● ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల కార్యదర్శి సీతాలక్ష్మి
జనగామ రూరల్: ప్రపంచంలో వస్తున్న మార్పులను విద్యార్థులు గమనించి సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలని ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల కార్యదర్శి కె.సీతాలక్ష్మి అన్నారు. గురువారం పట్టణంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ బాలికల కళాశాలలో నిర్వహించిన ప్రజ్ఞాన్ సైన్స్ ఫెస్ట్‌కు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.. ఏఐ, క్వాంటమ్ శాటిలైట్ టెక్నాలజీ వంటి అధునాతన సాంకేతికతను ఉపయోగించాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ జి.సంధ్యారాణి, డిప్యూటీ సెక్రటరీస్ డీఎస్ వెంకన్న, కె.వేణుగోపాల్, ఓఎస్‌డీఎస్ సతీష్ గౌడ్, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.


