ప్రత్యర్థులతో స్నేహహస్తం! | - | Sakshi
Sakshi News home page

ప్రత్యర్థులతో స్నేహహస్తం!

Feb 12 2026 7:33 AM | Updated on Feb 12 2026 7:33 AM

ప్రత్

ప్రత్యర్థులతో స్నేహహస్తం!

జనగామ/ జనగామ రూరల్‌: ఓవైపు ఓటింగ్‌..మరోవైపు ఓట్లు ఎవరికి పడుతున్నాయోనని టెన్షన్‌.. అయినా ఆ అభ్యర్థులు ఏకంగా ప్రత్యర్థులతోనే స్నేహహస్తం చాటారు. జనగామ మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ పూర్తయ్యాక ఒకటో వార్డు నుంచి పోటీ చేస్తున్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సజ్జ దుర్గాప్రసాద్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి మూడ్‌ లక్షణ్‌ నాయక్‌, బీజేపీ అభ్యర్థి కూరాకుల శ్రీలత ముగ్గురూ కలిసి బయటకు వచ్చి స్నేహపూర్వకంగా చేతులు కలిపి గెలుపు గుర్తులు చూపించారు. అలాగే రెండో వార్డు కౌన్సిల్‌ ఎన్నికల పోలీంగ్‌ ప్రెస్టన్‌ కళాశాల ఆవరణలో కొనసాగుతుండగా కాంగ్రెస్‌ అభ్యర్థి రామగళ్ల విజయ్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్ది రావెల రవి కలుసుకుని రాజకీయాలు పక్కనబెట్టి గెలుపోటములపై సమాలోచనలు చేశారు. కక్షపూరిత రాజకీయాలు పెట్రేగుతున్న కాలంలో ఇలా స్నేహహస్తం చాటడంపై పలువురు అభినందించారు.

రెండో వార్డు అభ్యర్థుల మాటాముచ్చట

పోలింగ్‌ కేంద్రం వద్ద 1వ వార్డు అభ్యర్థులు

ప్రత్యర్థులతో స్నేహహస్తం!1
1/1

ప్రత్యర్థులతో స్నేహహస్తం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement