ఇరాన్‌పై మరిన్ని దాడులు.. డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక | America President Donald Trump Comments On USA War With Iran, Says Attacks Will Intensify And Ready For Peace Talks | Sakshi
Sakshi News home page

Donald Trump: 'ఇరాన్‌పై దాడులు మరింత ఉధృతం'.. డొనాల్డ్ ట్రంప్ ప్రకటన

Mar 3 2026 12:30 AM | Updated on Mar 3 2026 12:11 PM

America President Donald Trump comments On USA war with Iran

ఇరాన్ మాతో చర్చలకు సిద్ధంగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తాము చేసిన దాడుల్లో ఇప్పటికే సైనిక ఉన్నతాధికారులు పెద్దసంఖ్యలో మరణించారని తెలిపారు. ఇరాన్‌పై ఆపరేషన్‌ ఫ్యూరీ కొనసాగుతుందని అన్నారు. తాము ఇంకా దాడులు ఉధృతం చేయలేదని అన్నారు. త్వరలోనే దాడులు మరింత తీవ్రతరం చేస్తామని ఇరాన్‌ హెచ్చరించారు.

ఇరాన్ ప్రతిసారి ‍అబద్ధాలు చెబుతోందని ట్రంప్ అన్నారు. ఈ యుద్ధం మరో 4 నుంచి ఐదు వారాల పాటు కొనసాగుతందని స్పష్టం చేశారు. ఇరాన్‌ను మా బలగాలు తరిమికొట్టాయని తెలిపారు. ఇరాన్‌కు చెందిన 10 వార్‌షిప్‌లను అమెరికా ధ్వంసం చేసిందని వెల్లడించారు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడి చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందని ట్రంప్ అన్నారు. ఇవాళ రాత్రంతా ఇరాన్‌పై దాడులు జరుపుతామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement