మాతో పెట్టుకుంటే వేటాడి మరీ మట్టుబెడతాం: అమెరికా రక్షణశాఖ | If you hurt Americans USA DIffence Minister Hegseth | Sakshi
Sakshi News home page

మాతో పెట్టుకుంటే వేటాడి మరీ మట్టుబెడతాం: అమెరికా రక్షణశాఖ

Mar 2 2026 7:58 PM | Updated on Mar 2 2026 9:01 PM

If you hurt Americans USA DIffence Minister Hegseth

వాషింగ్టన్‌: ప్రస్తుతం  జరుగుతున్న యుద్ధంపై అమెరికా రక్షణ శాఖ సంచలన వ్యాఖ్యలు చేసింది. తమతో పెట్టుకుంటే  ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమని అమెరికా రక్షణమంత్రి పీట్‌ హెగ్‌సెత్‌ హెచ్చరించారు. అమెరికాను బాధించినా, అమెరికన్లను బాధపెట్టినా క్షమించే ప్రసక్తే లేదన్నారు. ఎంతటి వారైనా అమెరికా జోలికి వస్తే అందుకు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అమెరికా జోలికి వచ్చిన వారిని భూమిపై ఎక్కడున్నా, వేటాడి, వెంటాడి మట్టుబెడతామన్నారు. 

యుద్ధం తాము ప్రారంభించలేదని, కానీ ముగింపు మాత్రం తామే ఇస్తామని హెచ్చరించారు. ‘యుద్ధం మేం ప్రారంభించలేదు.. మేము ముగింపును కచ్చితంగా ఇస్తాం. మేం ఎన్నిసార్లు హెచ్చరించినా ఇరాన్‌ అణ్వాయుధాల తయారీ కొనసాగించింది. 

అమెరికా, ఇజ్రాయెల్‌కు చావేనని ఖమేనీ అన్నారు. కానీ యుద్ధంలో ఖమేనీ చనిపోయారు. మేము ఇరాన్‌ పాలకులను మార్చడానికి యుద్ధం చేయడం లేదు. ఆ దేశంలో  అణ్వాయుధాలను అంతం చేయడానికే యుద్ధం చేస్తున్నాం. ఇరాన్‌ దారికి రాకపోతే దాడులు తీవ్రతరం చేస్తాం. ఇరాన్‌కు గట్టిగా బుద్ధి చెబుతాం’ అంటూ అమెరికా రక్షణ శాఖ తెలిపింది. అమెరికా రక్షణశాఖ వ్యాఖ్యలతో యుద్ధం తీవ్రత మరింతగా ఉండబోతుందనే సంకేతాలను ఇచ్చింది. 

  

 

 

Advertisement
 
Advertisement
Advertisement