హారం హాసం | - | Sakshi
Sakshi News home page

హారం హాసం

Mar 7 2026 8:18 AM | Updated on Mar 7 2026 8:18 AM

పంట నష్టం రైతుల వివరాలు:

నెలల తరబడిగా రైతుల ఎదురుచూపులు

పరి

జనగామ రూరల్‌: గత యాసంగిలో వడగళ్ల బీభత్సం, ఆ తర్వాత అతివృష్టి వర్షాలతో పంటలకు తీరని నష్టం వాటిల్లింది. వర్షాలు, గాలి దుమారంతో వేలాది ఎకరాల్లో చేతికందే దశలో ఉన్న వరి, మొక్కజొన్న, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. గత అక్టోబర్‌లో మొంథా తుపాను విరుచుకుపడడంతో భారీ వరదలు సంభవించి తీవ్రంగా పంట నష్టం జరిగింది. బీఆర్‌ఎస్‌ హయాంలో కూడా పంట నష్టం జరిగినప్పుడు పరిహారం అందించాలని బాధిత రైతులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. దీనిపై స్పందించిన అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందిస్తామని చెప్పిన ఆచరణలో జరగలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా రైతుల చేతికి చిల్లిగవ్వ అందలేదు. మోంథా తుఫాన్‌తో దెబ్బతిన్న పంటలకై నా నష్టపరిహారం ఇవ్వాలని రైతులు, పలు పార్టీల నాయకులు ఆందోళన చేపట్టి వినతి పత్రం కూడా అందజేశారు. పరిహారం అందక ప్రస్తుత ప రిస్థితుల్లో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు.

17వేల ఎకరాల్లో పంట నష్టం

జిల్లాలో గతేడాదికి సంబంధించిన పంట నష్టపరిహారం 11వేల మందిపైగా రైతులకు చెందిన సుమారు 17వేల ఎకరాల్లోని వరి, మామిడి, మొక్కజొన్నకు తీవ్ర నష్టం వాటిల్లిందని జిల్లా వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు సర్వే నిర్వహించారు. క్లస్టర్లు, గ్రామాల వారీగా ఏఈఓలు పంటల వివరాలను నమోదు చేసి ప్రభుత్వానికి నివేదించారు. పరిహారం చెల్లింపుల విషయంపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని అడగ్గా నివేదిక పంపామని, తమకు ఏలాంటి సమాచారం అందలేదని తెలిపారు. రైతులకు అందాల్సిన పరిహారం విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.

వడగళ్లు, మోంథా తుపానుతో చేతికొచ్చిన పంట నేలపాలు

జిల్లాలో 17వేల ఎకరాలపైగా

పంట నష్టం

ప్రభుత్వానికి నివేదిక

అందించామంటున్న అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement