‘మత్తు’ దిగాల్సిందే! | - | Sakshi
Sakshi News home page

‘మత్తు’ దిగాల్సిందే!

Apr 3 2026 7:50 AM | Updated on Apr 3 2026 7:50 AM

జనగామ: జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణ, అక్రమ రవాణా నివారణ కోసం జిల్లా ఎన్‌సీఓఆర్‌డీ కమిటీ సమావేశం కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అధ్యక్షతన ఇటీవల జరిగింది. ఈ మేరకు కలెక్టర్‌ పలు కీలక సూచనలు ఇచ్చారు.

శాఖల వారీగా నిఘా

నార్కోటిక్‌ డ్రగ్స్‌, అంఫెటమిన్స్‌, ఇతర సింథటిక్‌ పదార్థాలపై నిఘా ఉంచేందుకు ఎకై ్సజ్‌ శాఖకు బాధ్యతలు అప్పగించారు. రోజుకు కనీసం 5 కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పబ్లిక్‌ ప్రదేశాల్లో సర్వైలెన్స్‌ పర్యవేక్షణను పెంచడంతో పాటు యూరిన్‌ డ్రగ్‌ టెస్టింగ్‌ కిట్ల అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. సందేహాస్పద ప్రదేశాల్లో తరచూ పరీక్షలు చేస్తూనే, టాడీ నాణ్యతను నిర్ధారించేందుకు సమయానుకూల తనిఖీలు ఉండాలని ఆదేశించారు. నిషేధిత పొగాకు ఉత్పత్తులు పొడి (స్నఫ్‌), పట్టు, గుట్కా వంటి వాటిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా పనిచేయాలని వైద్యారోగ్య శాఖకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రుల్లో ప్రత్యేక తనిఖీలు ఉండాలని సూచనలు చేశారు. విద్యార్థుల్లో డ్రగ్‌ దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాలు, చిత్ర లేఖనం, ప్రచార కార్యక్రమాల ద్వారా విద్యాసంస్థల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో చైతన్యం కలిగించాల్సి ఉంటుంది. జిల్లాలో హేమ్‌ వంటి నిషేధిత పంటల అక్రమ సాగును గుర్తించి చర్యలు తీసుకునే విధంగా ఇతర శాఖలతో వ్యవసాయ శాఖ సమన్వయం చేసుకోవాలి. కార్మికులు ఎక్కువగా ఉండే రైస్‌ మిల్లులు, తదితర ప్రాంతాల్లో డ్రగ్‌ వాడకంపై నిఘా ఉంచాలి. ఇందుకు సంబంధించిన ప్రతి నివేదికను ఆలస్యం చేయకుండా కలెక్టర్‌కు పంపించాలి. మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు శాఖల మధ్య సమర్థవంతమైన సమన్వయం ఉండాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

రైల్వే స్టేషన్‌లో తనిఖీలు

రైల్వేస్టేషన్‌తో పాటు పలు పాన్‌షాపులు, ఇతర దుకాణాల్లో సహాయ కార్మిక అధికారి కుమారస్వామి, టీం సభ్యులతో కలిసి గురువారం తనిఖీలు నిర్వహించారు. ఎన్‌సీఓఆర్‌డీ, డ్రగ్‌ ట్రాఫికింగ్‌ విషయంలో కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆయా శాఖల అధికారులతో కలిసి ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు రైల్వే స్టేషన్‌తో పాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేశామన్నారు.

జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణపై కలెక్టర్‌ దృష్టి

ప్రత్యేక టీంల ఏర్పాటు..

నిఘా పెంచేందుకు ఎకై ్సజ్‌ శాఖకు బాధ్యతలు

వివిధ శాఖలు సమన్వయంతో

పనిచేయాలని సూచన

కేసుల నమోదు, కఠిన చర్యలకు ఆదేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement