పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ
స్టేషన్‌ఘన్‌పూర్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో స్టేషన్‌ఘన్‌పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, శివునిపల్లి పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను వరంగల్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ సరళిని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు. పోలింగ్ స్టేషన్ ఇన్‌చార్జులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట ట్రైనీ ఐపీఎస్ మనీషానెహ్రా, డీసీపీ రాజమహేంద్రనాయ క్, ఏసీపీలు భీమ్‌శర్మ, నర్సయ్య, సీఐలు జి.వేణు, ఎ.శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఐలు తదితరులున్నారు.


