సృజనాత్మకతను వెలికి తీయాలి | - | Sakshi
Sakshi News home page

సృజనాత్మకతను వెలికి తీయాలి

Mar 1 2026 7:57 AM | Updated on Mar 1 2026 7:57 AM

సృజనాత్మకతను వెలికి తీయాలి

సృజనాత్మకతను వెలికి తీయాలి

– మరిన్ని ఫొటోలు 9లోu

జనగామ రూరల్‌: సృజనాత్మకతను వెలికి తీసి శాస్త్రియతను పెంపొందించాలని జిల్లా సైన్స్‌ అధికారి చింతల ఉపేందర్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని సెయింట్‌ మేరీస్‌ పాఠశాలలో జాతీయ సైన్స్‌ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సైన్స్‌ అధికారి ఉపేందర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని సి.వి.రామన్‌ చిత్రపటానికి పూలమాల వేసి సైన్స్‌ ఎగ్జిబిట్స్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో ఇమిడి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి పాఠశాలలో అంతర్గతంగా నిర్వహించే వేదికలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. విద్యార్థులు శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలని, అబ్దుల్‌ కలాం చెప్పినట్లు కలలు కనండి.. వాటిని సాకారం చేసుకునే దిశగా అడుగులు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్‌ తుమ్మ శ్రీలతరెడ్డి, ప్రిన్సి పాల్‌ జైమోన్‌ థామస్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే గౌతమ్‌ మోడల్‌ స్కూల్‌లో నిర్వహించిన సైన్స్‌ దినోత్సవంలో మున్సిపల్‌ కమిషనర్‌ మహేశ్వర్‌ రెడ్డి పాల్గొని మాట్లాడారు. విజ్ఞాన ప్రదర్శనలు విద్యార్థుల్లో సృజనాత్మకతతో పాటు శాస్త్ర సాంకేతిక రంగాల్లో నైపుణ్యాలను మెరుగు పరచుకోవడానికి ఉపయోగపడతాయన్నారు. ఎ.శంకర్‌ రెడ్డి, భాష్యం విష్ణు చరణ్‌, ఎండీ మేహరాజ్‌ అహ్మద్‌, మోతే సురేందర్‌ రెడ్డి, అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే పసరమడ్లలోని ఆశ్రమ పా ఠశాలలో సైన్స్‌ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం జె.లచ్చిరాం,స్టా బి. జయరామ్‌ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

జిల్లా సైన్స్‌ అధికారి ఉపేందర్‌

ఘనంగా జాతీయ సైన్స్‌ దినోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement