కర్ణాటకలోని అరేబియా సముద్ర తీరంలో ఉంది మురుడేశ్వర ఆలయం. (Shri Murudeshwara Shiva Temple)
ఇక్కడ శివుడు శివలింగ రూపంలో పూజలు అందుకుంటున్నాడు.
కందుక కొండపై నిర్మించిన ఈ ఆలయం ప్రపంచంలోనే రెండో ఎత్తైన శివుని విగ్రహానికి ప్రసిద్ధి చెందింది.
పక్కనే విశాలమైన అరేబియా సముద్రం ఉంటుంది. ఈ దృశ్యం ప్రతి ఒక్కరిని మంత్రముగ్దులను చేస్తుంది.
20 అంతస్తుల రాజగోపురం ఈ ఆలయానికి మరో ప్రత్యేకత. దీని పైకి వెళ్లి ఆలయాన్ని పూర్తిగా వీక్షించవచ్చు.
ఆలయానికి వెళ్లే మెట్ల దగ్గర రెండు పెద్ద పెద్ద భారీ ఏనుగులు విగ్రహాలు ఉంటాయి.
మహా శివరాత్రి నాడు కర్నాటక నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు.
దుస్తుల కోడ్: పురుషులకు- ధోతీలు మాత్రమే, టీ-షర్టు, జీన్స్ మరియు ప్యాంట్‌లు వేసుకుంటే అనుమతి ఉండదు.


