జోర్దాన్‌ అధినేతకు ప్రధాని మోదీ ఫోన్.. భారతీయుల భద్రతపై ఆరా | Prime minister Narendra Modi Talks with Jordan President | Sakshi
Sakshi News home page

Narendra Modi: జోర్దాన్‌ అధినేతకు ప్రధాని మోదీ ఫోన్.. భారతీయుల భద్రతపై ఆరా

Mar 3 2026 5:17 AM | Updated on Mar 3 2026 11:32 AM

Prime minister Narendra Modi Talks with Jordan President

ఇరాన్- అమెరికా యుద్ధం వేళ ప్రధాని మోదీ భారతీయుల క్షేమంపై ఆరా తీస్తున్నారు. గల్ఫ్ దేశాల్లోని భారతీయుల సెక్యూరిటీపై జోర్డాన్‌ అధినేతతో చర్చించారు. ఆయనకు ఫోన్ చేసిన ప్రధాని.. ఆ దేశంలోని భారతీయుల భద్రత గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జోర్డాన్‌లో పరిస్థితులు తమను ఆందోళనకు గురిచేశాయని ప్రధాని మోదీ అన్నారు. శాంతి, భద్రతకు తమ  మద్దతు ఎల్లప్పుడు ఉంటుందని మోదీ భరోసా ఇచ్చారు.

కాగా.. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం నేపథ్యంలో గల్ఫ్‌ దేశాలపై మిస్సైల్స్ దాడులు జరుగుతున్నాయి. అరబ్ దేశాలే టార్గెట్‌గా ఇరాన్‌ మిస్సైల్స్‌తో విరుచుకుపడుతోంది.  ఈ నేపథ్యంలోనే మన భారత ప్రధాని మోదీ అన్ని దేశాల అధినేతలకు ఫోన్ చేసి ఆరా తీస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉ‍న్న భారతీయుల భద్రతపై చర్చిస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement