● ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ సంపత్‌రెడ్డి
దేవరుప్పుల: జిల్లా వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు దశలవారీగా చర్యలు చేపడుతున్నట్టు ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ సంపత్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలోని ధర్మాపురం 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌న్‌లో ఆదనంగా 5.0 పవర్ ట్రాన్స్‌ఫార్మర్ సామర్థ్యం పెంపుదలకు మరమ్మతులు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విద్యుత్ సంబంధిత సమస్యల కోసం సమీపంలోని విద్యుత్ శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని లేదా టోల్–ఫ్రీ నంబర్ 1912కు కాల్ చేయాలని సూచించారు. డీఈలు ఎం.లక్ష్మీనారాయణరెడ్డి, వి. విజ య్‌కుమార్, ఏడీఈలు అనిల్‌కుమార్, శ్రీధర్, ఏఈ లు నర్సింహ్మరెడ్డి, కుమారస్వామి పాల్గొన్నారు.


