కాటేసిన పాముతో ఆస్పత్రికి.. | Man Into Hospital With Snake In Hand | Sakshi
Sakshi News home page

కాటేసిన పాముతో ఆస్పత్రికి..

Mar 3 2026 7:37 AM | Updated on Mar 3 2026 11:30 AM

 Man Into Hospital With Snake In Hand

నెల్లూరు జిల్లా: సాధారణంగా పాము కనిపిస్తేనే ఆమడ దూరం పరిగెడతాం. అలాంటిది తనను కాటేసిన పామును చంపి.. దాన్ని చేత్తో పట్టుకొని నేరుగా ఆస్పత్రికే వచ్చారో వ్యక్తి. కోవూరు ప్రభుత్వ వైద్యశాల సాక్షిగా ఈ వింత ఘటన చోటుచేసుకుంది. ఈ సాహసం చూసి రోగులు, ఆస్పత్రి సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. 

కోవూరు పరిధిలోని భగత్‌సింగ్‌ కాలనీకి చెందిన వలీ పనుల్లో ఉండగా, ఓ పాము కాటేసింది. అయితే దాన్ని అక్కడికక్కడే చంపేశారు. ఏ పాము కరిచిందో తెలిస్తేనే వైద్యం కచ్చితంగా అందుతుందనే ఉద్దేశంతో నేరుగా దాంతో సహా కోవూరు ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. దీంతో ఆస్పత్రి ప్రాంగణంలోని వారంతా భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది వెంటనే స్పందించి చికిత్సను ప్రారంభించారు. ప్రస్తు తం వలీ పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం.  

Advertisement
 
Advertisement
Advertisement