వరంగల్: వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన ఎర్రబెల్లి స్వర్ణ తెలంగాణ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఈమేరకు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ మేయర్‌గా, కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా పనిచేసిన స్వర్ణ రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ రేసులో ఉన్నారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులైన స్వర్ణకు ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు చెప్పారు.


