breaking news
Jangaon District Latest News
-
ఏకగ్రీవ అభ్యర్థులకు నియామక పత్రాలు
స్టేషన్‌ఘన్‌పూర్: మండల పరిధిలోని 15 గ్రామ పంచాయతీలకుగాను జిట్టెగూడెంతండా గ్రామ పంచాయతీకి సర్పంచ్‌తో పాటు వార్డు స్థానాలకు ఒక్కొక్కరే నామినేషన్లు దాఖలు చేయడంతో గ్రామ పంచాయతీ పాలకమండలి ఏకగ్రీవమైంది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు గురువారం నియామకపత్రాలు అందించారు. ఆర్ఓ, ఏఆర్ఓ సమక్షంలో ఉపసర్పంచ్‌గా నునావత్ రజితను ఎన్నుకున్నారు. సర్పంచ్‌గా బానోతు బాలుతో పాటు ఎనిమిది వార్డు స్థానాలకు బానోతు మహేందర్, బానోతు స్వర్ణ, వాంకుడోతు రవి, నునావత్ రజిత(ఉపసర్పంచ్), లావుడ్య రోజ, భూక్య రవీందర్, లావుడ్య వెంకులు, లావుడ్య బుచ్చమ్మలకు నియామకపత్రాలు అందించారు. అదేవిధంగా మండలంలో ఏకగ్రీవమైన వార్డులలో చంద్రుతండాలో 7గురు, పాంనూర్‌లో నలుగురు, అక్కపెల్లిగూడెంలో ముగ్గురు, నమిలిగొండ ఒక్కరు, విశ్వనాధపురంలో ఒక్కరికి వార్డు సభ్యులుగా ఎన్నికల అధికారులు ధ్రువీకరణ పత్రాలు అందించారు. కార్యక్రమంలో ఆర్ఓ రాజేంద్రప్రసాద్, ఏఆర్ఓ అనీల్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి ఇల్లందుల సురేందర్ పాల్గొన్నారు. చిల్పూరు: మండలంలో 17 జీపీలుండగా మూడు గ్రామాల్లో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. గురువారం గార్లగడ్డతండాలో మాలోతు నవీన్, దేశాయితండాలో భూక్య వెంకట్, తీగలతండా తీగల సాంబరాజు ఆయా గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం ఉప సర్పంచ్‌లను ఎంపిక చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఎలినేని రామారావు, కార్యదర్శులు రంగారెడ్డి, తిరుమలరెడ్డి, భూక్య విమల తదితరులు పాల్గొన్నారు. రఘునాథపల్లి: మండలంలో ఐదు పంచాయతీల సర్పంచ్‌లు ఏకగ్రీవం కాగా గురువారం రెండు గ్రామాల ఉప సర్పంచ్ల ఎన్నిక పూర్తయినట్లు ఎంపీడీఓ గార్లపాటి శ్రీనివాసులు తెలిపారు. అయా గ్రామాల్లో ఏకగ్రీవ సర్పంచ్‌లు వాకిటి అలివేలు, పారునంది సునీత సమక్షంలో వార్డు సభ్యులతో అధికారులు ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహించగా రామన్నగూడెం ఉప సర్పంచ్‌గా ఎంపాల భాస్కర్, అయ్యవారిగూడెం ఉప సర్పంచ్‌గా పారునంది రాజీబ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. నేడు దివ్యాంగుల దినోత్సవంజనగామ రూరల్: జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశాల మేరకు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జూబ్లీ ఫంక్షన్ హాల్లో వేడుకలు నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి కోదండరాములు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని దివ్యాంగులు, దివ్యాంగుల కోసం పని చేసే స్వచ్ఛంద సంస్థలు, వివిధ సంఘాల నాయకులు పాల్గొని వేడుకను విజయవంతం చేయాలని కోరారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభం అవుతుందని ఈసందర్భంగా క్రీడల్లో పాల్గొన్న విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తుల ఆహ్వానంజనగామ రూరల్: ప్రభుత్వం రాజీవ్ విద్యా దీవెన స్కీమ్ కింద ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 9, 10వ తరగతి విద్యార్థులు ప్రీ–మెట్రిక్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి బి.విక్రమ్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థి కులం, ఆదాయం, ఆధార్ లింక్, బ్యాంక్ అకౌంట్ ధ్రువీకరణ పత్రాలు జతపరచి సంబంధిత పాఠశాలలో సమర్పించాలన్నారు. డే స్కాలర్‌కు రూ.3,500లు, వసతి గృహ విద్యార్థులకు రూ.7,000లు సంబంధిత విద్యార్థుల బ్యాంక్ అకౌంట్‌కు సంవత్సరానికి ఒకసారి చెల్లించడం జరుగుతుందన్నారు. పాఠశాల యూడైస్ కోడ్‌తో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఏమైనా రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో సమస్యలు తలెత్తితే సంబంధిత కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఈ నెల చివరిలోగా పూర్తిగా నింపిన దరఖాస్తులను సంబంధిత జిల్లా కార్యాలయంలో అందజేయాలన్నారు. -
నిబంధనల మేరకే ఖర్చు చేయాలి
● జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకురాలు జయశ్రీ స్టేషన్‌ఘన్‌పూర్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నిబంధనల మేరకే ఖర్చులు చేయాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకురాలు జయశ్రీ సూచించారు. మండలంలో సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులకు స్థానిక రైతు వేదికలో ఎన్నికల్లో చేపట్టాల్సిన వ్యయాలు, నిబంధఽనలు తదితర అంశాలపై గురువారం అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సర్పంచ్‌లుగా పోటీ చేసే వారు 5వేల జనాభాకు పైగా ఉంటే రూ.2.50లక్షలు, 5వేల జనాభాకు లోపు ఉంటే రూ.1.50 లక్షలు ఖర్చు చేయవచ్చన్నారు. వార్డు స్థానాలకు రూ.50వేలు, రూ.30వేలు ఖర్చు చేయవచ్చన్నారు. అసిస్టెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకులు సుకుమార్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ ఆఫీస్ సూపరింటెండెంట్ కృష్ణ, సీఐ జి.వేణు, అభ్యర్థులు పాల్గొన్నారు. లింగాలఘణపురంలో.. లింగాలఘణపురం: మండలంలోని బండ్లగూడెం రైతు వేదికలో మండలంలోని సర్పంచ్‌లు, వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులకు జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకురాలు జయశ్రీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శివశంకర్‌రెడ్డి, మండల ఎన్నికల అధికారి ప్రసాద్, ఎస్సై శ్రావణ్‌కుమార్, డీటీ షకీర్, ఎన్నికల ట్రైనర్ కోటి తదితరులు పాల్గొన్నారు. చిల్పూరులో.. చిల్పూరు: పంచాయతీ ఎన్నికల్లో బరిలో ఉన్న సర్పంచ్, వార్డు సభ్యులకు మండల కేంద్రంలో జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకురాలు జయశ్రీ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్‌కుమార్, ఎస్సై సిరిపురం వినయ్‌కుమార్, ఎంపీఓ మధుసూదన్ ఉన్నారు. -
కొత్తకొత్తగా ఉన్నది!
పాలకుర్తి టౌన్: జిల్లాలో కొత్తగా ఏర్పాటైన రెండు గ్రామ పంచాయతీలు.. పాలకుర్తి మండలంలోని మేకల తండా, దుబ్బతండా(టీ)లో తొలిసారి ఎన్ని కలు జరగనున్నాయి. రెండేళ్ల క్రితం ఏర్పడ్డ జీపీలు ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్నాయి. తమ గ్రా మంలోని వ్యక్తినే సర్పంచ్‌గా ఎన్నుకునే అవకాశం వారికి ఈసారి దక్కుతుంది. స్వయంపాలన దిశగా అడుగులు వేస్తున్నా గ్రామాల్లో పరిస్థితిపై ప్రత్యేక కథనం. ‘గిరి’జన తండాలు పంచాయతీలుగా.. జిల్లాలో గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చుతూ 2018 ఆగస్టు 2న ప్రభుత్వం జీవో జారీ చేయగా 2019లో ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత పాలకుర్తి మండలంలో మేకలతండా, దుబ్బతండా(టీ) ప్రత్యేక గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలని గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో, ప్రభుత్వం రెండేళ్ల క్రితం కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. పాలకుర్తి మండలంలోని మేకలతండా.. కొండాపురం గ్రామపంచాయతీ పరిధిలో ఉండేది. రెండేళ్ల క్రితం కొత్త జీపీగా ఏర్పడింది. అప్పటి నుంచి ఎన్నికలు లేకపోవడంతో స్థానిక పాలన లేదు. ఇప్పుడే తొలిసారి పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. జనాభా 520.. ఓటర్లు 450 మంది ఉన్నారు. సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వేషన్ అయింది. కొత్త గ్రామ పంచాయతీ దుబ్బతండా(టీ) మండలంలోని టీఎస్కే పరిధిలో ఉండేది. ఇక్కడ జనాభా 403కాగా.. ఓటర్లు 313మంది ఉన్నారు. జీపీగా ఏర్పాటైన తర్వాత తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. వందశాతం గిరిజనులు ఉండే ఈ రెండు జీపీల్లో స్వయం పాలన రానుంది.కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీ మేకలతండా కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీ దుబ్బతండా(టీ) -
తొలి విడత ర్యాండమైజేషన్ పూర్తి
● మండలాలకు బ్యాలెట్ పత్రాలుజనగామ: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఈ నెల11వ తేదీన తొలి విడత ఎన్నికలు జరుగనున్న సందర్భంగా పోలింగ్ నిర్వహణ కోసం ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. గురువారం కలెక్టరేట్లో సాధారణ ఎన్నికల అబ్జర్వర్ రవికిరణ్, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ పారదర్శకంగా నిర్వహించారు. ర్యాండమైజేషన్ ప్రక్రియలో మొదటి దశలో ఎలక్షన్ నిర్వహించేందుకు పీఓ–1,138, ఓపీఓ–1,552 మందిని ఎంపిక చేశారు. సజావుగా నిర్వహించాలి.. జిల్లాలో మొదటి విడత ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. రఘునాథపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. మండలాలకు బ్యాలెట్ పత్రాలు మొదటి విడతలో జరుగనున్న ఎలక్షన్లకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలను స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం లోని ఐదు మండలాల ఎంపీడీఓలకు అప్పగించారు. కలెక్టరేట్ స్ట్రాంగ్ రూంలో భద్రపరిచిన బ్యాలెట్ పేపర్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా పంచాయతీ అధికారి వసంతతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. నిబంధనల ప్రకారమే నిర్వహించాలి.. జనగామ రూరల్: జిల్లాలో పంచాయతీ ఎన్నికలను నిబంధనల ప్రకారం నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణికుముదిని సూచించారు. గురువారం కలెక్టర్లతో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వీడియో కాన్ఫరెనన్స్ ద్వారా సమీక్షించారు. పోస్టల్ బ్యాలెట్ కోసం వచ్చిన ప్రతీ దరఖాస్తు పరిశీలించి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలన్నారు. ప్రతి మండలంలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలెటేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. అబ్జర్వర్ రవికిరణ్ మాట్లాడుతూ..జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు తగ్గట్టుగా జరుగుతున్నాయని చెప్పారు. వీడియో కాన్పరెన్స్ అనంతరం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ.. జిల్లాలో 10 సర్పంచ్ స్థానాలు, 228 వార్డు స్థానాలు ఏకగ్రీవం కాగా..7 గ్రామ పంచాయతీలలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు మొత్తం ఏకగ్రీవం అయ్యాయని తెలిపారు. -
వరాలు కురిపిస్తారా..!?
అన్ని ఏర్పాట్లు పూర్తి సాక్షిప్రతినిధి, వరంగల్ : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సుమారు 35 రోజుల తర్వాత మళ్లీ ఓరుగల్లులో పర్యటిస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటకు శుక్రవారం తొలిసారి వస్తున్న ఆయన... ‘ప్రజాపాలన – ప్రజావిజయోత్సవాల’ సందర్భంగా పలు అభివృద్ధి పథకాలకు ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావస్తున్నా.. తరుణంలో నర్సంపేట సభలో ప్రసంగించనున్న ముఖ్యమంత్రి గతంలో ప్రకటించిన పథకాలు, నిధులపై స్పష్టత ఇస్తారని భావిస్తున్నారు. గ్రేటర్ వరంగల్‌తోపాటు ఉమ్మడి వరంగల్‌పై ఏం వరాలు కురిపిస్తారనే చర్చ జరుగుతోంది. అలాగే ‘మోంథా’ తుపాను నష్టం సందర్భంగా ఇళ్లు కూలిపోయిన వారికి ఒక్కొక్కరికి రూ.15వేలకు చెల్లించిన ప్రభుత్వం.. పంటల నష్టంపై నివేదికలు పంపిన చాలామందికి పరిహారం అందలేదు. వీటిపైన సీఎం ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు. డీపీఆర్ స్థాయిలోనే ‘గ్రేటర్’పనులు.. ఉమ్మడి వరంగల్‌కు కావాలి నిధులు.. ముఖ్యమంత్రి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వరంగల్‌పై పలు హామీలు కురిపించారు. హైదరాబాద్‌తో పోటీ పడేలా అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు. ఈ మేరకు సుమారు దశల వారీగా రూ.6,500 కోట్ల వరకు నిధులు మంజూరు చేశారు. ఇందులో మామునూరు ఎయిర్‌పోర్టుకు రూ.150 కోట్ల వరకు నిధులు విడుదలై భూసేకరణ జరుగుతోంది. భద్రకాళి చెరువు పూడిక, మాఢ వీధులు నిర్మాణం తదితర పనులు నడుస్తున్నాయి. వరంగల్ నగరంలో సుమారు నాలుగు వేల కోట్ల విలువైన అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణ ప్రతిపాదనలు డీపీఆర్‌ల దశలో ఉన్నాయి. ఔటర్ రింగ్‌రోడ్డు, ఇన్నర్ రింగ్రోడ్డులతోపాటు పలు అభివృద్ధి పథకాలకు నిధులు మంజూరైనా ఆ పనులు సాగడం లేదు. స్మార్ట్‌సిటీ పనులకు తోడు రాష్ట్రం వాటా కింద నిధులు మరిన్ని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు రావాల్సి ఉంది. అలాగే ఉమ్మడి వరంగల్‌లో మేడారం అభివృద్ధి, గిరిజన యూనివర్సిటీలకు మరిన్ని నిధులు అవసరం ఉందని ఇటీవల ప్రజాప్రతినిధులు సీఎంను కోరారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కూడా ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ఆ మూడు పథకాలపై స్పష్టత.. కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ఇటీవల వరంగల్‌లో పర్యటించారు. కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ (ఆర్ఎంయూ), కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, మామునూరు ఎయిర్పోర్ట్ పనులను ఆయన ప్రత్యేకంగా పరిశీలించి సమీక్షించారు. ఈ సందర్భంగా 7 మెగా టెక్స్ టైల్ పార్కుల్లో ఒకటైన కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు పనులపై కేంద్రం మొత్తం రూ.200 కోట్లతో చేపట్టగా రూ.1,700 కోట్ల పెట్టుబడులు వస్తాయని, 12,500 మందికి ఉపాధి కలుగుతుందన్నారు. వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టు విషయంలో 696 ఎకరాల భూమి ఎయిర్ పోర్టు అధికారుల వద్ద ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం సుమారు 243 ఎకరాల భూమి సేకరించి ఎయిర్ పోర్టు అథారిటీకి అందజేస్తే త్వరగా నిర్మాణం ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందన్నారు. కాజీపేటలోని రైల్ మానుఫ్యాక్చరింగ్ యూనిట్ త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోందన్నారు. ఈ మూడు పథకాల విషయంలో పలుమార్లు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు జరి గాయి. తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యా ఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించి స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుందని పార్టీవర్గాల సమాచారం. సాక్షి, వరంగల్/నర్సంపేట/నర్సంపేట రూరల్: నర్సంపేట నియోజకవర్గానికి తొలిసారి వస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఈ సభకు జనసమీకరణ చేయనున్నారు. ప్రజాపాలన–ప్రజా విజయోత్సవ సభలో భాగ ంగా నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి రూ.1,023 కోట్లతో అభివృద్ధి పనులకు సీ ఎం శంకుస్థాపన చేయనున్నారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు సీతక్క, కొండా సురేఖతో పాటు ఎమ్మెల్యేలు, నాయకులు హాజరుకానున్నారు. సభా ఏర్పాట్లను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్, కలెక్టర్ డాక్టర్ సత్యశారద, ఆర్డీఓ ఉమారాణి, ఏసీపీ రవీందర్ పరిశీలించారు. హెలిపాడ్, సభా ప్రాంగణాన్ని బాంబ్ స్క్వాడ్ బృందాలు, జాగీలాలు తనిఖీ చేశాయి. సీఎం పర్యటన షెడ్యూల్ ఇలా.. సీఎం రేవంత్‌రెడ్డి మధ్యాహ్నం 1.15 గంటలకు హైదరాబాద్ బేగంపేటనుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు. 2 గంటలకు నర్సంపేట లోని బంజారాభవన్‌లో ఏర్పాటుచేసిన హెలి పాడ్‌లో దిగుతారు. మధ్యాహ్నం 2.15నుంచి 3.55 వరకు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి బహిరంగసభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్లో తిరిగి హైదరాబాద్‌కు వెళ్తారు. గత పర్యటనలో రూ.6,500 కోట్లు మంజూరు చేసిన సీఎం.. మందకొడిగా పనులు.. ఇటీవల జిల్లాకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. మామునూరు, కేఎంటీపీ, ఆర్ఎంయూలపై వ్యాఖ్యలు ఈ మూడు ప్రాజెక్టులలో రాష్ట్రం పాత్రపై సీఎం స్పష్టత ఇచ్చే అవకాశం ఉమ్మడి వరంగల్ అభివృద్ధికి మరిన్ని నిధులపై ఆశలుప్రజాపాలన – ప్రజా విజయోత్సవ సభ’లో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం సభలో మాట్లాడనున్న ఆయన ఉమ్మడి వరంగల్‌పై నిధుల జల్లు కురిపిస్తారన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. అంతకు ముందు గ్రామ పంచాయతీ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉందని పార్టీకి చెందిన ముఖ్య నేత ఒకరు చెప్పారు. ఉమ్మడి జిల్లాలో తాజా పరిస్థితి ఏమిటి? పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏం జరుగుతోంది.. ? అని మాట్లాడనున్నారు. మెజార్టీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలిచేలా రేవంత్‌రెడ్డి మరోసారి మార్గదర్శనం చేయనున్నారని తెలిసింది. -
ఉప యోగం!
● సర్పంచ్ రిజర్వేషన్లలో నిరాశ.. ‘సెకండ్ పవర్’ కోసం ఆశ ● ఉప సర్పంచ్ పదవితో రాజకీయ భవిష్యత్‌ను నిర్మించుకునే ప్రయత్నం ● ఎన్నికల కంటే ముందే లక్షల రూపాయలతో ఒప్పందాలు..? ● పార్టీలు పక్కన బెట్టి.. రహస్య సమీకరణాలు ● పలుచోట్ల సర్పంచ్ పదవికి మించి పోటీ ● జిల్లాలో సర్పంచ్‌లు–280.. వార్డులు 2,534జనగామ: సర్పంచ్ రిజర్వేషన్లు ఆశావాహులకు నిరాశ కల్పించగా, ఉప సర్పంచ్ పీఠంపై అందరి కన్ను పడింది. సర్పంచ్‌గా పోటీ చేసే అవకాశం రాకపోవడంతో జిల్లాలో పలువురు నాయకులు ‘సెకండ్ పవర్ సీటు’ వైపు దష్టి సారించారు. వార్డు రిజర్వేషన్లు అనుకూలంగా రావడంతో, సభ్యుల మద్దతు కోసం లక్షల రూపాయలతో ముందుగానే ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. కొన్నిచోట్ల పార్టీలను పక్కనపెట్టి వ్యక్తిగత బంధాలు, ఆర్థిక హామీలతో వార్డు సభ్యులను తమవైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు భారీగా కసరత్తు చేస్తున్నారు. గ్రామస్థాయి పాలనలో ఉప సర్పంచ్ పదవికి ఉన్న చెక్ పవర్, నిర్ణయాధికారం, ప్రభావం కారణ ంగా ఈసారి పోటీ సర్పంచ్ రేసుకు మించినంత తీవ్రంగా కనిపిస్తోంది. ఉప సర్పంచ్ పదవి చేపట్టి రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న ఆతృతతో అభ్యర్థులు పరుగులు పెడుతున్నారు. జిల్లాలో రిజర్వేషన్లు ఇలా.. జిల్లాలో మొత్తం 280 గ్రామపంచాయతీలు, 2,534 వార్డులు ఉన్నాయి. ఎస్టీ వార్డులు–300, ఎస్సీ వార్డులు–157, బీసీ వార్డులు – 456, జనరల్ వార్డులు–1,120 వార్డుల పరిధిలో మహిళలు, జనరల్ కలుపుకుని రిజర్వేషన్లు కలిసి రాగా, సర్పంచ్ రిజర్వేషన్లలో జనరల్–123, బీసీ జనరల్–45, ఎస్సీ జనరల్–54, ఎస్టీ జనరల్– 58 రెండు కేటగిరీల్లో రిజర్వేషన్లు ఉన్నాయి. సర్పంచ్ తర్వాత ‘ఉప’కు ప్రాధాన్యం.. గ్రామస్థాయి పాలనలో సర్పంచ్ తర్వాత అత్యంత ప్రభావవంతమైన పదవి ఉప సర్పంచ్‌కే దక్కుతుంది. అభివృద్ధి పనుల పరిశీలన, పంచాయతీ నిర్ణయాల్లో చురుకై న పాత్ర కారణంగా ఈ పదవి రాజకీయాల్లో మంచి స్థానం కల్పిస్తోంది. ఈసారి అయితే ఉప సర్పంచ్ పోటీ కూడా సర్పంచ్ రేసును తలదన్నేంత స్థాయిలో మారింది. ఎలాగైనా ఉప సర్పంచ్ పీఠాన్ని కై వసం చేసుకుని గ్రామ రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే ఇదే గోల్డెన్ ఛాన్స్‌గా భావిస్తున్నారు. ఉప సర్పంచ్ పీఠం చుట్టూ నెలకొంటున్న హడావుడి గ్రామ రాజకీయాల్లో హీట్ పెరిగేలా చేస్తోంది. మేజర్ పంచాయతీలు, ఆదాయ వనరులు కలిగిన జీపీలపైనే ఎక్కువగా గురి పెడుతున్నారు. పార్టీ నాయకత్వం..నిఘా వర్గాల ఆరా వార్డు స్థాయిలో వేగంగా మారుతున్న సమీకరణాల నేపథ్యంలో వార్డు అభ్యర్థుల కదలికలు, సమావేశాలు, ఆర్థిక హామీలు, అభివృద్ధి వాగ్దానాలకు సంబంధించి పార్టీలకు చెందిన నాయకత్వంతో పాటు నిఘా విభాగాలు కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఎవరు ఎవరిని కలుస్తున్నారు, ఏ వార్డులో ఎవరు ప్రభావం చూపుతున్నారు, ఎవరి మీద ఒత్తిడి పెరుగుతోంది అన్న విషయాలను పార్టీలు నిశితంగా గమనిస్తున్నాయి. ఉపసర్పంచ్ పీఠం ద్వారా గ్రామ రాజకీయాల్లో పట్టుకోసం జరుగుతున్న ఈ రహస్య రచ్చ పార్టీ అధినాయకత్వానికి తలనొప్పిగా మారే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గ్రామంలో వార్డుల సంఖ్య ఆధారంగా ఉప సర్పంచ్ కోసం ఉబలాట పడిపోతున్న పలువురు ఆశావహులు వార్డు సభ్యులకు ఎన్నికల ఖర్చులకు సంబంధించి ముందుగానే కొంత సొమ్ము ముట్టజెబుతూ ఒప్పంద పత్రాలు రాయించుకుంటున్నారనే ప్రచారం వినిపిస్తోంది. వార్డు మెంబర్‌గా విజయం సాధించిన తర్వాత ఉప సర్పంచ్‌గా ఎన్నుకునే సమయంలో ఓటు తనకే వేయాలన్న హామీ ఇప్పుడే తీసుకుంటున్నారనే చర్చ రాజకీయ వేడిని పెంచుతోంది. పార్టీలను పక్కన పెట్టి మెజార్టీగా వ్యక్తిగతంగా కలిసేవారితోనే అవగాహన కుదుర్చు కోవడం ఈసారి ప్రధాన ధోరణిగా కనిపిస్తోంది. గత ఏడాదిన్నరగా పర్యటనలు, పబ్లిసిటీలతో లక్షల్లో ఖర్చు చేసిన ఆశావాహులు సర్పంచ్ పదవులకు వచ్చిన రిజర్వేషన్లు చాలామందికి అనుకూలించకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఏళ్ల తరబడి నిరీక్షణపై రిజర్వేషన్లు నీళ్లు చల్లడంతో రాజకీయ భవిష్యత్తును ని లబెట్టుకోవాలంటే ఉప సర్పంచ్ పీఠమే శరణ్యమని భావిస్తూ... ముందస్తు కసరత్తు మొదలుపెట్టారు. -
సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక చర్యలు
● డీసీపీ రాజామహేంద్ర నాయక్ దేవరుప్పుల: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు సమస్యాత్మక గ్రామాల్లో పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని డీసీపీ రాజామహేంద్ర నాయక్ పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో నామినేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఆయన వెంట వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐ జానకిరామిరెడ్డి, ఎస్సై ఊర సృజన్‌కుమార్ ఉన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి.. కొడకండ్ల: సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని డీసీపీ రాజమహేంద్రనాయక్ సూచించారు. మండలకేంద్రంలోని టీజీఆర్ఎస్జేసీ గురుకులంలో సైబర్ క్రైమ్ అవగాహన సదస్సులో డీసీపీ మాట్లాడుతూ.. ఆన్లైన్ మోసానికి గురైన వెంటనే 1930 నెంబర్‌కు ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కారం సులభతరం అవుతుందన్నారు. కార్యక్రమంలో ఏసీపీ అంబటి నర్సయ్య, పాలకుర్తి సీఐ జానకిరామ్‌రెడ్డి, ఎస్సై చింత రాజు, ఫ్రిన్సిపాల్ దిలీప్‌కుమార్ పాల్గొన్నారు. -
వేచి ఉంటాం.. పాలన చేస్తాం..
స్టేషన్‌ఘన్‌పూర్: పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పిస్తుండడంతో వారి ప్రాతినిధ్యం పెరిగింది. దీంతో పల్లెల్లో ఎక్కడా చూసినా మహిళలే కనపడుతున్నారు. మండలంలోని ఇప్పగూడెం క్లస్టర్‌లోని ఇప్పగూడెం, అక్కపెల్లిగూడెం, సముద్రాల గ్రామ పంచాయతీల పరిధిలోని వార్డు స్థానాలకు పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా అక్కపెల్లిగూడెం, ఇప్పగూడెం జీపీల వార్డు స్థానాలకు బరిలో ఉన్న వారు పోటీలో ఉన్నట్లుగా ధ్రువీకరణపత్రాలతో పాటు పోలింగ్ ఏజెంట్ల జాబితాను అందించేందుకు ఇప్పగూడెం గ్రామ పంచాయతీ వద్ద గంటల తరబడి వేచి ఉన్నారు. నిలబడే ఓపిక నశించిన వారు కాసేపు జీపీ వద్ద కూర్చోవడంతో సాక్షి కెమెరాకు చిక్కారు. -
అన్నా..తప్పక రావాలె
పట్టణాల్లో ఉంటున్న ఓటర్లకు అభ్యర్థుల ఫోన్లు జనగామ: గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి నడుస్తోంది. పల్లెల్లో జరుగుతున్న ఎన్నికల సన్నాహాలు పెళ్లి విందు కోసం ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అభ్యర్థుల ఇళ్లలో హడావుడితో పాటు బయట కూడా అదే ఉత్సాహం కనిపిస్తోంది. హైదరాబాద్, భీవండి, నిజామాబాద్, మేడ్చల్ తదితర ప్రాంతాల్లో ఉన్న గ్రామ ఓటర్లను తీసుకొచ్చేందుకు ప్రత్యేక ట్రావెల్స్ బస్సులు, కార్లను ముందస్తుగా బుక్ చేస్తున్నారు. పోలింగ్ రోజున సుదూర ప్రాంతాల నుంచి ఓటర్లను తీసుకొచ్చే వాహనాలు ఆలస్యం కాకుండా అవ్వకుండా ముందస్తుగా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. అభ్యర్థుల ఇళ్లలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. నాయకులు, కార్యకర్తలు, యువకులు, అభిమానులు, బం ధువులు, గ్రామస్థులు ఎవరికి వారే పనుల్లో బిజీగా గడిపేస్తున్నారు. తమ ఓటర్లు ఎక్కడెక్కడ ఉన్నారనే సమాచార జాబితాను తయారు చేసి, వారిని తమ వైపు తిప్పుకునేందుకు రూట్ల వారీగా ఒక్కో నాయకునికి బాధ్యతలను అప్పగిస్తున్నారు. ‘అన్నా హైదరాబాద్‌లో ఉన్న మనోడు వచ్చాడా.. భీవండి నుంచి బయలు దేరారా..’ అనే చర్చలు రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. సోషల్ మీడియాలో సైతం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పెళ్లి ఆహ్వాన పత్రాలు పంపినట్లుగా వాట్సాప్ గ్రూపుల్లో ఓటర్లకు తమ అభ్యర్థి తరపున సందేశాలు పంపిస్తున్నారు. ‘అన్నా పోలింగ్ రోజు తప్పకుండా గ్రామానికి రావాలి.. మీ అమూల్యమైన ఓటు వేయాలి..’అంటూ మెసేజ్‌లు వెల్లువెత్తుతున్నాయి. కొందరు అభ్యర్థులు ముహూర్తాలు చేసుకుని పట్నం బయలు దేరి ఊరి ఓటర్లు ఉన్న కాలనీలకు వెళ్లి సమావేశాలతో వారి మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ‘గ్రామం అభివృద్ధి కోసం ఓటు వేసి...అన్నను గెలిపించే బాధ్యత మీపైనే ఉంది..’ అంటూ ఆ బాధ్యతను వారిపైనే వదిలేస్తున్నారు. ఊరి ఓటర్లతో పాటు గెలుపులో పట్నం ఓటర్లు కింగ్ మేకర్లుగా మారనున్నారు. ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారు.. ఎక్కడ ఉంటున్నారు.. ఎప్పుడు వస్తారు.. ఎలాంటి వాహనాలు ఏర్పాటు చేయాలి, ఖర్చు ఎంత అనే బిజీలో అభ్యర్థుల అనుచరులు నిమగ్నమయ్యారు. మరికొంత మంది అభ్యర్థులు తమ ఓటర్లకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి మద్దతు కోరుతున్నారు. వలసల పెరుగు దలతో ఇప్పుడు గ్రామ రాజకీయాల్లో పట్నం ఓటర్ల ప్రభావం పెరిగింది. అందుకే అభ్యర్థులందరూ వారిపైనే గంపెడాశలు పెట్టుకుంటున్నారు. గ్రామాల్లో ఓటర్లను ఆకర్షించే విధంగా విందు రాజకీయాలకు తెర లేపుతుండగా, పట్నంలో ఉన్న వలస పక్షులను సైతం తమవైపు తిప్పుకునేందుకు బరిలో ఉన్న ప్రతి అభ్యర్థి ఆయా ప్రాంతాల్లో రోజువారీ వంటకాలు, విందులకు ప్లాన్ చేసుకుంటున్నారు. పట్నం ఓటర్లు ఏఏ ప్రాంతాల్లో ఉన్నారనే లెక్కల మేరకు ఒక్కో ఏరియాకు ఇన్‌చార్జ్‌లను నియమించి పోలింగ్ తేదీ వరకు అక్కడే ఉండే విధంగా ప్లాన్ చేశారు. ఇన్‌చార్జ్‌లు ప్రతి రోజు వలస ఓటర్లను కలవడం, పనులు ముగించుకుని ఇంటికి రాగా దావత్‌లతో ఖుషీ చేయడం వంటి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండాలి. ఈ తతంగమంతా గురువారం నుంచి మొదలు కానుంది. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలను తలదన్నే రీతిలో సర్పంచ్ ఎలక్షన్లలో డబ్బుల ప్రవాహం ఏరులై పారుతోందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో మినీ దావత్‌లు నడుస్తుండగా... ఒకటి, రెండు రోజుల్లో సుక్కా, ముక్కలతో విందులు షురూ కానున్నాయి. ఒక్క ఓటే ఫలితాన్ని తారుమారుచేయగల పరిస్థితుల్లో ప్రతి అభ్యర్థి వలస ఓటర్లను రప్పించుకోవడానికి చేసే హడావుడి అంతా ఇంతా కాదు. గతంలో చివరి క్షణంలో ఒక్క ఓటే పదలు సంఖ్యలో అభ్యర్థుల ఆశలను తలకిందులు చేసిన సంగతి మనం చూసిందే. ఆ అనుభవాలను గుర్తుకు చేసుకుంటూ ప్రస్తుతం బరిలో నిలిచిన అభ్యర్థులు ఎవరికి వారే ఒక్క ఓటు కూడా చేజారిపోకుండా ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. హైదరాబాద్, భీవండి.. తదితర పట్టణాలకు ట్రావెల్స్ బస్సులు ప్రతీ ఓటు కీలకం కావడంతో దూరప్రాంత ఓటర్లపై నజర్ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి సోషల్ మీడియా వాడకం -
ఊపందుకున్న పల్లెసమరం
జనగామ: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరుగనున్న నేపథ్యంలో రాజ కీయ పరిణామాలు ఊపందుకున్నాయి. మొదటి విడత నామినేషన్లు ఉపసంహరించుకుని ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టారు. ఎక్కడ చూసినా అభ్యర్థుల మధ్య అభివృద్ధి నినాదం, ఆధిపత్య పోరాటం స్పష్టంగా కనినిస్తోంది. రెండో విడత ఎలక్షన్లు జరిగే జనగామ నియోజకవర్గంలో బుజ్జగింపుల పర్వం సాగుతోంది. జనగామ, స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాల్లో జరగనున్న ఎన్నికలకు సంబంధించి మూడు దశల్లో ఎలక్షన్లు కొనసాగుతుండటంతో జిల్లాలో రాజకీయ చైతన్యం వెల్లివిరుస్తోంది. ఒక వైపు పల్లెల్లో ప్రచార డప్పులు మోగుతుంటే, మరో వైపు జనగామలో స్క్రూటినీ, విచారణలు అభ్యర్థులను టెన్షన్ పుట్టిస్తోంది. పాలకుర్తిలో నామినేషన్ల కోసం అభ్యర్థుల వరుసకడుతున్నారు. ప్రచారం షురూ... స్టేషన్ ఘన్్పూర్ నియోజకవర్గంలో మంగళవారం సాయంత్రం నుంచి ప్రచారం అధికారికంగా ప్రారంభమైంది. అభ్యర్థులు స్థానికులతో సమావేశాలు నిర్వహిస్తూ, ఇంటింటి ప్రచారం మొదలు పెట్టారు. గ్రామాల్లో ప్రజలు ఎదురుచూస్తున్న అభివృద్ధి అంశాలను ముందుకు తెస్తూ, తమ వాదాన్ని గట్టిగనే వినిపిస్తున్నారు. పల్లెల్లో బ్యానర్లు, ర్యాలీలు ఎన్నికల వాతావరణాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇక్కడ 324 మంది సర్పంచ్, 1,950 మంది వార్డు సభ్యులు బరిలో నిలిచారు. స్టేషన్‌ఘన్‌పూర్ సర్పంచ్, వార్డు సభ్యులకు గుర్తులను కేటాయించడంతో క్షణం ఆలస్యం చేయకుండా అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లిపోయారు. జనగామలో స్క్రూటినీ.. ఇదే సమయంలో జనగామ నియోజకవర్గంలో నా మినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ జరుగుతోంది. అభ్యర్థులు ఇచ్చిన నామినేషన్లను ఎన్నికల అధికారులు పరిశీలన చేస్తున్నారు. ఎవరి నామినేషన్ ఆమోదం పొందుతుందో, తిరస్కరణకు ఎవరిది గురవుతుందో అన్న ఉత్కంఠ అభ్యర్థుల్లో కనిపిస్తోంది. పాలకుర్తి నియోజకవర్గంలో మూడో విడతగా మంగళవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. సర్పంచ్, వార్డు సభ్యుల పోటీకి సిద్ధమవుతున్న అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు జీపీల వద్ద బారులు దీరారు. దీంతో నామినేషన్ కౌంటర్లు బిజీగా మారాయి. అభ్యర్థులు, పార్టీ పెద్దలు, మద్దతుదారులు అందరూ మూడు చోట్ల మూడు విధాలుగా రంగంలో దిగడంతో గ్రామపంచాయతీ ఎన్నికల వేడి రాబోయే రోజుల్లో మరింత ఉధృతం కానుంది. పాలకుర్తి నియోజకవర్గంలో మొదటి రోజు సర్పంచ్‌కు 41, వార్డులకు 37 నామినేషన్లు వచ్చాయి. జనగామ నియోజకవర్గంలోని తరిగొప్పులలో 25 సర్పంచ్, 6 వార్డు నామినేషన్లను తిరస్కరించారు. బచ్చన్నపేటలో 5 సర్పంచ్, 36 వార్డుల నామినేషన్లను తిరస్కరించారు. జిల్లాలో సర్పంచ్ ఏకగ్రీవమైన గ్రామాల్లో ఈనెల 4న ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. ఇందుకు సంబంధిత మండలాల ఎంపీడీఓలు ఏర్పాట్లు చేయాలని సూచించారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ప్రచారం షురూ జనగామలో స్క్రూటినీ ప్రక్రియ పాలకుర్తిలో నామినేషన్ల స్వీకరణ ప్రారంభం -
ఎన్నికల నియమావళిని పాటించాలి
పాలకుర్తి టౌన్: ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను పాటించాలని డీసీపీ రాజహేంద్రనాయక్ సూచించారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ, చెన్నూరులో ఏర్పాటు చేసిన నామినేషన్ ప్రతాల స్వీకరణ కేంద్రాలను బుధవారం ఆయన పరిశీలించారు. ఆయన వెంట వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐ జానకిరామిరెడ్డి, ఎస్సైలు దూలం పవన్‌కుమార్, మేకల లింగారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలు సహకరించాలి దేవరుప్పుల: రాజకీయాలకతీతంగా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా కొనసాగేలా అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని డీసీపీ రాజామహేంద్రనాయక్ సూచించారు. మండలంలోని కోలుకొండ, మాధాపురం, ధర్మాపురం క్లస్టర్లో కొనసాగిన సర్పంచ్, వార్డు నామినేషన్ల కేంద్రాలను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, పాలకుర్తి సీఐ జానకిరామిరెడ్డి, స్థానిక ఎస్సై ఊర సృజన్‌కుమార్ ఉన్నారు. డీసీపీ రాజమహేంద్రనాయక్ -
ఉత్సాహంగా దివ్యాంగుల క్రీడలు
జనగామ రూరల్: మహిళా, శిశు, దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం పట్టణంలోని ధర్మకంచ, మినీ స్టేడియంలో దివ్యాంగులకు క్రీడాపోటీలు నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి కె. కోదండరాములు జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. ఈసందర్భంగా వివిధ మండలాల నుంచి దివ్యాంగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 18ఏళ్లలోపు బాలబాలికలకు అలాగే మహిళలకు, పురుషులకు క్యారమ్, చెస్, జావెలిన్ త్రో, 100 మీటర్ల రన్నింగ్, షార్ట్ పుట్ ఈవెంట్లలో క్రీడా పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో పీడీ మెప్మా హర్షవర్ధన్, డీపీఎం జ్యోతి తెలంగాణ వికలాంగుల వేదిక వ్యవస్థాపకులు మేకల సమ్మయ్య, బొట్ల సుమతి, దివ్యాంగుల జిల్లా కమిటీ సభ్యులు పంతులు ప్రభాకర్, మట్టి కిషన్, తాళ్లపల్లి కుమార్, దామెర రమేశ్, సయ్యద్ మున్నావర్, గడ్డం సోమరాజు, సీనియర్ అసిస్టెంట్ సంపత్ కుమార్, ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ చింతకింది రాజు, దివ్యాంగులు పాల్గొన్నారు. అలాగే పట్టణంలోని భవిత కేంద్రంలో విద్యాశాఖ అధ్యంలో సాంస్కృతి క కార్యక్రమాలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో విద్యాశాఖ నుంచి సత్యనారాయణ మూర్తి పాల్గొన్నారు. -
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
స్టేషన్‌ఘన్‌పూర్: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా స్టేషన్‌ఘన్‌పూర్ మండల పరిధిలో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం బుధవారం సాయంత్రం ముగిసింది. మండల పరిధిలో మొత్తం 15 గ్రామ పంచాయతీలకు గాను 146 వార్డులున్నాయి. అందులో జిట్టెగూడెం తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానంతో పాటు మొత్తం 8 వార్డులకు ఒకే ఒక్క నామినేషన్లు దాఖలు కావడంతో నామినేషన్ల ఘట్టం చివరిరోజునే సర్పంచ్‌తో పాటు వార్డులన్నీ ఏకగ్రీవమైన విషయం విదితమే. మిగిలిన 14 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ స్థానాలకు మొత్తంగా 91 నామినేషన్లు, వార్డులకు 352 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే బుధవారం సాయంత్రం వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉండగా సర్పంచ్ స్థానాలకు 43 మంది ఉపసంహరణ చేసుకోగా ప్రస్తుతం 14 జీపీలకు 48 మంది బరిలో ఉన్నారు. అదేవిధంగా వార్డు స్థానాలకు 352 మంది ఉండగా 41 మంది నామినేషన్లు ఉపసంహరణ చేసుకోగా 311 మంది బరిలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు, ఎంపీడీఓ నర్సింగరావు తెలిపారు. 24 వార్డులు ఏకగ్రీవం మండల పరిధిలో మొత్తంగా 146 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 24 వార్డులు ఏకగ్రీవయ్యాయి. అందులో జిట్టెగూడెం తండాలో 8 వార్డులు, చంద్రుతండాలో 7, పాంనూర్‌లో 4, అక్కపెల్లిగూడెంలో 3, నమిలిగొండ 1, విశ్వనాధపురం 1 వార్డు ఏకగ్రీవమయ్యాయి. -
నియామకపత్రం అందుకున్న ధన్వంతి
జనగామ: డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి బుధవారం గాంధీభవన్‌లో జరిగిన పార్టీ సమావేశంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్, కాంగ్రెస్ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో అధిక స్థానాలు గెలుపొందాలని, ఓట్ చోరీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రభుత్వానికి కార్యకర్తలకు సమన్వయం పరిచేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై సూచనలు చేశారన్నారు. పార్టీ అధ్యక్షులకు, పార్టీ ఇన్చార్జ్కు లకావత్ ధన్వంతి కృతజ్ఞతలు తెలిపారు. దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలిజనగామ రూరల్: దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని సీనియర్ సివిల్ జెడ్జి ఇ.సుచరిత అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ ఆదేశాల మేరకు బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా పట్టణంలోని భవిత సెంటర్లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ జెడ్జి జి.శశి, ఎంఈఓ శంకర్‌రెడ్డి, డాక్టర్ లిఖిత, రవీంద్ర, దయామణి, ఎస్.రాములు, వి.శోభారాణి పాల్గొన్నారు. రఘునాథపల్లి: మండలంలోని 36 గ్రామాలకు 5 గ్రామాలు ఏకగ్రీవంగా కాగా 31 గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు. బరిలో నిలిచిన సర్పంచ్, వార్డు అభ్యర్థులకు గుర్తులు కేటాయించినట్లు బుధవారం ఎంపీడీఓ గార్లపాటి శ్రీనివాసులు తెలిపారు. ఎన్నికల గుర్తులు కేటాయించిన గంటలోనే వాట్సాప్ గ్రూపులలో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. 4 నామినేషన్లు తిరస్కరణజనగామ రూరల్: మండలంలోని 21 గ్రామపంచాయతీలకు 149 మంది సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ వేశారు. ఇందులో వడ్లకొండ నుంచి ఒక నామినేషన్‌ను తిరస్కరించారు. 198 వార్డు సభ్యులకు 569 మంది నామినేషన్లు దాఖలు చేయగా 3 తిరస్కరించారు. ఇందులో వెంకిర్యాల, గానుగుపహడ్, వడ్లకొండలో ఒక్కోటి చొప్పున ఉన్నాయి. బరిలో 69మంది సర్పంచ్ అభ్యర్థులులింగాలఘణపురం: మండలంలోని 21 పంచాయితీలకు గాను 69 మంది, 196 వార్డులకు గాను 163 మంది పోటీలో ఉన్నారు. గతంలో నాలుగు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా ఈసారి కొత్తపల్లి, రామచంద్రగూడెంలో జరిగిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో మండలంలో ఒక్క స్థానం కూడా ఏకగ్రీవం కాలేదు. రామచంద్రగూడెంలో 8 వార్డులకు గానూ 4 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇక్కడి సర్పంచ్ స్థానం ఏకగ్రీవం కోసం గ్రామస్తులు ముమ్మర ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. వేయిస్తంభాల ఆలయ ఆదాయం రూ.12,04,168హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల దేవాలయంలో బుధవారం ఉదయం హుండీ లెక్కింపు నిర్వహించారు. 50 రోజుల హుండీ ఆదాయం రూ.4,57,768, పూజా టికెట్ల ద్వారా రూ. 7,46,400.. మొత్తం ఆదాయం రూ.12,04,168 వచ్చిందని ఈఓ ధరణికోట అనిల్‌కుమార్ తెలిపారు. పర్యవేక్షకుడిగా దేవాదాయశాఖ పరిశీలకుడు ప్రసాద్ వ్యవహరించారు. దేవాలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, అర్చకుడు మణికంఠ శర్మ అవధాని, సిబ్బంది మధుకర్, లింగబత్తుల రామకృష్ణ, రజిత, రాజరాజేశ్వర సేవాసమితి మహిళా సభ్యులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ
పాలకుర్తి టౌన్: నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల పరిశీలకుడు రవికిరణ్ ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని ఆయన సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో స్టేషన్‌ఘన్‌పూర్ ఆర్డీఓ డీఎస్ వెంకన్న, తహీహసీల్దార్ సూత్రం సరస్వతి, ఎంపీడీఓ వర్కల వేదవతి, ఎంపీఓ హరినాథ్‌రెడ్డి, ఎస్సై లింగారెడ్డి, పంచాయతీ కార్యదర్శులు వెంకటాచారి, చంద్రశేఖర్, పాల్గొన్నారు. ఎన్నికల పరిశీలకుడు రవికిరణ్ -
ఐదుగురు సర్పంచ్‌లు ఏకగ్రీవం
రఘునాథపల్లి: మండలంలోని 36 గ్రామ పంచాయతీల పరిధిలోని ఏడు నామినేషన్ కేంద్రాల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా నామినేషన్ వేసిన అభ్యర్థుల ఉపసంహరణ గడువు బుధవారం ముగిసింది. మండలంలో ఐదు గ్రామాల్లో పోటీ లేకుండా ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. పడమటిగూడెం నుంచి బాలశౌరెడ్డి, రామన్నగూడెం – వాకిటి అలివేలు, వెల్ది – సింగిరెడ్డి సునీత, సోమయ్యకుంటతండా – కెతావత్ ఈర్యానాయక్, అయ్యవారిగూడెం –పారునంది సునీతలను సర్పంచ్‌లుగా అయా క్లస్టర్ గ్రామాల్లో అధికారులు ఏకగ్రీవంగా ప్రకటించి ధ్రువపత్రాలు అందజేశారు. చిల్పూరు: మండలంలో 17 గ్రామ పంచాయతీలుండగా గార్లగడ్డతండా, తీగలతండా, దేశాయితండా పంచాయతీలు ఏకగ్రీవమైనట్లు ఎంపీడీఓ శంకర్‌నాయక్ తెలిపారు. తీగలతండాలో సర్పంచ్‌గా తీగల సాంబరాజు, ఉప సర్పంచ్‌గా బదావత్ తిరుపతి, వార్డు సభ్యులు లక్ష్మి, మేరి, భూక్య తిరుపతి, రవి, భద్రమ్మ, చంద్రకళ, అజ్మీర తిరుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గార్లగడ్డతండాలో సర్పంచ్ మాలోతు నవీన్, ఉప సర్పంచ్ మాలోతు లింగ, వార్డు సభ్యులు సరిత, లక్ష్మ, రజిత, బుజ్జమ్మ, నాగేందర్, దేశాయితండాలో సర్పంచ్‌గా భూక్య వెంకట్, ఉప సర్పంచ్‌గా లాల్, వార్డు సభ్యులు రాజు, బుల్లి, జ్యోతి, కాశినాథ్, సుందర్, లలిత, మోతీలాల్, సుమన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జఫర్‌గఢ్: మండలంలోని దుర్గ్యా నాయక్‌తండాలో కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి బానోత్ అనూష యాకూబ్‌నాయక్ ఏకగ్రీవం అయ్యారు. గ్రామం నుంచి సర్పంచ్ స్థానానికి నలుగురు అభ్యర్థులు నామినేషన్లు వేయగా ముగ్గురు ఉపసంహరించుకున్నారు. దీంతో సర్పంచ్ అభ్యర్థిగా అనూష యాకూబ్‌నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇదే గ్రామం నుంచి ఆరుగురు వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యారు.వెంకట్సాంబరాజునవీన్ -
పోస్టల్ బ్యాలెట్ పంపిణీ సక్రమంగా చేయాలి
జనగామ రూరల్: పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోస్టల్ బ్యాలెట్ పత్రాలను సర్వీస్ ఓటర్లకు, ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు సరిగ్గా పంపిణీ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్ పంపిణీ, నిర్వహణపై బుధవారం అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్‌తో కలిసి జెడ్పీ సీఈఓ, డీపీఓ, ఎంపీడీఓలు, తహసీల్దార్లతో, ఎంపీఓలతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. పోస్టల్ బ్యాలెట్ పంపిణీ, నిర్వహణ తదితర అన్ని ప్రక్రియలకు సంబంధించి మాస్టర్ ట్రైనర్ రామరాజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు అవగాహన కల్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..మొదటి విడత పోలింగ్ జరిగే మండలాల్లో ఈ నెల 9వ తేదీన ఎంపీడీఓ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ కోసం ఫెసిలిటేషన్ కేంద్రానికి అవసరమైన ఏర్పా ట్లు చేయాలన్నారు. మొదటి విడత పోలింగ్ జరిగే మండలాల్లో ఈ నెల 6 న పోలింగ్ అధికారులకు రెండో విడత శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ -
వేసవిలో లోడ్‌కు సరిపడేలా చర్యలు
● ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి జనగామ రూరల్: రాబోయే వేసవిలో లోడ్‌కు సరిపడేలా 100 నుంచి 160 కేవీఏ ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యం పెంపు చేసే విధంగా సత్వర చర్యలు తీసుకుంటున్నామని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని వడ్లకొండ 220, 132 కేవీ సబ్‌స్టేషన్‌ను ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి సందర్శించారు. ఈందర్భంగా విద్యుత్ అధికారులతో ఆయన మాట్లాడుతూ.. కొత్తగా అవసరమైన ఫీడర్ల కోసం ప్రతిపాదనలు పంపాలన్నారు. నూతనంగా నిర్మించే ఎస్ఈ కార్యాలయాన్ని కూడా పరిశీలించి పలు సూచనలు చేశారు. అధునాతనంగా తీర్చిదిద్దాలని, పచ్చదనం ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం 33/11 కేవీ పెంబర్తి గేట్‌వే సబ్ స్టేషన్‌న్‌ను సందర్శించారు. కార్యక్రమంలో జనగామ ఎస్ఈ సీహెచ్.సంపత్ రెడ్డి, డీఈలు లక్ష్మినారాయణ రెడ్డి, గణేష్, విజయ్‌కుమార్ , సారయ్య, ఏడీఈ స్వామి రెడ్డి, ఈఈ సివిల్ వెంకటేశ్వర్లు , ఎస్ఏ సుదర్శన్ పాల్గొన్నారు. -
బుజ్జగింపులు..బేరసారాలు
● ‘నాకు సర్పంచ్, నీకు ఎంపీటీసీ..’ అంటూ మంతనాలు ● నేటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణలుస్టేషన్ఘన్పూర్: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మండల పరిధిలో ఇప్పటికే నామినేషన్లు, అప్పీళ్ల ఘట్టం ముగియగా నామినేషన్ల ఉపసంహరణకు బుధవారంతో గడువు ముగియనుంది. దాంతో గ్రామాల్లో రెబల్స్‌గా వేసిన అభ్యర్థుల బుజ్జగింపు పర్వాలు ఊపందుకున్నాయి. మండలంలో 15 గ్రామ పంచాయతీలు ఉండగా జిట్టెగూడెం తండా జీపీ ఏకగ్రీవం కాగా మిగిలిన 14 గ్రామాలకు ఎన్నికలు జరుగన్నాయి. మొత్తంగా సర్పంచ్ స్థానాలకు 91 మంది, వార్డు స్థానాలకు 352 మంది బరిలో ఉన్నారు. దాదాపు అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థుల ఖరారు అయినప్పటికీ పలు గ్రామాల్లో అదేపార్టీ నుంచి రెబల్స్‌గా ఇద్దరు, ముగ్గురు నామినేషన్లు వేశారు. దాంతో ఆయా గ్రామాల్లో గ్రామ కాంగ్రెస్ కమిటీలు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ ముఖ్య నాయకులతో కలిసి రహస్య సమావేశాలు నిర్వహిస్తూ బుజ్జగింపులు చేస్తున్నారు. పార్టీ నుంచి ఒక్కరే బరిలో ఉండాలని, మాట విని ఉపసంహరణ చేసుకున్న వారికి రానున్న రోజుల్లో సముచితస్థానం కల్పిస్తామంటూ హామీలు గుప్పిస్తున్నారు. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో ఇద్దరు పోటీకి ఉన్న చోట ‘నాకు సర్పంచ్ అవకాశం ఇవ్వు.. నీకు ఎంపీటీసీగా సహకరిస్తా..’ అంటూ రహస్య ఒప్పందాలు కుదుర్చుకుంటూ బేరసారాలు చేస్తున్నారు. కాగా ఇప్పటికే పలు గ్రామాల్లో కాంగ్రెస్ రెబల్స్ అంశం ఎమ్మెల్యే కడియం శ్రీహరి వద్దకు చేరింది. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు గ్రామ, మండల కమిటీలు పనిచేస్తున్నాయి. పార్టీ బలపర్చిన అభ్యర్థికి సహకరించాలని కోరుతూ రెబల్స్‌ను పోటీ నుంచి తప్పించేలా పార్టీ నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఏది ఏమైనా బుధవారం సాయంత్రంతో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియనుండగా ఏ గ్రామంలో ఎందరు బరిలో ఉంటున్నారు, ఏగుర్తులు వచ్చాయి అనేది తేలనుంది. -
నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరగాలి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జనగామ రూరల్: ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకుగానూ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. మంగళవారం జనగామ మండలం వడ్లకొండ గ్రామపంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న రెండో విడత నామినేషన్ ప్రక్రియను అలాగే హెల్త్ డెస్క్‌లో అధికారుల పనితీరును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల విధులను నిర్వహిస్తున్న అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్ పత్రాల పరిశీలన పకడ్బందీగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బి.మహేశ్, ఎంపీఓ సంపత్‌కుమార్, తహసీల్దార్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ శ్రేయస్సు, స్థితిస్థాపక కార్యక్రమానికి జిల్లా ఎంపిక వలసలను నిరోధించి గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామీణ శ్రేయస్సు స్థితిస్థాపకత కార్యక్రమానికి జిల్లా ఎంపికై ందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మంగళవారం తెలిపారు. రూరల్ డెవలప్మెంట్ జాయింట్ సెక్రటరీకి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న స్థితిగతులను వివరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ జీవనోపాధిని మెరుగుపరచి మహిళలను, యువతను, రైతులను మరింత సంపన్నులుగా, స్థితిస్థాపకంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం 2025 బడ్జెట్లో ప్రకటించిన ఈ కార్యక్రమానికి జిల్లా ఎంపిక అయిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. సిబ్బంది సహాయం తీసుకోండి.. నర్మెట: నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో అదనపు సిబ్బంది సహాయంతో సకాలంలో స్వీకరణ కార్యక్రమం ముగించాలని కలెక్టర్ రిజ్వాన్ షేక్ బాషా అన్నారు. మండల కేంద్రంతో పాటు మచ్చుపహాడ్‌లో ఏర్పాటు చేసిన కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఎంపీడీఓ కావ్య శ్రీనివాసన్, తహసీల్దార్ మొహసిన్, డీపీఆర్ఓ బండి పల్లవి, నర్మెట సీఐ ముసుకు అబ్బయ్య, రఘునాథపల్లి సీఐ శ్రీనివాస్, ఎస్సై నైనాల నగేష్, ఏఎస్సై వెంకట్‌రెడ్డి, ఎంపీఓ వెంకట్ మల్లికార్జున్ ఉన్నారు. నామినేషన్ ప్రక్రియ పరిశీలన.. తరిగొప్పుల: మండలంలోని పోతారం గ్రామంలో కొనసాగుతున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పరిశీలించారు. ఎంపీడీఓ బోజనపల్లి లావణ్య, తహసీల్దార్ మొగుళ్ల మహిపాల్‌రెడ్డి, ఎంపీఓ కృష్ణకుమారి పాల్గొన్నారు. -
మంత్రుల ఆదేశాలు అమలయ్యేనా..?
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ గద్దెల వరుస క్రమంలో గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను పునర్నిర్మిస్తున్నారు. నూతన గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై ఈనెల 4వ తేదీ(గురువారం)న పూజారులు ధ్వజస్తంభాల పునఃప్రతిష్ఠ పూజా కార్యక్రమాలను నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. గత నెల 28న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, ధనసరి సీతక్కలు గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులను పరిశీలించి రెండు గద్దెలపై రాతి పిలర్ల ఏర్పాటు పనులన్నీ ఈనెల 3 వతేదీ కల్లా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కానీ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై స్టోన్స్ ఏర్పాట్ల పనులు ఇంకా పూర్తి కాలేదు. మంత్రుల ఆదేశాల మేరకు బుధవారం నాటికల్లా పూర్తయ్యేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మిగిలింది ఒకరోజే.. గోవిందరాజు, పగిడిద్దరాజులను పునర్నిర్మిస్తున్న గద్దెలపై పునఃప్రతిష్ఠ పూజా కార్యక్రమాలకు ఒక రోజు మాత్రమే మిగిలింది. రెండు గద్దెల చుట్టూ రెండు వరుసల స్టోన్స్ ఏర్పాటు చేశారు. ఆదివాసీ సంస్కృతీసంప్రదాయాలతో లిఖించిన రాతి పిల్లర్‌ను మంగళవారం పగిడిద్దరాజు గద్దైపె ఏర్పాటు చేయడం కనిపించింది. రెండు గద్దెల చుట్టూ రాతి పిలర్ల ఏర్పాటుతోపాటు డిజైన్‌కు సంబంధించిన స్టోన్స్‌లను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ పనులన్నీ బుధవారం ఒక రోజులోనే పూర్తి చేస్తారా అన్న అనుమానాలు పూజారులు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పరిశీలించినా పనులు అంతంతే.. ప్రతిరోజూ జిల్లాస్థాయి ఉన్నతాధికారి మేడారం జాతర అభివృద్ధి పనులను పరిశీలిస్తూ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నా పనుల్లో ఆశించిన పురోగతి కనిపించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. పనుల పురోగతి విషయంలో కాంట్రాక్టర్లు, సంబంధిత అధికారుల పనితీరులో మార్పు రావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల పునర్నిర్మాణం పనులు పూర్తి కాకపోవడంపై ఆర్‌అండ్‌బీశాఖ అధికారులు హైరానా పడుతున్నారు. బుధవారంకల్లా రాతి పిలర్ల పనులు పూర్తి కాకపోతే మంత్రులనుంచి ఎలాంటి మాట వస్తుందోనన్న టెన్షన్ మొదలైనట్లు తెలుస్తోంది. రేపే గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై ధ్వజస్తంభాల పునఃప్రతిష్ఠ ముహూర్తం ఖరారు చేసిన పూజారులు మిగిలింది ఒక రోజే.. గద్దెల పనులు పూర్తయ్యేది అనుమానమే -
అర్ధరాత్రి వరకూ నామినేషన్ల స్వీకరణ
● నేటినుంచి మూడో విడత నామినేషన్లు ● మూడు మండలాల్లో పూర్తయిన ఏర్పాట్లు ● ‘స్టేషన్’లో మొదలు కానున్న సమరంజనగామ: జనగామ నియోజకవర్గంలో రెండో విడత నామినేషన్ల స్వీకరణ మంగళవారంతో ముగియగా... బుధవారం నుంచి పాలకుర్తి నియోజకవర్గంలోని మూడు మండలాల పరిధిలో మూడో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఈనెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు దేవరుప్పుల, కొడకండ్ల, పాలకుర్తి మండలాల పరిధిలోని 25 క్లస్టర్ల పరిధిలోని 91 గ్రామపంచాయతీలు, 800 వార్డుల పరిధిలో నామినేషన్లు స్వీకరించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 5 గంటలకు కేంద్రాల గేట్లను మూసివేస్తారు. ఆ సమయంలో నామినేషన్ కేంద్రంలో ఉన్న అభ్యర్థుల నుంచి మాత్రమే నామినేషన్లు స్వీకరించాలని కలెక్టర్ సూచించారు. నామినేషన్ల స్వీకరణలో ఎన్నికల సంఘం జారీ చేసిన నియమాలకు లోబడి వ్యవహరించాలని, స్వీకరణ, పరిశీలన, అభ్యర్థుల ప్రకటన, గుర్తుల కేటాయింపు ప్రక్రియలో జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ముగిసిన రెండో విడత నామినేషన్లు జనగామ నియోజకవర్గంలో నామినేషన్ల జోరు కొనసాగింది. చివరి రోజు అర్ధరాత్రి 2 గంటల వరకు రాజకీయ పార్టీలు, స్వతంత్రుల నుంచి నామినేషన్ పత్రాలు స్వీకరించారు. బుధవారం నామినేషన్లను పరిశీలించనుండ గా, అదే రోజు చెల్లుబాటు అయ్యే నామినేషన్ల జాబితా ప్రకటిస్తారు. 4వ తేదీ వరకు అప్పీళ్లకు అవకాశం కల్పించగా, 5వ తేదీన వాటిని పరిష్కరిస్తారు. 6వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ, ఆ తర్వాత తుది అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో ఉపసంహరణ మొదటి విడత ఎలక్షన్లు జరిగే స్టేషన్ ఘన్‌పూర్‌లో నామినేషన్ల అప్పీళ్ల పరిష్కారం ముగియగా, బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు అవకాశం ఇవ్వగా, వెంటనే తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించి, గుర్తులను కేటాయిస్తారు. దీంతో పంచాయతీ సమరం మొదలుకానుంది. 11వ తేదీన మొదటి విడుత పోలింగ్ జరుగనుంది. -
పకడ్బందీగా
బుధవారం శ్రీ 3 శ్రీ డిసెంబర్ శ్రీ 2025పంచాయతీ 12మండలాలుజిల్లాలో జీపీలుప్రశాంత గ్రామాలు103సమస్మాత్మక గ్రామాలుజనగామ: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం విస్త్రత భద్రతా ఏర్పాట్లను చేపట్టింది. వరంగల్–హైదరాబాద్ ప్రధాన హైవేలోని బచ్చన్నపేట(పోలీసు శాఖ), పెంబర్తి జంక్షన్(ఎలక్షన్ కమిషన్) ఆదేశాల మేరకు రెండు ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలను కట్టుదిట్టం చేశారు. జిల్లాలో మొత్తం 280 గ్రామపంచాయతీలుండగా, వీటిలో 177 గ్రామాలు సాధారణంగా పరిగణలోకి తీసుకుంటుండగా, 103 గ్రామాలను సమస్యాత్మక జీపీలుగా గుర్తించారు. ఈ గ్రామాల్లో ఎలాంటి అవాం ఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బలగాలు, రిజర్వ్ ఫోర్సు బలగాలు, నిఘా టీంలు నిత్యం నిఘా వేస్తున్నాయి. చెక్‌పోస్టులు, వెబ్‌కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్లు పర్యవేక్షణ ఎన్నికల పారదర్శకతను కాపాడడంలో భాగంగా వెబ్‌కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్లు, స్వతంత్ర అబ్జర్వర్ల పర్యవేక్షణ అమలు కాబోతోంది. గ్రామాల్లో అల్లర్లకు తావివ్వకుండా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామపెద్దలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలను కూడా ఈ కార్యక్రమాలలో భాగస్వాములను చేస్తున్నారు. ఎన్నికల సమయంలో శాంతి భద్రతలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. సున్నితమైన గ్రామాల్లో పోలీసు పహారా, రాత్రి పెట్రోలింగ్ తనిఖీలను మరింత బలోపేతం చేశా రు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో లైసెన్సు కలిగిన వ్యక్తుల వద్ద ఉన్న తుపాకులను ముందస్తు చర్యగా స్వాధీనం చేసుకున్నారు. అలాగే పాత క్రిమినల్ కేసులు ఉన్నవారు, గుడుంబా తయారీ, రవాణాలో నిమగ్నమైన వారు, బెల్ట్‌షాపుల నిర్వాహకులు, కాంప్లికేటెడ్ హిస్టరీ రౌడీషీటర్లు వంటి 120 మందిని తహసీల్దార్ సమక్షంలో బైండోవర్ చేశారు. ఎన్నికల సమయంలో అవాంఛనీయ సంఘటనలు, యంత్రాంగానికి ఎటువంటి ఆటంకం కలిగించకుండా నడుచుకోవాలని పోలీసు శాఖ వారికి కఠిన హెచ్చరికలు జారీ చేసింది. మూడు విడతల్లో.. జిల్లా వ్యాప్తంగా స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ, పాలకుర్తి నియోజకవర్గాల పరిధిలో మూడు విడతల్లో సర్పంచ్ ఎన్నికలు జరుగనున్నాయి. ప్రతీ విడతకు ప్రత్యేక భద్రతా బలగాల కేటాయింపు, సెక్టార్ మొబైల్ పార్టీలు, రూట్ మ్యాపులు సిద్ధం చేశారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ నాయకత్వంలో, డీసీపీ రాజమహేంద్రనాయక్ పర్యవేక్షణలో అన్ని విభాగాలు సమన్వయంతో పని చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామస్థాయి అధికారులు, పోలీసు, జిల్లా ఉన్నతాధికారులు, కలిసి ఎన్నికల రోజు నాటికి ఏ చిన్న ఉద్రిక్తత రాకుండా ముందస్తుగానే శాంతిభద్రతలపై దృష్టి పెడుతున్నారు. జిల్లా అధికారుల సమన్వయంతో చేపట్టిన చర్యలన్నీ గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పి, ప్రజాస్వామ్య ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలనే లక్ష్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. బచ్చన్నపేట, పెంబర్తి చెక్‌పోస్టుల పరిధిలో రాత్రింబవళ్లు పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తూ, అనుమానాస్పద రవాణాపై కఠిన పర్యవేక్షణ అమలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో అక్రమ చలామణి, డబ్బు, మద్యం తరలింపు జరగకుండా ముందస్తుగా చర్యలు చేపట్టారు. జిల్లా స్థాయి మానిటరింగ్ టీం వ్యవస్థల ద్వారా పోలింగ్ కేంద్రాలన్నింటినీ సరైన సమయంలో అధికారులు పరిశీలించనున్నారు. ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే స్పందించే విధంగా యంత్రాంగం సిద్ధంగా ఉండనుంది. ప్రతీ విడత పోలింగ్‌కు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. సెక్టార్ అధికారులకు బాధ్యతలు అ ప్పగించగా, పోలింగ్ కేంద్రాల వారీగా రూట్ మ్యాపులు సిద్ధం చేశారు. గుర్తించిన సున్నిత కేంద్రాల్లో అదనపు భద్రతా సిబ్బందిని కేటాయించారు. పర్యవేక్షణ చేస్తున్నాం.. పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలీసు యంత్రాంగం అలెర్టుగా ఉంది. ప్రతీ రోజు నామినేషన్ల ప్రక్రియను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నాం. ఎన్నికల రోజున ఏ చిన్న ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మొత్తం యంత్రాంగం ఎప్పటికప్పుడు ఫీల్డ్‌లో ఉండేలా ఏర్పాట్లు చేశాం. 103 సమస్యాత్మకంగా ఉన్నట్లు గుర్తించగా, 120 మందిని బైండోవర్ చేశాం. అలాగే లైసెన్స్ కలిగిన గన్స్‌ను డిపాజిట్ చేసుకున్నాం. – రాజమహేంద్ర నాయక్, డీసీపీ, వెస్ట్‌జోన్ ఎన్నికల వేళ పోలీస్ శాఖ అప్రమత్తం చెక్‌పోస్టులు, వెబ్‌కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్లు పర్యవేక్షణ 103 గ్రామాల్లో ప్రత్యేక నిఘా 120 మంది బైండోవర్... గన్స్ డిపాజిట్ మూడు విడతల్లో ఎలక్షన్లు.. యంత్రాంగం సర్వం సిద్ధం120 -
రాష్ట్రస్థాయి సైన్స్‌ఫెయిర్‌కు శివునిపల్లి విద్యార్థి
స్టేషన్‌ఘన్‌పూర్: ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లి జెడ్పీఎస్‌ఎస్‌కు చెందిన విద్యార్థి ఆజ్మీరా జగన్ రాష్ట్రస్థాయి సైన్స్‌ఫెయిర్ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల హెచ్ఎం కె.రమేశ్ తెలిపారు. ఈ మేరకు రాష్ట్రస్థాయి సైన్స్‌ఫెయిర్‌కు ఎంపికై న విద్యార్థిని మంగళవారం హెచ్ఎం, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇటీవల జిల్లా కేంద్రంలో జరిగిన సైన్స్‌ఫెయిర్‌లో సైన్స్ గైడ్ టీచర్లు ఎం.యాదగిరి, టి.శ్రీనాధ్ పర్యవేక్షణలో విద్యార్ధి ఆజ్మీరా జగన్ ఆటోమేటిక్ కారు పార్కింగ్ ఎగ్జిబిట్‌తో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ హెచ్ఎం కె.ప్రవీన్‌కుమార్, ఉపాధ్యాయులు శ్రీనికాంత్, లక్ష్మీప్రసాద్, వసంతకుమారి, కృష్ణవేణి, ఫకీర్దాస్, రవి తదితరులు పాల్గొన్నారు. -
బెల్ట్ జోరు!
మంగళవారం శ్రీ 2 శ్రీ డిసెంబర్ శ్రీ 2025గ్రామాల్లో ఎన్నికల వేళ మద్యం జోరు● రాత్రికి రాత్రే రవాణా ● 3వేల దుకాణాల్లో పెరిగిన వ్యాపారం..! ● పశువుల కొట్టాలు, వ్యవసాయ క్షేత్రాల్లో డంప్ ● జిల్లాలో ‘ఫుల్’ జోష్జనగామ: జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ఊపందుకుంటున్న వేళ మద్యం అమ్మకాలు ఊహించని విధంగా పెరిగింది. నామినేషన్ల ఊపు కొనసాగుతున్న సమయంలో మద్యం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ప్రచారంలో తమవైపు తిప్పుకునేందుకునే ప్రయత్నాల్లో రాత్రికి రాత్రే శివారు దారుల మీదుగా లక్షల రూపాయల మద్యాన్ని దాటించేస్తున్నారు. గ్రామాల్లో రాజకీయ వేడి పెరిగేకొద్ది మద్యం వినియోగం కూడా అదేస్థాయిలో పెరుగుతోందనే ఆరోపణలు లేకపోలేదు. ఓవైపు నామినేషన్లు.. మరోవైపు అమ్మకాలు జిల్లాలో మూడు విడతల్లో సర్పంచ్ ఎలక్షన్లు జరుగనున్నాయి. మొదటి విడతలో స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలో నామినేషన్ల స్వీకరణ ముగియగా, జనగామ నియోజకవర్గంలో ప్రారంభమైంది. మూడో విడతలో పాలకుర్తిలో ప్రారంభం కావాల్సి ఉంది. ఎలక్షన్ నేపధ్యంలో మద్యం, డబ్బుల తరలింపుపై ఎలక్షన్ విభాగం గట్టి నిఘా వేసింది. ఒత్తిడితో పాటు ఎన్నికల సమయంలో మద్యం కొరత ఉండకూడదనే ఉద్దేశ్యంతో బెల్ట్ దుకాణాల వ్యాపారులు అర్ధరాత్రి సమయంలో మద్యం తరలించి రహస్య ప్రాంతాల్లో నిల్వ చేస్తున్నారు. ప్రతీ గ్రామంలో మద్యం ప్రవాహం పెరగడంతో ఎన్నికల నైతికతపై ప్రజల్లో సందేహాలు మొదలయ్యాయి. పెరుగనున్న మద్యం వ్యాపారం జిల్లాలో 280 గ్రామపంచాయతీలు, దాదాపు 300 పైగా శివారు గ్రామాల పరిధిలో 3వేల వరకు బెల్ట్ షాపులు నడుస్తున్నాయని అంచనా. బెల్ట్ దుకాణాల్లో రూ.10 వేల నుంచి రూ.ఒక లక్ష వరకు రోజు వ్యాపారం జరుగుతుందని లెక్కలు వేసుకుంటున్నారు. కాని స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఈ వ్యాపారం రెట్టింపుగా దూసుకువెళ్తోంది. పలువురు ఓటర్లను ఆకర్షించడంలో నగదు, గిఫ్ట్‌లతో పాటు మద్యం కీలక పాత్ర పోషిస్తుంది. రోజువారీగా ఒక్కో బెల్ట్ దుకాణం నిర్వాహకుల కొనుగోలు కంటే అదనపు ఖరీదు చేస్తున్నారు. ఇందులో ఎక్కువగా క్వార్టర్, ఆఫ్ బాటిల్స్లే ఉంటున్నాయి. వ్యవసాయ క్షేత్రాలు..పశువుల కొట్టాలు.. ఎలక్షన్‌కు రెండు రోజుల ముందు భారీగా మద్యం బాటిల్స్ అవసరమున్న నేపధ్యంలో వ్యవసాయ క్షేత్రాలు, పశువుల కొట్టాలు, శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, అనుమానం రాని వ్యక్తుల నివాస ప్రాంతాల్లో అదనపు మద్యం స్టాక్‌ను డంప్ చేసినట్లు గ్రామాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎలక్షన్ సమయంలో ప్రతీ చిన్న సమావేశంలో మద్యం విందులు ప్రధానంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మద్దతు దారులు చేజారి పోకుండా అభ్యర్థులు తమ శక్తినంతా ధార పోసి విందులతో మచ్చిక చేసుకుంటారు. ఎ న్నికల సమయంలో మూతబడాల్సిన బెల్ట్ షాపులు మేము లేనిదే ఎన్నికలు ఎలా జరుగుతాయనే దర్జాగా వెలగబెడుతున్నాయి. బెల్ట్ దుకాణాల నిర్వహణపై ఎక్కడా ఆంక్షలు కనిపించడం లేదని అనేక గ్రామాల ప్రజలు బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు. బార్డర్లో చెక్ పోస్టులు, పోలీసుల తనిఖీలు ఉన్నప్పటికీ, వారి కళ్లు గప్పి బెల్ట్ నిర్వాహకులు మద్యాన్ని గ్రామాలకు తరలించేస్తున్నారు. గ్రామాల్లో ‘ఫుల్ జోష్’లో నడుస్తున్న మద్యం రాజకీయాలు పంచాయతీ ఎన్నికలకు కొత్త రంగు పులముతుండగా, ఖర్చులో సైతం రెండవ అతి పెద్దదిగా నిలుస్తోంది. -
మహాజాతర మరో 56 రోజులే!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరకు వేళవుతోంది. రెండేళ్లకోసారి ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారంలో జరిగే సమ్మక్క–సారలమ్మ జాతరకు కోటి మందికిపైగా భక్తులు తరలివస్తారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కుంభమేళాను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని తలపెట్టింది. ఇందుకోసం సుమారు రూ.150 కోట్లు కేటాయించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా సెప్టెంబర్ 23న మేడారంలో సందర్శించి వివరాలు వెల్లడించారు. వంద రోజుల్లో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అయితే.. ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పనులు వేగంగా జరగట్లేదు. ఈనెల నుంచే భక్తజనం.. 2026 జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరిగే మహాజాతరకు మరో 56 రోజుల సమయమే మిగిలి ఉంది. ఈనెల రెండో వారం నుంచే భక్తుల తాకిడి పెరుగుతుంది. ప్రతీ జాతరకు కనీసం నా లుగైదు నెలల ముందు నుంచి నిర్వహణ ఏర్పాట్లు, అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. ఈసారి జాతర కోసం ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖకు రూ.51.30 కోట్లు, రహదారులు, భవనాల శాఖకు రూ.9.95 కోట్లు, నీటిపారుదల శాఖకు రూ.5.90 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖకు రూ.8.57 కోట్లు.. ఇలా సుమారు 21 శాఖల ద్వారా మొత్తం రూ.150 కోట్ల నిధులతో పనులు చేపట్టారు. వంద రోజుల్లోనే పనులు పూర్తి చేయాలని సీఎం ఉన్నతాధికారులకు పదే పదే సూచించారు. ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వారంలో రెండు రోజులు ఈ పనులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇప్పటికీ మేడారంలో మూడు పర్యాయాలు, హైదరాబాద్‌లో రెండుసార్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. జిల్లా మంత్రులు, అధికారులతో సమీక్షించారు. ప్రధానంగా రహదారుల విస్తరణ, సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం, క్యూలైన్లతో సహా పలు ముఖ్యమైన పనులు మాత్రం ఇంకా ముగింపు దశకు చేరుకోలేదు. పనుల వేగవంతానికి ఆదేశం.. జాతర సమీపిస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, తన సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో పాటు ఉన్నతాధికారులతో ఆయన జాతర పనులు, ఏర్పాట్లపై ఆరా తీశారు. కొన్ని ప్రధాన పనుల ఆలస్యంపై అధికారులపై సీరియస్ అయినట్లు తెలిసింది. కాగా, మేడారంలో పురోగతిలో ఉన్న పనులపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘గద్దెల దగ్గరలో ఉన్న చెట్లను తొలగించవద్దు. నాణ్యతలో ఏమాత్రం రాజీ పడొద్దు. నిర్మాణంలో విమర్శలకు తావివ్వొద్దు. గద్దెల సమీపంలో నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలి’ అని సీఎం అధికారులకు సూచించారు. గద్దెల దగ్గర నాలుగు వైపులా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసి, గ్రాండ్ లుక్ వచ్చేలా లైటింగ్ ఏర్పాటు చేయాలని, గుడి చుట్టూ పచ్చదనం పెంపొందించాలని ఆదేశించారు. భక్తుల రద్దీ పెరగనున్నందున ఆలస్యం చేయకుండా పనులు పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించినట్లు తెలిసింది. ఈమేరకు ఇప్పటికై నా పనుల్లో వేగం పెరుగుతుందన్న చర్చ అన్ని వర్గాల్లో జరుగుతోంది. నెల రోజుల ముందు నుంచే భక్తుల తాకిడి సుమారు రూ.150 కోట్లతో కొసాగుతున్న పనులు సెప్టెంబర్ 23న సీఎం సందర్శన.. వంద రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశం హైదరాబాద్‌లో అత్యవసర సమీక్ష.. పనుల తీరుపై సీఎం సీరియస్ -
భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవాలి
టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి హన్మకొండ: విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించి భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ కర్నాటి వరుణ్‌రెడ్డి అన్నారు. హనుమకొండ న్యూశాయంపేటలోని శ్రీవ్యాస ఆవాసంలో సులక్ష్య సేవా సమితి బాధ్యులు పేద గిరిజన విద్యార్థులకు సోమవారం యూనిఫాం పంపిణీ చేశారు. సీఎండీ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు స్కూల్ యూనిఫాం అందించి మాట్లాడారు. విద్యార్థులు పట్టుదలతో చదువుకుని మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు. తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని కోరారు. సులక్ష్య సేవా సమితి అధ్యక్షుడు మండువ సంతోష్, ప్రముఖ ఫిజిషియన్ డాక్టర్ శివసుబ్రహ్మణ్యం, శ్రీవ్యాస ఆవాసం అధ్యక్షురాలు వసుంధర, కార్యదర్శి శ్రీనివాస్, డీఈ జి.సాంబరెడ్డి, ఎమ్మార్టీ, విజిలెన్స్ డీఈ అనిల్‌కుమార్ పాల్గొన్నారు. -
హెచ్ఐవీపై అపోహలు తొలగించాలి
● జిల్లా వైద్యాధికారి మల్లికార్జున్‌రావు జనగామ రూరల్: హెచ్ఐవీపై అపోహలు తొలగించాలని జిల్లా వైద్యాధికారి మల్లికార్జున్‌రావు అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం వైద్య శాఖ ఆధ్వర్యంలో బస్టాండ్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం 2002 నుంచి అనేక అవగాహన కార్యక్రమాలు, చికిత్స సదుపాయాలను అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 3,210 మంది ఎయిడ్స్ బాధితులుగా నమోదు కాగా అందులో 2,690 మంది మందులు తీసుకుంటూ ఆరోగ్యం మెరుగు పరుచుకుంటున్నారన్నారు. జిల్లాలో మూడు సంవత్సరాల్లో 46,000 టెస్టులు చేసి 35 మంది పాజిటివ్ గుర్తించామన్నారు. గర్భిణులకు టెస్టులు నిర్వహిస్తూ.. స్టాఫ్ నర్సులు, వైద్యులు ప్రజలకు సకాలంలో చికిత్స అందిస్తున్నారన్నారు. వ్యాధిపై అవగాహన పెంచుకోవాలని, భయపడకుండా సమీప ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు చేయించుకుని చికి త్స పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
రెండో రోజు అదే జోరు
జనగామ: జనగామ నియోజకవర్గంలోని జనగామ, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల మండలాల పరిధిలోని 79 గ్రామ పంచాయతీలు, 710 వార్డుల పరిధిలో సోమవారం రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగింది. నేటి (మంగళవారం)తో నామినేషన్ల స్వీకరణ ముగియనుంది. నాలుగు మండలాల పరిధిలో 19 క్లస్టర్లను ఏర్పాటు చేసి నామినేషన్లను స్వీకరిస్తున్నారు. రెండవ రోజు సర్పంచ్ అభ్యర్థులకు 157, వార్డు సభ్యులకు 396 నామినేషన్లు రాగా, రెండు రోజులకు కలుపుకుని సర్పంచ్ కోసం 214, వార్డులకు 464 వచ్చాయి. ఆయా మండలాల పరిధిలో నామినేషన్ సెంటర్లను కలెక్టర్ రిజ్వాన్ బాషా, ఎలక్షన్ జనరల్ అబ్జర్వర్ రవి కిరణ్, డీసీపీ రాజమహేంద్రనాయక్ సందర్శించారు. ఇదిలా ఉండగా మొదటి విడతకు సంబంధించి స్టేషన్‌ఘన్‌పూర్ మండలం నమిలిగొండ 6వ వార్డుపై ఒక అప్పీల్ కాగా, అధికారులు పరిశీలన చేస్తున్నారు. రఘునాథపల్లి మండలం ఇబ్రహీంపూర్ అధికార పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిపై అప్పీల్‌కు వెళ్లారు. రేపటి నుంచి మూడో విడత నామినేషన్లు షురూ.. ఈ నెల 3వ తేదీ (బుధవారం) నుంచి పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల్లో మూడో విడత పంచాయతీ ఎలక్షన్ల నామినేషన్లు షురూ కానున్నాయి. ఇందుకు సంబంధించి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. నియోజకవర్గ పరిధిలో 91 జీపీలు, 800 వార్డుల పరిధిలో నామినేషన్ల స్వీరకరణకు 25 క్లస్టర్లను అధికారులు ఏర్పాటు చేశారు.జనగామ నియోజకవర్గంలో రెండవ రోజు నామినేషన్లు అర్ధరాత్రి వరకు కొనసాగిన రెండో విడత నామినేషన్ల పర్వం రెండు రోజుల్లో సర్పంచ్ 214, వార్డులకు 464 నామినేషన్లు నేటితో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ రేపటి నుంచి పాలకుర్తి నియోజకవర్గంలో ప్రారంభం మండలం జీపీ సర్పంచ్ మొత్తం వార్డులు నామినేషన్లు మొత్తం జనగామ 21 39 51 198 106 119 నర్మెట 17 37 40 148 49 51 తరిగొప్పుల 15 32 40 126 86 104 బచ్చన్నపేట 26 49 83 238 155 190 మొత్తం 79 157 214 710 396 464 -
భగవద్గీతను అందరూ చదవాలి
హన్మకొండ కల్చరల్: శ్రీకృష్ణభగవానుడు ఉపదేశించిన భగవద్గీత అందరు చదవాలని తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మప్రచార పరిషత్ వరంగల్ అధ్వర్యంలో సోమవారం హనుమకొండలోని టీటీడీ కల్యాణమండపంలో గీతాజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రోగ్రాం ఇన్చార్జ్ రామిరెడ్డి కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా గంగు ఉపేంద్రశర్మ, అతిథులుగా ఆర్యవైశ్య సంఘం నాయకులు గట్టు మహేశ్‌బాబు, వికాస తరంగిణి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బచ్చు రాధాకృష్ణ హాజరై జ్యోతిప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు భగవద్గీత శ్లోకాల కంఠస్థపోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. న్యాయనిర్ణేతలుగా తెన్నేటి వసుంధర, వలస పైడి, మచ్చమ్మ, దయాకర్స్వామి, వేదాంతం శ్రీదేవి, దుర్గ వ్యవహరించారు. కార్యక్రమంలో టీటీడీ మండపం ఇన్చార్జ్ రఘువీర్, వికాస తరంగిణి ఉపాధ్యక్షులు దయాకర్‌రెడ్డి, కామిశెట్టి రాజు, బన్న శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
కార్యకర్తలకు అండగా ఉంటాం..
● ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాలకుర్తి: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. సోమవారం పాలకుర్తి మండలం ఈరవెన్ను గ్రామంలో బీఆర్ఎస్, సీపీఎం పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన కార్యకర్తలకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్న వారికి అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి, మల్లారెడ్డి, రాఘవరావు, సోమేశ్వర్, మహేందర్ రెడ్డి, శ్రీనివాస్, కుమారస్వామి, రమేష్, రాజశేఖర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా నామినేషన్లు వేయాలి
● డీసీపీ రాజమహేంద్రనాయక్ బచ్చన్నపేట: స్థానిక ఎన్నికల నామినేషన్లను ప్రశాంతంగా వేయాలని, క్లస్టర్ కేంద్రాల వద్ద ప్రజలు గుమికూడరాదని డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. సోమవారం మండల కేంద్రంతో పాటు పోచన్నపేట, కొడవటూర్ గ్రామాల్లోని నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ నామినేషన్ వేసే అభ్యర్థితో మరో ముగ్గురిని మాత్రమే అనుమతించాలని, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నామినేషన్లను తొందరగా స్వీకరించి బయటకు పంపించాలన్నారు. ఈ కార్యక్రమంలో నర్మెట సీఐ అబ్బయ్య, ఎస్సై ఎస్కే అబ్దుల్ హమీద్, కానిస్టేబుళ్లు పలువురు పాల్గొన్నారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగాలి బచ్చన్నపేట: స్థానిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగాలని ఎన్నికల జిల్లా జనరల్ అబ్జర్వర్ రవికిరణ్ అన్నారు. సోమవారం జిల్లా ఎన్నికల అధికారి రిజ్వాన్ బాషాతో కలిసి బచ్చన్నపేట, పోచన్నపేట, గ్రామ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఇంతవరకు వచ్చిన నామినేషన్ వివరాలు, టీ పోల్ ఎంట్రీ ప్రక్రియ, ఎన్నికల విధులకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు పూర్తి అయ్యాయా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామానుజాచారి, ఎంపీడీఓ మమతాబాయ్, ఎస్సై అబ్దుల్ హమీద్, ఆర్ఐలు వంశీ కృష్ణ, మునవర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. ‘బాండ్’ ప్రచారం రఘునాథపల్లి: అవకాశం ఇచ్చి చూడండి.. కుల సంఘాలకు కమ్యూనిటీ హాల్, ఇతర పనులు చేసి పెడతామంటూ సర్పంచ్ అభ్యర్థి వినూత్న రీతిలో ప్రచారానికి తెరలేపారు. సోమవారం మండలంలోని ఇబ్రహీంపూర్లో గౌడ కుల సంఘం వారు చిట్టీ నిర్వహిస్తుండగా అదే గ్రామానికి చెందిన బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి దొరగొల్ల రవి ఆ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఉడుత రంజిత్‌తో కులస్తులను కలిసి ఓటు వేయాలని అభ్యర్థించారు. సర్పంచ్‌గా గెలిపించిన రెండు నెలల్లో సొంత డబ్బులతో గౌడ సంఘం భవనం నిర్మించి ఇస్తానని ఏకంగా బాండ్ రాసిఇచ్చి విజ్ఞప్తి చేశారు. ఫతేషాపూర్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు అక్కనపల్లి సుజాత, అక్కనపల్లి మాధవి వేర్వేరుగా గ్రామంలో చిట్టీ నిర్వహించుకుంటున్న ముదిరాజ్ కులస్తులకు వద్దకు వెళ్లి ఓటు వేయాలని అభ్యర్థించారు. రాష్ట్రస్థాయి సైన్స్‌ఫెయిర్‌కు ఎంపిక జఫర్‌గఢ్: మండలంలోని తిడుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ మేరకు ఇటీవల జనగామ జిల్లాకేంద్రంలో జరిగిన సైన్స్‌ఫెయిర్‌లో పాఠశాలకు చెందిన విద్యార్థులు ఆధునిక ఎద్దుల బండి ఎగ్జిబిట్స్ ప్రదర్శించారు. దీంతో విద్యార్థుల ప్రతిభకను గుర్తించి రాష్ట్ర పోటీలకు ఎంపిక చేశారని హెచ్ఎం సదానందం తెలిపారు. ఈ మేరకు సోమవారం రాష్ట్రస్థాయికి ఎంపికై న విద్యార్థులను హెచ్ఎంతో పాటు ఉపాధ్యాయులు అభినందించారు. ఆధార్ కేంద్రం పరిశీలన జనగామ: జనగామ పట్టణంలోని ప్రభుత్వ ఆధార్ కేంద్రాన్ని మీసేవా గవర్నర్ టి. రవికిరణ్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆధార్ సేవలను పరిశీలించి, సేవల ప్రమాణాలు, ప్రజలకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. కమిషనర్ వెంట ఈడీఎం గౌతమ్‌రెడ్డి, తదితరులు ఉన్నారు. -
హిందూ ధర్మ పరిరక్షకులుగా నిలవాలి
జనగామ: భగవద్గీతను పాఠ్యపుస్తకాల్లో చేర్చడంతో పాటు విద్యాశాఖలో ప్రత్యేక సంస్కృత విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆధ్యాత్మిక వేత్త, విశ్వహిందూ పరిషత్ నిర్వాహకులు డాక్టర్ మోహనకృష్ణ భార్గవ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. సోమవారం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం గ్రేయిన్ మార్కెట్ ఆవరణలోని లక్ష్మీనారాయణ దేవాలయంలో భగవత్ గీతా జయంతి, శౌర్య దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో భగవద్గీత పఠనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత హిందూ ధర్మ పరిరక్షకులుగా నిలవాలని, భగవద్గీత సకల వేదసారమన్నారు. భగవద్గీత ప్రతీ ఇంటిలో ఉండాలని, అలంకార ప్రాయం కాకుండా చదివి జీవితాన్ని సన్మార్గంలో నడవాలి సూచించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ప్రతినిధి చిలువేరు హర్షవర్ధన్, కుందారపు బైరునాథ్, శివరామ్, సనత్, ఆలయ కమిటీ సభ్యులు మాడిశెట్టి రవి, వెంకన్న, కై లాసం, ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు. -
రెండో విడత నామినేషన్లు షురూ
జనగామ: జనగామ నియోజకవర్గంలోని జనగామ, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల మండలాల పరిధిలోని 79 గ్రామపంచాయతీలు, 710 వార్డుల పరిధిలో ఆదివారం నుంచి రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 2వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్లకు సంబంధించి నర్మె టలో(4క్లస్టర్లు), జనగామలో (5), తరిగొప్పులలో (5), బచ్చన్నపేటలో (5) మొత్తంగా 19 క్లస్టర్ల వారీగా ఆయా రాజకీయ పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులతో పాటు స్వతంత్రుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. సర్పంచ్ అభ్యర్థులకు 57, వార్డు సభ్యులకు 90 నామినేషన్లు వచ్చాయి. ఇదిలా ఉండగా నేడు, రేపు(మంగళవారం) దశమి, ఏకాదశి కలిసొచ్చిన మంచి రోజులతో నామినేషన్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. స్టేషన్ ఘన్‌పూర్‌లో నామినేషన్ల పరిశీలన, తిరస్కరణ స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో 27వ తేదీ నుంచి 29 సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల పరిశీలన చేసి చెల్లుబాటయ్యే అభ్యర్థుల నామినేషన్ల అర్హత వివరాలను ప్రకటించారు. డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం 5గంటల వరకు అప్పీళ్లకు అవకాశం ఇవ్వగా, 2వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అప్పీళ్ల పరిష్కారానికి అవకాశం కల్పించారు. 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్న్ఉపసంహరణ చేసుకున్న అనంతరం, తుది అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారు. ఒక్క స్టేషన్‌ఘన్‌పూర్‌లో సర్పంచ్‌కు 689 నామినేషన్లు రాగా, ఇందులో వివిధ కారణాల చేత 30 తిరస్కరించడం గమనార్హం. రఘునాథపల్లిలో 320 వార్డులకు 7 చోట్ల నామినేషన్లు దాఖలు కాకపోవడంతో పాటు 39 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. తొలి రోజు సర్పంచ్–57, వార్డులకు 90.. స్టేషన్ ఘన్‌పూర్‌లో చెల్లుబాటు అభ్యర్థుల జాబితా వెల్లడి -
మేడారంలో భక్తుల కోలాహలం
ఎస్‌ఎస్‌తాడ్వాయి : మేడారంలోని వనదేవతల గద్దెల ప్రాంగణం భక్తులతో కోలాహలంగా మారింది. ఆదివారం అమ్మవార్లను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతోపాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు ప్రైవేటు వాహనాల్లో మేడారానికి చేరుకున్నారు. జంపన్నవాగులో స్నానాలు చేసి అమ్మవార్లకు పుట్టువెంట్రుకలు సమర్పించారు. అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీర, సారె, కానుకలు, ఒడిబియ్యం, ఎత్తు బంగారం, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీతో గద్దెల ప్రాంగణం సందడిగా మారింది. సంతానం కలగాలని అమ్మవార్లకు మహిళలు ముడుపులు కట్టారు. మొక్కుల అనంతరం భక్తులు మేడారం పరిసరాల్లో వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. -
నేటి ప్రజావాణి రద్దు
జనగామ రూరల్: పంచాయతీ ఎన్నికల సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని సూచించారు. నామినేషన్ కేంద్రాల పరిశీలనతరిగొప్పుల: రెండో విడత సర్పంచ్ నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఏసీపీ పండరి చేతన్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ ప్రక్రియ ఎలా జరుగుతుందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు సీఐ అబ్బయ్య, ఎస్సై గుగులోతు శ్రీదేవి ఉన్నారు. ఆ ఊరి ఓట్ల కంటే వార్డు ఓట్లే ఎక్కువ!లింగాలఘణపురం: మండలంలోని ఏనెబావి గ్రామ పంచాయతీ ఓట్లు మండలంలోని ఓ పెద్ద గ్రామ పంచాయతీలోని ఒక్క వార్డు ఓట్ల కంటే తక్కువగానే ఉన్నాయి. ఏనెబావి గ్రామ పంచాయతీ శివారు గ్రామమైన పిట్టలోనిగూడెం ఓట్లు కలుపుకొని మొత్తం 285 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఇందులో 134 పురుషులు, 151 మహిళల ఓట్లు ఉండగా మండలంలోనే పెద్ద గ్రామ పంచాయతీ అయిన నెల్లుట్లలో 4,885 ఓట్లు ఉండగా ఒక్క మూడో వార్డులో 356 ఓట్లు ఉన్నాయి. అంటే ఏనెబావి గ్రామ పంచాయతీలోని మొత్తం ఓట్లతో పోల్చి తే నెల్లుట్లలోని ఒక్క వార్డులో ఉన్న ఓట్లు కూడా లేవు. అందులో మరో విశేషం ఏమిటంటే ఒక్క బీసీ ఓటరు లేని 1,2,3 వార్డులు బీసీలకు రిజ ర్వేషన్ కావడం, ఒక్క ఎస్టీ ఓటరులేని 4,5,6 వార్డులు ఎస్టీకి రిజర్వేషన్ కావడం జరిగింది. ఇందులో 1,2,3 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. గతంలో సర్పంచ్ ఎస్టీ కావడంతో ఏకగ్రీవమైంది. ప్రస్తుతం బీసీ మహిళ కావడంతో ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఒకవేళ ఓటింగ్ జరిగితే 285 ఓట్లలో ఎక్కువ ఎవరికి వస్తే వారే సర్పంచ్‌గా గెలిచే అవకాశం ఉంది. హేమాచలానికి పోటెత్తిన భక్తులు మంగపేట : మండలంలోని మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి వారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆదివారం సెలవు రోజు కావడంతో రాష్ట్రంలోని వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం తదితర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి తదితర సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి సందడి చేశారు. -
ఆయిల్‌పామ్‌తో నిరంతర ఆదాయం
జనగామ రూరల్: దేశంలో వంట నూనెల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఆయిల్‌పామ్ సాగుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకుగాను రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తోంది. మొక్కల అందజేత నుంచి డ్రిప్పు పరికరాలు, అంతర పంటల సాగు, తదితర వాటికి ప్రభుత్వం ప్రోత్సాహకాలనిస్తోంది. దిగుమతి సుంకాన్ని 5.5శాతం నుంచి 27.5శాతానికి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో ఆయిల్‌పామ్ ధర టన్నుకు రూ.16,500 పెరిగే అవకాశమున్నందున రైతుకు మంచి ధర పలికి మేలు జరుగనుంది. 2021 నుంచి ఇప్పటివరకు జిల్లాలో 7,457 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలను నాటడంతో రాష్ట్రంలోనే 5వ స్థానంలో నిలిచిందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. లాభసాటిగా ఆయిల్‌పామ్ రైతులకు అధిక ధరలను అందించి, రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగును లాభసాటిగా చేయాలని కొత్త రైతులను ప్రోత్సహించేందుకు మంచి రేటు అందిస్తున్నారు. భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశం ఉంది. అయిల్‌పామ్ సాగుపై కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి సాగు రకాలుపెంచేలా కృషి చేస్తున్నారు. నికర ఆదాయానికి అవకాశం ఈ పంట సాగుతో 4–30 ఏళ్ల వరకు నిరంతర ఆదాయం పొందవచ్చు. చీడపీడల బెడద ఉండదు. వేరుశనగ, పెసర, మినుము, నువ్వులు, పొద్దుతిరుగుడు, తదితర అంతర పంటల ద్వారా ఆదాయం పొందవచ్చు. బ్యాంకుల ద్వారా రుణ సాయం అందుతుంది. జిల్లాలో ఈ ఏడాది సుమారు 792 ఎకరాలకు డ్రిప్ పరికరాలకు పరిపాలన అనుమతులు ఇచ్చారు. ఈ వార్షిక ప్రణాళికలో భాగంగా 216 ఎకరాల్లో రైతులు మొక్కలను నాటారు. పంట సాగులో జిల్లాది 5వ స్థానం రాయితీలతో సాగును ప్రోత్సహిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా వ్యాప్తంగా 7,457 ఎకరాల్లో సాగు -
ఎన్నికల నియమావళిని పాటించాలి
నర్మెట: ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను తప్పకుండా పాటించాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్ తెలిపారు. మండలకేంద్రం పంచాయతీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన నామినేషన్ పత్రాల స్వీకరణ కేంద్రాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. ఎన్నికలకు అంతరాయాలు కల్పిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఆయన వెంట ఎస్సై నైనాల నగేష్, ఎంపీడీఓ కావ్య శ్రీనివాసన్, ఎంపీఓ వెంకట మల్లికార్జున్, కార్యదర్శులు పాల్గొన్నారు. జనగామ మండలంలో.. జనగామ రూరల్: జనగామ మండలంలోని ఐదు క్లస్టర్లలో సర్పంచులు, వార్డు మెంబర్లకు గాను నా మినేషన్ల ప్రక్రియ ఆదివారం ప్రారంభం అయింది. వడ్లకొండ క్లస్టర్‌ను డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఎంపీడీవో బి. మహేశ్, తహసీల్దార్ హుస్సెన్, ఎంపీఓ సంపత్‌కుమార్, ఎస్ఐ భరత్ పరిశీలించారు.49 వార్డులు ఏకగ్రీవంజఫర్గఢ్: మండలంలోని వివిధ గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన, తిరస్కరణ చేపట్టారు. మండలంలో సర్పంచ్ స్థానాలకు 189 నామినేషన్లు వేయగా ఏ ఒక్కటీ కూడా తిరస్కరణకు గురికాలేదు. వార్డు స్థానానికి వచ్చిన 471 నామినేషన్లకు గాను 5 తిరస్కరణకు గురయ్యాయి. కాగా ఆయా గ్రామాల్లో పలు వార్డు స్థానాలకు అభ్యర్థుల నుంచి ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో 49 వార్డులు ఏకగ్రీవమైనట్లు ఎంపీడీఓ సుమన్ తెలిపారు. ఇందులో అల్వార్బండాతండా గ్రామపంచాయితీ నుంచి 6 గురు వార్డు సభ్యులు ఏకగ్రీవం కాగా లక్ష్మినాయక్తండా నుంచి 7, తీగారం 3, కోనాయిచలం 5, దుర్ాగ్యనాయక్తండా 5, సాగరం 9, తిడుగు 4, ఉప్పుగల్లు 1, హిమ్మత్‌నగర్ 1, తిమ్మాపూర్ 1, షాపల్లి 3, మగ్ధుంతండా నుంచి నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్ -
ఇరుకు చౌరస్తాలో ట్రా‘ఫికర్’
నర్మెట చౌరస్తాలో ట్రాఫిక్ జాం మండలకేంద్రంలోని చౌరస్తా ఎప్పుడూ బిజీబిజీ.. ఏక్షణాన ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి. జనగామ–హుస్నాబాద్–కరీంనగర్‌కు నిత్యం వందలాది వాహనాల రాకపోకలు..ఇరుకై న చౌరస్తా...నలువైపుల నుంచి వాహనాలు...అక్కడే బస్టాప్..మరొక వైపు ప్రయాణికులను చేరవేసే ఆటోలు, జీపులు.. వేగంగా వెళ్లే వాహనాలు.. ఇలా ఎప్పుడూ ప్రమాదభరితమే. దీనికితోడు చౌరస్తా నుంచే తిరిగి హన్మకొండ, హైదరాబాద్ (పికెట్) వెళ్లే బస్సులు. రోడ్డు పక్కనే ద్విచక్రవాహనాల పార్కింగ్లు. స్థలం ఇరుకుగా ఉండడం, పార్కింగ్‌కు అనువైన స్థలం లేకపోవడం, వాహనదారులు నిబంధనలు పాటించక పోవడంతో నర్మెట చౌరస్తా ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. – నర్మెట -
అన్నదాతలకు ‘దిత్వా’ భయం
దిత్వా తుపాను కారణంగా వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రాగా కారుమబ్బులు కమ్ముకొస్తున్నాయి. దాంతో రైతులు కల్లాల వద్ద, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులుగా పోసి తుపాను ఎఫెక్ట్‌తో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు రావడం, తీవ్రంగా చలి నెలకొనడంతో పాటు కారుమబ్బులు వస్తుండగా అన్నదాతలు గుబులు చెందుతున్నారు. దీంతో కల్లాల్లో, ఐకేపీ సెంటర్లలో ఆరబోసిన ధాన్యంపై రైతులు ముందస్తు జాగ్రత్తగా పరదాలు కప్పుకుంటున్నారు. – స్టేషన్‌ఘన్‌పూర్ -
ఎడమొహం..పెడమొహం
పల్లెల్లో వర్గం ఏదైనా ప్రేమ, ఆప్యాయత పలకరింపులకు ఎక్కడా మాట రానివ్వరు. కానీ ఎలక్షన్ల నేపథ్యంలో గత రెండు, మూడు రోజులుగా పరిస్థితి భిన్నంగా మారిపోయింది. ఊరిలో కలిసి తిరిగే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రెండు కూటములుగా చీలిపోయి, గెలుపు ఎవరిదో చూద్దాం అనే ఎమోషన్లో బరిలోకి దిగుతున్నారు. ఇన్నాళ్లూ ఆప్యాయంగా పిలుచుకున్న వారు ఇప్పుడు ఒకరిని ఒకరు ఓరకంట చూపుతో చూసుకుంటూ రాజకీయ వేడిని పెంచేస్తున్నారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో నామినేషన్ల పరిశీలన పూర్తయ్యే సరికి, జనగామలో రెండో విడత మొదలైంది. జిల్లాలో అనేక ప్రాంతాల్లో స్వతంత్రులు, పార్టీ అభ్యర్థులు, తిరుగుబాటు నేతల హడావిడి పార్టీ అధినాయకత్వానికి చెమటలు పట్టిస్తున్నాయి. ఒకవైపు బుజ్జగింపులు, మరోవైపు అధికారిక అభ్యర్థుల ప్రకటన జిల్లా రాజకీయాల్లో సరికొత్త ఊపును తీసుకొస్తోంది. నామినేషన్ల ఉపసంహరణ నాటికి ఎవరిని బుజ్జగిస్తారు, ఎవరు బరిలో నిలుస్తారు అనే చర్చ వినిపిస్తోంది. ఈ ఎన్నికలు మాత్రం పల్లె రాజకీయాల్లో కొత్త రణరంగానికి నాంది పలుకుతున్నాయి. జనగామ: ‘అన్న, తమ్ముడు, బాబాయి, మామా, అల్లుడు..’ వరుసలు పెట్టుకుని ఆప్యాయంగా పిలుచుకునే నాయకులు ఇప్పుడు ఎడమొహం..పెడమొహంగా మారిపోయారు. పల్లె రాజకీయాల్లో సర్పంచ్ ఎన్నికలు మంటపుట్టిస్తున్నాయి. బుజ్జగింపుల పర్వం పీక్ స్టేజీకి చేరకోగా..వెనక్కి తగ్గేదేలేదంటూ ఆశావహులు కరాఖండీగా తేల్చిచెబుతున్నారు. ‘అన్నా ఒక్కసారి నామినేషన్ తిరిగి తీసుకోరాదే.. ఈసారి నాకు అవకాశం వచ్చింది.. మరోసారి మీకు అండగా నిలబడతాం..’ అంటూ చాలాచోట్ల వేడుకోళ్లు.. బతిమిలాటలు కనిపిస్తున్నాయి. మాట వినే ప్రసక్తే లేదు...బరిలో నిలవాల్సిందే అంటూ పోటీకి కాలుదువ్వుతున్నారు. పార్టీ శ్రేణులు, రెండోస్థాయి నేతలు రంగంలోకి దిగినప్పటికీ ఫలితం కనిపించడం లేదు. దీంతో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గాల పరిధి లోని ప్రధాన రాజకీయ పార్టీలు 90 శాతం అభ్యర్థుల జాబితాను ప్రకటించి, డబుల్ పోటీ ఉన్న పంచాయతీలను మాత్రం పెండింగ్‌లో ఉంచారు. రంగంలోకి ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు పంచాయతీ ఎన్నికల్లో పార్టీల జెండా ఎగురవేయాలని ఎవరికివారే ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు రంగంలోకి దిగి పార్టీలో మంచి గుర్తింపు ఇస్తాం, నామినేటెడ్ పోస్టుల్లో ప్రయార్టీ ఉంటుందని ఒకరి తర్వాత ఒకరిని సముదాయిస్తున్నారు. కానీ కొంతమంది ఆశావాహులు మాత్రం గెలుస్తామనే బలమైన నమ్మకంతో బరిలోనే ఉంటామనే సంకేతాలు ఇస్తుండడంతో నేతలు తలలు పట్టుకుంటున్నారు. యువ ఓటర్లే కీలకం పంచాయతీ ఎన్నికల్లో యువఓటర్లదే కీలకం కానుంది. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఇప్పటికే చాలా చోట్ల యువకెరటాలకు సంబంధించి సర్పంచ్, వార్డుసభ్యులు ఏకగ్రీవం కాగా, ఓట్ల సమయంలో సైతం వీరి పాత్ర ప్రధానంగా ఉంటుందని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. అనేక గ్రామాల్లో యువత గ్రూపులుగా ఏర్పాటై, తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకు ప్రజలను మోటివేట్ చేస్తున్నారు. యువతను తట్టుకునేందుకు రాజకీయ అనుభవంతో సీనియర్లు తమదైన శైలిలో ఓటర్లను ఆకర్షించే విధంగా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఇదిలా ఉండగా పల్లెల్లో అధ్వానమైన రోడ్లు, డ్రైనేజీలు, నీటి సమస్య, దోమల స్వైర విహారం ఇలా అనేక సమస్యలపై బరిలో నిలిచేందుకు ఉత్సాహం చూపిస్తున్న ఆశావహులను పట్టుకుని గెలిపిస్తే ఏం చేస్తావంటే ఇప్పుడే నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ పార్టీలకు తలనొప్పిగా పోటీదారులు పల్లె రాజకీయాల్లో మంటపెడుతున్న లోకల్ వార్ బరిలో నిలిచేందుకు బుజ్జగింపుల పర్వం -
లోకల్ ధమాకా!
జనగామ: జిల్లాలో నూతన మద్యం పాలసీ సోమవారం(డిసెంబర్ 1) నుంచి అమలుకానుంది. ప్రస్తుత వైనన్స్్ షాపుల లైసెన్స్ గడువు ముగియగా, ఉదయం 10 గంటల నుంచి కొత్త లైసెన్సులతో దుకాణాలు తెరుచుకోనున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జిల్లాలో నూతన మద్యం పాలసీ ప్రారంభం కావడం వ్యాపారులకు కలిసిరానుంది. ఎన్నికల వేళ గ్రామాల నుంచి పట్టణాల వరకు ప్రజల్లో రద్దీ పెరగడం, రాజకీయ కార్యకలాపాలు ఊపందు కోవడం వైన్స్ షాపుల వద్ద అమ్మకాలు ఒక్కసారిగా తారాస్థాయికి చేరుకునే అవకాశం ఉంది. స్థానికంతో లాభాలు.. నూతన మద్యం షాపుల ప్రారంభంలోనే పంచాయతీ ఎన్నికలు నడుస్తుండడంతో వ్యాపారులకు తొలిరోజు నుంచే లాభాల పంట పండనుంది. ముఖ్యంగా డిసెంబర్ మొదటి వారం నుంచి గ్రామాల్లో అభ్యర్థుల కదలికలు, సమావేశాలు, ఊరేగింపులు, రాత్రి వేళ చర్చలు పెరగడం మద్యం డిమాండ్‌ను పెంచేస్తుంది. ఎన్నికల సీజన్, కొత్త పాలసీ డబుల్ ఇంపాక్ట్ వల్ల అమ్మకాలలో ఉండే పెరుగుదల అంచనాలకు మించి దాటనుందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. కొందరు వ్యాపారులు ఇప్పటికే స్టాక్‌ను పెంచేసుకోగా, మరికొందరు ప్రీమియం బ్రాండ్ల సరఫరాలను భారీగా ఆర్డర్ చేసినట్టు సమాచారం. వ్యాపారులకు ఎలక్షన్లు అరుదైన గోల్డెన్ ఆఫర్‌గా మారే అవకాశముందని పలువురు నాయకులు అంటున్నారు. సిండికేట్.. చర్చ వైన్స్‌షాపుల కేటాయింపులతో పాటు మండలాల పరిధిలో ‘సిండికేట్’ ప్రభావం కొత్తగా చర్చనీయాంశమైంది. లాభదాయకమైన ప్రాంతాలపై ఒకే గ్రూపు ఆధిపత్యం కోసం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొత్త పాలసీ అమలుతో మారుతున్న వ్యాపార సమీకరణలు, వైన్స్ యజమానుల వ్యూహాలు జిల్లాలో మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. ఇది రాబోయే నెలల్లో రిటైల్ మార్కెట్‌ను ఎలా ప్రభావితం చేస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. కొత్త దుకాణం కలిసొచ్చిన వ్యాపారులు సేల్ కౌంటర్ మేనేజర్లు, టీమ్‌ల నియామకం, ఇంటీరియర్ సెట్అప్, స్టాక్ రిప్లేస్మెంట్, డిజిటల్ మీటర్లు, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి పనులను వేగవంతం చేస్తున్నారు. మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 50 మద్యం దుకాణాలకు గాను 1,697 దరఖాస్తులు జిల్లాలో మద్యం వ్యాపారంపై ఉన్న పోటీని మరోసారి రుజువు చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తుల రూపంలోనే ప్రభుత్వానికి రూ.50 కోట్ల 95 లక్షలు ఆదాయం రావడం గమనార్హం. 2025–27 రెండేళ్ల కాలానికి అక్టోబర్ 28న జిల్లాలోని 50 దుకాణాలకు లాటరీ నిర్వహించగా, అదృష్టం కలిసిన నిర్వాహకులు ఇప్పటికే షాపుల ప్రారంభానికి సన్నద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా గడిచిన రెండేళ్లలో పాతషాపుల్లో రూ.1100కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు వ్యాపార వర్గాలు అంచనా వేయడం గమనార్హం. కొత్త వైన్స్‌కు పంచాయతీ ఎన్నికల గిరాకీ నేటి నుంచి నూతన మద్యం పాలసీ ప్రారంభం లాభాల లెక్కలు–సిండికేట్‌పై చర్చలు జనగామ, స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీల పరిధి లో వైన్స్ షాపుకు అదనంగా రూ.5 లక్షల లైసెన్స్ ఫీజుతో లిక్కర్ మార్ట్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండడంతో పలువురు వ్యాపారులు దీనిపై ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం జనగామ నియోజకవర్గంలో మూడు లిక్కర్ మార్ట్లు ఉండగా, కొత్త పాలసీతో మరిన్ని ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. కస్టమర్లను ఆకట్టుకునే విధంగా లిక్కర్ మార్టుల్లో ధరల్లో మార్పులు, బ్రాండ్ల లభ్యత, సేవల ప్రమాణాల పెంచే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. మరోవైపు అత్యధిక సేల్ కోసం రహస్యంగా ప్రత్యేక ఆఫర్లు, మెరుగైన మౌలిక సదుపాయాలు, అధునాతన డిస్ప్లే ర్యాక్స్ ఏర్పాట్లపై దృష్టి పెడుతున్నారు. -
వసతుల కల్పన.. అభివృద్ధి రూపకల్పన
దామెర: హనుమకొండ జిల్లా దామెర మండలం కోగిల్వాయికి చెందిన గట్ల మల్లారెడ్డి సేవలు ఇప్పటికీ గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు. 1984–90, 1996–2001 రెండు పర్యాయాలు సర్పంచ్‌గా సేవలందించారు. గ్రామంలో ప్రైమరీ, హై స్కూల్ నిర్మించారు. పలు గ్రామాల్లో వాటర్ ట్యాంకులు, పైపులైన్, బస్‌షెల్టర్ నిర్మాణం, అంతర్గత రోడ్లు, వీఽధి దీపాల ఏర్పాటు వంటి ఎన్నో వసతులు కల్పించారు. ఆయన సేవలకు గుర్తుగా గ్రామంలోని కూడలిలో మల్లారెడ్డి ప్రతిమను ప్రతిష్ఠించారు. మల్లారెడ్డి కుమారుడు గట్ల విష్ణువర్ధన్‌రెడ్డి అమెరికా నుంచి వచ్చి 2018 నుంచి 2024 వరకు సర్పంచ్‌గా, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడిగా సేవలందించారు. -
నిస్వార్థ సేవ.. వెలిశాల తోవ
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలం రెడ్యాలకు చెందిన వెలిశాల రాధాకృష్ణ 1975 నుంచి 1995 వరకు నాలుగు పర్యాయాలు సర్పంచ్‌గా పనిచేశారు. అనంతరం 2000 నుంచి 2005వ సంవత్సరం వరకు మళ్లీ ఎన్నికై ప్రజలకు సేవలందించారు. గ్రామ అభివృద్ధికి తనవంతు కృషి చేశారు. భూ సమస్యలు, కుటుంబ తగాదాలను పరిష్కరించారు. మృధుస్వభావిగా ఉంటూ అందరి మన్ననలు పొందారు. నిస్వార్థంగా సేవ చేసిన ఆయన 2006 మార్చిలో మృతిచెందారు. పలు పార్టీల నేతలు, గ్రామస్తుల సహకారంతో 2014 జనవరి 27న రాధాకృష్ణ విగ్రహాన్ని గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేశారు. -
పరిశీలన.. సమీక్ష
● ‘గ్రేటర్’లో రోజంతా బిజీబిజీగా గడిపిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ● వరంగల్ రైల్వే స్టేషన్ పరిశీలన.. క్యాంటిన్లో చాయ్‌పే చర్చ ● శ్రీభద్రకాళి, వేయిస్తంభాల ఆలయంలో పూజలు● కల్యాణమండపం పనుల అలసత్వంపై అసంతృప్తి ● కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ తనిఖీ.. పనులపై ఆరా ● వరంగల్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వెల్లడి – హన్మకొండ/హన్మకొండ కల్చరల్/ఖిలా వరంగల్/కాజీపేట రూరల్ వేయిస్తంభాల ఆలయ కల్యాణ మండపాన్ని పరిశీలిస్తున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, చిత్రంలో బీజేపీ నాయకులు -
కేసీఆర్ దీక్షతోనే ప్రత్యేక రాష్ట్రం
జనగామ: పదేళ్ల పాలనలో తెలంగాణను చక్కదిద్ది అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్‌గా గుర్తింపు తీసుకు వచ్చిన కేసీఆర్‌తోనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రా జయ్యలు అన్నారు. దీక్షాదివస్ పురస్కరించుకుని యశ్వంతాపూర్ బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. 11 రోజుల పాటు చుక్క నీళ్లు కూడా తాగకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అన్నారు. 14 సంవత్సరాల పాటు కేసీఆర్ నాయకత్వంలో జరిగిన ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్య మ పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రమన్నారు. ఆమరణ నిరాహార దీక్ష సమయంలో అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్‌కు అండగా నిలిచారన్నారు. 2014 నుంచి 2023 వరకు కేసీఆర్‌తో కలిసి తిరిగే అదృష్టం తనకు లభించిందని ఎమ్మెల్యే పల్లా అన్నారు. -
అంతా ఏకమయ్యారు..
● జిట్టెగూడెంతండా, రామన్నగూడెం జీపీలు ఏకగ్రీవం స్టేషన్‌ఘన్‌పూర్: రాజకీయ పార్టీలకు అతీతంగా గ్రామ ప్రజలంతా ఏకమై సర్పంచ్, ఉపసర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులందరినీ ఏకగ్రీవం చేసుకున్న సంఘటన స్టేషన్‌ఘన్‌పూర్, రఘునాథపల్లి మండలాల్లో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రస్తుత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల్లోకి వెళ్తే అనవసరంగా డబ్బులు ఖర్చు చేసుకోవాల్సి వస్తుందని గ్రామపెద్దల సహకారంతో ప్రజలంతా ఏకమయ్యారు. రాజకీయ పార్టీలకు అతీతంగా సర్పంచ్‌తో పాటు ఉపసర్పంచ్, వార్డులను ఏకగ్రీవం చేసుకుంటూ తీర్మానం చేశారు. ఈ మేరకు నామినేషన్లకు శనివారం చివరి రోజు కావడంతో ఒక్కొక్కరినే నామినేషన్ వేయించారు. స్టేషన్ ఘన్పూర్ మండలం జిట్టెగూడెంతండా సర్పంచ్ స్థానానికి గాలిగుట్టతండాకు చెందిన బానోతు బాలు, ఉపసర్పంచ్‌గా నునావత్ రజితతో పాటు వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అలాగే రఘునాథపల్లి మండలంలోని రామన్నగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా వాకిటి అలివేలు, ఉపసర్పంచ్‌గా వెంపల్ల భాస్కర్‌తో పాటు వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చెకుముకి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక జనగామ రూరల్: జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్‌లో ధర్మకంచ పాఠశాల విద్యార్థులు మొదటి స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు హెచ్ఎం కనకయ్య తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ పాఠశాలకు చెందిన సంయుక్త, మల్లికార్జున్, అక్షిత అనే విద్యార్థులు ఆంగ్ల మాధ్యమం విభాగంలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. ఈ మేరకు గైడ్ టీచర్ చంద్రశేఖర్‌రావుతో పాటు విద్యార్థులను పాఠశాల చైర్మన్ యాస్మిన్, ఉపాధ్యాయులు అభినందించారు. నామినేషన్ కేంద్రం పరిశీలనచిల్పూరు: మండలంలోని చిన్నపెండ్యాల గ్రామంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ కేంద్రాన్ని శనివారం డీసీపీ రాజమహేందర్‌నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్వోలనతో మాట్లాడారు. ఎన్నికల నిబంధనలు పాటించాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వద్దన్నారు. ఆయన వెంట జనగామ రూరల్ సీఐ ఎడవెళ్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై నవీన్‌కుమార్ తదితరులు ఉన్నారు. హన్మకొండ: భారతీయ జనతా పార్టీ జిల్లాల వారీగా ఇన్‌చార్జ్‌లను నియమించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు ఇంచార్జ్‌ల పేర్లను శనివారం ప్రకటించారు. హనుమకొండ జిల్లాకు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ (భువనగిరి)ను ఇన్చార్జ్గా నియమించారు. వరంగల్‌కు కొండపల్లి శ్రీధర్ రెడ్డి (ఖమ్మం), జయశంకర్ భూపాలపల్లికి దశమంత రెడ్డి (జనగామ), మహబూబాబాద్‌కు డాక్టర్ జరుపులావత్ గోపి (నల్లగొండ), ములుగు జిల్లాకు డాక్టర్ కోరండ్ల నరేష్ (రంగారెడ్డి), జనగామ జిల్లాకు కట్ట సుధాకర్ రెడ్డి (నాగర్ కర్నూల్)ను ఇన్చార్జ్గా నియమించారు. బచ్చన్నపేట: గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని త్వరగా మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ అన్నా రు. శనివారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు, సాదాబైనామా పత్రాలను పరిశీలించారు. కొడవటూర్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రికార్డులు పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల ద్వారా మిల్లులకు పంపించిన ధాన్యానికి త్వరగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రామానుజాచారి, డిప్యూటీ తహసీల్దార్ శంకర్, వీఓఏలు గంగం వాణి, మహేశ్వరి, శ్రీలత, పంచాయతీ కార్యదర్శి రూపాచైతన్య, తదితరులు పాల్గొన్నారు.బాలు, జిట్టెగూడెంతండా అలివేలు, రామన్నగూడెం -
ఊరు వెలగాలని మూడెకరాలు అమ్మేశారు..
దుగ్గొండి: మండలంలోని తిమ్మంపేట గ్రామ సర్పంచ్‌గా విశిష్ట సేవలందించిన సారంపల్లి రాజిరెడ్డి 1970 నుంచి 11 ఏళ్లపాటు సర్పంచ్‌గా పనిచేశారు. ఈసమయంలో ఇంటింటికీ విద్యుత్‌ను తీసుకొచ్చేందుకు తన మూడెకరాల పొలాన్ని అమ్మేశారు. నాలుగు కిలోమీటర్ల దూరంలోని లక్నెపల్లి గ్రామం నుంచి విద్యుత్ లైన్ వేయించారు. గ్రామంలోని ప్రభుత్వ స్థలాన్ని వందలాది మంది పేదల ఇళ్ల కోసం ఇచ్చారు. ఆయన మరణానంతరం 2008లో రాజిరెడ్డి విగ్రహాన్ని గ్రామ పంచాయతీ ఎదుట ప్రధాన రహదారి పక్కన గ్రామస్తులంతా కలిసి ప్రతిష్ఠించారు. ఇప్పటికీ రాజిరెడ్డి పేరు ప్రస్తావన రాగానే కరెంట్ తెచ్చిన మహానుభావుడు అంటూ గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఆయనను గుర్తు చేసుకుంటారు. -
నిస్వార్థ సేవలకు గుర్తింపుగా గ్రామాల్లో సర్పంచ్ల విగ్రహాలు
వారు గ్రామానికి ప్రథమ పౌరులు.. ఏళ్ల క్రితమే సేవ కోసం నడుం కట్టారు. అభివృద్ధిని పల్లెకు పరిచయం చేశారు. తమకున్న పరిధిలో ప్రజలకు సేవ చేశారు. కాలక్రమంలో వారు గతించారు. కానీ, వారి అమూల్యమైన సేవలను ఇప్పటికీ ఆయా గ్రామాల ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. పల్లె సారథుల యాదిలో స్థానికులు కూడళ్లలో ప్రతిమల్ని ఏర్పాటు చేశారు. వారి జయంతి, వర్ధంతులను ఇప్పటికీ ఘనంగా జరుపుతున్నారు. వారిని నేటి తరం నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని ఆయా గ్రామాలవాసులు చెబుతున్నారు. పల్లె మకుటాలై.. ప్రతిమలై నిలిచిన ఆనాటి సర్పంచ్ల సేవలపై ‘సాక్షి’ సండే స్పెషల్. అభివృద్ధిని స్మరిస్తూ సేవల్ని గుర్తు చేస్తూ.. ఇప్పటికీ ఘనంగా జయంతి, వర్ధంతులు ఉమ్మడి జిల్లాలోని నేటితరం నాయకులకు ఆదర్శం -
ఎన్నికలపై అవగాహన కల్పించాలి
జనగామ: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బరిలో నిలిచే అభ్యర్థులకు అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. శనివారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో ఆయన మాట్లాడుతూ సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులు తమ ప్రచారం కోసం పబ్లిక్ మీటింగ్, ర్యాలీలు, మైకుతో పాటు తదితర వాటి కోసం తహసీల్దార్ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. అనుమతి పొందిన బహిరంగ సమావేశాలు, రోడ్ షోల వద్ద లౌడ్ స్పీకర్లు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకే ఉపయోగించాలన్నారు. వీటిని ఉల్లంఘించిన వారిపై పర్యవేక్షణ టీంలు లౌడ్ స్పీకర్లను జప్తు చేయడానికి అధికారం కలిగి ఉంటారన్నారు. ప్రచార వాహనాల వివరాలను తహసీల్దార్లకు ముందుగానే సమాచారం అందించాలన్నారు. ప్రచార ఖర్చులు నమోదు చేయాలి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చులను నిర్ణీత ఫారంలో నమోదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. అభ్యర్థుల ప్రచార ఖర్చు నమోదు చేసే అంశంపై వ్యయ పరిశీలకులు జయశ్రీ, ఖర్చుల మానిటరింగ్ నోడల్ ఆఫీసర్ కోదండ రాములు, మండల వ్యయ పరిశీలకులు, అన్ని మండలాల ఎంపీడీఓలతో కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల్లో అభ్యర్థులు ఎంత మేరకు ఖర్చు చేయాలనే అంశంలో ఎంపీడీఓలు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్ టీ, ఎంసీ ఎంసీటీంలు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ అభ్యర్థుల ఎన్నికల వ్యయ, ఖర్చులను పక్కాగా నమోదు చేయాలన్నారు. ఎంపీడీఓలు, తహసీల్దార్లు సమన్వయం చేసుకుంటూ పోటీలో ఉండే అభ్యర్థులకు నిర్ణీత గడువులోగా ఇవ్వాలన్నారు. -
నేటినుంచి రెండో విడత నామినేషన్లు
జనగామ: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో మొదటి విడత శనివారంతో ముగియగా, జనగామ నియోజకవర్గంలో నేటి (ఆదివారం) నుంచి రెండో విడత నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. ఇందుకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశాల ఎలక్షన్ అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రతీ రోజు సాయంత్రం 5 గంటలకు నామినేషన్ కేంద్రాల గేట్లను మూసివేస్తారు. అప్పటి వరకు కేంద్రాల ప్రాంగణంలో ఎంతమంది ఉన్నా.. నామినేషన్ పత్రాలను స్వీకరిస్తారు. ఎన్నికల నిర్వహణలో అలసత్వం వహించే అధికారులపై చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. నామినేషన్ స్వీకరణ కేంద్రానికి అభ్యర్థులు, ప్రతిపాదించే వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. నామినేషన్ల స్వీకరణలో ఎన్నికల సంఘం జారీ చేసిన నియమాలకు లోబడి వ్యవహరించాల్సి ఉంటుంది. జనగామ నియోజకవర్గంలోని జనగామ, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల మండలాల పరిధిలోని 79 గ్రామ పంచాయతీలు, 710 వార్డుల్లో నేటి (ఆదివారం) నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. నామినేషన్ల స్వీకరణకు మూడు లేదా నాలుగు గ్రామాలను కలిపి క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. నర్మెటలో4, జనగామలో 5, తరిగొప్పులలో 5, బచ్చన్నపేటలో 5 క్లస్టర్లను ఏర్పాటు చేశారు. రెండవ విడత నామినేషన్లను పురస్కరించుకుని బ్యాలెట్ బాక్స్, మెటీరియల్‌ను కలెక్టరేట్ స్ట్రాంగ్ రూం నుంచి మండలాలకు తరలించారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ శనివారంతో ముగిసింది. చివరి రోజు 30 క్లస్టర్లలో నామినేషన్ వేసేందుకు ఆయా పార్టీలు అభ్యర్థులు, స్వతంత్రులు బారులుదీరారు. చివరి రోజు రాత్రి 11.30 గంటల వరకు కొనసాగింది. మొత్తం 110 జీపీలకు 355, 1024 వార్డులకు 1,398 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. జనగామ నియోజకవర్గంలో 79 జీపీలు, 710 వార్డులు ముగిసిన మొదటి విడత నామినేషన్లు ఘన్‌పూర్‌లో రాత్రి వరకు కొనసాగిన నామినేషన్లుమండలం జీపీ వార్డులు క్లస్టర్లు జనగామ 21 198 5 నర్మెట 17 148 4 తరిగొప్పుల 15 126 5 బచ్చన్నపేట 26 238 5 మొత్తం 79 710 19 -
నూతన ఆవిష్కరణలవైపు అడుగులు
జనగామ రూరల్: విద్యార్థులు నూతన ఆవిష్కరణల వైపు అడుగులు వేయాలని అదనపు కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి పింకేష్‌కుమార్ అన్నారు. శనివారం పట్టణంలోని సాన్‌మారియా ఉన్నత పాఠశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన జిల్లా స్థాయి ఇన్స్పైర్, సైన్స్‌ఫెయిర్ ముగిసింది. జిల్లా వ్యాప్తంగా పలు పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు ప్రదర్శనలను వీక్షించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన ముగింపు సమావేశంలో పింకేష్‌కుమార్ పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలన్నారు. వినూత్నంగా ఆలోచించి కొత్త ఆవిష్కరణలకు బీజం వేయాలన్నారు. ఉత్తమ ప్రదర్శనలకు సర్టిఫికెట్, బహుమతులు అందించారు. కాగా సైన్స్‌ఫెయిర్ సబ్ థీమ్స్‌లో జూనియర్, సీనియర్ విభాగాల్లో మొదటి, రెండో బహుమతి, ఇన్‌స్పైర్‌లో 8 ప్రదర్శనలు రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. కార్యక్రమంలో ఏఎంఓ శ్రీనివాస్‌రావు, గౌసియా బేగం, సైన్స్ అధికారి ఉపేందర్, బాను, నాగరాజు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి పింకేష్‌కుమార్ ముగిసిన జిల్లాస్థాయి సైన్స్‌ఫెయిర్, ఇన్స్పైర్ మనక్ -
సైన్స్ఫెయిర్లతో సృజనాత్మకత
● జిల్లా సైన్స్‌ఫెయిర్‌ను ప్రారంభించిన కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ● మొదటి రోజు 2వేల మందికి పైగా విద్యార్థులు సందర్శన జనగామ రూరల్: సైన్స్ ఫెయిర్ల నిర్వహణతో వి ద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందుతుందని కలెక్ట ర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. శుక్రవారం పట్ట ణంలోని హైదరాబాద్ రోడ్డులోని సాన్‌మారియా ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి ఇన్స్పైర్, సైన్స్ ఫెయిర్‌ను అదనపు కలెక్టర్, జిల్లా విద్యాధికారి పింకేశ్ కుమార్‌తో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా జ్యో తిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు కేవలం సైన్స్ పుస్తకాలు చదవడమే కాకుండా ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని జ్ఞానాన్ని పెంపొందించుకుని మంచి భవిష్యత్‌ను నిర్మించుకోవా లన్నారు. స్మార్ట్ ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్న ఏఐ యాప్స్ ద్వారా ఎంతో సమాచారం లభ్యమవుతోందన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి పింకేశ్ కుమార్ మాట్లాడుతూ.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని, అభిరుచి, ఆసక్తికి అనుగుణంగా కోర్సు ఎంచుకొని జీవితంలో రాణించాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో సైన్స్ ఫెయిర్ 333, ఇన్స్పైర్ 77 ప్రాజెక్ట్‌లను ప్రదర్శించారు. కాగా ఆరు మండలాల నుంచి సు మారు 2వేలకు పైగా విద్యార్థులు ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ సత్యనారాయణమూర్తి, సైన్స్ అధికారి ఉపేందర్, ఏఎంఓ శ్రీనివాస్, పాఠశాల కరస్పాండెంట్ జగన్మోహన్ రెడ్డి, ఎంఈఓ శంకర్‌రెడ్డి, ఏసీజీ రవికుమార్, నాగరాజు, శ్రీకాంత్‌రెడ్డి , చంద్రబాన్ పాల్గొన్నారు. కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్ రిజ్వాన్ బాషా, చిత్రంలో జిల్లా విద్యాధికారి పింకేశ్ కుమార్, సైన్స్‌ఫెయిర్‌ను తిలకిస్తున్న విద్యార్థులు -
పక్కాగా కోడ్ అమలు కావాలి
● జిల్లా ఎన్నికల పరిశీలకుడు రవికిరణ్ జనగామ: గ్రామపంచాయతీ ఎన్నికలను సాఫీగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల పరిశీలకుడు రవికిరణ్ (ఐఎఫ్ఎస్) ఆదేశాలు జారీ చేశారు. గ్రామపంచాయతీ ఎన్నికలపై కలెక్టరేట్లో కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, డీసీపీ రాజమహేంద్రనాయక్లతో కలిసి సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ మాధురి షా, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. రైతుల ప్రయోజనానికే కొత్త విత్తన చట్టం రైతుల ప్రయోజనాల కోసమే నూతన విత్తన చట్టం తీసుకొచ్చినట్లు కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో రిజ్వాన్ బాషా అధ్యక్షతన నూతన విత్తన చట్టం–2025 ముసాయిదాపై అభిప్రాయ సేకరణ జరిగింది. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. మార్కెట్లో లభిస్తున్న విత్తనాల నాణ్యతను క్రమబద్ధీకరించడం, నకిలీ, నాసిరకం విత్తనాల అమ్మకాలను అరికట్టడం, రైతులు నష్టపోకుండా చూడ డం ఈ చట్టం బాధ్యత అన్నారు. సమీక్షలో వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఉమారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి అంబికాసోని తదితరులు పాల్గొన్నారు. ప్రమాదాలను నివారించాలి.. రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. డీసీపీ రాజమహేంద్రనాయక్, అధికారులు పాల్గొన్నారు. టీ–పోల్ మొబైల్ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి జనగామ రూరల్: స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల సౌలభ్యం కోసం అందుబాటులోకి తెచ్చిన టీ పోల్ మొబైల్ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. నామినేషన్ల కేంద్రాల పరిశీలన రఘునాథపల్లి: ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల పరిశీలకుడు రవికిరణ్, కలెక్టర్ రిజ్వాన్‌బాషా ఆదేశించారు. మండలంలోని నిడిగొండ, రఘునాథపల్లి నామినేషన్ కేంద్రాలను వారు పరిశీలించారు. -
ఎన్నికల ఖర్చుకు ముందస్తు డిపాజిట్లు?
లింగాలఘణపురం: సర్పంచ్ ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా పార్టీలు దూకుడుగా ముందుకెళ్తున్నాయి. దీనికోసం అభ్యర్థులు ఎంతటి ఖర్చునైనా భరించాల్సి ఉంటుందని సూచిస్తున్నాయి. పార్టీ మద్దతు వచ్చిన అనంతరం అభ్యర్థులు ఖర్చు పెట్టేందుకు వెనుకాముందు ఆలోచిస్తారని, అభ్యర్థిని ఖరారు చేయడానికి ముందుగానే ఆయా గ్రామాల్లో అభ్యర్థుల నుంచి పార్టీ ముఖ్యనేతలు డిపాజిట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయా గ్రామంలోని ఓట్లు, అయ్యే ఖర్చు ముందుగానే లెక్కలు వేసి ప్రస్తుతానికి ఇంత మొత్తం డిపాజిట్ చేస్తే గెలిపించే బాధ్యత తీసుకుంటామని అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. లేకపోతే మరో అభ్యర్థి ముందుకు వస్తాడని చెప్పడంతో విధిలేని పరిస్థితుల్లో అభ్యర్థులు ముందస్తుగా డిపాజిట్లు చేస్తున్నారు. బచ్చన్నపేట: మండలంలోని సాల్వాపూర్ గ్రామంలో అధికంగా బీసీ జనాభానే ఉన్నారు. 50 ఏళ్ల క్రితం గ్రామ పంచాయతీగా ఏర్పడగా గ్రామంలో ఒక్కరు కూడా ఓసీ లేరు. అయితే తాజా గ్రామ ఓటరు లిస్టులో ఓసీ వర్గానికి తాతిరెడ్డి ప్రేమలతారెడ్డి భర్త నారాయణరెడ్డి అనే పేరు వచ్చింది. ఆమెది తమ గ్రామం కాదని స్థానికులు చెబుతున్నారు. అలాగే పలువురు పేర్లు కూతాడి అనిత, నరేష్, దశరథ, కనుకమ్మ, అమ్రాజు భానుచందర్, పచ్చిమడ్ల ఎల్లమ్మ, పెద్దపాటి అనిత అనే పేర్లు కూడా గ్రామంలో లేకున్నా ఓటరు లిస్టులో వచ్చాయన్నారు. ఈ విషయమై ఎంపీడీఓ మమతాబాయ్ వివరణ కోరగా గ్రామంలో లేని వారు పేర్లు రావడంపై బీఎల్ఓలను అడుగాలన్నారు. ఆన్లైన్లో ఓటరు ఎక్కడనైనా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. దానిపై తహసీల్దార్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. గ్రామంలో లేని వారి పేర్లను తొలగించాలని నివేదిక పంపామని పంచాయతీ కార్యదర్శి మధు తెలిపారు. జనగామ: శ్రీ కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ ఉత్సవ కమిటీలో వెనకబడిన వర్గాలకు సముచిత స్థానం కల్పించినట్లు జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ అన్నారు. శుక్రవారం జరిగిన సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు లింగాల నర్సిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడ శ్రీనివాస్, పీఏసీఎస్ డైరెక్టర్ వంగాల మల్లారెడ్డి, పట్టణ అధ్యక్షుడు చెంచారపు బుచ్చిరెడ్డితో కలిసి శివరాజ్ యాదవ్ మాట్లాడారు.. బ్రహ్మోత్సవాల నిర్వహణ కోసం నియమించిన ఉత్సవ కమిటీలో ఇద్దరు ఓసీ, మరో ఇద్దరు ఎస్సీ వర్గాలకు చెందిన వారు ఉండగా, ఎనిమిది మంది బీసీ వర్గానికి చెందిన వారే ఉన్నారన్నారు. ఆలయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గొల్లకురుమలకు ఐదు మందికి అవకాశం కల్పించారన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతున్న కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిని విమర్శించడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. జనగామ రూరల్: కొమురవెల్లి మల్లన్న దేవస్థానంలో బీసీ కులాలపై జరుగుతున్న అన్యాయాన్ని తప్పుపడుతూ ఈనెల 30న దేవస్థానం ఈఓ కార్యాలయం ముట్టడి చేయనున్నట్లు కురుమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జాయ మల్లేశ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలి పారు. ఆలయ కమిటీ చైర్మన్ పదవి గొల్ల,కురుమలకు ఇవ్వాల్సిన చోట, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నియమించడం ఎండోమెంట్ శాఖ అధికారుల దుర్వినియోగానికి నిదర్శనమని విమర్శించారు. ఈనేపథ్యంలో గొల్ల, కురుమ సంఘాలు సహా బీసీ సబ్బండ ఉపకులాల నాయకులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని ముట్టడిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
‘చెకుముకి’తో విద్యార్థుల్లో శాసీ్త్రయ విజ్ఞానం
● డీసీపీ రాజామహేంద్ర నాయక్జనగామ రూరల్: సమాజంలో మూఢవిశ్వాసాలను పారదోలడంలో, విద్యార్థుల్లో శాసీ్త్రయ విజ్ఞానాన్ని పెంపొందించడంలో జనవిజ్ఞాన వేదిక కృషి అభినందనీయమని డీసీపీ రాజామహేంద్ర నాయక్ అన్నారు. శుక్రవారం జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఏకశిలా బీఎడ్ కళాశాలలో జిల్లా అధ్యక్షుడు రవీందర్ అధ్యక్షతన జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబురాలు నిర్వహించారు. ఈసందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత లక్షాన్ని ఎంచుకుని అది సాధించే వరకు విశ్రమించకుండా ,ప్రణాళికా బద్ధంగా కృషి చేయాలని సూచించారు. జిల్లాలోని 30 టీమ్స్ పాల్గొని తమ ప్రతిభను కనపరిచాయని 4 టీమ్స్ కరీంనగర్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాయని నిర్వాహకులు తెలిపారు. ప్రభుత్వ ఆంగ్ల మాధ్యమంలో ఽజెడ్పీఎస్ఎస్ ధర్మకంచ పాఠశాల ప్రభుత్వ తెలుగు మాధ్యమం జెడ్పీఎస్ఎస్ లింగాలఘణపురం, ప్రభుత్వ గురుకుల ఆంగ్ల మాధ్యమం, ఎంజేపీ మొండ్రాయి ప్రైవేట్ ఆంగ్ల మాధ్యమం, సాన్ మరియా పాఠశాల ఎంపికయ్యాయి. కార్యక్రమంలో గంట రవీందర్, శ్రీనాథ్, రాష్ట్ర కార్యదర్శి ఆకుల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఉమాదేవి, లక్ష్మణ్, చంద్రశేఖర్‌రావు పాల్గొన్నారు. నామినేషన్ల కేంద్రాల సందర్శన రఘునాథపల్లి: మండలంలోని కంచనపల్లి, రఘునాథపల్లి నామినేషన్ల కేంద్రాలను డీసీపీ రాజమహేంద్రనాయక్ శుక్రవారం సందర్శించారు. అయా నామినేషన్ల కేంద్రాలవద్ద బందోబస్తును పర్యవేక్షించారు. ఆయన వెంట ఎస్సై దూదిమెట్ల నరేశ్, ఏఎస్సై బత్తిని కట్టమల్లు తదితరులు ఉన్నారు. -
రెబల్స్..తగ్గేదేలే!
జనగామ: సర్పంచ్ ఎన్నికలు రాజకీయ పార్టీలకు కత్తిమీద సాములా మారిపోయాయి. నోటిఫికేషన్ వెలువడిన క్షణం నుంచి గ్రామాలన్నీ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయాయి. ప్రతి పంచాయతీలోనూ ఎవరు పోటీ చేస్తున్నా రన్న చర్చ హాట్ టాపిక్‌గా మారింది. అభ్యర్థుల ఎంపికలో పార్టీలు తీవ్రమైన పరీక్షను ఎదుర్కొంటున్నాయి. రెబల్ అభ్యర్థులు పార్టీల నాయకత్వాలకు సవాల్ విసురుతున్నారు. విబేధాలు, కుల సమీకరణలు, స్థానిక పరిస్థితులు కలిసి మరింత క్లిష్టం చేస్తున్నాయి. మొదటి విడత నామినేషన్ల ముగింపు దశలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరుకుంది. రెండో విడతలో పోటీ హోరాహోరీగా ఉండొచ్చని అంచనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పార్టీల అంతర్గత లాబీయింగ్ ఇప్పటికీ ఆగలేదు. టికెట్ కోసం ఆశలు పెట్టుకున్న నాయకులు తమ బలగాలను రంగంలోకి దింపారు. పార్టీ కార్యాలయాల నుంచి గ్రామం వరకు ఎవరికి టికెట్ వస్తుందా అనే సందేహామే సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎంలతో పాటు స్వతంత్రుల పోటీ అధినాయకత్వాల అంచనాలకు దొరకడం లేదు. దీంతో పార్టీల పెద్దలకు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా రెబల్ అభ్యర్థుల సమస్య చికాకు పుట్టిస్తోంది. టికెట్ రాకపోతే స్వతంత్రం గా పోటీ చేస్తామని చాలామంది ముందే ప్రకటన చేస్తూ పార్టీల నేతలను ఇబ్బందిలో పడేస్తున్నారు. వారిని బుజ్జగించేందుకు రాత్రిపూట మీటింగ్‌లు, ఆఫర్లు, భవిష్యత్‌లో నామినేటెడ్ పోస్టుల హామీలతో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఖర్చు, ఒత్తిడి ఈ రెండు అంశాలు ఇప్పుడు అభ్యర్థుల ఎంపికలో కీలకంగా మారాయి. కొన్ని గ్రామాల్లో అభ్యర్థుల ప్రచార ఖర్చును ముందే ఫిక్స్ చేసి, ఇంతకంటే తక్కువ ఉండొద్దంటూ ఆయా పార్టీ పెద్దలు స్పష్టంగా చెబుతున్నారు. గ్రామాల్లో ఇప్పటికే ప్రచార పర్వం మొదలైంది. ఎన్నికల క్యాంపెయిన్, ఒకరిపై ఒకరు ఆరోపణలతో పల్లె రాజకీయంలో హీటెక్కిపోతుంది. కత్తిమీద సాములా సర్పంచ్ అభ్యర్థి ఎంపిక స్పీడందుకున్న బుజ్జగింపుల పర్వం తప్పుకుంటే ఎక్స్ట్రా ప్యాకేజీలు, ఆఫర్లుమొదటి విడత పోలింగ్ జరుగనున్న స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని లింగాలఘణపురం, రఘునాథపల్లి, స్టేషన్న్ ఘన్పూర్, చిల్పూర్, జఫర్‌గఢ్ మండలాల పరిధిలో సర్పంచ్ నుంచి వార్డు వరకు సమీకరణాలు మారిపోతున్నాయి. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కడియం శ్రీహరి, యశస్వినిరెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి నాయకత్వంలో యువ నాయకు ప్రశాంత్‌రెడ్డి వంటి నేతలు అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ముఖ్యంగా రెబల్ బెడద లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్రామాల వారీగా వచ్చే రిపోర్టుల ఆధారంగా ఎప్పటికప్పుడు మండల, గ్రామ నాయకత్వానికి సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఎక్కువగా చికాకు కలిగించే గ్రామాలపై జోక్యం చేసుకుంటూ జనాదరణ కలిగిన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు అందరి అభిప్రాయాలను తీసుకుంటున్నారు. అధిష్టానం ఆదేశాలు లేకుండానే టికెట్ కోసం ఆశలు పెట్టుకున్న నాయకులు మాత్రం ప్రచార మోడ్‌లోకి వెళ్లిపోయారు. ఇప్పటికే మొదటి విడత నామినేషన్లు రాజకీయాలను మరింత వేడెక్కించాయి. రెండో విడత ఫైట్‌కు పార్టీ వ్యూహకర్తలు సిద్ధమవుతున్నారు. కొత్త పార్టీలో చేరే నాయకులు, రెబల్స్ ఎంట్రీ, నిమిషనిమిషానికి మారే మార్పులతో జిల్లా మొత్తం ఇప్పుడు ఎన్నికల హైవోల్టేజ్‌లో మునిగి తేలుతోంది. వచ్చే రెండు, మూడు రోజుల్లో అనేక గ్రామాల్లో రాయకీయ ఆట పూర్తిగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. ఏ పార్టీ ఎలా నిర్ణయం తీసుకుంటుందన్నదే ఇప్పుడు జిల్లాలో మాట్లాడుకుంటున్నారు. -
వీడిన నాలుగు దశాబ్దాల ఉద్యమబాట
జనగామ/ దేవరుప్పుల: ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మరో మావోయిస్టు కీలక నేత పవనాంద్‌రెడ్డి అలియాస్ చైతు అలియాస్ శ్యామదాదా శుక్రవారం అడవిబాట వీడారు. ఆయన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా పోలీసు అధికారులు, భద్రతాదళాల ఎదుట లొంగిపోయారు. జిల్లాలోని చిల్పూరు మండలం పల్లగుట్టకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గీరెడ్డి దామోదర్‌రెడ్డి–అండాళ్లు దంపతుల కుమారుడైన పవనాంద్‌రెడ్డి హనుమకొండలో ఉన్నత విద్యనభ్యసించే క్రమంలో ఆర్ఎస్యూనుంచి సీపీఐ(ఎంఎల్) పీపుల్స్‌వార్‌లోకి వెళ్లారు. తొలుత 1982–83లో జనగామ ప్రాంతంలో సింగిల్ ఆర్గనైజర్‌గా పనిచేసిన అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ క్రమంలోనే 1989–90 ప్రాంతంలో ఛత్తీస్‌గఢ్ జిల్లా గడ్చిరోలి జిల్లా ట్రిపుర్ఘడ్ ఏరియాలో పార్టీ విస్తరణలో భాగంగా డిప్యూటీ కమాండర్‌గా బాధ్యతలు స్వీకరించారు. దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ విస్తరణలో భాగంగా తన తండ్రి ఉపాధ్యాయుడి వృత్తికి కొనసాగింపుగా అక్కడి నిరక్షరాస్యులకు అక్షరాలు నేర్పేందుకు మాస్టారుగా కీలక బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు మొబైల్ మాస్ స్కూల్, మొబైల్ పొలిటికల్ స్కూల్ నిర్వహించారు. 2008లో దర్బా ఏరియాలో నిత్యనిర్బంధంలో పార్టీకి పట్టుదొరికేలా పాటుపడ్డారు. అక్కడి ప్రభుత్వం దృష్టిలో పడకుండా అప్పటికే వివాహం చేసుకున్న పవనాంద్‌రెడ్డి దంపతులను కేంద్ర కమిటీ టెక్నికల్ విభాగంలో కీలక బాధ్యతలు అప్పగించారు. 2000 సంవత్సరంనాటికి బయట పరిస్థితుల నేపథ్యంలో తిరిగి అటవీ ప్రాంతమైన బస్తర్‌లో దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సీనియర్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2013లో జరిగిన జిరామ్ వ్యాలీ దాడి సూత్రధారుల్లో ఒకరిగా పరిగణించిన చైతు అలియాస్ శ్యామ్దాదాకు అక్కడి ప్రభుత్వం మోస్ట్‌వాంటెడ్ కావడంతో ఆయన తలపై రూ.25 లక్షల రివార్టు ప్రకటించింది. చైతు సహా పది మంది నక్సలైట్లు శుక్రవారం సుక్మా జిల్లాలో పోలీసు ఎదుట లొంగిపోయారు. కాగా, ఈయన భార్య స్వప్న డివిజనల్ కమిటీ సభ్యురాలిగా కొనసాగే క్రమంలో ఈ ఏడాది జూన్‌లోనే గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోవడం గమనార్హం. కాగా, పవానంద్రెడ్డి తల్లిదండ్రులు ప్రస్తుతం హనుమకొండలో నివాసం ఉంటున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన మావోయిస్టు కీలక నేత పవనాంద్‌రెడ్డి ఆయన స్వస్థలం చిల్పూరు మండలం పల్లగుట్ట దండకారణ్యంలో మాస్టారుగా కీలక బాధ్యతలు మొబైల్ మాస్, పొలిటికల్ స్కూళ్ల ఏర్పాటు సూత్రధారి -
జోరందుకున్న బుజ్జగింపులు
స్టేషన్‌ఘన్‌పూర్: సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ఈనెల 29(శనివారం)న ముగియనుండగా గ్రామాల్లో బుజ్జగింపులు, రహస్యసమావేశాలు ఊపందుకున్నాయి. మండలంలో 15 గ్రామ పంచాయతీలు ఉండగా సగానికి పైగా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థుల ఖరారు ఇప్పటికీ కాలేదు. గ్రామ కాంగ్రెస్ కమిటీలు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ ముఖ్య నాయకులతో కలిసి గ్రామాల్లో ఆశావహులతో రహస్య సమావేశాలు నిర్వహిస్తూ బుజ్జగింపులు చేస్తున్నారు. మండలంలోని ఇప్పగూడెం, తానేదార్పల్లి గ్రామాల్లో అధికార పార్టీ నుంచి ప్రధానంగా ఇద్దరిద్దరు ఆశిస్తుండగా బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇప్పగూడెంలో మండల అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించి సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు అభ్యర్థుల ఎంపికకు కసరత్తులు చేశారు. నామినేషన్ల ఘట్టం ముగుస్తుండగా రెబల్స్ అధిక సంఖ్యలో నామినేషన్లు వేయనున్నారు. -
ఎన్నికల విధానం చూస్తే బాధేస్తోంది..
● ఆరోజుల్లో నాయకులు, కార్యకర్తలు అభ్యర్థి బాధ్యత తీసుకునేవారు ● ఓటుకు డబ్బులు ఇవ్వడం అంటే..అవినీతిని ప్రోత్సహించడమే ● ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టు ప్రత్యేక దృష్టి పెట్టాలి ● ‘సాక్షి’తో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రామసహాయం సురేందర్ రెడ్డి ● సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీగాఎదిగిన రామసహాయంసాక్షి, మహబూబాబాద్: ‘స్వాతంత్య్ర ఉద్యమం, నిజాంపాలన చూశాను. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా. సర్పంచ్ పదవితో రాజకీయ ఆరంగ్రేటం చేసి నాలుగుసార్లు ఎమ్మెల్యే, నాలుగుసార్లు ఎంపీగా పనిచేశా. అప్పటి రాజకీయాలకు ప్రస్తుత రాజకీయాలకు పొంతన లేదు. అప్పుడు మంచి నాయకుడిని ఎన్నుకోవాలనే తపన ప్రజల్లో ఉండేది. అభ్యర్థులను గెలిపించే బాధ్యత నాయకులు, కార్యకర్తలు తీసుకునేది. జీపులు.. డీజీల్ ఖర్చు తప్ప, ఇతరత్రా వ్యయాలు ఉండేవి కాదు. ఇప్పుడు ఓట్లు పడాలంటే డబ్బులు ఖర్చుపెట్టాలి. ఈవిధానం చూస్తే బాధేస్తోంది’ అని మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నాటి పరిస్థితులను ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. సర్పంచ్‌గా ఆరంగ్రేటం చదుకునే రోజులు.. అప్పటివరకు నాకు రాజకీయాలు తెలియదు. అందరి ప్రోత్సాహంతో 1960లో మహబూబాబాద్ జిల్లా మరిపెడ గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యా. ఏకగ్రీవ ఎన్నిక కావడంతో పెద్దగా డబ్బులు ఖర్చుపెట్టలేదు. నాకు ఇప్పుడు 95ఏళ్లు.. నేను సర్పంచ్‌గా గెలిచినప్పుడు ముప్పై సంవత్సరాలు కూడా లేవు. అయినా సర్పంచ్ అంటే గ్రామంలో ప్రత్యేక ఆదరణ. నాయకుడికి కూడా గ్రామం అన్నా.. గ్రామస్తులు అన్నా.. ప్రాణంగా పనిచేసేవారు. గ్రామాల అభివృద్ధికి ఎంతదూరమైనా పోయేవాళ్లం. ఎన్నికల్లో డబ్బులు పంచడం అంటే తెలియదు. గ్రామాల్లోకి వెళ్తే.. అక్కడి నాయకులే భోజనాలు పెట్టేవారు. పార్లమెంట్ ఎన్నికలకు నాకు అయిన ఖర్చు రూ.7,500 మాత్రమే.. ఇప్పుడు ఒక్క ఓటుకు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి. ఈ పరిస్థితి చూస్తుంటే బాధేస్తోంది. కమ్యూనిస్టులతో పోటీ.. ఆరోజుల్లో ఇన్ని పార్టీలు లేవు. కమ్యూనిస్టు, కాంగ్రెస్ రెండు పార్టీల మధ్యనే పోటీ ఉండేది. 1967లో ఎంపీగా ఎన్నికై న సమయంలో తొలి దశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకుంది. అప్పు డు మర్రి చెన్నారెడ్డి ఇతర నాయకులు నన్ను తెలంగాణ పార్లమెంటరీ సమితి కన్వీనర్‌గా ఎన్నుకున్నా రు. 1969లో హైదరాబాద్‌లో పదివేల మందితో సత్యాగ్రహ కార్యక్రమం చేశాం. జైలుకు వెళ్లిన సంఘటనలు ఉన్నాయి. అయితే అప్పుడు కమ్యూనిస్టులు ప్రజాప్రతినిధులతో పనులు చేయించేలా పోటీ పడేవారు. అభివృద్ధిని ఆకాంక్షించేవారు. పనిచేసిన వారిని అభినందించే సంస్కృతి ఉండేది. ఇప్పుడు అలాంటి వాతావరణం కనిపించడం లేదు. నాడు గ్రామానికి సేవ చేసే నాయకులకు ఎన్నుకునేవారు. ఇప్పుడు డబ్బులు ఖర్చుపెట్టే వారికి టికెట్లు ఇస్తున్నారు. ప్రజలు వారికి ఓట్లు వేసి ఎన్నుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఈ వాతావరణం మంచిదికాదు. డబ్బులు లేనివారు ప్రజాప్రతినిధులు అయ్యే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. డబ్బులు పంచి పెట్టడం అంటే అవినీతికి అవకాశం ఇవ్వడమే.. ఈ సంస్కృతి మారాలి. ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టు కలగజేసుకొని డబ్బులకు, ఎన్నికలకు ఉన్న సంబంధాన్ని విడగొట్టాలి. లేకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. -
వైజ్ఞానిక ప్రదర్శనకు సిద్ధం
జనగామ రూరల్: జిల్లా కేంద్రంలో నిర్వహించబడుతున్న జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అదనపు కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి పింకేశ్ కుమార్ తెలిపారు. సైన్స్ ఫెయిర్‌కు 22 గదుల్లో 350కు పైగా ప్రదర్శన వస్తువులు సిద్ధం చేశామన్నారు. మనక్ ఇన్స్పైర్ ప్రదర్శనలకు ప్రత్యేకంగా 10 గదుల్లో 77 ప్రయోగాల ప్రదర్శనకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ప్రదర్శనలో పాల్గొనే విద్యార్థులు, గైడ్ టీచర్లు సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను అదేశించారు. శాసీ్త్రయ దృక్పథాన్ని అభివృద్ధి చేయడంలో బాల వైజ్ఞానిక ప్రదర్శనలు కీలకమని సూచించారు. గురువారం సాన్ మారియా పాఠశాలలో ప్రదర్శనల నమోదు ప్రక్రియ చేపట్టారు. 22 గదుల్లో 350 వరకు ప్రదర్శనలు -
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి
జనగామ: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా సజావుగా జరిగేలా ప్రత్యేక దృష్టి సారించాలని ఎలక్షన్ జనరల్ అబ్జర్వర్ నిఖిల(ఐఏఎస్)నోడల్ అధికారులకు సూచించారు. జీపీ ఎలక్షన్లకు సంబంధించి గురువారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఆమె నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతకుముందు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా జిల్లాలో మూడు విడతలుగా జరగనున్న ఎన్నికల ఏర్పాట్లతో పాటు నోడల్ అధికారుల నియామకం, వారికి అప్పగించిన బాధ్యతల గురించి జనరల్ అబ్జర్వర్‌కు వివరించారు. అనంతరం నిఖిల మాట్లాడుతూ.. ఎన్నికలకు సంబంధించిన ప్రతీ అంశంపై అధికారులకు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, జెడ్పీ సీఈఓ మాధురి షా, వ్యయ పరిశీలకులు జయశ్రీ, డీఆర్డీఓ పీడీ వసంత, డీపీఓ నవీన్, నోడల్ అధికారులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో మీడియా సెంటర్ ప్రారంభం జీపీ ఎన్నికలను పురస్కరించుకుని కలెక్టరేట్లో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కలెక్టర్ రిజ్వాన్ బాషాతో కలిసి అబ్జర్వర్ నిఖిల మీడియా సెంటర్‌ను ప్రారంభించారు. ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలన్నారు. కార్యక్రమంలో డీపీఆర్ఓ పల్లవి, ఈడీఏం గౌతమ్‌రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల జనరల్ అబ్జర్వర్ నిఖిల -
గరంగరం..రసవత్తరం
స్టేషన్‌ఘన్‌పూర్: సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి అభ్యర్థుల ఎంపిక కోసం గ్రామ పార్టీల ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి, ప్రతిపక్ష బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచ్‌గా పోటీ చేసేందుకు గ్రామాల్లో ఎక్కువ మంది సముఖత చూపుతుండగా వారిని ఒక్కతాటిపైకి తీసుకురావడం పార్టీల నాయకులకు కత్తిమీద సాములాగా మారింది. నామినేషన్లకు కేవలం మరోరెండు రోజులే గడువు ఉండడంతో ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కొక్క గ్రామం నుంచి నలుగురైదుగురు పోటీకి వస్తున్నారు. ఈ క్రమంలో గ్రామాల్లో జరిగే సమావేశాల్లో వాదనలు, వాగ్వాదాలతో రసవత్తరంగా సాగుతున్నాయి. పార్టీ గ్రామ కమిటీలు, మండల, జిల్లా నాయకులు నచ్చజెప్పడంతో కొందరు పట్టు విడుస్తున్నా గ్రామానికి ఇద్దరు, ముగ్గురు మాత్రం తప్పనిసరిగా బరిలో ఉండేలా కనిపిస్తోంది. దాంతో కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ బెడద తప్పేలా లేదు. సర్పంచ్‌లుగా పోటీ చేయాలనుకునే ఆశావహులు ఎవ్వరికీ వారే తామే గెలుస్తామనే ధీమాతో స్థానిక ఎమ్మెల్యేతో పాటు మండల పార్టీ నాయకులను ప్రసన్నం చేసుకునేలా శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధాన పార్టీలకు తలనొప్పిగా అభ్యర్థుల ఎంపిక -
అయ్యయ్యో.. ‘చే’జారిందే!
సాక్షిప్రతినిధి, వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల ఎంపికపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. కొందరు నేతలు తమ పేర్లు సిఫారసు చేయకపోవడం వల్లే ఛాన్స్ చేజారిందని ఆశావహులు వాపోతుతుండగా, దరఖాస్తు చేసుకున్నా అవకాశం దక్కని సీనియర్లు అధిష్టానం తమపై చిన్నచూపు చూసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ప్రకటన వెలువడిన నాలుగైదు రోజులకు చాపకింది నీరులా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆరు జిల్లాలకు గాను ఇద్దరు షెడ్యూల్ కులాలు, ఒక మైనారిటీ, ఒక బీసీ, ఒక జనరల్, ఒక షెడ్యూల్ తెగలకు చెందిన నాయకులకు జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించారు. ఈ విషయంలో సామాజిక, సమన్యాయం పాటించినట్లు పార్టీ అధిష్టానం, సీనియర్లు చెబుతుండగా, సిఫారసులు ఫలించని, అవకాశం దక్కని నేతలు మాత్రం అసంతృప్తిగా ఉన్నట్లు అనుచరవర్గాలు చెప్తున్నాయి. వరంగల్‌పై పోటాపోటీ సిఫారసులు.. వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మైనార్టీ వర్గానికి చెందిన మహ్మద్ అయూబ్‌కు అనూహ్యంగా అవకాశం దక్కిందని చెప్పొచ్చు. తూర్పు నియోజకవర్గంలో రెండు వర్గాలుగా పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు. మంత్రి కొండా సురేఖ దంపతులు ఒక వర్గంగా, మిగిలిన నాయకులు మరో వర్గంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొండా దంపతులు మినహా మిగిలిన వారంతా డీసీసీ అధ్యక్షురాలిగా మాజీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణను ప్రతిపాదించారు. వర్ధన్నపేట, పరకాల ఎమ్మెల్యేలతోపాటు ఆ నియోజకవర్గాలకు చెందిన నాయకులు కూడా స్వర్ణను ప్రతిపాదించారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వర్ధన్నపేట నియోజకవర్గం ఏనుగల్లుకు చెందిన బొంపెల్లి దేవేందర్‌రావుకు డీసీసీ పదవీ ఇవ్వాలంటూ ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలిసింది. కొండా దంపతులు గోపాల నవీన్రాజుకు గానీ, లేని పక్షంలో మీసాల ప్రకాశ్‌కు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. కాగా, మైనార్టీ వర్గానికి చెందిన మహ్మద్ అయూబ్ పేరును డీసీసీ అధ్యక్షుడిగా ఎవరు ప్రతిపాదించలేదు. సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్‌లకు సన్నిహితంగా, ఛత్తీస్‌గఢ్‌కు పార్టీ పరిశీలకుడిగా వెళ్లడంతో మీనాక్షి నటరాజన్ దృష్టిలో పడడం, మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆ కోటాలో ఆయూబ్ పేరును చేర్చినట్లు తెలిసింది. మాజీలకు ఇవ్వొద్దని, కనీసం ఐదేళ్ల నుంచి పార్టీలో కొనసాగుతుండాలన్న నిబంధనలను పరిగణనలోకి తీసుకోవడంతో స్వర్ణ, నవీన్రాజులు అనర్హులయ్యారు. దీంతో మంత్రి కొండా సురేఖ దంపతులు, వారి అనుచరులు అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. మహబూబాబాద్‌లో ఎంపీ వర్గం.. జనగామలో ‘కొమ్మూరి’ వర్గం కినుక జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ భార్య ఉమకు కేటాయించడం పట్ల కొందరు సంతోషం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు అసంతృప్తిగా ఉన్నారు. మాజీ డీసీసీ అధ్యక్షుడు భరత్చందర్ రెడ్డి వర్గానికి దక్కడంపై ఆయన వర్గం సంతోషంగా ఉంది. కానీ, ఎంపీ బలరాం నాయక్ వర్గానికి చెందిన నునావత్ రాధకు ఇవ్వకపోవడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు అనుచరవర్గంలో చర్చ జరుగుతోంది. మొదటినుంచీ డీసీసీ అధ్యక్ష పదవి వస్తుందని భావించిన పీసీసీ సభ్యుడు వెన్నం శ్రీకాంత్ రెడ్డి కూడా అసంతృప్తిగానే ఉన్నారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి అనుచరుడిగా ఉన్న గణపురం అంజయ్య కూడా అధ్యక్ష పదవి వస్తుందని ప్రచారం చేసుకున్నారు. కాగా, అందరిని సమన్వయం చేసుకునేందుకు మురళి నాయక్ దంపతులు ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా గత ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌గా పనిచేసిన లకావత్ ధన్వంతి లక్ష్మీనారాయణ నాయక్‌ను నియమించగా, మాజీ ఎమ్మెల్యే, మాజీ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి, ఆయన అనుచరులు అసంతృప్తిలో ఉన్నట్లు పార్టీవర్గాల సమాచారం. పార్టీ స్థాపించిన నాటినుంచి నేటివరకు ఒకే పార్టీలో ఉండడం లకావత్ ధన్వంతికి తగిన గుర్తింపునిచ్చిందన్న చర్చ జరుగుతుండగా, ఎస్టీ సామాజిక వర్గం, మహిళ కావడంతో గొడవలకు ఫుల్స్టాప్ పెట్టవచ్చని ఉద్దేశంతో ఆమెను జిల్లా అధ్యక్షురాలిగా ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్విని రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, పలువురు కూడా బలపరిచినట్లు ప్రచారం జరుగుతోంది. ఆవేదనలో డీసీసీ పీఠం దక్కని ఆశావహులు ఉమ్మడి జిల్లాలో డీసీసీ అధ్యక్షుల ఎంపికపై మోదం, ఖేదం పార్టీ సీనియర్లనుంచీ భిన్న స్వరాలు.. వరంగల్‌పై మంత్రి సురేఖ శిబిరంలో అసంతృప్తి? మంత్రి సీతక్క అనుచరుడికే మళ్లీ ములుగు పగ్గాలు.. హనుమకొండ, భూపాలపల్లిల్లో ఎమ్మెల్యేల మాటే చెల్లుబాటు మహబూబాబాద్ డీసీసీపై ఎంపీ వర్గం కినుక..ఈ మూడింటిలో మంత్రి, ఎమ్మెల్యేల మాటే చెల్లుబాటు.. ములుగు డీసీసీ అధ్యక్షుడిగా మళ్లీ పైడాకుల అశోక్‌కే ఛాన్స్ దక్కింది. ఈ విషయంలో మంత్రి సీతక్క సిఫారసు మేరకు ఆయనకు మరోసారి అవకాశం దక్కిందన్న చర్చ పార్టీలో ఉంది. పార్టీలోని ఒక్కరిద్దరు సీనియర్లు అసంతృప్తికి గురైనట్లు వారి అనుచరులు చెబుతున్నారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, జేఎస్ భూపాలపల్లి అధ్యక్షుడిగా బట్టు కరుణాకర్లను నియమించడంలో ఎమ్మెల్యేల మాట చెల్లుబాటయ్యింది. భూపాలపల్లి నుంచి మాజీ మావోయిస్టు నేత గాజర్ల అశోక్ అలియాస్ ఐతు ప్రయత్నించినా ఆయనకు ఛాన్స్ రాలేదు. అలాగే హనుమకొండ నుంచి సుమారు 20మందికిపైగా ఆశించినా సీనియర్ నేత వెంకట్రాంరెడ్డికే అధిష్టానం పార్టీ పగ్గాలు అప్పగించింది. -
కేటీఆర్‌వి అహంకారపు మాటలు
స్టేషన్‌ఘన్‌పూర్: అహంకారం మాటలతో ఎవరూ పెద్ద నాయకులు కాలేరని మాజీమంత్రి కేటీఆర్‌పై స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. నియోజకవర్గ కేంద్రంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.. కేటీఆర్ సభ్యత, సంస్కారం మరిచి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కేటీఆర్‌లాగా అయ్యపేరు చెప్పుకుని, కుటుంబం పేరు చెప్పుకుని రాజకీయాలు చేయడం లేదని, స్వతంత్రంగా రాజకీయాల్లో ఎదిగానని స్పష్టం చేశారు. నీతి, నైతికత, విలువల గురించి మాట్లాడే అర్హత కేటీఆర్‌కు ఎంతమాత్రం లేదని, బీఆర్ఎస్ పాలనలో పదేళ్లలో 36 మంది ఎమ్మెల్యేలను చేర్చుకుని అందులో ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చినప్పుడు విలువలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. చెల్లెలు చేసే ఆరోపణలకు సమాధానం చెప్పలేని కేటీఆర్ తమపై విమర్శలు చేయడం సిగ్గుచేటని, ముందు తన చెల్లికి సమాధానం చెప్పి కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేనిరోజున బీఆర్ఎస్ పార్టీ ముక్కలు, చెక్కలవుతుందని, కేటీఆర్ నాయకత్వం నచ్చకనే హరీశ్‌రావు దూరంగా ఉంటున్నారని, కేసీఆర్ తర్వాత ఆయన తనదారి తాను చూసుకుంటారన్నారు. కేటీఆర్‌పై ఇప్పటికే పది కేసులున్నాయని, ఆయన ఎప్పుడైనా జైలుకు వెళ్లే అవకాశాలున్నాయన్నారు. సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్‌రెడ్డి, నాయకులు అన్నం బ్రహ్మారెడ్డి, కరుణాకర్‌రావు, కొలిపాక సతీష్, తెల్లాకుల రామకృష్ణ, చింత ఎల్లయ్య, మంద రాజు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం మండిపాటు -
మొదటిరోజు 152 నామినేషన్లు
జనగామ: సర్పంచ్ ఎలక్షన్ల ప్రక్రియ పట్టాలెక్కగా, జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్ నియోజక వర్గంలో గురువారం నుంచి మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. లింగాలఘణపురం, రఘునాథపల్లి, చిల్పూరు, జఫర్‌గఢ్, స్టేషన్‌న్‌ఘన్‌పూర్ మండలాల్లో తొలి విడత సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల ప్రక్రియ భారీ జోష్‌తో మొదలైయింది. మొదటి రోజు మొత్తం 152 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో 106 సర్పంచ్, 46 వార్డు సభ్యుల స్థానాలకు వచ్చాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మద్దతుదారులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయగా, కలెక్టర్ ఆధ్వర్యంలోని రెవెన్యూ, ఎలక్షన్ సెల్ మరియు ఇతర విభాగాలు పర్యవేక్షణ చేపట్టాయి. అభ్యర్థులు తమ అనుచరులతో ర్యాలీగా నామినేషన్ కేంద్రాలకు తరలివచ్చారు. నామినేషన్ల పర్వం మొదలు కాగా జిల్లా జనరల్ అబ్జర్వర్ నిఖిల్(ఐఏఎస్), కలెక్టర్ రిజ్వాన్ బాషాతో కలిసి ఆయా మండలాల పరిధిలో నామినేషన్ కేంద్రాలను సందర్శించి పరిశీలన చేశారు. అదనపు కలెక్టర్లు బెన్న్ షాలోమ్, పింకేశ్ కుమార్, ఆర్డీఓ గోపీరామ్, వెంకన్న, తహసీల్దార్లు, ఎంపీడీవోలు సైతం వివిధ పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. మండలం సర్పంచ్ వార్డు మొత్తం సభ్యులు చిల్పూరు 16 11 27 రఘునాథపల్లి 35 8 43 లిం.ఘణపురం 15 11 26 జఫర్‌గఢ్ 23 9 32 స్టేషన్‌ఘన్‌పూర్ 17 7 24 సర్పంచ్–106, వార్డు సభ్యులు– 46 మొదటి విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్, జనరల్ అబ్జర్వర్ -
కుర్చీపై మోజు.. ఖర్చంటే కలవరం
పదవి పిలుస్తున్నా.. భయపెడుతున్న వ్యయం జనగామ: సర్పంచ్ కుర్చీ పిలుపుతో ఆశావహులు తమ కలలలోకంలో విహరిస్తున్నారు. కానీ ఆ కలల వెంట వచ్చే ఖర్చుల లెక్కలు మాత్రం చెమటలు పట్టిస్తున్నాయి. ఎన్నికలకు కొద్ది రోజులే మిగిలి ఉండడంతో ఖద్దర్ నేతలు రోడ్డెక్కెస్తున్నారు. పదవి కోసం పరుగు మొదలైతే... ఖర్చు టెన్షన్ నీడలా వెన్నంటి నడిచి వస్తోంది. సర్పంచ్ కుర్చీ కళ్లముందు కనిపిస్తుంటే..పోటీకి సై అంటున్న సమయంలో ప్రజల నుంచి వచ్చే గౌరవాలు, మీటింగ్‌లు, హడావిడి సర్పంచ్ హోదా కలిగిన ఫీలింగ్ వచ్చేస్తోంది. ఎలక్షన్ షెడ్యూల్ రావడం, నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవడంతో ఆశావహులు పాత ఖద్దరు అంగీలను మడత పెట్టి.. చమక్కుమంటున్న కొత్త షర్టులను ఎక్కించేస్తున్నారు. గ్రామంలో ఎవరిని చూసినా.. వీరు కూడా పోటీ చేస్తారా... అని చెప్పుకునేలా ఖద్దరు రాజకీయాల హీట్ పెంచేస్తున్నారు. అప్పు.. నేనిస్తా... ‘అన్నా ఈసారి సర్పంచ్ పదవికి దిగుతున్నావట కదా...డబ్బులు ఉన్నాయా... అవసరమైతే చెప్పు.. అప్పు ఇస్తా...వడ్డీ సంగతి తర్వాత చూసుకుందాం.. ఎంతకావాలన్నా భయపడకు... ’అంటూ గ్రామాల్లో సర్పంచ్ బరిలో నిలిచే కొంతమందికి అప్పు రూపేణా ఇచ్చేందుకు వడ్డీరాయుళ్లు ముందుకొస్తున్నారు. చాలా గ్రామాల్లో పోటీకి సై అంటున్న ఆశావహుల వద్దకు డబ్బులు ఇచ్చే వడ్డీ వ్యాపారులు క్యూ కడుతున్నారు. ప్రేమగా పలకరింపుతో అప్పులు ఇస్తూ... ఓడినా, గెలిచినా రూ.5, రూ.10 లెక్కన వడ్డీ బాదుతూ వసూళ్లు చేయడం మాత్రం ఖాయం అంటున్నారు ప్రజలు. గత శాసనసభ ఎన్నికల్లో నాయకుల ఖర్చులను చూసి...గింతేనా అంటూ సింపుల్‌గా లెక్కవేసిన పలువురు ఆశావహులు ఇప్పుడు ఆ ఖర్చులు తమవైపు వచ్చేసరికి ఎంతో కొంత కంగారు పడిపోతున్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో విందులు, వినోదాలు, సదరు ఖర్చులతో పైసా పైసా వసూలు చేసిన వారంతా... ఇప్పుడు తామే భరించాల్సిన సమయం ఆసన్నం కావడంతో వారికి చెమటలు పడుతున్నాయి. ‘అన్నా పోటీకి సై అనాల్సిందే, రిజర్వేషన్లు ఎప్పుడూ కలిసి రావు... ఛాన్స్ మళ్లొస్తదో రాదో... ఎకరం భూమి అమ్మేద్దాం... అవసరముంటే మళ్లీ కొనొచ్చు... ఖర్చు పెడితే గెలుస్తావు..’ అంటూ వెన్నంటి నడిచే సహచరులు పురమాయిస్తున్నారు. వీరి మాటలు కొందరికి ధైర్యం ఇస్తుంటే, ఎకరం అమ్మైనా గెలవాలవాలనే కొత్త స్లోగన్ గ్రామాల్లో వినిపిస్తోంది. ఆశావహ ‘ఖద్దరు చొక్కా’ల ఊగిసలాట ఎంతైనా పోటీలో ఉండాల్సిందేనంటూ సహచరుల భరోసా 20 రోజులు కష్టపడితే కలనెరవేరుతుందంటూ ధైర్యం -
బుగులు వెంకన్న నేత్రదర్శనం
చిల్పూరు: మండల కేంద్రంలోని బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం భూనీల సమేత వేంకటేశ్వరుడు నిజరూపంలో భక్తులకు నేత్ర దర్శనం లభించింది. స్వామివారి నేత్రదర్శనంపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు. జీడికల్ ఆలయ హుండీ ఆదాయం రూ.2.57లక్షలులింగాలఘణపురం: మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి హుండీ ఆదాయం రూ.2,57,868లు వచ్చినట్లు ఈఓ వంశీ తెలిపారు. ఈ నెలలో మొదలైన జీడికల్ వీరాచల బ్రహ్మోత్సవాల అనంతరం గురువారం దేవాదాయ ఇన్స్పెక్టర్ నిఖిల్ పర్యవేక్షణలో హుండీ లెక్కించారు. ఈసారి భక్తులు అధికంగానే వచ్చిన గత ఏడాది ఆదాయంతో పోల్చితే తక్కువగానే వచ్చింది. కార్యక్రమంలో సిబ్బంది భరత్, మల్లేశం పాల్గొన్నారు. బాలసాహిత్యభేరికి మోడల్ స్కూల్ విద్యార్థులులింగాలఘణపురం: మండలంలోని మోడల్ స్కూల్‌కు చెందిన పదో తరగతి విద్యార్థినిలు బి.ఉజ్వల, కె.సాయిప్రసన్నకు తెలుగు అసొసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ఆధ్వర్యంలో ఈ నెల 30న వర్చువల్‌గా నిర్వహించే అంతర్జాతీయ శతాధిక బాలరచయితల వచన కవితా సమ్మేళనం బాలసాహిత్యభేరిలో పాల్గొనే అవకాశం లభించింది. గురువారం ప్రిన్సిపాల్ సునిత మాట్లాడుతూ.. ఇప్పటికే వీరిద్దరు జిల్లా, రాష్ట్రస్థాయిలో వచన కవితలో అనేక బహుమతులు గెలుపొందడంతో అవకాశం లభించిందన్నా రు. బాలసాహిత్యభేరిలో విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు, ప్రముఖ సాహితీవేత్తలు పాల్గొంటారని ప్రిన్పిపాల్ పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికపాలకుర్తి: మండలంలోని చెన్నూ రు గ్రామానికి చెందిన బాలబోయిన సందీప్, రావుల కు మారస్వామి అనే విద్యార్థులు తెలంగాణ 12వ రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో ఆదిలాబాద్‌లో జరుగనున్న పోటీల్లో వారు పాల్గొంటారు. సీనియర్ సాఫ్ట్‌బాల్ సెలక్షన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల ఎంపికలో 80 మంది పాల్గొన్నారు. ఇద్దరు విద్యార్థులను ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు. ధాన్యం బస్తాలు వేగంగా మిల్లులకు తరలించాలిరఘునాథపల్లి: ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే కేంద్రాల నుంచి మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ నిర్వాహకులను ఆదేశించారు. గురువారం మండలంంలోని నిడిగొండ పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. కొనుగోళ్లకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. సన్న ధాన్యం విక్రయించిన రైతులకు బోనస్ వస్తుందా? అని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన సందర్శించి భూ భారతి, రెవెన్యూ సమస్యలపై అధికారులతో సమీక్షించారు. ఆయన వెంట తహసీల్దార్ ఫణికిషోర్ ఉన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలిరఘునాథపల్లి: ఎన్నికల కమిషన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అడిషనల్ కలెక్టర్ పింకేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం మండలంలోని ఖిలాషాపూర్ పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్రంలో నామినేషన్లు వేసే ప్రక్రియను పరిశీలించారు. అభ్యర్థులు సమర్పించే నామినేషన్లలో సంతకాలు, వారికి సంబంధించిన పూర్తి సమాచారం పొందుపరుస్తున్నారా, ఏమైనా తప్పులు దొర్లుతున్నాయా అని పీఓలను అడిగి తెలుసుకున్నారు. అలాగే మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల సామగ్రి పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ గార్లపాటి శ్రీనివాసులు, ఎంపీఓ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. ఉజ్వలసాయిప్రసన్న -
నిబంధన ఎత్తివేత హర్షణీయం
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేయడం హర్షణీయం. గత 30 ఏళ్లుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటున్నప్పటికీ ముగ్గురు సంతానం ఉండడంతో నేరుగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు. మూడు దశాబ్దాలుగా అవకాశం కోసం ఎదురుచూస్తున్నాం. – ఇల్లందుల సుదర్శన్, దళిత సంఘాల రాష్ట్ర నాయకుడుసర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారికి ఇద్దరు పిల్లల నిబంధన తొలగిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ నిబంధన రద్దు కావడంతో నేటి నుంచి జరుగబోయే సర్పంచ్ ఎన్నికల్లో అందరికీ పోటీ చేసే అవకాశం ఉంటుంది. – రిజ్వాన్ బాషా షేక్, కలెక్టర్ -
ప్రతీ కార్యకర్త కథానాయకుడే
జనగామ: పంచాయతీ ఎన్నికల సమయంలో కేసీఆర్‌లాంటి నాయకున్ని ఇబ్బంది పెట్టకుండా ప్రతీ కార్యకర్త కథానాయకుడు కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ నెల 29న కేసీఆర్ దీక్షా దివస్ సందర్భంగా బుధవారం వరంగల్ పర్యటనను పురస్కరించుకుని జనగామ య శ్వంతాపూర్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో కలిసి కేటీఆర్ మాట్లాడారు.. చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ త్యాగం 16 ఏళ్ల పిల్లలకు తెలిసేలా దీక్షా దివస్ నిర్వహించాలన్నారు. జిల్లాలో దయాకర్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తాటికొండ రాజయ్యలాంటి మాస్ నాయకత్వం ఉందని, ముగ్గురు లీడర్ల పోరాట పటిమ గొప్పదన్నారు. కార్యకర్తల జోష్ చూస్తుంటే జనగామలో ఊరు, మునిసిపల్, సర్పంచ్, వార్డులు, జెడ్పీ, ఎంపీటీసీ స్థానాల్లో గులాబీ జెండా రెపరెపలాడడం ఖాయమనే కాన్ఫిడెన్స్ తనకు ఉందన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చిన పార్టీ మారిన కడియం శ్రీహరికి అక్కడి ఓటర్లు కర్రు కాల్చివాత పెట్టేందుకు ఎదురుచూస్తున్నారన్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వం తమ పార్టీలోకి రావాలని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, తన చివరి రక్తం బొట్టు వరకు కేసీఆర్‌తో ఉంటానని, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ తన విధేయతను చాటి చెప్పడం ఆయన నిజాయితీకి నిదర్శనమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చినట్టే ఇచ్చి, మగవారికి మాత్రం జేబులు గుల్లచేస్తున్నాడని ఆరోపించారు. చీరల పేరిట రూ.300 చీరను రూ.1200గా చూపించి, సీఎం రేవంత్‌రెడ్డి వాటిపై రూ.450కోట్ల రుణం తీసుకున్నారన్నారు. బీసీ రిజర్వేషన్ల పేరిట సీఎం చేసిన నాటకాలు బయటపడ్డాయన్నారు. కేసీఆర్ చేపట్టిన సమగ్ర సర్వేలో బీసీలు 51శాతం ఉన్నారని తేలిస్తే, రేవంత్‌రెడ్డి కులగణనతో రేవంత్‌రెడ్డి 46 శాతానికి తగ్గించారన్నారు. ప్రభుత్వంలో మంత్రులు ప్రజాసమస్యలను గాలికి వదిలేయడంతోనే జనగామలో బ్రిడ్జి నిర్మాణం కోసం ఐదుగురు యువకులు గాడిదలకు వినతి పత్రం ఇచ్చి తమ నిరసననను ప్రజాస్వామ్యబద్ధంగా తెలిపితే జైలులో పెట్టడం సిగ్గుచేటన్నారు. నేటితరం పిల్లలకు కేసీఆర్ పోరాటం గురించి చెప్పాలి ‘స్టేషన్’లో కడియంకు కర్రుకాల్చి వాతపెట్టడం ఖాయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఊసరవెల్లికి మారుపేరు కడియం శ్రీహరి:ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి గులాబీ జెండా నీడన ఎమ్మెల్యేగా విజయం సాధించిన స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఊసరవెల్లికి మారుపేరని, కాంగ్రెస్‌లో చేరి ద్రోహిగా మిగిలిపోయారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. ఉప ఎన్నికలు వస్తే కడియంను చిత్తుగా ఓడించేందుకు ఆ నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. జూబ్లీహిల్స్ లాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు: ఎర్రబెల్లి జూబ్లీహిల్స్‌లాంటి ఉప ఎన్నికలను తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆయన మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో ఓడిపోతే ముఖ్యమంత్రి సీటు పోతుందనే భయంతో వందల కోట్లు ఖర్చుపెట్టి చావుతప్పి, కన్నులొట్టపోయిన చందంగా గెలిచారన్నారు. కడియంకు సీఎం చివాట్లు: పోచంపల్లి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించగానే, రాజీనామా చేస్తా అంటూ కడియం సీఎం వద్దకు వెళితే చివాట్లు పెట్టి పంపించారని ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ‘దొంగ ఓట్లతో గెలిచాం.. మరో సారి ఉపఎన్నికంటూ వెళితే ఓటమి తప్పదు..’అని సీఎం హెచ్చరించడంతో రాజీనామా చేసేది లేదంటూ కడియం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారన్నారు. -
ఇద్దరు కాదు..ముగ్గురున్నా ఓకే
జనగామ: తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్ చట్టం–2018లో కీలక నిబంధనను రద్దు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్ పంచాయతీ ఎన్నికల్లో కీలకం కానుంది. ఉమ్మడి రాష్ట్రంలో 1994లో ఏపీ పంచాయతీ రాజ్ చట్టం నుంచి తీసుకున్న ఇద్దరు పిల్లల నిబంధన అమలులోకి వచ్చింది. మూడు దశాబ్దాల్లో రాష్ట్రంలో సమాజంలో పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి. ఆరోగ్య సేవల అభివృద్ధి, మహిళల్లో విద్యావకాశాలు పెరగడం, కుటుంబ నియంత్రణపై అవగాహన పెరగడం, ఆర్థిక స్థిరత్వం పెరగడం వంటివి జననాల రేటును గణనీయంగా తగ్గించాయి. జననరేటు ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో రాష్ట్ర జనాభా తగ్గుదలతో కార్మిక శక్తిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఇద్దరు పిల్లల నిబంధనను రద్దు చేసింది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఎలక్షన్లలో పోటీ చేసే అవకాశం కల్నించాలనే ఉద్దేశంతో పంచాయతీ రాజ్ చట్టం–2018 లోని సెక్షన్ 21(3) ఇద్దరు పిల్లల నిబంధనను పూర్తిగా తొలగించారు. పంచాయతీ రాజ్ ఎన్నికల్లో ఇంతకాలం అర్హత కోల్పోయిన వేల మందికి తిరిగి పోటీ చేసే అవకాశం వచ్చేసింది. పంచాయతీచట్టంలో కీలకమార్పు..ఇద్దరు పిల్లల నిబంధన రద్దు మూడు దశాబ్దాల తర్వాత ముగ్గురు పిల్లల ఆశావహులకు వరం -
మొదటి విడతకు రెడీ
● 5 మండలాల్లో పకడ్బందీ ఏర్పాట్లు ● 30 క్లస్టర్లుగా విభజన.. ● 110జీపీలు, 1,024 వార్డులకు ఎన్నికలుజనగామ: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఈనెల 27 (గురువారం) నుంచి అధికారికంగా ప్రారంభం కానుండగా, జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 12 మండలాలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. జిల్లా పరిధిలో 4,01,496 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,98,715, మహిళలు 2,02,963, ఇతరులు 8 మంది ఉన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని చిల్పూరు, స్టేషన్‌ఘన్‌పూర్, రఘునాథపల్లి, జఫర్‌గఢ్, లింగాలఘణపురం మండలాల పరిధిలోని 110 గ్రామపంచాయతీలు, 1,024 వార్డుల్లో మొదటి విడత నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. అభ్యర్థుల సౌకర్యార్థంతో పాటు దూరభారాన్ని తగ్గించేందుకు మూడు నుంచి నాలుగు గ్రామాలను కలిపి మండలంలో క్లస్టర్లుగా విభజించి, ఒక్కో కేంద్రాల్లో స్టేజ్–1 ఆర్ఓ(ఏఆర్‌ఓతో కలిసి) నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల స్వీకరణ పూర్తయిన తర్వాత స్టేజ్–2 ఆర్ఓల పర్యవేక్షణలో ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రక్రియ జరుగనుంది. లింగాలఘణపురంలో (6క్లస్టర్లు), స్టేషన్‌ఘన్‌పూర్‌లో (6), చిల్పూరులో (4), రఘునాథపల్లి(7), జఫర్‌గఢ్(7) మొత్తంగా 30 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. మొదటి విడత నామినేషన్లను పురస్కరించుకుని బ్యాలెట్ బాక్స్, మెటీరియల్‌ను కలెక్టరేట్ స్ట్రాంగ్‌రూం నుంచి తరలించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, శాంతియుతంగా జరిగేందుకు అధికారులు విస్తృతమైన ప్రణాళిక రూపొందించారు. పోలింగ్ స్టేషన్లకు అదనపు సిబ్బంది, మైక్రో అబ్జర్వర్లు కూడా నియమించనున్నారు. డీసీపీ రాజమహేంద్రనాయక్ ఆదేశాల మేరకు ఏఎస్పీ పండేరీ చేతన్ నితిన్, ఏసీపీ భీంశర్మ ఆధ్వర్యంలో సీఐ, ఎస్సైల ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన బందోబస్తు చేపట్టనున్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 2,534 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇందులో 100 ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు 757, 101–200 ఓటర్లు–1,089, 201–400 ఓటర్లు– 659, 401–650 ఓటర్లు–29, కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, సమర్థత కోసం ప్రతి విభాగానికి 13 మంది ప్రత్యేక నోడల్ అధికారులను కేటాయించారు. వారిలో పింకేశ్ కుమార్ (డీఈఓ, అదనపు కలెక్టర్), టి.వెంకట్‌రెడ్డి(డీఎల్పీఓ), జి.వి.ఎస్.గౌడ్ (డీటీఓ), మాధురి కృష్ణచంద్ర షా (జెడ్పీ సీఈఓ), ఎన్. రాణాప్రతాప్(ఫిషరీష్ ఆఫీసర్), పి.చిన్ని కోట్యా నాయక్ (సీపీఓ), కె.కోదండరాములు (డీసీఓ), బి.మాత్రునాయిక్ (హౌజింగ్ పీడీ), ఎ.నవీన్ (డీపీఓ), బి.పల్లవి (డీపీఆర్ఓ), ఒ.గౌతమ్‌రెడ్డి (ఈడీఎం), బి.నరేంద్ర (డీఎం), డి.సరిత (డిప్యూటీ సీఈఓ) ఉన్నారు.కలెక్టరేట్ స్ట్రాంగ్ రూంలో జీపీ ఎన్నికల మెటీరియల్, బ్యాలెట్ బాక్స్‌ల తరలింపు స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం: మండలం జీపీ వార్డులు పురుష మహిళా ఇతరులు మొత్తం పోలింగ్ ఓటర్లు ఓటర్లు కేంద్రాలు చిల్పూరు 17 168 16,473 16,853 1 33,327 168 స్టేషన్‌ఘన్‌పూర్ 15 146 13,177 13,387 – 26,564 146 రఘునాథపల్లి 36 320 22,279 22,729 2 45,010 320 జఫర్‌గఢ్ 21 194 16,928 17,320 1 34,249 194 లిం.ఘణపురం 21 196 16,323 17,033 – 33,356 196 మొత్తం 110 1,024 85,180 87,322 4 1,72,506 1,024 జనగామ నియోజకవర్గం: జనగామ 21 198 16,892 17,092 – 33,984 198 నర్మెట 17 148 10,121 10,396 – 20,517 148 తరిగొప్పుల 15 126 8,009 8,079 – 16,088 126 బచ్చన్నపేట 26 238 19,322 20,208 1 39,531 238 మొత్తం 79 710 54,344 55,775 1 1,10,120 710 పాలకుర్తి నియోజకవర్గం: దేవరుప్పుల 32 274 18,610 18,723 – 37,333 274 పాలకుర్తి 38 336 26,189 26,675 1 52,865 336 కొడకండ్ల 21 190 14,202 14,468 2 28,672 190 మొత్తం 91 800 59,001 59,866 3 1,18,870 800 -
వైజ్ఞానిక పండుగకు వేళాయె
జనగామ రూరల్: విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక అంశాలపై ఆసక్తి పెంపొందించి నూతన ఆవిష్కరణలను గుర్తించేందుకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈనెల 27 నుంచి రిజిస్ట్రేషనప్రక్రియ ప్రారంభించనున్నారు. జిల్లా స్థాయి సైన్స్ఫెయిర్తో పాటు ఇన్స్పైర్ మనక్ ఎగ్జిబిషన్ నిర్వహణకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి పాఠశాల నుంచి 5 ప్రాజెక్టులు జిల్లా సైన్‌న్స్ ఎగ్జిబిషన్‌కు ప్రదర్శన థీమ్ ‘వికసిత్, ఆత్మనిర్బర్ భారత్ కోసం..’ అనే ప్రధాన అంశంలో భాగంగా స్వయం సమృద్ధి భారత దేశం కోసం శాస్త్ర సాంకేతిక రంగాలైన సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం ప్రధాన అంశంగా ఎంపిక చేశారు. ఇందులో ఏడు ఉప అంశాలైన సుస్థిర వ్యవసాయం, వ్యర్థపదార్థాల నిర్వహణ ప్రత్యామ్నాయ ప్లాస్టిక్, హరితశక్తి(పునరుత్పాదక శక్తి), అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, వినోదభరితమైన గణిత నమూనాలు, ఆరోగ్యం, పరిశుభ్రత, నీటి సంరక్షణ నిర్వహణపై విద్యార్థులు ప్రాజెక్టుల ప్రదర్శనలు ఉంటాయి. రెండు రోజుల పాటు ప్రదర్శనలు ఎగ్జిబిషన్‌కు 27న సాయంత్రం 5 గంటల వరకు ప్రాజెక్టులు, పాఠశాల పేర్లను రిజిస్ట్రేషన్ చేస్తారు. రెండో రోజు ప్రదర్శనలు ప్రారంభంతో పాటు ప్రాజెక్టుల ప్రదర్శనతో పాటు సాయంత్రం ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడం అనే అంశంపై ప్రత్యేక సెమినార్ నిర్వహించనున్నారు. 28 తేదీల్లో జనగామ, లింగాల ఘణపురం, రఘునాథపల్లి, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల మండలాల విద్యార్థులు ప్రదర్శనలు తిలకిస్తారు. 29న స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల, చిల్పూర్ మండలాలు ఉంటాయి. నిబంధనలు ఇలా.. జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల నుంచి సైన్స్ ఎగ్జిబిషన్‌ను 333 ప్రాజెక్టులను ప్రదర్శించనున్నారు. ఎగ్జిబిషన్లో జూనియర్ విభాగంలో 6 నుంచి 8వ తరగతి వరకు, సీనియర్ విభాగంలో 9 నుంచి 12వ తరగతి వరకు ప్రతి ఉప అంశానికి ఒకరు చొప్పున ప్రాజెక్టులను ప్రదర్శించాలి. ఒక పాఠశాల నుంచి 5 మాత్రమే ప్రదర్శనకు అవకాశం ఉంటుంది. పాఠశాల నుంచి ఒక గైడ్ టీచర్ పాల్గొనాలి. జిల్లా ఇన్స్పైర్ మనక్ ప్రదర్శనలు జిల్లా స్థాయి ఇన్స్పైర్ ప్రదర్శన (2024–25)ను కూడా జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్(2025–26)తో పాటు నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇన్స్పైర్ (2024–25)లో జిల్లాస్థాయికి ఎంపికై న 77 ( ప్రాజెక్టులు) మంది విద్యార్థులు సైతం ఇందులో పాల్గొననున్నారు. ఎంపికై న విద్యార్థుల ఖాతాల్లో రూ.పదివేల చొప్పున డబ్బులు జమ చేస్తారు. ప్రధాన అంశంతో పాటు ఏడు ఉప అంశాల్లో 333 ప్రదర్శనలు ఇన్స్పైర్ మనక్ ఎగ్జిబిట్స్ 77 జిల్లా కేంద్రంలోని సాన్ మారియా పాఠశాలలో ఏర్పాట్లు పూర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించే జిల్లా సైన్స్ ఫెయిర్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. అధికారుల సమన్వయంతో 333 అవిష్కరణలు ప్రదర్శించనున్నారు. వీటితో పాటు 77 మనక్ ఇన్స్పైర్ ప్రాజెక్ట్‌లు ఉంటాయి. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. నూతన అవిష్కరణలకు చక్కటి అవకాశం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. – పింకేశ్ కుమార్, అదనపు కలెక్టర్, డీఈఓనూతన అవిష్కరణకు విద్యార్థుల్లో దాగిఉన్న నైపుణ్యాలను వెలికి తీసే గొప్ప అవకాశం. ప్రతీ ఒక్కరు దీనిని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి పాఠశాల నుంచి 5 ఎగ్జిబిట్లు ప్రదర్శించేలా ఉపాధ్యాయులు శ్రద్ధ చూపించాలి. – శ్రీనివాస్‌రావు, ఏఎంఓ -
పకడ్బందీగా ఎన్నికల ఏర్పాట్లు
జనగామ: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణీ కుముదిని ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి పంచాయతీ ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో ఆమె బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ 11, 14, 17న మూడు విడతల్లో పంచాయతీ ఎలక్షన పోలింగ్ ఉంటుందన్నారు. పోలింగ్ కేంద్రాల జియో లోకేషన్ వివరాలు టి–పోల్ వెబ్సైట్లో పొందుపరచాలని తెలిపారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అప్పీళ్ల పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటి చేసే అభ్యర్థుల ప్రకటన పకడ్బందీగా చేపట్టాలన్నారు. అనంతరం కాన్ఫరెన్‌న్స్ హాల్లో జరిగిన శిక్షణలో అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్‌తో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాల్గొని మాట్లాడారు..ఎన్నికల నిర్వహణలో ప్రతీ అధికారి పాత్ర కీలకమైందని, విధులు నిర్వహించే అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. సమావేశంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏఎస్పీ పండేరీ చేతన్ నితిన్, జెడ్పీ సీఈఓ మాధురి షా, డీఆర్డీఓ వసంత, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు. వీసీలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణీ కుముదిని -
‘నజరానా’ నారాజ్!
● ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10లక్షలు ఒట్టిదేనా? ● ఇప్పటికీ ఒక్క రూపాయీ ఇవ్వలేదంటూ ప్రజల చర్చ లింగాలఘణపురం: సర్పంచ్ ఎన్నికల్లో ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం గత ఎన్ని కల సమయంలో రూ.10లక్షల నజరానా ప్రకటించి నేటికీ ఏ ఒక్క పంచాయతీకి కూడా అందజేయలేదు. ఎన్నోసార్లు ఆయా గ్రామాల ఏకగ్రీవ సర్పంచ్‌లు అధికారులకు, మంత్రులు, ఎమ్మెల్యేలకు విన్నవించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో మళ్లీ ఎన్నికలొచ్చేసరికి గ్రామాల్లో చర్చమొదలైంది. ‘గప్పుడే చెప్పిండ్రు..అంతా ఒట్టిదే అయ్యింది.. ఇంతవరకు ఏ ఒక్క పంచాయతీకి ఒక్కపైసా రాలే..గట్లనే అంటరు ఏం ఇయ్యరు..’అంటూ చ ర్చించుకుంటున్నారు. మండలంలో 21 పంచాయతీలకు గాను సిరిపురం, ఏనెబావి, మంథోనిగూడెం, నేలపోగుల ఏకగ్రీవం కావడంతో ఎంతో ఉత్సాహంతో సర్పంచ్‌లు గ్రామాభివృద్ధికి పాటు పడగా నజరానా రాకపోవడంతో నిరాశలో పడ్డారు. -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం కావాలి
స్టేషన్‌ఘన్‌పూర్: ధాన్యం కొనుగోళ్లను వేగవంతంగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) బెన్ షాలోమ్ అన్నారు. మండలంలోని విశ్వనాథపురం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న రైతులు, కొనుగోలు కేంద్రం నిర్వాహకులతో మాట్లాడుతూ.. కొనుగోళ్ల తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ సదస్సుల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ డీఎస్ వెంకన్న, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఆర్ఐలు శ్రీకాంత్, సతీశ్, ఏపీఎం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ -
వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం
పాలకుర్తి టౌన్: శ్రీచండికా సమేత సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో బుధవారం సుబ్రహ్మణ్య షష్ఠి పురస్కరించుకొని శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి పంచామృత విశేష అభిషేకం, వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న, సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, ఆలయ ప్రధాన అర్చకులు దేవగిరి లక్ష్మన్న, అర్చకులు డీవీఆర్ శర్మ, దేవగిరి అనిల్‌కుమార్, మత్తగజం నాగరాజు, భక్తులు పాల్గొన్నారు. జిల్లా ఎన్నికల అబ్జర్వర్‌గా ఐఏఎస్ నిఖిలజనగామ: గ్రామపంచాయతీ ఎన్నికల పర్యవేక్షణ కోసం జనగామ జిల్లా ఎలక్షన్ జనరల్ అబ్జర్వర్‌గా డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్్స్టిట్యూట్ జాయింట్ డైరెక్టర్ జనరల్, ఐఏఎస్ అధికారి కె.నిఖిలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నిఖిలకు లింగాలఘణపురం తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జి.భగత్‌ను లైజన్ ఆఫీసర్‌గా నియమించారు. రాజ్యాంగంపై విద్యార్థులకు అవగాహన ఉండాలిజనగామ రూరల్: విద్యార్థులకు రాజ్యాంగంపై తప్పనిసరిగా అవగాహాన ఉండాలని సీనియర్ సివిల్ జెడ్జి ఈ. సుచరిత అన్నారు. బుధవారం జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ లా సంవిధాన్ డే సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ ఆదేశాల మేరకు పట్టణంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ ఎం.రవీంద్ర, ప్రధానో పాధ్యాయుడు శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. అంతర్జాతీయ సమ్మేళనానికి నర్మెట విద్యార్థులునర్మెట: మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల విద్యార్థులు బాలసాహిత్యభేరి పేరుతో అంతర్జాతీయ బాల రచయితల సమ్మేళనం కార్యక్రమానికి ఎంపికై నట్లు ఆ పాఠశాల హెచ్ఎం నీలం వేణు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. తానా ప్రపంచ సాహిత్య వేదిక నవంబర్ 30న నిర్వహిస్తున్న సమ్మేళనానికి పాఠశాల 8వ తరగతి విద్యార్థిని ఎం.అభినిష, పదో తరగతి విద్యార్థిని ఎం.శ్రుతి ఎంపికై నట్లు పేర్కొన్నారు. -
మహిళా సాధికారతకు పెద్దపీట
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్‌ఘన్‌పూర్: దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళల ఆర్థికాభివృద్ధి, సంక్షేమానికి, సాధికారతకు సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన 8,178 మహిళా సంఘాలకు రూ.17.36 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల వడ్డీ రాయితీ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆడపడుచులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చీరలు పట్టు చీరలలాగా ఎంతో బాగున్నాయని..‘ఎంపీ అయిన మా కావ్యకు కూడా ఒక చీర ఇవ్వాలి’ అని కలెక్టర్‌ను కోరారు. ‘తాను ఊరికే అనడం లేదని, ఇకపై మహిళలకు సంబంధించిన సమావేశాలకు ఆ చీరను ధరించి రావాలని, మహిళా సంఘాలకు చెందిన పాటను పాడుతూ వారితో కలిసి ఆడిపాడాలి..’అని కావ్యకు ఎమ్మెల్యే కడియం సూచించగా కలెక్టర్, ఎంపీతో పాటు సభికులందరి ముఖాల్లో నవ్వుల పూలుపూయించారు. కార్యక్రమంలో ఎంపీ కావ్య, కలెక్టర్ రిజ్వాన్ బాషా, డీఆర్డీఓ వసంత, డీపీఎం సతీష్, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ కొల్లూరి నర్సింహులు, ఘన్పూర్ మండల సమాఖ్య అధ్యక్షురాలు బేతి మంజుల, కోశాధికారి వి.లక్ష్మి, ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు. -
ప్రజల్లో చైతన్యం రగిలించిన వందేమాతరం
స్టేషన్‌ఘన్‌పూర్: దేశస్వాతంత్య్ర ఉద్యమంలో వందేమాతర గేయం ప్రజల్లో ఉత్తేజాన్ని, చైతన్యాన్ని నింపిందని వందేమాతరం గేయాలాపన ప్రోగ్రాం రాష్ట్ర కన్వీనర్ నాగపురి రాజమౌళిగౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ అన్నారు. వందేమాతరం గేయాన్ని బంకించంద్రఛటర్జీ రచించి 150 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో వందేమాతరం సామూహిక గేయాలాపన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. స్థానిక ప్రభు త్వ, ప్రైవేటు కళాశాలల విద్యార్థులతో కలిసి జాతీ య జెండాలను చేతబూని వందేమాతరం అంటూ నినాదాలు చేస్తూ ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక శివాజీ చౌక్ వద్ద సామూహికంగా వందేమాతరం ఆలపించారు. మండల అధ్యక్షుడు సట్ల వెంకటరమణగౌడ్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో పార్లమెంట్ కోకన్వీనర్ ఇనుగాల యుగేందర్‌రెడ్డి, నాయకులు ఐలోని అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వందేమాతరం గేయాలాపన ప్రోగ్రాం రాష్ట్ర కన్వీనర్ నాగపురి రాజమౌళిగౌడ్ -
బుధవారం శ్రీ 26 శ్రీ నవంబర్ శ్రీ 2025
జనగామ: రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేసింది. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. నామినేషన్లు, పరిశీలన, ఉపసంహరణ, అభ్యర్థుల జాబితా, పోలింగ్ తేదీలు, ఓట్ల లెక్కింపు తదితర కార్యక్రమాల తేదీలు అధికారికంగా ప్రకటించారు. ఈసీ ప్రకటనతో గ్రామాలన్నీ ఎలక్షన్ మూడ్‌లోకి వెళ్లిపోయాయి. జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలైంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో అభివృద్ధి పనులకు బ్రేక్ పడనుంది. మూడు దశల్లో పోలింగ్.. జిల్లాలో ఎలక్షన్లు మూడు దశల్లో జరగనున్నాయి. జిల్లాలోని 12 మండలాలు, 280 గ్రామ పంచాయతీలు, 2,534 వార్డులకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 11వ తేదీన తొలి విడత, 14వ తేదీన రెండో విడత, 17వ తేదీన మూడో విడత ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి ఫేజ్ నామినేషన్ నవంబర్ 27, రెండో ఫేజ్ నామినేషన్ నవంబర్ 30, మూడో విడత నామినేషన్ డిసెంబర్ 3వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఎన్నికల ఒక దశ మరొక దశకు మధ్య 2 రోజుల వ్యవధి ఉండనుంది. ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన సమయం నుంచి జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. బాధ్యతల కేటాయింపు.. ఎన్నికల నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని ఆర్ఓలు, ఏఆర్ఓలు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్లు, ఏిపీఓలు, ఓపీఓలకు బాధ్యతలు కేటాయించారు. పోలింగ్ సెంటర్లు, సీసీ కెమెరాలు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, మోడల్ కోడ్ పర్యవేక్షణ బృందాలు ఇక రంగంలోకి దిగనున్నాయి. పంచాయతీ ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డబ్బులు, బహుమతుల ద్వారా ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలను అరికట్టేందుకు ప్రత్యేక స్క్వాడ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ప్రతీ పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలతో పకడ్బందీ పర్యవేక్షణ ఉండనుంది. జిల్లాలో మూడు విడతల్లో ఎలక్షన్లు 280గ్రామ పంచాయతీలు, 2,534 వార్డులు.. అమలులోకి మోడల్ కోడ్ అభివృద్ధి పనులకు బ్రేక్మూడు విడతల్లో ఎన్నికలు జరిగే మండలాల సమాచారంఫేజ్ మండలాలు జీపీలు వార్డులు ఫేజ్–1 చిల్పూరు, స్టేషన్‌ఘన్‌పూర్, 110 1,024 రఘునాథపల్లి, జఫర్గడ్, లింగాలఘణపురం ఫేజ్–2 జనగామ, నర్మెట, తరిగొప్పుల, బచ్చన్నపేట 79 710ఫేజ్–3 దేవరుప్పుల, పాలకుర్తి, 91 800 కొడకండ్ల -
అనాథ పిల్లలకు చేయూత
జనగామ: జనగామ పట్టణం నెహ్రూ పార్క్ ఏరియాలోని సెయింట్‌పాల్స్ స్కూల్ యాజమాన్యంతో పాటు విద్యార్థులు సోమవా రం అనాథ పిల్లలకు భారీ విరాళం అందజేశారు. పాఠశాలలో నిర్వహించిన బాలల దినో త్సవం, ఫుడ్ ఫెస్టివల్లో భాగంగా సేకరించిన రూ.1,12,217లను కరుణాలయం ఆశ్రమంలో తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మరియ జోసఫ్ ఆధ్వర్యంలో ఫాదర్ అలెక్స్‌కు విరాళంగా అందించారు. అనంతరం మరియ జోసఫ్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. సెయింట్‌పాల్స్ విద్యార్థులు చదువుతో పాటు సేవాపరంగా ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారన్నారు. కొమురవెల్లి ఆలయ ఉత్సవ కమిటీ సభ్యుడిగా నర్సింహారెడ్డినర్మెట: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి దేవస్థాన ఉత్సవ కమిటీ సభ్యుడిగా మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, డీసీసీ ఉపాధ్యక్షుడు గంగం నర్సింహారెడ్డి ఎంపికయ్యారు. ఈపదవిలో డిశంబర్ 10 నుంచి 2026 మార్చి 21 వరకు ఆయన కొనసాగనున్నట్లు దేవాదాయ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, గడ్డం వివేక్, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ శాసన సభ్యుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి తదితర నాయకులకు ఈసందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ నిర్మాణానికి రూ.50వేల విరాళంబచ్చన్నపేట: మండలంలోని రామచంద్రాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ శివసీతారామాంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి దాతలు ఆర్థిక సహాయాన్ని అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. మంగళవారం వారు మాట్లాడుతూ.. గ్రామానికి ఎండీ షర్పద్దీన్ తన నానమ్మ, తాత ఎండీ సకినాబి, బాస్మియా, తండ్రి మునిరుద్దీన్ జ్ఞాపకార్థం రూ.50,116లను విరాళంగా అందించారు. ముస్లిం అయి ఉండి కూడా హిందూ దేవాలయానికి ఆర్థిక సహాయం అందించిన షర్పద్దీన్ను గ్రామస్తులు అభినందించారు. కార్యక్రమంలో సిద్దేశ్వరాలయ కమిటీ చైర్మన్ ఆముదాల మల్లారెడ్డి, నాయకులు సుంకె కనుకయ్య, నాచగోని సిద్దులు, బండపల్లి శంకరయ్య, బక్కెర సిద్దయ్య, నర్మెట చంద్రమౌళి, అంజనేయులు, జయరాం, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ‘టీచర్ల తనిఖీ బృందం’లో చోటు కోసం పైరవీలు? జనగామ: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన, ఉపాధ్యాయుల పనితీరు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, తదితర వాటి పర్యవేక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన టీచర్ల తనిఖీ ప్రోగ్రాంలో పైరవీలకు పెద్దపీట వేస్తున్నారనే సమాచాం వినిపిస్తోంది. జిల్లాలో టీచర్ల తనిఖీ బృందాలకు సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో తుది జాబితా విడుదల కానుంది. ఈనేపథ్యంలో తనిఖీ బృందాల్లో తాము సైతం ఉండబోతున్నామనే కొందరి ప్రచారంతో ఉపాధ్యాయ సంఘాల్లో వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. తనిఖీల కోసం దరఖాస్తు చేసుకున్న టీచర్లు పని చేసే బడుల్లో గత ఏడాది, ప్రస్తుతం పరిశీలిస్తే విద్యార్థుల సంఖ్య తగ్గినట్టు తెలుస్తోంది. బడుల్లో పిల్లల సంఖ్య తగ్గుముఖం పడుతున్నా.. పట్టింపుల్లేకుండా వ్యవహరించే పలువురు టీచర్లు తనిఖీ అధికారిగా బాధ్యతలు వచ్చేస్తున్నాయని ముందస్తుగా తమ సహచర టీచర్లతో మాట్లాడుకోవడం విద్యాశాఖలో చర్చకు దారి తీస్తోంది. తనిఖీ బృందానికి సంబంధించి అత్యంత సీక్రెట్‌గా జాబితా తయారు చేస్తున్నప్పటికీ, ముందస్తు లీకేజీలు ఏంటనే ప్రశ్న విద్యాశాఖ పనితీరును ఎండగడుతుంది. క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలికేయూ క్యాంపస్ : చదువుతోపాటు క్రీడలపై ఆసక్తిని పెంచుకోవాలని కాకతీయ యూనివర్సిటీ స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ ప్రొఫెసర్ వై.వెంకయ్య సూచించారు. మంగళవారం కేయూలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో స్పోర్ట్స్‌డే సందర్భంగా వివిధ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కె. భిక్షాలు మాట్లాడుతూ.. కళాశాలలో ప్రతి ఏటా విద్యార్థినులకు క్రీడాపోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. -
సాధారణ ప్రసవాలు పెంచాలి
జనగామ: ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలను పెంచడంతో పాటు రెగ్యులర్ డెలివరీల సంఖ్య పెరగాలని వరంగల్ ఎంపీ, దిశ కమిటీ చైర్మన్ కడియం కావ్య అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం హాలులో ఎంపీ కడియం కావ్య అధ్యక్షతన దిశ (జిల్లా అభివృద్ధి సహకార మానిటరింగ్ కమిటీ) సమావేశం జరిగింది. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్లు పింకేశ్ కుమార్, బెన్ షాలోమ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్ పాల్గొనగా, జిల్లా గ్రామీణభివృద్ధిశాఖ, విద్య, వైద్యం, ఆరోగ్యం, జాతీయ రహదారుల విభాగం, రోడ్లు భవనాలు, తదితర శాఖల ద్వారా అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల పురోగతిపై సమీక్షించారు. ఈసందర్భంగా ఎంపీ కావ్య మాట్లాడుతూ.. పేదలకు సేవ చేయడమే మనందరి లక్ష్యమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా నేతృత్వంలో జిల్లా యంత్రాంగం కృషితో అభివృద్ధి, అవార్డులు, పథకాల్లో జనగామ కేంద్ర, రాష్ట్ర స్థాయిలో దూసుకుపోతోందని కితాబిచ్చారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. జిల్లాలో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు. 12 మండలాల్లో మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా ఒక సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని తెలిపారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ.. విద్యాశాఖను బలోపేతం చేసేందుకు చేపట్టిన వివిధ కార్యక్రమాలతో మంచి సత్ఫలితాలను ఇచ్చిందన్నారు. సాధారణ ప్రసవాలపై ఎంపీ అసంతృప్తి జిల్లాలోని ఎంసీహెచ్, సీహెచ్‌సీల్లో వచ్చే మూడు నెలల కాలంలో 70శాతానికి పైగా సాధారణ ప్రసవాలు పెంచాలని ఎంపీ కడియం కావ్య సూచించగా.. జిల్లావె వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున్‌రావు, జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం డెలివరీ ప్రగతిని వివరించారు. 40 శాతం సాధారణ, 60 శాతం ఆపరేషన్లు జరిగినట్టు వివరించగా ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాన్పు సమయంలో సదరు కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి, సాధారణ డెలివరీకి డాక్టర్లు ప్రయత్నం చేయాలన్నారు. వచ్చే దిశ సమావేశంలో అపరేషన్ చేసిన ప్రతి డెలివరీకి సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. సంస్థాగత డెలివరీలతో పాటు సాధారణ ప్రసవాలను పెంచేలా దృష్టి సారించాలని ఆదేశించారు. గర్భిణులు మొదటి చెకప్ నుంచి చివరి వరకు ఆశాలు, ఏఎన్ఎం, అంగన్వాడీల పర్యవేక్షణ ఉండాలన్నారు. వచ్చే సమీక్షలో ప్రతీ సిజేరియన్‌కు వైద్యులు సమాధానం చెప్పాలి జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది దిశ సమీక్షలో వరంగల్ ఎంపీ, కమిటీ చైర్మన్ కడియం కావ్య రహదారులపై చర్చ జిల్లాలోని జనగామ–దుద్దెడ, వరంగల్–హైదరాబాద్ హైవేలపై చర్చ జరిగింది. పెంబర్తి నుంచి కరుణాపురం 45 కిలోమీటర్ల పరిధిలోని నిడిగొండ, ఛాగల్, చిన్నపెండ్యాల, స్టేషన్‌ఘన్‌పూర్, కరుణాపురం ఐదు లొకేషన్ల పరిధిలో రోడ్డు మరమ్మతుల కోసం రూ.5.3కోట్లు మంజూరు కాగా, పనులు ప్రారంభం కావాల్సి ఉన్నట్లు అధికారులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. రోడ్డు సేఫ్టీ కోసం 20 లొకేషన్ల పరిధిలో సోలార్ సిస్టం, ఇతర ప్రమాద నివారణ చర్యలు తీసుకునేందుకు మరో రూ.4కోట్లు మంజూరు అయినట్లు వివరించారు. మలుపులు, యూటర్న్, హైవేపై వీధి దీపాలు, ఇతర ప్రమాద ఘటనలకు సంబంధించి చర్యలు శూన్యమని ఎంపీ కావ్య అధికారుల నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేశారు. నేషనల్ హైవేపై సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదేశించారు. బచ్చన్నపేట రోడ్డు నిర్మాణానికి సంబంధించి కోర్టు ప్రాసెస్ ముగిసిన వెంటనే పనులు మొదలవుతాయని ఎన్హెచ్ఏఐ అధికారులు తెలిపారు. రహదారుల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లేకుండా తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని దిశ కమిటీ మెంబర్ బక్క శ్రీనివాస్ అన్నారు. సమావేశంలో డీఆర్డీఓ వసంత, దిశా కమిటీ సభ్యులు మాధవి, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి జనగామ రూరల్: విద్యాహక్కు చట్టం అమలుకు ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..టెట్‌పై సుప్రీంకోర్టు తీర్పు వచ్చి రెండు నెలలు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రివ్యూ పిటిషన్ వేయలేదని, కనీసం డిసెంబర్ 1 నుంచి జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనైనా చట్టాన్ని సవరించి సీనియర్ ఉపాధ్యాయుల ఉద్యోగాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రంజిత్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి మడూరి వెంకటేష్, ఆకుల శ్రీనివాసరావు, కోశాధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి
● ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పాలకుర్తి టౌన్: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య భవనంలో మండలంలోని స్వయం సహాయక సంఘాలకు రూ.6.73 కోట్లు వడ్డీరహిత రుణాల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. అలాగే ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబం, సమాజం, రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకుసాగుతాయన్నారు. అనంతరం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇందిర మహిళా శక్తి టీ పాయింట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ వసంత, ఏపీడీ నూరుద్దీన్, తహసీల్దార్ సరస్వతి, ఎండీపీఓ వేదావతి తదితరులు పాల్గొన్నారు. -
మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి
● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ రూరల్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించి అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో జనగామ పట్టణం, జనగామ, నర్మెట, తరిగొప్పుల, బచ్చన్నపేట మండలాలకు చెందిన మహిళా స్వయం సహాయక సంఘాలకు డీఆర్డీఏ ఆధ్వర్యంలో వడ్డిలేని రుణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. వడ్డీలేని రుణాల పథకం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, డీఆర్డీఏ వసంత, మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
వడ్డీలేని రుణాలు విడుదల
జనగామ: జిల్లాలో 2023 డిసెంబర్ నుంచి 2025 జూలై వరకు స్వయం సహాయ సంఘాలకు భారీగా వడ్డీ లేని రుణాలు అందిస్తున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు అనుబంధంగా ఉన్న సెర్ప్ ద్వారా సంఘాలకు ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కడియం శ్రీహరి, యశస్వినిరెడ్డి, ఎంపీలు కావ్య, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతిధుల చేతుల మీదుగా పంపిణీ చేస్తున్నారు. మొత్తంగా నాలుగు విడతల్లో జిల్లాకు 9,216 సంఘాలకు రూ.30.53 కోట్లు విడుదల చేశారు. నియోజకవర్గాల వారీగా.. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో 4,248 సంఘాలకు రూ.14.91 కోట్లు విడుదలయ్యాయి. చిల్పూర్, స్టేషన్‌ఘన్‌పూర్, లింగాలఘణపురం, రఘునాథపల్లి, జఫర్‌గఢ్ మండలాల స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నారు. జనగామ నియోజకవర్గంలో 2,558 సంఘాలకు రూ.8.89 కోట్లు మంజూరు చేశారు. రుణాలకు సంబంధించిన నిధులను బచ్చన్నపేట, జనగామ, నర్మెట, తరిగొప్పుల మండలాలకు కేటాయించారు. పాలకుర్తి పరిధిలో 2,410 సంఘాలకు రూ.6.73 కోట్లు రుణాలు మంజూరు కాగా, దేవరుప్పుల, కొడకండ్ల, పాలకుర్తి మండలాల పరిధిలోని సంఘాలు లబ్ధి పొందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సంఘాల ఆర్థిక స్థిరీకరణ కోసం ప్రభుత్వం వడ్డీలేని రుణాలను అందజేస్తోందని అధికారులు చెప్పారు. జిల్లాలోని 9,216 సంఘాలకు రూ.30.53కోట్లు పండగలా సాగుతున్న పంపిణీ -
దొంగల బెడద తప్పింది
గతంలో పొలం పనుల చేసి అలసిపోయి వ్యవసాయ పరికరాలు బావి దగ్గరే వదిలేసి ఇంటికి వెళ్లేవాళ్లం. అయితే దొంగలు మోటార్లు, స్టార్టర్లు, పశువులు, గొర్రెలు, కోళ్లను ఎత్తుకెళ్లేవారు. పంట పొలంలో ఉన్న ట్రాన్స్పార్మర్లోని కాపర్ వైరు ఎత్తుకెళ్లారు. దీంతో పలువురం రైతులం వ్యవసాయ భూమి హద్దులకు నాలుగు దిక్కుల నాలుగు సీసీ కెమెరాలను కర్రల సహాయంతో ఏర్పాటు చేసుకున్నాం. సీసీ కెమెరాల సాయంతో నా పొలం చుట్టు ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు నా ఫోన్ లోనే చూసుకుంటున్నా. – నారబోయిన పవన్‌కుమార్, రైతు, వావిలాల, పాలకుర్తి మండలం -
బాయికాడ బందోబస్తు
నిఘానీడలో వ్యవసాయ క్షేత్రాలు, డెయిరీ ఫామ్స్లింగాలఘణపురం/పాలకుర్తిటౌన్: టెక్నాలజీ సులభతరమై సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ క్షేత్రాలు, డెయిరీ ఫామ్‌లు సైతం నిరంతరం నిఘా నీడలో ఉంటున్నాయి. తక్కువ ఖర్చుతో అన్నదాతలు తమ వ్యవసాయ బావుల వద్ద ఏం జరుగుతుందనే విషయాలను తెలుసుకుంటూ ప్రశాంతంగా ఉంటున్నారు. బావుల వద్ద దొంగల బెడద, పాడిపశువులు, వ్యవసాయ పరికరాల చోరీ, లేగదూడలపై కుక్కల దాడి, పశువులు ఈనె సమయంలో రాత్రింబవళ్లు అక్కడే ఉండకుండా ఫోన్లో చూసుకుంటూ, ఏదైనా అనుకోని ఘటనతో జరిగితే తక్షణమే బావు ల వద్దకు వెళ్లి సమస్య పరిష్కారం చేసుకుంటు న్నారు. అలాగే జీతగాళ్లు వ్యవసాయ బావుల వద్ద ఉన్నారా లేదా.. రాత్రివేళల్లో ఎవరు వస్తున్నారు.. ఎటుపోతున్నారనే విషయాలను తెలుసుకొనేందుకు సోలార్ సీసీ కెమెరాలను ఏర్పా టు చేసుకొని ఫోన్లో చూసుకుంటూ పర్యవేక్షించుకుంటున్నారు. నిరక్షరాస్యులు సైతం ఆపరేట్ చేసేలా.. నిరక్షరాస్యులు సైతం తక్కువ ఖర్చుతో సోలార్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకొని ఆపరేట్ చేసుకొనే అవకాశం వచ్చింది. ఉన్నచోటు నుంచి బావి వద్ద ఉన్న సీసీ కెమెరాలో అక్కడి వ్యక్తితో మాట్లాడుకోవచ్చు. ఇలా రూ.6,700ల నుంచి స్థోమతను బట్టి రైతులు బావుల వద్ద సోలార్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవచ్చు. గతంలో మాది రిగా సీసీ కెమెరాలకు కేబుల్ అవసరం లేకుండా ఆన్లైన్లోనే ఫోన్ మాదిరిగా పని చేస్తుంది. ఆయా ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ను బట్టి సిమ్‌ను ఉపయోగించుకొని రీచార్జ్ చేసుకుంటే సరిపోతుంది. బావులు, డెయిరీ ఫామ్‌ల వద్దకు ఎవరైనా వస్తే వెంటనే ఫోన్‌కు అలెర్ట్ మెసేజ్ వస్తుంది. దీంతో రైతు ఎక్కడున్న ఫోన్లోనే చూసుకొని స్పందించవచ్చు. దొంగలు వచ్చిన, పశువులు ఈనినా, కోళ్ల దొంగతనం జరిగినా ఇలా ఏ విషయంలోనైనా చర్యలు తీసుకొని రైతులు హాయిగా ఉంటున్నారు. కెమెరాకు సంబంధించిన యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసుకుంటే రెండు, మూడు ఫోన్లకు లింక్ చేసుకోవచ్చు. మెమొరీ కార్డు ర్యామ్‌ను బట్టి వారం నుంచి నెల రో జుల పాటు రికార్డింగ్ అందుబాటులో ఉంటుంది. పలు గ్రామాల్లో సొలార్ సీసీ కెమెరాలు ఏర్పాటు చీమ చిటుక్కుమన్నా ఫోన్లో అలెర్ట్ రైతన్నకూ చేరువైన అధునాతన టెక్నాలజీ -
సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైతే రూ.25లక్షలు
స్టేషన్‌ఘన్‌పూర్: పార్టీ అభ్యర్థిని ఏకగ్రీవం చేస్తే నజరానాగా రూ.10 లక్షలు, సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేస్తే రూ.25 లక్షలు నిధులు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాన్ని ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కడియం మాట్లాడారు.. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల ఎంపిక గ్రామ కమిటీలు, మండల కమిటీలదేనని అన్నారు. ఈనెల 26వ తేదీవరకు ప్రతీ గ్రామం నుంచి ఇద్దరు, ముగ్గురు పేర్లతో అభ్యర్థుల ప్రతిపాదనలు అందించాలని గ్రామ కమిటీలు, మండల కమిటీలను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుడోజు రాంబాబు, ఏఎంసీ చైర్మన్ లావణ్యశిరీష్‌రెడ్డి, చిల్పూరు దేవస్థాన చైర్మన్ శ్రీధర్‌రావు, నాయకులు బెలిదె వెంకన్న, నూకల ఐలయ్య, కట్టా మనోజ్‌రెడ్డి, అన్నం బ్రహ్మారెడ్డి, క్రాంతి, కొలిపాక సతీష్, వెంకటేశ్వర్‌రెడ్డి, బూర్ల శంకర్, వెంకటయ్య, ఇంద్రారెడ్డి, పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
భక్తుల సౌకర్యార్థం రేకుల షెడ్డు నిర్మాణం
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఘాట్ రోడ్డు మార్గంలో భక్తుల సౌకర్యార్థం ఓ భక్తుడు రూ.5లక్షల వ్యయంతో సోమవారం నిర్మాణ పనులు ప్రారంభించినట్లు ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న తెలిపారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి గ్రామానికి చెందిన భక్తుడు వంగ సోమిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులు ఘాట్ రోడ్డు మార్గంలో ప్రయాణించే భక్తులకు ఎండా కాలం, వర్షాకాలం ఇబ్బందులు కలగకుండా ఘాట్ రోడ్డు మార్గంలో రూ. 5 లక్షల వ్యయంతో రేకుల షెడ్డు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, సిబ్బంది పాల్గొన్నారు. మాతృమరణాలు జరగకుండా చూసుకోవాలిజనగామ రూరల్: మాతృ మరణాలు జరగకుండా చూసుకోవాలని డీఎంహెచ్ఓ మల్లికార్జునరావు అన్నారు. సోమవారం పట్టణంలోని ఎంసీహెచ్‌లో ఇప్పగూడెం, నర్మెట, తరిగొప్పుల పలు పీహెచ్‌సీల్లో మాతృ మరణాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..మాతృ మరణాల ఘటనలు పునరావృతం కాకుండా నివారణ చర్యలు చేపట్టాలన్నారు. అంతేకాక నాణ్యమైన గర్భధారణ పూర్వసేవలు అందించడం, హైరిస్క్ ప్రెగ్నెన్సీలను ముందస్తుగా గుర్తించాలన్నారు. అనంతరం పట్టణంలోని ఏఎన్ఎంలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యులు కమల్ హాసన్, శ్రీతేజ, అనురాధ జాదవ్, శ్రీదేవి,అశోక్, మనస్విని, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు సింధురఘునాథపల్లి: మండలంలోని కుర్చపల్లి గ్రామానికి చెందిన తోకల సింధు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో ప్రతిభ చాటి జాతీయ స్థాయి జట్టుకు ఎంపికై నట్లు మండలంలోని గోవర్ధనగిరి గ్రామానికి చెందిన జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, ఎన్ఐహెచ్ కబడ్డీ కోచ్ తోటకూరి గట్టయ్య తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ మియాపూర్ బాచుపల్లిలో సోమవారం జరిగిన అండర్–16 రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో సింధు ప్రతిభ చాటి జాతీయ స్థాయి కబడ్డీ జట్టుకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు శిక్షణజనగామ రూరల్: విద్యార్థులకు నైతిక విలువలు, పాజిటివ్ లెర్నింగ్, వ్యక్తిత్వ వికాసం, సామాజి కాభివృద్ధి, ఆరోగ్యం, రక్షణ, నాయకత్వ ప్రస్థానం, సేవా దృక్పథం తదితర బోధనాంశాలపై ఉపాధ్యాయులు పట్టు సాధించాలని లయన్స్ క్వెస్ట్ మాస్టర్ ట్రైనర్ లయన్ కొండపల్లి రేణుక, కానుగంటి సుభాశ్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఏకశిల బీఈడీ కళాశాలలో రెండు రోజుల పాటు ఉపాధ్యాయ శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ లయన్ రామిని శ్రీనివాసులు, కారంపూడి సత్య నారాయణ, సుదగాని ప్రవీణ్, కె.రాజశేఖర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ మర్రెడ్డి పాల్గొన్నారు. -
పాడిపశువును కాపాడుకున్నా..
బావి వద్ద డెయిరీఫామ్, గొర్రెల ను పెంచుకుంటున్నా. రూ. 6,700లతో ఆన్లైన్లో సోలార్ సీసీ కెమెరాలను ఏర్పా టు చేసుకున్నా.. నెలకు రూ.300లు రీచార్జ్ చేసుకొని అక్కడ జరిగే ప్రతి అంశం ఫోన్లో రికార్డు అవుతుండగా చూసుకుంటున్నా.. ఒక రోజు పాడి ఆవు దాణా కోసం కట్టేసిన చోటు నుంచి ముందుకు వచ్చి ఎటూ వెళ్లలేక ఇబ్బంది పడుతుండగా ఫోన్లో చూసుకొని వెంటనే వచ్చి కాపాడుకున్నా. గొర్రెల దొడ్డి చుట్టూ రాత్రివేళల్లో కుక్కల మంద తిరుగుతుండగా చూసుకొని ఇంట్లోనే ఉండి వెంటనే ఫోన్లో అరవగా కుక్కలు పారిపోయాయి. – నకీర్త మల్లేశం, పాడి రైతు, కళ్లెం -
దేశాన్ని ఐక్యం చేసింది వందేమాతరమే
● బీజేపీ రాష్ట్ర నాయకుడు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిజనగామ రూరల్: దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో వందేమాతర గీతం ప్రజలను ఐక్యం చేసిందని బీజేపీ రాష్ట్ర నాయకుడు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి అన్నారు. వందేమాతర గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ ఆధ్వర్యంలో స్థానిక నెహ్రూ పార్క్ నుంచి రైల్వే స్టేషన్ వరకు పెద్దఎత్తున జాతీయ జెండాలు చేత పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. స్వతంత్ర సంగ్రామంలో వందేమాతర గేయం భారతీయులను ఉత్తేజపర్చిందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు ఆరుట్ల దశమంతరెడ్డి, కేవీఎల్ రెడ్డి, బుడుగుల రమేశ్, మహంకాళి హరిశ్చంద్రగుప్తా, డాక్టర్ భిక్షపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి భాగాల నవీన్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు బొమ్మకంటి అనిల్, సీనియర్ నాయకులు అంకుగారి శశిధర్‌రెడ్డి, బీసీ మోర్చా పట్టణ అధ్యక్షుడు శివకృష్ణ, హరి ప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆన్లైన్లో బుక్ చేసుకున్నా..
వ్యవసాయ బావుల వద్ద తరుచుగా జరుగుతున్న చిన్నచిన్న దొంగతనాలను ఎలా అరికట్టాలని ఆన్లైన్లో చూసి యూట్యూబ్‌లో అగ్రికల్చర్ సీసీ కెమెరా గురించి తెలుసుకున్నా.. రూ.8,500లకు సోలార్ సీసీ కెమెరాను కొనుగోలు చేశా. డెయిరీ ఫామ్‌లో రేకులపై సోలార్ ప్యానల్ ఏర్పాటు చేశా.. కెమెరా దొడ్లో పెట్టా. ఎవరొచ్చినా సుమారు 15 నుంచి 30 మీటర్ల దూరంలో ఉండగానే నేను ఎక్కడున్న ఫోన్‌కు మెసేజ్ వచ్చి అలెర్ట్ చేస్తుంది. దీంతో ఫోన్ చూసుకొని ఏం జరుగుతుందనే విషయాలను ఫోన్లోనే చూసుకుంటున్నా.. – బోయిని సంతోష్, పాడి రైతు, లింగాలఘణపురం -
ఎంపీడీఓ సంఘం జిల్లా కమిటీ ఎన్నిక
జనగామ రూరల్: తెలంగాణ మండల పరిషత్ అభివృద్ధి అధికారుల సంఘం జిల్లా ఎన్నికలు సోమవారం జరిగాయి. ఎన్నికల అధికారిగా జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య నిర్వహణాధికారి మాధురి కిరణ్ చంద్ర షా వ్యవహరించారు. ఈసందర్భంగా జిల్లా అధ్యక్షుడిగా కొడకండ్ల ఎంపీడీఓ పి.ఎం.ఎస్.సూరి, ప్రధాన కార్యదర్శిగా జి.మమత(ఎంపీడీఓ బచ్చన్నపేట), ట్రెజరర్‌గా వేదవతి (ఎంపీడీఓ, పాలకుర్తి), వైస్ ప్రెసిడెంట్ జి.శ్రీనివాసులు (ఎంపీడీఓ, రఘునాథపల్లి), ఆర్గనైజింగ్ సెక్రెటరీ బి.మహేశ్‌నాయక్ (ఎంపీడీఓ, జనగామ), అసోసియేట్ ప్రెసిడెంట్ శివశంకర్‌రెడ్డి (ఎంపీడీఓ లింగాల ఘనపూర్), కార్యనిర్వాహక సభ్యులుగా శంకర్ నాయక్ (ఎంపీడీఓ చిల్పూర్), కావ్య శ్రీనివాస్ ఎంపీడీఓ నర్మెట లావణ్య (ఎంపీడీఓ తరిగొప్పుల), మేనక (ఎంపీడీవో దేవరుప్పుల) ఎన్నికయ్యారు. అనంతరం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌ను, అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్తరిగొప్పుల: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, కొనుగోళ్లలో రైతుల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. మండలంలోని నర్సాపూర్, అబ్దుల్‌నాగారంలో సోమవారం ఆయన ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీని పరిశీలించారు. అనంతరం అబ్దుల్‌నాగారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేశారు. ప్రతీ మహిళకు చీర అందాలని సూచించారు. ధాన్యాన్ని తేమ శాతం రాగానే కొనాలని, ఎక్కువ రోజులు కొనకుండా ఉంచి రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కేజీబీవీని తనిఖీ చేసిన కలెక్టర్ మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. దిక్సూచిలో భాగంగా నిర్వహించిన హెల్త్ క్యాంపులో అందరికీ హెల్త్‌కార్డులు అందించారా, లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ మొగుళ్ల మహిపాల్‌రెడ్డి, ఎంపీడీఓ బోజనపల్లి లావణ్య, ఎంపీఓ కృష్ణకుమారి, ఆర్ఐ ఆంఽధ్రయ్య, మాజీ ఎంపీటీసీ తాళ్లపల్లి అనితారాజేశ్వర్గౌడ్, పంచాయతీ కార్యదర్శులు రవీందర్, శేఖర్ పాల్గొన్నారు. -
ఘనంగా కొత్తపల్లి ఉర్సు
స్టేషన్‌ఘన్‌పూర్: మండలంలోని కొత్తపల్లి గ్రామంలో దర్గా హజరత్ సయ్యద్ మీరా మొహియుద్దీన్షా ఖాద్రి రహమతుల్లా అలై ఉర్సు ఉత్సవాలను గ్రామ దర్గా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు ఉత్సవాలను ప్రారంభించగా ఏసీపీ భీమ్‌శర్మ, సీఐ జి.వేణు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉర్సు ప్రార్థనల్లో అనంతరం సందల్ ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదానం చేపట్టారు. కార్యక్రమంలో ఎస్.రాజేశ్, మాజీ సర్పంచ్ బూరు నరేందర్, దర్గా కమిటీ బాధ్యులు షౌకత్, అజ్జు, అన్వర్‌బేగ్, అమ్జద్, ఇమ్రాన్, రహీమ్, రహమాన్ తదితరులు పాల్గొన్నారు. -
రిజర్వేషన్ల వారీగా వార్డు స్థానాలు
మండలం వార్డులు 100 శాతం ఎస్టీ ఎస్సీ బీసీ జనరల్ ఎస్టీ బచ్చన్నపేట 238 – 01 44 74 119 చిల్పూరు 168 06 19 30 32 81 దేవరుప్పుల 274 40 36 40 41 117 స్టేషన్‌ఘన్‌పూర్ 146 18 – 38 26 64 జనగామ 198 06 13 39 44 96 కొడకండ్ల 190 56 21 29 17 67 లింగాలఘణపురం 196 – 06 42 50 98 నర్మెట 148 40 16 22 16 54 పాలకుర్తి 336 60 33 49 56 138 రఘునాథపల్లి 320 24 22 65 58 151 తరిగొప్పుల 126 30 09 21 33 48 జఫర్‌గఢ్ 194 20 11 37 39 87 మొత్తం 2,534 300 187 456 471 1,120 -
ప్రమాదమని తెలిసి..పట్టాలు దాటి..
● నెలరోజులుగా స్టేషన్‌ఘన్‌పూర్ ఎఫ్ఓబీ మూసివేత ● ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులుస్టేషన్ఘన్పూర్: డివిజన్ కేంద్రమైన స్టేషన్‌ఘన్‌పూర్ రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి(ఎఫ్ఓబీ) శిథిలావస్థకు చేరి పాక్షికంగా కుంగిపోవడంతో రైల్వే అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. నెలరోజులు గడుస్తున్నా ఇంతవరకూ మరమ్మతు పనులు చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం.. ఫుట్ ఓవర్ బ్రిడ్జి మరమ్మతు విషయంలో రైల్వేశాఖ అధికారుల నిర్లక్ష్యంతో ప్రయాణికులకు శాపంగా మారింది. రైల్వేస్టేషన్ నుంచి రెండో ప్లాట్ఫారం పైకి వెళ్లే ప్రయాణికులు, రెండో ప్లాట్ఫారం నుంచి రైల్వేస్టేషన్‌కు, ఒకటో ప్లాట్ఫారానికి వచ్చే ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రమాదమని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణికులు రైల్వేస్టేషన్ వద్ద పట్టాలు దాటి వెళ్లాల్సి వస్తోంది. ప్రతీరోజూ వివిధ పనులపై వందలసంఖ్యలో ప్రజలు సికింద్రాబాద్, వరంగల్, విజయవాడ తదితర ప్రాంతాలకు వెళ్తుంటారు. అయితే రెండో ప్లాట్‌ఫారంపైకి వచ్చే రైళ్లు ఎక్కడానికి ప్రయాణికులు ఫుట్ ఓవర్ బ్రిడ్జి మూసివేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పట్టాలపై నుంచి వెళ్తున్నారు. ఇప్పటికై నా రైల్వే అధికారులు స్పందించి ఫుట్ ఓవర్ బ్రిడ్జిని మరమ్మతు చేయించి వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. -
కలం గళమై చైతన్యం రగిలించిన అందెశ్రీ
● తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర కార్యదర్శి జోగు అంజయ్య జనగామ రూరల్: తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో కలం గళంతో ప్రజల్లో చైతన్యం రగిలించిన తెలంగాణ నిప్పుల వాగై ఉప్పొంగిన లోక కవి అందెశ్రీ అని తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర కార్యదర్శి జోగు అంజయ్య కొనియాడారు. ఆదివారం పట్టణంలోని గబ్బెట గోపాల్‌రెడ్డి భవన్లో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో డాక్టర్ అందెశ్రీ సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంజయ్య పాల్గొని అందెశ్రీకి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. పశువుల కాపరి నుంచి జీవితాన్ని ప్రారంభించి స్వయం కృషితో కలాన్ని చేతబట్టి గళాన్ని విప్పిన గొప్ప వాగ్గేయకారుడు అందెశ్రీ అన్నారు. అందెశ్రీ మరణం సాహితి ప్రపంచానికి తీరని లోటని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ సాహితి సాంబరాజు యాదగిరి, కవులు కళాకారుల ఐక్యవేదిక, జి.వై.గిరి ఫౌండేషన్ జి.కృష్ణ, జనగామ రచయితల సంఘం నక్క సురేష్, కవి హృదయం సాహిత్య వేదిక పెట్లోజు సోమేశ్వరాచారి, అభినందన కల్చరల్ సొసైటీ అయిలా సోమనర్సింహచారి, పోతన సాహిత్య వేదిక మాన్యపు భుజేందర్, కవులు కొలిపాక బాలయ్య, మసురం రాజేంద్రప్రసాద్, వసంత, అంకాల సోమయ్య, కానుగంటి వెంకటేశం, చీటూరు నర్సింహులు, గాదరి సుధాకర్, గూటం రమేష్, చాపల మహేందర్, మామిండ్ల అంజయ్య తదితరులు పాల్గొన్నారు. -
వందేళ్ల ఉత్సవాన్ని విజయవంతం చేయాలి
● సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్.రాజారెడ్డిలింగాలఘణపురం: సీపీఐ వందేళ్ల శత వార్షికోత్సవాల్లో భాగంగా డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే ఉత్సవాలను విజయవంతం చేయాలని సీపీఐ జనగామ జిల్లా కార్యదర్శి సీహెచ్.రాజారెడ్డి కోరారు. సీపీఐ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 15న మొదలైన శత ఉత్సవాల ప్రచార జాత ఆదివారం మండలంలోని నెల్లుట్లకు చేరుకుంది. ఈ సందర్భంగా మండల కార్యదర్శి సదానందం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాజారెడ్డి మాట్లాడుతూ.. 1925లో దేశంలో ఏర్పాటైన సీపీఐ స్వాతంత్రోద్యమంలో కీలకపాత్ర పోషించిందన్నారు. ప్రచార జాతలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లాఖాద్రి, జాతీయ కార్యవర్గ సభ్యులు పశ్య పద్మ, నాయకులు నరేంద్ర ప్రసాద్, ఉప్పలయ్య, సాయ్య, సోమయ్య, సుగుణమ్మ, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. ఉద్యమాలే ఏకై క మార్గం.. దేవరుప్పుల: ప్రజాసమస్యల పరిష్కారం కోసం పాలకులపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యమాలే ఏకై క మార్గమని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు పశ్య పద్మ, సీపీఐ జిల్లా కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి అన్నారు. సీపీఐ మండల కార్యదర్శి జీడీ ఎల్లయ్య ఆధ్వర్యంలో ప్రచార జాతా కడవెండి దొడ్డి కొమురయ్య, కామారెడ్డిగూడెం షెక్ బందగీ, దేవరుప్పులలో అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకోగా అమరులకు ఘన నివాళులు అర్పించారు. -
లెక్కలు తలకిందులు
సోమవారం శ్రీ 24 శ్రీ నవంబర్ శ్రీ 2025జనగామ: జిల్లాలో సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ప్రక్రియ ఆదివారం పూర్తికావడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల వేడి మొదలైంది. రిజర్వేషన్ల ప్రకటనతో రాజకీయ సమీకరణాలలో మార్పులు చోటుచేసుకున్నాయి. గత రిజర్వేషన్లతో పోలిస్తే ఈసారి జనరల్ కేటగిరీ పెరగడం, బీసీ స్థానాలు తగ్గడం, ఎస్టీ కేటగిరీ పెరగడం రాజకీయ నాయకుల లెక్కలను తలకిందులు చేసింది. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల్లో రాజకీయ పార్టీల సమక్షంలో ఆర్డీఓలు గోపిరామ్, వెంకన్న ఆధ్వర్యంలో లాటరీ విధానంలో రిజర్వేషన్లు ఖరారు చేశారు. పంచాయతీరాజ్ చట్టం నిబంధనల మేరకు మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేటాయింపులు పారదర్శకంగా పూర్తయ్యాయి. జిల్లాలో 12 మండలాల పరిధిలో 280 గ్రామపంచాయతీల పరిధిలో 2,534 వార్డులకు సంబంధించి ఎంపీడీఓలు రిజర్వేషన్లు ఖరారు చేశారు. పార్టీల వ్యూహాలు–స్వతంత్రుల కసరత్తు తాజా రిజర్వేషన్లలో లెక్కలు మారడంతో పలువురు ఆశావహులకు నిరాశకు లోనయ్యారు. ఆయా గ్రామాల్లో మహిళలకు ఉన్న స్థానాలు జనరల్‌గా మారడం ఉత్సాహాన్ని పెంచింది. అధికార పార్టీతో పాటు బీజేపీ, వామపక్ష పార్టీలు తమ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు కూడా ముందస్తుగా ప్రజల మద్దతు కూడగట్టడానికి ప్రయత్నిస్తున్నారు. పల్లెల్లో ఎన్నికల వాతావరణం.. పల్లెల్లో టీ దుకాణాలు, సెలూన్లు, కిరణా దుకాణాలు, ప్రధాన కూడళ్ల వద్ద సమావేశాలతో ఎక్కడ చూసినా సర్పంచ్ రిజర్వేషన్ గురించే చర్చ జరుగుతోంది. గ్రామం ఏ కేటగిరీలో పడింది, ఈసారి ఎవరికి అవకాశం వంటి ప్రశ్నలతో ప్రజలు స్పందనలు వ్యక్తం చేస్తున్నారు. మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు, వారి అనుచరులు వ్యూహ రచనలో నిమగ్నమయ్యారు. జిల్లా రిజర్వేషన్ల తీరు ఇలా.. జిల్లా వ్యాప్తంగా 280 జీపీల వారీగా కేటాయించిన రిజర్వేషన్లలో ప్రతీ సామాజిక వర్గానికి జీవో నిబంధనలను అనుసరించి కేటాయింపులు చేశారు. జిల్లాలో ప్రస్తుతం సామాజిక వర్గాల వారీగా కేటాయింపులు జరిగిన రిజర్వేషన్ల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జనరల్ కేటగిరీల్లో 23.21శాతం, జనరల్ మహిళ విభాగంలో 20.71 శాతంతో మొత్తం జనరల్ వర్గం వాటా 43.92 శాతం ఉంది. బీసీ జనరల్‌లో 8.93, బీసీ మహిళ కేటగిరీలో 7.14 శాతం కలుపుకుని మొత్తం బీసీ వర్గం వాటాగా 16.07 శాతంగా లెక్కించారు. ఎస్సీ జనరల్‌లో 11.07 శాతం, ఎస్సీ మహిళా విభాగంలో 8.21 శాతం కలుపుకుని మొత్తంగా ఎస్సీ వర్గం వాటా 19.28 శాతం ఉంది. ఎస్టీ వర్గం 100 శాతం గ్రామాలు కలుపుకొని ఎస్టీ జనరల్ 12.14 శాతం, ఎస్టీ మహిళ 8.57 శాతంతో మొత్తంగా ఎస్టీ వర్గం వాటా 20.71 శాతం కేటాయించారు. జిల్లా మొత్తం రిజర్వేషన్లలో సామాజిక వర్గం మొత్తంగా పరిశీలన చేస్తే జనరల్ 43.92 శాతం, బీసీ 16.07 శాతం, ఎస్సీ 19.28 శాతం, ఎస్టీ 20.71 శాతంగా ఉంది. ప్రతీ వర్గంలో మహిళలకు గణనీయమైన స్థాయిలో అవకాశాలు రావడం ప్రత్యేకతగా నిలిచింది. రిజర్వేషన్ పంపిణీ జిల్లాలో సామాజిక న్యాయాన్ని ప్రతిబింబిస్తూ, అన్ని వర్గాలకు న్యాయమైన అవకాశాలు లభించేలా చర్యలు తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ముగిసిన సర్పంచ్ రిజర్వేషన్ల ప్రక్రియ జనరల్ కేటగిరీలో సీట్లలో పెరుగుదల బీసీ సీట్లలో తగ్గుదల తాజా రిజర్వేషన్లతో ఆశ..నిరాశ అభ్యర్థుల వేటలో రాజకీయ పార్టీలుఅధికార–పోలీసుల ఏర్పాట్లు వేగవంతం ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం, రెవెన్యూ, పంచాయతీరాజ్ విభాగాలు ముందస్తు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నారు. పోలీసు శాఖ సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టి బందోబస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. అదనపు బలగాలు, రాత్రి పర్యవేక్షణ, సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేక మొబైల్ పెట్రోలింగ్ తదితర వాటికి సంబంధించి దృష్టిసారిస్తున్నారు. -
ఇక పోషణ్వాడీ!
లింగాలఘణపురం: అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులు, బాలింతలకు ఇప్పటికే అనేక రకాలుగా పౌష్టికాహార లోపం లేకుండా చేపట్టిన కార్యక్రమాలకు తోడుగా మరింత పటిష్టంగా కేంద్ర ప్రభుత్వం సాక్షం అంగన్వాడీ 2.0 పేరుతో పోషణ్ వాటికలను ఏర్పాటు చేయనుంది. అందుకు జిల్లాలోని మూడు ఐసీడీఎస్ పరిధిలో 695 అంగన్వాడీ కేంద్రాల్లో 227 కేంద్రాలను ఎంపిక చేసి ఒక్కొక్క కేంద్రానికి ఐదేళ్లకు గాను రూ.10వేల చొప్పున జిల్లాలో రూ.22.70 లక్షలు విడుదల చేసింది. అందులో చేపట్టాల్సిన పనులు.. అంగన్వాడీ కేంద్రాల ఆవరణలో 10+10 అడుగుల చదరపు విస్తీర్ణంలో మొక్కలు, మూలికల చెట్లు పెంచేందుకు స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అందులో 6 రకాల విత్తనాలు ఉద్యానవనశాఖ ఎంపిక చేసిన పాలకూర, తోటకూర, మెంతికూర, టమాట, వంకాయ, మిరపకాయ విత్తనాలను అదేవిధంగా ఔషధ, పండ్ల మొక్కలు మునగ, బొప్పాయి, కరివేపాకు, నిమ్మ, ఉసిరి, దానిమ్మ, అంతేకాకుండా లెమన్‌గ్రాస్, తిప్పతీగ, శతావరి వంటి మొక్కలను నాటి వాటి నుంచి వచ్చే ఫలాలను చిన్నారులకు, బాలింతలకు అందజేయాలని నిర్ణయించింది. ఖర్చు నిబంధనలు.. పోషణ్ వాటికల ఏర్పాటుకు ఐదేళ్లకు గాను విత్తనా లకు రూ.3వేలు, రవాణా ఖర్చు రూ.వెయ్యి, బెడ్ల తయారీకి రూ.వెయ్యి కాగా ఐదేళ్ల నిర్వహణ సాగునీటి ఖర్చు మరో రూ.5వేలుగా నిర్ణయించింది. అంగన్వాడీల్లో పోషణ్ వాటికల ఏర్పాటు జిల్లాలో 227 కేంద్రాల ఎంపిక ఐదేళ్లకు రూ.22.70లక్షలు విడుదల ఇక అంగన్వాడీల వద్దనే పౌష్టిక ఆహార పంటల సాగు227 కేంద్రాల ఎంపిక జిల్లాలోని 695 అంగన్వాడీ కేంద్రాలకుగానూ సొంత భవనాలు, వసతులు కలిగిన 227 కేంద్రాలను ఎంపిక చేసింది. అందులో జనగామ ఐసీడీఎస్ పరిధిలో 257 కేంద్రాలకు 80, కొడకండ్ల పరిధిలోని 183 కేంద్రాలకు 66, స్టేషన్‌ఘన్‌పూర్‌లోని 255 కేంద్రాలకు 81 కేంద్రాలను ఎంపిక చేసి ఒక్కొక్కదానికి రూ.10వేలు విడుదల చేసింది. అందులో విత్తనాలకు సంబంధించిన డబ్బులను మినహాయించి మిగిలిన డబ్బులు ఆయా అంగన్వాడీ కేంద్రాల ఖాతాలో జమ అయ్యాయి. జిల్లాలో పోషణ్ వాటిక కింద ఎంపికై న అంగన్వాడీ కేంద్రాల్లో అక్కడక్కడ పనులు మొదలయ్యాయి. విత్తనాల డబ్బులు మినహా మిగతా డబ్బులు ఆయా కేంద్రాల ఖాతాలో జమ అయ్యాయి. ఈ పథకంతో మరింత పౌష్టిక ఆహారం అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. – కోదండరామ్, ఇన్చార్జ్ డీడబ్ల్యూఓ, జనగామ -
ఒకేచోట మక్కలు, వడ్లు
● మార్కెట్లో స్థలం లేక రైతుల ఇబ్బందులు ● కొనుగోళ్లలో జాప్యంతో పడిగాపులుపాలకుర్తి టౌన్: ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని మిల్లర్లు, వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని, రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మడానికే మొగ్గుచూపుతున్నారు. మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుసేవా సహకార సంఘం ఆధ్వర్యంలో జిల్లా మొత్తం ఒకే మక్కల కొనుగోలు కేంద్రం ఇక్కడే ఏర్పాటు చేశారు. మార్కెట్లో మక్కలు, వడ్లు ఒకేచోట పోయడంతో సరిపోను స్థలం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏఈఓలు టోకెన్ ఇస్తేనే కాంటా పెడతామని సొసైటీ అధికారులు అంటున్నారని రైతులు వాపోతున్నారు. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో తీవ్రమైన జాప్యంతో ధాన్యం కుప్పల వద్ద కాపలా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోందంటున్నారు. పగలంతా ఎండలో, రాత్రి తీవ్రమైన చలితో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. సొసైటీ సిబ్బంది కొనుగోలు వేగవంతం చేయడం లేదని, అధికారులు స్పందించి వెంటవెంటనే ధాన్యం కొనుగోలు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం.. ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. రైతులు తీసుకొచ్చిన ధాన్యం, మక్కలను వరుస క్రమంలో ఏఈఓలు ఇచ్నిన టోకెన్ ప్రకారమే కొనుగోలు చేస్తున్నాం. జిల్లా మొత్తంమీద పాలకుర్తిలోనే మక్కల కొనుగోలు కేంద్రం ఉండడంతో ఇప్పటి వరకు 2,500 క్వింటాల్ మక్కలు కొనుగోలు చేశాం. –సత్యనారాయణరెడ్డి, ఎండీ, రైతు సేవా సహకార సొసైటీ, పాలకుర్తి -
వాట్సాప్‌లో ‘మీసేవ’
● పౌరసేవలు మరింత సులభం ● మొబైల్ ద్వారా సర్టిఫికెట్లు పొందే అవకాశంపాలకుర్తి టౌన్: పౌరసేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా అన్ని రకాల అవసరాల కోసం వివిధ సర్టిఫికెట్లు పొందడానికి ఇక ప్రభుత్వ కార్యాలయాలు, మీసేవ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే చేతిలో మొబైల్ ద్వారా సేవలను పొందవచ్చు. ప్రజలకు అవసరమైన సేవలు, సర్టిఫికెట్లను త్వరగా, సులభంగా అందించాలనే లక్ష్యంతో మీ సేవను ఇప్పుడు వాట్సాప్ ద్వారా కూడా అందుబాటులోకి తెచ్చింది. సేవలు ఎలా పొందవచ్చంటే.. ● స్మార్ట్ ఫోన్ ఉపయోగించి వాట్సాప్ ద్వారా సేవలు పొందవచ్చు. ● మందుగా మొబైల్లో మీ సేవ నంబర్ 8096958096ను సేవ్ చేసుకోవాలి. ● వాట్సాప్ నంబర్‌కు హెచ్ఐ లేదా ఎంఈఎన్యూ(మెనూ) అని టైప్ చేసి సెండ్ చేయాలి. ● మీసేవలో ప్రసత్తుం అందుబాటులో ఉన్న ప్రభుత్వ సేవల జాబితా వస్తుంది. ● ఆధార్ ప్రక్రియ పూర్తి చేసి, అవసరమైన సేవను ఎంపిక చేసుకోవాలి. ● దరఖాస్తు ఫారమ్‌ను ఇంటర్ఫేజ్ ద్వారా నింపవచ్చు. ● దరఖాస్తు చేసే సేవకు అవసరమైన డాక్యుమెంట్లు స్కాన్ చేసి వాట్సాప్‌లో అప్లోడ్ చేయాలి. ● సేవ ఆధారంగా నిర్ణయించిన ఫీజును ఆన్లైన్ పేమెంట్ గేట్‌వే ద్వారా చెల్లించచ్చు ● దరఖాస్తు స్టేటస్, అప్డేట్స్ వాట్సాప్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం పొందవచ్చు ● సర్టిఫికెట్, డాక్యుమెంట్ అప్రూవ్ అయితే, దాని డౌన్లోడ్ లింక్ వాట్సాప్‌కు వస్తుంది ● అనంతరం దానిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా మొబైల్ వాట్సాప్ సేవలను ఎక్కడ నుంచి అయిన పొందవచ్చు. 580 సేవలు.. మీ సేవ ప్లాట్‌ఫామ్ ద్వారా అందుబాటులో ఉన్న 580 సేవలు, ఇక వాట్సాప్ చానల్ కిందకు తీసుకొస్తారు. ప్రస్తుతానికి సర్టిఫికెట్లు పొందడానికి అవకాశం ఉంది. వీటిని దశల వారీగా పెంచుకుంటూ పూర్తి సేవలు వాట్సాప్ ద్వారా పొందే అవకాశం కల్పించనున్నారు. ఆదాయం, కులం, నివాస, జనన, మరణ, మార్కెట్ విలువ, వివాహ రిజిస్ట్రేషన్ తదితర సర్టిఫికెట్ల కోసం వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రెవెన్యూ, పోలీస్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పంచాయతీరాజ్, విద్యుత్, నీటి, ఆస్తి పన్ను, ఆలయాలు, పౌర సరఫరాల సేవలు పొందవచ్చు. -
మహిళా సంక్షేమానికి పెద్దపీట
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి ● ఘన్‌పూర్‌లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీస్టేషన్ఘన్పూర్: సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కొనియాడారు. ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో నియోజకవర్గంలోని జనగామ జిల్లాలోని ఐదు మండలాలకు చెందిన మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం నిర్వహించారు. ఆర్డీఓ డీఎస్ వెంకన్న అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడారు.. కోటి మంది మహిళలకు కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరీలో, నిర్మాణంలో జనగామ జిల్లాలో ఘన్పూర్ నియోజకవర్గం మొదటి స్థానంలో ఉందని, ప్రజలందరి ఆశీర్వాదంతో నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ది చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన చీరలు దిష్టిబొమ్మలకు కట్టారు: ఎంపీ కావ్య గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు ఇచ్చిన చీరలు నాణ్యత లేకుండా ఉండేవని, పొలాల్లో దిష్టిబొమ్మలకు కట్టేవారని ఎంపీ కడియం కావ్య ఆరోపించారు. కార్యక్రమంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ రాంబాబు, డీఆర్డీఓ వసంత, డీపీఎం సతీశ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు బెలిదె వెంకన్న, ఏఏంసీ చైర్పర్సన్ లావణ్యశిరీష్‌రెడ్డి, వైస్ చైర్మన్ నూకల ఐలయ్య, ఏపీఎంలు ప్రసాద్, పిట్టల నరేందర్, కె.కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. -
నేటి ప్రజావాణి రద్దు
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జనగామ రూరల్: ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధ ప్రక్రియతో పాటు స్వయం సహాయక సభ్యులకు చీరల పంపిణీ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు విధి నిర్వహణలో ఉన్నందున ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్టు కలెక్టర్ చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి కలెక్టరేట్‌కు ఎవరూ రాకూడదని, సహకరించాలని కలెక్టర్ కోరారు. రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక లింగాలఘణపురం: మండలంలోని వనపర్తి ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని కాళీ మౌనిక రాష్ట్రస్థాయి జూనియర్ వాలీబాల్ పోటీలకు ఎంపికై నట్లు ఎంఈఓ విష్ణుమూర్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం హన్మకొండలో జేఎన్ఎస్లో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ చాంపియన్‌షిప్‌లో భాగంగా నిర్వహించిన పోటీల్లో మౌనిక ఉత్తమ ప్రదర్శన కనబరిచి ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2 వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు చెప్పారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యేలా తీర్చిదిద్దిన వ్యాయామ ఉపాధ్యాయుడు పూజారి కుమార్‌ను, ఎంపికై న విద్యార్థిని మౌనికను ఉపాధ్యా య బృందం, గ్రామస్తులు అభినందించారు. రాష్ట్రస్థాయిలో ఉజ్వలకు ప్రథమ బహుమతి లింగాలఘణపురం: మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ పదో తరగతి విద్యార్థిని బి.ఉజ్వలకు వచన కవితల విభాగంలో రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి లభించినట్లు ఎంఈఓ విష్ణుమూర్తి, ప్రిన్సిపాల్ సునిత తెలిపారు. ఈ నెల 14న జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా తెలంగాణ సారస్వత పరిషత్ హైదరాబాద్ వారు నిర్వహించిన వచన కవిత విభాగంలో బహుమతులు పొందిన వారికి ఆదివారం హైదరాబాద్‌లో బహుమతి ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతా బయోటెక్, శాంతా వసంత్ ట్రస్టు సంయుక్తంగా నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవంలో వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కె.ఐ.వరప్రసాద్, మాజీ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి చేతుల మీదుగా రూ.2వేల నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రం అందుకుంది. ఈ సందర్భంగా విద్యార్థిని ఉజ్వలను ఉపాధ్యాయులు అభినందించారు. ఎన్ఎంఎంఎస్ పరీక్షకు 14 మంది గైర్హాజరు జనగామ రూరల్: జాతీయస్థాయి ఎన్ఎంఎంఎస్(నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీం) ప్రవేశ పరీక్షకు 14 మంది గైర్హాజరయ్యారని ప్రభుత్వ పరీక్షల సహాయ సంచాలకుడు టి. రవికుమార్ తెలిపారు. ఆదివారం ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ఎలాంటి సమస్యలు లేకుండా ముగిసిందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 4 పరీక్షా కేంద్రాల్లో 728 మంది విద్యార్థులకు గానూ 714 మంది హాజరు కాగా 14 మంది పరీక్షకు గైర్హాజరయ్యారని, 98.08 శాతంగా హాజరు నమోదైందని తెలిపారు. వనదేవతలకు మొక్కులు ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం వేలాదిగా తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు జంపన్నవాగులో స్నానాలు ఆచరించి వనదేవతల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఒడిబియ్య, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల వద్ద పూజలు నిర్వహించారు. మొక్కుల అనంతరం మేడారం పరిసరాల ప్రాంతాల్లో వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేసి సందడి చేశారు. -
ప్రతిభావంతులకు భరోసా
జనగామ రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా పేద విద్యార్థులు మధ్యలోనే చదువులను మానేస్తున్నారు. ప్రతిభావంతులైన పేద విద్యార్థులు చదువుకు దూరం కాకుండా అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్(ఎన్ఎంఎంఎస్) ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం వల్ల ప్రతిభ ఉండి చదువుకు దూరమయ్యే విద్యార్థులకు ఉన్నత చదువులు చదివే అవకాశం ఉంది. ఈనెల 23న జిల్లావ్యాప్తంగా పరీక్ష నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు పరీక్ష రాసేందుకు అర్హులు. దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ పరీక్షకు మెరిట్ ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది. అర్హత సాధిస్తే 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి 12 వేలు కేంద్రం అందిస్తుంది. గత ఏడాది జిల్లా నుంచి 35మంది విద్యార్థులు అర్హత సాధించారు. అవగాహన తప్పనిసరి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు చాలామంది పేద, మధ్య తరగతివారే ఎక్కువగా ఉంటారు. తల్లిదండ్రులు అంతగా చదువులేనివారు కావడంతో ఇలాంటి పరీక్షల వల్ల అవగాహన ఉండదు. ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులే చొరవ తీసుకుని పిల్లలచే పరీక్షలు రాయిస్తే వారిని ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు మంచి భవిష్యత్ ఉంటుంది. పరీక్ష విధానం.. మల్టీపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలుంటాయి. మెంటల్ ఎబిలిటీ (ఎంఏటీ), స్కాలస్టిక్ ఎబిలిటీ (ఎస్ఏటీ), ఏడు, ఎనిమిదో తరగతికి సంబంధించిన గణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 180 మార్కులకు పరీక్ష ఉండగా ప్రశ్నపత్రం రెండు విభాగాలుగా ఉంటుంది. పార్ట్– ఏలో మానసిక సామర్థ్య పరీక్ష 90 మార్కులకు 90 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో రీజనింగ్ ఎబిలిటీ, సంఖ్యాశాస్త్రం, పదాల భిన్న పరీక్ష, నంబర్ అనాలజీ, ఆల్ఫాబెట్ అనాలజీ, కోడింగ్, డీకోడింగ్, లాజికల్ ప్రశ్నలు, వెన్ చిత్రాలు, మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్ సంబంధించిన అంశాలు ఉంటాయి. పార్ట్–బీలో ఏడు, 8వ తరగతికి సంబంధించి 30 ప్రశ్నలకు 30 మార్కులు కేటాయించారు. వాటిలో గణితం 20, సామాన్య శాస్త్రం 35, సాంఘిక శాస్త్రం 35మార్కులు కేటాయిస్తారు. ప్రశ్నపత్రం తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. హాజరుకానున్న 729 మంది విద్యార్థులు ఈనెల 23న ఎన్ఎంఎంఎస్ పరీక్షకు జిల్లావ్యాప్తంగా 729 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పట్టణంలోని జెడ్పీఎస్ఎస్ ధర్మకంచ పాఠశాల, ప్రభుత్వ హైస్కూల్ జనగామ, సోషల్ వెల్ఫేర్, జెడ్పీఎస్ఎస్ బాలికల పాఠశాల స్టేషన్ ఘన్పూర్ మొత్తం నాలుగు సెంటర్లు సిద్ధం చేశారు. డీవోలు, ఎస్‌వోలను నియమించారు. ఉదయం 9.30 నుంచి 12.30 వరకు మూడు గంటల పరీక్ష ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 103 ఉన్నత పాఠశాల్లో 8వ తరగతి చదువుతున్న వారు 729 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే హాల్‌టికెట్లు విడుదల కాగా పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. –టి.రవికుమార్, సహాయ సంచాలకుడు, ప్రభుత్వ పరీక్షల విభాగం రేపు ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ పరీక్ష 4 సెంటర్లలో ఏర్పాట్లు పూర్తి అర్హత సాధిస్తే ఏడాదికి రూ.12 వేలు జిల్లావ్యాప్తంగా 729 మంది విద్యార్థులు -
పథకాల అమలులో మీడియాది ప్రధానపాత్ర
జనగామ రూరల్: ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు ప్రతీ నిరుపేదకు అందించే ప్రక్రియలో మీడియా రంగానిది ప్రధాన పాత్ర అని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కొనియాడారు. వివిధ అంశాల్లో కేంద్ర, రాష్ట్ర స్థాయిలో అవార్డులు వచ్చిన నేపథ్యంలో శుక్రవారం కలెక్టరేట్లోని కాన్ఫ రెన్స్ హాల్లో మీడియా ప్రతినిధులకు అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం జల సంచయ్ జన భగీదారి కార్యక్రమంలో భాగంగా జాతీయ స్థాయిలో జిల్లాకు అవార్డు వచ్చిన సందర్బంగా క్షేత్రస్థాయిలో కృషి చేసిన వివిధ శాఖల అధికారులకు అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, డీసీపీ రాజామహేంద్ర నాయక్, ఆర్డీఓ వెంకన్న, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని తదితరులు పాల్గొన్నారు. జనగామ: మొబైల్ ఫోన్ల రికవరీలో జిల్లా పోలీసుల సేవలు భేషుగ్గా ఉన్నాయని వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ కితాబిచ్చారు. శుక్రవారం జనగామ ఏసీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వారికి డీసీపీ అప్పగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలన్నారు. జనగామ పోలీస్ స్టేషన్ పరిధిలో 20, నర్మెట 1, బచ్చన్నపేట 2, తరిగొప్పుల 2, స్టేషన్‌ఘన్‌పూర్ 2, చిల్పూరు 4, రఘునాథపల్లి 1, వర్ధన్నపేట 5, రాయపర్తి 3, పాలకుర్తి 2, కొడకండ్ల 4, దేవరుప్పుల 4 ఫోన్లు ఉండగా, డీసీపీ చేతుల మీదుగా యజమానులకు అందించారు. ఏసీపీ భీంశర్మ, సీఐలు సత్యనారాయణరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సైలు పాల్గొన్నారు. జనగామ రూరల్: నేషనల్ హెల్త్ మిషన్ స్కీమ్‌లో ఖాళీగా ఉన్న (7) ఎంఎల్‌హెచ్‌సీ(మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్) పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి కె.మల్లికార్జున రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 24 నుంచి 29 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు. అభ్యర్థులు https:// jangaon. telangana. gov. in వెబ్సై ట్ నుంచి దరఖాస్తు పత్రాలను డౌన్ లోడ్ చేసుకోవాలన్నా రు. ఎంబీబీఎస్ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యముంటుందన్నారు. -
ఎక్కడ..!?
బడే దామోదర్ ● మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న దామోదర్ ● ఆయన స్వస్థలం ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి ● లొంగుబాటు ప్రయత్నాలపైనా సోషల్ మీడియాలో వైరల్ ● ఆయన పేరిట నాయకులు, వ్యాపారులకు ఫోన్ కాల్స్?సాక్షిప్రతినిధి, వరంగల్ : మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి, ఉమ్మడి వరంగల్‌కు చెందిన బడే దామోదర్ అలియాస్ చొక్కారావు ఎక్కడ? ఇటీవల సాగుతున్న వరుస లొంగుబాట్లు, ఎన్కౌంటర్ల నేపథ్యంలో ఆయన వ్యూహం ఏమిటీ? ఓ వైపు ఛత్తీస్‌గఢ్ – తెలంగాణ సరిహద్దుల్లో ఉన్నాడంటుండగా.. మరోవైపు లొంగుబాటు ప్రయత్నం చేస్తున్నాడని వైరల్ అవుతోంది? ఈ నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, సౌత్‌బస్తర్, ఏఓబీలలో కీలకమైన బడే దామోదర్ ఎక్కడున్నాడు? ఏం జరుగుతోంది? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ఇటీవల ములుగు జిల్లాకు చెందిన కొందరు రాజకీయ నాయకులు, వ్యాపారులకు ఆయన పేరిట ఫోన్ కాల్స్ రావడం, ఓ రాజకీయ నేతను కలవాలని సూచించడం కూడా కలకలం రేపుతోంది. దామోదర్ వ్యూహం ఏమిటో... ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం కాల్వపల్లికి చెందిన బడే దామోదర్‌ది సీపీఐ (మావోయిస్టు) పార్టీ ఉద్యమ చరిత్రలో ఓ అధ్యాయం. రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ 2021 జూన్ 21న కోవిడ్ బారిన పడి మృతిచెందగా.. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన బాధ్యతలను దామోదర్‌కు పార్టీ అప్పగించింది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో కీలకంగా మారిన ఈయన ఈ ఏడాది జనవరిలో పూజారి కాంకేర్ ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు సోషల్ మీడియాలో వైరలైంది. ఐదారు రోజుల వ్యవధిలో దామోదర్ బతికే ఉన్నట్లు మావోయిస్టు పార్టీ నాయకత్వం ప్రకటించింది. ఈ 11 నెలల వ్యవధిలో మావోయిస్టు పార్టీ నాయకత్వం ఎన్నో ఉత్థానపతనాలను చూసింది. అగ్రనేతలు ఎన్కౌంటర్లకు గురికావడం.. కేంద్ర కమిటీ స్థాయి నాయకులు, పెద్ద సంఖ్యలో దళసభ్యులు ఆయుధాలతో లొంగిపోవడం లాంటి సంఘటనలు జరిగాయి. ఇదే క్రమంలో ఏఓబీ సరిహద్దు మారేడుమిల్లి ఏరియాలో జరిగిన రెండు ఎన్కౌంటర్లలో హిడ్మా సహా 13మంది మృతిచెందడం... పదుల సంఖ్యలో ముఖ్య నేతలను విజయవాడలో అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించడం ఆ పార్టీ మనుగడకు సవాల్‌గా పరిణమించింది. ఇదే సమయంలో బడే దామోదర్ అలియాస్ చొక్కారావు, కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్, కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్ తదితరులు సైతం లొంగిపోతున్నారన్న ప్రచారం జరిగింది. కానీ ఇప్పటివరకు అధికారికంగా ఎటునుంచి ప్రకటన వెలువడలేదు.కాల్వపల్లికి చెందిన మావోయిస్టు అగ్రనేత బడే దామోదర్ పేరిట కొందరు రాజకీయ నాయకులు, వ్యాపారులకు ఫోన్ కాల్స్ వస్తుండటం కలకలంగా మారింది. తాను దామోదర్‌ను అంటూ ఫోన్ చేస్తున్న సదరు వ్యక్తి.. జిల్లా అటవీ ప్రాంతానికి చెందిన ఓ నాయకుడిని కలిసి డబ్బులు ఇవ్వాలని సూచించడం వివాదాస్పదమవుతోంది. ఇటీవల ఇద్దరు అధికార పార్టీ నాయకులు, ముగ్గురు ఇసుక వ్యాపారులకు దామోదర్ పేరిట ఫోన్లు రావడం.. ఆ ఫోన్లో మాట్లాడిన పలు విషయాలను బహిరంగంగానే మాట్లాడుకుంటుండటం గమనార్హం. నిత్యనిర్బంధంమధ్య దామోదర్ ఎక్కడున్నాడు.. ఎలా ఉన్నాడు.. అన్న చర్చ జరుగుతున్న తరుణంలో దామోదర్ వాయిస్‌తో ఫోన్లో చేస్తున్నదెవరు? ఒకవేళ దామోదరే అయితే ఎవరిని కలవమన్నారు? అనే అంశాలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. -
భక్తిశ్రద్ధలతో పోలిపాడ్యమి దీపారాధన
జనగామ: కార్తీక మాసం ముగింపు సందర్భంగా జిల్లావ్యాప్తంగా పోలిస్వర్గం పాడ్యమి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీ నగేశ్వర వాసవి కన్యకా పరమేశ్వరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలతో పాటు దీపోత్సవం,నందీశ్వర అభిషేకం, అర్ధ నారీశ్వరీ అన్నపూజా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ పజ్జూరి గోపయ్య బుద్దా రమేశ్, మహంకాళి హరిశ్చంద్ర గుప్తా, పుల్లూరు శ్రీనివాస్, గంగిశెట్టి మంజునాథ్, గోపిశెట్టి శ్రీనివాస్, లగిశెట్టి వీరలింగం, వంగపల్లి చంద్రశేఖర్, నంగునురి లక్ష్మీనారాయణ, గోపిశెట్టి నాగరాజు పాల్గొన్నారు. బాలాజీనగర్ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో నీటికొలను ఏర్పాటు చేసి వాటిలో అరటి దొప్పల్లో దీపాలను వదిలి భక్తిని చాటుకున్నారు. -
అంతరాయమొస్తే అలెర్ట్ చేస్తుంది!
విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిన చోటు గుర్తించి తక్షణమే మరమ్మతులు చేసేందుకు సహాయపడే యంత్రాన్ని(సిస్టమ్)ను పైలట్ ప్రాజెక్ట్‌గా మండలంలోని నర్సాపూర్ గ్రామంలో విద్యుత్‌శాఖ ఇటీవల ఏర్పాటు చేసింది. గ్రామంలో ఒక విద్యుత్ పోల్‌కు సోలార్ విద్యుత్ ద్వారా నడిచే ఈ పవర్ ఇంట్రప్షన్ పరికరాన్ని ఏర్పాటు చేసి గ్రామానికి విద్యుత్ సరఫరా అయ్యే కేబుల్స్‌కు మూడు పరికరాలను అమర్చారు. దీంతో ఏఏ ప్రాంతంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందనేది గుర్తించే వీలుంటుంది. తద్వారా తక్షణ మరమ్మతులు చేసే అవకాశం ఉంటుందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. – తరిగొప్పుల -
వేటు పడింది
జనగామ: బచ్చన్నపేట పంచాయతీ కార్యదర్శులు చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో ఎంపీఓ వెంకట మల్లికార్జున్‌ను తాత్కాలికంగా నర్మెట మండలానికి డిప్యుటేషన్‌పై పోస్టింగ్ ఇస్తూ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ‘దందా ఎంపీఓ’లు.. ‘వేటా? బదిలా?’ శీర్షికలతో సాక్షిలో ప్రచురితమైన వరుస కథనాలకు కలెక్టర్ స్పందించారు. బచ్చన్నపేట ఎంపీఓ పంచాయతీ సెక్రెటరీలను ఇబ్బందులకు గురిచేస్తూ వసూళ్ల దందాపై ఈ నెల10వ తేదీన కలెక్టర్‌కు ఫిర్యాదు అందగా, 12వ తేదీన విచారణకు ఆదేశించారు. ఈ మేరకు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఫిర్యాదు చేసిన సెక్రెటరీల వాంగ్మూలం తీసుకుని నివేదికను కలెక్టర్‌కు అందించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం విచారణ పెండింగ్ దశలో ఉండగా, ఆరోపణలను పరిగణలోకి తీసుకుని ఎంపీఓను నర్మెటకు బదిలీ చేశారు. విచారణ పూర్తయ్యేవరకు ఎంపీఓ వెంకట మల్లికార్జున్ నర్మెట మండలంలో పనిచేయాల్సి ఉంటుంది. ఈ మేరకు బచ్చన్నపేట ఎంపీడీఓ కార్యాలయం సూపరింటెండెంట్ కె.శ్రీనాథ్‌రెడ్డికి అదనపు చార్జి అప్పగించడంతో పాటు వెంటనే బాధ్యతలు స్వీకరించాలని ఆదేశాలు జారీ చేశారు. చక్రం తిప్పింది ఎవరు..? ఎంపీఓ మల్లికార్జున్‌ను సస్పెన్షన్‌కు గురికాకుండా కొంతమంది ఉద్యోగ సంఘ నేతలు రంగంలోకి దిగి గండం నుంచి గట్టెక్కించిన్నట్లు చర్చ జరుగుతోంది. ఎంపీఓపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు రాగా, మరో ఎంపీఓ సైతం ఇన్సూరెన్స్ పాలసీలు, వేధింపులకు సంబంధించి ఆరోణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. దీనిపై ఎలాంటి విచారణ లేకపోవడం గమనార్హం. బచ్చన్నపేట ఎంపీఓ బదిలీ కొనసాగుతున్న విచారణ నర్మెటకు పోస్టింగ్ -
జిల్లాలో మూడు విడతలుగా జరిగే మండలాలు
జనగామ: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల కోలాహలం మొదలైంది. ప్రభుత్వం తాజా మార్గదర్శకాల మేరకు ఈసారి ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గతంలో రెండు విడతల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తికాగా, ఇప్పుడు కొత్త గైడ్‌లైన్స్ కారణంగా ఒక విడతను అదనంగా జోడించారు. దీంతో జిల్లా అధికార యంత్రాంగం మొత్తం ఎన్నికల ఏర్పాట్లపై దృష్టి కేంద్రీకరిస్తోంది. జిల్లా పరి ధిలో 12 మండలాలు ఉండగా, ప్రతీ విడతలో నాలుగు మండలాల చొప్పున పోలింగ్ చేపట్టేందుకు పంచాయతీ శాఖపై కసరత్తు మొదలుపెట్టింది. రాబోయే నాలుగైదు రోజుల్లో అధికారిక నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండడంతో ఎన్నికల వేడి రాజుకోనుంది. డ్రాఫ్ట్ రూపంలో రిజర్వేషన్ల తయారు.. ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిజర్వేషన్ల విషయానికి వస్తే, జిల్లా అధికారులు ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీలకు 50 శాతం, మిగతా జనరల్ కేటగిరీ, మహిళలకు సంబంధించిన రిజర్వేషన్లను డ్రాఫ్ట్ రూపంలో సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి అధికారిక గెజిట్ విడుదలైన వెంటనే ఫైనల్ రిజర్వేషన్లను ప్రకటించనున్నారు. జిల్లాలో 4,11,000 మంది ఓటర్లు ఉండగా, ఇందులో తమ పేర్లు ఓటర్ జాబితాలో ఉన్నాయో తెలుసుకునేందుకు 23వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఇప్పటికే గ్రామ సచివాలయాల వద్ద ఓటర్ నమోదు, మొబైల్ నెంబర్ లింక్, తప్పుల సవరణ ప్రక్రియలతో బిజీబిజీగా మారిపోయింది. మూడో విడత పోటీదారులకు పెరగనున్న ఖర్చు మూడు విడతల్లో ఎన్నికలు జరగనుండడంతో అభ్యర్థుల ఖర్చు కూడా పెరగనుంది. జిల్లాలో 280 గ్రామ పంచాయతీలు ఉండగా, 2,534 వార్డులు ఉన్నాయి. ఇందులో 4 మండలాల చొప్పున విభజించి మూడు విడతల్లో ఎలక్షన్లను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి విడతలో 74 జీపీలు, 668 వార్డులు, రెండో విడతలో 117 జీపీలు, 1,038 వార్డులు, మూడో విడతలో 89 జీపీలు, 828 వార్డుల పరిధిలో ఎన్నికలను నిర్వహించనున్నారు. ప్రభుత్వ గైడ్‌లైన్స్ ప్రకారం మూడు విడతల షెడ్యూల్‌ను తయారు చేస్తుండగా, అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మొదటి విడత అభ్యర్థులకు ఖర్చులు కొంత తగ్గే అవకాశం ఉండగా, రెండో విడతలో 30 శాతం వరకు అదనపు భారం పడనుంది. ఇక మూడో విడత అభ్యర్థులకు మాత్రం ఖర్చు భారీగా పెరిగే అవకాశముందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎన్నికల తేదీలు దగ్గర పడుతున్న కొద్దీ మొదటి విడత అభ్యర్థులు స్వల్పకాలం ప్రచారంతోనే సరిపెట్టుకునే అవకాశం ఉంది.ఫేజ్ మండలాలు జీపీ వార్డులు ఫేజ్–1 జనగామ, లింగాలఘణపురం, నర్మెట, తరిగొప్పుల 74 668 ఫేజ్–2 బచ్చన్నపేట, దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల 117 1,038 ఫేజ్–3 చిల్పూరు, స్టేషన్‌ఘన్‌పూర్, రఘునాథపల్లి, జఫర్‌గఢ్ 89 828 ఓటరు జాబితా పరిశీలనకు 23 వరకు అవకాశం 12 మండలాలు.. మూడు విడతలుగా విభజన మూడో విడత ఎన్నికల పోటీదారులకు పెరగనున్న ఖర్చు -
‘కడియం’ మరోసారి
● స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను కలిసిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే ● వివరణకు మరింత సమయం కోరిన కడియం శ్రీహరి ● పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదులపై ఏం తేలనుంది..? ● హాట్‌టాపిక్‌గా మారిన ‘అనర్హత పిటిషన్’ల విచారణసాక్షిప్రతినిధి, వరంగల్ : మాజీ మంత్రి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్.. సుప్రీం ఆదేశాలతో ఊపందుకున్న విచారణ ఉమ్మడి వరంగల్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. సుప్రీంకోర్టు డైరక్షన్ మేరకు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. పార్టీ ఫిరాయింపుల (బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్‌లో చేరిక) అభియోగం ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి, వివరణలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం ఈ నెల 23న హాజరు కావాల్సి ఉంది. ఈ మేరకు గురువారమే స్పీకర్ ప్రసాద్ కుమార్ నోటీసులు కూడా ఇచ్చారు. అయితే రెండు రోజుల ముందే శుక్రవారం స్పీకర్‌ను కలిసిన కడియం శ్రీహరి వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కోరారు. ఆయన అభ్యర్థన మేరకు స్పీకర్ సమయం ఇస్తారా? లేదా?.. సమయం ఇస్తే ఎన్ని రోజులు ఇస్తారు? అన్న సస్పెన్స్ కొనసాగుతుండగా, ఈ ఎపిసోడ్లో కడియం శ్రీహరి వ్యూహం ఏమిటనేది పొలిటికల్ సర్కిళ్లలో చర్చ జరగుతోంది. స్పీకర్ నిర్ణయం కోసం వెయిటింగ్.. కేడర్‌తో సమాలోచనలు.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి శాసనసభ స్పీకర్ మరోసారి నోటీసులు జారీ చేయడంతో కడియం శ్రీహరి శిబిరంలో అలజడి మొదలైంది. జూలై నుంచి మూడు నెలల్లో విచారణ పూర్తి చేయాల్సి ఉండగా ఆలస్యమైంది. సుప్రీంకోర్డు ఆగ్రహించి నాలుగు వారాల గడువు ఇవ్వగా.. స్పీకర్ ఇటీవల విచారణకు సంబంధించిన ప్రక్రియలో వేగం పెంచారు. ఈ నేపథ్యంలోనే నోటీసు అందుకున్న శ్రీహరి హైదరాబాద్‌లో మకాం వేసి నిపుణులతో చర్చించి అభిప్రాయాలు తీసుకున్నట్లు చెబుతున్నారు. స్పీకర్ నోటీసుపై వివరణ ఇచ్చేందుకు మరోసారి గడువు కోరినట్లు సమాచారం. ఆయన అభ్యర్థనను స్పీకర్ ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటారు? ఎన్ని రోజులు సమయం ఇస్తారు? అనే దానిపై శ్రీహరి నిర్ణయం ఆధారపడి ఉంటుంది. ఇదిలా ఉంటే నోటీసులు తీసుకున్నప్పటినుంచి శ్రీహరి.. భవిష్యత్ కార్యాచరణపై తనకున్న ముఖ్య నేతలు, కేడర్ సమాలోచనల్లో పడ్డారని అనుచరవర్గాల సమాచారం. స్పీకర్‌ను కలిశా.. సమయం కోరా.. శాసనసభాపతి గురువారం నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో శుక్రవారం వారిని కలిశాను. వాస్తవానికి నాపై నమోదైన పిటిషన్‌పై 23న వివరణ ఇవ్వాల్సి ఉంది. వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని కోరేందుకు స్పీకర్‌ను కలిశా. నా అభ్యర్థన లేఖపై స్పీకర్ స్పందించి ఇచ్చే గడువు ప్రకారం వివరణ ఇస్తా. – కడియం శ్రీహరి, ఎమ్మెల్యే -
చదువుతోనే సమాజంలో గుర్తింపు
కొడకండ్ల: విద్యతోనే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని, విద్యాభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని కస్తూరిబా పాఠశాలలో రూ.94 లక్షలతో నిర్మించే అదనపు గదుల నిర్మాణానికి గురువారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి రూ.5 లక్షలతో పూర్తి చేసిన 7వ అంగన్వాడీ కేంద్ర నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఓ జ్యోతి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మౌలిక వసతులు కల్పించే బాధ్యత తనదని, శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకునే బాధ్యత విద్యార్థులదని సూచించారు. వెనుకబడిన కొడకండ్ల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. ఇంటిగ్రేటేడ్ స్కూల్‌తో కొడకండ్ల ఎడ్యూకేషనల్ హాబ్‌గా మారనుందని అన్నారు. తరగతి గదిలోకి వెళ్లి మాస్టారులా మారిన ఎమ్మెల్యే ప్రతి విద్యాద్ధి తమ భవిష్యత్ లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదువుకోవాలని సూచించారు. పాఠ్యాంశాలకు సంబంధించిన సందేహాలను వెంటనే నివృత్తి చేసుకొవాలని విద్యార్థులకు చెప్పారు. అదనంగా ఐదు బాత్రూంలు, గీజర్ వైరింగ్, హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయిస్తానని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ సాయికృష్ణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రవీందర్, మండల అధికారులు, నాయకులు, మార్కెట్ డైరెక్టర్లు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. కస్తూరిబా పాఠశాలలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి విద్యార్థుల వద్దకు వెళ్లి ప్రతి ఒక్కరిని పరిచయం చేసుకొని షేక్ హ్యాండ్ ఇచ్చారు. విద్యాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి -
శాస్త్రీయ పద్ధతుల్లో పాడిపరిశ్రమతో అభివృద్ధి
లింగాలఘణపురం: గ్రామీణ ప్రాంత ప్రజలు శాస్త్రీయ పద్ధతుల్లో పాడిపరిశ్రమను చేపడితే అభివృద్ధి సాధ్యమవుతుందని పశువైద్య విశ్వవిద్యాలయం రిటైర్డ్ రిజిస్ట్రార్ కె.కొండల్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని సిరిపురం రైతు వేదికలో వి.వి.నర్సింహరావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, సేవా స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా శాసీ్త్రయ పద్ధతుల్లో డెయిరీ, పాల ఉత్పత్తుల జోడింపుపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డాక్టర్ ఎం.శశికుమార్, ప్రొఫెసర్ సాహిత్యారాణి, సేవాస్ఫూర్తి ఫౌండేషన్ ప్రాజెక్టు మేనేజర్ జి.రత్నాకర్, ఏఓ మమత, గిరిబాబు, ఏఈఓలు తదితరులు పాల్గొన్నారు. -
హీటెక్కుతున్న రాజకీయం
పల్లెల్లో మళ్లీ మొదలైన పంచాయతీ ఎన్నికల సందడి జనగామ: పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. గ్రామపంచాయతీ ఎన్నికలకు కసరత్తు ప్రారంభించిన వేళ రాజకీయ పార్టీల కదలికల్లో వే గం పుంజుకుంది. ప్రభుత్వం మొదటగా గ్రామపంచాయతీ ఎన్నికలకు సుముఖత వ్యక్తం చేయడంతో ఆశావహులు తెరపైకి వచ్చారు. దీంతో పల్లెల్లో రాజకీయం వేడెక్కింది. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరిగే అవకాశం స్పష్టమవడంతో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసిన నేతలతోపాటు కొత్త వారు తమ అదృష్టం పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. నాయకులు ఇప్పటికే పార్టీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేపనిలో పడ్డారు. జిల్లా వ్యాప్తంగా 280 గ్రామపంచాయతీలు, 12 జెడ్పీటీసీలు, 134 ఎంపీటీసీలు, 2,534 వార్డులు, గత ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన వివరాల ప్రకారం 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈసారి పోలింగ్ శాతం మరింత పెరగడానికి అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ప్రతి ఓటరు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తపరుచనున్నారు. ఇక ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఏర్పాట్లను ప్రారంభించింది. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, సిబ్బంది నియామకం, ఓటర్ల జాబితా, తదితర కార్యక్రమాల్లో వేగం పెంచారు. సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పారదర్శక పోలింగ్ నిర్వహణకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. స్థానిక సమరం జరుగనున్న నేపథ్యంలో గ్రామాల్లో రాజకీయ వాతావరణం హీటెక్కింది. కొందరు సర్పంచ్ ఆశావహులు గతంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తుండగా, మరోవైపు కొత్త అభ్యర్థులు మార్పు అవసరాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేయనున్నారు. ప్రజల్లో మంచి పట్టున్న వారి నుంచి యువ అభ్యర్థుల వరకు అందరూ ప్రజా మద్ధతు కోసం సేవా కార్యక్రమాలు చేస్తూ గత కొన్నిరోజులుగా ఇంటింటికీ తిరుగుతున్నారు. గ్రామ పెద్దలు, సంఘాలు, ప్రభావవంతమైన కుటుంబాలు కూడా ఈ దశలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. చలి చంపుతున్న వేళ రాజకీయ వేడి మాత్రం తగ్గేలా కనిపించడం లేదు. ప్రతి సమావేశం, ప్రతి చర్చ ఎన్నికల చుట్టూ తిరుగుతోంది. అధికార పార్టీలతోపాటు ప్రతిపక్షాలు కూడా తమ బృందాలను గ్రామాల్లోకి దింపి వ్యూహరచనలకు శ్రీకారం చుట్టాయి. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార ప్రణాళికల వరకూ పార్టీలు దశలవారీగా సిద్ధమవుతున్నాయి. త్వరలో స్థానిక సంస్థల ఎలక్షన్ నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో పల్లెల్లో ఎన్నికల జోష్ కనిసిస్తుంది. పాత రిజర్వేషన్లతో కొత్త సమీకరణలు ఎలా రూపుదిద్దుకుంటాయన్నది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఓటర్ల నమోదు ప్రక్రియకు మరోసారి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ సంఖ్య మరింత పెరగనుంది. తెరపైకి ఆశావహులు ఎన్నికల బిజీలో అధికారులు, సిబ్బంది పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎంపికపై అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ కరసత్తు ప్రారంభించాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్లో అభ్యర్థుల ఎంపిక పెద్ద సవాల్‌గా మారనుంది. రెండు పార్టీల్లో మెజార్టీ గ్రామాల్లో ఇద్ద రి నుంచి ముగ్గురు పోటీలో ఉండడంతో అధిష్టానం ఎవరివైపు మొగ్గు చూపుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆయాపార్టీలు రహస్య సర్వేలు సైతం చేపట్టి అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా పాత రిజర్వేషన్ల ప్రకారం ఎలక్షన్లు నిర్వహిస్తారనే ప్రచారం నేపథ్యంలో అవకాశం కలిసి వచ్చే వారు సేవా కార్యక్రమాలతో దూసుకుపోగా, బీసీ రిజర్వేషన్లతో నెల రోజులు గ్యాబ్ రాగా, ఇప్పుడు మళ్లీ రంగంలోకి దిగారు. -
ప్రతీ మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలి
జనగామ రూరల్: ప్రతీ మహిళ పారిశ్రామిక వేత్తగా ఎదగాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకంపైన ఏపీఎం, సీసీ, మండల సమాఖ్య సభ్యులకు గురువారం కలెక్టరేట్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్థానికంగా తయారు చే సిన నిత్యం ప్రజలకు అవసరమైన వస్తువులు మహిళా సంఘాల సభ్యుల నుంచి వస్తే ప్రజలకు ఎక్కువ నమ్మకం ఉంటుందన్నారు. ఆహార ఉత్పత్తి ప్రాసెస్‌లో మహిళలకు పరికరాల కొనుగోలుకు సహకా రం అందించనున్నట్లు తెలిపారు. 200 వరకు వ్యక్తిగత ఆహార పరిశ్రమల లక్ష్యం ఉందని నాణ్యమైన ఉత్పత్తులు చేస్తే మార్కెటింగ్ కల్పిస్తామన్నారు. పరిశ్రమలు వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకుంటే ప్రాజెక్ట్ వ్యయంలో 35 శాతం సబ్సిడీ, రూ.10 లక్షల వరకు ప్రాజెక్ట్ వ్యయంపై రుణ అనుసంధాన రాయితీ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఓ వసంత, నూరుద్దీన్, జిల్లా అధికారులు ఉమాపతి, శ్రీరామ్, నవీన్, ఇక్రిశాట్ రీజినల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. కేంద్రం నుంచి జల పురస్కారం అవార్డు అందుకున్న నేపథ్యంలో వివిధ శాఖల అధికారులు కలెక్టర్, అదనపు కలెక్టర్లు, డీఆర్డీఓను సన్మానించారు. పక్కాగా విజయోస్తు 2.0 అమలు చేయాలి విజయోస్తు 2.0 కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేసి ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. అదనపు కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి పింకేష్ కుమార్‌తో కలిసి మండల విద్యాశాఖ అధికారులు, వివిధ విద్యాసంస్థల యజ మాన్యాలతో గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు విద్యార్థులకు 100 శాతం ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ ఉండాలన్నారు. యూడైస్ ప్లస్ పోర్టల్‌లో పాఠశాల వసతులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల సమాచారాన్ని నమోదు చేయాలన్నారు. అపార్ ఐడీలు 100 శాతం పూర్తయ్యేలా చూడలన్నా రు. అధికారులు తప్పనిసరిగా పాఠశాలలను విజి ట్ చేసి ఎస్ఏ వన్ పరీక్ష ఫలితాలను పరిశీలించాలన్నారు. పదో తరగతి పరీక్షల ప్రణాళికల ప్రకారం ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు పాటించా లని సూచించారు. న్యాస్ మాదిరిగానే ఈఏడాది మూడో తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి నెలలో నిర్వహించబోతున్న ఫౌండేషనల్ లెర్నింగ్ సర్వే (ఎఫ్ఎల్ఎస్) కోసం మూడో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కార్యక్రమంలో ఏఈ సత్యప్రసాద్, ఏఎంఓ శ్రీనివాస్, జీసీడీఓ గౌసియా బేగం, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లా ఆదర్శంగా నిలవాలి ప్రధాన్ మంత్రి ధన్, ధాన్య కృషి యోజన పథకాన్ని సమన్వయంతో అమలు చేసి రైతులకు గరిష్టలాభం చేకూరేలా పని చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. పథకం అమలు పైన గురువారం కలెక్టరెట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రణాళిక రూపకల్పన, భవిష్యత్ లక్ష్యాల ఖరారుపై వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్, సహకార విభాగం, భూగర్భ జలాలు, పౌర సరఫరాల శాఖల అధికారులకు సూచనలు చేశారు. శాఖలవారీగా ప్రాజెక్టులను సిద్ధం చేసి రెండు రోజుల్లో సమర్పించాలన్నారు. నైపుణ్యాలు పెంపొందించుకోవాలి దిక్సూచిలో భాగంగా విల్ 2 కాన్ సంస్థ సహకారంతో ఉపాధ్యాయులకు కొనసాగుతున్న 30 రోజుల స్పోకెన్ ఇంగ్లిష్, డ్రాఫ్టింగ్ నైపుణ్య శిక్షణను గురువారం కలెక్టర్ పరిశీలించారు. టెక్నాలజీకి అనుగుణంగా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలన్నారు. ప్రతి రోజు అన్ని పాఠశాలల్లో 30 నిమిషాల ప్రత్యేక దిక్సూచి పీరియడ్ నిర్వహించి విద్యార్థుల నైపుణ్యా లు పెంచాలన్నారు. ఉపాధ్యాయుల నైపుణ్యాలు మెరుగుపడాలనే ఉద్దేశంతో స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ రామేశ్వరం గౌడ్ సహకారంతో ఆన్లైన్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. 1,500 మంది ఉపాధ్యాయులతో కలెక్టర్ వర్చువల్‌గా మాట్లాడారు. శ్రీనివాస్, గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు.ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి జనగామ: స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అధికారులకు సూ చించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి, ఎన్నికల సంఘం అధికారులతో కలిసి గురువారం ఆమె హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు, అదనపు కలెక్టర్లు, పంచాయతీ అధికారులతో స్థానిక ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితా అభ్యంతరాలు, పోలింగ్ కేంద్రాలు, రిజర్వేషన్ల ప్రక్రియ, శాంతిభద్రతల అంశాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యుల జాబితా సమర్పించాలని ఆదేశించారు. మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణకు కార్యచరణ రూపొందించాలన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ -
పుస్తక పఠనంతో వ్యక్తిత్వ వికాసం
జనగామ: పుస్తక పఠనం మనసును ప్రశాంతంగా ఉంచడమే కాకుండా, నిర్ణయశక్తి, ఆత్మ విశ్వాసం, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందిస్తుందని డీసీపీ రాజమహేంద్ర నాయక్ అన్నారు. 58వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సందర్భంగా గురువారం జిల్లా గ్రంథాలయ ఆవరణలో సంస్థ చైర్మన్ మారడోజు రాంబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీసీపీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు లింగాల జగదీష్ చందర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ బొల్లం అజయ్‌తో కలిసి డీసీపీ జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మాట్లాడారు. గ్రంథాలయాలు భవిష్యత్ నిర్మాణంలో ఉత్తమ మార్గదర్శకాలని పేర్కొన్నారు. యువత పుస్తక పఠనం వైపు మొగ్గు చూపాలని సూచించారు. పుస్తకం చదివిన వ్యక్తి ఆలోచనలు, ప్రవర్తన, జీవన విధానం సానుకూలంగా మారుతాయని డీసీపీ సూచించారు. ప్రతి ఇంట్లోనూ పఠన సంస్కృతి పెరగాలంటే గ్రంథాలయాల వినియోగం తప్పనిసరి అన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, యువత తప్పనిసరిగా గ్రంథాలయాలను సందర్శించి పుస్తకాలు చదవడం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మారజోడు రాంబాబు మాట్లాడుతూ.. నెట్ ప్రపంచంలో గూగుల్ ద్వారా సమాచారాన్ని వెతకడం కాకుండా నేరుగా గ్రంథాలయాల్లో పుస్తక పఠనం చేసి జ్ఞానాన్ని పెంపొందించుకున్నప్పుడే సమాజానికి దిక్చూచిగా నిలబడతారని అన్నారు. పుస్తక పఠనం ద్వారా ఒకేచోట నుంచే ప్రపంచాన్ని తెలుసుకోవచ్చని తెలిపారు. అనంతరం పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులను సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు, కళాకారులు,కవులు, రచయితలు లింగాజీ, సాంబరాజు యాదగిరి, జి.కృష్ణ, ఐల సోమాచారి, జోగు అంజయ్య, గ్రంథాలయ సెక్రెటరీ సుధీర్, జయరాం, బాష్మియా, తోటకూర రమేష్, బండ కుమార్, పర్ష సిద్దేశ్వర్, క్రాంతి, శ్రవణ్, పృథ్వీ, నరేందర్, ప్రవీణ్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్ -
రైతులకు తప్పనిసరి రశీదులు ఇవ్వాలి
రఘునాథపల్లి: విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసిన రైతులకు తప్పనిసరి రశీదులు ఇవ్వాలని జిల్లా వ్యవసాయాధికారి అంబికాసోని వ్యాపారులను ఆదేశించారు. రఘునాథపల్లి, ఫతేషాపూర్, నిడిగొండలోని పలు విత్తనాలు, ఎరువుల షాపులను గురువారం ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ఆయా షాపుల్లో ఎరువుల నిల్వలు, లైసెన్స్, స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్స్, ఈ పాస్ మిషన్ బ్యాలెన్స్, స్టాక్ బోర్డు పరిశీలించారు. రైతులకు నకిలీ విత్తనాలు అంటగడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆమె వెంట మండల వ్యవసాయాధికారి శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.ఐక్యతే ఉద్యోగుల శక్తిపాలకుర్తి టౌన్: ఉద్యోగులు ఐక్యంగా ఉంటే ఏ సమస్యనైనా సులభంగా పరిష్కరించవచ్చని టీఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు ఖాజా షరీఫ్ అన్నారు. పాలకుర్తి, దేవరుప్పల, కొడకండ్ల మండలాల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ సంఘం పాలకుర్తి యూనిట్ అధ్యక్షుడు బక్క మహేష్‌యాదవ్ అధ్యక్షతన జిల్లా అధ్యక్షుడు ఖాజా షరీఫ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి టీఎన్జీఓ ఎల్ల ప్పుడు ముందుంటుందని తెలిపారు. జిల్లా కార్యదర్శి పెండెల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రభాకర్, హఫీజ్, వెంకటాచారి, శ్రీధర్, శివప్రసాద్, కాసర్ల రాజు పాల్గొన్నారు.నేటి నుంచి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలుజనగామ: జిల్లాలో నేటి(శుక్రవారం) నుంచి నిర్వహించే స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల నిర్వహణకు గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి (ఐఏఎస్) పింకేస్ కుమార్ ప్రాథమిక, సెకండరీ స్థాయి స్కూల్ కాంప్లెక్స్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 21, 22వ తేదీల్లో ప్రాథమిక స్థాయి (పీఎస్, యూపీఎస్)కి సంబంధించి రెండు విడతలుగా సమావేశాలు నిర్వహించనున్నారు. జిల్లాలో 35 స్కూల్ కాంప్లెక్స్‌లు ఉండగా, విద్యార్థుల బోధనకు ఎలాంటి ఆటంకం కలుగకుండా సమావేశాలకు రోజుకు 50 శాతం మంది టీచర్లు హాజరు కావాలని తెలిపారు. ఇందులో ఎస్ఏ–1 ఫలితాల సమీక్ష, పీఆర్ఎస్–2024 రిపోర్ట్ విశ్లేషణ, ఎఫ్ఎల్ఎన్ పాఠాల అమలు, 5 ప్లస్ 1 విధానం, డిజిటల్ టూల్స్ ఉపయోగం, బోధనా వ్యూహాలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. అలాగే ఉన్నత, ప్రాథమికోన్నత స్థాయిలో 24వ తేదీన తెలుగు, హిందీ, ఇంగ్లిష్, 25న సామాజిక శాస్త్రం, గణితం, బయాలజీ, 26న ఫిజికల్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ మూడు రోజులపాటు సమావేశాలను నిర్వహించేలా ప్రణాళిక రూపొదించారు. స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల సమయంలో వందశాతం హాజరు కావాలని విద్యాశాఖ నిబంధనలు విధించింది. అత్యవసర పరిస్థితులు మినహా, ఏ ఒక్క టీచర్‌కు కూడా సెలవు అనుమతి ఉండదని జీఓ లో పేర్కొన్నారు. ఎంఈఓ, హెచ్ఎం, సీఆర్పీలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు హాజరు ఉండాలనే ఖచ్ఛితమైన నిబంధన విధించారు. కాంప్లెక్స్ సమావేశాలకు హాజరయ్యే ఉపాధ్యాయుల సమాచారం, రిపోర్టులను యాప్ ద్వారా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాంవరంగల్ క్రైం : డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని డ్రగ్స్ కంట్రోల్ టీం ఆధ్వర్యంలో ‘సే నో టు డ్రగ్స్’ అనే నినాదంతో రూపొందించిన వాల్‌పోస్టర్‌ను సీపీ గురువారం అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. మత్తు పదార్థాల నియంత్రణలో ప్రజలు సైతం సహకరించాలని సూచించారు. ఎవరైన మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగాలకు పాల్ప డితే వెంటనే 87125 84473, 87126 85299 నంబర్లకు సమాచారం ఇవ్వాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచనున్నట్లు సీపీ తెలిపారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ రవి, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ జితేందర్ రెడ్డి, ఆర్ఐ శివకేశవులు, ఇన్స్పెక్టర్ సతీష్, ఆర్ఎస్సైలు పూర్ణచందర్ రెడ్డి, మనోజ్ రెడ్డి, నాగరాజు, ర్యాపిడో సంస్థ ప్రతినిధులు దుర్గారావు, సందీప్ పాల్గొన్నారు. -
కోతులకు ఆహారంగా ఏకుడుపేలాలు, అన్నం..
జఫర్‌గఢ్ : జఫర్‌గఢ్ మండలంలోని ఉప్పుగల్లు గ్రామానికి చెందిన ఓ రైతు తన పంటను కోతుల బారినుంచి కాపాడేందుకు వినూత్న ప్రయోగం చేపట్టారు. గ్రామానికి చెందిన గడ్డం కొమురయ్య తన పదెకరాల భూమిలో వరి సాగు చేశాడు. ప్రస్తుతం చేను బిర్రుపొట్ట దశకు రావడంతో కోతులు పంట చేను మీద పడి నాశనం చేస్తున్నాయి. వీటి బారినుంచి పంటను కాపాడేందుకు సదరు రైతు కొమురయ్య వినూత్న ఆలోచన చేశారు. ప్రతీరోజు ఇంటినుంచి ఎక్కువగా ఏకుడుపేలాలు, అన్నం, కొద్ది మొత్తంలో పల్లీలు తీసుకువచ్చి తన పంట పొలం వద్ద ఉన్న రోడ్డుపై చల్లుతున్నారు. దీంతో కోతులు పంట చేనును వదిలి రోడ్డుపైకి వచ్చి వీటిని తింటున్నాయి. కోతులన్నీ గుంపుగా ఒక చోటుకు చేరగానే వాటిని అక్కడి నుంచి తరిమేస్తున్నారు. దీంతో కోతులు పంట చేను వైపు రావడం లేదంటూ రైతు కొమురయ్య తెలిపాడు. ఈ విధానాన్ని గత కొద్ది రోజులనుంచి పాటిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, కోతులు తనను చూడగానే తన మాటలను గుర్తించి దగ్గరకు వస్తున్నాయని, తనపై ఎలాంటి దాడులు కూడా చేయడం లేదని రైతు కొమురయ్య తెలిపారు. ఈ ప్రయోగాన్ని గమనించిన తోటి రైతులతోపాటు రోడ్డు మీదుగా వెళ్లే ప్రయాణికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. వాటిబారి నుంచి పంటను కాపాడేందుకు ఓ రైతు వినూత్న యత్నం -
ముగిసిన కార్తీక మాసోత్సవం
జనగామ: ముప్పై రోజుల పాటు భక్తి శ్రద్ధలతో సాగిన కార్తీక మాసం గురువారంతో ముగిసింది. రోజు వారీగా ప్రత్యేక పూజలు, అభిషేకా లు, అర్చనలు, నంది అభిషేకాలు, దీపోత్సవం, రాత్రివేళ ఆకాశజ్యోతి దర్శనంతో భక్తులు శివయ్య అనుగ్రహాన్ని అందుకున్నారు. దేశంలోని పంచారామాలయాలతో సహా వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్లి నదీ స్నానాలు, ప్రత్యేక అర్చనలు చేపట్టిన భక్తులు కఠిన నియమాలతో 30 రోజులపాటు పూజలు నిర్వహించి తమ భక్తిని చాటుకున్నారు. చివరి రోజున ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు చేసిన అనంతరం ఉసిరి చెట్టు వద్ద దీపాలు వెలిగించారు. దీపాల వెలుగుల్లో శివనామ స్మరణ గురువారం జిల్లాలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రతి ఇల్లు, దేవా లయాల్లో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. శివ నామస్మరణ, దీపారాధన, ఉపవాస దీక్షలు, మహాన్యాస పూర్వ క అభిషేకాలు నిర్వహించిన భక్తులు కార్తీక మాస ఉపవాస దీక్షలను ము గించారు. భక్తులకు ఆకాశజ్యోతి దర్శన భాగ్యం కల్పించగా, ఉసిరి చెట్టు కింద దీపారాధన చేశారు. పోలీ స్వర్గానికి ఏర్పాట్లు కార్తీక మాసం ముగిసిన మరుసటి రోజు నేడు(శుక్రవారం) పోలీ స్వర్గం పర్వదినాన్ని భక్తులు ప్రత్యేకంగా జరుపుకుంటారు. తెల్లవారు జామునే నదీ ప్రవాహంలో దీపాలను వదలడం ఆనవాయితీ.. వీలు కాని భక్తులు ఆలయాల్లో వెలిగిస్తారు. నెల రోజులపాటు నియమాలు పాటించకపోయినా పోలీ పాడ్యమి రోజున కనీసం 30 వత్తులు వెలిగిస్తే విశేష పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. కార్తీక పర్వదినంతో ప్రారంభమైన భక్తి దీపార్చన పోలీ స్వర్గం రోజున మరింత భక్తి శ్రద్ధలతో సాగుతుంది. ముప్పై రోజులపాటు భక్తి శ్రద్ధలతో పూజలు నేడు పోలి స్వర్గం -
సాగుకు యంత్రసాయం
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని ఆధునికీకరించేందుకు అత్యంత ప్రాధాన్యమిస్తూ యాంత్రీకరణకు పెద్దపీట వేస్తోంది. రైతులపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రేవంత్‌రెడ్డి సర్కార్ సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలను అందిస్తోంది. కొన్ని సంవత్సరాలుగా సబ్సిడీ యంత్రాల సరఫరా నిలిచిపోగా, ఇప్పుడు రైతులకు ఉత్సాహాన్నిచ్చే విధంగా వ్యవసాయ శాఖకు భారీ మొత్తంలో యంత్రాలను విడుదల చేసింది. జిల్లాకు 3,370 యంత్ర పరికరాలకు ప్రభుత్వం ఆమోదం తెలపగా, వాటి పంపిణీ కోసం రూ.2.73 కోట్ల నిధులు కేటాయించింది. పలు కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోవడంతో, ప్రతీ పరికరం ఏ కంపెనీ ద్వారా అందుబాటులో ఉంటుందో రైతులకు వివరాలు కూడా ప్రకటించారు. రైతుకు అవసరమైన యంత్రంపై సంబంధిత కంపెనీ పేరిట డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) తీసి మండల అగ్రికల్చర్ ఆఫీసర్‌కు అందజేస్తే సరిపోతుంది. మార్పిడి చేసుకునే అవకాశం జిల్లాలో యంత్రాల అవసరానికి సంబంధించి డిమాండ్‌ను పరిశీలించి, అవసరమైతే ఇతర పరికరాలకు కేటాయించిన నిధుల నుంచి కన్వర్షనన్ చేసి రైతులు అత్యధికంగా కోరిన వాటిని అందించే అవకాశం కూడా కల్పించారు. సబ్సిడీ పరికరాలను అందించడంతో పాటు జిల్లాలో డిమాండ్ ఆధారంగా యంత్రాల మార్పిడి ద్వారా కూడా వారికి అవసరమైన వాటిని అందించే వెసులుబాటు ఈ స్కీంలో కల్పించారు. అర్హత కలిగిన ప్రతీ రైతుకు సబ్సిడీ వ్యవసాయ యంత్రాలు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి, అక్కడి నుంచి రాష్ట్రస్థాయికి దరఖాస్తుల పరిశీలన జరగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోపు యంత్రాల పంపిణీని 100శాతం పూర్తి చేయాలనే లక్ష్యంగా వ్యవసాయశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. రైతులు తమకు అవసరమైన యంత్రాలను త్వరగా ఎంపిక చేసుకుని దరఖాస్తు చేసు కోవాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. రైతులకు ప్రయోజనం ప్రభుత్వం నుంచి సబ్సిడీ యంత్రాల సరఫరా లేని సమయంలో రైతులు ప్రైవేటుగా 100శాతం ధర చెల్లించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. సీఎం రేవంత్‌రెడ్డి సర్కారు సబ్సిడీపై యంత్ర పరికరాలను అందుబాటులోకి తీసుకురావడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యంత్రపరికరాల కొనుగోలుపై ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్న కారు, మహిళ రైతులకు 50శాతం, జనరల్, పెద్ద రైతులకు 40శాతం సబ్సిడీ అందిస్తున్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని త్వరితగతిన దరఖాస్తు చేసుకుంటే, జిల్లాలో ఏ యంత్రానికి డిమాండ్ ఉందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోపు సబ్సిడీ యంత్రాల పంపిణీ ప్రక్రియ ముగించనున్నారు. రైతులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్ సబ్సిడీతో వ్యవసాయ యంత్రాలు అందజేత అన్నదాతపై తగ్గనున్న ఆర్థిక భారం పవర్ టిల్లర్ నుంచి రోటోవేటర్ వరకు జిల్లాకు 3,370 పరికరాలు.. రూ.2.73కోట్ల బడ్జెట్జిల్లాకు కేటాయించిన యంత్ర పరికరాల వివరాలు యంత్రం సంఖ్య మొత్తం (లక్షల్లో/రూ.) పవర్ వీడర్స్ 17 5.95 బ్రష్ కట్టర్లు 33 11.55 పవర్ టిల్లర్లు 25 25.00 స్ట్రా బేలర్స్ 19 38.00 స్ప్రేయర్లు 2456 24.56 (బ్యాటరీ/మాన్యువల్) పవర్ స్ప్రేయర్లు 444 44.40 రోటోవేటర్లు 154 77.00 సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్ 25 7.50 డిస్క్ హారో/ఎంబీ ప్లౌ/ కేజ్ వీల్స్/రోటో పడ్లర్ 169 33.80 బండు ఫార్మర్ 6 0.90 పవర్ బండ్ ఫార్మర్ 3 4.50 మొత్తం 3,370 2.73 కోట్లురైతులు సద్వినియోగం చేసుకోండి ప్రభుత్వం వ్యవసాయ యంత్ర పరికరాలను సబ్సిడీపై అందిస్తోంది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. యంత్ర పరికరాలకు సంబంధించి సర్కారు నుంచి కేటగిరీ వారీగా గైడ్‌లైన్స్ వచ్చాయి. రైతుల డిమాండ్ ఆధారంగా మన వద్ద డిమాండ్ లేని యంత్ర పరికరాలకు కేటాయించిన బడ్జెట్ నుంచి, అన్నదాతలకు ఉపయోగపడే విధంగా అందించే అవకాశం ఉంది. దీనిని రైతులు సద్వినియోగం చేసుకుని, వ్యవసాయ అవసరాలు ఉపయోగించుకోవాలి. యంత్ర పరికరాలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. యంత్ర పరికరం అవసరమైన రైతులు సంబంధిత కంపెనీపై డీడీ తీసి ఇవ్వాల్సి ఉంటుంది. – అంబికా సోని, జిల్లా వ్యవసాయాధికారి -
మినహాయింపు కొందరికే
జనగామ రూరల్: పదో తరగతి విద్యార్థుల వార్షిక పరీక్ష ఫీజు మినహాయింపు కొందరికే వర్తిస్తోంది. ఏటా పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం నోటిఫికేషన్లో వెనకబడిన కుటుంబాల విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు మినహాయింపును చేర్పుతూనే వస్తోంది. అయితే అది ఏ ఒక్కరికీ ఉపయోగపడడం లేదు. ప్రభుత్వం ప్రకటించడానికి, అధికారులు చెప్పుకోడానికే పరిమితమైందనే ఆరోపణలున్నాయి. పొంతనలేని వార్షిక ఆదాయం కారణంగా ప్రతి ఒక్కరూ ఫీజుల చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. జిల్లావ్యాప్తంగా 103 ఉన్నత పాఠశాలల్లో 6,695 మంది విద్యార్థులు పదో తరగతి వార్షిక పరీక్షలు రాసేందుకు యూడైస్ ప్లస్‌లో నమోదు చేసుకున్నారు. అయితే, ఏటా అక్టోబర్‌లోనే పరీక్ష ఫీజు షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అయితే రెగ్యులర్ విద్యార్థులు రూ.125 చెల్లించాల్సి ఉండగా సప్లిమెంటరీ విద్యార్థులు 3 సబ్జెక్టులోపునకు రూ.110, మూడుదాటితే రూ.125 చెల్లించాలి. ఒకేషనల్ విద్యార్థులు రూ.185 కట్టాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఫీజు చెల్లింపు 20 నవంబర్ వరకు ఉంది. అదేవిధంగా రూ.50 ఫైన్, రూ.200, రూ.500 అపరాధ రుసుం చెల్లించే గడువు సైతం ఇచ్చారు. రెండేళ్ల క్రితం వరకు తత్కాల్ పేరుతో రూ.వెయ్యి ఫైన్‌తో పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం ఇవ్వగా ఈసారి నోటిఫికేషన్లో అలాంటి అవకాశం ఇవ్వలేదు. మారని నిబంధనలతో ఇబ్బందులు అన్నిరకాల యాజమాన్య పాఠశాలల్లో వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు వార్షిక ఫీజు మినహాయింపు సౌకర్యాన్ని ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఆయా పాఠశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల్లో ఆర్థికంగా వెనకబడినవారికి ఈ అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఫీజు చెల్లింపుతో పాటు విద్యార్థి వారి కుటుంబ ఆదాయ ధ్రువపత్రం అందించాల్సి ఉంటుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని వారికి రూ.20 వేలు, పట్టణ ప్రాంతాల్లోని వారికి రూ.24వేల లోపు వార్షిక ఆదాయం నిబంధన విధించడంతో ఏ ఒక్కరికీ ఈ ప్రయోజనం చేకూరడంలేదు. రాష్ట్రంలో ఏ పథకమైన దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి ప్రభుత్వం వర్తింపజేస్తుంది. ఇందుకు గరిష్ట ఆదాయం రూ.లక్షకు పైగానే ఉంటుంది. కానీ టెన్త్ విద్యార్థులకు వచ్చేసరికి ఇంత తక్కువగా కేటాయించారు. 30 ఏళ్లుగా ఇదే డిజిట్ కొనసాగిస్తున్నారని, 2015 నుంచి మార్చాలని ఎస్ఎస్సీ బోర్డు ప్రభుత్వానికి లేఖ రాసిన మార్పు జరగడం లేదని తెలుస్తోంది. దీంతో చాలా మంది వెనుకబడిన కులాల విద్యార్థులకు ప్రయోజనం లేకుండాపోతోంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే.. ప్రభుత్వం సూచించిన ఆదేశాల ప్రకారం ఎస్సెస్సీ బోర్డు ద్వారా నోటిఫికేషన్ విడుదల చేశారు. దీని ప్రకారం జిల్లాలోని అన్ని పాఠశాలల హెచ్ఎంలకు ప్రతిని అందించాం. నిబంధనల ప్రకా రం ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు పరీక్ష ఫీజు మినహాయింపు పొందాలంటే వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల కుటుంబానికి రూ.20 వేలు, పట్టణాల్లో రూ.24 వేలు దాటకూడదు. – టి. రవికుమార్, అసిస్టెంట్ కమిషనర్ , ప్రభుత్వ పరీక్షల విభాగం వసతిగృహాల విద్యార్థులకు అవకాశం ప్రభుత్వ వసతిగృహాల్లో ఉండి చదువుతున్న బీసీ విద్యార్థులకు ఆ శాఖ కమిషనర్ ఏటా ఇచ్చే ప్రత్యేక ఆదేశాల మేరకు కొందరు ఫీజు రాయితీ పొందగలుగుతున్నారు. అదేవిధంగా కేజీబీవీల్లో చదువుతున్న మొత్తం బాలికలకు ఫీజు రాయితీ వర్తిస్తోంది. ఎస్సీ ఎస్టీ, బీసీ వెల్ఫేర్ గురుకులాలతో పాటు కేజీబీవీ విద్యార్థులు మాత్రమే ఈ రాయితీ నేరుగా పొందుతుండగా, మిగతా విద్యార్థులకు ఈ అవకాశం లభించడంలేదు. వార్షిక ఆదాయ నిబంధన సవరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. పదో తరగతి వార్షిక పరీక్ష ఫీజులో పాత నిబంధనలు ఏళ్లతరబడిగా మార్పులేని కుటుంబ ఆదాయపరిమితి బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు పూర్తిస్థాయిలో చేకూరని లబ్ధి గురుకులాలు, కేజీబీవీ విద్యార్థులకు అవకాశం -
రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు
జనగామ: అన్నదాతల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ పెట్టుబడి సాయం 21వ నిధులు బుధవారం విడుదలయ్యా యి. తమిళనాడులోని కోయంబత్తూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించారు. పీఎం కిసాన్ ద్వారా ఏడాదికి మూడు విడతల్లో రూ.6వేల పెట్టుబడి సాయం రైతులకు అందుతోంది. జనగామ జిల్లాలో 1, 80వేల మంది రైతులు ఉండగా, పీఎం కిసాన్ నిబంధనల మేరకు 20వ విడత వరకు 51, 346 మంది రైతుల ఖాతాల్లో నిధులు జమయ్యాయి. మొదటి విడతలో 1,06,274 మంది రైతులకు నిధులు అందగా ఎనిమిదో విడత నుంచి రైతుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. తాజాగా 21వ విడత నగదు జమతో కొత్తగా అర్హత పొందిన వారి సంఖ్య మొత్తం పరిశీలన పూర్తయిన తర్వాత వెల్లడికానుంది. పెట్టుబడి సాయం అందింది.. ఏటా మూడు సార్లు పీఎం కిసాన్ డబ్బులు నా ఖాతాలో జమ అవుతున్నాయి. నాలుగు ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. యాసంగి, వానాకాలం సీజన్లో పంటల సాగు సమయంలో పీఎం కిసాన్ సాయం ఎంతగానో అక్కరకు వస్తోంది. – వెంకట్రాం కనకయ్య, వీఎస్ఆర్ నగర్, బచ్చన్నపేట -
నవాబుపేట అంగడి వేలం ఆదాయం రూ.72.50 లక్షలు
లింగాలఘణపురం: మండలంలోని నవాబుపేట కోదండరామస్వామి ఆలయ ప్రాంగణంలో ప్రతీ శుక్రవారం జరిగే పశువుల సంతలో రహదారుల వేలం పాట ఆదాయం రూ.72.50 లక్షలు వచ్చినట్లు ఈఓ లక్ష్మిప్రసన్న తెలిపారు. బుధవారం హైదరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన వేలం పాటలో నవాబుపేటకు చెందిన బూడిద సదానందం వేలం దక్కించున్నారని చెప్పారు. పలుమార్లు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వేలం నిర్వహించగా తగిన ఆదాయం రాకపోవడంతో చివరిగా హైదరాబాద్ కమిషనర్ కార్యాలయంలో ఇన్స్పెక్టర్ నిఖిల్ ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించామన్నారు. వేలం పాటలో రాజు, మహేందర్, నర్సింహులు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
రామలింగేశ్వరుడికి అన్నపూజ
జనగామ: పట్టణంలోని పాతబీటు బజారు శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని బుధవారం అన్నపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అంతకుముందు స్వామికి అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ రామిని రాజేశ్వర్, ఉపాధ్యక్షుడు మహంకాళి హరిశ్చంద్రగుప్తా, ప్రధాన కార్యదర్శి కోకల మల్లేశం, కోశాధికారి అయిత శ్రీనివాసులు, సభ్యులు బాలాచారి, మారం శ్రీనివాస్, నాళ్ల మధు, పెద్ది శ్రీనివాస్, దారం సోమయ్య, వంగపల్లి చంద్రశేఖర్, ఆలయ అర్చకులు శివరాజ్ శర్మ పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు జశ్వంత్ రఘునాథపల్లి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిర్వహించిన జిల్లాస్థాయి వాలీబాల్ పోటీల్లో మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల విద్యార్థి కె.జశ్వంత్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు హెచ్ఎం ఉపేందర్ తెలిపారు. ఉమ్మడి జిల్లాస్థాయి అండర్–14 విభాగంలో జశ్వంత్ ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడంపై జశ్వంత్‌ను బుధవారం పాఠశాలలో ఉపాధ్యాయులు అభినందించారు. కార్యక్రమంలో పీఈటీ కుమార్, నాగభూష ణం, సురేందర్, రాములు, రవీందర్, లావణ్య, శ్రీలత, రేణుక, అంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఆకాశ జ్యోతి దర్శనంజనగామ: కార్తీకమాసం పురస్కరించుకుని పట్టణంలోని గుండ్లగడ్డ శ్రీ ఉమామహేశ్వర దేవాలయంలో బుధవారం భక్తులు ఆకాశ జ్యోతి దర్శనం చేసుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు గంగు సాంబమూర్తిశర్మ ఆధ్వర్యంలో శివయ్యకు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు ఉమ, రమ, హైమ, రాణి, పద్మ, ప్రమీల, సరిత, విజయ, వాణి, నాగమణి, ప్రకాశ్, రమేశ్, ప్రభాకర్, రాజు, శ్రీకాంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కేయూ బీపీఈడీ కళాశాల ప్రిన్సిపాల్‌గా భాస్కర్కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఆ విభాగం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి.భాస్కర్‌ను నియమిస్తూ రిజిస్ట్రార్ రామచంద్రం బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళా శాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వహించగా.. ఆయన స్ధానంలో భాస్కర్‌ను నియమించారు. వీసీ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం ఉత్తర్వులను భాస్కర్‌కు అందజేశారు. తొర్రూరు పీఏసీఎస్ పాలకవర్గం కొనసాగింపుతొర్రూరు: తొర్రూరు పీఏసీఎస్ పాలకవర్గాన్ని తాత్కాలికంగా కొనసాగిస్తూ జిల్లా సహకార శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బుధవారం డీసీఓ వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు. రద్దు చేసిన పీఏసీఎస్ చైర్మన్, ఇతర డైరెక్టర్లు కొనసాగనున్నారు. రుణాల రికవరీలో నిర్లక్ష్యం, డైరెక్టర్లు రుణాలు తీసుకుని చెల్లించకపోవడం, ధాన్యం తరలింపు, గన్నీ సంచుల కొనుగోళ్లలో అవకతవకలు, బడ్జెట్ రూపకల్పనలో నిర్లక్ష్యం నేపథ్యంలో తొర్రూరు సొసైటీ పాలకవర్గాన్ని రద్దు చేస్తూ సెప్టెంబర్‌లో సహకార శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. -
ఆరోగ్య జనగామ లక్ష్యం
జనగామ: ఆరోగ్య జనగామగా చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నానని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం నియోజకవర్గంలోని జనగామ అర్బన్, జనగామ మండలం, నర్మెట, తరిగొప్పుల, బచ్చన్నపేట మండలాలకు చెందిన 79 మంది లబ్ధిదారులకు రూ.23 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు. ఇచ్చిన మాట ప్రకారం రెండు సంవత్సరాలుగా తన నీలిమా హాస్పిటల్లో నియోజకవర్గ ప్రజలందరికీ ఉచిత వైద్యం అందిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ గరిష్టంగా రూ.60వేలు మాత్రమే ఇస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 60శాతం డబ్బులను లబ్ధిదారులకు అందించామన్నారు. కార్యక్రమంలో ఇర్రి రమణారెడ్డి, పోకల జమున, బాల్దె సిద్ధిలింగం, మేకల కళింగరాజు, గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, ఆయా మండలాల నాయకులు ఉన్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి -
విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషి చేయాలి
జనగామ రూరల్: విద్యార్థుల సమగ్రాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని రాష్ట్ర పరిశీలకురాలు, సీట్ అడిషనల్ డైరెక్టర్ విజయలక్ష్మి అన్నారు. బుధవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి పింకేశ్‌కుమార్ ఆధ్వర్యంలో మండల విద్యాధికారుల సమావేశం నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న స్కూల్ ఆండ్ క్లిన్ స్పెషల్ క్యాంపెయిన్ 5.0పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాఠశాలలు శుభ్రంగా ఉన్నాయని, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నారని అన్నారు. విద్యాశాఖాధికారి పింకేశ్ కుమార్ మాట్లాడుతూ.. విద్యాశాఖ ప్రతి మాసం విజయోస్తు కార్యక్రమం ద్వారా అన్ని అంశాలపై సమీక్ష చేస్తున్నామన్నారు. వెల్దండ పాఠశాల సందర్శన.. నర్మెట: పాఠశాలలో తరగతి గదులను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు విద్యార్థులకు మానసికోల్లాసం కలిగించే విధంగా ఆహ్లాదకరంగా, పచ్చదనంతో ఉండాలని రాష్ట్ర పరిశీలకురాలు, సీట్ అడిషనల్ డైరెక్టర్ విజయలక్ష్మి సూచించారు. మండలంలోని వెల్దండ పాఠశాలను సందర్శించిన ఆమె ఎంఈఓ మడిపల్లి ఐలయ్యతో పాటు ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సీఎంఓ నాగరాజు, ఉపాధ్యాయులు అంజిరెడ్డి, శామ్యూల్ ఆనంద్, తిరుమల్‌రెడ్డి, రమేష్, కృష్ణమూర్తి, బాలసిద్దులు, మాధవి, కల్పన పాల్గొన్నారు. రాష్ట్ర పరిశీలకురాలు, సీట్ అడిషనల్ డైరెక్టర్ విజయలక్ష్మి -
చీరల పంపిణీకి ఇన్చార్జులు
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జనగామ రూరల్: జిల్లాలో ఉన్న 11,237 స్వయం సహాయక సంఘాలలో 1,36,747 మంది సభ్యులు ఉన్నారని 1,15,143 మందికి ఇప్పటివరకు ఇందిరమ్మ చీరలు వచ్చాయని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ప్రతీ గ్రామంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను, ఇన్‌చార్జ్‌లను చార్జిలను పెట్టాలన్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంపై బుధవారం సచివాలయం నుంచి కలెక్టర్లు, మహిళా సమాఖ్య సభ్యులతో సీఎం రేవంత్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీసీలో అదనపు కలెక్టర్లు పింకేశ్ కుమార్, బెన్ షాలోమ్ పాల్గొన్నారు. వృద్ధులతో స్నేహపూర్వకంగా ఉండాలి.. వృద్ధులతో స్నేహపూర్వకంగా ఉండి ప్రేమను పంచాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా పిలుపునిచ్చారు. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 1న అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని శామీర్ పేటలోని రుద్రమదేవి ఓల్డ్ హోమ్ సేవ సొసైటీలో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కె.కోదండరాములు, డీఆర్డీఏ జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్ సతీష్, కన్న పర్శరాములు,హేమలత, క్యాథరిన్, వెంకట మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్‌కు హెచ్ఎంల సంఘం సత్కారం జనగామ: జల సంరక్షణలో జిల్లా జాతీయ స్థాయి సౌత్జోన్లో ద్వితీయ స్థానంలో నిలిచి కేంద్ర మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్న సందర్భంగా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాను హెచ్ఎంల సంఘం సత్కరించింది. ప్రధానోపాధ్యాయుల రాష్ట్ర కార్యదర్శి బుర్ర రమేశ్, హెచ్ఎంల బృందం లక్ష్మణ్‌గౌడ్, బీమా నాయక్, కిరణ్ కుమార్, అంజయ్య, ఈర్యా, కొండ శ్రీనివాస్ ఉన్నారు. -
విద్యారంగంలో రోల్‌మోడల్ తెలంగాణ
● స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్‌ఘన్‌పూర్: సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యమిస్తోందని, విద్యారంగంలో తెలంగాణ దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తోందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఘన్పూర్ మండలంలోని నమిలిగొండ శివారు మోడల్‌స్కూల్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి సీసీ రోడ్డు నిర్మాణ పనులకు బుధవారం ఎంపీ కడియం కావ్యతో కలిసి ఎమ్మెల్యే కడియం శంకుస్థాపన చేశారు. అనంతరం కేజీబీవీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.. నియోజకవర్గంలోని ఏడు కస్తూర్బా పాఠశాలలకు వసతుల కల్పనకు రూ.6 కోట్లు మంజూరయ్యాయని, ఘన్పూర్ కస్తూర్బా, మోడల్ స్కూల్‌కు రూ.28 లక్షలతో సీసీ రోడ్డు పనులు చేపడుతున్నట్లు తెలిపారు. సమాజంలో మహిళలు అభివృద్ధి చెందినప్పుడే దేశ ప్రగతి సాధ్యమని ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. జిల్లా జీసీడీఓ ఎండీ గౌసియాబేగం, ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్‌రెడ్డి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, మోడల్‌స్కూల్ ప్రిన్సిపాల్ వేణుగోపాల్‌రెడ్డి, కేజీబీవీ ఎస్ఓ రజిత, హెచ్ఎం సంపత్ పాల్గొన్నారు. జఫర్‌గఢ్‌లో.. జఫర్‌గఢ్: మండల కేంద్రంలోని కస్తూర్బా, మోడల్ స్కూల్ సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కడి యం శ్రీహరి ఎంపీ కావ్యతో కలసి శంకుస్థాపన చేశారు. కస్తూర్బాలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రిన్సిపాల్ సీహెచ్ స్వప్న అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథులుగా హాజరైన ఎమ్మెల్యే కడియం మాట్లాడుతూ.. కోనాయిచలంలో రూ.200కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లావణ్యశిరీష్‌రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ కర్ణాకర్‌రావు, వైస్ చైర్మన్ ఐలయ్య, తహసీల్దార్ రాజేష్‌రెడ్డి, ఎంపీడీఓ సుమన్ పాల్గొన్నారు. -
‘జల్ సంచాయ్..’లో జిల్లా ద్వితీయ స్థానం
జనగామ రూరల్: జిల్లాలో జల సంరక్షణ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసినందుకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జల్ సంచాయ్ జన్ భాగీధారీ కార్యక్రమంలో సౌత్ జోన్లో జిల్లా ద్వితీయ స్థానం సాధించింది. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుతో పాటు రూ.కోటి నగదు ప్రోత్సాహాన్ని కేంద్రం ప్రకటించింది. ఈ సందర్భంగా కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ సెప్టెంబర్ 26న సంబంధిత ఉత్తర్వులను జారీ చేసింది. కాగా మంగళవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌న్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖమంత్రి సీఆర్ పాటిల్ చేతుల మీదుగా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అవార్డు అందుకున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో జల్ సంచాయి జన భాగీధారి 2.0 కింద కలెక్టర్ రిజ్వాన్ బాషా జిల్లాలో ‘మన జిల్లా.. మన నీరు’ అనే నినాదంతో కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో తక్కువ ఖర్చుతో వర్షపు నీటి ఇంకుడు గుంత నిర్మాణాన్ని ప్రారంభించి జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులకు తగు సూచనలు చేస్తూ జిల్లాలోని ప్రతీ గ్రామ మండల, జిల్లా, స్థాయి అధికారులకు టార్గెట్ ఇచ్చారు. తక్కువ ఖర్చుతో వర్షపు నీటి సంరక్షణ గుంతలు ఇప్పటి వరకు 7,350 నిర్మాణం పూర్తి కాగా వచ్చే సంవత్సరం మార్చి 31 వరకు సుమారు 50,000 వర్షపు నీటి సంరక్షణ గుంతలు నిర్మిచాలని కలెక్టర్ జిల్లాలోని అధికారులకు, సామాజిక సంస్థలకు, ప్రజలకు తెలిపారు. జిల్లాకు లభించిన ఈ జాతీయ స్థాయి గుర్తింపుపై అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైభవంగా శ్రీసోమేశ్వర స్వామి మాస కల్యాణం పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మాస శివరాత్రి సందర్శంగా చండిక అమ్మవారి ఆలయంలో మంగళవారం చండికాసమేత శ్రీసోమేశ్వర స్వామివారి మాస కళ్యాణం మేళతాళాలు, అర్చకుల వేద మంత్రోచ్ఛరణల మధ్య వైభవోపేతంగా జరిగింది. భక్తులు ఈ కల్యాణోత్సవంలో పాల్గొని కనులారా తిలకించి తరలించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న, ఆలయ సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, ఆలయ ప్రధాన అర్చకుడు దేవగిరి లక్ష్మన్న, డీవీఆర్ శర్మ,దేవగిరి అనిల్‌కుమార్, మత్తగజం నాగరాజు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. శివపార్వతుల కల్యాణం .. జనగామ: కార్తీకమాసం పర్వదినం పురస్కరించుకుని జనగామ పట్టణంలోని గుండ్లగడ్డ శ్రీ ఉమామహేశ్వర దేవాలయంలో మంగళవారం శివపార్వతుల కల్యాణం, లక్షవత్తుల జ్యోతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆగమశాస్త్రం ప్రకారం అర్చకులు గంగు సాంబమూర్తి, వేదపండితుల వేదఘోషతో ప్రారంభమైన పుణ్యాహవాచనం, స్వస్తి వాచ నం, మహాగణపతి పూజ అనంతరం కంకణధారణ, ప్రత్యేక మంగళ స్నానాలు నిర్వహించారు. కార్యక్రమంలో రామిని శ్రీనివాస్, అనురాధ, రమా, ఉమా తదితరులు పాల్గొన్నారు. నశాముక్త్ భారత్ అభియాన్ పోస్టర్ ఆవిష్కరణ జనగామ రూరల్: మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నశాముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవం పురస్కరించుకుని కలెక్టరేట్లో మంగళవారం అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, బెన్షాలోమ్ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆఫీసు సిబ్బందితో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేసి అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో ప్రతిఒక్కరూ క్రియాశీల భాగస్వామి కావాలని డ్రగ్స్ రహిత జీవన శైలికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కె. కోదండరాములు తదితరులు పాల్గొన్నారు. -
బుధవారం శ్రీ 19 శ్రీ నవంబర్ శ్రీ 2025
జనగామ వాగుల్లో ఇసుక దోపిడీజనగామ రూరల్: మండలంలోని యశ్వంతాపూర్, చీటకోడూరు వాగులు ఇటీవల కురిసిన వర్షాలతో ఇసుకతో నిండుకుండలా కనిపిస్తున్నాయి. వడ్లకొండ, గానుగుపహాడ్, ఎర్రగొల్లపహాడ్ తదితన ప్రాంతాల సరిహద్దుల్లో ఇసుక డంప్ చేస్తూ, ప్రైవేటుగా విక్రయాలు చేస్తున్నారు. యశ్వంతపూర్ వాగు నుంచి ఇందిరమ్మ ఇళ్లకు అనుమతి ఇవ్వగా, ఒక్క చీటికి నాలుగు ఇసుక ట్రాక్టర్లను అక్రమంగా అమ్ముకుంటున్నారు. మైనింగ్, రెవెన్యూ అధికారులు పట్టించుకుని భూగర్భ జలాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.తనిఖీలు చేస్తున్నా.. ఆగని దందా -
వేతన వెతలు
ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న కాంటిజెన్సీ వర్కర్లకు పెండింగ్‌లో ఉన్న 9 నెలల వేతనాన్ని వెంటనే అందించాలి. నెలల తరబడి జీతాలు రాక అప్పులు చేయాల్సి వస్తోంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి. – కొలనుపాక హరిప్రసాద్, కాంటిజెన్సీ కార్మికుల రాష్ట్ర అధ్యక్షుడు, స్టేషన్‌ఘన్‌పూర్ స్టేషన్‌ఘన్‌పూర్: ప్రభుత్వ ఆసుపత్రులలో కాంటిజెన్సీ వర్కర్లుగా పనిచేస్తున్న కార్మికులకు తొమ్మిది నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. అరకొర వేతనాలతో ఏళ్ల తరబడిగా పనిచేస్తున్న కార్మికులు జీతాలు సకాలంలో అందక కుటుంబ పోషణ కోసం అప్పులు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులలో దాదాపు 600 మందికి పైగా, జనగామ జిల్లాలో 30 మంది వరకు కాంటిజెన్సీ వర్కర్లు పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో పరిసరాలు, వాష్‌రూమ్‌లు శుభ్రం చేయడం, వార్డులలో బెడ్ షీట్లను మార్చడం, వార్డులను క్లీనింగ్ చేయడం తదితర పనులను కాంటిజెన్సీ వర్కర్లు చేస్తుంటారు. ఆసుపత్రులకు ప్రధానమైన పరిశుభ్రత పనిని చేసే కాంటిజెన్సీ వర్కర్లు వేతనాల కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. ఉదయం వైద్య సిబ్బంది కన్నా ముందు ఆసుపత్రికి వచ్చి సాయంత్రం వరకు పనిచేసే కార్మికుల వెతలు పాలకులకు పట్టడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రులలో పేషెంట్లు ఉండే వార్డులతో పాటు వైద్యుల ఉండే గదులను ప్రతీరోజూ ఎప్పటికప్పుడు శుభ్రం చేసే కాంటిజెన్సీ వర్కర్లపై ప్రభుత్వం కరుణ చూపడం లేదు. సమ్మె చేసినా.. కాంటిజెన్సీ వర్కర్లకు నెలకు కేవలం రూ.5,200 వేతనమే అందిస్తారు. ఈ వేతనాన్ని కూడా తొమ్మిది నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడం విచారకరమని వర్కర్లు వాపోతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో పరిశుభ్రతలో కీలకంగా పనిచేసే కార్మికుల వేతనాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం శోచనీయమంటున్నారు. గతంలో వేతనాలు అందించాలని, తమను రెగ్యులరైజ్ చేయాలని కార్మికులు సమ్మె చేసినా పాలకులు స్పందించడం లేదు. సమ్మె సమయంలో హైదరాబాద్‌లోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో కార్మిక సంఘం నాయకులు వినతిపత్రాలు అందించారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కాంటిజెన్సీ వర్కర్లకు పెండింగ్ వేతనాలు ఇవ్వడంతో పాటు రెగ్యులరైజ్ చేయాలని కార్మికులు కోరుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంటిజెన్సీ వర్కర్ల ఇబ్బందులు 9 నెలలుగా వేతనాలు రాకపోవడంతో అప్పులు సకాలంలో వేతనాలు ఇవ్వడంతో పాటు రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ ఏళ్లతరబడి ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న కాంటిజెన్సీ వర్కర్లను రెగ్యులరైజ్ చేయాలి. ఆసుపత్రుల పరిశుభ్రత కోసం అహర్నిశలు పనిచేసే కార్మికులకు అందించే అరకొర వేతనాలు నెలల తరబడి అందించకపోవడం బాధాకరం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలి. – కె.అంజయ్య, సంఘం జిల్లా అధ్యక్షుడు, బచ్చన్నపేట -
రేవంత్ మాటలు ఘనం.. చేతలు శూన్యం
వరంగల్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఆయన చెప్పే మాటలు ఘనంగా ఉంటున్నాయని, చేతలు మాత్రం శూన్యమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించారు. మక్కలు, పత్తి యార్డుల్లోని రైతులతో మాట్లాడారు. వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశంలో రైతుల పక్షపాతి ఒక్క కేసీఆర్ మాత్రమే అని, ఆయన మొట్టమొదటిసారిగా రైతుబంధు తెచ్చి రైతులను ఆదుకున్నారని అన్నారు. రాష్ట్రంలో పత్తి రైతులు తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారన్నారు. సీసీఐ అడ్డమైన ఆంక్షలు పెట్టి ఆగమాగం చేస్తున్నా రేవంత్‌రెడ్డి లేఖలు రాస్తూ పట్టించుకోవడం లేదన్నారు. పంటలకు బోనస్ ఇస్తామని అనడమే కానీ, ఇచ్చింది లేదన్నారు. ఎల్1, ఎల్2, కపాస్ యాప్, తేమశాతం లాంటి తుగ్లక్ నిర్ణయాలతో రైతులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవడానికి విచ్చలవిడిగా డబ్బులు పంచిన రేవంత్‌రెడ్డి పత్తి రైతులకు కనీస మద్దతు ధర అందించలేకపోతున్నారని ఆరోపించారు. మక్క రైతులతో మాటామంతి.. అంతకుముందు అపరాల యార్డుకు వెళ్లిన హరీశ్‌రావు మక్కలను పరిశీలించారు. అమ్మడానికి వచ్చిన ములుగు జిల్లాకు చెందిన రైతులు వెంకటేశ్వర్లు, లక్ష్మయ్యతో ముచ్చటించారు. మక్కలను ఎంతకు అమ్మారు అని ప్రశ్నించగా రూ.1,825లకు అని సమాధానం చెప్పారు. మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,400లు ఉంది కదా అని అంటే.. వారు ట్రేడర్‌కు అమ్మామని, ఆయన వెంటనే డబ్బులు ఇవ్వడమే కాకుండా పంట వేసేందుకు ముందుగా పెట్టుబడి పెడుతున్నందున విక్రయించామని చెప్పారు. కేంద్రాల్లో కొనుగోలు చేసిన మక్కలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్ల మార్క్‌ఫెడ్ రైతులకు డబ్బులు చెల్లించలేక పోతోందని హరీశ్‌రావు అన్నారు. అందువల్ల క్వింటాల్‌కు రైతులు రూ.575లు నష్టపోతున్నా ట్రేడర్లకే అమ్ముకుంటున్నారని వాపోయారు. కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ టి.రవీందర్రావు, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యేలు దా స్యం వినయ్‌భాస్కర్, తాటికొండ రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ఒడితల సతీష్‌కుమార్, నన్నపునేని నరేందర్, సరోగసి కమిటీ మాజీ సభ్యురాలు డాక్టర్ హరి రమాదేవి, ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కా కులమర్రి లక్ష్మణ్‌బాబు, నాయకులు పాల్గొన్నారు. కేసముద్రం వ్యవసాయ మార్కెట్ సందర్శన కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌ను తన్నీరు హరీశ్‌రావు సందర్శించి, రైతులతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక, బోనస్ రాక, మరోవైపు యూరియా, రైతుబంధు,రైతు బీమా అందకపోవడంతో గోసపడుతున్న రైతులంతా రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం రేవంత్‌రెడ్డిపై శాపనార్దాలు పెడుతున్నారని విమర్శించారు. కేసముద్రం మార్కెట్లో కనీస సౌకర్యాలు లేవని, పందులు, మేకలు తిరుగుతుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. లేఖలు రాసి చేతులు దులుపుకుంటున్న సీఎం కాంగ్రెస్ పాలనలో కరెంటు నుంచి కాంటా దాకా సమస్యలే మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు వరంగల్ ఏనుమాముల మార్కెట్ సందర్శన.. రైతులతో ముచ్చటించి సమస్యలు తెలుసుకున్న మాజీ మంత్రి -
దందా ఆగేదెలా?
ఆకేరు వాగుజఫర్గడ్: ఆకేరు వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఈ విషయంలో అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. కూనూరు, తిడుగు, ఉప్పుగల్లు గ్రామాల మీదుగా ఉన్న ఆకేరు వాగును గుల్లచేస్తున్నారు. ఇక్కడ నుంచి హన్మకొండ, కాజీపేట, మడికొండ పట్టణ ప్రాంతాలతో పాటు ఆయా గ్రామాలకు ఇసుకను తరలించి రూ.5వేల నుంచి రూ.7వేలు వసూలు చేస్తున్నారు. జనగామ: జిల్లాలో వాల్టా, మైనింగ్, ఇరిగేషన్ చట్టాలు కళ్లముందే ఉల్లంఘిస్తున్నా, ఇసుక అక్రమ తవ్వకాలపై చర్యలు ఎక్కడా కనిపించడం లేదు. ఇసుక అక్రమ రవాణా గత కొద్దికాలంగా పది రెట్లు పెరిగింది. ఇందిరమ్మ ఇళ్ల కోసం తక్కువ ధరకే ఇసుక అందించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని మాఫి యా స్వర్గధామంగా మార్చుకుంది. కొంతమంది చీకటి ఒప్పందాలతో పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఇసుక దోపిడీ కొనసాగుతోంది. కొన్ని గ్రామాల్లో బలమైన నాయకుల ఆశీస్సులతో సిండికేట్‌గా ఇసుక వ్యాపారానికి తెరలేపినట్లు ప్రచారం ఉంది. సామాజిక కార్యకర్తలు, ప్రజలు అడ్డుకుంటున్నా ఇసుక అక్రమ వ్యాపారాన్ని సంబంధిత అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇసుక తరలింపునకు నెలనెలా మాముళ్లు ఎవరికనే అంశం జిల్లాలో పెద్ద చర్చకు దారితీస్తోంది. బచ్చన్నపేట, జనగామ–యశ్వంతాపూర్, రఘునాథపల్లి, దేవరుప్పుల, స్టేషన్‌ఘన్‌పూర్ వాగుల పరిధిలో గుంతలు బావులను తలపించే విధంగా మారిపోయాయి. ఇందిరమ్మ ఇళ్ల పేరిట..దేవరుప్పుల: ఇందిరమ్మ ఇళ్లకు ఉచితం పేరిట కలెక్టర్ స్థానిక అవసరాలకు తహసీల్దార్లకు ఇచ్చిన ఇసుక అనుమతులు మాఫియాకు ఊతం ఇచ్చినట్టవుతుంది. దాదాసాహెబ్కాలనీ నుంచి పాలకుర్తి, కొడకండ్ల మండలాల్లోని ఇళ్ల నిర్మాణం కోసం ఇసుక అనుమతులు తీసుకుని, ఇతర ప్రాంతాల్లో డంప్‌లు చేసి వ్యాపారం సాగిస్తున్నారు. ట్రాక్టర్‌కు రూ.4వేల నుంచి రూ.5వేల వరకూ అమ్ముకుంటున్నారు. అంతా ప్రైవేటుకే లింగాలఘణపురం: ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు అధిక ధరకు ఇసుక విక్రయించి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇందిరమ్మ ఇండ్ల అనుమతి ఉన్న వారికి ట్రాక్టర్‌కు రూ.3,500 ట్రిప్పు ఇస్తుండగా, ఇదే అ నుమతితో అక్రమంగా ఇసుక తరలించి రూ.5వేలకు విక్రయిస్తున్నారు. జోరుగా రవాణా పాలకుర్తిటౌన్: మండలానికి అవసరమైన ఇసుకను ముత్తారం, దేవరుప్పుల, జఫర్గడ్ కూనూరు, కోణాచలం, తిడుగు, వర్ధన్నపేట మండలం ఇల్లందు నుంచి అక్రమంగా పాలకుర్తి మండలానికి తరలిస్తున్నారు. ట్రాక్టర్‌కు రూ.5,000నుంచి రూ.8వేల వరకు విక్రయిస్తున్నారు. మోతమోగుతున్న చప్పుళ్లు స్టేషన్‌ఘన్‌పూర్: తాటికొండ గ్రామంలో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఇసుక ట్రాక్టర్ల మోతతో ఊరి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. తాటికొండ, కొత్తపల్లిలోని వాగుల నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు.బచ్చన్నపేట: పోచన్నపేట వాగు నుంచి ఇసుక తరలింపు ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇసుక దోపిడీ అధికారుల మౌనం.. మాఫియాకు వరం..? అదుపుతప్పిన చీకటి వ్యాపారం నెలనెలా మాముళ్లు.. వాల్టాచట్టానికి తూట్లు ఒక్కో ట్రాక్టర్ రూ.4వేల నుంచి రూ.8వేల వరకు వసూలురాత్రికి రాత్రే బచ్చన్నపేట: మండలంలోని పోచన్నపేట, నక్కవానిగూడెం, కాశీనగర్ ఏరియా లోని వాగుల నుంచి ఇసుకను రాత్రికి రాత్రే సరిహద్దులను దాటించేస్తున్నారు. తరలించిన ఇసుకను రహస్య ప్రాంతాల్లో డంప్ చేసి, బయటికి గ్రామాలకు విక్రయిస్తున్నారు. ఒక్క కూపన్ చూపించి నాలుగు ట్రాక్టర్ల ఇసుకను అమ్ముకుంటున్నారు. -
కాసులు కురిపిస్తున్న ఇసుక
రఘునాథపల్లి మండలంలో ఇసుకాసురుల తవ్వకాలతో వాగు పరిస్థితిరఘునాథపల్లి: ఇందరమ్మ ఇళ్ల పథకం పేరిట ఇసుక దందా కొంతమంది నాయకులు, ట్రాక్టర్ యజమానులకు కాసులు కురిపిస్తున్నాయి. లబ్ధిదారుల కూపన్లతో ఒకటికి నాలుగు ట్రిప్పుల ఇసుక మాయం చేస్తున్నారు. ఇబ్రహీంపూర్, ఫతేషాపూర్, లక్ష్మీతండా, మాదారం, సోమయ్యకుంట తండా, రఘునాథపల్లి, దాసన్నగూడెం, ఖిలాషాపూర్, కంచనపల్లి, మేకలగట్టు గ్రామాల్లో ఒక్కో ట్రాక్టర్ రూ.4,500 నుంచి రూ.5వేల వరకు ప్రైవేటుగా విక్రయిస్తున్నారు. -
కాంట్రాక్టర్లకు చేపల పెంపకం అప్పగించొద్దు
● స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రఘునాథపల్లి: చెరువులు, రిజర్వాయర్లలో చేపలు పట్టి విక్రయించే బాధ్యతలు కాంట్రాక్టర్లకు అప్పగించి నష్ఠపోవద్దని ఎమ్మెల్యే కడియం శ్రీహరి సూచించారు. మంగళవారం మండలంలోని అశ్వరావుపల్లి రిజర్వాయర్‌లో ఆయన చేపపిల్లలను వదిలారు. ఈ సందర్బంగా జిల్లా మత్య్స పారిశ్రామిక సొసైటీ జిల్లా అధ్యక్షుడు నీల రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. చేపల పెంపకం, విక్రయ బాధ్యతలు కాంట్రాక్టర్లకు అప్పగించడం వల్ల మత్య్సకారులు ఆర్దికంగా నష్టపోతారన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, ఆర్డీఓ గోపిరాం, డీఎఫ్ఓ రాణాప్రతాప్ పాల్గొన్నారు. పెద్ద సైజు చేపపిల్లలు వేయాలి లింగాలఘణపురం: రిజర్వాయర్లలో పెద్ద సైజు చేపపిల్లలు వేయాలని, అప్పుడే మత్స్యకారులకు ప్రయోజనం కలుగుతుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని నవాబుపేట రిజర్వాయర్‌లో చేప పిల్లలను విడుదల వేశారు. శ్రీరామనవమి వరకు పనులు పూర్తిచేయాలి రాబోయే శ్రీరామనవమి వరకు నవాబుపేట కోదండరామస్వామి ఆలయంలో కల్యాణ మండపం, సీసీ పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే కడియం సూచించారు. డీపీఓ నవీన్, డీఎఫ్ఓ రాణాప్రతాప్, ఆర్డీఓ గోపిరామ్, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీఓ శివశంకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
మహిళా గ్రూపుల పనితీరుపై పరిశీలన
లింగాలఘణపురం: మండల కేంద్రంలోని శుభాంజలి మండల సమాఖ్య, సరస్వతి గ్రామైక్య సంఘాల్లోని గ్రూపు సభ్యుల పనితీరుపై మంగళవారం ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్లు తేజశ్వని, వెంకటరమణ పరిశీలించారు. సరస్వతి గ్రామైక్య సంఘం సమావేశానికి హాజరై సంఘంలోని సభ్యులు తీసుకున్న రుణాలు, వాటితో ఉపాధి పొందుతున్న విధానం, తిరిగి రుణాలు చెల్లిస్తున్న తీరు, భవిష్యత్తులో మరింత ఉన్నతంగా అభివృద్ధి సాధించేందుకు తీసుకుంటున్న చర్యలపై సంఘ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. వీరితో పాటు అదనపు డీఆర్డీఓ నూరుద్ధీన్, మండల సమాఖ్య అధ్యక్షురాలు కాటం రవ్య, ఉమ, పద్మ, రేణుక తదితరులు ఉన్నారు. -
నేటినుంచి సీసీఐ కొనుగోళ్లు ప్రారంభం
● పత్తి మిల్లర్ల చర్చలు సఫలం ● ఊపిరిపీల్చుకుంటున్న రైతులుజనగామ: రాష్ట్రవ్యాప్తంగా పత్తి మిల్లులు, అనుబంధంగా ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రాలు ఈనెల 19న(బుధవారం) తెరుచుకోనున్నాయి. ఎల్–1, ఎల్2, ఎల్3 కేటగిరీల వారీగా సీసీఐ సెంటర్ల ప్రారంభం, ఎకరాకు 12క్వింటాళ్ల నుంచి 7 క్వింటాళ్లకు కుదింపు, జిల్లా పరిధి నిబంధన తదితర సమస్యలపై నిరసిస్తూ తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈనెల 17 నుంచి పత్తి మిల్లులు బంద్ పాటిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సీసీఐ సీఎండీతో జరిపిన చర్చలు సఫలం కావడం, కాటన్ అసోసియేషన్ ప్రతినిధులను ఒప్పించి బంద్‌ను విరమింపజేశారు. జిల్లాలో 15 పత్తి మిల్లులు ఉండగా, ఇందులో 14 చోట్ల సీసీఐ సెంటర్లను ప్రారంభించిన అధికారులు, మ రో చోట పెండింగ్ ఉంచారు. ఇప్పటివరకు 3,427 మంది రైతుల వద్ద 48.750 క్వింటాళ్ల తెల్ల బంగారం కొనుగోలు చేయగా, ఇందుకు సంబంధించి రూ.28.08 కోట్లకు గాను రూ.25కోట్ల మేర వారి ఖాతాలో జమ చేశారు. రైతులు తమ పత్తిని బుధవారం నుంచి సీసీఐ కేంద్రాలకు తీసుకొచ్చి మద్దతు ధరకు అమ్ముకోవచ్చని జిల్లా కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రామ్మోహన్ తెలిపారు. పత్తి మిల్లర్లు సమ్మె విరమించుకోవడంతో రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. సమ్మె విరమించారు నేటి నుంచి యథావిధిగా సీసీఐ సెంటర్లలో మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం సీసీఐ సీఎండీతో చర్చలు జరిపి, జిన్నింగ్ మిల్లర్ల సమ్మెను విరమింపజేశారు. -
అధిక సాంద్రత పత్తి సాగు లాభదాయకం
రఘునాథపల్లి: అధిక సాంద్రత పత్తి సాగు లాభదాయకమని రాష్ట్ర రైతు విజ్ఞాన కేంద్ర ప్రధాన శాస్త్రవేత్త, సమన్వయ కర్త డాక్టర్ శ్రీలత అన్నారు. సోమవారం మండలంలోని కన్నాయపల్లిలో యాదాద్రి భువనగిరి తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, రైతు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో అధిక సాంద్రత పత్తి సాగు విధానంపై శేరి సోమిరెడ్డి పత్తి చేనులో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీలత మాట్లాడుతూ ఎకరాకు 9 నుంచి 13 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని, కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఎకరాకు రూ.5 వేలు రైతుల ఖాతాలో జమ చేస్తుందన్నారు. అనంతరం గ్రామంలోని 50 మంది రైతులకు షెడ్యూల్ కులాల ఉప ప్రణాళికలో భాగంగా ఉచితంగా డీహెచ్ఎం 117 రకం మొక్కజొన్న విత్తనాలు పంపణీ చేశారు. కార్యక్రమంలో ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి. మల్లయ్య, సుశీల, ఏఓ కాకి శ్రీనివాస్‌రెడ్డి, ఆర్ఈసీ సభ్యుడు మంతపురి యాదగిరి, ఏఈఓ కల్పన, వేణు, రూప, రాజేష్, బానుచందర్, రెతులు పాల్గొన్నారు. -
చాళుక్యుల దీపస్తంభానికి దీపారాధన
రఘునాథపల్లి: మండలంలోని నిడిగొండ శివాలయం సమీపంలోని కల్యాణి చాళుక్యుల కాలం నాటి జైనమాన దీప స్తంభానికి కార్తీక మాసం సందర్భంగా సోమవారం రాత్రి గ్రామస్తులు దీపారాధన చేశారు. యువకులు, మహిళలు, చిన్నారులు, భక్తులు కలిసి ఎత్తైన స్తంభానికి దీపారాధన చేయడంతో నాటి వైభవం విరాజిల్లింది. పాఠశాల ఆకస్మిక తనిఖీస్టేషన్ఘన్పూర్: మండలంలోని రాఘవాపూర్ ప్రభుత్వ పాథమికోన్నత పాఠశాలను స్పెషల్ క్యాంపెయిన్ 5.0 రాష్ట్ర పరిశీలకులు, ఎన్ఈఆర్టీ డైరెక్టర్ విజయలక్ష్మి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్పెషల్ క్యాంపెయిన్ 5.0లో భాగంగా పాఠశాల ఆవరణ, తరగతి గదులు, వంటగది, మూత్రశాలలు, పరిశుభ్రత, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. ప్రభుత్వం, విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా చేపడతుఉన్న స్పెషల్ క్యాంపెయిన్ కార్యక్రమాలను సజావుగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీఎంఓ నాగరాజు, ఎంఈఓ కొమురయ్య, హెచ్ఎం అనిల్, ఎమ్మార్సీ సిబ్బంది గిరి, లవన్, రమేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి
జనగామ: యువత, నిరుద్యోగులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఆడిట్ అధికారి రెహమాన్ అన్నారు. సోమవారం 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా జిల్లా గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలుగా ఉపయోగపడుతున్నాయన్నారు. ఇక్కడ పెంపొందించుకున్న జ్ఞానం భవిష్యత్‌లో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు రాంబాబు, నాయకులు లింగాల జగదీష్, చందర్‌రెడ్డి, తోటకూరి రమేష్, బంద కుమార్, సంస్థ కార్యదర్శి సుధీర్, పుల్లయ్య, కళా నిలయం వ్యవస్థాపకుడు రాజేంద్ర ప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్: నూతనంగా ఏర్పడిన ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య సమస్యపై ప్రత్యేక చొరవతో పనిచేస్తున్నామని, అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ఘన్పూర్ ఎస్సీ కాలనీ 16వ వార్డులో సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న డ్రెయినేజీ సమస్యను పరిష్కరించారని కాలనీవాసులు కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.కమిషనర్ స్పందిస్తూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదేశాల మేరకు కలెక్టర్ రిజ్వాన్‌బాషా, అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్ సూచనలతో పనిచేయడం జరిగిందన్నారు. అభివృద్దికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు మోటం శ్రీనివాస్, పొదల రవి తదితరులు పాల్గొన్నారు. జనగామ రూరల్: వృద్ధులతో ప్రతిఒక్కరూ ఆప్యాయంగా, ప్రేమగా ఉండాలని ఇన్చార్జ్ జిల్లా సంక్షేమాధికారి కోదండ రాములు అన్నారు. సోమవారం మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వయోవృద్ధుల వారోత్సవాల సందర్భంగా పట్టణంలోని ర్రుమదేవి వృద్ధ ఆశ్రమంలో చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు క్యాథరిన్, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సిద్ది మల్లయ్య, మల్లారెడ్డి, రామస్వామి, రాజయ్య, భిక్షపతి, రామచంద్రం సీడీపీఓ సత్యవతి, స్వాతి, రాజు, తదితరులు పాల్గొన్నారు. జనగామ: భాగ్యనగర్ టీఎన్జీఓ గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీలో ఉద్యోగులకు స్థలాలను కేటాయించాలని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు ఖాజా షరీఫ్ కోరారు. సోమవారం హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన నిరసన దీక్షలకు జిల్లా నుంచి టీఎన్జీఓ నాయకులు, సభ్యులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. అనంతనం ఖాజా మా ట్లాడుతూ హౌసింగ్ సొసైటీ కేటాయించిన 140 ఎకరాల విస్తీర్ణంలో నాలుగు నెలలక్రితం 20 ఎకరాలు కబ్జా చేసినట్లు తెలిపారు. ఈ విషయమై తామంతా 125 రోజులుగా నిరసన చేస్తున్నామన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 48 రోజుల పాటు సకల జనుల సమ్మెతో ఉద్యోగులు ముఖ్యభూమిక పోషించారన్నారు. స్థలాన్ని కబ్జా చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట జిల్లాకు చెందిన పలువురు నాయకులు ఉన్నారు. -
పెన్షన్లు.. భూ సమస్యలు
● జనగామ పట్టణం స్వర్ణ కళామందిర్ పక్కన గల తన స్థలాన్ని కొందరు కూరగాయల వ్యాపారులు దౌర్జన్యంగా ఆక్రమించి వ్యాపారం నిర్వహిస్తున్నారని శ్రీహరి అనే వ్యక్తి విన్నవించారు. ● రాజీవ్‌నగర్ కాలనీలో నివాసం ఉంటున్న మోతే సంధ్య అద్దె ఇంట్లో ఇబ్బందులు పడుతున్నామని ఇందిరమ్మ ఇల్లు ఇప్పించి ఆదుకోవలని దరఖాస్తు చేసుకుంది. ● ఇందిరమ్మ ఇల్లు తన భార్య రాజేశ్వరీ పేరు మీద మార్చాలని జఫర్‌గఢ్ మండలం రేగడి తండాకు చెందిన భూక్య రవి వేడుకున్నారు. ● వితంతు పింఛన్ ఇచ్చి ఆదుకోవాలని చీటకోడూరుకు చెందిన తుక్కపల్లి ఎల్లమ్మ విన్నవించింది.ఈ ఫొటోలోని దివ్యాంగుడు చాగల్లు గ్రామానికి చెందిన తాటికాయల కుమార్. పుట్టుకతోనే కుడి చేయి పడిపోయింది. ఎలాంటి పనులు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఐదేళ్ల క్రితం సదరం సర్టిఫికెట్ వచ్చింది. దివ్యాంగ పెన్షన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసినా.. రావడం లేదని, పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని గ్రీవెన్స్‌లో విన్నవించారు. ●జనగామ రూరల్: సదరం సర్టిఫికెట్ ఉన్నా.. దివ్యాంగ పింఛన్ రావడం లేదని, సాగు భూమి ఒక గ్రామానికి బదులు మరొక గ్రామంలో ఉందని, కళాకారుల పింఛన్ ఇచ్చి ఆదుకోవాలని, ధాన్యం కొనుగోలు చేయడం లేదని.. ఇలా పలు సమస్యలతో సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో వినతులు సమర్పించారు. అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, బెన్షాలోమ్లు అర్జీలను స్వీకరించి ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. పెండింగ్ దరఖాస్తులు లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, ఆర్డీఓ గోపిరామ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్ గ్రీవెన్స్‌లో 39 అర్జీలు -
ముగిసిన జీడికల్ జాతర
లింగాలఘణపురం: మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి ఆలయంలో ఈనెల 4న మొదలైన జాతర సోమవారంతో ముగిసింది. చివరిరోజు వేదపండితులు ఆలయంలో అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. 108 కలశాలతో మహాసంప్రోక్షణ చేశారు. అనంతరం పండితోపన్యాసం, మహాదాశీర్వచనంతో ఉత్సవం పరిసమాప్తి జరిగింది. కార్యక్రమంలో వేదపండితులు గట్టు శ్రీనివాసాచార్యులు, విజయసారథి, భార్గవాచార్యులు, రాఘవాచార్యులు, మురళీధరాచార్యులు, బుచ్చయ్యశర్మ, దేవస్థాన చైర్మన్ మూర్తి, ఈఓ వంశీ, దేవస్థాన డైరెక్టర్లు, రిటైర్డ్ ఈఓ కేకే రాములు, సిబ్బంది భరత్, మల్లేశం, రమేష్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. -
పత్తి ధర ఢమాల్!
జనగామ: పత్తి ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. సీసీఐ ద్వారా మద్దతు ధర లభిస్తుందనుకున్న రైతులకు నిరాశ మిగిలింది. తుఫాను ప్రభావంతో ఇప్పటికే దిగుబడి తగ్గి పంట నష్టపోయిన రైతులను ఇప్పుడు మార్కెట్ బంద్ వెంటాడుతోంది. పైగా చిల్లర కాంటా వ్యాపారంలో క్వింటాకు రూ.1,800 తక్కువగా చెబుతుండడం, అత్యవసర ఆర్థిక ఒత్తిడికి తట్టుకోలేని రైతులు నష్టపోయినా అమ్మేయాల్సిన దుస్థితి నెలకొంది. కాటన్ కార్పొరేషన్ అసోసియేషన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సీసీఐ సంబంధిత మిల్లులు బంద్‌లోకి వెళ్లడంతో పత్తి కొనుగోళ్లు ఎక్కడికక్కడ స్తంభించి పోయాయి. మిల్లుల వద్ద పడిగాపులు సీసీఐ, పత్తి మిల్లులు బంద్ చేశారని తెలియక సెంటర్ల వద్దకు వచ్చిన రైతులు పడిగాపులు కాస్తున్నారు. పత్తి మిల్లులకు అనుసంధానంగా ఉన్న సీసీఐ సెంటర్ల వద్ద దేవరుప్పుల, పాలకుర్తి, రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, చిల్పూరు, జనగామ పలు మండలాలకు చెందిన రైతులు పత్తిని అమ్ముకునేందుకు వచ్చి నిరీక్షిస్తున్నారు. బంద్ చేపట్టారని తమకు ఎవరూ చెప్ప లేదని అంటున్నారు. బంద్ నేపధ్యంలో సీసీఐ సెంటర్లను సాక్షి పరిశీలన చేయగా, రైతుల కష్టాలు వెలుగు చూశాయి. నిబంధనల్లో కఠినతరం వానాకాలం సీజన్లో సీసీఐ అమలు చేస్తున్న నిబంధనలు రైతులకు ఆశని పాతంలా మారిపోయింది. గతంలో రైతు వారిగా ఎకరాకు 12 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేసిన సెంటర్లు, ఇప్పుడు 7 క్వింటాళ్లకు తగ్గించారు. అంతే కాకుండా ఎల్–1, ఎల్–2, ఎల్–3 పేరిట పత్తి మిల్లుల పరిధిలో సీసీఐ కేంద్రాలను ప్రారంభించే కొత్త నిబంధన తీసుకువచ్చారు. ఈ మార్పులతో రైతులకు నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చిల్లర కాంటా దోపిడీ సీసీఐ కొనుగోళ్లు నిలిచిపోవడంతో, ఇంటింటా తిరిగి తీసుకెళ్లడం, రవాణా ఖర్చులు, అవసరాలు, రుణ బకాయిల చెల్లింపులు, ఎరువుల కొనుగోళ్లు వంటి కారణాలతో రైతులు అంతగా ఇష్టపడకపోయినా చిల్లర కాంటాలో ప్రైవేట్ వ్యాపారులకే పత్తిని అమ్మక తప్పడం లేదు. ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకుని వ్యాపారులు క్వింటాలుకు రూ.1,000 నుంచి రూ.1,800 వరకు తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు. జనగామ పట్టణం, నెల్లుట్ల, తరిగొప్పుల, నర్మెట, రఘునాథపల్లి, పాలకుర్తి, స్టేషన్‌న్‌ఘన్‌పూర్ తదితర మండలాల్లో చిల్లర కాంటా జోరు స్పష్టంగా కనిపిస్తోంది. పాలక ప్రభుత్వాలు సీసీఐ మిల్లుల బంద్‌ను వీలైనంత త్వరగా ఎత్తివేసి కొనుగోళ్లు పునఃప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. గ్రామాల్లో జోరుగా చిల్లర వ్యాపారుల దందా ఆర్థిక పరిస్థితులు, యాసంగి పెట్టుబడి కోసం అమ్ముకుంటున్న రైతులు క్వింటాకు రూ.1,800 తగ్గించి కొనుగోలు చేస్తున్న వైనంసీసీఐ సెంటర్లలో మాతృ జిల్లాకు సంబంధించిన పత్తి మాత్రమే కొనుగోలు చేయాలనే నిబంధన విధించింది. దీంతో సరిహద్దు గ్రామాల రైతులకు ఇది పెద్ద సమస్యగా మారింది. సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, వరంగల్ జిల్లాల్లోని పలు ప్రాంతాలు, రెవెన్యూ పరిధి జనగామ జిల్లాకు పక్కనే ఉంటుంది. ఇతర జిల్లాల రైతులకు సీసీఐ సెంటర్లు సమీపంలో ఉన్నప్పటికీ ఇక్కడ పత్తి అమ్ముకునే వీలు లేకుండా పోతుంది. సొంత జిల్లాలో అమ్ముకుందామంటే రవాణా చార్జీలు పెరిగి పోతున్నాయి. దీంతో రైతులు పలుమార్లు ప్రయాణించాల్సి రావడంతో రవాణా వ్యయాలే భారం మారుతున్నాయి. రైతుల కష్టాలు, మిల్లర్ల వినతులను దృష్టిలో ఉంచుకుని సమీప జిల్లాల పత్తిని సైతం కొనుగోలు చేయాలని తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తోంది. -
భక్తిశ్రద్ధలతో కార్తీక దీపోత్సవం
రఘునాథపల్లి: మండలంలోని నిడిగొండలో శిథి లావస్థలో ఉన్న ముప్పేశ్వర త్రికూటాలయంలో ఆదివారం కార్తీక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. చుట్టు పక్కల గ్రామస్తులు తరలివచ్చి కార్తీ క దీపాలను వెలిగించి దైవభక్తిని చాటుకున్నారు. కుంకుమార్చన.. కార్తీక మాసం సందర్భంగా మండలంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో పండితులు అభిషేకాలు, కుంకుమార్చన పూజలు చేశారు. ఈ సందర్భంగా శ్రీవాసవీ మాతా సేవా సమితి ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ లగిశెట్టి భిక్షపతి–రాజమణి దంపతులను ఘనంగా సత్కరించారు. ప్రతినిఽధి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. శివాలయంలో.. దేవరుప్పుల: కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో పూజారి పెద్దాపురం వెంకటేశ్వరశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకం, పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు శివలింగానికి క్షీరాభిషేకం చేసి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. -
దొడ్డి కొమురయ్య ఆశయాలను కొనసాగిస్తాం
బచ్చన్నపేట: తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య ఆశయాలను కొనసాగిస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. ఆదివారం మండలంలోని చిన్నరామన్చర్ల గ్రామంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గె మల్లేశం, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ క్యామ మల్లేశంతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. దొరల పెత్తందారీ వ్యవస్థకు ఎదురొడ్డిన దొడ్డి కొమురయ్య అమరుడయ్యాడన్నారు. ఆ స్పూర్తితోనే అనేక పోరాటాలను చేశారని, ప్రపంచ చరిత్రలో సాయుధ పోరాటం చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై పెట్టాలని సీఎంతో మాట్లాడానని, ఆయన జయంతి, వర్ధంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా సీఎం చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో విగ్రహ దాత కేమిడి రాజు, కురుమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెవెళ్ల సంపత్, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి, కళాకారుల సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి ఒగ్గు రవి, మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిన్నింటి కావ్యశ్రీరెడ్డి, నాయకులు బాల్నె సిద్దిలింగం, కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి, బేజాడి బీరప్ప, బండి వీరస్వామి, నర్సింహులు, సిద్దులు, కిష్టయ్య, రమణారెడ్డి, మల్లేశం పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య -
రక్షణలేని చెరువులు
స్టేషన్‌ఘన్‌పూర్: చెరువుల అభివృద్ధి నిర్వహణ, నీటిసరఫరా కోసం పనిచేసే సాగునీటి సంఘాలు లేక జిల్లా వ్యాప్తంగా చెరువుల పర్యవేక్షణ కొరవడింది. గత పదిహేడు ఏళ్లుగా సాగునీటి సంఘాలు లేక పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురవుతున్నా పట్టించుకునేవారు లేరు. జిల్లా వ్యాప్తంగా 770 చెరువులు ఉండగా 153 చెరువులకు గతంలో సాగునీటి సంఘాలు ఉండేవి. మొత్తం చెరువులలో వంద ఎకరాల ఆయకట్టు ఉన్న చెరువులకు మాత్రమే సాగునీటి సంఘాలు ఉంటాయి. సాగునీటి సంఘాల ఎన్నికలకు ఆయా చెరువుల కింద వ్యవసాయభూములు ఉండి పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్న రైతులు ఓటర్లుగా ఉంటారు. ఒక సాగునీటి సంఘానికి ఆరుగురు డైరెక్టర్లు, ఒక చైర్మన్ ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేయగానే ఎన్నికలు నిర్వహించేవారు. ఆయా చెరువుల ఆయకట్టు రైతులు చైర్మన్‌తో పాటు డైరెక్టర్లను ఎన్నుకునేవారు. చైర్మన్, పాలకవర్గ సభ్యులు చెరువుల నిర్వహణతో పాటు నీటిని పంటపొలాలకు సీజన్ల వారీగా విడుదల చేసుకుని పొదుపుగా వాడుకునేవారు. అదేవిధంగా రైతులను సమన్వయం చేసుకుంటూ పలు అభివృద్ధి పనులు నిర్వహించేవారు. జాడలేని నీటిసంఘాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2006 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన చెరువులకు సాగునీటి సంఘాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి ఎన్నికలు నిర్వహించింది. వాటి పదవీకాలం 2008తో ముగియగా అప్పటి నుంచి సాగునీటి సంఘాల ఊసేలేదు. గత పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం చెరువుల అభివృద్ధి అంటూ మిషన్ కాకతీయ పనులతో చెరువులు, కుంటల పునరుద్ధరణ పనులు చేపట్టిందేగాని సాగునీటి సంఘాలను ఏర్పాటు చేయలేదు. నీటి సంఘాలు లేకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా తూతూమంత్రంగా పనులు చేపట్టారు. పలుచోట్ల చెరువుల భూములు అన్యాక్రాంతమైన సంఘటనలు సైతం ఉన్నాయి. 2014 నుంచి 2024 వరకు పదేళ్ల పాలించిన బీఆర్ఎస్ పాలకులు సాగునీటి సంఘాల మాటే ఎత్తలేదు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తయిన నీటి సంఘాల ఎన్నికలు తిరిగి పదేళ్లకు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సాగునీటి సంఘాలకు ఎన్నికలను నిర్వహించి చెరువులను రక్షించాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు. సాగునీటి సంఘాలు లేక పర్యవేక్షణ కరువు బాధ్యులు లేకపోవడంతో ఆక్రమణలు నీటి నిర్వహణ అస్తవ్యస్తం 17ఏళ్లుగా ఎన్నికలు నిర్వహించని ప్రభుత్వాలు -
హైవేపై జీరో సేఫ్టీ
లారీని బస్సు ఢీకొట్టిన ఘటనలో రోడ్డు భద్రత నిర్వహణ లోపం జనగామ: హైవేపై ‘జీరో సేఫ్టీ’ మరోసారి మృత్యుఘంట మోగించింది. నిడిగొండ ఫ్లైఓవర్‌కు 10 మీటర్ల దూరంలో బ్రేక్‌డౌన్ అయిన ఇసుక లారీ గంటసేపు రోడ్డుపైనే నిలిచిపోయింది. నేషనల్ హైవే అథారిటీ హెల్ప్‌లైన్ నెంబర్–1033కు డ్రైవర్ పలుమార్లు కాల్ చేసినా స్పందన రాలేదు. ఇదే సమయంలో హన్మకొండ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఆర్టీసీ రాజధాని బస్సు నేషనల్ హైవే రోడుపై నిలిచిన లారీని వెనక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. లారీ డ్రైవర్ 100కు కాల్ చేసి ఉంటే ప్రమాదం తప్పేదని పోలీసులు భావిస్తున్నారు. ఎన్‌హెచ్ నిర్వహణ, లైటింగ్ లోపాలు, హెల్ప్‌లైన్ అలసత్వం అమాయక ప్రాణాలను పొట్టనబెట్టుకుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లారీని ఢీకొట్టే సమయంలో బస్సు వేగం 55 కిలోమీటర్లు మాత్రమే ఉన్నట్లు జనగామ డిపో మేనేజర్ స్వాతి తెలిపారు. ప్రమాదంలో ప్రమేయం ఉన్న లారీ వాహన పత్రాలు సక్రమంగానే ఉన్నాయని జిల్లా రవాణా అధికారి జీవీఎస్ గౌడ్ తెలిపారు. అయితే ఓవర్‌లోడ్ ఉందా లేదా అనే విషయం తూకం వేసిన తర్వాత నిర్ధారణ జరుగుతుందన్నారు. ఇసుక లారీ ఫ్లైఓవర్ దిగిన వెంటనే బ్రేక్‌డౌన్‌తో ఆగిపోవడంతో ఎన్‌హెచ్ హెల్ప్‌లైన్ నెంబర్‌కు డ్రైవర్ ఫోన్ చేసినా, అక్కడ నుంచి రెస్పాన్స్ రాలేదని చెప్పినట్లు స్పష్టం చేశారు. నేషనల్ హైవేపై వాహనాలు ఆగిన వెంటనే హెల్ప్‌లైన్ సెంటర్లు స్పందించాల్సి ఉంటుంది. కానీ వరంగల్–హైదరాబాద్ హైవేపై అలాంటి చర్యలు కనిపించడం లేదు. రిపేరు, బ్రేక్‌డౌన్, తదితర కారణాలతో వాహనాలు రోడ్డుపై నిలిచిన సమయంలో తొలగించే టీంలు కనిపించడం లేదనే ఆరోపణలు లేకపోలేదు. చిన్న పెండ్యాల నుంచి జనగామ పెంబర్తి వరకు అనేక చోట్ల ఫ్లడ్‌లైట్లు వెలగడం లేదు.ఇటీవల కాలంలో బస్సుల ప్రమాదాలు పెరిగిపోవడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. అన్ని ప్రమాదాలకూ రహదారి భద్రతా లోపాలే ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రఘునాథపల్లి శివారు టిఫిన్ సెంటర్లోకి బస్సు దూసుకొచ్చిన ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మండల కేంద్రం శివారు పెట్రోలు బంకు వద్ద కారు–బస్సు ప్రమాదంలో ఓ వ్యక్తి మృత్యువాత పడ్డారు. ఖిలాషాపూర్ రోడ్డు సమీపంలో స్కూల్ బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో త్రుటిలో ప్రమాదం తప్పింది. జనగామ శివారు బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం సమీపంలో బెంగుళూరు నుంచి వచ్చే ట్రావెల్ బస్సు టైరు పేలి అదుపుతప్పి పల్టీకొట్టిన ఘటనలో 20మందికి పైగా గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బస్సు, లారీ ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఇప్పటివరకు 22 మందికి పైగా చనిపోయారు. నిడిగొండ శివారులో లారీ–రాజధాని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటన హైవే భద్రతలో ఉన్న లోపాలను మరోసారి బట్టబయలు చేసింది. హైవే అథారిటీ నిర్లక్ష్యం, హెల్ప్‌లైన్ స్పందన లేకపోవడం, లైటింగ్ సౌకర్యాల లేమి ఇవన్నీ ప్రమాదానికి కారణాలుగా వెలుగులోకి వస్తున్నాయి. ఫ్లైఓవర్ కిందకు దిగగానే అర్ధరాత్రి 12 గంటల సమయంలో లారీ బ్రేక్‌డౌన్ కావడంతో రోడ్డు మధ్యలోనే ఆగిపోయింది. దీంతో డ్రైవర్ మల్లేశం వెంటనే నేషనల్ హైవే హెల్ప్ లైన్‌కు పలుమార్లు కాల్ చేసినా రెస్పాన్స్ రాలేదు. గంటసేపు ఎలాంటి సహాయం అందకపోవడంతో లారీ రహదారి పైనే నిలిచిపోయింది. ఇదేక్రమంలో రాత్రి 1.05 గంటలకు బస్సు రావడం, ఢీకొట్టడం జరిగింది. మలుపుగా ఉన్న ఫ్లైఓవర్ దిగే సమయంలో లారీ అగిఉన్న విషయం బస్సు డ్రైవర్ ఎందుకు గమనించలేదనే విషయంపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఒకవేళ 50 మీటర్ల దూరంలో పసిగట్టి బ్రేక్‌లు వేసినా సడెన్‌గా అపలేకపోయారా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఫ్లైఓవర్ సమీపంలో బ్రేక్‌డౌన్‌తో లారీ అగిపోయిన సమయంలో సదరు డ్రైవర్ కనీస ప్రమాద హెచ్చరిక ప్రికాషన్ తీసుకోకపోవడం సైతం తప్పిదంగానే భావిస్తున్నారు. హెల్ప్‌లైన్ స్పందించకపోవడమే విషాదానికి కారణంగా ఉన్నతాధికారులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. 1033 హెల్ప్‌లైన్ స్పందన లేకపోవడమే ప్రమాదానికి కారణం 100కు కాల్ చేస్తే ప్రమాదం తప్పేదంటున్న అధికారులు ఢీకొట్టే సమయంలో బస్సు స్పీడ్ 55 కిలోమీటర్లు ఎన్‌హెచ్ నిర్వహణపై సర్వత్రా విమర్శలుప్రమాదం జరిగిన ప్రాంతంలోని యూటర్న్ దగ్గర సిగ్నల్ లైట్ ఒక వైపుకు తిరిగి ఉండడంతో డ్రైవర్లకు స్పష్టంగా కనిపించే పరిస్థితి లేకుండాపోయింది. హైవేపై చాలాచోట్ల స్ట్రీట్ లైట్లు వెలగకపోవడం, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోకపోవడం, రాత్రివేళ రక్షణ చర్యలు శూన్యంగా మారాయి.


