విద్యకు 20శాతం నిధులు కేటాయించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యకు 20శాతం నిధులు కేటాయించాలి

Feb 26 2026 7:38 AM | Updated on Feb 26 2026 7:38 AM

విద్యకు 20శాతం నిధులు కేటాయించాలి

విద్యకు 20శాతం నిధులు కేటాయించాలి

జనగామ రూరల్‌: విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్‌లో 20 శాతం నిధులు కేటాయిస్తేనే విద్యావ్యవస్ధ అబివృద్ధి చెందుతుందని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ సంఘం నాయకులు, వక్తలు అభిప్రాయపడ్డారు. జిల్లా అధ్యక్షుడు ఎన్‌ఎన్‌ రాజు ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి కె.రవిచందర్‌ మాట్లాడుతూ.. గత 12 ఏళ్లలో ప్రభుత్వాలు విద్యకు బడ్జెట్‌లో నిధులు తగ్గించడంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల సంఖ్య 2021–22లో 27 లక్షల ఉంటే ప్రస్తుతం 16 లక్షలకు పడిపోయిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో 15శాతం కేటాయిస్తామని పేర్కొని 7.3 శాతం మాత్రమే కేటాయించడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో ఇప్ప రాంరెడ్డి, బాధ్యులు ఎ.నర్సింహారెడ్డి, రాజా రెడ్డి, కనకారెడ్డి, రాగల్ల ఉపేందర్‌, అధ్యాపక జ్వాల సంపాదకురాలు ఎ. కళావతి, అడ్వకేట్‌ సాధిక్‌ అలీ, చంద్రశేఖర్‌, రామస్వామి, రామ్మోహన్‌ రెడ్డి, అంకుషావలి, లక్ష్మయ్య, జగ్గారెడ్డి, శ్రీనివాసులు, గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement