జిల్లాస్థాయి ఫెడరేషన్‌ కప్‌ అథ్లెటిక్స్‌ ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

జిల్లాస్థాయి ఫెడరేషన్‌ కప్‌ అథ్లెటిక్స్‌ ఎంపికలు

Apr 3 2026 7:44 AM | Updated on Apr 3 2026 7:44 AM

జనగామ రూరల్‌: జిల్లా స్థాయి ఫెడరేషన్‌ కప్‌ అథ్లెటిక్స్‌ ఎంపికలు పట్టణంలోని మినీ స్టేడియంలో శుక్రవారం నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణ గౌడ్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలబాలికలు, మెన్‌, ఉమెన్లలో అథ్లెటిక్స్‌ ఎంపికలు జరుగుతాయని, ఇందులో ఎంపికై న క్రీడాకారులు 11,12తేదీల్లో హన్మకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో రాష్ట్ర స్థాయి ఫెడరేషన్‌ కప్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొంటారన్నారు. ఉదయం 9 గంటలకు జనన ధ్రువీకరణ పత్రం, పదో తరగతి మెమోతో మినీ స్టేడియంలో హాజరుకావాలన్నారు. మరిన్ని వివరాలకు గంగిశెట్టి మనోజ్‌ కుమార్‌ 9885046437, ఆవుల అశోక్‌ 9912453220, వంచ చంద్రశేఖర్‌ రెడ్డి 7799552233, తూడి రంజిత్‌ 99852 23047 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలని కోరారు.

జాతీయస్థాయి సబ్‌ జూనియర్‌ క్రీడాపోటీలకు విద్యార్థినుల ఎంపిక

పాలకుర్తి టౌన్‌: మహారాష్టలోని పుణేలో ఈనెల 3 నుంచి 6 వరకు జరగనున్న 35వ జాతీయస్థాయి సబ్‌ జూనియర్‌ క్రీడాపోటీలకు తెలంగాణ కబడ్డీ జట్టులో పాలకుర్తి మండలం తొర్రూరు(జె) ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని పసులాది నవ్య, చెన్నూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని అంజలి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ చైర్మన్‌ చిట్ల ఉపేందర్‌రెడ్డి, మహాత్మా హెల్పింగ్‌ హ్యాండ్స్‌ వ్యవస్థాపకుడు గంట రవీందర్‌, ఎంఈఓ పోతుగంటి నర్సయ్య, మాచర్ల భిక్షపతి, కొయ్యాడ మల్లేష్‌, జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షుడు గార్ల మల్లికార్జున్‌, ఉపాధ్యక్షులు కుటింకటి శ్రీనివాస్‌, కొడిశాల అశోక్‌, గ్రామస్థులు, ఉపాధ్యాయులు విద్యార్థినులను అభినందించారు.

డిగ్రీ రీవాల్యూయేషన్‌ ఫలితాల విడుదల

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, అదిలాబాద్‌ జిల్లాలోని డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీఏ, ఒకేషనల్‌, బీకామ్‌ మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ల రీవాల్యూయేషన్‌ ఫలితాలను విడుదల చేసినట్లు గురువారం కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్‌ తెలిపారు. డిగ్రీ కోర్సుల మొదటి సెమిస్టర్‌ రీవాల్యూయేషన్‌కు 4,899మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 658మంది (13.43శాతం) విద్యార్థులు బెనిఫిట్స్‌ పొందినట్లు సమాచారం. మూడో సెమిస్టర్‌లో 4,616 మంది రీవాల్యూయేషన్‌కు దరఖాస్తు చేసుకోగా.. 606 మంది (13.13శాతం) బెనిఫిట్స్‌ పొందారు. ఐదో సెమిస్టర్‌కు 3,918 రీవాల్యూయేషన్‌కు దరఖాస్తులు రాగా. 704 మంది (17.97శాతం)బెనిఫిట్స్‌ పొందినట్లు రాజేందర్‌ తెలిపారు. రీవాల్యూయేషన్‌ ఫలితాలు కాకతీయ యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement