ, నిర్మాణ ప్రగతిని వేగవంతం చేయాలని కోరుతూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి శుక్రవారం హైదరాబాద్‌లో వినతి చేశారు. ఎల్–2 అర్హత జాబితాలో ఉన్న అర్హులకు ఇందిరమ్మ ఇళ్లను వెంటనే అప్పగించడంతో పాటు ఇంకా మిగిలిన ఇళ్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. జనగామ మున్సిపాలిటీ పరిధిలో 2011 జనాభా లెక్కల ప్రకారం 52,408 ప్రజలు ఉండగా, 1,371 మంది ఎల్–2 స్కీమ్‌కు అర్హులుగా గుర్తించారన్నారు. వీరిలో ఎమ్మెల్యే కోటాలో కేటాయించిన 200 ఇళ్లలో 188 ఇళ్లు ఇప్పటికే శాంక్షన్ చేసి, లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు తెలిపారు. మిగిలిన 12 మంది అర్హులకు కూడా సత్వరమే ఇళ్లు మంజూరు చేసి అప్పగించాలన్నారు. నియోజకవర్గ స్థాయిలో బచ్చన్నపేట, జనగామ మండలం, నర్మెట, తరిగొప్పుల, జనగామ టౌన్ కలిపి 800 ఇళ్లు కేటాయించబడగా, ఇప్పటికే 577 ఇళ్లు మంజూరు చేశారన్నారు. నిర్మాణం పూర్తితో పాటు కొనసాగుతున్న గృహాలు 511 కాగా, వివిధ కారణాలతో 61 ఇళ్లు రద్దు అయినట్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు స్పష్టం చేశారు. ఇంకా 223 ఇళ్లను ఆమోదించి పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని ఎమ్మెల్యే పల్లా అభ్యర్థించారు. మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే పల్లా విజ్ఞప్తి -
మెజార్టీ సభ్యుల ఆమోదంతోనే తీర్మానం
జనగామ: పురపాలికలో వాయిదా తర్వాత ఇటీవల జరిగిన సాధారణ సమావేశంలో మెజార్టీ సభ్యుల ఆమోదంతోనే ఎజెండా తీర్మానం పొందినట్లు కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. ‘మేం రాకముందే ఎజెండా ఎలా ఆమోదించారు’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఏప్రిల్ 30వ తేదీన జరిగిన సాధారణ సమావేశం వాయిదా పడగా, తిరిగి మే 6వ తేదీన నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో మూడు వంతుల సభ్యులు హాజరవడంతో 54 ఎజెండా అంశాలను చైర్పర్సన్ ముందుంచగా, కాంగ్రెస్‌కు చెందిన 9 మంది, బీఆర్ఎస్ సభ్యులు ముగ్గురు హాజరయ్యారన్నారు. మూడొంతుల కోరం ఉండడంతో ఎజెండా చదివే సమయంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ ఉడుగుల కిష్టయ్య అభ్యంతరం వ్యక్తం చేయగా, మెజార్టీ కౌన్సిలర్ల అంగీకారంతోనే ఆమోదించడం జరిగిందన్నారు. ఈలోగా ఆలస్యంగా వచ్చిన మరికొంతమంది బీఆర్ఎస్ సభ్యులు తమ రాకముందే ఎజెండా ఆమోదించడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. నిధుల దుర్వినియోగానికి సంబంధించిన అంశాలను కావాలనే త్వరగా ఆమోదించారని వారు ఆరోపించగా, సమావేశం ఉంటుందని మూడు రోజుల ముందే నోటీసులు ఇచ్చినట్లు చైర్పర్సన్ స్పష్టం చేసినట్లు తెలిపారు. ఎజెండాలో ఎలాంటి దుర్వినియోగం లేదు: మున్సిపల్ కమిషనర్ -
పేగుబంధం వదులుకుంది..! వైద్యబంధం అల్లుకుంది..!!
ఆడశిశువుకు ‘అమ్మ’ ప్రేమను పంచిన ఎంసీహెచ్తిక్కరపు పద్మ, నరేష్ దంపతులు జిల్లాలోని లింగాలఘణపురం మండలం కళ్లెం గ్రామంలో ఓ వ్యక్తి వద్ద ఇటుక తయారీ పనులు చేస్తున్నారు. నలుగురు పిల్లలు ఉన్న వీరికి మార్చి 23న ఐదో సంతానంగా చంపక్‌హిల్స్ ఎంసీహెచ్‌లో ఆడపిల్ల జన్మించింది. పుట్టుక సమయంలో పాప బరువు 1.25 కిలోలు మాత్రమే. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా ఉండడంతో వైద్యులు తక్షణ చికిత్స ప్రారంభించారు. వారం రోజుల తర్వాత పద్మ కుట్లు విప్పిన వెంటనే పాప ఆడపిల్ల కావడంతో ‘మేము సాకలేం, మీరే చూసుకోండి’ అంటూ డాక్టర్లకు చెప్పి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. అసాధారణమైన ఈ ఘటనను గమనించిన డాక్టర్ మధుసూదన్‌రెడ్డి విషయం వెంటనే చైల్డ్ వెల్ఫేర్‌శాఖకు తెలియజేశారు. అధికారులు వచ్చి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వగా, పాపను తామే పెంచుకుంటామని వారినుంచి హామీ తీసుకున్నారు. అయితే తల్లిదండ్రులు రెండు రోజులు గడవకముందే ఎవరికీ చెప్పకుండా ఆస్పత్రిలోనే పాపను వదిలేసి వెళ్లిపోయారు. వెంటనే ఆస్పత్రి రికార్డులో ఉన్న ఫోన్‌నంబర్ ఆధారంగా నరేష్‌కు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు, మీ ఊరు ఏంటి అని అడిగారు. ఒకసారి రాయలసీమ, మరోసారి ఉత్తరాంధ్ర అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు డాక్టర్లు తెలిపారు. లింగాలఘణపురం మండలం కళ్లెం గ్రామానికి వెళ్లిచూడగా వారు అక్కడినుంచి వెళ్లిపోయినట్లు గుర్తించారు. జనగామ: నెలలు నిండకముందే 1.25 కిలోల బరువుతో పుట్టి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న పాపతో రక్తబంధం వదిలేసుకున్నారు ఆ తల్లిదండ్రులు. కానీ, ఆ పసికందును ఈ లోకంలోకి తీసుకువచ్చిన వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది మాత్రం అక్కున చేర్చుకున్నారు. రోజంతా పర్యవేక్షణ, పాల ఫీడింగ్, ప్రేమతో కూడిన సంరక్షణతో ఆ శిశువులో నెమ్మదిగా మార్పు తీసుకువచ్చారు. తల్లి దూరమైన చోట మానవత్వం వెల్లివిరిసింది. నేడు పాప బరువు 2.3 కిలోలకు చేరి ఆరోగ్యంగా మారింది. జిల్లా కేంద్రంలోని చంపక్ హిల్స్ ఎంసీహెచ్ ఆస్పత్రిలో 50 రోజుల క్రితం చోటుచేసుకున్న ఘటన ఇప్పటికీ అందరినీ కదిలిస్తోంది. పేగుబంధం వదిలి వెళ్లినా.. అక్కున చేర్చుకుని పునర్జన్మనిచ్చిన ఆస్పత్రి, శిశువు కథ ఇది. అమ్మగా మారిన ఎస్ఎన్సీయూ పాపను పేగుబంధం కాదనుకున్నా.. వైద్యులు అక్కున చేర్చుకున్నారు. డాక్టర్ మధుసూదన్‌రెడ్డి పర్యవేక్షణలో పాపకు ఎస్‌ఎన్‌సీయూలో మెరుగైన వైద్యం అందిస్తూ, కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఒక్కో అనారోగ్య సమస్యకు చికిత్స చేసుకుంటూ వచ్చారు. రోజూ పాల డబ్బాతో ఫీడింగ్, అమ్మ ప్రేమ, లాలన అందిస్తూ పసిబిడ్డకు మాతృమూర్తుల్లా డాక్టర్లు, నర్సులు సంరక్షిస్తున్నారు. ఎనిమిది రోజుల వయసులో తల్లి ప్రేమ కోల్పోయిన ఈ పాపకు, ఎస్ఎన్సీయూ సిబ్బందే దేవుడిచ్చిన అమ్మలు అయ్యారు. తక్కువ బరువు నుంచి సంపూర్ణ ఆరోగ్యానికి.. 50 రోజుల చికిత్సతో పాప స్థితి రోజురోజుకూ మెరుగైందని డాక్టర్లు తెలిపారు. పాప పుట్టిన సమయంలో కిలో 250 గ్రాములు ఉండగా, ప్రస్తుత బరువు 2.300 కిలోలతో పూర్తిగా కోలుకుంది. ఎటువంటి అనారోగ్య సమస్య లేదు. బరువు 2.5 కిలోలకు చేరగానే చైల్డ్ వెల్ఫేర్ శాఖ సమన్వయంతో హనుమకొండ శిశుగృహానికి పాపను తరలించనున్నట్లు ఎంసీహెచ్ వైద్యుడు మధుసూదన్‌రెడ్డి ‘సాక్షి’కి వివరించారు.శిశువుకు అమ్మ ప్రేమను పంచుతున్న డాక్టర్, సిబ్బంది నెలలు నిండక తక్కువ బరువు, అనారోగ్య సమస్యలతో శిశువు జననం సాకలేమని వదిలివెళ్లిన తల్లిదండ్రులు.. అక్కున చేర్చుకున్న ఆస్పత్రి రక్తబంధం వదిలినా.. తల్లి ప్రేమ పంచి అన్నీ తామై చూసుకున్న వైద్యులు, సిబ్బంది 50 రోజుల్లో అద్భుతం.. బరువు పెరగడంతోపాటు సంపూర్ణ ఆరోగ్యంగా శిశువు -
సమాజం భాగస్వామ్యం కావాలి
● అప్పుడే ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతాయి.. ● నియోజకవర్గస్థాయి విద్యావారోత్సవాల్లో ఎంపీ కావ్య స్టేషన్‌ఘన్‌పూర్: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో సమాజం భాగస్వామ్యం కావాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా విద్యావారోత్సవాల్లో భాగంగా ఘన్పూర్ జెడ్పీహెచ్ఎస్లో నియోజకవర్గస్థాయి సర్పంచ్‌లు, కౌన్సిలర్లకు, ప్రజాప్రతినిధులకు విద్యా అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్‌ఘన్‌పూర్ ఎంఈఓ కొమురయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ మాట్లాడారు.. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం సమాజం చేతుల్లోనే ఉందని, ప్రజాప్రతినిధులు గుడిని ఎంత శ్రద్ధగా చూసుకుంటారో బడిని అలాగే చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్‌కుమార్, వైస్ చైర్మన్ నీల రాజమ్మగట్టయ్య, ఏఎంసీ చైర్మన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్‌రెడ్డి, వైస్ చైర్మన్ నూకల ఐలయ్య, తహసీల్దార్ స్వప్న, ఘన్పూర్, చిల్పూరు, లింగాలఘనపురం, జఫర్‌గఢ్, రఘునాథపల్లి ఎంఈఓలు కొమురయ్య, గోవర్ధన్, విష్ణుమూర్తి, రఘునందన్‌రెడ్డి, నాయకులు శంకర్, రజాక్‌యాదవ్, క్రిష్ణమూర్తి, కిషన్‌రాజ్, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. జనగామలో.. జనగామ రూరల్ : పాఠశాలల అభివృద్ధిలో సర్పంచ్, మున్సిపల్ కౌన్సిలర్లు భాగస్వాములు కావాలని అప్పుడే ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతాయని మండల విద్యాశాఖ అధికారి గురుజాల శంకర్‌రెడ్డి అన్నారు. జనగామ నియోజకవర్గ స్థాయి ప్రజాపాలన విద్యావారోత్సవాల్లో భాగంగా షామీర్పేటలోని రమాదేవి ఫంక్షన్ హాలులో సర్పంచ్, మున్సిపల్ కౌన్సిలర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా పలు అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల విద్యాశాఖ అధికారులు వెంకట్‌రెడ్డి, ఐలయ్య, జానకి తదితరులు పాల్గొన్నారు. -
పోరాటాల కోసం కొత్త కమిటీ
జనగామ: కలెక్టర్ వైఖరిని నిరసిస్తూ తలపెట్టిన రౌండ్ టేబుల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కలెక్టర్ బాధితుల రక్షణ కమిటీని ఏకగ్రీవంగా ఏర్పాటు చేసినట్లు బూడిద గోపి తెలిపారు. బుధవారం ఆయన కొత్త కమిటీకి సంబంధించిన వివరాలు వెల్లడించారు.. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల సమ్మతితో హైకోర్టు న్యాయవాది సాధిక్ అలీని కమిటీ కన్వీనర్‌గా నియమించినట్లు పేర్కొన్నారు. కో–కన్వీనర్లుగా సాంబరాజు యాదగిరి, అనంతుల ఆంజనేయులు, కట్ల సదానందం, కన్నారపు పరుశరాములు, రాగల్ల శ్రీహరి, మంగళ ంపల్లి రాజు, పాలమాకుల జితేందర్, మల్లి గారి రాజు, రాపర్తి రాజు, చల్ల అశోక్‌వర్ధన్‌రెడ్డి, బొట్ల శేఖర్, బూడిది జ్యోతిని ఎన్నుకున్నట్లు స్పష్టం చేశారు. సభ్యులుగా గడ్డం వెంకన్న, ఆకుల లక్ష్మయ్య, గడ్డం మల్లయ్య, బానోతు ధర్మభిక్షం, ఎండీ అజహర్, కత్తుల రాజిరెడ్డి, తోట సత్యం, ఎండీ దస్తగిర్, ఉమాపతి, సుంచు విజేందర్, బూడిది గోపి, పల్లెర్ల లలిత తదితరులను ఎన్నుకున్నారు. -
‘పల్లా’కు పెరుగుతున్న ప్రాధాన్యం.. సీనియర్లు నియోజకవర్గాలకే..
బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం వద్ద జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ప్రాధాన్యం పెరిగింది. ఉమ్మడి వరంగల్ పార్టీ సమావేశాలు, సమీక్షలు, కేడర్ సమావేశాలు, వ్యూహాత్మక చర్చల్లో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల హనుమకొండలో కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరైన రైతు సంగ్రామ సదస్సుకు పల్లా రాజేశ్వర్‌రెడ్డి అధ్యక్షత వహించారు. తాజాగా మంగళవారం కేసీఆర్ భేటీ అనంతరం నియమించిన సభ్యత్వ నమోదు ఇన్‌చార్జ్‌ల నియామకంలోనూ ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. మాజీ మంత్రి సత్యవతిరాథోడ్‌కు పాత ములుగు, జేఎస్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల బాధ్యతలు ఇవ్వగా.. గతంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇన్చార్జ్ గా ఉన్న జనగామ, వరంగల్, హనుమకొండ జిల్లాల బాధ్యతలను పల్లా రాజేశ్వర్‌రెడ్డికి అప్పగించారు. గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులుగా వ్యవహరించిన పలువురు సీనియర్లను సభ్యత్వ నమోదు విషయంలో నియోజకవర్గాలకే పరిమితం చేయడం పార్టీవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాక్షిప్రతినిధి, వరంగల్ : అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ.. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి కేంద్రబిందువుగా నిలిచిన ఉమ్మడి వరంగల్ జిల్లాపై పార్టీ ప్రత్యేక దృష్టి సారించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గ్రామస్థాయి నుంచి నగర, డివిజన్ల వరకు విస్తృతస్థాయిలో సభ్యత్వ నమోదు చేపట్టి మళ్లీ కేడర్‌ను కదిలించే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల కిందట ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌లో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కీలక భేటీ నిర్వహించిన పార్టీ అధినేత కేసీఆర్ సభ్యత్వ సేకరణకు ఇన్చార్జ్ లను నియమించారు. సభ్యత్వ సేకరణకు రంగంలోకి ఇన్‌చార్జ్‌లు.. పార్టీ శ్రేణులను మళ్లీ యాక్టివ్ చేయడం, కార్యకర్తల్లో నమ్మకం పెంచడం, స్థానిక నాయకత్వాన్ని సమీకరించడం లక్ష్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్‌లో భారీ సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేసి రాష్ట్రానికి రాజకీయ సంకేతం ఇవ్వాలనే ఆలోచనతో పార్టీ ముందుకు సాగుతున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలకు ఇన్‌చార్జ్‌లను నియమించారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌కు గతంలోనూ ఇన్చార్జ్గా ఉన్న ములుగు, జేఎస్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల బాధ్యతలు అప్పగించారు. గతంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇన్చార్జ్గా ఉన్న జనగామ, వరంగల్, హనుమకొండ జిల్లాల బాధ్యతలు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి అప్పగించారు. ఎమ్మెల్సీలు తక్కళ్లపెల్లి రవిందర్రావును ఖమ్మం, కొత్తగూడెం, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని మేడ్చల్–మల్కాజిరి, యాదాద్రి, మెట్టు శ్రీనివాస్‌ను గద్వాల్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలకు ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. గ్రామాల వారీగా లక్ష్యాలు.. సభ్యత్వ సేకరణకు ప్లాన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈసారి కేవలం పేరుకే కాకుండా డేటా ఆధారిత రాజకీయ వ్యూహంగా మలచాలని బీఆర్ఎస్ భావిస్తోంది. గత ఎన్నికల్లో పార్టీకి వచ్చిన ఓట్లు, బూత్‌వారీ బలం, స్థానిక నాయకత్వ ప్రభావం ఆధారంగా గ్రామాల వారీగా సభ్యత్వ లక్ష్యాలను ఖరారు చేస్తున్నట్లు సమాచారం. ప్రతీ మండలానికి ప్రత్యేక టార్గెట్లు ఇవ్వడంతోపాటు యువత, మహిళలు, రైతులు, విద్యార్థులు, పాత కార్యకర్తలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మాజీ ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నేతలు, మండల స్థాయి నాయకులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించి కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల నిర్వహించిన రైతు సంగ్రామ సభకు వచ్చిన స్పందనతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా గ్రామస్థాయిలో మళ్లీ పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసి, భవిష్యత్ ఎన్నికలకు సిద్ధం కావాలనే లక్ష్యంతో పార్టీ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్‌లో భారీ స్థాయిలో సభ్యత్వ నమోదు జరిగితే రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి కొత్త ఊపు వస్తుందనే భావన బీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. సత్యవతిరాథోడ్పల్లా రాజేశ్వర్‌రెడ్డి -
అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండాలి
జనగామ: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యేవరకు సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా వెంటనే అన్లోడింగ్, మిల్లులకు తరలింపు చర్యలు చేపట్టాలని సూచించారు. పౌరసరఫరాల సంస్థ డీఎం హతీరామ్, జిల్లా మార్కెటింగ్ అధికారి రామకృష్ణ, ఇన్చార్జ్ డీసీఎస్ఓ సురేష్‌రెడ్డి పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు నమోదు చేయాలి లింగాలఘణపురం: ధాన్యం కొనుగోలు వివరాలను ఎప్పటికప్పుడు ఓపీఎంఎస్ (ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్ సిస్టమ్) నమోదు చేసి రైతుల అకౌంట్లలో డబ్బులు పడేవిధంగా చూడాలని కలె క్టర్ సందీప్‌కుమార్ ఝా సూచించారు. మండలంలోని కుందారంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. కొనుగోళ్లను వేగవంతం చేయాలి.. స్టేషన్‌ఘన్‌పూర్/పాలకుర్తిటౌన్: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లను సక్రమంగా, వేగవంతంగా చేపట్టాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు. ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లి, పాలకుర్తి మండలంలోని ఈరవెన్ను, అయ్యంగారిపల్లి, గూడూరు, దేవరుప్పల మండలం కోలుకొండ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. కొనుగోళ్లలో జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు.మొక్కజొన్న కొనుగోళ్లలో నిర్లక్ష్యం వద్దు.. జిల్లాలోని మొక్కజొన్న కొనుగోళ్లలో ఎక్కడా నిర్లక్ష్యం వహించవద్దని, అవసరానికి అనుగుణంగా హమాలీల సంఖ్యను పెంచాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మొక్కజొన్న కొనుగోలు, ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై వేరు వేరుగా రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్‌తో కలిసి సమీక్ష నిర్వహించా రు. సమావేశంలో డీఆర్డీఓ భాస్కర్, మార్క్‌ఫెడ్ డీఎం చంద్రశేఖర్, ఆత్మ డీపీడీ విజయశ్రీ, డీసీఓ కోదండరాములు, డీఎంఓ రామకృష్ణ, అదనపు డీఆర్డీఓ నూరొద్దీన్, ఏఎంవీఐ శ్వేత, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులు ఇబ్బందులు పడొద్దు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశం -
ముగిసిన హిందూ బాలసంస్కార శిక్షణ
జనగామ: జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీ శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో 12 రోజులుగా కొనసాగుతున్న జరిగిన హిందూ బాలసంస్కార శిక్షణ శిబిరం బుధవారం ముగిసింది. ప్రముఖ ఆధ్యాత్మిక తత్వవేత్త మోహన కృష్ణ భార్గవ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో 115 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వహిందూ పరిషత్ విభాగ్ సంఘటన మంత్రి శివరాములు హాజరు కాగా మోహనకృష్ణ భార్గవ మాట్లాడుతూ.. పన్నెండు రోజుల శిక్షణకు అద్భుత స్పందన వచ్చిందన్నారు. శిక్షణలో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంస పత్రాలు, హనుమాన్ చాలీసా పుసకాలు, మెటీరియల్, బాక్సులు అందజేశారు. కార్యక్రమంలో దేవస్థాన గౌరవాధ్యక్షుడు గజ్జెల నర్సిరెడ్డి, వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు ఎనగందుల భిక్షపతి, ప్రముఖ వైద్యులు గోపీచంద్, ఆర్టీఏ మెంబర్ అభిగౌడ్ పాల్గొన్నారు. డీఆర్డీఓగా భాస్కర్జనగామ: జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ(డీఆర్డీఓ)గా రాపర్తి భాస్కర్‌ను నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి ఎంపీడీఓగా పనిచేస్తున్న భాస్కర్ డిప్యూటీ సీఈఓగా పదోన్నతి పొందగా, డీఆర్డీఓగా పోస్టింగ్ ఇచ్చారు. ఆయన జనగామ జిల్లా డీఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించారు. జనగామ జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓగా వి.వెంకయ్య పదోన్నతిపై ఇక్కడకు రాగా, బాధ్యతలను స్వీకరించారు. హైకోర్టు ఆదేశాల మేరకే తొలగింపుజనగామ: ప్రభుత్వ భూమిలో అనుమతి లేకుండా కొనసాగిస్తున్న టీస్టాల్‌పై చేపట్టిన చర్యలను తెలంగాణ హైకోర్టు సమర్థించినట్లు డీపీఆర్వో పల్లవి వెల్లడించారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. టీ స్టాల్‌కు సంబంధించిన తాత్కాలిక ఉత్తర్వులను కోర్టు రద్దు చేసి, వార్డు–17లోని వెజ్–నాన్ వెజ్ మార్కెట్ సమీపంలో ప్రత్యామ్నాయ స్థలాన్ని తాత్కాలిక లైసెన్సుతో కేటాయించాలని ఆదేశించినట్లు వెల్లడించారు. వాస్తుపేరుతో తొలగింపు ఆరోపణలు నిరాధారమని స్పష్టం చేశారు. కలెక్టర్ ఆకస్మిక తనిఖీలో అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే భూరికార్డుల కార్యాలయంలో ముగ్గురు ప్రైవేటు వ్యక్తులు అధికారుల అనుమతిలేకుండా ల్యాప్టా ప్, ప్రింటర్ ఉపయోగించి భూ రికార్డులు కలర్ ప్రింట్లు తీస్తున్నట్లు గుర్తించిన నేపథ్యంలో అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లగా, వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసి, పరిపాలనా చర్యలు ప్రారంభించగా, క్రిమినల్ చర్యలకు సంబంధించి పరిశీల న కొనసాగుతుందన్నారు. కాగా కలెక్టరేట్ ప్రాంగణంలో సుమారు 80 క్లెయిమ్ చేయని వాహనాలను గుర్తించగా, అగ్ని ప్రమాదం, భద్రతా సమస్యలను దృష్టిలో ఉంచుకుని పోలీసు, ఆర్టీఏ శాఖల సహకారంతో వాటిని తొలగించే ప్రక్రియ కొనసాగుతున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యంలో న్యాయబద్ధమై న విమర్శలను స్వాగతిస్తున్నామని, అయితే విమర్శలు వాస్తవాలపై ఆధారపడాలన్నారు. నమోదైన పాలనా చర్యలను నిరంకుశంగా అభివర్ణించడం వాస్తవాలకు విరుద్ధమని, హైకోర్టు ధ్రువీకరణ తమ పారదర్శక చర్యలకు నిదర్శనమని స్పష్టం చేశారు. -
ప్రశాంతంగా పాలిసెట్
జనగామ/స్టేషన్‌ఘన్‌పూర్: జిల్లాలో పాలిసెట్–2026 బుధవారం ప్రశాంతంగా ముగిసింది. పరీక్షల జిల్లా కో ఆర్డినేటర్, ప్రభుత్వ ఏబీవీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రవేశ పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు నిర్వహించిన ఈ పరీక్షకు జిల్లాలోని ఆరు కేంద్రాల్లో మొత్తం 1,615 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, వీరిలో 1,527 మంది హాజరయ్యారు. ఇందులో 790 మంది బాలురు, 737 మంది బాలికలు ఉన్నారు. బాలుర హాజరు శాతం 95 శాతం, బాలికల హాజరు శాతం 94శాతం కాగా, జిల్లా వ్యాప్తంగా ఓవరాల్‌గా హాజరు శాతం 95శాతంగా నమోదైనట్లు శ్రీనివాస్ వెల్లడించారు. ఒక నిమిషం ఆలస్యం క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాల సెంటర్‌కు ఓ విద్యార్థి కేవలం ఒక నిమిషం ఆలస్యంగా రాగా..అధికారులు లోనికి అనుమతించ లేదు. దీంతో ఆ విద్యార్థి తీవ్ర నిరాశకు గురయ్యాడు. కాగా, విద్యార్థులను వెంట తీసుకొచ్చిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎండలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరీక్షల సందర్భంగా సీఐ సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సైలు, పోలీసులు అన్ని కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. సెంటర్ల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు 1,615 మంది విద్యార్థులకు 1,527 మంది హాజరు -
కలెక్టర్ వైఖరితో జీవనోపాధిపై ప్రభావితం
జనగామ: కలెక్టర్ వైఖరి ప్రజల జీవనోపాధిఽపై ప్రభావితం చూపిస్తోందని అఖిలపక్ష నాయకులు ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వ్యవహారశైలిపై ఆందోళన వ్యక్తం చేస్తూ మంగళవారం స్థానిక విజయ ఫంక్షన్ హాల్లో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి బొట్ల శేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అన్ని పార్టీలు, ప్రజాసంఘాల ప్రతినిధులు, కౌన్సిలర్లు, కార్మిక, కర్షక సంఘాలు పాల్గొన్నాయి. దళిత మహిళ మంజుల మాట్లాడుతూ.. గత కలెక్టర్ మంజూరు చేసిన తన టీస్టాల్‌ను ప్రస్తుత కలెక్టర్ ఎటువంటి కనికరంలేకుండా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. సాదిక్ ఫౌండేషన్ చైర్మన్, న్యాయవాది సాదిక్ అలీ మాట్లాడుతూ.. కలెక్టర్ వైఖరి ఆందోళన కలిగిస్తోందని, కాంగ్రెస్ నాయకులు దీన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రజల్లో నమ్మకం కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 3వ వార్డు కౌన్సిలర్ బూడిద జ్యోతి మాట్లాడుతూ.. మహిళా ప్రజాప్రతినిధిగా తాను కలెక్టరేట్‌కు వెళ్తే సమయం కూడా ఇవ్వలేదన్నారు. సీపీఎం, టీఆర్పీ, జేఎంఐ, టీఆర్ఎస్ (కవిత) వర్గాల నాయకులు మాట్లాడుతూ.. కలెక్టర్ తన వైఖరిని 20 రోజుల లోపు మార్చుకోకపోతే అన్ని పార్టీలు కలిసి ఉద్యమాలు చేపడతామని, రాజకీయాలకు అతీతంగా ఈ తీర్మానాన్ని అమలు చేస్తారని స్పష్టం చేశారు. సమావేశంలో మాజీ కౌన్సిలర్ కత్తుల రాజిరెడ్డి, సుంచు విజేందర్, సింగారపు రమేశ్, మల్లిగారి రాజు, ఎండీ దస్తగిరి, న్యాయవాది రాగల్ల శ్రీహరి, ట్రాక్టర్ యజమానుల సంఘం నాయకుడు ఆకుల లక్ష్మయ్య, అజహర్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. అఖిలపక్ష సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం -
ముగిసిన చెస్ శిక్షణ శిబిరం
జనగామ: గుడాల ఫ్యామిలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన చెస్ శిక్షణ క్యాంపు మంగళవారంతో విజయవంతంగా ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఐ సత్యనారాయణరెడ్డి, బీజేపీ స్పోక్స్ పర్సన్ ఆరుట్ల దశమంతరెడ్డి, డాక్టర్ ప్రీతి దయాల్, కాసాల సంతోష్ కుమార్, గుడాల ఫ్యామిలీ ఫౌండే షన్ డైరెక్టర్ రాము, చెస్కోచ్లు పాల్గొన్నారు. 10 రోజుల పాటు నిర్వహించిన చెస్ క్యాంపులో 120 మంది విద్యార్థులు పాల్గొని చెస్‌కు సంబంధించిన మౌలిక నైపుణ్యాలు, వ్యూహాలు నేర్చుకున్నారు. కార్యక్రమం చివరి రోజు పది మందికి బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డ్‌ను ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రదానం చేశారు. అలాగే క్యాంపులో పాల్గొన్న ప్రతీ విద్యార్థికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇచ్చి ప్రోత్సహించారు. ఈ స్ఫూర్తిదాయక కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గుడాల ఫ్యామిలీ ఫౌండేషన్ చైర్మన్ గుడాల శ్రీనివాస్, కో–చైర్మన్లు గుడాల వేణు, గుడాల శ్రీధర్‌కు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు. -
అజ్ఞాతం వీడిన పసునూరి
సాక్షి ప్రతినిధి, వరంగల్: సీపీఐ (మావోయిస్ట్) పార్టీ అగ్రనేత పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్ అలియాస్ సంతోశ్ ఎట్టకేలకు ఉద్యమ బాట వదిలారు. పార్టీ సాధారణ సభ్యుడి నుంచి కేంద్ర కమిటీ నాయకుడి వరకు ఎదిగిన ఆయన జనజీవన స్రవంతిలో కలిశారు. 1982లో అజ్ఞాతంలోకి వెళ్లారు. సుమారు మూడు దశాబ్దాల పాటు మావోయిస్ట్ పార్టీ ఉద్యమంలో కొనసాగిన ఆయన మంగళవారం అడవిబాటను వదిలి పోలీసుల సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిశారు. సోమిడి నుంచి జార్ఖండ్ వరకు.. పసునూరి నరహరి స్వస్థలం హనుమకొండ జిల్లాలోని కాజీపేట మండలం సోమిడి గ్రామం. 1980 నుంచి పీపుల్స్‌వార్‌కు అనుబంధంగా ఉన్న రాడికల్ విద్యార్థి సంఘం, రాడికల్ యూత్ లీగ్‌లలో ఆయన చురుకై న పాత్ర పోషించారు. పులి అంజయ్య, క్రాంతి రణదేవ్, గోపగాని అయిలన్న అలియాస్ మహేశ్‌తో కలిసి వరంగల్ నగరంలో పలు కార్యక్రమాలు నిర్వహించిన నరహరి.. అనతికాలంలోనే పోలీసులకు వాంటెడ్‌గా మారారు. నిర్బంధం తీవ్రం కావడంతో 1982లో పూర్తికాలపు కార్యకర్తగా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏటూరునాగారం, తాడ్వాయి.. ఉత్తర తెలంగాణ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పని చేసిన ఆయన ఆంధ్రా ఒడిశా సరిహద్దుకు బదిలీపై వెళ్లారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఉద్యమ సహచరిని పెళ్లి చేసుకున్న ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఏఓబీ, ఝార్ఖంఢ్‌లో మావోయిస్ట్ ఉద్యమ విస్తరణకు కీలకంగా పని చేశారు. నరహరి పలు ఆపరేషన్స్‌లో కీలక పాత్ర పోషించినట్లుగా పోలీసు రికార్డులు చెబుతున్నాయి. నాలుగున్నర దశాబ్దాల పాటు అజ్ఞాతంలో ఉంటూ క్రమంగా మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగారు. ఉమ్మడి వరంగల్ నుంచి చివరి లొంగుబాటు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్‌లో భాగంగా పలువురు మావోయిస్టు అగ్రనేతలు ఎన్కౌంటర్లలో మృతి చెందారు. దళాలకు దళాలే మృత్యువాత పడగా.. మరికొందరు అగ్రనేతలు, మావోయిస్టుల ఆయుధాలతో సహా లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చి 31 టార్గెట్‌గా చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ పూర్తయిన సందర్భంగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్ట్ అగ్రనేతలు ముప్పాల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి, పొలిట్‌బ్యూరో సభ్యుడు మిసిర్ బెస్రాతో పాటు పసునూరి నరహరి అలియాస్ సంతోశ్ పేరును కూడా కేంద్రం ప్రకటించింది. ఇటీవల కాలంలో పోలీస్ కూంబింగ్‌లు మరింత ఉధృతంగా సాగుతున్న తరుణంలో కేంద్ర కమిటీ సభ్యుడు, జార్ఖండ్ ఈస్ట్ రీజినల్ బ్యూరో టెక్నికల్ విభాగం ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్న పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్, అలియాస్ సంతోశ్ మంగళవారం భార్యతో కలిసి తెలంగాణ పోలీసు ఉన్నతాధికారుల ఎదుట లొంగిపోయారు. కాగా, ఉమ్మడి వరంగల్ నుంచి ఇంకా ఐదారుగురు మావోయిస్ట్ ఉద్యమంలో ఉన్నట్లు ప్రచారం ఉన్నా.. పోలీసు రికార్డుల్లో మాత్రం లేరు. దీంతో ఉమ్మడి వరంగల్ నుంచి పోలీసు రికార్డుల్లో కీలక నేతగా ఉన్న పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్, సంతోశ్ లొంగుబాటు చివరిదిగా చెబుతున్నారు. అజ్ఞాత మావోయిస్టుల జాబితాలో ఉన్న నరహరి జనజీవన స్రవంతిలో కలవడంతో నక్సల్స్ రహిత జిల్లాగా మారిందంటున్నారు. జనజీవన స్రవంతిలోకి మావోయిస్ట్ అగ్రనేత నరహరి అలియాస్ విశ్వనాథ్ పార్టీ మెంబర్ నుంచి కేంద్ర కమిటీ సభ్యుడి వరకు.. నాలుగున్నర దశాబ్దాలపాటు ఉద్యమంలో పనిచేసిన అనుభవం జార్ఖండ్ ఇన్చార్జ్గా పనిచేసి లొంగిపోయిన నేత -
భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి
జనగామ: జిల్లావ్యాప్తంగా మంగళవారం హనుమాన్ జయంతి భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా జరిగాయి. భక్తులు భారీ సంఖ్యలో ఆలయాలకు చేరుకోగా, అర్చకులు చందన సమర్పణ, 108 తమలపాకులు, వడలతో స్వామి అలంకరణ, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీ మూలభావి శ్రీ హనుమత్ రామనాథ సహిత శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు మోహన్ కృష్ణ భార్గవ ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. శ్రీ సంతోషిమాత గణేష్ స్ట్రీట్, గుండ్లగడ్డ, హౌసింగ్ బోర్డ్ కాలనీ, గీతాశ్రమం, కురుమవాడ, గిర్నిగడ్డ, అంబేద్కర్ నగర్, బాణాపురం సహా పలు ప్రాంతాల ఆంజనేయ స్వామి ఆలయాల్లో ప్రధాన అర్చకులు శ్రీనివాస శర్మ, గంగు సాంబమూర్తి శర్మ నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల దీక్ష, అరమండల దీక్షలో భాగంగా నియమ నిష్ఠలతో మాల ధరించిన స్వాములు మాలవిరమణ చేశారు. -
విద్యాభివృద్ధిపై నేడు సదస్సులు
జనగామ: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లాలోని మూడు నియోజకవర్గ కేంద్రాల్లో నేడు(బుధవారం) సర్పంచ్‌లు, మున్సిపల్ కౌన్సిలర్లకు ఒక్కరోజు అవగాహన సదస్సులను నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ సిద్ధమైంది. పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి, విద్యార్థుల నమోదు పెంపు, డ్రాపవుట్ తగ్గింపు, బడిబాటలో ప్రజాప్రతినిధుల పాత్ర వంటి ప్రధాన అంశాలపై ఈ సదస్సుల్లో మార్గదర్శకత్వం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఎంఈఓలు, ఉపాధ్యాయులు గ్రామాల వారీగా మంగళవారం సర్పంచ్‌లు, కౌన్సిలర్లకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. నియోజకవర్గాల వారీగా.. జనగామ నియోజకవర్గానికి సంబంధించిన సదస్సు జిల్లా కేంద్రం సిద్దిపేట రోడ్డులోని శామీర్‌పేట శివారు రమాదేవి ఫంక్షన్ హాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. జనగామ, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల మండలాల ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొనాలి. స్టేషన్‌న్‌ఘన్‌పూర్ నియోజకవర్గ సదస్సు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. స్టేషన్ ఘన్పూర్, చిల్పూరు, జఫర్‌గఢ్, రఘునాథపల్లి, లింగాలఘణపురం మండలాల సర్పంచ్‌లు, కౌన్సిలర్లు హాజరవ్వాలి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య పాల్గొననున్నారు. పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని సదస్సు దర్థెపల్లి రోడ్డులోని విన్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించనున్నారు. పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల సర్పంచ్‌లు ఈ అవగా హన సమావేశానికి హాజరు కానున్నారు. విద్యారంగం పురోగతి, బడిబాట పటిష్టం, విద్యార్థుల సంఖ్య పెంపు దిశగా ఈ సదస్సులు కీలకంగా ఉపయోగపడతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. నియోజకవర్గస్థాయిలో సర్పంచ్, కౌన్సిలర్లకు అవగాహన విద్యాప్రగతిలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ‘స్టేషన్’ సదస్సుకు హాజరుకానున్న ఎమ్మెల్యే కడియం, ఎంపీ కావ్య -
పాలిసెట్‌కు సర్వం సిద్ధం
జనగామ: రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నిర్వహించనున్న పాలిసెట్–2026 ప్రవేశ పరీక్షకు జిల్లాలో సర్వం సిద్ధం చేశారు. ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం ప్రతీ సంవత్సరం నిర్వహించే ఈ పరీక్షకు భారీ సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేయడంతో జిల్లాలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని పరీక్ష కేంద్రాల్లో పర్యవేక్షణ బృందాలు, అవసరమైన సిబ్బందిని నియమించారు. జిల్లాలో ఈ సంవత్సరం 1,615 మంది విద్యార్థులు పాలిసెట్‌కు హాజరుకానున్నారు. వీరి కోసం అధికారులు ఆరు కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టణంలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు సెంటర్లు(ఏ,బీ) ఏర్పాటు చేయగా, ఇక్కడ ఒక్కో కేంద్రంలో 300 మంది చొప్పున మొత్తం 600 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. జనగామ మండలంలోని యశ్వంతాపూర్ క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో సైతం మరో రెండు సెంటర్లు (ఏ,బీ) ఏర్పాటు చేశారు. సెంటర్– ఏలో 288 మంది, సెంటర్– బీలో 260 మంది విద్యార్థులను కేటాయించారు. స్టేషన్ ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ సెంటర్లో 300 మంది, ప్రభుత్వ జూనియర్ కళాశాల సెంటర్లో 167 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాబోతున్నారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో తాగునీరు, టెంట్లు, వైద్య సదుపాయం, భద్రతా ఏర్పాట్లు కల్పించడంతో పాటు సీసీ కెమెరాలతో పోలీసులు పకడ్బందీ పర్యవేక్షణ చేయనున్నారు. పరీక్ష ఉదయం 11 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1.30 గంటలకు ముగుస్తుంది. విద్యార్థులు ఉదయం 10 గంటల కల్లా గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 11 గంటల తర్వాత గేట్లు క్లోజ్ చేసి నిమిషం ఆలస్యమైనా ఎవరినీ లోపలికి అనుమతించరు. పరీక్షకు సంబంధించి విద్యార్థులు హాల్‌టికెట్‌తో పాటు హెచ్‌బీ బ్లాక్ పెన్సిల్, బ్లూ లేదా బ్లాక్ బాల్‌పెన్ తప్పనిసరిగా తీసుకురావాలి. మొబైల్ ఫోన్లు, కాలిక్యులేటర్లు, స్మార్ట్ డివైస్‌లు పూర్తిగా నిషేధమని అధికారులు వెల్లడించారు. జిల్లా విద్యాశాఖ, పోలీసు శాఖ కలిసి ప్రత్యేక బృందాలను మోహరించనున్నారు. ట్రాఫిక్ నియంత్రణ నుంచి పరీక్ష కేంద్రాల వద్ద శాంతిభద్రతల వరకు అన్ని చర్యలు చేపట్టనున్నారు. విద్యార్థుల కోసం హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసి సందేహాలు నివృత్తి చేయనున్నారు. పాలిసెట్–2026 ఎంట్రెన్స్‌ను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. హాల్ టికెట్‌పై విద్యార్థి ఫొటో ముద్రణ జరగకుండా వచ్చినట్లైతే పాస్‌ఫొటోతో పాటు గుర్తింపుగా ఆధార్ కార్డును తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని అధికారులు సూచనలు చేశారు. జిల్లాలో సెంటర్ల వారీగా వివరాలు: 6 సెంటర్లు..హాజరుకానున్న 1,615 మంది విద్యార్థులు ఉదయం 11 గంటలకు గేట్లు మూసివేత నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సిద్దిపేట రోడ్డు: (సెంటర్– ఏ): 300మంది ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సిద్దిపేట రోడ్డు: (సెంటర్– బీ): 300మంది క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాల(సీజేఐటీ), యశ్వంతాపూర్(సెంటర్– ఏ): 288మంది క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాల(సీజేఐటీ), యశ్వంతాపూర్ (సెంటర్– బీ): 260మంది ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్, స్టేషన్ ఘన్పూర్: 300మంది ప్రభుత్వ జూనియర్ కళాశాల, స్టేషన్ ఘన్పూర్: 167మందిపాలిసెట్–2026 కోసం జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశాం. 1,615 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. పరీక్ష 11 గంటలకు ప్రారంభమవుతుంది. విద్యార్థులను ఉదయం 10 గంటల నుంచి లోపలికి అనుమతిస్తాం. సరిగ్గా 11 గంటలకు గేట్లు క్లోజ్ చేసిన తర్వాత, ఎవరినీ కూడా లోనికి అనుమతించం. –శ్రీనివాస్, డిస్ట్రిక్ కో ఆర్డినేటర్, ఏబీవీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ -
కొనుగోళ్లపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
● వీసీలో సీఎం రేవంత్‌రెడ్డి జనగామ: ధాన్యం, మక్కల కొనుగోళ్లలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లపై మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వీసీ అనంతరం సంబంధిత అధికారులతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు.. ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలను తప్పకుండా పాటిస్తూ, ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి సమస్యలు రాకుండా, రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రతీ అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. టోకెన్ పద్ధతి ప్రకారం తేమ శాతం రాగానే కొనుగోళ్లు చేపట్టి, అదే రోజూ ట్యాగ్ చేసిన మిల్లులకు ధాన్యాన్ని తరలించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, జెడ్పీ సీఈఓ, ఇన్చార్జ్ డీఆర్డీఓ రంగారావు, పౌర సరఫరాల సంస్థ డీఎం హతీరాం, సహకార శాఖ అధికారి కోదండరాములు, జిల్లా మార్కెటింగ్ అధికారి రామకృష్ణ, ఇన్చార్జ్ డీసీఎస్ఓ సురేష్ రెడ్డి, ఏపీడీ నూరొద్దీన్, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్‌గౌడ్, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పామాయిల్ తోటలో అగ్నిప్రమాదంరఘునాథపల్లి: మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ వెనకాల మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో పది ఎకరాల పామాయిల్ తోటలు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో డ్రిప్ పరికరాలు కూడా కాలిపోయాయి. హన్మకొండకు చెందిన అరుకొండ శ్రీధర్ మూడేళ్ల క్రితం ఏడున్నర ఎకరాల్లో పామాయిల్ తోట సాగు చేశారు. తోట కాపునకు వచ్చే తరుణంలో అటు వైపు వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు బీడి తాగి ఆర్పకుండా విసరడంతో తోటలోని గడ్డికి మంటలు అంటుకున్నాయి. మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా తోట చుట్టూ పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. అదే విధంగా పక్కనే ఉన్న హన్మకొండకు చెందిన వెంకటేశ్వర్లు, ప్రభాకర్‌కు చెందిన మూడు ఎకరాల పామాయిల్ తోటలకు కూడా మంటలు అంటుకున్నాయి. ముగ్గురికి చెందిన పది ఎకరాల్లో డ్రిప్ పరికరాలు కాలిపోయాయి. మంటలను గుర్తించిన పోలీసులు వెంటనే స్థానికుల సహకారంతో పచ్చని చెట్ల కొమ్మలతో శ్రమించి మంటలను ఆర్పారు. అప్పటికే పామాయిల్ తోటలు దగ్ధమై రైతులకు తీవ్ర నష్టం జరిగినట్లు సమాచారం. ‘బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలి’జనగామ రూరల్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని ప్రజాత్రంత మహిళా సంఘం, డీవైఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్ వద్ద మంగళవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి ఇర్రి అహల్య, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బోడ నరేందర్ మాట్లాడుతూ.. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన బండి భగీరథ్‌పై పోక్సో కేసు పెట్టి నాలుగు రోజులైనా ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడం దారుణమన్నారు. దీనిపై బీజేపీ మహిళా మోర్చా నాయకురాళ్లు స్పందించాలన్నారు. డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ధర్మభిక్షం, ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి మోకు భవాని, ఎర్ర అనిత, కొండ వరలక్ష్మి, మమత, కనకచారి, విప్లవ, సాత్విక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నైపుణ్యాలు పెంచుకోవాలికేయూ క్యాంపస్: పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాలు పెంచుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి అన్నారు. మంగళవారం కేయూలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ సెమినార్ హాల్లో ప్లేస్మెంట్ సెల్, మేజిక్ బస్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన జాబ్ మేళాలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచం మొత్తం భారత్‌వైపు చూస్తోందన్నారు. కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా విద్యార్థులు ప్రత్యేక నైపుణ్యాలు పెంపొందించుకోవాలన్నారు. కేయూ ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ చిర్రరాజు మాట్లాడారు. ఈజాబ్ మేళాలో 12 ప్రముఖ సంస్థలు పాల్గొనగా విద్యార్థులు హాజరయ్యారు. -
ధాన్యం దిగుమతిలో జాప్యం చేయొద్దు
జనగామ: ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని దిగుమతి చేసుకునేందుకు రైస్‌మిల్లర్లు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ధాన్యం సేకరణలో భాగంగా మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యం జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. అవసరమైతే అదనపు హమాలీలను ఏర్పాటు చేసుకొని, దిగుమతిలో వేగం పెంచాలన్నారు. ధాన్యం బస్తాల రవాణా విషయంలో స్పందించని లారీ డ్రైవర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. పౌరసరఫరాల సంస్థ డీఎం హతీరామ్, జిల్లా మార్కెటింగ్ అధికారి రామకృష్ణ, ఇన్చార్జ్ డీసీ ఎస్ఓ సురేష్‌రెడ్డి, ఏపీడీ నూరొద్దీన్, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. ఎస్ఐఆర్ మ్యాపింగ్‌పై దృష్టి సారించాలి ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా తాజా ఓటరు జాబితాను ఎస్ఐఆర్ జాబితాతో మ్యాపింగ్ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి ఆర్డీఓ, తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియలో జిల్లా రాష్ట్ర స్థాయిలో ముందంజలో ఉందని, ఈ మేరకు వారం రోజుల్లోగా 90 శాతానికి చేరుకోవాలన్నారు. ఆర్డీఓ గోపీరాం, జనగామ, చేర్యాల, ధర్మసాగర్, సిద్దిపేట తహసీల్దార్లు పాల్గొన్నారు. పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలి భూ భారతిలో వివిధ మాడ్యూల్స్‌లోని సక్సెషన్, మ్యుటేషన్, ఖాతా సమీకరణ, డేటా కరెక్షన్, అర్బన్ ల్యాండ్, కోర్టు కేసులు, జీపీపీ, పీపీబీ, నాలా తదితర పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. భూ భారతి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించాలి రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు చేపట్టడంతో పాటు భద్రత ప్రమాణాలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. కలెక్టరేట్లో డీసీపీ రాజమహేంద్ర నాయక్‌తో కలిసి కలెక్టర్ రహదారి భద్రత, మత్తు పదార్థాల నియంత్రణపై ఎకై ్సజ్, పోలీసు, వైద్య శాఖ అధికారులతో వేర్వేరుగా ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా పరిధిలోని రెండు నేషనల్ హైవేలపై అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలన్నారు. ప్రధాన రహదారులపై వీధి వ్యాపారాలు లేకుండా వారి కోసం ప్రత్యేక వెండింగ్ జోన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ఇన్చార్జ్ ఆర్అండ్బీ ఈఈ సరిత, డీటీఓ శ్రీనివాస్‌గౌడ్, ఎకై ్సజ్ అధికారి అనిత, డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లికార్జునరావు, ఆర్టీఏ మెంబర్ అభిగౌడ్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, నేషనల్ హైవేస్, పోలీసు అధికారులు పాల్గొన్నారు. మత్తు పదార్థాల నియంత్రణకు చర్యలు జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైల్వేస్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ పరిధిలో మత్తు పదార్థాల నియంత్రణపై విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రైతులకు ఇబ్బందులు సృష్టిస్తే కఠిన చర్యలు సమీక్షలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
ఆలకించి..ఆదేశించి
జనగామ రూరల్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అర్జీదారులు పోటెత్తారు. ఈసందర్భంగా ప్రజల సమస్యలను విని వారి నుంచి 190 దరఖాస్తులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజావాణిలో వివిధ సమస్యలతో వచ్చే ప్రజల అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, జెడ్పీ సీఈఓ రంగారావు, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, సీపీఓ చినకోట్యానాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ ప్రజల నుంచి 190 దరఖాస్తుల స్వీకరణ -
ఈ–ఆఫీసులోనే అన్ని రికార్డులు
జనగామ: జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని డీఈఓ కార్యాలయాన్ని కలెక్టర్, విద్యాశాఖ అధికారి సందీప్ కుమార్ ఝా సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అన్ని సెక్షన్లను కలెక్టర్ పరిశీలించారు. సిబ్బంది పనితీరు, సెక్షన్న్వారీ ఫైళ్ల నిర్వహణ విధానం, రికార్డు క్రమబద్ధీకరణపై ఆరా తీశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇకపై కార్యాలయంలో భౌతిక (ఫిజికల్) ఫైళ్ల నిర్వహణకు పూర్తిగా స్వస్తి పలకాలని స్పష్టం చేశారు. అన్ని ఫైళ్లను ఈ–ఆఫీస్‌లోనే డిజిటల్ విధానంలో నిర్వహించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల భవిష్యత్‌కు నాణ్యమైన విద్యే బాట బచ్చన్నపేట: విద్యార్థుల భవిష్యత్‌కు నాణ్యమైన విద్యే బాట అని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈనెల 11 నుంచి 17 వరకు చేపట్టిన విద్యా వారోత్సవాల సందర్భంగా సోమవారం మండల కేంద్రంలోని కేజీబీవీలో నిర్వహిస్తోన్న వేసవి శిబిరాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా శిబిరంలో పాల్గొన్న బాలికలతో కలెక్టర్ ఆప్యాయంగా ముచ్చటించారు. కార్యక్రమంలో జీసీడీఓ గౌసియా బేగం, స్పెషలాఫీసర్ నారమల్ల గీత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. డీఈఓ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ -
మైనింగ్‌కు ఊతం!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రభుత్వం మైనర్ ఖనిజ బ్లాకుల వేలం విధానంలో కొత్త మార్గదర్శకాలకు శ్రీకారం చుట్టింది. ఖనిజాల తవ్వకాల్లో పారదర్శకత, ఆదాయం పెంపు లక్ష్యంగా హైబ్రిడ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. పూర్తిగా ఆన్లైన్లోనే వేలం ప్రక్రియ ద్వారా ఖనిజాల లీజులు కేటాయించనున్నారు. ఈమేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎన్.శ్రీధర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మైనింగ్ రంగానికి ఊతమివ్వనున్నాయి. ముఖ్యంగా గ్రానైట్, స్టోన్ మెటల్, బ్లాక్ గ్రానైట్, రోడ్ మెటల్, మట్టి, ఇసుక వంటి ఖనిజాల తవ్వకాల్లో కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే వందల సంఖ్యలో లీజులు.. ఉమ్మడి వరంగల్‌లో ఇప్పటికే వందల సంఖ్యలో లీజులు ఉన్నాయి. వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అధికంగా క్వారీలు ఉన్నాయి. మైన్స్ అండ్ జియాలజీ శాఖ అంచనాల ప్రకారం ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల పరిధిలో ప్రస్తుతం చిన్నా, పెద్దవి కలిపి సుమారు 250కు పైగా మైనింగ్, క్వారీ లీజులు అమలులో ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో అధిక భాగం స్టోన్ మెటల్, రోడ్ మెటల్ యూనిట్లు, గ్రానైట్ తవ్వకాలు, బ్రిక్ ఎర్త్, మట్టి క్వారీలు, ఇసుక రీచ్‌లు ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అటవీ ప్రాంతాలు, కొండ ప్రాంతాలు అధికంగా ఉండండంతో గ్రానైట్, స్టోన్ మెటల్ క్వారీల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పట్టాదారులకు తీపి కబురు ఇకపై మైనర్ ఖనిజాల వేలం మొత్తం ఆన్లైన్లోనే జరగనుంది. బిడ్డింగ్ నుంచి లీజు కేటాయింపు వరకు ప్రతీ దశ డిజిటల్ విధానంలో ఉండడంతో అక్రమాలు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కనీసం ముగ్గురు బిడ్డర్లు తప్పనిసరి చేయడం ద్వారా పోటీ పెరిగి ప్రభుత్వానికి అధిక ఆదాయం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, పట్టా భూముల్లో ఖనిజ తవ్వకాలకు అంగీకరించిన భూ యజమానులకు ప్రభుత్వం అదనపు సొమ్ము చెల్లించనుంది. గ్రానైట్, మార్బుల్ మినహా ఇతర ఖనిజాలకు సీనియరేజ్ ఫీజులో 10 శాతం, గ్రానైట్, మార్బుల్‌కు 5 శాతం పెంచనున్నారు. ఈ నిర్ణయం వల్ల జిల్లాలోని ప్రైవేట్ భూముల్లో కొత్త క్వారీలకు భూ యజమానులు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా భావిస్తున్నారు. రాయల్టీ పెరిగే అవకాశం.. కొత్త వేలం విధానం అమలైతే ఉమ్మడి వరంగల్‌లో ఖనిజ ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సుమారుగా ఏటా రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు వస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం నిర్మాణ రంగం వేగంగా విస్తరిస్తుండడంతో రోడ్ మెటల్, స్టోన్ మెటల్, గ్రానైట్‌కు డిమాండ్ పెరుగుతోంది. కొత్త లీజులు మంజూరైతే ప్రభుత్వానికి రూ.25–30 కోట్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని మైనింగ్ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మైనర్ ఖనిజాల వేలంలో భారీ మార్పులు హైబ్రిడ్ విధానానికి సర్కారు గ్రీన్‌సిగ్నల్ పూర్తిగా ఆన్లైన్లోనే వేలం ప్రక్రియ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్త లీజులు గ్రానైట్, స్టోన్ మెటల్, ఇసుక క్వారీలపై ఫోకస్ 40–60 కొత్త లీజులకు అవకాశం? ఇప్పటి వరకు పర్యావరణ, కాలుష్య నియంత్రణ అనుమతులు లేక వేలం జరగని అనేక ఖనిజ బ్లాకులు కొత్త ‘హైబ్రిడ్ విధానం’ ద్వారా వేలంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి వరంగల్‌లోనే మరో 40 నుంచి 60 వరకు కొత్త మైనింగ్ లీజులు, క్వారీ బ్లాకులు వేలానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని మైనింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మహబూబాబాద్‌లో బ్లాక్ గ్రాౖ నెట్, భూపాలపల్లిలో రోడ్ మెటల్, ములుగులో స్టోన్ క్వారీలు, వరంగల్, హనుమకొండ పరిసరాల్లో నిర్మాణ రంగానికి అవసరమైన మెటల్ క్వారీలు అధికం. కాగా, ఆయా జిల్లాల్లో కొత్త విధానంతో వేగంగా అనుమతులు పొందే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. -
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
జనగామ రూరల్: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాటు పూర్తి చేసినట్లు డీఐఈఓ కె.జి తేందర్ రెడ్డి అన్నారు. సోమవారం డీఐఈఓ ఆధ్వర్యంలో సోమవారం చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంట్ అధికారుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా వారు మా ట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 12 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారని తెలిపారు. జిల్లా కేంద్రంలో 5 సెంటర్లు ఉన్నాయని, నర్మెటలో 1, స్టేషన్ ఘన్‌పూర్‌లో 2, జఫర్‌గఢ్‌లో 1 కొడకండ్లలో 1, దేవరుప్పులలో 1, పాలకుర్తిలో 1 పరీ క్ష కేంద్రాలు ఉన్నాయన్నారు. జిల్లావ్యాప్తంగా మొదటి సంవత్సరంలో జనరల్ విద్యార్థులు 1,966 మంది, ఒకేషనల్ విద్యార్థులు 372మంది, మొత్తం 2,338 మంది ఉన్నారన్నారు. రెండో సంవత్సరం జనరల్ విద్యార్థులు 957 మంది, ఒకేషనల్ విద్యార్థులు 302మంది మొత్తం 1,259మంది పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. సమావేశంలో డెక్ సభ్యురాలు సునంద, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా చిట్యాల శ్వేతపాలకుర్తి టౌన్: రాష్ట్ర మహిళ కమిషన్ సభ్యురాలిగా మండల కేంద్రానికి చెందిన తెలంగాణ రైతాంగ సాయుఽఽధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనువరాలు చిట్యాల శ్వేతను నియమిస్తున్న సోమవారం ప్రభుత్వం ఉత్తర్యులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని కోఠిలోని మహిళ విశ్వవిద్యాలయానికి తెలంగాణ సాయుఽధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఐలమ్మ మనవరాలు శ్వేతను మహిళ కమిషన్ సభ్యురాలుగా నియమించడంపై అమె ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ కళాశాలలో విద్యా వారోత్సవాలుస్టేషన్ఘన్పూర్: ఘన్పూర్ ప్రభుత్వ జూని యర్ కళాశాలలో సోమవారం విద్యావారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్‌కుమార్ కళాశాలలో తెలంగాణ ప్రభుత్వం, ఇంటర్ విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గదులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కళాశాలకు సంబంధించి ఏ సమస్యలున్నా పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ చేశారు. కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ కమలాకర్, అధ్యాపకులు నరేందర్‌రావు, లావణ్య, శ్వేత, రాంబాబు, రాజీవ్, సహజ, సంతోష, థామస్, రమేశ్, స్రవంతి, ప్రేమ్, సౌందర్య, నరేష్, ప్రదీప్ పాల్గొన్నారు. రేపటి నుంచి కాకతీయ కళల జాతరనయీంనగర్: కాకతీయ కళల జాతర ఈ నెల 13, 15, 17 తేదీల్లో నిర్వహించనున్నట్లు చేతన కళావేదిక వ్యవస్థాపకుడు, పూర్వ ఫిలిం సెన్సార్‌బోర్డ్ మెంబర్, రచయిత గాయకుడు ఆకుల నాగేశ్వర్ తెలిపారు. హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వెయ్యేళ్ల ఘన చరిత్ర కలిగిన కాకతీయ రాజుల పరిపాలన విశిష్టత, గొలుసుకట్టు చెరువుల నిర్మాణం వంటి అంశాలు, భారతదేశంలో అత్యంత ప్రాచీన నగరమైన ఓరుగల్లు కళలకు పుట్టినిల్లు, పేరిణి, జానపదాలకు నిలయమన్నారు. కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించనున్న మొదటి రోజు కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, మంత్రి సీతక్క, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, శాసనమండలి ఉపసభాపతి బండ ప్రకాశ్ హాజరవుతారన్నారు. అనంతరం కళల జాతర పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో సహ కార్యనిర్వాహకుడు గోకారపు శ్యాంకుమార్, బూరం ప్రశాంత్, నిర్వాహకులు మచ్చ రాజు, గాయకులు శివ, రాజేశ్, సునీల్ రావు, శ్రీనివాస్ రెడ్డి తదితరలు పాల్గొన్నారు. ఇంటర్ అడ్మిషన్లకు షెడ్యూల్ విడుదలవిద్యారణ్యపురి: అన్ని యాజమాన్యాల పరిధిలోని జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు సోమవారం ఇంటర్ బోర్డు షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, వివిధ గురుకులాల్లోనూ ప్రవేశాలు కల్పించనున్నారు. జూన్ 1 నుంచి తరగతులు.. మొదటి దశ ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఈనెల 12 నుంచి అడ్మిషన్ల ప్రక్రి య ప్రారంభం కానుంది. జూనియర్ కళాశాలల్లో 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ 1 నుంచి విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నాయి. మొదటి దశ అడ్మిషన్ల ప్రక్రియ జూన్ 30 వరకు పూర్తిచేయాల్సి ఉంటుంది. -
మా కష్టానికి విలువేది?
జనగామ: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు పరిధి కాటన్ యార్డులో ఏర్పాటు చేసిన ఐకేపీ, మెప్మా ధాన్యం కొనుగోలు సెంటర్ల వద్ద సోమవారం రైతులు ఆందోళనకు దిగారు. రెండు రోజుల క్రితం కురిసిన అకాల వర్షాలు రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. వందలాది బస్తాల ధాన్యం తడిసిపోయింది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన స్వల్ప వరద ప్రవాహంతో గింజలు కొట్టుకుపోయి నష్టం వాటిల్లింది. ఈ పరిణామాల నేపథ్యంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు ఆర్డీఓ గోపిరాం ఐకేపీ, మెప్మా సెంటర్లను సందర్శించారు. రైతుల వద్దకు వెళ్లి సమస్యను అడిగి తెలుసుకున్నారు. నెల రోజుల నుంచి ధాన్యం అమ్ముకోలేక, ఇప్పటికే అమ్మిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆర్డీఓకు ఆవేదన వెళ్లగక్కారు. ఆర్డీఓ వాహనానికి రైతులు అడ్డంగా నిలవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆయన నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ విఫలమవడంతో పరిశీలన పూర్తిచేసుకుని బయలుదేరే సమయంలో ఆర్డీఓ వాహనాన్ని అడ్డుకున్నారు. సెంటర్ల నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఆర్డీఓ బైక్‌పై వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో తేమశాతం ఎక్కువగా ఉన్న ధాన్యాన్ని మిల్లుకు తీసుకు వెళ్లాలని ఓ లారీ డ్రైవర్‌ను కోరగా, అందుకు ఆయన నిరాకరించారు. తడిసిన ధాన్యం తీసుకెళ్తే రోజుల తరబడి దిగుమతి కావడం లేదని, దీంతో ఈఎంఐలు కట్టలేకపోతున్నామని లారీ డ్రైవర్ అబ్దుల్ బషీర్ లారీ పైకి ఎక్కి ఉరి వేసుకొనేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఓ హమాలీ కార్మికుడు ధైర్యం చేసి డ్రైవర్‌ను కాపాడారు. తేమ తగ్గి నష్టం పెరిగింది ప్రభుత్వ నిబంధనల ప్రకారం 17 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సి ఉన్నప్పటికీ, సెంటర్లలో పరిస్థితి పూర్తిగా విరుద్ధంగా ఉందని రైతులు వాపోయారు. 15 నుంచి 30 రోజులుగా కొనుగోలు సెంటర్లలో ధాన్యం పేరుకుపోవడంతో తేమ 8 శాతానికి పడిపోయిందని, తేమ తగ్గుదలతో ఒక్కో రైతుకు భారీ నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే పూర్తిగా దిగుబడి తగ్గిపోయే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తరచుగా వచ్చే గాలివానలు, అడపాదడపా వర్షాలు ధాన్యాన్ని మరింత నష్టపరుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైస్ మిల్లుల్లో కోతలు.. సెంటర్ల నుంచి రైస్ మిల్లులకు తరలించిన ధాన్యంపై అన్యాయమైన కోతలు వేస్తున్నారని రైతులు ఆరోపించారు. చీటకోడూరు రూట్లోని సోమేశ్వర రైస్ మిల్లుకు 8శాతంతో ఉన్న ధాన్యం తీసుకెళ్తే తాలు పేరుతో 40 కిలోల వరకు కోత విధించారని రైతు గన్నెబోయిన సారయ్య ఆర్డీఓ ఎదుటే గోడును వెల్లబోసుకున్నాడు. ఇప్పటివరకు కొనుగోలు చేసిన 10 వేల బస్తాలను తరలించాల్సి ఉండగా, మరో 10 వేల బస్తాలు కొనుగోలుకు సిద్ధంగా ఉన్నాయని మెప్మా సెంటర్ ఇన్చార్జ్ రేణుక తెలిపారు. కాంటా వేసిన 2,500 బస్తాలను మిల్లులకు తరలించాల్సి ఉండగా, మరో 15 వేల బస్తాలు కళ్లాల్లోనే పేరుకుపోయాయని ఐకేపీ ఇన్చార్జ్ అనిత తెలిపారు. రైతుల కన్నీటి పర్యంతం రోజువారీ పనులు వదిలి నెల రోజులుగా కొనుగోలు సెంటర్ల వద్దే గడుపుతున్నామని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. వర్షం వస్తే బస్తాలను కిందకు, మీదకు మార్చమని చెప్పి తమను ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. అమ్ముకున్న సరుకు మిల్లుకు వెళ్లే వరకు తమనే కాపలా పెడుతున్నారని మండిపడ్డారు. తమ కష్టానికి విలువ లేదని, తేమ పెరిగిందంటూ మిల్లర్లు కోతలు వేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంటర్లలో సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ రైతులకు హామీ ఇచ్చినప్పటికీ, రైతుల ఆవేదన మాత్రం తీరలేదు. జనగామ యార్డులో కొనుగోళ్లు సజావుగా సాగేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలంటూ వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆర్డీఓ సందర్శన.. వాహనం అడ్డగించిన అన్నదాతలు కళ్లాల్లో పేరుకుపోయిన వేలాది ధాన్యం బస్తాలు మిల్లులకు తరలించడంలో జాప్యంతో ఇక్కట్లు -
బండి సంజయ్ రాజీనామా చేయాల్సిందే
జనగామ: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై వచ్చిన తీవ్రమైన ఆరోపణలను బీజేపీ నిర్లక్ష్యంగా తీసుకోవడం ఆందోళనకరమని డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి లక్ష్మినారాయణనాయక్ అన్నారు. సోమవారం డీసీసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు..బండి సంజయ్‌కి నీతి, నిజాయితీ, ఉంటే ఎంపీ, మంత్రి పదవులకు రాజీనామా చేసి విచారణకు సహకరించాలని డిమాండ్ చేశారు. మైనర్‌ను ఫాంహౌస్‌కు రప్పించి, కూల్‌డ్రింక్స్‌లో మత్తు పదార్థాలు కలిపి భగీరథ లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలు చిన్నవేమీ కావన్నారు. దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు, ప్రజాస్వామ్య వాదులు ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ బీజేపీ నేతలు నిశ్శబ్దం పాటించడం మహిళల భద్రతపై వారి అసలు వైఖరి బయటపడుతుందని విమర్శించారు. సమావేశంలో మాజీ మున్సిపల్, మార్కెట్ చైర్మన్లు వేమెళ్ల సత్యనా రాయణరెడ్డి, ఎర్రమల్ల సుధాకర్ తదితరులు ఉన్నారు.డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి -
నేడు హనుమాన్ జయంతి
జనగామ: జిల్లా వ్యాప్తంగా మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలకు ఆలయాలు సిద్ధమయ్యాయి. జిల్లా కేంద్రంలోని మూలబావి శ్రీ ఆంజనేయస్వామి ఆలయంతో పాటు హౌసింగ్ బోర్డు, గణేష్ స్ట్రీట్, గుండ్లగడ్డ, గిర్నిగడ్డ, గీతానగర్, తది తర ఆలయాల్లో ప్రత్యేక పూజల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. బచ్చన్నపేట, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్, రఘునాథపల్లి, లింగాలఘణపురం, దేవరప్పుల, చిల్పూరు, జఫర్‌గఢ్, నర్మెట, తరిగొప్పుల, కొడకండ్ల మండలాల్లోని దేవస్థానాల్లో హనుమంతుడి జయంతిని ఘనంగా నిర్వహించనున్నారు. భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండడంతో పోలీసు, ఆలయ కమిటీలు, స్థానిక వలంటీర్లు కలిసి చర్యలను తీసుకుంటున్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని జనగామ పట్టణానికి చెందిన కొత్తపల్లి శ్రీలత బియ్యం గింజలపై హనుమాన్ చాలీసా రాసి భక్తిని చాటుకున్నారు. గణేష్ స్ట్రీట్‌లోని హనుమాన్ ఆలయంబియ్యం గింజలపై హనుమాన్ చాలీసా -
మేడారంలో భక్తుల సందడి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం వేల సంఖ్యలో తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు ప్రైవేట్ వాహనాల్లో తరలివచ్చారు. జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద షెవర్ కింద స్నానాలు ఆచరించారు. అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఎత్తు బంగారం, ఒడిబియ్యం, పూలు, పండ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజులకు పూజలు చేశారు. మొక్కుల అనంతరం మేడారం పరిసరాల్లో చెట్ల కింద విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. దేవాదాయశాఖ జూనియర్ అసిస్టెంట్లు జగదీశ్వర్, మధు, రామదేవి భక్తులకు సేవలందించారు. రేపటినుంచి కేడీసీలో ఉచిత కోచింగ్ విద్యారణ్యపురి : వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీపీజీఈటీ పరీక్షకు ఉచిత శిక్షణను హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇవ్వనున్నట్లు ప్రిన్సిపాల్ గుర్రం శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. ఈ ఉచిత కోచింగ్‌ను ఈనెల 12 నుంచి ప్రారంభించినున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి ఏటా కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో 40 రోజుల ఉచిత శిక్షణను నిర్వహిస్తున్నట్లు కెమిస్ట్రీ విభాగం అధిపతి ప్రొఫెసర్ వాసం శ్రీనివాస్ తెలిపారు. ఈ సారి కెమిస్ట్రీ సబ్జెక్టుతోపాటు ఇంగ్లిష్, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్, బాటనీ, కామర్స్, మైక్రోబయాలజీ సబ్జెక్టులో కూడా పీజీ కోర్సుల్లో ప్రవేశాలకోసం విద్యార్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాస్ వివరించారు. ఆసక్తి గల విద్యార్థులు కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తమ తమ సబ్జెక్టు విభాగాల అధిపతులను ఇతర వివరాలకు పీజీ కోఆర్డినేటర్‌ను సంప్రదించాలని ప్రిన్సిపాల్ శ్రీనివాస్ కోరారు. అంతర్జాతీయ సదస్సుకు అధ్యాపకుడు ఆదిరెడ్డి కేయూ క్యాంపస్ : అమెరికాలోని ఎరోడెక్స్ రీసెర్చ్ యూనివర్సిటీలో ఈనెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సుకు ఆర్ట్స్అండ్ సైన్స్‌కళాశాల అధ్యాపకుడు, జర్నలిజం విభాగాధిపతి రుక్కిరెడ్డి ఆదిరెడ్డి పాల్గొనబోతున్నారని ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి ఆదివారం తెలిపారు. ఈ సదస్సులో మీడియా అధ్యయనాలు, డిజిటల్ కమ్యూనికేషన్ సమకాలిన జర్నలిజం ధోరణలపై ఆదిరెడ్డి తన పరిశోధన పత్రాన్ని సమర్పించబోతున్నారని ఆమె వెల్లడించారు. ఈమేరకు అంతర్జాతీయ సదస్సుకు రావాలని ఆదిరెడ్డికి ఆహ్వానం అందిందన్నారు. ప్రిన్సిపాల్‌తోపాటు పలువురు అధ్యాపకులు ఆదిరెడ్డిని అభినందించారు. చైల్డ్‌లైన్ సంరక్షణలో ఐదేళ్ల బాలుడుకాళోజీ సెంటర్: హనుమకొండ శిశు గృహానికి ఐదేళ్ల బాలుడిని తరలించినట్లు బాలరక్షక్ చైల్డ్ హెల్ప్‌లైన్ (1098) విభాగం సూపర్ వైజర్ కల్పన తెలిపారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ) నుంచి ఓ మహిళను ఈనెల 9న 108లో ఎంజీఎంకు తరలించారు. అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు రిజర్వ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స అందించారు. అయినా సదరు మహిళ ఆదివారం ఉదయం మృతి చెందింది. మృతురాలి వెంట ఐదు సంవత్సరాల బాలుడు ఉన్నాడు. 1098 ద్వారా చైల్డ్వెల్ఫేర్ అధికారులకు సమాచారం అందించడంతో వారు హనుమకొండలోని శిశు సంరక్షణ కేంద్రంలో అప్పగించారు. హేమాచలక్షేత్రంలో కోలాహలంమంగపేట: మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఈనెల 6వ తేదీతో ముగిసినప్పటికీ భక్తులు భారీగా తరలివస్తున్నారు. స్వయంభు స్వామి వారిని దర్శించుకునేందుకు తరలి వచ్చిన భక్తులతో ఆలయం కోలాహలంగా మారింది. ఆది వారం సెలవు రోజు కావడం, బ్రహ్మోత్సవాల కు రాలేకపోయిన భక్తులతో పాటు ఆలయ ప్రాంగణంలో జరిగిన వివాహాలకు తరలివచ్చిన వారితో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలో సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల్లో దీక్ష విరమణకు వెళ్తున్న ఆంజనేయస్వామి మాలధారులు స్వామివారిని భారీ సంఖ్యలో దర్శించుకున్నారు. -
బడిలో పండగ
నేటినుంచి విద్యావారోత్సవాలు ప్రారంభంజనగామ: విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా నిర్వహిస్తున్న ‘ఎడ్యుకేషన్ వీక్’ కార్యక్రమాలు నేటి(సోమవారం) నుంచి 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు, శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ఆదర్శ, కేజీబీవీ, గురుకుల పాఠశాలల్లో ఈ కార్యక్రమాలు ఉత్సాహంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి రోజు (మే11) పాఠశాల భవనాలు, తాగునీటి సదుపాయాలు, లైటింగ్, బయో టాయిలెట్ల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. అదే రోజు నుంచి మే 25 వరకు పీఎంశ్రీ, కేజీబీవీ పాఠశాలల్లో సమ్మర్ క్యాంపులు నిర్వహించనున్నారు. జిల్లాలో ఉన్నత, ప్రాథమిక, ప్రాథమికోన్నత, గురుకుల పాఠశాలలు సు మారు 600 వరకు ఉండగా, 40వేల మంది పిల్లల వరకు ఉంటారు. విద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలి సమీక్షలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరగబోయే విద్యావారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఈ కార్యక్రమ సన్నాహక ఏర్పాట్లకు సంబంధించి ఆదివారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్, విద్యాశాఖాధికారి సందీప్ కుమార్ ఝా ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో విద్యాశాఖ భాగస్వామ్యం కీలకమన్నారు. పీఎం శ్రీ స్కూల్స్‌లో 15 రోజుల పాటు ఆర్ట్స్, కల్చరల్, డాన్స్ మ్యూజిక్ తదితర రంగాలలో పిల్లలకు సమ్మర్ కోచింగ్ ఇవ్వాలన్నారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల నమోదు పెరిగేలా వారి సహకారాన్ని తీసుకోవాలన్నారు. 10వ తరగతిలో ఫెయిల్ అయిన ప్రభుత్వ, ప్రయివేట్ విద్యార్థులకు కోసం జిల్లా కేంద్రంలోని ధర్మకంచ ప్రభు త్వ ఉన్నత పాఠశాల, దేవరుప్పుల మండలం కామారెడ్డి గూడెంలో ఏ ర్పాటు చేసిన ప్రత్యేక తరగతుల శిబిరంలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు అయ్యేంత వరకు సబ్జెక్ట్‌ల వారీగా సులభమైన పద్ధతుల ద్వారా బోధన చేయాలన్నారు. జున్ 2వ తేదీన జరిగే బడిబాట కార్యక్రమం ద్వారా గ్రామస్థాయిలో సర్పంచ్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి విద్యార్థుల నమోదు గణనీయంగా పెంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యా వారోత్సవాల ముగింపు సమావేశంలో 10వ తరగతి, ఇంటర్ ఫలితాల్లో టాప్ 3 సాధించిన విద్యార్థులకు, జిల్లా స్థాయి క్రీడల్లో ప్రతిభ చూపిన ముగ్గురికి రూ.10 వేల నగదు పురస్కరంతో పాటు సన్మానం చేయాలన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ రెవెన్యూ బెన్ షాలోమ్, స్టేషన్‌ఘన్‌పూర్ ఏసీపీ భీంశర్మ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, డీఐఈఓ జితేంద్ర కుమార్, విద్యాశాఖ కార్యాలయ ఏడీ శ్రీనివాస్, జీసీడీఓ గౌసియా బేగం ఉన్నారు. రోజు వారీ కార్యక్రమాలు11వ తేదీ: తొలి రోజు ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ భవనాలు, తాగునీటి సదుపాయాలు, లైటింగ్, బయోటాయిలెట్ల పరిశుభ్రతపై అధికారులు సమీక్ష నిర్వ హిస్తారు. పీఎంశ్రీ, కేజీబీవీల్లో మే 25 వరకు సమ్మర్ క్యాంపులు నిర్వహించాలి. ఈ శిబిరాల్లో విద్యార్థులకు డ్రాయింగ్, యోగా, క్రీడలు, కళలు, వ్యక్తిత్వ వికాసంపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. 12వ తేదీ: జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి విద్యార్థుల కోసం రిమీడియల్ క్యాంపులు నిర్వహించాలి. పరీక్షల్లో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణతో పాటు పిల్లల సందేహాలకు నివృత్తి చేయాలి. విద్యార్థులకు సబ్జెక్ట్ వారీగా ప్రత్యేక సూచనలు ఇస్తారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 13వ తేదీ: మూడో రోజు సర్పంచులు, ప్రజాప్రతినిధులతో విద్యాభివృద్ధిపై ప్రత్యేక వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు. పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి, విద్యార్థుల నమోదు పెంపు, డ్రాపవుట్ తగ్గింపు వంటి అంశాలపై చర్చించాలి. 14వ తేదీ: బడిబాట కార్యక్రమంతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు (పీటీఎం) నిర్వహించనున్నారు. విద్యార్థుల హాజరు, చదువులో పురోగతి, పాఠశాల అవసరాలపై తల్లిదండ్రులతో చర్చించనున్నారు. కొత్త అడ్మిషన్ల కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలను పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 15వ తేదీ: లైబ్రరీ–ది హార్ట్ ఆఫ్ నాలెడ్జ్ పేరుతో పాఠశాలల్లో పుస్తక ప్రదర్శనలు, బుక్‌టాక్స్, డిజిటల్ క్లాస్రూమ్ ప్రదర్శనలు నిర్వహిస్తారు. విద్యార్థుల్లో పఠనాభిరుచి పెంపొందించేందుకు పుస్తకాల ప్రాధాన్యంపై అవగాహన కల్పించనున్నారు. 16వ తేదీ: విద్యార్థుల ప్రతిభాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ క్రీడాభిరుచి డే నిర్వహించనున్నారు. కళలు, క్రీడలు, యోగా, కరాటే, సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొననున్నారు. 17వ తేదీ: వారం రోజుల పాటు సాగిన ‘ఎడ్యుకేషన్ వీక్’ కార్యక్రమాలు విద్యా విజయోత్సవంతో ముగుస్తాయి. 10వ తరగతి, ఇంటర్, స్కిల్ డెవలప్మెంట్ రంగాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సన్మానించనున్నారు. సర్వం సిద్ధం చేసిన విద్యాశాఖ బడిబాటతో అడ్మిషన్ల పెంపునకు ఊతం విద్యా ప్రమాణాలకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు వేడుకలపై కలెక్టర్ ప్రత్యేక ఫోకస్ -
అకాల వర్షంతో ఆగమాగం
జనగామ: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం రైతులకు తీవ్ర నిరాశ మిగి ల్చింది. ప్రభుత్వ ధాన్యం సెంటర్లలో కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వందలాది బస్తాల ధాన్యం నీటిలో తడిసి రైతులు నష్టాన్ని చవిచూశారు. జనగామ వ్యవసాయ మార్కెట్ పరిధిలోని కాటన్ యార్డుల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ, మెప్మా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వేలాది బస్తాల ధాన్యం గింజలు రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు నిలిచిపోయాయి. కొనుగోళ్లలో ఆలస్యం కావడంతో రైతులు తమ బస్తాలను కంటికి రెప్పలా కాపాడేందుకు సెంటర్ల వద్ద రాత్రింబవళ్లు ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆకస్మికంగా కురిసిన ఆకాల వర్షం రైతుల కష్టాలను రెట్టింపు చేసింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన స్వల్ప వరదతో గింజలు కొట్టుకుపోయి నేలపాలయ్యాయి. వరదలో చిక్కుకున్న ధాన్యాన్ని రక్షించుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడ్డారు. అయితే ముందస్తు జాగ్రత్తగా కొంతమంది రైతులు టార్పాలిన్ కవర్లు కప్పుకోవటంతో నష్టం తప్పింది. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి, తక్షణమే షిఫ్ట్ చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేశారు. పలు గ్రామాల్లో.. జనగామ రూరల్: మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో స్వల్పంగా ధాన్యం తడిసింది. రోజలు తరబడి కోనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం నిల్వలుఉండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాటన్ యార్డు సెంటర్లలో తడిసిన ధాన్యం నీటిలో మునిగిన ధాన్యం.. కొట్టుకుపోయిన గింజలు కొనుగోళ్లలో వేగం పెంచాలని రైతుల వేడుకోలు -
ప్రపంచ యవనికపై వరంగల్ ‘5ఎఫ్’
సాక్షి, వరంగల్/గీసుకొండ: కేంద్రం ఆలోచనలకు అనుగుణంగా 5ఎఫ్ (ఫామ్ టు ఫైబర్.. టు ఫ్యాక్టరీ.. టు ఫ్యాషన్...టు ఫారిన్) దృక్కోణంతో ఓరుగల్లు ఖ్యాతి ప్రపంచానికి తెలిసేలా మరో అడుగు ముందుకు పడింది. పత్తి ఉత్పత్తి నుంచి అంతర్జాతీయ ఎగుమతుల దాకా ఒకే వేదికపై పూర్తి విలువ వ్యవస్థను కల్పించేలా దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును పీఎం మిత్ర (ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపెరల్ పార్కు) పథకం కింద 2023లో ఎంపిక చేశారు. ఈ మేరకు రూ.200 కోట్లతో కూడిన అభివృద్ధి పనులను ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వేదికగా ఆదివారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఇప్పటికే విడుదల చేసిన రూ.30 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టగా, మరో రూ.170 కోట్ల దఫాల వారీగా కేంద్రం రాష్ట్రానికి అందివ్వనుంది. దీంతో పాటు ‘కాంపిటిటివ్ ఇన్సెంటివ్ సపోర్ట్’ కింద రూ.300 కోట్ల వరకు ప్రోత్సాహక మద్దతు ఇవ్వనుండడంతో దేశ, విదేశీ కంపెనీలు ఇక్కడికి క్యూ కట్టే అవకాశం ఉంది. గీసుకొండ, సంగెం మండలాల్లోని శాయంపేట హవేలీలో మొత్తం 1,327 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ పార్కులో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ.1695.54 కోట్ల వ్యయం కాగా, వివిధ మార్గాల ద్వారా రూ.6,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఈ పార్కు ద్వారా 24,400కు పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రారంభోత్సవాన్ని వీక్షించిన కలెక్టర్, అధికారులు పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును పీఎం మోదీ హైదరాబాద్‌లో వర్చ్‌వల్‌గా ప్రారంభించగా ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా కలెక్టర్ సత్యశారద, అధికారులు పార్కు వద్ద వీక్షించారు. ఈ సందర్భంగా టీజీఐఐసీ జోన్ మేనేజర్ స్వామినాయక్ మాట్లాడుతూ కేఎంటీపీ నిర్మాణానికి రూ.1,695 కోట్లను అంచనా వేశారని, వాటిలో సుమారు రూ. 800–900 కోట్ల వరకు పలు అభివృద్ధి పనులు, సదుపాయాల పనులతో పాటు భూ సేకరణ పనులకు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. పత్తి ఉత్పత్తి నుంచి అంతర్జాతీయ ఎగుమతులు ఒకే వేదికపై.. కేఎంటీపీకి పీఎం మిత్ర కింద రూ.200 కోట్లు, సీఐఎస్ కింద రూ.300 కోట్లు వర్చువల్‌గా హైదరాబాద్ నుంచి ప్రారంభించిన పీఎం నరేంద్రమోదీ -
సరస్వతీఘాట్‌లో భారీ సెట్టింగ్
కాళేశ్వరం: కాళేశ్వరంలో ఈనెల 21నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగనున్న సరస్వతీనది అంత్యపుష్కరాలకు భారీ సెట్టింగులు వేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఘాటుపై సరస్వతీమాత విగ్రహం, ప్లాట్‌ఫారంపై నాలుగు దిక్కులా తోరణాలు ఏర్పాటు చేస్తున్నారు. మెట్ల కింద నుంచి ఇసుకలో నీటి వరకు వెదురు పందిర్లు సుమారుగా 900 మీటర్ల పొడవునా వేస్తున్నారు. వేసవి దృష్ట్యా అందులో నీటి తుంపర్లు నిత్యం పడేలా చల్లదనంతో కూడా నీడనిచ్చే విధంగా తయారు చేస్తున్నారు. భక్తులు స్నానాలకు వెళ్లి వచ్చే వరకు చల్లదనం అస్వాదించనున్నారు. హారతి వేదిక వద్ద ప్రముఖుల గ్యాలరీ, భక్తులకు గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడే 40 టెండ్సిటీ టెండ్లు, మాడ్రన్ లుక్‌తో వేస్తున్నారు. పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు ఏర్పాటు చేస్తున్నారు. ఖాదీవస్త్రాలు, చేనేత వస్త్రాలు విక్రయించడానికి స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. -
లేబర్ కోడ్ రద్దుకు అసెంబ్లీ తీర్మానం చేయాలి
● సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు సోమన్నజనగామ రూరల్: నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను ఐక్య పోరాటాల ద్వారా తిప్పికొట్టాలని రాష్ట్రంలో లేబర్ కోడ్ రద్దు కోసం అసెంబ్లీ తీర్మానం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు యటాల సోమన్న డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆదివారం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్ రూల్స్ ప్రతులను జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నెహ్రూ పార్క్ సెంటర్ వద్ద దహనం చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సుంచు విజేందర్, కోశాధికారి అన్నబోయిన రాజు, సహా య కార్యదర్శి బూడిద ప్రశాంత్, బండారు శంకర్ ,కొమురయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు. -
పాత పెన్షన్ అమలు చేయాలి
జనగామ రూరల్: స్పెషల్ లీవ్ పిటిషన్ వెనక్కి తీసుకొని 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం పీఆర్టీయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు కొల్ల మైపాల్‌రెడ్డి అధ్యక్షతన పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణులైన ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ‘ప్రతిభ అవార్డ్స్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. 2004కు ముందుగా నోటిఫికేషన్ విడుదలై అనంతరం నియమితులైన 2003ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం మెమో నంబర్ 57/4, 57/5లను జారీ చేసిందని తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసిందని పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా స్పష్టమైన తీర్పు ఇచ్చిందని, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. లేనిపక్షంలో ఆమరణ దీక్ష చేపడతానని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కడకంచి బాలమణి, రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి, సుంకరి భిక్షంగౌడ్, నూకల ఎల్లారెడ్డి పాల్గొన్నారు. స్పెషల్ లీవ్ పిటిషన్ వెనక్కి తీసుకోవాలి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి -
ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి
జనగామ రూరల్: కొనుగోలు అయిన ధాన్యాన్ని సత్వరమే మిల్లులకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం జనగామ మండలంలోని వడ్లకొండ రోడ్, నర్మెట మండలంలోని హనుమంతపూర్, అనంతరం తరిగొప్పుల, చిల్పూర్ మండలంలోని శ్రీపతిపల్లి, లింగంపల్లి, వెంకటాద్రిపేట, మల్కాపూర్, చిల్పూర్గుట్టలలో పర్యటించి అక్కడ ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని నిర్వహకులకు కలెక్టర్ స్పష్టం చేశారు. మిల్లర్లు ప్రభుత్వ నిబంధనలు పాటించాలి జిల్లాలో యాసంగి మార్కెటింగ్ సీజన్ 2025–26లో వరి కొనుగోలు ప్రక్రియ సందర్భంగా రైతులు, రవాణాదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టర్, మేజిస్ట్రేట్ సందీప్ కుమార్ ఝా సుమోటోగా స్పందించి జిల్లాలోని సీఎంఆర్ కేటాయింపు పొందిన రైస్ మిల్లర్లకు ప్రాథమిక షరతులతో కూడిన ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీ మిత్ర ఆగ్రో ఇండస్ట్రీస్, చిన్నరాంచర్ల, బచ్చన్నపేట మండలం, అలాగే సోమేశ్వర ఇండస్ట్రీస్, చీటకోడూరు, జనగామ మండలం, రెండు మిల్లులపై చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు. కొనుగోలు ప్రారంభమై 20 రోజులు గడిచినా, కొన్ని రైస్ మిల్లుల వద్ద వరి అన్లోడింగ్ ప్రక్రియ మందగించడంతో కొనుగోలు కేంద్రాల్లో వరి నిల్వలు పెరిగాయన్నారు. తరలింపును వేగవంతం చేయాలి చిల్పూరు: రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లతో పాటు తరలింపును వేగవంతం చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. మండలంలోని శ్రీపతిపల్లి గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏడీఆర్, డీఓ, ఐకేపీ ఏపీఎం పిట్టల నరేందర్, ఎంఏఓ నజీరుద్ధీన్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
గూడ్స్ రైలు వ్యాగన్లో పొగలు
స్టేషన్‌ఘన్‌పూర్: గూడ్స్ రైలు వ్యాగన్లో పొగలు వ్యాపించడంతో స్టేషన్‌ఘన్‌పూర్ రైల్వేస్టేషన్లో శనివారం సాయంత్రం అధికారులు రైలును నిలిపివేశారు. ఘన్పూర్ రైల్వేస్టేషన్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ కథనం ప్రకారం.. సికింద్రాబాద్ వైపు వెళ్తున్న గూడ్స్‌రైలు సాయంత్రం ఘన్‌పూర్‌కు రాగా 14వ వ్యాగన్లో పొగలు వ్యాపించాయి. గమనించిన రైల్వేసిబ్బంది రైలును స్టేషన్‌ఘన్‌పూర్‌లో నిలిపివేశారు. రైల్వే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నీరజ్‌కుమార్‌కు సమాచారం అందించగా ఘన్‌పూర్‌కు వచ్చారు. రైల్వే ఉన్నతాధికారులకు సమాచారం అందించి రైల్వే అప్‌లైన్ విద్యుత్ సరఫరా నిలిపివేశారు. కాగా, సమాచారం అందుకున్న స్టేషన్‌ఘన్‌పూర్ ఫైర్‌స్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ కె.లింగయ్య ఆధ్వర్యంలో ఫైర్ సిబ్బంది ఇంద్రసేనారెడ్డి, శ్రీనాఽథ్, తిరుపతి సంఘటనా స్థలానికి చేరుకుని 14వ వ్యాగన్లో ఫైర్‌ఇంజన్ ద్వారా నీళ్లతో బొగ్గును ఆర్పివేశారు. ఘన్పూర్ అప్‌లైన్‌లో గూడ్స్‌రైలు దాదాపు మూడు గంటలు నిలిచిపోవడంతో సాయంత్రం కాజీపేట నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే పలు రైళ్లను కాజీపేటలో నిలిపినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఎండ తీవ్రతతో బొగ్గు తరలించే గూడ్స్ బోగీల్లో అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయని అధికారులు వివరణ ఇచ్చారు. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ఫైర్ ఇంజన్‌తో ఆర్పివేత -
పంటలకు సాగునీరు అందించడమే లక్ష్యం
జఫర్‌గఢ్: చెరువులు, కాల్వలను అభివృద్ధి పర్చి పంటలకు సాగునీరందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు జిల్లా ఇరిగేషన్ శాఖ ఎస్ఈ సీతారాంనాయక్ పేర్కొన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండలంలోని కూనూరు చెరువులో చేపట్టిన పూడికతీత పనులను జిల్లా ఇరిగేషన్ శాఖ ఎస్ఈ సీతారాంనాయక్ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలసి శనివారం పరిశీలించారు. అనంతరం రూ.9 లక్షల నిధులతో కూనూర్ చెరువు మత్తడి పునఃనిర్మాణ పనులను సర్పంచ్ కాటం దేవేంద్ర మల్లారెడ్డి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ఈఈ వినయ్ బాబు, డీఈ శేషగిరి, ఏఈలు శరత్, కృష్ణ, జీవన్, ఉప సర్పంచ్ ఇల్లందుల ఐలయ్య, మాజీ ఎంపీటీసీ శిరబోయిన సంధ్యా శ్రీనివాస్, వార్డు సభ్యులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు. జిల్లా ఇరిగేషన్ శాఖ ఎస్ఈ సీతారాంనాయక్ -
నేటితో స్వీయగణనకు చివరి రోజు
జనగామ: జనగణన–2027లో భాగంగా ప్రభుత్వం అందించిన స్వీయగణన (సెల్ఫ్ ఎన్యుమరేషన్) అవకాశం నేటి(ఆదివారం)తో ముగియనుండటంతో ప్రతీ కుటుంబం తప్పనిసరిగా నమోదు పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత, కుటుంబ వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుకుంటూ, కేవలం 5 నుంచి 7 నిమిషాల్లోనే స్వయంగా నమోదు చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉందని తెలిపారు. ఒక మొబైల్ నంబర్‌తో ఒక కుటుంబం మాత్రమే నమోదు చేయగలరని, ఓటీపీ ఆధారంగా ధ్రువీకరణ జరుగుతుందని చెప్పారు. జిల్లా, పిన్ కోడ్, గ్రామం, పట్టణ వివరాలు ఇచ్చిన తర్వాత మ్యాప్‌లో ఇంటి స్థానం సరిగా గుర్తించడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఇంటి, కుటుంబ సభ్యుల వివరాలు, సౌకర్యాలు, ఆస్తుల సమాచారం నమో దు చేసిన తర్వాత ప్రివ్యూ చూసి సబిమిట్ చేయాలని సూచించారు. ఒకసారి సమర్పించిన తర్వాత మార్పులు సాధ్యం కాదని స్పష్టం చేశారు. నమోదు పూర్తయ్యాక 11 అంకెల ఎస్ఈ ఐడీ లభిస్తుందని, ఎన్యుమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు ఈ ఎస్ఈ ఐడీ నంబర్ చూ పించాల్సి ఉంటుందన్నారు. వివరాలు సరిపో తే నమోదు ఫైనల్ అవుతుందని, లేనిపక్షంలో ఎన్యుమరేటర్ తిరిగి సమాచారం నమోదు చేస్తారన్నారు. నమోదు కోసం se.census .gov.in వెబ్సైట్లో సంప్రదించాలన్నారు. డాక్టర్ల సమస్యలు పరిష్కరించాలి హన్మకొండ: ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ (పల్లె దవాఖానా)లలో పనిచేస్తున్న డాక్టర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మహేందర్ రావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ బి.శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిని అసోషియేషన్ ప్రతినిధులు కలిసి సమస్యలు విన్నవించారు. అనంతరం మంత్రిని సన్మానించారు. డాక్టర్లు వెంకటేశ్, శివశంకర్, అనుపచంద్, ఆశాజ్యోతి, స్వప్న, సంగీత, సుష్మ, భార్గవి, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. జూడో శిక్షణ కేంద్రం ప్రారంభం వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం ఆవరణలో ఉన్న మినీ ఇండోర్ స్టేడియంలో శనివారం శాశ్వత జూడో శిక్షణ కేంద్రాన్ని తెలంగాణ జూడో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బైరబోయిన కై లాశ్‌యాదవ్, డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీవైఎస్ఓ ప్రశాంత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని క్రీడలకు ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. కై లాశ్‌యాదవ్ మాట్లాడుతూ జూడో శిక్షణ నిరంతరం అందేలా సహకరించిన డీవైఎస్ఓ ప్రశాంత్‌కు ధన్యవాదాలు తెలిపారు. హ్యాండ్‌బాల్ కోచ్ బొడ్డు విష్ణువర్ధన్, స్విమ్మింగ్ కోచ్ రాయబారపు నవీన్, బ్యాడ్మింటన్ కోచ్ కూరపాటి రమేశ్, తైక్వాండో కోచ్ వెంకటస్వామి, సీనియర్ జూడో కోచ్‌లు నాయకపు నాగరాజు, దామెర నక్షత్ర పాల్గొన్నారు. పారా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ కమిటీవరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ సుబేదారిలోని ప్రభుత్వ దివ్యాంగుల వసతి గృహంలో తెలంగాణ పారా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ కమిటీని ఎన్నుకున్నారు. పారా స్పోర్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గాడిపెల్లి ప్రశాంత్ అధ్యక్షతన శనివారం జరిగిన దివ్యాంగ క్రీడాకారుల సమావేశంలో కార్యవర్గాన్ని ప్రకటించారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ముప్పిడి రాజుకుమార్, సలహాదారుగా సింగారపు బాబు, ప్రెసిడెంట్‌గా నిషా ఇన్ననీ, నిర్వహణ కార్యదర్శిగా సీవీ జగన్నాథరావు, వైస్ ప్రెసిడెంట్లుగా బొట్ల కార్తీక్, దామెర మనీందర్, కోశాధికారిగా బల్లె రాజు ఎన్నికైనట్లు ప్రశాంత్ తెలిపారు. తమకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, పారా ఒలింపిక్స్ కమిటీ, ఖేలో ఇండియా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
ప్రేమ మూర్తి.. అమ్మ కీర్తి
తాను ఎలా ఉన్నా పిల్లలను ఉన్నతంగా చూడాలనుకుంటుంది. పస్తులుండైనా కన్నవారి కడుపు నింపాలనుకుంటుంది. కష్టాల కడలిని ఎదురీదైనా పిల్లల భవిష్యత్‌కు బాటలు వేయాలనుకుంటుంది. కుటుంబ పెద్ద మరణించినా అన్నీ తానై నడిపిస్తుంది. ఉమ్మడి జిల్లాలో అనాథలకు ప్రేమను పంచుతున్న వారు ఒకరైతే.. భర్తలేకపోయినా పెంచి పెద్ద చేసిన వారు మరొకరు. ఇలా ఆదర్శంగా నిలుస్తున్న వారెందరో.. అలాంటి దైవాల ప్రేమకు అక్షర రూపమిస్తూ.. నేడు(ఆదివారం) మాతృ దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ. జఫర్‌గఢ్: వందలాది మంది అనాథ పిల్లలతో అమ్మ అని ఆప్యాయంగా పిలుపించుకుంటున్నారు ‘మా ఇల్లు ఆశ్రమ నిర్వాహకులు గాదె పుష్పరాణి. మండలంలోని రేగడితండా గ్రామ శివారు టీబీతండా వద్ద గాదె ఇన్నయ్య 20 ఏళ్ల క్రితం ‘మా ఇల్లు’ ప్రజాదరణ అనాథ ఆశ్రమాన్ని స్థాపించారు. 32 మంది పిల్లలతో ప్రారంభించిన ఈ ఆశ్రమంలో ఇప్పటి వరకు వందకు పైగా అనాథ పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు. ఆశ్రమంలోని ఆడపిల్లల విషయంలో ఆమె ప్రత్యేక శ్రద్ధవహిస్తూ తల్లిదండ్రులు లేని లోటు తీరుస్తున్నారు. ఆశ్రమానికి చెందిన ముగ్గురు ఆడపిల్లలకు సొంత ఖర్చులతో వివాహాలు జరిపించారు. పుష్పరాణి కృషి ఫలితంగా ఆశ్రమానికి చెందిన పిల్లలు లాయర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, నర్సులు, ఉపాధ్యాయులు, కానిస్టేబుల్‌గా ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా గాదె పుష్పరాణి మాట్లాడుతూ.. ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతో మంది అనాథ పిల్లలకు అమ్మలా సేవ చేయడం, వారితో అమ్మ అని పిలిపించుకోవడం తనకు ఎంతో సంతోషాన్నిస్తోందన్నారు. జనగామ: జనగామ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు బి.మాలతి. చిన్నప్పటి నుంచే తన తండ్రి తనను ఉద్యోగస్తురాలిగా చూడాలని కలలు కన్నారు. ఆ ఆశయం నెరవేర్చేందుకు బీటెక్ చదివి కష్టపడి ఉద్యోగం సాధించారు. భర్త వెంకటేష్ సపోర్ట్ చేస్తుండడంతో పెళ్లయిన తర్వాత కూడా ఉద్యోగంలో రాణిస్తున్నానని చెప్పారు. ఇంటికెళ్తే పిల్లలు ‘మమ్మీ’ అంటే తన అలసట తీరిపోతుందంటున్నారు. ఉద్యోగం, కుటుంబాన్ని సమన్వయం చేసుకుంటున్నానని చెప్పారు. తల్లి సరోజనతో సీఐ శ్రీనివాస్రెడ్డికుటుంబ పెద్ద లేకపోయినా పెంచి పెద్ద చేస్తూ.. ● ఆదర్శంగా నిలుస్తున్న ఉమ్మడి జిల్లా మాతృమూర్తులు బచ్చన్నపేట: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన గూడ లావణ్య – కీ.శే. భూపాల్‌రెడ్డి దంపతులకు ఇద్దరు సంతానం. కూతురు అపూర్వ, కుమారుడు అశ్విష్‌రెడ్డి. కూతురు బీటెక్ మూడో సంవత్సరం చదువుతుండగా లావణ్య భర్త భూపాల్‌రెడ్డి ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. ఆ కుటుంబం అంతా దుఖసాగరంలో మునిగిపోయింది. అయినప్పటికీ, తల్లి లావణ్య దిగులు పడకుండా తన పిల్లలను చదివించింది. అపూర్వ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ పట్టుదలతో చదివి ఎస్సై ఉద్యోగానికి ఎంపికయ్యారు. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా చేర్యాల పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా పని చేస్తున్నారు. కష్టాలు, కన్నీళ్లు ఎన్ని ఎదురైనా మనోధైర్యం, గుండె నిబ్బరం వీడకుండా ముందుకు సాగాలని, తన తల్లే తనకు ఆదర్శమని ఎస్సై అపూర్వరెడ్డి చెబుతున్నారు. జనగామ: జనగామ మున్సిపల్ కార్యాలయంలో 1992 నుంచి పెన్షన్ సెక్షన్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు పులి విజయలక్ష్మి. తండ్రి వారసత్వంగా వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాన్ని దైవ ప్రసాదంలా భావించి 34 ఏళ్లుగా నిబద్ధతతో సేవ చేస్తున్నారు. ఒక పక్క ఉద్యోగం.. మరో పక్క కుటుంబం.. ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లతో పెద్దకుటుంబం నడిపేటప్పుడు ఎన్నో సవాళ్లు ఎదురైనా సమయం, క్రమశిక్షణ పాటించి రెండింటిలోనూ సక్సెస్ సాధించానని చెబుతున్నారు. తన ప్రయాణంలో అండగా నిలిచిన భర్త నర్సింగరావే తన బలమంటున్నారు. రఘునాథపల్లి: మా అమ్మ ఎడవెల్లి సరోజన కష్టాలు బయటపె ట్టకుండా, మా కుటుంబం కోసం నిశ్శబ్ద పోరాటం చేసిన మహానుబావురాలు. చిన్నతనంలో చేయిపట్టి నడిపించింది. ఇప్పటికీ ఆమె ప్రేమే నన్ను ముందుకు నడిపిస్తోంది. నేనీ స్థాయిలో ఉన్నానంటే విలువలు, క్రమశిక్షణతో జీవనం కొనసాగిస్తున్నానంటే అమ్మ మార్గదర్శనంతోనే. నా ప్రతీ అడుగులో అమ్మ ప్రోత్సాహం ఉంది. తల్లులందరికీ శుభాకాంక్షలు. జనగామ: పెళ్లి తర్వాత కూడా తన చదువు, లక్ష్యం ఆగిపోలేదని అంటున్నారు జనగామ తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వి.స్వాతి. కుటుంబం ఇచ్చిన నమ్మకం, భర్త శ్రీధర్ (జూనియర్ లెక్చరర్) ఇచ్చిన ప్రోత్సాహంతో పోటీ పరీక్షలకు సిద్ధమై ఉద్యోగం సంపాదించానని చెప్పారు. ఒక కూతురు, బాబు ఉన్నారని, అటు ఉద్యోగం, ఇటు కుటుంబం రెండింటిని సమతుల్యం చేసుకోవడమే తన నిజమైన విజయం అంటున్నారు. -
తాగునీటి సమస్యను పరిష్కరిస్తా
స్టేషన్ ఘన్పూర్: నూతనంగా ఏర్పడిన స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సమస్యను పరిష్కరించేలా ప్రత్యేక చొరవతో పనిచేస్తానని మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్‌కుమార్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని తాగునీటి సరఫరా సమస్యలపై ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల నుంచి పలువురు నీటి సమస్యపై విన్నవించగా అందుకు మున్సిపల్ చైర్మన్ సానుకూలంగా స్పందించారు. ప్రధానంగా రెండు, మూడు రోజులకు ఒకసారి నీటి సరఫరా చేస్తున్నారని, పలు ఏరియాల్లో కలుషిత, మురుగునీరు వస్తోందని, పైప్లైన్ల లీకేజీలు, గేట్‌వాల్వ్‌లు, మిషన్ భగీరథ నల్లాలకు ఆన్ఆఫ్ ఏర్పాటు చేయాలని, బోర్లను మరమ్మతు చేయించాలని, వాటర్ ట్యాంక్‌లను శుభ్రం చేయించాలని తదితర అంశాలను పలువురు ప్రస్తావించారు. కాగా ప్రధానంగా 17వ వార్డు నుంచి ఎక్కువగా సమస్యలు వెల్లువెత్తాయి. ప్రశ్న: నల్లాలు వదిలిన సమయంలో మొదట 5 నిమిషాలు నల్లాల ద్వారా మురుగునీరు వస్తున్నాయి. పైప్లైన్ల లీకేజీలతో సమస్యగా ఉంది.. – సాంబారి సత్యనారాయణ, 12వ వార్డు మున్సిపల్ చైర్మన్: మున్సిపాలిటీలో పైప్లైన్ల లీకేజీపై ప్రత్యేక దృష్టి సారించాం. వాటర్మెన్లతో మాట్లాడి లీకేజీలపై ఎక్కడ సమస్య ఉన్నా వెంటనే పరిష్కరిస్తాం. ప్రశ్న: సమయపాలన లేకుండా నీటి సరఫరా చేస్తున్నారు. ఇళ్లలో అందరూ పనికి వెళ్లాక మధ్యాహ్నం సమయంలో నీటి సరఫరా చేస్తున్నారు. ఉదయమైనా, సాయంత్రమైనా నిర్ణీత సమయానికి నీటి సరఫరా చేయాలి.. – కుసుమ సాంబశివ, బోడ వేద ప్రకాష్, 15వ వార్డు చైర్మన్: మిషన్ భగీరథ వారు మన వాటర్ ట్యాంకులకు మధ్యాహ్నం వేళల్లో నీటిని అందిస్తున్నారు. అందుకే నీటి సరఫరా సమయంలో సమస్యగా ఉంది. ఈ విషయమై మిషన్ భగీరథ, మున్సిపాలిటీ వారితో చర్చించి సమయం ప్రకారం నీటిని అందించేలా చర్యలు తీసుకుంటాం. ప్రశ్న: వాటర్ ట్యాంకులను శుభ్రం చేయడం లేదు. పద్మశాలీ కాలనీలో ట్యాంకు పాకురుపట్టి ఉంది. దాంతో నల్లాల ద్వారా కలుషిత నీరు వస్తోంది.. – చిలగాని శ్రీధర్, 2వ వార్డు చైర్మన్: ట్యాంకులన్నింటినీ శుభ్రం చేయించి బ్లీచింగ్ చేయిస్తాం. ప్రశ్న: నీటి సమస్య తీవ్రంగా ఉంది. పైప్‌లైన్ వేసి గేట్‌వాల్వ్ ఏర్పాటు చేయలేదు. నాలుగైదు రోజులుకు ఒకసారి నీరు వస్తున్నాయి. వాటర్ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలి. – దాసరి పరశురాములు, ఎల్లావుల ఉపేంద్ర, సీహెచ్.కనకతార 17వ వార్డు, గుర్రం ఫాతికుమార్, 2వ వార్డు, –పెసరు మలేంద్ర, 17వ వార్డు చైర్మన్: 17వ వార్డులో నీటి సరఫరా సమస్య ఉన్నది వాస్తవమే. అభివృద్ధి పనుల్లో భాగంగా పాత ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉన్న వాటర్‌ట్యాంక్‌ను తొలగించాం. దాంతో నీటి సమస్య ఉంది. పైప్లైన్లకు అవసరమైన చోట గేట్‌వాల్వ్‌లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతానికి వాటర్ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తాం. ప్రశ్న: మిషన్ భగీరథ నల్లాలకు ఆన్‌ఆఫ్‌లు లేకపోవడంతో పలుచోట్ల నీరు వృథాగా పోతోంది. నల్లాలకు ఆన్‌ఆఫ్‌లు ఏర్పాటు చేస్తే బావుంటుంది.. –బంగ్లా శ్రీను 16వ వార్డు, పోశాల కృష్ణమూర్తి, 2వ వార్డు చైర్మన్: నీటి వృథాను అరికట్టేందుకు తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఈ క్రమంలోనే పైప్లైన్ల లీకేజీల మరమ్మతులు చేయించాం.. ప్రశ్న: వాటర్ ఫిల్టర్ బెడ్ ఏర్పాటు చేస్తే నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఽఘన్పూర్లో రిజర్వాయర్ ఉన్నందున ధర్మసాగర్ మాదిరిగా ఇక్కడ వాటర్ ఫిల్టర్‌బెడ్ ఏర్పాటు చేయించాలి – నీల సోమన్న, 11వ వార్డు చైర్మన్: వాటర్ ఫిల్టర్‌బెడ్ నిర్మాణ విషయాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి దృష్టికి తీసుకెళ్తా. నీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పనిచేస్తా. ప్రశ్న: డ్రైనేజీలలో గేట్‌వాల్వ్‌లు ఉండటంతో నల్లాల ద్వారా మురుగునీరు వస్తోంది. సమస్యను పరిష్కరించాలి.. – గుర్రం సురేష్ 3వ వార్డు చైర్మన్: మున్సిపాలిటీ పరిధిలోని డ్రైనేజీల వద్ద ఉన్న గేట్‌వాల్వ్‌ల విషయమై మున్సిపాలిటీ నీటిసరఫరా సిబ్బందితో చర్చిస్తా. సమస్యను శాశ్వతంగా పరిష్కరించి పరిశుభ్రమైన నీటిని అందిస్తా. ప్రశ్న: వీవర్స్‌కాలనీ సమీప న్యూ ముదిరాజ్ కాలనీలో వాటర్ ట్యాంకుకు మిషన్ భగీరథ నీరు రావడం లేదు. పైప్‌లైన్ వేసి ఒకటే గేట్‌వాల్వ్ ఏర్పాటు చేయడంతో పాలిటెక్నిక్ కళాశాలకు మొత్తం నీరు వెళ్తున్నాయి. దాంతో కాలనీలో మిషన్ భగీరథ నీరు రావడం లేదు.. – కొండ రవి, 3వ వార్డు చైర్మన్: సమస్యను స్వయంగా పరిశీలించి వాటర్ ట్యాంక్‌కు మిషన్ భగీరథ నీరు అందించేలా కృషి చేస్తా. అవసరమైన చోట మరో గేట్‌వాల్వ్ ఏర్పాటు చేసి అటు పాలిటెక్నిక్ కళాశాలకు, ఇటు కాలనీకి నీరు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటాం. ప్రశ్న: నీటి సమస్య తీవ్రంగా ఉంది. కాలనీలోని బో ర్లు, చేతిపంపులను మరమ్మతు చేయించాలి. కాలనీలో నూతన వాటర్ ట్యాంకు ఏర్పాటు చేయించాలి.. – పండుగ అశోక్, కుంభం నరేష్, పిట్టల మల్లేష్, 17వ వార్డు చైర్మన్: 17వ వార్డులో పైప్‌లైన్, గేట్‌వాల్వ్ సమస్యను పరిష్కరిస్తాం. కాలనీలో చెడిపోయిన చేతిపంపులను, బోర్లను త్వరలో మరమ్మతులు చేయించి నీటి సమస్యను పరిష్కరిస్తాం. అవసరమైతే కాలనీకి ప్రత్యేకంగా వాటర్ ట్యాంక్ నిర్మా ణం చేసేలా చర్యలు తీసుకుంటా. మున్సిపాలిటీలో ప్రతీ రోజు నీరందించేందుకు కృషి చేస్తా.. పైప్‌లైన్ లీకేజీలు, గేట్‌వాల్వ్ తదితర మరమ్మతు పనులు చేయిస్తా.. స్టేషన్ ఘన్పూర్ మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్‌కుమార్ ‘సాక్షి ఫోన్ ఇన్’ కార్యక్రమానికి విశేష స్పందన -
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం
జనగామ: ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేప్తోందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే మాట్లాడారు.. నియోజకవర్గంలో ధాన్యం సేకరణ పరిస్థితి రైతులకు తీవ్ర ఆందోళన కలిగించే స్థితిలో ఉందన్నారు. 80 శాతం కోతలు పూర్తయినప్పటికీ ప్రభుత్వం కేవలం 25 శాతం ధాన్యమే కొనుగోలు చేసిందన్నారు. ఇది రైతులను పూర్తిగా మోసం చేసినట్లే అని విమర్శించారు. రెండు రోజుల క్రితం జనగామ మార్కెట్‌కు సెలవులు ఇవ్వడం, చేర్యాల మార్కెట్లో వారం రోజులుగా ఒక్క కిలో ధాన్యం కొనకపోవడం రైతులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు లేకపోవడం, తూకం కాంటాలు పనిచేయకపోవడం, లారీలు ఎత్తకపోవడం, మిల్లర్లు ధాన్యం దించకపోవడం చివరికి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడం వరకు ప్రతీ దశలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. వెంటనే లారీలు, గన్నీ బ్యాగులు, మిల్లర్లను సమన్వయం చేసేందుకు సీఎం జోక్యం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు తాళ్ల సురేష్‌రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ బాల్దె సిద్దిలింగం, నీల యాదగిరి, ఉల్లెంగుల సందీప్, సలీం తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి -
బడిబాట పట్టాలి!
జనగామ: జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను గణనీయంగా పెంచాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. 2026–27 విద్యా సంవత్సరానికి ముందుగానే ప్రవేశాల పెంపుపై సమగ్ర కార్యాచరణను సిద్ధం చేస్తూ, ప్రతీ పాఠశాలకు స్పష్టమైన లక్ష్యాలు కేటాయించారు. గత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీ, మోడల్ స్కూల్స్, ఎయిడెడ్ పాఠశాలలు, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఎంత మంది ప్రవేశం పొందారు? ఈ సంవత్సరం కనీసం ఎంత పెంపు చేయాలి? అనే దానిపై స్కూల్స్, గురుకులాల వారీగా లక్ష్యాలు నిర్ధారించారు. తల్లిదండ్రుల్లో విశ్వాసం పెంపొందించేందుకు విద్యాశాఖతో కలిసి ప్రగతిశీల కార్యక్రమాలు చేపట్టాలని, బోధన నాణ్యత, పాఠశాలల వసతులు, మౌలిక సదుపాయాలు, శుభ్రత, డిజిటల్ క్లాస్ రూంల వినియోగం, విద్యార్థుల హాజరు శాతం పెంపుపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు. అధికారులు, హెడ్మాస్టర్లు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు పెరగడమే కాకుండా విద్యా నాణ్యత కూడా మెరుగవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న విద్యా సౌకర్యాలను సమర్థంగా వివరించి ప్రతీ పాఠశాల నిర్దేశిత లక్ష్యాన్ని తప్పనిసరిగా చేరుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికల పెంపు లక్ష్యంగా జిల్లాలోని అన్ని మండల విద్యా అధికారులు (ఎంఈఓలు), హెడ్మాస్టర్లు ప్రవేశాల పెంపు లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలని ఆదేశించారు. ప్రత్యేకంగా జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో బోధన నాణ్యత, భద్రత, మౌలిక సదుపాయాలు, ఇంగ్లిష్ మీడియం వంటి అంశాలు విద్యార్థుల ఆకర్షణకు ప్రధాన బలంగా అవుతున్నాయని సూచనలు చేశారు. ఎంఈఓలకు అప్పగించిన లక్ష్యాలు, పర్యవేక్షణను కచ్చితంగా నిర్వహించాల్సి ఉంటుంది. హెచ్ఎంలు తమ పాఠశాలలకు కేటాయించిన లక్ష్యాలను 100 శాతం చేరుకునేలా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మౌలిక వసతులు–ప్రభుత్వ పాఠశాలల బలం ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను తల్లిదండ్రులకు వివరించాలని అధికారులు పాఠశాలల యాజమాన్యానికి సూచించారు. మెరుగైన తరగతి గదులు బాలురు, బాలికలకు ప్రత్యేక టాయిలెట్స్, స్వచ్ఛమైన నీరు, విద్యుత్, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, ఈ సదు పాయాలు ప్రభుత్వ పాఠశాలల విశ్వసనీయతను పెంచడంలో కీలకమని పేర్కొన్నారు. విద్యార్థుల–తల్లిదండ్రుల అవసరాలకు ప్రాధాన్యం తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకుంటూ, వారి నమ్మకాన్ని పెంపొందించడానికి హెచ్ఎంలు క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. నాణ్యమైన బోధన, రోజువారీ హాజరు పర్యవేక్షణ, సహ పాఠ్యాతేర కార్యక్రమాలు, కమ్యూనికేషన్ నైపుణ్యాల అభివృద్ధి, డిజిటల్ లెర్నింగ్ వినియోగం వంటి అంశాలు ప్రవేశాల పెంపునకు దోహదం చేయనున్నాయి. డ్రాపౌట్ల నియంత్రణపై దృష్టి సారించి ఎంఈఓలు ప్రతీ వారం పాఠశాల వారీగా అడ్మిషన్ల పురోగతిని పరిశీలించి జిల్లా విద్యాధికారి కార్యాలయానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. హెడ్మాస్టర్లు రోజువారీ నమోదు వివరాలు నిర్వహించాలి. డ్రాపౌట్లను పూర్తిగా తగ్గించడం, గత విద్యార్థుల తల్లిదండ్రులతో ఫీల్డ్ విజిట్లు చేయడం వంటి చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. జిల్లాలోని ప్రతీ పాఠశాలకు లక్ష్యాలు నిర్దేశించి, వాటిని తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్ సూచించడంతో, ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య భారీగా పెరగనున్నట్లు విద్యాశాఖ అంచనా వేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచాలని కలెక్టర్ ఆదేశం 2026–27 విద్యా సంవత్సరానికి 100శాతం చేరికలే లక్ష్యం ఎంఈఓ, హెచ్ఎంలకు ప్రత్యేక బాధ్యతలు డ్రాపౌట్ నివారణపై దృష్టిమండలం సూల్స్ పిల్లల బడిబాట పెరిగితే సంఖ్య టార్గెట్ పిల్లల సంఖ్యబచ్చన్నపేట 41 3,003 1,181 4,184 చిల్పూరు 36 1,992 718 2,710 దేవరుప్పుల 49 2,053 914 2,967 స్టే.ఘన్పూర్ 33 3,006 990 3,996 జనగామ 58 4,651 1,853 6,504 కొడకండ్ల 32 1,822 826 2,648 లింగాల ఘనపురం 32 2,245 890 3,135 నర్మెట 28 1,719 849 2,568 పాలకుర్తి 53 2,533 976 3,509 రఘునాథపల్లి 49 2,883 1,504 4,387 తరిగొప్పుల 22 995 403 1,398 జఫర్‌గఢ్ 32 2,485 1,018 3,503 మొత్తం 465 29,397 12,097 41,494 -
చెత్తసేకరణ ఆటోలో పిల్లల తరలింపు
జనగామ: అధికారికంగా నిర్వహించిన జనగణన అవగాహన మారథాన్ ర్యాలీకి పిల్లలను చెత్త తరలించే అటోలో తీసుకురావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల భద్రతపై నిర్లక్ష్యంగా వ్యవహరించారని తల్లిదండ్రులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులను ఇటువంటి వాహనంలో తరలించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. మినీ స్టేడియంలో సమ్మర్ క్యాంపులో ఉన్న విద్యార్థులను పీఈటీ అభ్యర్థన మేరకు హరితహారం కోసం ఉపయోగించే ఆటోలో విద్యార్థులను ర్యాలీకి తీసుకు రావడం జరిగిందన్నారు. మంత్రి ఉత్తమ్‌ను కలిసిన జిల్లా రైస్‌మిల్లర్స్ జనగామ: జిల్లాలో బియ్యం సేకరణలో నెలకొన్న సమస్యలపై శుక్రవారం హైదరాబాద్‌లో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, సివిల్ సప్లయీస్ కమిషనర్లకు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి వినతి చేసినట్లు వెంకటనారాయణగౌడ్ తెలిపారు. తమ వినతిపై వారు సానుకూలంగా స్పందించారన్నారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకొని వచ్చే సోమవారం నుంచి ధాన్యం దిగుమతులను నిలిపివేయాలనే నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో గాదె శ్రీనివాస్, జొన్నల సోమేశ్వర్, మాశెట్టి అశోక్, మర్యాల లక్ష్మణ్, పెండ్లి దిలీప్‌రెడ్డి, శివన్న, నర్సయ్య, రమేశ్, కృష్ణమూర్తి, మాధవరెడ్డి, రాజేష్, సంతోష్, రమేశ్, అమీన్ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ కళాశాల స్కీంకు దరఖాస్తుల ఆహ్వానం జనగామ రూరల్: 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి కార్పొరేట్ కళాశాల స్కీంలో భాగంగా ప్రైవేట్ జూనియర్ కళాశాలల ఎంపిక కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి విక్రమ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 90శాతానికి పైగా ఉత్తీర్ణత సాధించి, అందులో కనీసం 50 శాతం మంది విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ర్యాంకులు సాధించిన ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఈ స్కీంలో తమ కళాశాల పేరును నమోదు చేసుకోవచ్చన్నారు. కళాశాలల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ ఈనెల 7నుంచి 11 వరకు ఉంటుందని రిజిస్ట్రేషన్ హార్డ్ కాపీలను జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కార్యాలయంలో సమర్పించాలన్నారు. 14వ తేదీన జిల్లా కమిటీ ద్వారా కళాశాలల తనిఖీ చేస్తారని 18వ తేదీన ఎంపికై న కళాశాలల జాబితాను సీజీజీ ద్వారా ఆన్లైన్లో ప్రకటిస్తారని తెలిపారు. రామప్ప భూముల వేలంలో పెరిగిన ఆదాయం వెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయం ఆధ్వర్యంలో 2026–27 సంవత్సరానికి సంబంధించి దేవస్థానం తరి భూములను రెండు పంటల కౌలు హక్కుల కోసం శుక్రవారం ఆలయ ఈఓ ఇమ్మడి భాస్కర్ ఆధ్వర్యంలో బహిరంగ వేలం నిర్వహించారు. -
పశుసంపద గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక
● కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా స్టేషన్‌ఘన్‌పూర్: పశుసంవర్ధక రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిదని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండలంలోని కొత్తపల్లి గ్రామంలో పశు వైద్య సంతానోత్పత్తి శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ శిబిరాన్ని ప్రారంభించి దూడలకు, గొర్రెలు, మేకలకు నులిపురుగుల నివారణ మందులు వేయించారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి మురళీధర్‌రావు, సర్పంచ్ ముక్కెర స్వరూపరవి, ఉపసర్పంచ్ ఇసాక్, జనగామ ఏడీ డాక్టర్ దేవేందర్, స్టేషన్‌ఘన్‌పూర్ ఏడీ డాక్టర్ చక్రధర్, తిమ్మంపేట ఏడీ డాక్టర్ సారంగపాణి, గోపాలమిత్ర సూపర్వైజర్ రాజేశ్వర్‌రావు, గోపాలమిత్రలు పాల్గొన్నారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు జనగామ రూరల్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పరీక్షలపై సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 13 నుంచి 21వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు, ఏమైనా సందేహాలు ఉంటే టెలీ మానస్ టోల్ ఫ్రీ నంబర్ 14416లో సంప్రదించి సమస్యలను నివృత్తి చేసుకోవాలని కోరారు. సమన్వయ సమావేశంలో డీఐఈఓ జితేందర్ రెడ్డి, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఓపీఎంఎస్లో వివరాలను నమోదు చేయాలి రైతులు పండించే ప్రతీ ధాన్యం గింజను సకాలంలో కొనుగోలు చేసి, ట్యాగ్ చేసిన మిల్లులకు ఎలాంటి ఆలస్యం లేకుండా రవాణా చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఐకేపీ, పౌరసరఫరాల అధికారులను ఆదేశించారు. ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు, ఓపీఎంఎస్లో నమోదు, మొదలగు అంశాలపై ఏపీఎం, సీసీలు, కేంద్ర నిర్వాహకులతో కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, జెడ్పీ సీఈఓ, ఇన్చార్జ్ డీఆర్డీఓ రంగారావు, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోని, పౌరసరఫరాల డీఎం హతిరామ్, అదనపు డీఆర్డీఓ నూరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి
● వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ వరంగల్ల క్రైం: ఉద్యోగంలో స్థాయి పెరిగినా కొద్ది బాధ్యతలు కూడా పెరుగుతాయని, ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలందించేలా అధికారులు కృషి చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల ఏఎస్సై స్థాయి నుంచి సబ్ ఇన్స్పెక్టర్లుగా పదోన్నతి పొందిన 25 మంది అధికారులు శుక్రవారం పోలీస్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించారు. అనంతరం పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా పదోన్నతి పొందిన ఎస్సై భుజాలపై స్టార్స్‌ను అలంకరించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పదోన్నతులతో కేవలం హోదా పెరగడమే కాకుండా ప్రజల పట్ల మరింత బాధ్యతతో పనిచేసే అవకాశం లభిస్తుందన్నారు. ప్రజా సమస్యలను సానుభూతితో వినడం, చట్టపరంగా వేగవంతమైన చర్యలు తీసుకోవడం, పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచేలా విధులు నిర్వర్తించాలని ఆయన సూచించారు. -
విద్యార్థులకు నైపుణ్యాధారిత శిక్షణ
● కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి కేయూ క్యాంపస్: విద్యార్థులకు నైపుణ్యాధారిత శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వర్సిటీలోని సెనేట్ హాల్లో అధ్యాపకులకు, డీన్లకు, యూనివర్సిటీ కళాశాలల ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాకతీయ యూనివర్సిటీ – స్కిల్ డిజైర్‌తో అవగాహన ఒప్పందం ద్వారా ఫుల్ స్టాక్ జావా, డేటా సైన్స్, డిజిటల్ మార్కెటింగ్ వంటి కోర్సులతో పాటు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రిక్ వాహనాల రంగాల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించనున్నామన్నారు. స్కిల్ డిజైర్ డైరెక్టర్ ముప్పల శ్రీకాంత్ ఈ కార్యక్రమాలకు సంబంధించి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పలు అంశాలను వివరించారు. రాబోయే సెమిస్టర్ నుంచి ఈకార్యక్రమాలు అమలు చేయనున్నారు. -
‘మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి’
పాలకుర్తి టౌన్: మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ చిక్కుడు రాములు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు పాలకుర్తి నియోజకవర్గంలోని కొడకండ్ల, దేవరుప్పుల, పాలకుర్తి మండలాల మత్స్య సొసైటీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మత్య్స ఉత్పత్తి పెంపు, చెరువుల సమర్థ నిర్వహణ, చేపల వ్యాధుల నివారణ, కలుపు నియంత్రణ చర్యలు, ఆధునిక చేపల పెంపకం, మత్స్యకార సంక్షేమ పథకాలు, చేపపిల్లల వితరణ, నీటి వనరుల సమర్థ వినియోగంపై మత్స్యశాఖ అధికారి జరపుల కిషన్ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఇరిగేషన్, డీఈఈ, ఏఈ,మత్స్య సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
రేపు రైల్వే ప్రాజెక్ట్‌ల ప్రారంభం
● వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని కాజీపేట రూరల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు రైల్వే ప్రాజెక్ట్‌లను ఈ నెల 10వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటనలో వర్చువల్‌గా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నట్లు శుక్రవారం రైల్వే అధికారులు తెలిపారు. కాజీపేట–హసన్‌పర్తి రైల్వేస్టేషన్ల మధ్య కోమటిపల్లి రైల్వే గేట్‌సమీపంలో నిర్మించిన సొరంగమార్గం (రైల్ అండర్ రైల్), బల్లార్షా – కాజీపేట – విజయవాడ మూడవ రైలు మార్గాన్ని ప్రారంభించనున్నారు. కాగా, కాజీపేట రైల్వే మ్యాన్‌ఫ్యాక్చరింగ్ యూనిట్ (ఆర్ఎంయూ–కోచ్‌ఫ్యాక్టరీ) ప్రధాని ప్రారంభించే ప్రాజెక్టుల్లో ఇప్పటి వరకు లేదని రైల్వే అధికారులు తెలిపారు. పనులు పూర్తి స్థాయిలో కాలేదని పేర్కొన్నారు. -
తలసేమియాపై అవగాహన ఉండాలి
జనగామ రూరల్: ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా శుక్రవారం పట్టణంలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి ఎల్.అశోక్ కుమార్ పాల్గొని ప్రజలకు తలసేమియా వ్యాధి నివారణపై అవగాహన కల్పించారు. తలసేమియా వ్యాధి వారసత్వంగా సంక్రమించే రక్త సంబంధిత వ్యాధి అని, సరైన సమయంలో పరీక్షలు చేయించుకోవడం ద్వారా నివారణ సాధ్యమవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా 50 మంది గర్భిణులకు స్క్రీనింగ్ నిర్వహించి, నమూనాలు సేకరించి గర్భిణి పాజిటివ్‌గా తేలిన పక్షంలో భర్తకు కూడా పరీక్షలు నిర్వహించి అవసరమైన సలహాలు అందిస్తున్నట్లు చెప్పారు. అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు వైద్యులు కమల్ హాసన్, శ్రీతేజ, అనురాధ జాదవ్ పాల్గొన్నారు. -
ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
● సీపీ సన్‌ప్రీత్ సింగ్చిల్పూరు: బాధితులు ఇచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా వెస్ట్ జోన్ పరిధిలోని చిల్పూరు పోలీస్‌స్టేషన్‌ను గురువారం సందర్శించారు. ముందుగా బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయానికి రాగా అర్చకులు రవీందర్‌శర్మ, రంగాచార్యులు, కష్ణమాచార్యులు సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. తీర్థప్రసాదాలతో పాటు స్వామి వారి శేషవస్త్రాన్ని సీపీకి అందజేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌ను సందర్శించగా వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేందర్‌నాయక్, ఏసీపీ భీంశర్మ, సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై సిరిపురం నవీన్‌కుమార్‌లు పుష్పగుచ్ఛం అందించారు. స్టేషన్ పరిసరాలను, రికార్డులను తనిఖీ చేసి సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులు లేకుండా చూడాలన్నారు. అక్రమ ఇసుక, మొరం రవాణా, పాఠశాలల పరిసరాల్లో పొగాకు ఉత్పత్తుల విక్రయాలు జరగకుండా చూడాలన్నారు. -
సౌర విద్యుత్ ప్రయోజనాలు వినియోగించుకోవాలి
లింగాలఘణపురం: సౌర విద్యుత్‌తో ఉండే ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని ట్రాన్స్‌కో డీఈ లక్ష్మీనారాయణరెడ్డి కోరారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం మండలంలోని రైతు వేదికలో వ్యవసాయ క్షేత్రాలు, సౌర విద్యుత్ కేంద్రాలపై ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు, సబ్సిడీలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈ లక్ష్మీనారాయణరెడ్డి మాట్లాడుతూ జలవిద్యుత్, థర్మల్ విద్యుత్‌కు ఉపయోగపడే వనరులు తగ్గడం, కాలుష్యం వంటి సమస్యలు ఏర్పడుతాయని, సౌర విద్యుత్‌తో ఎలాంటి కాలుష్యం లేకుండా సూర్యరశ్మితో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందన్నారు. వ్యవసాయ క్షేత్రాలతో పాటు, గృహ అవసరాలకు సౌర విద్యుత్‌ను వినియోగించుకొని ఎక్కువ ఉత్పత్తి అయితే గ్రిడ్ కొనుగోలు చేస్తే ఉత్పత్తిదారులకు ఆదాయం కూడా వస్తుందన్నారు. సమావేశంలో ఏడీ అనిల్‌కుమార్, ఏఈ శంకరయ్య, లింగాలఘణపురం సర్పంచ్ ఎడ్ల లావణ్య, ట్రాన్స్‌కో సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
పుస్తకాలొచ్చేశాయ్..
పాఠశాలల పునఃప్రారంభం రోజే అందించేలా చర్యలుజనగామ రూరల్: పాఠశాల పునఃప్రారంభం రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించేలా విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. గతంలో పాఠశాలలు ప్రారంభమై నెలలు గడిచినా పూర్తిస్థాయిలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించని విద్యాశాఖ అధికారులు.. రెండేళ్లుగా అందుకు భిన్నంగా సకాలంలో పాఠ్యపుస్తకాలను అందజేస్తోంది. సబ్జెక్ట్ పుస్తకాల కొరత తలెత్తకుండా అధిగమించడానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో ప్రత్యేక చొరవ తీసుకొని ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాకేంద్రంలోని స్టాక్ పాయింట్‌కు 60 శాతం పుస్తకాలు చేరాయి. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయడానికి కలెక్టర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా బడుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో అభివృద్ధి పనులు చేపడుతోంది. పాఠశాలలు ప్రారంభం అయ్యే నాటికి పెండింగ్ పనులు పూర్తి అయ్యేలా ఆదేశాలు జారీ చేశారు. విద్యా సంవత్సరం పాఠశాలల పునఃప్రారంభంలోనే విద్యార్థులకు సమస్యలు రాకుండా పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాం అందించడానికి చర్యలు తీసుకుంటుంది. ఇందుకు అవసరమెన పుస్తకాలు జిల్లాకు విడతల వారీగా అందిస్తున్నారు. జిల్లాలో 22వేల మంది విద్యార్థులు జిల్లాలో 12 మండలాల్లో ప్రభుత్వ పాఠశాలలు 434 ఉండగా సొసైటీలు, ఎయిడెడ్, కేజీబీవీలు గు రుకులాలు అన్ని కలిపి 586 పాఠశాలలున్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలు 341, ప్రాథమికో న్నత పాఠశాలలు 64, ఉన్నత పాఠశాలలు 101 ఉ న్నాయి. ఇందులో మొత్తం 22,142 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. వీరికి 2,68,550 పుస్తకాలు అవసరమని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటివరకు 1,54, 620 పుస్తకాలను విడతల వారీగా పంపించగా వాటిని జిల్లాకేంద్రంలో గోదాంలో భద్రపరిచారు. నోట్ బుక్స్ సైతం.. పేద, మధ్యతరగతి కుటుంబాలు వారి పిల్లలకు నోట్‌బుక్స్ కొనిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో వాటిని సైతం ఉచితంగా అందించాలనే ల క్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. గతేడా ది నుంచి పాఠ్య పుస్తకాలతో పాటు రాత పుస్తకాలను అందిస్తుంది. ఈ ఏడాది కూడా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. మొదటి రెండేళ్లు 6వ నుంచి 10వ తరగతి వారికి మాత్రమే రాత పుస్తకాలు అందించగా.. గతేడాది నుంచి ప్రాథమిక తరగతులకు ఇవ్వడం ప్రారంభించారు. క్యూ ఆర్ కోడ్‌తో ముద్రణ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన కొనసాగుతుంది. విద్యార్థుఽలకు అన్ని విషయాలు అర్థం అయ్యే విధంగా ఇబ్బందులు పడకుండా ఉండాలని పాఠ్యపుస్తకాల్లో ఇంగ్లిష్, తెలుగు బాషల్లో పాఠ్యంశాలను ముద్రిస్తున్నారు. అలాగే పుస్తకాలపై క్యూ ఆర్ కోడ్‌తో ముద్రిస్తున్నారు. దీంతో పుస్తకాలు పక్కదారి పట్టకుండా ఉండే అవకాశం ఉంది. పంపిణీకి సన్నద్ధం జిల్లాకు 2,68,550 లక్షల పాఠ్య పుస్తకాలు అవసరం ఇప్పటి వరకు వచ్చినవి 1,54,620 ఈనెల చివరి వరకు మిగతావి కూడా వచ్చే అవకాశంజిల్లాలో తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మీడియం పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో పుస్తకాలు అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. గతంలో రెండు భాషల్లో పాఠ్య పుస్తకాల ముద్రణకు ఆలస్యమయ్యేవి. ఈసారి విద్యార్థులకు ఇబ్బందులు కలగొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందస్తుగానే ముద్రణ ప్రారంభించింది. ఈ నెల చివరి కల్లా మిగతా పుస్తకాలు కూడా రానున్నాయి. పూర్తిస్థాయిలో అందిస్తాం..జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యాసంవత్సరం ప్రారంభం రోజే ఉచిత పాఠ్య పుస్తకాలు అందేలా కృషి చేస్తున్నాం. ఇప్పటికే జిల్లాకు 60 శాతం పుస్తకాలు చేరుకున్నాయి. మరో 15 రోజుల్లో పూర్తిస్థాయిలో రానున్నాయి. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా పాఠ్య పుస్తకాలతో పాటు నోట్ బుక్స్, ఏకరూప దుస్తులు కూడా అందించడానికి కృషి చేస్తున్నాం. – గౌసియా బేగం, ఇన్చార్జ్ ఏపీఓ -
రైతును కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానిదే
హన్మకొండ: రైతును కాపాడుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో మూడు రోజులపాటు జరిగిన రాష్ట్రస్థాయి మెగా రైతు మేళా గురువారం ముగిసింది. చివరి రోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు మేళాలో ఏర్పాటుచేసిన స్టాళ్లను సందర్శించి వివిధ ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ రైతాంగానికి కావాల్సిన అన్ని అవకాశాలు కళ్ల ముందుంచాలని, యాంత్రీకరణ, పురుగు మందులు, ఎరువులు, మార్కెటింగ్ వ్యవస్థ, భవిష్యత్‌లో రాష్ట్రంలో ఏ రకంగా ముందుకు పోవాలి తదితర అంశాలపై రైతులను అవగాహన కల్పించేందుకే హనుమకొండలో రైతుమేళా నిర్వహించామన్నారు. రైతుకు పాడి–పంట రెండూ అవసరమని, ఈ రెండింటి వైపు రైతును ప్రోత్సహించాలన్నారు. ఆయిల్‌పామ్ లాభదాయకమని, రైతులు దీని సాగుపై దృష్టి సారించాలన్నారు. సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్లాలన్నారు. రైతుబంధు పేరుతో యాంత్రీకరణ అపేసి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను అష్టకష్టాల పాలు చేసిందని విమర్శించారు. రుణమాఫీ, రైతు భరోసా, యూరియా సరఫరాపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. రైతులు దానం చేయాలని నాడు వైఎస్ చెప్పారు.. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రైతులు దానం చేయాలని, యాచించకూడదని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పారని, ఈ మేరకు వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ ఉచిత విద్యుత్ అందించారని, ప్రాజెక్టులు నిర్మించారన్నారు. అదే బాటలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. కొనుగోళ్లు వేగంగా జరగడం లేదు.. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ధాన్యం, మక్కల కొనుగోళ్లు వేగంగా జరగక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వర్షాలు రాకముందే కొనుగోళ్లు పూర్తి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో చేతులెత్తేసిందని విమర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, కేఆర్ నాగరాజు, రైతులు గోపిరెడ్డి గోపాల్ రెడ్డి, లావణ్య రెడ్డి, భాగ్యలక్ష్మి మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉద్యానశాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయ్, సత్యశారద, అదనపు కలెక్టర్లు ఎన్.రవి, సంధ్యారాణి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్రెడ్డి, ఎన్పీడీసీఎల్ అధికారులు, శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొన్నారు.ఆయిల్‌పామ్ సాగు లాభదాయకం సేంద్రియ పంటల వైపు రైతులు దృష్టి సారించాలి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ముగిసిన రాష్ట్రస్థాయి మెగా రైతుమేళా -
నేడు మెగా జాబ్‌మేళా
జనగామ: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నేడు (శుక్రవారం) మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి కె. కోదండ రాములు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్మీడియేట్ నుండి పోస్టు గాడ్యుయేషన్ వరకు విద్యార్హత కలిగిన యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు 50కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయన్నారు. ఈ నెల 8వ తేదీన హనుమకొండలోని బాలసముద్రం, కొత్త బస్టాండ్ సమీపంలోని కాళోజీ కళాక్షేత్రంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 91825 52593 నంబర్‌ను సంప్రదించాలన్నారు. మార్కెట్‌కు రెండు రోజుల సెలవుజనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం, మక్కల నిల్వలు పేరుకుపోవడంతో వాటిన తరలించేందుకు ఏఎంసీకి ఈ నెల 8, 9వ తేదీల్లో రెండు రోజులు పాటు సెలవును ప్రకటించినట్లు చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సరుకులను తరలించేం దుకు సరిపడా వాహనాలు అందుబాటులో లేకపోవడంతో ధాన్యం, మక్కలు పేరుకు పోయాయన్నారు. రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించగా, 10వ తేదీన ఆదివారం కావడంతో రైతులు ఎవరూ కూడా మార్కెట్‌కు సరుకులను తీసుకురావద్దన్నారు. ఈ నెల 11వ తేదీన యదావిధిగా మార్కెట్ సేవలు పునఃప్రారంభమవుతాయన్నారు. మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ జనగామ: మైనార్టీ విద్యార్థుల రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో యూపీఎస్సీ సీఎస్ఏటీ (సివిల్ సర్వీసెస్ అప్టిట్యూట్ టెస్ట్) 2026 పరీక్షకు ఉచిత శిక్షణను అందించనున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిగ్రీ పూర్తి చేసిన మైనార్టీ అభ్యర్థులు ఈ నెల 31వ తేదీ లోపు ఆన్లైన్ (సీఈటీ.సీజీజీ.జీఓవీ.ఇన్.టీఎంఆర్ఐఈఎస్)లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. జూన్ 14న జిల్లా కేంద్రంలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా మైనార్టీ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఈవీఎం గోదాం పరిశీలన జనగామ రూరల్: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు నెలవారీ తనిఖీలో భాగంగా కలెక్టరేట్లోని ఈవీఎం గోదాంను గురువారం అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా నమోదు పుస్తకం, సీసీ కెమెరాల పని తీరు, మంటల నియంత్రణ పద్ధతులను పర్యవేక్షించారు. భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని పోలీసు సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. ఈ పరిశీలనలో జనగామ ఆర్డీఓ గోపీరాం, తహసీల్దార్ మహిపాల్ రెడ్డి, ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు. గీత కార్మికులు సేఫ్టీ కిట్లను వినియోగించాలి జఫర్‌గఢ్: ప్రమాదాల బారిన పడకుండా గీత కార్మికులు తాటి చెట్లు ఎక్కేందుకు తప్పనిసరిగా కాటమయ్య సేఫ్టీ కిట్లను వినియోగించాలని జిల్లా కోఆర్డినేటర్ బాల్నే వెంకటమల్లయ్య కోరారు. మండలంలోని తీగారం గ్రామంలో సేఫ్టీ కిట్లపై గీత కార్మికులకు గురువారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వృత్తుల కంటే కల్లుగీత వృత్తి ప్రమాదకరమన్నారు. కాటమయ్య కిట్లు వాడడం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగవన్నారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి ఎకై ్సజ్ సీఐ సంతోష్‌రెడ్డి, ట్రేనర్స్ కుర్ర ఉప్పలయ్య, కనకటి రాజయ్య, బాల్నే కార్తిక్, గడ్డం రామచంద్రం, గడ్డం శ్రీనివాస్, తౌటి సురేష్‌గౌడ్, రాకేష్, పెద్ద శ్రీనివాస్, తవిటి రాకేష్, శ్రవణ్, కుమార్, సతీష్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు. -
క్యాంపు కార్యాలయంపై దాడిని ఖండిస్తున్నాం
జనగామ : కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అనుచరులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజాప్రతి నిధుల క్యాంపు కార్యాలయాలపైనే బీజేపీ గూండాలు దాడులకు తెగబడటం రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని చెప్పడానికి నిదర్శనమన్నారు. రాజకీయాల్లో మాటకు మాటతో సమాధానం చెప్పాలి గానీ, దాడులు చేసి విధ్వంసానికి పాల్పడటం బీ జేపీ అసలు స్వభావాన్ని బయటపెడుతోందని విమర్శించారు. ఎ మ్మెల్యే కార్యాలయంలో విధ్వంసం సృష్టించడం, కారు అద్దాలు పగులగొట్టడం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూపిస్తోందన్నారు. ఈ ఘటనలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ దాడి చేసే వారికే సహకరిస్తున్నట్టుగా వ్యవహరించడం అత్యంత బాధాకరమన్నారు. బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలని, ఈ దాడికి పాల్ప డిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై దౌర్జన్యం ప్రజాస్వామ్యంపై దాడి ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి -
సమస్యల పరిష్కారానికి చర్యలు
దేవరుప్పుల/లింగాలఘణపురం: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. గురువారం దేవరుప్పుల మండలంలోని ధారావ్తండా, సీతారాంపురం, లింగాలఘణపురం మండలంలోని పటేల్‌గూడెం, వనపర్తి గ్రామాల్లోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తరలించేందుకు అధికార యంత్రాంగం, నిర్వాహకులు సమన్వయం చేసుకొని కాంటా, రవాణా సజావుగా కొనసాగేలా చూడాలన్నారు. అకాల వర్షాల నేపధ్యంలో వీలును బట్టి రైతులు తమ సొంత వాహనాల్లో ధాన్యం తరలించవచ్చన్నారు.కేంద్రాల నిర్వహణ తీరు, రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ఎంత ధాన్యం కొనుగోలు చేశారు, టోకెన్లు ఎంత మందికి ఇచ్చారు, సమయానికి లారీలు వస్తున్నాయా, లోడింగ్ అన్‌లోడింగ్‌లో సమస్యలు ఉన్నాయా అంటూ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కమ్యూనిటీ పనులకు ప్రాధాన్యం ఉపాధి హామీ పథకం పనుల్లో కమ్యూనిటీ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. సీతరాంపూర్లోని మైనర్ ఇరిగేషన్ ట్యాంక్ వద్ద జరుగుతున్న ఉపాధి పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ నూరోద్దీన్, ఎంపీడీఓ మేనేక పౌడేల్, సర్పంచ్‌లు ధారావత్ అనిత, బస్వ ఎలేంద్ర వెంకన్న, ఏపీఎం సత్యనారాయణ, తదితరులు ఉన్నారు. రైతులు సొంత వాహనాల్లో ధాన్యం తరలించవచ్చు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
పేదలకు వరం బీసీ గురుకులాలు
జనగామ రూరల్: కార్పొరేట్ స్థాయిలో విద్యనందిస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న బీసీ గురుకులాలు పేద విద్యార్థులకు వరంగా మారాయి. నిత్యం విద్యార్థులకు నూతన విద్యావిధానాలకు అనుగుణంగా విద్యనందించడంతో పాటు పౌష్టికాహారం అందిస్తుంది. గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మ జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ విద్యాలయాల సంస్థ 2026–27 విద్యాసంవత్సరానికి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది. జిల్లావ్యాప్తంగా పదో తరగతి పూర్తైన విద్యార్థులు ఆన్లైన్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ మేరకు ఈనెల 12వ తేదీన దరఖాస్తుకు చివరి తేదీ ఉందని, విద్యార్థులు వినియోగించుకోవాలని బీసీ గురుకులాల సమన్వయ అధికారి శ్రీనివాస్ తెలిపారు. దరఖాస్తు చేసుకునే విధానం బీసీ గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు ఆయా గురుకులాల ప్రిన్సిపాళ్లకు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. మిగతా విద్యార్థులు ఎంజేపీటీబీసీఅడ్మిషన్.ఓఆర్జీ అనే వెబ్సైట్లో ఈనెల 12వ తేదీలోపు రూ.200 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. అందుబాటులో ఉన్న సీట్ల వివరాలు జిల్లాలో మొత్తం 6 బీసీ గురుకుల కళాశాలలు ఉన్నాయి. ఇందులో బాలుర కళాశాలలు 3, బాలికల కళాశాలలు 3 ఉన్నాయి. ప్రతీ కళాశాలలోఎంపీసీ 40, బైపీసీ 40, ఎంఈసీ 20, సీఈసీ 20 మొత్తం 720 సీట్లు ఉన్నాయి. సద్వినియోగం చేసుకోవాలి ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తూ విద్యార్థుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నాం. అన్ని రకాల వసతులతో ఉత్తమ బోధన కల్పిస్తున్నాం. జిల్లాలో 6 కళాశాలల్లో 720 సీట్లు ఉన్నాయి. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – శ్రీనివాస్, ఎంజేపీ జిల్లా కోఆర్డినేటర్ ఈనెల 12 వరకు ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ జిల్లాలో 6 కళాశాలలు, 700పైగా సీట్లు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి బీసీ గురుకులాల సమన్వయ అధికారి శ్రీనివాస్ -
అకాల వర్షం..ఆగమాగం
● ఐకేపీ కేంద్రాల్లో తడిచిన ధాన్యం ● పలుచోట్ల రాలిన మామిడి ● తడిచిన ధాన్యం తరలింపుపై కలెక్టర్ ఆదేశాలుజనగామ: జిల్లాలో అకాల వర్షం, ఈదురుగాలులు రైతుల కష్టానికి పరీక్షగా మారింది. మంగళవారం రాత్రి భారీగా వీచిన గాలులు, స్వల్ప వర్షంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ధాన్యం, మామిడితోటలకు స్వల్ప నష్టం జరుగగా, నష్టంపై జిల్లా పరిపాలన వేగంగా స్పందించారు. బచ్చన్నపేట మండలంలోని సాల్వాపూర్, గంగాపూర్, పడమటి కేశవాపూర్ ప్రాంతాల్లో మామిడి కాయలు రాలిపోగా, కోతకు సిద్ధమైన ధాన్యం గింజలు నీటిపాలు కాగా, సెంటర్లలో కొనుగోలుకు సిద్ధంగా ఉన్న సరుకు కొంతమేర తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందారు. జనగామ మండలం గానుగుపహాడ్ సహా పలు ఐకేపీ సెంటర్లలో కొనుగోలుకు సిద్ధంగా ఉన్న ధాన్యం తడిచింది. ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని దేవరుప్పుల మండలంలో రైతులు హైవేపై రెండు గంటల పాటు ధర్నాకు దిగారు. జనగామ మార్కెట్ కాటన్ యార్డులోని ఐకేపీ, మెప్మా సెంటర్లలో ధాన్యం తడిసిపోగా, రైతులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా వెంటనే స్పందించారు. కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేసే దిశగా చర్యలు ప్రారంభించారు. నర్మెట మండలం బొమ్మకూరు కొనుగోలు కేంద్రాన్ని ప్రత్యక్షంగా సందర్శించి, ఆలస్యం జరగకుండా టోకెన్ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. అనంతరం కలెక్టరేట్లో అత్యవసర సమావేశం నిర్వహించి అన్ని శాఖల సమ న్వయంతో కొనుగోలు తక్షణం పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
ప్రయాణికుల సౌకర్యమే ఆర్టీసీకి ప్రాధాన్యం
జనగామ: ప్రయాణికుల సౌకర్యమే ఆర్టీసీకి మొదటి ప్రాధాన్యమని, ప్రతీ సమస్యకు డిపో స్థాయిలో వెంటనే పరిష్కారం చూపుతామని కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి.సొలొమోను తెలిపారు. బుధవారం జనగామ డిపోను ఆయన సందర్శించారు. డిపో పరిసరాలు, బస్సుల నిర్వహణ, సిబ్బంది పనితీరును పరి శీలించారు. అనంతరం బస్స్టేషన్న్లో జరిగిన ప్రయాణికుల సదస్సులో పాల్గొని వారితో నేరుగా మాట్లాడారు. కొన్ని రూట్లకు సంబంధించి ప్రయాణికులు సూచనలు, అభ్యర్థనలు తెలియజేయగా, ఈడీ సొలొమోను వెంటనే స్పందించి సంబంధిత డిపో మేనేజర్లకు తగిన ఆదేశాలు జారీ చేశారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తూ మజ్జిగ ప్యాకెట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అనంతరం జనగామ డిపో బస్సుల టైమింగ్స్‌తో కూడిన క్యాలెండర్లను ప్రజలకు అందించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ ఎస్.స్వాతి, సూపర్ వైజర్లు, సిబ్బంది, ప్రయాణికులు పాల్గొన్నారు. రైతులు ఆందోళన చెందొద్దు జనగామ: జిల్లాలో తూకం వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో ఎలాంటి జాప్యం జరగడం లేదని సివిల్ సప్లయీస్ డీఎం హథీరామ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని హన్మంతాపూర్, ఆలీంపూర్, తమ్మడపల్లి రైతుల ధాన్యం ఎక్కువగా ఉన్న కారణంగా రవాణా పరంగా కొంత జాప్యం జరుగుతోందన్నారు. ఈ సమస్యను తక్షణం పరిష్కరించేందుకు అదనపు లారీలను ఏర్పాటు చేయడంతో పాటు తూకం వేసిన సరుకును ఆలస్యం చేయకుండా షిఫ్టింగ్ చేసేలా సదరు కాంట్రాక్టర్‌కు ఆదేశాలు జారీ చేశామన్నారు. జిల్లాలో గన్నీ బ్యాగుల కొరత లేదన్నారు. జిల్లాలో రైతులు ఆందోళన చెంది రోడ్డోక్కి రాస్తారోకోలు, ధర్నాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రతీ గింజను కొనుగోలు చేసే బాధ్యతను జిల్లా యంత్రాంగం తీసుకుందని, రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. మక్కలు కొంటున్నాం.. జనగామ: జిల్లాలో మొక్కజొన్న కొనుగోళ్లు వేగవంతంగా కొనసాగుతున్నాయని మార్క్‌ఫెడ్ మేనేజర్ రాజశేఖర్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో 41,718 ఎకరాల్లో మొక్కజొన్న పండగా, అందులో 26,050 మెట్రిక్ టన్నుల దిగుబడి రానున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 11,05,527 క్వింటాళ్ల మొక్క జొన్నను కొనుగోలు చేసినట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 5 మక్కల కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 1,765 మంది రైతుల నుంచి 86,514 క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు జరిగిందన్నారు. దీనికి సంబంధించి రూ.20.76 కోట్ల నగదును రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. రైతుల కోసం ఏర్పాటు చేసిన శాశ్వత మానిటరింగ్ వేదిక ఆధ్వర్యంలో సీఏపీ నిల్వ కేంద్రం (4,000 మెట్రిక్ టన్నులు) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే యశ్వంతాపూర్ ఐకేపీ మక్కల కొనుగోలు కేంద్రంలో మొక్కజొన్నల కొనుగోలు కొనసాగుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలి స్టేషన్‌ఘన్‌పూర్: రైతుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను, సౌకర్యాలను రైతులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జి.అనిత సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 4 నుంచి నిర్వహిస్తున్న రైతువారం కార్యక్రమంలో భాగంగా స్థానిక రైతువేదికలో బుధవారం రైతులకు ప్రత్యేక అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. బ్యాంకుల ద్వారా దీర్ఘకాలిక, స్వల్పకాలిక పంట రుణాలు, సహకార సంఘాలు, ఎఫ్పీఓల ద్వారా రైతులకు సేవలు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలు తదితర అంశాలపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఘన్పూర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్‌రెడ్డి, డీసీఓ కోదండరాం, కోఆపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ దివ్య, వ్యవసాయ మార్కెట్ సెక్రటరీ జన్ను భాస్కర్, పీఏసీఎస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ చిర్ర నాగరాజు, నాబార్డు అధికారులు, బ్యాంకుల మేనేజర్లు, పీఏసీఎస్ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. -
సీఎంను గద్దె దించేందుకు పోరాటానికి సిద్ధం
రేవంత్‌రెడ్డిని గద్దె దించేందుకు పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. రైతులను గోస పెడుతూ 40 ఏళ్ల నాటి కాంగ్రెస్ పాలనను తిరిగి గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ పాలనలో కల్లాల దగ్గరే పంట కొనుగోలు చేయగా, నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కల్లాల దగ్గర, కాంటాల దగ్గర ఎంత ఇస్తావంటూ అవినీతి రాజ్యమేలుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలకు నా చాలెంజ్.. రైతు మేళాను రైతుల మార్కెట్లో పెట్టండి.. ఉరికిచ్చి కొడతారు. – ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ మంత్రి కేసీఆర్ పాలన రైతులకు స్వర్ణయుగం పదేళ్ల కేసీఆర్ పాలన రైతులకు స్వర్ణయుగంలా ఉండగా, నేటి కాంగ్రెస్ పాలన రైతుల పాలిట రాబందుల పాలనగా మారింది. రైతులను గోస పెట్టుకుంటున్న రేవంత్ పాలన పోయి అన్నం పండించే రైతు మూడు పూటలా కడుపు నిండా భోజనం చేసే బీఆర్ఎస్ పాలన రావాలి. పడించిన పంటలో పావలా వంతు కూడా కొనకుండా రైతులను అరిగోస పెట్టుకుంటున్న ప్రభుత్వం చెర నుంచి రైతులకు విముక్తి రావాలి. – సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి తెలంగాణ ఊపిరి మా సదస్సు పోరాటాలకు పుట్టినిల్లు వరంగల్‌లో బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు పెట్టడానికి అనుమతి ఇవ్వలేదు. ఇక్కడి ఎమ్మెల్యే.. మీది ఏం సదస్సు, ఏం సభ అంటూ వెటకారంగా మాట్లాడారు. మాది తెలంగాణ ఊపిరి సదస్సు. రైతును రాజు చేయాలని, రైతు పక్షపాతి కేసీఆర్.. రైతుబంధు, రైతు భరోసా చరిత్రాత్మక నిర్ణయం తీసుకుని పథకాలు తీసుకొచ్చా రు. కానీ, కాంగ్రెస్ సర్కారు వాటిని తుంగలో తొక్కింది. – పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే, జనగామ -
టోకెన్ పద్ధతి కచ్చితంగా పాటించాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నర్మెట: ధాన్యం కొనుగోలు ప్రక్రియలో టోకెన్ పద్ధతిని కచ్చితంగా పాటించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నిర్వాహకులను ఆదేశించారు. మండలంలోని బొమ్మకూర్‌లో ఐకేపీ ఆధ్వర్యంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. అక్కడి సౌకర్యాలను పరిశీలించిన తర్వాత రైతులతో మాట్లాడారు.. లారీ ల యజమానులు కొర్రీలు పెడితే సమాచారం అందించాలని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. తడిసిన ధాన్యం మిల్లులకు తరలించాలి జనగామ రూరల్: అకాల వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని రైతులు ఆందోళనకు గురికావద్దని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్‌తో కలిసి సివిల్ సప్లై, వ్యవసాయ, కోఆపరేటివ్, రవాణా, మార్కెటింగ్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. బమ్మెర పోతన అభివృద్ధి పనులు వేగవంతమవ్వాలి పాలకుర్తి మండలం బమ్మెర గ్రామంలో చేపడుతున్న పోతన స్మారక మందిరం, కాంస్య విగ్రహం ఏర్పాటు అభివృద్ధి పనులు వేగవంతం కావాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. టూరిజం, ఇరిగేషన్, ఆర్ అండ్‌బీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్వీయగణన సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి జాతీయ ఇళ్ల జాబితా, స్వీయగణన నేపథ్యంలో ప్రజలు ఆన్లైన్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌న్‌లైన్‌న్‌లో నమోదు చేసినప్పటికీ ప్రభుత్వం నియమించిన ఎన్యుమరేటర్లు ప్రతీ ఇంటిని సందర్శించి, నమోదు చేసిన వివరాలను ధ్రువీకరిస్తారని స్పష్టం చేశారు. -
వడ్లు కొనండి సారూ..
● ఆర్డీఓ కాళ్లు మొక్కుతూ వేడుకున్న రైతు జనగామ: అకాల వర్షంతో పలుచోట్ల ధాన్యం తడవడంపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వేగవంత చర్యలు తీసుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు ఆర్డీఓ గోపిరాం జనగామ మార్కెట్లోని కాటన్ యార్డుకు చేరుకుని రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ఒక్కో రైతు వద్దకు వెళ్లి ధాన్యం నష్టాన్ని అడిగి తెలుసుకున్న ఆర్డీఓ.. సెంటర్ నిర్వాహకులను పిలిపించి కొనుగోలు ప్రక్రియ ఎందుకు ఆలస్యమవుతుందో ఆరా తీశారు. మార్కెట్లో లారీలు రాక 20 రోజులుగా నిలిచిపోవడం వల్లే ధాన్యం పేరుకపోయిందని రైతులు ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే లారీలను పంపించి కొనుగోళ్లు ఆలస్యం జరగకుండా చూడాలని విన్నవించారు. ఈక్రమంలో రైతు ప్రకాశ్ తన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఆర్డీఓ కాళ్లు మొక్కుతూ వేడుకున్నారు. కాటన్ యార్డులో స్థలం లేక ముగ్గురు, నలుగురు రైతులు బయట ధాన్యాన్ని ఆరబెట్టుకోగా, వాటిని కొనుగోలు చేయలేమని అధికారులు చెప్పడంతో సదరు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఆర్డీఓ కారుకు అడ్డంగా కూర్చొని రైతులు నిరస న తెలిపారు. సీరియల్ ప్రకారం ఆరుబయట ఉన్న రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని ఆర్డీఓ నిర్వాహకులకు చెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది. -
ఓరుగల్లునుంచే రైతుపోరు
సాక్షిప్రతినిధి, వరంగల్/కాజీపేట అర్బన్: ‘రైతుకు ఓపిక నశిస్తే భూకంపం పుడుతుందని పాలకులు గ్రహించాలి. భూమిని దున్నడం తెలిసిన రైతు నాగలి తిరగేసి కాంగ్రెస్‌ను బొంద పెడతారు.. వరంగల్ వేదికగా ఏ ఉద్యమం మొదలుపెట్టినా విజయవంతమవుతుంది. ఇప్పుడు జరిగిన ఈ రైతు సంగ్రామ సదస్సు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. వరంగల్ హంటర్ రోడ్డులో బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు సంగ్రామ సదస్సు నిర్వహించారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతుల మృతికి సంతాపంగా తొలుత ఒక నిమిషం మౌనం పాటించి, నివాళులర్పించి సదస్సును ప్రారంభించారు. జై కేసీఆర్ నినాదాలతో సదస్సు ప్రాంగణం మార్మోగింది. ‘కేసీఆర్ సారు మళ్లీ రావాలి. రైతు బంధు రాజ్యం రావాలి. రాబందుల పాల న పోవాలి’ అంటూ ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు నినదించారు. కాగా, కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ వైఫల్యాలు, ప్రభుత్వ తీరును కేటీఆర్ తన ప్రసంగంలో ఎండగట్టారు. రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డిపై ఘాటైన విమర్శలు చేశారు. సదస్సుకు హాజరైన పలువురు రైతులు, రైతు ప్రతినిధులు కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై తమ అభిప్రాయాల్లో అసంతృప్తిని వ్యక్తం చేశారు. సదస్సులో పలు తీర్మానాలు ప్రవేశపెట్టి హర్షధ్వానాల మధ్య ఆమోదించారు. రైతు సంగ్రామ సదస్సు బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపింది. సదస్సులో గాయకులు మధుప్రియ, మిట్టపల్లి సురేందర్, రసమయి బాలకిషన్ పాటలతో హోరెత్తించారు. ప్రత్యేక ఆకర్షణగా ఎడ్లబండి.. రైతు సంగ్రామ సదస్సు ప్రాంగణం ఎదుట ఏర్పాటు చేసిన కంకులతో రూపొందించిన పసుపు చీరను కట్టుకున్నట్లుగా ఎడ్లబండి, నాగలి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పలువురు ఎడ్ల బండి, నాగలి వద్ద సెల్ఫీలు దిగారు. వేసవి తాపానికి అంబలి.. దాహానికి మజ్జిగ, మంచినీళ్లు సదస్సుకు వచ్చిన రైతులకు వేసవి తాపాన్ని తగ్గించేందుకు మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు, బాటిళ్లను ఏర్పాటు చేశారు. సుమారు 10 వేల మంది రైతులకు తెలంగాణ వంటకాలను ఏర్పాటు చేశారు. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అంబలి స్టాల్‌ను ఏర్పాటు చేసి దాహార్తి తీర్చారు.కాంగ్రెస్ ప్రభుత్వంపై మరింత ఉధృతం చేస్తామన్న కేటీఆర్ జై కేసీఆర్.. సారు మళ్లీ రావాలి నినాదాలతో మార్మోగిన రైతు సంగ్రామ సదస్సు పాటలతో హోరెత్తించిన మధుప్రియ, మిట్టపల్లి సురేందర్, రసమయి అభిప్రాయాలు, కష్టాలు పంచుకున్న రైతులు.. పలు రైతు తీర్మానాలకు ఆమోదం కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టిన నేతలు.. బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ -
కల్లాల కాడ రైతుల ఎదురు చూపులు
కాంగ్రెస్ వాళ్లకే యూరియా.. వ్యవసాయంలో వ్యత్యాసం చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ వాళ్లకే ముందుగా యూరియా ఇస్తున్నారు. వాళ్ల పంటనే ముందుగా కొంటున్నారు. వర్షం వచ్చి వడ్లు తడుస్తున్నా.. పట్టించుకునే నాథుడే లేడు. అంతా అవినీతి, అక్రమాలకు నిలయంగా కాంగ్రెస్ పాలన నిలుస్తోంది. – సుబ్బారావు, రైతు, ఖానాపురం, వరంగల్ పండించిన పంటను ఎప్పుడు కొంటారు? పెట్టిన పెట్టుబడి ఎప్పుడు చేతికందుతుందని రైతులు కల్లాల కాడ.. మక్కల అమ్మకానికి నెల రోజులుగా ఎదురుచూస్తున్నారు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన ఎవుసం ఎప్పుడూ అభివృద్ధి చెందదు. కేసీఆర్ పాలనలో రైతు బంధు ద్వారా ఎకరాకు రూ.5 వేలు ఇవ్వగా, ఇప్పుడు ఒక ఎకరానికి మాత్రమే రూ.6 వేలు వేస్తున్నారు. – ఊకంటి రవి, రైతు, దుగ్గొండిరైతుబంధు పడట్లేదు.. యాక్సిడెంట్లో కాలు కోల్పోయినా కూడా కేటీఆర్‌ను చూసేందుకు, బీఆర్ఎస్పై మక్కువతో ఒక్క కాలితో నేలపై అతి కష్టమ్మీద సదస్సుకు వచ్చా. నాకు మూడెకరాల భూమి ఉంటే రైతు బంధు ఇస్తలేరు. కేసీఆర్ సారే సీఎం కావాలి. ఈసారి ఓటు వృథా చేసుకోం – ఎండీ మక్బూల్, రైతు, కొత్తపేట, హనుమకొండ ● -
ఎజెండా ఎలా ఆమోదిస్తారు?
మేం రాకముందేజనగామ: జనగామ మున్సిపల్ సాధారణ సమావేశం బుధవారం రసాభాసగా మారింది. గత నెల 30న వాయిదా పడిన సమావేశాన్ని బుధవారం మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి అధ్యక్షతన ఉదయం 10.30 గంటలకు ప్రారంభించారు. కౌన్సిల్లో మూడో వంతు సభ్యులు హాజరుకావడంతో చైర్పర్సన్ ఆదేశాల మేరకు 54 ఎజెండా అంశాలను సమావేశం ముందుంచగా కాంగ్రెస్‌కు చెందిన 9 మంది, బీఆర్ఎస్కు చెందిన ముగ్గురు సభ్యులు హాజరయ్యారు. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికి బీఆర్ఎస్ కౌన్సిలర్ ఉడుగుల కిష్ట య్య ఎజెండాపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మెజారిటీ సభ్యులు ఆమోదం తెలవడంతో చైర్పర్సన్ అంశం ఆమోదించినట్లు ప్రకటించారు. ఇదే సమయంలో అరగంట ఆలస్యంగా వచ్చిన బీఆర్ఎస్ సభ్యులు, తాము రాకముందే ఎజెండా అంశాలు తీర్మానించడం ఏంటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 54 ఎజెండా అంశాలను 30 నిమిషాల్లో ఎలా చదివారు? అని ప్రశ్నిస్తూ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు వారించగా మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆగ్రహం.. నిరసనలు బీఆర్ఎస్ సభ్యులు కమిషనర్ మహేశ్వర్‌రెడ్డిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము రాకముందే సమావేశం నిర్వహించడం అన్యాయమని ఆరోపించగా, కమిషనర్ మాత్రం నియమ నిబంధనల ప్రకారం చైర్పర్సన్ ఆదేశాలతోనే సమావేశం ప్రారంభించామని, మొత్తం వీడియో రికార్డ్ కూడా చేసినట్లు వారికి వివరించారు. అయితే బీఆర్ఎస్ సభ్యులు ఎజెండాలో నిధుల దుర్వినియోగానికి సంబంధించిన అంశాలు ఉన్నాయని, కావాలనే తమ కు అవకాశం ఇవ్వకుండా ఆమోదించారని మండిపడ్డారు. చైర్పర్సన్ వారి ఆరోపణలను ఖండిస్తూ సమావేశానికి మూడు రోజుల ముందే నోటీసులు ఇచ్చామని, ఆలస్యంగా వచ్చిన వారు ఇప్పుడెలా అభ్యంతరం చెబుతారని, తమ హయాంలో ఏ దుర్వినియోగం జరగదని స్పష్టం చేశారు. ఉద్రిక్తతలు పెరిగే క్రమంలో చైర్పర్సన్ సమావేశం ముగిసినట్లు ప్రకటించి చాంబర్‌కు వెళ్లిపోయారు. కమిషనర్ కారు ముందు బైఠాయింపు ఆ తర్వాత కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి తన చాంబర్లోకి వెళ్లగా, అక్కడకు చేరుకున్న బీఆర్ఎస్ సభ్యులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. పరిస్థితి వేడెక్కడంతో కమిషనర్ బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా, ఆయన కారు ముందు బైఠాయించి బీఆర్ఎస్ సభ్యులు అడ్డుకున్నారు. కొంతమంది బీఆర్ఎస్ సభ్యులు ఎజెండా కాపీలను చింపి నిరసన తెలిపారు. ఈ సంఘటనల నేపథ్యంలో సీఐతో పాటు పోలీసులు వచ్చి పరిస్థితిని సమీక్షించి ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నం చేశారు. సమావేశంలో చర్చకు బదులు ప్రతీసారి గొడవలకు దిగుతున్న బీఆర్ఎస్ సభ్యుల ధోరణిని ప్రజలు గమనిస్తున్నారని చైర్పర్సన్ బాలమణి వ్యాఖ్యానించారు. మరోవైపు చైర్పర్సన్ ఎజెండాను ఇష్టానుసారం ఆమోదించేందుకు ప్రయత్నిస్తున్నారని, దుర్విని యోగాన్ని అడ్డుకునేందుకే తాము ఆందోళన చేస్తున్నామని బీఆర్ఎస్ కౌన్సిలర్లు అన్నారు. కమిషనర్ ఒక పార్టీకే మద్దతు పలుకుతున్నారని ఆరోపించారు. రెండు గంటలపాటు కొనసాగిన ఉద్రిక్త వాతావరణం తర్వాత పరిస్థితి సాధారణమైంది. 30 నిమిషాల్లో 54 అంశాలు చదివారా? ఎజెండా ఆమోదంపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కాపీల చించివేత..కమిషనర్ కారు ఎదుట బీఆర్ఎస్ కౌన్సిలర్ల నిరసన ఆలస్యంగా వచ్చి గొడవ చేస్తారా?: చైర్పర్సన్ బాలమణి రసాభాసగా ముగిసిన మున్సిపల్ సాధారణ సమావేశం -
ధాన్యం తరలించాలని రాస్తారోకో
బచ్చన్నపేట: ధాన్యం తరలించడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని, అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని మంగళవారం మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. జాతీయ రహదారిపై ధర్నా చేయడంతో ఎక్కడి వాహనాలు అక్కడే కిలోమీటరు మేర నిలిచిపోయాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి నెల రోజులు గడుస్తున్నా తరలించడం లేదని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల వద్దకు లారీలు రావడం లేదన్నారు. ధర్నా వద్దకు వచ్చిన ఎస్సై శ్రీకాంత్ సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడుతానని హామీ ఇవ్వడంతో రైతులు వెనుదిరిగారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా మాజీ కోఆర్డినేటర్ ఇర్రి రమణారెడ్డి, మాజీ సర్పంచ్ వడ్డెపల్లి మల్లారెడ్డి, పర్వతం మధుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మాది రైతు పక్షపాతి ప్రభుత్వం
హన్మకొండ: రైతును రాజును చేయడమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ లక్ష్యమని, మాది రైతుపక్షపాతి సర్కార్ అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మూడు రోజులపాటు జరిగే రాష్ట్రస్థాయి మెగా రైతుమేళాను బుధవారం మంత్రులు కొండా సురేఖ, ధనసరి సీతక్క, ఎంపీ కావ్య, ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి పొంగులేటి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ప్రగతి ప్రణాళికలో భాగంగా 99రోజులు అధికారులను ప్రజల ముంగిటికి పంపిస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే రైతు ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. 2022లో అద్భుతమైన రైతు డిక్లరేషన్ సభ నిర్వహించి ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత వెరవేరుస్తామని చెప్పి, సీఎం రేవంత్ నాయకత్వంలో రైతు పక్షపాతి ప్రభుత్వం ఏర్పాటు కాగానే అమలు చేస్తున్నామన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా, రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదటిసారి రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమని గుర్తు చేశారు. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వం కొంటుందన్నారు. బీఆర్ఎస్ నాయకులు అధికారం పోయిందని కడుపునిండా విషం నింపుకుని మాట్లాడుతున్నారన్నారు. కల్లాల వద్దకు వెళ్లి సినిమాలో ఫోజులు ఇచ్చినట్లు ఇచ్చి పత్రికల్లో ఫొటోలు వేయించుకుంటున్నారన్నారు. ఎన్ని మీటింగ్‌లు పెట్టుకున్నా, నాలుగు సార్లు ముక్కు నేలకు రాసినా రైతులు పట్టించుకోరన్నారు. ఓర్వలేక బీఆర్ఎస్, బీజేపీ విమర్శలు.. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంటే బీఆర్ఎస్, బీజేపీ ఓర్వలేక విమర్శలు చేస్తున్నాయని అన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌ను గెలిపించాలని, సీఎం రేవంత్‌కు అండగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ హామీలు నెరవేర్చకుండా ఇప్పుడు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా బీఆర్ఎస్ నాయకులు కళ్లుండి చూడలేని, చెవులు ఉండి వినలేని దద్దమ్మలని అన్నారు. ధాన్యం కొనుగోళ్లకు ఇబ్బంది పెడుతున్న కేంద్రం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేయాలని చూస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొర్రీలు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. గత ప్రభుత్వం తడిసిన ధాన్యం కొనలేదని, తాము అన్నీ కొంటున్నామన్నారు. ఈ సందర్భంగా భూసార పరీక్షలు నిర్వహించుకున్న ఐదుగురు రైతులకు మంత్రుల చేతులమీదుగా పత్రాలు అందజేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్.నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, ఉద్యాన శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయ్, డాక్టర్ సత్యశారద పాల్గొన్నారు. రైతును రాజును చేయడమే లక్ష్యం ప్రభుత్వం పోయిందని కడుపునిండా విషం నింపుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హనుమకొండలో రాష్ట్రస్థాయి మెగా రైతుమేళా ప్రారంభం వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తులు, యంత్ర పరికరాలతో ఆకట్టుకున్న స్టాళ్లు సందర్శించి వివరాలు తెలుసుకున్న అన్నదాతలు -
ఓరుగల్లు వేదికగా రైతుపోరు!
సాక్షిప్రతినిధి, వరంగల్: రైతు సంగ్రామ సదస్సు కోసం ఓరుగల్లు ముస్తాబైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా బుధవారం హాజరవుతున్న ఈ సభ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. సదస్సు ఏర్పాట్లను కేటీఆర్ డైరెక్షన్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, తదితర ముఖ్య నేతలు, సీనియర్లతో కలిసి ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఉమ్మడి వరంగల్ నుంచి సుమారు 10 వేల మంది రైతులు హాజరవుతారని అంచనా వేసిన నేతలు ఆ మేరకు సదస్సులో ఏర్పాట్లు చేశారు. కాగా, వరంగల్ నుంచే రైతుపోరుకు శ్రీకారం చుట్టిన బీఆర్ఎస్.. సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. విస్తృత ఏర్పాట్లు... రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వ చేసిన మోసాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించనున్న సదస్సుకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. గత నెల 26న హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రైతు సంగ్రామ సదస్సుకు చకచకా ఏర్పాట్లు చేశారు. హనుమకొండ హంటర్ రోడ్డులోని సీఎస్ఆర్ గార్డెన్‌కు ఎదురుగా ఉన్న సుమారు ఐదెకరాల స్థలంలో సదస్సు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సుమారు 10వేల మంది రైతు ప్రతినిధులు సదస్సుకు హాజరు కానున్న నేపథ్యంలో ఎండ వేడిని తట్టుకునేలా జర్మనీ టెంట్లు వేశారు. ఆ పక్కనే హాజరయ్యే రైతుల కోసం భోజనం ఏర్పాటు చేశారు. కాగా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సదస్సుకు హాజరయ్యే రైతుల వాహనాల పార్కింగ్ కోసం కూడా ప్రత్యేక ప్రాంతాలను సూచించారు. కొలంబో మెడికల్ కాలేజ్ గ్రౌండ్ ఎదురుగా ఉన్న ప్రైవేట్ స్థలంలో పాలకుర్తి, ములుగు, మహబూబాబాద్, నర్సంపేట, డోర్నకల్, వర్ధన్నపేట నియోజకవర్గాలకు చెందిన వాహనాలు, తేజస్వీ స్కూల్ గ్రౌండ్‌తో పాటు, భారత్ పెట్రోల్ బంక్‌కు ఎదురుగా ఉన్న స్థలంలో స్టేషన్‌ఘన్‌పుర్, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల వాహనాలు, పాపడమ్స్ ఎదురుగా ఉన్న పద్మాలయ ఫంక్షన్ హాల్లో జనగామ నియోజకవర్గంతో పాటు జనరల్ వాహనాల కోసం పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలు, గులాబీ తోరణాలు బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు సంగ్రామ సదస్సు సందర్భంగా వరంగల్ నగరంలోని ప్రధాన రహదారులన్నీ గులాబీమయమయ్యాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ముఖ్య నేతల రాక సందర్భంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు, గులాబీ తోరణాలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా, బీఆర్ఎస్ నేతలు మంగళవారం ప్రెస్మీట్లో వెల్లడించిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 9 గంటల వరకే రైతులు సదస్సుకు హాజరయ్యేలా కార్యాచరణ సిద్ధం చేశారు. సదస్సు ప్రారంభంలో మొదట రైతు ప్రతినిధుల నుంచి ప్రభుత్వం వైఖరి, పరిపాలన విధానాలపై అభిప్రాయ సేకరణ చేయనున్నారు. ఈసందర్భంగా పలువురు రైతు ప్రతినిధులను సదస్సులో మాట్లాడించనున్నారు. ఆతర్వాత మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు కూడా తమ ప్రసంగం ద్వారా అభిప్రాయాలు వెల్లడించనున్నారు. అనంతరం రైతు సదస్సు ద్వారా ప్రస్తుత ప్రభుత్వ విధానాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలకు వివరించనున్నారు. ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. నేడు బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు హంటర్‌రోడ్డులో 10వేల మందికి ఏర్పాట్లు ఉదయం 9 గంటలకే వచ్చేలా సమీకరణ మొదట ప్రభుత్వ వైఖరిపై రైతుల అభిప్రాయాలు అనంతరం బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రసంగం గులాబీమయమైన వరంగల్ నగరం కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరించేందుకే రైతు సదస్సు విలేకరులతో బీఆర్ఎస్ నేతలు -
జైసోనియా, రాహుల్ అంటే డబ్బులొస్తాయా?
జనగామ రూరల్: శ్రీరాం అంటే డబ్బులు వస్తాయా అని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించడం సరికాదని, జై సోనియా, రాహూల్గాంఽధీ అంటే డబ్బులు వస్తాయా? అని ఎంపీ రఘునందన్‌రావు విమర్శించారు. మంగళవారం జనగామలో జరిగిన ప్రధాని జనగ్రహ సభ సన్మాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.. కొండా సురేఖ దేవాదాయశాఖ మంత్రి అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు. బీజేపీ శ్రీరామ్ అంటుందని, రాముని వారసులమని, దేవుళ్ల తోటి పెట్టుకున్న వాళ్లు కాలగర్భంలో కలిసిపోతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయం జెండా ఎగరవేస్తామని అన్నారు. కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత మొదటిసారి తెలంగాణకు వస్తున్న ప్రధాని మోదీ రూ.7వేల కోట్ల అభివృద్ధి పనులు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మాజీ మంత్రి గుండే విజయరామారావు, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరుట్ల దశమంత రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విద్యాసాగర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు లేగ రామ్మోహన్ రెడ్డి, ఉడుగుల రమేష్, సుభాష్, బల్ల శ్రీనివాస్, కొంతం శ్రీనివాస్ , శివరాజ్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు భాగాల నవీన్ రెడ్డి, తోకల ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. మంత్రి సురేఖ వ్యాఖ్యలు సరికాదు ప్రధాని మోదీ సభ సన్నాహక సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు -
గన్నీసంచులు అందుబాటులో ఉంచండి
రఘునాథపల్లి: ధాన్యం కొనుగోలులో రైతులు ఇబ్బంది పడకుండా అవసరమైన గన్నీసంచులు అందుబాటులో ఉంచాలని, రవాణా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ప్రమాణాల ప్రకారం ఉంటే రైతులు తీసుకొచ్చే ధాన్యాన్ని వెంటనే తూకం వేసి మిల్లులకు తరలించాలన్నారు. మంగళవారం మండలంలోని రఘునాథపల్లి, కంచనపల్లి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాంట ఎలా వేస్తున్నారు.? కేంద్రాలకు లారీలు సకాలంలో వస్తున్నాయా? అని తదితర వివరాలు నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. పీహెచ్సీ తనిఖీ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. పీహెచ్సీలో అందుతున్న వైద్యసేవలు, సిబ్బంది హాజరు, మందుల లభ్యత, పరిశుభ్రత, రోగులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని,, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి జనగామ రూరల్: భూభారతి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని, సాదాబైనామా పరిష్కారంలో జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం భూ భారతి, సాదాబైనామా పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భూ సంబంధిత పత్రాలు, పాత రికార్డులు, ఆదాయ పత్రాలు, తదితర వివరాలను కచ్చితంగా పరిశీలించాలన్నారు. దరఖాస్తుదారులకు పారదర్శకంగా సమాచారం అందించి, ఎటువంటి పొరపాట్లు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. కొనుగోళ్లలో జాప్యం జరగొద్దు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
పంట సౌభాగ్యం
భూసార పరీక్షలతో స్థిర వ్యవసాయంజనగామ: జిల్లా రైతుల్లో భూసారం పరిరక్షణపై అవగాహన పెరుగుతోంది. మంచి దిగుబడులు సాధించాలంటే భూమి ఆరోగ్యం అత్యంత కీలకమని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. నేలలో పోషకాలు, సేంద్రియ పదార్థం, నీటి నిల్వ సామర్థ్యం, గాలి ప్రసరణ వంటి అంశాలు సమతుల్యంగా ఉన్న ప్పుడే పంటలు సమృద్ధిగా పండుతాయని అధికారులు చెబుతున్నారు. వచ్చే వానాకాలం సీజన్ నాటికి రైతులు మట్టి పరీక్షలు చేయించుకునే విధంగా వ్యవసాయ శాఖ అవగాహన కల్పిస్తోంది. పంటల సాగుకు 20 రోజుల ముందుగానే మట్టి పరీక్షలు చేయించుకుని సాగుపనులు మొదలుపెడితే ఎరువుల ఖర్చు తగ్గడంతో పాటు పంట దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. భూసారాన్ని ప్రభావితం చేసే అంశాలు జిల్లాలో ఇసుక, బంకమట్టి, ఎర్రమట్టి వంటి విభిన్న నేల రకాలున్నాయి. నేలలోని సేంద్రియ పదార్థం పరిమాణం, సూక్ష్మజీవుల క్రియాశీలత, వాతావరణ పరిస్థితులు ఇవన్నీ భూసారం స్థాయిని నిర్ణయించే ముఖ్యమైన అంశాలు. వరుస పంటలు, అధిక రసాయన ఎరువుల వినియోగం వల్ల భూసారం తగ్గుతు ండడంతో భూసార శ్రేణిని పెంచే పద్ధతులను రైతులు అవలంబించాలని నిపుణులు సూచిస్తున్నారు. చెరువు మట్టి–మళ్లీ సారం చేరే మార్గం రైతులు ప్రతీ 2–3 సంవత్సరాలకు ఎకరానికి 15 నుంచి 20 బండ్ల చెరువు మట్టిని వేయడం ద్వారా భూమిలో సూక్ష్మపోషకాలు పునరుద్ధరించవచ్చు. జనగామ, బచ్చన్నపేట, లింగాలఘణపురం ప్రాంతాల్లో ఇప్పటికే పలువురు రైతులు ఈ పద్ధతిని అమలు చేస్తూ మంచి ఫలితాలు పొందుతున్నారని అధికారులు చెబుతున్నారు. చెరువు మట్టి నేల నిర్మాణాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తోంది. సేంద్రియ ఎరువులతో నేల ఆరోగ్యం జిల్లాలో పెంటపోగు వినియోగం పెరుగుతోంది. పశువుల ఎరువు, పంట అవశేషాలతో తయారైన పెంటపోగు ఎరువు నేల గాలి ప్రసరణను, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుందని అధికారులు చెబుతున్నారు. రైతులు వర్మికంపోస్ట్ తయారీపై ఆసక్తి చూపుతున్నారు. 40 నుంచి 60 రోజుల్లో సిద్ధమయ్యే ఈ సహజ ఎరువు నేలలో సూక్ష్మజీవులను పెంచి పంటలకు తక్షణ పోషకాలను అందిస్తుంది. పంటల మార్పిడి.. వరి తర్వాత పప్పు ధాన్యాలు, పత్తి తర్వాత కూరగాయలు వంటి పంటల మార్పిడి పద్ధతులు నేలలో పోషకాల లోపాలను నివారిస్తాయి. వరుసగా ఒకే పంట వేయడం వల్ల నేలలోని కొన్ని నిర్దిష్ట పోషకాలు తక్కువై దిగుబడులు పడిపోతున్నాయి. విత్తనాల ఎంపిక, రైతుల అవగాహనే భవిష్యత్తు వ్యాధి నిరోధక, స్థానిక వాతావరణానికి తట్టుకునే విత్తనాలను ఎంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నేల పరీక్షలతో అవసరమైన ఎరువులను వినియోగించడం ద్వారా ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇదిలా ఉండగా జిల్లాలో గతంలో 6వేల మట్టి శాంపిళ్లు తీయగా, దీనికి సంబంధించిన రిపోర్టు కాపీల ను రైతులకు అందించారు. ప్రజా పాలనలో భాగంగా 176 రెవెన్యూ గ్రామాల్లో 1,760 మట్టి నమూనాలను సేకరించి, ఇందుకు సంబంధించి రిజల్ట్ కాపీలను రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అందించారు. రెండు రోజుల క్రితం ప్రారంభమైన రైతు సదస్సుల్లో గ్రామానికి 20 చొప్పున 3,520 మట్టి శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. జిల్లాలో మట్టి పరీక్షల సమాచారం రైతులు పట్టాలు: 1.86లక్షలు రెవెన్యూ గ్రామాలు: 176గతంలో మట్టి పరీక్షలు: 6009 (రిజల్ట్ వచ్చింది) ప్రజాపాలనలో రెవెన్యూ గ్రామాల్లో చేసిన మట్టి పరీక్షలు: 1,760 (రిజల్ట్ వచ్చింది) రైతు సదస్సుల్లో మట్టి పరీక్షల శాంపిళ్ల సేకరణ: 3,520 చెరువు మట్టితో భూమిలో సూక్ష్మ పోషకాలు నేల పరీక్షల ప్రాధాన్యంపై రైతులకు అవగాహన వానాకాలం సీజన్‌కు ఇప్పటి నుంచే కసరత్తుస్థిర వ్యవసాయం వైపు అడుగులుజిల్లా రైతులు సహజ ఎరువులు, పంటల మార్పిడి, నేల పరీక్షలు వంటి పద్ధతులను అవలంబిస్తే భూసార యాజమాన్యం మెరుగై, దీర్ఘకాలికంగా స్థిరమైన వ్యవసాయం సాధ్యమవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. భూసారం బలంగా ఉంటే పంటల దిగుబడులు పెరిగి రైతుల ఆదాయం గణనీయంగా అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు. -
జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు
జనగామ రూరల్: పట్టణంలోని స్థానిక ధర్మకంచ మినీ స్టేడియంలో మంగళవారం జిల్లా స్థాయి 8, 10, 12, 14 16, 18 20 ఏళ్ల మెన్, ఉమెన్ అథ్లెటిక్స్ ఎంపికలు జరిగాయని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణ గౌడ్, ప్రధాన కార్యదర్శి గంగి శెట్టి మనోజ్ కుమార్ తెలిపారు. దాదాపు 130 మంది బాలబాలికలు వివిధ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొన్నారని, ఎంపికై న 8, 10, 12 14 సంవత్సరాల బాలబాలికలు ఈనెల 17న కొల్లూరులో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారన్నారు. అలాగే 14, 16, 18, 20 ఏళ్ల మెన్, ఉమెన్లలో ఎంపికై న క్రీడాకారులు ఈనెల 10వ తేదీన హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే మూడో తెలంగాణ రాష్ట్ర స్థాయి త్రోస్ అండ్ జంప్స్ పోటీలలో పాల్గొంటారని పేర్కొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంజనగామ రూరల్: జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా పనిచేయడానికి ఆసక్తి, అర్హతలు కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి సందీప్ కుమార్ ఝా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, లోకల్ బాడీ పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అభ్యర్థులు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండడం తప్పనిసరని ముఖ్యంగా ఎంఎస్ ఆఫీసు వంటి అప్లికేషన్లలో నైపుణ్యం కలిగి ఉండాలన్నారు. అదనంగా డేటా సైన్స్ అంశాలపై అవగాహనతో పాటు కంప్యూటర్ సైన్స్‌లో విద్యార్హతలు ఉండాలని స్పష్టం చేశారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 7వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు కలెక్టర్ కార్యాలయం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న విద్యా శాఖ ఇన్వార్డ్ విభాగంలో సమర్పించాలని కోరారు. డీఆర్ఓగా వెంకటేశ్వర్లు జనగామ: రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటీ కలెక్టర్లు, అదనపు కలెక్టర్ల బదిలీలు, పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీల్లో సిరిసిల్ల ఆర్డీఓగా పనిచేస్తున్న సీహెచ్.వెంకటేశ్వర్లను జన గామ జిల్లా డీఆర్ఓగా ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన సిరిసిల్లలో ఆర్డీఓగా విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో వెంటనే నూతన బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వులో స్పష్టంగా పేర్కొన్నారు. సీఐకి అభినందన పతకంజనగామ: జనగామ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణరెడ్డి ఐటీ నిబంధనలు, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం(సీఓటీపీఏ) అమలు, డ్రగ్ నియంత్రణ చర్యల్లో చూపిన కఠినతరమైన అమలు విధానానికి గుర్తింపుగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ చేతుల మీదుగా మంగళవారం అభినందన పురస్కారం అందుకున్నారు. ఇటీవలి కాలంలో ఈగిల్ యాక్షన్ గ్రూప్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై చేపట్టిన ప్రత్యేక చర్యలు, యువతకు మాదక ద్రవ్యాల ప్రమాదాలపై అవగాహన కల్పించడంలో సీఐ సత్యనారాయణరెడ్డి కీలకపాత్ర పోషించారు. సమాజంలో నేరాల నియంత్రణ, ప్రజల భద్రత, చట్టాల అమలు వంటి అంశాల్లో సీఐ సత్యనారాయణ రెడ్డి చేపట్టిన చర్యలు పోలీస్ విభాగంలో అభినందనీయమని కమిషనర్ పేర్కొన్నారు. న్యాయవాదుల గుమస్తాల సంఘం నూతన కమిటీజనగామ రూరల్: జిల్లా కోర్టు న్యాయవాదుల గుమస్తాల సంఘం నూతన కార్యవర్గ కమిటీని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కోర్నపాక ఉపేందర్, ప్రధాన కార్యదర్శిగా వల్లూరి నరేష్ ఎంపిక కాగా ఉపాధ్యక్షుడిగా భైరగోని శ్రీను, కోశాధికారిగా యాట అశోక్, కార్యదర్శిగా వేల్పుల మల్లేష్, కల్చరల్ యాక్టివిటీ ఇన్చార్జ్గా లకావత్ మహేందర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌గా శాడా శ్రవణ్, తోకల రమేశ్, గూడెపు అశోక్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు ఎమ్డీ ఖాజా పాషా, పుస్కూరి రఘు, ఎదునూరి పోచయ్య, బైరి శ్రీను, తుంగ బాలస్వామి, మల్ల మధు తదితరులు పాల్గొన్నారు. -
మట్టి పరీక్షలు తప్పనిసరి
జనగామ రూరల్: రైతులు మట్టి పరీక్షలు తప్పనిసరి చేసుకోవాలని వరితో పాటు పప్పు ధాన్యాలను పండించి ఆర్థిక వృద్ధి సాధించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. 99 రోజుల ప్రగతి ప్రణాళిక రైతు వారోత్సవాల్లో భాగంగా సోమవారం మండలంలోని చౌడారం రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ..నేల ఆరోగ్య కార్డుల ద్వారా భూమిలో నత్రజని, భాస్వరం, పొటాష్ సూక్ష్మ పోషకాల స్థితిని తెలుసుకుంటే అవసరమైన ఎరువులను సరైన మోతాదులో అందించవచ్చన్నారు. దీంతో సాగు ఖర్చులు తగ్గడంతో పాటు దిగుబడులు పెరుగుతాయని తెలిపారు. అనంతరం నేల ఆరోగ్య పరిరక్షణ, సమతుల్య ఎరువుల యాజమాన్యం, ప్రకృతి వ్యవసాయం మీద వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. రైతులకు మట్టి హెల్త్ కార్డును కలెక్టర్ అందించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోని, డిప్యూటీ డైరెక్టర్ అఫ్ అగ్రికల్చర్ అనిత, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రమాకాంత్, ఏఈఓలు అనిల్, చౌడారం ఉప సర్పంచ్ ప్రవీణ్, రైతులు పాల్గొన్నారు. వరితోపాటు పప్పు ధాన్యాలను పండించాలి రైతులకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచన -
వచ్చుడే లేటు..గంటకే పోవుడు
స్టేషన్‌ఘన్‌పూర్: వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే పింఛన్ల కోసం లబ్ధిదారులు గంటల తరబడి మండుటెండలో వేచి ఉండాల్సి వస్తోంది. పట్టణానికి చెందిన లబ్ధిదారులకు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ప్రతీ నెల తపాలాశాఖ సిబ్బంది పింఛన్లు పంపిణీ చేస్తారు. అయితే పంపిణీ చేసే సిబ్బంది సకాలంలో రాకపోవడం, వచ్చినా ఒక గంట సేపు పంపిణీ చేసి వెళ్లిపోతుండగా లబ్ధిదారులు పెన్షన్ కోసం పడిగాపులు పడాల్సిన దుస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం వేసవికాలంలో ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో నరకయాతన అనుభవిస్తున్నారు. సోమవారం ఉదయం 8 గంటల వరకే వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు పెన్షన్ కోసం మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే 11 గంటల వరకు పెన్షన్ పంపిణీ చేసే వారు రాకపోవడంతో మండుటెండలో పండుటాకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం 11 గంటల వచ్చిన సిబ్బంది కేవలం ఒక గంట సేపు పంపిణీ చేసి వెళ్లిపోవడంతో లబ్ధిదారులు చేసేదేమి లేక మధ్యాహ్నం వరకు వేచి ఉన్నారు. ఈ విషయమై మున్సిపల్ చైర్మన్, సంబంధిత అధికారులు స్పందించాలని, పెన్షన్లను సకాలంలో పంపిణీ చేయాలని, ఒకే చోట అందరికీ కాకుండా వార్డుల వారీగా ఆయా బస్తీలలో పంపిణీ చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. సకాలంలో పింఛన్లు అందించని తపాలా సిబ్బంది మండుటెండల్లో పండుటాకుల నిరీక్షణ -
చెల్లి బిడ్డలు ఇంటి నుంచి వెళ్లగొట్టారు..
ఈ ఫొటోలోని వృద్ధురాలి పేరు శ్రీరామోజు సోమక్క. భర్త పేరు పాపయ్య. లింగాల ఘణపురం మండలం వనపర్తి గ్రామం. 40 ఏళ్ల క్రితం భర్త మృతిచెందాడు. తనకు పిల్లలు లేకపోవడంతో ఒంటరిగా ఉంటోంది. తన చెల్లెలి కూతుళ్లు తనను చూసుకుంటానని తన వద్ద ఉన్న రెండున్నర తులాల బంగారం, రెండున్నర లక్షల రూపాయలు తీసుకున్నారు. మూడు నెలల తర్వాత ఇంటినుంచి వెళ్లగొట్టారు. దీంతో దిక్కుతోచక గ్రామంలోని తనకు ఉన్న పెంకుటింట్లో తలదాచుకుంటోంది. తనకు కాలు చేయి విరిగిందని పనిచేయలేని స్థితిలో ఉన్నానని, వచ్చే వృద్ధాప్య పింఛన్‌తో బతుకుతున్నానని వాపోయింది. షుగర్, బీపీతో ఇబ్బందులు పడుతున్నానని, తనకు ఆసరాగా తన డబ్బు బంగారం ఇవ్వాలని కలెక్టరేట్లో మొరపెట్టుకుంది. -
వైభవంగా హేమాచలుడి తెప్పోత్సవం
మంగపేట: మల్లూరులోని హేమాచల క్షేత్రంలో లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు తెప్పోత్సవం కార్యక్రమాన్ని బ్రహ్మోత్సవాల యాగ్నికులు మరళీకృష్ణమాచార్యుల బృందం వేద మంత్రోచ్ఛరణతో సోమవారం రాత్రి శాస్త్రోక్తంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు కార్యక్రమంలో భాగంగా ఉదయం ఆలయంలోని మూలవిరాట్‌కు నిత్య పూజ, యాగశాలలో సేవాకాలం, బాలభోగం, చతుస్థానార్చన ఆలయ సమీపంలోని ఎద్దు ముక్కు వద్ద గల ఆంజనేయస్వామికి పంచామృతాలతో అభిషేకం(స్నపనం) మహానివేదన కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం 7 నుంచి 9గంటల వరకు చతుస్థానార్చన, తెప్పోత్సవం, దోపోత్సవం, శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం, హవనం కార్యక్రమ క్రతువులను వేద పండితులు మంత్రోచ్ఛరణ నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెప్పోత్సవం కార్యక్రమంలో భాగంగా లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక పల్లకి(సేవ)పై మంగళ వాయిద్యాలతో తీసుకొచ్చి ఆలయ ప్రాంగణంలోని కొలనులో రెండు గంటల పాటు తెప్పోత్సవం నిర్వహించారు. అనంతరం పూర్వం నుంచి వస్తున్న ఆచారం ప్రకారం ఆలయ ప్రాంగణంలో దోపోత్సవం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు ముక్కామల శేఖర్ శర్మ, కారంపుడి పవన్‌కుమార్, అనిపెద్ది రాజీవ్‌శర్మ, ఏడునూతుల ఈశ్వర్‌చంద్ రామానుజం, బ్రహ్మోత్సవాల యాగ్నికులు పెరంబదూర్ మధనమోహనాచార్యులు, శ్రీ కృష్ణ యజుర్వేదం పండితులు వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
వెల్లువలా వినతులు
● కలెక్టరేట్ ప్రజావాణికి తరలొచ్చిన అర్జీదారులు ● 151 దరఖాస్తులు స్వీకరించిన అధికారులు ● వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశంజనగామ రూరల్: కలెక్టరేట్ ప్రజావాణికి అర్జీదారులు పోటెత్తారు. చెల్లి కూతుళ్లు ఇంటి నుంచి వెళ్లగొట్టారని ఓ మహిళ, బోదకాలుతో ఇబ్బంది పడుతున్నానని.. పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని ఒకరు,, భర్తలేడని తనకు పెన్షన్ ఇవ్వాలని ఓ వివాహిత..ఇలా పలు సమస్యలతో సోమవారం గ్రీవెన్స్ సెల్‌కు వచ్చారు. కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్‌న్స్ హాల్లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా 151 అర్జీలను స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. అన్ని శాఖల జిల్లా అధికారులు, వారి పరిధిలో ఉండే సిబ్బంది స్వీయగణన నమోదు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రంగారావు, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ మాతృ నాయక్, డీఎంహెచ్ఓ మల్లికార్జునరావు, డీడబ్ల్యూఓ కోదండరాములు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. దరఖాస్తుల్లో కొన్ని.. ● జనగామ మండలం చీటకోడూరు గ్రామానికి చెందిన కె.గణేష్ యాదవ్, తాను బీసీ డీ, యాదవ కులానికి చెందినవాడినని, తల్లిదండ్రులు కూలి పని చేస్తుంటారని, భూమి జాగా లేదు అని, ప్రైవేట్‌లో చదివించే స్థోమత లేదని, ఎంజేపీలో సీటు ఇప్పించాలని దరఖాస్తు చేసుకున్నాడు. ● లింగాల ఘణపురం మండలం పటేల్ గూడెం గ్రామానికి చెందిన జె.సురేష్, తనకు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం విద్యుత్ తీగల వల్ల ఆగిందని బిల్లు రాక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, సమస్యను పరిష్కరించాలని వినతి అందజేశాడు. ● పాలకుర్తి మండలం సరిసన్నగూడెం గ్రామానికి చెందిన ఎస్.కొమురమ్మ తమది నిరుపేద కుటుంబమని, ఉండడానికి ఇల్లు లేదని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి ఆదుకోవాలని కోరింది. ● జనగామ మండలం వెంకిర్యాల గ్రామానికి చెందిన మామిడి అంజయ్య, తనకు పెంకుటిల్లు ఉందని, అది శిథిలావస్థలో ఉందని, ప్రస్తుతం అద్దెకు ఉంటున్నారని, డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలని వినతిపత్రం అందజేశాడు. ● లింగాల ఘణపురం మండలం చీటూరు గ్రామ సర్పంచ్ బర్ల గణేష్, గ్రామంలోని ఎంపీపీ పాఠశాలకు అదనపు తరగతి గదులు కావాలని, అలాగే వంటశాల షెడ్ మంజూరు చేయలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ● జనగామ పట్టణం వెంకన్నకుంటకు చెందిన బి.లక్ష్మి తన భర్త 5ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడని, సొంత ఇల్లు కూడా లేదని వాపోయింది. కూలి పని చేసుకుంటూ అద్దె ఇంట్లో తన పిల్లలతో జీవిస్తున్నానని, వితంతు పెన్షన్ మంజూరు చేయాలని కోరింది. కలెక్టరేట్లో వైద్య శిబిరం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో కలెక్టరేట్‌కు వచ్చే వృద్ధులు, పిల్లలు ఇబ్బందులు పడకుండా ఏఎన్ఎంతో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌కు వచ్చేవారు బీపీ, షుగర్ వంటి పరీక్షలు చేయించుకోని మందులు తీసుకున్నారు. -
ఆమెకు ధీమా
జనగామ రూరల్: మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించడంతోపాటు కుటుంబ ఆర్థిక ప్రగతికి వెన్నుదన్నుగా నిలుస్తున్న మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు బీమా పథకం మరింత ధీమా ఇవ్వనుంది. మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా వారి జీవితాలకు భరోసా కల్పిస్తూ..ప్రమాద బీమా పథకాన్ని 2028 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్నవారిలో ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల బీమా పరిహారం పొందే సౌలభ్యం కల్పించింది. దీనిపై జిల్లాలో సీ్త్రనిధి రుణాలు పొందిన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు మరింత లబ్ధి చేకూరనుంది. జిల్లాలో 12 మండల సమైక్య సంఘాల్లో 11,237 సంఘాలున్నాయి. ఇందులో 1,26,786 మంది సభ్యులు ఉన్నారు. వీరు సీ్త్రనిధితో పాటు, బ్యాంకుల ద్వారా రుణాలు పొందుతూ స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించుకుంటున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆయా యూనిట్లు, ఉపాధి అవకాశాలు నెలకొల్పి, ఉపాధి పొందుతున్నారు. ప్రమాద బీమాను పెంచుతూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బీమా పథకం సీ్త్రనిధి ద్వారా అమలు జరగనుంది. మహిళలు స్వశక్తి సంఘంలో ఉండి ఏదైనా సహజమరణం చెందితే వారు తీసుకున్న రుణం మాఫీ కానుంది. ఆదే సీ్త్రనిధి, బ్యాంక్ రుణాలు తీసుకున్న మహిళా సంఘం సభ్యురాలు ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రభుత్వం అందించే రూ.10లక్షలు నామినీ ఖాతాల్లో జమ చేయనున్నారు. వారికి సంబంధించిన రుణాన్ని మాఫీ చేస్తారు. 50 శాతం మించిన అంగవైకల్యం ఏర్పడితే సదరం ధ్రువపత్రం ద్వారా పరిశీలించి, రూ.5 లక్షలు అందించనున్నారు. ఈ పథకం ప్రారంభించక ముందు రుణం పొందిన వారు మరణిస్తే, వడ్డీతో కలిపి చెల్లించాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులు, సంఘం సభ్యులపై పడేది. పథకం లబ్ధికి అర్హత గ్రామీణ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో 18 నుంచి 58 ఏళ్ల వారు స్వయం సహాయ సభ్యురాలిగా ఉన్నవారికి బీమా వర్తిస్తుంది. స్వశక్తి సంఘాల మహిళలకు బీమా భరోసా ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షలు, రుణమాఫీ పథకాన్ని 2028 వరకు పొడిగించిన ప్రభుత్వం జిల్లాలో 1,26,786 మంది సభ్యులు -
టెక్నాలజీతో లైబ్రరీ సేవల్లో మార్పులు
కేయూ క్యాంపస్: టెక్నాలజీతో లైబ్రరీ సేవల్లో వినూత్న మార్పులు వచ్చాయని గుజరాత్ రాష్ట్రంలోని ఇన్‌ఫ్లిబినెట్ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ దేవికా పి మదల్లి అన్నారు. కాకతీయ యూనివర్సిటీలోని సెనేట్హాల్లో కేయూ పరిధిలోని లైబ్రరీ అసిస్టెంట్లకు సోమవారం నిర్వహించిన ఇన్‌ఫ్లిబినెట్ రీజినల్ ట్రైనింగ్ ప్రోగ్రాం లైబ్రరీ ఆటోమేషన్ ప్రారంభ సమావేశంలో ఆమె మాట్లాడారు. వన్‌నేషన్ ఇన్ సబ్స్క్రిప్షన్ కార్యక్రమం కింద సుమారు 6,500 సంస్థలు నమోదు చేసుకున్నామని పేర్కొన్నారు. కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ యూనివర్సిటీ లైబ్రరీకి రూసా నిధుల కింద రూ.2 కోట్లు, ప్రాజెక్టు కింద రూ.49 లక్షలు, సాధారణ బడ్జెట్లో రూ.కోటి మంజూరు చేసినట్లు తెలిపారు. బెంగళూరుకు చెందిన విశ్రాంత ఆచార్యులు ఏఆర్డీ ప్రసాద్ మాట్లాడుతూ ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్‌పై అవగాహన కలిగి ఉండాలన్నారు. నిట్ లైబ్రేరియన్ ప్రొఫెసర్ వై. శ్రీనివాస్‌రావు, సోషల్ సైన్స్, ఆర్ట్స్ డీన్ బి.సురేశ్‌లాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్డీఓ కార్యాలయంలో ప్రజావాణి
స్టేషన్‌ఘన్‌పూర్: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, కలెక్టర్ సూచనల మేరకు ఆర్డీఓ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఘన్పూర్ ఆర్డీఓ ఆఫీస్‌లో నిర్వహించిన ప్రజావాణికి 30 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా ఆర్డీఓ డీఎస్ వెంకన్న మాట్లాడారు.. డివిజన్లోని వివిధ మండలాల నుంచి పలు సమస్యలపై 30 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇకపై ఆర్డీఓ కార్యాలయంలో ప్రతీ సోమవారం ప్రజావాణి ఉంటుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజలు అందించిన దరఖాస్తులను పరిశీలించి సత్వరమే పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు. 8న వరంగల్‌లో జాబ్ మేళాజనగామ: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా యువతకు ఉపాధి అవకాశాలను విస్తృతంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇంటర్మీడియట్ నుంచి పోస్ట్‌గ్రాడ్యుయేషన్ వరకు విద్యార్హత ఉన్న నిరుద్యోగ యువత కోసం మార్కెటింగ్, ఫైనాన్స్, బ్యాంకింగ్, హెల్త్‌కేర్, ఐటీ, బిజినెస్ సర్వీసెస్, కస్టమర్ సర్వీస్, హాస్పిటల్, డిజిటల్ మీడియా, లాజిస్టిక్స్ వంటి విభిన్న రంగాల్లో ఉపాధి కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహించనున్నారు. జిల్లా యువజన క్రీడల శాఖ, ఇండస్ట్రీస్, కామర్స్ విభాగం, ఐటీఈ,–సీ శాఖ ఆధ్వర్యంలో 50 కి పైగా ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళాలో భాగస్వామ్యం కానున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి కె.కోదండరాములు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా యువత కోసం ఈ నెల 8వ తేదీన వరంగల్‌లో ఈ జాబ్‌మేళా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జాబ్ మేళాలో పాల్గొనే యువత https://satg.telangana. gov.in/prajapalana వెబ్సైట్ ద్వారా లేదా కేటాయించిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. మరిన్ని వివరాల కోసం–918255 2593 నెంబర్‌ను సంప్రదించవచ్చని తెలియజేశారు. ఆయిల్‌పామ్ సాగుపై నేడు అవగాహన సదస్సుబచ్చన్నపేట: ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు అవగాహన కలిగించేందుకు నేడు (మంగళవారం) మండల కేంద్రంలో ఆయిల్‌పామ్ రైతుల అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఆయిల్‌ఫెడ్ ఇన్చార్జ్ దయాకర్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. నేడు ఉదయం 11 గంటలకు మండల కేంద్రంలోని జనగామ రోడ్డులో గల శ్రీనివాస ఫంక్షన్ హాల్లో జరిగే అవగాహన సదస్సుకు అన్ని గ్రామాల రైతులు అధిక సంఖ్యలో హాజరు కావాలన్నారు. సదస్సుకు తెలంగాణ రాష్ట్ర ఆయిల్‌ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, డీసీసీ అధ్యక్షులు లకావత్ ధన్వంతి, డీసీసీ ఉపాధ్యక్షుడు నూకల బాల్‌రెడ్డి, పలువురు అధికారులు హాజరవుతున్నారని తెలిపారు. టైర్ పేలి మద్యం వ్యాన్ బోల్తారఘునాథపల్లి: హైదరాబాద్–హన్మకొండ జాతీయ రహదారిలోని గోవర్ధనగిరి వద్ద సోమవారం రాత్రి ఓ మద్యం వ్యాన్ టైర్ పేలి బోల్తాపడింది. రాంపూర్ నుంచి రూ.5 లక్షల విలువైన మద్యం లోడ్‌తో జనగామ వైపు వెళ్తుండగా గోవర్ధనగిరి సమీపంలోకి రాగానే టైర్ పేలడంతో వాహనం అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో వ్యాన్‌లో ఉన్న ఇద్దరు కార్మికులు, డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంలో మద్యం సీసాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. సగం వరకు మద్యం సీసాలు పగిలిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మద్యం సీసాలు అపహరణకు గురికాకుండా చర్యలు తీసుకున్నారు. -
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
జనగామ రూరల్: ఈనెల 7వ తేదీన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి కడియం శ్రీహరి నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి పర్యటనపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ..రూ.50 కోట్లతో 7 విద్యుత్ ఉప కేంద్రాల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నారని తెలిపారు. నియోజకవర్గంలోని వేలేరు మండలం, పీచర గ్రామ పంచాయతీలో నూతనంగా నిర్మించిన 132/33 కేవీ విద్యుత్ ఉప కేంద్రాన్ని, చిల్పూర్ మండలం, కొండాపూర్, జఫర్‌గఢ్ మండలం సాగరం, రఘునాథపల్లి మండలం కుర్చపల్లి గ్రామంలో 33/11 కేవీ ఉప కేంద్రాలను ప్రారంభించనున్నారన్నారు. చిల్పూర్ మండలంలో 33/11 కేవీ లింగంపల్లి, పల్లగుట్ట, నష్కల్ ఉప కేంద్రాలకు శంకుస్థాపన చేయనున్నారన్నారు. ఉప ముఖ్యమంత్రి పర్యటనను విజయ వంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పర్యటనలో ఎటువంటి తప్పిదాలకు తావు లేకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని స్పష్టం చేశారు. సమీక్ష సమావేశంలో ఆర్డీఓ వెంకన్న, డీఏఓ అంబికా సోనీ, జెడ్పీ సీఈఓ రంగారావు, ఏబీసీడీఓ రవీందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవి లత, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి విక్రమ్, విద్యుత్ శాఖ అధికారి సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పల్లగుట్టలో సభ ఏర్పాట్ల పరిశీలనచిల్పూరు: మండలంలోని పల్లగుట్టలో ఈనెల 7న జరగనున్న డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క బహిరంగ సభ ప్రాంతాన్ని ఎమ్మెల్యే కడియం పరిశీలించారు. చిల్పూరు ఆలయ చైర్మన్ శ్రీధర్‌రావు, సర్పంచ్ ఎనగందుల నరసింహారెడ్డి, అధికారులతో కలిసి పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. మొదట జఫర్గడ్ మండల కేంద్రంలో బహిరంగ సభ అనుకున్నప్పటికీ దాన్ని పల్లగుట్ట గ్రామంలో 5 వేల మందితో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సర్పంచ్‌లు శాతబోయిన రాజు, ఆర్డీఓ వెంకన్న, తహసీల్దార్ విజయ్‌కుమార్, ఎంపీడీఓ రఘురామకృష్ణ, ట్రాన్స్‌కో అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటనపై ఎమ్మెల్యే కడియం, కలెక్టర్ సమీక్ష పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం -
లారీల కోసం రోడ్డెక్కిన రైతన్న
నర్మెట: లారీలు సకాలంలో రాకపోవడంతో ధాన్యం తరలింపులో జాప్యం జరుగుతోందని మండలంలోని హన్మంతాపురం ఐకేపీ సెంటర్ రైతులు ఆదివారం రోడ్డుపై ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. మద్దతు తెలిపిన సీపీఎం రైతు సంఘం జిల్లా కార్యదర్శి చందూనాయక్ మాట్లాడుతూ.. అధికారుల నిర్లక్ష్యంతో లారీలు సకాలంలో రాకపోవడంతో మండుటెండలో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, అన్నదాతలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని తక్షణం అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై నైనాల నగేష్ తన సిబ్బంది రాజు, విజయ్ కిరణ్‌తో వెళ్లి సర్దిచెప్పి ధర్నా విరమింపజేశారు. -
గాలిదుమారం..రైతుల ఆగమాగం
అకాల వర్షం.. అన్నదాతల ఇక్కట్లుదేవరుప్పుల: ఆరుగాలం శ్రమించి పంట దిగుమతి చేసి ఫలితం పొందుదామన్నా అన్నదాతలకు అకాల వర్షం వెంటాడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం మండలంలోని పలు గ్రామాల్లో అకాల వర్షం పడడంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, రైతుల కల్లాల వద్ద మొక్కజొన్నల రక్షణకు రైతులు నానా తంటాలు పడ్డారు. మరోవైపు నెల రోజులు కావాస్తున్నా ధాన్యం కాంటా పెట్టకపోవడంతో ఇటు మండుటెండలకు ఆరిపోవడమేగాక అకాల వర్షంతో రాశులు నీళ్లపాలు అయ్యేటట్టూ ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రైతుల దుస్థితిపై సత్వరమే స్పందించి యుద్ధప్రాతిపదికన కాంటాపెట్టి రైసు మిల్లుకు తరలించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.కొడకండ్ల: కాంటాలు నత్తనడకన సాగుతుండడం, మబ్బులు పట్టి చిరుజల్లులు కురుస్తుండడంతో కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆగమాగమవుతున్నారు. ఆదివారం సాయంత్రం ఆకస్మాత్తుగా గాలిదుమారం, ఉరుములతో కూడిన చిరుజల్లు కురువడంతో కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యాన్ని తడువకుండా కాపాడుకొనేందుకు అష్టకష్టాలు పడ్డారు. మార్కెట్ యార్డులో ఐకేపీ ఆధ్వర్యంలో రెండు కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తుండగా 20 మంది మాత్రమే హమాలీలు ఉండడంతో కాంటాలు ఆలస్యమవడమే కాకుండా కాంటా అయిన ధాన్యం కూడా ఎగుమతిలో జాప్యం జరుగుతోంది. తేమశాతం వచ్చేదాక ధాన్యాన్ని ఆరబోసుకొని తాలు లేకుండా తూర్పారపట్టిన తర్వాత కాంటా వేసిన ధాన్యం మిల్లుకు ఎగుమతి అయ్యాక మిల్లర్లు తాలు పేరిట బస్తాకు కిలో చొప్పున కోత విధిస్తుండడంతో తమ గోడును పట్టించుకొనే వారే కరువయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే అకాల వర్షాల భయం నెలకొనగా కాంటాలు ఆలస్యమై కొనుగోలు కేంద్రాల్లోనే పది రోజులకు పైగా పడికాపులు కాయాల్సి రావడం, తీరా కాంటా అయ్యాక కిలో తరుగుకు అంగీకరిస్తేనే దిగుమతి చేసుకొంటామని లేకుంటే చేసుకోమని మిల్లర్లు షరతులు విధిస్తుండటంతో దిక్కుతోచని దుస్థితిలో రైతులు కోతకు అంగీకరిస్తున్నారు. మార్కెట్ పాలకవర్గం, అధికారులు తమ గోసను పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. ఇక మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభించి పది రోజులు దాటినా కూడా ఇంత వరకు కాంటా ప్రారంభించకపోవడంతో రైతులు పడిగాపులు కాస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హమాలీల కొరతతో కాంటాలు ఆలస్యం పదిరోజులైనా కాంటా కాని మక్కలు -
ప్రశాంతంగా ‘నీట్’
సోమవారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 2026ఘనంగా శ్రీరంగనాథస్వామి విగ్రహ ప్రతిష్ఠాపనజఫర్గఢ్: మండల కేంద్రంలోని వేల్పుగొండ కొండ దిగువన ఉన్న సీతారామచంద్ర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శ్రీరంగనాథస్వామి విగ్రహా ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే స్వామివారి ఉత్సవ విగ్రహాలతో వేదపండితులు తమ మంత్రోచ్ఛరణల మధ్య పూజ కార్యక్రమాలు ప్రారంభించారు. కుంభస్థాపన, అగ్నిప్రతిష్ట, శాంతి హోమం, పూర్ణహూతి తదితర పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించడంతో పాటు కల్యాణమహోత్సవాన్ని నిర్వహించారు. కన్నులపండువగా సాగిన ఈ వేడుకలను భక్తులు కనులారా తిలకించి భక్తి పారవశ్యంలో ముగినిగిపోయారు. అనంతరం స్వామివారికి భక్తులు మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా స్వామివారి తీర్థప్రసాదాలను అందజేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పూజారులు పొడిచేటి వెంకటాచార్యులు, శ్రీనివాసచార్యులు, కృష్ణమాచార్యులతో పాటు భక్తులు, భారీ సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. చురుగ్గా ఆర్యూబీ పనులురఘునాథపల్లి: మండలంలోని గోవర్ధనగిరి రైల్వే గేట్ వద్ద ఆర్యూబీ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. నాలుగు నెలల్లో ఆర్యూబీ అందుబాటులోకి తీసుకొచ్చేలా నిర్మాణ పనులు వేగవంతం చేశారు. ఇందులో బాగంగా ఆదివారం విద్యుత్ సరఫరా నిలిపివేసి రెండు భారీ క్రేన్లతో 45 టన్నుల సామర్థ్యం గల గడ్డర్‌ను ఏర్పాటు చేశారు. రైల్వే ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా యుద్ధప్రాతిపదికన దాదాపు 140 మందితో గడ్డర్ ఏర్పాటు చేశారు. భారీస్థాయిలో చేపట్టిన ఈ పనులను గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు. సికింద్రాబాద్– కాజీపేట రైల్వే మార్గం కావడంతో ఈ గేట్ వద్ద రైళ్ల రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో ఒక్కోసారి 10 నుంచి 15 నిముషాల పాటు గేటు మూసివేయడంతో అత్యవసర పనులపై వెళ్లే గ్రామస్తులు పడిగాపులు కాస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్యూబీ అందుబాటులోకి వస్తే గ్రామస్తుల నిరీక్షణకు తెర పడనుంది. కామ్రేడ్ దోస్తులు.. సైకిల్ సవారీజనగామ: జిల్లాలో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్న్స్ టెస్ట్ (నీట్) పరీక్ష ఆదివారం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏబీవీ డిగ్రీ కళాశాల, పెంబర్తిలోని జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో మొత్తం రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 566 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా, 23 మంది గైర్హాజరైనట్లు పరీక్షల కో ఆర్డినేటర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ వెల్లడించారు. పరీక్ష కేంద్రాల వారీగా హాజరు ఏబీవీ డిగ్రీ కళాశాల కేంద్రంలో 408 మందికి అవకాశం ఇవ్వగా, 389 మంది విద్యార్థులు హాజరయ్యారు. 19 మంది గైర్హాజరయ్యారు. పెంబర్తిలోని జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాల కేంద్రంలో 158 మందికి బదులు 154 మంది హాజరుకాగా, నలుగురు గైర్హాజరైనట్లు అధికారులు వివరించారు. ఉదయం 11 గంటల నుంచి సెంటర్ల వద్ద విద్యార్థులను లోనికి అనుమతిస్తూ సిబ్బంది క్రమశిక్షణతో తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష మూడు గంటల పాటు సాగింది. పరీక్ష సమయంలో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు లేకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్ పర్యవేక్షణలో ఇద్దరు ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు సహా భారీగా పోలీసు సిబ్బందిని మోహరించారు. కఠినమైన తనిఖీలు.. పరీక్షలో నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ విద్యార్థినుల జడ క్లిప్‌లను కూడా తీసి వేయించారు. హైహీల్స్ సాండిల్స్, నల్లటి దారాలు, సాక్సులు, ఎలక్ట్రానిక్ వస్తువులు వంటి వాటిని రెండుసార్లు తనిఖీ చేసిన తర్వాతే బయట వేసి లోనికి పంపారు. పాస్ ఫొటోలు తెచ్చుకోని విద్యార్థులు ఎక్కువగా ఉండడంతో తల్లిదండ్రులు 42 డిగ్రీల సెల్సియస్ ఎండలో ఫొటో స్టూడియోల కోసం పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఈ సందర్భంలో పోలీసులు తల్లిదండ్రులకు రవాణా పరంగా పూర్తి సహకారం అందించారు. ఎరేజర్, పెన్సిల్ వంటి అవసరాలపై స్పష్టత లేక కొంతమంది తల్లిదండ్రులు పరీక్ష సెంటర్ల వద్ద ఆందోళన చెందారు. మూడు గంటల పాటు పరీక్ష రాసే విద్యార్థుల కోసం బయట వేచిచూసిన కుటుంబ సభ్యులు ఎండ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సెంటర్ల వద్ద అంబులెన్స్‌తో పాటు వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లను సిద్ధంగా ఉంచారు. పరీక్షలన్నీ సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించారు. ఆలస్యంగా వచ్చిన విద్యార్థుల ఆవేదన చివరి పది నిమిషాల్లో నలుగురు విద్యార్థులు రావడంతో హడావుడి నెలకొంది. మధ్యాహ్నం 1.30 తర్వాత వచ్చిన మరో ముగ్గురు విద్యార్థులను అధికారులు సెంటర్లలోకి అనుమతించలేదు. ఏబీవీ డిగ్రీ కళాశాల సెంటర్‌కు లకావత్ బాపూజీ ఉదయం ఎనిమిదిన్నరకు రావడంతో గందరగోళానికి గురై మధ్యాహ్నం తిరిగి వచ్చినప్పటికీ ఆలస్యంగా రావడంతో పరీక్ష రాయలేకపోయాడు. ఆలేరు నుంచి వచ్చిన ఆరె హిందూప్రియ, లకావత్ ఉదయ్ కిరణ్ కూడా ఆలస్యంగా రావడంతో నిరాశ చెందారు. పోలీసుల పర్యవేక్షణ, కట్టుదిట్టమైన తనిఖీలతో జిల్లాలో నీట్ పరీక్ష ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా విజయవంతంగా ముగిసింది.● చల్లబడ్డ ఆకాశం.. ఈదురు గాలులు రైతుల ఆందోళన ● ధాన్యం సెంటర్లలో వేలాది బస్తాలు ● కోతకు సిద్ధంగా ఉన్న వరిపంటచుక్క సత్తయ్య విగ్రహావిష్కరణ చేస్తున్న బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యే పల్లా, క్యామ మల్లేశం పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు 566 మంది విద్యార్థులు... 543 మంది హాజరు ముగ్గురు విద్యార్థుల ఆలస్యం.. కన్నీటి పర్యంతంతో ఇంటికి విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే లోనికి అనుమతిప్రశాంత వాతావరణంలో పరీక్ష: కలెక్టర్ జిల్లాలో నిర్వహించిన నీట్ పరీక్ష ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో జరిగిందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఆదివారం జిల్లాలో నీట్ పరీక్ష జరిగిన ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పెంబర్తిలోని మహాత్మ జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ గురుకుల సెంటర్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, పోలీసు అధికారులు, నీట్, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
పొద్దంతా ఎండలు..సాయంత్రం మబ్బులు
జనగామ: జిల్లాలో సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి, ఈదురుగాలులతో అన్నదాతను టెన్షన్ పెట్టించింది. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటతో పాటు ధాన్యం కొనుగోలు సెంటర్లలో నిల్వలు, రహదారులపై ఆరబోసిన ధాన్యంతో రైతులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కోతకు సిద్ధమైన పంటలకు కూడా అకాల వర్షాలు ముప్పుగా మారాయి. జిల్లాలో ఆదివారం ఉదయం 42 డిగ్రీల సెల్సీఎస్ ఆకాశంలో మబ్బులు, ఉరుములు కనిపించినప్పటికీ మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండలు రైతులను ఇబ్బందులకు గురిచేశాయి. సాయంత్రం ఐదున్నర తర్వాత ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో పాటు ఈదురుగాలులు, కొన్నిచోట్ల చిరుజల్లు కురవడంతో జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఆకస్మిక మార్పులు చోటు చేసుకున్నాయి. అకాల వాతావరణ మార్పులు రైతుల్లో ఆందోళన పెంచాయి. ధాన్యం నిల్వలపై వర్షం ప్రభావం ధాన్యం కొనుగోలు సెంటర్లలో కాంటా పూర్తి చేసుకుని తరలింపునకు సిద్ధంగా ఉంచిన వేలాది బస్తాలతో పాటు కొనుగోలుకు ఎదురుచూస్తున్న ధాన్యం నిల్వలతో అధికార యంత్రాంగంతో పాటు రైతులు అలర్టయ్యారు. తేమ శాతం కోసం రహదారులు, కల్లాలు, గ్రామ పరిసరాల్లో ఆరబోసుకున్న ధాన్యాన్ని రైతులు వెంటనే ఒకచోట చేర్చి కుప్పగా చేస్తున్నారు. టార్పాలిన్ కవర్లు ముందస్తుగా సిద్ధం చేసుకుని వర్షం కురిస్తే నష్టం జరగకుండా అష్టకష్టాలు పడుతున్నారు. కోతకు సిద్ధంగా వరి జిల్లాలో అన్ని మండలాల్లో కొంతమేర వరి పంటలు కోతకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సమయంలో ఈదురుగాలులు, అకాల చిరుజల్లులు పంటలకు నష్టం చేసే అవకాశం ఉండటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా మార్చి చివరి వారం, ఏప్రిల్ మొదటి వారాల్లో వడగళ్ల వాన, ఈదురుగాలులతో ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చేది. అయితే ఈసారి మే తొలివారంలో ఇలాంటి వాతావరణ మార్పులు రైతులను మరింతగా టెన్షన్ పుట్టించేలా గురిచేస్తున్నాయి. చల్లబడుతున్న ఆకాశంతో రైతుల కష్టాలు ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు దంచికొట్టే ఎండలు నమోదయ్యాయి. వెంటనే గాలులు, చిరుజల్లులు రావడంతో వాతావరణం పూర్తి భిన్నంగా మారిపోయింది. వడదెబ్బకు గురి చేసే విధంగా మండే ఉష్ణోగ్రతల మధ్య ధాన్యం రక్షణ చర్యలు చేపట్టడం రైతులకు భారీ శ్రమగా మారింది. ఈ పరిస్థితుల్లో ధాన్యం, పంటలకు ఏ నష్టం జరగకూడదని రైతులు వరుణ దేవున్ని ప్రార్థిస్తున్నారు. -
నేటినుంచి రైతు వారోత్సవాలు
జనగామ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి, వ్యవసాయ అనుబంధ రంగాల ప్రోత్సాహం రైతులను ఆర్థికంగా మరింత బలోపేతం చేయాలనే ప్రధాన ఉద్దేశ్యంతో రాష్ట్రవ్యాప్తంగా రైతు వారోత్సవాలు–2026 కార్యక్రమాలకు సిద్ధమైంది. ఈనెల 4 నుంచి 9 వరకు అన్ని మండలాలు, గ్రామపంచాయతీలు, రైతు వేదికలు, క్లస్టర్ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఉత్పత్తి వ్యయాల పెరుగుదల, మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు శాసీ్త్రయ పద్ధతులు అవలంబించడం ప్రతీ రైతుకు నేరుగా చేరుకుని, క్షేత్రస్థాయిలో సమగ్ర అవగాహన కల్పించేలా రైతు వారోత్సవాలు నిర్వహించనున్నారు చేపట్టనున్న కార్యక్రమాలు వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్య, సహకార, మార్కెటింగ్, విద్యుత్ శాఖల సమన్వయంతో జిల్లాలోని ప్రతీ గ్రామంలో రైతులు కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని రైతు వేదికల్లో గ్రామ సచివాలయాలు, పంచాయతీ భవనాలు, పాఠశాల ప్రాంగణాలలో రైతులతో ముఖాముఖి సమావేశాలు, క్షేత్ర ప్రదర్శనలు, సాంకేతిక సదస్సులు, ప్రత్యక్ష శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రతీ మండలంలో ప్రణాళిక సిద్ధం చేసి గ్రామాల వారీగా షెడ్యూల్ ప్రకారం మహిళా రైతులు, యువ రైతులు, కౌలు రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల సభ్యులకు ప్రత్యేక సెషన్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ పథకాల అర్హులైన రైతులను అక్కడికక్కడే గుర్తించి నమోదు చేయనున్నారు. రోజు వారీ కార్యక్రమాలు: ● 4వ తేదీన భూసార పరిరక్షణ, నేల ఆరోగ్య నిర్వహణ, సేంద్రియ పదార్థాల వినియోగం, పంటల మార్పిడి, గ్రీన్ మ్యాన్యూర్, సూక్ష్మ పోషకాల వినియోగం, నేల నమూనాల సేకరణ, భూసార పరీక్షల ప్రాముఖ్యంపై రైతులకు అవగాహన కల్పించడం ● 5వ తేదీన పండ్ల తోటలు, కూరగాయల సాగు, ఆయిల్‌పామ్, మసాలా పంటలు, పూల సాగు, నర్సరీ అభివృద్ధి, రక్షిత సాగు, షేడ్‌నెట్, పాలీహౌస్ సాగుపై ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహిస్తారు. ● 6వ తేదీన పంట రుణాలు, వ్యవసాయ యంత్రాల సబ్సిడీలు, పంట బీమా, రైతు క్రెడిట్ కార్డులు, బ్యాంకు లింకేజీ, సహకార సంఘాల సేవలు, మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన ● 7వ తేదీన ఆధునిక వ్యవసాయం యాంత్రీకరణ డ్రోన్ సాంకేతికత, వ్యవసాయ యంత్రాలు, ట్రాక్టర్లు, పవర్ వీడర్లు, రీపర్లు, సీడ్ డ్రిల్స్, స్ప్రేయర్లు, డ్రోన్ టెక్నాలజీ వినియోగంపై ప్రదర్శనలు నిర్వహిస్తారు. ● 8వ తేదీన పాడి పరిశ్రమ, గొర్రెలు, మేకల పెంపకం, కోళ్ల పెంపకం, చేపల పెంపకం, తేనెటీగల పెంపకం, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై అవగాహన ● 9వ తేదీన రైతు వారోత్సవాల ముగింపులో నీటి వనరుల పరిరక్షణ, సాగునీటి సమర్థ వినియోగం పరిసరాల పరిశుభ్రతకు పంటల అవసరాలకు అనుగుణంగా నీటిని పొదుపుగా వినియోగించే పద్ధతులు, సూక్ష్మ నీటిపారుదల విధానాలు తెలపడం. వారం రోజుల పాటు నిర్వహించనున్న రైతు వారోత్సవాల్లో జిల్లాలోని వ్యవసాయ శాస్త్రవేత్తలు అన్ని మండలాల అధికారులు, రైతు సంఘాలు, రైతులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు, శాఖల అధికారులు, సిబ్బంది, యువత స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలి. – అంబికా సోని, జిల్లా వ్యవసాయ అధికారి ఆరు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు రైతులకు శాసీ్త్రయ ఆధునిక సాంకేతికత వ్యవసాయంపై అవగాహన -
ఎలాంటి ఇబ్బందులూ రావొద్దు
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ రూరల్: జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించే నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో డీసీపీ రాజ మహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్షను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలన్నారు. అభ్యర్థులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఆయా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఉండాలన్నారు. సమీక్ష సమావేశంలో ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, వర్ధన్నపేట ఏసీపీలు పాల్గొన్నారు. -
‘నీట్’కు సర్వం సిద్ధం
జనగామ: దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్(నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్)–2026 వైద్య ప్రవేశ పరీక్షకు సంబంధించి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలోని జిల్లా లెవెల్ కోఆర్డినేటర్ కమిటీ పర్యవేక్షణలో ఈ పరీక్షలను నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. సిటీ కోఆర్డినేట్, నోడల్ ఆఫీసర్, ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కె.శ్రీనివాస్ నే తృత్వంలో జిల్లాలోని రెండు సెంటర్లను ఏర్పాటు చే శారు. ఇందులో సిద్దిపేట రోడ్డులోని ఏబీవీ ప్రభు త్వ డిగ్రీ కళాశాల, పెంబర్తి మహాత్మా గాంధీ జ్యోతి బాఫూలే గురుకులంలో పరీక్ష నిర్వహించనున్నారు. రెండు సెంటర్లు.. 566 మంది విద్యార్థులు జిల్లాలో నీట్ పరీక్ష కోసం ఏర్పాటు చేసిన రెండు సెంటర్ల పరిధిలో 556 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షల నిమిత్తం ఏబీవీ డిగ్రీ కళాశాలలో 17 రూమ్‌లు, మహాత్మా జ్యోతిబాఫూలే సెంటర్లో 7 రూమ్‌లు సిద్ధం చేశారు. మొత్తం 48 మంది ఇన్విజిలేటర్లను నియమించగా, ప్రతీరూమ్లో 24 మంది విద్యార్థులకు ఇద్దరు ఇన్విజిలేటర్లు పర్యవేక్షణ ఉంటుంది. ఏబీవీ డిగ్రీ కళాశాల సెంటర్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ ఎ.రవీంద్ర నాయక్, మహా త్మా జ్యోతిబాఫూలే సెంటర్ సూపరింటెండెంట్‌గా ఎం.వనిత విధులు నిర్వర్తించనున్నారు. పరీక్షల సందర్భంలో పోలీసు, పురపాలక, వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ తదితర విభాగాలు సమన్వయంగా పనిచేస్తున్నాయి. నీట్–2026 పరీక్ష పూర్తిగా సీసీ కెమెరాల నిఘా నీడలో నిర్వహించనున్నారు. విద్యార్థులకు రూటు పరంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా పట్టణంలోని ప్రధాన కూడళ్లలో సెంటర్లకు సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. 180 ప్రశ్నలు..720 మార్కులు నీట్ పరీక్షలో 180 ప్రశ్నలు, 720 మార్కులకు నిర్వహిస్తారు. పూర్తిగా ఆఫ్‌లైన్‌లో, మల్టిపుల్ ఛాయిస్ మోడల్లో పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూడు గంటల పాటు జరగనుంది. బయోమెట్రిక్, ఫేస్ రికగ్నేషన్ తదితర పరిశీలనల కోసం విద్యార్థులను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు అంటే రెండున్నర గంటల ముందు నుంచే సెంటర్లలోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత గేట్లు మూసివేస్తారు. గేట్లు మూసిన అనంతరం సెకను ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి అనుమతించరు. పోలీసు పర్యవేక్షణ పరీక్షా సెంటర్ల పరిసరాల్లో సెక్షన్ 144 అమల్లో ఉంటుంది. డీసీపీ రాజమహేంద్ర నాయక్ పర్యవేక్షణ లో ఇద్దరు ఏసీపీలు, ముగ్గురు సీఐలు, ఐదుగురు ఎస్సైలు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, 35 కానిస్టేబుళ్లు మొత్తం 45 మంది బందోబస్తులో ఉంటారు. జిల్లా కేంద్రంలో రెండు సెంటర్లు పరీక్షకు హాజరుకానున్న 566 మంది విద్యార్థులు అరగంట ముందుగానే గేట్లు క్లోజ్ సెకను ఆలస్యంగా వచ్చిన అనుమతికి నోజిల్లాలో నీట్–2026 పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పర్యవేక్షణలో పకడ్బందీగా పరీక్షల నిర్వహణ కోసం చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో రెండు సెంటర్లను ఏర్పాటు చేయగా, 566 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. – డాక్టర్ కె.శ్రీనివాస్, పరీక్షల కోఆర్డినేటర్ -
మక్కల ప్రైవేట్ తూకంపై కలెక్టర్ ఆగ్రహం
లింగాలఘణపురం: మండలంలోని కుందారం మక్కల కొనుగోలు కేంద్రంలో తూకంలో జాప్యం జరుగుతోందని, కొంతమంది రైతులు ప్రైవేట్‌గా కాంటాలు వేస్తున్నారని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు. శనివారం మండలంలోని కుందారం, చీటూరులో ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కుందారంలో మక్కల కొనుగోలు కేంద్రంలో కొంతమంది రైతులు సొంత కాంటాలను ఏర్పాటు చేసుకొని తూకం వేస్తుండడం గమనించి ఇదేంటని ప్రశించి ఇలాంటి వ్యవహారాలు చేయొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కుందారంలో మక్కల కొనుగోలులో జాప్యం, తూకం వేసిన మక్కలను తరలించడంలో కలుగుతున్న ఇబ్బందులు, ఇతర మండలాల నుంచి మక్కలు రావడంతో ఎక్కువై కలుగుతున్న ఇబ్బందులను సర్పంచ్ కూకట్ల రాజు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కలెక్టర్ మార్క్‌ఫెడ్ అధికారులతో మాట్లాడి రైతులు ప్రైవేట్‌గా తమ ట్రాక్టర్లలో గోదాంలకు తరలించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. -
నెలరోజులుగా పనులకు రాని ఉపాధి కూలీలు
కొడకండ్ల: మండలంలో ఉపాధిహామీ పనులు ముమ్మరంగా జరుగుతున్నా గుమ్ములబండ తండాలో మాత్రం నెలరోజులుగా ఉపాధి పనులకు కూలీలు రావడం లేదు. ఉపాధిహామీ సిబ్బంది తండాకు వెళ్లి పలుమార్లు ఉపాధి పనులకు రావాలని కూలీలను కోరినా ఫలితం లేకుండా పోయింది. గుమ్ములబండ తండాలో 112 జాబ్‌కార్డులుండగా 200 దాకా కూలీలు ఉన్నప్పటికీ రెగ్యులర్‌గా 120 మంది ఉపాధి కూలీలు పనులు హాజరవుతుంటారు. ఈ సీజన్లో వరి కోతలు, మొక్కజొన్న కోతలు వంటి వ్యవసాయ పనులుండటంతో వారంతా ఆ పనుల్లో నిమగ్నమై ఉపాధి పనులకు దూరంగా ఉంటున్నారు. కాగా, శనివారం సర్పంచ్ గుగులోత్ వీరేశ్‌నాయక్ ఇంటింటికి తిరిగి ఉపాధి పనులకు హాజరు కావాలని బొట్టు పెట్టి మరి కూలీలను ఆహ్వానించారు. ముమ్మరంగా వ్యవసాయ పనులు ఉండటం వలన రాలేకపోయామని, సోమవారం నుంచి హారజవుతామని కూలీలు ఏపీఓ నరిగే కుమారస్వామికి తెలిపారు. బొట్టుపెట్టి రావాలని సర్పంచ్ వినతి -
190 ఈఓ పోస్టులతో దేవాలయ పాలన సులభం
పాలకుర్తి టౌన్: తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖకు నూతనంగా 190 కార్యనిర్వహణాధికారుల పోస్టులు మంజూరు చేయడంతో దేవాలయాల పరిపాలన సులభమవుతుందని అర్చక, ఉద్యోగ జేఏసీ కన్వీనర్ డీవీఆర్ శర్మ అన్నారు. శనివారం హన్మకొండలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నివాసంలో అర్చక ఉద్యోగ నేతలు ఆమెను కలిశారు. ఈ సందర్భంగా జీఓ 42 కాపీని మంత్రి అందజేశారు. మంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర అధ్యక్షుడు బేతి రంగారెడ్డి, టక్కర్సు సత్యం, సూపరింటెండెంట్లు చారి, విజయ్, కొత్తపల్లి వెంకటయ్య పాల్గొన్నారు. -
ధాన్యం తరలించాలని రాస్తారోకో
బచ్చన్నపేట: ధాన్యం తరలించడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని శనివారం మండలంలోని ఆలింపూర్, తమ్మడపల్లి గ్రామాల్లో రైతులు రాస్తారోకో నిర్వహించారు. వడ్ల బస్తాలను జనగామ–చేర్యాల జాతీయ రహదారిపై వేసి కలెక్టర్ రావాలంటూ నిరసన తెలిపారు. దీంతో వాహనాలు అక్కడే కిలోమీటరు మేర నిలిచిపోయాయి. ఈ సందర్భంగా ఆయా గ్రామాల మాజీ సర్పంచ్‌లు నరెడ్ల బాల్‌రెడ్డి, మేకల కవితరాజు మాట్లాడుతూ.. వరి కోసి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి నెల రోజులు గడుస్తున్నా ధాన్యం తరలించడం లేదని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్దకు లారీలు రావడం లేదని వెంటనే సంబంధిత అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు. ధర్నా వద్దకు ఎస్సై ఎ.శ్రీకాంత్ చేరుకొని కొనుగోలు కేంద్రాలకు లారీలు వచ్చేలా అధికారులతో మాట్లాడుతానని హామీ ఇవ్వడంతో రైతులు వెనుదిరిగారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు వందలాది మంది పాల్గొన్నారు. -
‘బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలు అవాస్తవం’
జనగామ: పది సంవత్సరాలు అధికారంలో ఉండి అభివృద్ధి చేయలేని బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలు వాస్తవానికి దూరంగా, రాజకీయ అక్కసుతో నిండిపోయి ఉన్నాయని మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్ అన్నారు. శనివారం పురపాలికలోని తన చాంబర్లో మాట్లాడారు.. ఇటీవల జరిగిన మున్సిపల్ సాధారణ సమావేశంపై బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలను ఖండించారు. దశాబ్దకాలం పాటు మున్సిపాలిటీని అప్పుల బారిన పడేలా మార్చింది బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన అన్నారు. కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఉద్దేశపూర్వకంగా గొడవకు దిగడం వల్లే సభ వాయిదా పడిందని తెలిపారు. ఇంటింటికీ చెత్త సేకరణలో భాగంగా ప్రజలపై ఒక్క రూపాయి భారం పడకుండా 11 ఆటోలు కొనుగోలు చేయడంతో పాటు 30 మంది సిబ్బందిని నియమించేందుకు మంత్రి, కలెక్టర్ అనుమతిని ఇప్పటికే పొందినట్లు తెలిపారు. -
కష్టపడి చదివి లక్ష్యాన్ని సాధించాలి
జఫర్‌గఢ్: పిల్లలందరూ కష్టపడి చదివి లక్ష్యాన్ని సాధించాలని డీసీపీ రాజమహేంద్రనాయక్ సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండలంలోని రేగడితండా గ్రామ శివారు టీబీతండా వద్ద ఉన్న మా ఇల్లు ప్రజాదరణ అనాథ ఆశ్రమంలో శనివారం చైల్డ్ సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్, డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. లక్ష్య సాధన దిశగా ముందుకు సాగినప్పుడే అనుకున్న ఫలితాలు సాధించగలుగుతామన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కోదండరాములు, వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐ శ్రీనివాసరావు, స్థానిక ఎస్సై రామారావు, ఈగల్ (నార్కోటిక్) ఎస్సై కుమారస్వామి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి రవికాంత్, స్వప్నరాణి, చైల్డ్ హెల్ప్ లైన్ కౌన్పిలర్ మమత, ఆశ్రమ ఇన్చార్జిలు పూజ, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. డీసీపీ రాజమహేంద్రనాయక్ -
మా జీవితాలు ఇక దుర్భరమే..
కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడం దారుణం. ఒక్కసారిగా రూ.1000 పెంచడంతో వ్యాపారంపై తీవ్ర ఆర్థిక భారం పడుతుంది. తమ హోటల్లో నెలకు పదికి పైగా కమర్షియల్ సిలిండర్లు అవసరముంటాయి. ఇప్పటికే గ్యాస్ కొరతతో పలు హోటళ్లను నామమాత్రంగా నడిపిస్తున్నాం. పరిస్థితి ఇలాగే కొనసాగితే హోటల్ వ్యాపారుల జీవితాలు దుర్భరంగా మారనున్నాయి. – జొన్నల వినయ్, టిఫిన్ సెంటర్ యజమాని, శివునిపల్లి, స్టే.ఘన్పూర్● -
చట్టాలపై అవగాహన ఉండాలి
జనగామ రూరల్: పారా లీగల్ వలంటరీలకు చట్టాలపై అవగాహన ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో పారా లీగల్ వలంటరీలకు చట్టాలపై భవిష్యత్తులో చేసే కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఎస్.శ్రీదేవి, వలంటీర్లు పాల్గొన్నారు.నూతన జడ్జి బాధ్యతల స్వీకరణస్టేషన్ఘన్పూర్: స్టేషన్‌ఘన్‌పూర్ జూనియర్ సివిల్ కోర్టుకు పర్మినెంట్ జడ్జిగా వచ్చిన జూనియర్ సివిల్ జడ్జి శివలీల శనివారం బాధ్యతలు స్వీకరించగా ఘన్పూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కనకం రమేశ్, న్యాయవాదులు స్వాగతం పలికారు. ఆయన వెంట బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మునిగాల రవీందర్, షన్మాకుమారి, శ్రీనివాస్, బాబు తదితరులున్నారు. ఈసందర్భంగా స్థానిక న్యాయవాదులు పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో న్యాయవాదులు గట్టు రవి, గట్టు మనోహర్, నీరటి కార్తీక్, పోగుల కార్తీక్, గాదె పృథ్వీ, సుష్మ, భువన్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు.ప్రతీ సోమవారం ఆర్డీఓ కార్యాలయాల్లో గ్రీవెన్స్జనగామ: జిల్లాలో ప్రజల వినతులను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతీ సోమవారం ఆర్డీఓ కార్యాలయాల్లో రెవెన్యూ డివిజన్ స్థాయి గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టరేట్ సూపరింటెండెంట్ రజిత శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రీవెన్స్‌లో ఆర్డీఓ నోడల్ అధికారిగా పర్యవేక్షించనుండగా, అన్ని శాఖల డివిజన్ స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరై, ప్రజల వినతులను స్వీకరించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతీ అర్జీని ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఇక నుంచి ఎన్ఐీసీ పోర్టల్ స్థానంలో సీజీజీ గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా నమోదు చేయడం జరుగుతుందన్నారు. ప్రతీ వినతిదారుడికి యూనిక్ రిఫరెన్స్ నెంబర్‌తో కూడిన రశీదు పత్రం ఇవ్వనున్నట్లు, దీని ద్వారా వారు తమ వినతిని ఆన్లైన్లో సులభంగా తెలుసుకోవచ్చన్నారు. వినతులను 30 రోజుల్లోపు పరిష్కరించి, సంబంధిత నివేదికలను పోర్టల్‌లో అప్లోడ్ చేయాలన్నారు. ఆలస్యం జరిగితే ఆ కేసులను నేరుగా ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుందని ఆమె ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తుల పరిశీలనజనగామ: జనగామ పురపాలిక కార్యాలయంలో ఎస్సీ నిరుద్యోగ యువతీ, యువకులు ఎలక్ట్రిక్ వెహికిల్ టూ వీలర్, టూవీలర్(గూడ్స్, ప్యాసింజర్) కోసం చేసుకున్న ఆన్లైన్ ద్వారా చేసుకున్న దరఖాస్తులను పరిశీలించారు. శనివారం మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, కార్పొరేషన్, రవాణాశాఖ, బ్యాంకు అధికారుల సమక్షంలో దరఖాస్తులను స్క్రీనింగ్ టెస్ట్ చేశారు. వీటి కోసం 95 మంది దరఖాస్తు చేసుకోగా, స్క్రీనింగ్ టెస్ట్ కోసం 82 మంది హాజరయ్యారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ నియామకం● 69 మందితో నూతన కమిటీ ● డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి జనగామ: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు బి.మహేష్ కుమార్ గౌడ్ ఆమోదంతో జిల్లా కాంగ్రెస్ కమిటీకి కొత్తగా 69 మంది వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, ట్రెజరర్, సెక్రటరీలు, స్పోక్స్ పర్సన్లు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ల నియామకాలను ప్రకటించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతిలక్ష్మినారాయణ నాయక్ ఆధ్వర్యంలో తుది పరిశీలన జరిగిన తర్వాత శనివారం ఈ జాబితా విడుదల చేశారు. అనంతరం డీసీసీ అధ్యక్షురాలు మాట్లాడుతూ జిల్లా కమిటీ పేర్లను వెల్లడించారు. జిల్లాలో పార్టీ కార్యకలాపాలు, బూత్ స్థాయి బలోపేతం, సభ్యత్వ విస్తరణ, వచ్చే ఎన్నికల వ్యూహాల రూపకల్పనలో ఈ కొత్త కమిటీ కీలక పాత్ర పోషిస్తుందని ధన్వంతి తెలిపారు. -
ఈతకు వెళ్లి యువకుడి గల్లంతు
బచ్చన్నపేట: సరదాగా ఈత కొట్టడానికి స్నేహితులతో కలిసిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు బావి లో పడి గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యులు, ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఎనుగుల పద్మ– భిక్షపతి దంపతులకు చిన్నకుమారుడు ఎనుగుల ప్రశాంత్ (27) ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం గ్రామశివారులోని చేర్యాల రహదారి పక్కనగల రాజన్న బావిలో ఈత కొట్టడానికి వెళ్లాడు. ఇందులోభాగంగా బావి పక్కనే ఉన్న చెట్టు ఎక్కి బావిలో దూకిన ప్రశాంత్ నీటి అడుగుభాగానికి వెళ్లి పైకి రాలేదు. గమనించిన స్నేహితులు బావిలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహం కోసం వెతికినా రాత్రి వరకు కూడా మృతదేహం లభ్యం కాలేదు. దీంతో నేడు(ఆదివారం) మళ్లీ బావిలో మృతదేహం కోసం వెతకనున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. -
కట్టెల పొయ్యే దిక్కు!
కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై భారీ బాదుడు జనగామ: కమర్షియల్ సిలిండర్ ధర పెంపు హోటళ్ల నిర్వహణను తలకిందులు చేస్తోంది. వరుసగా పెరుగుతున్న ధరలు చిన్న వ్యాపారులపై పెనుభారం మోపుతున్నాయి. దీంతో చాలా మంది కట్టెల పొయ్యిపైనే హోటళ్లు నిర్వహించాల్సి వస్తోంది. ఇప్పటికే కమర్షియల్ సిలిండర్‌పై కొద్ది రోజుల క్రితం రూ.412 పెంపు చేసిన కేంద్ర ప్రభుత్వం, తాజాగా మరో రూ.839 మేర పెంచింది. దీంతో కేవలం కొన్ని నెలల్లోనే ఒక్క సిలిండర్‌పై పెంపు రూ.1,251కి చేరింది. దీంతో సిలిండర్ ధర రూ.3, 219కి చేరి వ్యాపారులకు తీవ్రమైన ఆర్థిక భారంగా మారింది. జిల్లాలో 12 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా, అధికారికంగా 500కు పైగా కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయి. వీటితో పాటు మరో 800 వరకు అనధికారిక కనెక్షన్లు ఉన్నట్లు అంచనా. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, గప్‌చుప్ బండ్లు, చిన్న హోటళ్లు, తినుబండారాల దుకాణాలు ప్రధానంగా కమర్షియల్ సిలిండర్లపైనే ఆధారపడతాయి. నెలకు నాలుగు నుంచి ఐదు సిలిండర్లు వినియోగించే చిన్న హోటళ్లకు కొత్త ధరల ప్రకారం ప్రతీ నెల కనీసం రూ.5వేల వరకు అదనపు వ్యయం తప్పదు. ఇప్పటికే భవన అద్దెలు, సిబ్బంది వేతనాలు, కూరగాయలు, నూనెలు, నిత్యావసరాల ధరలు పెరుగుతుండగా కమర్షియల్ గ్యాస్ ధరల భారీ పెంపు వారిపై మరింత ఒత్తిడిని పెంచుతోంది. వ్యాపారం కొనసాగించడమే పెద్ద సవాలుగా మారిందని, ప్రభుత్వ సహాయం లేకుంటే చిరు వ్యాపారరంగం తీవ్రమైన దెబ్బతింటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కమర్షియల్ సిలిండర్ల ధరలు పెరగడంతో టిఫిన్లు, ఇతర తినుబండారాల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లా కేంద్రంలోని పలు రెస్టారెంట్లు అదనంగా గ్యాస్ ధరలను జోడించి కస్టమర్ల వద్ద బిల్లులు వసూలు చేస్తున్నాయి. సామాన్య కుటుంబాలపై సైతం ధరల ప్రభావం పడనుంది. చిరు హోటళ్ల యజమానులపై ఆర్థిక భారం నెలకు రూ.5వేలకు పైగా అదనపు భారం కొద్ది నెలల్లోనే సిలిండర్‌పై రూ.1,251 పెంపు -
‘నీట్’కు పకడ్బందీ ఏర్పాట్లు
కేయూ క్యాంపస్: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకుగాను దేశవ్యాప్తంగా ఈ నెల 3న నిర్వహించనున్న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్టు (నీట్)– 2026కు ఉమ్మడి జిల్లాలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తంగా 14 కేంద్రాల్లో కలిపి 6,016మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులను ఉదయం 11గంటల నుంచే సెంటర్లోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1–30గంటలకు మెయిన్ గేట్లను మూసివేస్తారు. ఆ తరువాత వచ్చేవారికి అనుమతించబోరు. దివ్యాంగ అభ్యర్థులకు పరీక్ష రాసేందుకు అదనంగా గంట సమయం ఇస్తారు. ఆయా అభ్యర్థులకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష ఉంటుంది. హనుమకొండ, వరంగల్‌లోని పరీక్ష కేంద్రాల్లో ఐదుగురు స్క్రైబర్స్‌ను కూడా అందుబాటులో ఉంచుతున్నట్లు రెండు జిల్లాల నీట్ నోడల్ ఆఫీసర్ భిక్షపతి తెలిపారు. జిల్లా సెంటర్లు అభ్యర్థులుహనుమకొండ, వరంగల్ 09 4,600 జయశంకర్ భూపాలపల్లి 02 374 జనగామ 02 566 మహబూబాబాద్ 01 476 రేపు మధ్యాహ్నం 2నుంచి 5 గంటల వరకు నిర్వహణ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 14 పరీక్ష కేంద్రాలు ఉదయం 11గంటల నుంచే సెంటర్లలోకి అనుమతి మధ్యాహ్నం 1–30గంటల తరువాత నో ఎంట్రీ హాజరుకానున్న 6,016మంది అభ్యర్థులు అభ్యర్థులు అడ్మిట్ కార్డుతోపాటు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, 4x6 సైజ్ ఫొటో ఒకటి, ఏదైనా గుర్తింపుకార్డు వెంట తీసుకునిరావాలి. పన్ను, పెన్సిల్ తీసుకురావొద్దు. వీటిని పరీక్ష కేంద్రాల్లోనే అందజేస్తారు. బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకుంటారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, వాచ్‌లు తీసుకురావొద్దు. మహిళలు బంగారు నగలు పెట్టుకొని రాకూడదు. ఒకవేళ పెట్టుకుని వస్తే కేంద్రం వద్ద తీసివేయిస్తారు. కాళ్లకు షూస్ ధరించకూడదు. జీన్స్లాంటివి గాకుండా ఇతర సాధారణ దుస్తులు ధరించి రావాలి. పారదర్శకంగా ఉండే వాటర్ బాటిల్స్‌ను తీసుకురావచ్చు. డయాబెటిక్ అభ్యర్థులుంటే వారు పండ్లు (అరటి, యాపిల్) తీసుకొని రావచ్చు. ప్రతి గదిలో, మెయిన్ గేట్‌వద్ద అందరికీ కనిపించేలా గడియారాలు ఏర్పాటు చేస్తారు. వరంగల్ నిట్‌లో రెండు సెంటర్లు, హనుమకొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీకళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో ఎడ్యుకేషన్), వరంగల్‌లో సీకేఎం కళాశాల, ఎల్బీ కళాశాల, కేంద్రీయ విద్యాలయం, యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్ కళాశాల, యూనివర్సిటీ పీజీ కళాశాల. జయశంకర్ భూపాలపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో), ప్రభుత్వ జూనియర్ కళాశాల. జనగామ జిల్లా కేంద్రంలోని ఏవీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పెంబర్తిలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల విద్యాలయం. మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోగల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల. మహబూబాబాద్‌లో నీట్ నోడల్ ఆఫీసర్‌గా కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ ముఖేశ్‌కుమార్ వ్యవహరించనున్నారు. -
నేడు స్క్రీనింగ్ టెస్ట్
జనగామ: జనగామ మున్సిపల్ పరిధిలోని ఎలక్ట్రిక్ వెహికిల్, టూ వీలర్, ఎలక్ట్రిక్ టూవీలర్(గూడ్స్ అండ్ ప్యాసింజర్) కోసం దరఖాస్తు చేసుకున్న ఎస్సీ నిరుద్యోగ యువతీ, యువకులకు శనివారం(2వ తేదీ) మున్సిపల్ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందని కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు. జఫర్‌గఢ్: మండల కేంద్రంలోని వేల్పుగొండ కొండ దిగువన ఉన్న సీతారామచంద్ర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈ నెల 3న (ఆదివారం) శ్రీరంగనాథస్వామి మూర్తి విగ్రహా ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకుడు పొడిచేటి వెంకటాచార్యులు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం సందర్భంగా శనివారం నుంచి రెండు రోజుల పాటు ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. మరింగంటి నర్సింహాచార్యుల కుటుంబ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వేడుకల్లో భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జనగామ: జిల్లాలో రైతులకు మద్దతు ధర కల్పించేందుకు అన్నదాతల ముంగిటే సెంటర్లను ఏర్పాటు చేసినట్లు ఇన్చార్జ్ డీఆర్డీఓ నూరొద్దీన్ శుక్రవారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ‘మా పడ్లు కొనండి సారూ’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. రైతు ఇంటి దగ్గరే మార్కెట్ సౌకర్యాలు కల్పిస్తూ, ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతుతో ఎంఎస్పీని పూర్తి స్థాయిలో అందిస్తున్నామని అధికారులు హామీ ఇచ్చారు. 12 మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు సజావుగా జరుగుతోందని కొన్ని గ్రామాలను ఇతర కేంద్రాలకు లింక్ చేసినట్లు తెలిపారు. అందులో భాగంగా జనగామ మండలం యశ్వంతాపూర్ గ్రామాన్ని చీటకో డూరు కొనుగోలు కేంద్రానికి అనుసంధానం చేసినట్లు వివరించారు. గ్రామాల రైతులు తమ గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం అమ్ముకోవాలన్నారు. వైభవంగా హేమాచలుడి తిరుకల్యాణంమంగపేట: రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధి గాంచిన మల్లూరు శ్రీ హేమాచలక్షేత్రంలో లక్ష్మీనర్సింహాస్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. ఆలయ కార్యనిర్వాహణ ఇన్చార్జ్ అధికారి ఎం.వీరస్వామి, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ శ్రావణం సత్యనారాయణ పర్యవేక్షణలో లక్ష్మీనర్సింహాస్వామి ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల కల్యాణ మహోత్సవాన్ని భద్రాచలం సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకుడు అమరవాది మురళీ కృష్ణమాచార్యుల బృందం వేద మంత్రోచ్ఛరణ నడుమ శాస్త్రోక్తంగా జరిపించారు. ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు ప్రధానాలయంలోని స్వయంభు స్వామివారిని నూతన వస్త్రాలంకరణ చేసి నిత్యారాధన, తిరు కల్యాణ మహోత్సవాన్ని జరిపించారు. సుమారు రెండు గంటల పాటు స్వామివారి కల్యాణ మహోత్సవ క్రతువును నిర్వహించారు. 12.30 గంటలకు అభిజిత్ లగ్నంలో జిలకరబెల్లం, మాంగళ సూత్రదారణ, ముత్యాల తలంబ్రాలతో స్వామివారి కల్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా జరిపించారు. -
‘లెక్క’ తప్పారు!
● ఆ తర్వాత సైన్స్ పరీక్షలో 50మంది విద్యార్థులు ● మొత్తంగా జిల్లాలో ఉత్తీర్ణులు కానిది 198 మంది ● అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ఖరారుజనగామ: పదో తరగతి వార్షిక పరీక్షల్లో సబ్జెక్టుల వారీగా ఫెయిల్యూర్స్ నమోదు ఆందోళన కలిగిస్తోంది. సబ్జెక్టుల వారీగా పలవురు విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేకపోయారు. ప్రతీ సబ్జెక్టులో విద్యార్థులు ఎందుకు ఫెయిల్ అయ్యారన్న దానిపై విశ్లేషణ జరపాల్సి ఉంది. జిల్లాలోని విద్యార్థుల అభ్యాసన విధానం, బోధనా ప్రమాణాలు, ప్రాథమిక అవగాహన లోపం వంటి కారణాలు ఉండొచ్చని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. 6,443 మంది పరీక్షకు హాజరు మార్చిలో నిర్వహించిన పదో తరగతి వార్షిక పరీక్షల్లో 6,443 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 3,105 మంది బాలురు, 3,338 మంది బాలికలు ఉన్నారు. వీరిలో 6,292 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణులైన వారిలో 3,013 మంది బా లురు, 3,279 మంది బాలికలు ఉన్నారు. 183 పాఠశాలల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 32 ప్రైవే ట్ పాఠశాలలు, 58 ఉన్నత పాఠశాలలు, 8 కేజీబీ వీలు, 4 మోడల్ పాఠశాలలు, 4 బీసీ వెల్ఫేర్ పాఠశాలలు, 1 ఎయిడెడ్, 1 రెసిడెన్షియల్, 2 మైనారిటీ, 2 సోషల్ వెల్ఫేర్, 1 ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలు 100 శాతం ఫలితాలు సాధించాయి. తెలుగులో 29 మంది మాతృభాష తెలుగులో 29 మంది విద్యార్థులు ఫెయిల్ కావడం గమనార్హం. సాధారణంగా ఈ విషయంలో ఎక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించే పరిస్థితి ఉండేది. అయితే రచనా శైలి, వ్యాకరణ అవగాహన లోపం, పాఠ్యాంశాలపై నిర్లక్ష్యం వంటి అంశాలు ఫలితాలను ప్రభావితం చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా దీర్ఘ ఉత్తర ప్రశ్నల రచనలో విద్యార్థులు మార్కులు కోల్పోయినట్లు విశ్లేషిస్తోంది. హిందీ విషయంలో ముగ్గురు విద్యార్థులు మాత్రమే ఫెయిల్ కావడంతో ఈ సబ్జెక్ట్‌లో మొత్తం విద్యా బోధన స్థిరంగా ఉన్నట్టు అర్థమవుతోంది. ఇంగ్లిష్‌లో 28 మంది ఇంగ్లిష్‌లో 28 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేకపోవడం సాధారణంగానే ఉన్నప్పటికీ, భాషపై ప్రాథమిక అవగాహన లోపం, స్పెల్లింగ్ తప్పులు, గ్రామర్‌లో నిర్లక్ష్యం, రీడింగ్, రైటింగ్ స్కిల్స్ బలహీనత కారణాలుగా నిలిచాయి. ముఖ్యంగా వ్యాసరచన, లెటర్ రైటింగ్ ప్రాంతాల్లో తక్కువ మార్కులు పొందినట్లు స్పష్టమైంది. గణితంలో 79 మంది రికార్డు స్థాయిలో గణితం సబ్జెక్టులో అత్యధికంగా 79 మంది ఫెయిల్ శాతం నమోదైంది. ఈ ఫెయిల్యూర్ రేటుతో జిల్లాలో మ్యాథ్స్ బోధనపై ప్రశ్నార్థకం ఏర్పడింది. ఫార్ములాల పట్ల అవగాహన లేకపోవడం, సున్నితమైన కాన్సెప్ట్‌లను గ్రహించడంలో ఇబ్బంది పడడం, సమస్యలను దశల వారీగా పరిష్కరించే నైపుణ్యం లోపించడం వంటి కారణాలు విద్యార్థుల పనితీరు తగ్గడానికి దారి తీశాయనే చర్చ ఉంది. సైన్స్‌లో 50 మంది సైన్స్‌లో 50 మంది విద్యార్థులు ఫెయిల్ కావడం కూడా ఆందోళనకరమే. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం విభాగాల్లో ప్రయోగాత్మక అవగాహన లోపం, డయాగ్రామ్లు సరిగా రాయకపోవడం, సిద్ధాంతాత్మక ప్రశ్నల్లో అ స్పష్టత ప్రధాన కారణాలుగా గుర్తించినట్లు తెలుస్తోంది. సాంఘికశాస్త్రంలో 9 మంది మాత్రమే ఫెయిల్ కావడం ఒక రకంగా స్థిరమైన ఫలితంలా కనిపిస్తుంది. పరీక్ష ఫీజుల చెల్లింపులు అభ్యర్థులు పరీక్ష ఫీజును సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుల వద్ద ఆన్లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల14వ తేదీ వరకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, 15వ తేదీ వరకు హెచ్ఎం, ఈఎన్ఆర్ను ఆన్లైన్ ద్వారా డీఈఓకు సమర్పించాల్సి ఉంటుంది. 16వ తేదీ నాటికి డీఈఓలు ఈఎన్ఆర్ను ప్రభుత్వ పరీక్షల కార్యాలయానికి ఆన్లైన్ ద్వారా సమర్పించాలి. రూ.50 ఆలస్య రుసుముతో సంబంధిత సబ్జెక్టు పరీక్షకు రెండు రోజుల ముందుగా చెల్లించే అవకాశం కల్పించారు. రాష్ట్ర సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు జూన్‌లో నిర్వహించనున్న అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ప్రకటించింది. జూన్ 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఉంటాయి. 5వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్ గ్రూప్–ఏ పరీక్ష ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఉంటుంది. ఫస్ట్ లాంగ్వేజ్ పార్ట్–1 (కంపోజిట్ కోర్సు) ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.50, ఫస్ట్ లాంగ్వేజ్ పార్టు–2 (కంపోజిట్ కోర్సు) ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.50 వరకు జరుగనుంది. 6వ తేదీన సెకండ్ లాంగ్వేజ్ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30, 7వ తేదీ ఇంగ్లిష్ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30, 8వ తేదీన గణితం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30, 9న సైన్స్ పార్ట్–1 (ఫిజికల్ సైన్స్) ఉదయం 9.30 నుంచి 11 గంటలు, 10న సైన్స్ పార్ట్–2 (బయోలాజికల్ సైన్స్) ఉదయం 9.30 నుంచి 11 గంటలు, 11న సాంఘిక శాస్త్రం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు జరగనుంది. -
పన్ను వసూళ్ల లక్ష్యసాధనకు చర్యలు
జనగామ రూరల్: మున్సిపాలిటీ పరిధిలో పన్నుల వసూళ్ల లక్ష్యసాధనకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో స్టేషన్ ఘన్పూర్ మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్‌కుమార్‌తో కలిసి మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పారిశుధ్యం, జనన, మరణాలు, వివిధ అభివృద్ధి పనులు, బిల్డింగ్ అనుమతులు, ఆస్తి, వాణిజ్య పన్నులు, పెండింగ్‌లో ఉన్న ఎల్ఆర్ఎస్ తదితర వివరాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయా విభాగాల వారీగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతీ వార్డులో ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని, ఉదయం 5 నుంచి 8 గంటల రోడ్ల శుభ్రత, ఇంటింటి చెత్త సేకరణ ప్రాధాన్యం, పరిశుభ్రత, పన్నుల వసూళ్లపై దృష్టి సారించాలన్నారు. వాణిజ్య ప్రకటనల పన్నులు తప్పనిసరిగా వసూలు చేయాలని, మున్సిపాలిటీకి ఆదాయాన్ని పెంచాలన్నారు. మున్సిపల్ చైర్మన్ వినయ్‌కుమార్ మాట్లాడుతూ.. ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్స్ వసూలు చేసే అంశంలో ప్రభుత్వ నియమ నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలని, నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న రోడ్డు, మురుగు కాల్వల నిర్మాణ పనులు, వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణం, కమ్యూనిటీ హాల్ తదితర వివిధ అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, మేనేజర్ సత్యనారాయణ, పట్ణణ ప్రణాళిక అధికారి సుష్మా, ఇంజనీరింగ్, శానిటరీ ఇన్స్పెక్టర్, బిల్ కలెక్టర్లు పాల్గొన్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
ఎగిరింది కార్మిక జెండా
కార్మికుల సాధనాలు, కార్యక్రమాల నివేదిక పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న కలెక్టర్, ఏఎల్ఓ ఆర్టీసీ డిపో వేడుకల్లో ఏఎంసీ చైర్మన్ శివరాజ్ యాదవ్, డిపో మేనేజర్ స్వాతిజనగామ: జిల్లా వ్యాప్తంగా మేడే వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. కలెక్టర్ కార్యాలయ కాన్ఫరెన్‌న్స్ హాల్లో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ..కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణలో కార్మిక సంఘాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని, అన్ని సంఘాలు కలిసికట్టుగా పనిచేస్తే సమస్యలకు సమగ్ర పరిష్కారం సాధ్యమవుతుందని తెలిపారు. అనంతరం కార్మికుల సాధనాలు, కార్యక్రమాల నివేదిక పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏఎల్ఓ కుమారస్వామి, బీసీ సంక్షేమ శాఖ అధికారి నరసింహరావు, ఏబీసీడీఓ రవీందర్, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి విక్రమ్, వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్టాండ్‌లో.. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో డిపో మేనేజర్ స్వాతి ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అసిస్టెంట్ మేనేజర్ హుస్సేన్, ట్రాఫిక్ ఇన్చార్జ్ ఎంబీకే రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీలో.. జనగామ పురపాలిక ప్రాంగణంలో మున్సిపల్ ఔట్సోర్సింగ్ వర్కర్స్, డ్రైవర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు మల్లిగారి రాజు ఆధ్వర్యంలో కార్మికులు మేడే వేడుకలను జరుపుకున్నారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు మిద్దెపాక రాజు, కార్యదర్శి గడిపె ప్రవీణ్ కుమార్, డ్రైవర్ల యూనియన్ అధ్యక్షులు మునిగె రవి, కార్యదర్శి మసి రాజు, ఉపాధ్యక్షులు వాతాల యాదగిరి, మునిగె కరుణాకర్, 13 వ వార్డు కౌన్సిలర్ పానుగంటి ప్రవీణ్ సువార్త, మౌనిక తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా మేడే వేడుకలు -
బస్టాండ్‌లో జనజాతర
జనగామ ఆర్టీసీ బస్టాండ్‌లో రాత్రి 9 గంటలకు వందలాది మంది ప్రయాణికుల రద్దీపెళ్లిళ్లు, శుభకార్యాలు, దుర్గామాత, బొడ్రాయి పండుగలతో జనగామ ఆర్టీసీ బస్టాండ్ జాతరను తలపించింది. శుక్రవారం రాత్రి 10 గంటలు దాటినా వందలాది మంది ప్రయాణికులు బస్సుల కోసం నిరీక్షించారు. హన్మకొండ, జగద్గిరిగుట్ట, సిద్దిపేట, తరిగొప్పుల తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ప్లాట్‌ఫామ్‌లతో పాటు ప్రయాణ ప్రాంగణం మొత్తం నిండిపోయారు. బస్సులు ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చేదాక చూడకుండా ఎదురుగా వెళ్లి ఎక్కే ప్రయత్నం చేశారు. ఒక్కో బస్సులో 90 నుంచి 100 మందికి పైగా ప్రయాణం చేశారు. – జనగామ -
పథకాలపై అవగాహన పెంచుకోవాలి
జనగామ రూరల్: కార్మికులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఎస్. శ్రీదేవి అన్నారు. మేడే సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లాలోని నెల్లుట్ల గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి శ్రీదేవి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శశి, లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ ఎం.రవీంద్ర, సర్పంచ్ రామకృష్ణ, దీప్తి, శేఖర్, జితేంద్ర, సుందరయ్య, అమృత పాల్గొన్నారు. -
విద్యుత్, రోడ్డు భద్రత పాటించాలి
జనగామ: విద్యుత్, రోడ్డు భద్రత పాటించి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్‌రెడ్డి పిలుపునిచ్చారు. విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయంలో శుక్రవారం విద్యుత్ భద్రత వారోత్సవాలను పురస్కరించుకుని వారు ముఖ్యఅతిథిగా హాజరై పోస్టర్‌ను ఆవిష్కరించి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మాట్లాడుతూ.. ఉద్యోగులు, ప్రజలు భద్రతా ప్రమాణాల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. రోడ్డు నియమాలు పాటిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చన్నారు. సమాజాన్ని నాశనం చేస్తున్న డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. కరెంటు ఎల్సీ తీసుకునే సమయంలో యాప్ ద్వారా మాత్రమే సేవలను ఉపయోగించుకోవాలని ఎస్ఈ సూచించారు. కార్యక్రమంలో డీఈ లక్ష్మీనారాయణరెడ్డి, ఏడీఈ వేణుగోపాల్, టౌన్–1 ఏఈ సౌమ్య, టౌన్–2 ఏఈ చంద్రమోహన్, రూరల్ ఏఈ మధు, పెంబర్తి ఏఈ కనకయ్య, సిబ్బంది పాల్గొన్నారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రతిఒక్కరూ భాగస్వాములవ్వాలి డీసీపీ రాజమహేంద్ర నాయక్ -
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి
జనగామ రూరల్: దీర్ఘకాలికంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేసేలా పాటుపడాలని కోరుతూ తపస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చల్లా తిరుపతిరెడ్డి, అంకం సతీష్‌కుమార్ హైదరాబాద్‌లోని నాచారంలో జరుగుతున్న అభ్యాసవర్గ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఏవీఎన్‌రెడ్డి, మల్క కొమురయ్యకు శుక్రవారం వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు విలేకర్లతో మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల నుంచి ఉపాధ్యాయుల సమస్యల పెండింగ్‌లో ఉన్నాయని, వీటని పరిష్కరించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏలు, పీఆర్సీని వెంటనే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో సంఘం బాధ్యులు మల్లారెడ్డి, పంచాక్షరి, క్రాంతి, కృతాత్మమూర్తి, రమేశ్, అన్నపూర్ణ, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీలకు తపస్ జిల్లా నాయకుల వినతి -
7న ఉప ముఖ్యమంత్రి పర్యటన
హన్మకొండ: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ నెల 7న స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డితో కలిసి శుక్రవారం ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటనలో భాగంగా విద్యుత్ సబ్ స్టేషన్ల ప్రారంభం, శంకుస్థాపన కార్యక్రమాలు ఉంటాయన్నారు. వేలేరు మండలం పీచరలో 132/33 కేవీ సబ్ స్టేషన్, చిల్పూరు మండలం కొండాపూర్, జఫర్గడ్ మండలం సాగరం, రఘునాథపల్లి మండలం కుర్చపల్లి గ్రామాల్లో 33/11కేవి సబ్ స్టేషన్ల ప్రారంభోత్సవం, జఫర్గడ్ మండలం కేంద్రంలో 132/33కేవి సబ్ స్టేషన్, చిల్పూరు మండలం లింగంపల్లి, పల్లగుట్ట, నష్కల్ గ్రామాల్లో 33/11 కేవీ సబ్ స్టేషన్లకు శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు. ఉప ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా జఫర్గడ్లో 5 వేల మందితో బహిరంగ సభకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ మేరకు అధి కారులకు ఆదేశాలివ్వాలని సీఎండీ వరుణ్ రెడ్డికి సూచించారు. జఫర్గడ్ 132/33కేవి సబ్ స్టేషన్‌కు సంబంధించిన భూ కేటాయింపునకు ట్రాన్స్ కో అధికారులు వెంటనే చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలన్నారు. ఈ మేరకు సీఎండీ వరుణ్ రెడ్డి సంబంధిత అధికారులకు సభ, భూ కేటాయింపుపై స్పష్టమైన ఆదేశాలిచ్చారు. లోటుపాట్లు లేకుండా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేసి ఉప ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. -
శోభాయమానం.. పుష్పయాగం
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో శ్రీభద్రకాళిభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో చివరిరోజు గురువారం ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి మూలమూర్తిని పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. చూర్ణోత్సవం జరిపి చక్రతీర్థోత్సవం నిర్వహించి తిరిగి చక్రాన్ని అమ్మవారి సన్నిధికి చేర్చారు. అలాగే దేవాలయం చుట్టూ అమ్మవారి ఊరేగింపు జరపడానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి విరాళంగా అందజేయనున్న కోటి రూపాయలతో 30 అడుగుల రథం తయారీకి ఉపయోగించే కలపకు పూజలు చేశారు. శిల్పి గిర్మాజీ ప్రవీణ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అందజేసిన అడ్వాన్స్ రూ.45 లక్షలతో నాగపూర్ నుంచి తెప్పించిన మేలు రకం టేకు కలపకు అర్చకులు పూజలు చేసి పని ప్రారంభించారు. అమ్మవారికి పుష్పయాగం అమ్మవారికి శతఘటాభిషేకం జరిపి రాత్రి స్నపనమందిరంలో వేదపండితులు మంత్రోచ్ఛరణ చేస్తుండగా గులాబీలు, మల్లెలు, లిల్లీ లు, విరజాజు లు, బంతులు, చామంతులు, కనకాంబరాలతో పుష్పయాగం నిర్వహించారు. పుష్పయాగం నిర్వహించడం వల్ల బ్రహ్మోత్సవాల్లో జరిగిన దోషాలు తొలగిపోతాయని భద్రకాళి శేషు తెలిపారు. భద్రకాళి ఆలయంలో ముగిసిన కల్యాణ బ్రహ్మోత్సవాలు -
అజెండా అంశంలో స్పష్టత లేదు
జనగామ: మున్సిపల్ కౌన్సిల్లో బడ్జెట్, అజెండా అంశాల తయారీపై తీవ్ర అసంతృప్తి నెలకొందని మాజీ మున్సిపల్ చైర్పర్సన్లు ప్రేమలతారెడ్డి, పోకల జమున లింగయ్య విమర్శించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.. 54 అజెండా అంశాలు తయారు చేసే సమయంలో వైస్ చైర్మన్‌ను ఎందుకు ఆహ్వానించలేదన్నారు. సాధారణ మున్సిపల్ బడ్జెట్ నుంచి రూ.1.50 కోట్ల మొత్తాన్ని మళ్లిస్తే కార్మికుల జీతాలు, పీఎఫ్‌లు, ఆఫీసు అత్యవసర ఖర్చులు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. అజెండా సిద్ధం చేసే ప్రక్రియను పూర్తిగా పక్కనబెట్టి, మూడు రోజుల ముందు ఇవ్వాల్సిన కాపీలు ఒక్కరోజు ముందే ఇచ్చారని నిలదీశారు. సమావేశం జరుగుతున్న సమయంలో కౌన్సిల్ హాల్లోకి పోలీసులను ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. వైస్ చైర్మన్‌ను వేదికపై నుంచి దిగమని పోలీసులు అడగడమేంటి, ఇది స్పష్టమైన ప్రొటోకాల్ ఉల్లంఘన అన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ అజెండా అంశాల గురించి తనకు తెలియదని చెప్పడం ఆశ్చర్యకరమన్నారు. సమావేశంలో కౌన్సిలర్లు సేవెల్లి మధు, గోపగోని సుగుణాకర్ గౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేష్‌రెడ్డి, సజ్జ దుర్గాప్రసాద్, గునిగంటి వెన్నెల, పానుగంటి సువార్త, మామిడాల రజిత, అనూష, నాయకులు మల్లేశం, ఉల్లెంగుల సందీప్, రాజు, దావెర రాజు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మాజీ మున్సిపల్ చైర్పర్సన్లు ప్రేమలతారెడ్డి, జమున -
ఇందిరమ్మ ఇళ్ల జాబితా విడుదల చేయండి
● మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే పల్లా వినతి జనగామ: నియోజకవర్గానికి సంబంధించి మిగిలిన ఇందిరమ్మ ఇళ్ల జాబితాను వెంటనే విడుదల చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి గురువారం హైదరాబాద్‌లో విజ్ఞాపన పత్రాన్ని అందించారు. జిల్లా పరిధిలో జరుగుతున్న గృహ నిర్మాణ పనులు, ఎదురవుతున్న సమస్యలు, ప్రజల అవసరాలను మంత్రికి వివరించినట్లు పేర్కొన్నారు. పథకాన్ని మరింత వేగవంతం చేయడానికి రెవెన్యూ, హౌజింగ్ శాఖల సమన్వయాన్ని బలోపేతం చేయాలని, అర్హత ఉన్న ప్రతీ కుటుంబం ఇల్లు పొందేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జనగామ నియోజకవర్గానికి 2025–26లో మంజూరైన 3,500 ఇందిరమ్మ ఇళ్లలో 1,400 ఇళ్లు ఎమ్మెల్యే సిఫారసుల్లో భాగంగా కేటాయించాల్సి ఉండగా, వాటిలో 600 ఇళ్లు సిద్దిపేట సెగ్మెంట్‌కు వెళ్లాయన్నారు. వీటిలో 462 ఇళ్లు ఇప్పటికే మంజూరు కాగా, 138 ఇళ్లు ఇంకా బకాయిగా ఉన్నాయని లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూల్మిట్ట కలుపుకుని కొత్తగా 128 దరఖాస్తులు వచ్చాయన్నారు. జనగామ సెగ్మెంట్లో కేటాయించిన 800ఇళ్లకు 577 ప్రతిపాదనలు అందాయన్నారు. బచ్చన్నపేట 424, జనగామ 395, నర్మెట 161, తరిగొప్పుల 130, జనగామ టౌన్ 477 ప్రతిపాదనలు వచ్చినట్లు వివరాల్లో పేర్కొన్నారు. ఇప్పటివరకు 357 ఇళ్లు మంజూరు కాగా, 223 ఇళ్లు రెండో విడతలో మిగిలి ఉన్నాయని తెలిపారు. వీటిని వెంటనే విడుదల చేయాలని కోరినట్లు చెప్పారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి● రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా జనగామ రూరల్: పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, విద్యాకార్యక్రమాలు పక్కాగా అమలు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్‌తో కలిసి వారు కలెక్టర్లతో 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించే విద్య వారోత్సవాలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు. విద్యా శాఖ కార్యదర్శి మాట్లాడుతూ.. 2026–2027 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 2,700 ప్రభుత్వ పాఠశాలలలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. 99 రోజుల కార్యక్రమంలో భాగంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో మే 11వ తేదీ నుంచి వారోత్సవాలను నిర్వహించాలని మౌలిక వసతుల కల్పనకు సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులతో శంకుస్థాపనలు చేయించాలన్నారు. వీసీ అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి, నాణ్యమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. విద్యా శాఖ ఏడీ శ్రీనివాస్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 3న చుక్కా సత్తయ్య విగ్రహావిష్కరణజనగామ: ఒగ్గు కళాకారుడు చుక్కా సత్తయ్య 91వ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 3వ తేదీన జిల్లా కేంద్రం హైదరాబాద్ రోడ్డు కళ్లెం కమాన్‌వద్ద విగ్రహా విష్కరణ ఉంటుందని జిల్లా కురుమ సంఘం అధ్యక్షుడు కంచె రాములు, బీసీ సంఘం జిల్లా చైర్మన్ సేవెల్లి సంపత్ తెలిపారు. గురువారం విగ్రహావిష్కరణ మహోత్సవానికి సంబంధించి జిల్లా కురుమ సంఘం కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జాయ మల్లేష్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. అనంతరం ఉత్సవ కమిటీ చైర్మన్‌గా ఎన్నికై న కంచె రాములు మాట్లాడుతూ.. చుక్కా సత్తయ్య విగ్రహావిష్కరణ మహోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్బండ జానపద కళాకారులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. బీసీ సంఘం జిల్లా చైర్మన్ సేవెల్లి సంపత్ మాట్లాడుతూ.. ఒగ్గుకళను ఒక వర్గానికి పరిమితం కాకుండా జాతీయ, అంతర్జాతీయ వేదికలకు పరిచయం చేసిన వ్యక్తి చుక్కా సత్తయ్య అన్నారు. వేలాది మంది శిష్యులను తీర్చిదిద్దిన ఆది గురువు సత్తయ్య విగ్రహావిష్కరణకు బహుజనులు భారీసంఖ్యలో తరలిరావాలన్నారు. సమావేశంలో బండి వీరస్వామి, చౌదరపల్లి రోశయ్య, మంగళంపల్లి రాజు, పాశం శ్రీశైలం, జూకంటి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. -
మక్కల కొనుగోళ్లలో జాప్యంపై ధర్నా
పాలకుర్తి టౌన్: నెల రోజులుగా మండల కేంద్రంలోని చిట్యాల ఐలమ్మ వ్యవసాయ మార్కెట్ యార్డులో మక్కల కొనుగోళ్లు జరగకవపోడంతో సీపీఐ(ఎంఎల్)లిబరేషన్ జిల్లా కార్యదర్శి గుమ్మడిరాజుల సాంబయ్య ఆధ్వర్యంలో గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు బైఠాయించి మూడూ గంటల పాటు ధర్నా నిర్వహించారు. తహసీల్దార్ సరస్వతి మార్కెట్ యార్డును సందర్శించే వరకు ఆందోళన కొనసాగింది. సేష్టన్ ఘన్పూర్ ఆర్టీఓ డీఎస్ వెంకన్న ఆదేశాల మేరకు తహసీల్దార్ మార్కెట్ యార్డుకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మార్క్‌ఫెడ్ అధికారులు గన్నీ బ్యాగులు పంపించడం లేదని, కాంటాలు పెట్టిన మక్కలను గో దాముల్లోకి తరలిస్తుంటే గోదాముల్లో డెలివరీ చేసుకోవడం లేదని డీసీసీ బ్యాంక్ సీఈఓ సత్యనారాయణరెడ్డి తెలిపారు. ధర్నాలో పార్టీ నాయకులు జీడి సో మయ్య, మంకాళి శ్రీనివాస్, కొనుక్కటి కళింగరా జు, బక్క నాగరాజు, బక్క సోమయ్య, సమ్మయ్య, గట్టుమల్లు, రమేశ్, నాగరాజు, కత్తల జోగయ్య, యాకయ్య తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతుల బైఠాయింపు -
ఉద్యమ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి
జనగామ: జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగంలో అవగాహన పెంపుతో పాటు స్వయం సహాయక సంఘాల సాధికారతకు దోహదపడేలా ఉద్యమ్ రిజిస్ట్రేషన్ చేపట్టినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశం హాల్లో దీనిపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం (టీఓటీ) నిర్వహించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధ్యక్షతన డీఆర్డీఏ, సెర్ప్, పరిశ్రమల శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏపీఎంలు, ఎంఎస్ఓలు, సీసీలకు దశలవారీ మార్గదర్శకత్వం అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని స్వయం సహాయక సంఘాలు మే 10లోపు ఉద్యమ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని, రిజిస్ట్రేషన్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న అనేక సబ్సిడీలు, ఆర్థిక ప్రోత్సాహకాలు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. స్నేహ వేసవి కాలపట్టికపై అవగాహన ఉద్యమ్ శిక్షణ అనంతరం స్నేహ వేసవి కాలపట్టిక 2026పై జిల్లా స్థాయి సమన్వయ సమావేశాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నిర్వహించారు. మే 2 నుంచి జూన్ 10 వరకు జరిగే ఈ శిబిరాల్లో బాలబాలికల అభివృద్ధి, భద్రత, అవగాహన, ఆరోగ్యం, నైపుణ్యాలు, కెరీర్ మార్గదర్శకత్వం వంటి అంశాలపై ప్రత్యేక సెషన్లు జరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఓ నూరుద్దీన్, డీపీఓ వెంకట్‌రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. విద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలి ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11 నుంచి 16 వరకు నిర్వహించే విద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. విద్యా వారోత్సవాలపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశంలో విద్యా శాఖ ఏడీ శ్రీని వాస్, ఇతర విద్యా శాఖ అధికారులు, అన్ని మండలాల ఎంఈఓలు, హెడ్ మాస్టర్లు పాల్గొన్నారు. కొనుగోలు ప్రక్రియ సజావుగా ఉండాలి జనగామ రూరల్: జిల్లాలో ఏర్పాటు చేసిన 234 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగాలని, ఇందుకు వ్యవసాయ, సివిల్ సప్ప్లై వివిధ శాఖల అధికారులు సమన్వయంగా పనిచేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. మండలంలోని శామీర్‌పేట్‌లో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. సమీక్షలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
ప్రత్యేక శ్రద్ధతో మెరుగైన ప్రగతి
జనగామ రూరల్: పదో తరగతి పరీక్షల ఫలితాల్లో జిల్లా మరోసారి సత్తా చాటుకుంది. వార్షిక పరీక్షలకు 6,443 మంది విద్యార్థులు హాజరుకాగా, వారిలో 6,292 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 97.66 శాతం ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లా రాష్ట్రంలో 17వ స్థానాన్ని దక్కించుకుంది. ప్రత్యేకంగా సర్కారు పాఠశాలల్లో కనిపించిన ఈ పురోగతి విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారుల కృషికి నిదర్శనంగా నిలిచింది. తల్లిదండ్రులు, గ్రామస్థాయి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ల భాగస్వామ్యం కూడా ఫలితాల మెరుగుదలకు దోహదపడిన అంశంగా అధికారులు భావిస్తున్నా రు. ఫలితాల్లో బాలికలు మరింత మెరుగైన ప్రతిభ చూపారు. మొత్తం బాలికల ఉత్తీర్ణత శాతం 98.23 కాగా, బాలురు 97.04 శాతం అందుకున్నారు. జెడ్పీలపై ప్రత్యేక శ్రద్ధ జిల్లాలోని 103 జెడ్పీ, మండల పరిషత్, అర్బన్ సర్కారు పాఠశాలలు ఈ ఏడాది ప్రత్యేక శ్రద్ధతో బోధనా కార్యక్రమాలు నిర్వహించగా, ఫౌండేషన్ కోర్సులు, రివిజన్ ప్రోగ్రామ్‌లు, వారానికొకసారి నిర్వహించిన మానిటరింగ్ సమావేశాలు మంచి ఫలితాలను ఇచ్చాయని అధికారులు తెలుపుతున్నారు. విద్యార్థుల హాజరు శాతం పెంపు, ప్రత్యేక క్లాస్‌లు, పరిశీలన పద్ధతులే ఈ విజయానికి దోహదపడ్డాయన్నారు. తగ్గిన రాష్ట్ర స్థాయి ర్యాంక్ గత రెండు పర్యాయాలు జిల్లా రాష్ట్రస్థాయిలో టాప్ 5లో ర్యాంకు సాధించింది. విజయోస్తు కార్యక్రమంలో భాగంగా జెడ్పీ పాఠశాలలు, ఇతర యజామాన్యాలు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో గత రెండు ఏళ్లలో మంచి ఫలితాలు సాధించింది. గతేడాది 2024–25లో రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంక్ సాధించింది. 2023–24లో 4వ స్థానం సాధించగా ప్రస్తుత 2025–26లో 17వ స్థానానికి పడిపోయింది. అయితే ఈ ఏడాది ర్యాంకు తగ్గినప్పటికీ ఎక్కువ మంది విద్యార్థులు పాస్ కావడం గమనార్హం. పది ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో జిల్లాకు 17వ స్థానం 6,443 మంది విద్యార్థులకు 6,292 మంది పాస్ వంద శాతం సాధించిన జఫర్‌గఢ్ మండలం సత్తాచాటిన జెడ్పీ పాఠశాలలుబచ్చన్నపేట 97.30 చిల్పూర్ 98.56 దేవరుప్పుల 91.83 స్టేషన్ ఘన్పూర్ 97.73 జనగామ 96.41 కొడకండ్ల 99.74 లింగాలఘణపురం 98.53 నర్మెట 95.72 పాలకుర్తి 98.99 రఘునాథపల్లి 99.41 తరిగొప్పుల 97.74 జఫర్‌గఢ్ 100జిల్లాలో 100శాతం ప్రగతి సాధించిన ఏకై క మండలంగా జఫర్‌గఢ్ నిలిచింది. 369 మందిలో 369 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి, 100శాతంతో సత్తా చాటుకున్నారు. కాగా, దేవరుప్పుల మండలంలో 355 మందిలో 326 మంది పాస్ కాగా, పాస్ శాతం 91. 83. జిల్లాలో అత్యల్ప శాతాన్ని నమోదు చేసిన మండలం ఇదే. -
ప్రొటోకాల్ రగడ
వైస్ చైర్మన్‌కు గౌరవం ఇవ్వడం లేదని బీఆర్ఎస్ కౌన్సిలర్ల వాగ్వాదంజనగామ: మున్సిపల్ సాధారణ సమావేశంలో ప్రొటోకాల్ వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. వైస్ చైర్మన్‌కు వేదికపై అవకాశం ఇవ్వలేదంటూ బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో వేడెక్కి, చివరికి అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధంగా మారింది. గురువారం మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్ అధ్యక్షతన 54 అంశాలతో కూడిన అజెండాతో పురపాలిక సాధారణ సమావేశం జరిగింది. కౌన్సిల్ సాధారణ సమావేశం ప్రారంభం కానున్న వేళ, గత సంప్రదాయం ప్రకారం మున్సిపల్ వైస్ చైర్మన్ భూష పర్వతాలు వేదికపై కూర్చునే అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లు కోరారు. వైస్ చైర్మన్‌కు వేదికపైనే గౌరవం ఇవ్వాలని ఉడుగుల కిష్టయ్య, గోపగోని సుగుణాకర్ గౌడ్, సజ్జ దుర్గాప్రసాద్, సేవెల్లి మధు, పానుగంటి సువార్త, అనూష, హఫీజ్ ఫాతిమా, మామిడాల రజిత, దావెర రామ రాజు, గునిగంటి వెన్నెల తదితర గులాబీ కౌన్సిలర్లు ప్రశ్నించారు. ప్రొటోకాల్ గొడవ జరుగుతున్న సమయంలో పురపాలిక అధికారి కౌన్సిల్ అజెండా అంశాలు చదవడం ప్రారంభించగానే బీఆర్ఎస్ కౌన్సిలర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ కుర్చీని వేదికపై తీసుకెళ్లారు. దీనిపై కాంగ్రెస్ కౌన్సిలర్లు చెంచారపు కరుణాకర్‌రెడ్డి, రజిని, బుక్కా బాలభరద్వాజ్, పాముకుంట్ల ప్రసాద్ గౌడ్ తదితరులు వేదికపైకి చేరి ఆ కుర్చీ తీసివేయడానికి ప్రయత్నించడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తమైంది. సమావేశ ప్రాంగణానికి వెంటనే పోలీసులు చేరుకున్నారు. సమాచారం అందుకున్న సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్సైలు భరత్, చెన్నకేశవులు, మహిళా కానిస్టేబుళ్లతో కలిసి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేపట్టారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఒకేసారి జరిగినా, వేదికపై కూర్చోడానికి ఎటువంటి జీఓ లేదని చైర్పర్సన్ బాలమణి పేర్కొన్నారు. చైర్పర్సన్ లేని సందర్భంలో మాత్రమే వైస్ చైర్మన్ సభ చేపడతారని కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే వైస్ చైర్మన్ వేదికపై కూర్చోవచ్చని తమ వద్ద ఆధారాలు ఉన్నాయని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఓ జీఓ కాపీని చూపించారు. అజెండా ప్రారంభ సమయంలో 15వ వార్డు కౌన్సిలర్ మా రబోయిన పాండు గత సమావేశానికి సంబంధించిన తమ ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలని అధికారులను అడిగారు. అజెండా ఎవరిని అడిగి తయారు చేశారు? వైస్ చైర్మన్‌కు ఎందుకు సమాచారం ఇవ్వలేదు? అని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రశ్నించారు. అజెండా కాపీలు సాధారణ సమావేశానికి ఎన్ని రోజులు ముందుగా ఇవ్వాలి అనే ప్రశ్నలను లేవనెత్తారు. ప్రతీ కౌన్సిలర్ వార్డుల పర్యటన చేసి ప్రజాసమస్యలను పరిగణనలోకి తీసుకుని అజెండా సిద్ధం చేయాలని, ఇష్టానుసారంగా అజెండా తయారు చేయడం ఏంటని మండిపడ్డారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగిన మున్సిపల్ సాధారణ సమావేశంలో ఉద్రిక్తత కారణంగా సభ ముందుకు సాగలేదు. వేదిక గౌరవం, అజెండా ప్రొటోకాల్, వైస్ చైర్మన్ అవమానానికి సంబంధించి న వివాదం తీవ్రరూపం దాల్చడంతో, పరిస్థితి అదుపులో లేకపోవడంతో చైర్పర్సన్ బాలమణి శ్రీనివాస్ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సమావేశంలో కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, మేనేజర్ రాములు, ఎన్పీడీసీఎల్ ఏఈ సౌమ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. నిబంధనలు లేవన్న చైర్పర్సన్, కమిషనర్ వేదికపై కుర్చీ వేసిన బీఆర్ఎస్ సభ్యులు కుర్చీ తొలగించేందుకు కాంగ్రెస్ ప్రయత్నం పోడియం వద్ద గులాబీ కౌన్సిలర్ల బైఠాయింపు పరిస్థితి అదుపు తప్పడంతో వాయిదావేదికపై కూర్చున్న వైస్ చైర్మన్ పర్వతాలను పోలీసులు నచ్చజెబుతూ కిందికి దింపేందుకు ప్రయత్నించగా మరోసారి ఉద్రిక్తత నెలకొంది. గులాబీ కౌన్సిలర్లు పోడియం వద్ద బైఠాయిస్తూ వైస్ చైర్మన్‌కు గౌరవం ఇచ్చేవరకు తమ సీట్లలో కూర్చోమని నిరాకరించారు. బీసీ వైస్ చైర్మన్ పర్వతాలను అవమానపరుస్తున్నారని, అంబేడ్కర్ రాజ్యాంగం ఇక్కడ అమలు కావడంలేదని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై చర్చకు తాము ఎప్పుడూ ఆటంకం కలిగించమని, కానీ వైస్ చైర్మన్‌కు వేదిక గౌరవం దక్కేవరకు పోడియం వద్దే కూర్చుని సభను కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. చేర్యాల, స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీల్లో వైస్ చైర్మన్లను వేదికపై కూర్చోడానికి జీఓ ఉంటే జనగామలో ఎందుకు వర్తించదంటూ ప్రశ్నలు లేవనెత్తారు. అలాగే కలెక్టరేట్ సమావేశంలో కూడా వైస్ చైర్మన్‌కు ఆహ్వానం ఇవ్వకపోవడంపై కమిషనర్‌ను నిలదీశారు. -
కొనుగోలు కేంద్రం.. ఉన్నట్టా..! లేనట్టా..?
లింగాలఘణపురం: మండల కేంద్రంలోని మాణిక్యాపురంలో కళ్లెం పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రం ఉన్నట్టా.. లేనట్టా అంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకే చోట రెండు కొనుగోలు కేంద్రాలు ఉండడంతో వివాదం నెలకొని పీఏసీఎస్ ఆధ్వర్యంలోని కేంద్రంలో కాంటాలు పెట్టడంలేదు. గురువారం రైతు సంఘం జిల్లా కార్యదర్శి చందు నాయక్ ఆధ్వర్యంలో కేంద్రాన్ని సందర్శించి వెంటనే కొనుగోళ్లు చేయాలని డిమాండ్ చేశారు. ఆయనతో పాటు రైతు సంఘం నాయకులు ఉప్పలయ్య, పాపిరెడ్డి, నరేందర్‌రెడ్డి, భవాని తదితరులు ఉన్నారు. -
‘పది’ ఫలితాల్లో ‘ఎస్ఆర్’ విజయభేరి
విద్యారణ్యపురి: టెన్త్ పరీక్షల ఫలితాల్లో ఎస్ఆర్ స్కూల్స్ విద్యార్థులు విజయభేరి మోగించారని ఆ విద్యా సంస్థల చైర్మన్ ఎ. వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి తెలిపారు. ఈ ఫలిత్లాలో సి. సంస్కృతారెడ్డికి 600 మార్కులకు గాను 589, పి.రంజివంశీకి 588, ఎస్.కీర్తనకు 587, అంకం సౌజన్యకు 587, ఎ. సంజయ్‌కు 586, టి. వైష్ణవికి 585, బాశెట్టి సాయిశ్రీకి 584 మార్కులు వచ్చాయని వారు తెలిపారు. క్రమశిక్షణతో కూడిన విద్యనందిస్తున్నామని, పాఠ్యప్రణాళిక, అంకితభావం కలిగిన ఉపాధ్యాయ బృందం విద్యాబోధన చేశారని తెలిపారు. తమ విద్యార్థులు పోటీ పరీక్షలను ఎదుర్కొనేలా ఐఐటీ అండ్ మెడికల్ ఫౌండేషన్‌లో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధం చేసేలా బృహత్తర పద్ధతిలో రాష్ట్రవ్యాప్తగా ప్రైమ్స్కూల్స్ ప్రారంభించామని తెలిపారు. -
‘తేజస్వి’ విద్యార్థుల సత్తా
నయీంనగర్ : పదో తరగతి ఫలితాల్లో తేజస్వి పాఠశాల విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. 591 మార్కులతో కందిక సాహిత్య ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఎం.అభివర్షిని 590, ఎం.శ్రీతిక 588, జి.సాయి శ్రేష్ఠ, ఆర్.తన్మయి, ఎ.హర్షిత్, ఎండి.సుమేర్ అహ్మద్, అమృత వర్షిణి 587, కె.హిమవర్షిత, కె.నాగస్వామి, మణి సాయి ప్రణవ్ 586, జి.సౌమ్య శ్రీ, ఎల్.కిరణ్ తేజ్, సిహెచ్.మహిన్వద, ఎం.దీప్తి, ఎన్.కార్తికేయ 585, పి.సాయిసాన్వి, పి.శ్రీపాద రెడ్డి 584, సి.హెచ్.శ్రేష్ఠ 583, జునైరియా నౌరిన్, ఎల్.వర్ష, ఎ.రేష్మిత, ఎ.వర్షిణిశ్రీ 582, ఎం.గీతిక, ఎం.మేద, బి.లాస్య, ఎ.నీలిమైతిలి, టి.శశిధర్ 581, జి.సింధు 580 మార్కులు సాధించింది. 570– 579 మధ్య 78 మంది విద్యార్థులు, 560– 569 మధ్య 67 మంది విద్యార్థులు 550–559 మధ్య73 మంది విద్యార్థులు, 540 – 549 మధ్య 48 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 539 కంటే తక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు 161 మందితో నయీంనగర్, పోచమ్మకుంట, ప్రశాంత్‌నగర్ బ్రాంచ్‌లలో జిల్లా స్థాయిలో అధిక మార్కులు సాధించడం తేజస్వి ఘనత. విజయ పరంపర కొనసాగించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, తల్లిదండ్రులకు పాఠశాల చైర్మన్ రేవూరి జెన్నారెడ్డి, పిల్లలమర్రి చంద్రశేఖర్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. -
‘పది’లో బాలికలదే హవా
జనగామ రూరల్: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. బుధవారం ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల్లో జిల్లా 98.23 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో 17వ స్థానంలో నిలిచింది. మొత్తం 183 ప్రభుత్వ, ప్రైవేట్, పాఠశాలలు, మైనార్టీ, కస్తూర్బా గాంధీ, సాంఘిక సంక్షేమ, మహాత్మా జ్యోతి బాపూలే, బీసీ వెల్ఫేర్, ఆశ్రమ, ఎయిడెడ్, మోడల్ స్కూల్, గిరిజన పాఠశాలలు ఉండగా ఇందులో మొత్తం 6,443 విద్యార్థులు పరీక్షలు రాయగా 6,292 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 3,013 మంది, బాలికలు 3,279 ఉన్నారు. గత ఏడాది జిల్లా విద్యార్థులు 98.81 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ఈఏడాది 97.66 ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాదికంటే ఒక శాతం ఉత్తీర్ణత తగ్గగా.. బాలికల ఉత్తీర్ణత శాతం గత ఏడాదికంటే కొంత పెరిగింది. వివిధ పాఠశాలల ఉత్తీర్ణత వివరాలు ఇలా.. జిల్లా వ్యాప్తంగా మొత్తం 183 పాఠశాలలు ఉన్నాయి. ఎయిడెడ్ పాఠశాలలు 88.88 శాతం, ఆశ్రమ పాఠశాలలు 96.03 శాతం, బీసీ వెల్ఫేర్ 99.84 శాతం, ప్రభుత్వ పాఠశాల 92.94 శాతం, కేజీబీవీలు 99.61 శాతం, మోడల్ పాఠశాలలు 98.35 శాతం, ప్రైవేట్ పాఠశాలలు 99.36 శాతం, రెసిడెన్షియల్ 100శాతం, మైనార్టీ పాఠశాల 100 శాతం, సోషల్ వెల్ఫేర్ 99.26 శాతం, ట్రైబల్ వెల్ఫేర్ 99.28 శాతం, జిల్లా పరిషత్ పాఠశాలలు, 95.53 శాతం ఉత్తీర్ణత సాధించాయి. కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ జిల్లాలోని 12 కేజీబీవీల్లో 8 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. 505 మంది విద్యార్థులకుగాను 498 మంది ఉత్తీర్ణత సాధించారు. 99 శాతం ఉత్తీర్ణత ఉండగా 551 మార్కులతో పాలకుర్తి కేజీబీవీ విద్యార్థిని పూర్ణిమ ప్రథమ స్థానంలో నిలిచింది. కొడకండ్ల కేజీబీవీ విద్యార్థిని యశస్విని 548 మార్కులు సాధించింది. 80మంది 500 పైగా మార్కులు సాధించారు. జెడ్పీ విద్యార్థుల ఉత్తీర్ణత పట్టణంలోని ధర్మకంచ, మండలంలోని వడ్లకొండ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. మొత్తం 1,577 మంది విద్యార్థులకుగాను 1,523 మంది ఉత్తీర్ణత సాధించారు. వడ్లకొండ జెడ్పీ పాఠశాల విద్యార్థిని గోల్లపల్లి ఐశ్వర్య 571 మార్కులు సాధించింది. ధర్మకంచ పాఠశాలకు చెందిన మారబోయిన సంయుక్త 557 మార్కులు, కొయ్యాడ ధనశ్రీ 554 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు. మైనార్టీ బాలుర గురుకులాల్లో.. జనగామ మైనార్టీ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. బి.కేవిన్ 533 మార్కులు, పి.మణికంఠ 525 మార్కులు సాధించారని పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు. మెరిసిన మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల విద్యార్థులు మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. మొత్తం 6 పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత 4 పాఠశాలలు సాధించగా 397 మంది విద్యార్థులకు 394 మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. పూజశ్రీ 581 మార్కులు, విఘ్నేశ్ 579 మార్కులు సాధించారు. సోషల్ వెల్ఫేర్‌లో.. జిల్లాలోని అయిదు సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు, పాలకుర్తి, జఫర్‌గఢ్ రెండు గురుకులాలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. నర్మెట పాఠశాలకు చెందిన బిందు 571 మార్కులు, జఫర్‌గఢ్ పాఠశాలకు చెందిన సహస్ర 555 మార్కులు సాధించారు.గత ఐదేళ్లలో ఉత్తీర్ణత శాతం ఇలా.. సంవత్సరం బాలికలు బాలురు మొత్తం 2021–22 96.01 93.39 94.72. 2022–23 91.17 92.58 91.90 2023–24 98.68 97.59 98.16 2024–25 99.20 98.40 98.81 2025–26 98.23 97.04 97.66 రాష్ట్రస్థాయిలో జిల్లాకు 17వ స్థానం జిల్లా వ్యాప్తంగా 97.66 శాతం పాస్ గతంకంటే పెరిగిన ఉత్తీర్ణత శాతం -
‘బాలయేసు’ విజయదుందుభి
దేవరుప్పుల : జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని బాలయేసు ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు బుధవారం వెలువడిన పదో తరగతి ఫలితాల్లో మరోసారి విజయదుందుభి మోగించారు. 582 మార్కులతో బాకి అభిజ్ఞాన్ దేవరుప్పుల మండలంలో ఫస్ట్ ర్యాంకు సాధించాడు. మహ్మద్ రైసున్నీసా 576, కున్సోతు స్వాతి 566 మార్కులు, మొత్తం 32 మంది విద్యార్థుల్లో 22 మంది 500లకు పైగా మార్కులు సాధించారని, ఇది ఎంతో గర్వకారణమని పాఠశాల కరస్పాండెంట్ బ్రదర్ జేసురాజ్ అన్నారు. ఈ సందర్భంగా ప్రతీ విద్యార్థి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయులు మదన్ మోహన్, మహేశ్, కృష్ణ, పాషా, షబానా, సంధ్య విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. -
‘ఏకశిల’ విద్యార్థుల ప్రతిభ
హసన్‌పర్తి: టెన్త్ పరీక్ష ఫలితాల్లో ఏకశిల విద్యాసంస్థల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. వరుసగా 585,582,580,578 ,577,576,574,573,572,571,570 మార్కులతో రాష్ట్ర స్థాయిలో టాపర్‌గా నిలిచినట్లు ఏకశిల విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతిరెడ్డి తెలిపారు. ఈసందర్భంగా హసన్‌పర్తి మండలం పెంబర్తిలోని ఏకశిల టెక్నో స్కూల్లో బుధవారం అభినందన సభ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకశిల విద్యాసంస్థలో విద్య అంటే మార్కులు మాత్రమే కాదు.. భవిష్యత్‌ను నిర్మించే శక్తి అన్నారు. నాణ్యమైన విద్యతో పాటు నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, జీవిత నైపుణ్యాలను పెంపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఫలితాలతో ఏకశిల విద్యాసంస్థకు మరింత గౌరవం పెరిగిందన్నారు. అనంతరం అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ఏకశిల విద్యాసంస్థల డైరెక్టర్లు బేతి కొండల్‌రెడ్డి, గౌరు సువిజారెడ్డి, ప్రిన్సిపాళ్లు బేతి శైలాజారెడ్డి, ముచ్చ స్వప్నరెడ్డి, ఎం.డి. బాబా, కె.డి. స్వర్ణరాజ్, లవకుమార్, అడ్మినిస్ట్రేషన్ ఇన్చార్జ్ జి.రాంప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
● డీసీపీ రాజమహేంద్రనాయక్ జనగామ రూరల్: విద్యార్థులు మత్త పదార్థాలకు దూరంగా ఉండాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్ అన్నారు. బుధవారం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా పెంబర్తి మహాత్మా జ్యోతిరావు ఫూలే కళాశాలలో శ్రీబాలల భద్రత– మత్తు పదార్థాలకు నో చెప్పండిశ్రీ అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ సత్యనారాయణ రెడ్డి, మహిళా, శిశు సంక్షేమ శాఖ, ఏహెచ్‌టీయూ, డ్రగ్ కంట్రోల్ విభాగం అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డీసీపీ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మత్తుపదార్థాలు భవిష్యత్‌ను నాశనం చేస్తాయని వివరించారు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో వ్యక్తిగత సమాచారం రక్షణ, అనుహ్య లింకులు, ఫేక్ కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. యువత బాధ్యతాయుత పౌరులుగా మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ, సైబర్ నేరాలకు గురికాకుండా జాగ్రత్తలు పాటించి సమాజాభివృద్ధికి చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
రైతుల సమస్యలు పరిష్కరించాలి
● కలెక్టరేట్ ఎదుట రైతుసంఘం ధర్నా జనగామ రూరల్: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందు నాయక్ డిమాండ్ చేశారు. రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వినతి అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ధాన్యం ఎగుమతికి లారీలను తరలించాలని, ధాన్యం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న జాప్యాన్ని అరికట్టాలని కోరారు. గన్నీ సంచుల కొరత తీవ్రంగా ఉందని సహకార సంఘాలకు కొత్త గన్నీ బ్యాగులు ఇవ్వాలన్నారు. తరుగు పేరుతో రైతుల ధాన్యం, మిల్లర్ల కట్టింగును నియంత్రించాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య, గొర్ల మేకల పెంపకం దారుల సంఘం జిల్లా కార్యదర్శి కన్నెబోయిన బాలరాజు, గానుగుపహాడ్ ఉపసర్పంచ్ కుర్ర శంకర్ నాయక్, పెద్ద తండా ఉపసర్పంచ్ గోగులోతు ఝాన్సీరాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు. అంత్యపుష్కరాలను విజయవంతం చేయాలి ● మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్‌బాబు కాళేశ్వరం: సరస్వతీ నది అంత్యపుష్కరాలను అధి కారులు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మే 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగే సరస్వతీనది అంత్యపుష్కరాల నిర్వహణకు సంబంధించి బుధవారం హైదరాబాద్‌లో అంబేడ్కర్ సచివాలయంలో మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సమక్షంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంత్య పుష్కరాల ఏర్పాట్లపై కలెక్టర్ రాహుల్ శర్మ మంత్రులకు వివరించారు. పుష్కరాల నిర్వహణలో భక్తులకు అవసరమైన సౌకర్యాలు, భద్రతా చర్యలు, రవాణా, పారిశుద్ధ్యం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు మాట్లాడుతూ అంత్య పుష్కరాలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున చేపట్టిన ఏర్పాట్లును త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం సరస్వతీ అంత్య పుష్కరాల వాల్ పోస్టర్, పుష్కరాల టీజర్‌ను విడుదల చేశారు. -
పెట్రోల్, డీజిల్ సరఫరాపై ఆందోళన వద్దు
జనగామ: జిల్లాలో డీజిల్, పెట్రోల్ సరఫరా విషయంలో అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ సందీప్ కుమర్ ఝా అన్నారు. పెట్రోలు, డీజిల్ సరఫరాపై బుధవారం కలెక్టరేట్లో పెట్రోలియం సంస్థల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో ఎనర్జీ కమిటీ సమన్వయ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. జిల్లాలో పెట్రోలు, డీజిల్ నిల్వలపై తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తహసీల్దార్, పోలీస్, లీగల్ మెట్రాలాజీ అధికారులు నిరంతరం బంకుల్లో ఉన్న ఇంధన నిల్వలను తనిఖీ చేయాలన్నారు. పెట్రో, డీజిల్‌ను బాటిళ్లు, క్యాన్లలో పోయడంతో వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, ఆర్డీఓలు గోపీరామ్, వెంకన్న, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్, సివిల్ సప్లయీస్ డీఏం హతీరామ్, లీగల్ మెట్రాలాజీ అధికారి ఝాన్సీ, డీఎంహెచ్ఓ మల్లికార్జునరావు ఉన్నారు. మే డేను విజయవంతం చేయాలి మే డే కార్మిక దినోత్సవాన్ని జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ హాల్లో ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మే 2 నుంచి 10వ తేదీ వరకు మేడే వారోత్సవాలను జిల్లాలోని ప్రతి మండలంలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో చేపట్టాలని సూచించారు. కార్మిక వారోత్సవాల కమిటీ చైర్మన్ సందీప్ కుమార్ ఝా అధ్యక్షతన వేడుకలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మే డే ఉత్సవాల్లో ఉత్తమ నిర్వహణ, ఉత్తమ అధికారిని సన్మానించాలన్నారు. సమీక్షలో జిల్లా కార్మిక శాఖ అధికారి కుమారస్వామి, జిల్లా ఉపాధి అధికారి రవికాంత్, ఐటీఐ ప్రిన్సిపాల్, వివిధ కార్మిక సంఘాల బాధ్యులు పాల్గొన్నారు. ఎంపీ లాడ్స్ నిధులు వినియోగించుకోవాలి ఎంపీ లాడ్స్ నిధుల ద్వారా మంజూరైన పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఎంపీ లాడ్స్ పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పనులకు సంబంధించిన పురోగతిపై చర్చించి దిశానిర్దేశం చేశారు. సీసీ రోడ్లు, పాఠశాలల మరమ్మతులు, వీధి దీపాలు, మరుగుదొడ్లు, ఆర్ఓ ప్లాంట్లు, విద్యుత్, కమ్యూనిటీ హాల్ వంటి అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. సమీక్షలో సీపీఓ చినకోట్యా నాయక్, ఈఈ పీఆర్ శ్రీనివాసరావు, మిషన్ భగీరథ ఈఈ(ఇంట్రా) శ్రీకాంత్, పలువురు ఎంపీడీఓలు, జనగామ మున్సిపల్ మేనేజర్ రాములు, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
పెట్రోల్ బంక్‌ల తనిఖీ
కొడకండ్ల: మండలంలోని పెట్రోల్ బంక్‌లను స్టేషన్‌ఘన్‌పూర్ ఆర్డీఓ వెంకన్న బుధవారం తనిఖీ చేశారు. కొడకండ్ల, మొండ్రాయి బంక్‌లను ఆయన తనిఖీ చేసి స్టాక్ వివరాలు తెలుసుకున్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో మండల సమస్యలపై సమీక్ష నిర్వహించి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఉత్తలూరి అనీల్‌బాబు, ఆర్ఐ అశోక్, సిబ్బంది ఉన్నారు. నోస్టాక్ బోర్డు పెట్టొద్దు పాలకుర్తి టౌన్: తప్పనిసరై అయితేనే బోర్డులుపెట్టాలని.. పెట్రోల్, డీజిల్ ఉన్నప్పటికీ నో స్టాక్ బోర్డులు పెడితే చర్యలు తప్పవని ఆర్డీఓ డీఎస్ వెంకన్న అన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రంలో నో స్టాక్ బోర్డు పెట్టిన పెట్రోల్, డీజిల్ బంకులలను తనిఖీ చేశారు. తనిఖీ చేసిన బంకులో పెట్రోల్, డీజిల్ లేదని తెలిపారు. బంకుల్లో ఎక్కడైనా పెట్రోల్, డీజిల్ కొరత ఉంటే ట్రోల్ ఫ్రీ నంబర్ 1800 425 00 333, లేదా రాష్ట్ర విపత్తుల హెల్ప్‌లైన్ 1077కు సమాచారం ఇవ్వాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ సుత్రం సరస్వతి, ఆర్ఐ రాకేష్, అధికారులు ఉన్నారు. -
‘షైన్’ విజయకేతనం..
హన్మకొండ : పదో తరగతి పరీక్ష ఫలితాలలో షైన్ విద్యా సంస్థల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. తమ పాఠశాలకు చెందిన ఎ.అక్షర 588 మార్కులు, ఎల్.రేవంత్, ఎండి అఫ్రోజ్ 586, సమీరా నయీం 585, వెలుదండి సీమ, జి.సంహిత, కె.సుమిత్ 584, టి హాసిని, ఎ.ప్రశాంతి, ఎ.సుశాంత్, సీహెచ్.సిరి 583, వి.జాహ్నవి, మార్క శ్రీధన్ 582, ఎ.హర్షిణీ 581, పి.యతిస్, పి.హర్షిత 580 మార్కులు సాధించారని షైన్ విద్యాసంస్థల అధినేత మూగల కుమార్ యాదవ్ వివరించారు. ఐఐటీ ఫౌండేషన్, నీట్‌తోపాటు పదో తరగతి పరీక్షలకు ప్రత్యేక శిక్షణా ఇవ్వడంతోనే ఈ ఫలితాలు సాధించామన్నారు. ఇటీవల వెలువడిన ఇంటర్ ఫలితాలలో కూడా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించారన్నారు. బుధవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పదో తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు, వారి ఉన్నతికి శ్రమించిన అధ్యాపకులను ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో కరెస్పాడెంట్ మూగల రమ, షైన్ పబ్లిక్ స్కూల్ ఎరగ్రట్టుగుట్ట బ్రాంచ్ సెక్రటరీ జక్కుల శ్రీనివాస్ యాదవ్, ఐఐటీ కోఆర్డినేటర్ మూగల రమేశ్ యాదవ్, ప్రిన్సిపళ్లు పి.విశాల్, కె.దినేశ్, రాజ్ కుమార్, కవిత, ప్రగతిరెడ్డి, సబితా, మానస, కాలేజీ ప్రిన్సిపాళ్లు రాజుగౌడ్, పి.శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఓటరు మ్యాపింగ్ శాతాన్ని పెంచాలి
● డిప్యూటీ సీఈఓ పద్మావతి జనగామ: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా జిల్లాలో ఓటరు మ్యాపింగ్ శాతాన్ని పెంచాలని డిప్యూటీ సీఈఓ పద్మావతి పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్ సీఈఓ కార్యాలయం నుంచి జిల్లాకు వచ్చిన డిప్యూటీ సీఈఓ పద్మావతి.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ పురోగతిపై కలెక్టరేట్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని అన్మ్యాప్డ్ ఎలక్టోరల్స్పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విస్త్రృతంగా మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టాలని సూచించారు. ఇందులో భాగంగా ప్రతీ ఇంటికి వెళ్లి వివరాలను సేకరించాలని, వలసదారుల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని తెలిపారు. బీఎల్ఓల ద్వారా ఫారం–7 ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. డబుల్ మ్యాపింగ్ వంటి సమస్యలను గుర్తించి, పరిష్కారంలో జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. ఈ మేరకు నిర్దేశిత సమయంలోగా మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేసి, త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మ్యాపింగ్ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. అనంతరం రెవెన్యూ అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతీ మండల స్థాయిలో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి వెంటనే సమర్పించాలని అధికారులకు ఆదేశించారు. సమీక్ష సమావేశంలో ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీధర్, తహసీల్దార్లు, అధికారులు, పాల్గొన్నారు. -
జనగామ
గురువారం శ్రీ 30 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026బాలికలదే హవా7ముగ్గురు ఇన్స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతులువరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ముగ్గురు ఇన్స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతి లభించింది. రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతులు కల్పిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన వారిలో హనుమకొండ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గొర్ల సీతారెడ్డి, టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సార్ల రాజు, ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ ఇన్స్పెక్టర్ బోలగాని శ్రీనివాస్‌గౌడ్ ఉన్నారు. పదోన్నతి పొందిన వారిని అధికారులు అభినందించారు. కొనుగోళ్లను వేగంగా చేపట్టండి ● ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్‌ఘన్‌పూర్: మక్కలు, ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, ధాన్యాన్ని వెంటనే సంబంధిత రైస్ మిల్లులకు చేరేలా రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాను కోరారు. బుధవారం కలెక్టరేట్లో ఎమ్మెల్యే శ్రీహరి కలెక్టర్‌ను కలిశారు. ఇదిలాఉండగా.. మే 7వ తేదీన నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించనున్నట్లు కలెక్టర్‌కు తెలిపారు. భట్టి పర్యటనకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. టెన్త్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో జిల్లాకు 17వ స్థానం ● జిల్లా వ్యాప్తంగా 97.66 శాతం పాస్ ● గతంకంటే పెరిగిన ఉత్తీర్ణత శాతం -
మార్కులకు మించింది పిల్లల జీవితం!
● పరీక్ష ఫలితాల వేళ భరోసా ఇవ్వాల్సింది తల్లిదండ్రులే ● తొర్రూరు ఉపాధ్యాయుల సందేశ పత్రం జనగామ: పదో తరగతి ఫలితాలు నేడు(బుధవారం)విడుదల కానున్న నేపథ్యంలో తమ పిల్లల భవిష్యత్తు విషయంలో తల్లిదండ్రులు తీసుకోవా ల్సిన కీలక నిర్ణయాలపై పాలకుర్తి మండలం తొర్రూరు(జె) ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మంగళవారం ప్రత్యేక సందేశాన్ని కరపత్రం ద్వారా విడుదల చేశారు. 10వ తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు ఎలా ఉన్నా, పి ల్లలపై ప్రేమ, అండ ఎల్లప్పుడూ ఉండాలని, మార్కుల ఆధారంగా భవిష్యత్తును తీర్చిదిద్దకూడదని అందులో సూచించారు. పరీక్షలు జీవితం కాదు, అవి జీవిత యాత్రలో ఒక భాగమని, పిల్లల మనసును మెరుగ్గా అర్థం చేసుకొని వారికి భరోసా ఇవ్వడం ప్రతీ కుటుంబం బాధ్యత అని గుర్తు చేశారు. పరీక్షల ఒత్తిడితో పిల్లలు నిరుత్సాహానికి గురికాకుండా, వారికి ధైర్యం నింపుతూ ముందుకు నడిపించాలని పాఠశాల మండలి సూచించింది. -
స్టాక్ ఉండి నో స్టాక్ బోర్డు పెడితే చర్యలు
● పెట్రోలు బంకులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేయండి ● అధికారులకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశంజనగామ: జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిర్వహణపై అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. మంగళవారం ఆయా శాఖల అధికారులతో పెట్రోల్, డీజిల్ నిల్వలపై కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్‌పై ప్రజలు అపోహలకు గురి కావొద్దన్నారు. సాధారణ అవసరాలకు మాత్రమే ఇంధనం కొనుగోలు చేయాలని, అధికారులు కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి నివేదికలు సమర్పించాలని సూచించారు. జిల్లాలో ఉన్న బంకుల్లో తహసీల్దార్, సివిల్ సప్లై, పోలీస్, తూనికలు కొలతల శాఖల అధికారు లు జాయింట్ యాక్షన్ కమిటీలుగా బంకుల్లోని పెట్రోల్, డీజిల్ నిల్వలను తరుచూ చెక్ చేయాలన్నారు. ఒక వేళ బంకుల్లో పెట్రోల్, డీజిల్ ఉన్నప్పటికీ స్టాక్ లేదని బోర్డు కనిపిస్తే, సదరు యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా పెట్రోల్, డీజిల్ కొరత ఉంటే టోల్ ఫ్రీ నెంబర్–1800 425 00 333 లేదా రాష్ట్ర విపత్తుల హెల్ప్‌లైన్ 1077కు సమాచారం ఇవ్వాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ ఆర్డీఓలు గోపిరామ్, వెంకన్న, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్, వ్యవసాయ, ఆరోగ్య, విద్య, వైద్య, సంక్షేమ శాఖల అధికారులు, పెట్రోల్ బంక్ డీలర్లు పాల్గొన్నారు. -
దారెంటా ధాన్యపు రాశులు!
జఫర్‌గఢ్: మొక్కజొన్న, వరి పంట ఒకేసారి చేతికి రావడంతో పల్లెలు ఎటూచూసినా ధాన్యపు రాశులతో కళకళలాడుతున్నాయి. అయితే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఆలస్యం అవుతుండడంతో రైతులు వడ్లు, మక్కలనురోడ్లపైనే ఆరబోస్తున్నారు. మండలంలోని తిమ్మాపూర్ గ్రామ శివారు ఎస్సీ కాలనీ ప్రధాన రహదారి నుంచి మొదలుకొని తమ్మడపల్లి (జి) గ్రామం మీదుగా పాలకుర్తి మండలంలోని బమ్మెర శివారు వరకు రోడ్లపైనే కిలోమీటర్ల మేర రైతులు తమ ధాన్యాన్ని అరబోయడంతో పాటు పెద్ద ఎత్తున నిల్వలు చేశారు. ఇటీవల తమ్మడపల్లి (జి) గ్రామంతో పాటు జఫర్‌గఢ్‌లో ప్రధాన రహదారుల పక్కనే ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు కల్లాలు లేకపోవడంతో ధాన్యంతో పాటు మక్కలను ఆరబోయడానికి రోడ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో వాహనదారులు, ప్రయాణికులకు ప్రమాదకరంగా మారింది. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు కొనుగోళ్లలో జాప్యం లేకుండా చేస్తే ఇబ్బందులు తప్పనున్నాయి. -
దిగి వెళ్లాడో లేదో.. బైక్ భగ్గుమంది!
● ఒక్కసారిగా దగ్ధమైన పాలవ్యాపారి ద్విచక్రవాహనం ● మంటలు తీవ్రంగా వ్యాపించడంతో కాలనీవాసుల భయాందోళనజనగామ: పట్టణంలో మంగళవారం ఓ బైక్ దగ్ధమైన ఘటన కాలనీ వాసులను టెన్షన్‌కు గురిచేసింది. వివరాలిలా ఉన్నాయి. రఘునాథపల్లి మండలం పడమటిగూడెం గ్రామానికి చెందిన ఉడుముల ధర్మారెడ్డి పాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రతిరోజూ పట్టణానికి వచ్చి కాలనీల్లో రెగ్యులర్ ఖాతాదారులకు పాల డబ్బాలు ఇచ్చి వెళ్లుంటాడు. రోజువారీలాగే తన బైక్‌పై ఉదయం 7 గంటలకు గణేష్ స్ట్రీట్‌లోని ప్రభుత్వ పాఠశాల సమీపానికి చేరుకున్నాడు. అక్కడ తన బైక్‌ను నిలిపి, ఇంటింటికీ వెళ్లి పాల డబ్బాలు ఇచ్చేందుకు వెళ్లిన సమయంలో బైక్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడే ఉన్న వారంతా పరుగులు పెట్టా రు. మంటలు తీవ్రంగా వ్యాపించడంతో 100తో పాటు అగ్నిమాపక శాఖకు డయల్ చేయగా, పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను పూర్తిగా ఆర్పేయగా, అప్పటికే బైక్ పూర్తిగా కాలిపోయింది. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. బైక్‌కు సంబంధించి అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.


