మహనీయుల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

మహనీయుల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలి

Apr 3 2026 7:50 AM | Updated on Apr 3 2026 7:50 AM

కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా

జనగామ రూరల్‌: రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, సంఘ సంస్కరణల కోసం కృషి చేసిన బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతి, అంబేడ్కర్‌ జయంతి వేడుకల ఏర్పాట్లపై డీసీపీ రాజమహేంద్ర నాయక్‌ తో కలిసి వివిధ కుల సంఘాల ప్రతినిధులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఈ నెల 5న బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతి, అలాగే 14వ తేదీన బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి వేడుకల ఏర్పాట్లు పక్కాగా ఉండాలన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా బాధ్యతా యుతంగా పని చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్సీ సంక్షేమ అధికారి విక్రమ్‌, ఆర్డీఓ గోపీరాం, మున్సిపల్‌ కమిషనర్‌ మహేశ్వర్‌ రెడ్డి, కుల సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement