నిదానంగా ఓటెత్తారు!
జిల్లాలో మున్సి‘పోల్’ ప్రశాంతం
రెండు గంటలకోసారి నమోదైన ఓట్లశాతం
జనగామ: జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ మొదట నిదానంగా ప్రారంభమైనప్పటికీ గంటగంటకూ ఓటర్ల రాక పెరుగుతూ వచ్చింది. పోలింగ్ బూత్‌లలో ఉదయం 6 గంటలకు అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా, సరిగ్గా ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మొదటి రెండు గంటల్లో 10 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ నమోదు కాగా, ఉదయం 10 తర్వాత ఓటర్లు వరుసగా బూత్‌లకు చేరుకోవడం మొదలైంది. జనగామలో 66, స్టేషన్‌ఘన్‌పూర్‌లో 36 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించారు. డీసీపీ రాజమహేంద్రనాయక్ పర్యవేక్షించగా, ఏఎస్పీ చేతన్ నితిన్, ఏసీబీ, సీఐ, ఎస్సై ఆధ్వర్యంలో 750 మందికి పైగా పోలీసు బలగాలు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పర్యవేక్షించడంతో రెండు చోట్ల పోలింగ్ పూర్తిగా ప్రశాంతంగా ముగిసింది.
మాకెందుకు డబ్బులు ఇవ్వలేదు..
పట్టణంలోని 23వ వార్డులో ఓటర్లు స్వయంగా ఓ అభ్యర్థిని నిలదీసిన ఘటన ఎన్నికల ప్రక్రియకు విభిన్నంగా నిలిచింది. మా ఓటుకు ఎందుకు డబ్బులు ఇవ్వలేదని ఓటర్లు అభ్యర్థిని ప్రశ్నించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. వెంటనే పోలీసులు చేరుకుని పరిస్థితిని శాంతింపజేశారు. చాలా పోలింగ్ కేంద్రాల్లో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ఓటర్ల కోసం పార్టీ నాయకులు వేచి ఉండి, వాహనం దిగిన వెంటనే వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేశారు. కొన్ని చోట్ల వీల్‌ఛైర్ల కొరత కారణంగా దివ్యాంగులకు ఇబ్బందులు కలగగా తెలుసుకున్న అధికారులు వెంటనే తెప్పించి సేవలను ప్రారంభించారు.
కట్టుదిట్టమైన చర్యలతో..
పోలింగ్ కేంద్రాల్లో మొబైల్ ఫోన్లకు అనుమతి ఇవ్వకుండా, ఓటర్లను పూర్తిగా చెక్ చేసిన తర్వాతే లోపలికి అనుమతించారు. సీసీ కెమెరాలు, మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణలో పోలింగ్ మొత్తం సాగింది. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ సెంటర్ నుంచి జనరల్ అబ్జర్వర్ నరసింహారెడ్డి, కలెక్టర్ షేక రిజ్వాన్ బాషా పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలించారు. అలాగే ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి ప్రెస్టన్ మైదానంలోని పోలింగ్ బూత్‌లను సందర్శించారు. బూత్‌ల వద్ద స్థానికేతర నాయకులు ఉండకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే వారిని అక్కడి నుంచి పంపించారు. ఇదే క్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ బాల్దె సిద్దిలింగంను అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించగా, పరిస్థితులు ఉద్రిక్తతమయ్యే అవకాశం ఉండడంతో కావడంతో పోలీస్ జీప్‌లో పెంబర్తిలోని ఆయన స్వగృహానికి తరలించారు. చిన్న గందరగోళాలు తప్పి తే పోలింగ్ శాంతియుతంగా సాగింది.
ఎప్పటికప్పుడు పరిశీలన..
కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర పింకేశ్ కుమార్, పోలింగ్ సరళిని పరిశీలించేందుకు ఎప్పటికప్పుడు పరిశీలించారు. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌లోని సెయింట్ మెరీస్, ఏబీవీ హైస్కూల్, ధర్మకంచ ఉన్నత పాఠశాల, పోలింగ్ బూత్‌లను సందర్శించి, అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. పోలీసు బందోబస్తు, ఓటర్లకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు, మెడికల్ క్యాంపు తదితర వాటికి సంబంధించి సూచనలు చేశారు. ప్రశాతం వాతావరణంలో పోలింగ్ జరిగేందుకు సహకరించిన ఓటర్లు, అధికార యంత్రానికి కలెక్టర్ అభినందించారు.
21వ వార్డులో వృద్ధురాలిని ఓటు వేసేందుకు తీసుకెళ్తున్న సిబ్బంది
వృద్ధురాలిని తీసుకెళ్తున్న పారిశుద్ధ్యకార్మికురాలు
గంటగంటకూ పెరుగుతూ..
జనగామ: జనగామ మున్సిపాలిటీ ఎన్నికల్లో పోలింగ్ ప్రారంభమైన మొదటి గంట నుంచి ఓటర్లు మంచి స్పందన చూపించారు. పట్టణంలో 44,045 ఓట్లు ఉండగా, పురుషులు 21.358, మహిళలు 22,678, అదర్స్ 9 మంది ఉన్నారు. ఉదయం 9 గంటలకే మొత్తం 4,489 మంది, అంటే 10.19శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించారు. 11 గంటల వరకు రద్దీ పెరగడంతో 11,674 ఓట్లు నమోదు కాగా, శాతం 26.5శాతానికి చేరింది. మధ్యాహ్నం 1 గంట సమయానికి పోలింగ్ మరింత ఊపందుకొని 20,545 ఓట్లు పడగా, శాతం 46.65శాతం వద్దకు చేరింది. మధ్యాహ్నం 1గంట నుంచి 3 గంటల వరకు అనూహ్యంగా రద్దీ పెరగడంతో 3 గంటలకు 28,764 ఓట్లు పోలు కాగా, పోలింగ్ శాతం 65.1 శాతానికి చేరుకుంది. సాయంత్రం చివరి గంటల్లోనూ పోలింగ్ వేగం తగ్గకపోవడంతో 5 గంటల నుంచి రాత్రి 7 వరకు పోలింగ్ ముగిసే వరకు 34,821 ఓట్లు పోలు కాగా, 79.04శాతం వద్ద నిలిచింది. ఇందులో పురుషులు 16,914, మహిళలు 17,898 మంది ఓటు వేశారు. జనగామ మున్సిపాలిటీలో ఉత్సాహభరితంగా ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ముఖ్యంగా మహిళల ఓటింగ్ శాతం పురుషుల కంటే ఎక్కువగా ఉంది.
ఘన్‌పూర్‌లో ఓటింగ్ శాతం..
స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటర్లు ఊహించిన దానికంటే ఎక్కువ ఉత్సాహం కనబర్చారు. రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతం విడుదల చేయగా, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓటింగ్ స్థిరంగా పెరుగుతూ వచ్చింది. మొత్తం 18,550 మంది ఓటర్లలో పురుషులు 8,913, మహిళలు 9, 636, ఇతరులు 1 ఉన్నారు. ఉదయం 9 గంటలకు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు క్రమంగా రావడంతో మొత్తం 2,138 మంది ఓటుహక్కు వినియోగించుకోగా, 11.52శాతంగా నమోదైంది. 11 గంటలు వరకు ఓటర్లు పెద్ద సంఖ్యలో కేంద్రాలకు చేరుకోవడంతో 6,181 ఓట్లు పోలయ్యాయి. ఈ దశలో పోలింగ్ శాతం 33.32శాతానికి చేరింది. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ కేంద్రాల్లో మరింత రద్దీ పెరిగింది. పార్టీల ప్రతినిధులు ఎక్కువ మొత్తంలో ఓటర్లను తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ఈ సమయానికి మొత్తం 10,458 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా, 56.38 శాతానికి చేరుకుంది. మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి ఓటర్లు పెద్ద సంఖ్యలో కేంద్రాలకు చేరుకున్నారు. ఈ సమయానికి పోలైన మొత్తం ఓటర్ల సంఖ్య 13,752 కాగా, శాతం 74.13శాతానికి చేరుకుంది. సాయంత్రం చివరి గంటల్లో కూడా ఓటర్లు చురుకుగా స్పందించడంతో 5 గంటల వరకు 15,670 ఓట్లు నమోదు కాగా ఇందులో పురుషులు 7,6 20, మహిళలు 8,049 మందితో 84.47 శాతంతో ముగిసింది.
గతం కంటే 0.32 శాతం తగ్గిన ఓటింగ్
జనగామ మున్సిపాలిటీలో 2020 పురపాలిక ఎన్నికల కంటే 0.29శాతం ఓటింగ్ తగ్గింది. గతంలో 40,099 ఓట్లు ఉండగా, 31,822 ఓట్ల పోలింగ్‌తో 79.36శాతం ఓటింగ్ నమోదు కాగా, ప్రస్తుతం 79.04తో 0.32శాతం ఓటింగ్ తగ్గింది.
కొత్త కొత్తగా ఉన్నది!
మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు యువత ఉత్సాహం చూపించింది. ముఖ్యంగా ఈ ఏడాదే ఓటు హక్కు వచ్చిన యువత ఓటు వేసి సెల్ఫీలు తీసుకుని, వాట్సాప్‌ల్లో స్టేటస్‌లు పెట్టుకుని సంతోషం వ్యక్తం చేశారు. ఎక్కువగా విద్యార్థులే కావడంతో ఓటు వేయడానికి సొంతూరుకు వచ్చారు. తమ స్నేహితులతో కలిసి పోలింగ్ కేంద్రాల బయట సందడి చేశారు.
–జనగామ
మరిన్ని వార్తలు, ఫొటోలు 8, 9లో
మధ్యాహ్నం వరకు పెరిగిన ఓటింగ్
చిన్న చిన్న ఉద్రిక్తతలు మినహా సజావుగా ఎన్నికలు
జనగామ 79.04శాతం,
స్టేషన్‌లో 84.47శాతం పోలింగ్
పట్టణంలో ఓటేసిన ఎమ్మెల్యే పల్లా,
కలెక్టర్ రిజ్వాన్ బాషా దంపతులు
ఉ 9గంటలు 11గంటలు ఒంటిగంట 3గంటలు 5 గంటలకు
జనగామ 10.19 26.5 46.65 65.1 79.04
స్టే.ఘన్‌పూర్ 11.52 33.32 56.38 74.13 84.47
నిదానంగా ఓటెత్తారు!
నిదానంగా ఓటెత్తారు!
నిదానంగా ఓటెత్తారు!
నిదానంగా ఓటెత్తారు!
నిదానంగా ఓటెత్తారు!
నిదానంగా ఓటెత్తారు!


