breaking news
Nellore
-
Jupudi Prabhakar Rao: రౌడీషీటర్ శ్రీకాంత్ వెనుక ఉన్నది టీడీపీ నేతలే..
-
కాకాణి గోవర్ధన్ రెడ్డి విడుదల
-
నెల్లూరు ఆర్ఎన్ఆర్ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
-
నెల్లూరు ఆర్ఎన్ఆర్ కాలేజీలో దారుణం
సాక్షి,నెల్లూరు: అన్నమయ్య సర్కిల్ ఆర్ఎన్ఆర్ జూనియర్ ఇంటర్ కాలేజీలో దారుణం జరిగింది. హాస్టల్లో ఉంటున్న ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ గదిలోనే ఉరేసుకుని ప్రాణాలు కోల్పోయింది.దీంతో విద్యార్థిని ఆత్మహత్య గురించి గుట్టుచప్పుడు కాలేజీ యాజమాన్యం వ్యవహరించింది. ఎవరికీ అనుమానం రాకుండా.. విద్యార్ధినికి ఆరోగ్యం బాగలేదంటూ ఆస్పత్రికి తరలించింది. బాధితురాలి తల్లిదండ్రులకు ఇదే విధంగా సమాచారం అందించింది. కుమార్తె ఆరోగ్యంపై సమాచారం అందుకున్న తల్లిదండ్రులు హుటాహుటీన ఆస్పత్రికి తరలివచ్చారు.అయితే,విద్యార్థిని మెడ భాగంపై కమిలిన గాయాలు ఉండడంపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. ఆర్ఎన్ఆర్ కాలేజీ వద్ద తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. -
నెల్లూరులో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
సాక్షి, చాకిచెర్ల: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. తుపాన్ వాహనం లారీని ఢీకొనడంతో.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. ఉలవపాడు మండలం చాకిచర్ల వద్ద జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని తుపాను వాహనం ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే, వీరంతా.. పిడుగురాళ్ల నుంచి తిరుమల దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. -
నేను నవ్వినందుకు కేసు పెట్టారు
సాక్షి,నెల్లూరు: నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ విచారణ ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి ప్రసన్నకుమార్ రెడ్డికు మద్దతు తెలిపేందుకు నాపై కేసు పెట్టారు.ప్రసన్న కుమార్‌తో కలిసి నన్ను ఏ2గా చేర్చారు. నేను నవ్వినందుకు కేసు పెట్టారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాను. కూటమి ప్రభుత్వంలో వేదిక మీద నవ్విన నాయకుల మీద కేసులు పెట్టే పరిస్థితులు వచ్చాయి. నవ్విన తప్పే అంటే ఇక ఏమి చేయాలి?. కూటమి నేతలు ఏ స్థాయికి దిగజారి పోయారో తెలుస్తోంది.36 ప్రశ్నలు అడిగారు, 10 నిమిషాల్లో సమాధానం రాసి ఇచ్చాను. నన్ను ఆరు గంటలు కూర్చోబెట్టారు, విచారణ చేశారు. బీసీ నాయకులను కూటమి ప్రభుత్వం కక్ష్య సాధిస్తోంది’అని ఆరోపించారు. కాగా,కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్య కొనసాగుతోంది. అనిల్ కుమార్‌పై వేమిరెడ్డి ప్రశాంతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అనిల్ కుమార్.. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. -
అనిల్ కుమార్ యాదవ్ పై కక్ష సాధింపు
-
ఆ కేసులో అనిల్ కుమార్ యాదవ్ ని ఇరికించే కుట్ర
-
నెల్లూరు రూరల్ డీఎస్పీ ఆఫీసుకు అనిల్ కుమార్ యాదవ్
-
పదవులొచ్చాయి.. పరువు పోయింది
ఎలా ఉండేవాళ్ళు ఎలా అయ్యారు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో భాగంగా ఉన్నపుడు వేమిరెడ్డి ప్రభాకర్ దంపతులు ఎంతో గౌరవంతో ఉండేవారు.. ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉండగా ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా ఉంటూ దేశంలోని పలుచోట్ల శ్రీవారి ఆలయాల నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.. ఇంటా బయటా గౌరవం.. గుర్తింపుతో ఉండేవారు.నాడు వెమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటే ఒక జంటిల్మెన్ అనే ట్యాగ్ లైన్‌తో ఉండేవారు.. వైఎస్ జగన్‌తో పాటు పార్టీ నేతలు.. సభ్యులు.. సహచర ఎంపీలు.. ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ప్రభాకర్ రెడ్డికి ఎనలేని గౌరవం ఇచ్చేవాళ్ళు. ఎక్కడ తేడా వచ్చిందో కానీ ఆయన టీడీపీలో చేరి నెల్లూరు నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. భార్య ప్రశాంతి రెడ్డి కోవూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇంట్లో భార్యాభర్తలకు రెండు పదవులు రావడం వరకూ సంతోషమే కానీ.. పదవులు రావడం.. వారికి ఇది వరకు సమాజంలో ఉన్న గౌరవం పోవడం ఒకేసారి జరిగిపోయింది.పదవులు వచ్చినంత త్వరగా గౌరవమర్యాదలు పోవడం మొదలైంది. సంపన్నులైన వేమిరెడ్డి దంపతులు ప్రజా జీవితంలో ఉంటే తమకు మంచి లాభం అని భావించిన టీడీపీ జనసేన నేతలు వారు గెలవగానే ఇప్పుడు నిజరూపం చూపిస్తున్నారు. ప్రశాంతి పేరు చెప్పి టీడీపీ జనసేన నేతలు కోవూరులో రౌడీయిజం చేయడం మొదలెట్టారు. ఎక్కడికక్కడ దందాలు.. సెటిల్మెంట్లు.. గూండాగిరితో సమాజాన్ని హడలెత్తిస్తున్నారు. అంతేకాకుండా సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిమీద దాడి చేసి ఆస్తులు ధ్వంసం చేయడం వాళ్లకు వాళ్ళు సమర్థించుకున్నా కానీ వేమిరెడ్డి ఫ్యామిలీకి బాగా డ్యామేజ్ చేసింది. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి అంత మాత్రానికే ఇంటి మీదకు వెళ్లి రౌడీయిజం చేయడమా అనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఇసుక.. మద్యం.. గ్రావెల్ అంటూ ఆమె అనుచరులు దందా చేస్తూ జనాన్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.దీంతోబాటు నెల్లూరులో క్వార్ట్జ్ ఖనిజం పేరిట వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కంపెనీలు చేస్తున్న దందా అంతా ఇంతా కాదు. దేశ విదేశాలకు లక్షల టన్నుల ఖనిజం ఎగుమతి చేయడం.. ఇందులో చాలావరకు అక్రమంగా తవ్వింది ఉందని తేటతెల్లం అవడంతో ఆయన సైతం సమాధానం ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ప్రభాకర్ రెడ్డికి చెందిన మైనింగ్ కంపెనీలు అడ్డగోలుగా ఖనిజాలు తవ్వేస్తూ వనరులను కొల్లగొడుతున్నట్లు ప్రభుత్వం వద్ద కూడా రికార్డులు ఉన్నాయి. పైగా మైనింగ్ శాఖ కూడా లోలోన ఇదే రిపోర్ట్ పంపింది. మొత్తానికి డబ్బు.. పదవి వచ్చినంత వేగంగా వేమిరెడ్డి పరపతి దిగజారిపోయింది.ఇక జనంలో విమర్శలు.. వైఎస్సార్సీపీ నాయకుల పోరాటాలు చూసి వేమిరెడ్డి ఏమనుకున్నారో ఏమో ఇక తానూ మైనింగ్ వ్యాపారం నిలిపివేస్తాను అని ప్రకటించారు. వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనకు ముందురోజే ఆయన మీడియాతో మాట్లాడుతూ తానింకా వ్యాపారం చేయలేనని అన్నారు. వ్యాపారాలు మూసేస్తున్నానని ప్రకటించారు. గౌరవం సైతం చిల్లుకుండలోని నీరులా రోజురోజుకూ తగ్గిపోతోంది.. గతంలో గౌరవంగా ఉండే వేమిరెడ్డి కుటుంబం ఇప్పుడు పరువు.. పరపతి కోల్పోయి అవమానకర పరిస్థితుల్లో పదవుల్లో కొనసాగుతున్నారని నెల్లూరు జనం చెప్పుకుంటున్నారు..-సిమ్మాదిరప్పన్న. -
జగన్ పర్యటనలో పోలీసులు ఓవరాక్షన్ YSRCP లీడర్లు స్ట్రాంగ్ కౌంటర్
-
దమ్ముంటే ఆపు.. పోలీసులకి ఇచ్చిపడేసిన ప్రసన్నకుమార్ రెడ్డి
-
నెల్లూరు జిల్లాలో YSRCP నాయకులపై అక్రమ కేసులు
-
అడ్డుకోలేని ఆంక్షలు.. ఇనుప కంచెలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటనలో పార్టీ శ్రేణులను, అభిమానులను కట్టడి చేయడంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఊరూరా ఆంక్షలు, పెద్ద సంఖ్యలో చెక్‌పోస్టులు, అడుగడుగునా బారికేడ్లు, ముళ్లు, ఇనుప కంచెలు ఏర్పాటు చేయడంతో పాటు తుదకు రహదారులను తవ్వి.. ధ్వంసం చేసినా ప్రభుత్వ పెద్దల లక్ష్యం మాత్రం నెరవేరలేదు. ఇవేవీ కూడా వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలను అడ్డుకోలేకపోయాయి. జగన్‌ను కలిసేందుకు, చూసేందుకు వచ్చిన నేతలు, కార్యకర్తలు, అభిమానులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. కొందరు నేతలు, కార్యకర్తలపై లాఠీచార్జ్ చేసి ప్రభుత్వ పెద్దలను మెప్పించే ప్రయత్నాలు చేశారు. ఇంత చేసినా ఊహించని స్థాయిలో జనం రావడంతో నెల్లూరు నగరం జన సునామీగా మారింది. వైఎస్ జగన్ గురువారం నాటి పర్యటనకు 110 మందికి మించి పాల్గొన కూడదంటూ ఆంక్షలు విధించిన ఇన్చార్జి ఎస్పీ ఏఆర్ దామోదర్ నేతృత్వంలో గుంటూరు రేంజ్ పరిధిలోని అన్ని జిల్లాల నుంచి 2వేల∙మందికిపైగా పోలీసులను మోహరించారు. పర్యటనకు ఎవరూ రాకూడదంటూ, వస్తే కేసులు నమోదు చేస్తామంటూ నిర్బంధాలకు తెర లేపారు. అర్ధరాత్రి, అపరాత్రి తేడాలేకుండా వైఎస్సార్సీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు. ప్రజలకు సైతం హెచ్చరికలు చేశారు. గురువారం తెల్లవారుజాము నుంచే నెల్లూరు సరిహద్దుల్లో పదుల సంఖ్యలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, బయట ప్రాంతాల నుంచి ఎవరూ నగరంలోకి రాకుండా చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు రోడ్లపైకి వచ్చి తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రజలు పనుల నిమిత్తం నెల్లూరు నగరానికి వెళుతున్నామని చెప్పినప్పటికీ వినకుండా బలవంతంగా వెనక్కి పంపారు. ఇనుప కంచెలతో బారికేడ్లను ఏర్పాటు చేశారు. రహదారులను తవ్వేశారు. చెముడుగుంటలోని హెలిప్యాడ్ వద్ద నుంచి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటి వరకు ప్రధాన కూడళ్ల వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. డీటీసీకి వెళ్లే రహదారిలోకి ఎవరినీ అనుమతించలేదు. ఆ ప్రాంతం వారు ఎవరూ ఇల్లు విడిచి బయటకు రాకుండా నిర్బంధించారు. కర్ఫ్యూ వాతావరణంకేంద్ర కారాగారం చుట్టూ బారికేడ్లు పెట్టారు. దానికి ముందు ముళ్ల కంచెను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. అనుకూల మీడియా మినహా ఇతరులు ఎవరినీ వెళ్లనివ్వలేదు. వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు రాకుండా పరిసర ప్రాంతాలన్నీ పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. హెలిప్యాడ్ వద్దకు వెళుతున్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరుల పట్ల కూడా పోలీసు అధికారులు దురుసుగా ప్రవర్తించారు. నెల్లూరు నగరం అంతా కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించింది. విధుల్లో ఉన్న పోలీసులంతా వైఎస్ జగన్ భద్రత కోసం కాకుండా వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు జగన్ వద్దకు వెళ్లకుండా నిలువరించడానికే పని చేసినట్లు స్పష్టంగా కనిపించింది. ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ సమీపంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలపై పోలీసులు లాఠీలు ఝుళిపించి భయానక వాతావరణం కల్పించారు. నెల్లూరు నగరంలో పలువురు వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేశారు. జిల్లా మైనార్టీ అధ్యక్షుడు సిద్దిఖ్, 42వ డివిజన్ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ మస్తాన్, కుక్కలగుంటకు చెందిన ఆవుల నాగేంద్రను చిన్నబజారు పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు.పలువురికి సెక్షన్ 170 బీఎన్ఎస్ఎస్ కింద నోటీసులు జారీ చేశారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినప్పటికీ తుదకు వైఎస్ జగన్ కేంద్ర కారాగారానికి వచ్చే సమయానికి వేల మంది అభిమానులు అక్కడికి చేరుకుని జై జగన్... అంటూ నినాదాలు చేశారు. అక్కడి నుంచి జగన్ పర్యటన ముగిసే వరకు కనుచూపు మేర జనం పోటెత్తారు. ఆంక్షలను లెక్క చేయక జగన్ పర్యటనలో పాల్గొని అభిమానాన్ని చాటుకున్నారు. -
YS Jagan Nellore Tour : అవధులు లేని అభిమానం.. ఉరకలు పరుగులు (ఫొటోలు)
-
Watch Live: నల్లపరెడ్డికి వైఎస్ జగన్ పరామర్శ
-
Nellore Tour : మీరెవరు మమ్మల్ని ఆపడానికి
-
ఇది ఒక చీకటి రోజు.. రోడ్డుపై బైఠాయించిన నల్లపరెడ్డి
-
అనిల్ కుమార్ కు వైఎస్ జగన్ ఆత్మీయ ఆలింగనం
-
జనం రాకుండా రోడ్లు తవ్వేశారు.. చంద్రబాబు సర్కార్‌పై వైఎస్సార్సీపీ ఆగ్రహం
సాక్షి, నెల్లూరు జిల్లా: వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై చంద్రబాబు సర్కార్ ఆంక్షలు పెట్టడం దారుణమని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇలాంటి ఆంక్షలు ఎప్పుడూ లేదన్నారు. ప్రభుత్వమే రోడ్లను తవ్వేస్తోందన్న అంబటి.. రోడ్ల తవ్వడమేంటి? ఇదేమైనా యుద్ధ భూమా? అంటూ దుయ్యబట్టారు. ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారాయన.మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిపై దొంగ కేసులు పెట్టి జైలుకు పంపారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. జిల్లా జైలు వద్ద ఆయన మీడియాత మాట్లాడుతూ.. ప్రజలను రానివ్వకుండా ఎక్కడిక్కడ బారికేడ్లు పెట్టారు.. పక్క జిల్లాల నుంచి పోలీసులు వచ్చారు. ప్రజలు స్వచ్ఛందంగా జగన్‌ని చూసేందుకు వస్తారు. జగన్ పర్యటనపై పోలీసులు, కూటమి నేతలు కుట్రలు చేస్తున్నారు’’ అని అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌పై ఉండే అభిమానాన్ని ఎవ్వరూ ఆపలేరన్నారు.భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా చంద్రబాబు కూటమి ప్రభుత్వం హాస్యాస్పదంగా వ్యవహరిస్తుందన్నారు. నెల్లూరు నగరాన్ని పూర్తిగా పోలీసులతో అష్ట దిగ్బంధనం చేసారు. చుట్టుపక్కల ఉన్న పల్లెలను పోలీసులతో చుట్టుముట్టారు. అయినా అభిమానులు, కార్యకర్తలు వస్తారని దారులను జేసీబీలతో గుంతలు తవ్వుతున్నారు. ఇది ఆశ్చర్యం కలిగించే విషయం. ఇలా గుంతలు తవ్వడం ద్వారా ప్రజలకు అత్యవసర పనులకు ఆటంకం కలుగుతుంది...నెల్లూరు లో ప్రధాన రహదారులు, దారులలో ముళ్ల కంచెలు వేస్తున్నారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ తరంగాలు చూస్తే మంచి హాస్య నాటకం పోలీసులతో వేయిస్తున్నట్లు ఉంది. అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు వస్తుంటే ఇన్నీ ఆంక్షలా.. అందరికీ నోటీసులు ఇచ్చి, అడుగడుగునా అడ్డంకులు పెడుతున్నారు. ఎక్కడ ప్రజలు జగన్ కోసం వస్తారోనని ప్రభుత్వం భయపడుతుంది. చంద్రబాబు కూటమి ప్రభుత్వం అన్ని అడ్డంకులు, నిబంధనలు పెట్టిన జగన్ చూడటానికి సునామీలా వస్తారని బంగారుపాళ్యంలో రుజువైయింది. కూటమీ ప్రభుత్వం గుంతలు తవ్విన, ముళ్ల కంచెలు వేసిన జగన్ పర్యటన విజయవంతం అవ్వడం ఖాయం. ఆపడం ఎవరితరం కాదు’’ అని భూమన అన్నారు.రోడ్లను తవ్వడం దారుణం: అప్పలరాజురాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. రోడ్లను తవ్వడం దారుణమన్నారు.వైఎస్ జగన్ అంటే భయమెందుకు?: అనంత వెంకటరామిరెడ్డివైఎస్ జగన్ అంటే చంద్రబాబు ప్రభుత్వానికి భయమెందుకు అంటూ ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి. సింహాన్ని చూసి భయపడినట్లు ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వం తీరు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యున్ని ఆపాలనుకోవడం మూర్ఖత్వం. వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనలో ప్రజలను అడ్డుకోవడం దుర్మార్గం. దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు వైఎస్ జగన్. పులివెందుల ఎమ్మెల్యే అంటూ వ్యంగ్యంగా మాట్లాడిన మంత్రులు... జగన్ పర్యటనలపై ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారో చెప్పాలని అనంత వెంకటరామిరెడ్డి అన్నారు.సునామీని ఆపగలిగే శక్తి ఉందా?: ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషావైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై ప్రభుత్వ ఆంక్షలపై ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మండిపడ్డారు. ప్రజలను, సునామీని ఆపగలిగే శక్తి ఉందా? అన్న ఇస్సాక్ భాషా.. ముందే నీ ఓటమిని ఒప్పుకుంటున్నవా? చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. ‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరు. అలాగే వైఎస్ జగన్ మీద ప్రజలకు ఉన్న అభిమానాన్ని ఆపలేరు. ప్రజలను రాకుండా మీరు చేస్తున్న పనులు హేయమైనవి, దుర్మార్గమంటూ ఆయన విమర్శించారు. మీ నీచ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. మాపై ఎన్ని కేసులు పెట్టిన భయపడం’’ అని ఇస్సాక్ భాషా తేల్చి చెప్పారు.ఇలాంటి దుస్థితి ఏ రాష్ట్రంలోనూ లేదు: వైఎస్ అవినాష్రెడ్డివైఎస్ జగన్ భద్రతను గాలికొదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం.. కార్యకర్తలను అడ్డుకుంటుందని వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మండిపడ్డారు. రోజురోజుకీ కూటమి ప్రభుత్వ అరాచకం పెరిగిపోతోందన్నారు. నెల్లూరు పర్యటనకు కార్యకర్తలను రాకుండా లాఠీ ఛార్జ్ చేయడం దారుణం. మా ప్రభుత్వంలో మిమ్మల్ని అడ్డుకున్నామా..?. చంద్రబాబు స్వేచ్ఛగా తిరిగి ఎన్నెన్నో విమర్శలు చేశారు. ఏ హోదా లేని పవన్ కళ్యాణ్‌కి కూడా అన్నాడు మేము భద్రత ఇచ్చాం. వీళ్ళని మేము ఎక్కడా అడ్డుకున్నది లేదు. కానీ ఇప్పుడు జగన్‌ను అడ్డుకోవాలని చూడటం దారుణం.ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటివద్ద కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేశారు. ఎవరు రాకూడదని 5 వేల మంది పోలీసులను వినియోగించారు. ఇలాంటి దుస్థితి ఏ రాష్ట్రంలోనూ లేదు. గుంటూరు, సత్తెనపల్లి, పొదిలి, బంగారుపాళ్యం.. ఇలా రోజు రోజుకీ కూటమి ప్రభుత్వ అరాచకం ఎక్కువవుతోంది. మీరు ఎంత అపాలనుకున్నా.. వైఎస్ జగన్ కోసం వచ్చే జనాన్ని మీరు ఆపలేరు. జగన్ భద్రతపై ప్రతి ఒక్క కార్యకర్తల్లో ఆందోళన ఉంది. భద్రతపై కేంద్రాన్ని, సుప్రీం కోర్టును, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాం’’ అని అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. -
వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన... సాక్షి రిపోర్టర్ పై పోలీసుల దౌర్జన్యం
-
నేడు వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన.. కూటమి సర్కార్ భారీ ఆంక్షలు.. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా..
-
Updates: నెల్లూరులో ముగిసిన వైఎస్ జగన్ పర్యటన
జగన్ నెల్లూరు పర్యటన.. ఎప్పటికప్పటి అప్డేట్స్నెల్లూరులో ముగిసిన వైఎస్ జగన్ పర్యటనఅక్రమ కేసుల్లో అరెస్టై నెల్లూరు జైల్లో ఉన్న కాకాణి గోవర్ధన్‌రెడ్డితో ములాఖత్అనంతరం నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి జగన్ప్రసన్న కుమార్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు జగన్ పరామర్శఅనంతరం మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్ఏపీలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులంటూ ఫైర్ 👉నా పార్టీ నాయకుడిని పరామర్శించడానికి నేను వెళ్ళకూడదా? - వైఎస్ జగన్ నా వెనుక జనం రాకుండా , నా పర్యటనలకు ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు..?జనం రాకుండా రోడ్లను తవ్వేశారుప్రజలను రాకుండా ఆపడానికి 2 వేల మంది పోలీసులు అంతగా శ్రమించాల్సిన అవసరం ఏముంది ?బాబు గారి ప్రభుత్వం మంచిగా పరిపాలిస్తే... ఎందుకు ఇంత భయపడుతుంది..?తన పాలనను చూసి చంద్రబాబు భయపడుతున్నాడువిద్య వైద్య రంగాలను పూర్తిగా నాశనం చేశారుఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోయాయి , రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదుఅన్ని వర్గాల ప్రజలను ప్రభుత్వం గాలికి వదిలేసిందిమా పార్టీ నాయకుడైన ప్రసన్న ఇంట్లోకి టీడీపీ గూండాలు చొరబడి బీభత్సం సృష్టించారురోజా , విడుదల రజిని పై కారు కూతలు కూస్తున్నారుమా పార్టీ జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడులు చేశారుతప్పుడు కేసులు పెట్టి మా పార్టీ నేతలను వేధిస్తున్నారుఏ తప్పు చేశాడని కాకానిని జైల్లో పెట్టారు ?రాష్ట్రంలో చంద్రబాబు విషబీజాలు నాటుతున్నారుపోలీసుల ద్వారా ఒక మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారు👉ఏ తప్పు చేశాడని కాకాణిని జైల్లో పెట్టారుఏ తప్పు చేశాడని కాకాణిని జైల్లో పెట్టారుకాకాణిపై ఏకంగా 14 తప్పుడు కేసులు పెట్టారుప్రెస్మీట్లోని తన క్లిప్పింగ్‌లను వాట్సాప్‌లో షేర్ చేస్తే కేసు పెట్టారురాజకీయ నాయకుడు ప్రెస్‌మీట్ పెడితే దాన్ని వాట్సాప్‌లో షేర్ చేస్తే కేసులు పెడతారా? 👉ఉచిత ఇసుక ఎక్కడ చంద్రబాబు ఉచితంగా ఇసుక ఇస్తామని హామీ ఇచ్చారుఏ ఉచితంగా ఇసుక ఎక్కడ ఇస్తున్నారుఇసుక పేరుతో అడ్డంగా దోపిడీకి తెరతీశారు👉నన్ను చూసి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారుసూపర్ సిక్స్,సూపర్ సెవన్ అంటూ వెన్నుపోటురాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతోందిచంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని ప్రశ్నించేవారిని గొంతు నొక్కేస్తున్నారు.జనం రాకుండా రోడ్లను తవ్వేశారుప్రతిపక్ష నాయకుడిని చూసి చంద్రబాబు ఎందుకు బయపడుతున్నారునాడు నేడు ఆగిపోయింది.. ఇంగ్లీష్ మీడియం ఆగిపోయిందిరైతన్న పంటకు గిట్టుబాటు ధర లేదుచంద్రబాబు రాజ్యంలో రైతన్నలకు ఆత్మహత్యలే శరణ్యం👉ఏపీలో ఎమర్జెన్సీ పరిస్థితులున్నాయి: వైఎస్జగన్రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందినా పర్యటనకు ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు?జనం రాకుండా ఏకంగా రోడ్లనే తవ్వేశారు👉ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వైఎస్ జగన్మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి ఇంటికి చేరుకున్న వైఎస్ జగన్టీడీపీ గుండాల దాడి నుంచి తృటిలో తప్పించుకున్న ప్రసన్న కుమార్రెడ్డిఇంటిని, ఫర్నీచర్‌ను ధ్వంసం చేసిన పచ్చ మూక.. దాడి నుంచి సురక్షితంగా బయటపడ్డ కుటుంబ సభ్యులుప్రసన్న కుమార్‌రెడ్డికి, ఆయన కుటుంబ సభ్యులకు జగన్ పరామర్శఇంటిని పరిశీలిస్తున్న వైఎస్ జగన్👉నెల్లూరులో జన ప్రభంజనంవైఎస్ జగన్‌కు అడుగడుగునా అపూర్వ స్వాగతంవైఎస్ జగన్ పర్యటనకు భారీగా తరలివచ్చిన ప్రజలుదారి పొడవునా వైఎస్ జగన్‌కు ఉప్పొంగిన జనాభిమానంజనంతో కిక్కిరిసిపోయిన నెల్లూరు రహదారులునెల్లూరులో ఎక్కడ చూసినా జన ప్రవాహంపోలీసుల ఆంక్షలను లెక్క చేయని ప్రజలు 👉ఆంక్షల ఆటంకాలను దాటుకుని తరలివస్తున్న కార్యకర్తలుజగన్ నినాదాలతో దద్దరిల్లుతున్న గవర్నమెంట్ ఆస్పత్రి సెంటర్రోడ్ల పైకి వస్తున్న వాహనాలను, వైసీపీ కార్యకర్తలను వీడియో రికార్డ్ చేస్తున్న పోలీసులుపోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించిన, భయబ్రాంతులకు గురి చేసిన వైఎస్ జగన్‌ని కలుస్తామంటున్న కార్యకర్తలు👉జైల్లో మాజీ మంత్రి కాకాణిని పరామర్శించిన వైఎస్ జగన్ప్రసన్నకుమార్రెడ్డి ఇంటికి బయల్దేరిన వైఎస్ జగన్👉ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటి వద్ద పోలీసుల అరాచకంవైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, ప్రజలపై పోలీసుల లాఠీఛార్జ్మహిళలు, వృద్ధులపైనా కూడా లాఠీఛార్జ్ చేసిన పోలీసులునిరసనగా రోడ్డుపై బైఠాయించిన ప్రసన్నకుమార్రెడ్డిపోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ ఆగ్రహంపోలీసులకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ శ్రేణుల నినాదాలుపోలీస్ జులుం నశించాలంటూ వైఎస్సార్సీపీ కార్యకర్తల నినాదాలుమా కార్యకర్తలను అన్యాయంగా కొట్టారు: ప్రసన్నకుమార్రెడ్డిస్వచ్ఛందంగా ప్రజలు తరలివస్తుంటే అడ్డకుంటున్నారుప్రజలపై కూడా పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారుజనం రాకుండా రోడ్లు తవ్వేశారువైఎస్జగన్ అభిమానులను ఎవరూ ఆపలేరు 👉నెల్లూరు జైల్లో కాకాణితో వైఎస్ జగన్ ములాఖత్అక్రమ కేసులో రిమాండ్‌లో ఉన్న కాకాణికి వైఎస్ జగన్ పరామర్శవైఎస్ జగన్ వెంట కాకాణి కూతురు, ఎంపీ గురుమూర్తి, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుఅనంతరం ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి వెళ్లనున్న వైఎస్ జగన్ఇటీవల మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిని ధ్వంసం చేసిన టీడీపీ గూండాలు👉నెల్లూరు చేరుకున్న వైఎస్ జగన్హెలిప్యాడ్ వద్ద పోలీసుల ఓవరాక్షన్హెలిప్యాడ్ దగ్గర జనాన్ని తరిమేస్తున్న పోలీసులుపొలాల గట్ల మీద నుంచి తరలివచ్చిన కార్యకర్తలుహెలిప్యాడ్ దగ్గర అనుమతి లేదంటూ తరిమేసిన పోలీసులుఅక్రమ కేసుల్లో నెల్లూరు జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్దన్రెడ్డికాకాణితో వైఎస్ జగన్ ములాఖత్టీడీపీ గుండాల దాడి నుంచి తప్పించుకున్న మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిప్రసన్నకుమార్ రెడ్డి ఇల్లు ధ్వంసం చేసిన పచ్చ మూకప్రసన్న కుమార్‌ను, ఆయన సభ్యులను పరామర్శించనున్న వైఎస్ జగన్👉నెల్లూరు నగరం అష్ట దిగ్బంధం.. అణువణువునా ఆంక్షల వలయంగుంటూరు రేంజ్ తిరుపతి రేంజ్ నుంచి భారీగా పోలీసు బలగాలుచెవుడుగుంట జైలు నుంచి సుజాతనగర్‌లోని మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి ఇంటి వరకు భారీగా పోలీసు బలగాలుఅడుగడుగునా బారీకేడ్లు, ముళ్లకంచెలుఅయ్యప్ప గుడి నుంచి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మీదుగా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ ఇంటికి రానున్న వైఎస్ జగన్మెయిన్రోడ్డులోకి జనం రాకుండా ప్రతి సందుల్లో ముళ్లకంచెలు, భారీ కేట్లు ఏర్పాటుపోలీసుల తీరుపై నగరవాసుల అసహనంరోజువారి కార్యక్రమాలకు, పనులకు వెళ్లనీయకుండా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారంటూ జనం ఆగ్రహంనల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి నివాసానికి వెళ్లే కార్నర్లో ఉద్రిక్తతతన ఇంటి వైపు కార్యకర్తలు రానీయకుండా పోలీసులు అడ్డుకోవడంపై నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి ఆగ్రహంఅక్కడే నిలబడి నిరసన తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి👉మరికాసేపట్లో నెల్లూరుకు వైఎస్ జగన్‌మరికాసేపట్లో నెల్లూరుకు చేరుకోనున్న వైఎస్ జగన్అక్రమ కేసులలో నెల్లూరు జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్దన్రెడ్డికాకాణితో వైఎస్ జగన్ ములాఖత్టీడీపీ గుండాల దాడి నుంచి తప్పించుకున్న మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిప్రసన్నకుమార్ రెడ్డి ఇల్లు ధ్వంసం చేసిన పచ్చ మూకప్రసన్న కుమార్‌ను, ఆయన సభ్యులను పరామర్శించనున్న వైఎస్ జగన్👉జగన్ నెల్లూరు పర్యటనపై కూటమి సర్కార్ ఆంక్షలుమూడు వేలమందికి పైగా పోలీసుల మోహరింపుప్రజలు, వైసీపీ శ్రేణులు, అభిమానులు రాకుండా రోడ్లు తవ్వేసిన అధికారులు ఎటు చూసినా ముళ్ల కంచెలు, బారికేడ్లునెల్లూరు జైలు వద్దకు జగన్‌తో పాటు కేవలం 10 మందికే అనుమతికోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ ఇంటి వద్ద 100 మందికి మించి ఉండకూడదని ఆంక్షలు113 మందికి మించి ఉంచితే కేసులు పెడతామని వార్నింగ్👉 నెల్లూరులో మీడియాపై పోలీసుల దౌర్జన్యంమీడియాపైనా పోలీసుల ఆంక్షలుమీడియా ప్రతినిధులను అడ్డుకుంటున్న పోలీసులు కవరేజ్‌కు అనుమతి లేదంటూ రిపోర్టర్లను నెట్టేస్తున్న పోలీసులు👉రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ: సీదిరి అప్పలరాజురోడ్లను తవ్వడం దారుణంరాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది👉 నెల్లూరు సెంట్రల్ జైలు సమీపంలో పోలీసులు ఓవరాక్షన్వైఎస్సార్సీపీ కార్యకర్తలను చెదరగొడుతున్న పోలీసులునెల్లూరు సెంట్రల్ జైలు వద్ద మీడియాపైనా ఆంక్షలురోడ్డుకు అడ్డంగా ముళ్ల కంచెలు వేసిన పోలీసులుస్వచ్ఛందంగా వస్తున్న ప్రజలను అడ్డుకుంటున్న పోలీసులుఆర్టీసీ బస్సులను నిలిపి ప్రయాణికులను ప్రశ్నిస్తున్న పోలీసులు👉 నెల్లూరులో ఆంక్షలు పెట్టడం దారుణం: అంబటి రాంబాబుస్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇలాంటి ఆంక్షలు ఎప్పుడూ లేదుప్రభుత్వమే రోడ్లను తవ్వేస్తోందిరోడ్ల తవ్వడమేంటి? ఇదేమైనా యుద్ధ భూమా?ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది👉నెల్లూరు బయలుదేరిన వైఎస్ జగన్‌కాసేపట్లో కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పరామర్శించనున్న జగన్అనంతరం టీడీపీ గూండాలు ధ్వంసం చేసిన ప్రసన్న కుమార్‌రెడ్డి నివాసానికి వెళ్లనున్న జగన్👉వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై కొనసాగుతున్న పోలీస్ ఆంక్షలుజగన్ ప్రయాణించే రూట్స్ లో భారీగా సీసీ కెమెరాలు ఏర్పాటుస్వచ్ఛందంగా వచ్చే ప్రజలను, వైఎస్సార్సీపీ కార్యకర్తలను గుర్తించడమే టార్గెట్సీసీ కెమెరా రికార్డు అయిన వ్యక్తులపై కేసులు నమోదుకు ప్రయత్నాలువైఎస్ జగన్ పర్యటనలో జనాన్ని అడ్డుకోవడానికి కుట్రలునడక దారిలో రాకుండా జేసీబీలతో రోడ్లు తవ్వేస్తున్న పోలీసులుబైకులు, నడక ద్వారా జనం రాకుండా అడ్డుకోవడానికి కుయుక్తులుఇనుప కంచెలు, బారికేడ్లతో సిటీలోకి వచ్చే రోడ్లను బ్లాక్ చేస్తున్న పోలీసులు👉వైఎస్ జగన్ పర్యటనకు అడ్డంకులు.. చంద్రబాబు సర్కార్ కుట్రలువైఎస్ జగన్ పర్యటనకు అడ్డంకులు సృష్టించడమే చంద్రబాబు సర్కార్ ప్రధాన ఏజెండానగరంలోని ప్రధాన రహదారులు, కూడళ్లలో చెక్ పోస్టులు ఏర్పాటుచెన్నై-కోల్ కతా హైవేలో సైతం తనిఖీలువైఎస్ జగన్ పర్యటనకు స్వచ్ఛందంగా వస్తున్న ప్రజలను అడ్డుకుంటున్న పోలీసులుఆర్టీసీ బస్సులను సైతం నిలిపి ప్రయాణికులను ప్రశ్నిస్తున్న పోలీసులుఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులకు నోటీసులిచ్చిన పోలీస్ శాఖవార్డు లీడర్స్ దగ్గర నుండి మాజీ మంత్రుల వరకూ నోటీసులుజగన్ పర్యటనకు జన సమీకరణ చేయకూడదు అంటూ హెచ్చరికలునిబంధన ఉల్లంఘిస్తే కేసులు తప్పవంటూ బెదిరింపులుపోలీస్ శాఖను అడ్డం పెట్టుకుని కుట్రలకు దిగుతున్న చంద్రబాబు సర్కార్👉మాజీ సీఎం జగన్ నెల్లూరు పర్యటనకు భారీగా నిర్భంధనలుస్వచ్ఛందంగా వచ్చే ప్రజలను, అభిమానులను అడ్డుకోవడానికి వ్యూహంభారీగా పోలిసుల మోహరింపు, పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటుప్రధాన కూడళ్ల దగ్గర నుండి చిన్న సర్కిల్స్ వరకూ అన్నింటా చెక్ పోస్టులుపోలీస్ శాఖను అడ్డుపెట్టుకొని కుట్రలకు పూనుకున్న చంద్రబాబు సర్కార్👉నేడు వైఎస్ జగన్ పర్యటన ఇలా..మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం జిల్లాకు రానున్నారు. అక్రమ కేసులతో జిల్లా కేంద్ర కారాగారం రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో ములాఖత్ అవుతారు. అక్కడి నుంచి సుజాతమ్మ కాలనీలో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.ఉదయం 9.15 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో నెల్లూరు బయలు దేరుతారు10.40 గంటలకు జిల్లా డీటీసీ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు11 గంటలకు జిల్లా కేంద్ర కారాగారానికి చేరుకుని కాకాణి గోవర్ధన్‌రెడ్డితో ములాఖాత్11.30 గంటలకు రోడ్డుమార్గాన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి బయలుదేరుతారు11.50 గంటలకు చేరుకుని ప్రసన్నకుమార్‌రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారుమధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి 1.15 గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకుంటారు1.25 గంటలకు హెలిప్యాడ్ నుంచి బెంగళూరు బయలు దేరుతారు.వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటనకు పోలీసులు భారీ ఆంక్షలు విధించారు. భద్రత పేరిట ఆ పార్టీ శ్రేణులు, ప్రజలను కట్టడి చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. జన సమీకరణ చేసినా, ర్యాలీలు నిర్వహించినా చర్యలు తప్పవంటూ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ప్రధాన నాయకులందరికీ పోలీసు అధికారులు నోటీసులు జారీ చేశారు. జగన్ పర్యటనలో పాల్గొనడానికి ఎవరికీ అనుమతి లేదని, అందువల్ల ఎవరూ వెళ్లరాదని, ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రెస్మీట్లు పెట్టి మరీ ప్రజలను హెచ్చరించారు. పోలీసులు మరీ ఇంతగా ఆంక్షలు విధించడంపై ప్రజలు మండి పడుతున్నారు. వైఎస్ జగన్ గురువారం (నేడు) నెల్లూరులో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు చెముడుగుంట డీటీసీ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి జిల్లా కేంద్ర కారాగారం వద్దకు వెళతారు. రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో ములాఖత్ అవుతారు. అనంతరం నగరంలోని సుజాతమ్మ కాలనీలో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.వైఎస్ జగన్‌కు రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతుండటం, ఆయన రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి అభిమానాన్ని చాటుకుంటుండడం చూసి ఓర్వలేని కూటమి నేతలు పోలీసుల ద్వారా జగన్ పర్యటనలకు భారీగా ఆంక్షలు విధిస్తున్నారు. అయితే ఆంక్షలు తమకు అడ్డంకులు కావంటూ పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు పోటెత్తుతున్నారు. నెల్లూరు పర్యటనకు సైతం భారీగా వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు వచ్చే అవకాశం ఉందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో పోలీసులు ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. హెలిప్యాడ్ వద్ద 10 మంది, ములాఖత్‌కు ముగ్గురికి మాత్రమే అనుమతులిచ్చారు. వారు మినహా ఇతరులెవరూ కేంద్ర కారాగారం వద్దకు రావొద్దని, వస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. కేంద్ర కారాగారానికి వచ్చే అన్ని రహదారులను బారికేడ్లతో మూసివేసి, భారీగా పోలీసులను మోహరిస్తున్నారు. -
అడుగడుగునా బారికేడ్లు, చెక్‌పోస్టులు
నెల్లూరు (క్రైమ్): వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటనకు పోలీసులు భారీ ఆంక్షలు విధించారు. భద్రత పేరిట ఆ పార్టీ శ్రేణులు, ప్రజలను కట్టడి చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. జన సమీకరణ చేసినా, ర్యాలీలు నిర్వహించినా చర్యలు తప్పవంటూ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ప్రధాన నాయకులందరికీ పోలీసు అధికారులు నోటీసులు జారీ చేశారు. జగన్ పర్యటనలో పాల్గొనడానికి ఎవరికీ అనుమతి లేదని, అందువల్ల ఎవరూ వెళ్లరాదని, ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రెస్మీట్లు పెట్టి మరీ ప్రజలను హెచ్చరించారు. పోలీసులు మరీ ఇంతగా ఆంక్షలు విధించడంపై ప్రజలు మండి పడుతున్నారు. వైఎస్ జగన్ గురువారం (నేడు) నెల్లూరులో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు చెముడుగుంట డీటీసీ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి జిల్లా కేంద్ర కారాగారం వద్దకు వెళతారు. రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో ములాఖత్ అవుతారు. అనంతరం నగరంలోని సుజాతమ్మ కాలనీలో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. రహదారుల దిగ్బంధం వైఎస్ జగన్‌కు రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతుండటం, ఆయన రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి అభిమానాన్ని చాటుకుంటుండడం చూసి ఓర్వలేని కూటమి నేతలు పోలీసుల ద్వారా జగన్ పర్యటనలకు భారీగా ఆంక్షలు విధిస్తున్నారు. అయితే ఆంక్షలు తమకు అడ్డంకులు కావంటూ పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు పోటెత్తుతున్నారు. నెల్లూరు పర్యటనకు సైతం భారీగా వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు వచ్చే అవకాశం ఉందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో పోలీసులు ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. హెలిప్యాడ్ వద్ద 10 మంది, ములాఖత్‌కు ముగ్గురికి మాత్రమే అనుమతులిచ్చారు. వారు మినహా ఇతరులెవరూ కేంద్ర కారాగారం వద్దకు రావొద్దని, వస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. కేంద్ర కారాగారానికి వచ్చే అన్ని రహదారులను బారికేడ్లతో మూసివేసి, భారీగా పోలీసులను మోహరిస్తున్నారు. కారాగారం చుట్టూ ముళ్ల కంచె ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారం సాయంత్రం హెలిప్యాడ్ నుంచి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటి వరకు ట్రయల్ కాన్వాయ్ జరిగింది. ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి 100 మందికి మాత్రమే అనుమతిచ్చారు. ములాఖాత్ అనంతరం చెముడుగుంట, బుజబుజనెల్లూరు జాతీయ రహదారి, అయ్యప్పగుడి మీదుగా జగన్ ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి వెళతారు. దీంతో ఆయా ప్రాంతాలను పోలీసు అధికారులు తమ ఆ«దీనంలోకి తీసుకున్నారు. ప్రధాన కూడళ్ల వద్ద పోలీసు బలగాలను మోహరించారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. జగన్ పర్యటించే ప్రాంతంలో 10 డ్రోన్లు, 40 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశారు. ఇదంతా ఆంక్షల ఉల్లంఘనలపై కేసులు నమోదు చేసేందుకేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, నగరంలో ఏర్పాట్లు చూస్తున్న ప్రజలు.. వైఎస్ జగన్ వస్తుంటే ప్రభుత్వానికి ఎందుకింత భయం అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
వైఎస్ జగన్ పర్యటనలంటే కూటమికి భయమెందుకో?
సాక్షి,నెల్లూరు: వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలంటే కూటమికి భయమెందుకు? అని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన వేళ చంద్రబాబు సర్కార్ విధిస్తున్న ఆంక్షలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్ జగన్ పర్యటనలంటే కూటమికి భయమెందుకు?. జగన్‌కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకపోతున్నారు. కూటమి సర్కార్ ప్రజల సంక్షేమాన్ని ఎప్పుడో వదిలేసింది.ప్రజలను వదిలేసి సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు పోరాటాలు కొత్త కాదు. రేపు నెల్లూరు జిల్లా నలుమూలల నుంచి జనం తరలి వస్తారు. ప్రజాభిమానాన్ని ఆపాలంటే కొత్త జైళ్లు కట్టుకోండి. ప్రజల హక్కులను కాలరాసే అధికారం పోలీసులకు లేదు. నాయకుడికి మద్దతు తెలపడం ప్రజల హక్కు. ఇబ్బంది పెట్టినవారెవరనీ వదిలి పెట్టే ప్రసక్తే లేదు’ అని స్పష్టం చేశారు. -
వైఎస్ జగన్ పర్యటనకు వెళ్లకుండా చెక్ పోస్ట్ లు ఏర్పాటు
-
వైఎస్ జగన్‌ను అడ్డుకునే ప్రయత్నం చేస్తే ప్రజా ప్రళయాన్ని చూస్తారు
-
జగన్ నెల్లూరు పర్యటనపై ఆంక్షలను ఖండిస్తూ నిరసన
-
ప్రియుడిని ఇంటికి పిలిచి ..?
నెల్లూరు జిల్లా: వివాహేతర సంబంధాలతో పచ్చని కాపురాన్ని నాశనం చేసుకుంటున్నారు కొంతమంది దంపతులు. ఈ వివాహేతర సంబంధలు చివరకు హత్యలకు దారితీస్తున్నాయి. తాజాగా నెల్లూరులో మరో దారుణం చోటు చేసుకోంది. ప్రియుడిని ఇంటికి పిలిచి మరీ హత్య చేసింది ప్రియురాలు.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తరుణ్ తేజ్ అనే వ్యక్తికి ప్రవళికతో పెళ్లి కాగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే తరుణ్‌కు మాధవి అనే మరో మహిళతో పరిచయం ఏర్పడగా అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.ప్రవళిక సంచలన ఆరోపణలుఅయితే ఎప్పటిలాగే మాధవి ప్రియుడు తరుణ్ తేజ్‌ని ఇంటికి పిలిచింది. కానీ అదే ఇంట్లో తరుణ్ తేజ్ హత్యకు గురయ్యాడు. మార్చురీ వద్ద ప్రవళ్లిక మీడియాతో మాట్లాడుతూ తరుణ్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదన్నారు. అతడిని స్నేహితురాలే హత్య చేసి కప్పిపుచ్చేందుకు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారం చేస్తున్నట్లు ఆరోపించారు. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
నెల్లూరు అష్టదిగ్బంధం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటన నేపథ్యంలో నగరాన్ని అష్టదిగ్బంధం చేస్తూ సెక్షన్–30 పోలీసు యాక్ట్ అమలు చేస్తున్నారు. వైఎస్ జగన్ హెలికాప్టర్ వద్దకు 10 మందిని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు ప్రకటించారు. ఆయన కాన్వాయ్‌లో కేవలం మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉందని తెలిపారు. మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో ములాఖత్‌కు వైఎస్ జగన్ సహా కేవలం ముగ్గురికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు వెల్లడించారు. మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి 100 మందినే అనుమతిస్తామని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ నేపథ్యంలో అడుగడుగునా అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలు చూసి ప్రజలు విస్తుపోతున్నారు. ప్రజలు వచి్చనా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడంపైనా జనం తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రజల్లోకి వస్తుంటే ప్రభుత్వానికి అంత ఉలుకెందుకని చర్చించుకుంటున్నారు. ఆంక్షలు మరింత కఠినతరం ఈనెల 31న గురువారం వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు రానుండటంతో పోలీసులు ఆంక్షల్ని మరింత కఠినతరం చేశారు. నెల్లూరు నగరంలో ఇప్పటికే సెక్షన్–30 పోలీసు యాక్ట్ అమల్లోకి తెచ్చారు. జనసమీకరణ చేయరాదని, రోడ్డుషోలు, ర్యాలీలు, బహిరంగ సమావేశాలు నిర్వహించకూడదంటూ ఆంక్షలు విధించారు. ఫ్లకార్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదని వైఎస్సార్సీపీ శ్రేణులకు ఇప్పటికే స్పష్టం చేశారు. నిబంధనల్ని అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలకు సైతం ఎలాంటి అనుమతులు లేవని, వస్తే కేసులు తప్పవని హెచ్చరిస్తున్నారు. నెల్లూరు నగరంలోకి వచ్చే అన్నీ మార్గాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలను సైతం హౌస్ అరెస్ట్ చేస్తారన్న ప్రచారం సాగుతోంది. పోలీసుల చర్యలపై ప్రజల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జననేతను కనీసం చూసేందుకు కూడా అనుమతి ఇవ్వకపోవడంతో కూటమి సర్కారు తీరుపై జనం అసహనం వ్యక్తం చేస్తున్నారు. హెలిప్యాడ్ వద్దకు 10 మందికే అనుమతి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 31న ఉదయం 10–10.30 గంటల మధ్య హెలికాప్టర్లో చెముడుగుంట డీటీసీ సమీపంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్రమ కేసుల నేపథ్యంలో జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో ములాఖత్ అవుతారు. జగన్మోహన్రెడ్డిని చూసేందుకు ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో వారిని అడ్డుకునేందుకు కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.హెలిప్యాడ్ వద్ద కేవలం 10 మంది వైఎస్సార్సీపీ నేతలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ములాఖత్‌కు కేవలం ముగ్గురిని మాత్రమే అనుమతించారు. జగన్మోహన్రెడ్డి కాన్వాయ్‌లో మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ములాఖత్ అనంతరం జగన్మోహన్రెడ్డి రోడ్డు మార్గంలో సుజాతమ్మ కాలనీలోని మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి వెళతారు. అక్కడ వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అక్కడ 100 మందికి అనుమతించారు. ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులు రాకుండా అటువైపు వెళ్లే అన్నీ రహదారుల్లో బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. హాస్పిటల్ వద్ద నుంచి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. భద్రత పేరిట ఆంక్షలు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉంది. అందుకు తగిన విధంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారు. రోప్ పార్టీలు, క్యూఆర్ టీమ్‌లు ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్న పోలీసులు వైఎస్ జగన్‌కి భద్రత కల్పించకుండా.. కేవలం ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులు రాకుండా అడ్డుకునే పనిలో నిమగ్నమయ్యారు. నగరం నలువైపులా అష్ట దిగ్బంధం చేయాలని నిర్ణయించారు. నేషనల్ హైవేపైనా వాహనాల తనిఖీకి చర్యలు చేపట్టారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు: ఇన్చార్జి ఎస్పీ వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఇన్చార్జి ఎస్పీ ఏఆర్ దామోదర్ మంగళవారం వెల్లడించారు. భద్రతాపరంగా తీసుకుంటున్న చర్యలు, ముందస్తు అనుమతులు, ఆంక్షలను మీడియాకు వెల్లడించారు. హెలిప్యాడ్ వద్ద 10 మందిని, ములాఖత్‌కు ముగ్గురిని, ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి 100 మందిని మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. నగరంలో సెక్షన్–30 పోలీసు యాక్ట్ అమల్లో ఉన్న దృష్ట్యా ఊరేగింపులు, సభలు, సమావేశాలకు ఎలాంటి అనుమతి లేదన్నారు. -
వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు
-
జగన్ నెల్లూరు పర్యటనపైనా ఆంక్షలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఈనెల 31న వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటనకు షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో పోలీసులు మరోమారు కఠిన ఆంక్షలు విధించారు. ఆయన పర్యటనలో ప్రజాభిమానాన్ని అడ్డుకునేందుకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించాలని కుట్రలు పన్నుతున్నారు. హెలిప్యాడ్ వద్దకు కేవలం పది మందిని మాత్రమే అనుమతిస్తామని, ర్యాలీగా వెళ్లొద్దని, అభిమానులు తరలిరావడానికి వీల్లేదంటూ వివిధ ఆంక్షలతో వైఎస్సార్సీపీ నేతలకు పోలీసులు నోటీసులిచ్చారు. ఈ ఆంక్షలపై వైఎస్సార్సీపీ శ్రేణులు మండిపడుతున్నారు.మాజీమంత్రి కాకాణితో ములాఖత్.. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సర్కారు వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీమంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిపై దాదాపు 13 అక్రమ కేసులు బనాయించి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైఎస్ జగన్ కాకాణితో ములాఖత్ కానున్నారు. అక్కడ నుంచి.. టీడీపీ రౌడీమూకలు ఇటీవల ధ్వంసం చేసిన మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి వెళ్తారు.ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. ఈ మేరకు వైఎస్ జగన్ పర్యటన ఖరారు కావడంతో పోలీసులు ఆయన పర్యటనలో ప్రజాభిమానాన్ని అడ్డుకునేందుకు కఠినమైన ఆంక్షలు విధిస్తూ ఇప్పటికే వైఎస్సార్సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డికి రెండు నోటీసులు అందించారు.హెలిప్యాడ్ వద్దకు పది మందే వెళ్లాలంట..ఇక వెంకటాచలం మండలం చెముడుగుంటలోని సెంట్రల్ జైలుకు సమీపంలో పోలీసులు అనుమతిచ్చిన హెలిప్యాడ్ వద్దకు కేవలం పదిమంది మాత్రమే వెళ్లాలని, అంతకుమించి ఎవరూ వెళ్లకూడదని పోలీసులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అలాగే, జైలు ఆవరణలోకి ఎవరూ రాకూడదని, కేవలం ముగ్గురితోనే వెళ్లి కాకాణితో ములాఖత్ కావాలని స్పష్టంచేశారు.అక్కడ నుంచి రోడ్డు మార్గంలో నెల్లూరులోని ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి కేవలం మూడు వాహనాల్లోనే వెళ్లాలని ఈనెల 27న నోటీసు ఇ చ్చిన పోలీసులు సోమవారం దానిని సవరించి 15 వాహనాలతో వెళ్లొచ్చని మరో నోటీసు జారీచేశారు. అయితే, ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటి వద్దకు ఎవరూ వెళ్లకూడదని, ఒక్క వైఎస్ జగన్ మాత్రమే వెళ్లాలంటూ నోటీసులు ఇవ్వడంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది.గతంలో హెలిప్యాడ్‌కు అనుమతి ఇవ్వకుండా.. నిజానికి.. ఈనెల 3న వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటన ఖరారైనప్పటికీ హెలిప్యాడ్‌కు స్థల అనుమతులు కూడా ఇవ్వకుండా టీడీపీ కూటమి నేతలు అడ్డంకులు సృష్టించారు. ప్రైవేటు స్థలంలో హెలికాప్టర్ దిగేందుకు స్థల యజమాని ఒప్పుకున్నా.. కూటమి నేతలు వారిని భయపెట్టి స్థలం ఇవ్వనీయకుండా అడ్డుకున్నారు.పోలీసులు సైతం హెలిప్యాడ్‌కు అనుమతులివ్వకుండా ఇబ్బందిపెట్టారు. ఈ నేపథ్యంలో.. స్థానిక ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి హెలిప్యాడ్‌ను అనుమతివ్వాలని న్యాయస్థానానికి వెళ్లడంతో అప్పట్లో జగన్ పర్యటన వాయిదా పడింది. ఈసారి ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పర్యటన ఆపేదిలేదని తెగేసి చెప్పడంతో పోలీసులు కఠినమైన ఆంక్షలు పెట్టి అనుమతులిచ్చారు.ప్రజాభిమానాన్ని అడ్డుకునేందుకే.. ఇదిలా ఉంటే.. ఏడాదిలోనే టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత వెల్లువెత్తుతోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డిని గెలిపించకుండా తప్పుచేశామన్న భావన ప్రజల్లో బలంగా ఏర్పడడంతో ఆయన ఎక్కడకెళ్లినా ప్రజలు స్వచ్ఛందంగా తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఊహించని స్థాయిలో జనం రావడాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం జీర్ణించుకోలేకే ఆ ప్రజాభిమానాన్ని అడ్డుకునేందుకు జగన్ పర్యటనలకు ఇలా ఆంక్షలు విధిస్తూ.. కుట్రలు పన్నుతోంది. -
నెల్లూరులో జనసేన రౌడీమూకల అరాచకం
నెల్లూరు సిటీ: కూటమి నేతల అరాచకాలకు అంతేలేకుండా పోతోంది. రౌడీమూకలు పేట్రేగిపోతున్నాయి. ఫలితంగా సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. తాజాగా శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ నియోజకవర్గం శ్రామికనగర్లో జనసేన గూండాలు సోమవారం అరాచకం సృష్టించారు. తినీతినక రూపాయిరూపాయి పోగేసి సామాన్యులు కట్టుకున్న ఇళ్లను యంత్రాలు తీసుకొచ్చి మరీ నిర్ధాక్షిణ్యంగా కూల్చివేశారు. వివరాల్లోకి వెళ్తే శ్రామికనగర్లో 3.9 ఎకరాల స్థలంలో బెల్లంకొండ తిరుపాల్ అనే వ్యక్తి ఎకరన్నరం పొలంలో లేవుట్ వేశారు.అప్పట్లో 10 మంది భూమిని విభజించుకుని కొన్నారు. ఆ తర్వాత పేద, మధ్య తరగతి ప్రజలు 40 మంది వరకు ఆ లేఅవుట్లోని ప్లాట్లను కొని రిజి్రస్టేషన్లూ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆ స్థలాల విలువ భారీగా పెరిగింది. ఈ క్రమంలో కూటమి అధికారంలోకి వచ్చాక జనసేన పార్టీ మీడియా చైర్మన్, ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్‌కుమార్, మరో ఐదుగురు ఈ లేఅవుట్ వేసిన భూమి తమదంటూ హద్దురాళ్లు ఏర్పాటు చేసే యత్నం చేశారు. ప్లాట్ల యజమానులు కోర్టుకు వెళ్లడంతో ఆ తర్వాత మిన్నకుండిపోయారు.ఈ క్రమంలో రెండుమూడు నెలలుగా దశలవారీగా అర్ధరాత్రుళ్లు నిర్మాణ దశలో ఉన్న నాలుగు ఇళ్లను దుండగులు కూల్చేశారు. ఎవరి పనో తెలీక నిర్మాణదారులు అయోమయపడ్డారు. ఈ నేపథ్యంలో సోమవారం జనసేన గూండాలు పేట్రేగిపోయారు. జనసేన నేత నూనె మల్లికార్జున్‌యాదవ్ కుమారుడు తన అనుచరులు, రౌడీమూకలు, యంత్రాలతో వచ్చి లేఅవుట్లో వేసిన మరో మూడు ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడానికి సిద్ధమయ్యారు. సమాచారం తెలుసుకున్న ప్లాట్ల యజమానులు అక్కడికి చేరుకుని కూల్చివేతలను అడ్డుకున్నారు.112 ద్వారా కంట్రోల్‌రూం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి కూల్చివేతలను ఆపాలని ముక్తసరిగా చెప్పి వెళ్లిపోయారు. పోలీసులు వెళ్లిన గంట తర్వాత జనసేన రౌడీలు మూడు ఇళ్లను నేలమట్టం చేశారు. అంతటితో ఆగకుండా రోడ్డునూ మూసివేస్తూ అప్పటికప్పుడు గోడ కట్టేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు లేఅవుట్లోనే కాపుగాశారు. అక్కడే మద్యం తాగుతూ హల్చల్ చేసి స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు. అయితే బాధితులు ఎస్పీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయడంతో సీఐ తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. పోలీసులు రాగానే రౌడీమూకలు గోడలు దూకి పరారయ్యారు. ప్రధాన పాత్ర వహించిన కొందరిని పోలీసులు వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
నెల్లూరు మున్సిపల్ కార్మికులపై పోలీసుల ఓవర్ యాక్షన్..
-
బాలాజీ ఫౌండేషన్ దాతృత్వం
హైదారాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బాలాజీ ఫౌండేషన్ మరోసారి దాతృత్వాన్ని చాటుకుంది. నెల్లూరు ఆర్టీసీ ప్రధాన బస్టాండులో ప్రయాణికుల సౌకర్యార్థం రూ.10 లక్షలు వెచ్చించి మినరల్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ మాట్లాడుతూ... నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే బస్టాండులో తాగునీటి సదుపాయం కల్పించడం అభినందనీయమన్నారు. బాలాజీ ఫౌండేషన్ వ్యాపారంతో పాటు సేవారంగంలోనూ మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. తన తండ్రి బాలాజీ చౌదరి నెల్లూరు నుంచే తన వ్యాపార ప్రస్థానాన్ని ప్రారంభించారని, అలాంటి ప్రాంతంలో బాలాజీ ఫౌండేషన్ సేవలు అందించడం ఎంతో సంతోషంగా ఉందని బీ న్యూ మొబైల్స్ అండ్ ఎల్రక్టానిక్స్’, బాలాజీ సంస్థ సీవోఈ సాయి నిఖిలేష్ తెలిపారు. -
మాజీ మంత్రి అనిల్‌కు పోలీసుల నోటీసులు
సాక్షి, నెల్లూరు: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో వైఎస్సార్సీపీ నేతలే టార్గెట్‌గా అక్రమ కేసుల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. రెడ్‌బుక్ రాజ్యాంగంలో భాగంగా ఇప్పటికే పలువురు వైఎస్సార్సీపీ నేతలను వేధింపులకు గురి చేస్తూ అక్రమ కేసులు పెట్టారు. ఇక, తాజాగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆయన ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు.వివరాల ప్రకారం.. టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా తాజాగా మాజీమంత్రి అనిల్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే, కొవ్వూరులో వైఎస్సార్సీపీ సమావేశంలో పాల్గొన్నందుకు, ప్రశాంతి రెడ్డి ఎపిసోడ్‌పై అనిల్ కుమార్ మాట్లాడినందుకు గానూ.. ఆయనకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఈ క్రమంలో అనిల్ కుమార్ యాదవ్ ఇంటికి పోలీసులు వెళ్లారు.. ఈ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. కాగా, ఎల్లుండి విచారణకు రావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, పార్టీ సమావేశంలో పాల్గొన్నందుకు పోలీసులు నోటీసులు ఇవ్వడంపై ప్రజలు విస్తుపోతున్నారు. -
ఇల్లరికం అల్లుడు.. అత్తను చంపేశాడు
తిరుపతి జిల్లా: తల్లిదండ్రులు లేని వ్యక్తికి కూతురిని ఇచ్చి ఇల్లరికం తెచ్చుకుని కొడుకుతో సమానంగా చూస్తున్న అత్తనే అల్లుడు హతమార్చాడు. ఈ ఘటన తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలోని తుమ్మూరులో బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని అయ్యప్పరెడ్డిపాళేనికి చెందిన సగటూరు చెంగమ్మ(47) మూడో కుమార్తె స్వాతిని పండ్లూరుకి చెందిన బోడెద్దుల వెంకయ్యకు ఇచ్చి వివాహం చేసింది. ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసే వెంకయ్యను చెంగమ్మ ఇల్లరికం పెట్టుకుని కుమార్తెతో కలిసి ఉంటోంది. వెంకయ్యకు మూడేళ్ల కుమార్తె కూడా ఉంది. వెంకయ్యకు మూడు నెలల క్రితం కొన్ని వ్యాధులు సోకడంతో ఇంటి నుంచి పంపించేశారు. అయితే అల్లుడికి అన్ని విధాలుగా అత్త సహాయ సహకారాలు అందిస్తోంది. భార్యతో కాపురం చేయనివ్వడం లేదని కక్ష పెట్టుకున్న వెంకయ్య.. మంగళవారం మధ్యాహ్నం చెంగమ్మకు ఫోన్‌చేసి మాట్లాడాలని రమ్మన్నాడు. నెల్లూరు నుంచి వస్తున్న చెంగమ్మ స్వర్ణముఖి బ్రిడ్జి సమీపంలో అల్లుడితో మాట్లాడేందుకు దిగింది. అత్త మీద కోపంగా ఉన్న వెంకయ్య ఒక్కసారిగా కత్తితో ఆమెపై విచక్షణారహితంగా గొంతు కోసి కిరాతకంగా హత్య చేశాడు. ఎవరూ గుర్తించకుండా ఆమెను స్వర్ణముఖి నది కట్టమీద నుంచి కిందకు తోసేశాడు. మంగళవారం రాత్రి ఆమెను నదిలో పూడ్చిపెట్టి ఏమీ తెలియనట్టు బుధవారం ఉదయం అయ్యప్పరెడ్డిపాళేనికి వెళ్లాడు. అనుమానం వచి్చన గ్రామస్తులు వెంకయ్యను నిలదీయడంతో చెంగమ్మను హత్య చేసినట్లుగా ఒప్పుకున్నాడు. నాయుడుపేట పోలీసులు వెంకయ్యను అదుపులోకి తీసుకుని విచారించారు. అత్త మృతదేహాన్ని స్వర్ణముఖి బ్రిడ్జి సమీపంలో నదిలో పూడ్చిపెట్టినట్లుగా పోలీసులకు వివరించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. బుధవారం సాయంత్రం మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
టీడీపీ ఎమ్మెల్యేల దౌర్జన్యం.. ఎమ్మెల్సీ తూమాటిపై దాడికి యత్నం
నెల్లూరు (పొగతోట): రామాయపట్నం పోర్టు పరిధిలో కూటమి ప్రభుత్వం బలవంతంగా చేపడుతున్న భూ సేకరణపై జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ(డీడీఆర్సీ) సమావేశంలో నిలదీసిన ఎమ్మెల్సీ తూమాటి మాధవరావుపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు దూకుడుగా వ్యవహరించారు. ఆయన ప్రసంగాన్ని అడ్డుకుంటూ వేలు చూపిస్తూ ఆగ్రహంతో రగిలిపోయారు. ఒక దశలో దాడి చేసే యత్నం చేశారు. ఈ ఘటన ముగ్గురు మంత్రులు మహ్మద్ ఫరూఖ్, ఆనం రామనారాయణరెడ్డి, నారాయణ, కలెక్టర్, జిల్లా అధికార యంత్రాంగం సమక్షంలోనే బుధవారం ఈ ఘటన జరిగింది. భూసేకరణపై వివరణ ఇవ్వండి: ఎమ్మెల్సీ తూమాటి వ్యవసాయశాఖపై సమీక్ష జరుగుతున్న సమయంలో ఎమ్మెల్సీ మాధవరావు భూ సేకరణపై చర్చకు పట్టుబట్టారు. జూలై 13న రామాయపట్నం పోర్టుకు 20 వేల ఎకరాల భూసేకరణకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నామంటూ ప్రభుత్వం జీఓ ఇచి్చందని, 20 వేలు ఎకరాలు ఏ ప్రాంతంలో సేకరిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికే కరేడులో భూ సేకరణను ప్రజలు పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తున్నారని గుర్తుచేశారు. 5 వేల ఎకరాలు సరిపడే పరిశ్రమకు 8,300 ఎకరాలకు పైగా సేకరిస్తున్నారని, దీనివల్ల 5 వేల కుటుంబాలు ఉపాధి కోల్పోయే అవకాశం ఉందన్నారు. వాగ్వాదానికి దిగిన కందుకూరు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ తూమాటి మాట్లాడుతుంటే కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సభా మర్యాదను పాటించకుండానే వాగ్వాదానికి దిగారు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఎమ్మెల్సీ ప్రభుత్వం ఇచి్చన జీఓకు వివరణ ఇవ్వాలంటూ పట్టుబట్టారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, దగమాటి కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎమ్మెల్సీపైకి దూసుకువచ్చారు. సభావేదికపై ఉన్న ముగ్గురు మంత్రులు కూడా ఎమ్మెల్సీని తప్పుబట్టారు. మంత్రి ఆనం మాట్లాడుతూ ‘‘ఇది అసెంబ్లీ కాదు. ఏదైనా ఉంటే అసెంబ్లీలో చర్చించండి. నీ రాజకీయ అనుభవం నాలుగేళ్లు. నేను 40 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నాను. మాట్లాడకుండా కూర్చోవాలి’ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఎమ్మెల్సీ తూమాటి వాకౌట్ చేసి బయటకు వెళ్లి పోయారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ విలేకరులతో మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, ఒక పరిశ్రమ పేరు చెప్పి బీపీసీఎల్‌కు భూములు కేటాయించేందుకు యత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ విషయంపై ప్రశ్నించినందుకు తనను అవమాన పరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాగళం వినిపిస్తామన్నారు. ఇదిలా ఉంటే ఈ ఘటనను ప్రసారం చేయొద్దంటూ మీడియాను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి బెదిరించారు. -
నెల్లూరులో ఆర్టీసీ బస్సు చోరీ
నెల్లూరు సిటీ/ఆత్మకూరు: నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఓ వ్యక్తి బస్సును చోరీ చేయడంతో దాదాపు రెండు గంటల పాటు ఆర్టీసీ అధికారులు హైరానా పడ్డారు. చివరికి ఫాస్ట్‌ట్యాగ్‌తో బస్సు ఆచూకీ కనుగొన్నారు. వివరాల్లోకి వెళితే.. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు డిపోకు చెందిన బస్సు ఏఎస్‌పేట నుంచి మంగళవారం సాయంత్రం ప్రయాణికులతో బయలుదేరి నైట్ హాల్ట్‌గా నెల్లూరు బస్టాండ్‌కు చేరింది. బుధవారం ఉదయం 5 గంటలకు తిరిగి ఏఎస్‌పేటకు బయలుదేరాల్సి ఉంది. డ్రైవర్, కండెక్టర్ బస్టాండ్‌లోనే నిద్రపోయారు. ఈ క్రమంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి బుధవారం తెల్లవారు జామున బస్సును అపహరించాడు. 4 గంటలకు నిద్రలేచిన కండక్టరు, డ్రైవర్ బస్టాండ్‌లో బస్సు కనిపించకపోవడంతో ఆత్మకూరు, నెల్లూరు డిపో మేనేజర్లకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు టోల్గేట్ల సిబ్బందిని అప్రమత్తం చేశారు. అధికారులు బస్సు ఆచూకీ కోసం ప్రయత్నిస్తుండగా, బుచ్చిరెడ్డిపాళెం టోల్‌ప్లాజా వద్ద సంగం వైపు క్రాస్ అయినట్లు ఫాస్ట్‌ట్యాగ్ మెసేజ్ వచ్చింది. సంగంలో బస్సును ఆపేందుకు ప్రయత్నించగా ఆగలేదు. నెల్లూరుపాళెం సెంటర్ వద్దకు వచ్చిన బస్సును పలువురు చాకచక్యంగా నిలిపి బస్సు నడిపిన వ్యక్తిని పట్టుకుని స్తంభానికి కట్టేశారు. ఆత్మకూరు ఎస్సై ఎస్కే జిలానీకి ఫిర్యాదు చేశారు. బస్సును చోరీ చేసిన వ్యక్తిని విడవలూరు మండలం కంచరపాళెంకు చెందిన కృష్ణగా గుర్తించారు. అతనికి మతిస్థిమితం లేదని తెలిపారు. నెల్లూరు పోలీసులకు, ఆర్టీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. కృష్ణను నెల్లూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్టు ఎస్సై జిలానీ తెలిపారు. -
DRC సమావేశంలో సోమిరెడ్డి ఓవర్ యాక్షన్...
-
కుబేర మూవీ తరహాలో భారీ స్కాం
-
Nellore: బాబుకు చావుదెబ్బ YSRCPలోకి టీడీపీ కార్పొరేటర్
-
ఎమ్మెల్యే వేధింపులు.. టీడీపీ నేత ఆత్మహత్యాయత్నం
-
ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వేధింపు.. టీడీపీ నేత ఆత్మహత్యాయత్నం
సాక్షి,నెల్లూరు: చంద్రబాబు ప్రభుత్వంలో టీడీపీ ఎమ్మెల్యేల వేధింపులు తాళ లేక ఆ పార్టీ నేతలు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా, టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి వేధింపుల్ని భరించలేక జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శి ఇమామ్ భాషా ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం రేపింది. కోవూరు నియోజకవర్గంలోనీ విడవలూరు మండలం ముదువర్తి గ్రామ పార్టీ కార్యాలయంలో ఇమామ్ భాషా మీడియాతో మాట్లాడారు. ప్రశాంతి రెడ్డి ఘోరంగా అవమానించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె చేసిన అవమానాన్ని తాను తట్టుకోలేకపోతున్నానంటూ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. అప్రమత్తమైన కార్యకర్తలు ఆయనను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడిని ఖండించిన మిథున్ రెడ్డి
-
ఆగని ఆగడాలు.. నెల్లూరులో టీడీపీ నేతల అరాచకం (ఫొటోలు)
-
Nellore: మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి
-
నెల్లూరు : రెండోరోజు రొట్టెల పండగకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
నా తల్లిని బెదిరించారు.. నేను ఇంట్లో ఉంటే చంపేవారు: ప్రసన్నకుమార్
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో టీడీపీ మూకలు అరాచకం సృష్టించాయి. మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై సోమవారం రాత్రి దాడిచేసి బీభత్సం సృష్టించారు. ఈ నేపథ్యంలో పచ్చ మూకల దాడిపై ప్రసన్నకుమార్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఇంట్లో ఉంటే ఆయనను కచ్చితంగా హత్య చేసేవారిని అన్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న తన తల్లిని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు.మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘నిన్న రాత్రి నా నివాసం పై జరిగిన దాడి నన్ను హతమార్చడానికే అని అర్థమవుతోంది. నేను ఇంట్లో ఉండి ఉంటే నన్ను ఖచ్చితంగా చంపేసేవారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న నా తల్లిని బెదిరించారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. వేమిరెడ్డి దంపతులు ఇలాంటి రాజకీయాలకు పాల్పడతారని అనుకోలేదు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చరిత్ర నెల్లూరు వాసులు అందరికీ తెలిసిన విషయమే. నేను చేసిన ప్రతీ వ్యాఖ్యకి కట్టుబడి ఉన్నాను. గతంలో ఇలాంటి దాడులు ఎన్నడూ జరగలేదు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ఈ దాడి విషయంలో పోలీస్ శాఖ న్యాయం చేస్తారన్న నమ్మకం నాకు లేదు. ఇటువంటి దాడులపై పవన్ కళ్యాణ్ స్పందించాలి. డిప్యూటీ సీఎం అయిపోయినంత మాత్రాన కుర్చీలో కూర్చుని పోవటం కాదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. మరోవైపు.. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మీ మాట్లాడుతూ..‘200 మంది అరాచక వ్యక్తులు ఒక్కసారిగా ఇంట్లో ప్రవేశించారు. కంటికి కనపడిన వస్తువులు అన్నింటినీ ధ్వంసం చేశారు. నీ కుమారుడు ఎక్కడ అంటూ నన్ను బెదిరించారు. నాకు ఆరోగ్యం సరిగా లేదు. నిన్న రాత్రి జరిగిన ఘటనతో భయాందోళనకు గురయ్యాను. ఇలాంటి దాడులు ఏనాడు చూడలేదు. నా కుమారుడు ఇంట్లో ఉండి ఉంటే అతన్ని చంపేసేవారు’ అని ఆందోళన వ్యక్తం చేశారు. మారణాయుధాలతో దాడి..ఇదిలా ఉండగా.. మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై టీడీపీ మూకలు సోమవారం రాత్రి దాడిచేసి బీభత్సం సృష్టించారు. 70–80 మంది సోమవారం రాత్రి 9 గంటల సమయంలో మారణాయుధాలతో నెల్లూరు నగరం సుజాతమ్మ కాలనీలోని ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లోకి చొరబడ్డారు. వారిని ఎవరూ గుర్తుపట్టకుండా సీసీ కెమెరాలను ముందుగా ధ్వంసంచేశారు. ఇంటి ముందు నుంచి కొందరు.. వెనుక వైపు కిచెన్ తలుపులను పగులగొట్టి మరికొందరు లోపలికి ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారు. కింద గదితోపాటు పైభాగంలోని గదిలో వస్తువులన్నింటినీ పగులగొట్టారు. అడ్డుకోబోయిన సిబ్బందిపైనా పచ్చమూకలు దాడిచేశాయి. పోర్టికోలో ఉన్న రెండు కార్లను ధ్వంసం చేశారు. అరగంట పాటు నానా బీభత్సం సృష్టించారు. కంటి ఆపరేషన్ చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తల్లి శ్రీలక్ష్మమ్మ టీడీపీ మూకల దాడితో భీతిల్లిపోయి కుప్పకూలిపోయారు. తమతో పెట్టుకుంటే అంతుచూస్తామని, ఎవరిని వదిలిపెట్టబోమని దుండగులు హెచ్చరించారు.అయితే, పోలీసులు వస్తున్నారని తెలుసుకుని దుండగులు బైక్‌లపై పరారయ్యారు. దాడి సమాచారం అందుకున్న నెల్లూరు నగర డీఎస్పీ పి. సింధుప్రియ హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడి జరిగిన తీరును అక్కడున్న వారిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు.. మంత్రి లోక్‌శ్ నెల్లూరులో ఉండగానే ఈ ఘటన జరగడం చూస్తే.. దీని వెనుక పెద్దస్థాయిలో కుట్ర జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ప్రసన్నను హత్య చేసేందుకేనా?దుండగులు పథకం ప్రకారం నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని హత్యచేసేందుకే ఈ దుశ్చర్యకు ఒడిగట్టినట్లు తెలుస్తోంది. రాత్రయితే ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లో ఉంటారని భావించిన దుండగులు మారణాయుధాలతో ఇంటికి చేరుకున్నారు. అయితే, ఆ సమయంలో ప్రసన్నకుమార్‌రెడ్డి లేకపోవడంతో ఇంట్లోని వస్తువులన్నింటినీ ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. కోవూరు సమావేశం అనంతరం ప్రసన్నకుమార్‌రెడ్డి, ఆయన కుమారుడు, స్థానిక నేతలతో కలిసి కోవూరులోనే ఉన్నారు. ఇంట్లో ఉండి ఉంటే ఆయన పరిస్థితి దారుణంగా ఉండేదని అంటున్నారు. -
కాసిన్ని రొట్టెలు
‘రొట్టెపై కవిత గట్టేంత సాహసం చేయలేను. కాని మిమ్మల్ని ఆ నిప్పుల పొయ్యి వరకూ రమ్మని ఆహ్వానిస్తాను. అక్కడ తినడానికి సిద్ధమవుతున్న రొట్టెను దర్శించమని, ఆ అద్భుతాన్ని తిలకించమని వేడుకుంటాను’ అంటాడొక హిందీ కవి. సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు, ఆకాశహార్మ్యాలు, విమానం టికెట్టులు, లాకర్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు, మురుగు పొంగితే ఇష్టరీతిన చుట్టుముట్టినట్టు చేరే అసమంజస ధనం... ఇవి కొందరికి అద్భుతంగా తోచవచ్చు. కాని ఆకలిగొన్నవాడికి పొయ్యి మీద కాలుతున్న రొట్టె కంటే అద్భుతమైనది మరొకటి ఉండదు. ప్రతి పూటా అది అపురూపమే. అందుకే కవి అంటాడు– ‘ప్రతిసారీ ఇంతకు ముందు కంటే మరింత రుచిగా ఉంటుంది. ప్రతిసారీ ఇంతకు ముందు కంటే ఎంతో గుండ్రంగా అగుపిస్తుంది. ఆకలి గురించి అగ్ని పలికే గొప్ప వాంగ్మూలం కదా రొట్టె’....బైబిల్లో రొట్టె కేవలం రొట్టె కాదు. జీవితానికి సంకేతం. జీవితానికి ఏమి కావాలి? పంచడం... పంచుకు తినడం తప్ప. ‘ప్రభూ... వారిని ఇంటికి వెళ్లమని చెప్పు. వాళ్లు వెళితే వారి వారి రొట్టెలు సంపాదించుకు తినగలరు’ అని శిష్యులు ఏసు ప్రభువుకు చెబుతారు. అప్పటికే వారంతా ఎడారి వంటి ప్రాంతంలో ఉన్నారు. ఏసు వెంట ఐదు వేల మంది ఉన్నారు ఆయన ఆరాధనలో. వారంతా ఇళ్లకు వెళ్లి రొట్టెలు ఎప్పటికి తినాలి? ‘మన వద్ద ఏం ఉన్నాయి?’... ‘ఒక బాలుడి బుట్టలో ఐదు రొట్టెలు, రెండు చేపలు’.... కరుణామయుడి హృదిలో సాటి మనిషి ఆకలి పట్ల ఎంతటి కరుణ ఉంటుందంటే ఆ ఐదు రొట్టెలు, రెండు చేపలే ఐదువేల మందికి సరిపోతాయి. పరిమళా సోమేశ్వర్ రాసిన ‘రొట్టె కోసం’ అనే కథలో ఆకలిగొన్న పేదబాలుడు ఇంటింటికీ తిరుగుతూ రొట్టె కోసం అంగలారుస్తాడు. ఒక డబ్బున్న మహిళ రోజూ రొట్టెలు చేసి కాకులకు వేయడం వాడికి తెలుసు. ఆ రోజున కాకులకు బదులుగా తను దక్కించుకోవాలని ప్రయత్నిస్తే ఆ మహిళకు ఎంత కోపం వస్తుందో. ‘ఫో... వెధవా’ అని తరిమి కొడుతుంది. కాకులకు వేస్తే పుణ్యంగాని ఇలాంటి వెధవలకు వేస్తే ఏం పుణ్యం? వివిన మూర్తి రాసిన ‘రొట్టె ముక్క’ అనే కథలో కడుపుతో ఉన్న దళితురాలికి రొట్టె ముక్క తినాలని మనసులో పడుతుంది. మినపరొట్టె. ఆ చిన్న కోరిక తీరడం, తీరకపోవడం వెనుక జాతుల దోపిడి అంతా ఉంది.మనుషుల్ని దొంగలుగా మార్చడం రొట్టె ప్రధానంగా చేసే పని. విక్టర్ హ్యూగో ప్రఖ్యాత నవల ‘లే మిజరబుల్స్’లో ప్రధాన పాత్ర జీన్ వాల్జీన్ రొట్టెను దొంగిలించడంతో ఆ నవల తర్వాతి ఘటనలన్నీ రూపు కడతాయి. జీన్ వాల్జీన్ రొట్టెను దొంగిలించింది కుటుంబం ఆకలి తీర్చడం కోసం. గమ్మత్తు ఏమిటంటే ఈ నాగరిక ప్రపంచపు నిర్మాణమంతా రొట్టెను న్యాయంగా దక్కనీకపోవడంపై ఆధారపడి ఉంది. ఇచ్చే చేయి ఒకరిదిగా పుచ్చుకునే చేయి మరొకరిదిగా ఉంచడం వల్ల ప్రపంచంలోని కొద్దిపాటి కుబేర సంతతి బతుకు ఈడ్చగలుగుతుంది. ఈ కుబేరులు కుబేరుల్లా ఉండటానికి మొదట జనానికి రొట్టె లేకుండా చేస్తారు. జనం రొట్టె తినే పరిస్థితిలో ఉంటే గనక యుద్ధాలు తెచ్చి ఇళ్లనూ, వంటగృహాలను ధ్వంసం చేస్తారు. రొట్టెకై అలమటించి జనం చస్తున్న సమయాల్లో కుబేరుల ఇళ్లలోని చలినెగళ్లు మరింత ఎర్రగా నాల్కలు సాచి వెచ్చదనం ఇస్తాయని వారూ వీరూ చెప్పడమే!‘తిండి లేని పిల్లలున్న దేశంలో పాలు నల్లగా ఉంటాయి. పిల్లలకు తిండి లేని దేశాల్లో రొట్టెలు రాళ్లలా ఉంటాయి’ అని రాస్తాడు వాడ్రేవు చినవీరభద్రుడు. నక్సలైటు పేరుతో అమాయకుణ్ణి తెచ్చి, ఇంటరాగేషన్ పేరుతో నాలుగు రోజులుగా ఆకలికి మాడుస్తుంటే తన వద్ద ఉన్న రొట్టెలను అతడికి రహస్యంగా పెట్టడం గురించి కన్నీళ్లతో రాస్తారు సత్యమూర్తి అలియాస్ శివసాగర్. ‘రొట్టె చేసేందుకు రైతు శ్రమిస్తున్నాడు. రొట్టెతో ఆకలి తీర్చుకునే సామాన్యుడు శ్రమిస్తున్నాడు. కాని రొట్టెతో ఆడుకునే పెద్దమనుషులు పెద్దలసభలో కూచుని ఉన్నారే’ అని సుధామా పాండే ధూమల్ రాసిన ప్రఖ్యాత కవిత ‘రోటీ ఔర్ సన్సద్’ ఆలోచనలను రేకెత్తిస్తూనే ఉంటుంది. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా 80 కోట్ల మందికి రొట్టెగ్రాసం ఇస్తున్నామని చెప్పుకుంటున్న ఈ దేశంలో ఆ స్థితిని యథాతథంగా ఉంచడానికి కారణం తగిన సాహిత్యం పుట్టడానికే కాబోలు. లేకుంటే మనకేం తక్కువ.జూలై 6 నుంచి నెల్లూరులో రొట్టెల పండగ మొదలయ్యింది. అనేక రాష్ట్రాల నుంచి లక్షలాది మంది పాల్గొని అక్కడి ‘బారా షహీద్ దర్గా’ వద్ద వున్న చెరువులో మోకాటి లోతున దిగి ఒకరి నుంచి మరొకరు రొట్టెలు మార్చుకుంటారు. ఏం రొట్టెలు అవి? ‘సంతానం రొట్టె’, ‘సౌభాగ్యం రొట్టె’, ‘ఆరోగ్యం రొట్టె’, ‘ఉద్యోగం రొట్టె’, ‘సొంతింటి రొట్టె’, ‘పెళ్లి రొట్టె’, ‘చదువు రొట్టె’.... అందరివీ చిన్న చిన్న కోరికలు... చిన్న చిన్న ఆశలు... చిన్న చిన్న ఆకాంక్షలు.... ప్రపంచంలోగాని, ఈ దేశంలోగాని, ఏ నైసర్గికతలోగాని కోటాను కోట్ల సామాన్యులకు ఇంతకు మించిన కోరికలు ఉండవు. వారంతా ‘దో వక్త్కీ రోటీ’ దొరికి జీవితం చీకూ చింతా లేకుండా గడిచిపోతే చాలనే కోరుకుంటారు.ఈ మందభాగ్యులను పాలించడానికి కర్కశత్వం అవసరమా? కరుణ సరిపోదా? -
జగన్ నెల్లూరు పర్యటన తాత్కాలిక వాయిదా
-
వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై టీడీపీ కుట్రలు
-
నెల్లూరులో అత్తమామలను నరికి చంపిన అల్లుడు
భార్యపై అనుమానమే పెనుభూతమైంది. రెక్కాడితే గానీ డొక్కాడని పేద కుటుంబంలో మద్యం చిచ్చు రేపింది. మత్తులో విచక్షణ కోల్పోయేలా చేసింది. అడ్డుకోబోయిన అత్త, మామల ప్రాణాలు తీసింది. భార్య కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటనతో దుత్తలూరు ఒక్కసారిగా ఉలికి పడింది. పల్లెల్లో విచ్చలవిడిగా జరుగుతున్న మద్యం విక్రయాలే ఈ ఘటనకు కారణమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: దుత్తలూరు ఏసీ కాలనీ ఆదివారం అర్ధరాత్రి హత్యల కలకలంతో ఉలికి పడింది. మద్యం మత్తులో భార్యపై అనుమానంతో విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి సాగించిన మారణకాండ ఇది. కాలనీలో నివాసముంటున్న ఏలూరు వెంగయ్య మద్యానికి బానిసయ్యాడు. ఇదే క్రమంలో భార్యపై పెంచుకున్న అనుమానం అతనిలో మనిషిని మృగాన్ని చేసింది. భార్యను ఎలాగైనా అంతమొందించాలనే ఉద్దేశంతో ఉన్న వెంగయ్య ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు పూటుగా మద్యం తాగి ఇంటికెళ్లాడు. అప్పటికే భార్య వెంకాయమ్మ సమీపంలోని పుట్టింటికెళ్లింది. దీంతో మరింత కోపోద్రిక్తుడైన వెంగయ్య కట్టెలు కొట్టడానికి ఉపయోగించే పదునైన మచ్చుకత్తి వెంట తీసుకొని అత్తామామల ఇంటికి వెళ్లాడు. తన భార్యను చంపేస్తానంటూ వీరంగం చేశాడు. దీంతో అడ్డుకోబోయిన అత్తామామలు చలంచర్ల జయమ్మ (60) కల్లయ్య (65)లను కత్తితో విచక్షణా రహితంగా దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావమై ఆ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. అంతటితో ఆగకుండా భార్య వెంకాయమ్మపై కూడా కత్తితో దాడి చేశాడు. అయితే ఆమె తప్పించుకునే ప్రయత్నం చేయడంతో గాయాలతో బయటపడి కింద పడిపోయింది. పెద్ద కుమార్తె కేకలు వేయడంతో స్థానికులు వచ్చి గట్టిగా నియంత్రించడంతో వారిని కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ కత్తితో పరారయ్యాడు. గాయపడిన వెంకాయమ్మను ఉదయగిరి వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న సీఐ వెంకట్రావు, ఎస్సైలు ఆదిలక్ష్మి, రఘునాథ్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. క్లూస్‌టీం ప్రాథమిక ఆధారాలు సేకరించారు. నిందితుడు వెంగయ్య కోసం స్థానికంగా, సాంకేతకంగా వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఎప్పుడుపడితే అప్పుడు పల్లెల్లో మద్యం దొరకడం వల్లే ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు. -
వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనకు టీడీపీ నేతల అడ్డంకులు
-
వైఎస్ జగన్ హెలికాప్టర్‌ను దిగనివ్వం.. కోటంరెడ్డి అనుచరుల అరాచకం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పర్యటనకు టీడీపీ నాయకులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. అక్రమ కేసులు బనాయించి జైల్లో ఉంచిన మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డితో ములాఖత్‌కు వైఎస్ జగన్ జూలై 3న నెల్లూరుకు రానున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ కోసం వైఎస్సార్సీపీ నాయకులు స్థలాన్ని పరిశీలిస్తుండగా నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అనుచరులు అడ్డుపడుతున్నారు. నెల్లూరు రూరల్ పరిధిలో వైఎస్సార్సీపీ నాయకులు మూడు వేర్వేరు ప్రైవేటు స్థలాలను చూడగా.. కోటంరెడ్డి అనుచరులు ఆయా భూముల యజమానులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అక్కడ ఉన్న నిర్మాణాలతో పాటు భూములపై వివాదాలు సృష్టిస్తూ భయభ్రాంతులకు గురిచేశారు. వైఎస్సార్సీపీ నేతలు శనివారం కొత్తూరు అంబాపురంలోని క్రైస్తవ మిషనరీ ఆధ్వర్యంలో నడిచే ఓ పాఠశాల మైదానాన్ని హెలిప్యాడ్ కోసం ఎంపిక చేశారు. స్కూల్ యాజమాన్యం అనుమతితో జిల్లా అధికారులకు దరఖాస్తు చేశారు. అయితే, ఎమ్మెల్యే కోటంరెడ్డి అనుచరులు మిషనరీ స్కూల్ వద్దకు వెళ్లి వీరంగం సృష్టించారు. ట్రస్ట్ భూముల్లో ప్రభుత్వ భూమి ఉందంటూ హడావుడి చేశారు. భవనాలను కూల్చేస్తామంటూ రాద్ధాంతానికి దిగారు. దీంతో స్కూల్ సంబం«దీకులు భయాందోళనకు గురై హెలిప్యాడ్‌కు స్థలం ఇవ్వబోమని చెప్పాల్సి వచ్చింది. వైఎస్ జగన్ జనాదరణ చూసి భయపడి..రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 143 హామీలతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి గద్దెనెక్కిన టీడీపీ కూటమి ఆ హామీలు నెరవేర్చలేక తీవ్ర వ్యతిరేకత మూటకట్టుకుంది. దీనిని నిలదీస్తూనే మాజీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో పర్యటనలు చేస్తుండడంతో రోజురోజుకు జనాదరణ పెరుగుతోంది. ఆయన నెల్లూరు జిల్లాకు వస్తున్నారని తెలియగానే సంఘీభావం తెలిపేందుకు వేలాదిమంది తరలివస్తారని టీడీపీ నేతల్లో భయం పుట్టింది. వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు అవరోధాలు సృష్టిస్తున్నారు. హెలిప్యాడ్‌కు స్థలాలు ఇవ్వకుండా యజమానులను బెదిరిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. -
మా నాన్న తప్పు చేయడు.. ఎవరైనా చేస్తే ఒప్పుకోడు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘నేను గట్టిగా నమ్ముతున్నాను. మా నాన్న ఎలాంటి తప్పు చేయలేదని. చేయని తప్పులకు అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారు. బెయిల్ రాకుండా రోజుకో కేసు తెరపైకి తెచ్చి వేధిస్తున్నారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాన్నను దగ్గరగా చూస్తున్నాను. ఆయన ఏ తప్పు చేయడు. తప్పు చేసిన వారు ఎవరైనా ఒప్పుకోడు. అలాంటి ఆయనపై అక్రమ కేసులు పెడుతున్నారు. అన్నింటిని ఆ భగవంతుడే చూస్తున్నాడు. నాన్నపై కుట్ర పన్ని తప్పులు చేసిన వారు, చేయిస్తున్న వారిని భగవంతుడే శిక్షిస్తాడు. నాన్న కడిగిన ముత్యంలా బయటకు వస్తాడని నేను నమ్ముతున్నాను’ వైఎస్సార్సీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తనయ కాకాణి పూజితతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ.మీ నాన్న అరెస్ట్ తర్వాత మీ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏమిటి? కూటమి ప్రభుత్వ వైఫల్యాలను నిత్యం ప్రశి్నస్తున్నారని మానాన్నపై అక్రమ కేసులు బనాయించి రిమాండ్‌లో ఉంచారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాన్నను వదిలి ఉండలేదు. ఎప్పుడు ఆయనతోనే ఉండేవాళ్లం. నాకు వివాహం అయి తొమ్మిదేళ్లు. అప్పుడే నా ఇద్దరు బిడ్డలు నా వద్దే ఉండాలని చెప్పి చేశారు. నాన్నను చూడకుంటా ఒక్క రోజు కూడా ఉండలేదు. అలాంటిది మూడు నెలలుగా నాన్నకు దూరంగా ఉంటే ఎలా ఉంటుంది?. 80 ఏళ్ల మా నాన్నమ్మ నా బిడ్డ ఏం తప్పు చేశాడని జైల్లో పెట్టారని ప్రశి్నస్తుంటే ఆమెను ఓదార్చలేకపోతున్నాం. మా పిల్లలు తాతయ్య ఎక్కడని రోజూ ఏడుస్తున్నారు. పిల్లలు వాళ్ల తాతయ్యను వదిలి ఉండలేదు. మా నాన్న మనస్తత్వం తెలిసిన నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆయన తప్పు చేయడు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా జంకడు. ఆయన్ను ఒక రాజులా చూశాను. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆయన్ను చూడలేకే ములాఖత్‌కు వెళ్లడం లేదు.కాకాణిని జైల్లో పెట్టడంతో పార్టీ కేడర్ పరిస్థితి ఏమిటి? మూడు నెలలుగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు మా నాన్న దూరంగా ఉన్నారు. అయినా పార్టీ కేడర్ ఏమీ భయపడడం లేదు. నా తండ్రి అందుబాటులో లేకపోయినా.. ఆయన బిడ్డగా నేను పార్టీ కేడర్‌కు అండగా నిలబడి ధైర్యం చెబుతున్నాను. అందరికి మంచి చేసిన మా నాన్నను జైల్లో పెట్టడంతో పార్టీ కేడర్ మొత్తం కసితో ఉన్నారు. వారే ముందుకు వచ్చి మాకే ధైర్యం చెబుతున్నారంటే ఆయన వారిపట్ల ఎంత నిబద్ధతగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.పార్టీ కేడర్‌ను వేధిస్తున్నారన్న సమాచారం ఎంత వరకు నిజం? కూటమి ప్రభుత్వ పెద్దలు ఆదేశాలతో పోలీసులు మా నాన్న గోవర్ధన్‌రెడ్డిపై ఇప్పటికే చాలా అక్రమ కేసులు పెట్టారు. రోజుకో కేసు పెడుతున్నారు. ఆధారాలు లేని ఆ కేసుల్లో నాన్న పేరు చెప్పాలని పార్టీ కేడర్‌ను పోలీసులు తీసుకెళ్లి చిత్రహింసలు పెడుతున్నారు. వాళ్ల టార్చర్ భరించలేకపోతున్నట్లు కొందరు నాకు ఫోన్ చేసి అమ్మా మమ్మల్ని పోలీసులు ఇబ్బంది పెట్టి సంతకాలు తీసుకుంటున్నారు అని చెబుతుంటే బాధగా అనిపిస్తుంది. నాన్న ఒక్కడిని ఇబ్బంది పెట్టడం కోసం ఇంత మందిని హింసించడం చూస్తే నా మనస్సు చలిస్తుంది. నాన్న వెంట నడిచిన నేతలందరిని కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారు.భవిష్యత్ ప్రణాళిక ఏమిటి? మా కుటుంబం విలువలతో కూడిన రాజకీయం చేసింది. మా తాతయ్యకు ఇప్పటికి మంచి పేరు ఉంది. మా తాత విలువలకు వారసుడిగా రాజకీయ చేస్తున్నారే కానీ.. ఏనాడు తెలియక కూడా తప్పు చేయలేదు. జెడ్పీ చైర్మన్‌గా, రెండు సార్లు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఎవరికి అన్యాయం చేయలేదు. తప్పు చేసిన వారిని రాజకీయ కోణంలోనే ఆ తప్పులను ఎత్తి చూపి విమర్శలు చేశారనే కానీ, అధికారంలో ఉన్నప్పుడు వ్యక్తిగత కక్ష తీర్చుకునే ప్రయత్నం చేయలేదు. మా నాన్న ఏ తప్పు చేయలేదు కాబట్టి కచ్చితంగా కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు. అంత వరకు మా నియోజకవర్గంలోని మా పార్టీ కార్యకర్తలకు నేను అండగా ఉంటానని చెప్పాను. -
3న నెల్లూరుకు వైఎస్ జగన్
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ జూలై 3న నెల్లూరు రానున్నారు. సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిని ములాఖత్‌లో పరామర్శిస్తారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.ఆదివారం నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో వైఎస్ జగన్ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ తలశిల రఘురాం, మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ మేరిగ మురళి, సూళ్లూరుపేట సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య తదితరులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కాకాణిని కలిసిన అనంతరం వారి కుటుంబ సభ్యులను కూడా వైఎస్ జగన్ పరామర్శిస్తారని తెలిపారు. -
రోకలిబండతో భార్యను కొట్టి చంపిన భర్త
నెల్లూరు(క్రైమ్): భార్య చీటికి మాటికి గొడవపడుతుండడంతో విసిగిపోయిన భర్త రోకలిబండతో కొట్టి హతమార్చాడు. ఈ సంఘటన నెల్లూరులో శనివారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు బాలాజీనగర్ గౌడహాస్టల్ సమీపంలో ఎల్.విజయ్‌చంద్ర, శైలజ(46) దంపతులు నివసిస్తున్నారు. వారికి బీటెక్, పదో తరగతి చదువుతున్న ఇద్దరు కుమారులున్నారు.విజయ్‌చంద్ర ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. శైలజ తండ్రి చెన్నైలో ఉంటూ మృతిచెందారు. ఆయనకు చెందిన ఆస్తులు తమకు రావాలంటే కొంత నగదు ఖర్చు చేయాలని ఆమె భర్తకు చెప్పి అతనిచేత పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చుచేయించింది. దీంతో విజయ్‌చంద్ర అప్పులపాలయ్యాడు.ఈ క్రమంలోనే భర్తపై ఆమె అనుమానం పెంచుకుని వేధించడం మొదలుపెట్టింది. మానసిక స్థితి సరిగా లేకపోవడంతో నిత్యం భర్తతో గొడవపడుతుండేది. కుమారులు ప్రశి్నస్తే వారితోనూ గొడవపడేది. శనివారం మధ్యాహ్నం విజయ్‌చంద్ర ఇంట్లోనే ఉన్నారు. కుమారులను భోజనం తీసుకురమ్మని బయటకు పంపించారు. ఈక్రమంలో దంపతుల నడుమ మరోమారు గొడవ జరిగింది.ఆగ్రహానికి గురైన భర్త పక్కనే ఉన్న రోకలిబండతో శైలజ తలపై మోదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనకు దారితీసిన పరిస్థితులను పిల్లలను అడిగి తెలుసుకున్నారు. పెద్దకుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
నెల్లూరు జైలు నుంచి కాకాణి తరలింపు
-
మెజిస్ట్రేట్ ఎదుట కాకాని
-
MDU Operators: కరోన లాంటి కష్టకాలంలో కూడా ప్రాణాలకు తెగించి కష్టపడ్డాం..
-
నెల్లూరులో ప్రసిద్ధ ఆలయం..శనివారం ఒక్కరోజే భక్తులకు దర్శనం (ఫొటోలు)
-
జనసేనలో భగ్గుమన్న వర్గ విభేదాలు
-
ఆపరేషన్ సిందూర్.. మధుసూదన్ కుటుంబ సభ్యుల రియాక్షన్
-
చంద్రబాబు పర్యటనలో తప్పిన పెనుప్రమాదం
నెల్లూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన జిల్లా పర్యటనలో ప్రజలకు పెను ప్రమాదం తప్పింది. నారంపేటలోని ఎమ్ఎస్ఎమ్ఈ పార్క్ వద్ద అధికారులు ఏర్పాటు చేసిన ఆర్చి కుప్పకూలింది. అప్పటికే చంద్రబాబు, ప్రజలు వెళ్లిపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. ప్రజావేదిక వద్ద ఉదయమే ఏర్పాటు చేసిన ఆర్చి.. సాయంత్రం కల్లా కుప్పకూలడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆర్చి కూలే సమయంలో అక్కడ ఎవరూ లేరని, లేకపోతే పెద్ద ప్రమాదమే జరిగేదని స్థానికులు చెబుతున్నారు.ఈరోజు(గురువారం) నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటించారు. ప్రజావేదిక పేరుతో జరిగిన సభకు సీఎం హాజరయ్యారు. ఈ క్రమంలోనే భారీ ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లు భాగంగా ఏర్పాటు చేసిన ఒక ఆర్చ్ కుప్పకూలింది. అది జనాలు ఎవరూ లేని సమయంలో కూలడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. -
నెల్లూరు: వైద్య విద్యార్థుల మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
గుంటూరు, సాక్షి: నెల్లూరు జిల్లా కారు ప్రమాదంలో ఐదుగురు వైద్య విద్యార్ధులు, మరొకరు మృతి చెందడంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్న ఆయన.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారాయన.నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం వద్ద ఇవాళ ఘోర ప్రమాదం జరిగింది. ముంబయి జాతీయ రహదారిపై ఉన్న పెట్రోల్‌బంకు వద్దకు రాగానే ఓ కారు అదుపు తప్పిన ఓ హోటల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆ ఇంట్లో నివసిస్తున్న వెంకట రమణయ్య (50) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అలాగే.. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వైద్య విద్యార్థుల్లో.. ఐదుగురు మరణించారు. తీవ్రంగా గాయపడ్డ మరో విద్యార్థికి ఆస్పత్రిలో చికిత్స అందుతోంది. ఇదీ చదవండి: నెల్లూరులో కారు బీభత్సం: ఘోర ప్రమాదం ఇలా.. -
నెల్లూరు జిల్లాలో కారు బీభత్సం, ఆరుగురు మృతి
-
నెల్లూరు లాడ్జిలో ప్రేమజంట ఆత్మహత్య
సాక్షి, నెల్లూరు: నగరంలో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. నెల్లూరు రైల్వే స్టేషన్ సమీపంలోని సింహపురి లాడ్జిలో పాయిజన్ తీసుకుని ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను రాజమండ్రి కొవ్వూరుకు చెందిన జోసెఫ్(25), కృష్ణా జిల్లా కైకలూరు సమీపంలోని ఆటపాక గ్రామానికి చెందిన శ్రావణి (23)గా పోలీసులు గుర్తించారు.మూడు రోజుల క్రితం ఉద్యోగ నిమిత్తం కౌన్సిలింగ్‌కి వచ్చామన్న కారణం చూపి సింహపురి లాడ్జిలో జోసెఫ్, శ్రావణిలు రూమ్ తీసుకున్నారు. రెండు రోజుల నుంచి గదిలో నుంచి బయటకు రాకపోవడంతో పాటు వాసన వస్తుండడంతో లాడ్జి యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
నెల్లూరులో కోర్టు సినిమా హీరోయిన్ శ్రీదేవి సందడి (ఫొటోలు)
-
Waqf Bill: నీకు బుద్ధి చెప్పి తీరుతాం... బాబును ఏకిపారేసిన ముస్లింలు
-
బెయిల్ రాకుండా.. కాకాణిపై కూటమి ప్రభుత్వం కుట్ర
సాక్షి,నెల్లూరు : మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి బెయిల్ రాకుండా ఉండేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుందా?. నెల్లూరులో కార్యకర్తలతో అందుబాటులో ఉన్నన్ని పోలీసులు నోటీసులు ఇవ్వని పోలీసులు.. కాకాణి హైదరాబాద్‌కు వెళ్లిన వెంటనే నోటీసులు ఎలా ఇస్తారు?.బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరగడానికి ఒకరోజు ముందు విచారణకు హాజరుకావాలని పోలీసులు చెప్పడం వంటి పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోందని వైఎస్సార్సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. కాకాణి గోవర్థన్‌రెడ్డి నెల్లూరులోని తన నివాసంలో కార్యకర్తలతో నాలుగైదు రోజులు అందుబాటులో ఉన్నారు. అందుబాటులో ఉన్నన్ని రోజులు పోలీసులు నోటీసులు ఇవ్వలేదు. అయితే, ఉగాది పండుగ పర్వదినాన హైదరాబాద్‌లో ఉన్న తన కుటుంబసభ్యులతో గడిపేందుకు వెళ్లారు. కాకాణి నెల్లూరులో లేరని తెలుసుకుని హుటాహుటీనా నివాసానికి వెళ్లి నోటీసులు అంటించారు. ఉగాది రోజు సాయంత్రం ఆరుగంటల సమయంలో కాకాణి నివాసానికి నోటీసులు అంటించారు. దీనిపై వైఎస్సార్సీపీ శ్రేణులు మండిపడుతున్నారు. మంగళవారం కాకాణి గోవర్థన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో సోమవారం ఉదయం 11గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాకాణినికి బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు పోలీసులు కుట్రలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
ట్రెండింగ్ కర్రీ బిజినెస్ : సండే స్పెషల్స్, టేస్టీ ఫుడ్
ఉరుకులు పరుగుల జీవితంలో ప్రత్యేకమైక సమయాన్ని కేటాయించి వంటలు చేసుకోవడం చాలా మందికి కష్టతరంగా మారింది. హోటల్స్‌లో భోజనం కూడా ఖర్చుతో కూడుకుంది కావడంతో అన్నం మాత్రం వండుకుని కర్రీస్‌ను బయట కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. దీంతో నగరంలో వీధికో కర్రీస్ పాయింట్లు వెలిశాయి. నగరంలోని కర్రీస్ పాయింట్లకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. అందుకు తగ్గట్లు కొత్త రుచులతో ఆహార ప్రియులకు రోజుకో ఒక స్పెషల్ కర్రీని పరిచయం చేస్తున్నారు. నాన్‌వేజ్ ఐటమ్స్‌లో కొత్త రకాలను పరిచయం చేస్తూ కర్రీస్ సెంటర్లు నగర వాసుల మన్నలను పొందుతున్నాయి. 17 ఏళ్ల క్రితం మాగుంట లేఅవుట్ ప్రాంతంలో గంగోత్రి కర్రీస్ పాయింట్ ఏర్పాటు చేశారు. అప్పట్లో కర్రీస్ పాయింట్లను పరిచయం చేసింది వారే. అయితే ప్రస్తుతం ఆ కర్రీ పాయింట్ లేదు. దాదాపు 400పైగా కర్రీ పాయింట్స్ నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో కర్రీ పాయింట్స్ అనేకం వెలిశాయి. ఒక్క స్టోన్‌హౌస్‌పేట, బాలాజీనగర్, నవాబుపేట, కిసాన్‌నగర్, మైపాడుగేటు ప్రాంతాల్లోనే 70 కర్రీస్ పాయింట్లు ఉన్నాయి. అదే విధంగా హరనాథపురం, చిల్డ్రన్స్‌పార్క్, చిన్నబజారు, పెద్దబజారు, వీఆర్సీ సెంటర్, మద్రాసు బస్టాండు, దర్గామిట్ట, వేదాయపాళెం, అయ్యప్పగుడి ఇలా ప్రధాన ప్రాంతాల్లోని అధిక సంఖ్యలో కర్రీస్ పాయింట్లు వెలిశాయి. ఇలా మొత్తం దాదాపు 400కు పైగా కర్రీస్ పాయింట్లు ఉన్నాయి. చదవండి: నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలు నిత్యావసరాల ఖర్చులు పెరగడంతో... గతంతో పోలిస్తే కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. దీంతో ఇంట్లో గ్యాస్, నిత్యావసర వస్తువులకు ఖర్చు చేయడం కన్నా రూ.20 నుంచి రూ.30లకు ఒక కర్రీ ప్యాకెట్ రావడంతో వాటిపైనే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. సాంబార్, పప్పు, రసానికి కలిపి రూ.60 నుంచి రూ.80లు వెచ్చిస్తే నలుగురు వ్యక్తులు తినేందుకు సరిపోతుంది. ఇంట్లో అన్నం వండుకుని కర్రీస్ కొనుగోలు చేస్తే రోజు గడిచిపోతుంది. జీవనోపాధికి దోహదం హోటల్స్‌లో పనిచేసిన అనుభవం ఉన్నవారు, సొంత కాళ్లపై నిలబడాలనే ఉద్దేశంతో ఉన్న వారు కర్రీ సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వస్తున్నారు. ఇంటి పెద్ద మాత్రమే కాకుండా ఇంట్లోని భార్య, పిల్లలు కర్రీ పాయింట్లో అవసరమైన పనులు ఒకరికి ఒకరు సహాయ పడుతూ బుతుకు జీవనాన్ని నెట్టుకొస్తున్నారు. ఉదయం 4 నుంచి కర్రీకి సంబంధించి కూరగాయలు, ఇతర వస్తువులను సమకూర్చుకుంటారు. ఉదయం 11 గంటలకే అన్ని రకాల కర్రీస్‌ను అందుబాటులో ఉంచుతారు. సాయంత్రానికి తిరిగి మళ్లీ వంటకాలు చేయాల్సి ఉంది. కుటుంబ సభ్యులు అందరూ కలిసి పనులను పంచుకుంటారు. వీరిలో రుచిని, నాణ్యతను అందించిన వాళ్లకు మాత్రమే ఆదరణ లభిస్తుంది. సండే స్పెషల్స్ ఆదివారం వచ్చిందంటే నగర వాసులు సినిమాలు, షికార్లుకు వెళ్తుంటారు. రోజంతా పిల్లలతో గడుపుతుంటారు. బయట వంటకాలు రుచి చూసేందుకు ఇçష్ట పడుతుంటారు. దీంతో ఆదివారం హోటల్స్‌తో పాటు కర్రీ సెంటర్లు కూడా ప్రత్యేకంగా నాన్‌వెజ్ రుచులను అందుబాటులోకి తెస్తుంటాయి. రాగి సంగటితో పాటు బొమ్మిడాయల పులుసు, రొయ్యలు, చికెన్, మటన్‌లో ఫ్రైలు, కర్రీల విక్రయాలు చేస్తుంటారు. సాధారణ రోజులో కన్నా ఆదివారం తమ వ్యాపారం జోరుగా ఉంటుందని కర్రీ పాయింట్ నిర్వాహకులు చెబుతున్నారు. చదవండి: వాకింగ్ చేస్తూనే మృత్యు ఒడికి.. సీసీటీవీలో దృశ్యాలు వివిధ రకాల పచ్చళ్లు... కర్రీ పాయింట్లలో అనేక రకాల పచ్చళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కొన్ని కర్రీ సెంటర్లు వారంలో ప్రతిరోజు ఒక్కో రకం పచ్చళ్లను అందుబాటులో ఉంచుతుంటాయి. అదే విధంగా కారపు పొడులు సైతం విక్రయిస్తున్నారు. అదే విధంగా నాన్‌వెజ్‌లో ఫ్రై ఐటమ్స్, వెజ్‌లో కూడా పలు కొత్త రకాల ఫ్రై ఐటమ్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. రుచి, నాణ్యత ఉంటేనే.. చాలా కాలంగా కర్రీ పాయింట్ నిర్వహిస్తున్నా. అయితే రుచి, నాణ్యత ఇవ్వగలిగితేనే కస్టమర్లు మళ్లీ మళ్లీ వస్తారు. కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు హెచ్చుతగ్గులు ఉన్నా కస్టమర్ల కోసం అందుబాటు ధరల్లో విక్రయాలు చేస్తుంటాం. – వెంకటేశ్వర్లు, కర్రీ పాయింట్ నిర్వాహకుడు -
Political Corridor: కోటంరెడ్డి హవా.. అబ్దుల్ అజీజ్ కు మొండిచేయి
-
రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
నెల్లూరు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మనుబోలు మండలం గోట్లపాలెం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఒక ఆటోను ద్విచక్ర వాహనం డీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తుదిశ్వాస విడిచాడు. మృతులు ఊటుకూరుకు చెందిన మృతులు వరుణ్ కుమార్(17), నందకిషోర్(18), సురేంద్ర(40)లుగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
లవ్వర్ పిలుస్తోందంటూ.. యువకుని హత్య
నెల్లూరు(క్రైమ్): రౌడీషీటర్ చింటూ హత్య కేసులో పరారీలో ఉన్న ఆరుగురు నిందితులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌లో నగర డీఎస్పీ పి.సింధుప్రియ, స్థానిక ఇన్స్పెక్టర్ వి.శ్రీనివాసులురెడ్డితో కలిసి హత్యకు దారితీసిన పరిస్థితులు, నిందితుల వివరాలను వెల్లడించారు. పాత వేదాయపాళేనికి చెందిన అరవభూమి సుజన్ కృష్ణారెడ్డి అలియాస్ చింటూ (28) రౌడీషీటర్. అతడిపై వివిధ పోలీస్స్టేషన్లలో కేసులున్నాయి. చింటూకు ఇందిరాగాంధీనగర్‌కు చెందిన కృష్ణసాయి అలియాస్ కిట్టు స్నేహితుడు. వీరి మధ్య విభేదాలున్నాయి. చింటూ గతంలో కిట్టు ఇంటికి వెళ్లి గొడవపడి చంపుతానని అందరిముందు బెదిరించాడు. అవమానంగా భావించిన కిట్టు ఈ విషయాన్ని తన స్నేహితులైన కొత్తూరు రామకోటయ్యనగర్‌కు చెందిన కరిముల్లా, ఇందిరాగాంధీనగర్‌కు చెందిన షేక్ మహ్మద్‌బాబా, వెంగళరావ్‌నగర్‌కు చెందిన జి.పవన్, ఫ్రాన్సిన్ అనిక్రాజ్ అలియాస్ అనిక్రాజ్, మనుబోలు మండలం కోదండరామపురానికి చెందిన కె.సాయితేజకు జరిగిన విషయాన్ని చెప్పాడు. అందరూ కలిసి చింటూ హత్యకు పథక రచన చేశారు.మాట్లాడాలని పిలిచి..చింటూ ఇందిరాగాంధీనగర్లోని ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. ఆమెను కొందరు ఇబ్బందులు పెడుతుండగా ఆ విషయమై మాట్లాడదామని కిట్టు ఈనెల 14వ తేదీ రాత్రి చింటూను ఇందిరాగాంధీనగర్ రెండో వీధికి పిలిచాడు. అక్కడే కాపుకాసిన నిందితులు చింటూ రాగానే కత్తులతో విచక్షణారహితంగా నరికి హత్య చేసి పరారయ్యారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ వి.శ్రీనివాసులురెడ్డి కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతికత ఆధారంగా నిందితులను గుర్తించారు. మంగళవారం వెంగళరావ్‌నగర్‌లో ఆరుగురిని అరెస్ట్ చేశారు. నిందితులపై త్వరలో రౌడీషీట్లు తెరుస్తామని డీఎస్పీ చెప్పారు. -
నెల్లూరులో వైభవంగా శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి రథోత్సవం (ఫొటోలు)
-
నెల్లూరు జిల్లా సంగంలో నకిలీ SI హల్ చల్
-
సైదాపురం మండలంలో ఆగని అక్రమ మైనింగ్ దందా
-
నెల్లూరులో సందడి చేసిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (ఫోటోలు)
-
దర్గాకు వచ్చే భక్తులతో షరీఫ్ అసభ్య ప్రవర్తన
-
సింహపురి ఆభరణాలు భళా..
స్వర్ణాభరణాల తయారీలో దక్షిణాది రాష్ట్రాల్లో సింహపురి రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఇక్కడ లభించే వినూత్న డిజైన్లకు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. స్థానికంగా స్థిరపడిన మార్వాడీలు, జైన్లు.. ఇక్కడి వారు అందించే ముడిసరుకుతో ఆభరణాలను తయారు చేస్తూ స్వర్ణకారులు, ముస్లింలు ఉపాధి పొందేవారు. అయితే కాలక్రమేణా వీరి స్థానాన్ని బెంగాలీలు ఆక్రమిస్తున్నారు. ఫలితంగా ఎన్నో ఏళ్లుగా ఇదే వృత్తిని నమ్ముకున్న తయారీదారులు ప్రస్తుతం జీవనోపాధి కోల్పోయి నానా అగచాట్లు పడుతున్నారు. నెల్లూరు (పొగతోట): స్వర్ణాభరణాల తయారీకి కేరాఫ్‌గా నెల్లూరు నిలుస్తోంది. దక్షిణాదిలో కోయంబత్తూరు తర్వాతి స్థానం నెల్లూరుదే కావడం విశేషం. చెన్నై సైతం మూడో స్థానంలో ఉందంటే ఇక్కడ రూపొందించే ఆభరణాలకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి 50 ఏళ్ల నుంచే జిల్లాలో నిష్ణాతులు పాతుకుపోయారు. పెద్ద, చిన్న, అతి సూక్ష్మ ఆభరణాల తయారీలో ఇక్కడి స్వర్ణకారులు ప్రావీణ్యం సాధించారు. అర గ్రాము, గ్రాముతో చిన్న కమ్మలు, నెక్లెస్‌లు, స్టోన్ ఐటెమ్స్‌ను రూపొందించడంలో చేయి తిరగడంతో వీటిని సింగపూర్, మధ్య ప్రాచ్య దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. జిల్లాలో నెలకు రూ.500 కోట్లకుపైగా వ్యాపారం జరుగుతోందని అంచనా. జిల్లాలో ఇలా.. ఆభరణాలను తయారు చేసే స్వర్ణకారులు జిల్లాలో సుమారు 15 వేల మందికిపైగా ఉన్నారు. చిన్న, పెద్ద బంగారు షాపులు నగరంలో వెయ్యికిపైగా ఉన్నాయి. స్వర్ణాభరణాలను తయారు చేయడంలో ప్రారంభంలో స్థానిక స్వర్ణకారులు, అనంతరం ముస్లింలు, ప్రస్తుతం బెంగాలీలు ముందంజలో ఉన్నారు. చేతితో తయారుచేసే బంగారు ఆభరణాలను ప్రజలు అమితంగా ఇష్టపడుతున్నారు. అదే ముంబై, కోయంబత్తూర్ తదితర ప్రాంతాల్లో మెషీన్ కటింగ్‌తో తయారు చేస్తున్నారు. నగరంలోని ఆచారివీధి, చిన్నబజార్, కొరటాల వీధి, గిడ్డంగివీధి, కాకర్ల వీధి, కుక్కల గుంట, మండపాల వీధిలో వేలాది మంది స్వర్ణకారులు జీవనోపాధి పొందుతున్నారు. అధిక శాతం షాపులనూ ఆయా ప్రాంతాల్లోనే ఏర్పాటు చేశారు. కాలానుగుణంగా మార్పులు స్వర్ణకారులకు ముడి సరుకును మార్వాడీలు, జైన్లు, స్థానికులు అందజేస్తారు. స్వర్ణకారులుండే రోజుల్లో వంద గ్రాముల బంగారానికి 8 గ్రాముల తరుగు, కూలిని అందించేవారు. ఇలా వంద గ్రాముల బంగారాన్ని ఇస్తే 92 గ్రాములతో ఆభరణాలను తయారుచేసేవారు. ఫలితంగా స్వర్ణకారులకు 8 గ్రాముల బంగారం, కూలి లభించేది. అనంతరం తయారీలో ముస్లింలు ప్రవేశించారు. ఆ సమయంలో కూలిని ఎత్తేసి తరుగును మాత్రమే ఇచ్చేవారు. గోల్డ్ మాఫియా ఆగడాలు జిల్లాలో గోల్డ్ మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. బడా నేతల సహకారంతో ప్రభుత్వానికి ఎలాంటి పన్నులు చెల్లించకుండానే రూ.కోట్ల విలువైన బంగారు ఆభరణాలను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. జిల్లాలో తయారు చేస్తున్న రాళ్లు, ఫ్యాన్సీ ఐటమ్స్ నగలకు దేశ వ్యాప్తంగా ప్రత్యేక డిమాండ్ ఉండటంతో ఇతర రాష్ట్రాలకు చెందిన బడా వ్యాపారులు దొడ్డిదారిన తీసుకొచ్చి తయారీ అనంతరం అదే మార్గంలో అక్రమంగా తరలిస్తున్నారు. అధికారులు, పోలీసులకు ప్రతి నెలా ముడుపులు అందుతుండటంతో నామమాత్రపు తనిఖీలు చేసి చేతులు దులుపుకొంటున్నారు. పెండింగ్‌లో ఎఫ్ఐఆర్లు బంగారు ఆభరణాలను తయారు చేసేందుకు వచ్చిన బెంగాలీల్లో అధిక శాతం మంది పూర్తి వివరాల్లేకుండానే ఉంటున్నారు. బంగారు ఆభరణాల చోరీలకు సంబ«ంధించిన ఎఫ్ఐఆర్లు సంతపేట పోలీస్‌స్టేషన్‌లో అధిక శాతం పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు వీటిని తయారు చేసే దుకాణంలో సీసీ ఫుటేజ్‌లు అందుబాటులో ఉన్నా, అపహరించిన వారిని పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. జిల్లాలో నైపుణ్యమున్న స్వర్ణకారులు కార్మికులుగానే మిగిలిపోతున్నారు. వీరి జీవితాల్లో వెలుగులు రావడంలేదు. బెంగాల్ నుంచి తయారీదారులను ఆహ్వా నించి సూక్ష్మ బంగారు ఆభరణాలను రూపొందించడాన్ని ప్రారంభించారు. సూక్ష్మ, పలచటి ఆభరణాలపై ఎక్కువ మంది ఆసక్తి చూపడంతో అధిక శాతం మంది రావడం ప్రారంభించారు. తయారీలో ప్రస్తుతం వీరే కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరికి ప్రస్తుతం తరుగుగా ఐదు గ్రాములను ఇస్తున్నారు. వీరి రంగప్రవేశంతో స్వర్ణకారులు, ముస్లింలు ఉపాధి కోల్పోయారు. ఫలితంగా ఆటోలు తోలుకుంటూ, కూరగాయలు, పండ్ల వ్యాపారాలు, బడ్డీ కొట్లు నడుపుకొని జీవనం సాగిస్తున్నారు.సందట్లో సడేమియాగా మధ్యవర్తులుబంగారు ఆభరణాల తయారీలో మధ్యవర్తులుగా చిన్నబజార్, పెద్దబజార్ తదితర ప్రాంతాలకు చెందిన కీలక వ్యక్తులను ఏర్పాటు చేసుకున్నారు. మధ్యవర్తులు సూచించిన వ్యక్తులకే బంగారాన్ని ఆభరణాల తయారీ నిమిత్తం ఇస్తారు. తయారీదారులకొచ్చే తరుగులో కొంత భాగాన్ని వీరు తీసుకుంటున్నారు. మరోవైపు కొన్ని చోట్ల కీలకంగా ఉండే వ్యక్తులకు బంగారు ముడి సరుకును ఇస్తున్నారు. వీరు బెంగాలీలతో బంగారు ఆభరణాలను తయారు చేయించి తిరిగి అందజేస్తున్నారు. -
ఈ టీచరమ్మ నిత్య విద్యార్థి
‘నేను ఇప్పటికీ విద్యార్థినే’అంటుంది విజయమ్మ. ఉపాధ్యాయురాలిగా ఉద్యోగ విరమణ చేసిన విజయమ్మ మదిలో ‘విశ్రాంతి’ అనే ఊహ ఎప్పుడూ రాలేదు. ఆమె ఇల్లు పెద్దబడి. చిలుకలు వాలిన చెట్టులా ఎప్పుడూ సందడిగా ఉంటుంది. ‘సామాజిక సేవాకార్యక్రమాల్లోనే సంతోషం’ అని చెబుతున్నట్లుగా ఉంటుంది. ‘నేను నిత్య విద్యార్థిని’ అని చెప్పే విజయమ్మ మాటను అక్షరాలా నిజం చేయడానికన్నట్టు ఇప్పటికే ఐదు డిగ్రీలు, 4 పీజీ కోర్సులు పూర్తి చేసి పదవ కోర్సుకు సిద్ధమవుతోంది.ఉద్యోగానికి ఉత్సాహం తోడైతే ఆ శక్తే వేరు. ఆ శక్తి విజయమ్మలో కనిపిస్తుంది. ఉద్యోగ విధులకు సామాజిక బాధ్యతను కూడా జోడించడం ఆమె ప్రత్యేకత. తాను ఉద్యోగం చేసిన ప్రతి గ్రామంలో విద్యాబోధనతోపాటు పర్యావరణ సంరక్షణ గురించి పిల్లలకు అవగాహన కలిగించేది. ఆయా గ్రామాలలో వందల మొక్కలను నాటించింది. బాలికల చదువు విషయంలో ప్రత్యేక చొరవ చూపేది. ‘ఇప్పటి నుంచే మీకంటూ ఒక కల ఉండాలి’ అని చెబుతుండేది.పేదరికాన్ని జయించి, ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి గొప్పస్థానంలో నిలిచిన ఆదర్శనీయ మహిళల గురించి చెబుతూ ఉండేది. వింజమూరు, ఇందుకూరుపేట, టీపీ గూడూరు, నెల్లూరు రూరల్ తదితర ప్రాంతాల్లో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహించిన విజయమ్మ ఇందుకూరుపేట మండలం కొత్తూరు హైస్కూల్లో ఉపాధ్యాయినిగా ఉద్యోగ విరమణ చేసింది. రోజూ ఎంతో ఉత్సాహంగా స్కూల్‌కు వెళ్లే విజయమ్మకు ఉద్యోగ విరమణ తరువాత స్కూలు దూరం అయింది. అయితే ఉత్సాహం దూరం కాలేదు. జనవిజ్ఞాన వేదిక ద్వారా సామాజిక కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటోంది.మైపాడు గేటు సమీపప్రాంతంలో ఆమె ఉండే ఇల్లు పిట్టలు వాలిన చెట్టులా ఎప్పుడూ కళకళగా ఉంటుంది. విజయమ్మ పదవీ విరమణ చేసినా ఇప్పటికీ స్థానికులతో సహా ఎక్కడెక్కడి నుంచో విద్యార్థులు వస్తూనే ఉంటారు. విద్యార్థుల కోసం పుస్తకాలతోపాటు డ్రాయింగ్ టూల్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. విజయమ్మ ఇంట్లో ఒక మూల పుస్తకాలు చదువుకునే, ఒక మూల పెయింటింగ్ వేసే అమ్మాయిలు కనిపిస్తుంటారు. ఆమె మార్గదర్శకత్వంలో రోడ్డుకు ఇరువైపులా, రైల్వే గేట్.. మొదలైనప్రాంతాల్లో విద్యార్థులు విరివిగా మొక్కలు నాటుతున్నారు.అవయవ దానంతో పాటు శరీర దానాలు చేసేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ‘సింహపురి దేహ సమర్పణ’ సంస్థను విజయమ్మ ప్రారంభించింది. మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడి శరీరాన్ని వైద్యశాలలకు దానం చేసేలా చొరవ చూపుతుంది. ఇప్పటివరకు నలుగురి మృతదేహాలను ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలకు అందజేసింది. ప్లాస్టిక్ వినియోగం వల్ల జరిగే నష్టాలపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కలిగేలా ర్యాలీలు నిర్వహిస్తోంది.పనిలోనే ఆనందంరోజూ బడికి వెళుతున్నప్పుడల్లా ఎంతో ఉత్సాహంగా ఉండేది. విద్యార్థులలో విద్యార్థిగా మారిపోయేదాన్ని. ఇప్పుడు స్కూల్‌కు వెళ్లే అవకాశం లేకపోయినా విద్యార్థులకు దూరం కాలేదు. ఇప్పటికీ ఎంతోమంది విద్యార్థులు నా దగ్గరికి వస్తుంటారు. మేమందరం కలిసి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. ‘హాయిగా ఇంట్లో విశ్రాంతి తీసుకోకుండా ఇవన్నీ ఎందుకు?’ అనే వాళ్లు కూడా ఉంటారు. అయితే నాకు పనిలోనే ఆనందం దొరుకుతుంది. మనం చేయడానికి ఈ సమాజంలో ఎన్నో మంచి పనులు ఉన్నాయి. మనం అనుకున్నవాటిలో కొన్ని చేయగలిగినా ఎంతో సంతోషం, ఎంతో శక్తి వస్తుంది.– విజయమ్మ – వల్లూరు సాంబశివరావు, సాక్షి, పొగతోట, నెల్లూరు -
విద్యార్థులే వంట మాస్టర్లు!
ఉదయగిరి: చదువుకోవాల్సిన విద్యార్థులతో వంట పనులు చేయిస్తూ వేధిస్తున్నారు. ఏడు నెలలుగా కొనసాగుతున్న ఈ వేధింపులు ఆదివారం వెలుగులోకి వచ్చాయి. వివరాలు.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గండిపాలెం గురుకుల విద్యాలయంలో ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు 428 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యార్థులకు వంట చేసేందుకు ఇద్దరు కుక్‌లు, మరో ఇద్దరు సహాయకులు ఉన్నారు.కానీ ప్రతి రోజూ వంటతో పాటు ఇతర పనులు చేసేందుకు విద్యార్థులను 15 మంది చొప్పున బ్యాచ్‌లుగా విభజించారు. రొటేషన్ పద్ధతిలో వీరితో వంట పనులు చేయిస్తున్నారు. ఆదివారం చపాతీలు చేయాల్సి ఉంది. విద్యార్థులందరికీ కలిపి దాదాపు 1,300 చపాతీలు అవసరం. దీంతో ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకే ఒక బ్యాచ్ విద్యార్థులతో చపాతీలు తయారు చేయించారు. దీనికి సంబంధించిన వీడియో ఆదివారం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది.ఏడు నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రిన్సిపాల్ పుష్పరాజ్‌ను వివరణ కోరగా.. ఆదివారం నలుగురు వంట సిబ్బందిలో ఇద్దరు విధులకు హాజరవ్వలేదని చెప్పారు. దీంతో వంట పనులు విద్యార్థులతో చేయించినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. కాగా, కన్జ్యూమర్స్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అధ్యక్షుడు తిరుపాల్ మాట్లాడుతూ.. విద్యార్థులతో పనులు చేయిస్తున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. -
వాట్సాప్ ద్వారా మద్యం డోర్ డెలివరి.. ‘సంపద సృష్టి అంటే ఇదేనా చంద్రబాబు’
సాక్షి,నెల్లూరు: ‘రాష్ట్రంలో వాట్సాప్ ద్వారా మద్యం డోర్ డెలివరీ అవుతుంది.. చంద్రబాబు ఇదేనా మీ సంపద సృష్టి అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. మద్యం వ్యాపారులతో చంద్రబాబు ఒప్పందం కుదుర్చుకున్నారు. మద్యం ధరల్ని పెంచారు. తద్వారా ఏటా మూడు వేల కోట్లు చంద్రబాబు జేబులోకి వెళ్లనున్నాయి’అని విమర్శలు గుప్పించారు.కూటమి ప్రభుత్వం లిక్కర్ ధరల్ని పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘లిక్కర్ ధరలు పెంచి చంద్రబాబు బాదుడు మళ్ళీ షురూ చేశారు. ప్రభుత్వ అధీనంలో ఉన్న మద్యం షాపుల్ని టీడీపీ నేతలకు కట్టబెట్టి.. ధరలు పెంచేశాడు. లిక్కర్ షాప్స్‌లో పని చేస్తున్న వారిని రోడ్డున పడేశారు.ఎమ్మెల్యేల కనుసన్నల్లో బెల్ట్ షాపులు నడుస్తున్నాయి.తక్కువ ధరకే మేలైన మద్యం ఇస్తానని హామీ ఇచ్చి.. ఉన్న ఫలంగా రేట్లు పెంచాడు.ప్రభుత్వ ఆదాయానికి తూట్లు పొడుస్తూ.. టీడీపీ నేతలు జేబులు నింపుకునేలా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.పద సృష్టిస్తానని చెప్పి.. తన సంపద పెంచుకునే పనిలో పడ్డారు. ఎల్లో సిండికేట్స్ ఏకమై ప్రజల కష్టాన్ని దోచుకుంటున్నారు. మద్యం షాప్స్ దగ్గర నుంచి బెల్ట్ షాప్స్ దాకా.. స్థానిక ఎమ్మెల్యేలు కమిషన్స్ వసూలు చేస్తున్నారు. వందల కోట్ల కమిషన్స్ దండుకోవడంలో భాగంగా.. చంద్రబాబు మద్యం ధరలు పెంచారు.చంద్రబాబు ఉండవల్లి నివాసానికి నోట్ల కట్టలు భారీగా వెళ్తున్నాయి. మద్యం వ్యాపారులతో చంద్రబాబు డీల్ కుదుర్చుకుని.. మద్యం ధరలు పెంచారు. ఏటా 3 వేల కోట్ల రూపాయలు చంద్రబాబు జేబులోకి వెళ్ళబోతున్నాయి. వాట్సాప్ ద్వారా లిక్కర్ డోర్ డెలివరి అవుతుంది. రాష్ట్ర ప్రజలను చంద్రబాబు గాలికి వదిలేశారు’ అని దుయ్యబట్టారు. -
నెల్లూరు జిల్లాలో టీడీపీ నాయకుల భూకబ్జాలు
-
పోలీసులు ఇలా.. వాహనదారులు అలా..!
ప్రయాణాల్లో హెల్మెట్ తప్పకుండా ధరించాలంటూ నెల్లూరులో (Nellore) పోలీసులు వాహనదారులకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేస్తుండగా.. ప్రజలు మాత్రం ఇవేమీ తమకు పట్టవంటూ ర్యాలీ పక్కనుండే హెల్మెట్ (Helmet) లేకుండా ఇలా ప్రయాణిస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరుఅనంతపురంలో సూర్యోదయం (Sun Rise) వేళ ప్రకృతి తన సుందర రూపాన్ని ఆవిష్కరించింది. ఇందులో భాగంగా సర్పం ఆకారంలో ఉన్న మేఘం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ దృశ్యాన్ని పలువురు తమ సెల్‌ఫోన్‌ల్లో చిత్రీకరించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం విశాఖపట్నంలో 27వ రాష్ట్ర స్థాయి పాలిటెక్నిక్ కాలేజీల క్రీడలు ఉల్లాసంగా ఉత్సాహంగా సాగుతున్నాయి. ఈ పోటీల్లో విద్యార్థులు తమ ప్రతిభను చాటుతున్నారు. ఇందులో భాగంగా ఓ విద్యార్థి ఇలా హైజంప్ (High Jump) చేస్తున్నాడు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం కొన్నేళ్లుగా తమ కాలనీలోనే ఉంటున్న ప్రాథమిక పాఠశాలలోని 3, 4, 5 తరగతులను తమకు దూరంలోని మోడల్ పాఠశాలకు తరలిస్తున్నారని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో బుధవారం చుంచులూరు ఎస్సీ కాలనీ వాసులు ధర్నా. అనంతరం ఆత్మకూరు వెళ్లి ఆర్డీవో పావనికి వినతిపత్రం సమర్పించారు.పాఠశాలలో అక్షర జ్ఞాపకాల దొంతరలతో తడవాల్సిన బాల్యం పొట్ట చేతబట్టుకుని బతుకు జీవుడా అంటూ మండే ఎండలో స్వేదంతో తడిసి ముద్దవుతోంది. ప్రభుత్వం బడి బయట ఉన్న బడి ఈడు చిన్నారులను పాఠశాల బాట పట్టించడంలో విఫలమైంది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు–చినకోండ్రుపాడు, నిమ్మగడ్డవారిపాలెం మార్గాల్లో చిన్నారులు ఇలా మేకలు కాసుకుంటూ కనిపించారు.శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ బుధవారం ప్రయోగించిన వందో ప్రయోగం విజయవంతం కావడంతో చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలంలోని టేకుమంద జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు జేజేలు పలికారు. జయహో ఇస్రో, జయహో భారత్ అంటూ పాఠశాలకు చెందిన కలాం సైన్స్ క్లబ్ నినాదాలు చేసింది. ‘ఇస్రో 100’ అనే అక్షర ప్రదర్శన నిర్వహించి జేజేలు పలికారు. -
ఎమ్మెల్యే కోటంరెడ్డికి బిగ్ షాక్!
సాక్షి, నెల్లూరు: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. నియోజకవర్గంలో టీడీపీకి చెందిన సుమారు 200 మంది కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. ఈ క్రమంలో వారికి వైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆనం విజయకుమార్ రెడ్డి.నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. నియోజకవర్గంలో టీడీపీకి చెందిన సుమారు 200 మంది కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరిపోయారు. 31వ డివిజన్‌కి చెందిన టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డితో పాటు మరో 200 మంది టీడీపీ కీలక కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. ఈ నేపథ్యంలో వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రూరల్ నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇంచార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి. ఈ సందర్బంగా విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రూరల్ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని అన్నారు. అలాగే, పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.ఇదిలా ఉండగా.. ఏపీలో కూటమి సర్కార్ పాలనలో అధికార పార్టీలకు చెందిన కార్యకర్తలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయకపోవడంతో కూటమి కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఎందుకు ఇవ్వడంలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు సర్కార్‌పై మండిపడుతున్నారు. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన సూపర్ సిక్స్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరులో పతాక స్థాయికి చేరిన ఎమ్మెల్యే కోటంరెడ్డి అరాచకాలుకోటంరెడ్డి దురాగతాల్ని భరించలేక టీడీపీని వీడి వైయస్ఆర్సీపీలో చేరిన 200 మంది కార్యకర్తలు టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డితో పాటు 200 మంది కార్యకర్తలకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ… pic.twitter.com/ST1wReMtti— YSR Congress Party (@YSRCParty) January 27, 2025 -
నెల్లూరు రెడ్‌క్రాస్ కు రాజకీయ రంగు పులమడం దారుణం: చంద్రశేఖర్ రెడ్డి
-
Republic Day 2025: జయమ్మ విజయం
‘మన దేశంలో పేదలు కలలు కనగలరు. వాటిని నిజం చేసుకోగలరు’ అనే మాట ఎన్నో సందర్భాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నోటి నుంచి వినిపించింది. పేదరాలైన జయమ్మ కల కన్నది. ‘నా కష్టాన్ని చూసి నలుగురు మెచ్చుకుంటే చాలు’ నలుగురు ఏం ఖర్మ... సాక్షాత్తూ రాష్ట్రపతిభవన్ ఆమె కష్టాన్ని గుర్తించింది.‘నీ భర్త ఏం పనిచేస్తాడు?’ అనే ప్రశ్నకు... జయమ్మ చెప్పిన జవాబుకు అవతలి వ్యక్తి ముఖం అదోలా మారిపోయేది. మాటల్లో చిన్న చూపు కనిపించేది.నెల్లూరుకు చెందిన జయమ్మ ఔట్సోర్సింగ్ పారిశుధ్య కార్మికురాలు. దీంతోపాటు భర్తతో కలిసి సెప్టిక్ ట్యాంకు క్లీనింగ్ పనులు చేస్తుంది.‘చేయడానికి మీకు ఈ పనే దొరికిందా తల్లీ’ అని వెక్కిరించిన వాళ్లు ఎందరో! అయితే ఏ రోజూ చేస్తున్న పనిపట్ల నిర్లక్ష్యం, విముఖత జయమ్మలో కనిపించలేదు. ఆమె రెక్కల కష్టం వృథా పోలేదు. వృత్తి పట్ల జయమ్మ అంకితభావానికి గుర్తింపుగా దిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి ఆహ్వానం అందింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇస్తున్న విందులో పాల్గొనబోతోంది జయమ్మ.‘పెద్దోళ్లకు అందరూ చుట్టాలే. పేదోళ్లకు కష్టాలే చుట్టాలు’ అంటుండేది జయమ్మ తల్లి రాజమ్మ.ఆ ఇంటికి కష్టాలు కొత్త కాదు. కష్టపడడం కొత్త కాదు. నెల్లూరు నగరంలోని ఉమ్మారెడ్డిగుంట ప్రాంతానికి చెందిన జయమ్మ తన తల్లిదండ్రులకు సాయంగా రోజువారీ కూలిపనులకు వెళ్తుండేది. ‘ఏ పనీ లేకుండా ఇంట్లో కూర్చోవడం కంటే పనికి పోవడమే నాకు ఇష్టం’ అంటున్న జయమ్మకు ‘శ్రమ’ అనేది చిన్నప్పటి నేస్తం.జయమ్మకు రమేష్‌తో వివాహం జరిగింది. రమేష్ మొదట్లో సెప్టిక్‌ట్యాంక్ వాహనానికి డ్రైవర్‌గా వెళ్తుండేవాడు. పదేళ్లపాటు డ్రైవర్‌గా పనిచేసిన అనుభవంతో తానే సొంతంగా ఓ సెప్టిక్ ట్యాంకర్ సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేసి క్లీనింగ్ పనులు చేసుకుంటూ కుటుంబ పోషణ చేసేవాడు. ఇద్దరు పిల్లలు స్కూల్‌కి వెళ్లే వయస్సు వచ్చేవరకు గృహిణిగా ఉన్న జయమ్మ ఆ తరువాత భర్త చేసే సెప్టిక్ ట్యాంకు క్లీనింగ్ పనులకు తాను కూడా తోడుగా వెళ్తుండేది.చిన్నచూపు చూసినా..భూగర్భ డ్రైనేజీ పారిశుధ్య పనులకు వెళ్లే జయమ్మను తోటివారే చిన్నచూపు చూసేవారు. అవేమీ పట్టించుకోకుండా భర్తకు చేదోడువాదోడుగా ఉండేది. క్లీనింగ్ సమయాల్లో చర్మవ్యాధుల బారిన పడేది. ఈ దంపతుల కష్టాన్ని చూసిన ‘నవజీవన్ ’ అనే స్వచ్ఛంద సంస్థ నాలుగేళ్ల క్రితం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ షూరిటీతోపాటు ఎన్ ఎస్కేఎఫ్డీ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకు రుణం మంజూరు చేయించింది. రూ.10 లక్షల సబ్సిడీతో రూ.32 లక్షలు విలువైన కొత్త సెప్టిక్ ట్యాంకర్ క్లీనింగ్ వాహనాన్ని మంజూరు చేయించడంతో వారికి సొంతవాహనం సమకూరింది. దీంతో దంపతులిద్దరూ సొంత వాహనంతో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కార్పొరేషన్ అధికారుల సహకారంతో నగరంలోని ఎన్నో నివాసాల్లో సెప్టిక్‌ట్యాంక్ క్లీనింగ్ పనులు చేస్తున్నారు.అన్ని అంశాల్లో మంచి మార్కులుకేంద్ర ప్రభుత్వ ఎన్ ఎస్కేఎఫ్డీసీ (నేషనల్ సఫాయి కర్మచారీస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పోరేషన్) పథకం లబ్ధిదారు అయిన జయమ్మ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనానికి యజమాని అయింది. పథకాన్ని ఏ మేరకు సద్వినియోగం చేసుకున్నారు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా, సకాలంలో ఈఎంఐ కడుతున్నారా, లోడ్‌ను ఎక్కడంటే అక్కడ డంప్ చేస్తున్నారా లేక ప్రభుత్వం చూపిన పాయింట్లోనే డంప్ చేస్తున్నారా... ఇలాంటి అంశాలతో పాటు తగినవిధంగా జీవనోపాధి పొందుతున్నారా.. పోలీస్ స్టేషన్లో ఏమైనా కేసులు నమోదయ్యాయా... ఇలా ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు ఎన్ఎస్కేఎఫ్డీసీ అధికారులు. అన్నింట్లో మంచి మార్కులు రావడంతో జయమ్మ కృషికి గుర్తింపు లభించింది. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనడానికి రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం వచ్చింది.ఆ నమ్మకంతోనే...‘నమ్మిన పని ఎప్పుడూ మోసం చేయదు అనే మాట ఎన్నోసార్లు విన్నాను. ఆ నమ్మకంతోనే ఎంతమంది వెక్కిరించినా పట్టించుకోలేదు. మా ఆర్థిక స్థాయికి సెఫ్టిక్ ట్యాంకర్ క్లీనింగ్ బండికి సొంతదారులమవుతామని అనుకోలేదు. కష్టపడితే ఆ కష్టమే మనల్ని ముందుకు తీసుకువెళుతుంది’ అంటూ ఆత్మవిశ్వాసం నిండిన గొంతుతో అంటుంది జయమ్మ.జీవితంలో మర్చిపోలేని రోజుమేము చేసే వృత్తి తప్పుడు పనేం కాదు. మా రెక్కల కష్టాన్నే నమ్ముకుని పనిచేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. అందులోనే మాకు సంతృప్తి ఉంది. ఎవరేమి అనుకున్నా మేము ఎప్పుడూ బాధపడలేదు. నా భర్తకు తోడుగా సాయంగా వెళ్లి క్లీనింగ్ పనులు చేస్తున్నా. గణతంత్ర వేడుకల్లో పాల్గొనాలని రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆహ్వాన పత్రిక రావడం జీవితంలో మర్చిపోలేని సంఘటన. ఎంతో సంతోషంగా ఉంది.– జయమ్మ– చిలక మస్తాన్‌రెడ్డి సాక్షి ప్రతినిధి, నెల్లూరు -
సంప్రదాయాలకు ప్రతీక.. నెల్లూరు సంక్రాంతి సంబురాల్లో ఎడ్ల పందేలు (చిత్రాలు)
-
ప్రతి గ్రామంలో కూడా పార్టీ నిర్మాణం జరగాలి
-
వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
జగనే కరెక్ట్ అంటున్నారు.. (ఫొటోలు)
-
నెల్లూరు జిల్లా నేతలతో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
-
నెల్లూరు జిల్లా నేతలతో వైఎస్ జగన్ కీలక సమావేశం
-
నేడు నెల్లూరు జిల్లా నేతలతో వైఎస్ జగన్ భేటీ
-
రైతన్నల పడిగాపులు
-
యువకుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్
-
ఎంపీ వేమిరెడ్డి ఆగడాలు..గనుల యజమానుల రహస్య భేటీ..!
సాక్షి,నెల్లూరు:టీడీపీ ఎంపీ వేమిరెడ్డికి వ్యతిరేకంగా నెల్లూరు(Nellore)జిల్లా మైనింగ్ కంపెనీల యజమానులు సమావేశమయ్యారు. జిల్లాలో క్వార్జ్ మైనింగ్ వివాదం రోజురోజుకు ముదురుతోంది. సైదాపురంలో ఉన్న తెల్లరాయి తవ్వకం,రవాణాకు అనుమతులు దక్కించుకుని వందల కోట్ల మైనింగ్‌ను ఎంపీ వేమమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి(Vemireddy Prabhakarreddy) తన గుప్పెట్లో పెట్టుకున్నారు. తాను చెప్పిన ధరకే క్వార్ట్జ్ అమ్మాలంటూ గనుల యజమానులపై వేమిరెడ్డి ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో ఆయనకు వ్యతిరేకంగా గూడూరులోని ఓ హోటల్లో గనుల యజమానులు రహస్య సమావేశం నిర్వహించారు. వేమిరెడ్డికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు మైనింగ్ యజమానులు ఈ సమావేశంలో తీర్మానం చేసినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: పోలీసుల ఓవరాక్షన్..వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు -
ఎడ్లంటే ప్రేమ.. పోటీలకు సై..
పొదలకూరు: ఆ యువకుడికి వ్యవసాయమన్నా, పశువుల పెంపకమన్నా ప్రాణం. ఉన్నత చదువులు చదివి సాఫ్ట్‌వేర్‌గా ఉద్యోగం చేస్తున్నా.. మనసంతా ఎడ్లపైనే ఉండేది. ఆ మమకారంతోనే రెండు కోడె దూడలను కొనుగోలు చేసి వాటికి రాముడు, భీముడు అని ముద్దుగా పేర్లు పెట్టుకుని పిలుస్తున్నాడు. అవి ఇప్పుడు పెద్దవయ్యాయి. రాష్ట్రస్థాయి ఎడ్ల పందేల్లో (బండ లాగుడు) పాల్గొని అవి ప్రథమ స్థానంలో నిలవాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నాడు.ఆలనాపాలనకు ప్రత్యేకంగా ఒకరు కోడెదూడలను కొనుగోలు చేసిన నాటి నుంచి వాటి ఆరోగ్యంపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాను. వాటిని రాముడు, భీముడు అనే పేర్లతో మా కుటుంబమంతా పిలుచుకుంటున్నాం. వాటి ఆలనాపాలనకు నెల జీతం ఇచ్చి ఓ మనిషిని కూడా ఏర్పాటు చేశాను. చెబితే అతిశయోక్తిగా ఉంటుందేమో కానీ వాటి పోషణకు నిత్యం రూ.2 వేలు వరకు ఖర్చు చేస్తున్నాను. పశుగ్రాసంతోపాటు ఉలవలు, జొన్నలు కూడా పెడుతున్నాం. నేను కోడెలను కొని మూడేళ్లయింది. వాటి వయసు ఇప్పుడు నాలుగేళ్లు. పోటీలకు సిద్ధం చేసే ఉద్దేశంతో శిక్షణ ఇప్పిస్తున్నాను. తోటలోనే పరుగులు తీయించి అలసటను తట్టుకునేలా అలవాటు చేస్తున్నాను. పశువైద్యుల సలహాలు సూచనలు తీసుకుని వాటి ఆరోగ్యంపై పరీక్షలు కూడా చేయిస్తున్నాను. ఏదో తెలియని వెలితి ఆ యువకుడి పేరు బుధవరపు ప్రతాప్. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం బిరదవోలు పంచాయతీ ముత్యాలపేట గ్రామం. సాక్షి అతడిని పలుకరించగా ఏం చెప్పారంటే... మాది వ్యవసాయ కుటుంబం. నేను కావలి విట్స్ ఇంజినీరింగ్ కాలేజీలో చదివాను. ఐదేళ్ల క్రితం హైదరాబాద్ హెచ్‌సీఎల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరాను. కరోనా సమయంలో వర్క్‌ఫ్రం హోమ్‌లో భాగంగా ఇంటి నుంచే పనిచేసేవాడిని.చదవండి: సింహపురి ‘కోడల్లుళ్లు’ వచ్చేశారోచ్!ఉద్యోగంలో జీతం బాగానే వస్తున్నా ఏదో తెలియని వెలితి ఉండేది. తాత, తండ్రుల నుంచి పోషిస్తున్న ఎడ్లపై అభిలాష కలిగింది. ఒంగోలు జాతికి చెందిన కోడెలు కొనుగోలు చేసి పోషించాలని భావించి మా నాన్న పెంచలయ్యతో చెప్పాను. దానికి ఆయన మొదట సందేహించినా నా ఇష్టాన్ని కాదనలేదు. తండ్రి సహకారంతో వెంకటాచలం మండలం సర్వేపల్లి గ్రామంలో 8 నెలల వయస్సు ఉన్న దూడను రూ.80 వేలు వెచ్చించి, అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఏడాది వయసున్న దూడను రూ.లక్ష వెచ్చించి కొన్నాను. ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నా రాముడు, భీముడుకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తే రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీల్లో రాణిస్తాయని నమ్మకంగా ఉంది. ఇందుకోసం నెలకు రూ.30 వేలు వెచ్చించి వైఎస్సార్ జిల్లా చెన్నూరులో నెల కిందటే శిక్షకుడి వద్ద వదిలిపెట్టాను. ప్రతినిత్యం వాటిని వీడియోకాల్‌లో చూసుకుంటూ శిక్షణకు ఎలా సహకరిస్తున్నాయో తెలుసుకుంటున్నాను. నా ఎడ్ల గురించి తెలిసిన కొందరు రైతులు మంచి ధరతో కొనుగోలు చేస్తామని ముందుకొచ్చినా నేను ససేమేరా అన్నాను. బండలాగుడు పోటీల్లో అవి ప్రథమ స్థానంలో నిలవడమే నా లక్ష్యం. -
ఇది 'గంగా' దందా
సాక్షి, టాస్క్ ఫోర్స్ : ఆయనేమీ ప్రజాప్రతినిధి కాదు. అధికార పార్టీ నేత మాత్రమే. ఇది చాలు దండుకోవడానికన్నట్లు ప్రభుత్వేతర శక్తిగా రెచ్చిపోతున్నారు. సొంత పార్టీలోని ఇతర నేతలకు సైతం కొరకరాని కొయ్యలా మారి ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలను సైతం లెక్క చేయడం లేదు. తన నియోజకవర్గం మీదుగా వెళ్లే ప్రతి ఇసుక లారీ తను చెప్పిన రేటుకు అన్లోడ్ చేసి వెళ్లాల్సిందేనని రూల్ పెట్డారు. ఏకంగా నేషనల్ హైవేపై అనధికారికంగా టోల్గేట్ పెట్టి, తన ప్రైవేటు సైన్యాన్ని మోహరించారు. ఆయనే ప్రముఖ పారిశ్రామిక వేత్త గంగా ప్రసాద్. ఈయన వ్యవహారం ప్రధానంగా వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాల్లోని అధికార కూటమి పార్టీల నేతలకు మింగుడు పడటం లేదు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అంటూ గొప్పలు చెప్పుకుంటున్నా, అది క్షేత్ర స్థాయిలో ఎక్కడా అమలవ్వడం లేదు. లోకల్ ఎమ్మెల్యేల కనుసన్నల్లో రీచ్‌ల నిర్వహణ సాగుతోంది. ఈ ప్రాంతంలో పెన్నా నదిలో భారీ యంత్రాలు పెట్టి టన్నుల లెక్కన లోడింగ్ చార్జీల పేరుతో నగదు వసూలు చేసుకుంటూ కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నారు. పెన్నా ఇసుకకు ఇతర జిల్లాలతో పాటు చెన్నై, బెంగళూరులో ఎక్కువ డిమాండ్ ఉంది. దాంతో అధికార పార్టీ నేతలు పెన్నా నది నుంచి ఇసుకను చెన్నై, బెంగళూరులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తిరుపతి జిల్లాకు చెందిన గంగాప్రసాద్ కన్ను ఈ దందాపై పడింది. 20 రోజులుగా జాతీయ రహదారిపై ప్రైవేటు సైన్యం ద్వారా టోల్గేట్ పెట్టి, ఇసుక లారీలను ఆపుతున్నారు. టన్ను ఇసుకను రూ.750 చొప్పున వదిలేసి వెళ్లాలని నిబంధన పెట్టారు. లేదంటే వెనక్కు వెళ్లిపోవాలని హుకుం జారీ చేస్తున్నారు. పార్టీ పెద్దలతో ఉన్న సంబంధాల దృష్ట్యా స్థానిక నేతలెవరూ ఈయన వ్యవహారాన్ని నేరుగా ప్రశ్నించలేక పోతున్నారు. ఇప్పటికే సిలికా, సైదాపురం గనుల్లో సైతం అనధికారికంగా మైనింగ్ దందా నడుపుతున్న గంగాప్రసాద్.. సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఉన్న స్వర్ణముఖి నది గర్భాన్ని సైతం తోడేస్తూ చెన్నైకి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అక్కడ పెద్ద టిప్పర్ ఇసుక రూ.80 వేల నుంచి రూ.లక్ష ధర పలుకుతోంది.నెల్లూరు ఇసుక మాఫియా ఆయన కనుసన్నల్లోనే..నెల్లూరు జిల్లా ఇసుక మాఫియాను కూడా గంగా ప్రసాద్ తన గుప్పిట్లోకి తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి. తిరుపతి, నెల్లూరు సరిహద్దు ప్రాంతంలో నేషనల్ హైవేపై ఏకంగా టోల్గేట్ పెట్టి, ప్రైవేటు సైన్యం చేత వాహనాలను తనిఖీలు చేయిస్తున్నారు. ఇందుకు పోలీసులు సైతం ఈయనకు సహకరిస్తుండటం విడ్డూరం. తన మాట వినకుండా ఏ లారీ అయినా ముందుకు వెళితే.. గూడూరు రూరల్ పోలీసుల ద్వారా కేసులు నమోదు చేయిస్తున్నారు. టన్ను ఇసుక రూ.750 చొప్పున కారు చౌకగా కొట్టేస్తున్న గంగాప్రసాద్... శ్రీసిటీలో నిర్మాణాలకు టన్ను రూ.1,500 చొప్పున విక్రయిస్తున్నారు. శ్రీసిటీలో 50 వేల మెట్రిక్ టన్నుల ఇసుక అవసరం ఉందని తెలుసుకుని ఈ దందాకు దిగారు. ఈయన వ్యవహారం అటు తిరుపతి, ఇటు నెల్లూరు జిల్లాల్లోని ఎమ్మెల్యేలకు మింగుడు పడటం లేదు. ఆయా జిల్లాల నుంచి చెన్నై, బెంగళూరు వెళ్లే ఇసుక లారీలకు ఆరు నెలలుగా లోకల్ ఎమ్మెల్యేలు వెన్నుదన్నుగా ఉన్నారు. గంగా ప్రసాద్ రంగంలోకి దిగడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని త్వరలో సీఎం దృష్టికి తీసుకెళ్లాలని వారంతా నిర్ణయించినట్లు తెలిసింది. -
వేమిరెడ్డికే క్వార్ట్జ్ గనులు!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సైదాపురం క్వార్ట్జ్ గనులపై ఎమ్మెల్యేలు, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మధ్య నెలకొన్న ఆధిపత్య పోరులో ఎంపీదే పైచేయిగా మారినట్లు సమాచారం. గనులను చేజిక్కించుకునేందుకు జిల్లాకు చెందిన ఇతర ఎమ్మెల్యేలు చేసిన యత్నాలు బెడిసికొట్టాయి. ఎంపీ వేమిరెడ్డికి ప్రభుత్వ ‘ముఖ్య’ నేత గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జనవరి నుంచి ఇక అధికారికంగానే గనుల దోపిడీ జరగనుంది. నాణ్యమైన గనులు ఉన్న వెంకటగిరి, సర్వేపల్లి, ఉదయగిరి నియోజకవర్గాల్లో దొరికే క్వార్ట్జ్ మెటల్‌ను ఆయనకే అప్పగించాలని ప్రభుత్వ పెద్దల నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు నజరానాగా ప్రతి నెలా ‘ముఖ్య’ నేతకు ముడుపులు చెల్లించేలా ఒప్పందం జరిగినట్లు సమాచారం. ఇప్పటికే సైదాపురం పరిసర ప్రాంతాల నుంచి గత నెల రోజులుగా నిత్యం వందల లారీల్లో ఖనిజాన్ని అనధికారికంగా పెద్ద ఎత్తున తరలిస్తున్నారు.తమకు ముడిసరుకు మొత్తం అప్పగించాలని లేదంటే కేసులు బనాయించి లీజులు రద్దు చేయిస్తామని అన్ని అనుమతులున్న ఇతర గనుల యజమానులను బెదిరిస్తున్నారు. అన్ని అనుమతులు ఉన్నప్పటికీ గత ఆర్నెళ్లుగా గనుల యజమానులు తవ్వకాలు చేపట్టకుండా అడ్డుకుంటున్నారు. లీగల్ మైన్లను దుర్మార్గంగా నిలిపివేయడంపై గనుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమ అనుకూల అధికారులను నియమించుకోవడంతోపాటు సైదాపురంలో ఎంపీ వేమిరెడ్డి కార్యాలయం ఏర్పాటుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. సైదాపురం కేంద్రంగా ఇకపై అక్కడి నుంచే తన వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుగా వేమిరెడ్డి అన్ని వసతులు ఏర్పాటు చేసుకుంటున్నారు. గనుల తవ్వకాలపై ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా సైదాపురం పరిసరాల్లో క్వార్ట్జ్ శుద్ధి పరిశ్రమ ఏర్పాటు పేరుతో జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. ఉపాధి దొరుకుతుందంటూ కంపెనీ ముసుగులో ప్రజలను మభ్యపుచ్చి కొన్నాళ్ల పాటు హడావుడి చేసి అనంతరం అందరి నుంచి గనులను లాక్కునే ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది.గనుల యజమానులకు బెదిరింపులు.. జిల్లాలో మైనింగ్ దందాను చేజిక్కించుకున్న వేమిరెడ్డి అనుచరులు అధికారికంగా అన్ని అనుమతులున్న గనులు యజమానులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. అధికారిక గనుల్లో ఉన్న ముడిసరుకును సైతం తమకే ఇవ్వాలని, తాము చెప్పిన ధరకే అప్పగించాలని బెదిరింపులకు దిగారు. ఇప్పటికే తవ్విన ఖనిజంతోపాటు ఇకపై వెలికితీసేది కూడా తాము చెప్పిన నామ మాత్రపు ధరకే ఇవ్వాలని ఆదేశించారు. ఈ క్రమంలో గనుల యజమానులను హైదరాబాద్‌లోని తన కార్యాలయానికి పిలిపించుకుని ఎంపీ తీవ్ర స్థాయిలో హెచ్చరించినట్లు సమాచారం. ముడిసరుకు ఇవ్వకుంటే గనుల నుంచి మీ లారీలు వెళ్లలేవని, పలు రకాల కేసులు నమోదు చేయించి లీజులు రద్దు చేయిస్తామంటూ తమను బెదిరించినట్లు ఓ గని యజమాని వాపోయాడు. తమ మైన్లకు అన్ని అనుమతులు ఉన్నాయని, గత 50 ఏళ్లుగా ‘డెడ్ రెంట్’ సైతం చెల్లిస్తున్నామని పేర్కొన్నాడు.రూప్ కుమార్ ద్వారా..ఎంపీ వేమిరెడ్డి తన అనుచరుడైన రూప్‌కుమార్‌ను ముందుపెట్టి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. సైదాపురం సమీపంలోని శ్రీనివాస పద్మావతి, చాగణం సమీపంలో ఉన్న సిద్ధి వినాయక, తుమ్మలతలుపూరులో ఉన్న జయలక్ష్మి కనకదుర్గా, కలిచేడు సమీపంలో ఉన్న రాఘవేంద్ర గనులు ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఆర్నెళ్లుగా అందరి మైన్లు నిలిపివేసి కేవలం ఎంపీ అనుచరుడికి చెందిన నాలుగు గనులకే అనుమతులు ఇవ్వడం వెనుక మతలబు ఏమిటనేది తెలిసిపోతోంది.అనుకూల అధికారి రాకనెల్లూరు జిల్లా మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా తిరుపతి జిల్లా డీడీ బాలాజీ నాయక్‌కు అదనపు బాధ్యతలు అప్పగించేలా ఎంపీ చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. గతంలో ఇక్కడ పనిచేసిన చంద్రశేఖర్‌ను కలెక్టర్ ద్వారా 20 రోజుల క్రితం ప్రభుత్వానికి సరెండర్ చేశారు. అయితే దీన్ని న్యాయస్థానం తప్పుబట్టడంతో మళ్లీ పోస్టింగ్ ఇచ్చినట్లే ఇచ్చి విజయవాడకు బదిలీ చేశారు. అనంతరం ఆ పోస్టులో తమ అనుకూల అధికారిని నియమించేలా బుధవారం ఉత్తర్వులు జారీ చేయించారు.విదేశాల్లో భారీ గిరాకీ..కూటమి ప్రభుత్వం రాగానే సైదాపురం క్వారŠట్జ్ గనులపై ‘ముఖ్య’ నేత కన్ను పడటంతో వెంటనే అనుమతులు నిలిపివేశారు. అన్ని అనుమతులతో వందేళ్ల లీజుపై తీసుకున్న గనులను సైతం మూసి వేయించారు. ఇక్కడ లభ్యమయ్యే మైకా క్వార్‌ట్టŠజ్, తెల్లరాయి క్వార్‌ట్టŠజ్‌పై నివేదిక తెప్పించుకున్నారు. వందేళ్లకు సరిపడా గనుల్లో నిల్వలున్నట్లు గుర్తించడంతో వాటిని తవ్వి సొమ్ము చేసుకునేందుకు పథకం వేశారు. సైదాపురం మండలంలో లభించే ఖనిజాన్ని చైనా, జపాన్, రష్యాకు ఎగుమతి చేస్తుంటారు. ఎనిమిది నెలలుగా మైకా, క్వార్ట్ ్జకి విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. నాణ్యతను బట్టి ముడి ఖనిజం టన్ను రూ.25 వేల నుంచి రూ.రెండు లక్షల వరకు పలుకుతోంది. చైనాలోని సెమీకండక్టర్ పరిశ్రమల్లో మైకా క్వార్ట్ ్జని ఎక్కువగా వినియోగిస్తున్నారు. -
నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలం
నెల్లూరు(అర్బన్): శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలం రేపింది. మర్రిపాడు మండలం వెంకటాపురానికి చెందిన బత్తుల నాగరాజు, కళ్యాణి దంపతుల ఐదేళ్ల కుమారుడు సుబ్బరాయుడు జ్వరం, తలనొప్పితో సుమారు 20 రోజులుగా బాధపడుతున్నాడు. మొదట్లో స్థానికంగా వైద్యం చేయించినా తగ్గలేదు.దీంతో 10 రోజుల కిందట నెల్లూరులోని నారాయణ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు పరీక్షించి మందులు రాసి ఇంటికి పంపారు. అయినా తగ్గకపోవడంతో మళ్లీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో వైద్యులు థర్డ్ పార్టీ ల్యాబ్ సహకారంతో ముంబైలోని ప్రైవేటు ల్యాబ్‌కు రక్త నమూనాలు పంపారు. అక్కడ జికా వైరస్ అని తేలింది. దీంతో బాలుడిని మెరుగైన చికిత్స కోసం చెన్నై ఎగ్మోర్‌లోని బేబీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. -
నెల్లూరు జిల్లాలో కలకలం రేపుతోన్న జికా వైరస్
-
కోట్లు పలుకుతున్న కావలి సబ్ రిజిస్ట్రార్ పోస్టు
కావలి సబ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వేదికగా అధికారానికి, అహంకారానికి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. లంచం లేనిదే సంతకం పెట్టని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లంచాలకు తావులేదంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కావలిలోనే కాక, ఆ శాఖలో చర్చనీయాంశమైంది. ఈ శాఖలో అవినీతికి తావులేదని చెప్పిన ఆ ప్రజాప్రతినిధే.. మూడు నెలలు తిరగక ముందే ప్లేటు ఫిరాయించి ఆ పోస్టుకు బహిరంగ వేలం పెట్టడంతో సబ్ రిజిస్ట్రార్ vs ప్రజాప్రతినిధిగా మారింది. సెలవు పెట్టి వెళ్లిపోవాలని.. లేదంటే ఎలా పనిచేస్తావో చూస్తానన్న సదరు ప్రజాప్రతినిధిని ధిక్కరించి.. ఆ సబ్ రిజిస్ట్రార్ తన పలుకుబడితో అదే సీటులో కూర్చొని పనిచేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కావలి సబ్ రిజిస్ట్రార్ సీటు.. భలే హాటుగా మారింది. ఈ పోస్టు వ్యవహారం జిల్లాలో హాట్‌టాపిక్ అయింది. అధికారం, రాజకీయం ఆధిపత్యం కొనసాగుతోంది.రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో దళారీ వ్యవస్థ ద్వారా అదనపు వసూళ్లు లేకుండా కాగితం కదలని పరిస్థితి. అలాంటి సబ్ రిజిస్ట్రార్కార్యాలయం ఎదుట లంచాలకు తావులేదని, ప్రభుత్వ రుసుములు చెల్లిస్తే చాలని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ పెద్ద సంచలనంగా మారింది. నిత్యం క్రయవిక్రయాల్లో రూ.లక్షల్లో చేతులు మారే కార్యాలయంలో ఉన్న పళంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం వెనుక పెద్ద కథే నడిచింది. ఈ వ్యవహారం వెనుక అధికారి నిజాయితీ ఉందనుకుంటే పొరపాటే. రూ.కోట్లు పలికే ఆ పోస్టులో సదరు ప్రజాప్రతినిధిని ధిక్కరించి కూర్చొన్న సదరు మహిళా అధికారి భవిష్యత్ ప్రమాదానికి భయపడి ఆ బోర్డు ఏర్పాటు చేసినట్లుగా చర్చ సాగుతోంది. నెలకు రూ.50 లక్షల ఆదాయం జిల్లాలో నెలవారీ ముడుపుల ఆదాయంలో నెల్లూరు తర్వాత కావలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయమే. కావలి చుట్టూ రామాయపట్నం పోర్టు, పోర్టు ఆధారిత పరిశ్రమలు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, దగదర్తి విమానాశ్రయం ఇలా పారిశ్రామికంగా అభివృద్ధి వైపు దూసుకుపోతున్న కావలిలో రియల్ ఎస్టేట్ రంగం ఉవ్వెత్తున ఎగిసి పడుతోంది. ఈ ప్రాంతంలో భూ క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అయితే భూ వివాదాలు ఉన్న ఈ ప్రాంతంలో రిజిస్ట్రేషన్లు ప్రక్రియ కీలకంగా మారింది. నిబంధలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేస్తే రూ.లక్షల్లో ముడుపులు అందుతాయి. నెలవారీగా సబ్ రిజిస్ట్రార్ ఆదాయం రూ.50 లక్షలకుపై మాటే ఉంటుందని సమాచారం. ఈ క్రమంలో కావలి సబ్ రిజిస్ట్రార్ పోస్టుకు భలే డిమాండ్ ఏర్పడింది. అయితే ఈ దఫా సాధారణ బదిలీల్లో భాగంగా ఉన్నతాధికారులను మేనేజ్ చేసుకుని ఓ మహిళా అధికారి ఈ పోస్టును పట్టేసింది. స్థానిక ప్రజాప్రతినిధి సిఫార్సు లేఖ లేకుండానే ఆ పోస్టులో కూర్చొంది. రెండు నెలల పాటు సబ్‌రిజి్రస్టార్ కార్యాలయంలో కాసులు గలగలాడాయి. దీంతో ఆ పోస్టుపై కన్నేసిన ప్రజాప్రతినిధి సదరు అ«ధికారిణి దందా వ్యవహారంపై ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం, ఆమె కొద్ది రోజులు సెలవుపై వెళ్లడం చకచకా జరిగిపోయాయి. పోస్టుకు బహిరంగ వేలం.. కావలి సబ్‌రిజిస్ట్రార్ సెలవుపై వెళ్లడంతో ఆ పోస్టుకు డిమాండ్ పెరిగింది. దీంతో సదరు ప్రజాప్రతినిధి ఈ పోస్టుకు వేలం పెట్టినట్లు తెలుస్తోంది. నెలవారీగా రూ.లక్షల్లో ఆదాయం వచ్చే ఆ పోస్టుకు గతంలో పని చేసిన ఓ అధికారి, నెల్లూరులో పనిచేసి వెళ్లిన మరో అధికారి పోటీ పడుతున్నారు. రెగ్యులర్ పోస్టు అయితే.. రూ.2 కోట్లు ఇవ్వడానికి సిద్ధమని చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం బదిలీలపై నిషేధం ఉండడంతో డిప్యుటేషన్‌పై వచ్చేందుకు అధికారులు పోటీ పడుతున్నారు. రూ.కోటి వరకు బేరం కుదిరింది. లోకల్ ప్రజాప్రతినిధి సిఫార్సు లేఖతోపాటు రిజిస్ట్రేషన్ శాఖ రాష్ట్ర కార్యాలయంలో భారీ ఆఫర్లతో పోస్టు కోసం ఎగబడుతున్నారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో తన పోస్టుకు ఎసరు పెడుతున్న విషయాన్ని తెలుసుకున్న సదరు అధికారిణి జిల్లాకు చెందిన ఓ మంత్రి ద్వారా ఉన్నతాధికారులకు రెకమెండ్ చేయించుకుని వెను వెంటనే విధుల్లో జాయిన్ అయిపోయింది. అధికారంలోకి వచ్చిన వెంటనే కార్యాలయాన్ని సందర్శించిన సదరు ప్రజాప్రతినిధి ఇక్కడ అవినీతికి తావులేకుండా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని చెప్పారు. మూడు నెలలు తిరగక ముందే ఆ పోస్టుకు వేలం పెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీటు వదలాల్సిందే.. కదిలే ప్రసక్తే లేదు.. కావలి సబ్ రిజిస్ట్రార్ గా విధుల్లో జాయిన్ అయిన అధికారిణి స్థానిక ప్రజాప్రతినిధి వద్దకు ఇతరులను రాజీ రాయబేరానికి పంపించారు. అయితే ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రజాప్రతినిధి ఆమె ఆ సీటులో ఎన్ని రోజులు కూర్చుంటుందో నేను చూస్తానంటూ బెదిరింపులకు దిగారు. ఆ సీటు వదలాల్సిందేనని సదరు ప్రజాప్రతినిధి హుంకరిస్తుంటే.. కదిలే ప్రసక్తే లేదంటూ సబ్ రిజిస్ట్రార్ మొండికేస్తున్నారు. అధికారి, ప్రజాప్రతినిధి మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధంలో రాజకీయంగా ఉచ్చు బిగిసే అవకాశం ఉండడంతో ఆ సబ్ రిజిస్ట్రార్ ముందు జాగ్రత్తలు తీసుకుంటూ ఆ ప్రజాప్రతినిధికే సవాల్ విసురుతూ ఎదురొడ్డుతున్నారు. ఈ క్రమంలో ఏసీబీని అస్త్రంగా ఉపయోగించుకునే అవకాశం ఉందని భావించిన సదరు అధికారిణి కార్యాలయంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇందులో ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజు, చలనాలు మాత్రమే చెల్లించాలని, దళారులకు ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వొద్దని బోర్డు పెట్టించడమే కాకుండా క్రయ, విక్రయ దారులను ఎవరికి అదనపు రుసుములు చెల్లించవద్దని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం ఆ కార్యాలయ ఉద్యోగులకు నచ్చడం లేదు. రూ.లక్షలు వెచ్చించి కావలి కార్యాలయానికి బదిలీపై వస్తే లంచాలు రాకుండా ఆమె వ్యక్తిగత స్వార్థం కోసం తమకు వచ్చే ఆదాయాన్ని అడ్డుకుంటుందని ఉద్యోగులు మండిపడుతున్నారు. గతంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా, గుంటూరు జిల్లాలో పనిచేసిన సదరు అధికారిణిపై అనేక ఆరోపణలున్నట్లు ఆ శాఖలో ప్రచారం జరుగుతోంది. అలాంటి అధికారిణి కావలికి వచ్చేసరికి ఇలా బోర్డులు ఏర్పాటు చేయడంపై ఆ శాఖలోనే హాట్ టాపిక్‌గా మారింది. -
నీళ్ల కోసం రోడ్డెక్కిన రైతులు
కందుకూరు/లింగసముద్రం: సాగునీటి కోసం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని రాళ్లపాడు ప్రాజెక్టు ఆయకట్టు రైతులు ఆందోళనకు దిగారు. ఆదివారం ప్రాజెక్టు వద్ద బైఠాయించి నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని నినదించారు. ఈ ఏడాది రాళ్లపాడు ప్రాజెక్టులోకి పూర్తి స్థాయిలో నీళ్లు వచ్చాయి. దీంతో ప్రాజెక్టు కుడి కాలువ కింద ఉన్న లింగసముద్రం, కొండాపురం మండలాల రైతులు నెల రోజులుగా పెద్ద ఎత్తున నార్లు పోశారు. వారం కిందట కుడికాలువ గేటు ఊడి కింద పడిపోవడంతో నీటి విడుదల నిలిచిపోయింది. గేటుకు మరమ్మతులు చేసి పైకి లేపడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో నీరు రాక నారు ఎండిపోతోంది. ఈ పరిస్థితుల్లో ఆదివారం ఒక్కసారిగా రెండు మండలాల రైతులు ఆందోళనకు దిగారు. ప్రాజెక్టుపై రోడ్డు మీద బైఠాయించి వాహన రాకపోకలను అడ్డుకున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆయకట్టు రైతులను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రాజెక్టులో చేపల పెంపకంపై ఉన్న శ్రద్ధ... రైతులపై లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రాజెక్టులో పది రోజుల కిందట చేప పిల్లలను వదిలారని, అవి పెరిగేందుకు నీరు అవసరం కావడంతో కావాలనే కొందరు నాయకులు నీటి విడుదల కాకుండా జాప్యం చేయిస్తున్నారని ఆరోపించారు.ధర్నా చేయడానికి వీల్లేదంటూ గొడవఈ ఏడాది ప్రాజెక్టులో చేపలు వేసిన టీడీపీ నాయకుడు మద్దెల రామారావు వచ్చి ఇక్కడ ధర్నా చేయడానికి వీల్లేదని రైతులతో వాగ్వాదానికి దిగారు. రామారావుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘ప్రాజెక్టులో చేపలు వేసి గేట్లు పైకి లేవకుండా మీరే చేస్తున్నారా...’ అని మండిపడ్డారు. దీంతో కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇద్దరు రైతుల ఆత్మహత్యాయత్నంఈ తరుణంలో చినపవని గ్రామానికి చెందిన తూమాటి బాలకోటయ్య అనే రైతు పురుగు మందు తాగేందుకు ప్రయత్నించగా, వెంటనే తమకు న్యాయం జరగకపోతే ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకుంటానని మరోరైతు సిద్ధమయ్యారు. మిగిలిన రైతులు వారిని అడ్డుకుని సమస్య పరిష్కారం కోసం పోరాటం చేద్దామని సర్ది చెప్పారు. అదే సమయంలో అక్కడి చేరుకున్న వలేటివారిపాలెం ఎస్ఐ మదిరినాయుడు, గుడ్లూరు ఎస్ఐ వెంకట్రావ్, ప్రాజెక్టు ఈఈ వెంకటేశ్వర్లు రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా, నీరు ఇచ్చే వరకు ధర్నాను విరమించే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. చేతులెత్తేసిన నిపుణుడు బాషా ఊడిపడిపోయి కిందకు చేరిన గేటును పైకి లేపేందుకు నాలుగైదు రోజులుగా ప్రయత్నం చేస్తున్న నరసరావుపేటకు చెందిన నిపుణుడు, మెకానిక్ బాషా ఆదివారం పూర్తిగా చేతులెత్తేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీరు ఉండడం వల్ల మరమ్మతులు చేయడం సాధ్యంకాని, ఇక తాము ఏమీ చేయలేమని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే ప్రచార ఆర్భాటంపై రైతుల ఆగ్రహంకాలువకు నీరు రాక తాము అల్లాడుతుంటే ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాత్రం నీటిని విడుదల చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. నీరు విడుదలయ్యాయో... లేదో.. మా పొలాల వద్దకు వచ్చి చూస్తే తెలుస్తుందని మండిపడ్డారు. 25 ఎకరాల్లో వరినారు పోశానుప్రాజెక్టులోకి పూర్తి స్థాయిలో నీరు వచ్చాయని తెలియడంతో 25 ఎకరాల్లో వరి నారుమడులు పెట్టాను. తుపాను కారణంగా కురిసిన వర్షాలకు దుక్కులు కూడా దున్నాను. కుడికాలువకు నీరు విడుదల చేస్తారని 10 రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. నీరు విడుదల కాకపోవడం వరినారు ఎండిపోయింది. – ఇనుకొల్లు సతీష్, ఆయకట్టు రైతు, చినపవని, లింగసముద్రం మండలం చేపల కోసమే నీరు విడుదల చేయడం లేదుకొందరు నేతలు రాళ్లపాడు ప్రాజెక్టులో చేపలు వదిలారు. చేపలకు నీరు ఉంచుకోవాలనే ఉద్దేశంతో సాగుకు సక్రమంగా నీటిని విడుదల చేయడం లేదు. ఈ ఏడాది పుష్కలంగా ప్రాజెక్టులో నీరు ఉండడంతో 10 ఎకరాల్లో వరినార్లు పోశాను. నీరు విడుదల కాకపోవడంతో నార్లు ఎండిపోతున్నాయి. – టి.కమలాకర్‌రెడ్డి, పెదపవని, లింగసముద్రం మండలం -
సింహపురి ‘కోడల్లుళ్లు’ వచ్చేశారోచ్!
సంక్రాంతి పందేల్లో కాలు దువ్వేందుకు సింహపురి నుంచి కోడి పుంజులొచ్చేశాయి. నెల్లూరు ప్రాంతంలో పెంచిన కాకి, నెమలి, డేగ, పచ్చకాకి, కేతువ తదితర జాతుల పుంజులు పందేలరాయుళ్లను ఆకర్షిస్తున్నాయి. రకాన్ని బట్టి ఒక్కొక్క పుంజు రూ.3 వేల నుంచి రూ.6 వేల వరకు విక్రయిస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన వ్యాపారులు రావులపాలెం–ఏలూరు హైవే, రద్దీ రోడ్ల వెంబడి వీటిని విక్రయిస్తున్నారు. – సాక్షి, భీమవరం భీమవరం బ్రీడ్నే అక్కడ పెంచి..సంక్రాంతి కోడి పందేలకు ఉమ్మడి గోదావరి జిల్లాలు పెట్టింది పేరు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, వెంప, సీసలి, దుంపగడప, తూర్పు గోదావరి జిల్లాలోని మురమళ్ల, కాట్రేనికోన, వేట్లపాలెం కోడిపందేలకు పేరొందాయి. పెద్ద బరుల్లో రోజుకు 25 నుంచి 30 వరకు పందేలు జరిగితే.. గ్రామాల్లోని చిన్న బరుల్లో జరిగే పందేలకు లెక్కే ఉండదు. సంక్రాంతి మూడు రోజులు వేలాదిగా జరిగే పందేలకు రెట్టింపు కోడిపుంజులు అవసరమవుతాయి. పందేలకు వినియోగించే ‘భీమవరం బ్రీడ్’ పుంజులకు గిరాకీ అంతాఇంతా కాదు. సంక్రాంతి పందేల కోసం ఉండి, ఆకివీడు, చెరుకుమిల్లి, చినఅమిరం, కాళ్ల, కోనసీమలోని అమలాపురం, లంక, మండపేట, రామచంద్రపురం, పెద్దాపురం తదితర ప్రాంతాల్లో భీమవరం బ్రీడ్ కోడిపుంజుల పెంపకం ద్వారా గోదావరి జిల్లాల్లో వందలాది మంది ఉపాధి పొందుతున్నారు. భీమవరం బ్రీడ్ పుంజులకు ఉన్న గిరాకీని దృష్టిలో పెట్టుకుని నెల్లూరీయులు వీటిని అక్కడ పెంచుతున్నారు. అనంతరం వాటిని గోదావరి జిల్లాలకు తెచ్చి విక్రయిస్తున్నారు.నెల ముందే వ్యాపారుల రాకవారం రోజుల్లో సంక్రాంతి నెల పట్టనుండగా.. నెల్లూరు జిల్లాకు చెందిన నాటుకోళ్ల పెంపకందారులు, వ్యాపారులు అప్పుడే గోదావరి జిల్లాల్లో అమ్మకాలు చేసేందుకు కోడి పుంజులతో తరలివస్తున్నారు. ఒక్కొక్కరు 15 నుంచి 20 పుంజులను తెస్తున్నారు. నలుగురైదుగురు గుంపుగా వచ్చి రావులపాలెం–ఏలూరు హైవే వెంబడి, రద్దీ రోడ్లు పక్కన ఖాళీ ప్రదేశాల్లో పుంజుల్ని ఉంచి అమ్మకాలు చేస్తున్నారు. పందెం కోళ్లలోని దాదాపు అన్ని రకాల జాతులు వీరి వద్ద అందుబాటులో ఉంటున్నాయి. సాధారణంగా పందేల కోసం గోదావరి జిల్లాల్లో సిద్ధం చేసే పుంజులు చాలా ధర ఉంటాయి. పందెం పుంజులను కొత్త అల్లుళ్ల మాదిరిగా పెంచుతుంటారు. వాటికి మూడు నెలల ముందునుంచే మటన్ కీమా, డ్రైఫ్రూట్స్ వంటి బలవర్ధకమైన ఆహారాన్ని అందిస్తుంటారు. శరీర పటుత్వాన్ని పెంచేందుకు వాకింగ్, ఈత కొట్టించడం, నీళ్లపోతలు, శాఖాలు తదితర రూపాల్లో ప్రత్యేకంగా ట్రైనర్లతో శిక్షణ ఇస్తుంటారు. వాటికందించే ఆహారం, శిక్షణను బట్టి ఒక్కొక్క పుంజు ధర రూ.25 వేల నుంచి రూ.లక్ష కూడా దాటిపోతోంది. చూసేందుకు స్థానిక పుంజులకు ఏమాత్రం తీసిపోని విధంగా సైజులు, రంగుల్లో నెల్లూరు పుంజులు ఉంటున్నాయి. పుంజు రంగు, ఎత్తు, బరువును బట్టి రూ.3 వేల నుంచి రూ.6 వేలలోపే ధరలు ఉండటంతో వీటి కొనుగోలుకు పందెంరాయుళ్లు ఆసక్తి చూపుతున్నారు. వాటి కాళ్ల సామర్థ్యం, ప్రత్యర్థిపై దాడిచేసే వేగాన్ని పరీక్షించేందుకు అక్కడే డింకీ పందేలు కట్టి బాగున్న వాటిని బేరమాడి తీసుకుంటున్నారు. నెలరోజుల పాటు వాటికి తగిన మేతను అందించి శిక్షణ ఇవ్వడం ద్వారా పందేలకు సన్నద్ధం చేసే వీలుంటుందంటున్నారు.ఇక్కడే గిరాకీ బాగుంటుంది సంక్రాంతి సందర్భంగా గోదావరి జిల్లాల్లో కోడిపుంజులకు గిరాకీ బాగుంటుంది. నెల్లూరు జిల్లా నుంచి చాలామంది పెంపకందారులు, వ్యాపారులు ఇక్కడకు కోడిపుంజులు తెచ్చి విక్రయిస్తుంటారు. నేను సొంతంగా పెంచిన వాటితో పాటు అక్కడ కొనుగోలు చేసిన పుంజులను తీసుకువచ్చాను. – వెంకటేష్, నెల్లూరు ముందుగానే వచ్చాం నాలుగేళ్లుగా ఏటా సంక్రాంతి ముందు కోడి పుంజులను తీసుకువస్తున్నాం. గతంలో రెండు వారాల ముందు వచ్చేవాళ్లం. మరింత ముందుగా వస్తే పందేలరాయుళ్లు మా వద్ద కొనుగోలు చేసిన పుంజులను పెంచుకునేందుకు బాగుంటుందని కొందరు చెప్పడంతో ఈ ఏడాది నెల రోజులు ముందే వచ్చా. అమ్మకాలు బాగుంటే రూ.10 వేల వరకు మిగులుతాయి. – సంగయ్య, నెల్లూరు -
కూటమి ప్రభుత్వంలో లబోదిబో అంటున్న రైతులు
-
బాలికపై లైంగికదాడి కేసులో నిందితుడికి జీవిత ఖైదు
నెల్లూరు (లీగల్): బాలికతో లైంగిక సంబంధం పెట్టుకుని గర్భవతిని చేశాడని నమోదైన కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడు పోతురాజు మీరయ్యకు జీవిత ఖైదు, రూ.20 వేలు జరిమానా విధిస్తూ నెల్లూరు పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సిరిపిరెడ్డి సుమ మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు మనుబోలు మండలం పిడూరుమిట్ట గ్రామానికి చెందిన పోతురాజు మీరయ్య చిల్లర అంగడి నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.అదే గ్రామానికి చెందిన బాలిక అంగడికి వెళ్తున్నప్పుడు మాయమాటలు చెప్పి లైంగిక సంబంధం పెట్టుకుని గర్భవతిని చేశాడు. బాధిత బాలిక 2022 జనవరి పన్నెండో తేదీన మనుబోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు పోతురాజు మీరయ్యను అరెస్టు చేశారు. దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జీïÙటు దాఖలు చేశారు. విచారణలో మీరయ్య నేరం రుజువు కావడంతో పై మేరకు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. -
నెల్లూరులో అక్రమంగా తరలిపోతున్న రేషన్ బియ్యం
-
షల్ మీడియా యాక్టివిస్ట్ ల పై కొనసాగుతున్న కక్ష సాధింపు
-
నెల్లూరులో గంటపాటు దంచికొట్టిన భారీ వర్షం
-
డబ్బు కావాలంటే ఇది చాలా కీలకం..
నెల్లూరు నగరానికి చెందిన కిశోర్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. వివిధ వస్తువుల కొనుగోలు కోసం అతను ఆన్లైన్ యాప్‌లో రూ.20 వేలు రుణం తీసుకున్నాడు. సకాలంలో చెల్లించలేకపోయాడు. యాప్ నిర్వాహకులు చాలా వడ్డీ వేశారు. దీనికితోడు సిబిల్ స్కోర్ దారుణంగా పడిపోయింది.నెల్లూరులో నివాసం ఉంటున్న సంతోష్ ఓ షోరూంలో ఏడునెలల క్రితం ఏసీ కొన్నాడు. ఐదునెలలపాటు ఈఎంఐలు సమయానికి చెల్లించాడు. వివిధ కారణాలతో ఆ తర్వాత కట్టలేకపోయాడు. దీంతో రూ.750 అపరాధ రుసుము చెల్లించాలని బ్యాంక్ వారు పేర్కొన్నారు. అదనపు చెల్లింపుల భారంతోపాటు సిబిల్ స్కోర్ సైతం తగ్గిపోయింది.నెల్లూరు సిటీ: కాలం మారిపోయింది. సాంకేతిక పరిజ్ఞానం పరుగులు పెడుతోంది. దీంతో జీవనశైలిలో అనేక మార్పులొచ్చాయి. నాడు ఎంతో నెమ్మదిగా జరిగిన పనులు నేడు నిమిషాల్లోనే అయిపోతున్న పరిస్థితి. ఒకప్పుడు బ్యాంక్ రుణం కావాలంటే కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. పొలం, ఇళ్ల డాక్యుమెంట్లు ఉన్నా డబ్బు ఇచ్చేందుకు బ్యాంక్‌లు ఎంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవి. నేడు స్మార్ట్ ఫోన్లోని యాప్ నుంచి రూ.5వేల నుంచి రూ.లక్షల్లో రుణాలు పొందొచ్చు. ఇక్కడే ఒక మెలిక ఉంది. అదే సిబిల్ క్రెడిట్ స్కోర్. డబ్బు కావాలంటే ఇది చాలా కీలకం. దీని ఆధారంగా ఇప్పుడు బ్యాంక్‌లు, ఆన్లైన్ యాప్‌లు రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ స్కోర్‌ను 750 కంటే తగ్గకుండా చూసుకోవాల్సి బాధ్యత ఏర్పడింది. ఈఎంఐల్లోనే.. నేడు బ్యాంక్‌లు ఈఎంఐల పద్ధతిలో రుణ సౌకర్యం కల్పించాయి. చేతికి పెట్టుకునే వాచ్ నుంచి సెల్‌ఫోన్, కారు, ఏసీ, టీవీ, ఫ్రిడ్జ్, ఇళ్లు కొనుగోలుకు నెల వాయిదాల విధానంలో రుణాలు తీసుకుంటున్నారు. చిన్నచిన్న వస్తువుల కోసం ఈ–కామర్స్ యాప్‌లో క్రెడిట్, డెబిట్ కార్డులతో ఈఎంఐలు పెడుతున్నారు. అయితే కొందరు నిర్దేశిత తేదీల్లోగా ఈఎంఐ చెల్లించకపోతున్నారు. దీంతో భారీగా ఆలస్య రుసుము చెల్లించాల్సి వస్తోంది. లోన్ యాప్‌లు, ఒక్కోసారి కొన్ని బ్యాంక్‌ల ప్రతినిధుల బెదిరింపులూ తప్పడం లేదు. సులువుగా.. యాప్‌లు వచ్చిన నాటి నుంచి రుణం తీసుకోవడం సులభంగా మారిపోయింది. కేవలం పాన్‌కార్డు నంబర్ ఉంటే చాలు. సంబంధిత వెబ్సైట్ లేదా యాప్‌లో నమోదు చేయగానే కొద్ది నిమిషాల్లోనే రుణం వచ్చేది, రానిదీ తెలిసిపోతుంది. అలాగే వివిధ ఎలక్ట్రానిక్ దుకాణాలు, షాపుల్లోనూ పాన్‌కార్డు నంబర్‌ను నమోదు చేసి వెంటనే ఎంతవరకు రుణం వస్తుందో చెబుతున్నారు. దీంతో తమకు అవసరమున్నా, లేకున్నా చాలామంది ఎల్రక్టానిక్స్ వస్తువులపై ఆసక్తి చూపుతున్నారు. జీరో వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజు లేదంటూ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు చెప్పే మాటలకు చాలామంది ఆకర్షితులవుతున్నారు. ఏ ప్రయోజనం లేకుండా ఆయా సంస్థలు ఎందుకు ఇలా చేస్తాయనే విషయాన్ని మర్చిపోతున్నారు. కనీస అవగాహన కూడా లేకుండా వాటి ఉచ్చులో చిక్కుకుంటున్నారు. వస్తువులు తీసుకుని సకాలంలో చెల్లించలేకపోవడంతో సిబిల్ స్కోర్ గణనీయంగా పడిపోతోంది. దీనివల్ల భవిష్యత్‌లో అత్యవసరమైనప్పుడు రుణాలు పొందలేని పరిస్థితి ఏర్పడుతోంది.ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ.. కొత్త కొత్త లోన్ యాప్‌లు పుట్టుకుని రావడంతో యువత, విద్యార్థులు ఆ ఉచ్చులో ఇరుక్కుని పోతున్నారు. సరదాల కోసం రుణం తీసుకోవడం మొదలుపెట్టి, చివరికి తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. యాప్‌లలో ఇష్టారాజ్యంగా లోన్లు తీసుకుని బెట్టింగ్‌లు, మద్యంకు బానిసవుతున్నారు. రుణాలు సమయానికి చెల్లించకపోవడంతో నిర్వాహకులు వారిని బ్లాక్మెయిల్ చేయడం, మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కాగా ఉన్నత చదువులకు రుణాలు తీసుకునే సమయంలో సమస్యలు త లెత్తే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. సిబిల్‌ను కాపాడుకుంటేనే.. రానున్న రోజుల్లో సిబిల్ స్కోర్ చాలా ముఖ్యం. ఇప్పటికే బ్యాంక్ రుణాలు తీసుకోవాలంటే ఇది కచ్చితంగా బాగుండాలి. రుణ చెల్లింపుల్లో ఆలస్యం చేస్తే చెక్»ౌన్స్తోపాటు సిబిల్ స్కోర్ కూడా తగ్గుతుంది. భవిష్యత్‌లో తీసుకునే రుణాలపై కూడా ప్రభావం పడుతుంది. బ్యాంక్ రుణాలు, క్రెడిట్ కార్డుల చెల్లింపులు ఆలస్యం కాకుండా జాగ్రత్తలు తీసుకోండి. – సీహెచ్ వెంకటసందీప్, సీఏ తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి. బ్యాంక్ స్టేట్మెంట్లు, రుణాలు తీసుకోవడంపై దృష్టి సారించాలి. ముఖ్యంగా వారి అలవాట్లను నిత్యం గమనిస్తుండాలి. చెడు మార్గంలో వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. – వేణు, సీఐ, నెల్లూరు రూరల్ పోలీస్‌స్టేషన్ -
AP: బలహీనపడిన తుపాను
సాక్షి, అమరావతి/నెట్వర్క్: ఫెంగల్ తుపాను ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి వద్ద నెమ్మదిగా బలహీనపడింది. తీరం దాటిన తర్వాత కూడా 6 గంటలకుపైగా భూమిపై తుపానుగానే స్థిరంగా కొనసాగింది. ఆదివారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ప్రస్తుతం ఇది పుదుచ్చేరి సమీపంలోని కడలూరుకు 30 కి.మీ., విల్లుపురానికి 40 కి.మీ., చెన్నైకి 120 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాత్రికి ఇంకా బలహీనపడి వాయుగుండంగా.. ఆ తర్వాత అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మూడు జిల్లాల్లో ఎడతెగని వర్షాలుతుపాను ప్రభావంతో చిత్తూరు, తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఆదివారం కూడా ఎడతెగని వర్షాలు కురిశాయి. మిగిలిన కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. 24 గంటల వ్యవధిలో తిరుపతి జిల్లా పుత్తూరులో 18.7సెం.మీ. అత్యధిక వర్షపాతం నమోదైంది. అదే జిల్లా పుత్తూరు మండలం రాచలపాలెంలో 15.2 సెం.మీ. వర్షం కురిసింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట, తడ, చిత్తమూరు, దొరవారిసత్రం, నాయుడుపేట, వెంకటగిరిలో భారీ వర్షాలు కురిశాయి. చిత్తూరు జిల్లా నగరి, నిండ్ర, కార్వేటినగరం, పాలసముద్రం మండలాలు, నెల్లూరు జిల్లాలోని మనుబోలు, కొడవలూరు, సైదాపురం మండలాల్లో విస్తృతంగా వర్షాలు కురిశాయి. కోస్తా జిల్లాల్లోనూ చాలాచోట్ల భారీ వర్షాలు పడ్డాయి.డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోనలో 10 సెం.మీ. వర్షం కురిసింది. తిరుపతి జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. వాగుల్లోకి పెద్దఎత్తున నీరు చేరి ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చెన్నైలో ఇంకా తీవ్రంగా వర్షాలు పడుతుండటంతో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్లే అనేక బస్సులను రద్దు చేశారు. సోమవారం కూడా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. తిరుపతి జిల్లాలో జోరువానతిరుపతి జిల్లాలో 3 రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. సత్యవేడు, గూడూరు, శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తాయి. వర్షం ప్రభావంతో 116 ఆర్టీసీ సర్వీసులను నిలుపుదల చేశారు. 21 గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ సర్వీసులు వెళ్లడం లేదు. చెన్నైకి వెళ్లే పలు సర్వీసులకు బ్రేక్ పడింది. ఏసీ సర్వీసులను నిలుపుదల చేశారు. జిల్లాలో మామిడి కాలువ, పాముల కాలువ, కార్వేటి కాలువ, ఈదులకాలువ, సున్నపు కాలువ తదితర 21 కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇతర ప్రాంతాల్లోనూ వానలుకృష్ణా జిల్లా పెనమలూరు, పెడన, పామర్రు, అవనిగడ్డ ప్రాంతాల్లో ఆదివారం కూడా వర్షాలు కురిశాయి. 19,500 ఎకరాల్లో వరి నేలవాలింది. కోతలు పూర్తయిన చోట్ల ధాన్యాన్ని రోడ్లపైనే రాశులు పోయగా.. తడిసిపోయింది. ఎన్టీఆర్ జిల్లాలో అక్కడక్కడా మోస్తరు జల్లులు కురిశాయి. పూత దశలో ఉన్న కంది, మిరప గాలులకు రాలిపోయింది. మబ్బుల కారణంగా పంటలు తెగుళ్ల బారిన పడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో 9.2 మి.మీ. వర్షం పడగా, అత్యల్పంగా వట్టిచెరుకూరు మండలంలో 1.6 మి.మీ. వర్షం కురిసింది. కొల్లిపర, దుగ్గిరాల, తెనాలి, పొన్నూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో కోతకు వచ్చిన వరి పంట పలుచోట్ల నేల వాలింది.పశ్చిమ గోదావరి జిల్లాలో ఆదివారం చిరు జల్లుల కారణంగా సార్వా మాసూళ్ల (నూర్పిడి) పనులు నిలిచిపోయాయి. విజయనగరం జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంటను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. భోగాపురం, గరివిడి, ఎస్.కోట, డెంకాడ, గుర్ల, చీపురుపల్లి, పూసపాటిరేగ, కొత్తవలస, బొండపల్లి, గజపతినగరం, వేపాడ, నెల్లిమర్ల, మెంటాడ, విజయనగరం, రామభద్రపురం మండలాల్లో ఎక్కువ వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలో చెదురుమదురు జల్లులు పడ్డాయి.కాకినాడ జిల్లాలో తేలికపాటి జల్లులు పడుతున్నాయి. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వరి చేలు నేలకొరిగాయి. సుమారు 30 శాతం వరిచేలు నేలనంటాయి. ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, పి.గన్నవరం వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో వరిపై వర్షాల ప్రభావం అధికంగా ఉంది. కూనవరం మొగ మూసుకుపోవడంతో ముంపు నీరు దిగడం లేదు. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో రొయ్యల చెరువుల్లో ఆక్సిజన్ శాతం పడిపోయింది. రొయ్యలను కాపాడుకునేందుకు ఆక్వా రైతులు అష్టకష్టాలు పడుతున్నారు.తిరుమలలో విరిగిపడుతున్న కొండ చరియలుతిరుమలలోని రెండో ఘాట్ రోడ్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. సకాలంలో టీటీడీ సిబ్బంది వాటిని తొలగిస్తున్నారు. రెండు ఘాట్ రోడ్లలోనూ దిట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. తిరుమలలో ఆదివారం కూడా ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చలి తీవ్రత పెరగడంతో చంటి పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైఎస్సార్ జిల్లాలోని పలు మండలాల్లో వర్షం కురిసింది. గాలుల తీవ్రతకు పలు మండలాల్లో వరి పంట నేలకొరిగింది. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. రైల్వేకోడూరు నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. వరి, టమాటా, బొప్పాయి ఇతర ఆకు కూరల తోటలు దెబ్బతిన్నాయి. పొగ మంచు రావడంతో రహదారులపై వాహనదారులు కష్టతరంగా ప్రయాణాన్ని సాగిస్తున్నారు. -
తిరుపతి, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్
సాక్షి, అమరావతి/విశాఖపట్నం/నెట్వర్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను నెమ్మదిగా కదులుతోంది. శనివారం రాత్రికి గంటకు 7కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మహాబలిపురానికి 50 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 80 కిలోమీటర్లు, చెన్నైకి 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. శనివారం రాత్రికి తుపాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే తమిళనాడు–పుదుచ్చేరి తీరాల వద్ద కారైకాల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి దగ్గర తీరం దాటే ప్రక్రియ మొదలైనట్టు పేర్కొంది.తీరం దాటే సమయంలో ఇంకా నెమ్మదిగా కదులుతున్నట్టు తెలిపింది. తుపాను చెన్నైకి సమీపంలో తీరం దాటేందుకు వచ్చినట్టే వచ్చి దాదాపు 6 గంటల వరకూ సముద్రంలోనే స్థిరంగా నిలిచిపోయింది. అనంతరం.. పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ పుదుచ్చేరి తీరం వైపు పయనించింది. తుపాను తీరం దాటిన తర్వాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడనుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే తుపాను ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తుండగా.. కోస్తాంధ్ర జిల్లాల్లో తీరం వెంబడి తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడుతున్నాయి.భారీ నుంచి అతి భారీ వర్షాలు డిసెంబర్ 2 వరకూ కొనసాగే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. తిరుపతి, నెల్లూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని.. ఆయా జిల్లాల్లోని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు 3వ తేదీ వరకూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. తుపాను తీవ్రత దృష్ట్యా తిరుపతి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో అత్యంత తీవ్రంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ∙ఆరెంజ్ అలర్ట్, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలతో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.రెండు జిల్లాల్లో కుండపోతశ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, అన్నమయ్య, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెగని వర్షాలకు తిరుపతి జిల్లా అంతా తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నెల్లూరు జిల్లాలోనూ వర్షాల తీవ్రతకు అనేక ప్రాంతాల్లోని రోడ్లపై నీరు చేరింది. కోస్తా జిల్లాల అంతటా వర్షాలు పడుతుండటంతో కళ్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయి పనికిరాకుండా పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఆకస్మిక అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నట్టు అధికారుహెచ్చరికలు జారీ చేశారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి.ఈదురుగాలులు ఎక్కువగా ఉండటంతో చలి తీవ్రంగా ఉంది. జనమంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. వాకాడు, కోట, చిట్టమూరు, చిల్లకూరు, సూళ్లూరుపేట, తడ మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదయ్యపాళెం నుంచి∙సంతవేలూరుకు వెళ్లే మార్గంలో సీఎల్‌ఎన్‌పల్లి వద్ద పాముల కాలువ, అంబూరు సమీపంలో మార్ల మడుగు కాలువలు ఉధృతంగా ప్రవహించడంతో ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 10 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పెద్ద పాండూరు సమీపంలో రాళ్ల కాలువ వద్ద నీటి ఉధృతి పెరగడంతో మరో 7 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో గాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు నెలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు పడిపోవంతో విద్యుత్‌కు అంతరాయం కలిగింది.తిరుమలలో భారీ వర్షంతిరుమలలో శనివారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చలి తీవ్రత పెరిగింది. చంటి పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అద్దె గదులు దొరకని భక్తులు షెడ్ల కింద వర్షానికి, చలికి వణికిపోతున్నారు. వ్యాపార సంస్థలు ఉదయం నుంచి మూతపడ్డాయి. తిరుమల శిలాతోరణం నుంచి శ్రీవారి పాదాల వద్దకు వెళ్లే మార్గంతోపాటు, ఆకాశ గంగ, పాపవినాశనం మార్గాలను తాతాల్కింగా మూసివేశారు. విమాన సర్వీస్‌లు రద్దువిజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే పలు విమాన సరీ్వస్‌లను శనివారం రద్దు చేశారు. చెన్నై విమానాశ్రయాన్ని మూసివేయడంతో అక్కడి నుంచి గన్నవరం వచ్చి వెళ్లాల్సిన రెండు ఇండిగో విమానాలు రద్దయ్యాయి. తిరుపతి, షిర్డీ విమాన సర్వీస్‌లు కూడా రద్దయ్యాయి. చెన్నై, షిర్డీ, తిరుపతి వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కాగా.. తిరుపతి (రేణిగుంట) విమానాశ్రయంలోని రన్‌వేపై నీళ్లు చేరడంతో ఏడు విమాన సరీ్వస్‌లు రద్దయ్యాయి. భీములవారిపాలెంలో అత్యధికంగా 13.1సెంటీ మీటర్లుశనివారం తిరుపతి జిల్లా భీములవారిపాలెంలో అత్యధికంగా 13.1సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అదే జిల్లా మన్నార్పోలూర్లో 13.0, పుత్తూరులో 12.3, సూళ్లూరుపేటలో 11.8, పూలతోటలో 11.5, తడలో 10.8, మల్లంలో 10.3, చిత్తూరు జిల్లా నగరిలో 9.4, నిండ్రలో 8.8 సెంటీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైంది.సముద్రం అల్లకల్లోలంవిశాఖ సముద్ర తీరం భారీ కెరటాలతో అల్లకల్లోలంగా మారింది. మూడు అడుగుల కంటే ఎత్తుగా కెరటాలు ఎగసి పడుతున్నాయి. విశాఖలోని వైఎంసీఏ నుంచి విక్టరీ ఎట్ సీ వరకు గల తీరం భారీగా కోతకు గురయింది. నాలుగు అడుగులకుపైగా ఎత్తున ఇసుక పూర్తిగా కోతకు గురైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో శనివారం ఉదయం నుంచి జల్లులు పడటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల్లో జల్లులు కురిశాయి. విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలో అక్కడడక్కడా జల్లులు పడ్డాయి.కృష్ణా జిల్లా వ్యాప్తంగా శనివారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వర్షం కురవడంతో రోడ్ల వెంబడి ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. కోతలు కోసి పనలపై ఉన్న ధాన్యం తడిసిపోయింది. హంసలదీవి వద్ద సాగరతీరం అల్లకల్లోలంగా మారింది. పల్నాడు జిల్లాలో అక్కడక్కడా జల్లులు పడుతున్నాయి. బాపట్ల జిల్లా రేపల్లె, వేమూరు నియోజకవర్గాలలో విడతలవారీగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. సుమారు 3వేల ఎకరాలకుపైగా వరిపంట నేలకొరిగింది.తుపానుపై సీఎం సమీక్ష సాక్షి, అమరావతి: ఫెంగల్ తుపాను నేపథ్యంలో అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తుపాను పరిస్థితులపై శనివారం జిల్లా కలెక్టర్లు, సీఎంవో, రియల్ టైమ్ గవర్నెన్స్ అధికారులతో సమీక్షించారు. ఆర్టీజీ ద్వారా నిరంతర పర్యవేక్షణతో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.సహాయ, పునరావాస కార్యక్రమాలకు సమాయత్తం కావాలని కలెక్టర్లను ఆదేశించారు. తుపాను విషయంలో రైతులు ఆందోళనగా ఉన్నారని, నిరి్ధష్టమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్నదాతలకు చేరవేయాలని సూచించారు. కాగా, ఫెంగల్ తుపాను దృష్ట్యా భారీ వర్షాలు కురిసి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే పునరుద్ధరణ చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉండాలని విద్యుత్ సంస్థలను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ శనివారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా సూచించారు. -
తుపాను ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు..
విశాఖపట్నం: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఫెంగల్ తుపానుగా బలపడి తీవ్ర వాయుగుండం వెంటనే బలహీనపడింది. ఈ క్రమంలో మరింత బలహీనపడి రేపు మహాబలిపురం వద్ద తీరం దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.ఇక, తుపాను కారణంగా నేటి నుంచి ఏపీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. కాగా, ఈనెల 30 నుంచి డిసెంబర్ 2 వరకు కోస్తాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. -
పెంచలకోన దేవస్థానం సమీపంలో చిరుత సంచారం..
-
హిజ్రాల మధ్య గ్యాంగ్ వార్.. హాసిని హత్య వెనుక...
కొడవలూరు: మండలంలోని టపాతోపు అండర్ బ్రిడ్జి వద్ద మంగళవారం రాత్రి హత్యకు గురైన మానికల హాసిని (33) చిన్నప్రాయంలోనే తక్కువ సమయంలోనే నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు, నంద్యాల, చెన్నై, కర్ణాటక ప్రాంతాల్లోని సుమారు పది వేల మందికి హాసిని నాయకురాలుగా ఎదిగింది. ఆమె ఎదుగుదలను జీరి్ణంచుకోలేని హిజ్రాల్లోనే మరోవర్గం ఈ కిరాతకానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తోటపల్లిగూడూరు మండలం చిన్నచెరుకూరు గిరిజన కాలనీకి చెందిన మానికల శ్రీనివాసులు, విజయమ్మ దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలు, ఒక మగ పిల్లవాడు. మధ్య సంతానంగా మగ పిల్లవాడిగా జన్మించిన సుదీప్ మొదటి నుంచి తేడాగా ఉండేవాడు. తండ్రి టైలర్ కాగా, తల్లి విజయమ్మ వ్యవసాయ పనులకు వెళుతూ ముగ్గురు పిల్లలను చదివించారు. ఏడో తరగతి వరకు గ్రామంలోని పాఠశాలలోనే చదివిన సుదీప్ ఆ తర్వాత ఇంటి నుంచి పారిపోయారు. అప్పటికే హిజ్రా లక్షణాలు కలిగి ఉన్న సుదీప్ హిజ్రాలతో పరిచయం పెంచుకుని పూర్తిగా హిజ్రాగా మారి హాసినిగా పేరు మార్చుకున్నారు. ఆకర్షణీయంగా కనిపించే హాసిని హిజ్రాల్లో ప్రత్యేకతను చాటుకుంటూ నాయకత్వ బాధ్యతలు తీసుకుంది. ఆర్థికంగా స్థిరపడ్డాక కుటుంబాన్ని తిరుపతికి మార్చుకుంది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో హిజ్రాల సమస్యలపై తరచూ సమావేశాలు నిర్వహిస్తూ వాటి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తూ బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఆర్థికంగానూ బలపడడంతో నెల్లూరులోని మాగుంట లేఅవుట్లో ఒక ఇల్లు, రాజీవ్‌గాంధీనగర్‌లో రెండు ఇళ్లు, తిరుపతిలో ఒక ఇల్లు నిర్మించుకున్నట్లు తెలిసింది. తల్లిదండ్రులకు చిన్నచెరుకూరులో ఇల్లు నిర్మించడంతో పాటు ఆర్థికంగా అండగా ఉండేదని సమాచారం. హాసిని తల్లి స్వగ్రామం విడవలూరు మండలం పార్లపల్లిలో మహాలక్ష్మి అమ్మవారి ఆలయ నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించింది. నిర్మాణం పూర్తికావడంతో సోమవారం నుంచి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంతో మంగళవారం జరిగిన అభిషేకాలు, పూజలకు హాసిని తన సహచర హిజ్రాలు 20 మందిని తీసుకెళ్లారు. అక్కడ రాత్రి 10 గంటల వరకు అభిషేకాలు, పూజల అనంతరం అక్కడి నుంచి నెల్లూరుకు బయలు దేరారు. హాసిని కారులో వస్తుండగా సహచరులు ఆటోల్లో వెనుక అనుసరించారు. టపాతోపు అండర్ పాస్ వద్ద రెండు కార్లలో కాపుకాచిన ఆరుగురు వ్యక్తులు అటకాయించి కారులో ఉన్న హాసిని మెడపై విచక్షణా రహితంగా నరికి పారిపోయారు. వెనుక ఆటోల్లో వచ్చిన సహచరులు గమనించి చూడగా హాసిని రక్తపు మడుగులో పడి ఉంది. హుటాహుటిన నెల్లూరులోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించగా అప్పటికే హాసిని మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఎస్సై కోటిరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పోలీసుల అదుపులో నిందితులు?సాక్షి, టాస్క్‌ఫోర్స్: సంచలనం రేకెత్తించిన హాసిని హత్య కేసును పోలీసులు ఛేదించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కొడవలూరు ఇన్స్పెక్టర్ సురేంద్రబాబు తన సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. నెల్లూరురూరల్ మండలానికి చెందిన ఓ యువకుడు ఓ హిజ్రా గ్యాంగ్‌లో ఉన్న హిజ్రా తో సహజీవనం చేస్తున్నారు. ఆ యువకుడిని హాసిని, ఆమె అనుచరులు పలుమార్లు అందరి ముందు తీవ్రంగా అవమానించినట్లు సమాచారం. దీంతో కక్ష పెంచుకున్న సదరు యువకుడు తన సహచరులతో కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. సాంకేతికత ఆధారంగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని లోతుగా విచారిస్తున్నట్లు తెలిసింది. హాసిని ఆదిపత్యాన్ని కొందరు హిజ్రాలూ వ్యతిరేకిస్తున్నారు. వారు సోషల్ మీడియా వేదికగా హాసినిని దూషిస్తూ పోస్టులు పెట్టడం, బెదిరింపు చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వారి ప్రమేయం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.కలకలం రేపిన హిజ్రా హాసిని హత్యహంతకులను తక్షణమే అరెస్ట్ చేయాలిమార్చురీ ఎదుట సహచరుల ధర్నాపోస్టుమార్టం అనంతరం అశ్రునయనాల మధ్య మృతదేహం తిరుపతికి తరలింపునెల్లూరు(క్రైమ్): జిల్లాలో మంగళవారం రాత్రి జరిగిన హిజ్రా హాసిని హత్యోదంతం కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కలకలం రేకెత్తించింది. ఆమె సహచరులు కడప, చిత్తూరు, తిరుపతి, తమిళనాడు రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో బుధవారం తెల్లవారు జామునే నెల్లూరుకు చేరుకున్నారు. హత్యకు దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. హాసిని మృతదేహం జీజీహెచ్ మార్చురీలో ఉండడంతో కొందరు అక్కడికి వచ్చి అక్కడే బైఠాయించగా మరికొందరు నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావును ఆయన ఇంటి వద్ద కలిశారు. తమ నాయకురాలు హత్య కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. చట్ట ప్రకారం విచారణ జరిపి నిందితులను శిక్షిస్తామని డీఎస్పీ వెల్లడించడంతో జీజీహెచ్‌లోని మార్చురీ వద్దకు చేరుకున్నారు. మృతదేహానికి ప్రభుత్వ వైద్యులు శవపరీక్ష నిర్వహించి బాధితులకు అప్పగించారు. అశ్రునయనాల మధ్య హాసిని మృతదేహాన్ని అంబులెన్స్‌లో తిరుపతికి తరలించారు. మార్చురీ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా దర్గామిట్ట ఇన్స్పెక్టర్ రోశయ్య ఆధ్వర్యంలో ఎస్ఐ రమేష్ బాబు తమ సిబ్బందితో కలిసి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. -
రూ. 40 వేలతో మినీ ట్రాక్టర్ , ఇంట్రస్టింగ్ స్టోరీ
పెద్దగా చదువుకోకపోయినా సృజనాత్మక ఆలోచన, పట్టుదలతో కూడి కృషితో అద్భుతాలు సృష్టించవచ్చని చెప్పటానికి ఈ మినీ ట్రాక్టర్ ఓ ఉదాహరణ. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా పొదలకూరుకు చెందిన పెంచల నారాయణ (25) వెల్డింగ్ పనిచేస్తూ జీవిస్తున్నారు. 9వ తరగతి వరకు చదువుకున్న నారాయణ చిన్న రైతుల కోసం కేవలం రూ.40 వేల ఖర్చుతో మినీ ట్రాక్టర్‌ను తయారు చేసి ప్రశంసలు పొందుతున్నారు. ఆటో ఇంజన్ తదితర విడిభాగాలను జత చేసి మినీ ట్రాక్టర్‌ను రూపొందించారు. 2 లీటర్ల డీజిల్‌తో ఎకరా పొలం దున్నేయ వచ్చునని నిరూపించారు. ΄ పొలం దున్నడంతో పాటు నిమ్మ, జామ వంటి పండ్ల తోటల్లో అంతర సేద్య పనులను ఈ మినీ ట్రాక్టర్‌తో అవలీలగా చేసుకోవచ్చని నారాయణ వివరించారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే రైతులకు తక్కువ ఖర్చుతో కూడిన మినీ ట్రాక్టర్‌ను అందిస్తానని పెంచల నారాయణ అంటున్నారు. కాన్సెప్ట్ బాగుంది: గణేశంపల్లెసృజన అధ్యక్షులు బ్రిగేడియర్ పోగుల గణేశం మాట్లాడుతూ.. ‘కాన్సెప్ట్ బాగుంది. ఏమీ తెలియని ఒక అబ్బాయి నడిచే మోటరు వాహనాన్ని తయారు చేయడం సులభం కాదు అన్నారు. ‘రోడ్డు మీద బాగానే నడుస్తోంది. చిన్న ఇంజన్‌తో దుక్కిచేయటం వంటి శక్తితో కూడుకున్న పనులను ఏయే రకాల భూముల్లో ఈ చిన్న టాక్టర్ ఎంతవరకు చేయగలుగుతుందో చూడాలి’ అన్నారాయన. – కే.మధుసూధన్, సాక్షి, పొదలకూరు -
ప్రియురాలు పిలిచింది.. మొత్తం దోచేసింది
బనశంకరి: ప్రేమ అనే పదానికి మచ్చ తెచ్చేలా ఆ ప్రియురాలు వ్యవహరించింది. ప్రియున్ని అపహరించి దోపిడీకి పాల్పడి చివరకు కటకటాల పాలైంది. ఏపీలోని నెల్లూరుకు చెందిన ప్రేమ జంట వ్యవహారం బెంగళూరులో రచ్చయింది. పెనుకొండకు పిలిపించి.. కోరమంగళ పోలీసులు తెలిపిన ప్రకారం... నెల్లూరుకు చెందిన శివ, మోనిక అనే యువతీ యువకులు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అతడు నెల్లూరులో మెడికల్ షాప్ నిర్వహిస్తున్నారు. శివతో బాగా డబ్బు, బంగారం ఉన్నట్లు భావించిన మోనికలో దుర్బుద్ధి పుట్టింది. అతనిని కిడ్నాప్ చేసి బాగా వసూలు చేయాలని తనకు తెలిసినవారితో కుట్ర పన్నింది. ఆ ప్రకారం 4 రోజుల కిందట శివకు ఫోన్ చేసింది, నిన్ను నా స్నేహితులు చూడాలని, బంగారు నగలు ధరించి ఇన్నోవా కారులో రావాలని ఫోన్లో తెలిపింది. మోనిక మాటలను నమ్మిన శివ 60 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు ఇన్నోవా కారులో పుట్టపర్తి జిల్లా హిందూపురం వద్ద పెనుకొండకు వచ్చాడు. అక్కడ మోనిక అనుచరులు శివను కారులోనే అపహరించి బంగారు ఆభరణాలు దోచుకుని పావగడకు తీసుకెళ్లి ఓ హోటల్లో బంధించారు. రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. శివ తన స్నేహితులతో మాట్లాడి తన బ్యాంక్ ఖాతాలోకి రూ.5 లక్షలు జమ చేయించాడు. ఏటీఎం కార్డు తెప్పించి.. డబ్బు డ్రా చేయాలంటే ఏటీఎం కార్డు లేదు, దీంతో నెల్లూరులో ఇంటి నుంచి బెంగళూరు మెజిస్టిక్ అడ్రస్‌కు కొరియర్ చేయించుకుని శనివారం రాత్రి బెంగళూరులోని కోరమంగలలో నగదు డ్రా చేయడానికి వెళ్లారు. ఆ సమయంలో కిడ్నాపర్ల మధ్య గొడవ చోటు చేసుకుంది. గస్తీలో ఉన్న ఎస్ఐ మాదేశ్ అనుమానంతో వారిని విచారించగా కిడ్నాప్ కథ వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులు మోనిక, హరీశ్, హరికృష్ణ, నరేశ్, రాజ్‌కుమార్, నరసింహ, అంజనీల్ అనే ఏడుమందిని అరెస్ట్ చేశారు. కిడ్నాపర్లు కూడా నెల్లూరుకు చెందినవారని డీసీపీ సారా ఫాతిమా తెలిపారు. నిందితుల్లో ఇద్దరిపై 5 కు పైగా కేసులు ఉన్నాయని తెలిపారు. ప్రియురాలే దోపిడీకి సూత్రదారి అని తెలుసుకుని ప్రియుడు షాక్‌కు గురయ్యాడు. కేసు విచారణలో ఉందని డీసీపీ తెలిపారు. -
జర్మనీలో నెల్లూరు వాసి ఉపేంద్రరెడ్డి మృతి
-
నెల్లూరు జైలుకు YSRCP నేతలు
-
చిన్నారిపై లైంగికదాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
నెల్లూరు (లీగల్): నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మిక్కిలింపేట గ్రామానికి చెందిన బాలిక 2020 ఫిబ్రవరి 16వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఇంటిముందు ఆడుకుంటుండగా సమీపంలోని ఇంట్లో నివసించే ఉప్పు రవికుమార్ అనే యువకుడు బాలికను ఇంటికి తీసుకుపోయి లైంగిక దాడికి పాల్పడ్డాడు.బాలిక తల్లి అదేరోజు కొడవలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు రవికుమార్‌ను అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. విచారణలో నిందితుడిపై నేరం రుజువు కావడంతో నెల్లూరు పోక్సో ప్రత్యేక కోర్టు జడ్జి సిరిపిరెడ్డి సుమ నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 20 వేలు జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పారు. -
నెల్లూరు జిల్లాలో దారుణం..
-
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం
-
కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు
-
అమ్మా సారీ.. నేను చదవలేకపోతున్నా
నెల్లూరు సిటీ: ‘అమ్మా.. సారీ నేను చదవలేకపోతున్నాను.. నేను బతికినా ఒకటే.. చచ్చినా ఒకటే’ అంటూ పదో తరగతి విద్యార్థి హాస్టల్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ముత్తుకూరు మండలం ఆర్ఆర్ కాలనీలో దువ్వూరు హరనాథ్‌రెడ్డి, అనిత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి జీవనాధారం వ్యవసాయం. ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు పనత్రెడ్డి (15) ధనలక్ష్మీపురంలోని వీబీఆర్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. అతను చిన్నప్పటి నుంచే చదువుల్లో కొంత వెనుకబడ్డాడు. ఇంట్లో ఉంటే ఆటల్లో పడి పుస్తకాలపై శ్రద్ధ పెట్టే అవకాశం తక్కువగా ఉంటుందని, హాస్టల్లో చేర్చితే సహచర విద్యార్థులతో కలిసి మంచి మార్కులు సాధిస్తాడని తల్లిదండ్రులు భావించారు. దీంతో ఎనిమిదో తరగతిలోనే హాస్టల్లో చేర్పించారు. చదువు విషయంలో పనత్పై ఎక్కువ ఒత్తిడి చేయొద్దని, పాస్ మార్కులు వస్తే చాలని అక్కడి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులు చెప్పారు. అయితే పనత్రెడ్డికి ఒక పక్క పాఠాలు అర్థం కాక, తల్లిదండ్రులకు చెబితే తిడతారని భయపడ్డాడు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక తీవ్ర ఒత్తిడికి లోనవుతూనే చదువు కొనసాగించాడు. మంచి మార్కులు రావడం లేదన్న ఆందోళన అతన్ని వెంటాడుతూనే ఉంది. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం భోజనం చేశాక పనత్రెడ్డి నేరుగా హాస్టల్లోని తన గదికి వెళ్లాడు. నైలాన్ తాడుతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన సహచర విద్యార్థులు పాఠశాల సిబ్బందికి సమాచారం అందించారు. వారు కిందకు దించి అతడిని చికిత్స నిమిత్తం నారాయణ హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే పనత్రెడ్డి మృతి చెందాడని నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు హుటావుటిన ఘటనా స్థలానికి చేరుకుని విగతజీవిగా పడి ఉన్న పనత్ను చూసి కన్నీటి పర్యంతమయ్యారు.పాఠశాల ఎదుట ఆందోళనపనత్రెడ్డి మృతిపై విద్యార్థి సంఘ నాయకులు పాఠశాల వద్ద ఆందోళన చేశారు. ఉపాధ్యాయుల ఒత్తిడితోనే అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. నెల్లూరు రూరల్ ఇన్స్పెక్టర్ వేణు ఘటనా స్థలానికి చేరుకుని వారికి సర్ది చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమత్తం నెల్లూరు జీజీహెచ్‌కు తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మైనర్ బాలికపై ఆటో డ్రైవర్ లైంగిక దాడి
-
వైఎస్ జగన్ కుటుంబంపై దుష్ప్రచారం చేస్తే ఊరుకోం: కాకాణి
నెల్లూరు, సాక్షి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిట్రిక్స్‌కు తెరలేపారని, మాటలు తప్ప, చేతలు శూన్యమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. కోటి 47 లక్షల రేషన్ కార్డులు ఉంటే.. సగానికి సగం మందికి ఉచిత గ్యాస్ కట్ చేశారని ధ్వజమెత్తారు. ఆయన నెల్లూరులో శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘చంద్రబాబు మోసపురిత హామీలపై ఎమ్మెల్యేలే ఆగ్రహంతో ఉన్నారు. సూపర్ సిక్స్.. సూపర్ ప్లాఫ్గా మారింది. లా అండ్ ఆర్డర్లో చంద్రబాబు ఫెయిల్ అయ్యారు. నిత్యావసరాలు ధరలు పెంచేయ్యడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. పోర్టులు, హాస్పిటల్స్‌ను ప్రైవేటీకరణ చేస్తున్నారు.వైఎస్ జగన్ కుటుంబం మీద బురద చళ్లుతున్నారు. ఫేక్ న్యూస్ ప్రచారం చెయ్యడంలో మంత్రి నారా లోకేష్ దిట్ట. వైఎస్ జగన్ కుటుంబం గురించి నీచంగా ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ ఆస్తి పంపకాలు కోర్టులో ఉండగా దాన్ని కూడా చంద్రబాబు రాజకీయం చేస్తూ.. రాజకీయ పబ్బం గడుకుంటున్నారు. రెండేళ్ల క్రితం విజయమ్మ కారు ప్రమాదానికి గురైతే.. అందులో కుట్ర కోణం ఉందని ఇప్పుడు దుష్ప్రచారం చేస్తున్నారు. ..ఎన్టీఆర్‌ను ఎవరు చంపేశారో.. ఎవరు వెన్నుపోటు పొడిచారో అందరికి తెలుసు.ఆయన చనిపోవడానికి కారకులు చంద్రబాబు కాదా?. జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం ముగించుకుని వస్తుంటే ప్రమాదం జరిగింది.. అందులో కుట్ర కోణం ఉందా.?. హరికృష్ణ మరణం, జానకి రామ్ మృతిలో కుట్ర కోణం ఉందని మేము భావించాలా.?. తండ్రి మరణిస్తే.. తల కొరివి పెట్టడానికి మనసు రాని వ్యక్తి చంద్రబాబు... చంద్రబాబుకి రూ. 1300 కోట్ల ఆస్తులు ఉంటే అందులో తమ్ముడికి, చెల్లెళ్లకి వాటా ఇచ్చారా? కుటుంబ విషయాల్లో తల దూర్చడం అవసరమా?. తనకి ప్రాణహాని ఉందని పవన్ కళ్యాణ్ ఇంట్లోని ఆడ బిడ్డ మీడియా ముందుకు వచ్చి చెప్పిన విషయం పవన్‌కు గుర్తులేదా?. 77 మంది మహిళలు అఘాయిత్యలకు గురైతే.. వాటి గురించి పవన్ కనీసం మాట్లాడలేదు. అలాంటి వ్యక్తి షర్మిలకి భద్రత కల్పిస్తామని చెప్పడం సిగ్గుచేటు. ..ఇసుక, మద్యం మాఫియాలకు కూటమి ఎమ్మెల్యేలే పాల్పడుతున్నారు. పవన్‌కు దమ్ముంటే వారిని తొక్కి పెట్టినార తియ్యాలి. పోలీసులు పెట్టే కేసులకు భయపడే వాళ్లు వైఎస్సార్సీపీలో ఎవ్వరూ లేరు. జగన్ పాలనకి చంద్రబాబు పాలనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. వైఎస్ జగన్ పాలన చూసి చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలి. కుటుంబాల మీద దుష్ప్రచారాలు చేస్తే.. మేం కూడా అలాగే వ్యవహరించాల్సి ఉంటుంది. అరెస్టులకు, అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు’’ అని అన్నారు. -
డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డ బీటెక్ విద్యార్థి
సాక్షి,హైదరాబాద్ : నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టిస్తున్నాయి. వనస్థలిపురంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడ్డా బీటెక్ విద్యార్థి జాన్ పట్టుబడ్డాడు. పోలీసుల తనిఖీల్లో నెల్లూరు జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థి జాన్ వద్ద ఏడు గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ను గుర్తించారు. డ్రగ్ ఎండీఎఏను గ్రాము రూ. 2500కు కొనుగోలు చేసి రూ.5వేల చొప్పున అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎండీఎంఏ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. జాన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
ఉద్యోగులకు ఊరికే జీతాలు.. బాబు గారి కొత్త స్కీమ్
-
అడ్డంగా దోచేస్తోన్న అనుచరులు
-
నెల్లూరులో టెన్షన్ టెన్షన్..
-
AP: ఉద్రిక్తత.. వైన్‌షాప్ మూసేయాలని మహిళల ఆందోళన
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జగదీష్‌నగర్‌లో ఉద్రిక్తత నెలకొంది. స్థానికంగా నూతనంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని ఎత్తివేయాలంటూ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. జనావాసాల నడుమ ఏర్పాటు చేసిన మద్యం షాపును తొలగించాలని డిమాండ్ చేశారు.మహిళలు, స్థానికులు షాపు వద్ద పెద్దఎత్తున ఆందోళనకు దిగడంతో తీవ్రతరంగా మారింది దుకాణం కౌంటర్ వద్దకు వెళ్లి నిర్వాహకులను హెచ్చరించారు.అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. జనావాసాల మధ్య మద్యం షాపు వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని, ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజులుగా ఆందోళనలు చేస్తున్నా.. ఎక్సైజ్ అధికారులు స్పందించకపోవడం దారుణమని, ఇప్పటికైనా దుకాణాన్ని తొలగించాలని లేనిపక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. జగదీష్‌నగర్‌లో మద్యం షాపు వద్ద స్థానికుల ఆందోళనకు ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి సంఘీభావం ప్రకటించారు.ఇదిలా ఉండగా వైన్ షాప్ నిర్వాహకునికి మద్దతుగా పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. అంతేగాక మహిళను బెదిరించేందుకు వైన్‌షాప్ నిర్వాహకులు రౌడీలను తీసుకొచ్చారు. మరోవైపు షాప్ మూసేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని మహిళలు హెచ్చరిస్తున్నారు. తమకు ళలకు అన్యాయం జరిగితే రాని పోలీసులు.. మద్యం షాప్ ఓనర్‌కు మద్దతుగా వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఇసుక, మద్యంలో కూటమి పెద్దల అవినీతి: కాకాణి
నెల్లూరు, సాక్షి: ఇసుక, మద్యం విషయంలో కూటమి ప్రభుత్వ పెద్దలు అవినీతికి పాల్పడ్డారని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. ఆయన నెల్లూరులో శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘సూపర్ సిక్స్‌లో ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఇప్పుడు ఇసుకపై కొత్త నాటాకానికి తెరతీశారు. చంద్రబాబు చెప్పేదానికి, చేసేదానికి పొంతనే ఉండటం లేదు. చంద్రంబాబా దొంగ ఎమ్మెల్యేలు అన్నట్లు ఉంది. చంద్రబాబు పార్టీ నేతలకు ఒకటి చెబుతారు.. క్షేత్రస్థాయిలో మరోటి జరుగుతోంది. చంద్రబాబు మాటలకు అర్దాలే వేరులే అన్నట్లు ఉంది. ఇసుక, మద్యం జోలికి వెళ్ళవద్దని చెబుతారు. కానీ టీడీపీ నేతలు వాటినే ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. ఉచిత ఇసుక ఇస్తామని చెప్పారు. ఇప్పుడు సీనరేజ్ రద్దు చేస్తామని చెబుతున్నారు. ఇసుక ఉచితం అన్నప్పుడు సీనరేజ్ ఎక్కడ ఉంటుంది?. రాష్ట్రంలో ఇసుక, మద్యంకు సంబంధించి ఎన్నో దౌర్జన్యాలు జరిగాయి. ఎవరిమీదా చర్యలు తీసుకోలేదు, కేసులూ పెట్టలేదు. ... లాటరీలో మద్యం షాపులు పొందిన వారిని కిడ్నాప్ చేశారు. ఇసుక టెండర్లు పొందిన వారిని మంత్రులు భయపెడుతున్నారు. తమ అనుమతి లేకుండా ఎలా టెండర్లు వేశారు అంటూ నిలదీస్తున్నారు. ఇసుక, మద్యంలో ఎన్నో అక్రమాల జరుగుతున్నాయని టీడీపీ కరపత్రికే రాసింది. సూపర్ సిక్స్‌లో ప్రకటించిన వాటిలో ఏమీ అమలు కాలేదు. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపిస్తున్న మీడియాపై కేసులు పెడుతున్నారు. నెల్లూరు జిల్లాలో నాలుగు ఇసుక రీచ్‌ల కోసం టెండర్లు పిలిచారు. లాటరీ ద్వారా ఎంపిక చెయ్యాలని మంత్రి నారాయణ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. .. మా రీచ్‌లో మాకు తెలియకుండా టెండర్లు ఎలా వేశారంటూ ఒక మంత్రి, ఎమ్మెల్యే లాటరీలలో పొందిన వారిని భయపెడుతున్నారు. ఒక మంత్రి తీసుకున్న నిర్ణయాన్ని పట్టించుకోకుండా కలెక్టర్ టెండర్లు రద్దు చేశారు. మంత్రి అంటే లెక్క లేకుండా చేశారు. దీనిపై కలెక్టర్ సమాధానం చెప్పాలి. మళ్లీ టెండర్లు పిలుస్తామని చెప్తున్నారు. చంద్రబాబు మాటలు పట్టించుకోకుండా ఇక్కడ నేతలు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈనెల 25న కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహిస్తాం’’ అని అన్నారు.చదవండి: చంద్రబాబు నిర్ణయం.. టీడీపీ నేతలకే తిరుమల వెంకన్న సేవలు! -
తమకు దక్కలేదని.. ఇసుక టెండర్లే రద్దు
సాక్షి టాస్క్‌ఫోర్స్: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఒక మంత్రి ఇసుక రీచ్‌ల విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరించారు. జిల్లాలో గురువారం నాలుగు ఓపెన్ ఇసుక రీచ్‌లకు టెండర్లు తెరిచారు. రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువవడంతో కలెక్టర్ లాటరీ విధానంలో నలుగురికి అనుమతులు ఇచ్చారు. మెట్ట నియోజకవర్గంలో ఒక రీచ్ దక్కిన కాంట్రాక్టర్‌పై మంత్రి వీరంగం వేశారు. ఆ కాంట్రాక్టర్‌ను పిలిపించుకుని.. నా ఇలాఖాలో ఎలా టెండర్ వేస్తావంటూ బూతులు తిట్టారు. తోటి ఎమ్మెల్యేలతో కలిసి ఏకంగా ఇసుక టెండర్లనే రద్దుచేయించారు. జరిగింది ఇలా.. జిల్లాలోని పెన్నానదిలో నాలుగుచోట్ల ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇహ్వాది. మినగల్లు, పడమటి కంభంపాడు, పల్లిపాడు, విరువూరుల్లో ఓపెన్ రీచ్‌ల ద్వారా 2.86 మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ నెల ఏడో తేదీన టెండర్లు ఆహ్వానించారు. ఆ రీచ్‌లకు 23 మంది కాంట్రాక్టర్లు 43 దరఖాస్తులు దాఖలు చేశారు. వీటిలో ఒకటి జీఎస్టీ సక్రమంగా లేకపోవడంతో రద్దయింది. మిగిలిన దరఖాస్తులు అర్హత సాధించడంతో కలెక్టర్ ఆనంద్ లాటరీ విధానంలో నలుగురు కాంట్రాక్టర్లకు నాలుగు రీచ్‌లు కేటాయించారు. రీచ్‌లను పంచుకునేందుకు.. నాలుగు ఓపెన్ రీచ్‌లను పంచుకునేందుకు ఒక మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు తమ షాడోలతో టెండర్లు దాఖలు చేయించారు. టెండర్ల ప్రక్రియను నామమాత్రం చేసి తమ షాడోలకు అప్పగించేందుకు పెద్ద ఎత్తున రాజకీయ ఒత్తిళ్లు తెచ్చారు. నదుల్లో ఇసుక తవ్వకాలు జరిపించేందుకు మెట్రిక్ టన్నుకు గతంలో రూ.90–100 చొప్పున చెల్లించారు. ఇప్పుడు అదే ధరతో టెండర్లు ఆహ్వానించినా.. తమ్ముళ్లు మాత్రం రీచ్‌ల్లోకి ఎంట్రీ అయితే చాలన్నట్లుగా గిట్టుబాటు చూడకుండానే టన్నుకు రూ.36 మాత్రమే కోట్ చేశారు. అంత తక్కువ ధరకే కేటాయిస్తే గిట్టుబాటు కాదని, అక్రమ రవాణాను ప్రోత్సహించినట్లే అవుతుందని భావించి టన్నుకు రూ.114.90 వంతున నిర్ణయించిన కలెక్టర్ లాటరీతో ఒక్కో రీచ్‌కు ముగ్గురిని ఎంపికచేసి ప్రథమస్థానంలో ఉన్నవారికి రీచ్ కేటాయించారు. మరో ఇద్దరిని రిజర్వులో ఉంచారు. తమ అనుచరులకు టెండర్లు దక్కలేదని ఆ మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు టెండర్ల ప్రక్రియ జరిగినప్పుడు లాటరీ విధానంలో ఎలా ఎంపిక చేస్తారంటూ తీవ్రంగా ఒత్తిడి తెచ్చి ఏకంగా టెండర్లనే రద్దుచేయించారు. నా ఇలాఖాలోకి వస్తావా.. తాట వలిచేస్తా.. లాటరీ విధానంలో ఇసుక రీచ్ దక్కించుకున్న ఒక కాంట్రాక్టర్‌పై మెట్ట ప్రాంతానికి చెందిన ఒక మంత్రి చిందులు తొక్కారు. తన నియోజకవర్గంలో ఉన్న ఇసుక రీచ్‌కు తన అనుమతి లేకుండా టెండర్ ఎలా దాఖలు చేస్తావంటూ గురువారం రాత్రి బండబూతులతో రెచి్చపోయారు. ‘నా ఇలాఖాలోకి వచ్చి ఇసుక రీచ్‌కు టెండరు వేస్తావా.. నీ తాట తీస్తా..’ అంటూ మంత్రి కన్నెర్ర చేయడంతో వణికిపోయిన కాంట్రాక్టర్ తాను రీచ్ నుంచి తప్పుకుంటానని వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. -
నెల్లూరు వైపు దూసుకొస్తున్న వాయుగుండం
సాక్షి,నెల్లూరు:చెన్నై-నెల్లూరు మధ్య కేంద్రీకృతమైన వాయుగుండం నెల్లూరు వైపు దూసుకువస్తోంది.గురువారం(అక్టోబర్17) వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.తీరందాటే సమయంలో60- 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. వాయుగుండం తీరం దాటే సమయంలో గూడూరు, మనుబోలు, కావలి, నెల్లూరు సమీప ప్రాంతాలలో భారీ వర్షాలు పడనున్నాయి.ఇప్పటికే నెల్లూరుతో పాటు కావలిలో వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్నాయి. భారీ వర్షాలకు రోడ్లపై వరద నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.ఇదీ చదవండి: వాయుగుండం ముప్పు -
ఎడతెరిపిలేని వాన
సాక్షి నెట్వర్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో సోమవారం తెల్లవారుజామునుంచి మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో విద్యాసంస్థలకు అత్యవసరంగా సెలవు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా సగటున 54.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం సాయంత్రానికి జిల్లాలో సగటున 25.8 మి.మీ. వర్షపాతం నమోదైంది.ఒంగోలు బస్టాండ్ సెంటర్ సహా నగరంలోని కాలనీలన్నీ జలమయం అయ్యాయి. జల వనరుల శాఖ ఎస్ఈ కార్యాలయ భవనంలోకి వర్షం నీరు చేరింది. వైఎస్సార్ జిల్లాలో చిరుజల్లులు కురిశాయి. సిద్ధవటంలో అత్యధికంగా 29.6 మి.మీ. వర్షం కురిసింది. తిరుపతి జిల్లా చిల్లకూరు, వాకాడు, తడ మండలాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రం నుంచి భీకర శబ్దాలు వెలువడుతున్నాయి. సముద్రాన్ని చూసేందుకు వెళ్లే వారిని స్థానికులు అడ్డుకుని వెనక్కి పంపేస్తున్నారు.తిరుమలలో హై అలర్ట్ తిరుమల: భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తిరుమలలో హై అలర్ట్ ప్రకటించారు. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని టీటీడీ ఈఓ జె.శ్యామలరావు ఆదేశించారు. విపత్తు నిర్వహణ ప్రణాళికపై టీటీడీ అడిషనల్ ఈఓ సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి ఆయన అధికారులతో సోమవారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 48 గంటల్లో తిరుమలలో విపత్తును ఎదుర్కొనేందుకు అధికారులంతా సంసిద్ధంగా ఉండాలని కోరారు.కొండ చరియలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే చర్యల్లో భాగంగా వైద్య శాఖ అంబులెన్సులను అందుబాటులో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంజనీరింగ్ విభాగం సిద్ధంగా ఉండాలన్నారు. రేపు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో ఈనెల 16న బుధవారం శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ దృష్ట్యా 15న మంగళవారం తిరుమలలో సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.రైళ్ల రాకపోకలకు అంతరాయం తెనాలి రూరల్: భారీ వర్షాల కారణంగా చెన్నై–విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షాలకు పొన్నూరు–బాపట్ల స్టేషన్ల మధ్య డౌన్ లైన్ వద్ద భూమి కుంగుతోంది. దీని కారణంగా పట్టాలు దెబ్బతిని రైళ్లు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉండడంతో ఈ డౌన్ లైన్లో మాచవరం స్టేషన్ వద్ద నుంచి రైళ్ల రాకపోకలను నిలిపివేసి మరమ్మతులు చేపడుతున్నారు. ఈ కారణంగా పలు రైళ్లను బాపట్ల, చీరాల, ఒంగోలులో నిలిపివేశారు. చెన్నైలో ఐటీ ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం సాక్షి, చెన్నై: తమిళనాడులోని మధురై, కోయంబత్తూరు తదితర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరం, శివారులలోని చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలకు అతి భారీ వర్ష సూచనతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మంగళవారం ఈ నాలుగు జిల్లాలలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు ఈ నెల 18 వరకు వర్క్›ఫ్రం హోం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. -
అల్పపీడనం ప్రభావం..నెల్లూరు జిల్లాలో భారీ వర్షం (ఫొటోలు)
-
నెల్లూరు జిల్లాలో దంచికొడుతున్న వర్షాలు
-
రూ.2 కోట్లు పెట్టి 100 దరఖాస్తులు వేయించా
సాక్షి, టాస్క్‌ఫోర్స్ : తెలుగు తమ్ముళ్లకు మద్యం షాపులు కట్టబెట్టేందుకు టీడీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బయటి వ్యక్తులకు షాపులు దక్కకుండా బెదిరింపులకూ దిగుతున్నారు. మంత్రి పొంగూరు నారాయణ తన సొంత డబ్బులు రూ.2 కోట్లు ఖర్చుచేసి 100 దరఖాస్తులు వేయించినట్లు చెబుతున్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆయన మంగళవారం పార్టీ కార్యకర్తలతో గ్రూప్ కాల్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. ‘నగరంలో కొందరు నన్ను బ్రాందీ షాపులు కావాలని అడిగారు. 5, 10%అయినా ఇప్పించండని అడిగారు. వారు ధరఖాస్తులకు అంత ఖర్చు పెట్టుకోలేరు కాబట్టి నేనే ఆ ఖర్చు భరిస్తున్నా. నెల్లూరులో రౌడీయిజం ఒప్పుకోను. దుకాణాల వద్దకు వచ్చి ఏ డిపార్ట్మెంట్ వాళ్లు అడిగినా ఒప్పుకోను. రూ.2 కోట్లు సొంత డబ్బు ఖర్చుపెట్టి 100 దరఖాస్తులు వేయిస్తున్నా. వాటిలో 4 నుంచి 5 షాపులు రావచ్చని అనుకుంటున్నాను’ అని వ్యాఖ్యానించారు. అందుకు సంబంధించిన ఆడియో కాల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
నెల్లూరు జిల్లాలో పరువు హత్య
కొడవలూరు: కుమార్తె తమ మాట కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని కుటుంబ పరువుకు భంగం కలిగించిందన్న కోపంతో ఆమె తల్లిదండ్రులు, సోదరి, సోదరుడు కలిసి హత్యచేశారు. ఈ విషయం వెలుగులోకి రాకుండా ఇంటి పక్కనున్న ఖాళీ స్థలంలోనే మృతదేహాన్ని పూడ్చిపెట్టి కంప వేశారు. 25 రోజుల అనంతరం స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం పద్మనాభసత్రంలో జరిగింది.కొడవలూరు సీఐ సురేంద్రబాబు, ఎస్సై సీహెచ్ కోటిరెడ్డి, గ్రామస్తులు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. పద్మనాభసత్రం పల్లెపాళేనికి చెందిన తిరుమూరు వెంకటరమణయ్య, దేవసేనమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె భువనేశ్వరికి పదేళ్ల క్రితమే వివాహమైంది. రెండో కుమార్తె శ్రావణి (24)కి ఆరేళ్ల క్రితం పెళ్లి చేశారు. కొద్దిరోజులకే ఆమె భర్తతో విభేదించి విడాకుల కోసం కోర్టును ఆశ్రయించి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. వారికి పద్మనాభసత్రం మెయిన్ రోడ్డు వెంబడి కూరగాయల దుకాణం ఉండగా వారికి సహాయంగా ఉంటోంది. ఈ క్రమంలోనే అల్లూరు మండలం నార్త్‌ఆములూరుకు చెందిన షేక్ రబ్బానీ బాషా అనే పెయింటర్‌తో ఆమెకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. హత్యకు గురయ్యే పదిరోజుల ముందు శ్రావణి ఆ యువకుడితో వెళ్లిపోయి అతన్ని పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ నార్త్ఆములూరులోనే కాపురం పెట్టారు. వారంరోజుల తర్వాత ఈ విషయం శ్రావణి తల్లిదండ్రులకు తెలిసి ఇంటికి తీసుకొచ్చారు. తమ కులానికే చెందిన మరో వ్యక్తితో వివాహం చేస్తామని, వెళ్లొద్దని ఆమెపై ఒత్తిడి తేవడంతోపాటు దారుణంగా కొట్టారు. ఇది చుట్టుపక్కల వారు గమనించారు.పూడ్చిపెట్టి.. పైన కంప వేసి.. శ్రావణి మాట వినకపోవడంతో 25 రోజుల క్రితం ఓ రాత్రి ఆమె తల్లిదండ్రులతోపాటు సోదరి భువనేశ్వరి, సోదరుడు సాయి కలిసి ఆమెను తీవ్రంగా కొట్టి హత్యచేశారు. ఈ విషయం బయటకు పొక్కకుండా ఇంటి పక్కనే ఉన్న వారి ఖాళీ స్థలంలో చెంచయ్య అనే వ్యక్తి సాయంతో గుంత తీయించి మృతదేహాన్ని పూడ్చిపెట్టి ఎవరికీ అనుమానం రాకుండా పైన కంప వేసేశారు. ఈ నేపథ్యంలో.. ఇరవై రోజులు గడిచినా శ్రావణి నుంచి ఫోన్ రాకపోవడంతో షేక్ రబ్బానీ బాషా గ్రామంలో విచారించాడు. తల్లిదండ్రులతో శ్రావణి లేదని గ్రామస్తులు తెలుపడంతో వారే హతమార్చి ఉంటారని అనుమానించాడు. గ్రామస్తులకూ సందేహం వచ్చి ఇంటి పరిసర ప్రాంతాలు పరిశీలించగా ఖాళీ స్థలంలో పాతి పెట్టిన ఆనవాళ్లు వారి అనుమానానికి బలం చేకూర్చాయి. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. సీఐ సురేంద్రబాబు, ఎస్సై కోటిరెడ్డి శ్రావణి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారించారు. తామే శ్రావణిని హత్యచేసి పాతి పెట్టామని వారు అంగీకరించినట్లు సీఐ తెలిపారు.దీంతో తహసీల్దార్ కె. స్ఫూర్తి మృతదేహాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించారు. హత్యకు పాల్పడిన తల్లిదండ్రులు, సోదరి, సహకరించిన సోదరుడు, చెంచయ్యపై హత్యకేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. తల్లిదండ్రులను, చెంచయ్యను అదుపులోకి తీసుకున్నామని, భువనేశ్వరి, సాయి పరారీలో ఉన్నారని, వారిని పట్టుకుంటామని తెలిపారు. -
నా కడుపు కాలిపోతోంది బాబు.. లోకేష్ వద్దే తేల్చుకుంటా?
-
సోమిరెడ్డికి YSRCP నేతలు వార్నింగ్
-
సాధారణ ప్రజల భూములు కబ్జా చేసేందుకు టీడీపీ మూకల కుట్రలు
-
‘చంద్రబాబూ.. పేర్లు మార్చడం తప్ప ఏం చేశావ్?’
నెల్లూరు, సాక్షి : సోమశిల జలాశయానికి తానే ఆద్యుడిగా సీఎం చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటని నెల్లూరు వైఎస్సార్సీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. 1995 నుంచి 2004 వరకూ అయన ముఖ్యమంత్రిగా ఉన్నారు..ఏనాడైనా సమగ్ర సోమశిల గురించి ఆలోచించారా..? అని ప్రశ్నించారు.‘‘అప్పట్లో 36 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉండేది. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే సోమశిల సామర్థ్యాన్ని 78 టీఎంసీలకు పెంచారు. అదేవిధంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని కూడా 40 వేల క్యూసెక్కులకు పెంచారు. అప్పట్లో తెలంగాణలోని కాంగ్రెస్ వాదులు దీనిని వ్యతిరేకించినా.. రాజశేఖర్ రెడ్డి ఖాతర చేయలేదు. 14 ఏళ్లల్లో ఎప్పుడూ పెన్నార్ డెల్టా అధునికీకరణ గురించి పట్టించు కోలేదు. సంగం...నెల్లూరు బ్యారేజ్‌ల నిర్మాణాన్ని పట్టించుకోలేదు.. మేమే పూర్తి చేశాం అని అన్నారాయన... సంగం బ్యారేజ్‌కు మంత్రిగా ఉంటూ మరణించిన గౌతమ్ రెడ్డి పేరు పెడితే దానిని చంద్రబాబు తొలగించారు. నెల్లూరు బ్యారేజ్‌కు మాజీ మంత్రి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి పేరు పెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పేర్లు మార్చడం తప్ప ఏం అభివృద్ది చేశారో చెప్పాలి చంద్రబాబు అని డిమాండ్ చేశారు. సోమశిల మరమ్మతులకు వైఎస్సార్సీపీ హయాంలోనే పునాది పడింది. 1995 నాటి ముఖ్యమంత్రిని చూస్తారని చంద్రబాబు అన్నారు.1995లో ఆయన ట్రాక్ రికార్డ్ బాగా లేదు..అందుకే ఆందోళన కలుగుతోంది. సోమశిల జలాశయం పనులు నాణ్యతతో చేయాలని కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. -
మర్యాదగా చెబితే అర్థం కాదా?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/ ఆత్మకూరు/ దర్గామిట్ట(నెల్లూరు): ఉద్యోగులపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మరోసారి వారిపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సోమశిల ప్రాజెక్టును సందర్శించిన చంద్రబాబు ఆ తర్వాత ప్రజావేదికలో రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మైక్ పనిచేయకపోవడంతో ఉద్యోగులపై నిప్పులు చెరిగారు. ‘డిప్యూటీ కమిషనర్ జిల్లాలో ఉన్నాడా.. ఏం చేస్తున్నాడు.. వెరీ క్లియర్.. అడ్మినిస్ట్రేషన్ నిద్రపోతోంది.. 95 నాటి సీఎంను అని చెప్పాను.. ఇంకా అర్థం కాలేదా.. మర్యాదగా చెబితే అర్థం కాలేదు.. అందుకే యాక్షన్‌లోకి దిగి వస్తున్నా.. మర్యాద అయిపోయింది.. ఇక యాక్షన్ ఉంటుంది. బీ కేర్‌పుల్.. నీవేం ప్రేక్షకుడివి కాదు.. ఇవన్నీ నీవే సూపర్వైజ్ చేసుకోవాలి. అందరూ ఇలాగే తయారయ్యారు.. అడ్మినిస్ట్రేషన్‌ను భ్రష్టు పట్టించారు.. మీరందరూ ఇష్టారాజ్యం అనుకుంటున్నారు’ అంటూ సమాచార, ప్రసార శాఖ డిప్యూటీ డైరెక్టర్ సదారావుపై తీవ్రంగా మండిపడ్డారు.ఇరిగేషన్ ఎస్ఈకి పాఠాలు..సోమశిల జలాశయ పర్యటనలో ఎస్ఈ బసిరెడ్డి వెంకట రమణారెడ్డిపైనా ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జలాశయానికి వస్తున్న ఇన్‌ఫ్లో గురించి ముఖ్యమంత్రికి వివరిస్తున్న సమయంలో ఆయన మాటలను పరిగణనలోనికి తీసుకోకుండా ప్రతి పాయింట్‌కు నీరు ఎంత వస్తుందనే అంశాన్ని పట్టించుకోవాలని, మీరు ఇంజనీరింగ్ చదివారు కదా అన్నీ మీకు ముందే తెలిసి ఉండాలంటూ మండిపడ్డారు.దీంతో అక్కడి అధికారులు కిమ్మనకుండా ఉండిపోయారు. జలాశయానికి వస్తున్న ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలను తెలిపేందుకు అవకాశం లేకుండా ఆయనను మళ్లీ అన్నీ తెలుసుకుని రావాలని, మీరు సర్టిఫైడ్ ఇంజనీర్లు కదా.. అంటూ ఎద్దేవా చేస్తూ చంద్రబాబు ముందుకు సాగిపోయారు. సోమశిల జలాశయానికి నీటి నిల్వ పెరిగే కొది -
బాలికపై అత్యాచారం..
-
ఫుల్‌గా మందు కొట్టి.. మహిళా SI పై టీడీపీ నేతల దాడి
-
నెల్లూరు ఎన్టీఆర్ నగర్ లో విషాదం