● కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా
స్టేషన్‌ఘన్‌పూర్: పశుసంవర్ధక రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిదని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండలంలోని కొత్తపల్లి గ్రామంలో పశు వైద్య సంతానోత్పత్తి శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ శిబిరాన్ని ప్రారంభించి దూడలకు, గొర్రెలు, మేకలకు నులిపురుగుల నివారణ మందులు వేయించారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి మురళీధర్‌రావు, సర్పంచ్ ముక్కెర స్వరూపరవి, ఉపసర్పంచ్ ఇసాక్, జనగామ ఏడీ డాక్టర్ దేవేందర్, స్టేషన్‌ఘన్‌పూర్ ఏడీ డాక్టర్ చక్రధర్, తిమ్మంపేట ఏడీ డాక్టర్ సారంగపాణి, గోపాలమిత్ర సూపర్‌వైజర్ రాజేశ్వర్‌రావు, గోపాలమిత్రలు పాల్గొన్నారు.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు
జనగామ రూరల్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో పరీక్షలపై సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 13 నుంచి 21వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు, ఏమైనా సందేహాలు ఉంటే టెలీ మానస్ టోల్ ఫ్రీ నంబర్ 14416లో సంప్రదించి సమస్యలను నివృత్తి చేసుకోవాలని కోరారు. సమన్వయ సమావేశంలో డీఐఈఓ జితేందర్ రెడ్డి, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఓపీఎంఎస్‌లో వివరాలను నమోదు చేయాలి
రైతులు పండించే ప్రతీ ధాన్యం గింజను సకాలంలో కొనుగోలు చేసి, ట్యాగ్ చేసిన మిల్లులకు ఎలాంటి ఆలస్యం లేకుండా రవాణా చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఐకేపీ, పౌరసరఫరాల అధికారులను ఆదేశించారు. ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు, ఓపీఎంఎస్‌లో నమోదు, మొదలగు అంశాలపై ఏపీఎం, సీసీలు, కేంద్ర నిర్వాహకులతో కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్, జెడ్పీ సీఈఓ, ఇన్‌చార్జ్ డీఆర్డీఓ రంగారావు, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోని, పౌరసరఫరాల డీఎం హతిరామ్, అదనపు డీఆర్డీఓ నూరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.


