నేతల ప్రసన్నం కోసం..
నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్వినీరెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి తదితరులు తమ తమ లిస్టులను సిద్ధం చేసుకుంటూ హైకమాండ్‌తో సంప్రదింపులను ముమ్మరం చే స్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటుతుండడంతో ఇన్నాళ్లు నామినేటెడ్ పోస్టులకు ఎదురుచూసిన వారికి ఇప్పుడు అవకాశం వచ్చిందనే భావన కనిపిస్తోంది. ఏ పదవి అయినా సాధించాలనే పట్టుదలతో నాయకులు తెల్లవారుజామున ప్రారంభమయ్యే లాబీయింగ్‌ను రాత్రి వరకూ కొనసాగిస్తున్నారు. అవసరమైతే కొంతమంది నాయకులు హైదరాబాద్‌కు వెళ్లి హైకమాండ్‌కు తమ సేవలు, పార్టీ కోసం చేసిన కష్టాన్ని వివరించే ప్రయత్నాలు చేస్తున్నారు. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గాలకు చెందిన నాయకులు తాము అర్హులేనని చూపిస్తూ హైకమాండ్ ఎదుట తమబలం, బలగాన్ని చూపించే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు.


