breaking news
Jangaon District News
-
జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి
జనగామ రూరల్: స్వతంత్ర సంస్థగా పనిచేయాల్సిన కేంద్ర ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో కీలుబొమ్మగా మారి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందని, ప్రజాస్వామ్యానికి మచ్చలా మారిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ వెంటనే రాజీనామా చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఇప్పటివరకు తొలగించిన 13 కోట్ల ఓట్లపై సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. ఎన్నికల కమిషనర్ల నియామక చట్టం 2023ను రద్దు చేయాలని, ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు చంద్రశేఖర్ రావు, నల్లనాగుల రాజు, షరీఫ్,శాడ రవి. మడూరి వెంకటేష్, అంకూషా వళి, శ్రీనివాస చారి, లక్ష్మయ్య కృష్ణ, వజ్రయ్య, శ్రీనివాసులు, సయ్యద్ శ్రీనివాసులు, గణేష్, తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరపాలి
దేవరుప్పుల: జిల్లా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరపాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. శని వారం మండలంకేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. జనగామ జిల్లా ఏర్పడి దశాబ్ద కాలం అయినా సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి పాలా భిషేకం చేయాలన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. జనగామ జిల్లా ఏర్పడి తర్వాత జనగామ ప్రాంతం అనేక విధాలుగా అభివృద్ధి చెందిందన్నారు. నేడు జిల్లాకేంద్రంలో నిర్వహించే వేడుకలకు జనగామ, పాలకుర్తి, స్టేషన్ఘనపూర్ నియోజవర్గ నాయకులు కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి -
నేటి నుంచి దేవీనవరాత్రి ఉత్సవాలు
● విద్యుత్‌దీపాల వెలుగుల్లో మండపాలు జనగామ: దేవీ నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని జిల్లాలో నేటి (ఆదివారం) నుంచి నవరాత్రి పూజలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా ఉత్సవ కమిటీలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశాయి. జిల్లాకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం, గణపతి ఆలయం, శ్రీ విల్లాస్ కాలనీ, పాత బీడు బజార్, రెడ్డి స్ట్రీట్ బొడ్రాయి, బతుకమ్మకుంట, కురుమవాడ, బాలాజీనగర్ తదితర ప్రాంతాల్లో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. అమ్మవారి మండపాలను ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. విద్యుత్‌దీపాలతో అలంకరించడంతో పాటు ఆలయాలను తలపించేలా ప్రత్యేక సెట్టింగులు ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నారు. నేటినుంచి సోమేశ్వరాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు పాలకుర్తి టౌన్: మండలకేంద్రలోని శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో నేటి నుంచి (ఆదివారం) ఈనెల 20వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న తెలిపారు. చండికాదేవి అమ్మవారు 11న శ్రీబాలాత్రిపురసుందరీదేవి, 12న శ్రీగాయత్రిదేవి, 13న శ్రీఅన్నపూర్ణాదేవి, 14న శ్రీమహాలక్ష్మీదేవి, 15న శ్రీలలితా త్రిపురసుందరీదేవి, 16న శ్రీసరస్వతీ దేవి, 17న శ్రీచండీకాదేవి, 18న శ్రీదుర్గాదేవి, 19న శ్రీమహిషాసుర మర్ధినీదేవి, 20న శ్రీరాజరాజేశ్వరీ దేవి (దసరా శమీ వృక్ష పూజ)గా భక్తులకు దర్శనం ఇస్తారని ఈఓ తెలిపారు. తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోని గణపతి దేవాలయంలో.. పాతబీటుబజార్ వద్ద.. -
భక్తి పరిమళం.. బతుకమ్మ వైభవం
● పూలలో గౌరమ్మ.. పూజల్లో ఆడపడుచులు● జిల్లాలో బతుకమ్మ సంబురాలు షురూ● ఆటపాటలతో సందడి చేసిన మహిళలుజనగామ: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ జిల్లావ్యాప్తంగా శనివారం వైభవంగా ప్రా రంభమైంది. ప్రకృతిలో ల భించే రంగురంగుల అడ వి పూలతో బతుకమ్మలను పేర్చి గౌరమ్మగా కొలిచే మహిళలు సంప్రదాయబద్ధంగా వేడుకల్లో పాల్గొన్నారు. జనగామ, స్టేషన్‌ఘన్ పూర్, పాలకుర్తి నియోజకవర్గాల పరిధిలోని 12 మండలాలతో పాటు జిల్లా కేంద్రంలో పండుగ సందడి నెలకొంది. గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో ప్రత్యే క ఏర్పాట్లు చేయగా, పట్టణాలు, గ్రామాలు, కాలనీల్లో పండుగ వాతావరణం కనిపించింది. ప్రధాన కూడళ్లలో సందడి జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంట, తహసీల్దార్ కార్యాలయం, పాత బీటుబ జారు, శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం, గుండ్లగడ్డ, గిర్నిగడ్డ, శ్రీవిల్లాస్ కాలనీ, బాలాజీనగర్, కురుమవాడ, హౌసింగ్ బోర్డు, గోకుల్‌నగర్, బాణాపురం, శ్రీ సాయి రెసిడెన్సీ, అంబేడ్కర్‌నగర్, గ్రేయినన్ మార్కెట్ తదితర ప్రాంతాల్లో సాయంత్రం నుంచి వేడుకలు ప్రారంభమయ్యాయి. మహిళలు బతుకమ్మలను చేతబట్టి ర్యాలీలుగా ప్రధాన కూడళ్లకు చేరుకున్నారు. సంప్రదాయ పాటలు పా డుతూ సంబురాలు చేసుకున్నారు. గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మహిళలు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ తర్వాత బతుకమ్మలను చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేశారు. వేడుకలు ప్రశాంతంగా జరిగేలా డీసీపీ రాజామహేంద్ర నాయక్ పర్యవేక్షణ లో సీఐ సత్యనారాయణ, ఆయా మండలాల ఎస్సైలు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తంగేడు పూలకు కొరత బతుకమ్మ పేల్చడంలో ప్రత్యేక స్థా నం కలిగిన తంగేడు పూలు ఈసారి ఆశించిన స్థాయిలో లభించకపోవడం మహిళలను నిరాశకు గురిచేసింది. వర్షాభావ పరిస్థితులతో ఉన్న కొద్దిపాటి చెట్లకు పూలు సరిగా పూయ లేదు. దీంతో బంతిపూలతో పాటు రోడ్ల పక్కన లభించే ఇతర పూలను సేకరించి బతుకమ్మలను పేర్చారు. -
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ: పల్లా
జనగామ: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే బతుకమ్మ పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆకాంక్షించారు. శని వారం జిల్లాకేంద్రంలో ఎమ్మెల్యే మాట్లాడారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకొని నియోజకవర్గ ప్రజలకు, ఆడపడుచులకు శు భాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని ఆరాధిస్తూ రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు, ఆటలతో తొమ్మిది రో జుల పాటు నిర్వహించే ఈ వేడుకలు మహిళల ఐక్యతకు, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు. అంతర్జాతీయ వడ్రంగి పోటీల్లో ప్రతిభస్టేషన్ఘన్పూర్: చైనా వేదికగా ఇటీవల జరిగిన అంతర్జాతీయ వడ్రంగి పోటీల్లో మండలంలోని విశ్వనాఽథపురం గ్రామానికి చెందిన కేశోజు యశ్వంత్‌చారి ఉత్తమ ప్రతిభతో ఐదోస్థానంలో నిలిచారు. సాంప్రదాయ కులవృత్తులు కనుమరుగవుతున్న ప్రస్తుత తరుణంలో వృత్తిపై నమ్మకం, నైపుణ్యం, పట్టుదల ఉంటే ప్రపంచస్థాయిలో గుర్తింపు సాధించవచ్చని నిరూపిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. చైనాలో జరిగిన ఈ పోటీల్లో 25 దేశాలు పాల్గొనగా యశ్వంత్‌చారి ఐదోస్థానాన్ని కై వసం చేసుకున్నారు. ఈ మేరకు యశ్వంత్చారిని విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మల సంఘం నాయకులు అభినందించారు. ‘రైతులకు ఇబ్బందులు కలగొద్దు’జనగామ రూరల్: రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ అన్నారు. శనివారం జనగామ మండలంలోని షామీర్పేట గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు ప్రక్రియలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, పారదర్శకంగా ధాన్యం సేకరించాలన్నారు. కొనుగోలు కేంద్రంలో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం నరేందర్, సర్పంచ్ గణిపాక వనిత మహేందర్ డీటీ సీఎస్ లు, రైతులు పాల్గొన్నారు. -
వచ్చే ఏడాది బతుకమ్మల నిమజ్జనం రిజర్వాయర్‌లోనే..
పాలకుర్తి టౌన్: పాలకుర్తి రిజర్వాయర్ పనులను త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది బతుకమ్మ పండుగకు రిజర్వాయర్‌లోనే బతుకమ్మలను నిమజ్జనం చేస్తామని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి హామీ ఇచ్చారు. శనివారం మండలకేంద్రంలోని చెరువు వద్ద నిర్వహించిన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో ఎమ్మె ల్యే మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అన్నారు. తెలంగాణ ఆడపడుచులు ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి హామీ -
పోరాట ఫలితం ‘జనగామ’
జనగామ: ఎన్నో పోరాటాలు.. వందలాది ఆందోళనలు.. వేలాది మంది ప్రజల ఆకాంక్షల ఫలితంగా ఆవిర్భవించిన జనగామ జిల్లా పదేళ్లు పూర్తి చేసుకుని 11వ వసంతంలోకి అడుగుపెడుతోంది. జిల్లా సాధన కోసం జేఏసీ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, రైతులు ఏకతాటిపైకి వచ్చి ఉద్యమించారు. సుమారు 500 రోజుల పాటు కొనసాగిన ఉద్యమంలో ధర్నాలు, రాస్తారోకోలు, దీక్షలు, అరెస్టులు చోటు చేసుకున్నాయి. 200 రోజులపాటు 144 సెక్షన్ అమలైనట్లు ఉద్యమకారులు గుర్తుచేసుకుంటున్నారు. 55 మంది జైలు జీవితం గడిపారు. చివరకు 2016 అక్టోబర్ 11న జిల్లా అధికారికంగా ఆవిర్భవించింది. విద్య, వ్యవసాయంలో గణనీయమైన మార్పులు జిల్లా ఏర్పాటుతో పాలన, వైద్యం, విద్య, వ్యవసా యం, విద్యుత్ రంగాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. సుమారు రూ.80 కోట్లతో నూతన కలెక్టరేట్, రూ.100 కోట్లతో కోర్టు భవన నిర్మాణం చేపట్టారు. వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల, పీజీ వైద్య విద్య, చంపక్‌హిల్స్‌లో పీజీ కళాశాల భవనం, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సీటీ స్కాన్, తెలంగాణ డయాగ్నోస్టిక్స్, రేడియాలజీ హబ్ వంటి సదుపాయాలు, క్రిటికల్ కేర్ ఆస్పత్రి, షీ టీమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జనగామ రైల్వేస్టేషన్ సుందరీకరణ చేశారు. వ్యవసాయానికి జలకళగోదావరి జలాల రాకతో కరువు ప్రాంతంగా పేరున్న జనగామలో సాగునీటి ఆశలు చిగురించాయి. దేవాదుల కాల్వలు, రిజర్వాయర్ల అభివృద్ధితో సాగు విస్తీర్ణం లక్షన్నర ఎకరాలకు పైగా పెరిగింది. ధాన్యం సేకరణ రికార్డు స్థాయికి చేరింది. 62 రైతు వేదికలు, గోదాముల నిర్మాణం రైతులకు తోడ్పాటునందించాయి. చంపక్‌హిల్స్‌లో 400/220కేవీ సబ్‌స్టేషన్, ఇతర విద్యుత్ సబ్స్టేషన్లతో వోల్టేజీ సమస్యల నివారణకు చర్యలు చేపట్టారు. కొత్త మండలాల ఏర్పాటు, గురుకుల విద్యాసంస్థలు, పెంబర్తి హస్తకళలకు ప్రోత్సాహం జిల్లాకు గుర్తింపు తెచ్చాయి. జిల్లాలో అభివృద్ధి పనులు ఇలా.. లింగాలఘణపురం: కుందారం–పాలకుర్తి రోడ్డులో పటేల్‌గూడెం వాగుపై రూ.2 కోట్లతో బ్రిడ్జి నిర్మించారు. జీడికల్ రామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో రూ.50 లక్షలతో సీసీ రోడ్లు వేశారు. కొడకండ్ల: రూ.250 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, ముండ్రాయి–కొడకండ్ల, వెలిశాల, పాలకుర్తి, నాంచారిమడూరు రోడ్ల ఆధునీకీకరణ. స్టేషన్‌ఘన్‌పూర్: రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఆర్డీఓ కార్యాలయం, ఫైర్ స్టేషన్, జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటయ్యాయి. మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్లు, రూ.45 కోట్లతో 100 పడకల ఆస్పత్రి, రూ.26 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ కార్యాలయం పనులు, రూ.2.63 కోట్లతో ఇండోర్ స్టేడియం, దేవాదుల రిజర్వాయర్ లైనింగ్‌కు రూ.100 కోట్లు, మల్లన్నగండి కుడి కాల్వకు రూ.15 కోట్లు వెచ్చిస్తున్నారు. జఫర్‌గఢ్: కోనాయిచలంలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, రూ.4.50 కోట్లతో 30 పడకల ఆస్పత్రి నిర్మించారు. జనగామ రూరల్: జనగామ–హుస్నాబాద్ రోడ్డుపై రూ.2 కోట్లతో బ్రిడ్జి నిర్మించారు. ఎర్రగొల్లపాడు రోడ్డు పనులకు రూ.60 లక్షలు, చీటకోడూరు –యశ్వంతాపూర్ వాగుపై వంతెనలకు రూ.5 కోట్లు వెచ్చించారు. రఘునాథపల్లి: దొడ్డిగుట్ట వద్ద రూ.3 కోట్లతో గోదాములు నిర్మించారు. పాలకుర్తి టౌన్: సుమారు రూ.100 కోట్లతో పర్యాటక కారిడార్ అభివృద్ధి, సోమనాథుడి స్మృతివనం, కల్యాణ మండపం, బమ్మెరలో పోతన స్మృతి వనం, వల్మిడి సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధికి నిధులు, సుమారు రూ.400 కోట్లతో పాలకుర్తి, చెన్నూరులో రిజర్వాయర్ల పనులు. రూ.17.50 కోట్లతో 50 పడకల ఆస్పత్రి నిర్మాణం. ఫైర్ స్టేషన్, ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. జనగామ రూరల్, అర్బన్, ఆయా మండలాల పరిధిలో మరో 4 మండలాలుగా పెంచి విస్తరించాలి. జిల్లాకు ఎస్పీ కార్యాలయం హోదా కల్పించాలి. ప్రభుత్వ ఐటీఐ, కేంద్రీయ విద్యాలయం, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలి. జనగామ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలి. పెంబర్తి–వరంగల్ ఇండస్ట్రీయల్ కారిడార్ కలగానే మిగిలిపోయింది. 11వ వసంతంలోకి అడుగు -
బతుకమ్మలతో వైద్య విద్యార్థుల నిరసన
జనగామ: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, మాతా శిశు సంరక్షణ కేంద్రంలో పనిచేస్తున్న 22 మంది విదేశీ వైద్య విద్యార్థులు మూడో రోజు శనివారం విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. భారతదేశంలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన హౌస్ సర్జన్లకు నెలకు రూ.29,900 స్టైఫండ్ చెల్లిస్తుండగా, విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసిన తమకు కేవలం రూ.5 వేలు మా త్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము కూడా 90 శాతం వైద్య సేవలు అందిస్తున్నందున సమాన స్టైఫండ్ చెల్లించాలని ప్లకార్డులు, బతుకమ్మలతో నిరసన చేపట్టారు. ఈ నెల 14న హైదరాబాద్‌లోని వైద్య మండలి కార్యాలయం ఎ దుట ఆందోళన నిర్వహించనున్నట్లు తెలిపారు. -
పూల పండుగకు వేళాయె..
నేడు ఎంగిలిపూల బతుకమ్మ ● ఎల్‌నినో ఎఫెక్ట్‌తో కానరాని అడవిపూలు ● మార్కెట్‌ను ఆశ్రయిస్తున్న మహిళలుజనగామ: తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబురాలు నేటినుంచి ప్రారంభమై తొ మ్మిది రోజులు కొనసాగనున్నాయి. మరోవైపు బతుకమ్మకు ఉపయోగించే తంగేడు, గునుగు, గడ్డి పూ లు, నేల చామంతి తదితర ప్రకృతి సిద్ధమైన పూల కు కొరత ఏర్పడింది. కరువు పరిస్థితుల నేపథ్యంలో పూల లభ్యత తగ్గడంతో గతంలో అడవులకు వెళ్లి పూలు సేకరించే కుటుంబాలు సైతం ఇప్పుడు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా బొడ్డెమ్మ పండగకు వీడ్కోలు పలుకుతూ బతుకమ్మ పండగకు స్వాగతం పలికేందుకు మహిళలు సిద్ధమయ్యారు. పూల కొరత.. నిమజ్జనంపై సందిగ్ధం వర్షాభావ పరిస్థితుల కారణంగా సంప్రదాయ పూలు ఆశించిన స్థాయిలో లభించడం లేదు. దీంతో కొన్ని గ్రామాలకు చెందిన కుటుంబాలు సుదూర ప్రాంతాల్లోని అడవులకు వెళ్లి పూలను సేకరించి జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల్లో విక్రయిస్తున్నాయి. చెరువుల్లో నీటి నిల్వలు తగ్గడంతో బతుకమ్మ నిమజ్జనంపై సందిగ్ధత నెలకొంది. మహిళలు పెద్ద సంఖ్యలో వేడుకల్లో పాల్గొనే ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పర్యవేక్షణ చేపట్టనున్నారు. -
మార్కెట్‌పై నిఘా
● జనగామ మార్కెట్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక బృందం ● ధాన్యం తూకాల నుంచి వేలం ధరల వరకు తనిఖీలు ● మార్కెట్ లావాదేవీలపై అధికారుల పర్యవేక్షణ,రికార్డుల పరిశీలన ● మార్కెట్ ఫీజుల వసూళ్లపైనా నజర్ ● రోజువారీ తనిఖీలు, ఉన్నతాధికారులకు నివేదికలుముగ్గురు సభ్యులతో బృందం మార్కెట్ తనిఖీ బృందంలో జనగామ డీఎంఓ సారంగపాణి, అడిషినల్ ఇన్చార్జ్ కార్యదర్శి దివ్య, ఏఎంసీ ములుగు సూపర్వైజర్ రాజు సభ్యులుగా ఉన్నారు. ఈ బృందం కార్యకలాపాలను మార్కెటింగ్ శాఖ అదనపు సంచాలకుడు లక్ష్మణుడు పర్యవేక్షించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు మార్కెట్లకు తనిఖీ బృందాలను ఏర్పాటు చేయగా.. జనగామకు చోటు కల్పించారు. జనగామ: వ్యవసాయ మార్కెట్లలో లావాదేవీలను పారదర్శకంగా నిర్వహించడం, కొనుగోళ్లు, విక్రయాల్లో నిబంధనల అమలును నిర్ధారించడం, రికార్డుల్లో అవకతవకలకు తావులేకుండా చూడటంపై రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా జనగామ మా ర్కెట్‌ను నిరంతరం తనిఖీ చేసేందుకు ప్రత్యేక బృందాన్ని నియమిస్తూ మార్కెటింగ్ శాఖ సంచాలకులు రాహుల్ రాజ్ సర్క్యులర్ జారీ చేశారు. రోజువారీ నివేదికలతో పర్యవేక్షణ తనిఖీ బృందాలు రోజువారీ నివేదికలను సంబంధిత టీమ్ లీడర్ల ద్వారా పర్యవేక్షణ అధికారులకు సమర్పించాలి. ఆ నివేదికలను పరిశీలించిన అధికారులు ప్రతీ మార్కెట్‌పై సంక్షిప్త నివేదికను మార్కెటింగ్ శాఖ సంచాలకుడికి అందించాలి. ప్రత్యేక అధికారుల బృందాలతో రోజువారీ సమన్వయం చేసుకోవడంతోపాటు, గుర్తించిన సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. అవసరమైతే క్రమశిక్షణ చర్యల కోసం సంబంధిత ఫైళ్లను విజిలెన్స్ విభాగానికి పంపే అవకాశం కూడా సర్క్యులర్‌లో కల్పించారు. వ్యాపారుల రికార్డులపైనా దృష్టి కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు సమర్పించాల్సిన నెలవారీ కొనుగోలు రిటర్నులు, తక్‌పట్టీల వివరాలను ప్రత్యేక అధికారులు పరిశీలించి, నిబంధనల అమలుపై బృందాలకు మార్గనిర్దేశం చేయాలి. కోల్డ్ స్టోరేజీలు, చెక్‌పోస్టుల తనిఖీలకు అవసరమైనప్పుడు మార్కెట్ కమిటీల నుంచి అద్దె వాహనాలను సమకూర్చుకోవచ్చని, ఇందుకు 2026–27 ఆర్థిక సంవత్సరంలో మంజూరైన బడ్జెట్‌ను కార్యాలయ నిర్వహణ కింద వినియోగించుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జనగామ మార్కెట్లో సరుకుల రాకపోకలు, వేలం ధరలు, తూకాలు, కొనుగోలు రిటర్నులు, మార్కెట్ ఫీజుల వసూళ్లపై సమగ్ర తనిఖీ లకు ఈ ఆదేశాలు ప్రాధాన్యమిస్తున్నాయి. తనిఖీలు పూర్తన తర్వాత అన్ని విషయాలు వెల్లడి కానున్నాయి.రికార్డుల తనిఖీ.. తూకాల్లో పారదర్శకత మార్కెట్‌కు వచ్చే సరుకులతోపాటు బయటకు వెళ్లే వివరాలు రిజిస్టర్లతో సరి పోల్చాలి. మార్కెట్ యార్డులతోపాటు కోల్డ్ స్టోరేజీల్లో నిర్వహించే వేలం, టెండర్ రిజిస్టర్లను పరిశీలించాలి. వేలం లేదా టెండర్లో నిర్ణయించిన ధరలకు, తక్‌పట్టీల్లో నమోదైన ధరలకు మధ్య వ్యత్యాసాలున్నాయా.. లేదా.. అనేది నిర్ధారించాలి. ధాన్యం తూకాలను రాకపోకల రిజిస్టర్లు, దడువాయి నమోదు చేసిన అసలు తూకంతో సరిపోల్చి, తక్‌పట్టీలు, నెలవారీ కొనుగోలు రిటర్నుల్లో నమోదైన వివరాలను తనిఖీ చేయాలి. నెలవారీ కొనుగోలు రిటర్నులు వేలం ధరలు, తూకాల వివరాలకు అనుగుణంగా ఉన్నాయా.. లేదా.. అన్నది కూడా బృందం పరిశీలించాలి. చెక్‌పోస్టుల వద్ద సరుకుల రవాణా వివరాలు, మార్కెట్ ఫీజు రశీదులు, ధరలు, తూకాల రికార్డులు, ఎగ్జిట్ రిజిస్టర్లను రోజువారీగా తనిఖీ చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. -
అర్హులైన ఓటర్ల పేర్లు పునరుద్ధరించాలి
● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి జనగామ: దేశవ్యాప్తంగా ఓట్ల తొలగింపు ప్రక్రియతో రాజకీయంగా లబ్ధి పొందింది బీజేపీనేనని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన జనగామలో మాట్లాతుడూ.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తోందని విమర్శించారు. తెలంగాణలో ఓట్ల తొలగింపుపై సమగ్ర విచారణ జరిపి, తొలగించిన అర్హులైన ఓటర్ల పేర్లను తిరిగి జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో 95 లక్షల మంది ఓటర్లకు నోటీసులు ఇచ్చారని, తొలి దశలో 73 లక్షల ఓట్లు, రెండో దశలో మరో 21 లక్షల ఓట్లు తొలగించారని పల్లా ఆరోపించారు. అనేక నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. పేర్లలో అక్షరదోషాలు, ఇంటిపేర్లలో తేడాలు, వివరాలు సరిపోలకపోవడం వంటి కారణాలతో అర్హులైన వారి ఓట్లను సైతం తొలగించారని విమర్శించారు. నోటీసులకు స్పందించలేదనే కారణంతో ఓటు హక్కును తొలగించడం సరికాదన్నారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ స్వతంత్రంగా వ్యవహరించడం లేదని ఆరోపించిన పల్లా.. ఆయనను పదవి నుంచి తొలగించి, ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
సోమేశ్వరుడి ఆదాయం రూ.21,98,507
పాలకుర్తి టౌన్: పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.21,98,507 సమకూరినట్లు ఆలయ ఈఓ లక్ష్మీప్రసన్న తెలిపారు. 2026 మార్చి 24 నుంచి అక్టోబర్ 9 వరకు భక్తులు హుండీలో వేసిన కానుకలను శుక్రవారం ఆలయ కల్యాణ మండంపంలో లెక్కించారు. వల్మిడి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ ఈఓ వెంకట్‌రెడ్డి పర్యవేక్షణలో హుండీ ఆదాయంను లెక్కించారు. మిశ్రమ బంగారం 5 గ్రాముల 580 మిల్లి గ్రాములు, మిశ్రమ వెండి కేజీ 359.740 మిల్లి గ్రాములు, యూఎస్ డాలర్స్ 230, ఇంగ్లాడ్ 30 పౌండ్స్, నేపాల్ రూపీ 150 వచ్చినట్లు ఈఓ తెలిపారు. జీజీహెచ్‌లో జూనియర్ డాక్టర్ల నిరసన జనగామ: స్ట్ఫైండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ జనగామ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్), ఎంసీహెచ్‌లో పని చేస్తున్న 22 మంది విదేశీ వైద్య పట్టభద్రులు (ఎఫ్ఎంజీ) జూనియర్ డాక్టర్లు శుక్రవారం విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ప్రస్తుతం తమకు నెలకు రూ.5 వేల స్టైఫండ్ మాత్రమే చెల్లిస్తుండగా, భారతదేశంలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన హౌస్ సర్జన్లకు రూ.29,900 ఇస్తున్నారని పేర్కొన్నారు. తాము కూడా సమానంగా వైద్య సేవలందిస్తున్నందున అదే స్థాయిలో స్టైఫండ్ చెల్లించాలని డిమాండ్ చేశారు. నేడు (శనివారం) జిల్లా వ్యాప్తంగా విధులు నిలిపివేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 14న హైదరాబాద్‌లోని డీఎంబీ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించనున్నట్లు తెలిపారు. గోదావరి జలాలతో ఏనచెరువు నింపండి జనగామ రూరల్: జిల్లాలోని వడ్లకొండ గ్రామంలోని ఏనచెరువును గోదావరి జలాలతో నింపి ఎండిపోతున్న తమ పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం వడ్లకొండ, పెద్దపాడు గ్రామాల రైతులు జనగామ – హుస్నాబాద్ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. పురుగుమందు డబ్బాలతో నిరసన తెలిపారు. ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ధర్నా విరమించాలని కోరగా వినకపోవడంతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఏనచెరువు కింద వందలాది ఎకరాల్లో వేసిన పంటలు నీరు లేక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువును గోదావరి నీటితో నింపాలని గతంలోనే కలెక్టర్, ఇరిగేషన్ ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం, నీటిపారుదల శా ఖ అధికారులు ఏనచెరువుకు గోదావరి జలాల ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఎల్లబో యిన హరీశ్, నాయకులు శానబోయిన మహిపా ల్, రైతులు దండుబోయిన కుమార్, చిలువేరు రాజు, నామాల అంజనేయులు, వడ్లకొండ పెద్దపాడు గ్రామాల రైతులు పాల్గొన్నారు. జేవీవీ కృషి అభినందనీయం జనగామ రూరల్: శాస్త్రేయ విజ్ఞాన వ్యాప్తిలో జేవీవీ కృషి అభినందనీయం జేవీవీ రాష్ట్ర బాధ్యుడు శ్రీనాథ్ అన్నారు. శుక్రవారం జనవిజ్ఞాన వేదిక 6వ జిల్లా మహాసభలు రవీందర్ అధ్యక్షతన ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మా ట్లాడుతూ.. మూఢవిశ్వాసాలను వీడి ప్రజలంతా సైన్స్‌ను అనుసరించడం ద్వారా మాత్రమే సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అనంతరం రాష్ట్ర బాధ్యుడు శ్రీనాథ్ ఎన్నికల అధికారిగా, రాష్ట్ర కార్యదర్శి ఆకుల శ్రీనివాస రా వు పరిశీలకులుగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ గోపాల్‌రెడ్డి , డాక్టర్ మనస్విని, డాక్టర్ మాచర్ల భిక్షపతి, అధ్యక్షులుగా బాలరాజు, ప్రధాన కార్యదర్శి కనకయ్య, కోశాధికారి లక్ష్మణ్, ఉపాధ్యక్షులుగా కేఎల్ మర్రెడ్డి, చంద్రశేఖర్‌రావు, ఉమాదేవి, శోభన్‌బాబు, కార్యదర్శులుగా రవీందర్, సత్తయ్య, కృష్ణ అంజనేయాచారి, శ్రీనివాస్ ని ఎన్నుకున్నారు. -
ఆరోగ్యంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ రూరల్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఆరోగ్యం, పోషకాహారం, మానసిక శ్రేయస్సుపై అవగాహన కల్పించేందుకు పాఠశాల ఆరోగ్య, శ్రేయస్సు కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో కార్యక్రమ అమలుపై సమీక్షించారు. ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని మరో 21 జిల్లాలకు విస్తరించగా అందులో జనగామ కూడా ఉందన్నారు. ప్రతీ పాఠశాల నుంచి ఇద్దరు ఉపాధ్యాయులను ఎంపిక చేసి, శిక్షణ అనంతరం హెల్త్ అండ్ వెల్నెస్ అంబాసిడర్లుగా కార్యక్రమంలో భాగస్వాములను చేయాలన్నారు. ప్రతీ వారం గంట పాటు విద్యార్థులకు ఆరోగ్యం, పోషకాహారం, పరిశుభ్రత, మానసిక ఆరోగ్యం, వ్యాధుల నివారణపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతీ మంగళవారాన్ని ఆరోగ్యం, శ్రేయస్సు డేగా నిర్వహించి, నిర్దేశించిన 11 అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. యోగా, ధ్యానం, సురక్షిత తాగునీరు, రుతుక్రమ పరిశుభ్రత, ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన పెంపొందించాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ వాణిశ్రీ, జీసీడీఓ గౌసియా బేగం, తదితరులు పాల్గొన్నారు. -
ఆకాంక్ష నెరవేరి రెండేళ్లు
● సంతోషంలో 2024 డీఎస్సీ ఉపాధ్యాయులు ● జిల్లాలో 220 మందికి కొలువులు జనగామ: ఎన్నో ఏళ్ల నిరీక్షణ, పట్టుదల ఫలితంగా 2024 డీఎస్సీ ద్వారా ఉద్యోగం సాధించినవారి కల నెలవేరి రెండేళ్లు పూర్తయ్యాయి. రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని శుక్రవారం తమ నియామక రోజుల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. కొత్త టీచర్ల రాకతో రెండేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త కళ కనిపిస్తోంది. 2024 డీఎస్సీ ద్వారా జిల్లాలో 220 పోస్టులను భర్తీ చేయగా.. సుదీర్ఘకాలంగా డీఎస్సీ కోసం ఎదురు చూసి ఉద్యోగం పొందిన అభ్యర్థులు సంబురాలు జరుపుకున్నారు. 2024 అక్టోబర్ 9న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందుకున్న ఉపాధ్యాయులు, అదే నెల 16వ తేదీ నుంచి పాఠశాలల్లో విధుల్లో చేరారు. కొత్త ఉపాధ్యాయుల నియామకంతో పాఠశాలల్లో బోధనా కార్యకలాపాలకు మరింత ఊతం లభించింది. లక్ష్యంతో ఉద్యోగం సాగించిన కృషి, నియామక పత్రాలు అందుకున్న క్షణాలు, తొలిసారి పాఠశాలలో అడుగుపెట్టిన అనుభూతులు తమకు ఎప్పటికీ మధుర జ్ఞాపకాలుగా నిలుస్తాయని ఉపాధ్యాయులు భావిస్తున్నారు. -
హోరాహోరీగా ‘ఆర్టీసీ’ ఎన్నికలు
● జనగామ డిపోలో 400 ఓట్లకు 396 పోలింగ్ ● ఈయూ–ఎన్ఎంయూ కూటమికి అనధికారిక ఆధిక్యం జనగామ: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు జనగామ డిపోలో శుక్రవారం హోరాహోరీగా సాగాయి. డిపో పరిధిలో మొత్తం 400 ఓట్లు ఉండగా 396 ఓట్లతో 99 శాతం పోలింగ్ నమోదైంది. ఓట్ల లెక్కింపు అనంతరం అందిన అనధికారిక సమాచారం ప్రకారం ఈయూ–ఎన్ఎంయూ ఐక్య కూటమి అధిక్యం సాధించడంతో ఆ కూటమి నాయకులు సండురాలు చేసుకున్నారు. అయితే అధికారిక ఫలితాలు ఈ నెల 17న వెలువడనున్నాయి. ఉదయం 5 నుంచి పోలింగ్ జనగామ డిపోలో శుక్రవారం ఉదయం 5 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగిసింది. అనంతరం సాయంత్రం 6.45 గంటలకు షురూ అయిన ఓట్ల లెక్కింపు రాత్రి 8 గంటలకు పూర్తయింది. క్లాస్–3 రాష్ట్ర స్థాయి, క్లాస్–6 ప్రాంతీయ స్థాయి విభాగాలకు సంబంధించి కార్మికులు వేర్వేరుగా ఓట్లు వేశారు. లేబర్ డిపార్ట్మెంట్ వరంగల్ డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో, జనగామ లేబర్ ఆఫీసర్ కుమారస్వామి పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించారు. డిపో మేనేజర్ ఉష, సీఐ హుస్సేన్, అసిస్టెంట్ ఇంజినీర్ నెట్ రాఘవేందర్, సూపరింటెండెంట్ మురళీధర్ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు. కూటముల మధ్య పోటీ ఈయూ–ఎన్ఎంయూ ఐక్యకూటమి, టీడబ్ల్యూయూ–ఎస్‌డబ్ల్యూఎఫ్ ఐక్య కూటమితో పాటు టీజేఎంయూ, బీడబ్ల్యూయూ వేర్వేరుగా పోటీ చేశాయి. కార్మికులను ఆకట్టుకునేందుకు సంఘాల నాయకులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రచారాన్ని హోరెత్తించారు. దీంతో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ సమయంలో ఏజెంట్లు పరిశీలించిన ఓట్ల సరళి ఆధారంగా ఈయూ–ఎన్ఎంయూ కూటమి ఆధిక్యం సాధించినట్లు అనధికా రికంగా ప్రచారం జరిగింది. దీంతో ఆ కూటమి నాయకులు, మద్దతుదారులు సంబురాలు జరుపుకున్నారు. కూటమి తరఫున డిపో కార్యదర్శి వీఎస్ఆర్రెడ్డి, అధ్యక్షుడు ఏ.శ్రీనివాస్, చైర్మన్ జె.శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాలరాజు, గ్యారేజీ కార్యదర్శి అంజయ్య, ఎన్ఎంయూ తరఫున డిపో కార్యదర్శి అంజయ్య, అధ్యక్షుడు జి.ఎస్.రెడ్డి, జాయింట్ సెక్రటరీ పి.మహేందర్, సహాయ కార్యదర్శి రమేష్, టీవీ రత్నం, సందీప్ అనధికారిక లెక్కల ప్రకారం ఆధిక్యం సాధించగా వారిని సత్కరించారు. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఈయూ–ఎన్ఎంయూ కూటమి నాయకులు శాలువాతో సత్కరించారు. ఎమ్మెల్యే వారికి శుభాకాంక్షలు తెలిపారు. సీఐ సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐలు చెన్నకేశవులు, నర్సయ్య, రతీష్ బందోబస్తును పర్యవేక్షించారు. ఓట్లు ఇలా(అనధికారం) క్లాస్–3(స్టేట్) టీడబ్ల్యూయూ/ ఎస్‌డబ్ల్యూఎఫ్:145 ఈయూ/ఎన్ఎంయూ:248 టీజేఎంయూ:01 చెల్లనివి:02క్లాస్–6(రీజియన్) టీడబ్ల్యూయూ/ ఎస్‌డబ్ల్యూఎఫ్:165 ఈయూ/ఎన్ఎంయూ:224 టీజేఎంయూ:04 బీడబ్ల్యూయూ:03 -
ఈ–నామ్లో సాంకేతిక లోపం
జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఈ–నామ్ 2.0 వెర్షన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో గురువారం బిడ్డింగ్ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ–నామ్ సేవల్లో సాంకేతిక సమస్య ఏర్పడటంతో మధ్యాహ్నం ఒంటి గంటకే పూర్తి కావాల్సిన బిడ్డింగ్ ప్రక్రియ సుమారు 2 గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైంది. దీంతో సుదూర ప్రాంతాల నుంచి ధాన్యాన్ని తీసుకొచ్చిన రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నా రు. సాంకేతిక సమస్య కారణంగా బిడ్డింగ్ మరింత ఆలస్యం కాకుండా మార్కెట్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ–నామ్ సేవలు అందుబాటులోకి రాకపోతే రైతులకు ఇబ్బంది కలగకుండా మాన్యువల్‌గా బిడ్డింగ్ నిర్వహించేందుకు డీఎంవో సారంగపాణి ఆధ్వర్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అనంతరం ప్రధాన సర్వర్ నుంచి ఈ–నామ్ సేవలు పునరుద్ధరించినట్లు సమాచారం అందడంతో మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ బిడ్డింగ్ ప్రారంభించారు. మార్కెట్‌కు గురువారం 5 వేలకుపైగా ధాన్యం బస్తాలు తరలివచ్చాయి. బిడ్డింగ్ ఆలస్యమైనప్పటికీ రైతులకు నష్టం కలగకుండా అధికారులు ప్రత్యక్ష పర్యవేక్షణ చేపట్టారు. ఏఎంసీలో ఆలస్యంగా ధాన్యం బిడ్డింగ్ 5వేల బస్తాలకు పైగా ధాన్యం రాక -
ఆర్టీసీ ఎన్నికలకు సర్వం సిద్ధం
జనగామ: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలకు జనగామ డిపో సర్వం సిద్ధమైంది. జిల్లా కార్మిక శాఖ అధికారి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి కుమారస్వామి ఆధ్వర్యంలో ఈనెల 9న (శుక్రవారం) ఎన్నికల కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. డిపో మేనేజర్ ఉష ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్‌కు మరికొద్ది గంటలే సమయం ఉండటంతో ఆయా సంఘాల నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ), నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ), తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) కలిసి జేఏసీగా పోటీ చేస్తున్నాయి. మరో వైపు తెలంగాణ వర్కర్స్ యూనియన్ (టీడబ్ల్యూ యూ), స్టేట్ వర్కర్స్ యూనియన్ (ఎస్డబ్ల్యూ యూ) బరిలో నిలిచాయి. రెండు ఓట్లు.. తొమ్మిది గుర్తులు కార్మికులు ఎన్నికల్లో రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. క్లాస్–3 స్టేట్ స్థాయికి ఒక ఓటు, రీజినల్ లెవల్ క్లాస్–6కు మరో ఓటు వేయాలి. మొత్తం తొమ్మిది గుర్తులను కేటాయించారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించనున్నారు. జనగామ డిపోలో మొత్తం 400 మంది కార్మికులకు ఓ టు హక్కు ఉంది. ఓ టర్లు తప్పనిసరిగా ఐడీ కార్డు చూపించి ఓటు వేయాల్సి ఉంటుంది. ఉదయం 5 నుంచి పోలింగ్ ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. సాయంత్రం 6.20 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. అయితే ఎన్నికల ఫలితాలను ఈ నెల 17న అధికారికంగా ప్రకటించనున్నారు. పోలింగ్ కేంద్రంలో ఆయా సంఘాలకు చెందిన ఏజెంట్లు ఉండి ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. రిటర్నింగ్ అధికారి కుమారస్వామితో పాటు మరో నలుగురు ఎన్నికల సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. డిపోలో సందడి ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల నేపథ్యంలో డిపో ఆవరణ సందడిగా మారింది. నమూనా బ్యాలెట్ పత్రాలు, కండువాలతో కార్మిక సంఘాల నాయకుల హడావిడి కనిపించింది. సుదీర్ఘకాలం తర్వాత ఆర్టీసీలో ఎన్నికల సందడి నెలకొనడంతో కార్మికుల్లోనూ ఆస క్తి నెలకొంది. ప్రచారం తీరు స్థానిక సంస్థల ఎన్నికలను తలపించింది. ఎన్నికల నేపథ్యంలో సీఐ సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో డిపో ఆవరణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. డిపోలో ఏర్పాట్లు పూర్తి నేడు పోలింగ్, సాయంత్రం లెక్కింపు ఈనెల 17న ఫలితాల ప్రకటన -
పెన్షనర్ల ఆవేదనకు దృశ్యరూపం
జిల్లా కేంద్ర ప్రభుత్వ ఉన్నత పాఠశాల విశ్రాంత ఉపాధ్యాయుడు సయ్యద్ హష్మత్తుల్లా హుస్సేన్ గీసిన బొమ్మ పెన్షనర్ల పరిస్థితికి అద్దం పడుతోంది. ఉచిత బస్సు ప్రయాణాలు, విద్యుత్, గ్యాస్ సిలిండర్ల వంటి సంక్షేమ పథకాలకు లేని ఆర్థిక భారం, రిటైర్డ్ ఉద్యోగులకు అందాల్సిన ఆర్థిక ప్రయోజనాల విషయంలో ఎందుకు వస్తోందని ఆయన ప్రశ్నించారు. గ్రాట్యూటీ, జీపీఎఫ్, లీవ్ శాలరీ, కమ్యూటేషన్, పీఆర్సీ 2023 వంటి కష్టపడి సంపాదించుకున్న చట్టబద్ధమైన బకాయిలను కాళ్ల కింద తొక్కిపెట్టడం ఎంతవరకు ధర్మమని ఈ కార్టూన్ ద్వారా ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి పెన్షనర్ల ఆవేదన తీర్చాలని, వారి హక్కులను న్యాయంగా పునరుద్ధరించాలని ఈ చిత్రం బలంగా కోరుతోంది. – జనగామ -
పాఠశాలను పరిశుభ్రంగా ఉంచాలి
బచ్చన్నపేట: పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు పాఠశాల పరిసరాలను కూడా పరి శుభ్రంగా ఉంచాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మండలంలో ని చిన్నరామన్చర్ల గ్రామంలోని మండల ప్రజాపరిషత్ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, వసతులు, వంట గది, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడు తూ పాఠాలు ఎలా బోధిస్తున్నారని అడిగారు. యూనిఫామ్‌లు అందాయా అని ఆరా తీశారు. ఈవీఎం గోదాం పరిశీలన జనగామ రూరల్: ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం, నెలవారీ తనిఖీలో భాగంగా గురువారం కలెక్టరేట్లోని ఈవీఎం గోదాంను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించి, పరిశీలించారు. భద్రతా నమోదు పుస్తకం, సీసీ కెమెరాల పనితీరు, మంటల నియంత్రణ పద్ధతుల ను పర్యవేక్షించారు. ఏసీ బెన్షాలోమ్ ఆర్డీఓ గోపీరాం, తహసీల్దార్ మహిపాల్ రెడ్డి, ఎన్ని కల విభాగం సూపరింటెండెంట్ శ్రీధర్ పాల్గొన్నారు. సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం -
సమాన పనికి.. సమాన ౖస్టెఫండ్
జనగామ: విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసి, ఫారెన్న్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ)లో అర్హత సాధించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇంటర్న్‌షిప్ చేస్తున్న ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ (ఎఫ్ఎంజీ) సమాన స్టైఫండ్ కోసం ఆందోళన బాట పట్టారు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణలో గురువారం నిరసన తెలిపారు. దేశంలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఇంటర్న్లతో సమానంగా విధులు నిర్వహిస్తున్న తమకు అదే స్థాయిలో స్టైఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హత ఒకటే.. విధులు ఒకటే ఎన్న్ఎంసీ నిబంధనల ప్రకారం విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసిన అనంతరం ఎఫ్ఎంజీఈలో అర్హత సాధించి, అవసరమైన ప్రక్రియను పూర్తి చేసిన తర్వాతే ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్లినికల్ ఇంటర్న్‌షిప్ చేస్తున్నామని ఎఫ్‌ఎంజీలు తెలిపారు. ఓపీ, వార్డులు, క్యాజువాలిటీ, ఎమర్జెన్సీ సేవలతో పాటు సర్జన్లకు సహకారం, రోగుల పర్యవేక్షణ వంటి విధులు నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాధారణ విధులతో పాటు నెలలో ఐదు రోజులపాటు నైట్ డ్యూటీలతో కలిపి 28 గంటల ఎమర్జెన్సీ విధులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. రూ.5 వేలతోనే సరిపెడుతున్నారు.. దేశంలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఇంటర్న్‌లకు నెలకు రూ.29,792 స్టైఫండ్ అందుతుండగా, తమకు కేవలం రూ.5 వేలు మాత్రమే స్టైఫండ్ ఇస్తున్నారన్నారు. సమాన అర్హతలు కలిగి, సమానమైన వైద్య సేవలు అందిస్తున్నప్పుడు స్టైఫండ్‌లో వ్యత్యాసం చూపడం అన్యాయమంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 800 మంది జిల్లాలో 22 మంది ఎఫ్ఎంజీ ఇంటర్న్లు పనిచేస్తుండగా, రాష్ట్రవ్యా ప్తంగా సుమారు 800 మంది ఉన్నారు. దేశంలోని రాజస్థాన్న్, ఉత్తరప్రదేశ్, బీహార్, గుజరాత్, బెంగాల్ తదితర రాష్ట్రాల్లో విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసి అర్హత సాధించిన ఇంటర్న్‌లకు స్థానిక ఎంబీబీఎస్ ఇంటర్న్లతో సమానంగా స్టైఫండ్ అందుతున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలోనూ అదే విధానం అమలు చేయాలని కోరారు. ఇంటర్న్‌లకు మద్దతుగా కల్నల్ డాక్టర్ భిక్షపతి మాట్లాడుతూ.. ఎఫ్ఎంజీ విద్యార్థులు అడుగుతున్నది న్యాయమైన హక్కు అని, ఎంబీబీఎస్ విద్యకు కుటుంబాలు పెద్ద ఎత్తున ఆర్థిక భారాన్ని భరిస్తున్నాన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రోజుకు సుమారు రూ.160 స్టైఫండ్ ఇవ్వడం సరిపోదని, స్థానిక ఎంబీబీఎస్ ఇంటర్న్లతో సమానంగా చెల్లించాలని సూచించారు.సమాన స్టైఫండ్ కోసం రెండేళ్లుగా అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్తున్నామని తెలిపారు. సెప్టెంబర్ 23న డీఎంఈకి వినతిపత్రంతో పాటు సంబంధిత పత్రాలను సమర్పించినా ఇప్పటి వరకు స్పష్టమైన పరిష్కారం చూపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సమస్య పరిష్కారం కోసం దశల వారీగా ఆందోళన చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 8, 9, 10 తేదీల్లో ఓపీ సేవలకు దూరంగా ఉండాలని, 11, 12, 13 తేదీల్లో విధులకు పూర్తిగా గైర్హాజరు కావాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. 14న హైదరాబాద్‌లోని డీఎంఈ కార్యాలయం ఎదుట శాంతియుత నిరసన చేపట్టి తదుపరి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. జీజీహెచ్‌లో ఎఫ్ఎంజీ హౌస్ సర్జన్ల ఆందోళన నెలకు రూ.5 వేలతో సరిపెడుతున్నారని ఆవేదన ఎంబీబీఎస్ ఇంటర్న్‌లకు ఇస్తున్న రూ.29,792 చెల్లించాలని డిమాండ్అర్హతలు పూర్తి చేసి ప్రభుత్వ ఆస్పత్రుల్లో సమాన విధులు నిర్వహిస్తున్నప్పుడు స్టైఫండ్‌లో వ్యత్యాసం ఉండకూడదు. ప్రభుత్వం సమస్యను సానుకూలంగా పరిశీలించాలి. – డాక్టర్ పి.త్రిశూల్రెడ్డిఎఫ్ఎంజీ ఇంటర్న్లు వైద్య సేవల్లో కీలకంగా భాగస్వాములవుతున్నారు. వారి ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సమాన స్టైఫండ్ అందేలా చర్యలు తీసుకోవాలి. – డాక్టర్ పసుపులేటి మనోజ్ఞ -
భారత ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే
జనగామ రూరల్: బీజేపీ ‘ఓట్ చోరీ’పై పోరాటం చేస్తున్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సీనియర్ నాయకులు, కూటమి ఎంపీలపై దౌర్జన్యంగా వ్యవహరించడం అమానుషమని, ఇది భారత ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే అని డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీనారాయణ నాయక్ మండిపడ్డారు. గురువారం ఏఐసీసీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం బీజేపీ ప్రభుత్వం, జ్ఞానేశ్ కుమార్, మోదీ, అమిత్‌షా దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని, ఓటర్ల హక్కులను కాపాడేందుకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. నిరసనలో వైటీడీఏ మెంబర్ డాక్టర్ లక్ష్మీ నారాయణ నాయక్, మాజీ మున్సిపల్ చైర్మన్ వేమళ్ళ సత్యనారాయణ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్రమల్ల సుధాకర్, డాక్టర్ రాజమౌళి, వేముల మల్లేష్, బడికే ఇందిరా, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు మాజిద్ అప్సర్, జాయ మల్లేష్, సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి శ్రీనివాస్ రెడ్డి, ఆర్టీఏ మెంబర్ అభి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి జ్ఞానేశ్ కుమార్, మోదీ, అమిత్ షా దిష్టిబొమ్మల దహనం -
వడివడిగా సాగు లెక్క!
జనగామ రూరల్: జిల్లాలో వానాకాలం సాగు లెక్కతేల్చడానికి వ్యవసాయశాఖ అధికారులు డిజిటల్ క్రాప్ బుకింగ్ సర్వే చేపట్టారు. జిల్లా వ్యవసాయ అధికారితో పాటు ఏడీఏల పర్యవేక్షణలో జిల్లాలోని 280 గ్రామపంచాయతీల్లో 62 మండల అధికారులు, 176 మంది వలంటీర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 76.4 శాతం పూర్తయింది. సర్వేలో రాష్ట్ర స్థాయిలో 19వ స్థానంలో నిలిచింది. అయితే ధాన్యం చేతికి వచ్చే దశ రావడంతో సర్వే నమోదు ప్రక్రియ ముమ్మరం చేశారు. 10 రోజుల్లో సర్వే పూర్తి చేయనున్నారు. క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడి ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు.. సర్వేనంబర్ వారీగా సాగు చేసిన పంట వివరాలు.. ఫొటోలను క్రాప్ బుకింగ్ మొబైల్ యాప్‌లో జియో ట్యాగింగ్ ద్వారా నమోదు చేస్తున్నారు. నెట్వర్క్ సమస్యలు.. గ్రామీణ ప్రాంతాల్లో పలుచోట్ల నెట్వర్క్ సమస్యలు తలెత్తుతున్నట్లు వలంటీర్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా కేడేస్టల్ మ్యాప్ లేని గ్రామాల్లో సర్వే ఆలస్యమవుతోంది. సర్వే ద్వారా జిల్లాలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేశారనే కచ్చితమైన రావడంతో వివరాలు పాటు పంటల దిగుబడిని అంచనా చేసి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలపై ప్రభుత్వానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. క్రాప్ బుకింగ్ సర్వే ద్వారా కొన్ని పంటలకు మద్దతు ధర లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. రైతులకు విస్తృత అవగాహన పంట సర్వే నమోదుపై గ్రామాల్లోని రైతులకు వి స్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. పంట నమోదు ద్వారా కలిగే ఉపయోగాలు వివరిస్తున్నారు. అలాగే ఎల్‌నినో వానాకాలం సాగుపై ఎంతమేర ప్రభావం చూపిందనే లెక్క సర్వేతో తేలనుంది. అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలకు రైతులు పంటల సాగుకు సిద్ధమయ్యారు. ఇప్పటికీ భారీ వర్షాలు లేక చెరువులు వెలవెలబోతుండగా, భూగర్భ జలాలు అడుగంటాయి. సాగు ప్రారంభంలోనే ప్రభుత్వం ఎల్‌నిలో ప్రభావం ఉంటుందని, ఆరుతడి పంటల సాగువైపు రైతులను మళ్లించే దిశగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. అయినా రైతులు మాత్రం ఎక్కువ శాతం వరి, తక్కువ భాగంలో పత్తి సాగు చేస్తున్నారు. కూరగాయల సాగుకు సంబంధించిన పంట లెక్క సజావుగా కొనసాగుతోంది. వ్యవసాయ విస్తరణ అధికారులు, వలంటీర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులు సాగు చేసిన పంట వివరాలు నమోదు చేస్తున్నారు. పంట లెక్కల ఆధారంగా ప్రభుత్వం రైతులకు అందించే వివిధ పథకాల అమలు, పంటల ప్రణాళిక, దిగుబడి అంచనాలు రూపొందించడం సులభమవుతుంది. జిల్లాలోని 12 మండలాల్లో క్రాప్ బుకింగ్‌లో 77 శాతంతో మొదటి స్థానంలో కొడకండ్ల నిలవగా, 48 శాతంతో చివరి స్థానంలో రఘునాథపల్లి నిలిచింది. మిగిలిన మండలాల్లో 60 నుంచి 70 శాతం వరకు చేరుకుంది.10 రోజుల్లో పంట లెక్కల ప్రక్రియ ముగియనుంది. సర్వే పూర్తిచేసి సమగ్ర నివేదికను ఉ న్నతాధికారులకు సమర్పిస్తాం. ధాన్యం విక్రయం ఇతర అవసరాలకు ఉపయోగపడనున్నది. రైతులు సరైన వివరాలు అందించి సహకరించాలి. – అంబికా సోని, జిల్లా వ్యవసాయ అధికారి రాష్ట్ర వ్యాప్తంగా 19 స్థానం సర్వేలో 62 మంది వ్యవసాయ అధికారులు, 176 మంది వలంటీర్లు ప్రతీ రైతు సమాచారం ఆన్లైన్ నమోదు మొదటి స్థానంలో కొడకండ్ల, చివరి స్థానంలో రఘునాథపల్లిమొత్తం క్రాప్ సర్వే ప్లాట్స్ 5,47,309 పూర్తయిన సర్వే ప్లాట్స్ 4,18,050 చేయాల్సిన సర్వే ప్లాట్స్ 1,29,259 మొత్తం శాతం 76.40 -
సవరణలకే ఓటర్ల మొగ్గు
● జిల్లాలో 11,739 దరఖాస్తులు ● ఫారం–8కే అత్యధిక స్పందన ● కొత్త ఓటర్ల కోసం 4,096 దరఖాస్తులు ● ఇప్పటి వరకు 2,246 అప్డేట్ జనగామ: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్)లో జిల్లాలో సవరణలు, మార్పులు, చేర్పులకే ప్రజలు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. జూన్‌న్ 15 నుంచి అక్టోబర్ 7 వరకు నిర్వహించిన ప్రక్రియలో జనగామ, స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాల పరిధిలో ఫారం–6, 6ఏ, 7, 8 ద్వారా మొత్తం 11, 739 దరఖాస్తులు అందాయి. వీటిలో ఇప్పటివరకు 2,246 దరఖాస్తులు పరి ష్కరించి అప్డేట్ చేయగా, మరో 9,493 దరఖాస్తులు ప్రక్రియలో ఉన్నాయి. ఫారం–8కే భారీ స్పందన ఓటరు జాబితాలో పేరు, చిరునామా, ఇతర వ్యక్తిగత వివరాల సవరణలు, బదిలీల కోసం ఫారం–8 ద్వారా అత్యధికంగా 7,540 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 2,041 అప్డేట్ అయ్యాయి. జనగామలో 3,046కు 926, స్టేషన్న్ ఘన్‌పూర్‌లో 2,362కు 1,006, పాలకుర్తిలో 2,132కు 109 దరఖాస్తులు పరిష్కరించారు. మొత్తం దరఖాస్తుల్లో ఫారం–8 వాటా సుమారు 64 శాతం కావడం గమనార్హం. కొత్త ఓటర్ల దరఖాస్తులు 4,096 18 ఏళ్లు నిండిన వారు కొత్తగా ఓటు హక్కు పొందేందుకు ఫారం–6 ద్వారా 4,096 దరఖాస్తులు వచ్చాయి. జనగామలో 1,453, స్టేషన్ ఘన్‌పూర్‌లో 1,429, పాలకుర్తిలో 1,214 దరఖాస్తులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కేవలం 134 మాత్రమే అప్డేట్ అయ్యాయి. ఇందులో స్టేషన్న్ ఘన్‌న్‌పూర్ 61, పాలకుర్తి 38, జనగామ 35 ఉన్నాయి. తొలగింపునకు 98 దరఖాస్తులు ఓటరు జాబితాలో మరణించిన, ప్రాంతం మారిన లేదా అనర్హులైన ఓటర్ల తొలగింపునకు ఫారం–7 ద్వారా 98 దరఖాస్తులు రాగా, 71 పేర్లు తొలగించారు. జనగామలో 47కు 35, స్టేషన్ ఘన్‌పూర్‌లో 38కు 25, పాలకుర్తిలో 13కు 11 పరిష్కరించారు. ఎన్ఆర్ఐ ఓటర్ల కోసం ఫారం–6ఏ ద్వారా కేవలం 5 దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా ఇప్పటికే ఉన్న ఓటర్ల వివరాల సవరణపై ప్రజల ఆసక్తి కొత్త నమోదుతో పోలిస్తే స్పష్టంగా ఎక్కువగా కనిపిస్తోంది. మిగిలిన దరఖాస్తులను వేగంగా పరిశీలిస్తే తుది ఓటర్ల జాబితా మరింత కచ్చితత్వంతో రూపొందే అవకాశం ఉంది. -
జిల్లాస్థాయి షూటింగ్‌బాల్ ఎంపికలు
స్టేషన్‌ఘన్‌పూర్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, క్రీడల ద్వారా దేహదారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం కల్గుతుందని మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ అన్నారు. డివిజన్‌కేంద్రంలో షూటింగ్‌బాల్ జూనియర్ బాల, బాలికల జిల్లాస్థాయి ఎంపిక పోటీలు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కమిషనర్ మాట్లాడారు..క్రీడలతో స్నేహభావం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు. షూటింగ్‌బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నెపు కుమార్ మాట్లాడుతూ.. ఎంపిక పోటీలకు బాలురు 60 మంది, బాలికలు 40 మంది వచ్చారని, వారిలో క్రీడాప్రతిభ ఆధారంగా ఎంపిక చేశామన్నారు. జిల్లాస్థాయిలో ఎంపికై న వారు ఈనెల 10 నుంచి 12వ తేదీవరకు మెదక్ జిల్లా తూఫ్రాన్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలి పారు. అసోసియేషన్ జిల్లా చైర్మన్ గద్దె అనీల్‌కుమార్, ఉపాధ్యక్షులు దేవ్‌సింగ్, సాంబరాజు, పీడీలు రవీందర్, అశోక్, సాంబన్న, రాజు, నరేశ్, రేణుక, మహాలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. -
చైర్మన్ సంతకం లేకుండా చెక్కులు పాస్
● వాచ్‌మన్‌పై చర్యలకు ఏఎంసీ తీర్మానం జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ)లో చైర్మన్ సంతకం లేకుండా సెప్టెంబర్ 2026కు సంబంధించిన చెక్కులను కేవలం సెక్రటరీ సంతకంతో పాలకవర్గంతో సంబంధం లేకుండా ఎస్టీఓ ద్వారా పాస్ చేయించిన వ్యవహారంపై ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ తెలిపారు. ఏఎంసీ యార్డులోని నూతన కార్యాలయంలో బుధవారం పాలకవర్గం అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా చైర్మన్ శివరాజ్ యాదవ్ మాట్లాడుతూ..చైర్మన్ సంతకం లేకుండానే చెక్కులు పాస్ చేయించిన విషయం తెలుసుకుని సిబ్బందిని ప్రశ్నించినట్లు చెప్పారు. ఈ క్రమంలో చైర్మన్‌పై వాచ్‌మన్ ఐలయ్య దురుసుగా ప్రవర్తించాడని పాలకవర్గం మొత్తం గుర్తించిందన్నారు. దీనిపై పాలక వర్గం చర్చించిన అనంతరం వాచ్‌మన్‌ను సస్పెండ్ చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించిందన్నారు. సమావేశంలో ఏఎంసీ డైరెక్టర్లు నాగబండి రవీందర్, నీల మోహ న్, శ్రీలతరెడ్డి, బాష్మియా, నామాల శ్రీనివాస్, తోటకూరి రమేశ్, బన్సీ నాయక్, శీలం కొండల్‌రెడ్డి, పార్ష సిద్దేష్, బండ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ విషయమై ఐలయ్య మాట్లాడుతూ.. పై అధికారులు చెప్పిన మాట ప్రకారం విధులు నిర్వర్తించానని, ఇందులో తన తప్పు ఏమీ లేదని చెప్పారు. ఎలాంటి విచారణకై నా సిద్ధమన్నారు. -
బోరు ఆగుకుంటూ పోస్తోంది..
నాలుగు ఎకరాల్లో వరి, పత్తి పంట సాగు చేసిన. పంటల పెట్టుబడికి రూ.50 వేలకు పైగా ఖర్చు చేసిన. ఎల్‌నినోతో పంటలపై తీవ్ర ప్రభావం ఉంది. భూగర్భ జలాలు పడిపోవడంతో బోర్లు గ్యాప్ ఇచ్చి పోస్తున్నాయి.. వరి పొట్ట దశలో ఉంది. కోతకు మరో నెల రోజుల సమయం ఉంది. ఇప్పుడు నీరందకపోతే దిగుబడి తగ్గుతుంది. పైపుల ద్వారా మడులకు తడి అందించే ప్రయత్నం చేసినా ఫలితం కనిపిండం లేదు. – ఎం.రాజు, రైతు, ఓబులాపూర్, జఫర్‌గఢ్●రెండు ఎకరాల్లో వరి సాగు చేసిన. రెండు బోర్ల ద్వారా పొలానికి తడి అందిస్తున్నా.. సాగునీరు అందడం లేదు. తెల్లవారుజాము నుంచి రాత్రి పొద్దు పోయే వరకు పొలం వద్దనే ఉంటూ పైపులను మారుస్తూ మడులకు నీరు పారిస్తున్నా. బోర్లు గ్యాప్ ఇస్తుండడంతో పొట్టదశలో ఉన్న వరి పంటను కాపాడుకునేందుకు రెక్కలు ముక్కలు చేసుకుంటున్నం. – కామిడి లక్ష్మారెడ్డి, రైతు, బచ్చన్నపేట -
రేపు ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల పోలింగ్
వరంగల్–1 472రీజినల్ మేనేజర్ 50హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలకు వరంగల్ రీజియన్ పరిధిలో కార్మికశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. 9న ఉదయం 5నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 3,042 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇప్పటికే డిపోల వారీగా, రీజినల్ మేనేజర్ కార్యాలయంలో పోలింగ్ బూత్‌లు గుర్తించారు. ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, సిబ్బందిని నియమించారు. బ్యాలెట్స్ బాక్స్‌లు సమకూర్చుకోవడంతో పాటు బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేశారు. నేడు (గురువారం) హనుమకొండలోని జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కార్మిక శాఖ కార్యాలయంలో సిబ్బందికి పోలింగ్ మెటీరియల్ పంపిణీ చేయనున్నారు. పోలింగ్ పర్యవేక్షకులుగా అసిస్టెంట్ లేబర్ కమిషనర్లు మహబూబాబాద్ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ వెంకట్‌రెడ్డి మహబూబాబాద్, భూపాలపల్లి, తొర్రూరు డిపోల్లోని పోలింగ్ స్టేషన్లను, వరంగల్ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ భార్గవ్ వరంగల్–1, వరంగల్–2 హనుమకొండ, ఆర్ఎం ఆఫీస్, జనగామ, పరకాల, నర్సపేట, పరకాల డిపోల్లోని పోలింగ్ స్టేషన్లను పర్యవేక్షిస్తారు. ప్రతీ ఓటరుకు రెండు ఓట్లు.. ● ప్రతీ ఓటరు (కార్మికుడు) రెండు ఓట్లు వేయాలి. క్లాస్–3 (రాష్ట్ర), క్లాస్–6 (రీజియన్)కు వేర్వేరుగా ఓట్లు వేయాల్సి ఉంటుంది. ● డ్యూటీలో ఉండి 9న పోలింగ్‌లో పాల్గొనే అవకాశం లేని కార్మికులకు ఈ నెల 15, 16 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్‌కు అవకాశం కల్పించారు. ● పోలింగ్ కోసం మొత్తం 39 మంది సిబ్బందిని నియమించారు. ఇందులో 10 మంది ప్రిసైడింగ్ అధికారులుండగా, మిగతా వారిలో అసిస్టెంట్ ప్రిసైడింగ్ అఫీసర్, ఎన్నికల సిబ్బంది ఉన్నారు. ● పోలింగ్ అనంతరం కౌంటింగ్ నిర్వహిస్తారు. కానీ, ఫలితాలు అధికారికంగా విడుదల చేయరు. ● పోస్టల్ బ్యాలెట్‌ను ఈ నెల 15, 16 తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు డిపోలో కేటాయించిన బాక్స్‌లో వేయాలి. ● వీటిని ఈ నెల 16న మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ చేస్తారు. తుది ఫలితాలు 17న ప్రకటిస్తారు. ముగిసిన ఎన్నికల ప్రచారం... టీజీఎస్ ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల ప్రచారం బుధవారంతో ముగిసింది. ఈ నెల 18న కార్మిక శాఖ గుర్తింపు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. అప్పటినుంచి యూనియన్లు ఎన్నికల ప్రచారం చేపట్టాయి. కార్మిక యూనియన్ ప్రధాన సంఘాలతోపాటు ఆయా పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్మిక సంఘాల రాష్ట్ర, రీజియన్ నాయకులు డిపోల వారీగా ప్రచారం నిర్వహించారు. గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డారు. చివరగా ఈ నెల 6న తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్, ఎస్‌డబ్ల్యూఎఫ్ ఐక్య కూటమి బహిరంగ సభ నిర్వహించగా, ఎంప్లాయీస్ యూనియన్, ఎన్ఎంయూ, టీఎంయూ ఐక్య కూటమి బుధవారం బహిరంగ సభ నిర్వహించింది. కార్మికులకు ఏమేమి చేస్తామో వివరించాయి. వరంగల్ రీజియన్‌లో రెండు ఐక్య కూటమిల మధ్య ముఖాముఖి పోటీ నెలకొనగా ఓటర్ల మద్దతు పొందేందుకు తీవ్రంగా శ్రమించాయి. విజయంపై ఎవరికివారు ధీమాతో ఉన్నారు. వరంగల్–2 258హనుమకొండ 557జనగామ 400242పరకాలమహబూబాబాద్ 280 నర్సంపేట 219 9న ఉదయం 5నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ అనంతరం కౌంటింగ్ ఈ నెల 15, 16న పోస్టల్ బ్యాలెట్ క్లాస్–3కి వైట్ పేపర్ బ్యాలెట్ క్లాస్–6కు లైట్ గ్రీన్ బ్యాలెట్ 17న తుది ఫలితాల ప్రకటన -
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించాలి
జనగామ: పట్టభద్రులు ఓటు హక్కును నమోదు చేసుకుని ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకగా నిలవాలని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పిలుపు. బుధవారం మండలంలోని యశ్వంతాపూర్ బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడా రు. గతంలో ప్రతీ నియోజకవర్గంలో 10 వేల నుంచి 15 వేల వరకు గ్రాడ్యుయేట్ ఓటర్లు నమోదయ్యారని, ప్రతీ గ్రామానికి ఒకరు లేదా ఇద్దరు ఇన్‌చార్జ్‌లను నియమించి నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 1.60 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని, పోలీస్ శాఖలో 60 వేలు, సింగరేణిలో 14 వేల ఉద్యోగాలు కల్పించామని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటివరకు 12 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని విమర్శించారు. ఓటరుగా నమోదు చేసుకోవాలి.. వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతీ గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే రాజయ్య, రాకేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పట్టభద్రులకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పిలుపు -
ధారగా బోరు..
మడి దాటని నీరు!జనగామ: వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో జిల్లాలో భూగర్భ జలాల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలతో ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్‌లో భూగర్భ జలమట్టం కొంత మెరుగుపడినప్పటికీ, గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే మాత్రం నీటిమట్టాలు గణనీయంగా లోతుకు పడిపోయాయి. జిల్లాలోని 37 ఫీజోమీటర్లలో నమోదైన వివరాల ప్రకారం సెప్టెంబర్–2026లో జిల్లా సగటు భూగర్భ జలమట్టం 8.20 మీటర్ల లోతులో ఉంది. ఆగస్టులో 9.50 మీటర్లు ఉండగా, ఇటీవల కురిసిన వర్షాలతో 1.30 మీటర్లు నీటి మట్టంపైకి వచ్చినట్లు నమోదైంది. అయితే 2025 సెప్టెంబర్‌లో సగటు 4.79 మీ టర్లుగా ఉండటంతో, గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం 3.41 మీటర్లు లోతుకు వెళ్లింది. అత్యల్పం..అత్యధికంగా లోతుకు జిల్లాలోనే స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని నమిలిగొండ 1.48 మీటర్ల పైకి అత్యంత మెరుగైన స్థానంలో నిలవగా, జనగామ మండలంలోని సిద్దంకిలో 14.68 మీటర్ల లోతుకు పడిపోయాయి. జఫర్‌గఢ్ మండలంలోని సూరారం 13.85, రఘునాథపల్లి మండలంలోని గబ్బెటలో 13.19 మీటర్ల లోతులో భూగర్భజలాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. సాగుకు నీటి కొరత.. రైతుల్లో ఆందోళన జిల్లాలో వానాకాలంలో వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలు కలిపి సుమారు 3.50 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. వర్షాలు ఆలస్యంగా, తక్కువగా కురవడంతో ఇప్పటికే బోర్లు, బావులపై ఆధారపడిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో 800 నుంచి 1,000 అడుగుల వరకు బోర్లు వేసినా ఆశించిన స్థాయిలో నీరు లభించని పరిస్థితి ఉందని రైతులు చెబుతున్నారు. దీంతో ఉన్న బోర్ల నుంచి కిలోమీటర్ల మేర పైపులు వేసి మడికి మడి నీటిని అందిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వరి పొలాలు ఎండిపోగా, పత్తిలోనూ దిగుబడి తగ్గే పరిస్థితి నెలకొంది. సాధారణంగా పత్తి కొమ్మకు 30–40 కాయలు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 20 కాయలు కూడా కనిపించని పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న పంటపైనా నీటి కొరత ప్రభావం పడుతోంది. వర్షాలు మరింతగా కురిసి భూగర్భ జలాలు రీచార్జ్ అయితేనే మిగిలిన పంటలకు ఊరట లభించే అవకాశం ఉంది. తడారి పోతున్న పంటలు పంటను కాపాడుకునేందుకు కష్టాలు మడి మడికి పైపులు పెట్టి పారకం ఇటీవల వర్షాలతో ఉపశమనం పాక్షికమే జిల్లా సగటు నీటిమట్టం 8.20 మీటర్లు గతేడాదితో పోలిస్తే 3.41 మీటర్లు లోతుకుబచ్చన్నపేట (పడమటి కేశ్వాపూర్) 12.01 చిల్పూరు (కిష్టాజిగూడెం) 6.60 దేవరుప్పుల (మాధవాపురం) 10.76 స్టేషన్‌ఘన్‌పూర్ (చాగల్) 11.94 జనగామ (సిద్దెంకి) 14.68 కొడకండ్ల 10.47 లింగాల ఘణపురం (జీడికల్) 9.45 నర్మెట (మచ్చుపహాడ్) 7.65 రఘునాథపల్లి (గబ్బెట) 13.19 పాలకుర్తి (వల్మిడి) 11.58 తరిగొప్పుల (అక్కరాజుపల్లి) 13.02 జఫర్‌గఢ్ (సూరారం) 13.85 -
సైబర్ నేరాలపై అవగాహన ఉండాలి
జనగామ రూరల్: సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన ఉండాలని డీసీపీ రాజామహేంద్ర నాయక్ సూచించారు. బుధవారం డీసీపీ కార్యాలయంలో తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో రూపొందించిన సైబర్ జాగృతి దివస్ అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, ఫిషింగ్ లింకులు, అనుమానాస్పద ఫోన్ కాల్స్ సందేశాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఏసీబీ భీంశర్మ, సీఐ సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సేవ సంకల్ప అభియాన్‌లో గడ్డం సమ్మయ్యదేవరుప్పుల: హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించిన సేవ సంకల్ప అభియాన్ సేవాజ్యోతి యాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండలంలోని అప్పిరెడ్డిపల్లెకు చెందిన ప్రముఖ చిందుయక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య హాజరయ్యారు. ఆ కార్యక్రమాన్ని సమ్మయ్య జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట అధ్యక్షుడు రాంచందర్ రావు పాల్గొన్నారు.తండాల్లో విద్యుత్ పనులపై కేంద్ర బృందం తనిఖీపాలకుర్తి టౌన్: మండలంలోని కొండాపురం, పెద్దతండాలో బుధవారం పీఎం జుగ పథకం (ప్రధాన మంత్రి జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్) కింద చేపట్టిన విద్యుత్ పనులను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు పరిశీలించారు. ఆయా తండాల్లో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు, కరెంట్ మీటర్లను తనిఖీ చేసి పనుల పురోగతి ని పరిశీలించారు. విద్యుత్ సదుపాయాల కల్ప నతో తండాల్లో వెలుగులు నింపడంపై తండా వాసులు ఆనందం వ్యక్తం చేశారు. పథకం అమలు తీరును పరిశీలించిన కేంద్ర బృందం, విద్యుత్ మౌలిక వసతుల నాణ్యతను కూడా పరిశీలించింది. కార్యక్రమంలో ఎంఆర్టీ డీఈ కన్స్ట్రక్షన్ విజయ్‌కుమార్, ఏడీఈ స్వామిరెడ్డి, ఏఈ రమేశ్, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. దేశ సంక్షేమం కోసం ప్రధాని మోదీ కృషి జనగామ రూరల్: దేశ సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోదీ కృషి అనిర్వచనీయమని ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతి కిరణ్ అన్నారు. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా 12 ఏళ్లు, ప్రజా జీవి తంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ ఆధ్వర్యంలో కామాక్షి ఫంక్షన్ హాల్లో వికసిత్ భారత్ సంకల్ప సభ నిర్వహించారు. నరేంద్ర మోదీ ప్రసంగం వీక్షించి అనంతరం నెహ్రూ పార్క్ నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు సేవా జ్యోతి యాత్ర నిర్వహించారు. యాత్ర ప్రముఖ్ శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు విద్యాసాగర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, శివరాజ్ యాదవ్, ఉడుకుల రమేశ్, దామోదర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ఉమారాణి అంజిరెడ్డి, నవీన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మారెడ్డి రంగు రాములు, పల్లె కుమార్, వివిధ మోర్చాల అధ్యక్షులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
మహిళలకు ‘ఏఐ–సఖి’పై శిక్షణ
జనగామ: జిల్లా కేంద్రంలో గుడాల ఫ్యామిలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏఐ సఖి కార్యక్రమంలో భాగంగా బుధవారం 30 మంది మహిళలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), వివిధ అప్లికేషన్ల వినియోగంపై శిక్షణ ఇచ్చారు. రెండు రోజుల పాటు జరిగే కార్యక్రమంలో భాగంగా మహిళలకు చిరు వ్యాపారాల అభివృద్ధి, వ్యాపారాలను డిజిటల్‌గా ప్రమోట్ చేసుకునే విధానాలపై అవగాహన కల్పించారు. హైదరాబాద్‌కు చెందిన ఏఐ స్టార్టప్ స్టైకరో ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు, సంస్థ ఫౌండర్ మురారి దుండ్రా, ఏఐ ట్రైనర్ బాలాజీ శిక్షణ ఇచ్చారు. ముగింపు కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బెస్ట్ ఏఐ సఖి అవార్డులు అందజేయనున్నట్లు నిర్వాహకులు కాసాల సంతోష్ కుమార్ తెలిపారు. ఫౌండేషన్ చైర్మన్ గుడాల శ్రీనివాస్, గుడాల వేణు శ్రీధర్ ఉన్నారు. -
తెరమీరితే మసక తప్పదు!
జనగామ: కంటి చూపు మనిషికి ఓ వరం.. రోజువారీ జీవితంలో సెల్‌ఫోన్, కంప్యూటర్, టీవీ వినియోగం పెరగడం, మారుతున్న జీవనశైలి, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యల కారణంగా కంటి ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. మరోవైపు చిన్నారుల్లోనూ దృష్టి లోపాలు గుర్తించబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. కంటి ఆరోగ్యంపై ప్రభుత్వం జనరల్ ఆస్పత్రి నేత్ర వైద్య నిపుణులు అవగాహన కల్పిస్తున్నా రు. ఈనెల 8న (గురువారం) ప్రపంచ దృష్టి దినో త్సవాన్ని నిర్వహిస్తున్నారు. స్క్రీన్ టైమ్‌తో సమస్యలు మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర డిజిటల్ పరికరాలను ఎక్కువసేపు చూడటం వల్ల కళ్లు పొడిబారడం, మంట, దురద, నీరు కారడం, తలనొప్పి, తాత్కాలికంగా చూపు మసకబారడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్నారులు, విద్యార్థులు స్క్రీన్కు ఎక్కువ సమ యం కేటాయించకుండా తల్లిదండ్రులు పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. మధుమేహంతో.. మధుమేహం ఉన్నవారిలో కంటి వెనుక భాగంలోని రెటీనాపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. అందువల్ల మధుమేహ బాధితులు చూపు బాగానే ఉందని నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సూచన మేరకు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలి. కంటి ఒత్తిడి, కంటి శుక్లాలు, రెటీనా సంబంధిత వ్యాధులను సైతం ముందుగానే గుర్తిస్తే చికిత్సతో చూపును కాపాడుకునే అవకాశాలు మెరుగుపడతాయి. చిన్నారుల విషయంలో అప్రమత్తత పిల్లలు పుస్తకం లేదా మొబైల్‌ను కళ్లకు దగ్గరగా పెట్టుకోవడం, తరచూ కళ్లను రుద్దడం, టీవీని దగ్గరగా చూడడం, తరగతి గదిలో బోర్డుపై అక్షరాలు కనిపించకపోవడం వంటి లక్షణాలను తల్లిదండ్రులు గమనించాలి. పాఠశాల స్థాయిలో కంటి పరీక్షలు నిర్వహించి దృష్టి లోపాలను తొలిదశలో గుర్తిస్తే చదువులో వెనుకబడకుండా చూడవచ్చు. నిర్దిష్ట వ్యవధిలో కంటి పరీక్షలు చేయించుకోవాలి. మొబైల్, కంప్యూటర్ వినియోగంలో మధ్యమధ్యలో కళ్లకు విశ్రాంతి ఇవ్వాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. కళ్లను మురికి చేతులతో రుద్దకూడదు. వైద్యుల సూచన లేకుండా కంటి చుక్కలు వాడకూడదు. మధుమేహం, రక్తపోటు ఉన్నవారు కంటి పరీక్షలను నిర్లక్ష్యం చేయకూడదు. డిజిటల్ స్క్రీన్ చూస్తున్నప్పుడు ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 అడుగుల దూరంలోని వస్తువును 20 సెకన్ల పాటు చూడాలి. కంప్యూటర్ స్క్రీన్‌ను కంటి స్థాయి కంటే 15–20 డిగ్రీలు దిగువగా, 50 నుండి 70 సెంటీమీటర్ల దూరంలో అమర్చుకోవాలి. గదిలో వెలుతురు సరిగ్గా ఉండేలా చూసుకో వాలి. స్క్రీన్ గ్లేర్‌ను తగ్గించే ఫిల్టర్లు వాడాలి. వైద్యులు సూచించిన కళ్లద్దాలను క్రమం తప్పకుండా వాడాలి. సరైన దృష్టి సామర్థ్యం పనిలో ఉత్పాదకతను 22శాతం పెంచుతుంది. కంటి ఆరోగ్యంపై నిర్లక్ష్యం వీడాలి స్క్రీన్ టైమ్ తగ్గించుకుంటేనే ‘చూపు’ పదిలం ముందస్తు పరీక్షలతోనే రక్షణ నేడు ప్రపంచ దృష్టి దినోత్సవంకంటి సంబంధిత అనేక వ్యాధులను ప్రారంభ దశలో గుర్తించి చికిత్స అందిస్తే చూపును కాపాడుకోవచ్చు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో కంటి సమస్యలను చిన్నవిగా భావించి వైద్యులను సంప్రదించకపోవడం, అద్దాల అవసరం ఉన్నా వినియోగించకపోవడం వంటి కారణాలతో సమస్యలు తీవ్రమయ్యే అవకాశం ఉంది. చూపు ఉన్నంత వరకు దాని విలువ తెలియకపోవచ్చు. చూపు పోయిన తర్వాత దాని ప్రాధాన్యం తెలుస్తుంది. అందుకే కంటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ముందస్తు పరీక్షలు, సరైన జీవనశైలితో చూపును కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. – డాక్టర్ రాజు, కంటి వైద్య నిపుణులు, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, జనగామ -
విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఉండొద్దు
జనగామ: విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా పంపిణీ ట్రాన్న్స్ఫార్మర్ల నిర్వహణ, విద్యుత్ పరికరాల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని జనగామ నోడల్ అధికారి, ఎస్ఈ(ఎన్పీడీసీఎల్) పి.శ్రీకాంత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జనగామ డివిజన్న్లోని ఎస్పీఎం షెడ్‌ను ఆయన పరిశీలించారు. షెడ్లోని విద్యుత్ పరికరాల నిర్వహణ, పంపిణీ ట్రానన్స్ఫార్మర్లకు సంబంధించిన పనులు, అందుబాటులో ఉన్న సామగ్రిని పరిశీలించి అధికారులతో సమీక్షించారు. రైతులు, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. జనగామ ఎస్ఈ చెరుకు సంపత్‌రెడ్డి, ఆయా విభాగల అధికారులు పాల్గొన్నారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో.. స్టేషన్‌ఘన్‌పూర్: విద్యుత్ వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని జనగామ నోడల్ అధికారి పి.శ్రీకాంత్ అన్నారు. డివిజన్‌కేంద్రంలో నూతనంగా నిర్మాణం చేస్తున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల రిపేర్ షెడ్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఘన్‌పూర్‌లో విద్యుత్ వినియోగం పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని నూతన ఎస్పీఎం షెడ్ నిర్మాణం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ ఎంఆర్టీ డీఈ వినయ్‌కుమార్, ఘన్పూర్ ఆపరేషన్ డీఈ సారయ్య, ఏడీఈ రణధీర్‌రెడ్డి, ఏఈలు శంకర్, శివకుమార్, శ్వేత, సుమన్, లైన్మన్లు పాల్గొన్నారు. జిల్లా నోడల్ అధికారి, ఎస్ఈ(ఎన్పీడీసీఎల్) పి.శ్రీకాంత్ -
జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక
చిల్పూరు: మండలంలోని చిన్నపెండ్యాల ప్రభు త్వ పాఠశాలలో చదివే పొగాకుల సుదీప్తి(8వతరగతి), చేపూరి షర్మిళ (9వతరగతి) జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎం గుడిమల్ల సంపత్‌కుమార్, వ్యాయామ ఉపాధ్యాయుడు రవీంద్ర ప్రసాద్ తెలిపారు. మంగళవారం పాఠశాల ఆవరణలో విద్యార్థుల అభినందన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈనెల 4వ తేదీన జిల్లా కేంద్రంలో నిర్వహించిన నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్స్ట్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్ సెలక్షన్ పోటీల్లో పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి జాతీ య స్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. షర్మిళ 600 మీటర్ల రన్నింగ్, సుదీప్తి 600 మీటర్ల రన్నింగ్, లాంగ్ జంప్ విభాగంలో ఎంపికై నవంబర్ 14 నుంచి 16వ తేదీ వరకు సదా శివపేటలో నిర్వహించే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. సర్పంచ్ తిరుపతమ్మ, ఉప సర్పంచ్ సంతోష్ తదితరులు అభినందించారు. రేపు షూటింగ్‌బాల్ ఎంపిక పోటీలు స్టేషన్‌ఘన్‌పూర్: డివిజన్ కేంద్రంలో జిల్లా స్థాయి షూటింగ్‌బాల్ జూనియర్ బాలుర ఎంపికలు ఈనెల 8వ తేదీన నిర్వహించనున్నట్లు షూటింగ్‌బాల్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ అనీల్‌కుమార్, అధ్యక్షుడు ఇనుగాల యుగేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి అన్నెపు కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 20 సంవత్సరాల వయస్సులోపు క్రీడాకారులు అర్హులని, ఎంపికలకు వచ్చేవారు ఎస్ఎస్సీ మెమో, ఆధార్‌కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. ఎంపికై నవారు ఈనెల 10, 11, 12వ తేదీల్లో మెదక్ జిల్లా తూప్రాన్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. వివరాలకు 90102 55898, 81067 03282 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. సంజయ్‌నగర్ మోడల్ మార్కెట్‌కు వీధి వ్యాపారులుజనగామ: పట్టణంలోని ప్రధాన రహదారులు, ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు నిర్వహిస్తున్న వీధి వ్యాపారులను సంజయ్‌నగర్‌లో నిర్మించిన మోడల్ మార్కెట్‌కు దశల వారీగా తరలించేందుకు చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్‌రెడ్డి మంగళవారం తెలిపారు. పట్టణాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్ద డంతో పాటు ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. సుమారు రూ.7 కోట్ల వ్యయంతో నిర్మించిన సంజయ్‌నగర్ మోడల్ మార్కెట్లో కూరగాయల విక్రయాలకు 50, నాన్న్వెజ్ విక్రయాలకు 65 షాపులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మోడల్ మార్కెట్లో షాపుల కేటాయింపునకు అర్హత కలిగిన వీధి వ్యాపారుల నుంచి ఈ నెల 7 నుంచి 10వ తేదీ వరకు మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. వ్యాపారులు సహకరించి కేటాయించిన షాపుల్లో వ్యాపారాలు నిర్వహించుకోవాలని కోరారు. రైస్ మిల్లుకు సీల్పాలకుర్తి టౌన్: రైస్ మిల్లుల్లో అక్రమాలకు పాల్పడితే మిల్లర్లపై చట్టపరమైన చర్యలతో పాటు, మిల్లులు, సంబంధిత ఆస్తులను రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా ఆదేశాలున్నాయని పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. మండలంలోని వావిలాలలోని అన్నపూర్ణ రైస్‌మిల్లులో అక్రమాలు వెలుగుచూసిన నేపథ్యంలో నిల్వలను స్వాధీనం చేసుకునేందుకు 6–ఏ కేసు నమోదు చేసి, మిల్లును సీల్ చేసినట్లు చెప్పారు. తదుపరి చర్యల కోసం కలెక్టర్ నివేదిక సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తేనే అనుమతులుపాలకుర్తి టౌన్: నిబంధనల ప్రకారం కొత్తగా ఏర్పాటు చేసే అస్పత్రుల్లో రోగులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తేనే అనుమతులు ఇస్తామని డీఎంహెచ్ఓ వి.వాణిశ్రీ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలో కొత్తగా రిజిష్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న ఆస్పత్రులను డీసీహెచ్ఎస్ సంధ్యారాణితో కలిసి డీఎంహెచ్ఓ వాణిశ్రీ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాలకుర్తిలో కొత్తగా రెండు ఆస్పత్రుల ఏర్పాటుకు రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసినట్లు తెలిపారు. ఆస్పత్రుల్లో అన్ని అనుమతులు ఉండేలా యాజమాన్యాలు చేసుకోవాలని సూచించారు. -
భద్రత ప్రశ్నార్థకం!
●సాక్షిప్రతినిధి, వరంగల్: పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు మంచి విద్య, వసతి, భోజనం అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన గురుకులాల్లో వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎలుకల కాటు నుంచి ఆహార కలుషితంతో అస్వస్థత, విద్యార్థుల మధ్య ఘర్షణలు, ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాల ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో తల్లిదండ్రులు కలవరపడుతున్నారు. విస్తృతం ‘గురుకుల’ నెట్వర్క్.. హనుమకొండ, వరంగల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో బీసీ, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల సంస్థలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల పంపిన నివేదిక ప్రకారం ఆయా సొసైటీల జాబితాలను పరిశీలిస్తే పాఠశాలలు, ఇతర రెసిడెన్షియల్ సంస్థలు కలిపి సంఖ్య 61 ఉండగా 24,400 మంది విద్యార్థినీవిద్యార్థులు ఉన్నారు. ఒక్క ఎంజేపీటీ బీసీడబ్ల్యూఆర్ఈఐ పరిధిలోనే ఉమ్మడి వరంగల్ ప్రాంతంలో 31 గురుకులాల్లో 12,400 వరకు విద్యార్థులున్నట్లు ఆ గణాంకాలు చెబుతున్నాయి. గేట్ దగ్గరే తల్లిదండ్రులు.. గురుకులాల్లో చదివే పిల్లలు వారాల తరబడి తల్లిదండ్రులకు దూరంగా ఉంటారు. పిల్లలకు ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే తల్లిదండ్రులకు తెలియదు. కొన్నిచోట్ల తల్లిదండ్రులను లోపలికి అనుమతించకపోవడంతో పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. పిల్లలతో మాట్లాడేందుకు వచ్చిన పేరెంట్స్ గేటు బయటే ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ మొక్కుబడిగా మారడం వల్ల కూడా అనర్థాలకు కారణంగా చెబుతున్నారు. దీంతో లోపల వారి పిల్లలు ఎలా ఉంటున్నారు? భోజనం ఎలా ఉంది? వసతి గదులు, మరుగుదొడ్లు ఎలా ఉన్నాయి? ఎవరైనా వేధిస్తున్నారా? అనారోగ్యంగా ఉన్నారా? అనే ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్పాలి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పిల్లల్ని నమ్మి పంపుతున్నాం.. ‘పిల్లలను నమ్మి గురుకులాలకు పంపుతున్నాం.. మా కళ్లకు దూరంగా ఉన్నా.. అధికారులు, సిబ్బంది పర్యవేక్షణలో భద్రంగా ఉన్నారనే నమ్మకం కల్పించాలి. ఘటన జరిగిన తర్వాత స్పందించడం కాదు.. ఘటన జరగకుండా చూడాలి’ అని హనుమకొండ జిల్లాకు చెందిన గురుకుల పాఠశాలలో చేరిన ఓ విద్యార్థిని తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. ‘గురుకులాల్లో చేర్పించిన పిల్లలందరూ రైతులు, పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే. పిల్లలకు మంచి భవిష్యత్ వస్తుందనే ఆశతో వారిని దూరంగా పంపుతున్నాం. అప్పుడప్పుడు కలెక్టర్లు, ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేస్తున్నా.. నిర్వహణలో మార్పు లేదు. ఇకనైనా జాగ్రత్తలు తీసుకుని పిల్లల భవిష్యత్‌కు భరోసా ఇవ్వాలి’ అని వరంగల్ జిల్లాకు చెందిన పేర్లు చెప్పని ఓ గురుకుల విద్యార్థి తల్లిదండ్రులు కోరుతున్నారు. పాదం కింద ఎలుక కొరికిందని చూపిస్తున్న మహబూబాబాద్ జిల్లా గూడూరులోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలికల పాఠశాల విద్యార్థిని సాయి హర్షిత, నెక్కొండ గురుకుల పాఠశాలలో టీచర్ కొడితే గాయమైందని చూపిస్తున్న విద్యార్థినిపిల్లలను పర్యవేక్షించే వ్యవస్థ ఏం చేస్తోంది? గురుకులాల్లో టీచర్ దాడి, ఎలుకల కాటు, అనారోగ్యం, ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు వరుస ఘటనలతో ఆందోళన చెందుతున్న విద్యార్థులు తల్లిదండ్రులు ఈ ఏడాది కలవరపెట్టిన ఘటనలు కొన్ని ఏప్రిల్ 26 : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నాంచారి మడూరు మహాత్మా జ్యోతిరావుపూలే రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలో మొదటి సంవత్సరం విద్యార్థి రాచర్ల కార్తీక్ మృతి కలకలం రేపింది. కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జూన్ 30 : హనుమకొండ జిల్లా పరకాల మండలం మల్లక్కపేట (నర్సక్కపల్లి) సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో పదో తరగతి విద్యార్థిని ఈకు శ్రీవాణి బాత్రూంలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదం నింపింది. ఆగస్టు 3: వరంగల్ జిల్లా వర్ధన్నపేట గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో సుమారు 27 మంది బాలికలు అస్వస్థతకు గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆహార కలుషితమే కారణమన్న ఆరోపణలపై విచారణ జరిపారు. సెప్టెంబర్7: ములుగు జిల్లా ఏటూరునాగారంలో పారిశుద్ధ్యం, నీటి సమస్యలపై విద్యార్థినులు ఆందోళనకు దిగిన ఘటనలు చోటుచేసుకున్నాయి. మరో ఘటనలో విద్యార్థి నాయకురాలు ముగ్గురు బాలికలను కర్రతో కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. సెప్టెంబర్ 19: హనుమకొండ జిల్లా వంగర పీవీ రంగారావు బాలికల గురుకులంలో చదువుతున్న ఓ విద్యార్థిని సోదరి ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. తిరిగి గురుకులంలో చేర్చుకోవాలనే విషయంలో ప్రిన్సిపాల్ నిరాకరించడంతో తల్లిదండ్రులు ఆందోళనకు దిగడం వివాదాస్పదమైంది. సెప్టెంబర్ 24: జనగామ జిల్లా పాలకుర్తిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో పలువురు విద్యార్థులను ఎలుకలు కరవడం చర్చనీయాంశమైంది. దీంతో అధికారులు బాలికలను ఆస్పత్రికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించినట్లు ప్రకటించారు. అక్టోబర్ 5: వరంగల్ జిల్లా ఖానాపురంలో ఇద్దరు గిరిజన బాలికలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. ఫోన్ ద్వారా వేధింపులే ఘటనకు కారణమన్న ఆరోపణలు వచ్చాయి. అక్టోబర్ 5: మహబూబాబాద్ జిల్లా గూడూరులోని బీసీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో ఐదో తరగతి బాలికను ఎలుక కరిచింది. -
‘స్టేషన్’ కౌన్సిల్ రసాభాస
స్టేషన్‌ఘన్‌పూర్: ఘన్పూర్ మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన అత్యవసర మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా, వాడీవేడిగా జరిగింది. మున్సిపాలిటీ పరిఽధిలో బతుకమ్మ, విజయదశమి పండుగ ఏర్పాట్ల గురించి కమిషనర్ రాధాకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశం ఆద్యంతం రసాభాసగా కొనసాగింది. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన 18వ వార్డు కౌన్సిలర్ పొన్న రవితో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన బూర్ల రాజేశ్వర్, పొన్న రాజేష్, తాటికొండ మధు, బాలగాని అనీల్ పలు అంశాలపై కమిషనర్‌ను, చైర్మన్‌ను నిలదీశారు. మున్సిపల్ సిబ్బందిని కమిషనర్, చైర్మన్ తమ వాహనాలకు డ్రైవర్లుగా నియమించుకోవడంపై ప్రశ్నించారు. ఇప్పటికే సి బ్బంది తక్కువగా ఉండగా, ఉన్న సిబ్బందిని డ్రైవర్లుగా ఎలా నియమించుకుంటారని నిలదీశారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు మాట్లాడుతూ.. ఇటీవల జరి గిన వినాయకచవితి, బోనాలు తదితర పండుగల సమయంలో అత్యవసర సమావేశాలు నిర్వహించకుండా ప్రస్తుతం బతుకమ్మ, దసరా పండుగకు సమావేశం నిర్వహించడంలో ఆంతర్యమేమిటన్నా రు. ప్రతీ నెలా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని, మూడు నెలలకు ఒకసారి జనరల్ బా డీ మీటింగ్ నిర్వహించాలనే నిబంధనలు ఉన్నప్పటికీ ఎందుకు సమావేశాలు ఏర్పాటు చేయడం లేద ని ప్రశ్నించారు. కలెక్టర్ ఆదేశిస్తేనే సమావేశాలు ఏర్పాటు చేస్తారా అంటూ మండిపడ్డారు. ఒక దశలో బీఆర్ఎస్ కౌన్సిలర్ రాజేశ్వర్ మాట్లాడుతుండగా కౌన్సిలర్ బెదిరిస్తున్నారా అంటూ మాట్లాడటంతో వాగ్వాదం జరిగింది. బీఆర్ఎస్ కౌన్సిలర్లకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని, సరైన ప్రోటోకాల్ పాటించడం లేదని మండిపడ్డారు. అభివృద్ధికి అందరూ సహకరించాలి అన్ని వార్డుల అభివృద్ధిక ప్రత్యేక చొరవతో పనిచేస్తానని, పార్టీలకు అతీతంగా అందరూ సహకరించాలని మున్సిపల్ చైర్మన్ వినయ్‌కుమార్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని స్టేషన్‌ఘన్‌పూర్, శివునిపల్లి, ఛాగల్లు గ్రామాల్లో దసరా పండుగకు సజావుగా ఏర్పాట్లు చేసేలా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నీల రాజమ్మగట్టయ్య, ఏఈ అనీల్, మేనేజర్ సత్యనారాయణ, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. అత్యవసర సమావేశంలో కమిషనర్‌తో బీఆర్ఎస్ కౌన్సిలర్ల వాగ్వాదం మున్సిపాలిటీ ఖర్చుల వివరాలను తెలపాలని డిమాండ్ -
ఓటు హక్కు పరిరక్షణకు ఐక్యపోరాటం
జనగామ: ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు రక్షణ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం ఐక్యంగా పోరాడాలని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, టీపీసీసీ ఇన్చార్జ్ సచిన్ సావంత్ పిలుపునిచ్చారు. ‘సేవ్ డెమోక్రసీ వీక్–వోట్ బచావో, దేశ్ బచావో’ కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో భారీ ర్యా లీ నిర్వహించారు. రైల్వేస్టేషన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహం వరకు సాగింది. అనంతరం నాయకులు కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని తమ డిమాండ్లతో కూడి న వినతిపత్రాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు అందజేశారు. జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, వైటీడీఏ మెంబర్, టీపీసీసీ సభ్యుడు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, ఎస్ఎస్ఏ రాష్ట్ర చైర్మన్ గంప వేణుగోపాల్, స్టేషన్ ఘన్పూర్ ఎస్ఐఆర్ ఇన్చార్జి దుద్ధిళ్ల శ్రీనుబాబు, జనగామ మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్) లిబరేషన్, సీపీఐ, టీజేఎస్, సమాజ్‌వాదీ పార్టీ భాగస్వామ్య పక్షాల నాయకులు, కార్యకర్తలతో కలిసి సచిన్ సావంత్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఓటు చోరీకి పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయని, ఓటు హక్కు విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని డి మాండ్ చేశారు. నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. ఓటు హక్కును కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, జిల్లా ఇన్చార్జ్ ఎండీ అబ్బాస్ మాట్లాడుతూ..సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ చేసిన తప్పిదాలకు ప్రజల ఓట్లు తొలగించే పరిస్థితి రావడం దారుణమన్నారు. డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఓటు చోరీ ఆరోపణలపై బీజేపీ ప్రభుత్వం ప్రజ లకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ీకార్యక్రమంలో సీపీఐ నేత సాయన్న, నాయకులు లింగాల జగదీష్ చంద్రరెడ్డి, మోకు కనకారెడ్డి, కొత్త కరుణాకర్‌రెడ్డి, నూకల బాల్‌రెడ్డి, వేమల్ల సత్యనారాయణరెడ్డి, వేముల మల్లేష్, ఇందిర, మాజిద్ అప్సర్, దోర్నాల వెంకటేశ్వర్లు, సిద్ధారెడ్డి, మేడ శ్రీనివాస్, బెలిదె వెంకన్న, మోకు కనకారెడ్డి, రాపర్తి రాజు, అహల్య, బొట్ల శేఖర్, సింగారపు రమేష్, ప్రకాష్, గోపి, విజయేందర్, రమేశ్ పాల్గొన్నారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ సచిన్ సావంత్ ఇండియా కూటమి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత -
కంటిచూపు ఎలా ఉందమ్మా..?
లింగాలఘణపురం: ‘కంటి చూపు ఎలా ఉందమ్మా..? కంటిపై పొర ఏర్పడినట్లు ఉంది..మంచిగా కనిపిస్తుందా..’ అంటూ మండలంలోని వడిచర్ల పాఠశాలలో పనిచేసే స్కావెంజర్ జోగు ఎల్లమ్మను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అడిగి తెలుసుకున్నారు. మంగళవారం పాఠశాలను ఆకస్మిక తని ఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సంఖ్య, తరగతి గదుల పరిశీలన, మధ్యాహ్న భోజన సరకుల నాణ్యత, ఉపాధ్యాయుల బోధన, విద్యార్థుల అభ్యసన సామర్థ్యం తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలో రోజువారీ వేతనంతో పని చేసే ఎల్లమ్మ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. పాఠశాలలో కుర్చీలు తక్కువగా ఉన్నాయని దృష్టికి తేగా 15 బెంచీలు తెప్పిస్తానని చెప్పారు. ఎంఈఓ విష్ణుమూర్తికి చెప్పడంతో నేలపోగులలో అదనంగా ఉన్న బెంచీల ను తెప్పించారు. కలెక్టర్‌తో పాటు సర్పంచ్ కార్తీక్, హెడ్మాస్టర్ సరిత, ఉపాధ్యాయులు ఉన్నారు. వృద్ధురాలిని ఆరా తీసిన కలెక్టర్ -
ఆర్టీసీలో హోరాహోరీ!
జనగామ: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో కార్మిక సంఘాల ఎన్నికల సందడి ఊపందుకుంది. రెండు జేఏసీలు బరిలో నిలవడంతో పోటీ రసవత్తరంగా మారింది. 400 మంది కార్మికుల ఓట్లే ఫలితాన్ని నిర్ణయించనున్న నేపథ్యంలో నాయకులు ఒక్కో ఓటరును కలిసి మద్దతు కోరుతున్నారు. ప్రచారం, హామీలు, వ్యూహాలతో డిపో పరిసరాలు కోలాహలంగా మారాయి. ఎన్నికల సందడి.. ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికల నేపథ్యంలో డిపోలో సందడి నెలకొంది. సుదీర్ఘ విరామం తర్వాత యూనియన్లకు ఎన్నికలు నిర్వహిస్తుండటంతో కార్మిక సంఘాలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. డిపో పరిధిలో ప్రధానంగా రెండు జేఏసీల మధ్య పోటీ నెలకొంది. ఒకవైపు ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ), నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ), తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) కలిసి జేఏసీగా ఏర్పడి బరిలో నిలిచాయి. మరోవైపు తెలంగాణ వర్కర్స్ యూనియన్ (టీడబ్ల్యూయూ), స్టేట్ వర్కర్ యూనియన్ (ఎస్‌డబ్ల్యూయూ) కలిసి జేఏసీగా పోటీ చేస్తున్నాయి. ఓటర్లే కీలకం డిపో పరిధిలో మొత్తం 400 ఓట్లు ఉండగా.. ఈ ఓట్లే రెండు వర్గాల భవితవ్యాన్ని తేల్చనున్నాయి. ఈయూ జేఏసీ తరఫున సెక్రటరీగా వి.ఎస్.ఆర్.రెడ్డి, అధ్యక్షుడిగా ఎ.శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎం.బాలరాజు పోటీ చేస్తున్నారు. టీడబ్ల్యూయూ జేఏసీ తరఫున సెక్రటరీగా ఎల్.ఎల్.పతి, అధ్యక్షుడిగా ఎం.బి.కె.రెడ్డి, రాష్ట్ర కార్యదర్శిగా గిరిమల్ల రాజు, డిపో చైర్మన్‌గా కుర్ర సురేందర్ బరిలో ఉన్నారు. ఓటు కోసం ముమ్మర ప్రచారం ఎన్నికలకు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రచారం ఊపందుకుంది. గత కొద్ది రోజులుగా ఇరు వర్గాల నాయకులు డిపో ప్రధాన గేటు వద్ద ప్రచారం నిర్వహించడంతోపాటు ప్రతీ కార్మికుడిని వ్యక్తిగతంగా కలిసి మద్దతు కోరుతున్నారు. తమ సంఘాన్ని గెలిపిస్తే కార్మికుల సమస్యల పరిష్కారానికి ఏం చేస్తారు.. ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనాలు కల్పిస్తారు.. గతంలో సంఘం చేసిన కార్యక్రమాలేమిటి వంటి అంశాలను వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత వైభవం కోసం పోటీ గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీలో కార్మిక సంఘాల కార్యకలాపాలు నిలిచిపోవడంతో సుదీర్ఘకా లం తర్వాత మళ్లీ యూనియన్ల పునరుద్ధరణ, వెంటనే ఎన్నికలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో కార్మిక సంఘాలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. గతంలో తమకున్న ప్రాధాన్యాన్ని తిరిగి సాధించడంతోపాటు కార్మికుల సమస్యలపై బలమైన వాణి వినిపించేందుకు ఎన్నికల్లో గెలుపు అవసరమని భావిస్తున్నాయి. 9న పోలింగ్.. అదే రోజు ఫలితం ఈ నెల 9న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసిన ఇరువర్గాలు ప్రతి ఓటరును కలిసి తమ గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నాయి. ఆర్టీసీ డిపో ఎదుట ప్రచారం చేస్తున్న ఈయూ కార్మిక సంఘం నాయకులుటీడబ్ల్యూయూ కూటమి శిబిరంలో మున్సిపల్ చైర్పర్సన్ బాలమణి, కౌన్సిలర్ కరుణాకర్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు వెంకన్న తదితరులురాజకీయ రంగు ఆర్టీసీ యూనియన్న ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు సైతం ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వాములు కావడంతో పోటీ మరింత వేడెక్కింది. ప్రచార తీరు స్థానిక సంస్థల ఎన్నికలను తలపిస్తోంది. ఎలాగైనా పట్టు సాధించి విజయం సాధించాలని ఇరువర్గాలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ చివరి నిమిషం వరకు ఒక్క ఓటును కూడా వదులుకోకుండా ప్రచారం సాగిస్తున్నాయి.ఊపందుకున్న కార్మిక సంఘాల ఎన్నికల పోరు జనగామ డిపోలో ఈయూ వర్సెస్ టీడబ్ల్యూయూ జేఏసీగా బరిలో నిలిచిన సంఘాలు యూనియన్ పగ్గాల కోసం జోరు ప్రచారం 9న పోలింగ్.. అదే రోజు కౌంటింగ్ -
తేమ ఉన్నా తగ్గేదేలే!
జనగామ: ధాన్యం మార్కెట్లో ఈసారి సీన్ మారింది..వానాకాలం పంట అడుగుపెట్టగానే ధర పరుగులు పెడుతోంది. తేమ 30–40 శాతం ఉన్న సాధారణ రకం ధాన్యానికీ క్వింటాల్‌కు రూ.2,400కుపైగా ధర పలుకుతుండగా, మద్దతు ధరను మించి ప్రైవేట్ కొనుగోళ్లు సాగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 5 వేలకుపైగా బస్తాలు మార్కెట్‌కు చేరడం డిమాండ్‌కు అద్దం పడుతోంది. వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంతో గత సీజన్లో దిగుబడులు తగ్గడం, రానున్న వానాకాలం సీజన్లోనూ దిగుబడి తగ్గే అవకాశాల నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ధాన్యానికి డిమాండ్ పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. గతేడాది రూ.1,600.. గతేడాది ఇదే సమయంలో 30 నుంచి 40 శాతం తేమ ఉన్న ధాన్యానికి క్వింటాల్‌కు రూ.1,600 నుంచి రూ.1,750 వరకు మాత్రమే ధర లభించింది. ప్రస్తుతం అదే స్థాయిలో తేమ ఉన్న ధాన్యానికి రూ.2,300 నుంచి రూ.2,450లకు పైగా ధర పలు కుతోంది. ప్రభుత్వం తాజాగా పెంచిన మద్దతు ధర ప్రకారం ఏ–గ్రేడ్ ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,461, కామన్ రకానికి రూ.2,441గా నిర్ణయించింది. అయితే జనగామ మార్కెట్లో ప్రైవేట్ కొనుగోళ్లలో ఈ ధరను మించి కొనుగోళ్లు జరుగుతున్నాయి. సోమవారం ప్రైవేట్‌గా అత్యధికంగా క్వింటాల్‌కు రూ.2,473 ధర పలికింది. మోడల్ ధర రూ.2,021గా నమోదైంది. మిల్లర్ల కొనుగోళ్లతో పోటీ రైస్ మిల్లులపై ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అధికారులు నిరంతర తనిఖీలు నిర్వహిస్తుండటంతో సీఎంఆర్ ధాన్యం విషయంలో మిల్లర్లు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వం కేటాయించిన ధాన్యంలో షార్టేజ్ ఏర్పడితే దాన్ని భర్తీ చేసేందుకు మిల్లర్లు ప్రస్తుతం మార్కెట్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కాకినాడ ఎగుమతులకు డిమాండ్ పెరగడంతో గతంలో క్వింటాల్‌కు రూ.2,800గా ఉన్న ధర ప్రస్తుతం రూ.3,300కు చేరినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. ఈ పరిణామాలన్నీ ధాన్యం ధర పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి. దీంతో పాటు పరం, తవుడు, ఉనుక ధరలు సైతం అమాంతం పెరగడంతో ఈసారి ధాన్యానికి ఇదే ధరలు కొనసాగే అవకాశం ఉందని భావిస్తున్నారు. పొరుగు జిల్లాల నుంచి వ్యాపారులు మార్కెట్లో ధరలు ఆశాజనకంగా ఉండటంతో సూర్యాపేట, తిరుమలగిరి, భువనగిరి, సిద్దిపేట తదితర ప్రాంతాల వ్యాపారులు కూడా ఇక్కడికి వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. దీంతో మార్కెట్లో కొనుగోళ్లకు పోటీ పెరిగింది. రైతుల్లో పెరిగిన ఆశలు 30–40 శాతం తేమ ఉన్నప్పటికీ రూ.2,400కుపైగా ధర లభించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఊహించిన దానికంటే ధర ఎక్కువగా రావడంతో చుట్టుపక్కల ప్రాంతాల రైతులు కూడా జనగామ మార్కెట్‌కు ధాన్యం తరలించే అవకాశం ఉంది. ప్రస్తుత డిమాండ్ కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. వానాకాలం ధాన్యానికి ఫుల్ గిరాకీ జిల్లా వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్ ధర రూ.2,400 పైనే! మద్దతు ధరను మించి వస్తుండడంతో రైతుల హర్షం సీఎంఆర్ షార్టేజీ భర్తీకి మిల్లర్ల పోటీ కొనుగోళ్లు..? ఎగుమతులతో ఊపందుకున్న ధాన్యం ధరలుఊహించని ధర వచ్చింది.. ప్రభుత్వ మద్దతు కంటే ప్రైవేట్ మార్కెట్లో ధాన్యానికి ఊహించిన దాని కంటే ధర బాగా వచ్చింది. మూడు ఎకరాల్లో వరి సాగు చేయగా, రూ.75వేల వరకు పెట్టుబడికి ఖర్చు చేసిన. 175 బస్తాల వరకు దిగుబడి రాగా, క్వింటాల్ ధర రూ.2,453 ధర వచ్చింది. –పి.శ్రీనివాసరెడ్డి, రైతు, కళ్లెంధరలో రికార్డు..ధాన్యం ధరలో వ్యవసాయ మార్కెట్ రికార్డు సృష్టించింది. క్వింటాల్ ధాన్యం రూ.2,473, రూ.2,453, రూ.2,021 ధరలు పలికాయి. రైతులకు మంచి ధర రావడంతో పాటు ఎక్కడా కూడా నష్టం జరగకుండా మార్కెట్ అధికారులు, సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. –బనుక శివరాజ్ యాదవ్, ఏఎంసీ చైర్మన్ -
ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
● కలెక్టరేట్లో హెల్ప్‌డెస్క్ ● కలెక్టర్ సందీప్ కుమార్ ఝాజనగామ రూరల్: వానాకాలం 2026–27 సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి సంబంధిత అధికారులతో ధాన్యం సేకరణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో సుమారు 202 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. రైతుల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయనున్నట్టు 1800–425–6605 టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రతీ కొనుగోలు కేంద్రంలో ట్రక్ షీట్ నిర్వహణ తప్పనిసరి అని స్పష్టం చేశారు. సమావేశంలో డీఆర్డీఓ భాస్కర్, జిల్లా సివిల్ సప్లై అధికారి సురేష్ రెడ్డి, డీఎం సివిల్ సప్లై హతీరామ్, డీసీఓ కరుణ, ఎల్డీఎం ప్రతిభ, తూనికలు కొలతల శాఖ అధికారి ఝాన్సీ, రవాణా, రెవెన్యూ, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు.. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణాల పురోగతి, రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపునకు సంబంధించిన ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ, పెండింగ్ దరఖాస్తులపై అదనపు కలెక్టర్ బెన్షామ్తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ.. పాలకుర్తి, జనగామ నియోజకవర్గాల్లో పెండింగ్‌లో ఉన్న ఇళ్ల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అన్ని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం మాత్రమే దరఖాస్తులను ఆమోదించడం తిరస్కరించడం చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో హౌజింగ్ పీడీ బలరామరావు, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి, ఎంపీడీఓలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
కడుపులో బిడ్డ.. కత్తెర కోత!
సాక్షి ప్రతినిధి, వరంగల్: కడుపులోని బిడ్డ బయటికి రావాలంటే కోత తప్పడం లేదు. గర్భిణులకు ఒకప్పుడు సుఖ ప్రసవం (నార్మల్ డెలివరీ) జరిగేది. కానీ, నేడు సహజ ప్రసవాల స్థానంలో సిజేరియన్ సంఖ్య గణ నీయంగా పెరిగింది. ఉమ్మడి వరంగల్‌లోని పలు జిల్లాల్లో ప్రతీ పది ప్రసవాల్లో ఏడుకు పైగా సిజేరియన్లే నమోదవుతున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈ వాటా ఏకంగా 80శాతం దాటగా, వరంగల్ 89.6, జనగామ 89.5 శాతంతో సెంచరీ మార్కుకు చేరువగా ఉన్నాయి. మిగిలిన నాలుగు జిల్లాల్లోనూ ఈ వాటా 80 శాతానికి పైగానే ఉంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే–6 (2023–24) గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. నాలుగు జిల్లాల్లో 70 శాతం పైనే!.. సీ–సెక్షన్ల (సిజేరియన్లు) వాటా ఉమ్మడి వరంగల్ నాలుగు జిల్లాల్లో 70 శాతాన్ని దాటింది. హనుమకొండ జిల్లా 74.1 శాతంతో ముందంజలో ఉండగా.. జయశంకర్ భూపాలపల్లి 70.4 శాతం, జనగామ 70.2 శాతం, మహబూబాబాద్ 70.1 శాతం నమోదయ్యాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా కనిపిస్తోంది. ఉమ్మడి వరంగల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్ల వాటా 80 శాతాన్ని దాటింది. జనగామ, వరంగల్ జిల్లాల్లో ఈ వాటా దాదాపు 90 శాతానికి చేరువైంది. జనగామలో 89.5 శాతం, వరంగల్‌లో 89.6 శాతం నమోదైంది. మహబూబాబాద్‌లో 87.5 శాతం, హనుమకొండలో 82.7 శాతం, భూపాలపల్లిలో 82.6 శాతం, ములుగులో 81.9 శాతం ఉన్నాయి. అంటే ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరిగే ప్రతీ పది ప్రసవాల్లో ఎనిమిదికి పైగా సీ–సెక్షన్లే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కాగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సహజ ప్రసవాల వాటా ప్రైవేట్‌తో పోలిస్తే ఎక్కువగా ఉన్నప్పటికీ.. సీ–సెక్షన్ల శాతం మాత్రం గణనీయంగానే ఉంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ కొన్ని జిల్లాల్లో ప్రతీ పది ప్రసవాల్లో ఆరు వరకు సిజేరియన్లు నమోదవుతున్నాయి. ప్రసవాలన్నీ దవాఖానాల్లోనే.. హనుమకొండలో ఆస్పత్రి ప్రసవాలు 100 శాతం నమోదయ్యాయి. అంటే ప్రసవాల కోసం ఆస్పత్రులను ఆశ్రయించే పరిస్థితి పూర్తిగా ఏర్పడినప్పటికీ.. అదే సమయంలో సిజేరియన్ల వాటా 74.1 శాతానికి చేరడం ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అంశంగా మారింది. ఆస్పత్రి ప్రసవాల పెరుగుదల తల్లి, శిశువుల భద్రతకు అనుకూలమైన పరిణామమే. గర్భిణులకు ప్రసవానికి ముందునుంచే సుఖ ప్రసవం, సిజేరియన్ అవసరం అయ్యే పరిస్థితులు, ప్రసవ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పష్టమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.ఉమ్మడి జిల్లాలో ప్రతీ పది ప్రసవాల్లో ఏడూ సీ–సెక్షన్లే సహజ ప్రసవాల (నార్మల్ డెలివరీ)కు ససేమిరా..! ప్రసవాలన్నీ ఆస్పత్రుల్లోనే.. అయినా పెరుగుతున్న ఆపరేషన్ల వాటా.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో 80శాతానికి పైనే.. ప్రభుత్వ దవాఖానాల్లో 40–64 శాతం నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే–6 (2023–24) గణాంకాలు వెల్లడి -
మార్కెట్ యార్డు కమాన్ గేట్ ఓపెన్
జనగామ: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు వచ్చే ముఖద్వారం (కమాన్ గేట్) సోమవారం అధికారికంగా తెరుచుకుంది. కొన్ని సంవత్సరాల క్రితం వాస్తు మార్పుల నేపథ్యంలో అప్పటి పాలకవర్గం ఈ గేట్‌ను మూసివేసింది. దీంతో మార్కెట్‌కు వచ్చే రైతులు, వ్యాపారులు, ప్రజలకు ఇబ్బందులు పడేవారు. ఈ నేపథ్యంలో వారి సౌకర్యార్థం కమాన్ గేట్‌ను తిరిగి తెరవాలని కోరుతూ పలు వురు విజ్ఞప్తి చేశారు. మార్కెట్‌కు ముఖద్వారం ప్రాధాన్యంపై పండితుల సూచనలు తీసుకున్న అనంతరం గేట్‌ను తెరిపించినట్లు ఏఎంసీ చైర్మ న్ బనుక శివరాజ్‌యాదవ్ తెలిపారు. అధికారికంగా గేట్ సేవలు అందుబాటులోకి రావడంతో మార్కెట్‌కు వచ్చే రైతులు, వ్యాపారులకు రాకపోకల ఇబ్బందులు తొలగిపోయాయి. ‘ఆర్టీసీ ఎన్నికల్లో టీడబ్ల్యూయూ జెండా ఎగురవేయాలి’ జనగామ రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల9వ తేదీన ఆర్టీసీలో నిర్వహించనున్న యూనియన్ ఎన్నికల్లో టీడబ్ల్యూయూ(తెలంగాణ వర్కర్స్ యూనియన్) జెండా ఎగురవేయాలని యూని యన్ రాష్ట్ర కార్యదర్శి ఎంబీకే రెడ్డి అన్నారు. సోమవారం కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎంప్లాయీస్ యూనియన్ నుంచి టీడబ్ల్యూయూలోకి పలువురు నాయకులు, కార్మికులు చేరారు. మున్సిపల్ చైర్పర్సన్ బాలమణి, కౌన్సిలర్లు లోకమంతరెడ్డి, కరుణాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ‘ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు భూములివ్వం’ స్టేషన్‌ఘన్‌పూర్: ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు భూములను ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదని నష్కల్, వంగాలపల్లి గ్రామాల రైతులు అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు భూములు ఇవ్వమని స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదు ట సోమవారం వారు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ చిల్పూ రు మండలం నష్కల్, వంగాలపల్లి గ్రామాల సర్వే నంబర్ 143లోని భూములను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు ఇవ్వబోమన్నారు. ప్రతీ దళితుడి భూమికి పట్టాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి దళితుల భూములను లాక్కోవడం అమానుషమన్నారు. ఈ యూనిట్‌తో 90 మంది రైతుల కటుంబాలు రోడ్డున పడతామ ని, అలా జరిగితే ఆత్మహత్యలే శరణమన్నారు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని రైతులు కోరారు. బీజేపీ మండల అధ్యక్షుడు గంటె ఉపేందర్‌యాదవ్, రైతులు గంటె చంద్రుడు, శాగంటి అనీల్, దాసు పాల్గొన్నారు. మై ట్యాక్సీ సేఫ్ యాప్ ఆవిష్కరణ కాజీపేట: ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షిత ప్రయాణానికి ఆటోడ్రైవర్లు, పోలీసులకు సహకరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత అన్నారు. కాజీపేట ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో సోమవారం ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో చేపట్టిన ఆటో ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ‘అభయ మై టాక్సీ సేఫ్’ యాప్‌ను సీపీ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నగరంలో దాదాపు 12వేల ఆటోలకు క్యూ ఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ నంబర్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తామంటూ ఆటోడ్రైవర్లతో సీపీ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీసీపీ దార కవిత, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ రాయల ప్రభాకర్‌రావు, ఏసీపీ టి.సత్యనారాయణ, సీఐలు పిట్టల వెంకన్న, జక్కుల శ్యాంసుందర్, ఎస్సైలు మంగ, శ్రావణ్ సిబ్బంది పాల్గొన్నారు. -
సత్వరమే పరిష్కరించాలి
● ప్రజావాణి అర్జీలను పెండింగ్‌లో ఉంచొద్దు ● అధికారులకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశం ● ప్రజల నుంచి 405 దరఖాస్తుల స్వీకరణ జనగామ రూరల్: కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలివచ్చి తమ గోడును వినిపించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి 405 అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. ప్రజా సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలని, పెండింగ్‌లో లేకుండా దరఖాస్తులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. కాగా, అర్జీల్లో ఎక్కువగా ఇందిరమ్మ ఇళ్లు, భూ సమస్యలు, పెన్షన్లవే ఉన్నాయి. ప్రజావాణిలో జెడ్పీ సీఈఓ బలరామరావు, డీఆర్డీఓ భాస్కర్, సీపీఓ చిన కోట్యా నాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల్లో కొన్ని ఇలా.. ● జఫర్‌గఢ్ మండలం హిమ్మత్‌నగర్ గ్రామానికి చెందిన సీహెచ్.అనిత, తనకు పెంకుటిల్లు ఉండగా అది కూలిపోయిందని, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద గుర్తించి, ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని దరఖాస్తు చేసుకున్నారు. ● లింగాల ఘణపురం మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన బండ్రు సారమ్మ, తనకు మూడు ఎకరాల భూమి ఉందని, అందులోని 16 గుంటల భూమి రికార్డుల్లోకి ఎక్కలేదని, ఆ భూమిని రికార్డులోకి ఎక్కించి, పట్టా ఇప్పించగలరని దరఖాస్తు చేసుకున్నారు. ● బచ్చన్నపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన రవీందర్ రెడ్డి, సదాశివపేట, నారాయణపురం మధ్యలో కాలువ తెగిపోయిందని వ్యవసాయ పనులకు ఇబ్బందులు పడుతున్నామని కాలువ మరమ్మతులు చేయాలని కలెక్టర్‌ను కోరారు. ● స్టేషన్ ఘన్పూర్ మండలానికి చెందిన రేష్మా, తన పెంకుటిల్లు కూలిపోయే దశలో ఉందని ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పేద కుటుంబానికి చెందినదని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. -
మక్కలదీ అదే దారి..
జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,410 ఉండగా, సోమవారం మార్కెట్లో గరిష్టంగా రూ.2,452 ధర పలికింది. మోడల్ ప్రైస్ రూ.2,275గా నమోదైంది. పది రోజులుగా మార్కెట్‌కు మొక్కజొన్నలు వస్తుండగా, ఊహించిన విధంగానే ధరలు పెరుగుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోళ్ల పరిశ్రమలతో పాటు ఇతర అవసరాలకు మొక్కజొన్నకు డిమాండ్ పెరగడం, దిగుబడి అంతంత మాత్రంగానే ఉండడంతో ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం లభిస్తున్న ధరకు అదనంగా క్వింటాల్‌కు మరో రూ.100 పెంచి ఇస్తే బాగుంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. ధర సంతోషం కలిగించింది.. మూడెకరాలు సాగు చేసిన. రూ.30వేల వరకు పెట్టుబడులు ఖర్చు చేసిన. వర్షాభావ పరిస్థితులతో రెండెకరాలు పూర్తిగా ఎండిపోయింది. ఒక ఎకరం పంటను రెక్కలు ముక్కలు చేసుకుని కాపాడిన. 42 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. రూ. 2,425 ధర పలికింది. ఇంత ధర వస్తదనుకోలేదు. –ముసుకు కుమారస్వామి, రైతు, అయ్యంగార్పల్లి, పాలకుర్తి● -
వైభవంగా అమ్మవారి దివ్య ఆగమనం
జనగామ: పట్టణంలోని శ్రీ విల్లాస్ కాలనీలో దేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం ‘అమ్మవారి దివ్య ఆగమనం’ పేరిట ఆధ్యాత్మిక వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేమళ్ల అభిలాష్‌రెడ్డి(టీం ఆఫ్ శ్రీ విల్లాస్ కాలనీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఆలయాన్ని తలపించేలా ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్టింగ్‌లో అమ్మవారికి అంగరంగ వైభవంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, వైటీడీఏ మెంబర్ డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, మాజీ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ వేముల సత్యనారాయణరెడ్డి, కంచ రాములు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆర్టీసీ చౌరస్తా మీదుగా శ్రీ విల్లాస్ కాలనీకి చేరుకున్న శోభాయాత్రతో పట్టణంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఆగమన శోభాయాత్రను తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు మణిరాజ్, మణిదీప్, రమేశ్, వరుణ్, వేముల అభిలాష్‌రెడ్డి, సత్యకుమార్, శ్రీనివాస్ రెడ్డి, విఠల్, శేఖర్, సాత్విక్ తదితరులు పాల్గొన్నారు. -
లెవీ ధాన్యం పక్కదారి
● ధాన్యం నిల్వల్లో తేడాలు.. ● అధికారుల స్వాధీనంలోకి రైస్మిల్లుపాలకుర్తి టౌన్: మండలంలోని వావిలాల అన్నపూర్ణ రైస్ మిల్లులో లెవీ ధాన్యం నిల్వల్లో వ్యత్యాసాలను గుర్తించడంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఆగస్టులో విజిలెన్స్ బృందం నిర్వహించిన తనిఖీలో మిల్లులో ఉండాల్సిన ధాన్యం, వాస్తవ నిల్వలో తేడా బయటపడింది. అనంతరం ఫిజికల్ రీ–వెరిఫికేషన్ నిర్వహించి ధాన్యం పక్కదారి పట్టినట్లు నిర్ధారించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో సోమవారం పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘనందన్, తహసీల్దార్ ఎస్.సరస్వతితో కలిసి పంచనామా నిర్వహించారు. అనంతరం మిల్లును తహసీల్దార్ ఆధీ నంలోకి అప్పగించారు. అక్రమాలపై చర్యలు తీసుకున్న అధికారులను వావిలాల రైతులు అభినందించారు. ఆర్ఐ రాకేశ్, సిబ్బంది పాల్గొన్నారు. -
మైనింగ్ ఆపండి.. రామప్పను కాపాడండి!
● కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి కేహెచ్‌టీ వినతిపత్రం ● ‘రామప్ప’ పరిరక్షణకు ప్రజా ఉద్యమం ● 5 కిలోమీటర్ల దూరంలో 300 మీటర్ల లోతైన ఓపెన్‌కాస్ట్ ● చెరువుపై ‘హైడ్రాలిక్ గ్రేడియంట్’ ప్రభావంపై ఆందోళనసాక్షిప్రతినిధి, వరంగల్: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, చారిత్రక రామప్ప చెరువుకు సింగరేణి ప్రతిపాదిత ఓపెన్‌కాస్ట్ బొగ్గుగనితో పొంచిఉన్న ముప్పుపై పౌరులు, పౌరస్పందన వేదికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ‘మైనింగ్ ఆపండి, రామప్పను కాపాడండి’ నినాదంతో ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుడుతున్నాయి. ఓపెన్‌కాస్ట్ బొగ్గుగని వల్ల ముప్పు పొంచి ఉందని, ఆ ప్రాజెక్టును ఉపసంహరించుకోవాలని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డిని కలిసి కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ (కేహెచ్‌టీ) వినతిపత్రం సమర్పించింది. ఈ మేరకు ట్రస్టీ ప్రొఫెసర్ ఎం.పాండురంగారావు, వరంగల్ నగర మాజీ మేయర్ టి.రాజేశ్వర్‌రావు, మండల పరశురాములు తదితరులు ఆదివారం ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు. 3 టీఎంసీల చెరువుపై ప్రభావం? ములుగు జిల్లా వెంకటాపూర్ గ్రామం వద్ద సింగరేణి ప్రతిపాదించిన పీవీ నరసింహారావు ఓపెన్‌కాస్ట్ మైన్ రామప్ప చెరువు, దేవాలయానికి దిగువ వైపున సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉందని వినతిపత్రంలో పేర్కొన్నారు. గనిని సుమారు 300 మీటర్ల లోతు వరకు తవ్వే ప్రతిపాదన ఉందని తెలిపారు. పీవీఎన్ఆర్ ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు రామప్పకు సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉందని పేర్కొన్న తాజా అధ్యయనాలు కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 3 టీఎంసీల నీటిని నిల్వచేసి దాదాపు 30 వేల ఎకరాలకు సాగునీరు అందించే రామప్ప చెరువుకు ముప్పు పొంచి ఉందని తెలిపారు. చెరువు కింద భాగంలో 300 మీటర్ల లోతైన గని తవ్వితే భూగర్భజలాల ప్రవాహంలో మార్పులు, లీకేజీ వేగం పెరిగే అవకాశం ఉందని, దీనిపై జీఎస్ఐ నివేదికలోని పరిశీలనలను ఉటంకించిందని కేహెచ్‌టీ బాధ్యులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. బ్లాస్టింగ్ వల్ల రామప్ప ఆలయం ఇప్పటికే ఫ్లోర్ బీముల్లో పగుళ్లు, డిఫరెన్షియల్ సెటిల్మెంట్ వంటి సమస్యలను ఎదుర్కొంటోందని పేర్కొంది. అధికార యంత్రాంగం నో అన్నా.. పీవీఎన్ఆర్ ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు ఇంకా ప్రతిపాదిత దశలోనే ఉంది. 2021లో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన నిపుణుల కమిటీ ప్రాజెక్టుకు టరమ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్) మంజూరుకు సిఫారసు చేసింది. 2026 సెప్టెంబర్‌లో రామప్పపై ప్రభావాన్ని అంచనా వేసేందుకు శాసీ్త్రయ, పర్యావరణ అధ్యయనాలు పూర్తయ్యే వరకు ముందుకు వెళ్లరాదనే అభిప్రాయాన్ని ములుగు జిల్లా యంత్రాంగం వ్యక్తం చేసింది. ఇటీవల పాలంపేట ప్రత్యేక అభివృద్ధి సంస్థ సమావేశంలో కూడా ప్రాజెక్టు ప్రభావంపై సమగ్ర పరిశీలన, శాసీ్త్రయ అధ్యయనాల అవసరాన్ని చర్చించారు. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ)పై తుది నిర్ణయం అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేసినట్లు నివేదికలు వెల్లడించినా సింగరేణి ముందుకు సాగడంపై కేహెచ్‌టీ ఆధ్వర్యంలో కేంద్రమంత్రికి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశం అవుతోంది. -
హిమం నుంచి సాగరం వరకు..
సాక్షిప్రతినిధి, వరంగల్: ‘హిమం’ అంటే చలి.. మంచు.. కశ్మీర్ గుర్తొస్తుంది. ‘సాగరం’ అంటే సముద్రం.. కన్యాకుమారి గుర్తుకొస్తుంది. ఈ రెండు భిన్న భౌగోళిక ప్రపంచాలను ఒకే రైలు పట్టాలపై కలిపితే అదే హిమసాగర్ ఎక్స్‌ప్రెస్. దేశంలోని ఒక చివర నుంచి మరో చివర వరకు ప్రజలను తీసుకెళ్తున్న ఈ సుదూర రైలు 1984 అక్టోబర్ 3న తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అప్పట్లో జమ్ముతావి–కన్యాకుమారి మధ్య నడిచిన ఈ రైలు.. ఆ తర్వాత దేశంలోనే అత్యంత దూరం నడిచే రైళ్లలో ఒకటిగా నిలిచింది. 2015లో జమ్ముతావి బదులు శ్రీమాతా వైష్ణోదేవి కాట్రా వరకు పొడిగించారు. ఇప్పుడు ఈ రైలుకు 42 ఏళ్లు. ఉత్తరం నుంచి దక్షిణం వరకు ప్రయాణికులను మోస్తున్న ఈ రైలు ప్రస్తుతం భార త రైల్వేలో మూడో అత్యంత సుదూర రైలు సర్వీసుగా కొనసాగుతోంది. 3,790 కి.మీ. దూరాన్ని 70 గంటల ప్రయాణంలో కవర్ చేస్తోంది. వరంగల్‌కు ప్రత్యేకమైన అనుబంధం హిమసాగర్ ప్రయాణంలో ఉమ్మడి వరంగల్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రైలు తెలంగాణలో రామగుండం, వరంగల్, ఖమ్మం స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. వరంగల్‌లో ఒక నిమిషం, ఖమ్మంలో మరో నిమిషం మాత్రమే ఆగుతుంది. రైలు వరంగల్ స్టేషన్‌కు చేరుకునే సమయం సుమారు 16:09 గంటలు కాగా.. 16:10కే బయలుదేరుతుంది. అంటే ప్రయాణికుడు రైలు ఎక్కడానికి, దిగడానికి కూడా గడియారం క న్నా వేగంగా నిర్ణ యం తీసుకోవాల్సిందే అన్నమాట. కాగా, హిమసాగర్ ఎక్స్‌ప్రెస్‌కు కాజీపేటలో స్టాప్ లేదు. ‘కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కనెక్టివిటీ ఉంది. కాజీపేట నుంచి హిమసాగర్కు మాత్రం కనెక్షన్ లేదు’ అంటూ రైల్వే ప్రయాణికులు సరదాగా వ్యాఖ్యానించే పరిస్థితి. 12 రాష్ట్రాల మీదుగా.. హిమసాగర్ ఎక్స్‌ప్రెస్ దేశ భౌగోళిక వైవిధ్యానికి ఒక కదిలే అద్దం. జమ్మూకశ్మీర్ నుంచి ప్రారంభమై పంజాబ్, హరియాణా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు మీదుగా ప్రయాణిస్తుంది. 12 రాష్ట్రాల మీదుగా సాగుతున్న ఈ సుదూర ప్రయాణం దేశ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. ఒకే రైలులో ప్రయాణిస్తే.. ఉత్తర భారత వాతావరణం నుంచి దక్షిణ భారత తీరప్రాంత వాతావరణం వరకు మార్పును ప్రత్యక్షంగా చూడొచ్చు. ఆధ్యాత్మిక పర్యటనకూ ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. కాట్రాలోని శ్రీమాతా వైష్ణోదేవి నుంచి ప్రారంభమైన ప్రయాణం.. మార్గమధ్యంలో తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలను కలుపుతూ కన్యాకుమారి వరకు తీసుకెళ్తుంది. అప్పట్లో ‘లాంగెస్ట్’.. ఇప్పుడు మూడో స్థానం ఈ ఎక్స్‌ప్రెస్ దేశంలోనే అత్యంత దూరం నడిచే రైలు ప్రయాణాల్లో అగ్రస్థానంలో ఉండేది. 2011లో దిబ్రూగఢ్–కన్యాకుమారి వివేక్ ఎక్స్‌ప్రెస్ రావడంతో ఆ రికార్డు మారింది. ప్రస్తుతం వివేక్ ఎక్స్‌ప్రెస్, అరొనై సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ల తర్వాత మూడో స్థానంలో ఉంది. దేశాన్ని కలపడానికి రైల్వే పట్టాలు వేసిన కాలంలో పుట్టిన ఈ రైలు.. దశాబ్దాల తర్వా త కూడా ‘హిమం నుంచి సాగరం వరకు.. దేశం ఒక్కటే’ అనే భావనకు చిహ్నంగా నిలుస్తోంది. వరంగల్ మీదుగా హిమసాగర్ ఎక్స్‌ప్రెస్ 42 ఏళ్ల ప్రయాణం కశ్మీర్ కొండల నుంచి కన్యాకుమారి సముద్రతీరం వరకు.. 3,790 కిలోమీటర్ల దూరం.. 70 గంటల సుదీర్ఘ జర్నీ -
చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ప్రశాంత్‌రెడ్డి
జనగామ: సిద్దిపేట జిల్లా చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి ఈనెల 5న (సోమవారం) పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రశాంత్‌రెడ్డితో పాటు మార్కెట్ కమిటీ పాలక మండలి సభ్యులు కూడా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ప్రశాంత్‌రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో జనగామ పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజల ఆశలకు అనుగుణంగా పనిచేస్తా: కొమ్మూరి చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడారు.. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ మార్కెట్ కమిటీని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. ప్రతీ ఒక్కరి సహకారంతో చేర్యాల మార్కెట్ కమిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. -
బోధనకు భరోసా
జనగామ: జిల్లాలో విద్యా బోధనను మరింత బలోపేతం చేసే దిశగా విద్యాశాఖ చేపట్టిన ఉపాధ్యాయుల వర్క్ అడ్జస్ట్మెంట్ పూర్తయింది. రెండు విడతల్లో 121 మందిని సర్దుబాటు చేయగా, 96 మంది ఎస్జీటీలను ఏకోపాధ్యాయ పాఠశాలలకు, 25 మంది స్కూల్ అసిస్టెంట్లను హైస్కూళ్లకు కేటాయించారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమించి విద్యాబోధనకు అంతరాయం లేకుండా జిల్లా విద్యాశాఖ చేపట్టిన వర్క్ అడ్జస్ట్మెంట్ ప్రక్రియలో రెండో విడత సవరణ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉత్తర్వులు వెలువరించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడంతోపాటు ఏకోపాధ్యాయ పాఠశాలలకు ప్రాధాన్యం ఇచ్చారు. తొలి విడతలో 80 మంది గత నెల 1వ తేదీన చేపట్టిన తొలి విడత సర్దుబాటులో జిల్లా వ్యాప్తంగా 80 మంది ఉపాధ్యాయులను కేటాయించారు. వీరిలో 18 మంది స్కూల్ అసిస్టెంట్లు, 62 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు ఉన్నారు. అనంతరం సెప్టెంబర్‌లో పలువురు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఉద్యోగ విరమణ చేయ డం, మండల విద్యాశాఖాధికారులు తాజాగా అందించిన వివరాల ఆధారంగా రెండో విడతలో కలెక్టర్ మార్పులు, చేర్పులు చేశారు. రెండో విడతలో 7గురు స్కూల్ అసిస్టెంట్లు, 34 మంది ఎస్జీటీలను సర్దుబాటు చేశారు. 96 సింగిల్ టీచర్ పాఠశాలలకు అదనపు బలం రెండు విడతలను కలిపి మొత్తం 96 మంది ఎస్జీటీలను ఏకోపాధ్యాయ పాఠశాలలకు కేటాయించడం ఈ ప్రక్రియలో ప్రధానాంశంగా నిలిచింది. ఇప్పటి వరకు ఒక్క ఉపాధ్యాయుడితో కొనసాగుతున్న పాఠశాలలకు మరో ఉపాధ్యాయుడు అందుబాటులోకి రావడంతో బోధన, విద్యార్థుల పర్యవేక్షణలో కొంత వెసులుబాటు కలగనుంది. పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్యను విద్యార్థుల నమోదు ఆధారంగా సమతుల్యం చేయడంపై శాఖ దృష్టి సారించింది. సబ్జెక్టు టీచర్ల కొరతకు పరిష్కారం హైస్కూళ్లలో ప్రధాన సబ్జెక్టుల బోధనకు ఆటంకం లేకుండా 25 మంది స్కూల్ అసిస్టెంట్లను అవసరమున్న పాఠశాలలకు కేటాయించారు. గణితం, ఇంగ్లిష్, బయోలాజికల్ సైన్స్ తదితర సబ్జెక్టుల్లో ఉపాధ్యాయుల కొరతను తగ్గించేలా సర్దుబాటు చేపట్టారు. పీజీఐ మెరుగుదలపై దృష్టి ఏకోపాధ్యాయ పాఠశాలల్లో బోధనను బలోపేతం చేయడం ద్వారా విద్యార్థులకు నిరంతర విద్యాబోధన అందించడంతో పాటు జిల్లా పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (పీజీఐ) పనితీరు మెరుగుపర్చే దిశగా చర్యలు తీసుకున్నారు. ఈ వర్క్ అడ్జస్ట్మెంట్ పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన చేపట్టారు. సర్దుబాటు చేసిన ఉపాధ్యాయులకు శాశ్వత బదిలీ, సీనియారిటీ వంటి హక్కులు వర్తించవు. వారు తమ అసలు పోస్టుల నుంచే వేతనాలు పొందుతారు. సింగిల్ టీచర్ స్కూళ్లకు ప్రాధాన్యం హైస్కూళ్లలో సబ్జెక్టు టీచర్ల కొరతకు చెక్ 96 ఏకోపాధ్యాయ బడులకు ఊరట విద్యా ప్రమాణాలే లక్ష్యంగా రెండు విడతల్లో 121 టీచర్ల సర్దుబాటు అంశం తొలి రెండో రెండు విడత విడత విడతల్లో స్కూల్ అసిస్టెంట్లు 18 7 25 ఎస్జీటీలు 62 34 96 మొత్తం 80 41 121 -
జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు
జనగామ రూరల్: పట్టణంలోని స్థానిక మినీ స్టేడియం ధర్మకంచలో ఆదివారం 14, 16 ఏళ్ల బాలబాలికల నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్స్ సెలక్షన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ ఎంపికల్లో దాదాపు 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. జిల్లా తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్ నారాయణ గౌడ్ మాట్లాడుతూ..క్రీడాకారులు క్రమశిక్షణతో పాల్గొని భవిష్యత్తులో క్రీడాకోటాలో మంచి ఉద్యోగాలు పొందాలని, తల్లిదండ్రులకు సమాజానికి పేరు ప్రతిష్టలు తేవాలని కోరారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఎంపికైన క్రీడాకారులు వచ్చే నెలలో వోక్సన్ యూనివర్సిటీ, కామ్కోల్, సంగారెడ్డిలో జరిగే జాతీయస్థాయి నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్లో పాల్గొంటారు. కార్యక్రమంలో కౌన్సిలర్ గోపగోని సుగుణాకర్, యూనియన్ బ్యాంక్ మేనేజర్ హరికృష్ణ, అసోసియేషన్ కార్యదర్శి కొదురుపాక సారంగపాణి, ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి మనోజ్ కుమార్, కోశాధికారి ఆవుల అశోక్, నిర్వహణ కార్యదర్శి వంచ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లావాసి మోహనకుమారి గిన్నీస్ రికార్డు జనగామ: పట్టణానికి చెందిన కోటోజు మోహనకుమారి గిన్నీస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించారు. కోటోజు వెంకటేశ్వర్లు కుమార్తె మోహనకుమారి మహిళా మనోవికాస్ బృందంతో కలిసి ఏపీలో నిర్వహించిన ‘హర్ ఘర్ తిరంగా’ ప్రాజెక్టులో భాగస్వామిగా నిలిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రేరణతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్లాస్టిక్ రహిత వాతావరణం, మహిళా సాధికారతతో పాటు దేశభక్తి సందేశాన్ని చాటారు. ఈ ప్రాజెక్టులో 350 మంది మహిళలు కలిసి 47 వేల క్రోషే జాతీయ పతాకాలను తయారు చేశారు. వాటిని 12.18 కిలో మీటర్ల పొడవైన బంటింగ్‌గా అమర్చి గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించారు. భారతీయ సంప్రదాయ హస్తకళ, మహిళల సమష్టి శక్తి, దేశభక్తిని ప్రపంచస్థాయిలో చాటిన ఈ ఘనతలో మోహనకుమారి తన స్నేహితురాలు సుశ్మితతో కలిసి పాల్గొన్నారు. జనగామకు చెందిన మోహన కుమారి ఈ అంతర్జాతీయ రికార్డులో భాగస్వామి కావడం జిల్లాకు గర్వకారణమని పలువురు అభినందించారు. బాక్సింగ్ పోటీల్లో ఏబీవీ విద్యార్థుల ప్రతిభ జనగామ రూరల్: హనుమకొండలోని జె.ఎన్. స్టేడియంలో ఆదివారం జరిగిన కాకతీయ యూనివర్సిటీ ఇంటర్ కాలేజియేట్ బాక్సింగ్ టోర్నమెంట్ 2025–26లో జనగామ ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ న కు ఎంపికయ్యారు. వీరిలో కళాశాలకు చెంది న విద్యార్థులు కె. అంజలి, ఆర్. సాయి ప్రణతి, బి. నిఖిల్ గౌడ్, కె. శ్రీశాంత్ గౌడ్ ఉన్నారు. మహిళల పోటీలు రాజస్థాన్‌లో, పురుషుల పోటీలు ఉత్తరప్రదేశ్‌లో జరుగనున్నాయి. ఎంపికై న విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. శ్రీనివాస్, ఫిజికల్ డైరెక్టర్ డా. టి.కళ్యాణి, అధ్యాపకులు అభినందించారు. పోస్టర్ ఆవిష్కరణ జనగామ రూరల్: జిల్లా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనగామ కవులు కళాకారుల ఐక్యవేదిక అధ్వర్యంలో జన జాతర జిల్లా ఉద్యమ యాదిసభ(కవులు కళాకారుల ఆత్మీయ సమ్మేళనం) పోస్టర్‌ను ఆదివారం జిల్లా కేంద్రంలోని చౌరస్తాలో ఆవిష్కరించారు. ఈనెల 11న (ఆదివారం) సూర్యాపేట రోడ్డులోని ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్లో జరిగే ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి కవులు, కళాకారులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జి.కృష్ణ, పెట్లోజు సోమేశ్వరాచారి, అయిలా సోమనర్సింహాచారి, లగిశెట్టి ప్రభాకర్, ఇనుముల నర్సయ్య, చిలుమోజు సాయికిరణ్, తాళ్లపల్లి లక్ష్మణ్ గౌడ్, రంగరాజు ప్రసాద్, గొలుసుల ఎల్లయ్య, రవి, ముత్తగారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
జీవనశైలి మారితే మేలు
జనగామ: జిల్లా ఆరోగ్య ప్రొఫైల్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–6(ఎన్ఎఫ్హెచ్ఎస్) గణాంకాలు, గత సర్వేతో పోలిస్తే జిల్లాలో మహిళా సాధికారత, మాతా, శిశు ఆరోగ్యం, టీకాలు, పోషకాహారం, డిజిటల్ వినియోగంలో గణనీయమైన పురోగతిని వెల్లడించాయి. అదే సమయంలో సిజేరియన్ ప్రసవాలు, ఊబకాయం, మధుమేహం, రక్తపోటు, మద్యపానం వంటి అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పెద్దల్లో షుగర్.. బీపీ పెరుగుదల పిల్లల ఆరోగ్యం మెరుగుపడుతున్నా పెద్దల్లో జీవనశైలి వ్యాధులు పెరుగుతున్నాయి. అధిక బరువు, ఊబకాయం ఉన్న మహిళలు 24.1 నుంచి 38.7 శాతానికి పెరిగారు. అధిక షుగర్ ఉన్న మహిళలు 14.4 నుంచి 23.4 శాతానికి, పురుషులు 18.3 నుంచి 24.1శాతానికి పెరిగారు. అధిక బీపీ ఉన్న మహిళలు 26.1 నుంచి 28.9 శాతానికి, పురుషులు 29 నుంచి 31.5 శాతానికి చేరారు. మహిళల్లో సాధికారత పెరుగుతోంది 91.6శాతం మహిళలు స్వయంగా ఉపయోగించే బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్నారు. సొంతంగా మొబైల్ ఉపయోగించే మహిళలు 57.7 నుంచి 64.8 శాతానికి పెరిగారు. 15–24 ఏళ్ల యువతుల్లో 98.5 శాతం మంది పరిశుభ్రమైన రుతుక్రమ పద్ధతులను పాటిస్తున్నారు. పిల్లల సంఖ్య తగ్గింది.. వృద్ధుల వాటా పెరిగింది ఐదేళ్లలోపు పిల్లల జనాభా 7 నుంచి 5.5 శాతానికి తగ్గగా, 15 ఏళ్లలోపు వారి వాటా 19.1 నుంచి 18 శాతానికి పడిపోయింది. మరోవైపు 60 ఏళ్లు దాటిన వారి వాటా 14.9 నుంచి 19.3 శాతానికి పెరిగింది. భవిష్యత్తులో వృద్ధుల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం పెరగాల్సిన పరిస్థితిని ఇది సూచిస్తోంది. ఇంటర్నెట్లో భారీ దూకుడు మహిళల్లో ఇంటర్నెట్ వినియోగం 21.4 నుంచి ఏకంగా 64 శాతానికి చేరింది. పురుషుల్లో 47.1 నుంచి 91.9 శాతానికి పెరిగింది. పది లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు చదివిన మహిళలు 44 నుంచి 54.9 శాతానికి, పురుషులు 57.7 నుంచి 69.6 శాతానికి పెరిగారు. టీకాల్లో ముందడుగు 12–23 నెలల పిల్లల్లో పూర్తి టీకాలు పొందిన వారి శాతం 84.2 నుంచి 93కి పెరిగింది. మీజిల్స్ తొలి డోసు 96.6 శాతం పిల్లలకు అందింది. విటమిన్ –ఏ పొందిన పిల్లల శాతం 80.8 నుంచి 94.2కి పెరిగింది. బాల్య వివాహాలకు బ్రేక్ 18 ఏళ్లలోపు వివాహమైన 20–24 ఏళ్ల మహిళల శాతం 20.3 నుంచి 13.9కి తగ్గింది. 15–19 ఏళ్లలో గర్భం దాల్చిన లేదా తల్లులైన యువతుల శాతం 6.5 నుంచి 5.2కి తగ్గింది. బాల్య వివాహాల నియంత్రణలో ఇది సానుకూల పరిణామం. గర్భిణుల సంరక్షణలో భారీ పురోగతి మొదటి మూడు నెలల్లోనే గర్భ నమోదు, పరీక్షలు చేయించుకున్న వారి శాతం 89.7 నుంచి 93.5కి చేరింది. కనీసం నాలుగు యాంటెనాటల్ చెకప్‌లు చేయించుకున్నవారు 65.4 నుంచి 84.6 శాతానికి పెరిగారు. 100 రోజుల ఐరన్ మాత్రల వినియోగం 59.4 నుంచి 85.1కి, 180 రోజుల వినియోగం 34.8 నుంచి 66.3 శాతానికి పెరిగింది. ప్రసవాల్లో 100 శాతం సంస్థాగత సేవలు జిల్లాలో ఆస్పత్రి ప్రసవాలు 99.6 నుంచి 100 శాతా నికి చేరాయి. ప్రభుత్వ ఆస్పత్రుల వాటా 49.6 నుంచి 68.6 శాతానికి పెరిగింది. మొత్తం ప్రసవాల్లో 70.2 శాతం సిజేరియన్లు కావడం ఆందోళన కలి గిస్తోంది. ప్రైవేట్‌లో 89.5 శాతం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో 61.4 శాతం సిజేరియన్లు నమోదయ్యాయి. పిల్లల పోషకాహారంలో మెరుగుదల పుట్టిన గంటలోనే తల్లిపాలు అందించిన పిల్లలు 41.9 నుంచి 57.6 శాతానికి పెరిగారు. స్టంటింగ్ 33.4 నుంచి 29.2కి, వేస్టింగ్ 22.9 నుంచి 16.5కి తగ్గింది. అత్యంత తీవ్రమైన పోషకాహార లోపం 10.1 నుంచి 2.3 శాతానికి పడిపోవడం విశేషం. తక్కువ బరువున్న పిల్లలు 30.9 నుంచి 24 శాతానికి తగ్గారు. పిల్లల ఆరోగ్యం మెరుగైంది విరేచనాలతో బాధపడుతున్న పిల్లలు 10.8 నుంచి 8.5 శాతానికి తగ్గారు. తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్న్ లక్షణాలు ఉన్న పిల్లలు 2.7 నుంచి కేవలం 0.6 శాతానికి పడిపోయారు.జిల్లా ఆరోగ్య ప్రొఫైల్‌లో కీలక అంశాలు పెద్దల ఆరోగ్యానికి పెరుగుతున్న ముప్పు తల్లీ, బిడ్డ ఆరోగ్యంలో ముందడుగు బాల్య వివాహాలకు బ్రేక్, మహిళా సాధికారతకు ఊతం మద్యపానంపై ముప్పు, జీవనశైలి వ్యాధుల్లో ఆందోళన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడిమద్యం.. మరో పెద్ద సవాలు పురుషుల్లో పొగాకు వినియోగం 27.1 నుంచి 23.4 శాతానికి తగ్గింది. అయితే 15 ఏళ్లు దాటిన పురుషుల్లో 61.6 శాతం మంది మద్యం సేవిస్తున్నట్లు సర్వేలో తేలింది. మహిళల్లో ఈ శాతం 9.0గా ఉంది. సర్వే ప్రకారం ఒక్కమాటలో చెప్పాలంటే, తల్లి–బిడ్డ ఆరోగ్యంలో జిల్లా ముందడుగులో ఉండగా, పెద్దల జీవనశైలి వ్యాధుల్లో వెనుకడుగులో ఉన్నట్లు వెల్లడించారు. మాతా, శిశు సంరక్షణ, టీకాలు, పోషకాహారం, డిజిటల్ అక్షరాస్యతలో సాధించిన పురోగతిని నిలబెట్టుకోవడంతో పాటు సిజేరియన్ల నియంత్రణ, షుగర్, బీపీ, ఊబకాయం, మద్యపాన నియంత్రణపై ఇక నుంచి ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. -
జ్ఞానేశ్ కుమార్‌ను బాధ్యతలనుంచి తప్పించాలి
చిల్పూరు: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను బాధ్యతల నుంచి తప్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రాపర్తి రాజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కృష్ణాజీగూడెం గ్రామంలో శనివారం నిర్వహించిన సీపీఎం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు. మండల కార్యదర్శి సాదం రమేష్, పోలు సంపత్, రాజు, ప్రభాకర్, బర్మ రవి, కోమల, బుచ్చిరాజు, కుమార్, లింగయ్య, భీమయ్య రామరాజు పాల్గొన్నారు. 5న బైక్ ర్యాలీ పాలకుర్తి టౌన్: ఎన్నికల సంఘం నిర్ణయాలపై అనుమాలు తలెత్తడం ఆందోళనకరమని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పోగు శ్రీనివాస్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఈసీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈనెల 5న సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించాలని కాంగ్రెస్, సీపీఎం నాయకులు నిర్ణయించారు. సీపీఎం, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
ఫ్యాన్లు లేక రోగుల అవస్థలు
జనగామ: జిల్లా కేంద్రంలోని పురపాలక కార్యాలయ ఆవరణలో నిర్వహిస్తున్న తెలంగాణ డయాగ్నొస్టిక్ రేడియాలజీ హబ్‌కు వివిధ వైద్య పరీక్షల కోసం వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అల్ట్రాసౌండ్ స్కానింగ్, డిజిటల్ ఎక్స్‌రే తదితర సేవల కోసం వచ్చే పేషెంట్లు పరీక్షల కోసం సుమారు గంట పాటు వేచి ఉండాల్సి వస్తుండగా, వెయిటింగ్ హాల్లో ఒక్క ఫ్యాన్ కూడా లేకపోవడంతో ఉక్కపోతతో అవస్థలు పడుతున్నారు. వృద్ధులు, మహిళలు, అనారోగ్యంతో ఉన్న రోగులు ఎక్కువసేపు వేచి ఉండే సమయంలో ఇబ్బందులు అధికంగా ఉంటున్నాయని పలువురు పేర్కొంటున్నారు. రోగుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని వెయిటింగ్ హాల్లో ఫ్యాన్లు ఏర్పాటు చేసి, కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులు, నిర్వాహకులను ప్రజలు కోరుతున్నారు. -
‘ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు భూములు ఇవ్వం’
చిల్పూరు: ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు తమ భూములను ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదంటూ ఆర్డీఓ కార్యాలయ అధికారికి రైతులు వినతి పత్రం అందజేశారు. నష్కల్ గ్రామంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో శనివారం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కోసం భూములను సేకరించే ప్రతిపాధనపై నష్కల్, వంగాలపల్లి గ్రామాల రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు గంటె ఉపేందర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి శాగంటి మణి ఆధ్వర్యంలో రైతులు తమ జీవనాధారమైన భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చేది లేదని అధికారులకు స్పష్టం చేశారు. సీనియర్ అసిస్టెంట్లు ఉపేందర్, సత్యనారాయణ, చిల్పూరు ఆర్ఐ లోకేష్, నష్కల్ జీపీఓ యాకయ్య, రైతులు గంటె లక్ష్మి, రాజేష్, అనీల్, పాశం దాసు, భిక్షపతి, కరుణాకర్, యోబు, వినోద్, బాబు తదితరులు పాల్గొన్నారు. -
తిరుమలలో ‘సంకీర్తన’కు కంచనపల్లి బృందం
రఘునాథపల్లి: తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహించే అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమానికి మండలంలోని కంచనపల్లి గ్రామానికి చెందిన శ్రీరామదాసు భజన మండలి ఎంపికై ంది. ఈ నెల 6న తిరుమల సన్నిధిలో నిర్వహించే సంకీర్తనలో జన మండలి అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్‌స్వామి ఆధ్వర్యంలో బృందం పాల్గొననుంది. కంచనపల్లి శ్రీభక్తాంజనేయ దేవస్థానం నేతృత్వంలో గురువులు బ్రహ్మశ్రీ నాగుల నాగేశ్వరరావుస్వామి వారి మార్గదర్శకత్వంలో ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్తున్నట్లు బృందం సభ్యులు శనివారం తెలిపారు. జగన్ మళ్లీ సీఎం కావాలని పూజలు బచ్చన్నపేట: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండోసారి సీఎం కావాలని మండలంలోని లింగంపల్లి గ్రామానికి చెందిన వైఎస్ వీరాభిమాని బొడ్డు ప్రవీణ్ ప్రత్యేక పూజలు చేశారు. శనివారం యాదాద్రిభువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో ప్రవీణ్ మోకాళ్లపై ఆలయ మెట్లు ఎక్కి లక్ష్మీనర్సిహస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్‌ను మళ్లీ సీఎంను చేయడం ఖాయమన్నారు. విరాళం బచ్చన్నపేట: కొన్నె గ్రామంలో శ్రీ బీరప్ప కామరాతి దేవాలయ నిర్మాణానికి పలువురు దాతలు విరాళాలను అందించినట్లు కురుమ సంఘం, దేవాలయ నిర్వాహణ కమి టీ సభ్యులు తెలిపారు. శనివారం వారు మాట్లాడుతూ ఉప సర్పంచ్ చల్ల కమలాకర్ రూ.20,116లు, కొండి ఉప్పల్‌రెడ్డి రూ. 20,116 విరాళం అందించినట్లు చెప్పారు. ఆలయ నిర్మాణానికి దాతలు సహకరించాలని కోరారు. ఆర్థికసాయం నర్మెట: మల్కపేట తొలి సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బానోత్ లక్ష్మణ్ నాయక్ (75) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందాడు. కాగా, గ్రామ శాఖ అధ్యక్షుడు బానోత్ సురేష్ ఆధ్వర్యంలో శనివారం పార్టీ శ్రేణులు రూ. 10 వేలు సాయం అందించి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. కొమురవెళ్లి దేవస్థాన కమిటీ చైర్మన్ నర్సింహారెడ్డి, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్, బాలచందర్ ఉన్నారు. సోమేశ్వరాలయంలో ఆరుద్రోత్సవం పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం రాత్రి ఆరుద్రోత్సవ కార్యక్రమాన్ని అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య వైభవంగా నిర్వహించారు. పంచామృతాలతో సుగంధ ద్రవ్యములు, నమక చమకములతో అభిషేకం, పంచహరతులతో చేపట్టిన గర్భాలయ దీపోత్సవాన్ని భక్తులు కనులార తిలకించి తరించారు. ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న, అర్చకులు పాల్గొన్నారు. గిరిప్రదక్షిణ బచ్చన్నపేట: కొడవటూర్ని స్వయంభూ శ్రీసిద్ధేశ్వరాలయ సిద్దులగుట్ట శివనామస్మరణతో మారు మెంగింది. శనివారం భక్తులు మహా గిరిప్రదక్షిణను నిర్వహించారు. ఆలయం చుట్టూ నాలుగు కిలోమీటర్లు భక్తులు ప్రదక్షిణ చేశారు. అనంతరం శివాలయంలో పుట్టు శివలింగాన్ని దర్శించుకుని తీర్థ ప్రసాదం స్వీకరించారు. సర్పంచ్ కవితమురళి, ఆలయ కమిటీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, ఈఓ వంశీ, ఆలయ ప్రధాన పూజారి ఓం నమశివాయ, డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. పింఛన్లకు 892 దరఖాస్తులు లింగాలఘణపురం: చేయూత పెన్షన్లకు మండలంలోని 21 గ్రామాల పరిధిల 892 మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో 820 మంది అర్హులుగా గుర్తించినట్లు ఎంపీడీఓ శివశంకర్‌రెడ్డి తెలిపారు. 35 మంది దరఖాస్తుదారులు సరైన ఆధారాలు అందించలేదని వీంతో వీరిని హోల్డ్‌లో పెట్టామని, 37 మందిని అనర్హులుగా గురించినట్లు వివరించారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఇంటికి గెజిటెడ్ హోదా కలిగిన అధికారులు విచారణ జరిపిఅర్హుల జాబితాను ప్రభుత్వానికి నివేదించినట్లు చెప్పారు. -
గ్రామసభ ఆమోదంతోనే ఇళ్లు మంజూరు చేయాలి
లింగాలఘణపురం: గ్రామసభ ఆమోదంతోనే రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని పలువురు సర్పంచ్‌లు డిమాండ్ చేశారు. శనివారం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ శివశంకర్‌రెడ్డి అధ్యక్షతన మండల స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మండల కేంద్ర సర్పంచ్ ఎడ్ల లావణ్యరాజు మాట్లాడుతూ రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం జాబితాను గ్రామ పంచాయతీల నుంచి పంపించాలని ఎవరు అడుగలేదని, తప్పనిసరిగా తీర్మానం ఉండాలని డిమాండ్ చేశారు. రెండు నెలలుగా ఆర్డబ్ల్యూఎస్ ఏఈ లేకపోవడంతో గ్రామాల్లో ఇబ్బందులు ఎదురౌతున్నాయని నెల్లుట్ల సర్పంచ్ నర్సింగ రామకృష్ణ అన్నారు. గ్రామాల్లో ఉపాధి హామీ కూలీల సంఖ్యను పెంచాలని, అప్పుడే మెటీరియల్ కాంపోనెంట్ పనులు మంజూరు అవుతాయని ఎంపీడీఓ శివశంకర్‌రెడ్డి అన్నారు. సమావేశంలో ఎంపీఓ సంపత్‌కుమార్, మండల వైద్యాధికారి ఉదయ్‌కిరణ్, ఏఓ నజీరుద్ధీన్, ఏఈలు కార్తీక్, భరత్, నజీబ్, ఏపీఎం జ్యోతి, పశువైద్యాధికారి జలేందర్‌రెడ్డి, సీడీపీఓ మణెమ్మ, సర్పంచ్‌లు విష్ణుకుమార్, బుచ్చిరెడ్డి, సదానందం, మమత, సుమలత, సంతోషి, శోభ, సుజాత, ఆయా గ్రామాల కార్యదర్శులు పాల్గొన్నారు. కాగా, మండలంలోని 21 మంది సర్పంచ్‌లకు సగం మంది హాజరు కాలేదు. ఏనెబావి సర్పంచ్ సుజాతకు బదులుగా ఆమె భర్త సిద్దులు పాల్గొనగా విలేకరులు ఫొటో తీయగానే అక్కడి నుంచి జారుకున్నారు. -
సంక్షిప్త సమాచారం
రేపు ‘వేద’లో స్వర్ణ ప్రాశన జనగామ: కొడిమల సత్తిరెడ్డి జ్ఞాపకార్థం వేద ఆయుర్వేదిక్ పంచకర్మ వెల్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో ఈనెల 5న ఉచిత స్వర్ణప్రాశన శిబిరం నిర్వహించనున్నట్లు డాక్టర్ అంజిరెడ్డి శనివారం తెలిపారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు హైదరాబాద్ రోడ్డులో ఏకశిల బీఈడీ కళాశాల ఎదురుగా ఉన్న వేద ఆస్పత్రిలో శిబిరం జరుగుతుందన్నారు. 6 నెలల నుంచి 16 ఏళ్లలోపు పిల్లలకు స్వర్ణప్రాశన అందించనున్నట్లు తెలిపారు. పిల్లల శారీరక, మానసిక వికాసం, జీర్ణశక్తి, కండరాలు, ఎముకల పటిష్టతకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్లు ఓటరుగా నమోదు చేసుకోవాలి బచ్చన్నపేట: గ్రాడ్యుయేట్లు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటరుగా నమోదు చేసుకోవాలని రైతు బంధు సమితి జిల్లా మాజీ కోఆర్డినేటర్ ఇర్రి రమణారెడ్డి అన్నారు. శనివారం గంగాపూర్ గ్రామంలో పట్టభద్రులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. సర్పంచ్ జిల్లెల్ల భాస్కర్‌రెడ్డి, ఉప సర్పంచ్ సదానందం, పట్టభద్రులు పాల్గొన్నారు. జఫర్‌గఢ్: పట్టభద్రులు బాధ్యతగా ఓటరుగా నమోదు చేసుకోవాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పల్లెపాటి జైపాల్‌రెడ్డి కోరారు. పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని బాలాజీ ఇంటర్నెంట్ సెంటర్ వద్ద శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. అనంతరం దరఖాస్తులను తహసీల్ధార్ కార్యాలయంలో ఆర్ఐ దేవేందర్‌కు అందజేశారు. సన్నాహక సమావేశం స్టేషన్‌ఘన్‌పూర్: రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రులందరూ విధిగా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు గాదె పృథ్వీ అన్నారు. ఘన్పూర్ డివిజన్‌కేంద్రంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి’ దేవరుప్పుల: మోసపూరిత వాగ్దానాలతో ప్రజాపాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టభద్రులు తమ ఓటుతో గుణపాఠం చెప్పాలని ఉస్మానియా విద్యార్థి జేఏసీ నేత ఇప్ప పృథ్వి రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో అర్హులు తమ పేరు నమోదు చేసుకోవాలని కోరారు. బహుజనుల రాజ్యాధికారమే బీఎస్పీ లక్ష్యం స్టేషన్‌ఘన్‌పూర్: బహుజనుల ఐక్యత, రాజకీయ చైతన్యం, రాజ్యాధికార సాధనయే లక్ష్యంగా బీఎస్పీ పనిచేస్తుందని పార్టీ జిల్లా నాయకుడు జలగం ప్రవీణ్ అన్నారు. ఈనెల 9న బడంగ్పేట్లో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రం శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహుజన రాజ్యాధికార సమరభేరి సభకు సంబంధించిన పోస్టర్లను ఘన్పూర్డివిజన్ కేంద్రంలో శనివారం ఆవిష్కరించారు. ఎన్నిక నర్మెట: బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధిగా వెల్దండకు చెందిన బొల్లం అవినాష్ నియమితులయ్యారు. అనంతరం అవినాష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ పార్టీ బలోపేతానికి కృషిచేస్తానని అన్నారు. ఈ సందర్భంగా తన ఎంపికకు సహకరించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు హరీశ్, జిల్లా, మండల నాయకులుకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేవైఎం అధికార ప్రతినిధిగా రాజేశ్వర్‌రెడ్డి స్టేషన్‌ఘన్‌పూర్: బీజేవైఎం జిల్లా అఽధికార ప్రతినిధిగా మండలంలోని తాటికొండకు చెందిన తౌటిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డిని నియమించినట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్, బీజైవైఎం అధ్యక్షుడు అల్లబోయిన హరీశ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు రాజేశ్వర్‌రెడ్డి ఘన్‌పూర్‌లో విలేకరులతో మాట్లాడుతూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేలా కృషి చేస్తానన్నారు. రెడ్డి జాగృతి మండల అధ్యక్షురాలిగా సునీతారెడ్డి స్టేషన్‌ఘన్‌పూర్: రెడ్డి జాగృతి ఘన్పూర్ మండల అధ్యక్షురాలిగా మండలంలోని తానేదార్పల్లి గ్రామానికి చెందిన మంతెన సునీతారెడ్డిని నియమించనట్లు రాష్ట్ర అధ్యక్షురాలు పోరెడ్డి కవితారెడ్డి, జిల్లా అధ్యక్షుడు కర్‌రెడ్డి రఘునందన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సునీతారెడ్డి మాట్లాడుతూ రెడ్డి కులస్తులను ఏకం చేస్తూ న్యాయమైన హక్కుల సాధనకు పనిచేస్తానన్నారు. నియామకం జఫర్‌గఢ్: మండలంలోని కూనూర్ గ్రామానికి చెందిన పోతోజు ఏళ్ళచారిని బీజేపీ చేతి వృత్తుల సెల్ జిల్లా కన్వీనర్‌గా నియమిస్తూ పార్టీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఏళ్లచారి మాట్లాడుతూ తన నియామకానికి కృషి చేసిన పార్టీ జిల్లా అధ్యక్షుడు రమేశ్, పార్టీ మండల అధ్యక్షుడు నగేష్‌గౌడ్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. గీత కార్మిక సంఘం కార్యవర్గం ఎన్నిక కొడకండ్ల: రామవరం గ్రామ గీత కార్మిక సంఘం నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బొమ్మగాని సోమయ్య, ఉపాధ్యక్షుడిగా గిరగాని చంద్రమౌళి, కోశాధికారిగా బాల్నె వెంకటేష్‌గౌడ్, డైరెక్టర్లుగా కునూరు పాపయ్య, సోమనర్సయ్య, శ్రీనివాస్, యాకన్న, అయిలయ్య, రవిగౌడ్‌లు ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు. సర్పంచ్ గిరగాని క్రాంతికుమార్ పాల్గొని నూతన, పూర్వ కార్యవర్గాన్ని సన్మానించారు. ఓటుహక్కు విలువైనది బచ్చన్నపేట: ఓటు హక్కు విలువైనదని ప్రజలకు అవగాహన కల్పించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మసూద్, సీపీఎం మండల కార్యదర్శి బెల్లంకొండ వెంకటేష్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఇండియా కూటమి పార్టీల అఖిల పక్ష సమాశంలో వారు మాట్లాడారు. మార్కెట్ కమిటీ చైర్మన్‌ను కలిసిన నాయకులు బచ్చన్నపేట: నూతనంగా ఎన్నికై న చేర్యాల వ్యవసాయ మార్కెట కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డిని పలువురు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు శనివారం కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. క్రీడా దుస్తుల పంపిణీ చిల్పూరు: పల్లగుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులకు స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నీలిమ చెల్లెలు సారాసునందిని (ఎన్పీడీసీఎల్ ఏఈఈ) జ్ఞాపకార్థం రూ.20వేల విలువైన స్పోర్ట్స్ యూనిఫారాలతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఐడీ కార్డులను శనివారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో హెచ్ఎం విజయ్‌కుమార్ తదితరులు ఉన్నారు. కాల్వకు గండిపెట్టడంతో పొలాలకు నష్టం లింగాలఘణపురం: అశ్వరావుపల్లి రిజర్వాయర్ నుంచి వచ్చే ప్రధాన కాలువలో 18 ఎల్ నుంచి లింగాలఘణపురంలోని పాత చెరువులోనికి వచ్చే కాలువకు బోడబండ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి గండి పెట్టారు. దీంతో కడకంచి కొంరయ్య పొలంలో వరి పంటకు నష్టం జరిగింది. ఉదయం విషయం తెలుసుకున్న సర్పంచ్ ఎడ్ల లావణ్యరాజు జేసీబీతో కాల్వ గండిని పూడ్చి తిరిగి చెరువులోకి నీరు వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. గండి పెట్టడంతో వరికి పొలం గట్లన్నీ తెగిపోయాయని, గడ్డివాము మొత్తం తడిసిందని రైతు కొంరయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. చెరువులో మునిగి వ్యక్తి మృతి నర్మెట: చేపల వేటకు వెళ్లిన వ్యక్తి చెరువులో మునిగి మృతి చెందిన ఘటన హన్మంతాపురంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన శనిగరం మల్లేష్ (58) కూలి పనులు చేస్తూ ఒంటరిగా జీవిస్తున్నాడు. కాగా, హన్మంతాపురం ఊర చెరువులో శుక్రవారం చేపల వేటకు వెళ్లిన ఆయన ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. చెరువులో శనివారం మృత దేహాన్ని గమనించిన స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతుడి కుమారుడు నరేష్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై నైనాల నగేష్ తెలిపారు. బైక్ అదుపుతప్పి మాజీ సర్పంచ్‌కి తీవ్ర గాయాలు పాలకుర్తి టౌన్: మండల కేంద్రంలో పాలకుర్తి–సేష్టన్ఘన్పూర్ ప్రధాన రహదారిపై ఈరవెన్ను క్రాస్ రోడ్డు వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదవంలో బమ్మెర మాజీ సర్పంచ్ నాగభూషణంకు తీవ్ర గాయాలయ్యాయి. నాగభూషణం పాలకుర్తి నుంచి బమ్మెరకు వెళ్తుండగా బైక్ అదుపుతప్పడంతో రోడ్డుపై పడడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. కాగా, స్ధానికులు మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం ఆయనను తరలించారు. జీపీ భవన నిర్మాణానికి భూమి కేటాయించండి చిల్పూరు: గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణం కోసం భూమిని కేటాయించాలని వంగాలపల్లి సర్పంచ్ భూక్య మేనకసుధాకర్, ఉప సర్పంచ్ అరూరి రవిచంద్ర కోరారు. ఈ మేరకు శనివారం ఆర్టీఓ సెక్షన్ అధికారికి వినతి పత్రం అందజేశారు. మంతెన అశోక్, చిట్యాల రాజేశ్, మంతెన కమల్, విద్యాసాగర్, ప్రజలు పాల్గొన్నారు. ర్యాలీని విజయవంతం చేయాలి కొడకండ్ల: సేవ్ డెమోక్రసి, ఓటు బచావో, దేశ్ బచావో కార్యక్రమంలో భాగంగా ఈ నెల 6న మండలకేంద్రంలో చేపట్టనున్న నిరసన ర్యాలీలో ఇండియా కూటమి పార్టీల నాయకులు భాగస్వాములై విజయవంతం చేయాలని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సురేష్‌నాయక్ కోరారు. శనివారం మండలద్రంలోని పార్టీ కార్యాలయంలో సంయుక్త సమావేశం నిర్వహించి నిరసన ర్యాలీ విజయవంతంపై చర్చించారు. -
పాఠశాలలో సౌకర్యాల కొరత
రఘునాథపల్లి: ఉపాధ్యాయుల ప్రత్యేక చొరవతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగి 220కి చేరడంతో, వసతుల కొరతతో బడి ఎదుట నో అడ్మిషన్ బోర్డు పెట్టి వార్తల్లో నిలిచిన మండలంలోని ఖిలాషాపూర్ ప్రాథమిక పాఠశాల (ఎంపీపీఎస్ పెద్దగుడి) సమస్యలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. పాఠశాలలో తీవ్రమైన మౌలిక వసతుల కొరత వేధిస్తుండటాన్ని, మంజూరైన అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని కోరుతూ శని వారం పాఠశాల కమిటీ, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు రూపొందించిన ఫ్లెక్సీ ప్రస్తుతం స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో తీవ్రంగా వైరల్ అవుతోంది. ఫ్లెక్సీలో పేర్కొన్న ప్రధాన సమస్యలు పాఠశాలలో 220 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ కనీసం ఒక్క బాత్రూమ్ కూడా లేదు. దీంతో బాలికలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల చుట్టూ ప్రహరి లేక పోవడంతో చిన్న పిల్లల భద్రత తీవ్ర ప్రమాదంలో పడుతోంది. విద్యార్థులు తాగడానికి సరపడా స్వచ్ఛమైన తాగునీటి సదుపాయం తక్షణమే ఏర్పాటు చేయాలని, విద్యార్థుల సంఖ్యకు తగినన్ని తరగతి గదులు లేక పోవడంతో బోధన, చదువుకు తీవ్ర విఘాతం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నిధులు మంజూరయ్యాయని అధికారులు చెప్పడమే తప్ప క్షేత్రస్థాయిలో ఎలాంటి పనులు ప్రారంభం కాలేదని గ్రామస్తులు, పాఠశాల కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. మంజూరైన పనులు ప్రారంభించకపోతే కలెక్టరేట్ వద్ద శాంతియుత నిరసన చెపడతామని ఫ్లెక్సీ ద్వారాహెచ్చరించారు. మంజూరైన పనులు వెంటనే ప్రారంభించాలని విజ్ఞప్తి వాట్సాప్ గ్రూపుల్లో వైరల్‌గా పాఠశాల కమిటీ, గ్రామస్తుల ఫ్లెక్సీ -
వైద్యశిబిరం
నర్మెట: వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల శుభ్రత పాటించాలని, పరిశుభ్రతే ఆరోగ్యానికి ప్రథమ ఔషదమని సర్పంచ్ ధరావత్ రాజమణి, వైద్య సిబ్బంది అన్నారు. ఇప్పలగడ్డలో శనివారం నిర్వహించి వైద్యశిబిరంలో పాల్గొన్న వారు మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురికి బీపీ, షుగర్, కీళ్ల నొప్పులు తదితర పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. కార్యదర్శి శ్రీకాంత్, ధరావత్ రాజు, ఉప సర్పంచ్ శ్రీను, ఏఎన్ఎం సరిత, విజయశాంతి, ఆశ కార్యకర్త ప్రేమలత పాల్గొన్నారు. మౌలిక వసతులు కల్పించాలి జఫర్‌గఢ్: డబుల్బెడ్రూం ఇళ్లల్లో నివాసం ఉంటున్న వారికి మౌలిక వసతులు కల్పించాలని బీజేపీ మండల అధ్యక్షుడు కోరుకొప్పుల నగేష్‌గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని తమ్మడపల్లి (ఐ) గ్రామంలో డబుల్ బెడ్రూం ఇళ్లలో నివాసం ఉంటున్న పేదల సమస్యలను నగేష్‌గౌడ్ శనివారం అడిగి తెలుసుకున్నారు. ఇళ్లలో నివాసం ఉంటున్న పేదలకు పట్టాలివ్వడంతో పాటు కనీస వసతులు కల్పించి వారిని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పరిహారం అందజేత దేవరుప్పుల: మండలంలోని రంబోజీగూడెం గ్రామ పరిది రాజీవ్‌నగర్‌కు చెందిన వ్యవసాయరైతు మేడ నర్సయ్యకు చెందిన ఎద్దు ఇటీవల విద్యుదాఘాతంలో మృతి చెందగా సదరు శాఖ అధికారులు రూ.40 వేల పరిహారం చెక్కును శనివార అందజేశారు. బాధిత రైతుకు విద్యుత్‌శాఖ ఏడీఏ అనిల్‌కుమార్, వెటర్నటీ డాక్టర్ శిల్ప పర్యవేక్షణలో సత్వరమే పరిహారం చెక్కు అందించినందుకు సర్పంచ్ పరీదుల ధనలక్ష్మీ భాస్కర్‌గౌడ్, రైతులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. -
గ్రామీణ ప్రాంతాల్లో ‘వనజీవి’ స్ఫూర్తి విస్తరణకు చర్యలు
జనగామ: పర్యావరణ పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసిన వనజీవి రామయ్య స్ఫూర్తిని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించేందుకు వాస్విక్ ఫౌండేషన్ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా వనజీవి రామయ్య జీవితం, పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన ‘వనజీవి’ చిత్రాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ప్రదర్శించే అంశంపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్యతో వాస్విక్ ఫౌండేషన్ చైర్మన్, చిత్ర నిర్మాత నిడిగొండ నరేష్ ప్రజాపతి శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు, ముఖ్యంగా యువతకు వనజీవి రామయ్య పర్యావరణ సేవలు, మొక్కల పెంపకం, ప్రకృతి పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు చిత్ర ప్రదర్శనలు నిర్వహిం చాలనే ఉద్దేశాన్ని కమిషనర్‌కు వివరించారు. గ్రామస్థాయిలో పర్యావరణ పరిర క్షణపై చైతన్యం పెంపొందించడంలో ఇటువంటి కార్యక్రమాలు దోహదపడ తాయని తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ దివ్య సానుకూలంగా స్పందిస్తూ వనజీవి రామయ్య పర్యావరణ సేవలను ప్రశంసించినట్లు వారు తెలిపారు. నిడిగొండ నరేష్ ప్రజాపతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటడాన్ని అలవాటుగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి సహకారం అందిస్తున్న కమిషనర్ దివ్యకు నరేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట ఫౌండేషన్ సభ్యుడు తరిగొప్పుల నవీన్ కుమార్ పాల్గొన్నారు. -
పోషకాహారం తీసుకోవాలి
స్టేషన్‌ఘన్‌పూర్: ప్రతి ఒక్కరూ సాధ్యమైనంతలో సరైన పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలని ఐసీడీఎస్ ఏసీడీపీఓ శోభారాణి, తాటికొండ సర్పంచ్ మారపాక సుజన శ్రీనివాస్ అన్నారు. తాటికొండ గ్రామంలో అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో పోషణ మాసం ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులకు సామూహిక సీమంతాలను చేపట్టారు. అంగన్వాడీ టీచర్లు పద్మ, ధనలక్ష్మీ, సులోచన, లలిత, అరుణాదేవి, ఏఎన్శ్రీం నాగరాణి, ఆశ కార్యకర్తలు మాధవి, సబీనా, రజిత, జ్యోతి, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు పాల్గొన్నారు. -
పరిసరాల శుభ్రత పాటించాలి
● ఎంపీడీఓ వేదవతిపాలకుర్తి టౌన్: ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను పాటించి ఆరోగ్యకరమైన వాతావారణం కల్పించేందుకు భాగస్వాములు కావాలని ఎంపీడీఓ వేదవతి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల పరిసరాల్లో నిర్వహించిన ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెత్తాచెదారం పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. సర్పంచ్ కమ్మగాని విజయ నాగన్న, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, వార్డు సభ్యులు, జీపీ సిబ్బంది పాల్గొన్నారు. -
డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన
జనగామ రూరల్: సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్, గంజాయి నిర్మూలన కోసం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తన ఆట, పాటలతో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు బహుజన యుద్ధనౌక డాక్టర్ ఏపూరి సోమన్న తెలిపారు. ఈ నెల 9న పట్టణంలోని జూబ్లీ ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్న కార్యక్రమానికి డీసీపీ రాజమహేంద్ర నాయక్, సీఐ సత్యనారాయణరెడ్డిలను హాజరుకావాలని ఆహ్వానించారు. కరెన్సీపై అంబేడ్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరశురామ్, కళాకారులు కడారి శ్రీను, జి.మౌనిక, పరమేష్, కె.ప్రవీణ్, పి.రేవంత్ ఉన్నారు. -
మద్యంపై పల్లెల్లో యుద్ధం!
● తొమ్మిది గ్రామాల్లో సంపూర్ణ మద్య నిషేధం ● మరికొన్ని గ్రామాల్లోనూ నిషేధం దిశగా అడుగులు ● చొరవ తీసుకుంటున్న మహిళలు, సహకరిస్తున్న యువత రఘునాథపల్లి: మద్యంపై పల్లెలు యుద్ధం చేస్తున్నాయి. పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతూ, పేద, మధ్యతరగతి కుటుంబాలను రోడ్డుపైకి తీసుకు వ స్తుండటంతో పాటు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న మహమ్మారిని పారద్రోలేందుకు ప్రజలు నడుం బిగిస్తున్నారు. ఇక్కడ పార్టీ, వర్గం, మహిళలు, పురుషులు అన్న తేడా లేకుండా ఏకమవుతున్నారు. బతుకులు ఆగం చేస్తున్న మద్యం గ్రామాల్లో విక్రయించవద్దంటూ నినదిస్తున్నారు. బెల్ట్ దుకాణం నడపొద్దని మొదట విజ్ఞప్తి చేస్తున్న ప్రజలు, అప్పటికీ వినకుంటే అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. అయినా ఫలితం లేకుంటే జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. మండలంలోని తొమ్మిది గ్రామాల్లో సంపూర్ణ మద్య నిషేధం అమలులో ఉండగా, వెల్ది గ్రామంలో బెల్ట్ నిర్మూలనకై ఇటీవల గ్రామ పంచాయతీ తీర్మానం చేశారు. మరిన్ని పల్లెలు అదే దారిన నడిచేందుకు సిద్ధమవుతున్నారు. మద్య నిషేధానికి మహిళలు, యువత కీలకంగా వ్యవహరిస్తుండటం గమనార్హం. సర్పంచ్‌లు, గ్రామపెద్దలు మద్య నిషేధం దిశగా చొరవ తీసుకుంటున్నారు. తీర్మానాలు చేసి కఠినంగా అమలు చేయాలని నిర్ణయిస్తున్నారు. వేలం పాడిన గ్రామాల్లోనూ.. బెల్ట్‌షాపుల కోసం బహిరంగ వేలం నిర్వహించే ఇబ్రహీంపూర్, ఫతేషాపూర్‌లో మద్య నిషేధం సంపూర్ణంగా అమల్లోకి వచ్చింది. ఇబ్రహీంపూర్లో ఎనిమిది నెలల క్రితం పార్టీలకతీతంగా ఏకమైన యువత, మహిళలు బెల్ట్ దుకాణాలను మూసి వేయించాయి. ఫతేషాపూర్‌లో ఆరు నెలలుగా మద్య నిషేధం కోసం ర్యాలీలు తీసి మద్యంతో గ్రామస్తులకు జరిగే నష్టాన్ని బెల్ట్‌షాపు నిర్వహకులకు వివరించారు. అయినా ఫలితం కనిపించలేదు. దీంతో గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే శ్రీహరి దృష్టికి మహిళలు తీసుకెళ్లడంతో స్పందించిన ఎమ్మెల్యే తక్షణమే సీఐ వేణు, ఎస్సై నరేష్‌లను బెల్ట్‌షాపులు నిర్వహించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో బెల్ట్‌షాపులు మూసివేశారు. అధికారులను కలిసి తీర్మానాలు గ్రామాల్లో మద్య నిషేధంపై చేసిన తీర్మానాల ప్రతులను ఆయా గ్రామాల సర్పంచ్‌లు మహిళలు, గ్రామ పెద్దలతో కలిసి ఎస్సై, సీఐ, తహసీల్దార్లను కలిసి అందజేశారు. బెల్ట్‌షాపులు నడవకుండా సహకరించాలని కోరారు. జిల్లా అధికారులకు కూడా తీర్మాన ప్రతులను అందజేసి మద్యం నిర్మూలనపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.మద్యపాన నిషేధ గ్రామాలు ఇవే.. ఇబ్రహీంపూర్, దాసన్నగూడెం, లక్ష్మీతండా, వేపలగడ్డతండా, కుసుంబాయితండా, జాఫర్‌గూడెం, ఫతేషాపూర్, కన్నాయపల్లి, భాంజీపేట -
జంతువుల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు
● వీధి జంతువులకు శుభ్రమైన తాగునీటి పాత్రలు ఏర్పాటు చేయాలి. ఆకలి, దాహంతో ఉన్న జంతువులకు తగిన ఆహారం అందించాలి. ● గాయపడిన, అనారోగ్యంతో ఉన్న జంతువులకు వెంటనే పశువైద్య చికిత్స అందించాలి. క్రమం తప్పకుండా టీకాలు వేయించాలి. ● వీధి కుక్కలు, పిల్లుల కోసం స్టెరిలైజేషన్ కార్యక్రమాలను శాసీ్త్రయంగా నిర్వహించాలి. ● అడవులు, చెరువులు, గడ్డి భూములు వంటి జంతువుల సహజ ఆవాసాలను కాపాడాలి. ● అక్రమ వేట, అడవి జంతువుల అక్రమ రవాణాను అరికట్టాలి. ● జంతువులు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. అడవి ప్రాంతాల్లో వాహనాల వేగాన్ని నియంత్రించాలి. ● ప్లాస్టిక్ వ్యర్థాలను జంతువులు తినకుండా చెత్తను సక్రమంగా నిర్వహించాలి. ● పాఠశాలలు, కళాశాలల్లో జంతు సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ● వన్యప్రాణుల అక్రమ వేట, వ్యాపారం, నివాస ప్రాంతాల విధ్వంసాన్ని నిరోధించాలి. -
విద్యుత్ బిల్లుల భారం తగ్గించుకోవాలి
● ఎన్పీడీసీఎల్ డీఈ లక్ష్మీనారాయణరెడ్డి జనగామ: ప్రతీ కుటుంబం సౌరవిద్యుత్‌ను విని యోగించుకోవడం ద్వారా విద్యుత్ పొదుపుతో పా టు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని ఎన్పీడీసీఎల్ డీఈ ఎం.లక్ష్మీనారాయణరెడ్డి పిలుపునిచ్చా రు. ప్రధానమంత్రి సూర్య ఘర్–సేవా సేతు పథకంపై శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ప్రజ లకు అవగాహన కల్పించారు. డీఈ అధ్యక్షతన జ రిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్, వైస్ చైర్మన్ పర్వతాలు, కౌ న్సిలర్లు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. సౌర విద్యుత్ విక్రేతలు, బ్యాంకర్లు పాల్గొని పథకానికి సంబంధించిన వివరాలను ప్రజలకు వివరించారు. అనంతనం డీఈ మాట్లాడుతూ గృహాల పైకప్పులపై రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుని గృహ విద్యుత్ అవసరాలను తీర్చుకోవడంతో పాటు విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకునే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పాముకుంట్ల ప్రసాద్‌గౌడ్, బుక్కా బాలభరధ్వాజ్, బూడిద జ్యోతిగోపి, మంత్రి సుమలతశ్రీశైలం, ఏఈడీ డి.వేణుగోపాల్, ఏఈలు బి.సౌమ్య, చంద్రమోహన్, రాజ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో.. స్టేషన్‌ఘన్‌పూర్: ప్రధానమంత్రి సూర్య ఘర్–సేవా సేతు పథకంను సద్వినియోగం చేసుకోవాలని స్టేషన్‌ఘన్‌పూర్ డీఈ బి.సారయ్య అన్నారు. వి ద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయంలో మూడు రోజు లుగా నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు శని వారంతో ముగిశాయి. ఈ సందర్భంగా డీఈ మా ట్లాడారు. ఏడీఈ రణధీర్‌రెడ్డి తదితరులున్నారు. -
ప్రకృతి పరిరక్షణ
జంతు రక్షణ..● ఉమ్మడి జిల్లాలో విస్తృతంగా అటవీప్రాంతం ● అనేక రకాల జంతువుల ఆవాసం ● వాటిని సంరక్షించుకుంటేనే జీవ వైవిధ్య సమతుల్యత నేడు ప్రపంచ జంతు దినోత్సవంవన్యప్రాణులకు ఓరుగల్లు పుట్టినిల్లు అటవీ శాఖ అధికారుల ప్రత్యేక దృష్టి..అటవీశాఖ ఆధ్వర్యంలో ములుగు జిల్లాలోని అడవుల్లో సుమారు 169 కెమెరాలను అమర్చారు. వన్యప్రాణుల కదలికలను కెమెరాల్లో బందించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. నిత్యం గూడేల్లో అటవీశాఖ అధికారులు తనిఖీలు చేస్తూ వేటాడే వస్తువులు, ఆయుధాలు, సామగ్రిని స్వాధీనం చేసుకుంటున్నారు. జంతువులు, పక్షులు, సరీసృపాలు, ఇతర జీవులది పర్యావరణ వ్యవస్థలో ముఖ్య పాత్ర. వాటి మనుగడ కాపాడడడం ప్రతి ఒక్కరి బాధ్యత. అడవుల నరికివేత, వేట, అక్రమ రవాణా, అడవుల్లో మంటలు వంటి కారణాలతో అనేక వన్యజీవులు ప్రమాదంలో పడుతున్నాయి. వన్యప్రాణుల ఆవాసాలను రక్షించడం, అడవులను కాపాడడం, అక్రమ వేటను అరికట్టడంపై ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా వాటి మనుగడకు తోడ్పడవచ్చు. ముఖ్యంగా అడవులకు సమీపంలో నివసించే ప్రజలు వన్యప్రాణులతో సహజీవనం చేస్తూ, వాటికి హాని కలిగించకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ములుగు జిల్లా అడవుల్లో ఎలుగుబంటి, పిల్లి, అడవి పిల్లి, నాలుగు కొమ్ముల జింక, అడవి కుక్క, చుక్కల జింక, భారతీయ నక్క, అడవి దున్న, తోడేలు కుక్క, హైనా, నల్లమెడ కుందేలు, నక్క, చిరుతపులి, లంగూర్ కోతి, రీసస్ కోతి, ముంగీస, నీలగాయి, ముళ్లపంది, అలుగు, సాంబర్ జింక, పెద్ద ఉడుత, ఎగిరే ఉడుత, పులి, అడవి పంది ఉన్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. సందర్శకులకు కనువిందు హనుమకొండ హంటర్ రోడ్డులోని కాకతీయ జూవాలాజికల్ పార్క్ సందర్శకులకు కనువిందునిస్తోంది. ఇక్కడ జంతువులు, పక్షులు, తామర కొలను ఆకట్టుకుంటోంది. చిరుత పులి, అడవిదున్నలు, ఎలుగుబంటి, నక్కలు, అడవి పిల్లి, చుక్కల దుప్పి, సాంబర్ దుప్పి, కొండగొర్రెలు, మూషిక జింకలు, మనుబోతు, కృష్ణ జింకలు మొసళ్లు, తాబేళ్లు, నక్షత్ర తాబేళ్లు, గ్రీన్ ఇంగ్వానా(తొండ) నాలుగు రకాల సరీసృపాలు, నిప్పుకోడి, రియా, నెమళ్లు, నలుపు, తెలుపు హంసలు, రామచిలుక, లవ్ బర్డ్స్ వంటి 26 రకాల పక్షులున్నాయి. సందర్శకులకు కనువిందు చేయడానికి పెద్దపులులను తీసుకొచ్చినా వాటిలో ఒకటి చనిపోయింది. మరొకటి అనారోగ్యానికి గురవడంతో హైదరాబాద్ జూపార్క్‌కు తరలించారు. కొత్తగా హాగ్డీర్, బార్కింగ్డీర్, (దక్షిణ ఎరుపురంగు జింకలు) లుటినో పార్కిట్ (పసుపురంగు రామచిలుక)లు అందుబాటులో ఉన్నాయి. -
పాలకుర్తి సమగ్ర అభివృద్ధికి సహకరించాలి
● మంత్రిని కోరిన ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పాలకుర్తి టౌన్: పాలకుర్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి కోరారు. హైదరాబాద్‌లో శనివారం మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ను టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డితో కలిసి ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గంలోని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ పథకాలు మరింత సమర్థవంతంగా అమలయ్యేలా పనిచేయాలని మంత్రి అన్నారు. మహిళల సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి మహిళల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర మహిళా కమిషన్ మరింత కృషి చేయాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. శనివారం తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన నేరేళ్ల శారదను ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
హేమాచల క్షేత్రంలో ప్రత్యేక పూజలు
మంగపేట: మండలపరిధిలోని హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. ఆలయంలోని స్వయంభూ స్వామి వారిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్నారు. చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్న భక్తులు లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మికి పూలు, పండ్లు, పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు అనిపెద్ది రాజీవ్‌శర్మ, కారంపుడి పవన్‌కుమార్ ఆచార్యులు, వెంకటనారాయణ శర్మ స్వామివారికి నువ్వుల నూనెతో తిల తైలాభిషేకం, ప్రత్యేక అర్చనలు జరిపించారు. -
వందశాతం సంస్థాగత ప్రసవాలు
జనగామ: జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–6లో జిల్లా మాతా, శిశు ఆరోగ్యానికి సంబంధించి పలు కీలక గణాంకాలు నమోదయ్యాయి. జిల్లాలో వందశాతం ప్రసవాలు ఆస్పత్రుల్లోనే జరగడం విశేషం. ఇందులో 68.6 శాతం ప్రసవాలు ప్రభుత్వ వైద్య సంస్థల్లో జరిగాయి. అలాగే వందశాతం ప్రసవాలకు శిక్షణ పొందిన ఆరోగ్య సిబ్బంది సేవలు అందించారు. మొత్తం ప్రసవాల్లో సిజేరియన్ వాటా 70.2 శాతంగా నమోదైంది. గర్భిణుల వైద్య పరీక్షల్లో పురోగతి ఐదేళ్లలో జరిగిన ప్రసవాలను పరిశీలిస్తే 93.5 శాతం మంది తల్లులు తొలి త్రైమాసికంలోనే ప్రసవ పూర్వ పరీక్షలు చేయించుకున్నారు. వందశాతం మంది తల్లులకు గర్భధారణ సమయంలో ఏదో ఒక దశలో వైద్య సేవలు అందాయి. కనీసం నాలుగు ప్రసవ పూర్వ పరీక్షలు చేయించుకున్న వారి శాతం 84.6గా నమోదైంది. 85.1 శాతం మంది గర్భిణులు వందరోజులు లేదా అంతకంటే ఎ క్కువ కాలం ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు తీసుకున్నారు. టీకాల్లో 93 శాతం పూర్తి కవరేజీ 12–23 నెలల వయసున్న పిల్లల్లో టీకా కార్డు లేదా తల్లి జ్ఞాపకం ఆధారంగా 93 శాతం మంది పూర్తి టీకాలు పొందినట్లు సర్వేలో వెల్లడైంది. ఇదే వయసు పిల్లల్లో 93 శాతం మందికి మూడు డోసుల పోలియో, పెంటావాలెంట్ టీకాలు అందాయి. 9–35 నెలల వయసున్న పిల్లల్లో 94.2 శాతం మందికి గత ఆరు నెలల్లో విటమిన్– ఏ మోతాదు అందింది. పిల్లల పోషణపై ఆందోళన ఐదేళ్లలోపు పిల్లల్లో 29.2 శాతం మంది వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడం, 16.5 శాతం మంది ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం, 24 శాతం మంది తక్కువ బరువుతో ఉన్నట్లు సర్వే గుర్తించింది. 6–23 నెలల పిల్లల్లో కేవలం 17.9 శాతం మందికే తగిన ఆహారం అందుతున్నట్లు నమోదైంది. మరోవైపు జిల్లాలో 99.8 శాతం కుటుంబాలకు మెరుగైన తాగునీటి వనరు, 88.8 శాతం కుటుంబాల్లో కనీసం ఒకరికి ఆరోగ్య బీమా లేదా ఆర్థిక సహాయ పథకం కవరేజీ ఉన్నట్లు గణాంకాలు వెల్లడించాయి. ఎన్ఎఫ్హెచ్ఎస్–6లోని 2023–24 జిల్లా గణాంకాల ఆధారంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. మొత్తంగా చూస్తే సంస్థాగత ప్రసవాలు, ప్రసవ పూర్వ వైద్య సేవలు, టీకాల విషయంలో జిల్లా మంచి స్థాయిలో ఉండగా, చిన్నారుల పోషకాహారంలో మరింత మెరుగుదల అవసరమని గణాంకాలు సూచిస్తున్నాయి. గర్భిణుల వైద్యపరీక్షల్లో గణనీయ పురోగతి జిల్లాలో 93 శాతం చిన్నారులకు పూర్తి టీకాలు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–6లో వెల్లడి -
మహనీయులకు ఘన నివాళి
జనగామ రూరల్: గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో 157వ గాంధీ జయంతి, 122వ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి మహనీయుల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈసందర్భంగా 12వ తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో జిల్లాకు చెందిన క్రీడాకారులు ప్రతిభ కనబరిచి, 2 స్వర్ణ పతకాలు, 4 రజత పతకాలు సాధించగా వారిని కలెక్టర్ అభినందించి సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ అధికారి ఎన్.ఎల్. నరసింహ రావు, అధికారులు పాల్గొన్నారు. -
బ్యాడ్మింటన్ జాతీయస్థాయి పోటీలకు కావ్యశ్రీ
రఘునాథపల్లి: మండలంలోని అశ్వరావుపల్లి ఉన్నత పాఠశాల కు చెందిన పదో తరగతి విద్యార్థిని ప్యారాల కావ్యశ్రీ జాతీయ స్థాయి సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికై న ట్లు పాఠశాల హెచ్ఎం శోభన్‌బాబు, పీఈటీ మచ్చ రాజేందర్ శుక్రవారం తెలిపారు. మెదక్ జిల్లా బీహెచ్ఎల్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో కావ్యశ్రీ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ందన్నారు. ఈ నెల 3,4, 5,6,7 తేదీల్లో చత్తీస్‌గఢ్‌లో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో కావ్యశ్రీ పాల్గొంటుందన్నారు. ఈ సందర్బంగా కావ్యశ్రీని సర్పంచ్ చైతన్య రాజు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ రేణుక, ఉపాధ్యాయులు అభినందించారు. -
శనివారం శ్రీ 3 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
●సాక్షిప్రతినిధి, వరంగల్ : సికింద్రాబాద్–న్యూఢిల్లీ మధ్య ఉత్తర తెలంగాణను దేశ రాజధానితో అనుసంధానిస్తూ ఐదు దశాబ్దాలుగా పరుగులు తీస్తున్న తెలంగాణ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12723/12724) 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోనుంది. 1976, అక్టోబర్ 3న అప్పటి ఆంధ్రప్రదేశ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌గా ప్రారంభమైన ఈ రైలు.. రాష్ట్ర విభజన అనంతరం పేరు మార్పు చేసుకుని నేటి(2026, అక్టోబర్ 3)తో ఐదు దశాబ్దాలు పూర్తి చేసుకుంటోంది. ఈ రైలుతో ఉమ్మడి వరంగల్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రారంభ సమయంలో కాజీపేట జంక్షన్‌లోనే హాల్ట్ ఉండేది. ఇక్కడి ప్రయాణికులు ఢిల్లీ, ఉత్తర భారత ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు ఇది కీలక రవాణా మార్గమైంది. వారానికి రెండు రోజులతో మొదలు.. 1976లో రైలు ప్రారంభించినప్పుడు వారానికి రెండు రోజులు మాత్రమే నడిచేది. అది కూడా 14 బోగీలతో సేవలందించేది. ప్రయాణికుల ఆదరణ, డిమాండ్ పెరగడంతో వారానికి మూడు రోజులకు సర్వీసులను పెంచారు. అనంతరం 1991లో నిత్యసేవగా మార్చడంతో పాటు బోగీల సంఖ్యను 24కు పెంచారు. ప్రస్తుతం ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో నడుస్తుండగా.. రైలులో 22 కోచ్‌లు ఉంటున్నాయి. రైలు ప్రారంభించిన తొలినాళ్లలో కాజీపేట జంక్షన్లో మాత్రమే స్టాప్ సదుపాయం ఉండేది. దీంతో వరంగల్, హనుమకొండతో పాటు ఉత్తర తెలంగాణ ప్రాంతాల నుంచి ఢిల్లీ వెళ్లే ప్రయాణికులకు కాజీపేట కీలక బోర్డింగ్ పాయింట్‌గా మారింది. తర్వాత ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా సిర్పూర్ కాగజ్‌నగర్, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లిలోనూ హాల్ట్ సదుపాయం కల్పించారు. -
కొనేటోళ్లు లేరు
అమ్మేటోళ్లు లేరు.. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి గడ్డుకాలం..● 90 శాతం పడిపోయిన లావాదేవీలు ● అడ్వాన్సులు ఇచ్చిన వ్యాపారులకు వడ్డీల భారం ● అత్యవసరమైతేనే నష్టానికి ప్లాట్ల విక్రయంజిల్లాలో ఒకప్పుడు జోరుగా సాగిన రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రస్తుతం తీవ్రమాంద్యాన్ని ఎదుర్కొంటోంది. భూములు, ప్లాట్ల ధరలు గతంతో పోలిస్తే తగ్గినా కొనుగోలుదారులు ముందుకు రాకపోవడంతో మార్కెట్ స్తబ్ధంగా మారింది. జిల్లాలో సుమారు 1,500 మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నట్లు అంచనా ఉండగా, ప్రస్తుతం సుమారు 200 మంది మాత్రమే క్రియాశీలంగా ఉన్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని వ్యవసాయ భూములు, కమర్షియల్ ప్లాట్ల వివరాలు పంచుకుంటూ వ్యాపారం కొనసాగిస్తున్నా, రెండున్నరేళ్లుగా పరిస్థితి పూర్తిగా మారిపోయిందని వాపోతున్నారు. –జనగామ జిల్లాలో గతంలో ఎకరం రూ.50 లక్షల వరకు పలికిన భూమి ప్రస్తుతం రూ.30 లక్షల స్థాయికి పడిపోయినట్లు రియల్ ఎస్టేట్ వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ధర తగ్గినప్పటికీ కొనుగోలు దారులు ముందుకు రావడం లేదు. దీంతో ధర కంటే డిమాండ్ లేకపోవడమే ప్రధాన సమస్యగా మారిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రంలో గతంలో గజం రూ.20 వేల వరకు పలికిన కొన్ని కమర్షియల్ ప్లాట్ల ధర ప్రస్తుతం రూ.13 వేల నుంచి రూ. 15 వేల వరకు తగ్గినట్లు చెబుతున్నారు. అయినప్పటికీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపేవారి సంఖ్య తక్కువగానే ఉంది. గతంలో సందడి.. ఇప్పుడు వెలవెల గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రోజుకు 100 నుంచి 200 ఎకరాల వరకు వ్యవసాయ భూముల లావాదేవీలు, 50 నుంచి 70 వరకు ప్లాట్ల విక్రయాలు జరిగేవని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం అప్పటి లావాదేవీల్లో 10 శాతం కూడా జరగడం లేదని పేర్కొంటున్నారు. వ్యవసాయ భూముల ధరలు కూడా కొన్ని ప్రాంతాల్లో ఎకరాకు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు పడిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. జనగామ, స్టేషన్ ఘన్పూర్, కొడకండ్ల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కమర్షియల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు గతంలో ఉన్న డిమాండ్ కనిపించడం లేదని, తహసీల్దార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందని అంటున్నారు. భూమి నుంచి బట్టల దుకాణం వరకు ప్రభావం రియల్ ఎస్టేట్ రంగం కేవలం భూముల కొనుగోలు, విక్రయాలకే పరిమితం కాదు. ఈ రంగంలోకి వచ్చే డబ్బు నిర్మాణ రంగం, వస్త్ర వ్యాపారం, వాహనాలు, హార్డ్‌వేర్, సిమెంట్, ఇసుక, విద్యుత్ సామగ్రి, ఫర్నిచర్ తదితర అనేక రంగాల్లోకి ప్రవహిస్తుంది. ఇప్పుడు భూముల లావాదేవీలు తగ్గడంతో ఆర్థిక చలామణి కూడా మందగించిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, చిన్నాచితక వ్యాపారులు, నిర్మాణ రంగంపై ఆధారపడిన కార్మికులు ఆదాయాన్ని కోల్పోతుండగా, స్థిరంగా ఉన్న వ్యాపారులు సైతం వ్యాపార విస్తరణను నిలిపివేసే పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటున్నారు. అప్పుడు అడ్వాన్సులు..ఇప్పుడు వడ్డీలు భూముల ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాతో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ముందుగానే భూములకు అడ్వాన్సులు చెల్లించి అగ్రిమెంట్లు చేసుకున్నారు. అయితే ఆ భూములు, ప్లాట్లు అనుకున్న సమయంలో విక్రయించకపోవడంతో ఇప్పుడు ఆర్థిక ఒత్తిడిలో చిక్కుకున్నారు. జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో ఒక్కొక్కరు రూ.25 లక్షల నుంచి రూ.కోటి, రూ.2 కోట్ల వరకు అడ్వాన్సులు చెల్లించిన సందర్భాలున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. విక్రయాలు జరగకపోవడంతో పెట్టుబడిగా పెట్టిన మొత్తానికి వడ్డీలు చెల్లించడం భారంగా మారింది. 90శాతం తగ్గాయి..గతంతో పోలిస్తే జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం 90శాతం తగ్గింది. ప్లాట్లు, వ్యవసాయ భూముల ధరలు చాలా వరకు తగ్గాయి. అయినప్పటికీ పాత ధరతో కొనుగోలు చేసిన వారు తగ్గించి అమ్మడం లేదు. కొనుగోలు చేసేవారు కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అత్యవసర సమయంలో అమ్ముకోవాల్సిన వారు మాత్రమే ఎంతో కొంత తగ్గించి అమ్ముతున్నారు. –అలూరి రమేశ్,గౌరవ అధ్యక్షుడు, జిల్లా రియల్ ఎస్టేట్ సంఘంజనగామ హౌసింగ్ బోర్డు ప్రాంతంలో ఓ వ్యక్తి గజం రూ. 5,200 చొప్పున 300కుపైగా గజాలు కొనుగోలు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఇటీవల అదే ప్లాట్‌ను గజం రూ.4 వేల చొప్పున విక్రయించాల్సి వచ్చింది. దీంతో గజానికి రూ.1,200 చొప్పున నష్టం వాటిల్లింది. మరో ప్రాంతంలో గతంలో గజం రూ.23 వేలకు విక్రయమైన స్థలాన్ని కొనుగోలుదారు ఏడాది పాటు ఎదురుచూసినప్పటికీ స్పందన లేకపోవడంతో చివరకు గజం రూ.18 వేలకు విక్రయించినట్లు తెలుస్తోంది. ఈ లావాదేవీలో గజానికి రూ.5 వేల వరకు నష్టం వచ్చింది. మార్కెట్ పూర్తిగా పడిపోతుందని భావించి వెంటనే విక్రయించే వారితో పాటు భవిష్యత్‌లో ధరలు మళ్లీ పెరుగుతాయన్న ఆశతో ప్లాట్లను అలాగే ఉంచుతున్నవారూ ఉన్నారు. దీంతో ఒకవైపు అమ్మేవారు ధర తగ్గించేందుకు సిద్ధంగా ఉన్నా, మరోవైపు కొనేవారు భవిష్యత్ పరిస్థితులను పరిశీలిస్తూ వెనుకడుగు వేస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. -
రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడలు ప్రారంభం
వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 52వ రాష్ట్రస్థాయి బాలుర కబడ్డీ పోటీలు, 36వ రాష్ట్రస్థాయి బాలికల కబడ్డీ పోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి సుమారు 68 జట్లకు చెందిన 1,300 మందికి పైగా క్రీడాకారులు, కోచ్‌లు, మేనేజర్లు, పీఈటీలు, పీడీలు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా పరిధిలోని హనుమకొండ, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల క్రీడాకారులు చేసిన మార్చ్ఫాస్ట్ ఆకట్టుకుంది. ఉత్తమ ఉపాధ్యాయుడిగా గణేష్ కందగట్ల రఘునాథపల్లి: గాంధీ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ లాల్‌బహదూర్ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో మండలంలోని వెల్ది మోడల్ స్కూల్, జూనియర్ కళాశాల పీజీజీ ఆంగ్ల ఉపాధ్యాయుడు గణేష్ కందగట్ల రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంయుక్తంగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేశాయి. ఈసందర్భంగా పురస్కారం అందుకున్న గణేష్ కందగట్లకు ప్రిన్సిపాల్ పాలకుర్తి శ్రీధర్, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు. దేవాదుల, ఎస్సారెస్పీ నీళ్లు విడుదల చేయాలి పాలకుర్తి టౌన్: నియోజకవకర్గంలోని రైతుల పంటలు కాపాడేందుకు దేవాదుల, శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) నుంచి వెంటనే సాగునీరు విడుదల చేయాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డిని కలిసి రైతుల సమస్యల ను వివరించారు. సాగునీరుందక వరి పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి రెండ్రోజుల్లో దేవాదుల నీటిని విడుదల చేస్తామని, ఎస్సారెస్పీ నీటి అంశాన్ని అధి కారులతో చర్చించి నిర్ణయం తీసుకుటామని హామీ ఇచ్చినట్లు దయాకర్‌రావు తెలిపారు. 5న స్పాట్ అడ్మిషన్లు కేయూ క్యాంపస్ : కేయూ ఫార్మసీ కళాశాలలో బీఫార్మసీ కోర్సులో మిగిలిన 8 సీట్ల భర్తీకి ఈ నెల 5న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణవేణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఫీజుతో సహా ఫార్మసీ కళాశాలకు హాజరు కావాలని సూచించారు. ఎప్‌సెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు స్పాట్ ఫీజుగా రూ.1,300, అర్హత సాధించని అభ్యర్థులు రూ 2,100 ఫీజు చెల్లించాలని సూచించారు. -
15నుంచి ఎయిర్‌పోర్టు పనులు
సాక్షి, వరంగల్: మామునూరు విమానాశ్రయ అభివృద్ధి పనుల్లో మరో కీలక ముందడుగు పడింది. ఈ నెల 15 నుంచి బౌండరీ వాల్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. విమానాశ్రయం కోసం కొత్తగా సేకరించిన భూమి చుట్టూ ప్రీ కాస్ట్ ప్రహరీ గోడ నిర్మించడంతో పాటు, ఇప్పటికే ఉన్న గోడ ఎత్తును పెంచేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) చర్యలు చేపట్టింది. ఇందుకోసం రూ.13.28 కోట్లతో హైదరాబాద్‌కు చెందిన సైడాక్స్ ఇంజనీర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు తాజాగా వర్క్ ఆర్డర్ జారీ చేసింది. ఈ నెల 14లోపు కాంట్రాక్టు సంస్థ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి, ఏఏఐ వరంగల్ విమానాశ్రయ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఇంజనీరింగ్–సివిల్) సమక్షంలో పనుల స్థలాన్ని స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. టెండర్ నిబంధనల ప్రకారం 15 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది. రూ.21.39 కోట్ల అంచనా.. 37.89 శాతం తక్కువకు టెండర్.. బౌండరీ వాల్ నిర్మాణ పనులకు ఏఏఐ అధికారులు రూ.21,39,52,823 అంచనా వ్యయాన్ని నిర్ణయించారు. టెండర్ ప్రక్రియలో సైడాక్స్ ఇంజనీర్స్ సంస్థ రూ.13,28,86,521.60కు పనులు చేపట్టేందుకు ముందుకొచ్చింది. అంచనా వ్యయం కంటే 37.89 శాతం తక్కువకు టెండర్ దక్కించుకుంది. ఈ మొత్తానికి జీఎస్టీ అదనం. వర్క్ ఆర్డర్ జారీ కావడంతో నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేసి ఈ నెల 15నుంచి పనులు చేపట్టనున్నారు. భద్రతా నిబంధనలకు అనుగుణంగా... ఈ ప్రాజెక్ట్‌లో రెండు ప్రధాన పనులు చేపట్టనున్నారు. విమానాశ్రయం కోసం కొత్తగా సేకరించిన భూమి చుట్టూ ప్రీ కాస్ట్ బౌండరీ వాల్ నిర్మించనున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న ప్రహరీ గోడ ఎత్తును బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్న్ సెక్యూరిటీ (బీసీఏఎస్) నిబంధనలకు అనుగుణంగా పెంచనున్నారు. విమానాశ్రయ భూముల పరిరక్షణ, అనధికార ప్రవేశాల నియంత్రణ, భద్రతాపరమైన ఏర్పాట్లకు ఈ పనులు దోహదపడనున్నాయి. ఇదిలా ఉండగా 949.44 ఎకరాల విస్తీర్ణంలో కొద్ది నెలల క్రితం రూ.203.49 కోట్లతో రన్ వే ఆధునీకరణనుంచి టెర్మినల్‌కు అనుసంధాన రహదారులు, విమానాల పార్కింగ్ ఆప్రాన్, ట్యాక్సీ వేలు, గ్రౌండ్ సపోర్ట్ సదుపాయాల వరకు టెండర్లు పిలిచిన ఏఏఐ...ఇటీవల రూ. 213.59 కోట్ల అంచనా వ్యయంతో నూతన డొమెస్టిక్ టెర్మినల్ బిల్డింగ్, ఏటీసీ టవర్ కమ్ టెక్నికల్ బ్లాక్, ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్, ఫైర్ స్టేషన్, ఈఅండ్ఎం వర్క్‌షాప్ వంటి కీలక మౌలిక వసతులను నిర్మించేందుకు టెండర్లు పిలిచిన విషయం తెలిసిందే. కీలకమైన ఈ పనులు కూడా ట్రాక్‌లోకి ఎక్కితే మామునూరు విమానాశ్రయ నిర్మాణ పనులు ఊపందుకోనున్నాయి. రూ.13.28 కోట్లతో బౌండరీ వాల్ నిర్మాణం ప్రారంభం కొత్తగా సేకరించిన భూమి చుట్టూ ప్రీ కాస్ట్ ప్రహరీ పాతగోడ ఎత్తు పెంపునకు చర్యలు 15 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యం -
ఓటు హక్కు పరిరక్షణకు కార్యాచరణ
● ప్రకటించిన ఇండియా కూటమి ప్రతినిధులుజనగామ: ఓటు హక్కు పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇండియా కూటమి, టీపీసీసీ పిలుపు మేరకు జిల్లాలో పలు కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రతినిధులు ప్రకటించారు. ‘సేవ్ డెమోక్రసీ వీక్–ఓట్ బచావో–దేశ్ బచావో’ కార్యక్రమాల్లో భాగంగా డీసీసీ కార్యాలయంలో శుక్రవారం కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ధన్వంతి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీతో పాటు మాజీ ఎమ్మెల్యే, సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్. రాజారెడ్డి, జిల్లా నాయకుడు మోకు కనకారెడ్డి, టీపీసీసీ సభ్యుడు, వైటీడీఏ మెంబర్ డాక్టర్ ఎల్.లక్ష్మీనారాయణ నాయక్ మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా నుంచి ఓట్ల తొలగింపు, ఓట్ చోరీ ఆరోపణలు, ఓటు హక్కు పరిరక్షణ తదితర అంశాలపై నాయకులు చర్చించామన్నారు. ఓటు హక్కు పరిరక్షణకు అన్ని పార్టీలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమాలను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లి ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నెల 3వ తేదీన మండల కేంద్రాల్లో ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల నాయకులతో సంయుక్త సమావేశాలు, 5న మండల కేంద్రాల్లో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ర్యాలీలు, 8న జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సమావేశంలో నాయకులు బూడిద గోపి, జోగు ప్రకాష్, ఆది సాయన్న, ఎనగంధుల ఉమాపతి, ఎర్రమల్ల సుధాకర్, వేమళ్ల సత్యనారాయణరెడ్డి, వేముల మల్లేష్, ఇందిరా, మాజిద్ అప్సర్, జాయ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. -
పోరాటస్ఫూర్తి నల్లా నర్సింహులు
జనగామ: నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నడిపిన కామ్రేడ్ నల్లా నర్సింహులు పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలని వక్తలు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో మన ఆలోచన సాధన సమితి ఆధ్వర్యంలో నల్లా నర్సింహులు శత జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట ఉన్న నల్లా నర్సింహులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జయంతి సభ నిర్వహించారు. నల్లా నర్సింహులు శత జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సభకు, రాష్ట్ర కార్యదర్శి గునిగంటి చంద్రశేఖర్‌గౌడ్, మంగళంపల్లి రాజు కార్యక్రమాన్ని పర్యవేక్షించగా, సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నర్సింగ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నర్సింగ్ రావు మాట్లాడుతూ.. నల్లా నర్సింహులు వెట్టిచాకిరి, దొరల దోపిడీ, భూస్వాముల పీడన, అప్రజాస్వామిక పాలనకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తుచేశారు. కార్యక్రమంలో నల్లా అరుణ, సామాజిక ఉద్యమకారుడు, రచయిత పాశం యాదగిరి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యేల్, బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, బీసీ ఉద్యమకారుడు వట్టె జానయ్య యాదవ్, జనగామ మున్సిపల్ చైర్‌పర్సన్‌న్ కడకంచి బాలమణిశ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్లు, వివిధ కుల, బీసీ, బహుజన సంఘాల ప్రతినిధులు, తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు. -
‘డబుల్’ ఇళ్ల మంజూరులో పారదర్శకత: కమిషనర్
జనగామ: ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మంజూరు విషయంలో ప్రజలు ఆధారాలు లేని వదంతులను నమ్మొద్దని జనగామ ము న్సిపల్ కమిషనర్ రాజశేఖర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇళ్ల మంజూరు పేరుతో ఓ లబ్ధిదారురాలి నుంచి రూ.లక్ష డిమాండ్ చేసినట్లు వచ్చిన సమాచారంపై కమిషనర్ స్పందించారు. సంబంధిత లబ్ధిదా రురాలిని పిలిపించి విచారించినట్లు తెలిపారు. విచారణలో మున్సిపల్ ఉద్యోగులు ఎవరూ తన ఇంటికి రాలేదని, ఎవరూ డబ్బులు అడగలేదని, తాను ఎవరికీ డబ్బులు చెల్లించలేదని లబ్ధిదారురాలు స్పష్టం చేసినట్లు కమిషనర్ తెలిపారు. అయితే గుర్తుతెలియని వ్యక్తి తన ఇంటికి వచ్చి రూ.లక్ష అడిగినట్లు ఆమె వెల్లడించిందన్నారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు ఇందిరమ్మ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, పంపిణీ ప్రక్రియను పారదర్శకంగా, డ్రా విధానంలో నిర్వహిస్తున్నామన్నారు. ఇళ్ల మంజూరు పేరుతో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే ఆధారాలతో మున్సిపల్ కార్యాలయానికి ఫిర్యాదు చేయాలన్నారు. ఫిర్యాదులపై విచారణ జరిపి వాస్తవాలు నిర్దారణ అయితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషనర్ స్పష్టం చేశారు. ‘గాంధీ జయంతి రోజు జీవ హింస చేయొద్దు’జనగామ/స్టేషన్‌ఘన్‌పూర్: ఈనెల 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని జీవహింస చేయొద్దని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ ము న్సిపల్ కమిషనర్లు రాజశేఖర్‌రెడ్డి, రాధాకృష్ణ బుధవారం వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. పట్టణంలోని చికెన్, మటన్ సెంటర్ల వ్యాపారులు మాంసం విక్రయాలు చేయొద్దన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే ట్రేడ్ లైసెన్స్ రద్దుతో పాటు రూ.10వేల జరిమానా విధించనున్నట్లు తెలిపారు. ముఖ్య కూడళ్లతో పాటు ప్రతీ వార్డులో నిఘా ఉంటుందన్నారు. కటాస్‌లో గిన్నిస్ రికార్డు పాలకుర్తి టౌన్: కరాటే కాటాస్ విభాగంలో ప్రతిభ కనబర్చి గిన్నిస్ రికార్డు సాధించారు మండలంలోని శాతపురంకు చెందిన మాస్టర్లు బానోతు బాలుకుమార్, భూక్య రమేష్. ఈ మేరకు ఇటీవల హైదరాబాద్‌లో కరాటే విజన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ, ఇంటర్నేషనల్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో ప్రపంచ వ్యాప్తంగా 2000 మందికిపైగా క్రీడాకారులు పాల్గొన్నారు. కాటాస్ విభాగంలో మాస్టర్లు బా లుకుమార్, రమేష్ అద్భుత ప్రతిభ కనబర్చి గిన్నిస్ రికార్డు సాధించారు. ఈ మేరకు బుధవారం మండలకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాలుకుమార్, రమేష్‌లను ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో రాపాక సత్యనారాయణ, పోగు శ్రీనివాస్, ఎండీ మదార్, యాక య్య, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. జాతర ఏర్పాట్లపై సూచనలు లింగాలఘణపురం: మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల జాతర ఏర్పాట్లపై బుధవారం జనగామ ఆర్డీఓ గోపీరామ్ అధికారులకు సూచనలు చేశారు. ఇటీవల ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆధ్వర్యంలో నవంబర్‌లో జరిగే బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలని సమీక్ష సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆర్డీఓ గోపీరామ్ ఆలయాన్ని సందర్శించారు. సానిటేషన్, గ్రీనరీ ఏర్పాట్లు, తాగునీటి వసతి, విద్యుత్ సౌకర్యం, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై ఆర్డీఓ అధికారులకు సూచనలు చేశారు. తహసీల్దార్ అండాలు, ఎంపీడీఓ శివశంకర్‌రెడ్డి, డాక్టర్ ఉదయ్‌కిరణ్, ట్రాన్స్‌కో ఏఈ శంకరయ్య, ఈఓ వంశీ, దేవస్థాన చైర్మన్ మూర్తి తదితరులు ఉన్నారు. జనగామ: స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరి ధిలో 2బీ బార్ ఏర్పాటుకు ఆసక్తి గల వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అ బ్కారీ శాఖ అధికారి ఎన్. అంజిరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బార్ లైసె న్స్నకు ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు దరఖాస్తులు సెప్టెంబర్ 27వ తేదీ నుంచి ఈనెల 12వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి కార్యాలయం, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కార్యాలయం, కాజీపేట, కమిషనర్, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్, రాష్ట్ర కార్యాలయం, హైదారాబాద్‌లలో సమర్పించవచ్చన్నారు. దరఖాస్తు రుసుం రూ.1లక్ష చెల్లించాల్సి ఉంటుందన్నారు. వివరాలకు వెబ్సైట్ టీజీబీసీఎల్.తెలంగాణ.జీవీఓ.ఇన్ లేదా జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి ఎన్.అంజిరెడ్డి (87126 58996), స్టేషన్‌ఘన్‌పూర్ ఎస్హెచ్ఓ (87126 59006)ను సంప్రదించవచ్చన్నారు. -
సోలార్ సేవల వారధి..
హన్మకొండ: సోలార్ విద్యుత్ ఉత్పత్తి పెంపే లక్ష్యంగా టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ముందుకు సాగుతోంది. అక్టోబర్ 1, 2, 3 తేదీల్లో ప్రతీ విద్యుత్ డివిజన్ స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించనుంది. ఉమ్మడి జిల్లాలోని ఆరు సర్కిళ్లలోని 13 డివిజన్లలో ఈ సదస్సులు నిర్వహించనున్నారు. హనుమకొండ సర్కిల్లో హనుమకొండ టౌన్, హనుమకొండ రూరల్ డివిజన్లు, వరంగల్ సర్కిల్లో వరంగల్‌టౌన్, నర్సంపేట, వరంగల్ రూరల్ డివిజన్లు. జనగామ సర్కిల్లో జనగామ టౌన్, స్టేషన్ ఘన్పూర్ డివిజన్లు, మహబూబాబాద్ సర్కిల్లో మహబూబాబాద్, తొర్రూరు డివిజన్, భూపాలపల్లి సర్కిల్లో భూపాలపల్లి, కాటారం డివిజన్లు, ములుగు సర్కిల్లో ములుగు, ఏటూరునాగారం డివిజన్లు ఉన్నాయి. అవగాహన కల్పిస్తారిలా.. ‘సేవా సేతు’ కార్యక్రమంలో భాగంగా నేటి (గురువారం) నుంచి డివిజన్ స్థాయిలో పీఎం సూర్య ఘర్ పథకంపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. అధికారుల సూచనలతో పాటు బ్యాంకు రుణాల జారీ, వినియోగంపై సంపూర్ణ అవగాహన కల్పిస్తారు. ఈమేరకు ఒకే వేదికపై టీజీ ఎన్పీడీసీ ఎల్, రెడ్కో అధికారులతో పాటు బ్యాంకర్లు పాల్గొననున్నారు. రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలని ఆసక్తి కలిగిన వినియోగదారులకు అప్పటికప్పుడు రుణ మంజూరుతో పాటు అధికారులు.. అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తారు. దీంతో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలనుకునే గృహ వినియోగదారులకు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే ఒకే చోట అన్ని పనులు పూర్తి కానున్నాయి. కాగా, పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనపై టీజీ ఎన్పీడీసీఎల్ ఐపీసీ, రాక్ చీఫ్ ఇంజనీర్ కె.వెంకటరమణ బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని కార్యాలయంనుంచి ఎస్ఈలు, డివిజన్ ఇంజనీర్లకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. నేటినుంచి అవగాహన సదస్సులు పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనలో భాగంగా రూఫ్‌టాప్ సోలార్‌పై మూడు రోజుల పాడు డివిజ న్ల వారీగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్ సర్కిల్ (జిల్లా) సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎ.ఆనందం తెలిపారు. అక్టోబర్ 1న వరంగల్ ఓ సిటీలోని టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్ సబ్ డివిజన్ టీజీఎన్పీడీసీల్ కార్యాలయంలో, 2న ఎన్పీడీసీఎల్ వర్ధన్నపేట సబ్ డివిజన్ కార్యాలయంలో, 3న నర్సంపేట రైతు వేదిక కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ప్రకటలో తెలిపారు. ఈ సదస్సులో ఎన్పీడీసీల్, రెడ్కో అధికారులు పాల్గొని అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. రుణ సౌకర్యంపై బ్యాంకర్లు వివరిస్తారని తెలిపారు. విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. రూప్‌టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పా టు చేసుకోవడంపై వినియోగదారులకు ఒకే వేదికపై పూర్తి సమాచారం అందిస్తాం. సేవా సేతు కార్యక్రమాల్లో వినియోగదారులకు రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటుకు సంబంధించిన విఽ దానం, దరఖాస్తు ప్రక్రియ, సబ్సిడీ, బ్యాంకు రుణ సదుపాయాలు, నెట్ మీటరింగ్, విద్యుత్ బిల్లులో కలిగే ప్రయోజనాలు తదితర అంశాలపై అధికారులు అవగాహన కల్పిస్తారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – కె.వెంకటరమణ, టీజీ ఎన్పీడీసీఎల్ ఐసీసీ–రాక్ చీఫ్ ఇంజనీర్ పీఎం సూర్య ఘర్–ముఫ్త్ బిజ్లీ యోజన ద్వారా తమ ఇళ్ల పైకప్పులపై రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని విద్యుత్‌ను వినియోగించుకోవచ్చు. ఈపథకం కింద గృహ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయం అందజేస్తోంది. ఒక కిలోవాట్‌కు రూ.30,000, 2 కిలోవా ట్లకు రూ.60,000, 3 కిలోవాట్లకు ఆపైన కిలో వాట్ల సామర్థ్యానికి గరిష్ఠంగా రూ.78,000 కేంద్ర ప్రభుత్వం రాయితీ అందిస్తోంది. విద్యుత్ బిల్లును తగ్గించుకునే అవకాశంతో పాటు మిగులు విద్యుత్‌తో అదనపు ఆదాయం పొందవచ్చు పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా 3 కిలోవా ట్లకు దాదాపు నెలకు 450 యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి చేసుకొనే అవకాశం ఉంది. టిజీఎన్పీడీసీఎల్ పరిధిలో ప్రస్తుతం 34,023 విద్యుత్ సర్వీస్ (వినియోగదారుల రూప్ టాప్ సోలార్)ల ద్వారా 203.1 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ప్రస్తుతం 60 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 20,000 దరఖాస్తులు పురోగతిలో ఉన్నాయి. నేటి నుంచి పీఎం సూర్యఘర్‌పై అవగాహన సదస్సులు సోలార్ విద్యుత్ ఉత్పత్తి పెంపే లక్ష్యంగా టీజీఎన్పీడీసీఎల్ ఒకే వేదికపై డిస్కం, రెడ్కో, బ్యాంకర్లు ఎన్పీడీసీఎల్ పరిధిలో 203.10 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి -
చర్యలు తీసుకోవాలి
ప్రమాదాల నివారణకుజనగామ రూరల్: జిల్లాలో రహదారి భద్రతను మరింత పటిష్టం చేయడంతో పాటు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో డీసీపీ రాజమహేంద్ర నాయక్‌తో కలిసి రహదారి భద్రత కమిటీ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని జాతీయ రహదారులు, ప్రధాన రహదారులపై రహదారి భద్రతా చర్యలు, ప్రమాదాల నివారణ, అనధికార పార్కింగ్లు, రహదారి సూచికలు, లైటింగ్, సర్వీస్ రోడ్లు, వాహనాల వేగ నియంత్రణ, తదితర అంశాలపై సమీక్షించారు. కోమల్ల టోల్ ప్లాజా వద్ద అనధికార పార్కింగ్‌ను తొలగించాలని, కరుణాపురం ప్రాంతంలోని మద్యం దుకాణాల వద్ద పార్కింగ్ సమస్యలను పరిష్కరించి, రహదారిపై వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు అవసరమైన ప్రాంతాల్లో రంబుల్ స్ట్రిప్స్, థర్మోప్లాస్టిక్ పాయింట్లు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాల బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, ఉన్న కెమెరాల పనితీరును తనిఖీ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు గోపీరాం, కిరణ్ ప్రకాష్, ఏసీపీ భీం శర్మ, ఆర్టీఏ సభ్యులు చిలువేరు అభిగౌడ్, నేషనల్ హైవేస్ హెచ్ఎంఆర్ఈ మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు రాజశేఖర్ రెడ్డి, రాధాకృష్ణ, డీఎంహెచ్ఓ వాణిశ్రీ, డీపీఓ వెంకట్‌రెడ్డి, ఏడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మత్తు పదార్థాల నియంత్రణకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో డీసీపీ రాజమహేంద్రనాయక్‌తో కలిసి సంబంధిత శాఖ అధికారులతో సమీక్షించారు. మత్తు పదార్థాల వినియోగం వ్యక్తిగత ఆరో గ్యానికే కాకుండా కుటుంబ వ్యవస్థ, సమాజ భద్రతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున, వాటి నియంత్రణకు సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలన్నారు. కొత్త ఓటరు జాబితా తయారీకి షెడ్యూల్ జనగామ: వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ కొత్త ఓటరు జాబితా తయారీకి షెడ్యూల్ విడుదలైనట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సందీప్ కుమార్ ఝా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 3 సంవత్సరాల క్రితం డిగ్రీ పూర్తి చేసిన అర్హత కలిగిన అభ్యర్థులు ఫారం 18 దరఖాస్తును ఏఈఆర్వోలకు లేదా నియమిత అధికారికి సమర్పించాలన్నారు. నవంబర్ 6 వరకు దరఖాస్తుల స్వీకరణ, 20 వరకు ముసాయిదా జాబితా తయారీ, ముద్రణ ప్రక్రియ పూర్తి చేసి, అదే నెల 25న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. డిసెంబర్ 10 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరణ, 25లోగా వాటిని పరిష్కరించి, సప్లిమెంట్లను సిద్ధం చేసి, డిసెంబర్ 30న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామన్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
విద్యా ప్రమాణాలపై నిఘా!
జనగామ: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, బోధన, అభ్యసన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు జిల్లా విద్యాశాఖ అకడమిక్ ప్యానల్ ఇన్స్పెక్షన్ బృందాల జాబితాను ఖరారు చేసింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి, సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు అధికారి సందీప్ కుమార్ ఝా (ఐఏఎస్) ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర సమగ్ర శిక్ష మార్గదర్శకాల మేరకు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో అకడమిక్ మానిటరింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన అకడమిక్ ప్యానల్ బృందాల్లోని ఒక నోడల్ అధికారి, ప్రాథమిక పాఠశాల బృందంలోని ఒక సభ్యుడు, ప్రాథమికోన్నత పాఠశాల బృందంలోని మరో సభ్యుడు జిల్లా ఎఫ్ఎల్ఎన్ సెల్‌కు బదిలీ అయ్యారు. దీంతో వారు తనిఖీ విధులకు అందుబాటులో లేకపోవడంతో వారి స్థానంలో ప్రత్యామ్నాయ సభ్యులను నియమించి బృందాలను సవరించారు. నిర్దేశిత బృందం నిర్మాణాన్ని కొనసాగిస్తూ కొత్త జాబితాను ఆమోదించారు. హైస్కూల్ అకడమిక్ ప్యానల్‌కు 103 పాఠశాలలను కేటాయించారు. నోడల్ అధికారిగా ఒబుల్కేశ్వాపూర్ ఉన్నత పాఠశాల గెజిటెడ్ హెచ్ఎం ఎన్.వాసుదేవరెడ్డిని నియమించారు. వివిధ సబ్జెక్టులకు చెందిన (శేషుకుమార్, కిషన్ కుమార్, రాంబాబు, శ్రీనివాస్, శ్రీనివాసచారి, సత్తయ్య, సుభాష్, వెంకటేశ్వర్లు) పాఠశాల సహాయకులను సభ్యులుగా నియమించారు. బహుళ సబ్జెక్టుల ఆధారంగా విద్యా ప్రమాణాలను పరిశీలించే విధంగా రూపొందించారు. అలాగే 64 ప్రాథమికోన్నత పాఠశాలలు, 93 ప్రాథమిక పాఠశాలలకు మూడు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసి నోడల్ అధికారి, సభ్యులను కేటాయించారు. అకడమిక్ తనిఖీల్లో తరగతి గది బోధన, ఉపాధ్యాయుల బోధనా పద్ధతులు, విద్యార్థుల అభ్యసన స్థాయి, ఉపాధ్యాయులు, విద్యార్థుల పరస్పర చర్యలు, విద్యా రికార్డులు, అకడమిక్ పద్ధతులను పరిశీలించనున్నారు. పాఠశాలల్లో ఉన్న విద్యాపరమైన లోపాలను గుర్తించి, పరిశీలన ఆధారంగా నిర్ణీత నమూనాలో నివేదికలు, అభిప్రాయాలను సమర్పించాల్సి ఉంటుంది. తనిఖీ బృందం సభ్యులు తమ సొంత పాఠశాలల్లో పని చేస్తుండటంతో వారి గైర్హాజరీ సమయంలో విద్యార్థుల సాధారణ బోధనకు అంతరాయం కలగకుండా హెచ్ఎంలు, మండల విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. అవసరమైతే అదే పాఠశాల లేదా సమీప పాఠశాలల్లోని అందుబాటులో ఉన్న అదనపు ఉపాధ్యాయులతో వర్క్ అడ్జస్ట్మెంట్ చేయాలని ఆదేశించారు.జనగామ పట్టణంలోని ధర్మకంచ పీఎంశ్రీ ఉన్నత పాఠశాలనోడల్ అధికారులు తనిఖీలను సమన్వయం చేసి, కేటాయించిన పాఠశాలల కవరేజీ, రికార్డుల నిర్వహణ, తనిఖీ నివేదికల సమర్పణను పర్యవేక్షించాలి. మండల విద్యాశాఖ అధికారులు, పర్యవేక్షణ అధికారులు తనిఖీ కార్యక్రమంతో పాటు వర్క్ అడ్జస్ట్మెంట్ అమలును కూడా పరిశీలించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో జిల్లాలో అకడమిక్ తనిఖీలకు పాఠశాల స్థాయి నుంచి తరగతి గది వరకు పరిశీలనకు ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. విభాగం కేటాయించిన నోడల్ అధికారి సభ్యులవివరాలు పాఠశాలలు ఉన్నత పాఠశాలలు 103 ఎన్. వాసుదేవరెడ్డి బి.శేషుకుమార్, పి.కిషన్‌కుమార్, బి. రాంబాబు, ఎం. శ్రీనివాస్, ప్రాథమికోన్నత పాఠశాలలు 64 ఎం. లక్ష్మంజీ టి.హరిప్రసాద్, ఎన్.జయపాల్‌రెడ్డి ప్రాథమిక పాఠశాలలు –టీమ్–1 93 చి.కన్నయ్య రమేష్, టి.సునీత టీమ్–2 93 జి. మంజుల జి.కనకయ్య, వి.సంతోష్ కుమార్ టీమ్–3 93 ఈ. శ్రీవాస్‌రెడ్డి పి.పరశురాములు, ఎం.రాఘవులుఅకడమిక్ ప్యానల్ తనిఖీ బృందాలు ఖరారు బోధన, అభ్యసన ప్రక్రియపై ప్రత్యేక దృష్టి జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పర్యవేక్షణ తనిఖీలకు వెళ్లే టీచర్ల స్థానంలో వర్క్ అడ్జస్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
విద్యావంతులుగా ఎదగాలి
● సీనియర్ సివిల్ జడ్జి శంకర శ్రీదేవి జనగామ రూరల్: పిల్లలు భవిష్యత్‌లో విద్యావంతులుగా ఎదగాలని సీనియర్ సివిల్ జడ్జి శంకరశ్రీదేవి అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మే రకు బుధవారం పట్టణంలోని బాల సదనంను సందర్శించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యంతో చదవాలన్నారు. అనంతరం విద్యార్థినులకు ఇంగ్లిష్ టు తెలుగు నిఘంటువులు అందించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ వరోనిక, వార్డెన్ నివేదిక, స్రవంతి పాల్గొన్నారు. అలాగే పట్టణంలోని సబ్జైల్ని సందర్శించారు. ఖైదీలతో బెయిల్ అంటే ఏమిటీ? ఎలా పొందాలి? న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ స లహాలు, తదితర విషయాలు వివరించారు. సూపరింటెండెంట్ కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
లిఫ్ట్ పనులు వేగవంతం చేయాలి
చిల్పూరు: గండి రామారం ఎత్తిపోతల పథకం లిఫ్ట్–1 పనులను వేగవంతం చేసి జనవరిలో రెండో పంటకు సాగునీరు అందించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని లింగంపల్లి గ్రామ శివారులోని గండి రామారం లిఫ్ట్ పంప్‌హౌస్ నిర్మాణ పనులను బుధవారం నీటి పారుదల శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ. 104 కోట్లతో గండి రామారం ఎత్తిపోతల ప్రా జెక్టు పనులను ప్రారంభించామన్నారు. గత పాలకులు లిఫ్ట్1, 3 పనులను పట్టించుకోలేదని, తాను ఎమ్మెల్యేగా ఎన్నికై న వెంటనే అధికారులు, కాంట్రాక్టర్ల వెంట పబడి పనులు చేయిస్తున్నానన్నారు. ప్రస్తుతం 70 శాతం పనులు పూర్తి అయ్యాయని, మిగతా పనులు త్వరగా పూర్తి చేసి జనవరిలో రెండో పంటకు సాగునీరు అందివ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా పంపుహౌస్ వద్ద ఏ పనులు ఎవరు చేయాలో అధికారులకే స్పష్టత లేకపోతే ఎలా? శాఖల మధ్య సమన్వయ లోపం ఉంటే రైతులే ఇబ్బంది పడేదని ఎమ్మెల్యే మండిపడ్డారు. ఎట్టి పరిస్థితిలో జనవరిలో సాగునీరు అందివ్వాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నీటి పారుదల శాఖ సీఈ సుధీర్, ఎస్ఈ సీతారాం, ఈఈ ప్రవీణ్, చిల్పూరు ఆలయ చైర్మన్ శ్రీధర్‌రా వు, మండల అధ్యక్షుడు చిర్ర నాగరాజు, ఎడవెల్లి మల్లారెడ్డి, వెన్నం రవీందర్‌రెడ్డి, సర్పంచ్‌లు కరుణాకర్, నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
బాహ్య మూల్యాంకన విధానాన్ని రద్దు చేయాలి
జనగామ రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో హోమ్ ఎగ్జామ్స్‌కు సంబంధించి ఒకటి నుంచి పదో తరగతి వరకు బాహ్య మూల్యాంకనం విధానాన్ని తక్షణమే ఉపసంహరించు కోవాలని టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు ఎన్.ఎన్. రాజు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధనా పరిస్థితులు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, ఉపాధ్యాయుల కొరత, పాఠశాలల్లో అందుబాటులో ఉన్న వసతులను పరిగణనలోకి తీసుకోకుండా సమస్యలు పరిష్కరించకుండా ఈ నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదన్నారు. జిల్లా అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ బాహ్య మూల్యాంకనాన్ని భవిష్యత్తులో ప్రవేశపెట్టాలనుకుంటే కనీసం మూడు సంవత్సరాల ముందస్తు ప్రణాళికతో, ఉపాధ్యాయులకు తగిన శిక్షణ, విద్యార్థులకు అభ్యసన సంసిద్ధత కల్పించి, అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మహ్మద్ అంకుషావలి, కుర్రేముల యాదగిరి, లక్మయ్య, వై.వజ్రయ్య, యు.శ్రీహరి, లక్మణ్ జీ, బానోతు వెంకన్న, సత్యనారాయణ రెడ్డి, దూడల రమేష్, శారదమ్మ, జే.రాజేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ -
ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిరసన
జనగామ రూరల్: పట్టణంలో మూడో విడత డబు ల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం స్థలం ఇచ్చిన లబ్ధిదారులకే పట్టాలు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సీపీఎం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాశ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట మూడో రోజు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కనకారెడ్డి మాట్లాడుతూ ఆర్థిక స్తోమత లేక ఇల్లు కట్టుకోలేని 72 మందికి డబుల్ బెడ్ రూమ్‌లు ఇస్తూ 2023 జూలైలో అప్పటి కలెక్టర్ ఆదేశంతో డ్రా తీసి వారికి ఇళ్లు కేటాయించారన్నారు. ఇటీవల ఆన్లైన్లో డబుల్ బెడ్ రూమ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ డ్రా తీశారని, పట్టాలు ఉన్న వారిని విస్మరించడం సరికాదన్నారు. ఇప్పటికై నా న్యాయబద్ధంగా అర్హులైన పట్టాలు కలిగి ఉన్న డబుల్ బెడ్ రూముల్లో నివాసం ఉంటున్న పేదలకే పట్టాలు ఇవ్వాలన్నారు. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకొని పేదలకు న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బూడిది గోపి, సుంచు విజేందర్, ఎండీ అజారుద్దీన్, కౌన్సిలర్ బూడిది జ్యోతి, కళ్యాణం లింగం, పల్లెర్ల లలిత, జయ, ఎండీ గౌసియా, కచగళ్ళ వెంకటేష్, మాదాసి సుధాకర్, సిలివేరు ఉపేందర్, పద్మ, అందాల, కమల, నాజియా, రేణుక కవిత, శశిరేఖ, సంతోష, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. -
వైద్య కళాశాలకు భౌతికకాయం
జనగామ: మరణానంతరం తన భౌతికకాయం వైద్య విద్యకు ఉపయోగపడాలనే సంకల్పంతో పాలకుర్తి మండలం గూడూరుకు చెందిన రిటైర్డ్ రెవెన్యూ అధికారి పాలడుగు రత్నాకర్‌రావు (68) ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుతం జనగామ పట్టణంలోని పద్మాలయ రెసిడెన్సీ, గ్రెయిన్ మార్కెట్ ప్రాంతం లో నివాసముంటున్న ఆయన తన తదనంతరం భౌతికకాయాన్ని జనగామ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అందజేసేందుకు బుధవారం బాడీ డొనేషన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగమణి, అనాటమీ విభాగం హెచ్ఓడీ డాక్టర్ జితేందర్‌కు బాడీ డొనేషన్ రిజిస్ట్రేషన్ ఫామ్‌లో అవసరమైన వివరాలను నమోదు చేసి లిఖితపూర్వకంగా అందజేశారు. కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో తన మరణానంతరం భౌతికకాయాన్ని వైద్య కళాశాలకు అందజేస్తానని గతంలో ఇచ్చిన హామీ మేరకు భార్య అరుణ సంతకంతో కూడిన అంగీకార పత్రాన్ని కూడా సమర్పించారు. ‘అక్షరం’ ఇచ్చిన స్ఫూర్తితో.. ప్రముఖ కవి శ్రీశ్రీ రచించిన ‘అనంతం’లోని అక్షర రూపం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని రత్నాకర్‌రావు తెలిపారు. మనిషి మరణించిన తర్వాత కూడా తన దేహం ద్వారా సమాజానికి, భవిష్యత్ వైద్యులకు ఉపయోగపడాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా పట్వారీగా, పంచాయతీ కార్యదర్శిగా ఎంఆర్‌ఐగా విధులు నిర్వహించిన ఆయన 2016లో పదవీ విరమణ పొందారు. అనంతరం సాహిత్య అభిరుచిని కొనసాగిస్తూ పలు రచనలు చేశారు. వైద్య విద్యకు విలువైన సేవ: డాక్టర్ నాగమణి మరణానంతరం భౌతికకాయాన్ని వైద్య కళాశాలకు దానం చేయడం గొప్ప సామాజిక సేవ అని, వైద్య విద్యార్థులకు మానవ శరీర నిర్మాణంపై ప్రత్యక్ష అధ్యయనానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని ప్రిన్సిపాల్ డాక్టర్ నాగమణి తెలిపారు. అనాటమీ హెచ్ఓడీ డాక్టర్ జితేందర్ మాట్లాడుతూ బాడీ డొనేషన్ ద్వారా భవిష్యత్ వైద్యులకు మానవ శరీర నిర్మాణంపై శాసీ్త్రయ అవగాహన పెరుగుతుందని, సమాజంలో మరింత మందికి ఈ దానంపై అవగాహన కలగాల్సిన అవసరం ఉందన్నారు. ముందస్తుగా అనుమతి పత్రం అందించిన రత్నాకర్‌రావు -
కాంగ్రెస్ పాలనలో అభివృద్ధిపథంలో గ్రామాలు
లింగాలఘణపురం: కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం మండలంలోని వనపర్తిలో రూ.10 లక్షల సీసీ రోడ్లు, కొత్తపల్లిలో రూ.37.50 లక్షల సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించారు. వనపర్తిలో మరో రూ.20 లక్షల సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ముఖ్యఅతిథిగా మాట్లాడారు.. బీఆర్ఎస్, బీజేపీ అధికారం కోసం విషం చిమ్ముతున్నాయని, వారికి ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. సమావేశాల్లో సర్పంచ్‌లు వంచ శైలజ ఉపేందర్‌రెడ్డి, విష్ణు, తహసీల్దార్ ఆండాలు, ఎంపీడీఓ శివశంకర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శివకుమార్, పార్టీ మండల అధ్యక్షుడు విజయ్‌మనోహర్, మాజీ జెడ్పీటీసీ, జిల్లా ఉపాధ్యక్షుడు వంశీధర్‌రెడ్డి, దిలీప్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు. జిల్లా విద్యుత్ ఉద్యోగుల యూనియన్ కార్యవర్గం జనగామ: తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా బి.వీరాంజనేయులు, కార్యదర్శిగా చెట్టిపల్లి నరేందర్‌రెడ్డి, సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బి.రాజ్‌కుమార్, కోశాధికారిగా కె.నారోత్తంరెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్, కంపెనీ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, రాష్ట్ర సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐలేష్ తదితరులు నూతన కార్యవర్గాన్ని అభినందించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం, సంఘం అభివృద్ధిపై నాయకులు చర్చించారు. కార్యక్రమంలో జనగామ అధ్యక్షు డు మూల మహేందర్, కార్యదర్శి కోతి విజయ్ కుమార్, కోశాధికారి బి.యాకయ్య, ఘన్పూర్ నాయకులు శ్రీధర్, ఫయాజ్, కృష్ణరాజు, కంపెనీ జాయింట్ సెక్రటరీ బి.ప్రశాంత్‌రెడ్డి, రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ జి.రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్‌రెడ్డిని నూతన కమి టీ మర్యాద పూర్వకంగా కలిసింది. 50 ప్రగతినగరాల్లో ఓరుగల్లుకు చోటు వరంగల్ అర్బన్: దేశవ్యాప్తంగా ఉన్న 50 ప్రగతినగరాల్లో ఓరుగల్లు ఒకటిగా నిలిచింది. రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్‌కు చోటు లభించింది. ఈ మేరకు మంగళవారం న్యూఢిల్లీ నుంచి కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ 50 ప్రగతి నగరాల వివరాలను వెల్లడించారు. సాలిడ్ వేస్ట్మేన్జ్మెంట్ రూల్స్–2026కు అనుగుణంగా నాలుగు రకాల వ్యర్థాలను మూలస్థాయిలోనే వేర్వేరుగా సేకరించాలని సూచించారు. పారిశుద్ధ్య సమస్యలు, ఫిర్యాదులను సులభతరం చేయడం, వాట్సాప్ ఆధారిత ప్రజా ఫిర్యాదుల వ్యవస్థకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర మంత్రి వివరించారు. నగరాల పరిశుభ్రతను మరింత మెరుగుపరచడంతో పాటు ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో హనుమకొండలోని కమిషనర్ క్యాంపు కార్యాలయం నుంచి గ్రేటర్ వరంగల్ కమిషనర్ టి.వెంకన్న, సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఎంహెచ్ఓ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. నేడు ‘డయల్ యువర్ డీఎం’ హన్మకొండ: ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు, సలహాలు సూచనలు స్వీకరించడానికి బుధవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ పుప్పాల అర్పిత తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు హనుమకొండలోని వరంగల్–1 డిపో నుంచి డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, పాలకుర్తి, తరిగొప్పుల తదితర రూట్ల ప్రయాణికులు 9959226047 నంబర్‌కు ఫోన్‌చేసి సలహాలు, సూచనలు ఇవ్వాలని, సమస్యలు చెప్పాలని కోరారు. -
చెత్తను రోడ్లపై, డ్రెయినేజీల్లో వేయొద్దు
● మున్సిపల్ చైర్పర్సన్ బాలమణి ● పురపాలికలో సహపంక్తి భోజనంజనగామ: చెత్తను రోడ్లపై, డ్రెయినేజీల్లో వేయకుండా స్వచ్ఛ జనగామ కోసం ప్రతీ పౌరుడు తమతో కలిసి రావాలని మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులు, కౌన్సిలర్లు, కమిషనర్, అధికారులు, సిబ్బందికి చైర్పర్సన్ సహపంక్తి భోజనం ఏర్పాటు చేశారు. ప్రజలు తడి, పొడి చెత్తను వేరు చేసి స్వచ్ఛ ఆటోల్లోనే వేయాలని, రోడ్లు, డ్రెయినేజీల్లో చెత్త వేయకుండా మున్సిపాలిటీ అందిస్తున్న సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కమిషనర్ రాజశేఖర్‌రెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
దక్షిణ భారత బాక్సింగ్ చాంపియన్ షిప్లో ప్రతిభ
జనగామ రూరల్: జిల్లా కేంద్రంలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు ఈనెల 16 నుంచి 19 వరకు బెంగళూరులో జరిగిన 1వ సౌత్ ఇండియా బాక్సింగ్ చాంపియన్ షిప్–2026లో రాష్ట్రం తరపున పాల్గొని కాంస్య పతకాలు సాధించారు. కళాశాలకు చెందిన తృతీయ సంవత్సరం బీఏ విద్యార్థినులు రమావత్ సాయి ప్రణతి 45–48 కేజీలు, అంజలి కొర్ర 65–70 కేజీల విభాగాల్లో ప్రతిభ కనబరిచారు. కళాశాల ప్రిన్సిపాల్ కె.శ్రీనివాస్, బీఏ విభాగాధిపతి జె. శ్రీదేవి, ఏఓ రాజ్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ కళ్యాణి విద్యార్థినులను అభినందించారు. -
మూడేళ్లయినా.. రికవర్రీనే!
సాక్షి ప్రతినిధి, వరంగల్: రైతులనుంచి ప్రభుత్వం సేకరించిన ధాన్యం.. రైసుమిల్లులకు కేటాయింపు.. మిల్లింగ్ చేసి సీఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగింత. ఇదీ సాధారణ ప్రక్రియ. కానీ ఉమ్మడి వరంగల్‌లో రబీ 2022–23 సీజన్‌కు సంబంధించిన లెక్కలు చూస్తే.. ధాన్యం కేటాయించి సుమారు మూడేళ్లు దాటినా రికవరీ మాత్రం పూర్తికాలేదు. కోట్ల రూపాయల విలువైన ధాన్యం, బియ్యం బకాయిలు మిల్లర్ల వద్దే నిలిచిపోయాయి. సీఎంఆర్ చెల్లించని మిల్లుల్లో వేలం వేసిన ధాన్యానికి సంబంధించిన లెక్కలు కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. కాగితాలపై లెక్కలు.. మిల్లులు దాటని బకాయిలు.. పౌరసరఫరాల సంస్థ ఇటీవల ప్రభుత్వానికి పంపిన నివేదిక ప్రకారం.. ఉమ్మడి వరంగల్‌లోని హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఇంకా ధాన్యం బకాయిలు ఉన్నాయి. 216 మిల్లులకు ఇచ్చిన 1,11,634 మెట్రిక్ టన్నుల ధాన్యానికి గాను 37,825 మెట్రిక్ టన్నులు మాత్రమే రికవరీ అయ్యాయి. మరో 73.809 మె.టన్నుల ధాన్యం మిల్లర్ల వద్ద ఉంది. విలువ పరంగా రూ.166.30 కోట్ల మేర రికవరీ చేయాల్సి ఉందని ఆ నివేదికలో పౌరసరఫరాల సంస్థ పేర్కొంది. రబీ 2022–23 సీజన్‌కు సంబంధించిన రికవరీ పూర్తికాకపోవడం అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. వేలం వేసిన ధాన్యం జాడేది..? 2022–23 రబీలో సీఎంఆర్ రైసుమిల్లర్లు ఎంతకు చెల్లించకపోవడంతో పౌరసరఫరాల సంస్థ.. 216 మిల్లుల్లో ఉన్న రూ.250.92 కోట్ల విలువ చేసే 1,11,634 మె.టన్నుల ధాన్యం మొత్తానికి వేలం వేసింది. తీరా టెండర్లు ముగిశాక వెళ్లి చూస్తే చాలా మిల్లుల్లో ధాన్యం లేకపోవడంతో మళ్లీ రికవరీపైనే దృష్టి సారించారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, పౌరసరఫరాల సంస్థలు సంయుక్తంగా పోలీసుశాఖ సహాయంతో రంగంలోకి దిగడంతో కొంత మేరకు వసూలైనా.. ఇంకా రూ. కోట్లల్లో పెండింగ్ పడ్డాయి. ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల్లో 96 మిల్లుల వద్ద ఈ బకాయిలు ఉన్నట్లు నివేదిక పేర్కొంటోంది. జనగామ, వరంగల్ జిల్లాల్లో 54 మిల్లుల వద్ద బకాయిలు ఉన్నాయి. ములుగులో 13, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో 24, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఐదు మిల్లుల వద్ద బకాయిలు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇటీవల సైతం కొందరు మిల్లర్లు బకాయిలు చెల్లిస్తున్నప్పటికీ.. వసూళ్ల కోసం తదుపరి చర్యలపై చర్చ మొదలైంది. బకాయిదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడమా? రెవెన్యూ రికవరీ యాక్టు కింద చర్యలు తీసుకోవడమా? బకాయిదారుల ఆస్తులను గుర్తించి జప్తు ప్రక్రియ చేపటడమా? అన్న అంశాలు కీలకంగా మారాయి. ఇప్పటికే నోటీసులు జారీ చేసిన మిల్లర్లు కొందరిపై పోలీసు కేసులు నమోదు చేయడం చర్చనీయాంశం అవుతోంది. 2022–23 సీఎంఆర్ డిఫాల్టర్ మిల్లులు: 216 రికవరీ కావాల్సిన ధాన్యం : 1,11,634 మె.టన్నులు ధాన్యం విలువ: రూ.250.92 కోట్లు.. రికవరీ చేసిన ధాన్యం: 37,825 మె.టన్నులు వసూలైన మొత్తం: రూ.84.61 కోట్లు బకాయి ఉన్న ధాన్యం: 73,809 మె.టన్నులు బకాయి మొత్తం: రూ.166.30 కోట్లు ఇంకా బకాయి ఉన్న మిల్లులు: 96 రైస్‌మిల్లర్ల వద్దే 2022–23 సీజన్ సీఎంఆర్ ఉమ్మడి జిల్లాలో రూ.166.30కోట్ల రికవరీ పెండింగ్.. జాడలేని 73,809 మె.టన్నుల వేలం ధాన్యం మొత్తం బకాయిలు 96 మిల్లుల వద్ద.. ప్రశ్నార్థకంగా మారిన వసూళ్లు తెరపైకి క్రిమినల్ కేసులు.. ఆర్ఆర్ యాక్టులు.. బకాయిదారుల ఆస్తుల వివరాలపై ‘విజిలెన్స్’ ఆరా!వివరాల సేకరణలో ‘విజిలెన్స్’ నిమగ్నంభారీగా బకాయిలు పేరుకుపోవడంతో బకాయిదారుల ఆస్తుల వివరాల సేకరణలో పౌరసరఫరాల సంస్థ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిమగ్నమైనట్లు సమాచారం. కొందరు బకాయి ఉన్న రైసుమిల్లర్లు తమ స్థిర, చరాస్తులను బినామీల పేరిట మార్పిడి చేశారన్న ప్రచారం ఉంది. మిల్లులను ఎత్తివేసి వాటి స్థానంలో ఫంక్షన్హాల్లు, సీడ్ మిల్లులుగా మార్చినట్లు కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బకాయిదారుల ఆస్తుల వివరాల సేకరణ ‘విజిలెన్స్’ దృష్టి సారించారన్న చర్చ సర్వత్రా కలకలం రేపుతోంది. కాగా ఈ విషయమై ఉమ్మడి వరంగల్‌కు చెందిన ఓ జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారిని సంప్రదించగా సీరియస్‌గా బకాయిల వసూళ్లు జరుగుతున్నాయని, తమను ఆ వివాదంలోకి లాగొద్దంటూ సమాధానం దాటవేశారు. -
సమయపాలన..పర్యవేక్షణ
నిరంతర పర్యవేక్షణ విద్యార్థుల హాజరు నమోదులో జాప్యం లేకుండా ఒకరికి బదులు మరొకరు హాజరు వేయడం వంటి అక్రమాలకు చెక్ పెట్టేందుకే ముఖ గుర్తింపు విధానాన్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా అధ్యాపకులు, సిబ్బంది సమయానికి విధులకు వస్తున్నారా? లేదా? అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసే అవకాశం ఉంటుంది. విద్యార్థుల హాజరు శాతం పెరిగి, పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది. జనగామ రూరల్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు బోధనపై పట్టు సాధించి పాఠ్య విషయాలు కోల్పోకుండా సమయపాలన, హాజరు విషయంలో మరింత పారదర్శకత పాటించేలా ఇంట ర్మీడియట్ బోర్డు ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థుల హాజరును ముఖ గుర్తింపు ఆధారంగా నమోదు చేసే ‘ఎఫ్ఆర్ఎస్’ (ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్) పద్ధతి అమల్లోకి తెచ్చింది. గత ఏడాది బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసినప్పటికీ సాంకేతిక కారణాలతో ఆశించిన స్థాయిలో కొనసాగలేదు. దీంతో ఈ ఏడాది కొత్త సాఫ్ట్‌వేర్‌తో ముఖ గుర్తింపు హాజరు విధానానికి శ్రీకారం చుట్టింది. దీంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అమలు చేస్తున్నారు. అయితే ఇటీవల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఎఫ్ఆర్ఎస్ విధానం అమలుపై డీఐఈఓ, సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అన్ని కళాశాలల్లో తప్పనిసరిగా చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. రోజుకు రెండు పూటల ఫొటోలు ప్రత్యేకంగా రూపొందించిన ప్రత్యేక యాప్ టీజీబీఐఈ (తెలంగాణ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్) ద్వారా హాజరును నమోదు చేస్తున్నారు. కళాశాలల్లో విధులు నిర్వహించే అధ్యాపకులు, సిబ్బంది రోజుకు రెండుసార్లు (ఉదయం 9.30 గంటలలోపు, సాయంత్రం 4 గంటలకు) ముఖ గుర్తింపుతో హాజరు నమోదు ప్రక్రియ చేపడుతున్నారు. విద్యార్థుల హాజరును కూడా ఇదే విధానంలో నమోదు చేస్తున్నారు. మొబైల్లో కొత్త యాప్‌ను డౌన్లోడ్ చేసుకునే విధానం, దాని వినియోగంపై ఇప్పటికే అధ్యాపకులు, సిబ్బందికి అవగాహన కల్పించారు. 7 ప్రభుత్వ కళాశాలలు జిల్లాలో 8 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి సుమారు 2,500 మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. వీరితో పాటు 200వరకు అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు. ఇప్పటికే సిబ్బంది రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాగా, ప్రస్తుతం విద్యార్థుల వివరాల నమోదు కొనసాగుతోంది. సమర్థ పర్యవేక్షణ కోసమే.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థుల హాజరును మరింత పారదర్శకంగా నమోదు చేయడంతో పాటు సమయపాలన పాటించేలా చేయడమే ఎఫ్ఆర్ఎస్ విధానం ప్రధాన ఉద్దేశం. టీజీబీఐఈ యాప్ ద్వారా ముఖ గుర్తింపు ఆధారంగా హాజరు నమోదు జరుగుతుంది. పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత కళాశాలల పనితీరును మరింత సమర్థంగా పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. – సందీప్ కుమార్ ఝా, కలెక్టర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ‘ముఖ గుర్తింపు హాజరు’ విధానం రోజుకు రెండుసార్లు ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులకు పూర్తిస్థాయిలో వర్తింపు ‘టీజీబీఐఈ’ యాప్ ద్వారా నమోదు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న అధికారులు జిల్లాలో 7 కళాశాలలు, 2,500 మందిపైగా విద్యార్థులు -
సమ్మక్క చెంత ప్యారడైజ్
చీర, సారెతో వస్తున్న హీరో నాని, గద్దెల ప్రాంగణంలో చిత్రబృందం మేడారంలో వనదేవతలు సమ్మక్క, సారలమ్మను మంగళవారం ప్యారడైజ్ సినిమా హీరో నాని, నటుడు సంపూర్ణేష్ బాబు, నిర్మాత సుధాకర్ చెరుకూరి, దర్శకుడు ఓదెల శ్రీకాంత్, పాటల రచయిత కాసర్ల శ్యామ్ దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అమ్మవార్లకు హీరో నాని నిలువెత్తు బంగారం(బెల్లం), చీర, సారె సమర్పించారు. మేడారం వచ్చే ముందుగా ములుగు గట్టమ్మ వద్ద ప్రత్యేక పూజలు జరిపారు. – ఎస్ఎస్ తాడ్వాయి/ములుగు -
8 అంతస్తుల్లో ఓపీ సేవలు!
● ఏర్పాట్లు చేస్తున్న అధికారులు ● సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు వేగవంతం కాశిబుగ్గ: వరంగల్‌లో నిర్మిస్తున్న 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో మొదటి విడత ఓపీ సేవలు అందించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం 8 అంతస్తుల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. డీఎంఈ డాక్టర్ వాణి, వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద పర్యవేక్షణతో పాటు సీఎంఓ అఽధికారుల చొరవతో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. కానీ, దసరా వరకు పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో అధికారులు ఒకడుగు ముందుకు వేసి ప్రాథమిక దశలో ఓపీ సేవలను ప్రజలకు అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నారు. ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్య సేవలను ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. దసరా వరకు ఓపీ సేవలు, అత్యవసరమైన ఎక్స్‌రే, ల్యాబ్, ఈసీజీ, డ్రెస్సింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓపీలో వైద్యపరీక్షల అనంతరం పేషెంట్లను అడ్మిట్ చేయాల్సి వస్తే వారిని ఎంజీఎంకు ఎలా తీసుకెళ్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎంజీఎం అంబులెన్స్‌లను ఉపయోగిస్తారా, ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేస్తారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా, సూపర్ స్పెషాలిటీ వైద్యసేవల వివరాలను చెప్పడానికి ఎంజీఎం అధికారులు ఆసక్తి చూపడం లేదు. -
రెడ్‌క్రాస్ అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా జనగామ రూరల్: జిల్లాలో రెడ్‌క్రాస్ సంస్థ అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నూతనంగా ఎన్నికైన మేనేజింగ్ కమిటీ సభ్యులకు సూచించారు. సోమవారం రాత్రి కలెక్టర్‌ను కొత్త కమిటీ సభ్యులు ఆయన్ను కలిశారు. ఈసందర్భంగా వారితో కలెక్టర్ మాట్లాడుతూ.. మూడోసారి చైర్మన్‌గా ఎన్నికై న డా. లవకుమార్ రెడ్డిని అభినందిస్తూ జిల్లాలో రెడ్‌క్రాస్ సొసైటీని బలోపేతం చేయాలన్నారు. జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీకి 15 మంది మేనేజింగ్ కమిటీ సభ్యులు ఎన్నిక కావాలని ఇందుకోసం 17 మంది సభ్యులు నామినేషన్ పత్రాలు ఎన్నికల అధికారి, స్టేషన్ ఘన్పూర్ ఆర్డీఓ ఎస్.కిరణ్ ప్రకాశ్‌కు సమర్పించారు. ఏకగ్రీవం కావడానికి అనుగుణంగా కన్న పరశురాములు, కృష్ణజీవన్ బజాజ్ పోటీ నుంచి ఉపసంహరించుకోవడంతో మేనేజింగ్ కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించారు. వెంటనే ఆఫీసు బేరర్స్ ఎన్నిక నిర్వహించి పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఎన్నికల అధికారి ప్రకటించారు. కలెక్టర్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించే ఈ కార్యవర్గంలో చైర్మన్‌గా డా. డి.లవకుమార్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా ఇ.ప్రభాకర్ రెడ్డి, కోశాధికారిగా గాదె క్యాథరిన్, రాష్ట్ర ఎం.సి. సభ్యుడిగా దొంతుల శేఖర్, మేనేజింగ్ కమిటీ సభ్యులుగా వేమల్ల నరసింహ రెడ్డి, ఎస్.శివరాజ్ యాదవ్, సీహెచ్ సురేందర్ రెడ్డి, పి.సత్యం, బి.రజినీ, జైన రమేశ్, పప్పు వెంకట్ రెడ్డి, పి.శ్రీనివాస్, పేర్వారం ప్రభాకర్, ఎ.హేమంత్‌రాజ్, ఎం.ఆంజనేయులు ఎన్నికయ్యారు. -
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి జనగామ: సంక్షేమ పథకాల అమలులో రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందేలా చూస్తానని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జనగామ పట్టణానికి చెందిన 19 మంది, జనగామ రూరల్‌కు చెందిన 17 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. అర్హులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందించారు. వారు మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. -
వికాసం దిశగా అడుగులు
జనగామ రూరల్: యువ వికాసం పథకం అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. నవంబరు 19 నుంచి రాజీవ్ యువవికాసం పథకం స్వయం ఉపాధి యూనిట్లకు ఆర్థిక సహాయం అందించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించడంతో పథకం అమలుపై ఆశలు చిగురిస్తున్నాయి. యువతకు స్వయం ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రూపొందించిన యువ వికాసం పథకం లబ్ధికి 17 నెలలుగా దరఖాస్తుదారులు నిరీక్షిస్తున్నారు. ఏప్రిల్ 2025లో పథకం అమలుకు అధికారులు జిల్లావ్యాప్తంగా దరఖాస్తులను స్వీకరించారు. 30 వేలకుపైగా వినతులు అందాయి. వాటి పరిశీలన పూర్తయినా నేటికీ దరఖాస్తుదారులకు పథకం లబ్ధిచేకూరలేదు. దరఖాస్తులను కలెక్టర్ సమక్షంలో పారదర్శకంగా పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని మంత్రి ఆదేశించడంతో నిరుద్యోగులు ఉపాధికి భరోసా లభించనుంది. రాయితీ ఇలా.. ప్రభుత్వం దరఖాస్తుదారులకు రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు రాయితీతో కూడిన రుణం అందించనుంది. రూ.50 వేల యూనిట్‌కు పూర్తిగా వంద శాతం లబ్ధి చేకూర్చనున్నారు. రూ.లక్ష యూనిట్‌కు 90 శాతం రాయితీ, రూ.2 లక్షల యూనిట్‌కు 80 శాతం రాయితీ, రూ. 4లక్షల యూనిట్‌కు 70 శాతం రాయితీ, రూ.5 లక్షల యూనిట్‌కు 60 శాతం రాయితీ కల్పించనున్నారు. పథకం లబ్ధి పొందేందుకు బీసీ సామాజిక వర్గ నిరుద్యోగులు అత్యధికంగా దరఖాస్తు చేసుకున్నారు. పథకం రుణంలో అత్యధికంగా రాయితీ ఉండటంతో సునాయాసంగా బ్యాంకులు రుణాలు మంజూరు చేసే అవకాశం ఉంది. పారదర్శకంగా ఎంపిక చేయాలి యువ వికాసం పథకం కింద దరఖాస్తు చేసుకున్న అర్హత గల లబ్ధిదారులకే వర్తింపజేయాలి. ఎలాంటి పైరవీలకు తావులేకుండా ఎంపిక ప్రక్రియ చేపట్టాలి. గ్రామసభల ద్వారా లబ్ధిదారులకు యూనిట్లు అందజేయాలి. –ఎల్లబోయిన హరీశ్, జిల్లా అధ్యక్షుడు, బీజేవైఎం 95 328 యూనిట్లు దరఖాస్తులు రాజీవ్ యువ వికాసం పథకం అమలుకు సన్నద్ధం నవంబర్‌లో ప్రారంభిస్తామని ప్రకటించిన ప్రభుత్వం నిరుద్యోగుల్లో చిగురిస్తున్న ఆశలు 17నెలలుగా ఎదురుచూపులుఎంపీడీఓల పర్యవేక్షణలో.. ఎంపీడీఓల పర్యవేక్షణలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందులో బ్యాంకర్లను కూడా భాగస్వాములను చేస్తున్నారు. అయితే బ్యాంక్ సిబిల్ స్కోర్‌ను పరిగణలోకి తీసుకున్నట్లు తెలిసింది. ఎంపిక ప్రక్రియలో ఎవరి ప్రమేయం లేకుండా పారదర్శకంగా చేపట్టేలా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రత్యేక చర్యలు చేపట్టారు. దరఖాస్తుల వివరాలు ఇలా.. -
విద్యావ్యవస్థ కాషాయీకరణకు కుట్ర
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ● ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవ సభహనుమకొండలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులు, ఏఐఎస్ఎఫ్ నాయకులు అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) 90వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్ నుంచి కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ సిరంగి రాజన్ తదితరులు పాల్గొని మాట్లాడారు. కేంద్రం విద్యావ్యవస్థ కాషాయీకరణకు కుట్ర చేస్తోందని, దీనిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. – కేయూ క్యాంపస్ -
ఓటుహక్కును హరిస్తే ఊరుకోం
జనగామ: ఓటు హక్కును పరిరక్షించాలని, ఓటర్ల జాబితా సవరణ, ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఈర్) ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాల ని, ఓటు హక్కును హరిస్తే ఊరుకోమని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి ఆధ్వర్యంలో నెహ్రూ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, టీపీసీసీ సభ్యులు, వైటీడీఏ మెంబర్ లక్ష్మీనారాయణ నాయక్, మున్సి పల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేసి, కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం స్టేషన్ ఘన్పూ ర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ..అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరును ఓటర్ జాబితా నుంచి తొలగించకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మాట్లాడుతూ.. ఓటర్ జాబితాలో మార్పులు, తొలగింపులు, అభ్యంతరాలపై ప్రజలకు స్పష్టమైన సమాచా రం అందించాలని, ఎన్నికల వ్యవస్థపై నమ్మకం పెరిగేలా ఎన్నికల సంఘం వ్యవహరించాలన్నారు. ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్ నిరంతరం పోరాడుతుందని డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీ నారాయణ అన్నారు. జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. ఓటర్ జాబితా సవరణలో పారదర్శకత పాటించాలని, ఓటర్ల హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ శ్రేణులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. వైటీడీఏ మెంబర్ డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ మాట్లాడుతూ.. ఓట్ల దోపిడీకి అడ్డుకట్ట వేయాలన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు అందించారు. ఉన్న ఓటర్ల పేర్లు తొలగించకుండా చూడాలని, ఎన్నికల ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని వినతిపత్రంలో కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ మరుజోడు రాంబాబు, నాయకులు వేమళ్ల సత్యనారాయణరెడ్డి, ఏఎంసీ మార్కెట్ చైర్మన్ బనుక శివరాజు, లావణ్య, మంజుల, లింగాల జగదీష్‌చందర్‌రెడ్డి, గుడి వంశీధర్ రెడ్డి, నూకల బాల్‌రెడ్డి, ఉడత రవి, పట్టణ అధ్యక్షుడు దోర్నాల వెంకటేశ్వర్లు, లోక్కుంట్ల ప్రవీణ్, మాజిద్ అప్సర్, బడికే ఇందిర, బోనాసి క్రాంతి, జాయ మల్లేష్, అభిగౌడ్, మేడ శ్రీనివాస్, జిల్లెళ్ల సిద్ధారెడ్డి, చింతకింది మల్లేష్ తదితరులు ఉన్నారు. ఓట్ల దోపిడీకి అడ్డుకట్ట వేయాలి కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా సీఈసీ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మ దహనం -
ఏఐఎన్ పీఎస్‌ఈఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రఘునందన్
జనగామ: ఆల్ ఇండియా న్యూ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్(ఏఐఎన్ పీఎస్‌ఈఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శిగా పౌరసరఫరాల శాఖ ఎన్‌న్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్న్ ఎంపికయ్యారు. ఈ మేరకు ఫెడరేషన్‌న్ జాతీయ అధ్యక్షుడు మంజీత్ సింగ్ పటేల్ తన నియామకాన్ని ప్రకటించినట్లు రఘునందన్ సోమవారం జిల్ల కేంద్రంలో మాట్లాడుతూ తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉద్యోగులకు ఒకే పింఛను విధానం అమలు చేయాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని పేర్కొన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలతో పాటు దక్షిణ భారత ఇన్చార్జిగా కూడా రఘునందనన్్ కొనసాగనున్నారు. -
త్వరితగతిన పరిష్కరించాలి
● గ్రీవెన్స్‌లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశం ● ప్రజల నుంచి 371 దరఖాస్తుల స్వీకరణజనగామ రూరల్: కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఫిర్యాదులను స్వీకరించి, పరిశీలించారు. ప్రజా వాణిలో ఎక్కువగా భూ, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్ సమస్యలే ఉన్నా యి. ప్రజలు అందజేసిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి 371 అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. వచ్చిన దరఖాస్తుల ను సంబంధిత శాఖల అధికారులకు కేటాయిస్తూ, త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. డీఆర్డీఓ భాస్కర్, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి, సీపీఓ చిన కోట్యానాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. దరఖాస్తుల్లో కొన్ని.. పట్టణంలోని 11వ వార్డు వీవర్స్ కాలనీ చెందిన కందగట్ల మధుసూదన్, తమ వీధిలో డ్రెయినేజీ కాలువ, సీసీ రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నారని, మురుగు కాలువ, సీసీ రోడ్డు నిర్మాణం చేసి ప్రజలను ఆదుకోవాలని కలెక్టర్‌కు దరఖాస్తు అందజేశారు. జఫర్‌గఢ్ మండల తిడగు గ్రామానికి చెందిన వాసం వెంకటేశ్వర్లు తమకు రెండు ఎకరాల ఎనిమిది గుంటల భూమి వంశపారపర్యంగా సంక్రమించిందని, సంబంధిత భూమి ఇతరుల పేరిట రెవెన్యూ రికార్డుల్లో వస్తోందని, దానిని తొలగించి, తమ పేరును ఆన్లైన్లో నమోదు చేసి పట్టా పాసుబుక్, పహాణీలు అందజేయాలని కోరారు. బచ్చన్నపేట మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన బండి వనజ, గతంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు అందజేయగా ఆన్లైన్ పోర్టల్‌లో నమోదు కాలేదని తన దరఖాస్తును పరిశీలించి, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. లింగాల ఘణపురం మండలం వడిచెర్ల గ్రామం చెందిన బొట్ల అనసూర్య, తనది పేద కుటుంబం అని, కూలి పని చేసుకొని జీవనం సాగిస్తున్నారని, భూమి జాగా ఏమీ లేదని, ఉన్న ఇల్లు శిథిలావస్థలో ఉందని, ఇందరిమ్మ ఇల్లు మంజూరు చేయాలని కలెక్టర్‌ను వేడుకుంది. జనగామ మండలం సిద్ధెంకి గ్రామానికి చెందిన నీలగిరి భిక్షపతి, తన రెండు ఎకరాల ఐదు గుంటల భూమిని ఆన్లైన్ రికార్డుల్లో నమోదు చేయాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశాారు. -
డోర్ లాక్.. టెన్షన్ టెన్షన్
● కారులో చిక్కుకున్న నాలుగేళ్ల బాలుడు ● 20 నిమిషాల ఉత్కంఠ స్టేషన్‌ఘన్‌పూర్: కారు డోర్ లాక్ కావడం, అందులో ముందు సీటులో నాలుగేళ్ల వయస్సున్న బాలుడు కూర్చుని ఉండటంతో 20 నిమిషాల పాటు ఉత్కంఠ నెలకొంది. ఈఘటన ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలో సోమవారం జరిగింది. శివునిపల్లిలోని ఫైర్‌స్టేషన్ పక్కన ఉన్న టిఫిన్ సెంటర్లో టిఫిన్ తీసుకునేందుకు కుమారుడితో కారులో వచ్చిన ఓవ్యక్తి కారు దిగి డోర్ వేసి టిఫిన్ సెంటర్లోకి వెళ్లాడు. కారు ఆటోమెటిక్‌గా సెంట్రల్ లాక్ కావడంతో టిఫిన్ తీసుకుని వచ్చిన ఆ వ్యక్తి కారు డోర్ తీస్తే తెరుచుకోలేదు. ఎంత ప్రయత్నించినా డోర్ ఓపెన్ కాకపోవడంతో ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. కారు లోపల బాలుడు ఉండటం, డోర్ రాకపోవడంతో ఉత్కంఠ నెలకొనగా పలువురు అక్కడ గుమిగూడారు. డోర్ తీయాలని బయటి నుంచి వారు చెపుతున్నా బాలుడికి అర్థం కాలేదు. దాంతో అక్కడ ఓ యువకుడు తన సెల్ఫోన్లో యూట్యూబ్ ఆన్ చేసి కారు అద్దం ఎలా దించాలో చూపించడంతో బాలుడు కారు అద్దం కిందికి దించాడు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
మరింత సమర్థవంతంగా పారిశుద్ధ్య నిర్వహణ
జనగామ: మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు నూతనంగా అందుబాటులోకి వచ్చిన స్వచ్ఛ ఆటోల ర్యాలీని సోమవారం నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ చేపట్టడంతో పాటు ప్రజల్లో పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించనున్నారు. ప్రతీ ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి స్వచ్ఛ ఆటోలకు అందించాలని, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కమిషనర్ రాజశేఖర్‌రెడ్డి సూచించారు. మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్ మాట్లాడుతూ.. స్వచ్ఛ జనగామ లక్ష్యంగా మున్సిపాలిటీ నిరంతరం పని చేస్తోందన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. పట్టభద్రుల ఓటరు జాబితా డీ–నోవో తయారీపై నోటీసుజనగామ: వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు జాబితా డీ–నోవో (కొత్తగా) తయారీ ప్రక్రియలో భాగంగా మున్సిపల్ కార్యాలయంలో నోటీసు ప్రచురించినట్లు కమిషనర్ రాజశేఖర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 1అక్టోబర్ 2026 అర్హత తేదీగా నిర్ణయిస్తూ, నల్లగొండ అదనపు కలెక్టర్, ఎన్నికల నమోదు అధికారి జారీ చేసిన నోటీసును మున్సిపల్ కార్యాలయ నోటీస్ బోర్డుతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండే ప్రముఖ ప్రదేశాల్లో ప్రదర్శించినట్లు తెలిపారు. ప్రజల సమాచారం కోసం నోటీసు ప్రతులతో పాటు ఫారం–18ను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ఎన్నికల సం ఘం, తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు డీ–నోవో ఓటరు జాబితా తయారీపై అవసరమైన ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన పట్టభద్రులు సంబంధిత ఎన్నికల అధికారుల సూచనల మేరకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. రెడ్‌క్రాస్ రాష్ట్ర మేనేజ్మెంట్ సభ్యుడిగా దొంతుల శేఖర్జనగామ: తెలంగాణ స్టేట్ రెడ్‌క్రాస్ సొసైటీ మేనేజ్మెంట్ సభ్యుడిగా జిల్లా కేంద్రానికి చెందిన దొంతుల శేఖర్ ఎన్నికయ్యారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేసేందుకు రెడ్‌క్రాస్ సరైన వేదికగా భావించి ఎన్నికల్లో పోటీ చేసి రాష్ట్ర మేనేజ్మెంట్ సభ్యుడిగా ఎన్నికై నట్లు తెలిపారు. రెడ్‌క్రాస్ ద్వారా జిల్లాలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తానన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన జిల్లా రెడ్‌క్రాస్ సభ్యులు, సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాతీయ చెస్ పోటీల్లో ప్రతిభ బచ్చన్నపేట : అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో మండలంలోని సాల్వాపూర్ గ్రామానికి చెందిన బోయిని అనిల్ సత్తా చాటారు. గ్రామానికి చెందిన బోయిని కర్ణాకర్ కుమారుడు అనిల్ పదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం ఢిల్లీలో వాజీపూర్‌లో నిర్వహించిన అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో 900 మంది విద్యార్థులకు పైగా పాల్గొనగా అనిల్ 15 ఏళ్ల విభాగంలో పాల్గొని అత్యంత ప్రతిభ చూపి 13వ స్థానంలో నిలిచాడు. గత ఆరు నెలల కాలంలో చైన్నె, మంగళూరు, ముంబాయి, ఢిల్లీ తదితర నగరాల్లో నిర్వహించిన వివిధ చెస్ పోటీల్లో పాల్గొని ఏకంగా తొమ్మిది అవార్డులు, కప్‌లను కైవసం చేసుకున్నాడు. ఈసందర్భంగా అనిల్‌ను సర్పంచ్ మిద్దెల శ్రీధర్‌గౌడ్, గ్రామస్తులు, తోటి విద్యార్థులు అభినందించారు. -
అసలు పోరు వారిద్దరి మధ్యే..!
సాక్షిప్రతినిధి, వరంగల్ : టీజీఎస్ ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అక్టోబర్ 9న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కార్మిక సంఘాలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ నెల 26న ఎన్నికల గుర్తులు కేటా యించడంతో ప్రచారంలో మరింత జోష్ వ చ్చింది. షెడ్యూల్‌కు ముందే ప్రధాన యూని యన్లు రీజి యన్ స్థాయిలో సర్వసభ్య సమావేశాలు నిర్వహించి కార్మికులను ఎన్నికలకు సన్నద్ధం చేశాయి. వరంగల్ రీజియన్‌లోని 9 ఆర్టీసీ డిపోలతోపాటు రీజినల్ మేనేజర్ కార్యాలయం, జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాలలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు ఓటర్లుగా ఉన్నారు. కార్మికశాఖ ఇప్పటికే డ్రాఫ్ట్ ఓటరు జాబితాను విడుదల చేసి ఈనెల 25వరకు అభ్యంతరాల ను స్వీకరించింది. ఓటరు జాబితాను త్వరలోప్రకటించనుంది. మంగళవారం (నేడు) న మూనా బ్యాలెట్‌ను కార్మికశాఖ జారీ చేయనుంది. 12 యూనియన్లు.. రెండు కూటములు.. గుర్తింపు ఎన్నికల బరిలో మొత్తం 12యూనియన్లు ఉన్నాయి. అయితే ప్రధానంగా రెండు కూటముల మధ్యే పోటీ నెలకొంది. తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ (అశ్వత్థామరెడ్డి వర్గం), స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) ఒక కూటమిగా బరిలో ఉన్నాయి. ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ), తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ–థామస్‌రెడ్డి వర్గం) మరో కూటమిగా పోటీ చేస్తున్నాయి. పొత్తుల ప్రకారం ఎస్‌డబ్ల్యూఎఫ్ ఖమ్మం, నల్లగొండ రీజియన్లలో పోటీ చేస్తుండగా.. తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ వరంగల్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర రీజియన్లు, అనుబంధ వర్క్‌షాపులు, రాష్ట్రస్థాయిలో పోటీ చేస్తోంది. మరో కూటమిలో ఎన్ఎంయూ వరంగల్ రీజియన్‌లో పోటీ చేస్తుండగా.. మిగతా రీజియన్లలో టీఎంయూ బరిలో ఉంది. క్లాస్–3 రాష్ట్రస్థాయి పోటీలో ఎంప్లాయీస్ యూనియన్ పోటీ చేస్తోంది. రాష్ట్ర, రీజియన్‌స్థాయి.. రెండు ఓట్లు.. గుర్తింపు ఎన్నికల్లో ప్రతీ కార్మికుడు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. క్లాస్–3లో రాష్ట్రస్థాయికి, క్లాస్–6లో రీజియన్ స్థాయికి ఓటు వేయనున్నారు. దీంతో రాష్ట్రస్థాయి కూటముల ప్రచారంతో పాటు వరంగల్ రీజియన్‌లో స్థానిక యూని యన్ల ప్రచారం కూడా జోరందుకుంది.ఆర్టీసీ వర్కర్స్ యూనియన్‌కు టీపీసీసీ మద్దతు.. కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా ఉన్న తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్‌కు టీపీసీసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఎన్నికల సమన్వయం కోసం టీపీసీసీ ఉపాధ్యక్షుడు బొంతు రామ్మోహన్‌ను ఇన్చార్జిగా నియమించింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇతర యూనియన్లను ప్రోత్సహించకుండా తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్‌కు సహకరించాలని సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో హోరాహోరీ పోరు ‘విల్లు–బాణం’ ‘కాగడ’ మధ్యే సవాల్ బరిలో 12 యూనియన్లు.. రెండు కూటములు.. నేడు నమూనా బ్యాలెట్‌ను జారీ చేయనున్న కార్మికశాఖ..ఇద్దరి మధ్యే ప్రధాన పోటీ.. వరంగల్ రీజియన్‌లో క్లాస్–6కు ప్రధాన పోటీ తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్, ఎన్ఎంయూ మధ్యే కనిపిస్తోంది. తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ ‘విల్లు–బాణం’ గుర్తుతో, ఎన్ఎంయూ ‘కాగడ’ గుర్తుతో బరిలో ఉన్నాయి. దీంతో వరంగల్ రీజియన్‌లో ఈ రెండు యూనియన్లు కార్మికులను ఆకట్టుకునేందుకు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. -
మేడారంలో మొక్కుల సందడి
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ప్రైవేట్ వాహనాల్లో మేడారానికి చేరుకుని జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించారు. కల్యాణకట్టలో భక్తులు అమ్మవార్లకు పుట్టు వెంట్రుకలు సమర్పించుకున్నారు. అనంతరం గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, ఎత్తు బంగారం, ఒడి బియ్యం, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. యాటలను, కోళ్లను మొక్కుగా సమర్పించారు. అనంతరం వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. -
కసరత్తు షురూ
సాక్షిప్రతినిధి, వరంగల్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో రాజకీయ పార్టీలు అప్రమత్తమవుతున్నాయి. వరంగల్–ఖమ్మం–నల్లగొండ నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నాయి. మరోవైపు ఎన్నికల సంఘం ఓటర్ల నమోదు ప్రక్రియకు షెడ్యూల్ ప్రకటించడంతో పార్టీలు ఆ పనిలో నిమగ్నమవుతున్నాయి. ఓటర్లను పెంచుకోవడం, తమకు అనుకూలమైన, గెలిచే అవకాశమున్న అభ్యర్థిని బరిలోకి దించడం లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. దీంతో ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్ పట్టభద్రుల ఓటర్ల జాబితా తయారీకి ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. సోమవారం ఓటర్ల నమోదుకు నోటీసు వెలువడనుంది. నవంబర్ 6 వరకు ఓటరు నమోదుకు అవకాశం కల్పించింది. నవంబర్ 25న ముసాయిదా జాబితా, డిసెంబర్ 30న తుది జాబితా ప్రకటించనుంది. దీంతో అర్హులైన పట్టభద్రులను గుర్తించి ఓటర్లుగా నమోదు చేయించేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. గతంలో ఓటు ఉన్నవారు కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉండడంతో ప్రధాన పార్టీలు ఈ ప్రక్రియపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయి. కాంగ్రెస్‌లో టికెట్ ఫైట్! అధికార కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ టికెట్ కోసం ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. గుత్తా అమిత్‌రెడ్డి, రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, పీవీ శ్రీనివాస్, చనగాని దయాకర్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, సింగాపురం ఇందిర పేర్లు అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల నుంచి మరికొందరు నేతలు కూడా అవకాశం కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే అధిష్టానం ఎవరికి అవకాశం ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ గురి.. గత ఎన్నికల్లో కోల్పోయిన స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఆ పార్టీ నుంచి ఏనుగుల రాకేశ్‌రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇప్పటికే ఆయన ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలో రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. పట్టభద్రులు, నిరుద్యోగులు, ఉద్యోగులతో సంబంధాలు పెంచుకోవడంపై పార్టీ అధిష్టానం సైతం దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థి ఎంపికతో పాటు ఓటర్ల నమోదు కూడా కీలకం కానుంది. బీజేపీ కసరత్తు పట్టభద్రుల నియోజకవర్గంలో తమ బలాన్ని పెంచుకునేందుకు బీజేపీ కూడా సిద్ధమవుతోంది. గత ఎన్నికల్లో ఆ పార్టీ సీనియర్ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి రెండుసార్లు వరుస ఓటమికి గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మూడోసారి టికెట్ ఆశిస్తున్నా పార్టీ నాయకత్వం గెలుపు గుర్రాలపై దృష్టి పెట్టినట్లు పార్టీవర్గాల సమాచారం. ఎస్.ప్రకాశ్‌రెడ్డి, జి.మనోహర్‌రెడ్డి, నూకల నర్సిరెడ్డి, రాణి రుద్రమ, కాసం వెంకటేశ్వర్లు తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే అభ్యర్థి ఎవరనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. నిరుద్యోగమే ప్రధాన అస్త్రం.. ఈ ఎన్నికలో నిరుద్యోగ సమస్య, ఉద్యోగాల భర్తీ, ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు, ఉద్యోగుల సమస్యలు ప్రధాన చర్చకు వచ్చే అవకాశం ఉంది. పట్టభద్రుల సమస్యలపై ఎవరు గట్టిగా మాట్లాడతారు? ఎవరు వారి మద్దతు కూడగడతారు? అనేది కీలకం కానుంది. కాగా, ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల్లో పట్టభద్రుల ఓటర్ల నమోదు, ప్రచార కార్యక్రమాలపై ప్రధాన పార్టీలు నేటి నుంచి దృష్టి పెట్టనున్నాయి. ఓటర్ల జాబితాలో కొత్తగా ఎంతమంది చేరతారు? అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి సమీకరణాలు తెరపైకి వస్తాయి? అనే అంశాలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలపై మూడు పార్టీల గురి గెలుపు గుర్రాల వేటలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ టికెట్ కోసం ఆశావహుల ప్రయత్నాలు నిరుద్యోగం, ఉద్యోగాలే ప్రధాన అస్త్రాలు నేడు ఓటర్ల నమోదుకు ఈసీ నోటీసుకార్యక్రమం తేదీ ఓటర్ల నమోదుకు నోటీసు సెప్టెంబర్ 28, 2026 పత్రికల్లో పునఃప్రకటన అక్టోబర్ 15, 25 అర్హత తేదీ నవంబర్ 1 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ నవంబర్ 6 ముసాయిదా ఓటర్ల జాబితా నవంబర్ 25 అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణ నవంబర్ 25–డిసెంబర్ 10 తుది ఓటర్ల జాబితా డిసెంబర్ 30 -
లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు సమాజ నిర్మాణానికి స్ఫూర్తి
జనగామ రూరల్: సామాజిక న్యాయం, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, ప్రజాసేవకు జీవి తాన్ని అంకితం చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని, ఆయన ఆశయాలు సమసమాజ నిర్మాణానికి స్ఫూర్తిదాయకమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కొనియాడారు. ఆది వారం కలెక్టరేట్లోని జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి సందర్భంగా కలెక్టర్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల హక్కులు, సామాజిక న్యాయం కోసం బాపూజీ చూపిన మార్గం నేటి తరానికి ఆదర్శప్రాయమని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, ఆర్టీఏ సభ్యులు చిలువేరు అభిగౌడ్, కుల సంఘాల ప్ర తినిధులు, సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ప్రశాంతంగా వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగాల రాతపరీక్ష జనగామ రూరల్: జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖలో వివిధ కేటగిరీల్లో పోస్టుల భర్తీకి కలెక్టరేట్ ఆదివారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పర్యవేక్షణలో రాత పరీక్షను ప్రశాంతంగా నిర్వహించారు. 11 పోస్టులకు గాను 281 దరఖాస్తులు రాగా 233 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఫిజీషియన్ 1 పోస్టుకు గాను, మొత్తం 12 దరఖాస్తులు రాగా, 7 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఎంఎల్హెపీ 6 పోస్టులకు గాను,166 దరఖాస్తులు రాగా,130 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ల్యాబ్ టెక్నీషియన్ 2 పోస్టులకు 96 దరఖాస్తులు రాగా, 90మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. సైకియాట్రిస్ట్ 1 పోస్టుకు ఒక అభ్యర్థి దరఖాస్తు చేసుకోగా గైర్హాజరయ్యారు. ఆప్తాల్మిక్ అసిస్టెంట్ 1 పోస్టుకు గాను 6 దరఖాస్తులు రాగా, 6 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, ఉపాధి శాఖ అధికారి కుమారస్వామి పాల్గొన్నారు. బతుకమ్మతల్లి విగ్రహ నిర్మాణానికి భూమి పూజ జఫర్‌గఢ్: మండలంలోని సాగరం గ్రామంలో నూతనంగా చేపడుతున్న బతుకమ్మ తల్లి విగ్రహ నిర్మాణానికి భూమి ఆదివారం భూమి పూజ చేశారు. గ్రామానికి చెందిన పిన్నింటి అనిత చంద్రశేఖర్ దంపతులు బతుకమ్మ తల్లి విగ్రహ నిర్మాణానికి రూ.2.50 లక్షల విరాళంగా అందజేయగా సర్పంచ్ తాటికాయల మమత చేతన్ చేతుల మీదుగా భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. కాగా విగ్రహ దాత చంద్రశేఖర్ దంపతులను గ్రామస్తులు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సుమన్, వరికెల మహేశ్వర్‌రావు, కత్తుల కుమారస్వామి, గ్రామస్తులు పాల్గొన్నారు. డబుల్ బెడ్రూం వాసులకు న్యాయం చేయాలి జనగామ రూరల్: మూడో విడత డబుల్ బెడ్రూం ఇళ్లలో నివాసం ఉంటున్న పేదలకు న్యాయం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో మూడో విడత ఇళ్ల స్థలాలు కోల్పోయిన వారికి గత ప్రభుత్వం 72 మందికి డబుల్ బెడ్రూం ఇళ్లను డ్రా ద్వారా కేటాయించారన్నారు. గత ప్రభుత్వం ఇచ్చినవి చెల్లవని కాంగ్రెస్ ప్రభుత్వం నివాసం ఉంటున్న పేదల ఇల్లు కూడా డ్రా తీసి ఇతరులకు కేటాయించారని, దీంతో పేదల మధ్య ఘర్షణ జరిగే అవకాశం ఉందన్నారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చొరవ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో బాల్నే వెంకట మల్లయ్య, కళ్యాణం లింగం, పాము శ్రీకాంత్ పగిడిపల్లి బాలమణి, ఎర్ర రజిత, మునిసిపట్ల జయ, మాదాసి సుధాకర్, గంపల సురేష్, కొమ్మ గళ్ళ ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఓటు హక్కు పరిరక్షణకు నేడు కాంగ్రెస్ నిరసన
● నెహ్రూ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ, ధర్నా ● డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతిజనగామ: ఓట్ల చోరీ వ్యవహారం, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 28న (సోమవారం) జిల్లా కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి తెలిపారు. ఆదివారం డీసీసీ కార్యాలయంలో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.. ఉదయం 10 గంటలకు నెహ్రూ పార్క్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు వెల్లడించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, ఎస్ఐఆర్ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు. వైటీడీఏ సభ్యుడు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ మాట్లాడుతూ.. డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి ఆధ్వర్యంలో ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ కడియం కావ్య, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహ రి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, హనుమాండ్ల ఝాన్సీరెడ్డి నాయకత్వంలో కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. మారుజోడు రాంబా బు, లింగాల జగదీష్‌చందర్‌రెడ్డి, లోకుంట్ల ప్రవీణ్, బోనాసి క్రాంతి, జాయ మల్లేష్, మహేందర్‌రెడ్డి, చింతకింది మల్లేష్, శ్రవణ్‌బాబు, శ్రీనివాస్, మహేష్, కోట నాయక్, జనార్దన్, ప్రవీణ్, దామోదర్‌రెడ్డి, బాల్దె శ్రీశైలం, నర్సింహులు పాల్గొన్నారు. -
మంత్రులు పొన్నం, వివేక్‌కు దర్రీస్ బహూకరణ
కాశిబుగ్గ: హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఆదివారం నిర్వహించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో వరంగల్ కొత్తవాడలో తయారు చేసిన దర్రీస్‌లను రాష్ట్ర మంత్రులకు బహూకరించారు. జయంతి వేడుకలకు ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని చేనేత సహకార సంఘాలు అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, చేనేత కార్మికులు, పద్మశాలి సంఘాల నుంచి వంద మందికి పైగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కార్మిక శాఖమంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి చేనేత దర్రీస్‌లను అందజేశారు. చేనేత సంఘం ప్రతినిధులు చిప్ప వెంకటేశ్వర్లు, ఝెలుగం సాంబయ్య ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా నుంచి అడిగొప్పుల సంపత్, దువ్వల రాజేందర్, ఎలగం రావిరాజ్, ఝెలుగం వెంకటమల్లు, చిన్న వీరస్వామి, వలుస లక్ష్మీనారాయణ, కూరపాటి సంపత్, బూర వేణుమాధవ్, ఓం ప్రకాశ్, మాటేటి రాములు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
చకచకా ‘ఇంటిగ్రేటెడ్’ నిర్మాణ పనులు
జఫర్‌గఢ్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ స్కేల్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే నిర్మాణ పనులు బేస్మెంట్ వరకు చేరుకున్నాయి. గురుకుల విద్యా విధానంలో విప్లవాత్మక మార్పును తీసుకొచ్చేందుకు గాను ఒకేచోట పేద విద్యార్థులకు విద్యా బోధన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రూ.200 కోట్ల వ్యయంతో మండలంలోని కోనాయిచలం గ్రామ రెవెన్యూ పరిధిలోని స్టేషన్‌ఘన్‌పూర్‌కు వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న 21 ఎకరాల ప్రభుత్వ స్థలంలో పాఠశాలల భవన సముదాయ నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ పనుల నిర్మాణానికి గాను గతేడాది మార్చి 16న సీఎం రేవంత్‌రెడ్డి స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రంలో వర్చువల్‌గా శంకుస్థాపన చేయగా ఈ ఏడాది ఫిబ్రవరి 10న ఎంపీ కావ్యతో కలసి ఎమ్మెల్యే కడియం భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. అన్ని వర్గాలకు ఒకేచోట.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన నాలుగు గురుకులాల పాఠశాల విద్యార్థులు ఒకే చోట కలిసి చదువుకునే అవకాశం లభించనుంది. పేద వర్గాలకు చెందిన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యా బోధనతో పాటు ఆధునిక మౌలిక వసతులు కల్పించనున్నారు. ఈ భవన నిర్మాణ పనులు 18 నెలల్లోగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం గడువు విధించింది. పనులు ప్రారంభించిన నాటి నుంచి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ భవన నిర్మాణ పనులు పూర్తయితే 2,560 మంది విద్యార్థులు ఒకే ప్రాంగణంలో ఉండి 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకునే అవకాశం కలగనుంది. బేస్మెంట్ దశ పూర్తి.. ఇప్పటికే భవన నిర్మాణ పనులు బేస్మెంట్ దశ పూర్తి అయ్యింది. కొద్దిరోజుల క్రితం మొరం విషయంలో పనులు నిలిచిపోగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక చొరవ తీసుకోని కలెక్టర్‌తో మాట్లాడి సదరు కాంట్రాక్టర్ ద్వారా ప్రభుత్వానికి డీడీలు కట్టించడంతో తిరిగి నిర్మాణ పనులు మళ్లీ ఊపందుకున్నాయి. నిర్మాణ పనులు త్వరతగతిన చేపట్టేందుకు సదరు కాంట్రాక్టర్ భవన నిర్మాణ కార్మికులకు పనిచేసే చోటనే ప్రత్యేక షెడ్డులను ఏర్పాటు చేయడంతో రాత్రింబవళ్లు పనులు ముమ్మరంగా సాగతున్నాయి. స్కూల్ నిర్మాణం కోసం రూ.200 కోట్ల కేటాయింపు బేస్మెంట్ లెవల్ వరకు పూర్తయిన పనులు పేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య -
దేవాదులతో వేలాది ఎకరాలకు నీళ్లు
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి రఘునాథపల్లి: భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా 24 యేళ్ల క్రితం తాను నాటిన దేవాదుల అనే మొక్క ఇప్పుడు మహా వృక్షమై వేలాది ఎకరాలకు సాగు, అనేక గ్రామాలకు తాగునీరు అందిస్తోందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం మండలంలోని లక్ష్మితండా, ఇబ్రహీంపూర్, ఫతేషాపూర్‌లో రూ 2.45 కోట్ల విద్యుత్ సబ్‌స్టేషన్, రూ.51లక్షలతో సీసీ రోడ్లు, నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే అధికారులు, ప్రజాప్రతినిదులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రారంభించారు, అనంతరం ఇబ్రహీంపూర్లో సర్పంచ్ పోకల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చీటకోడూర్, ఆలేరు కెనాల్లకు షట్టర్లు ఏర్పాటు చేసి యేటా ఫతేషాపూర్, ఇబ్రహీంపూర్ చెరువులు నింపేలా చర్యలు తీసుకుంటా అన్నారు. గత ఎమ్మెల్యే పనులు, పథకాలు, పార్టీ పదవులకూ కమీషన్లు తీసుకుంటూ చిల్లర, చిచోర పనులు తప్ప, నియోజకవర్గం అభివృద్ధికి చేసిందేమి లేదని ఆరోపించారు. నియోజకవర్గంలో రూ.1,600 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, అధికారం కోల్పోయామనే అక్కసుతో బీఆర్ఎస్, అధికారం ఆశతో బీజేపీ నిత్యం ప్రభుత్వంపై చౌకబారు విమర్శలు చేస్తున్నాయని విమర్శించారు. ఆయా కార్యక్రమాల్లో ట్రాన్స్‌కో ఎస్ఈ చెరుకు సంపత్‌రెడ్డి, డీఈలు లక్ష్మినారాయణరెడ్డి, విజయ్‌కుమార్, ఈఈ అనూప్‌కుమార్, ఏడీఈలు స్వామిరెడ్డి, ముంతాజ్ హుస్సేన్, సుధాకర్, ఎంపీడీఓ కావ్య శ్రీనివాసన్, పీఆర్ డీఈ కిరణ్‌కుమార్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మారుజోడు రాంబాబు, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల జగదీష్‌చందర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు గాదె మహేందర్‌రెడ్డి, సర్పంచ్‌లు సుజాతసత్యనారాయణ, పయ్యావుల రవి, బొమ్మ వీరస్వామి, ఉప సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. -
గ్యాస్ సబ్సిడీకి ఈకేవైసీ తప్పనిసరి
● వచ్చేనెల నుంచి కఠినంగా అమలు ● కొత్త గ్యాస్ కనెక్షన్లకు ఎదురుచూపులు ● జిల్లా వ్యాప్తంగా 1,60,016 కనెక్షన్లుజనగామ రూరల్: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులు ఈకేవైసీకి చేసుకోవడానికి గతంలో మూడు నెలల పాటు అవకాశం కల్పించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చే నెల నుంచి ఈకేవైసీ అమలు చేసేందుకు అధికారులు కఠినంగా ప్రణాళిక సిద్ధం చేశారు. సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు పక్కదారి పడుతున్నాయని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అక్రమాలను అరికట్టేందుకు కేంద్రం ఈకేవైసీని అమలు చేయాలని తీర్మానించింది. ఇందులో భాగంగా మూడు నెలలుగా లబ్ధిదారులకు సూచనలు చేస్తుండగా, కొంతమంది లబ్ధిదారుల్లో స్పందన కరువైంది. తెల్ల రేషన్‌కార్డు కలిగిన నిరుపేదలకు మహాలక్ష్మి పథకం రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే కేంద్ర ప్రభుత్వం సైతం ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్ పొందిన లబ్ధిదారులకు సబ్సిడీ అందిస్తోంది. ఇందుకోసం ఆన్లైన్లో తమ పూర్తి వివరాలు అందజేయాలని కొన్ని నెలలుగా ప్రభుత్వాలు ప్రకటనలు చేశాయి. గ్యాస్ వినియోగదారులు ఈ కేవైసీ చేసుకునేలా ఏజెన్సీలు ప్రోత్సహించాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో పరిస్థితి. జిల్లాలో హెచ్‌పీ, భారత్, ఇండేన్ ఆయిల్ కంపెనీలకు చెందిన గ్యాస్ కనెక్షన్లు మొత్తం 1,60,016 ఉండగా డిస్ట్రిబ్యూటింగ్ ఏజెన్సీలు 12 వరకు ఉన్నారు. 86,154 మంది జనరల్ కేటగిరీ కనెక్షన్లు పొందగా అందులో దీపం పథకం కింద కనెక్షన్ల్లు 41,222, ఉజ్వల కనెక్షన్లు 18,070, సీఎస్ఆర్ కింద 14,570 కనెక్షన్ల్లు అందజేశారు. అంతేగాకుండా హెచ్‌పీ గ్యాస్ దాదాపు 30వేలు, భారత్ 60 వేలు, ఇండేన్ 70వేలు కనెక్షన్లు ఉన్నాయి. పట్టణ పరిధిలో వినియోగదారులు 21 రోజులు, గ్రామీణ ప్రాంతంలో 45 రోజుల అంతరంతో సిలిండర్లను బుకింగ్ చేసుకునేలా నిబంధనలు మార్చడంతో వినియోగదారులకు ఇబ్బందులు తప్పడంలేదు. ఎదురుచూస్తున్న ప్రజలు గతేడాది జిల్లాలో దాదాపు 15వేల మంది కొత్త రేషన్‌కార్డులు పొందారు. వారిలో అధిక మంది నూతన గ్యాస్ కనెక్షన్ల కోసం నిరీక్షిస్తున్నారు. మహాలక్ష్మి పథకం కింద వేల కుటుంబాలు రూ.500కు రాయితీ సిలిండర్ తీసుకుంటున్నారు. ఈ పథకానికి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకున్నారు. కొత్త గ్యాస్ కనెక్షన్ల్లు మంజూరు నిలిచిపోవడంతో నూతన కార్డుదారులకు మహాలక్ష్మి పథకం ప్రయోజనం దక్కకుండా పోతోంది. దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఉన్నా లబ్ధిదారులు చనిపోతే వారి పేరిట ఉన్న కనెక్షన్లు వారి వారసుల పేరిట బదిలీ కావడం లేదు. నిబంధనలు కఠినతరం గ్యాస్ కనెక్షన్ ఉన్న లబ్ధిదారులు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి. తుది గడువు ఏమిలేదని, లబ్ధిదారులు సంబంధిత ఏజెన్సీని సంప్రదించి చేయించుకోవాలి. రానున్న రోజుల్లో నిబంధనలు మరింత కఠినంగా ఉండనున్నాయి. సబ్సిడీకి ఈకేవైసీ తప్పనిసరి. అలాగే నూతనంగా రేషన్ కార్డు పొందిన లబ్ధిదారులు కొత్త కనెక్షన్ల జారీకి ఇంకా ఎలాంటి నిబంధనలు రాలేదు. –సురేష్ రెడ్డి, డీసీఎస్ఓ -
కన్నవారి కలలు ఫలించాయి
● జూనియర్ సివిల్ జడ్జిగా అశ్విని రఘునాథపల్లి: జిల్లాలోని రఘునాథపల్లికి చెందిన నోముల పార్వతి–యాకయ్యది వ్యవసాయాధార కుటుంబం. సమాజంలో విద్య లేకపోతే ఎదురయ్యే ఇబ్బందులను స్వయంగా అనుభవించిన ఆ దంపతులు కూతురిని సమాజానికి ఉపయోగపడే ఉన్నత స్థానంలో చూడాలని కలలు కన్నారు. వారి కాష్టాన్ని, త్యాగాలను అర్దం చేసుకున్న అశ్విని ఆహర్నిశలు శ్రమించి ఏడాది క్రితం వనపర్తి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. విజయవంతంగా బాధ్యతలు నిర్వరిస్తున్నారు. ‘కూతురు న్యాయమూర్తి కావాలన్న మా అశను తను నెరవేర్చింది. ఏడాది కాలంగా జడ్జిగా సేవలు అందిస్తున్న మా బిడ్డను చూస్తేంటే కడుపు నిండిపోతుంది. కూతుర్ల దినోత్సం వేళ ఒక కూతురిగా తను మాకు ఇచ్చిన అతి పెద్ద బహుమతి’అని అశ్విని తల్లిదండ్రులు పార్వతి, యాకయ్య ఎంతో ఆనందంగా తెలిపారు. -
ఇద్దరు పిల్లలూ డాక్టర్లే..
కాశిబుగ్గ: వరంగల్ దేశాయిపేటకు చెందిన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి గాండ్ల ప్రభాకర్–రమాదేవికి ఇద్దరు కుమార్తెలు మౌనిక, మేఘన. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారన్నా చింత లేకుండా వారిని చదివించారు. పెద్దమ్మాయి మౌనిక కేఎంసీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి, కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో పీడియాట్రిక్స్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఉస్మానియా పరిధిలోని నీలోఫర్ ఆస్పత్రిలో డీఎం నియోనెటాలజీగా పనిచేస్తున్నారు. అదేవిధంగా చిన్నమ్మాయి మేఘన కూడా తామేమి తీసిపోనట్లుగా ఒంగోలులోని రిమ్స్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసి, ప్రస్తుతం గుంటూరులోని మెడికల్ కాలేజీలో ఆప్తాల్మాజీలో సెకండియర్ చదువుతున్నారు. ‘మాకు కొడుకులు లేరన్న చింత లేదు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టినా లక్ష్మీదేవిలగా భావిస్తూ కష్టపడి చదివించాం. డాక్టర్లు కావడంతో మా జన్మ ధన్యమైంది.’అని తల్లిదండ్రులు ప్రభాకర్–రమాదేవి సగర్వంగా చెప్పారు. -
మున్సిపాలిటీకి నిధులు విడుదల చేయాలి
● మంత్రికి ఎమ్మెల్యే పల్లా వినతిజనగామ: మున్సిపాలిటీ అభివృద్ధికి అవసరమైన నిధులను వెంటనే విడుదల చేసి పెండింగ్ పనులను పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కోరారు. శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఎమ్మెల్యే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో ఇందిరానగర్‌తో పాటు మూడు వార్డులకు మంజూరైన రూ.25 కోట్లు, ఎన్నికల సమయంలో మున్సిపాలిటీ అభివృద్ధికి మంజూరైన రూ.18.9 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని, షామీర్పేట వద్ద కిలోమీటర్ అప్రోచ్ రోడ్డుకు ఆర్అండ్బీ ద్వారా నిధులు మంజూరు చేయాలన్నారు. గండిరామారంలో వరద నీటిలో మునిగిన రెం డు పంపులను మరమ్మతు చేసి తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసి అవసరమైన మేరకు అదనపు నిధులు కేటాయించాలని కోరారు. -
తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
మా పాప శ్రేష్ట ప్రవస్థి రెండో తరగతిలోనే ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొని వంద పద్యాలు కంఠస్థం చేసి జూనియర్స్ విభాగంలో అందరి ముందు వినిపించింది. అప్పటి మంత్రి లక్ష్మారెడ్డితో ప్రశంసలు అందుకుంది. ఆరేళ్ల వయసులో 16 నిమిషాల్లో 100 పద్యాలు వినిపించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఇంతవరకు ఈ రికార్డును రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ కూడా బ్రేక్ చేయలేదు. ఇంకా పలు రంగాల్లో తన ప్రతిభ చాటుతోంది. ప్రస్తుతం ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. – శివగారి కిరణ్ కుమార్, జనగామ -
కీర్తి కాంతులు!
కూతుళ్లు..నేడు కూతుళ్ల దినోత్సవం (డాటర్స్ డే)● అమ్మనాన్నల రెక్కల కష్టం.. కూతుళ్ల విజయాల ఆకాశం ● చదువుకోలేదన్న వెలితిని.. పిల్లల చదువుతో తుడిచేసుకున్న తల్లిదండ్రులు ● వారి ఆశలను వమ్ము చేయకుండా నెరవేర్చిన కూతుళ్లు ● ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నతస్థానాలకు ఎదిగిన పలువురుకూతుర్ని చూసి గర్వపడుతున్నాం.. హన్మకొండ : నిన్నుచూసి మేము తల్లిదండ్రులుగా ఎంతో గర్వపడుతున్నాం. కూతురు సహనా రెడ్డి చిన్ననాటి నీ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటా ఆనందం పొందుతున్నాం. విద్య అనేది భవిష్యత్తును మార్చే శక్తి అని దృఢంగా నమ్మి మా కూతురును చదివించాం. కాకతీయ యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేసి, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ స్కూల్ ఎంబీఏ పూర్తి చేసింది. మల్టీ నేషనల్ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీలో ఏడాదికి రూ.75 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం చేస్తూ సమాజంలో ఉన్నత స్థాయిలో నిలవడం మాకెంతో గర్వకారణం. మా ఆనందం.. ఆశలకు ప్రతీక అయిన నీవు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నతశిఖరాలను అధిరోహించాలని, నేటి సమాజానికి మార్గదర్శకురాలిగా నిలవాలని కోరుకుంటున్నాం. –గోపు రేణుక, సమ్మిరెడ్డి, హనుమకొండ -
జిల్లా వ్యవసాయ కార్యాలయ ఆస్తులు జప్తు
● కోర్టు ఆదేశాల మేరకు సామగ్రి బయట ● అధికారి లేకపోవడంతో తిరుగుముఖంజనగామ రూరల్: జిల్లా వ్యవసాయ కార్యాలయ ఆస్తులు శనివారం జప్తు చేశారు. 2015, 2016 సంవత్సరాల్లో జిల్లా వ్యవసాయ శాఖ లబ్ధిదారులకు వ్యవసాయ పరికరాలను సబ్సిడీపై ఇచ్చేందుకు నిర్ణయించింది. ఈమేరకు దీప్తి ఇంజనీరింగ్ వెల్డింగ్ వర్క్స్ ఓనర్ కత్తుల రాజిరెడ్డి రూ. 18 లక్షల 45 వేల విలువైన పరికరాలు అందించాడు. వాటికి అప్పటి ప్రభుత్వం ఇచ్చిన డీడీలు బౌన్స్ కావడంతో బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. దీంతో జిల్లా వ్యవసాయ కార్యాలయంలో ఉన్న ఆస్తులు, ఫర్నిచర్ జప్తు చేసుకోవాలని కోర్టు ఆదేశించింది. దీంతో కలెక్టరేట్లోని వ్యవసాయ శాఖ కార్యాలయంలోని ఫర్నిచర్ బయట పెట్టారు. జిల్లా అధికారి లీవులో ఉన్నారని వ్యవసాయ శాఖ సిబ్బంది చెప్పడంతో కోర్ట్ సిబ్బంది ఆ సామగ్రిని అక్కడే పెట్టి వెళ్లిపోయారు. తిరిగి 28న (సోమవారం) వచ్చి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. -
వృథాగా పోతున్న వరద నీరు మళ్లింపు
● పనులు పరిశీలించిన ఎమ్మెల్యే కడియం రఘునాథపల్లి: మండలంలోని ఉత్తర ప్రాంతంలోని గ్రామాలతో పాటు ఇబ్రహీంపూర్ పెద్ద చెరువు మత్తడి నుంచి వృథాగా పోతున్న నీటిని శ్రీమన్నారాయణపురం గ్రామం వద్ద కెనాల్ ద్వారా నవాబుపేట రిజర్వాయర్‌లోకి మళ్లించామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. వాగులో వృథాగా పోతున్న వరద నీటిని కెనాల్ ద్వారా నవాబుపేట రిజర్వాయర్‌కు మళ్లించే పనులను ఆయన క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ నాయకులు, రైతులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వరద నీటి మళ్లింపుతో లింగాలఘణపురం, రఘునాథపల్లి మండలాల్లోని వేలాది ఆయకట్టుకు సాగు నీరందుతుందన్నారు. అనంతరం గ్రామంలో ఇటీవల మృతి చెందిన మాచర్ల యాదగిరిగౌడ్ కుటుంబాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరామర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మారుజోడు రాంబాబు, లింగాల జగదీష్‌చందర్‌రెడ్డి, గంగిడి నరసింహారెడ్డి, లింగాజి, గాదె మహేందర్‌రెడ్డి, బొమ్మ వీరస్వామి, లోనె శ్రవణ్, గొరిగ రవి, నామాల బుచ్చయ్య, కోళ్ల రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
చాకలి ఐలమ్మ ఆశయాలు స్ఫూర్తిదాయకం
జనగామ రూరల్: చాకలి ఐలమ్మ ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కొనియాడారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ పోషించిన పాత్ర చిరస్మరణీయమన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ అధికారి ఎన్.ఎల్.నరసింహరావు, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిపాక రాములు, జిల్లా పద్మశాలి సంఘం అద్యక్షుడు వేముల బాలరాజు, కుమ్మరి సంఘం అధ్యక్షుడు ఎద్నూరి బుచ్చయ్య, అభినాష్, కుల సంఘాల ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. ‘రెడ్‌క్రాస్’ మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడిగా వెంకట్ రెడ్డి జనగామ రూరల్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల్లో లయన్ పప్పు వెంకట్ రెడ్డి మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. స్టేషన్ ఘన్పూర్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ప్రకాష్ ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించి ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు. ఈసందర్భంగా వెంకట్ రెడ్డికి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా జిల్లాలో మానవతా సేవలను మరింత విస్తరించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి జనగామ రూరల్: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోని భవిష్యత్తులో గొప్పగా ఎదగాలని ఇంటర్మీడియట్ విద్యాధికారి జితేందర్ రెడ్డి ఆకాంక్షించారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ నాముని పావని కుమారి అధ్యక్షతన ఫస్టియర్ విద్యార్థులకు ఫ్రెషర్స్ డే నిర్వహించారు. ఈసందర్భంగా జితేందర్ రెడ్డి మాట్లాడు తూ.. కళాశాల విద్య భవిష్యత్తుకు బాటలు వేస్తుందన్నారు. ఉత్తమ విద్యను పొంది అంకిత భావంతో చదివి వంద శాతం ఫలితాలు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో కళా శాల స్టాఫ్ సెక్రటరీ వై. శ్రీకాంత్‌రెడ్డి, ఎన్ఎస్ ఎస్ కోఆర్డినేటర్ వస్కుల శ్రీనివాస్, కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మరిపెల్ల రవిప్రసాద్, అధ్యాపకులు పాల్గొన్నారు. ఇన్ సర్వీస్ టీచర్ల టెట్‌లో 71.43శాతం ఉత్తీర్ణత జనగామ: ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. జిల్లాలో 231 మంది ఉపాధ్యాయులు పరీక్షకు హాజ రుకాగా 165 మంది ఉత్తీర్ణత సాధించారు. దీంతో జిల్లాలో 71.43 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సబ్జెక్టుల వారీగా చూస్తే పేపర్–2 సోషల్ విభాగంలో అత్యధిక సంఖ్యలో ఉత్తీర్ణత సాధించారు. టెట్ పేపర్–1కు జిల్లాలో 43 మంది ఉపాధ్యాయులు పరీక్షకు హాజరుకాగా 29 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ విభాగంలో సుమా రు 67.44 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రాథమిక స్థాయి బోధనకు అర్హత సాధించేందుకు నిర్వహించిన ఈ పరీక్షలో ఉపాధ్యాయుల నుంచి మంచి స్పందన కనిపించింది. పేపర్–2లో మ్యాథ్స్, సైన్స్ విభాగానికి 97 మంది ఉపాధ్యాయులు హాజరుకాగా 69 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ విభాగంలో సుమారు 71.13 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పేపర్–2 సోషల్ విభాగంలో 91 మంది పరీక్ష రాయగా 67 మంది ఉత్తీర్ణులయ్యారు. దీంతో ఈ విభాగంలో సుమారు 73.63 శాతం ఉత్తీర్ణత నమోదైంది. జిల్లాలో మూడు విభాగాల్లో కలిపి 231 మంది ఉపాధ్యాయులు పరీక్ష రాయగా 165 మంది అర్హత సాధించారు. ఇన్న్సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ అర్హత సాధించడం ద్వారా తమ వృత్తిపరమైన అర్హతలను మరింత బలోపేతం చేసుకునే అవకాశం లభించినట్లయింది. -
నలుగురు కుమార్తెలు ఉద్యోగస్తులే..
ఏటూరునాగారం: మాది రైతు కుటుంబం. ఎన్నో కష్టాలు పడి మా తల్లిదండ్రులు నన్ను పెంచి పెద్దచేశారు. ఇంటర్ వరకు చదువుకున్నాను. 19 సంవత్సరాలకే జైలు వార్డెన్ ఉద్యోగం వచ్చింది. పోలీసులను మావోయిస్టులు చంపుతున్నారని తల్లిదండ్రులు పోలీసులు ఉద్యోగానికి పంపలేదు. నాకు నలుగురు కుమార్తెలు. ప్రభుత్వ పాఠశాలలో చదివించి ఇంటి వద్ద నేనే ట్యూషన్ చెప్పేవాడిని. ఆ తర్వాత నా రెండో కుమార్తె ప్రసన్న లక్ష్మీని డిప్లొమా అగ్రికల్చర్ చదివించగా ఏఈఓగా ఉద్యోగం వచ్చింది. పెద్ద కుమార్తె పద్మను ఏఎన్ఎంగా ములుగు ఏరియా ఆస్పత్రిలో థియేటర్ అసిస్టెంట్‌గా ఔట్ సోర్సింగ్‌లో పనిచేస్తోంది. మూడో కుమార్తె ప్రియాంకకు ములుగు ఏరియా ఆస్పత్రిలో ల్యాబ్ అసిస్టెంట్‌గా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. నాలుగో కుమార్తె రజిత కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం రాగా ప్రస్తుతం హైదరాబాద్‌లోని హెడ్ క్వార్టర్స్‌లో వెటర్నరీ ల్యాబ్ టెక్నిషియన్‌గా ఉద్యోగం చేస్తోంది. నలుగురు కుమార్తైలెనా అధైర్యపడకుండా ప్రయోజకులను చేశా. వారు నా నామ్మకాన్ని నిలబెట్టడం తండ్రిగా ఎంతో సంతృప్తినిచ్చింది. – గోగు నగేశ్, ఏటూరునాగారం, ములుగు జిల్లా -
జిల్లాకు రూ.27 కోట్ల వరాలు
జనగామ: జిల్లాలో పేదల కోసం అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్లను పూర్తి చేసి నివాసయోగ్యంగా తీర్చిదిద్దేందుకు రూ.2 కోట్లతో పాటు మున్సిపాలిటీకి మరో రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రెస్టన్ కళాశాల గ్రౌండ్లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమ సభలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జనగామ మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి మంత్రి మాట్లాడారు.. గత ప్రభుత్వ హయాంలో వివిధ కారణాలతో నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయిన ఇళ్లను గుర్తించి వాటిని పూర్తి చేసి పేద కుటుంబాలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఒక్క జనగామ నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గతంలో నిర్మాణాలు పూర్తికాక ఖాళీగా ఉన్న ఇళ్లను గుర్తిస్తున్నామని చెప్పారు. జనగామకు సంబంధించి అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేసేందుకు రూ.2 కోట్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వచ్చే దసరా నాటికి ఇళ్లు నివాసయోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జనగామ జిల్లాలో సుమారు 500 కుటుంబాలు పూరి గుడిసెల్లో నివసిస్తున్నాయని, వచ్చే దసరా నాటికి ఇందులో అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేలా మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించారు. మొండి గోడలు, స్లాబ్ స్థాయిలో నిలిచిపోతే ఆర్థిక పరిస్థితుల కారణంగా మొండి గోడల వద్ద, స్లాబ్ స్థాయిలో నిర్మాణాలు నిలిచిపోయిన ఇళ్లను కూడా పరిశీలించి రూ.2లక్షల నుంచి రూ.3 లక్షల వరకు సాయం అందిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. మూడు నాలుగు విడతల్లోనూ అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ స్థలాలు ఉన్న ప్రాంతాలను గుర్తించి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఏ గ్రామంలో, ఏ మున్సిపాలిటీలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఇళ్ల స్థలాలు అందుబాటులో ఉన్నాయో వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. మూడో విడతలో ఆయా ప్లాట్లకు ఇళ్లను కూడా మంజూరు చేసే కార్యక్రమం చేపడతామని తెలిపారు. జనగామ మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు దసరా నాటికి రూ.25 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులను వెంటనే మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కేంద్రం నుంచి తుది బిల్లుల విషయంలో ఆలస్యం జరిగిన సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు వచ్చి చెల్లింపులు చేసిందన్నారు. అనంతరం 500 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇంది రమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను మంత్రి చేతుల మీ దుగా అందించారు. కార్యక్రమంలో డీసీపీ రాజమ హేంద్రనాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్‌రెడ్డి, ఏ ఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి నాయక్, వైటీడీఏ సభ్యులు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ తదితరులు పాల్గొన్నారు. అసంపూర్తి ఇళ్లకు రూ.2 కోట్లు మున్సిపాలిటీకి రూ.25 కోట్లు పూరిగుడిసెల కుటుంబాలకు రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి -
పల్లెకు ‘జలసిరి’.. రోడ్లకు హ్యామ్ జోష్
సాక్షిప్రతినిఽధి, వరంగల్: ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల గ్రామీణ ప్రాంతాలకు రహదారి అనుసంధానంతోపాటు నీటి భద్రత, ఉపాధి అవకాశాలు, శాశ్వత ఆస్తుల సృష్టికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, ఇందులో భాగంగా రెండు పూర్వ జిల్లాల్లో హ్యామ్ రోడ్ల పనులను అక్టోబర్ 25 నుంచి దశలవారీగా ప్రారంభించేందుకు కార్యాచరణ సిద్ధమైందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క (అనసూయ) తెలిపారు. హనుమకొండ కలెక్టరేట్లో శుక్రవారం ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, వీబీ జీరామ్‌జీ, ఎల్‌నినో సన్నద్ధత, హ్యామ్ రోడ్లపై సంబంధిత అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. వరంగల్ నుంచి ఖమ్మం వరకు పనుల కదలిక.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ పనులను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ప్రారంభించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి సీతక్క చెప్పారు. రెండు ఉమ్మడి జిల్లాల పరిధిలో 445 రహదారులను 1,366 కి.మీ. మేర అభివృద్ధి చేయనున్నట్లు తెలి పారు. ఇందుకోసం సుమారు రూ.1,130 కోట్ల వర కు వ్యయం కానుందని, ఇందులో 90 శాతం మేర ఇప్పటికే ఉన్న రహదారులను అభివృద్ధి చేయనుండగా.. 10 శాతం మేర కొత్త రహదారులు నిర్మించనున్నట్లు వివరించారు. ప్రతీ ఆవాసం నుంచి గ్రామానికి, గ్రామం నుంచి మండల కేంద్రానికి రహదారి సౌకర్యం ఉండాలన్నదే హ్యామ్ రోడ్ల లక్ష్యమని పేర్కొన్నారు. ఉపాధి అంటే కూలీ మాత్రమే కాదు.. ‘జలసిరి’తో నీటి భద్రత ఉపాధి హామీ (వీబీజీ రామ్‌జీ) పనులను పని దినాల కల్పనకే పరిమితం చేయకుండా గ్రామాల్లో శాశ్వత ఆస్తులను సృష్టించేలా మారుస్తున్నట్లు సీతక్క తెలిపారు. జలసిరి కార్యక్రమం కింద ప్రతీ ఇంటికి ఇంకుడు గుంత.. ప్రతీ ఊరికి ఊటకుంట.. ప్రతీ పంటకు పంటకుంట నిర్మించనున్నట్లు తెలి పారు. ఏజెన్సీ గ్రామాల్లో వాగుల వద్ద చెక్‌డ్యామ్‌లు నిర్మించి వర్షపు నీటిని నిల్వ చేయడం, భూగర్భ జలాలను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న గ్రామ సమగ్ర ప్రణాళికలను రూపొందించి ఆవిష్కరించనున్నట్లు సీతక్క తెలిపారు. గ్రామ సర్పంచుల ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో ఏ పనులు అవసరమో గుర్తించి అభివృద్ధి మ్యాప్ తయారు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో అందుబాటులో ఉన్న నీటితో తాగునీటి అవసరాలకు సరిపడా నీరు ఉందని స్పష్టం చేశారు. అయినప్పటికీ వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే ముందస్తు ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ సీఎస్ దాన కిషోర్, కమిషనర్ దివ్య దేవరాజన్, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయ్, సత్యశారద, స్పెషల్ కమిషనర్ శ్రీలక్ష్మి, అడిషనల్ కమిషనర్ రవీందర్, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, పంచాయతీరాజ్ ఈఎన్సీ జగదీశ్వర్, వరంగల్ బల్దియా కమిషనర్ వెంకన్నతో పాటు ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉపాధి పనులతోపాటు గ్రామాల్లో శాశ్వత ఆస్తుల సృష్టి ఏజెన్సీ గ్రామాల్లో వాగులపై చెక్‌డ్యామ్‌లు అక్టోబర్ 2న గ్రామ సమగ్ర ప్రణాళికలకు శ్రీకారం ఉమ్మడి వరంగల్, ఖమ్మం అధికారులతో మంత్రి ధనసరి సీతక్క సమీక్ష -
సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ
● డీసీపీ రాజమహేంద్రనాయక్ జఫర్‌గఢ్: నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో దోహదం చేస్తుందని డీసీపీ రాజమహేంద్రనాయక్ పేర్కొన్నారు. సుస్త్రో ఆయిల్ కంపెనీ ఉప్పుగల్లు వారి సహకారంతో మండలంంలోని 14 గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను స్థానిక పోలీస్‌స్టేషన్‌లో డీసీపీ రాజమహేంద్రనాయక్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. గ్రామాల్లో జరుగుతున్న దొంగతనాలు, నేరాల తీరును తెలుసుకోవడంతో పాటు నేరస్తులను పట్టుకునేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతలు, షాపుల యాజమానులు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సుస్త్రో ఆయిల్ కార్పొరేషన్ కంపెనీ అధినేత సంతోష్ జగ్ధని, సీఎస్ఆర్ హెడ్ సురేష్ రోండా, జనరల్ మేనేజర్ సుబ్బారెడ్డి, పబ్లిక్ రిలేషన్ విజయ్‌కుమార్ నాయర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కుమార్‌రాజా, హెచ్ఆర్ హెడ్ ధనవర్మ, ఎస్సై బి.రామారావు, సర్పంచ్‌లు కొడారి సాంబరాజు, పులి సమ్మయ్య, మమత సోమన్నతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
జిల్లా విశిష్టతను తెలుసుకోవాలి
జనగామ రూరల్: జిల్లా చారిత్రక, సాంస్కృతిక విశిష్టతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని జిల్లా పర్యాటక అధికారి ఎన్ఎల్ నరసింహారావు సూచించారు. శుక్రవారం ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యాటక ప్రాధాన్యం, జిల్లా చారిత్రక, సాంస్కృతిక విశిష్టతను ప్రజలకు తెలియజేసే విధంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. యువ టూరిజం క్లబ్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. అండర్–20 షాట్‌పుట్ విభాగంలో పుదుచ్చేరిలో నిర్వహించిన సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్లో మూడో స్థానం సాధించిన సునీత్ కుమార్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీఐఈఓ జితేందర్‌రెడ్డి, రెడ్డి రత్నాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ చేతుల మీదుగా నగదు పురస్కారం జఫర్‌గఢ్: మండలంలోని తమ్మడపల్లి (జి) ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని గాదె శ్రీజ పదో తరగతిలో మండలంలో టాపర్‌గా నిలిచినందుకు గవర్నర్ శివప్రతాప్శుక్లా చేతుల మీదుగా రూ.50 వేల నగదు పురస్కారాన్ని అందుకున్నట్లు ప్రధానోపాధ్యాయుడు సీతారామయ్య తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. శ్రీరాం గ్రూప్ సంస్థ వారు ప్రకటించిన రూ.50 వేల నగదు పురస్కారాన్ని గురువారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ విద్యార్థినికి పురస్కారం అందించారన్నారు. ఈసందర్భంగా విద్యార్థినిని ఉపాధ్యాయులు తదితరులు అభినందించారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు న్యాయం చేయాలి జనగామ రూరల్: డబల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కోసం స్థలాలు ఇచ్చిన మూడో విడత ఇందిరమ్మ లబ్ధిదారులు 72 మందికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చొరవ తీసుకుని న్యాయం చేయాలని సీపీఎం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాశ్ కోరారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో కళ్యాణం లింగం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయ న మాట్లాడారు. బూడిది గోపి, అజారు ద్దీన్, బాల్నె వెంకట మల్లయ్య, పల్లెర్ల లలిత, పగిడిపల్లి బాలమణి, పందిళ్ల కళ్యాణి, ప్రశాంత్, శ్రావణ్, జయ వరలక్ష్మి పాల్గొన్నారు. -
మంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
జనగామ: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో రెవె న్యూ అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్‌లతో కలిసి కలెక్టర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం, బస్టాండ్ ఎదురుగా ఉన్న ప్రెస్టన్ కళాశాల గ్రౌండ్లో నిర్వహించే కార్యక్రమాలకు వేదిక, పందిళ్లు తదితర ఏర్పాట్లను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్, మున్సిపల్ చైర్పర్సన్ బాలమణిశ్రీనివాస్‌తో కలిసి మున్సి పల్ కార్యాలయం, ప్రెస్టన్ కళాశాల గ్రౌండ్‌ను పరిశీలించారు. ఆర్డీఓ గోపీరాం, ఏసీపీ భీమ్‌శర్మ, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
అక్రమాలకు చెక్
‘సీ్త్రనిధి’ యాప్..లింగాలఘణపురం: మహిళా స్వయం సహాయక సంఘాల్లో సీ్త్రనిధి రుణాలు తీసుకొనే సంఘ సభ్యుల రుణాల చెల్లింపులో ఇక నుంచి అక్రమాలకు తావులేకుండా చెక్ పెట్టనున్నారు. సెర్ప్ తీసుకొచ్చిన శ్రీమన సీ్త్రనిధి యాప్శ్రీతో ప్రతీ సభ్యురాలు నేరుగా తాము తీసుకున్న రుణాల చెల్లింపులో నేరుగా బ్యాంక్‌లోనే జమ చేసుకొనే అవకాశం కల్పించింది. గతంలో రుణం తీసుకున్న సభ్యురాలు సమావేశం రోజు సంఘం అధ్యక్షురాలు సమక్షంలో సీఏలకు చెల్లించడం జరిగేది. దీంతో అధ్యక్షురాలు ఆ డబ్బులను బ్యాంక్‌కు వెళ్లి సంఘం ఖాతాలో జమ చేయాల్సి ఉండేది. ఆ సమయంలో అధ్యక్షురాలు సభ్యులు చెల్లించిన డబ్బులు జమ చేయకుండా, ఒక వేళ తక్కువ జమ చేసిన సభ్యులకు బ్యాంక్‌కు వెళ్తే గాని తెలిసేదీ కాదు. దీంతో అక్రమాలకు అవకాశం కలిగేది. కొన్ని చోట్ల ఇలాంటి సంఘటనలు జరిగిన నేపథ్యంలో మన సీ్త్రనిధి యాప్‌ను తీసుకొచ్చింది. చెల్లింపులు..బకాయిలు.. మన సీ్త్రనిధి యాప్‌తో నేరుగా సభ్యురాలే తాను తీసుకున్న రుణం చెల్లింపుల లావాదేవీలను జరుపుకొనే అవకాశం ఏర్పడింది. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే తాను తీసుకున్న అప్పు వివరాలు, చెల్లింపులు, ఇంకా ఎంత బకాయి ఉంది..ఏ సభ్యులు ఎంత చెల్లించింది.. అనే ప్రతి వివరాలను అందులోనే చూసుకోవచ్చు. అంతేకాకుండా సీ్త్రనిధి రుణం కోసం దరఖాస్తు చేసుకొనే అవకాశం కూడా ఉంటుంది. దీంతో సీ్త్రనిధి రుణాల వివరాలన్నీ డిజిటలైజ్ చేయడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఇలా.. జిల్లాలోని 12 మండలాలు, ఓరుగల్లు టీఎల్ఎఫ్ మెప్మాతో కలిసి జిల్లాలో 13,739 స్వయం సహాయక సంఘాలు ఉండగా అందులో 1,49,841 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో 4,849 సంఘాల్లో 22,137 మంది సభ్యులు సీ్త్రనిధి రుణాలను తీసుకున్నారు. ఇందులో 4,010 సంఘాల్లోని 6,513 మంది సభ్యులు యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఇంకా 9,694 సంఘాలు, అందులోని 1,43,328 మంది సభ్యులు సీ్త్రనిధి రుణాలను తీసుకోకుండా యాప్‌ను డౌన్లోడ్ చేసుకోకుండా ఉన్నారు. స్వయం సహాయక సంఘంలోని సభ్యులందరూ ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల సీ్త్రనిధి సేట్ జనరల్ మేనేజర్ రాము, జిల్లా అసిస్టెంటెంట్ మేనేజర్ నిర్మల జిల్లాలో పర్యటించారు. ‘మన సీ్త్రనిధి’ పేరిట యాప్ తీసుకొచ్చిన సెర్ప్ నేరుగా బ్యాంక్ అకౌంట్లలో రుణాల చెల్లింపు రుణ వివరాలు తెలుసుకొనే అవకాశం సభ్యులకు అవగాహన కల్పిస్తున్న యంత్రాంగం -
శనివారం శ్రీ 26 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
మేము మా కూతురుప్రతీ తల్లిదండ్రికి తమ కూతుళ్లతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. అల్లారుముద్దుగా పెంచిన కూతురు ఉన్నతస్థానానికి ఎదిగితే ఆ విజయం చూసి మురిసిపోవడంలో ఉన్న ఆనందం మరెక్కడా ఉండదు. కూతురితో గడిపిన ప్రతీ విషయం ఓ తీపిజ్ఞాపకం. మీకూ అలాంటి తీపి జ్ఞాపకాలు, మీ కూతురు గొప్పతనం గురించి డాటర్స్ డే (కూతురు దినోత్సవం) సందర్భంగా ‘సాక్షి’తో పంచుకోండి. దీంతోపాటు తల్లిదండ్రి తమ కూతురుతో దిగిన సెల్ఫీఫొటో, మీ పేరు, ప్రాంతం వివరాలను ఈ నెల 26వ తేదీ సాయంత్రం 4గంటల్లోగా కింది వాట్సాప్ నంబర్‌కు పంపండి. వచ్చిన వాటిని స్క్రూటినీ చేసి 27వ తేదీ పత్రికలో ప్రచురిస్తాం.మీరు పంపాల్సిన వాట్సాప్ నంబర్ : 96420 01602 -
రెండు డీఏల ప్రకటనపై హర్షం
● ప్రభుత్వానికి, కలెక్టర్‌కు టీఎన్జీఓ నాయకుల కృతజ్ఞతలుజనగామ: ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంపై టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు, జిల్లా టీజీఈజేఏసీ చైర్మన్ ఖాజా షరీఫ్ హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏల్లో రెండు డీఏలను దసరా సందర్భంగా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంపై ఉద్యోగుల్లో సంతోషం వెల్లివిరుస్తోందన్నారు. రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో 206 ఉద్యోగ సంఘా లతో కలిసి మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాస్ తదితరులు ఉద్యోగుల సమస్యలను పలు దశల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. జిల్లా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సహకరిస్తున్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు కృతజ్ఞతలు తెలి పా రు. జిల్లా కార్యదర్శి పెండెల శ్రీనివాస్, రాష్ట్ర నాయకుడు పేర్వారం ప్రభాకర్, అసోసియేట్ అధ్యక్షుడు సానం రాజనర్సయ్య, జిల్లా కోశాధికారి ఎండీ హఫీ జ్, నాగార్జున, యశోద తదితరులు పాల్గొన్నారు. -
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
● పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం ● మంత్రి పర్యటనకు పట్టణవ్యాప్తంగా స్వాగత తోరణాలు.. భారీ కటౌట్లు ● కొమ్మూరి ఆధ్వర్యంలో సన్నాహక సమావేశంజనగామ: జిల్లా కేంద్రంలో మున్సిపల్ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఈనెల 26న (శనివారం) మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జిల్లా కేంద్రానికి రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మంత్రికి స్వాగతం పలికేందుకు పట్టణంలోని ప్రధాన మార్గాల్లో భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొ మ్మూరి ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, చెంచారపు కరుణాకర్‌రెడ్డి, మేడ శ్రీనివాస్, దోర్నాల వెంకటేశ్వర్లు, గాదెపాక రామచందర్ తదితరులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. మంత్రి పర్యటనకు ప్రజలు, ఇందిరమ్మ మహిళా లబ్ధిదారులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కొమ్మూరి పిలుపునిచ్చారు. మరోవైపు మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ బాలమణి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కమిషనర్ రాజశేఖర్‌రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రి పర్యటన ఇలా.. ముందుగా మున్సిపల్ కార్యాలయంలో అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం పట్టణంలోని 13వ వార్డులో గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని, అక్కడి నుంచి నేరుగా బహిరంగ సభకు హాజరుకానున్నారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ పనులకు శ్రీకారం జనగామ మున్సిపాలిటీకి రూ.1.77 కోట్ల విలువైన 16 చెత్త సేకరణ ఆటోలు, జేసీబీని జెండా ఊపి ప్రారంభిస్తారు. అలాగే 54 మంది శానిటరీ వర్కర్లు, ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లకు నియామక పత్రాలు అందజేస్తారు. రూ.2 కోట్లతో నిర్మించిన డంపింగ్ యార్డు షెడ్, మెషినరీ, రూ.38 కోట్లతో చేపట్ట నున్న మురుగునీటి శుద్ధి ప్లాంట్ (ఎస్టీపీ) పనులకు శంకుస్థాపన చేస్తారు. తరిగొప్పుల మండలంలో రూ.2.25 కోట్లతో నిర్మించిన తహసీల్దార్ కార్యాలయ భవనం, బచ్చన్నపేట మండలం కట్కూర్‌లోని జెడ్పీహెచ్ఎస్, ఎంపీపీఎస్ పాఠశాలల్లో రూ.38.75 లక్షలతో చేపట్టిన మరమ్మతు, పునరుద్ధరణ పనులను ప్రారంభిస్తారు. పోచన్నపేట ఎంపీపీఎస్‌లో రూ.24 లక్షలు, రామచంద్రాపురం ఎంపీపీఎస్‌లో రూ.23 లక్షలు, కోర్టు సమీపంలోని జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో రూ.20 లక్షలతో చేపట్టనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. జిల్లాలోని 12 కేజీబీవీలు, 15 పీఎంశ్రీ పాఠశాలలు, 28 జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలల్లో రూ.1.92 కోట్లతో అవుట్డోర్ బాస్కెట్‌బాల్ కోర్టుల నిర్మాణ పనులకు శ్రీకారం చుడతారు. జీజీహెచ్‌లో రూ.19.25 లక్షలతో అంతర్గత సీసీ రోడ్డు, చంపక్‌హిల్స్ ఎంసీహెచ్‌లో రూ.7.35 లక్షలతో ఆక్సిజన్ ప్లాంట్‌కు సీసీ రోడ్డు, పార్కింగ్ ప్రాంతంలో గ్రావెల్, యూజీడీ పనులు ప్రారంభిస్తారు. ఐడీఓసీ వద్ద రూ.10 లక్షలతో పార్కింగ్ టైల్స్, ఫెన్సింగ్, రూ.31 లక్షలతో ప్రహరీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. మున్సిపాలిటీ పరి ధిలో 99 మంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారు. 500 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేస్తారు. -
మళ్లీ తెరపైకి ‘ఫిరాయింపుల’ వివాదం!
సాక్షిప్రతినిధి, వరంగల్: పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ఉమ్మడి వరంగల్‌లో మరోసారి చర్చనీయా ంశంగా మారింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టు వేసిన అనర్హత వేటు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడంతో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్‌లో చేరిన వ్యవహారంలో కడియం శ్రీహరితోపాటు దానం నాగేందర్‌పై కూడా అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. ఇద్దరి విషయంలోనూ విచారణ జరిపి, వారి వాదనలు స్వీకరించిన స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ గత మార్చి 11న ఇద్దరిపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. ఫిరాయింపునకు సంబంధించి తగిన ఆధారాలు లేవని పేర్కొన్నారు. దీంతో కడియం శ్రీహరి వ్యవహారానికి అప్పట్లో తెరపడినట్లయింది. ‘కడియం’పై ఆ ప్రభావం ఎంత? మార్చి 11న స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం సెప్టెంబర్ 18న తెలంగాణ హైకోర్టు స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టి దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించింది. 2024 ఏప్రిల్ 23నుంచి ఆయన అసెంబ్లీ సభ్యత్వం రద్దయినట్లుగా కోర్టు పేర్కొంది. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లుగా కూడా ప్రకటించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా గురువారం ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది. అదే రోజు స్పీకర్ కొట్టివేసిన కడియం శ్రీహరి అనర్హత పిటిషన్ విషయంలోనూ తదుపరి న్యాయపరమైన పరిణామాలు ఎలా ఉంటాయన్న చర్చ ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో మొదలైంది. ‘కడియం’పై చేసిన ఫిర్యాదులేంటి..? 2023, డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ఘన్పూర్నుంచి కడియం శ్రీహరి బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచారు. అనంతరం 2024 మార్చి 31న సీఎం రేవంత్‌రెడ్డి, అప్పటి తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్లు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే సమయంలో ఆయన కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్ వరంగల్ లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. కడియం శ్రీహరి పార్టీ మార్పు, కుమార్తె తరఫున కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రచారం చేయడం, బీఆర్ఎస్ కేసీఆర్ తదితరులపై చేసిన విమర్శలు కూడా అప్పట్లో బీఆర్ఎస్ అనర్హత పిటిషన్లో ప్రధానంగా ప్రస్తావించిన అంశాల్లో ఉన్నాయి. దానం తర్వాత.. కడియం సంగతేంటి? ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో హాట్‌టాపిక్ దానంపై హైకోర్టు వేటును సమర్థించిన సుప్రీం.. మార్చి 11న ఇద్దరినీ అనర్హత నుంచి తప్పించిన స్పీకర్ స్పీకర్ తీర్పుతో శ్రీహరికి అప్పట్లో ఊరట.. తాజాగా మళ్లీ చర్చ -
భారీ వర్షాలతో చెరువులు, కుంటలకు జలకళ
● నెర్రెలు బారిన పొలాలకు జీవం ● వరి, ఆరుతడి పంటలకు మేలు.. ● పత్తికి నష్టమంటున్న రైతులు ● చీడపీడలపై ఆందోళనజనగామ: వానాకాలం సీజన్ ప్రారంభమైన తర్వాత జిల్లాలో తొలిసారిగా భారీ వర్షం కురవడంతో రైతాంగానికి ఊరట లభించింది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాల జాడ లేక వాలిపోతున్న పత్తి మొక్కలు, నెర్రెలు బారిన వరి పొలాలు, ఎండిపోతున్న ఆరుతడి పంటలకు వర్షం ప్రాణం పోసింది. పెట్టుబడులు సైతం దక్కుతాయో లేదోనని ఆందో ళన చెందిన రైతుల్లో భారీ వర్షంతో ఆశలు చిగురించాయి. 3.30లక్షల ఎకరాల్లో సాగు జిల్లా వ్యాప్తంగా సుమారు 3.30 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న తదితర వానాకాలం పంటలు సాగు చేశారు. సకాలంలో వర్షాలు లేకపోవడంతో భూగర్భజలాలు అడుగంటగా, సాగునీటి వనరులపై ఆధారపడి పంటలను కాపాడుకునేందు కు రైతులు ఇబ్బందులు పడ్డారు. తాజాగా కురిసిన వర్షంతో వాగుల్లోకి వరదనీరు చేరడంతోపాటు పలు చెరువులకు జలకళ వచ్చింది. మరికొన్ని మండలాల్లో వాగులు, కల్వర్టులపై నుంచి నీరు ఉప్పొంగి ప్రవహించింది. ప్రస్తుతం కురిసిన వర్షం పంటలకు కొంతమేర ప్రయోజనం చేకూర్చిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. నర్మెటలో ఊర చెరువు మత్తడి పోస్తుండగా, పాలకుర్తి లక్ష్మినారాయణపురం చెరువులోకి వరద నీరు చేరడంతో జలకళ సంతరించుకుంది. జనగామ మం డలం ఎర్రగుంట తండాలో వరిపంట నేల వాలిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 52 చోట్ల మత్తళ్లు జిల్లాలో 771 చెరువులు ఉండగా, 52 మత్తళ్లు పోస్తున్నాయి. ఇందులో 75 నుంచి 100శాతం నిండిన చెరువులు 123, 50 నుంచి 75శాతం 99, 25 నుంచి 50శాతం 273 చెరువులు ఉన్నాయి. జిల్లాలో 72.8 మిల్లీ మీటర్ల భారీ వర్షం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. జిల్లాలోని 20 ప్రాంతాల్లో (లొకేషన్లు) కలిపి 72.8 మిల్లీ మీటర్లుగా వర్షం నమోదైంది. చిల్పూర్ మండలం మల్కాపూర్‌లో అత్యధికంగా 110 మి.మీ. వర్షపాతం నమోదైంది. జఫర్‌గఢ్‌లో 108, దేవరుప్పులలో 103.5, కొడకండ్లలో 97.8, స్టేషన్ ఘన్పూర్ మండలం తాటికొండలో 89.3, దేవరుప్పుల కోలుకొండలో 83, తరిగొప్పుల అబ్దుల్ నాగారంలో 82.5, పాలకుర్తిలో 79, జనగామ మండలం వడ్లకొండలో 76.5 మి.మీ.ల వర్షపాతం నమోదయ్యాయి. జనగామ పట్టణంలో 72.8 మి.మీ. వర్షపాతం నమోదవగా, నర్మెటలో 69.3, పాలకుర్తి గూడూరులో 63, రఘునాథపల్లిలో 62, తరిగొప్పులలో 59.3, బచ్చన్నపేటలో 55, లింగాలఘన్ణపురంలో 51, పాలకుర్తి వావిలాలలో 50 మి.మీ. వర్షం కురిసింది. బచ్చన్నపేట మండలం పడమటి కేశ్వాపూర్లో 43, జఫర్‌గఢ్ కూనూర్‌లో 20.8 మి.మీ. నమోదైంది. -
క్లినిక్‌లు, మెడికల్‌షాపుల్లో తనిఖీలు
● ఆరు మెడికల్ షాపులకు డీఎంహెచ్ఓ షోకాజ్ నోటీసులుస్టేషన్ఘన్పూర్: కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వాణిశ్రీ, జిల్లా ఔషధ నియంత్రణ అధికారుల ఆధ్వర్యంలో డివిజ న్ కేంద్రంలోని ప్రైవేటు క్లినిక్‌లు, మెడికల్‌షాపులను గురువారం తనిఖీలు నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖ, ఔషధనియంత్రణ శాఖ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి మెడికల్ షాపులు, ఆప్టికల్స్, క్లినిక్‌లను విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ డాక్టర్ వాణి శ్రీ మాట్లాడుతూ.. ఘన్‌పూర్‌లో నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేని వారు వైద్య సేవలు అందిస్తున్నారనే ఫిర్యాదు మేరకు కలెక్టర్ ఆదేశాలతో తనిఖీ లను చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఆరు మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు అందించామన్నారు. బస్టాండ్ సమీప క్లినిక్‌లో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ల్యాబ్‌ను సీజ్ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా రాజరాజేశ్వరి మెడికల్షాపులో నిర్వహిస్తున్న క్లినిక్‌ను, కట్ల దవాఖానాలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఎక్స్‌రే మిషన్‌ను మూసివేసినట్లు తెలిపారు. తనిఖీల్లో ఔష ధ నియంత్రణ అడిషనల్ డైరెక్టర్ రాజ్యలక్ష్మీ, జిల్లా ఔషధ నియంత్ర అధికారి ఆలె బాలకిషన్, ఘన్పూర్ పీహెచ్సీ వైద్యాధికారి శ్రీవాణి పాల్గొన్నారు. -
సుప్రీం తీర్పు కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ
జనగామ: పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో దానం నాగేందర్ అనర్హతపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు గురువారం సమర్థించడం కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ అని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. దానం దాఖలు చేసిన పిటిషన్న్ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ప్రజల ఓట్లతో ఎన్నికై న ప్రజాప్రతినిధులు పార్టీలు మారడం ప్రజల తీర్పును అవమానించడమేనని అన్నారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం మానుకుని ప్రజల తీర్పును గౌరవించాలని పల్లా డిమాండ్ చేశారు. -
సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ‘వికసిత్ గ్రామ పంచాయతీ’
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ● ప్రణాళిక అమలుపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణజనగామ రూరల్: గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ‘వికసిత్ గ్రామ పంచాయతీ’ ప్రణాళిక అమలు చేయాలని ముఖ్యంగా తెలంగాణ జలసిరి పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో వీబీజీరామ్‌జీ 125 రోజుల ఉపాధి పని గ్యారంటీ, ఎల్‌నినో తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే ప్రణాళిక, తెలంగాణ జలసిరి పనులపై బచ్చన్నపేట, తరిగొప్పుల, నర్మెట, జనగామ మండలాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్ తయారీ, అమలు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. గ్రామీణ రోడ్లు, డబ్ల్యూబీఎం రోడ్లు, సీసీ రోడ్లు, కల్వర్టులు, ప్రభుత్వ పాఠశాల భవనాలు..తదితర నిర్మాణాలు, మరమ్మతులు కూడా ఈ పథకం ద్వారా చేపట్టవచ్చని వివరించారు. ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్యశాఖ, మిషన్ భగీరథ, తదితర శాఖల అధికారులు గ్రామాల అవసరాలకు అనుగుణంగా సర్పంచులతో సమన్వయం చేసుకొని పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచించారు. డీఆర్డీఓ భాస్కర్, అదనపు డీఆర్డీఓ సూరి, ఎఫ్ఆర్ఓ భాస్కర్, జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోనీ, డీపీఓ వెంకట్ రెడ్డి, మత్స్యశాఖ అధికారి రాణా ప్రతాప్, డీవీహెచ్ఓ మురళీధర్ రావు, ఈఈ పీఆర్ రవీందర్, మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ శ్రీకాంత్, డీహెచ్ఎస్ఓ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించాలి ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై రైతులకు అవగాహన కల్పించి ఎఫ్పీఓల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. కలెక్టరేట్లో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, సేంద్రీయ రైతులు, వ్యవసాయ పారిశ్రామికవేత్తలు, వ్యాపారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ మా ట్లాడుతూ.. జిల్లాలో ఎగుమతులకు మంచి అవకాశాలు ఉన్నాయని, చిట్టి ముత్యాలు బియ్యం ఎగుమతులకు అధిక డిమాండ్ ఉందన్నారు. ఉత్పత్తుల ఎగుమతులకు సంబంధించిన అవకాశాలు, నాణ్య త ప్రమాణాలు, మార్కెటింగ్, సహాయం, ఎగుమతి ప్రక్రియపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వా రా అసిస్టెంట్ మేనేజర్ సుకేష్ వివరించారు. జిల్లా వ్యవసాయ అధికారి అంబికాసోని, మత్స్యశాఖ అధికారి రాణాప్రతాప్, జిల్లా ఉద్యానవన శాఖ అధి కారి నర్సయ్య, ఏపీడీ నూరుద్దీన్, నాబార్డ్ డీడీఎం విజయ్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ప్రతిభ పాల్గొన్నారు. -
అసమర్థ పాలనతోనే విద్యుత్ సంక్షోభం
● మాజీ మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పల్లా ● కేటీపీపీ సందర్శించిన బీఆర్ఎస్ బృందంగణపురం: కాంగ్రెస్ అసమర్థ పాలనతోనే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నెలకొందని.. దీంతో రైతులకు సాగునీరు అందక పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయారని మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీపీ)ను గురువారం బీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు సీనియర్ నేతలు సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని వనరులు ఉన్నా వినియోగించుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థ పాలన చేస్తోందన్నారు. సింగరేణి సంస్థకు జెన్కో సంస్థ రూ.52 వేల కోట్ల బకాయి పడిందని.. దీంతో సింగరేణి బొగ్గును ఉత్పత్తి చేయకపోవడంతో విద్యుత్ ఉత్పత్తి చేయడం లేదన్నారు. తమ నాయకుడు కేటీఆర్ మాట్లాడితే స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎంత డబ్బు ఖర్చు అయిన ఇతర ప్రాంతాల నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలని చెప్పడం సిగ్గు చేటన్నారు. కేటీపీపీలో 1100 మెగా విద్యుత్ ఉత్పత్తికి గాను కేవలం 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి మాత్రమే అవుతుందన్నారు. అధికారులను అడిగితే ఉత్పత్తి తగ్గిన విషయం వాస్తవమే అన్నారని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిని సరిపడా చేసుకునే ప్లాంట్లు ఉన్నప్పటికీ చేతగానితనంతో ఉత్పత్తి చేయలేకపోతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సింగరేణి సంస్థ 2,900 కోట్ల రూపాయలు నష్టపోయిందన్నారు. జెన్కోకు రోజుకు 8వేల టన్నుల బొగ్గును సింగరేణి ఇవ్వాల్సి ఉండగా ఎందుకు ఇవ్వడం లేదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రెండు నెలల బొగ్గు నిల్వలు ఉండేవన్నారు. ఇప్పుడు కనీసం 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు లేవన్నారు. తమ ప్రభుత్వ పాలనలో 24 గంటల విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రతీ ఎకరాకు సాగునీరు అందించామన్నారు. దేవాదులనుంచి గోదావరి నీటిని ఎత్తిపోసే తెలివి లేదన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, తాటికొండ రాజయ్య, అరూరి రమేశ్, శంకర్ నాయక్, నాయకులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు, బడే నాగజ్యోతి తదితరులు పాల్గొన్నారు.గంటపాటు ఉద్రిక్తత బీఆర్ఎస్ బృందాన్ని మొదట కేటీపీపీ లోపలికి వెళ్లకుండా బారికేడ్లను ఏర్పాటు చేసి పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గంటపాటు ఉద్రిక్తత నెలకొంది. ఆగ్రహానికి గురైన మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు బారికేడ్లను నెట్టివేసి ప్రధాన గేటు వద్ద ఆందోళన చేపట్టారు. స్పందించిన పోలీసులు వారి సొంత పూచికత్తుపై ప్లాంటులోకి అనుమతించారు. ప్లాంటును సుమారు గంటకు పైగా పరిశీలించిన బృందం సభ్యులు అనంతరం అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. -
రైతులను పట్టించుకోని కాంగ్రెస్
పాలకుర్తిటౌన్ (దేవరుప్పుల) : కాలం కలిసి రాక రైతులు గోస పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. బుధవారం దేవరుప్పుల మండలంలోలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన బంజర గ్రామంలో రోడ్డు పక్కన పున్న చెరువులో ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా కూలీలు మాట్లాడుతూ.. పంటలకు నీరందడంలేదని.. పంటలు ఎండిపోవడంతో ఉపాధి పనులకు వస్తున్నామని చెప్పారు. స్పందించిన ఎర్రబెల్లి మాట్లాడుతూ.. చెరువులకు సాగు నీరు అందించాలని, వందల ఎకరాలు సాగు చేయకుండా రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. రైతులకు ఏమి చేఆయలో తెలియని వ్యక్తి రాష్ట్రానికి సీఎంగా కొనసాగడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో దేవరుప్పుల మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు తీగల దయాకర్, ఏల సుందర్, కరుణాకర్, నవీన్‌నాయక్, పానుగంటి కృష్ణ పాల్గొన్నారు. ● మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు -
బాలికల క్రీడా ప్రతిభకు రగ్బీ వేదిక
పాలకుర్తి టౌన్: గ్రామీణ ప్రాంత బాలికల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు రగ్బీ వంటి పోటీలు దోహదపడతాయని సీఐ భరత్ సుమన్ అన్నారు. మండలంలోని చెన్నూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జిల్లాస్థాయి అస్మిత రగ్బీ సిటీ టోర్నమెంట్స్ ఆధ్వర్యంలో బుధవారం బాలికలకు –15, 18 విభాగాల్లో పోటీలు నిర్వహించారు. గ్రామీణ క్రీడాకారులకు రాష్ట్ర స్థాయి అవకాశాలు పొందేందుకు ఈ పోటీలు ఉపకరిస్తాయని తెలంగాణ రగ్బీ డెవలప్మెంట్ ఆఫీసర్ శేషు అన్నారు. కార్యక్రమంలో రగ్బీ జిల్లా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దొంతమల్ల గణేష్, కొండ రవి, మామిండ్ల సోంమల్లు, బాలబోయిన సందీప్, రావుల కుమారస్వామి, జోగు సంతోష్, సుష్మిత, నరేష్, పుస్కూరి రమేష్, జంపల పుష్పలీల, కారుపోతుల వేణు, కళింగరావు, క్రీడాకారులు పాల్గొన్నారు. చెన్నూరులో జిల్లాస్థాయి అస్మిత రగ్బీ పోటీలు -
వినాయక నిమజ్జనం
ఉత్సాహంగా పాల్గొన్న భక్తులుజనగామ: నవరాత్రులు భక్తుల పూజలందుకున్న గణనాథులు బుధవారం నిమజ్జనానికి బయల్దేరారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా జిల్లాలో సుమారు రెండు వేల వరకు విగ్రహాలు కొలువుదీరగా, మొదటి రోజు జిల్లా వ్యాప్తంగా 1,090 వినా యక విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు అధికారులు తెలిపారు. బుధవారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురిసినా.. భక్తులు ఉత్సాహంగా గణపతి విగ్రహాలతో శోభాయాత్ర నిర్వహించారు. లింగాలఘణపురం మండలం నెల్లుట్ల చెరువు వద్ద ప్రత్యేకంగా రెండు క్రేన్లు, రెండు తెప్పలతోపాటు 40 మంది గతఈతగాళ్లతో భారీ గేట్లు ఏర్పాట్లు చేశారు. భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర జిల్లా కేంద్రంలో సాయంత్రం ఏడు గంటల నుంచి గణనాథుల నిమజ్జన యాత్ర సాగింది. కళాకారుల విన్యాసాలు, కోలాటాలు, భజనలు, చిన్నారులు, మహిళలు, యువత పాల్గొన్న సాంస్కృతిక కార్యక్రమాలతో శోభాయాత్రలు సందడిగా సాగాయి. నెహ్రూ పార్కు, కురుమవాడ, బాలాజీనగర్, జిల్లా ఆస్పత్రి ప్రాంతం, గోకుల్‌నగర్, గ్రీన్‌మార్కెట్, శ్రీనగర్‌కాలనీ నుంచి భారీ సంఖ్యలో విగ్రహాలను భక్తులు నెల్లుట్ల చెరువుకు తరలించారు. పూజలతో నిమజ్జనానికి శ్రీకారం నెల్లుట్ల చెరువు వద్ద డీసీపీ రాజమహేంద్ర నాయక్, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్‌రెడ్డి, ఏసీపీ భీమ్‌శర్మ, సీఐలు సత్యనారాయణరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వేణు ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పూలదండలు, అక్షింతలు, పూజా సామగ్రిని ప్రత్యేక వాహనంలోకి తరలించిన అనంతరం కేవలం విగ్రహాన్ని మాత్రమే నిమజ్జనం చేసేలా చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా.. భారీ వర్షం, ఊరేగింపుల జోరు మధ్య నిమజ్జన శోభాయాత్ర కొనసాగింది. పోలీసులు, అధికారులు వర్షంలో తడుస్తూనే విధులు నిర్వహిస్తూ భక్తులకు ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షించారు. చివరి రోజు మండపాల వద్ద భజనలు, లడ్డూ వేలం పాటలు, ఇతర పూజా సామగ్రి వేలం నిర్వహించగా భక్తులు పోటీపడి కొనుగోలు చేశారు. స్వాగత వేడుకలు నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా విశ్వహిందూ పరిషత్, గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్వాగత వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీ భీంశర్మ, సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్సై పాల్గొన్నారు. వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు ఎనగందుల భిక్షపతి, కార్యదర్శి మోహనకృష్ణ భార్గవ, ఉపాధ్యక్షుడు బచ్చు బాలనా రాయణ, కోశాధికారి దిడిగం లక్ష్మణ్ పాల్గొన్నారు. నేడు కొనసాగనున్న నిమజ్జనం జిల్లా కేంద్రంతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెండో రోజు నేడు(గురువారం), 25వ తేదీ శుక్రవారం సైతం వినాయక నిమజ్జనం కొనసాగనుంది. పట్టణంలో 100, జిల్లా వ్యాప్తంగా మరో వెయ్యి విగ్రహాలు నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నాయి. జిల్లా అధికారులు నెల్లుట్ల చెరువు వద్ద ఈ నెల 25 వరకు నిమజ్జన సేవలు అందించే విధంగా ఏర్పాట్లు చేశారు. జనగామ: నెల్లుట్ల చెరువులోకి విగ్రహాలను తీసుకెళ్తున్న డీసీపీ రాజమహేంద్రనాయక్, సీఐలు జనగామ: నెల్లుట్ల చెరువులో గణపయ్య నిమజ్జనం నెల్లుట్ల చెరువు వద్ద పకడ్బందీ ఏర్పాట్లు పర్యవేక్షించిన పోలీసులు, అధికారులు జిల్లా వ్యాప్తంగా నేడు కొనసాగనున్న నిమజ్జనాలువినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో సుమారు 600 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. జిల్లా కేంద్రం నుంచి నెల్లుట్ల చెరువు వరకు ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. విద్యుత్ శాఖ ఎస్ఈ సంపత్‌రెడ్డి ఆధ్వర్యంలో నిమజ్జన మార్గాలు, చెరువు పరిసరాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. -
రక్తదానంలో సెంచరీ
జనగామ: ఎవరికి ఎప్పుడు అవసరం వచ్చినా.. రక్తదానం చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.. పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్. జనగామ ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం రెడ్‌క్రాస్ రక్తనిధికి 100వ సారి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడే అవకాశం లభిస్తుందన్నారు. ఆరోగ్యంగా ఉన్న వారు ఏడాదికి మూడు పర్యాయాలు రక్తదానం చేయవచ్చని తెలిపారు. 1999 నుంచి ఇప్పటి వరకు 100 సార్లు రక్తదానం చేశానని రఘునందన్ తెలిపారు. మోటార్ సైకిల్ రేసింగ్‌లో యువకుడి సత్తా జనగామ: జాతీయ స్థాయి మోటార్ సైకిల్ రేసింగ్ పోటీల్లో జనగామ మండలం సిద్దెంకి గ్రామానికి చెందిన రవీందర్ కుమారుడు బీదాని రాజేందర్ సత్తాచాటారు. చైన్నెలోని మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో ఈ నెలలో నిర్వహించిన ఇండియన్ నేషనల్ మోటార్ సైకిల్ రేసింగ్ ఛాంపియన్ షిప్–2026లో ఆయన ప్రతిభ కనబరిచారు. టీవీఎస్ ఆర్ఆర్ 310 ఓఎంసీ ఎక్స్పర్ట్ కేటగిరీ–రౌండ్ 2, రేస్–1లో రాజేందర్ ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ మేరకు రాజేందర్ చైన్నెలో బుధవారం అవార్డు అందుకున్నారు. జాతీయ స్థాయిలో సిద్దెంకి గ్రామానికి గుర్తింపు తీసుకురావడంపై స్థానికులు రాజేందర్‌ను అభినందించారు. ఈదురుగాలులతో భారీ వర్షంజనగామ: జిల్లా కేంద్రంతోపాటు జిల్లాలోని 12 మండలాల పరిధిలో బుధవారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వినాయక నిమజ్జన కార్యక్రమాలు ప్రారంభమయ్యే సమయంలోనే వర్షం ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభమైన వర్షం క్రమంగా తీవ్రత పెంచుకుంది. రాత్రి 8.30 గంటల సమయంలో దంచికొట్టిన వర్షానికి రహదారుల జలమయమయ్యాయి. పలుచోట్ల ఈదురుగాలులు వీచాయి. మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యుత్ తీగలు, నీటి వనరులు, లోతైన ప్రాంతాల వద్ద అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. దరఖాస్తుల ఆహ్వానం విద్యారణ్యపురి: హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీజీ కోర్సుల విద్యార్థుల బోధనకు అతిథి అధ్యాపకుల నియమకం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య గుర్రం శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెస్సీ మైక్రో బయాలజీ విభాగంలో రెండు పోస్టులకు, ఎమ్మెస్సీ కంప్యూటర్స్ ఒక పోస్టుకు, ఎంఏ తెలుగు ఒక పోస్టుకు అర్హులైన అధ్యాపకులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. సంబంధిత పీజీ సబ్జెక్టుల్లో 55 శాతానికి తక్కువ కాకుండా మార్కులు కలిగి ఉండాలని, ఎస్సీఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉండాలని పేర్కొన్నారు. పీహెచ్డీ, నెట్, బోధనలో అనుభవం కలిగినవారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఈనెల 26 సాయంత్రం 4:30 గంటల్లోగా దరఖాస్తులు కళాశాలల్లో సమర్పించాలని సూచించారు. -
కంప్యూటర్ విద్యపై దృష్టి సారించాలి
బచ్చన్నపేట : పాఠశాల విద్యార్థులు కంప్యూటర్ విద్యపై దృష్టి సారించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మండలంలోని పోచన్నపేట ఎంపీపీఎస్‌ను బుధవారం సందర్శించిన ఆయన కంప్యూటర్ ల్యాబ్ (ఏఎక్స్ఎల్)ను ప్రారంభించారు. పాఠశాల విద్యాబోధన, మౌళిక సదుపాయాలు, పరిశుభ్రత, మధ్యాహ్న భోజన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు కంప్యూటర్ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడి పలు ప్రశ్నలు వేశారు. కట్టెల పొయ్యిపై మధ్యాహ్న భోజనం వండకూడదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్యాస్ పొయ్యిపై వండాలని సూచించారు. విద్యార్థులను ఆరు బటయ కూర్చోబెట్టకుండా తరగతి గదుల్లో మాత్రమే ఉంచాలని హెచ్ఎంకు చెప్పారు. కార్యక్రమంలో ఎంఈఓ ఇర్రి వెంకట్‌రెడ్డి, సర్పంచ్ ఎండీ.ఫిరోజ్, హెచ్ఎం అమృత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆయిల్ పామ్ సాగు విస్తరణకు కార్యచరణ జనగామ రూరల్: జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు ప్రత్యేక కార్యచరణ చేపట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం ఉద్యాన తోటల పెంపకంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ప్రస్తుతం 590 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతోందని, దానిని మరింత విస్తరించేందుకు రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. డ్రిప్ ఇరిగేషన్‌ను 430 ఎకరాల వరకు సరఫరా చేసినట్లు అధికారులు వివరించారు. మహిళా సంఘాలు, రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు డ్రిప్ ఇరిగేషన్ పరికరాల విక్రయాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎంఐడీహెచ్ పథకం కింద సీడ్ ప్రాసెసింగ్ విస్తరించాలన్నారు. తేనెటీగల పెంపకం, పుట్టగొడుగుల సాగుపై శిక్షణ ఇవ్వాలన్నారు. ఇందుకోసం గుర్తించిన 24 మహిళా సంఘాలకు శిక్షణ, మార్కెటింగ్ అవకాశాలు కల్పించి, ఉత్పత్తికి ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. జిల్లాలో వెదురు, అరటి తోటల పెంపకానికి అనువైన స్థలాలను గుర్తించాలని సూచించారు. అరటి సాగులో ఎకరానికి 1,100 మొక్కలు, మొక్కకు మొక్కకు మధ్య 1.8 మీటర్ల దూరం పాటించేలా అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. సమావేశంలో డీహెచ్ఎస్ఓ నర్సయ్య, డీఆర్డీఓ భాస్కర్, ఉద్యాన శాఖ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
వినాయక నిమజ్జనానికి నిరంతర విద్యుత్
జనగామ: వినాయక నిమజ్జన కార్యక్రమాలు సురక్షితంగా, సజావుగా జరిగేలా జిల్లాలో నిరంతర విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేసినట్లు ఎన్పీడీసీఎల్ ఎస్ఈ చెరుకు సంపత్‌రెడ్డి తెలిపారు. బుధవారం నిమజ్జన ఏర్పాట్లలో విద్యుత్ సేవలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. నిమజ్జన ప్రాంతాల్లో విద్యుత్ అవసరాలకు అనుగుణంగా అదనపు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు (డీటీఆర్) ఏర్పాటు చేశారు. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సరఫరా పునరుద్ధరించేందుకు మొబైల్ ట్రాలీ డీటీఆర్లను సిద్ధంగా ఉంచామన్నారు. జనగామ నెల్లుట్ల చెరువు, ఘన్పూర్ పుట్టలమ్మ చెరువు, పాలకుర్తి తొర్రూరు (జి) ప్రాంతాల్లో ప్రత్యేక విద్యుత్ ఏర్పాట్లు చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రధాన నిమజ్జన ప్రాంతాలతోపాటు ఊరేగింపు మార్గాల్లో 24 గంటల పాటు విద్యుత్ సిబ్బందిని అందుబాటులో ఉంచి పర్యవేక్షణ చేపడుతున్నారు. భారీ వినాయక విగ్రహాలను తరలించే సమయంలో విద్యుత్ లైన్లకు సమీపంలో అప్రమత్తంగా ఉండాలని ఎస్ఈ సూచించారు. విద్యుత్ అత్యవసర పరిస్థితుల్లో 1912కు కాల్ చేయాలని సూచించారు. ఆయన వెంట డీఈ లక్ష్మినారా యణరెడ్డి తదితరులు ఉన్నారు.● ఎస్ఈ సంపత్‌రెడ్డి -
వచ్చేనెల 18 నుంచి ‘సూపర్’లో ఓపీ సేవలు!
కాశిబుగ్గ: వరంగల్‌లోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులను వేగవంతం చేయడానికి అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో వివిధ శాఖల రాష్ట్ర, జిల్లాస్థాయి ఉన్నతాధికారులు కదిలారు. రాష్ట్రస్థాయి అధికారులతోపాటు జిల్లాస్థాయి అధికారులు సమన్వయంతో పని చేస్తూ ముందుకు వెళ్లడానికి తగిన ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రి మాదిరిగా రాత్రింబవళ్లు ఆస్పత్రి నిర్మాణ పనులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 18న ఓపీ సేవలను ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు పాటిస్తూ.. ఇటీవల హైదరాబాద్‌లో వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిపై జరిగిన సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సీరియస్‌గా చెప్పారు. 30 రోజుల్లో 24 గంటలు పనిచేస్తూ వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ట్రస్థాయిలోని ఐఏఎస్ అధికారులు సైతం టీంలుగా ఏర్పడి పనులను పూర్తి చేయడానికి కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. అలాగే, ఇటీవల ఎంజీఎంలో చోటు చేసుకున్న సంఘటనలు, ప్రతిపక్ష పార్టీల ఆందోళనలు, రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను సూపర్ వేగంతో పూర్తిచేసేందుకు కదిలారు. అయితే, ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ 18న ఓపీ సేవలు ప్రారంభం చేయాలని ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. దసరా కానుకగా రెండు రోజుల ముందు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రాథమికంగా ప్రారంభించాలని భావిస్తునట్లు సమాచారం. దీంతో దసరా పండుగ సందర్భంగా పేద ప్రజలకు వైద్య సేవలు అందించినట్లు ఉంటుందని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. డీఎంఈ, కలెక్టర్ పర్యవేక్షణలో..తాజాగా బుధవారం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి డీఎంఈ డాక్టర్ వాణి అధికారులతో కలిసి వచ్చినట్లు తెలుస్తోంది. సీఎంఓ, డీఏంఈ, హెల్త్ డిపార్ట్మెంట్లోని ఉన్నతాధికారులతో పాటు ఎల్ అండ్ టీ, ఆర్ అండ్ బీ అధికారులు సమన్వయం చేసుకుంటున్నట్లు సమాచారం. వీరు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తూ, వరంగల్ కలెక్టర్ సత్యశారద పర్యవేక్షణలో పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాణపు పనులను పరిశీలించి, ప్రజలకు వైద్యసేవలు త్వరగా అందించేందుకు ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. ప్రారంభించేందుకు అధికారుల కసరత్తు దసరా కానుకగా ప్రజలకు వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయం? సీఎం ఆదేశాలతో కదిలిన యంత్రాగం -
బరిలో 11 యూనియన్లు
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల బిజీలో యూనియన్లు తలమునకలయ్యాయి. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న 11 యూనియన్లు సోమవారం కార్మిక శాఖకు లేఖ లు అందించాయి. మంగళవారం డిపోల వారీగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను డిపో మేనేజర్లు కార్మిక శాఖకు అందించారు. కార్మిక శాఖ తిరిగి యూని యన్లకు జాబితా ఇచ్చింది. డ్రాఫ్ట్ జాబితా ప్రకారం వరంగల్ రీజియన్‌లో మొత్తం 3,096 మంది ఓటర్లు ఉన్నారు. రీజినల్ మేనేజర్ కార్యాలయంలో 51 మంది ఓటర్లు ఉన్నారు. హనుమకొండ డిపోలో 537, భూపాలపల్లిలో 274, వరంగల్–1లో 484, మహబూబాబాద్ డిపోలో 250, తొర్రూరులో 303, నర్సంపేటలో 291, జనగామలో 403, పరకాలలో 244 మంది, వరంగల్–2 డిపోలో 259 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నెల 24 వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరించి 25న తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. 26న యూనియన్లకు గుర్తులు కేటాయిస్తారు. లేఖలు ఇచ్చిన సంఘాలు.. ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు 11 యూని యన్లు కార్మిక శాఖకు సమ్మతి తెలిపాయి. వాటిలో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, ఎంప్లాయీస్ యూనియన్, టీఎస్ ఆర్టీసీ కార్మిక్ సంఘ్, తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్, తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్, ఆర్టీసీ సామాజిక తెలంగాణ మజ్దూర్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూని యన్, ఆర్టీసీ కార్మిక పరిషత్, బహుజన కార్మిక యూనియన్, బహుజన వర్కర్స్ యూనియన్ ఉన్నాయి. రాష్ట్ర, రీజియన్ వారీగా పొత్తు ఒప్పందాలు.. గెలుపు అవకాశాలను అంచనా వేసిన యూని యన్లు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నా యి. ఈ మేరకు క్లాస్–3 (రాష్ట్ర), క్లాస్–6 (రీజి యన్) వారీగా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నా యి. ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ), నేషనల్ మజ్దూర్ యూనియన్(ఎన్ఎంయూ) మధ్య పొత్తుపై ఒప్పందం కుదిరినట్లు ఆ యూనియన్ నాయకులు తెలిపారు. వరంగల్, ఖమ్మం రీజి యన్ (క్లాస్–6) ఎన్ఎంయూకు, రాష్ట్రంలోని మిగతా రీజియన్లు, క్లాస్–3కి ఎంప్లాయీస్ యూని యన్‌కు మద్దతు ఇచ్చేలా అంగీకారం కుదిరింది. ● తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) మధ్య అవగాహన కుదిరినట్లు తెలిసింది. క్లాస్–6లో ఖమ్మం, నల్లగొండ రీజియన్లలో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, మిగతా రీజి యన్లు, క్లాస్–3లో తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ పోటీలో ఉండేలా ఒప్పందం కుదిరినట్లు ఆ యూనియన్ వర్గాలు తెలి పా యి. ఈ మేరకు వరంగల్ రీజియన్‌లో తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్‌కు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ మద్దతు ఇస్తుంది. ● టీఎంయూ అశ్వత్థామ రెడ్డి వర్గం తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్‌గా పోటీ చేయనుంది. వరంగల్ రీజియన్‌లో తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ (టీఎంయూ అశ్వత్థామ రెడ్డి వర్గం), ఎంప్లాయీస్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, నేషనల్ మజ్దూర్ యూనియన్లు బలంగా ఉన్నాయి. ● మిగతా యూనియన్లు ఉన్నప్పటికి అంతగా ప్రభావం చూపకపోవచ్చని కార్మిక వర్గాలు తెలిపాయి. ● ఈ రీజియన్‌లో తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్ మధ్య పోటీ ముఖాముఖిగా జరిగే అవకాశముంది. ఈ నెల 26న గుర్తుల కేటాయింపుతో పోటీపై మరింత స్పష్టత రానుంది. పోటీకి ఆసక్తి తెలుపుతూ కార్మిక శాఖకు లేఖల అందజేత ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల బిజీలో యూనియన్లు ఈయూ, ఎన్ఎంయూ మధ్య కుదిరిన పొత్తు వరంగల్ రీజియన్ ఎన్ఎంయూకు టీడబ్ల్యూయూతో జత కట్టిన ఎస్‌డబ్ల్యూఎఫ్..వరంగల్ రీజియన్ టీఆర్టీసీ వర్కర్స్ యూనియన్‌కు, ఎస్‌డబ్ల్యూఎఫ్‌కు ఖమ్మం, నల్లగొండ -
కట్టెల పొయ్యి వంటపై కలెక్టర్ సీరియస్
లింగాలఘణపురం: కట్టెల పొయ్యిపై వంట చేయడంపై కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆగ్ర హం వ్యక్తం చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను, ఉపాధ్యాయుల బోధన తీరును పరిశీలించారు. అనంతరం వంటశాలను పరిశీలించేందుకు వెళ్లగా కట్టెల పొయ్యిపై వంట చేయడం గమనించి అసహనం వ్యక్తం చేస్తూ గ్యాస్‌పై మాత్రమే వంట చేయాలని ఆదేశించారు. వంట చేసే మహిళా సంఘ సభ్యులను మార్చాలని ప్రిన్సిపాల్ సునితను ఆదేశించారు. ఈ విషయంపై ప్రిన్సిపాల్ సునిత సంబంధిత సర్పంచ్ ఎడ్ల లావణ్యరాజు, గ్రామంలోని వీఓఏల అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేసి వంట చేసే సభ్యులను కలెక్టర్ ఆదేశాలతో మార్చుతున్నామని, ఇతర మహిళలను నియమించాలని కోరారు. ప్రమాణాల పెంపుపై దృష్టి సారించాలి జనగామ రూరల్: జూనియర్ కళాశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను, కళాశాలల ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..విద్యార్థులు, అధ్యాపకుల హాజరును ఎఫ్ఆర్ఎస్ ద్వా రా ప్రవేశ, నిష్క్రమణ సమయాల్లో తప్పనిసరిగా నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమీక్షలో డీఐఈఓ జితేందర్ రెడ్డి, ఇంటర్మీడియట్ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. ఎంజీఎం దుస్థితిపై ప్రశ్నిస్తే దాడి చేస్తారా?జనగామ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి దుస్థితిని ప్రశ్నిస్తూ సందర్శనకు వెళ్లిన మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌పై పోలీసులు వ్యవహరించిన తీరును ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మంగళవా రం తీవ్రంగా ఖండించారు. ఆస్పత్రిలో బెడ్లు, అంబులెన్స్‌ల కొరతతో పాటు పైకప్పులు పెచ్చులూడుతున్న దుస్థితిపై ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యేను అడ్డుకుని దాడి చేయడం దారుణమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను ప్రశ్నించినందుకు కడుపులో తన్నడం, గాయపర్చడం ఏ విధమైన ప్రజాస్వామ్య పాలన అని ప్రశ్నించారు. ఆస్పత్రుల పరిస్థితులను చక్కదిద్దాల్సిన ప్రభుత్వం, సమస్యలను ప్రశ్నించే వారిపై పోలీసులతో దాడులు చేయించడం సిగ్గుచేటన్నారు. పోలీసుల అత్యుత్సాహాన్ని వెంటనే అరికట్టాలని, వినయ్ భాస్కర్‌పై జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాగున్న రోడ్డును ధ్వంసం చేసి కొత్త నిర్మాణమా? జనగామ: మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డులో బాగానే ఉన్న సీసీ రోడ్డును పూర్తిగా ధ్వంసం చేసి నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్న అంశంపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ వాట్సాప్ వేదికగా మున్సిపల్ కమిషనర్‌కు మంగళవారం విజ్ఞప్తి చేశారు. భారీ వాహనాల రాకపోకలు పెద్దగా లేని చిన్న కాలనీ రోడ్డును పూర్తిగా తొలగించాల్సిన అవసరం ఏమిటన్న అంశాన్ని అధికారులు పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. రోడ్డు అక్కడక్కడ మాత్రమే దెబ్బతిన్నట్లయితే, తక్కువ ఖర్చుతో మరమ్మతులు చేపట్టవచ్చన్నారు. ఈ అంశంపై మున్సిపల్ కమిషనర్ స్వయంగా పర్యవేక్షించి పూర్తిస్థాయి విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని కోరా రు. ఈ విషయమై కమిషనర్ మాట్లాడుతూ.. సీసీ రోడ్డు ధ్వంసానికి సంబంధించి ఇంజనీరింగ్ డిపార్టుమెంట్ డీఈ, ఏఈలతో పాటు కౌన్సిలర్లను పిలిచి మాట్లాడతామని, విచారణ జరుపుతామన్నారు. సీసీరోడ్డు నిర్మాణ సమయంలో ఏ స్థితిలో ఉందో అనే విషయమై డీఈ పరిశీలించారా లేదా అని కూడా ఆరా తీస్తామన్నారు. రైతు రిజిస్ట్రేషన్ ద్వారా రైతు ఐడీ పొందాలి జనగామ రూరల్: రైతు నమోదు చేసుకొని, రైతు ఐడీని పొందాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే రైతు నమోదు చేసుకున్న రైతులు సంబంధిత వెబ్సైట్ లింక్‌ను ఓపెన్ చేసి, తమ ఆధార్ నంబర్ నమోదు చేయాలని తెలిపారు. ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేసిన ఫార్మర్ ఐడీ నంబర్‌ను తెలుసుకోవచ్చన్నారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. -
నిమజ్జనానికి వేళాయె
జనగామ: జిల్లాలో ఈనెల 23న (బుధవారం) జరగనున్న వినాయక నిమజ్జనానికి యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. జిల్లాలో మొత్తం 770 చెరువులు ఉండగా, 2 వేలకుపైగా వినాయక ప్రతిమలు కొలువుదీరాయి. నిమజ్జనానికి ప్రధాన కేంద్రంగా నెల్లుట్ల చెరువు వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. జిల్లా కేంద్రం, లింగాల ఘణపురం, నెల్లుట్ల ప్రాంతాలకు చెందిన సుమారు 600 నుంచి 800 వరకు వినాయక విగ్రహాలు ఇక్కడ నిమజ్జనం చేసే అవకాశం ఉండటంతో భారీ ఏర్పాట్లు చేశారు. వర్షం వచ్చినా.. ఇబ్బంది లేకుండా నెల్లుట్ల చెరువు నిమజ్జన ప్రాంతానికి సమీపంలో సుమారు 100 మీటర్ల మేర రోడ్డును ఫార్మేషన్ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ వర్షం కురిసినా వాహనాలు బురదలో కూరుకుపోకుండా, నిమజ్జన కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. చెరువు వద్ద రెండు భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు. నిమజ్జనానికి వచ్చే నిర్వాహకులు, భక్తుల రాకపోకలకు ప్రత్యేక ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను ఏర్పాటు చేశారు. రెండు బోట్లను అందుబాటులో ఉంచారు. 12 సీసీ కెమెరాలు.. 180 లైట్లు నెల్లుట్ల చెరువు చుట్టూ 12 సీసీ కెమెరాలు, 180 లైట్లు ఏర్పాటు చేశారు. వీటిని మూడు లొకేషన్ల ద్వారా ప్రత్యేక కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశారు. నిమజ్జన ప్రక్రియ, శోభాయాత్ర, చెరువు పరిసరాల్లో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించనున్నారు. 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్‌ను సిద్ధం చేశారు. వ్యర్థాలు వేరుగా.. నిమజ్జనంలో ఈసారి కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. వినాయక విగ్రహాలతో పాటు వచ్చే పూల మాలలు, ఇతర వ్యర్థాలను చెరువులో వేయకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల్లో సేకరించనున్నారు. వ్యర్థాలను తొలగించిన అనంతరం ఖాళీ విగ్రహాన్ని నిమజ్జనం చేసేలా చర్యలు చేపట్టారు. ఇందుకు 30 మంది పారిశుధ్య సిబ్బంది మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించనున్నారు. 40 మంది గజ ఈతగాళ్లు నెల్లుట్ల చెరువు వద్ద 40 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. వీరు 20 మంది చొప్పున మూడు షిఫ్టుల్లో సేవలందించనున్నారు. నిమజ్జన ప్రాంతాల్లో నిరంతరాయంగా మెడికల్ క్యాంపులు, 108 అంబులెన్స్, ఫైర్ సేఫ్టీ, విద్యుత్ శాఖ ప్రత్యేక బృందాలు సేవలందించనున్నాయి. 300 మంది బందోబస్తు డీసీపీ రాజామహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో ఏసీపీలు, ఎస్సైలతోపాటు 300 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లాలోని ఇతర ప్రధాన నిమజ్జన కేంద్రాలైన నర్మెట, చిల్పూరు మండలాలు గండిరామారం రిజర్వాయర్, బచ్చన్నపేట గుడి చెరు వు, పాలకుర్తి, తొర్రూరు(జే), దేవరుప్పుల ధర్మాపురం చెరువు, కొడకండ్ల రామవరం చెరువు, తరి గొప్పుల, రఘునాథపల్లి, ఇబ్రహీంపురం తదితర ప్రాంతాల్లోనూ ఏర్పాట్లు చేశారు. ఘన్పూర్, పాలకుర్తి చెరువుల వద్ద ఒక్కో క్రేన్ ఏర్పాటు చేశారు. నేటినుంచి 25 వరకు అధికారుల విధులు ఈ నెల 23 నుంచి 25వ తేదీ తెల్లవారుజాము వరకు అన్ని శాఖల జిల్లా అధికారులు విధుల్లో ఉండనున్నారు. జనగామ మున్సిపాలిటీలోని 30 వార్డుల వార్డు అధికారులు మూడు షిఫ్టుల్లో సేవలందించనున్నారు. నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే వరకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయనున్నారు. నిమజ్జనం సందర్భంగా ఈ నెల 23 నుంచి 24వ తేదీ సాయంత్రం 6 గంటల వ రకు జిల్లాలోని వైన్స్, బార్లు మూసివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. నెల్లుట్ల చెరువు వద్ద భారీ ఏర్పాట్లు పట్టణంలో 2వేలకు పైగా గణనాథుల ప్రతిమలు రెండు భారీ క్రేన్లు, నాలుగు బోట్లు సిద్ధం నేటి నుంచి రేపు సాయంత్రం 6 వరకు వైన్స్, బార్లు బంద్భద్రతకు ప్రాధాన్యం.. వినాయక నిమజ్జనంలో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. నీటిలోతు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, బారికేడ్లు ఏర్పాటు చేశాం. 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూం, సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగుతుంది. నిమజ్జన ఘాట్ల వద్ద భద్రతతో పాటు శోభాయాత్ర సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. అత్యవసర సేవలన్నీ అందుబాటులో ఉంచాం. –సందీప్‌కుమార్ ఝా, కలెక్టర్ -
శిశువు భద్రత కట్టుదిట్టం
ఎస్‌ఎన్‌సీయూలో మూడు స్థాయిల్లో సిబ్బంది విధులు నిర్వహిస్తూ ఫీడింగ్, ఫొటోథెరపీ, డీఎంఓ మానిటరింగ్ తదితర సేవలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వార్డులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సూపరింటెండెంట్ గదికి అనుసంధానం చేశారు. అనుమతిలేని వ్యక్తులు లోనికి ప్రవేశించకుండా భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉంటున్నారు. ఇటీవల ఎస్ఎన్సీయూ నుంచి ఓ శిశువును ఎత్తుకెళ్లిన ఘటనలో ఆస్పత్రి సిబ్బంది, సెక్యూరిటీ వెంటనే స్పందించి గంటల వ్యవధిలోనే శిశువును గుర్తించడం ఇందుకు ఉదాహరణ. జనగామ: జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్)లోని నవజాత శిశువుల ప్రత్యేక సంరక్షణ కేంద్రం (ఎస్ఎన్సీయూ)లో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. ఎంసీహెచ్‌లోని ఎస్‌ఎన్‌సీయూలో మూడు వార్డులు ఉండగా ప్రస్తుతం 15 మంది నవజాత శిశువులకు వైద్యసేవలు అందుతున్నాయి. వీరిలో నలుగురు క్రిటికల్ కేర్‌లో, మరో 11 మంది సాధారణ పరిశీలనలో ఉన్నారు. విద్యుత్‌పై ప్రత్యేక దృష్టి ఎస్ఎన్సీయూలోని సుమారు 80 శాతం పరికరాలు విద్యుత్‌పై ఆధారపడి పనిచేస్తున్నాయి. వార్మర్లు, ఇంక్యుబేటర్లు, పల్స్, బీపీ, సాచురేషన్ మల్టీ ప్యారామీటర్లు, సిరంజి పంపులు, ఫొటోథెరపీ, వెంటిలేటర్లు, సీపాప్ పరికరాలతో పాటు ఏసీలు, కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇతర పవర్ పరికరాలు వినియోగంలో ఉన్నాయి. విద్యుత్ అంతరాయం ఏర్పడితే అత్యవసర సేవల కోసం జనరేటర్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. సాంకేతిక లోపాలు, ప్రమాదాలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు విద్యుత్ ఆడిటింగ్ నిర్వహించడంతో పాటు ఇంజినీరింగ్ విభాగం తనిఖీలు చేపడుతోంది. ఎంసీహెచ్ ప్రారంభమైనప్పటి నుంచి ఎస్‌ఎన్‌సీయూలో విద్యుత్ సంబంధిత సాంకేతిక సమస్యలు తలెత్తలేదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం అప్రమత్తం ఆదిలాబాద్ రిమ్స్‌లో చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంసీహెచ్లలోని ఎస్ఎన్ సీయూ వార్డుల భద్రత, వసతులపై ప్రత్యేకంగా ఆరా తీస్తోంది. ఇందుకు చెక్‌లిస్ట్ పంపడంతో పాటు ఏసీ లు, విద్యుత్ సేవలకు సంబంధించి సమస్యలు ఉంటే వెంటనే నివేదించాలని ఆదేశాలు జారీ చేసింది. భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఎంసీహెచ్‌లోని ఎస్‌ఎన్‌సీయూలో నవజాత శిశువుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. 24 గంటల పాటు వైద్యులు, సిబ్బంది పర్యవేక్షణ ఉంటుంది. సీసీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా కొనసాగుతోంది. విద్యుత్ అంతరాయం ఏర్పడినా సేవలకు ఆటంకం కలగకుండా జనరేటర్ అందుబాటులో ఉంది. విద్యుత్ పరికరాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ, సాంకేతిక లోపాలు తలెత్తకుండా ఆడిటింగ్ నిర్వహిస్తున్నాం. –డాక్టర్ మధుసూదన్‌రెడ్డి, ప్రొఫెసర్, హెచ్ఓడీ పీడియాట్రిక్స్ జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎన్‌సీయూపై ప్రత్యేక నిఘా.. నవజాత శిశువుల కేంద్రంలో 24 గంటల పర్యవేక్షణ విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు ఆడిటింగ్ ఆదిలాబాద్ ఘటనతో అప్రమత్తం ఓపీ సేవల వద్ద ఉక్కపోత24 గంటల పర్యవేక్షణఓపీలో ఉక్కపోత ఎస్‌ఎన్‌సీయూలో భద్రతా చర్యలు పటిష్టంగా ఉన్నప్పటికీ ఎంసీహెచ్ ఓపీ సేవల వద్ద మరో సమస్య కనిపించింది. ప్రధాన హాల్లో సరైన వసతి సౌకర్యాలు ఉన్నప్పటికీ, పరీక్షల కోసం గంటల తరబడి వేచి ఉండే గర్భిణులు, బాలింతలు ఫ్యాన్లు లేకపోవడంతో ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. -
ఆయుర్వేద యోగాతో ఆరోగ్యం
● డీసీపీ రాజమహేంద్ర నాయక్ జనగామ రూరల్: ఆయుర్వేద యోగా ఆరోగ్యకరమైన జీవనశైలి దైనందిన జీవితంలో తప్పనిసరిగా భాగం కావాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్ అన్నారు. మంగళవారం 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్ వద్ద ఆయుర్వేద వెల్నెస్ – యోగా వాక్‌ను డీసీపీ రాజ మహేంద్ర నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. డీసీపీ మాట్లాడుతూ..ఆయుర్వేదం సూచించే నివారణాత్మక ఆరోగ్య విధానాలను జీవితంలో అమలు చేయాలని సూచించారు. డీఎంహెచ్ఓ వాణిశ్రీ మాట్లాడుతూ.. యోగా, ఆయుర్వేదం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ మమత, డా.సరిత, డీపీఎం కుమార్, వైద్యాధికారులు, ఏఎన్‌న్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు, ఆయుష్ సిబ్బంది పాల్గొన్నారు. నేడు మెగా ఆయుష్ వైద్యశిబిరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు ఈనెల 23న మున్సిపల్ కార్యాలయంలోని కాన్ఫరెన్‌న్స్ హాల్లో మెగా ఆయుష్ వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఆయుష్ అధికారి మమత ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిబిరంలో ఆయుర్వేద, హోమియో, యునాని, యోగా వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని జిల్లా ప్రజలు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


