కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి లోని దూరవిద్య సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్‌లైన్ ఎడ్యూకేషన్(సీడీఓఈ)లో డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 10వరకు గడువు పొడిగించినట్లు సీడీఓఈ డైరెక్టర్ ఆచార్య సురేష్‌లాల్ గురువారం తెలిపారు. డిగ్రీ బీఏ, బీకాం జనరల్, బీకాం కంప్యూటర్స్, బీబీఏ, బీఎల్‌ఐఎస్‌సీ, బీఎస్సీ కోర్సులు, పీజీఎంఏ, ఎంకామ్, ఎ మ్మెస్సీ, ఎంఎల్‌ఐఎస్‌సీ, ఎంసీఏ, డిప్లోమా కోర్సుల్లో డిప్లోమా ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, డిప్లోమా ఇన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లాస్, డిప్లోమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, డిప్లోమా ఇన్ యోగా, ఎన్విరాన్‌మెంటల్ అండ్ అక్యుపేషనల్ హెల్త్, రూరల్ డెవలప్‌మెంట్, హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎథిక్స్, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చని తెలిపారు. ఆన్‌లైన్, ఆఫ్ లైన్‌లో అడ్మిషన్లు పొందే అవకాశం ఉందని తెలిపారు. దరఖాస్తులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎస్‌డీఎల్‌సీఈకేయూ.కో.ఇన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు.


