కట్టుదిట్టమైన బందోబస్తు: డీసీపీ
జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీల పరిధిలో 750 మంది పోలీసులు బలగాల పర్యవేక్షణలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీసీపీ రాజమహేంద్ర నాయక్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ..అడిషినల్ ఎస్పీతో పాటు రెండు చోట్ల ఏఎస్పీ, ఏసీపీ, 7 సీఐలు, 32 మంది ఎస్సైలు బీఎఎస్‌ఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ పోలీసులు గట్టి నిఘా ఉంచనున్నట్లు తెలిపారు. జనగామలో 30, స్టేషన్‌లో 18 రూట్లను ఏర్పాటు చేసి ఆయా మార్గాల్లో పోలీసు పర్యవేక్షణ ఉంటుందన్నారు. క్రిటికల్ కేంద్రాల వద్ద ఎస్సై ర్యాంకు అధికారి బందోబస్తు ఉంటుందన్నారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల లోపు పార్టీ జెండాలు, ప్రచారానికి అనుమతి లేదన్నారు. రెండు పురపాలికల పరిధిలో 30 లోకేషన్ల పరిధిలో మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణ ఉంటుందన్నారు. కాగా జనగామలో డీసీసీ, ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్, సీఐ సత్యనారాయణరెడ్డి ఆద్వర్యంలో పోలీసులు కవాతు నిరహించారు.


