ఇస్రో ప్రయోగాలకు 3 నెలల పాటు బ్రేక్‌! | ISRO experiments take a break for 3 months | Sakshi
Sakshi News home page

ఇస్రో ప్రయోగాలకు 3 నెలల పాటు బ్రేక్‌!

Mar 3 2026 5:34 AM | Updated on Mar 3 2026 5:34 AM

ISRO experiments take a break for 3 months

వరుసగా రెండు పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు విఫలం 

రెండింటికీ మూడో దశలోనే లెత్తిన సాంకేతిక లోపం  

దీనిపై విచారణకు కమిటీ వేసిన కేంద్రం  

షార్‌లో విచారిస్తున్న కమిటీ  

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రూపొందించిన పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ప్రయోగాల్లో..ఒకే రకమైన సాంకేతిక లోపంతో రెండు ప్రయోగాలు విఫలం కావడంతో 3 నెలల పాటు ప్రయోగాలకు ఇస్రో బ్రేక్‌ వేసింది. గతేడాది మే నెలలో పీఎస్‌ఎల్‌వీ సీ61, ఈ ఏడాది జనవరిలో పీఎస్‌ఎల్‌వీ సీ62 రాకెట్‌లు విఫలమైన తరువాత మళ్లీ ప్రయోగాల జోలికి పోలేదు. ఈ రెండు రాకెట్లు ఒకే తరహా సాంకేతికపరమైన లోపంతో విఫలమయ్యాయి. పీఎస్‌ఎల్‌వీ సీ61 ప్రయోగం విఫలమైనప్పుడు శాస్త్రవేత్తలు ఏమరుపాటుగానే ఉండిపోయారు. అదే తరహాలోనే మరో ప్రయోగం కూడా విఫలం కావడంతో కేంద్రం తీవ్రంగా పరిగణించి విచారణ కమిటీని నియమించింది.

ఈ కమిటీ ఇటీవల శ్రీహరికోటలో విచారణ జరిపింది. రెండు రాకెట్లకు మూడో దశలోనే సాంకేతిక లోపం తలెత్తింది. మూడో దశ అంటే ఘన ఇంధన దశ. ఘన ఇంధన మోటార్‌లు షార్‌ కేంద్రంలోనే తయారు చేస్తారు. అందుకే ఈ కమిటీ సాలిడ్‌ మోటార్‌ దశలోనే ఎందుకు ఇబ్బంది వచి్చందనే దానిపై తనిఖీలు చేపట్టి దానికి సంబం«ధించిన ఇంజినీర్లను విచారించింది. ఇలా అన్ని సెంటర్లకు కమిటీ వెళ్లి విచారిస్తుంది. దీంతో 3 నెలల పాటు ప్రయోగాలు ఉండకపోవచ్చునని షార్‌ వర్గాల సమాచారం. దీంతో ఈ ఏడాది అనుకున్న గగన్‌యాన్‌ ప్రాజెక్టు ప్రయోగాలు కూడా ఆలస్యమయ్యే అవకాశముంది. చంద్రయాన్‌–4 ప్రయోగం కూడా కొంత ఆలస్యం కావచ్చనే చర్చ ఇస్రో వర్గాల్లో నడుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement