ఇంటర్ పరీక్షలు షురూ..
పరీక్ష కేంద్రం వద్ద గుమిగూడిన విద్యార్థులు
క్యూలో విద్యార్థులు
జనగామ రూరల్: జిల్లావ్యాప్తంగా 16 సెంటర్లలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఫస్టియర్ విద్యార్థులు 96.94శాతం హాజరయ్యారని ఇంటర్ విద్యాధికారి (డీఐఈఓ) జితేందర్‌రెడ్డి తెలిపారు. మొత్తం 4,480మంది విద్యార్థులకుగాను 4,343 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 137 మంది గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ విద్యార్థులు 3,397మందికి 3,350 హాజరు కాగా 47మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌లో 1,083 మందికి 993 మంది హాజరు కాగా 90 మంది గైర్హాజరయ్యారు. పట్టణంలోని పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందులు కాకుండా మంచినీటి వసతి, లైటింగ్‌తో పాటు ఇతర సౌకర్యాలు కల్పించారు. పరీక్ష కేంద్రాల వద్ద ప్రతి సెంటర్‌కు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆశ, ఏఎన్‌ఎంలను నియమించారు. పొరపాట్లకు తావులేకుండా సజావుగా పరీక్షలను నిర్వహించేందుకు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి జితేందర్ రెడ్డి, సంబంధిత అధికారులు, సిబ్బంది చర్యలు చేపట్టారు. పట్టణంలోని పలు పరీక్ష కేంద్రాలను డీఐఈఓ జితేందర్ రెడ్డి, డెక్ సభ్యులు కె.సునంద, కె.శేఖర్ బోర్డు అబ్జర్వర్లు పాలకుర్తి, కొడకండ్ల పరీక్ష కేంద్రాలను పరిశీలించారు.
పరీక్ష కేంద్రాలను పరిశీలించిన డీసీపీ
ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో పట్టణంలోని ఏబీపీ జూనియర్ కళాశాలను డీసీపీ రాజమహేంద్ర నాయక్ పరిశీలించారు. పరీక్ష పూర్తయిన వెంటనే జవాబు పత్రాలను పోలీసు బందోబస్తు మధ్య నిర్దేశిత ప్రాంతాలకు తరలించాలని, ఎటువంటి మాల్‌ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా పూర్తి పారదర్శకంగా, పక్కాగా పరీక్షలు జరిగేలా చూడాలని ఆదేశించారు.
పరీక్ష గది నంబర్
చూసుకుంటున్న విద్యార్థులు
మొదటి రోజు ఫస్టియర్ పరీక్షకు 96.94శాతం మంది హాజరు
పరీక్ష కేంద్రాల వద్ద పకడ్బందీ పోలీసు బందోబస్తు
ఇంటర్ పరీక్షలు షురూ..
ఇంటర్ పరీక్షలు షురూ..
ఇంటర్ పరీక్షలు షురూ..


