రెండేళ్లలో పదేళ్ల అభివృద్ధి
● చివరి రోజు ఎన్నికల ర్యాలీలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
జనగామ: పదేళ్లలో బీఆర్‌ఎస్ చేయని అభివృద్ధిని సీఎం రేవంత్‌రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన రెండేళ్లలో చేసి చూపించారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కొనియాడారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రచారం చివరి రోజు పట్టణంలోని 20, 21, 22, 23 వార్డుల్లో ఆయన పాల్గొన్నారు. బీరప్పగడ్డ నుంచి ర్యాలీగా నెహ్రూపార్కు, కుర్మవాడ మీదుగా లక్ష్మీ వాటర్‌ప్లాంట్ వరకు చేరుకున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ర్యాలీలో ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతితో కలిసి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 21వ వార్డులో మైసమ్మ గుడి పునర్మిర్మాణానికి ఎంపీతో కలిసి కృషి చేస్తామన్నారు. కొత్తగా 3,500 ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయని, కాంగ్రెస్, సీపీఎం బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి ప్రజాపాలనకు మద్దతు పలకాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ అభ్యర్థులు కడకంచి బాలమనిశ్రీనివాస్, గ్యాదరి రేణుక, బాల్దె మల్లేశం, మోటో రేణుక, ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, నాయకులు కంచె రాములు తదితరులు పాల్గొన్నారు.


