శ్రీ తల్పగిరి రంగనాధస్వామి ఆలయం, నెల్లూరు జిల్లాలోని ఆలయాలలోకెల్లా అత్యంత ప్రాచీనమైన ఆలయం.
ఇది నెల్లూరులోని రంగనాయకులపేటలో పెన్నానది ఒడ్డున ఉంది.
రంగనాధస్వామిని విష్ణువు ప్రతి రూపంగాను, రంగనాయిక అమ్మవారిని లక్ష్మీదేవి ప్రతి రూపంగాను అభివర్ణిస్తారు.
ఈ దేవాలయంలోని అద్దాల మండపం ఇక్కడికి వచ్చే భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది.
గర్భగుడిలోకి ప్రవేశించే ఉత్తర ద్వారాన్ని ముక్కోటి ఏకాదశి నాడు మాత్రమే తెరచి వుంచుతారు.
శ్రీ తల్పగిరి రంగనాథ స్వామికి ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ నెలలో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు.
దర్సన సమయం : ఆలయం దర్శనం ఉదయం 6:30 నుంచి 12 గంటలు తిరిగి సాయంత్రం 4:30 నుంచి రాత్రి 8 గంటలు వరకు దొరుకుతుంది.


